తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

రూతు

Chapter 1

1 న్యాయాధిపతులు ఇశ్రాయేలును రాజ్యపాలన చేసిన కాలములో, ఆ దేశంలో కరువు వచ్చింది. ఇశ్రాయేలు దేశంలోని యూదా ప్రాంతంలో బేత్లెహేము పట్టణం నుండి ఒక మనిషి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు మరియు మోయాబు దేశంలో కొంతకాలం కోసం నివసించడానికి వెళ్ళాడు.. అతని భార్య మరియు అతని ఇద్దరు కుమారులు అతనితో పాటు వెళ్ళారు. 2 ఆ మనిషి పేరు ఎలీమెలెకు, మరియు అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, మరియు కిల్యోను. వారు యూదాలో బేత్లెహేము నుండి ఎఫ్రాతా వంశంలో భాగం. వారు మోయాబు దేశానికి వచ్చారు, మరియు అక్కడ నివసించారు.

3 అప్పుడు నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు, మరియు నయోమితో తన ఇద్దరు కుమారులు మాత్రమే ఆమెతో ఉన్నారు. 4 ఆ కుమారులు మోయాబు నుండి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒక స్త్రీ పేరు ఓర్పా, మరియు మరొక స్త్రీ పేరు రూతు. అయితే వారు ఆ ప్రాంతంలో దాదాపు పది సంవత్సరాలు నివసించిన తరువాత, 5 మహ్లోను, మరియు కిల్యోను కూడా చనిపోయారు. కాబట్టి నయోమి తన కుమారులు లేక భర్త లేకుండా ఒంటరిగా ఉండిపోయింది.

6 ఒక రోజున నయోమి మోయాబులో ఉన్నప్పుడు, యెహోవా తన ప్రజలకు సహాయం చేసాడు మరియు ఇప్పుడు ఇశ్రాయేలులో సమృద్ధియైన ఆహారం ఉన్నది అని ఒకరు చెప్పడం ఆమె విన్నది. కాబట్టి ఆమె తన ఇద్దరు కోడళ్ళతో బెత్లేహేముకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడింది. 7 వారు నివసిస్తూ ఉన్న ప్రదేశాన్ని వారు విడిచిపెట్టారు మరియు యూదా దేశానికి తిరిగి ప్రయాణం చెయ్యడానికి ఆరంభించారు. 8 వారు నడుస్తూ ఉన్నప్పుడు, నయోమి తన ఇద్దరు కోడళ్ళతో చెప్పింది, "మీలో ప్రతి ఒక్కరూ చుట్టు తిరగాలి మరియు మీ తల్లి ఇంటికి వెనుకకు వెళ్ళాలి. చనిపోయిన మన భర్తలతో మరియు నాతో మీరు నమ్మకంగా ఉన్నవిధంగా యెహోవా మీకు నమ్మకంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. 9 మీలో ప్రతీ ఒక్కరూ మరొక భర్తను కలిగియుండడానికి, వారితో మీరు సురక్షితమైన గృహాన్ని కలిగియుండడానికి అనుమతించాలని నేను యెహోవాను అడుగుతున్నాను." అప్పుడు ఆమె వారిలో ప్రతిఒక్కరిని ముద్దు పెట్టుకొంది. మరియు వారు గట్టిగా ఏడ్చారు.

10 వారు ఇద్దరూ చెప్పారు, "వద్దు! మేము నీ బంధువుల యొద్దకు నీతో వస్తాము." 11 అయితే నయోమి చెప్పింది, “వద్దు, నా కుమార్తెలారా, ఇంటికి తిరిగండి. మీరు నాతో రావడం మీకు ఎటువంటి మంచిని చెయ్యదు! మీకు భర్తలుగా మారగలిగిన ఎక్కువమంది కుమారులను నేను కలిగియుండడం సాధ్యం కాదు. 12 నా కుమార్తెలారా మీరు వెనుకకు వెళ్ళాలి. నా కోసం మరొక భర్తను కలిగి యుండడానికి ఇది చాలా ఆలస్యం అయ్యింది. నేను మరొక భర్తను కలిగి యుండాలని ఆలోచించినప్పటికీ కూడా మరియు ఈ రాత్రి నేను వివాహం చేసుకొని ఎక్కువమంది కుమారులను కలిగియున్నప్పటికి కూడా, 13 వారు పెద్దవారు అయ్యేంత వరకూ మీరు ఎదురు చూడరు, అప్పటి వరకు మీరు అవివాహితులుగా నిలిచియుండలేరు! వద్దు, నా కుమార్తెలారా, యెహోవా నన్ను కొట్టాడు, నా జీవితాన్ని చాలా వేదనకరంగా చేసాడు. అయితే మీ జీవితాలు నా జీవితం వలే వేదనకరంగా ఉండవలసిన అవసరం లేదు. 14 అప్పుడు రూతు మరియు ఓర్పా మరల గట్టిగా ఏడ్చారు. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంది, వీడ్కోలు చెప్పింది మరియు వెళ్ళిపోయింది. అయితే రూతు నయోమితో ఉండిపోయింది.

