తెలుగు (Telugu): translationQuestions

Updated ? hours ago # views See on DCS Draft Material

Matthew

Matthew 1

Matthew 1:1-14

యేసు వంశావళిలో తమ ప్రాముఖ్యతనుబట్టి మొదటిగా పేర్కొన్న ఇద్దరు పూర్వీకులు ఎవరు?

మొదటిగా పేర్కొన్న ఇద్దరు పూర్వీకులు దావీదు, అబ్రాహాము. (1:1)

Matthew 1:15-17

వంశావళిలో ఎవరి భార్య పేరు ఉంది? ఎందువలన?

యోసేపు భార్య మరియ. ఎందుకంటే ఆమె యేసుకు జన్మనిచ్చింది (1:16).

Matthew 1:18-19

మరియ యోసేపుకు ప్రదానం కావడానికి ముందు ఏమి జరిగింది?

మరియ యోసేపుకు ప్రదానం కావడానికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది (1:18).

యోసేపు ఎలాంటివాడు?

యోసేపు నీతిమంతుడు (1:19).

మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు ఏమి చేయాలని నిర్ణయించుకున్నాడు?

యోసేపు మరియను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు (1:19).

Matthew 1:20-21

మరియను విడిచిపెట్టకూడని ఎందుకు నిర్ణయించుకున్నాడు?

యోసేపుకు దేవదూత కలలో కనబడి మరియను భార్యగా స్వీకరించమని, ఆమెకు గర్భం పరిశుద్ధాత్మ వలన కలిగినదని చెప్పాడు (1:20).

యోసేపు ఆ బాలునికి యేసు అనే పేరు ఎందుకు పెట్టాడు?

ఆయన తన ప్రజలను తమ పాపాలనుండి రక్షిస్తాడు కనుక అ పేరు పెట్టాడు (1:21).

Matthew 1:22-23

పాత నిబంధనలో ఈ సంగతులన్నీ జరుగుతాయని చెప్పిన ప్రవచనం ఏమిటి?

కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అని పాత నిబంధనలో ప్రవక్త చెప్పినట్టు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేలు అంటే "దేవుడు మనకు తోడు" అని అర్థం (1:23).

Matthew 1:24-25

మరియ యేసుకు జన్మనిచ్చేంత వరకు యోసేపు ఎలాంటి జాగ్రత్త తీసుకొన్నాడు?

మరియ యేసుకు జన్మనిచ్చేంత వరకు ఆమెను సమీపించలేదు (1:25).

Matthew 2

Matthew 2:1-3

యేసు ఎక్కడ జన్మించాడు?

యేసు యూదా దేశంలోని బెత్లేహేములో జన్మించాడు (2:1).

తూర్పు దేశపు జ్ఞానులు యేసును ఏమని పిలిచారు?

తూర్పు దేశపు జ్ఞానులు యేసును "యూదుల రాజు" అని పిలిచారు (2:2).

యూదుల రాజు పుట్టాడని జ్ఞానులు ఎలా తెలుసుకున్నారు?

తూర్పు దిక్కున వెలసిన యూదుల రాజు నక్షత్రం చూసి తెలుసుకున్నారు (2:2).

జ్ఞానులనుంది ఈ వార్త విన్న హేరోదు రాజు ఎలా స్పందించాడు?

ఈ వార్త విన్న హేరోదు రాజు కలవరపడ్డాడు (2:3).

Matthew 2:4-8

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసు పుడతాడని ఎలా తెలుసుకున్నారు?

యేసు బేత్లెహేములో పుడతాడని ప్రవచనం ద్వారా వారు తెలుసుకున్నారు (2:5-6).

Matthew 2:9-10

జ్ఞానులు యేసు కచ్చితంగా ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోగలిగారు?

తూర్పు దేశం నుండి జ్ఞానులను నడిపించిన నక్షత్రం యేసు ఉన్న యింటిపై నిలిచింది (2:9).

Matthew 2:11-12

జ్ఞానులు యేసును దగ్గరకు వచ్చినప్పడు యేసు వయసు ఎంత?

జ్ఞానులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నాడు (2:11).

జ్ఞానులు యేసుకు ఇచ్చిన కానుకలు ఏమిటి?

జ్ఞానులు యేసుకు బంగారము, బోళము, సాంబ్రాణి కానుకలుగా ఇచ్చారు (2:11).

జ్ఞానులు ఏ మార్గంలో తిరిగివెళ్లారు? ఎందుకు?

వారిని హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని దేవుడు హెచ్చరించినందువల్ల వారు వేరొక మార్గంలో వెళ్లారు (2:12).

Matthew 2:13-15

కలలో యోసేపుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబడ్డాయి?

హేరోదు యేసును చంపాలని చూస్తున్నాడని, అందువల్ల మరియను, యేసును తీసుకొని ఐగుప్తుకు పారిపొమ్మని కలలో దూత చెప్పాడు (2:13).

యేసును ఇగుప్తుకు తీసుకు వెళ్ళినప్పుడు ఏ ప్రవచనం నేరేవేరింది?

యేసును ఇగుప్తుకు తీసుకు వెళ్ళినప్పుడు 'ఇగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని' అనే ప్రవచనం నెరవేరింది (2:15).

Matthew 2:16-18

జ్ఞానులు తన దగ్గరకు తిరిగి రానప్పుడు హేరోదు ఏమి చేశాడు?

బేత్లెహేము ప్రాంతంలోని రెండు సంవత్సరాల లోపు వయసు మగ పిల్లలను చంపించాడు (2:16).

Matthew 2:19-21

హేరోదు మరణించిన తరువాత యోసేపుకు ఏ సూచనలు అందాయి?

యోసేపుకు కలలో ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళమని సూచనలు అందాయి (2:19-20).

Matthew 2:22-23

యోసేపు మరియా, యేసులతో కలసి ఎక్కడ నివసించాడు?

యోసేపు మరియా, యేసులతో కలసి గలిలయలోని నజరేతులో నివసించాడు (2:22-23).

యోసేపు కొత్త ప్రాంతానికి వెళ్లడం వల్ల ఏ ప్రవచనం నెరవేరింది?

క్రీస్తు నజరేతువాడని ప్రవక్తలు పలికిన మాట నెరవేరింది (2:23).

Matthew 3

Matthew 3:1-6

అరణ్యంలో బాప్తిసమిచ్చే యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు?

బాప్తిసమిచ్చే యోహాను "పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి" అని ప్రకటిస్తున్నాడు (3:2).

యెషయా ప్రవక్త పలికిన ఏ ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు?

"ప్రభువు మార్గము సరాళము చేయుడి" అనే ప్రవచనం నెరవేర్చడానికి బాప్తిసమిచ్చే యోహాను వచ్చాడు (3:3).

Matthew 3:7-9

పరిసయ్యులును, సద్దూకయ్యులను చూసి వారిని ఏమి చేయమని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు?

మారుమనస్సుకు తగిన ఫలము ఫలించమని బాప్తిసమిచ్చే యోహాను పరిసయ్యులకు, సద్దూకయ్యులకు చెప్పాడు (3:8).

పరిసయ్యులు, సద్దూకయ్యులు తమలో తాము ఏమి అనుకోవద్దని బాప్తిసమిచ్చే యోహాను చెప్పాడు?

అబ్రాహాము తమ తండ్రి అని తమలో తాము అనుకోవద్దని యోహాను చెప్పాడు (3:9).

Matthew 3:10-12

యోహాను ప్రకారం మంచి ఫలము ఫలించని చెట్టుకు ఏమి జరుగుతుంది?

మంచి ఫలము ఫలించని చెట్టు నరికివేయబడి అగ్నిలో పడవేయబడుతుందని యోహాను చెప్పాడు (3:10).

బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు ఏమి చేస్తాడు?

బాప్తిసమిచ్చే యోహాను తరువాత వచ్చేవాడు పరిశుద్ధాత్మలో, అగ్నిలో బాప్తిసమిస్తాడు (3:11).

Matthew 3:13-15

యేసుకు బాప్తిసమిచ్చే యోహాను బాప్తిసమిచ్చేందుకు అంగీకరించకపొతే యేసు ఏమి చెప్పాడు?

"నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నది" అని యేసు యోహానుతో చెప్పాడు (3:15).

Matthew 3:16-17

యేసు నీటిలోనుండి బయటకు వచ్చినప్పుడు ఏమి చూసాడు?

యేసు నీటిలో నుండి బయటకు వచ్చీనప్పుదు దేవుని ఆత్మ పావురం రూపంలో పైనుండి తన పైకి క్రిందికి దిగి రావడం చూసాడు (3:16).

యేసు బాప్తిస్మం తీసుకొన్న తరువాత పరలోకం నుండి స్వరం ఏమని పలికింది?

"ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" అన్న స్వరం పరలోకం నుండి వినిపించింది (3:17).

Matthew 4

Matthew 4:1-4

అపవాది చేత శోధింపబడడానికి యేసును అరణ్యంలోకి ఎవరు కొనిపోయారు?

అపవాది చేత శోధింపబడడానికి యేసును ఆత్మ కొనిపోయాడు (4:1).

యేసు ఎన్ని రోజులు ఉపవాసమున్నాడు?

యేసు నలభై పగళ్ళు , నలభై రాత్రులు ఉపవాసమున్నాడు (4:2).

అపవాది యేసును శోధించిన మొదటి శోధన ఏమిటి?

రాళ్ళను రొట్టెలుగా చేయమని అపవాది యేసును మొదటిగా శోధించాడు (4:3).

మొదటి శోధనకు యేసు చెప్పిన జవాబు ఏమిటి?

మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని యేసు జవాబిచ్చాడు (4:4).

Matthew 4:5-6

అపవాది యేసు ముందు ఉంచిన రెండవ శోధన ఏమిటి?

అపవాది యేసును దేవాలయంపై నుండి క్రిందికి దూకమని చెప్పి శోదించాడు (4:5-6).

Matthew 4:7-9

రెండవ శోధనకు యేసు ఏమని జవాబిచ్చాడు?

యేసు, ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని చెప్పాడు (4:7).

అపవాది యేసు ముందు ఉంచిన మూడవ శోధన ఏమిటి?

అపవాది తనకు సాగిలపడి నమస్కారము చేయమని చెప్పాడు (4:8-9).

Matthew 4:10-13

మూడవ శోధనకు యేసు ఏమని జవాబిచ్చాడు?

ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని యేసు అపవాదికి చెప్పాడు (4:10).

Matthew 4:14-16

యేసు కపెర్నహూము లోని గలిలయ వచ్చినప్పుడు ఏమి నెరవేర్చబడింది?

గలిలయ లోని ప్రజలకు వెలుగు కనబడింది అని పలికిన యెషయా ప్రవచనం నెరవేరింది (4:15-16).

Matthew 4:17

ఏమి సందేశం యేసు బోధించడం మొదలుపెట్టాడు?

యేసు, "పరలోకరాజ్యము సమీపించియున్నది కనుక మారుమనస్సు పొందుది" అని ప్రకటించడం మొదలుపెట్టాడు" (4:17).

Matthew 4:18-20

పేతురు, ఆంద్రెయలను ఏమి చేస్తానని యేసు చెప్పాడు?

పేతురు, ఆంద్రెయలను మనుషులను పట్టే జాలరులనుగా చేస్తానని యేసు చెప్పాడు (4:19).

Matthew 4:21-22

పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు తమ జీవనానికి ఏ పని చేస్తారు?

పేతురు, ఆంద్రెయ, యాకోబు మరియు యోహానులు చేపలు పట్టేవారు (4:18,21).

Matthew 4:23-25

ఈ సమయంలో బోధించడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు?

యేసు గలిలయలోని సమాజమందిరములోకి వెళ్ళాడు (4:23).

ఏ ఏ రకాల ప్రజలు యేసు దగ్గరకు తేబడుతున్నారు? యేసు వారికి ఏమి చేస్తున్నాడు?

నానా విధమైన రోగముల చేత పీడింపబడుతున్నవారిని, దయ్యములు పట్టినవారిని ఆయన దగ్గరకు తెస్తున్నారు, యేసు వారిని బాగుపరుస్తున్నాడు (4:24).

ఈ సమయంలో ఎంతమంది యేసును అనుసరిస్తున్నారు?

ఈ సమయంలో బహు జనసమూహములు యేసును వెంబడిస్తున్నారు (4:25).

Matthew 5

Matthew 5:1-4

ఆత్మ విషయంలో దీనులైనవారు ఎందువలన ధన్యులు?

ఆత్మ విషయంలో దీనులైనవారు ధన్యులు ఎందుకంటే పరలోక రాజ్యం వారిది (5:3).

దు:ఖపడేవారు ఎందువలన ధన్యులు?

దు:ఖపడేవారు ధన్యులు, ఎందుకంటే వారు ఓదార్చబడతారు (5:4).

Matthew 5:5-10

సాత్వీకులు ఎందువలన ధన్యులు?

సాత్వీకులు ధన్యులు, ఎందుకంటే వారు భూలోకంను స్వతంత్రించుకొంటారు (5:5).

నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ఎందువలన ధన్యులు?

నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, ఎందుకంటే వారు తృప్తిపరచబడతారు (5:6).

Matthew 5:11-14

యేసు నిమిత్తం జనులచే హింసించబడిన వారు ఎందువలన ధన్యులు?

యేసు నిమిత్తం జనులచే హింసించబడేవారు ధన్యులు, ఎందుకంటే పరలోకమందు వారి ఫలము అధికమౌతుంది (5:11-12).

Matthew 5:15-16

విశ్వాసులు ఇతరుల ఎదుట తమ వెలుగును ఎందుకు ప్రకాశింపనియ్యాలి?

విశ్వాసులు తమ మంచి క్రియలను బట్టి ఇతరుల ఎదుట తమ వెలుగును ప్రకాశింపనియ్యాలి (5:15-16).

Matthew 5:17-18

పాత నిబంధన చట్టాలను, ప్రవక్తల ప్రవచనాల విషయం ఏమి చేయడానికి యేసు వచ్చాడు?

పాత నిబంధన చట్టాలను, ప్రవక్తల ప్రవచనాలను నేరవేర్చడానికే యేసు వచ్చాడు (5:17).

Matthew 5:19-20

పరలోకంలో గొప్పవాడు అని పిలువబడేవాడు ఎవరు?

దేవుని ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధించేవాడు పరలోకంలో గొప్పవాడు (5:19).

Matthew 5:21-22

నరహత్య చేసేవాడు మాత్రమే కాక, మరి ఇంకా ఎవరు తీర్పులోకి ప్రవేశిస్తాడు?

నరహత్య చేసేవాడు మాత్రమే కాక, తన సహోదరుని మీద కోపగించేవాడు కూడా తీర్పులోకి ప్రవేశిస్తాడు (5:21-22).

Matthew 5:23-24

నీ సహోదరుని పట్ల నీకు విరోధం ఏదైనా ఉన్నట్టయితే ఏమి చేయాలని యేసు బోధించాడు?

మనం మన సహోదరుని పట్ల విరోధం ఏదైనా ఉన్నట్టయితే అతనితో సమాధానపడాలని యేసు బోధించాడు? (5:23-24).

Matthew 5:25-26

మనం న్యాయాధిపతి ఎదుటికి వెళ్లేముందు మన ప్రతివాదిపట్ల ఏమి చేయాలని యేసు బోధించాడు?

త్రోవలో ఉండగానే మన ప్రతివాదితో సమాధానపడాలని యేసు బోధించాడు (5:25).

Matthew 5:27-28

వ్యభిచారం చేయడం మాత్రమే కాక, మరొకటి కూడా పాపమని యేసు చెప్పాడు, అది ఏమిటి?

వ్యభిచారం మాత్రమే కాదు గాని ఒక స్త్రీని మోహపు చూపు చూడడం కూడా పాపమేనని యేసు బోధించాడు (5:27-28).

Matthew 5:29-30

పాపంలో పడేలా చేసే విషయాలపట్ల మనం ఎలా ఉండాలని యేసు చెప్పాడు?

పాపంలో పడేలా చేసే విషయాలను మనం వదిలించుకొని, వాటికి దూరంగా ఉండాలని యేసు చెప్పాడు (5:29-30).

Matthew 5:31-35

విడాకులను యేసు ఎందుకు సమర్ధించాడు?

అవివాహితుల మధ్య వ్యభిచారం విషయంలో యేసు విడాకులు అనుమతించాడు (5:32).

ఒక భర్త తన భార్యను తప్పుగా విడాకులు తీసుకున్నట్లయితే, ఆమె భార్యను తిరిగి పెళ్లి చేసుకున్నట్లయితే ఆమె ఏమి అయిది?

వ్యభిచార కారణం లేకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్ళి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. [5:32].

Matthew 5:36-37

ఆకాశం తోడు, పరలోకం తోడు, భూలోకం తోడు, యెరూషలేము తోడు, తల తోడు అనడానికి బదులు మనం ఏమి చెప్పాలని యేసు చెప్పాడు?

వీటన్నిటికి మించి మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అని యేసు చెప్పాడు (5:33-37).

Matthew 5:38-42

దుష్టుని విషయంలో మనం ఎలా ఉండాలని యేసు బోధించాడు?

మనం దుష్టుని విషయంలో అతణ్ణి ఎదిరించకుండా ఉండాలని యేసు బోధించాడు (5:38-39).

Matthew 5:43-45

మనలను ద్వేషించేవారి పట్ల, మన శత్రువులపట్ల మన వైఖరి ఎలా ఉండాలని యేసు బోధించాడు?

మన శత్రువులను, మనలను ద్వేషించే వారిని ప్రేమించి, వారి కోసం ప్రార్ధించాలని యేసు బోధించాడు (5:43-44).

Matthew 5:46-48

మనలను ప్రేమించేవారిని మాత్రమే కాక, ద్వేషించేవారిని కూడా ప్రేమించాలని యేసు ఎందుకు బోధించాడు?

మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు ప్రత్యేకంగా చేస్తున్నది ఏమిటి? అన్యులు కూడా అలాగే చేస్తున్నారు గదా అని యేసు చెప్పాడు (5:46-47).

Matthew 6

Matthew 6:1-4

మనం తండ్రి ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం చేసే పనులు ఎలా ఉండాలి?

మనం చేసే నీతి క్రియలు రహస్యంగా ఉండాలి (6:1-4).

Matthew 6:5-7

రహస్యంగా చేసే ప్రార్థన ఎవరి వద్దనుండి ప్రతిఫలం పొందుతుంది?

రహస్యంగా చేసే ప్రార్థన తండ్రి వద్దనుండి ప్రతిఫలం పొందుతుంది (6:6).

Matthew 6:8-13

మనం ప్రార్ధించే సమయంలో ఎలా ప్రార్ధించాలని యేసు చెప్పాడు?

మన తండ్రికి మన అక్కరలు ఏమిటో తెలుసు గనుక ప్రార్థనలో విస్తారమైన మాటలు పలుకవద్దని యేసు చెప్పాడు (6:7-8).

తండ్రి చిత్తం ఎక్కడ నెరవేరాలని మనం ప్రార్ధించాలి?

తండ్రి చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టుగా భూమియందును నెరవేరాలని ప్రార్ధించాలి (6:10).

Matthew 6:14-15

మన ఋణస్తులను మనం క్షమించకపోతే దేవుడు ఏమి చేస్తాడు?

మన ఋణస్తులను మనం క్షమించకపోతే దేవుడు మన ఋణాలను క్షమించడు (6:15).

Matthew 6:16-18

మనం తండ్రి నుంచి ప్రతిఫలం పొందాలంటే మన ఉపవాసం ఎలా ఉండాలి?

మనం ఉపవాసం చేస్తున్నట్టు ఇతరులకు కనబడేలా కాక, రహస్యమందున్న తండ్రికి కనబడేలా చేస్తే తండ్రి ప్రతిఫలమిస్తాడు (6:16-18).

Matthew 6:19-21

మన ధన నిధిని ఎక్కడ దాచుకోవాలి? ఎందుకు?

పరలోకంలో మన నిధి దాచుకోవాలి. ఎందుకంటే అది నాశనం కాదు, దొంగలు దోచుకోరు (6:19-20).

మన ధనం ఉన్నచోట ఏమి ఉంటుంది?

మన ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది (6:21).

Matthew 6:22-24

మనం ఎంచుకోవలసిన ఇద్దరు యజమానులు ఎవరు?

దేవుడు, సంపద అనే ఇద్దరు యజమానులలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలి (6:24).

Matthew 6:25-26

ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని ఎందుకు చింతించకూడదు?

ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరిస్తామో అని మనం చింతించకూడదు. ఎందుకంటే, పక్షులను పట్టించుకొనే దేవుడు వాటికంటే శ్రేష్టమైన మనలను మరింత ఎక్కువగా పట్టించుకుంటాడు (6:25-26).

Matthew 6:27-31

మనం చింతించడం వల్ల ఏమి చేయలేమని యేసు గుర్తు చేస్తున్నాడు?

మనం చింతించడం వల్ల ఒక మూర ఎత్తు పెరగలేమని యేసు గుర్తు చేస్తున్నాడు (6:27).

Matthew 6:32-34

మన భూలోక అవసరాలు మనకు అనుగ్రహించబడాలంటే మనం మొదటగా దేనిని వెదకాలి?

మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటగా వెదకాలి. అప్పుడు మన భూలోక అవసరాలు మనకు అనుగ్రహించబడతాయి (6:33).

Matthew 7

Matthew 7:3-5

మనం ఇతరుల కళ్ళలో ఉన్న నలుసు చూడడానికి ముందు ఏమి చేయ్యాలి?

మనం మొదటగా మన కళ్ళలో ఉన్న దూలమును తీసివేసుకోవాలి (7:1-5).

Matthew 7:6

పరిశుధ్ధమైనది కుక్కలకు వేస్తే ఏమవుతుంది?

పరిశుధ్ధమైనది కుక్కలకు వేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కి మనమీద పడి మనలను చీల్చి వేస్తాయి (7:6).

Matthew 7:7-10

తండ్రి నుంచి పొందాలంటే మనం ఏమి చేయాలి?

మనం తండ్రి నుంచి పొందాలంటే ఆయనను అడగాలి, వెదకాలి, తట్టాలి (7:8).

Matthew 7:11-12

తండ్రిని అడిగేవారికి ఆయన ఏమి చేస్తాడు?

ఆయనను అడుగువారికి ఆయన మంచి ఈవులను అనుగ్రహిస్తాడు (7:11).

ఇతరుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలని ధర్మశాస్త్రము, ప్రవక్తలు బోధించారు?

ఇతరుల మనకు ఏమి చేయాలని కోరుకుంటామో వారికీ అలానే చేయాలని ధర్మశాస్త్రము, ప్రవక్తలు బోధించారు (7:12).

Matthew 7:13-14

వెడల్పు మార్గము ఎక్కడకు నడిపిస్తుంది?

వెడల్పు మార్గము నాశనమునకు నడిపిస్తుంది (7:13).

ఇరుకు మార్గము ఎక్కడకు నడిపిస్తుంది?

ఇరుకు మార్గము జీవమునకు నడిపిస్తుంది (7:14).

Matthew 7:15-20

అబద్ధ ప్రవక్తలను మనం ఎలా గుర్తించాలి?

వారి జీవితాలలోని ఫలములను బట్టి వారిని గుర్తించగలము (7:15-20).

Matthew 7:21-23

పరలోక రాజ్యములో ఎవరు ప్రవేశించగలరు?

తండ్రి చిత్తం నేరవేర్చువారు పరలోకరాజ్యములో ప్రవేశిస్తారు (7:21).

యేసు నామంలో ప్రవచించినవారిని, దయ్యాలను వెళ్ళగొట్టినవారిని, అద్భుతాలు చేసిన వారిని చూసి యేసు ఏమి అంటాడు?

యేసు వారిని చూసి, "నేను మిమ్ములను ఎన్నటికీ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యెద్ద నుండి వెళ్ళండి" అంటాడు (7:22-23).

Matthew 7:24-25

యేసు చెప్పిన ఉపమానంలో ఇద్దరు యింటి యజమానులలో బుద్ధి గలవాడు ఎవరు?

యేసు మాటలు విని ఆ ప్రకారము చేసినవాడు బుద్ధిమంతుడు (7:24).

Matthew 7:26-27

యేసు చెప్పిన ఉపమానంలో ఇద్దరు యింటి యజమానులలో బుద్ధిలేనివాడు ఎవరు?

యేసు మాటలు విని ఆ ప్రకారము చేయనివాడు బుద్ధిలేనివాడు (7:26).

Matthew 7:28-29

శాస్త్రుల బోధలతో పోలిస్తే ఆయన బోధ ఎలా ఉన్నది?

శాస్త్రుల బోధలతో పోలిస్తే ఆయన బోధ అధికారము గలదిగా ఉన్నది (7:29).

Matthew 8

Matthew 8:4

యేసు కుష్టరోగిని స్వస్థపరచిన తరువాత దేవాలయానికి వెళ్ళి యాజకునికి కనబడి మోషే నియమించిన కానుక సమర్పించమని ఎందుకు చెప్పాడు?

స్వస్థపడిన కుష్టరోగి యాజకుని ఎదుట సాక్ష్యార్ధంగా కనబడాలని దేవాలయానికి వెళ్ళమన్నాడు (8:4).

Matthew 8:5-7

పక్షవాతంతో పడియున్న తన సేవకుణ్ణి స్వస్థపరచమని శతాధిపతి కోరినప్పుడు యేసు ఏమి చెప్పాడు?

నేను వచ్చి సేవకుణ్ణి స్వస్థపరుస్తానని యేసు చెప్పాడు (8:7).

Matthew 8:8-10

యేసు తన ఇంటికి రావడం అవసరం లేదని శతాధిపతి ఎందుకు చెప్పాడు?

యేసు తన ఇంటికి వచ్చుటకు తాను అయోగ్యుడనని శతాధిపతి తలంచాడు. యేసు ఒక్క మాట పలికితే తన సేవకుడు బాగుపడతాడని నమ్మాడు (8:8).

యేసు శతాధిపతిని ఏమని మెచ్చుకున్నాడు?

ఇశ్రాయేలీయులలో ఎవరిలోనైనా ఇలాంటి విశ్వాసము కనబడలేదని యేసు చెప్పాడు (8:10).

Matthew 8:11-13

పరలోక రాజ్యములో ఎవరు భోజనపు బల్ల వద్ద కూర్చుంటారని యేసు చెప్పాడు?

అనేకులు తూర్పు నుండి, పడమర నుండి వచ్చి పరలోక రాజ్యములో భోజనపు బల్ల వద్ద కూర్చుంటారు (8:11).

ఏడ్పు, పండ్లు కొరుకుడు ఉండే చీకటిలోకి ఎవరు త్రోయబడతారని యేసు చెప్పాడు?

రాజ్య సంబంధులు చీకటిలోకి త్రోయబడతారని యేసు చెప్పాడు (8:12).

Matthew 8:14-15

యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎవరిని స్వస్థపరిచాడు?

యేసు పేతురు ఇంటిలోకి వెళ్ళినప్పుడు పేతురు అత్తను స్వస్థపరిచాడు (8:14-15).

Matthew 8:16-17

యేసు దయ్యములను వెళ్ళగొట్టి, సమస్త రోగులను స్వస్థపరిచినపుడు ఎవరి ప్రవచనం నెరవేర్చబడింది?

"ఆయన మన బలహీనతలను సహించుకొని మన రోగములను భరించెనని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనం నెరవేరింది (8:17).

Matthew 8:18-20

యేసు నివాసం గురించి ఒక శాస్త్రి అడిగిన ప్రశ్నకు ఆయన ఏమి జవాబిచ్చాడు?

యేసు తనకు తల వాల్చుకొనుటకు కూడా స్థలము లేదని చెప్పాడు (8:20).

Matthew 8:21-22

ఒక శిష్యుడు తన తండ్రిని పాతిపెట్టుటకు అనుమతినిమ్మని అడిగినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

యేసు ఆ శిష్యునితో, తనను వెంబడించమని, మరణించిన వారు మరణించిన వారిని పాతిపెట్టుకోనిమ్మని చెప్పాడు (8:21-22).

Matthew 8:23-25

సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు ఏమి చేస్తున్నాడు?

సముద్రము మీద తుపాను లేచి పడవ అలలతో కప్పబడినప్పుడు యేసు నిద్రపోతున్నాడు (8:24).

Matthew 8:26-27

శిష్యులు యేసును లేపి తాము నశించిపోతున్నామని భయపడినప్పుడు యేసు వారితో ఏమన్నాడు?

యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "అల్ప విశ్వాసులారా, ఎందుకు భాధపడుతున్నారు?" (8:26).

అక్కడ మిక్కిలి నిమ్మళం అయినప్పుడు శిష్యులు ఎందుకు ఆశ్చర్యపడ్డారు?

యేసుకు గాలీ, సముద్రమూ లోబడుతున్నాయని శిష్యులు ఆశ్చర్యపడ్డారు (8:27).

Matthew 8:28-29

యేసు గదరేనీయుల దేశము వచ్చినప్పుడు ఎవరిని కలుసుకున్నాడు?

యేసు దయ్యములు పట్టిన ఇద్దరు ఉగ్రులైన మనుషులను కలుసుకున్నాడు (8:28).

వారిలో ఉన్న దయ్యములు యేసుతో ఏమని చెప్పాయి?

సమయము రాకమునుపే మమ్మును బాధించుటకు వచ్చితివా అని యేసుతో చెప్పాయి (8:29).

Matthew 8:30-32

వారిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు దయ్యాలు ఏమి చేశాయి?

యేసు ఆ దయ్యాలను వెళ్ళగొట్టగా, అవి పందుల గుంపులో ప్రవేశించి సముద్రములోకి వేగంగా పరుగెత్తి నీళ్ళలో పడి చనిపోయాయి (8:32).

Matthew 8:33-34

యేసు పట్టణంలో ప్రవేశించినప్పుడు పట్టణస్థులు ఆయనను ఏమని బ్రతిమాలుకొన్నారు?

పట్టణస్థులు తమ ప్రాంతం విడిచిపొమ్మని ఆయనను బ్రతిమాలుకొన్నారు (8:34).

Matthew 9

Matthew 9:3-6

పక్షవాతం గలవానితో అతని పాపాలు క్షమించబడ్డాయని చెప్పడం, స్వస్థపడి లేచి నడువమని చెప్పడం ఏది సులభమని ఎందుకు అడిగాడు?

పక్షవాతం గలవానితో అతని పాపలు క్షమించబడ్డాయని చెప్పడం ద్వారా ఆయనకు పాపాలు క్షమించే అధికారం ఉన్నదని చెప్పాడు (9:5-6).

Matthew 9:7-9

పక్షవాతం గల రోగి స్వస్థపడినపుడు, అతని పాపాలు క్షమించబడినపుడు అక్కడ ఉన్నవారు దేవుణ్ణి ఎందుకు స్తుతించారు?

ప్రజలు భయపడి మనుష్యునికి ఇలాంటి అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించారు (9:8).

యేసు శిష్యుడు కాకముందు మత్తయి వృత్తి ఏమిటి?

యేసు శిష్యుడు కాకముందు మత్తయి సుంకపు పన్ను వసూలుదారుడు (9:9).

Matthew 9:10-11

యేసు, ఆయన శిష్యులు ఎవరితో కలసి భోజనం చేశారు?

యేసు, ఆయన శిష్యులు సుంకరులతో, పాపులతో కలసి భోజనం చేశారు (9:10).

Matthew 9:12-13

యేసు ఎవరిని పిలవడానికి వచ్చానని చెప్పాడు?

యేసు పాపులను పిలవడానికి వచ్చానని చెప్పాడు (9:13).

Matthew 9:14-19

తన శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదని యేసు చెప్పాడు?

తన శిష్యులతో తనతో కలసి ఉన్నందున వారు ఉపవాసం ఉండడం లేదని యేసు చెప్పాడు (9:15).

యేసు శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు?

యేసు వారి యొద్ద నుండి కొనిపోబడినప్పుడు ఉపవాసం ఉంటారని యేసు చెప్పాడు (9:15).

Matthew 9:20-22

రక్తస్రావ రోగం గల స్త్రీ ఏమి చేసింది? ఎందుకు?

రక్తస్రావ రోగం గల స్త్రీ యేసు పైవస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే తాను స్వస్థపడతానని అనుకొన్నది (9:20-21).

రక్తస్రావ రోగం గల స్త్రీ బాగుపడడానికి ఏమి దోహదం చేసింది?

స్త్రీ బాగుపడడానికి ఆమె విశ్వాసం దోహద పడిందని యేసు చెప్పాడు (9:22).

Matthew 9:23-24

యేసు యూదా అధికారి ఇంట్లో ప్రవేశించినపుడు అక్కడి ప్రజలు ఆయనను ఎందుకు అపహసించారు?