15 నయోమి ఆమెతో చెప్పింది, “చూడు, నీ తోడికోడలు తిరిగి తన బంధువుల వద్దకు, మరియు తన దేవుళ్ళ వద్దకు తిరిగి వెళ్లిపోతూ ఉంది! ఆమెతో వెనుకకు వెళ్ళు!" 16 అయితే రూతు జవాబిచ్చింది, “వద్దు! నేను నిన్ను వెళ్ళనివాలని లేదా నేను వెనుకకు తిరగాలని మరియు నిన్ను అనుసరించడం మానివేయాలని దయచేసి నన్ను బలవంత పెట్టవద్దు! నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను వెళ్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేను ఉంటాను. నీ బంధువులే నా బంధువులుగా ఉంటారు, మరియు నువ్వు ఆరాధించు దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. 17 నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడ నేను చనిపోతాను మరియు వారు నన్ను అక్కడ సమాధి చేస్తారు. నేను చనిపోవడానికి ముందు నేను నిన్ను విడిచిపెట్టినట్లయిన యెడల యెహోవా నన్ను కఠినంగా శిక్షించును గాక."

18 తనతో రావడానికే రూతు నిశ్చయించుకున్నదని నయోమి గ్రహించినప్పుడు, ఆమె ఇంటికి తిరిగి వెళ్ళడానికి బతిమిలాడడం ఆమె మానుకుంది. 19 కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు బేత్లెహేము పట్టణానికి వారు వచ్చు వరకు నడవడం కొనసాగించారు. వారు అక్కడికి చేరినప్పుడు, పట్టణంలో అనేక మంది వారి గురించి గట్టిగా అరవడం ఆరంభించారు. పట్టణంలోని స్త్రీలు ఆశ్చర్యపోయారు, "ఈమె నయోమి అని నమ్మడానికి కష్టంగా ఉంది!"

20 నయోమి వారితో చెప్పింది. “మీరు ఇకమీదట నన్ను నయోమి అని పిలవకండి, ఎందుకంటే ఇది 'మనోహరమైన' అనే అర్థాన్ని ఇస్తుంది, దానికి బదులు నన్ను మారా అని పిలవండి ఎందుకంటే ఇది 'చేదు' అనే అర్థాన్ని ఇస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితాన్ని చాలా వేదనభరితంగా చేసాడు. 21 నేను వెళ్ళినప్పుడు, నేను కోరుకున్న ప్రతీ దానిని కలిగియున్నాను, అయితే ఏమీ లేకుండా యెహోవా నన్ను తిరిగి తీసుకొని వచ్చాడు. నన్ను నయోమి అని పిలువకండి. యెహోవా నన్ను వ్యతిరేకించాడు. సర్వశక్తిగల దేవుడు నన్ను కఠినంగా చూసాడు. 22 కాబట్టి ఆవిధంగా నయోమి మోయాబు నుండి స్త్రీ, ఆమె కోడలు రూతుతో పాటుగా ఇంటికి తిరిగి వచ్చింది. వారు బేత్లేహెములోనికి వచ్చినప్పుడు, యవల పంట కోత అప్పుడే ఆరంభం అయ్యింది.

Chapter 2

1 చనిపోయిన నయోమి భర్తకు ఒక బంధువు ఒక మనిషి అక్కడ ఉన్నాడు. అతడు చాలా ధనవంతుడు మరియు ప్రాముఖ్యమైనవాడు, మరియు ఎలీమెలెకు వంశంలో ఒక సభ్యుడు. అతని పేరు బోయజు. 2 (మోయాబు నుండి స్త్రీ) రూతు నయోమితో ఇలా చెప్పింది, “ పొలములలోనికి వెళ్లి, మరియు పంటకోత కోసేవారు తమ వెనుక విడిచిపెట్టే ధ్యాన్యాన్ని ఏరుకోడానికి నన్ను వెళ్ళనివ్వు, నాకు అనుమతి ఇస్తున్న పంటకోత కోసే వాని వెనుక నేను వెళ్తాను." అప్పుడు నయోమి ఇలా జవాబిచ్చింది, :ముందుకు వెళ్ళు, నా కుమారి." 3 కాబట్టి రూతు వెళ్ళింది. ఆమె పొలాలకు వెళ్ళినప్పుడు, ఆమె పంటకోత కోయువారిని అనుసరించింది మరియు ధ్యాన్యాన్ని ఏరుకొంది. పొలంలో ఆ భాగం ఎలీమెలెకు బంధువు బోయజుకు చెందినది. 4 అప్పుడు బోయజు పట్టణం నుండి తిరిగి వచ్చాడు. పంట కోత కోయువారికి శుభములు చెప్పాడు, ఇలా చెప్పాడు “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” వారు జవాబిచ్చారు, "యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక!”

5 అప్పుడు బోయజు రూతును చూసాడు, ముఖ్యుడైన పనివానిని అడిగాడు, "ఆ యవన స్త్రీ ఎవరికి చెందినది?" 6 అప్పుడు ముఖ్యుడైన పనివాడు జవాబిచ్చాడు, "ఈమె మోయాబు నుండి యవనురాలైన స్త్రీ, అక్కడ నుండి నయోమితో తిరిగి వచ్చింది. 7 ఈమె నాతో చెప్పింది, 'నేను పంట కోత కోయు మనుషుల వెనుక విడిచిపెట్టే ధాన్యమును మధ్య ఏరుకోడానికి దయచేసి అనుమతించండి.' ఆమె ఈ ఉదయం ప్రారంభం నుండి ఇప్పటి వరకు పని చేసింది, నీడ కింద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంది.”

8 అప్పుడు బోయజు రూతుతో చెప్పాడు, “యవ్వనురాలా, దయచేసి నామాట విను. ధాన్యం ఏరుకోడానికి నువ్వు మరొక పొలముకు లేదా మరే ఇతర స్థలమునకు వెళ్ళనవసరం లేదు. నువ్వు ఇక్కడే నా సేవకులైన అమ్మాయిల వద్ద ఉండాలి. 9 మనుషులు ఎక్కడ పంట కోత కోస్తున్నారో గమనించు, మరియు నా సేవకులైన అమ్మాయిల వెంట అనుసరించు. నీమీద దౌర్జన్యం చెయ్యకూడదని పంట కోయు మనుషులకు నేను చెప్పాను. మరియు నీకు దాహం వేసినప్పుడు వెళ్ళు మరియు మనుషులు నింపిన కుండలనుండి తాగడానికి కొంత నీళ్ళు తీసుకో." 10 అప్పుడు ముఖము నేలను తాకుతూ ఆమె అతని ముందు మోకరించింది. ఆమె చాలా ఆశ్చర్యపడింది, "ఎందుకు నీవు నా పట్ల అంత దయను చూపించావు? నీవు నాకు ఏవిధమైన గమనమును చూపిస్తావని నేను ఆలోచించలేదు, ఎందుకంటే నేను విదేశీయురాలిని. 11 బోయజు జవాబిచ్చాడు, "నీ భర్త చనిపోయినప్పటి నుండి నీ అత్త కోసం నువ్వు చేసినది అంతటి గురించి ప్రజలు నాకు చెప్పారు. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు నీ సొంతదేశమును, విడిచిపెట్టావు మరియు ఇంతకు ముందు నీవు యెరుగని ప్రజల మధ్య నివసించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావని వారు నాకు చెప్పారు. 12 యెహోవా నువ్వు చేసిన దాని కోసం పూర్తి ప్రతిఫలం ఇస్తాడని నేను ప్రార్థిస్తున్నాను. అవును నిన్ను కాపాడడానికి, నువ్వు ఎవరిని విశ్వసిస్తున్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!”