ఆ బాలిక చనిపోలేదు, నిద్రపోతున్నదని యేసు చెప్పినప్పుడు అక్కడి ప్రజలు ఆయనను అపహసించారు (9:24).

Matthew 9:25-26

యేసు ఆ బాలికను మరణం నుండి లేపినప్పుడు ఏమి జరిగింది?

యేసు ఆ బాలికను మరణం నుండి లేపిన వార్త అ ప్రాంతమంతా వ్యాపించింది (9:26).

Matthew 9:27-28

ఇద్దరు గుడ్డి వారు యేసును వెంబడిస్తూ ఏమని కేకలు వేసారు?

"దావీదు కుమారుడా, మమ్మును కనికరించుము" అంటూ ఇద్దరుగుడ్డి వారు కేకలు వేసారు (9:27).

Matthew 9:29-31

గుడ్డి వారికి యేసు చూపు ఇచ్చినప్పుడు ఆయన వారిలో ఏమి చూసాడు?

యేసు ఇద్దరు గుడ్డి వారిలో ఉన్న నమ్మకాన్ని బట్టి స్వస్థపరిచాడు (9:29).

Matthew 9:32-34

దయ్యము పట్టిన మూగ వానిని స్వస్థపరిచినప్పుడు పరిసయ్యులు ఏమని నేరారోపణ చేశారు?

ఈయన దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు (9:34).

Matthew 9:35-36

యేసు జన సమూహమును చూసి ఎందుకు కనికర పడ్డాడు?

యేసు జన సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలే , విసిగి చెదరి ఉన్నందున వారిపై కనికరపడ్డాడు (9:36).

Matthew 9:37-38

దేని కొరకు అవసరంగా ప్రార్థన చేయాలని యేసు తన శిష్యులతో చెప్పాడు?

కొత్త విస్తారంగా ఉన్నందున కోత పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొమ్మని యేసు తన శిష్యులతో చెప్పాడు (9:38).

Matthew 10

Matthew 10:1

యేసు తన పన్నెండుమంది శిష్యులకు వేటిపై అధికారం ఇచ్చాడు?

అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతివిధమైన రోగమును, వ్యాధిని స్వస్థపరుచుటకు యేసు తన పన్నెండుమంది శిష్యులకు అధికారం ఇచ్చాడు (10:1).

Matthew 10:2-4

యేసును అప్పగించేబోయే శిష్యుని పేరు ఏమిటి?

యేసును అప్పగించేబోయే శిష్యుని పేరు ఇస్కరియోతు యూదా (10:4).

Matthew 10:5-7

ఆ సమయంలో యేసు తన శిష్యులను ఎక్కడికి పంపాడు?

యేసు తన శిష్యులను ఇశ్రాయేలు దేశంలోని నశించిన గొర్రెల యొద్దకు పంపాడు (10:6).

Matthew 10:8-10

శిష్యులు ధనం గానీ, అదనంగా దుస్తులు గానీ తమ వెంట తీసుకుని వెళ్ళవచ్చా?

లేదు, శిష్యులు ధనం గానీ, అదనంగా దుస్తులు గానీ తమ వెంట తీసుకుని వెళ్ళకూడదు (10:9-10).

Matthew 10:11-13

శిష్యులు గ్రామ గ్రామాలకు తిరుగుతున్నపుడు ఎక్కడ బస చెయ్యాలి?

శిష్యులు గ్రామ గ్రామాలకు తిరుగుతున్నపుడు యోగ్యుడైన ఒక వ్యక్తిని వెదకి అతని ఇంటి వద్ద బస చెయ్యాలి (10:11).

Matthew 10:14-15

శిష్యులను అంగీకరించక, వారి మాటలు వినని పట్టణాల ప్రజలకు ఎలాంటి తీర్పు ఉంటుంది?

శిష్యులను అంగీకరించక, వారి మాటలు వినని పట్టణాల ప్రజలకు సోదోమ గోమోర్రా జరిగినదానికంటే మించిన కీడు జరుగుతుంది (10:14-15).

Matthew 10:16-18

శిష్యులుగా ఉండగోరువారు ఎలా ఉండడానికి సిద్ధపడాలి?

శిష్యులుగా ఉండగోరువారు ప్రజలచే మహాసభలకు అప్పగింపబడడానికి, కొరడా దెబ్బలు తినడానికి, అధిపతుల ఎదుట నిలబడడానికి సిద్ధపడి ఉండాలి (10:17-18).

Matthew 10:19-20

శిష్యులు మాట్లాడుతున్నప్పుడు వారిలో ఎవరు ఉండి మాట్లాడిస్తున్నారు?

శిష్యులు మాట్లాడుతున్నప్పుడు తండ్రి ఆత్మ వారిలో ఉండి మాట్లాడిస్తున్నారు (10:20).

Matthew 10:21-23

అంతములో ఎవరు రక్షింపబడతారని యేసు చెప్పాడు?

అంతము వరకు సహించినవాడు రక్షింపబడతారని యేసు చెప్పాడు (10:22).

Matthew 10:24-27

యేసును ద్వేషించినవారు ఆయన శిష్యుల పట్ల ఎలా ఉంటారు?

యేసును ద్వేషించినవారు ఆయన శిష్యులను కూడా ద్వేషిస్తారు (10:22,24-25).

Matthew 10:28-31

ఎవరికీ భయపడకూడని యేసు చెప్పాడు?

ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడనక్కరలేదని యేసు చెప్పాడు (10:28).

ఎవరికీ భయపడాలని యేసు చెప్పాడు?

ఆత్మను, దేహమును కూడా నరకములో నశింపజేసే వాడికి భయపడాలని యేసు చెప్పాడు (10:28).

Matthew 10:32-33

యేసును ఒప్పుకొన్నవారి పట్ల ఆయన ఏమి చేస్తాడు?

యేసును ఒప్పుకొన్నవారిని ఆయన తన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు (10:32).

యేసును తిరస్కరించిన వారిని ఆయన ఏమి చేస్తాడు?

యేసును తిరస్కరించిన వారిని ఆయన తన తండ్రి ఎదుట తిరస్కరిస్తాడు (10:33).

Matthew 10:34-36

యేసు తాను ఎలాంటి విభేదాలు పెట్టేందుకు వచ్చానని చెప్పాడు?

గృహాలలోని సభ్యులలో విభేదాలు పెట్టేందుకు తాను వచ్చానని యేసు చెప్పాడు (10:34-36).

Matthew 10:37-41

యేసు కోసం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు ఏమి పొందుతాడు?

యేసు కోసం తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు (10:39).

Matthew 10:42

శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు ఇచ్చేవాడు ఏమి పొందుతాడు?

శిష్యుడని ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చల్లని నీరు ఇచ్చేవాడు అందుకు తగిన ఫలము పొందుతాడు (10:42).

Matthew 11

Matthew 11:1-3

యేసు ఏమి ముగించిన తరువాత పట్టణంలలో బోధించుటకు, ప్రకటించుటకు వెళ్ళిపోయాడు?

యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించుట ముగించిన తరువాత పట్టణంలలో బోధించుటకు, ప్రకటించుటకు వెళ్ళిపోయాడు (11:1).

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమి సందేశం యేసుకు పంపించాడు?

బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుకు, "రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా" అనే సందేశం పంపిచాడు (11:3).

Matthew 11:4-8

రాబోవువాడు ఈయనే అని ఋజువు చేసే సంఘటనలు ఏమి జరుగుతున్నాయని యేసు చెప్పాడు?

గుడ్డివారు చూచుచున్నారు, చనిపోయినవారు తిరిగి లేస్తున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది అని యోహానుకు చెప్పమని యేసు చెప్పాడు (11:5).

ఎవరి విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడని యేసు చెప్పాడు?

తన విషయంలో అభ్యంతరపడనివాడు ధన్యుడని యేసు చెప్పాడు (11:6).

Matthew 11:9-12

యేసు జీవితంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎలాంటి పాత్ర పోషించాడు అని యేసు చెప్పాడు?

మార్గమును సిద్ధపరచడానికి ముందుగా రాబోవు దూత అని బాప్తిస్మం ఇచ్చు యోహానును గూర్చిన ప్రవచనం ఉన్నది అని యేసు చెప్పాడు(11:9-10).

Matthew 11:13-17

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎవరు అని యేసు చెప్పాడు?

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏలీయా ప్రవక్త అని యేసు చెప్పాడు (11:14).

Matthew 11:18-19

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమియు తినకుండా, తాగకుండా ఉంటునప్పుడు అక్కడివారు అతనిని గూర్చి ఏమన్నారు?

బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమియు తినకుండా, త్రాగకుండా ఉండుటను బట్టి అతనికి దయ్యము పట్టింది అన్నారు (11:18).

యేసు ఇతరులతో కలసి తినుచూ, త్రాగుచూ ఉండుటను బట్టి అక్కడివారు అతనిని గూర్చి ఏమన్నారు?

యేసు ఇతరులతో కలసి తినుచూ, త్రాగుచూ ఉండుటను బట్టి అక్కడివారు అతనిని గూర్చి ఇతడు తిండిబోతు, తాగుబోతు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని చెప్పుకున్నారు (11:19).

Matthew 11:20-24

యేసు విస్తారమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ మార్పు నొందని పట్టణాల గురించి ఆయన ఏమని ప్రకటించాడు?

విస్తారమైన అద్భుత కార్యాలు జరిగించినప్పటికీ మార్పు నొందని పట్టణాలపై తీర్పు వస్తుందని యేసు ప్రకటించాడు (11:20-24).

Matthew 11:25-27

పరలోక రాజ్య విషయాలను ఎవరికి మరుగు చేసినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు?

పరలోక రాజ్య విషయాలను జ్ఞానులకు, వివేకులకు మరుగు చేసినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).

పరలోక రాజ్య విషయాలను ఎవరికి బయలు పరచినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు?

పరలోక రాజ్య విషయాలను పసిపిల్లలకు, బుద్ధిహీనులకు బయలు పరచినందుకు యేసు తండ్రికి స్తుతులు చెల్లించాడు (11:25).

ఎవరు తండ్రిని తెలుసుకుంటారని యేసు చెప్పాడు?

తండ్రి తనకు తెలుసుననీ తనకు ఇష్టమైన వారికి తాను బయలు పరుస్తాననీ యేసు చెప్పాడు (11:27).

Matthew 11:28-30

ఎవరికి విశ్రాంతి కలుగజేస్తానని యేసు వాగ్దానం చేశాడు?

ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త ప్రజలకు ఆయన విశ్రాంతి కలుగజేస్తానని యేసు వాగ్దానం చేశాడు (11:28).

Matthew 12

Matthew 12:1-4

యేసు శిష్యులు ఏమి చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు?

యేసు శిష్యులు పంటచేనిలో ప్రవేశించి వెన్నులు తుంచి తింటూ విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారని పరిసయ్యులు నేరారోపణ చేశారు (12:2).

Matthew 12:5-6

దేవాలయము కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

యేసు తానే దేవాలయము కంటే గొప్పవాడినని చెప్పాడు (12:6).

Matthew 12:7-8

మనుష్య కుమారుడైన యేసుకు ఏ అధికారం ఉంది?

మనుష్య కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (12:8).

Matthew 12:9-10

యేసు సమాజ మందిరములో ఊచ చెయ్యి గలవాడిని బాగుచేసినప్పుడు పరిసయ్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

పరిసయ్యులు యేసును "విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా?" అని ప్రశ్నించారు (12:10).

Matthew 12:11-12

సబ్బాతు దినమున ఏమి చేయడం న్యాయమని యేసు చెప్పాడు?

విశ్రాంతి దినమున మేలు చేయుట న్యాయమేనని యేసు చెప్పాడు (12:12).

Matthew 12:13-18

ఊచ చెయ్యి గలవాడిని యేసు స్వస్థపరచినపుడు ఆయనను ఏమి చెయ్యాలని ఆలోచన చేశారు?

యేసు ఊచ చెయ్యి గలవాడిని స్వస్థపరచినపుడు పరిసయ్యులు ఆలయం బయటకు వెళ్లి యేసును ఎలా సంహరించాలి అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు (12:14).

Matthew 12:19-25

యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు ఏమి చేయడు?

యేసును గూర్చి యెషయా ప్రవచనం ప్రకారం యేసు జగడమాడడు, కేకలు వేయడు, నలిగినా రెల్లును విరువడు, మకమకలాడుతున్నఅవిసెనారను ఆర్పడు (12:19-20).

యేసును గురించి యెషయా ప్రవచించినట్టు, దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది?

అన్యజనులకు దేవుని న్యాయవిధి యేసు ద్వారా ఎవరికి ప్రచురము చేయబడుతుంది (12:18,21).

Matthew 12:26-27

బయల్జేబూలు ద్వారా దయ్యములను వెళ్ళగొట్టే విషయంలో యేసు ఎలా స్పందించాడు?

సాతాను వలన సాతానును వెళ్ళగొడితే సాతాను రాజ్యము ఎలా నిలబడుతుంది అని యేసు చెప్పాడు (12:26).

Matthew 12:28-30

దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని ఆత్మ వలన తాను దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దేవుని రాజ్యము వారి యొద్దకు వస్తుందని యేసు చెప్పాడు (12:28).

Matthew 12:31-32

ఎలాంటి పాపం క్షమించబడదని యేసు చెప్పాడు?

ఆత్మ విషయమైన దూషణ అనే పాపం క్షమించబడదని యేసు చెప్పాడు (12:31).

Matthew 12:33-35

దేని వలన చెట్టు ఎలాంటిదో తెలుస్తుంది?

చెట్టు అది కాసే ఫలాల వలన మంచిదో, కాదో తెలుస్తుంది (12:33).

Matthew 12:36-37

వేటిని బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు?

తమ మాటలను బట్టి పరిసయ్యులు అపరాధులుగా తీర్పు తీర్చబడతారు అని యేసు చెప్పాడు(12:37).

Matthew 12:38-40

ఆయన తన తరం వారికి యేసు ఏ సూచన ఇస్తున్నాడు?

యోనా ఉన్నట్టు, మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండబోతున్నానని యేసు ఈ తరం వారికి సూచన ఇచ్చాడు (12:39-40).

Matthew 12:41

యోనా కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

తాను యోనా కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:41).

నీనెవే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యేసు తరంలోని ప్రజలపై ఏమని నేరస్థాపన చేస్తారు?

నీనివే ప్రజలు, దక్షిణ దేశపు రాణి యోనా ద్వారా, సొలోమోను ద్వారా దేవుని మాటలు విన్నారు. యేసు తరంలోని ప్రజలపై యోనా, సోలోమోనుల కంటే గొప్పవాడైన యేసు మాటలు వినలేదు (12:41-42).

Matthew 12:42

సొలోమోను కంటే గొప్పవాడు ఎవరని యేసు చెప్పాడు?

తాను సొలోమోను కంటే గొప్పవాడినని యేసు చెప్పాడు (12:42).

Matthew 12:43-47

యేసు తరంలోని వ్యక్తిని వదిలిపెట్టిన అపవిత్రాత్మ వడలిపోయిన స్థితి ఎలా ఉంటుంది?

వదిలి పోయిన అపవిత్రాత్మవెళ్లి తనకంటే చెడ్డవైన మరో ఏడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ వ్యక్తి కడపటి స్థితి కంటే మొదటి స్థితి హీనమైనదిగా అయ్యేలా చేస్తుంది. యేసు తరంలోని వ్యక్తి అలానే ఉంటాడు(12:43-45).

Matthew 12:48-50

యేసు తనకు తల్లి, సహోదరుడు, సహోదరి ఎవరని చెప్పాడు?

తన తండ్రి చిత్తము చొప్పున చేయువాడే తనకు తల్లి, సహోదరుడు, సహోదరి అని యేసు చెప్పాడు (12:46-50).

Matthew 13

Matthew 13:3-6

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయి?

త్రోవ పక్కన పడిన విత్తనాలను పక్షులు వచ్చి తినివేశాయి (13:4).

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు ఏమయ్యాయి?

మన్నులేని రాతి నేలను పడిన విత్తనాలు అక్కడ మన్ను లేనందున అవి మొలిచాయి గానీ, సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి (13:5-6).

Matthew 13:7-12

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?

ముండ్ల పొదలలో పడిన విత్తనాలు మొలిచి ముండ్లపొదలు పెరిగి వాటిని అణచివేశాయి (13:7).

యేసు చెప్పిన విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనాలు ఏమయ్యాయి?