13 ఆమె జవాబిచ్చింది, "అయ్యా, నేను నిన్ను సంతోషపరచడం కొనసాగిస్తానని ఎదురుచూస్తున్నాను. మరియు నీ పని కత్తెలైన అమ్మాయిలలో ఒక దానిని కాకపోయినా నీ సేవకురాలైన నా పట్ల ఎంతో దయ కలిగి యుండడం చేత నన్ను నువ్వు ఆదరించావు!" 14 భోజనం చేసే సమయమైనప్పుడు బోయజు ఆమెతో చెప్పాడు, “ఇక్కడికి రా మరియు కొంత ఆహారం తీసుకో. ఈ రొట్టెను తీసుకో మరియు దానిని ద్రాక్షారసంలో ముంచు మరియు దానిని తిను.” అప్పుడు ఆమె పంట కోయు వారి దగ్గర కూర్చున్నప్పుడు అతడు కాల్చిన కొన్ని ధాన్యపు గింజలను ఆమెకు ఇచ్చాడు. ఆమె కోరుకున్న వాటినంతటిని తిన్నది మరియు కొంత మిగిల్చింది.

15 ఆమె తిరిగి పనికి వెళ్ళడానికి లేచిన తరువాత, బోయజు తన పనివాళ్ళకు ఆదేశించాడు, "మీరు కోసిన ధాన్యపు పనల దగ్గర ఆమె కొంత ధ్యాన్యము ఏరుకొన్నప్పటికి కూడా ఆమెను ఆపడానికి ప్రయత్నించవద్దు. 16 అది మాత్రమే కాక, కట్టల నుండి ధాన్యపు కంకులు కొన్నింటిని బయటికి తీయడానికి మరియు ఏరుకోడానికి ఆమె కోసం వాటిని నేల మీద విడిచిపెట్టాలని నేను మిమ్మును కోరుతున్నాను. మరియు ఆమెను గద్దించవద్దు. 17 కాబట్టి రూతు సాయంకాలం వరకూ అదే పొలంలో ధాన్యాన్ని ఏరుకుంది. అప్పుడు ఆమె కంకుల నుండి గింజలను వేరుచేయడానికి తాను ఏరుకున్న యవలను దుళ్ళగొట్టింది. యవల గింజలు ఒక పెద్ద బుట్ట నిండడానికి సరిపోయాయి. 18 ఆమె దానిని తిరిగి పట్టాణానికి మోసుకొని వెళ్ళింది మరియు ఆమె పోగుచేసిన దానిని తన అత్తకు చూపించింది. ఆమె తన మధ్యాహ్న భోజనంలో తాను మిగిల్చి ఉంచిన కాల్చిన ధ్యాన్యపు గింజలను కూడా తన అత్తకు ఇచ్చింది.

19 తన అత్త రూతును అడిగింది, “నువ్వు ఈ రోజు ధాన్యము అంతటిని ఎక్కడ ఏరుకున్నావు? ఎవరి పొలంలో నువ్వు పని చేశావు? నీ పట్ల చాలా దయ కలిగిన ఆ మనుష్యుడిని దేవుడు ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను." అప్పుడు రూతు తాను ఎవరితో పనిచేసిందో ఆ వ్యక్తిని గూర్చి ఆమెకు చెప్పింది. ఆమె చెప్పింది, “నేను ఈ రోజు ఎక్కడ పనిచేసానో ఆ పొలాన్ని సొంతంగా కలిగియున్న ఆ మనిషి పేరు బోయజు.” 20 నయోమి తన కోడలుతో చెప్పింది. “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఇంకా బ్రతికి ఉన్న మన పట్ల మరియు చనిపోయిన మన భర్తల పట్లా నమ్మకంగా జరిగించడం యెహోవా ఆపివేయ లేదు." అప్పుడు ఆమె ఇంకా చెప్పింది, "“ఆ మనిషి ఎలీమెలెకుకు దగ్గర బంధువు. నిజానికి మన కుటుంబాన్ని గురింఛి శ్రద్ధ తీసుకోవడంలో బాద్యత కలిగిన వారిలో అతడు ఒకడు. 21 అప్పుడు మోయాబీయురాలైన స్త్రీ రూతు చెప్పింది, "అతడు ఇంకా నాతో చెప్పాడు, 'పొలం వద్ద నుండి నా ధాన్యమునంతటినీ తీసుకురావడం అయ్యేంతవరకూ నా పనివారితోనే నిలిచి యుండు."