మంచి నేలలో పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగా, ఒకటి అరువదంతలుగా, ఒకటి ముప్పదంతలుగా ఫలించాయి (13:8).

Matthew 13:13-14

యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు, చూస్తారు గానీ ఏమి చెయ్యరు?

యెషయా ప్రవచనం ప్రకారం, ప్రజలు వింటారు గానీ గ్రహించరు, చూస్తారు గానీ ఎంతమాత్రము తెలుసుకోరు (13:14).

Matthew 13:15-17

యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజలలో ఉన్న తప్పు ఏమిటి?

యేసు మాటలు విని వాటిని అర్ధం చేసుకోలేని ప్రజల హృదయాలు కొవ్వు పట్టాయి. వారి చెవులు మందములయ్యాయి, వారి కన్నులు మూసికోనిపోయాయి (13:15).

Matthew 13:18-19

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో త్రోవ పక్కన పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

త్రోవ పక్కన పడిన విత్తనం వలే ఒక వ్యక్తివాక్యము విని దానిని గ్రహించక ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి వాని హృదయములో చల్లిన దానిని ఎత్తుకుపోతాడు (13:19).

Matthew 13:20-21

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో రాతి నేలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

రాతి నెలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని వెంటనే దానిని సంతోషముగా గ్రహించును కానీ, వాక్యము నిమిత్తము శ్రమ అయినను, హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు (13:20-21).

Matthew 13:22-26

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో ముండ్ల పొదలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

ముండ్ల పొదలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తిని ఐహిక విచారములు, ధన మోహము ఆ వాక్యము అణచివేస్తాయి (13:22).

విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానంలో మంచి నేలలో పడిన విత్తనం ఒక వ్యక్తి విషయంలో ఎలా పోల్చబడుతుంది?

మంచి నేలలో పడిన విత్తనం వలే ఒక వ్యక్తి వాక్యము విని గ్రహించి, సఫలుడై, నూరంతలుగా, అరువదంతలుగా, ముప్పదంతలుగా ఫలిస్తాడు (13:23).

Matthew 13:27-28

గురుగులు విత్తువాని ఉపమానంలో పొలములో గురుగులు చల్లినది ఎవరు?

శత్రువు పొలములో గురుగులు చల్లాడు (13:28).

Matthew 13:29-30

గురుగులు, గోధుమల గురించి యజమాని తన సేవకులకు ఇచ్చిన సూచనలు ఏమిటి?

రెండు పంటలూ కలసి పెరిగిన తరువాత కోతకాలము వచ్చినప్పుడు, గోధుమలను గిడ్డంగిలో సమకూర్చి, గురుగులను తగలబెట్టమని యజమాని చెప్పాడు (13:30).

Matthew 13:31-32

యేసు చెప్పిన ఆవగింజ ఉపమానంలో చిన్నదైన ఆవగింజ ఏమి అవుతుంది?

ఆవగింజ మొక్క పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో నివసించునంత చెట్టు అవుతుంది (13:31-32).

Matthew 13:33-35

పరలోక రాజ్యమును పులిసిన పిండితో ఎందుకు పోల్చాడు?

పరలోక రాజ్యము కొంచెము పొంగజేసే పదార్థం కలిసిన మూడు కుంచాల పిండి తో పోల్చబడినది (13:33).

Matthew 13:36-39

గురుగుల ఉపమానంలో, మంచి విత్తనం విత్తువాడు ఎవరు? పంట పొలం ఏమిటి? మంచి విత్తనాలు ఎవరు? గురుగులు ఎవరు? పంట కోయువారు ఎవరు?

మంచి విత్తనాలు విత్తేవాడు మనుష్య కుమారుడు, పంట పొలం లోకం, మంచి విత్తనాలు రాజ్య వారసులు, గురుగులు దుష్టుని సంబంధులు, పంట కోయువారు దేవదూతలు (13:37-39).

Matthew 13:40-43

యుగసమాప్తిలో దుర్నీతిపరులకు ఏమి జరుగుతుంది?

యుగసమాప్తిలో దుర్నీతిపరులు అగ్నిగుండములో పడవేయబడతారు (13:42).

యుగసమాప్తిలో నీతిమంతులకు ఏమి జరుగుతుంది?

యుగసమాప్తిలో నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యునివలే తేజరిల్లుతారు (13:43).

Matthew 13:44-46

యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన పొలములో దొరికిన నిధి విషయంలో ఒక వ్యక్తి ఏమి చేశాడు?

తనకు ఉన్నదంతా అమ్మి ఆ పొలము కొన్నాడు (13:44).

యేసు చెప్పిన ఉపమానంలో, పరలోక రాజ్యముతో పోల్చబడిన మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి ఏమి చేశాడు?

మంచి ముత్యం కనుగొన్న వ్యక్తి వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి అ ముత్యం కొన్నాడు (13:45-46).

Matthew 13:47-53

చేపలు పట్టే వల ఉపమానం యుగసమాప్తిలో జరగబోయే దేనిని సూచిస్తుంది?

వల నిండినప్పుడు మంచి చేపలను గంపలోకి చేర్చి, చెడ్డవాటిని బయట పారవేస్తారు. అదే విధంగా యుగసమాప్తిలో దేవదూతలు నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పాడవేస్తారు (13:47-50).

Matthew 13:54-56

యేసు స్వదేశీయులు ఆయన బోధలు విన్నప్పుడు ఏమని ప్రశ్నించారు?

"ఈ జ్ఞానం, ఈ అద్భుతములు చేసే శక్తి ఎక్కడినుంచి వచ్చాయి" అని ఆశ్చర్యపడ్డారు (13:54).

Matthew 13:57-58

ప్రవక్తకు తన దేశములో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ప్రవక్త తన దేశములో, తన యింటిలో ఘనహీనుడుగా ఉంటాడని యేసు చెప్పాడు (13:57).

యేసు స్వదేశీయుల అవిశ్వాసం వల్ల ఏమి జరిగింది?

స్వదేశీయుల అవిశ్వాసం వల్ల యేసు అక్కడ అనేక అద్భుతాలు చేయలేదు (13:58).

Matthew 14

Matthew 14:1-2

హేరోదు యేసు గురించి ఏమనుకున్నాడు?

బాప్తిసమిచ్చే యోహాను చనిపోయి తిరిగి లేచాడని హేరోదు యేసును గురించి అనుకున్నాడు (14:2).

Matthew 14:3-5

హేరోదు చేసిన ఏ అన్యాయమైన పనిని గూర్చి యోహాను చెప్పాడు?

హేరోదు తన సోదరుని భార్యను ఉంచుకొన్నాడని యోహాను చెప్పాడు (14:4).

హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష ఎందుకు విధించ లేదు?

ప్రజలు ఇతనిని ప్రవక్త అని గౌరవిస్తున్నందువల్ల ప్రజలకు భయపడి హేరోదు యోహానుకు వెంటనే మరణ శిక్ష విధించలేదు (14:5).

Matthew 14:6-7

తన జన్మదినం నాడు హేరోదియ నాట్యం చేసినప్పుడు హేరోదు ఏమి చేశాడు?

హేరోదియ ఏమి కోరినా ఇస్తానని ఆమెకు ప్రమాణం చేశాడు (14:7).

Matthew 14:8-12

హేరోదియ ఏమి కోరుకుంది?

ఒక పళ్ళెంలోయోహాను తలను తెచ్చి ఇవ్వమని కోరింది (14:8).

హేరోదు ఆమె కోరికను ఎందుకు తీర్చవలసి వచ్చింది?

విందు సమయంలో ప్రజలందరి ఎదుటా చేసిన ప్రమాణం నెరవేర్చుకోవడానికి ఆమె కోరిక తీర్చవలసి వచ్చింది. (14:9).

Matthew 14:13-15

జనసమూహములు తనను వెంబడిస్తున్నప్పుడు వారిని చూసి యేసు ఏమి చేశాడు?

జనసమూహములను చూసి యేసు వారిపై కనికరపడి, వారిలో రోగులను స్వస్థపరిచాడు (14:14).

Matthew 14:16-18

యేసు తన శిష్యులతో ఏమి చెప్పాడు?

జనసమూహములకు మీరే భోజనము పెట్టమని యేసు తన శిష్యులతో చెప్పాడు (14:16).

Matthew 14:19-21

యేసు, తన శిష్యులు తెచ్చిన అయిదు రొట్టెలు, రెండు చేపలను ఏమిచేశాడు?

యేసు ఆ రొట్టెలను, చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి, ఆశీర్వదించి ఆ రొట్టెలు జనసమూహమునకు పంచమని శిష్యులకు ఇచ్చాడు (14:19).

ఎంతమంది ప్రజలు భుజించారు? ఇంకా ఎంత మిగిలిపోయింది?

అయిదు వేలమంది పురుషులతోపాటు స్త్రీలు, పిల్లలు తినగా పన్నెండు గంపలు మిగిలిపోయాయి (14:20-21).

Matthew 14:22-24

జనసమూహాన్ని పంపివేసిన తరువాత యేసు ఏమి చేశాడు?

యేసు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ పైకి వెళ్ళాడు (14:23).

సముద్రం మధ్యలో ఉన్న శిష్యులకు ఏమి జరిగింది?

బలమైన గాలి వీచినప్పుడు శిష్యులు ప్రయాణిస్తున్న నావ అదుపుతప్పింది (14:24).

Matthew 14:25-27

యేసు తన శిష్యుల దగ్గరకు ఎలా వచ్చాడు?

యేసు నీళ్ళపై నడుచుకుంటూ వచ్చాడు (14:25).

శిష్యులు యేసును చూసినప్పుడు ఆయన వారితో ఏమని చెప్పాడు?

యేసు తన శిష్యులకు నేనే, భయపడవద్దని, ధైర్యంగా ఉండమని చెప్పాడు (14:27).

Matthew 14:28-30

పేతురు తన దగ్గరకు చేస్తానని యేసుతో చెప్పినప్పుడు యేసు ఏమన్నాడు?

నీళ్ళపై నడచి రమ్మని యేసు పేతురుతో చెప్పాడు (14:29).

పేతురు నీళ్ళలో ఎందుకు మునిగిపోతున్నాడు?

పేతురు భయపడినప్పుడు నీళ్ళలో మునిగిపోవడం మొదలుపెట్టాడు (14:30).

Matthew 14:31-33

యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు ఏమి జరిగింది?

యేసు, పేతురు దోనె ఎక్కినప్పుడు గాలి అణగిపోయింది (14:32).

ఇది చూసిన శిష్యులు ఏమి చేశారు?

దీనిని చూసిన శిష్యులు యేసు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కారు (14:33).

Matthew 14:34-36

యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు అక్కడి ప్రజలు ఏమి చేశారు?

యేసు, ఆయన శిష్యులు సముద్రపు అవతలి తీరం చేరుకొన్నప్పుడు ప్రజలు రోగులను యేసు దగ్గరకు తీసుకువచ్చారు (14:35).

Matthew 15

Matthew 15:4-6

పరిసయ్యులు పారంపర్యాచారం నిమిత్తం దేవుని ఆజ్ఞను ఎలా అతిక్రమిస్తున్నారని యేసు చెప్పాడు?

పరిసయ్యులు తమ తల్లితండ్రుల నుండి సంక్రమించినది "దేవార్పితమని" చెప్పి తమ పిల్లలను వారికి సహాయం చేయనీయక అడ్డుపడుతున్నారు (15:3-6).

Matthew 15:7-9

పరిసయ్యుల పలికే మాటలను గురించి, వారి హృదయాలను గురించి యెషయా ఏమని ప్రవచించాడు?

పరిసయ్యులు తమ పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తారు గాని వారి హృదయాలు ఆయనకు దూరముగా ఉన్నవి అని యెషయా ప్రవచించాడు (15:7-8).

దేవుని గురించిన మాటలు బోధించడానికి బదులు పరిసయ్యులు ఏమి బోధిస్తున్నారు?

పరిసయ్యులు మనుషులు కల్పించిన పద్ధతులు బోధిస్తున్నారు (15:9).

Matthew 15:10-11

ఒక మనుష్యుని అపవిత్రపరచనిది ఏమిటని యేసు చెప్పాడు?

మనుష్యుని నోటిలోకి వెళ్ళునది అతనిని అపవిత్రపరచదని యేసు చెప్పాడు (15:11,17,20).

ఒక మనుష్యుని ఏది అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు?

మనుష్యుని నోటి నుండి వచ్చునది అతనిని అపవిత్రపరుస్తుందని యేసు చెప్పాడు (15:11,18-20).

Matthew 15:12-17

యేసు పరిసయ్యులను ఏమని పిలిచాడు? వారి వలన ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

యేసు పరిసయ్యులను గుడ్డివారని పిలిచాడు. గుడ్డివారు గుడ్డివారికి దారి చూపినపుడు ఇద్దరూ గుంటలో పడతారు (15:14).

Matthew 15:18-20

ఎలాంటి ఆలోచనలు ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి?

దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారం, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము, దేవదూషణ ఒక వ్యక్తి హృదయాన్ని మలినం చేస్తాయి (15:19).

Matthew 15:21-23

కనాను స్త్రీ తనను కనికరించమని కోరినప్పుడు మొదట యేసు ఏమి చేశాడు?

యేసు ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదు (15:23).

Matthew 15:24-26

ప్ర, కనాను స్త్రీకి సహాయం చేయకపోవడం విషయంలో యేసు ఎలాంటి వివరణ ఇచ్చాడు?

యేసు, తాను ఇశ్రాయేలు ఇంటివారిలో నశించిన గొర్రెల వద్దకే పంపబడ్డానని చెప్పాడు (15:24).

Matthew 15:27-28

కనాను స్త్రీ విధేయత చూసిన యేసు ఆమెతో ఏమి చెప్పాడు, ఆమెకోసం ఏమి చేశాడు?

ఆమె విశ్వాసము గొప్పదని చెప్పి, ఆమె కోరుకొన్నది నెరవేర్చాడు (15:28).

Matthew 15:29-31

గలిలయలో ఆయన దగ్గరకు వచ్చిన బహు జనసమూహమునకు ఏమి చేశాడు?

యేసు మూగ వారిని, కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనులను స్వస్థపరిచాడు (15:30-31).

Matthew 15:32-35

యేసు ఎన్ని రొట్టెలు, ఎన్ని చేపలతో జనసమూహం ఆకలి తీర్చాడు?

శిష్యుల వద్ద ఉన్న ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలతో యేసు జనసమూహం ఆకలి తీర్చాడు (15:34).

Matthew 15:36-39

యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని ఏమి చేశాడు?

యేసు రొట్టెలు, చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి, రొట్టెలు విరిచి తన శిష్యులకు ఇచ్చాడు (15:36).

రొట్టెలు, చేపలను ఎంతమంది ప్రజలు తృప్తిగా తిన్నారు?

స్త్రీలు, పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు తృప్తిగా తిన్నారు (15:38).

వారందరూ తిన్న తరువాత ఎంత మిగిలింది?

వారందరూ తిన్న తరువాత ఏడు గంపల రొట్టెలు, చేపలు మిగిలాయి (15:37).

Matthew 16

Matthew 16:1-2

పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును ఏ విధంగా శోధించడానికి వచ్చారు?

పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆకాశము నుండి ఏదైనా సూచక క్రియ చేసి చూపించమని యేసును అడిగారు (16:1).

Matthew 16:3-4

పరిసయ్యులు, సద్దూకయ్యులకు ఏ సూచక క్రియ ఇవ్వబడుతుందని చెప్పాడు?

పరిసయ్యులు, సద్దూకయ్యులకు యోనాను గూర్చిన సూచక క్రియ వారికి అనుగ్రహింపబడుతుందని చెప్పాడు (16:4).

Matthew 16:5-10

దేని విషయంలో జాగ్రత్త వహించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు?

పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహించాలని యేసు తన శిష్యులకు చెప్పాడు (16:6).

Matthew 16:11-12

శిష్యులను జాగ్రత్త వహించాలని చెప్పడంలో యేసు అసలు ఉద్దేశం ఏమిటి?

శిష్యులను జాగ్రత్త వహించాలని చెప్పడంలోని యేసు అసలైన ఉద్దేశం పరిసయ్యుల, సద్దూకయ్యుల బోధలను గూర్చి జాగ్రత్త పడమని (16:12).

Matthew 16:13-16

యేసు ఫిలిప్పు కైసరయకు వచ్చినప్పుడు తన శిష్యులను ఏమని అడిగాడు?