22 నయోమి తన కోడలు రూతుకు జవాబు ఇచ్చింది, "నా కుమారి, అతని సేవకులైన అమ్మాయిలతో అతని పొలానికి నువ్వు వెళ్ళడానికి ఇది మంచిదిగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు మరొకరి పొలానికి వెళ్ళిన యెడల, మరొకరు నీ మీద దౌర్జన్యం చెయ్యవచ్చు." 23 కాబట్టి రూతు బోయజు సేవకులైన అమ్మాయిలతో పాటుగా పని చేసింది. పనివారు యవలు, మరియు గోదుమ పంట కోత రెంటినీ ముగించే వరకూ ధాన్యం పరిగె పోగుచేసింది. ఆ సమయంలో ఆమె నయోమితో నివసించడం కొనసాగించింది.

Chapter 3

1 ఒక రోజున, నయోమి రూతుతో చెప్పింది. “నా కుమారి, ఒక మంచి భర్తతో క్షేమకరమైన కుటుంబాన్ని కలిగియుండడానికి నీ కోసం సిద్ధపరచాలని నేను కోరుకుంటున్నాను. 2 ఇప్పుడు నువ్వు బోయజు సేవకులైన అమ్మాయిలతో పని చేస్తూ ఉన్నావు. నీకు తెలిసిన విధంగా, అతడు మనకు సమీప బంధువు. కాబట్టి జాగ్రత్తగా విను. ఈ రాత్రి యవల గింజలను నూర్చే స్థలంలో అతడు ఉంటాడు. అతడు ధాన్యమును పొట్టునుండి తూర్పారబట్టబోతున్నాడు. 3 నువ్వు స్నానం చెయ్యి మరియు కొంత సుగంధద్రవ్యం రాసుకో. నీ పూర్తి వెలుపలి వస్తాన్ని ధరించు. అప్పుడు వారు ధాన్యాన్ని నూర్చే స్థలం వద్దకు వెళ్ళు. అయితే అతడు భోజనం మరియు త్రాగడం ముగించేంత వరకు నువ్వు అక్కడ ఉన్నావని అతనికి తెలియనియ్యవద్దు. 4 అతడు నిద్రపోడానికి పండుకొన్నప్పుడు అతడు ఎక్కడ పండుకొన్నాడో గమనం నిలుపు. అప్పుడు అతని దగ్గరకు వెళ్ళు, అతని కాళ్ళమీద దుప్పటితీసివెయ్యి, మరియు అక్కడ పండుకో. అతడు నిద్ర లేచినప్పుడు, నువ్వు ఏమి చెయ్యాలో నీకు అతడు చెపుతాడు." 5 రూతు జవాబిచ్చింది, “నన్ను చెయ్యమని నువ్వు చెప్పినదంతా నేను చేస్తాను.”