యేసు తన శిష్యులను "మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు?" అని అడిగాడు (16:13).

యేసు ఎవరని కొందరు అనుకొంటున్నారు?

కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను అనీ, కొందరు ఏలీయా అనీ, కొందరు యిర్మీయా అనీ, ప్రవక్తలలో ఒకడనీ అనుకొంటున్నారు (16;14).

యేసు ప్రశ్నకు పేతురు ఏమని జవాబిచ్చాడు?

"నీవు సజీవుడైన దేవుని కుమారడవైన క్రీస్తువు" అని పేతురు జవాబిచ్చాడు (16:16).

Matthew 16:17-18

యేసు ప్రశ్నకు జవాబు పేతురుకు ఎలా తెలుసు?

యేసు అడిగిన ప్రశ్నకు జవాబును పరలోకమందున్న తండ్రి అతనికి బయలుపరిచాడు (16:17).

Matthew 16:19-20

భూమిపై పేతురుకు ఎలాంటి అధికారం యేసు ఇచ్చాడు?

యేసు పరలోకపు తాళపు చెవులు పేతురుకు ఇచ్చాడు. పేతురు భూలోకంలో దేనిని బంధిస్తాడో పరలోకంలో అది బంధించబడుతుంది, భూలోకంలో దేనిని విప్పుతాడో అది పరలోకంలో విప్పబడుతుంది అని యేసు చెప్పాడు (16:19).

Matthew 16:21-23

ఆ సమయం నుండి యేసు తన శిష్యులకు ఏ విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు?

తాను యెరూషలేముకు వెళ్లి, అనేక శ్రమలు పొంది, చంపబడి, మూడవ రోజున లేపబడవలసి ఉన్నదని చెప్పడం మొదలుపెట్టాడు (16:21).

జరుగబోయే సంగతులు యేసుకు ఎన్నడూ జరగవని పేతురు యేసును గద్దించినపుడు యేసు ఏమన్నాడు?

యేసు పేతురుతో, "సాతానా, నా వెనుకకు పొమ్ము" అన్నాడు (16:23).

Matthew 16:24-26

యేసును అనుసరించే ప్రతి ఒక్కరూ ఏమి చేయడానికి ఇష్టపడాలి?

యేసును అనుసరించే ప్రతి ఒక్కరూ తనను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని ఆయనను వెంబడించాలి (16:24).

మనిషికి ఏది ప్రయోజనకరం కాదని యేసు చెప్పాడు?

ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే వానికి ఏమి ప్రయోజనము అని యేసు చెప్పాడు (16:26).

Matthew 16:27-28

మనుష్యకుమారుడు ఎలా రాబోతున్నాడని యేసు చెప్పాడు?

మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కలసి రాబోతున్నాడని యేసు చెప్పాడు (16:27).

మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికి తగిన ప్రతిఫలం ఎలా చెల్లిస్తాడు?

మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికి వారి వారి క్రియల చొప్పున తగిన ప్రతిఫలం చెల్లిస్తాడు (16:27).

Matthew 17

Matthew 17:1-2

యేసుతో కలసి ఎత్తయిన కొండ పైకి ఎవరు వెళ్లారు?

పేతురు, యాకోబు అతని సహోదరుడైన యోహాను యేసుతో కలసి వెళ్లారు (17:1).

కొండపైన యేసు ఎలా కనిపించాడు?

యేసు ముఖము సూర్యునివలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివయ్యాయి (17:2).

Matthew 17:3-4

యేసుతో మాట్లాడడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారు?

మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడడానికి ప్రత్యక్షమయ్యారు (17:3).

పేతురు ఏమి చేద్దామని అన్నాడు?

వారు ముగ్గురికీ మూడు కుటీరాలు నిర్మిద్దామని పేతురు అన్నాడు (17:4).

Matthew 17:5-8

ప్రకాశవంతమైన మేఘమునుండి ఏమని వినిపించింది?

ప్రకాశవంతమైన మేఘము నుండి, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి" అన్న మాటలు వినిపించాయి (17:5).

Matthew 17:9-10

వారు కొండ దిగి వస్తున్నప్పుడు యేసు శిష్యులకు ఏమని ఆజ్ఞాపించాడు?

మనుష్య కుమారుడు మరణించి తిరిగి లేచే వరకు ఈ దర్శనము ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు (17:9).

Matthew 17:11-13

లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చే విషయం గూర్చి యేసు ఏమి చెప్పాడు?

లేఖనాల ప్రకారం ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతాడని యేసు చెప్పాడు (17:11).

ఏలీయా ముందుగానే వచ్చిన సంగతి, మనుషులు అతనికి ఏమి చేసారో ఆ సంగతి గురించి యేసు ఏమి చెప్పాడు?

ఏలీయా బాప్తిసమిచ్చే యోహానుగా ఇదివరకే వచ్చినప్పుడు మనుషులు అతనిని తెలుసుకోక, వారి ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేశారు అని యేసు చెప్పాడు (17:10-13).

Matthew 17:14-16

శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ గలిగారా?

శిష్యులు చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి స్వస్థ పరచ లేకపోయారు (17:14-16).

Matthew 17:17-18

చాంద్ర రోగం ఉన్న బాలునికి యేసు ఏమి చేశాడు?

యేసు అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించాడు. ఆ గంటలోనే ఆ బాలుడు స్వస్థత పొందాడు (17:18).

Matthew 17:19-21

చాంద్ర రోగం ఉన్న బాలుణ్ణి శిష్యులు ఎందుకు స్వస్థ పరచ లేకపోయారు?

తమకున్న అల్ప విశ్వాసం వల్లనే బాలుణ్ణి శిష్యులు స్వస్థ పరచ లేకపోయారని యేసు చెప్పాడు (17:20).

Matthew 17:22-25

శిష్యులు విచారగ్రస్తులయ్యేలా యేసు చెప్పిన విషయం ఏమిటి?

యేసు తన శిష్యులతో తనను చంపే వారికీ తనను అప్పగిస్తారని, వారు తనను చంపుతారని, మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పినప్పుడు శిష్యులు విచారగ్రస్తులయ్యారు (17:22-23).

Matthew 17:26-27

పేతురు, యేసు తమ పన్నులు చెరొక అర షెకెలు ఎలా చెల్లించారు?

పేతురును సముద్రమునకు వెళ్లి, గాలం వేసి మొదటగా వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచి అక్కడ దొరికిన ఒక షెకెలుతో ఇద్దరి పన్ను కట్టాలని యేసు పేతురుతో చెప్పాడు (17:27).

Matthew 18

Matthew 18:1-3

మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలగాలంటే ఎలా ఉండాలి?

మనం తప్పక మార్పు చెంది చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించలేము అని యేసు చెప్పాడు (18:3).

Matthew 18:4-8

పరలోక రాజ్యంలో గొప్పవాడుగా ఎవరు ఉంటారని యేసు చెప్పాడు?

తనను తాను తగ్గించుకునేవాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని యేసు చెప్పాడు (18:4).

యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువానికి ఏమి జరుగుతుంది?

యేసునందు విశ్వాసముంచిన చిన్నవారిని అభ్యంతరపరచువాడు మెడకు తిరుగలి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట మేలు (18:6).

Matthew 18:9

ప్ర,. మనకు అభ్యంతరం కలిగించే వాటిని ఏమి చేయాలని యేసు చెప్పాడు?

మనకు అభ్యంతరం కలిగించే దేనినైనా విసిరి పారవేయాలని యేసు చెప్పాడు (18:8-9).

Matthew 18:10-11

చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదని యేసు చెప్పాడు?

చిన్నపిల్లలను ఎందుకు తృణీకరించకూడదంటే పిల్లల దూతలు పరలోకమందున్న తండ్రి ముఖాన్ని చూస్తున్నారని యేసు చెప్పాడు (18:10).

Matthew 18:12-14

తప్పిపోయిన గొర్రెను వెదికే వ్యక్తి పరలోకపు తండ్రిని ఎలా పోలి ఉన్నాడు?

ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు (18:12-14).

Matthew 18:15-16

నీ సహోదరుడు నీపట్ల తప్పు చేసినప్పుడు నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటి?

మొదటగా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని తప్పు తెలియజెయ్యి (18:15).

నీ సహోదరుడు వినని పక్షంలో నువ్వు చేయవలసిన రెండవ పని ఏమిటి?

రెండవదిగా, నీతో సహా ఇద్దరు ముగ్గురిని సాక్ష్యులుగా నీ వెంట తీసుకు వెళ్ళు (18:16).

Matthew 18:17

అప్పటికీ నీ సహోదరుడు వినని పక్షంలో మూడవదిగా నువ్వు ఏమి చెయ్యాలి?

మూడవది, ఆ సంగతి సంఘములో చెప్పాలి (18:17).

Matthew 18:18-20

ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు యేసు చేస్తున్న వాగ్దానం ఏమిటి?

ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు వారి మధ్యన ఉంటానని యేసు వాగ్దానం చేస్తున్నాడు (18:20).

Matthew 18:21-22

మన సహోదరులు మనపట్ల తప్పిదం చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలని యేసు చెప్పాడు?

మనం మన సహోదరుణ్ణి ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్బై ఏళ్లసార్లు క్షమించాలని యేసు చెప్పాడు (18:21-22).

Matthew 18:23-25

సేవకుడు తన యజమానికి అచ్చియున్నది ఏమిటి? అతడు దానిని తీర్చగలిగాడా?

సేవకుడు తన యజమానికి పదివేల తలాంతులు అచ్చియున్నాడు. అతడు దానిని తీర్చలేకపోయాడు (18:24-25).

Matthew 18:26-27

యజమాని సేవకుని అప్పు ఎందుకు క్షమించాడు?

యజమాని ఆ సేవకునిపై కనికరపడి అతనిని విడిచిపెట్టి క్షమించాడు (18:27).

Matthew 18:28-31

క్షమాపణ పొందిన సేవకుడు తనకు వంద తలాంతులు అచ్చియున్న తోటి సేవకుణ్ణి క్షమించి విడిచిపెట్టాడా?

ఆ సేవకుడు తనకు వంద తలాంతులు అచ్చియున్న తోటి సేవకుణ్ణి క్షమించకుండా చెరసాలలో వేయించాడు (18:28-30).

Matthew 18:32-33

ఆ సేవకుడు తన తోటి సేవకునికి చేసినది విన్న యజమాని ఏమన్నాడు?

యజమాని సేవకుణ్ణి పిలిచి అతడు క్షమించబడినట్టు, అతని తోటి దాసుని పట్ల కనికరం చూపాలని చెప్పాడు (18:33).

Matthew 18:34-35

ఆ యజమాని సేవకుణ్ణి ఏమి చేశాడు?

యజమాని తనకు అచ్చియున్నందంతా చెల్లించే వరకూ బాధపరచువారికి అతణ్ణి అప్పగించాడు (18:34).

మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే తండ్రి ఏమి చేస్తాడని యేసు చెప్పాడు?

యజమాని తన సేవకునిపట్ల చేసినట్టు, మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఇలాగే చేస్తాడని యేసు చెప్పాడు (18:35).

Matthew 19

Matthew 19:3-4

పరిసయ్యులు యేసుని శోధించడానికి ఆయనను ఏమని ప్రశ్నించారు?

"ఏ కారణం చేతనైనా భార్యకు విడాకులు ఇవ్వడం న్యాయమేనా?" అని పరిసయ్యులు యేసుని ప్రశ్నించారు (19:3).

సృష్టి ఆరంభంలో ఏమి ఉన్నదని యేసు చెప్పాడు?

సృష్టి ఆరంభంలో దేవుడు పురుషుని, స్త్రీని సృష్టించాడని యేసు చెప్పాడు (19:4).

Matthew 19:5-6

దేవుడు పురుషుని, స్త్రీని చేసిన విధానాన్ని బట్టి పురుషుడు ఏమి చేయాలని యేసు చెప్పాడు?

పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడని యేసు చెప్పాడు (19:5).

పురుషుడు తన భార్యను హత్తుకొనుట వలన ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

పురుషుడు తన భార్యను హత్తుకొని ఉండుట వలన వారిద్దరూ ఏక శరీరులుగా ఉంటారు (19:5-6).

దేవుడు జతపరచిన వారిని మానవుడు ఏమి చేయకూడని యేసు చెప్పాడు?

దేవుడు జతపరచిన వారిని మానవుడు వేరు చేయకూడని చేయకూడని యేసు చెప్పాడు (19:6).

Matthew 19:7-9

మోషే ఆజ్ఞ విడాకులను ఎందుకు అనుమతించిందని యేసు చెప్పాడు?

ఆనాటి యూదుల హృదయ కఠినత్వాన్ని బట్టి మోషే విడాకులు అనుమతించాడని యేసు చెప్పాడు (19:7-8).

వ్యభిచారం చేసేవాడు ఎవరని యేసు చెప్పాడు?

కేవలం వ్యభిచారం కోసమే తన భార్యను విడిచిపెట్టి మరో స్త్రీని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి. విడిచి పెట్టబడిన దానిని వివాహం చేసుకొనేవాడు వ్యభిచారి అని యేసు చెప్పాడు (19:9).

Matthew 19:10-12

నపుంసకులుగా ఉండేందుకు అంగీకరించే వారిని గూర్చి యేసు ఏమి చెప్పాడు?

నపుంసకులుగా మారేందుకు అంగీకరించే వారిని నపుంసకులుగా మారనివ్వండి అని యేసు చెప్పాడు (19:10-12).

Matthew 19:13-15

చిన్న పిల్లలను యేసు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేశారు?

చిన్నపిల్లలను యేసు దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు శిష్యులు వారిని గద్దించారు (19:13).

యేసు చిన్నపిల్లలను చూసినప్పుడు ఏమి చేశాడు?

చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని తన యొద్దకు రానివ్వమని, పరలోక రాజ్యం ఇలాంటివారిదేనని యేసు చెప్పాడు (19:14).

Matthew 19:16-19

నిత్యజీవంలో ప్రవేశించాలంటే తప్పక ఏమి చెయ్యాలని అ యువకునితో యేసు చెప్పాడు?

నిత్యజీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలన్నిటినీ పాటించమని యేసు అ యువకునితో చెప్పాడు (19:16-17).

Matthew 19:20-22

ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నానని అ యువకుడు చెప్పినప్పుడు, యేసు అతనితో ఏమని చెప్పాడు?

ఆజ్ఞలన్నిటినీ పాటిస్తున్నానని అ యువకుడు చెప్పినప్పుడు యేసు అతనితో అతనికున్నవన్నీ అమ్మివేసి పేదవారికి ఇవ్వమని చెప్పాడు (19:20-21).

తనకున్నవన్నీ అమ్మివేయమని యేసు ఆజ్ఞాపించినపుడు అతడు ఎలా స్పందించాడు?

ఆ యువకుడు ఎక్కువ ఆస్థి గలవాడు కనుక యేసు చెప్పిన మాట విని విచార పడుతూ తిరిగి వెళ్ళిపోయాడు (19:22).

Matthew 19:23-27

ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుటను గూర్చి యేసు ఏమని చెప్పాడు?

ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని యేసు చెప్పాడు. అయితే దేవునికి సమస్తమును సాధ్యమే (19:23-26).

Matthew 19:28

తనను వెంబడించిన శిష్యులకు ఏ ప్రతిఫలం దక్కుతుందని యేసు చెప్పాడు?

తనను వెంబడించిన శిష్యులు పునరుత్థాన దినమందు, వారు పన్నెండు సింహాసనములపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారని యేసు చెప్పాడు (19:28).

Matthew 19:29-30

మొదటివారిని, కడపటివారిని గూర్చి యేసు ఏమి చెప్పాడు?

మొదటివారు అనేకులు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు అని యేసు చెప్పాడు (19:30).

Matthew 20

Matthew 20:1-2

ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఎంత కూలి ఇవ్వడానికి అంగీకరించాడు?

ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఒక దేనారము ఇవ్వడానికి అంగీకరించాడు (20:1-2).

Matthew 20:3-7

తొమ్మిది, పన్నెండు, మూడు, అయిదు గంటల సమయంలో కుదుర్చుకున్న పనివారికి ఎంత కూలి ఇస్తానని ఇంటి యజమాని చెప్పాడు?

ఏది న్యాయమో అది ఇస్తానని ఇంటి యజమాని కూలివారితో చెప్పాడు (20:4-7).

Matthew 20:8-10

పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఎంత కూలి లభించింది?

పన్నెండు గంటలకు కుదుర్చుకున్న కూలీలకు ఒక దేనారము కూలి లభించింది (20:9).

Matthew 20:11-12

పొద్దున్న పనికి కుదర్చబడిన కూలీలు ఏమని సణుగుకొన్నారు?

తాము రోజంతా పనిచేసినప్పటికీ చివరి గంట పనిచేసినవారితో సమానమైన కూలీ దొరికిందని సణుగుకొన్నారు (20:11-12).

Matthew 20:13-16

కూలీలకు ఇంటి యజమాని ఏమని సమాధానమిచ్చాడు?

పొద్దుటి నుంచి పని చేసినవారికి చెప్పినట్టు ఒక దేనారం కూలి ఇచ్చానని, అయితే తన ఇష్ట ప్రకారం మిగతా కూలీలకు కూడా అంతే చెల్లించానని ఇంటి యజమాని చెప్పాడు (20:13-15).

Matthew 20:17-19

యేసు తన శిష్యులతో యెరూషలేము బయలుదేరేముందు తనకు జరుగబోయే ఏ ఏ విషయాలు ముందుగా తెలియజేసాడు?

తనను ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకొని మరణ శిక్ష విధించి సిలువ వేస్తారని, తాను మూడవ రోజున తిరిగి లేస్తానని శిష్యులకు ముందుగా చెప్పాడు (20:17-19).

Matthew 20:20-21

జెబెదయి కుమారుల తల్లి యేసును ఏమి కోరుకుంది?

తన కుమారులు యేసు రాజ్యంలో ఆయనకు కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చుని ఉండాలని యేసును కోరుకున్నది (20:20-21).

Matthew 20:22-24

పరలోక రాజ్యంలో తన కుడి పక్కన ఎడమ పక్కన ఎవరు కూర్చోవాలో నిర్ణయించే అధికారం ఎవరికి ఉన్నదని యేసు చెప్పాడు?

ఆయన ఎంపిక చేసిన వారికోసం తగిన స్థలాలను తండ్రి అయిన దేవుడు నిర్ణయిస్తాడు (20:23).

Matthew 20:25-28

తన శిష్యులలో గొప్పవాడుగా ఉండగోరిన వాడు ఎలా ఉండాలని యేసు చెప్పాడు?

గొప్పవాడుగా ఉండగోరిన వాడు పరిచారకుడుగా ఉండాలని ఉండాలని యేసు చెప్పాడు (20:26).

యేసు ఎందుకు వచ్చానని చెప్పాడు?

అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు (20:28).

Matthew 20:29-31

యేసు ఆ మార్గమున వెళ్తూ ఉండగా దారి పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివాళ్ళు ఏమి చేశారు?

ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు, "ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు" అని కేకలు వేసారు (20:30).

Matthew 20:32-34

ఇద్దరు గుడ్డివాళ్ళను యేసు ఎందుకు స్వస్థపరిచాడు?

ఇద్దరు గుడ్డివాళ్ళను చూసి యేసు వారిపై కనికరపడ్డాడు (20:34).

Matthew 21

Matthew 21:1-3

యేసు తన శిష్యులకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఏమి కనబడుతుందని చెప్పాడు?

శిష్యులు వెళ్ళినప్పుడు వారికి కట్టబడియున్న ఒక గాడిద, దానితో గాడిద పిల్ల కనబడతాయని యేసు చెప్పాడు (21:2).

Matthew 21:4-5

ఈ సంఘటనను ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడు?

ప్రవక్త, ఇదిగో నీ రాజు గాడిదను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని ప్రవచించాడు (21:4-5).

Matthew 21:6-8

యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు ఏమి చేశారు?

యెరూషలేము వీధుల్లో యేసు ప్రయాణిస్తున్నపుడు జనసమూహములు పైబట్టలు, చెట్ల కొమ్మలు దారి వెంట పరిచారు (21:8).

Matthew 21:9-11

యేసు వెళ్తుండగా జనసమూహం ఏమని కేకలు వేసారు?

జనసమూహం "దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము" అని కేకలు వేశారు (21:9). .

Matthew 21:12-14

యెరూషలేము దేవాలయములో ప్రవేశించినప్పుడు యేసు ఏమి చేశాడు?

దేవాలయములో ప్రవేశించి యేసు, క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి, గువ్వలను అమ్మేవారి బల్లలను పడదోశాడు (21:12).

దేవుని మందిరాన్ని వ్యాపారులు ఏమి చేశారని యేసు అన్నాడు?

దేవుని మందిరాన్ని వ్యాపారులు దొంగల గుహవలె చేశారని యేసు అన్నాడు (21:13).

Matthew 21:15-17

యేసును గూర్చి చిన్న పిల్లలు కేకలు వేస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు అభ్యంతరం తెలిపినప్పుడు యేసు వారితో ఏమి అన్నాడు?

బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్దింపజేసితివి అని ప్రవక్తలచే పలుకబడిన ప్రవచనం యేసు వారికి గుర్తు చేశాడు (21:15-16).

Matthew 21:18-19

యేసు అంజూరపు చెట్టును ఏమి చేశాడు? ఎందుకు?

అది కాపు లేకుండా ఉన్నందువల్ల యేసు ఆ చెట్టుని శపించాడు (21:18-19).

Matthew 21:20-22

అంజూరపు చెట్టు ఎండిపోయిన సందర్భంలో ప్రార్థన గురించి యేసు తన శిష్యులకు ఏమి బోధించాడు?

వారు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటన్నిటినీ పొందుతారని యేసు బోధించాడు (21:20-22).

Matthew 21:23-24

యేసు బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి యేసును ఏమని ప్రశ్నించారు?

ప్రధాన యాజకులు, పెద్దలు యేసు దగ్గరకు వచ్చి, ఏ అధికారంతో యేసు ఈ పనులన్నీ చేస్తున్నాడని అడిగారు (21:23).

Matthew 21:25-27

ప్రధాన యాజకులు, పెద్దలు అడిగిన ప్రశ్నకు బదులుగా యేసు వారిని ఏమని అడిగాడు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, లేక మనుషులనుండి కలిగిందా అని యేసు వారిని ప్రశ్నించాడు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం పరలోకం నుండి కలిగినది అని చెబితే, యోహానును ఎందుకు నమ్మలేదని యేసు ప్రశ్నించవచ్చు (21:25).

బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చే బాప్తిస్మం మనుషులనుండి కలిగింది అని చెప్పడానికి ఎందుకు సందేహించారు?

బాప్తిసమిచ్చే యోహానును ఒక ప్రవక్తగా భావిస్తున్న ప్రజలకు భయపడి ఏ జవాబూ చెప్పలేదు (21:26).

Matthew 21:28-30

యేసు చెప్పిన కథలో ఇద్దరు కుమారులలో ఎవరు తండ్రి చెప్పిన పని చేశారు?

మొదటి కుమారుడు ముందు వెళ్లనని చెప్పినప్పటికీ తరువాత తన మనస్సు మార్చుకొని వెళ్లి పని పూర్తిచేశాడు (21:28-31).

Matthew 21:31-34

ప్రధాన యాజకులు, శాస్త్రుల కంటే ముందుగా సుంకరులు, వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని యేసు ఎందుకు చెప్పాడు?

సుంకరులు, వేశ్యలు యోహాను నీతి మార్గమును నమ్మారు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యోహాను నీతి మార్గమును నమ్మక పశ్చాత్తాపపడలేదు (21:31-32).

Matthew 21:35-37

పంట యజమాని తన భాగం కోసం సేవకులను పంపినప్పుడు గుత్త కాపులు ఏమిచేశారు?

గుత్త కాపులు సేవకులలో ఒకరిని కొట్టారు, ఒకరిని చంపారు, మరియొకరిపై రాళ్ళు రువ్వారు (21:35-36).

చివరకు యజమాని ఏమి చేశాడు?

చివరగా యజమాని తన కుమారుణ్ణి పంపించాడు (21:37).

Matthew 21:38-39

చివరగా యజమాని పంపిన వ్యక్తిని గుత్త కాపులు ఏమిచేశారు?

యజమాని కుమారుణ్ణి గుత్త కాపులు చంపివేశారు (21:38-39).

Matthew 21:40-41

తరువాత ఏమి చేయమని మనుషులు యజమానికి చెప్పారు?

ఆ దుర్మార్గులైన గుత్త కాపులను సంహరించి పంటలో భాగం ఇచ్చే వేరే కాపులకు ఇవ్వమని చెప్పారు (21:40-41).

Matthew 21:42

యేసు లేఖనాన్ని ప్రస్తావించి చెప్పినట్టు, నిషేధించబడిన రాయి ఏమవుతుంది?

ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది (21:42).

Matthew 21:43-44

యేసు ప్రస్తావించిన లేఖనం ప్రకారం, ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

దేవుని రాజ్యము ప్రధాన యాజకులు, పరిసయ్యుల యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు ప్రజల యొద్దకు తీసుకురాబడుతుంది (21:43).

Matthew 21:45-46

ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసును వెంటనే ఎందుకు బంధించలేకపోయారు?

యేసును ప్రజలు ప్రవక్త అని భావించినందువల్ల ప్రధాన యాజకులు, పరిసయ్యులు ప్రజలకు భయపడి యేసును బంధించలేకపోయారు (21:46).

Matthew 22

Matthew 22:5-7

రాజు తన కుమారుని పెండ్లి విందుకు ఆహ్వానం పంపినపుడు పిలువబడినవారు ఏమి చేశారు?

కొందరు ఆహ్వానం లక్ష్యపెట్టలేదు, కొందరు తమ సొంత పనులకు వెళ్ళిపోయారు, కొందరు ఆ సేవకులను పట్టుకుని అవమాన పరచి చంపివేశారు (22:2-6).

మొదట పెండ్లి విందుకు పిలువబడి, తిరస్కరించినవారిని రాజు ఏమి చేశాడు?

రాజు తన సేనలను పంపి ఆ హంతకులను చంపించి, వారి నగరాన్ని తగలబెట్టించాడు (22:7).

Matthew 22:8-12

తరువాత రాజు పెండ్లి విందుకు ఎవరిని పిలిచాడు?

తరువాత రాజు తన సేవకులకు కనబడినవారందరినీ, వారు మంచివారైనా, చెడ్డవారైనా అందరినీ పిలిపించాడు (22:9-10).

Matthew 22:13-14

పెండ్లి దుస్తులు ధరించనివారిని రాజు ఏమి చేశాడు?

పెండ్లి దుస్తులు ధరించనివారి కాళ్ళు, చేతులు కట్టివేసి చీకటిలోకి తోసివేశాడు (22:11-13).

Matthew 22:15-19

పరిసయ్యులు యేసును ఏమి చేయాలని చూశారు?

పరిసయ్యులు యేసును మాటలలో పెట్టి చిక్కుల్లో పడవేయాలని చూశారు (22:15).

పరిసయ్యుల శిష్యులు యేసును ఏమని ప్రశ్నించారు?

కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కాదా అని యేసును అడిగారు (22:17).

Matthew 22:20-22

పరిసయ్యుల శిష్యులకు యేసు ఏమని జవాబిచ్చాడు?

కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వమని వారికి జవాబిచ్చాడు (22:21).

Matthew 22:23-24

పునరుత్దానమును గురించి సద్దూకయ్యుల నమ్మకం ఏమిటి?

పునరుత్దానము అనేది లేదని సద్దూకయ్యుల నమ్ముతారు (22:23).

Matthew 22:25-28

సద్దూకయ్యుల కథలో ఒక స్త్రీకి ఎంత మంది భర్తలు ఉన్నారు?

ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉన్నారు (22:24-27).

Matthew 22:29-30

సద్దూకయ్యులకు తెలియని రెండు విషయాలు ఏమిటని యేసు చెప్పాడు?

సద్దూకయ్యులకు లేఖానాలు, దేవుని శక్తీ గురించి తెలియదు (22:29).

పునరుత్థానంలో పెండ్లి గురించి యేసు ఏమి చెప్పాడు?

పునరుత్థానంలో ఎవరూ పెండ్లి చేసుకోరని యేసు చెప్పాడు (22:30).

Matthew 22:31-33

పునరుత్థానం ఉన్నదని యేసు లేఖనాల ద్వారా ఎలా చూపించాడు?

తండ్రియైన దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైయున్నాడని లేఖనాలను ప్రస్తావిస్తూ యేసు చెప్పాడు (22:32).

Matthew 22:34-36

పరిసయ్యుడైన ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ఏమని ప్రశ్నించాడు?

ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటని ప్రశ్నించాడు (22:36).

Matthew 22:37-40

యేసు చెప్పిన రెండు ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి?

నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అనేవి యేసు చెప్పిన ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు (22:37-39).

Matthew 22:41-42

యేసు పరిసయ్యులను ఏమని ప్రశ్నించాడు?

క్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగాడు (22:42).

పరిసయ్యులను ఏమని జవాబిచ్చారు?

క్రీస్తు దావీదు కుమారుడని పరిసయ్యులు జవాచ్చారు (22:42).

Matthew 22:43-44

తరువాత యేసు పరిసయ్యులను అడిగిన రెండవ ప్రశ్న ఏమిటి?

తన ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఎలా చెబుతున్నాడని యేసు అడిగాడు (22:43-45).

Matthew 22:45-46

పరిసయ్యులకు యేసుకు ఏమని జవాబిచ్చారు?

యేసు అడిగిన దానికి వారు ఎవరూ మాట్లాడలేకపోయారు (22:46).

Matthew 23

Matthew 23:1-3

పరిసయ్యులు, శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చుని చెప్పే వాటి గురించి యేసు ఏమని చెప్పాడు?

పరిసయ్యులు, శాస్త్రులు మోషే పీఠం మీద కూర్చుని చెప్పే వాటన్నిటినీ గైకొనుమని యేసు చెప్పాడు (23:2-3).

పరిసయ్యుల, శాస్త్రుల క్రియల చొప్పున చేయవద్దని యేసు ఎందుకు చెప్పాడు?

పరిసయ్యుల, శాస్త్రుల క్రియల చొప్పున చేయవద్దని యేసు ఎందుకు చెప్పాడంటే వారు చెబుతారు గాని ఆ ప్రకారం చేయరు (23:3).

Matthew 23:4-7

పరిసయ్యుల, శాస్త్రులు ఎందుకోసం తమ క్రియలు జరిగిస్తారు?

పరిసయ్యుల, శాస్త్రులు ఇతరులు చూడాలని తమ క్రియలు జరిగిస్తారు (23:5).

Matthew 23:8-10

యేసు చెప్పినట్టు మనకున్న ఒకే ఒక్క తండ్రి, ఒకే ఒక్క గురువు ఎవరు?

పరలోకమందున్నవాడు ఒక్కడే మన తండ్రి, క్రీస్తు ఒక్కడే మన గురువు అని యేసు చెప్పాడు (23:8-10).

Matthew 23:11-12

తనను హెచ్చించుకొనే వారిని, తనను తగ్గించుకోనే వారిని దేవుడు ఏమి చేస్తాడు?

తనను హెచ్చించుకొనే వారిని తగ్గిస్తాడు, తనను తగ్గించుకోనే వారిని హెచ్చిస్తాదు (23:12).

Matthew 23:13-15

పరిసయ్యులు, శాస్త్రులు ఒక వ్యక్తిని తమ మతంలోకి చేర్చుకొన్నప్పుడు అతడు దేనికి వారసుడు అవుతాడు?

పరిసయ్యుల, శాస్త్రులు ఒక వ్యక్తిని తమ మతంలోకి చేర్చుకొన్నప్పుడు ఆ వ్యక్తి వారికంటే రెండు రెట్లు అధిక శిక్షకు పాత్రుడవుతాడు (23:15).

యేసు పరిసయ్యులను, శాస్త్రులను వారి ప్రవర్తన బట్టి పదే పదే ఏమని పిలిచాడు?

యేసు పరిసయ్యులను, శాస్త్రులను పదే పదే వేషదారులు అని పిలిచాడు (23:13-15,23,25,27,29).

Matthew 23:16-22

ఒట్టు పెట్టుకొనే సందర్భంలో పరిసయ్యుల, శాస్త్రుల బోధలను గూర్చి యేసు ఏమి చెప్పాడు?

పరిసయ్యుల, శాస్త్రుల బోధలు అంధులైన మార్గదర్శకులు, అంధులైన అవివేకులు అని యేసు చెప్పాడు (23:16-19).