6 కాబట్టి ఆమె ధాన్యం నూర్చే స్థలము వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె తన అత్త తనకు చెయ్యాలని ఆదేశించిన ప్రతీదానిని చేసింది. 7 బోయజు భోజనం చేయడం, మరియు ముగించినప్పుడు, అతడు సంతోషంగా ఉన్నాడు. అతడు ధాన్యం కుప్ప చివరికి దూరంగా వెళ్ళాడు, అక్కడ పండుకొన్నాడు, మరియు నిద్ర పోయాడు. అప్పుడు రూతు రహస్యంగా అతన్ని సమీపించింది. అతని కాళ్ళ పైన ఉన్న దుప్పటి ఆమె తీసివేసింది మరియు అక్కడ పండుకొంది. 8 అర్థరాత్రి సమయంలో ఆ మనిషి అకస్మాత్తుగా మేల్కొన్నాడు. అతడు కూర్చున్నాడు మరియు ఒక స్త్రీ తన కాళ్ళ దగ్గర పండుకొని ఉండడం గమనించాడు. 9 అతడు ఆమెను అడిగాడు, "నువ్వు ఎవరు?" ఆమె జవాబిచ్చింది, "నేను నీ దాసిని, రూతు. చనిపోయిన నా భర్త కుటుంబానికి నువ్వు బాధ్యతగలిగిన వాడివి గనుక, దయచేసి నన్ను వివాహం చేసుకోవడం చేత నన్ను భద్రంగా ఉంచు. 10 బోయజు జవాబిచ్చాడు, "నా ప్రియమైనదానా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక! ఇంతకు ముందు నీ అత్త విషయంలో నువ్వు చాలా నమ్మదగినదానవుగా ఉన్నావు, అయితే ధనవంతులు గానీ లేదా పేదవారు గానీ వివాహం చేసుకోడానికి యువకుని వెనుక వెళ్ళకుండా ఉండడం చేత ఇప్పుడు నువ్వు మరింత ఎక్కువగా నమ్మకంగా జరిగించుచున్నావు. 11 ఇప్పుడు, నా ప్రియమైనదానా, నువ్వు అడిగినదానినంతటిని నేను చేస్తాను. భయపడవద్దు. ఎందుకంటే ఈ పట్టణంలో ఉన్న ప్రజలు అందరు నువ్వు గౌరవింపదగిన స్త్రీ అని యెరుగుదురు. 12 అయితే, నయోమికి సమీపబంధువులలో నేను ఒకడిగా ఉండగా. మరియు కాబట్టి మీ ఇద్దరి విషయంలో బాద్యుడిని, నా కంటే మీ విషయంలో ఎక్కువ బాధ్యత కలిగిన మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఎందుకంటే అతడు నయోమికి మరింత సమీపస్థుడు. 13 మిగిలిన రాత్రి అంతా నువ్వు ఇక్కడ ఉండు. రేపు ఉదయం ఈ మనిషికి నీ గురించి చెపుతాను. అతడు నీ విషయంలో శ్రద్ధ తీసుకొంటానని చెప్పిన యెడల, మంచిది, అతడు నిన్ను వివాహం చేసుకొనవచ్చు. అయితే నీ విషయంలో శ్రద్ధ తీసుకోడానికి ఇష్టత చూపించక పోయిన యెడల యెహోవా సజీవుడిగా ఉన్న ప్రకారం నేను నిన్ను వివాహము చేసుకొంటాను మరియు నేను నీ విషయంలో శ్రద్ధ తీసుకొంటానని రూఢిగా వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి ఉదయం అయ్యేవరకూ ఇక్కడే ఉండు."

14 అప్పుడు బోయజు ఇంకా చెప్పాడు, "ఒక స్త్రీ ఇక్కడికి వచ్చినదని ఏ ఒక్కరికీ తెలియకుండా ఉన్న యెడల ఇది మంచిది." కాబట్టి ఆమె తెల్లవారు వరకు అతని పాదాల దగ్గర పండుకొన్నది మరియు మనుష్యులు ఆమెను గుర్తుపడడానికి తగినంత వెలుగు రావడానికి ముందే వెళ్ళిపోవడానికి లేచింది. 15 అప్పుడు బోయజు ఆమెతో చెప్పాడు, “నీ దుప్పటిని ఇక్కడికి తీసుకురా మరియు దానిని పట్టుకో.” ఆమె దానిని చేసినప్పుడు, అతడు ఉదారంగా అధిక మొత్తంలో యవలను దానిలో పోసాడు మరియు దానిని ఆమె భుజం మీద ఉంచాడు. అప్పుడు అతడు పట్టణంలోనికి వెళ్ళాడు.

16 రూతు ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అత్త రూతును అడిగింది, "నా కుమారి, అది నువ్వేనా?" అప్పుడు రూతు బోయజు చెప్పినది మరియు తనకు చేసినదంతయు ఆమెతో చెప్పింది. 17 ఆమె నయోమితో ఇంకా చెప్పింది, "అతడు నాకు ఈ యవలు అంతా ఇచ్చాడు, 'ఏమీ లేకుండా నువ్వు నీ అత్త దగ్గరకు వెళ్ళకూడదని నేను కోరుతున్నాను' అని చెప్పాడు.". 18 అప్పుడు నయోమి చెప్పింది "నా కుమారి, ఏమి జరుగుతుందో మనం చూచే వరకు ఇక్కడ ఎదురుచూడు. ఆ మనిషి ఈ రోజు ఖచ్చితంగా ఈ విషయంలో శ్రద్ధ తీసుకొంటాడు."