Matthew 23:23-24

పరిసయ్యులు, శాస్త్రులు పుదీనాలో, సోపులో, జీలకర్రలో పదవ వంతు చెల్లిస్తున్నప్పటికీ ఏ విషయంలో తప్పిపోతున్నారు?

పరిసయ్యులు, శాస్త్రులు ధర్మ శాస్త్రములో ముఖ్యమైన విషయాలలో అంటే న్యాయము, కనికరము, విశ్వాసము విషయాలలో తప్పిపోతున్నారు (23:23).

Matthew 23:25-26

పరిసయ్యులు, శాస్త్రులు దేనిని శుభ్రం చేయడంలో తప్పిపోతున్నారు?

పరిసయ్యులు, శాస్త్రులు తమ గిన్నెలు బయట శుభ్రం చేస్తున్నారు గాని గిన్నెల లోపల శుభ్రం చేయడం లేదు (23:25-26).

Matthew 23:27-28

పరిసయ్యులు, శాస్త్రులు తమ లోపల ఏమి ఉంచుకొన్నారు?

పరిసయ్యులు, శాస్త్రులు వేషధారణ, అన్యాయం, అక్రమాలతో తమ హృదయాలు నింపుకొన్నారు (23:25,28).

Matthew 23:29-31

పరిసయ్యుల, శాస్త్రుల పితరులు దేవుని ప్రవక్తలను ఏమి చేశారు?

పరిసయ్యుల, శాస్త్రుల పితరులు దేవుని ప్రవక్తలను చంపివేశారు (23:29-31).

Matthew 23:32-33

శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి శిక్షను ఎదుర్కోబోతున్నారు?

శాస్త్రులు, పరిసయ్యులు తీర్పులో నరక శిక్షను ఎదుర్కోబోతున్నారు (23:33).

Matthew 23:34-36

శాస్త్రులు పరిసయ్యులు తాను పంపుతున్న ప్రవక్తలను, జ్ఞానులను, , ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

వారిలో కొందరిని సిలువ వేస్తారు, కొందరిని కొరడాలతో కొడతారు, కొందరిని తరిమి వేస్తారు (23:34).

శాస్త్రుల, పరిసయ్యుల దోష ప్రవర్తన బట్టి వారికి ఎలాంటి తీర్పు వస్తుంది?

చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా వారి శాస్త్రుల, పరిసయ్యుల మీదకు వస్తుంది (23:35).

ఏ తరము వారికి యేసు చెప్పినది వస్తుంది?

యేసు చెప్పిన ఇవన్నీప్రస్తుత తరమువారికి వస్తాయి (23:36).

Matthew 23:37-39

యేసు యెరూషలేము సంతతి ఏమి చేయాలని కోరినప్పుడు వారు నెరవేర్చలేక పోయారు?

యెరూషలేము సంతతి అంతటినీ ఒక చోట సమకూర్చవలెనని కోరినప్పుడు వారు నిరాకరించారు (23:37).

యెరూషలేము పట్టణం ఎలా ఉంది?

ఇప్పుడు యెరూషలేము పట్టణం విడిచిపెట్టబడింది (23:38).

Matthew 24

Matthew 24:1-2

యెరూషలేములోని దేవాలయమును గూర్చిన యేసు ప్రవచనం ఏమిటి?

యెరూషలేములోని దేవాలయము రాయి మీద రాయి ఒక్కటికూడా నిలబడకుండా పడదోయబడుతుందని యేసు ప్రవచించాడు (24:2).

Matthew 24:3-5

దేవాలయమును గూర్చిన ప్రవచనం విన్నప్పుడు శిష్యులు యేసును ఏమని అడిగారు?

ఇవి ఎప్పుడు జరుగుతాయి, యేసు రాకడకు, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడిగారు (24:3).

ఎలాంటి వ్యక్తులు ప్రజలను మోసపుచ్చుతారని యేసు చెప్పాడు?

అనేకులు యేసు పేరట వచ్చి తామే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసం చేస్తారు (24:5).

Matthew 24:6-8

వేదన కలగడానికి ప్రారంభమయ్యే సంభవాలు ఏమిటని యేసు చెప్పాడు?

యుద్ధములు, కరువులు, భూకంపాలు మొదలైనవి వేదన కలగడానికి ప్రారంభమయ్యే సంభవాలు అని యేసు చెప్పాడు (24:6-8).

Matthew 24:9-11

ఆ సమయంలో విశ్వాసులకు ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

ఆ సమయంలో విశ్వాసులు శ్రమలపాలై చనిపోతారు, జనములచేత ద్వేషింపబడతారు, అనేకులు అభ్యంతరపడి అప్పగించుకొంటారు, ఒకరినొకరు ద్వేషించుకొంటారు (24:9-12).

Matthew 24:12-14

ఎవరు రక్షింపబడతారు?

అంతము వరకు సహించినవారు రక్షింపబడతారు (24:13).

అంతము రాక ముందు సువార్త వ్యాప్తి ఎలా జరుగుతుంది?

రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్ధమై లోకమంతటా ప్రకటింపబడుతుంది (24:14).

Matthew 24:15-18

విశ్వాసులు నాసనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం చూసినప్పుడు ఏమి చేస్తారని యేసు చెప్పాడు?

విశ్వాసులు నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉండడం చూసినప్పుడు కొండలకు పారిపోతారు(24:15-18).

Matthew 24:19-22

ఆ రోజుల్లో ఇంతటి ఘోర శ్రమ ఎలా ఉంటుంది?

లోకం ఆరంభం నుండి ఇప్పటివరకు ఇలాంటి శ్రమ కలగలేదు, ఇకపై ఎప్పటికీ జరగదు (24:21).

Matthew 24:23-25

అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు ఏర్పరచబడిన వారిని ఎలా మోసగిస్తారు?

అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరచి ఏర్పరచ బడిన వారిని మోసగిస్తారు (24:24).

Matthew 24:26-28

రాబోయే మనుష్య కుమారుడు ఎలా కనబడతాడు?

మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనడుతుందో రాబోయే మనుష్య కుమారుడు కనబడతాడు (24:27).

Matthew 24:29

శ్రమ ముగిసిన తరువాత సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలకు ఏమి జరుగుతుంది?

సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చీకటి కమ్మివేస్తుంది. నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి (24:29).

Matthew 24:30-33

మనుష్య కుమారుడు మహిమతో, ప్రభావముతో దిగి వచ్చుట చూసినప్పుడు భూమిపై ఉన్న సకల గోత్రములవారు ఏమి చేస్తారు?

మనుష్య కుమారుడు మహిమతో, ప్రభావముతో దిగి వచ్చుట చూసినప్పుడు భూమిపై ఉన్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకుంటారు (24:30).

మనుష్య కుమారుడు తన దూతలను ఎంపిక చేయబడిన వారిని పోగుచేయడానికి పంపినప్పుడు ఎలాంటి శబ్దం వినిపిస్తుంది?

దూతలు ఎంపిక చేయబడిన వారిని పోగుచేయడానికి వచ్చినప్పుడు గొప్ప బూర శబ్దం వినిపిస్తుండి (24:31).

Matthew 24:34-35

ఈ విషయాలన్నీ జరిగే వరకు ఏమి గతించదని యేసు చెప్పాడు?

ఈ విషయాలన్నీ జరిగే వరకు ఈ తరము గతించదని యేసు చెప్పాడు (24:34).

ఏవి గతించి పోయినా, ఏవి గతించవని యేసు చెప్పాడు?

ఆకాశము, భూమి గతించి పోయినా ఆయన మాటలు గతింపవని యేసు చెప్పాడు (24:35).

Matthew 24:36

ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలుసు?

కేవలం ఒక్క తండ్రికి మాత్రమే ఈ విషయాలన్నీఎప్పుడు జరుగుతాయో తెలుసు (24:36).

Matthew 24:37-42

నోవహు దినముల ముందు జలప్రళయం రాకముందు ప్రజలు ఉన్నట్టుగా మనుష్య కుమారుడు వచ్చే సమయంలో ప్రజలు ఎలా ఉంటారు?

ప్రజలు తినుచూ, త్రాగుచూ పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు మనుష్య కుమారుని రాకడను గూర్చి తెలుసుకొనకుండా ఉంటారు (24:37-39).

Matthew 24:43-44

విశ్వాసులు తన రాకడ విషయంలో ఏ వైఖరి కలిగి ఉండాలని యేసు చెప్పాడు?

ప్రభువు ఎప్పుడు వస్తాడో విశ్వాసులకు తెలియదు కనుక మెలకువ కలిగి సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (24:42,44).

Matthew 24:45-47

యజమాని ఇంట లేనప్పుడు నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకుడు ఏమి చేస్తాడు?

నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకుడు తన యజమాని ఇంట లేనప్పుడు యజమాని ఇంటివారి బాగోగులు చూసుకుంటాడు (24:45-46).

యజమాని తిరిగి వచ్చినప్పుడు నమ్మకమైన, బుద్ధిమంతుడైన సేవకునికి ఏమి చేస్తాడు?

యజమాని తన యావదాస్తిపై ఆ సేవకునికి బాధ్యతలు అప్పగిస్తాడు (24:47).

Matthew 24:48-51

యజమాని ఇంట లేనప్పుడు దుష్టుడైన సేవకుడు ఏమి చేస్తాడు?

యజమాని ఇంట లేనప్పుడు దుష్టుడైన సేవకుడు తన తోటి సేవకులను కొట్టి, తాగుబోతులతో కలసి తాగుతూ, తింటూ ఉంటాడు (24:48-49).

యజమాని తిరిగి వచ్చినప్పుడు దుష్టుడైన సేవకుణ్ణి ఏమి చేస్తాడు?

యజమాని తిరిగి వచ్చినప్పుడు దుష్టుడైన సేవకుణ్ణి రెండుగా నరికించి, ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే స్థలానికి తోలివేస్తాడు (24:51).

Matthew 25

Matthew 25:1-4

బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు ఏమి చేయలేదు?

బుద్ధి లేని కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లేముందు తమ దివిటీలలో నూనె తీసుకు వెళ్ళలేదు (25:3).

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు ఏమి చేశారు?

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనేందుకు వెళ్లే ముందు తమ దివిటీలలో సరిపడిన నూనె తీసుకు వెళ్లారు (25:4).

Matthew 25:5-9

పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు? అది అనుకొన్న సమయమేనా?

పెండ్లి కుమారుడు అనుకొన్నసమయం కంటే ఆలస్యంగాఅర్థరాత్రి సమయంలో వచ్చాడు (25:5-6).

Matthew 25:10-13

పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధి గల కన్యలు ఏమి చేశారు?

బుద్ధి గల కన్యలు పెండ్లి కుమారునీతో కలసి పెండ్లి విందుకు వెళ్లారు (25:10).

పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు బుద్ధిలేని కన్యలకు ఏమి జరిగింది?

బుద్ధిలేని కన్యలు నూనె కొనేందుకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి విందు తలుపులు మోయబడ్డాయి (25:8-12).

కన్యకల ఉపమానం నుండి విశ్వాసులు ఏమి నేర్చుకోవాలని యేసు కోరుకున్నాడు?

ఆ దినమైనా, సమయమైనా తెలియదు గనుక విశ్వాసులు మెలకువగా, సిద్ధంగా ఉండాలని యేసు చెప్పాడు (25:13).

Matthew 25:14-16

యజమాని ఊరు విడిచి వెళ్తూ, తన ఇద్దరు సేవకులకు ఇచ్చిన అయిదు, రెండు తలాంతులను వారు ఏమి చేశారు?

అయిదు తలాంతులు పొందినవాడు అదనంగా మరో అయిదు తలాంతులు సంపాదించాడు. రెండు తలాంతులు పొందినవాడు అదనంగా మరో రెండు తలాంతులు సంపాదించాడు (25:16-17).

Matthew 25:17-18

యజమాని ఊరు విడిచి వెళ్తూ, ఒక సేవకునికి ఇచ్చిన ఒక్క తలాంతును అతడు ఏమి చేశాడు?

అతడు ఒక గొయ్యి తవ్వి యజమాని ఇచ్చిన తలాంతును దాచిపెట్టాడు (25:18).

Matthew 25:19-25

యజమాని ఎంతకాలం వరకు తిరిగి రాలేదు?

యజమాని చాలాకాలం వరకు తిరిగి రాలేదు (25:19).

అయిదు, రెండు తలాంతులు తీసుకొన్న సేవకులతో యజమాని ఏమని చెప్పాడు?

యజమాని వారితో, "భళా నమ్మకమైన మంచి దాసుడా" అని మెచ్చుకొని వారిని అనేకమైన వాటిపై నియమించాడు (25:20-23).

Matthew 25:26-30

ఒక్క తలాంతు తీసుకొన్న సేవకునితో యజమాని ఏమన్నాడు?

యజమాని ఆ సేవకుణ్ణి "సోమరివైన చెడ్డ దాసుడా" అని చెప్పి అతని వద్దనుండి ఒక్క తలాంతు తీసి వేసి, అతణ్ణి చీకటిలోకి విసరివేయమని చెప్పాడు (25:24-30).

Matthew 25:31-33

మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని ఏమి చేస్తాడు?

మనుష్య కుమారుడు మహిమగల సింహాసనముపై కూర్చుని సమస్త జనులను పోగుచేసి ఒకరినుండి ఒకరిని వేరుపరుస్తాడు (25:31-32).

Matthew 25:34-40

రాజు కుడి పక్కన ఉన్నవారు ఏమి పొందుతారు?

రాజు కుడిపక్కన ఉన్నవారు లోకం పుట్టినది మొదలు తమ కోసం సిద్దపరచబడిన రాజ్యం పొందుతారు (25:34).

రాజు కుడిపక్కన ఉన్నవారు తమ జీవిత కాలంలో ఏమి చేశారు?

రాజు కుడిపక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు, దాహం ఉన్నవారి దాహం తీర్చారు, పరదేశులను ఆదరించారు, బట్టలు లేనివారికి బట్టలిచ్చారు, రోగులను పరామర్శించారు, ఖైదీలను దర్శించారు (25:35-40).

Matthew 25:41-43

రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఏమి పొందుకుంటారు?

రాజు కుడి పక్కన ఉన్నవారు అపవాదికి, వాడి దూతలకు సిద్దపరచబడిన నిత్యాగ్నిలోకి పడద్రోయబడతారు (25:41).

Matthew 25:44-46

రాజు ఎడమ పక్కన ఉన్నవారు తమ జీవిత కాలంలో ఏ పనులు చేయలేదు?

రాజు ఎడమ పక్కన ఉన్నవారు ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టలేదు, దాహం గొన్నవారి దప్పిక తీర్చలేదు, పరదేశులను ఆదరించలేదు, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వలేదు, రోగులను పరామర్శించలేదు, ఖైదీలను దర్శించలేదు (25:42-45).

Matthew 26

Matthew 26:1-2

ఏ యూదుల పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు?

పస్కా పండుగ రెండు రోజుల్లో రాబోతున్నదని యేసు చెప్పాడు (26:2).

Matthew 26:3-5

యాజకులు, పెద్దలు ప్రధాన యాజకుని మందిరములో సమకూడి ఏమని ఆలోచన చేశారు?

వారు యేసును మాయోపాయము చేత పట్టుకొని ఆయనను చంపాలని ఆలోచన చేశారు (26:4).

ప్రధాన యాజకులు, పెద్దలు ఎందువలన భయపడ్డారు?

పండుగ సందర్భంగా యేసుని చంపితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని వారు భయపడ్డారు (26:5).

Matthew 26:6-11

ఒక స్త్రీ విలువైన అత్తరును యేసు తలపై పోసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారు?

శిష్యులు కోపగించుకోని ఆ అత్తరును అమ్మి వచ్చిన ధనం పేదలకు పంచవచ్చు గదా అన్నారు (26:6-9).

Matthew 26:12-13

తన తలపై ఆ స్త్రీ నూనె పోసినప్పుడు యేసు ఏమని చెప్పాడు?

నా భూస్థాపన కొరకు ఈమె ఈ అత్తరు పోసినదని యేసు చెప్పాడు (26:12).

Matthew 26:14-22

యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ఎంత మొత్తం చెల్లించారు?

యేసును అప్పగించడానికి ఇస్కరియోతు యూదాకు ప్రధాన యాజకులు ముప్ఫై వెండి నాణెములు చెల్లించారు (26:14-15).

Matthew 26:23-25

తనను అప్పగింపబోయేవానికి భవిషత్తులో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?

తనను అప్పగింపబోయే వాడికి బాధ, వాడు పుట్టకుండా ఉన్నట్టయితే అతనికి మేలు అని యేసు అన్నాడు (26:24).