Chapter 4

1 ఈ లోపు, బోయజు పట్టణపు ద్వారం లోపలి ప్రదేశం వద్దకు వెళ్ళాడు అక్కడ ప్రజలు వారి అధికారిక కార్యాన్ని జరిగిస్తారు. అతడు అక్కడ కూర్చున్నాడు. కొద్ది సమయం తరువాత, బోయజు ప్రస్తావించిన దగ్గరి బంధువు అటుగా వచ్చాడు. బోయజు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు మరియు చెప్పాడు, ఇక్కడకు రా మరియు కింద కూర్చో." కాబట్టి ఆ మనిషి అక్కడికి వచ్చాడు, మరియు కూర్చున్నాడు. 2 అప్పుడు బోయజు పట్టణం నుండి పెద్ద వయసువారు, బాగా గౌరవించబడిన పదిమందిని సమావేశపరచాడు. మరియు వారితో చెప్పాడు, "దయచేసి ఇక్కడ కూర్చోండి, తద్వారా మా కార్యానికి సాక్ష్యం ఇవ్వవచ్చు." కాబట్టి వారు కూర్చున్నారు.

3 అప్పుడు బోయజు తన బంధువుతో చెప్పాడు, "మన బంధువు ఎలీమెలెకుకు చెందిన పొలం అమ్మకం కోసం వచ్చిందని నీకు తెలుసా? ఈ మధ్య మోయాబు నుండి తిరిగి వచ్చిన నయోమి దానిని అమ్ముతుంది. 4 నేను నీకు చెప్పాలని ఆలోచించాను, ఎందుకంటే నువ్వు దానిని ఇక్కడ సాక్షులుగా ఉండడానికి ఇష్టత చూపిన గౌరవింపదగిన ఈ మనుషుల ముందు స్వాధీనం చేసుకోడానికి తీసుకోవచ్చును. నువ్వు తిరిగి కుటుంబంలోనికి కొనాలని కోరిన యెడల ఆ విధంగా చెయ్యి. అయితే నువ్వు కొనడానికి ఇష్టపడని యెడల నాకు తెలియపరచు, ఎందుకంటే ఎలీమెలెకుకు నువ్వు దగ్గర బంధువు, మరియు నీ తరువాత నేను ఉన్నాను." ఆ మనిషి జవాబిచ్చాడు, "నేను దానిని తీసుకొంటాను!"

5 అప్పుడు బోయజు అతనితో చెప్పాడు, "నువ్వు నయోమి నుండి ఆ భూమిని కొనుగోలు చేసినప్పుడు, మోయాబు నుండి వచ్చిన మన బంధువు వితంతువు రూతును నువ్వు పెండ్లి చేసుకోవలసిన అవసరం కూడా ఉంది, తద్వారా ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోడానికి ఆమె ఒక కుమారుడిని కలిగియుంటుంది, మరియు చనిపోయిన ఆమె భర్త పేరును కొనసాగిస్తుంది.” 6 అప్పుడు సమీపస్థుడైన బంధువు చెప్పాడు, “అప్పుడు నేను దీనిని నా కోసం కొనలేను. నేను ఆ విధంగా చేసిన యెడల, నేను నా సొంత కుమారుని స్వాస్థ్యాన్ని పాడు చేస్తాను. నా స్థానంలో భూమి మరియు స్త్రీ కోసం నువ్వు బాధ్యత తీసుకోవచ్చు. నేను దీనిని చెయ్యలేను"

7 (ఆ కాలంలో, ఇద్దరు మనుషులు విడిపించడానికి అంగీకరించినప్పుడు లేదా వారి మధ్య ఏదైనా మార్పిడి జరిగినప్పుడు ఒక మనిషి తన చెప్పులలో ఒక దానిని తీస్తాడు మరియు దానిని మరొక వ్యక్తికి ఇవ్వడం ఇశ్రాయేలులో అది ఆచారం. ఇది ఇశ్రాయేలులో లావాదేనీలను పూర్తి చేసే విధానం.) 8 కాబట్టి ఆ బంధువు బోయజుకు చెప్పాడు, “నువ్వు పొలమును నీ కోసం కొనుక్కో!" మరియు అతడు తన చెప్పులలో ఒక దానిని తీసుకొన్నాడు మరియు దానిని బోయజుకు ఇచ్చాడు.

9 అప్పుడు బోయజు గౌరవప్రదమైన మనుషులకు మరియు అక్కడ ఉన్న మనుషులు అందరికి చెప్పాడు, “ఈ రోజు ఎలీమెలెకు, కిల్యోను మరియు మహ్లోనులకు చెందిన ఆస్థిని అంతటిని నయోమి నుండి నేను కొన్నాను అని మీరు అందరు చూసారు. 10 మోయాబు నుండి మహ్లోను వితంతువు రూతును కూడా నా భార్యగా ఉండడానికి నేను తీసుకొంటున్నాను, దీని ద్వారా ఆమె మహ్లోను కుమారునిగా యెంచబడేలా ఒక కుమారునికి జన్మ ఇస్తుంది. అతడు స్వాస్థ్యాన్ని స్వతంత్రించు కొంటాడు మరియు తన బంధువుల మధ్య మరియు ఇక్కడ అతని సొంత ప్రదేశంలో కుటుంబం పేరును కొనసాగిస్తాడు. ఈ రోజు మీరు ఈ సంగతులను చూసారు మరియు విన్నారు, మరియు వాటిని గురించి అడుగు వారు ఎవనికైనా వాటిని గురించి మాట్లాడవచ్చు."

11 గౌరవింపదగిన మనుషులు అందరూ, మరియు పట్టణం ద్వారం దగ్గర కూర్చొని ఉన్న ఇతరులు, అంగీకరించారు మరియు చెప్పారు, "అవును మేము చూచాము మరియు విన్నాము. నీ ఇంటి లోనికి వస్తున్న ఈ స్త్రీని మన పితరులను కని, మరియు మన ప్రజలు, ఇశ్రాయేలును ఆరంభించిన, ఇద్దరు, రాహేలు మరియు లేయా వలే ఉండడానికి యెహోవా అనుమతించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఎఫ్రాతా వంశంలో నువ్వు ధనవంతుడవు మరియు ఇక్కడ బేత్లేహెములో ప్రముఖుడవు కావాలని మేము కోరుతున్నాము. 12 యెహోవా నీకును మరియు ఈ యవన స్త్రీకిని అనేకమందిని వారసులను ఇస్తాడు కనుక నీ పితరుడు యూదా మరియు తామారు కుమారుడైన పెరెసు కుటుంబము వలే నీ కుటుంబం ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము,

13 కాబట్టి బోయజు తన భార్యగా ఉండడానికి రూతును తీసుకొన్నాడు మరియు ఆమెతో పెళ్ళి చేసుకున్నాడు మరియు ఆమె వద్దకు వెళ్ళాడు. యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా అనుగ్రహం చూపాడు, మరియు ఆమె ఒక కుమారుని కన్నది. 14 బేత్లెహేము స్త్రీలు నయోమితో చెప్పారు, “ఈ రోజు నీ కుటుంబాన్ని భద్రపరచడానికి ఒక మనిషిని నీకు ఇచ్చినందు కోసం యెహోవాకు స్తుతులు. ఇశ్రాయేలీయులు అంతటా ఉన్న మనుష్యులు ఆయన నామమును తెలుసు కొంటారని మేము కోరుతున్నాము. 15 నిన్ను ప్రేమిస్తున్న మరియు నీకు ఏడుగురు కుమారులు ఉన్న యెడల వారి కంటే శ్రేష్టమైన నీ కోడలు ఇతనిని కన్నది. కాబట్టి ఇతడు నువ్వు తిరిగి యవ్వనస్థురాలిగా భావించేలా చేస్తాడు మరియు నువ్వు వృద్దురాలివి అయినప్పుడు అతడు నిన్ను పోషిస్తాడు.”

16 అప్పుడు నయోమి ఆ బిడ్డను ఎత్తుకొంది మరియు అతనిని తనకు దగ్గరగా తీసుకొంది మరియు అతని కోసం సంరక్షకురాలు అయింది. 17 ఆమెకు సమీపంగా నివసిస్తున్న స్త్రీలు చెప్పారు, "ఇది నయోమికి ఇప్పుడు ఒక కుమారుడు పుట్టినట్టుగా ఉంది!" వారు అతనికి ఓబేదు అని పేరు పెట్టారు. తరువాత ఓబేదు యెష్షయికి తండ్రి అయ్యాడు, అతడు దావీదుకు తండ్రి అయ్యాడు.

18 పెరెసు వంశావళి క్రమం ఇక్కడ ఉంది. పెరెసు కుమారుడు హెస్రోను. 19 హెస్రోను కుమారుడు రము. రము కుమారుడు అమ్మీనాదాబు. 20 అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను. 21 శల్మాను కుమారుడు బోయజు. బోయజు కుమారుడు ఓబేదు. 22 ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.