యేసును అప్పగింపబోయేది నేనా అని యూదా అడిగినప్పుడు యేసు ఏమని జవాబిచ్చాడు?

"నీవన్నట్టే" అని యేసు జవాబిచ్చాడు (26:25).

Matthew 26:26

యేసు రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి, విరిచి శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

"దీనిని తీసికొని తినండి, ఇది నా శరీరము" అని చెప్పాడు (26:26).

Matthew 26:27-29

యేసు గిన్నె తీసుకొని దానిని శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?

"ఇది నా రక్తము, అంటే పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము" అని చెప్పాడు (26:28).

Matthew 26:30-32

యేసు తన శిష్యులతో ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు వారితో ఏమని చెప్పాడు?

ఆ రాత్రి వారంతా తన విషయంలో అభ్యంతరపడతారని యేసు చెప్పాడు (26:30-31).

Matthew 26:33-35

పేతురు యేసు విషయంలో అభ్యంతరపడనని యేసుతో చెప్పినప్పుడు ఆయన పేతురుతో ఏమని చెప్పాడు?

పేతురు ఈ రాత్రి కోడి కూయక ముందు తనను ఎరుగనని మూడుసార్లు చెబుతాడని యేసు చెప్పాడు (26:33-34).

Matthew 26:36-38

తాను ప్రార్ధించే సమయంలో పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను ఏమి చేయమని యేసు అడిగాడు?

శిష్యులను మెలకువగా ఉండి కనిపెట్టమని యేసు కోరాడు (26:37-38).

Matthew 26:39-41

ప్రార్థనలో యేసు తండ్రిని ఏమి అడిగాడు?

సాధ్యమైతే ఈ గిన్నెను నానుండి తొలగిపోనిమ్ము అని ప్రార్ధించాడు (26:39).

యేసు తన చిత్తం కాక, ఎవరి చిత్తం నెరవేరాలని కోరాడు?

యేసు, తన చిత్తం కాక తండ్రి చిత్తమే నెరవేరాలని కోరాడు (26:39,42).

Matthew 26:42-46

యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు ఏమి చేస్తున్నారు?

యేసు ప్రార్ధించి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు (26:40,43,45).

ఎన్నిసార్లు యేసు శిష్యులను విడిచి ప్రార్ధించడానికి వెళ్ళాడు?

యేసు శిష్యులను విడిచి మూడుసార్లు ప్రార్ధించడానికి వెళ్ళాడు? (26:39-44).

Matthew 26:47-50

గుంపులో ఉన్న యేసును బంధించడానికి యూదా ఏ సూచన చెప్పాడు?

గుంపులో ఉన్న యేసును ముద్దు పెట్టుకోవడం అనే సూచనను బట్టి ఆయనే యేసు అని గుర్తించాలని యూదా చెప్పాడు (26:47-50).

Matthew 26:51-54

యేసును బంధించినప్పుడు శిష్యులు ఏమి చేశారు?

యేసు శిష్యులలో ఒకడు కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు (26:51).

యేసు కోరుకుంటే తనను తాను కాపాడుకోలేడా?

యేసు తన తండ్రిని కోరితే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సేనలను తండ్రి పంపుతాడని యేసు చెప్పాడు (26:53).

లేఖనాలు ఏ సంఘటనలవల్ల నేరవేరబడాలని యేసు చెప్పాడు?

జరుగుతున్నఈ సంఘటనలన్నీ లేఖానాల నెరవేర్పు అని యేసు చెప్పాడు (26:54,56).

Matthew 26:55-58

అప్పుడు శిష్యులు ఏమి చేశారు?

శిష్యులు అందరూ యేసును విడిచి పారిపోయారు (26:56).

Matthew 26:59-61

యేసుకు మరణ శిక్ష విధించేలా చేయాలని ప్రధాన యాజకులు, మహాసభవారు ఏమి కుట్రలు చేస్తున్నారు?

ఆయనను చంపాలని యేసుకు వ్యతిరేకంగా ప్రజలచే అబద్ధ సాక్ష్యం చెప్పించాలని చూస్తున్నారు (26:59).

Matthew 26:62-64

జీవము గల దేవుని సాక్ష్యంగా ఏమి చెప్పాలని ప్రధాన యాజకుడు ఆజ్ఞాపించాడు?

ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట తమతో చెప్పమని ఆజ్ఞాపించాడు (26:63).

ప్రధాన యాజకుని ఆజ్ఞకు ఏమని జవాబిచ్చాడు?

యేసు, "నీవు చెప్పినట్టే" అని జవాబిచ్చాడు (26:64).

ప్రధాన యాజకుడు ఏమి చూస్తాడని యేసు చెప్పాడు?

మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ప్రధాన యాజకుడు చూస్తాడని యేసు చెప్పాడు (26:64).

Matthew 26:65-66

ప్రధాన యాజకుడు యేసుపై ఏమని నేరారోపణ చేశాడు?

యేసు దైవదూషణ చేస్తున్నాడని ప్రధాన యాజకుడు యేసుపై నేరారోపణ చేశాడు (26:65).

Matthew 26:67-68

యేసుపై నేరం ఆరోపించినపుడు వారు ఏమి చేశారు?

వారు యేసు ముఖంపై ఉమ్మివేసి, గుద్ది, అరచేతులతో కొట్టారు (26:67).

Matthew 26:69-72

ఒకప్పుడు యేసుతో కలసి ఉన్న పేతురును, నువ్వు యేసు శిష్యుడివి కదా, అని అక్కడి వారు అడిగిన మూడుసార్లు పేతురు ఏమని చెప్పాడు.

యేసు ఎవరో తనకు తెలియదని పేతురు చెప్పాడు (26:70,72,74).

Matthew 26:73-75

మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే ఏమి జరిగింది?

మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే కోడి కూసింది (26:74).

మూడవసారి జవాబిచ్చిన తరువాత పేతురుకు ఏమి జ్ఞాపకం వచ్చింది?

తనను ఎరుగనని మూడుసార్లు పలికిన తర్వాతే కోడి కూస్తుందని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు (26:75).

Matthew 27

Matthew 27:1-2

ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసును ఎక్కడికి తీసుకు వెళ్ళారు?

ఉదయమైనప్పుడు వారు యేసును గవర్నరు పిలాతు దగ్గరకు తీసుకు వెళ్ళారు (27:2).

Matthew 27:3-5

యేసుకు శిక్ష విధింపబడినప్పుడు చూసిన ఇస్కరియోతు యూదా ఏమి చేశాడు?

నిరపరాధి రక్తం అప్పగించినందుకు పశ్చాత్తాపపడిన యూదా ఆ వెండి నాణేలు విసిరివేసి వెళ్ళి ఉరి వేసుకున్నాడు (27:3-5).

Matthew 27:6-8

ముప్ఫై వెండి నాణేలతో ప్రధాన యాజకులు ఏమి చేశారు?

వారు విదేశీయులను పాతిపెట్టడం కోసం కొంత పొలం కొన్నారు (27:6-7).

Matthew 27:9-10

ఈ సంఘటనల వల్ల ఎవరి ప్రవచనాలు నేరవేరాయి?

ఈ సంఘటనలు వల్ల యిర్మీయా ప్రవచనాలు నేరవేరాయి (27:9-10).

Matthew 27:11-14

పిలాతు యేసును ఏమని అడిగాడు? యేసు ఏమి జవాబిచ్చాడు?

పిలాతు యేసును 'నీవు యూదుల రాజువా? అని అడిగాడు. అందుకు యేసు, 'అవును, నీవు అన్నట్టే' అని జవాబిచ్చాడు (27:11).

ప్రధాన యాజకులు, పెద్దలు యేసుపై నేరారోపణ చేసినప్పుడు యేసు ఏమి జవాబిచ్చాడు?

యేసు ఒక్క మాట కూడా బదులు పలకలేదు (27:12-14).

Matthew 27:15-16

పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం పిలాతు యేసుకు ఏమి చేయాలని కోరాడు?

పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం పిలాతు యేసును విడుదల చేయించాలని కోరాడు (27:15-18).

Matthew 27:17-19

న్యాయపీఠంపై కూర్చుని ఉన్న పిలాతుకు అతని భార్య ఏమని వర్తమానం పంపింది?

ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని ఆమె పిలాతుకు వర్తమానం పంపించింది (27:19).

Matthew 27:20-22

పస్కా పండుగ సాంప్రదాయం ప్రకారం యేసుకు బదులుగా బరబ్బాను ఎందుకు విడుదల చేశారు?

ప్రధాన యాజకులు, పెద్దలు యేసును కాక బరబ్బాను విడుదల చేయాలని కేకలు వేసేలా ప్రజలను ప్రేరేపించారు (27:20).

యేసును ఏమి చేయాలని ప్రజలు కోరుకున్నారు?

యేసును సిలువ వేయమని ప్రజలు కోరుకున్నారు (27:22-23).

Matthew 27:23-24

ప్రజలనుండి అల్లరి ఎక్కువ అవుతున్నప్పుడు పిలాతు ఏమి చేశాడు?

పిలాతు ప్రజల ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి తాను నిరపరాధినని చెప్పి, యేసును జనసమూహానికి అప్పగించాడు (27:24).

Matthew 27:25-26

యేసును ప్రజలకు అప్పగించినప్పుడు వారు ఏమని అన్నారు?

ప్రజలు, "వాని రక్తము మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక" అని కేకలు వేసారు (27:25).

Matthew 27:27-31

అప్పుడు గవర్నరు సైనికులు యేసును ఏమి చేశారు?

సైనికులు యేసుకు అంగీ తొడిగించి, తలపై ముళ్ళ కిరీటం ఉంచి, ఆయనను గేలి చేస్తూ, ఆయన తలపై కొట్టి, సిలువ వేసేందుకు తీసుకువెళ్ళారు (27:27-31).

Matthew 27:32-34

కురేనీయుడైన సీమోనును ఏమి చేయమని బలవంతపెట్టారు?

యేసు మోస్తున్న సిలువను మోయమని సీమోనును బలవంతపెట్టారు (27:32).

సిలువ వేసేందుకు వారు యేసును ఎక్కడికి తీసుకు వెళ్ళారు?

వారు "కపాల స్థలము" అని అర్ధం వచ్చే గొల్గొతాకు యేసును తీసుకువచ్చారు (27:33).

Matthew 27:35-37

యేసును సిలువ వేసిన తరువాత సైనికులు ఏమి చేశారు?

సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన దుస్తులు పంచుకొని, అక్కడే కూర్చుని ఆయనకు కాపలా కాస్తున్నారు (27:35-36).

యేసు తల భాగంపై ఏమని రాసి పెట్టారు?

"ఇతడు యూదుల రాజైన యేసు" అని వ్రాశారు (27:37).

Matthew 27:38-44

యేసుతోపాటు ఎవరిని సిలువ వేసారు?

యేసుకు కుడి పక్కన, ఎడమ పక్కన ఇద్దరు దొంగలను ఆయనతోపాటు సిలువ వేశారు (27:38).

గుమి గూడిన ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఏమని సవాలు చేశారు?

తనను తాను రక్షించుకొని సిలువ దిగి రమ్మని యేసును సవాలు చేశారు (27:39-44).

Matthew 27:45-47

మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఏమి జరిగింది?

మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది (27:45).

మూడు గంటల సమయంలో యేసు ఏమని కేక వేసాడు?

యేసు, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి" అని కేక వేసాడు (27:46).

Matthew 27:48-50

యేసు మరల బిగ్గరగా కేక వేసిన తరువాత ఏమి జరిగింది?

యేసు ప్రాణం విడిచాడు (27:50).

Matthew 27:51-53

యేసు మరణించిన తరువాత దేవాలయానికి ఏమి జరిగింది?

యేసు మరణించిన తరువాత దేవాలయపు తెర పైనుండి క్రిందకు రెండుగా చినిగింది (27:51).

యేసు మరణించిన తరువాత సమాధులు ఏమయ్యాయి?

సమాధులు తెరుచుకుని అనేకమంది పరిశుద్ధులు లేచి అనేకమందికి కనబడ్డారు (27:52-53).

Matthew 27:54-56

జరిగినదంతా చూస్తున్న శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి?

"ఇతడు నిజముగా దేవుని కుమారుడు" అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు (27:54).

Matthew 27:57-58

యేసును సిలువ వేసిన తరువాత ఆయన మృత దేహాన్ని ఏమి చేశారు?

ధనవంతుడైన యేసు శిష్యుడు యోసేపు పిలాతును యేసు దేహం తనకిమ్మని అడిగి, నారబట్ట చుట్టి తన సొంత కొత్త సమాధిలో ఉంచాడు (27:57-60).

Matthew 27:59-61

యేసు మృతదేహం ఉంచిన సమాధి కి అడ్డంగా ఏమి ఉంచారు?

ఒక పెద్ద రాయిని సమాధికి అడ్డంగా ఉంచారు (27:60).

Matthew 27:62-64

తరవాతి రోజు ప్రధాన యాజకులు, పెద్దలు పిలాతును ఎందుకు కలిసారు?

యేసు దేహాన్ని ఎవరూ ఎత్తుకు వెళ్ళకుండా భద్రం చేయడానికి కాపలా పెట్టమని అడగడానికి కలిశారు (27:62-64).

Matthew 27:65-66

సమాధికి ఏమి చేయడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు?

సమాధి రాతికి ముద్ర వేసి, సైనికులను కాపలా ఉంచడానికి పిలాతు అనుమతి ఇచ్చాడు (27:65-66).

Matthew 28

Matthew 28:1-2

మగ్దలేనే మరియ, వేరొక మరియ ఏ రోజు, ఏ సమయంలో యేసు సమాధి దగ్గరకు వెళ్లారు?

ఆదివారం తెల్లవారుజామున వారు యేసు సమాధి దగ్గరకు వెళ్ళారు (28:1).

యేసు సమాధి రాయి ఎలా దొర్లించి ఉంది ?

దేవుని దూత రాయి దొర్లించాడు (28:2).

Matthew 28:3-4

అక్కడి కావలివారు దూతలను చూసి ఏమి చేశారు?

దూతకు భయపడి కావలివారు వణకి చచ్చిన వారి వలె ఉండిపోయారు (28:4).

Matthew 28:5-7

దూత యేసు గురించి ఆ స్త్రీలకు ఏమి చెప్పాడు?

యేసు మృతులలోనుండి లేచి గలిలయలోకి వారికంటే ముందుగా వెళ్ళాడు అని దూత చెప్పాడు (28:5-7).

Matthew 28:8-10

యేసు గురించి ఆయన శిష్యులకు చెప్పడానికి వెళ్ళిన ఆ స్త్రీలకు దారి మధ్యలో ఏమి జరిగింది?

యేసు వారికి ఎదురుపడ్డాడు. అప్పుడు వారు ఆయన పాదాలు పట్టుకొని ఆయనకు మొక్కారు (28:8-9).

Matthew 28:11-15

సైనికులు వచ్చి ప్రధాన యాజకులతో సమాధి వద్ద జరిగిన విషయాలు చెప్పినప్పుడు ప్రధాన యాజకులు ఏమి చేశారు?

ప్రధాన యాజకులు సైనికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి, యేసు దేహాన్ని ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళారని ప్రచారం చెయ్యమని చెప్పారు (28:11-13).

Matthew 28:16-17

శిష్యులు యేసును గలిలయలో చూసినప్పుడు ఏమి చేశారు?

శిష్యులు యేసుకు మొక్కారు. అయితే కొందరు సందేహించారు (28:17).

Matthew 28:18-19

ఎలాంటి అధికారం తనకు ఇవ్వబడిందని యేసు చెప్పాడు?

పరలోకంలో, భూమి మీదా తనకు సర్వాధికారం ఇవ్వబడిందని యేసు చెప్పాడు (28:18).

యేసు తన శిష్యులకు ఇచ్చిన మూడు ఆజ్ఞలు ఏమిటి?

సమస్త జనులను శిష్యులనుగా చేసి, వారికి బాప్తిస్మం ఇస్తూ, యేసు ఆజ్ఞాపించిన వాటిని నెరవేర్చాలని బోధించమని చెప్పాడు (28:19-20).

ఎవరి నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు చెప్పాడు?

తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వమని యేసు తన శిష్యులకు చెప్పాడు (28:19).

Matthew 28:20

యేసు తన శిష్యులకు చేసిన చివరి వాగ్దానం ఏమిటి?

నేను యుగసమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు (28:20).