తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

పేతురు రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 {నేను,} సీమోను పేతురు, మెస్సీయ యేసును సేవిస్తాను, మరియు నేను {ఆయన నియమించిన} అపొస్తలుడను. దేవుడు మనలను {అపొస్తలులను} {మెస్సీయ యందు} విశ్వసించేలా చేసిన విధముగా మీరు {మెస్సీయ యందు} విశ్వసించేటట్లు చేసిన మీకు {నేను ఈ పత్రిక రాయుచున్నాను}. తన నీతి క్రియల చేత {యేసు దీనిని చేసాడు}. మన దేవుడు మెస్సీయ యేసు, మరియు ఆయనే మనలను రక్షించువాడు.

2 దేవుడు తన దయగల క్రియలను మీ పట్ల విస్తరించాలి మరియు మిమ్మును మరింత సమాధానముగా చెయ్యాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే దేవుడు మరియు {ఆయన} మన ప్రభువు యేసు మీకు తెలుసు. 3 ఆయనను ఘనపరచే జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడుగా తన శక్తి చేత {ఆయన దీనిని చేస్తాడు}. ఆయనను గురించి మనకు తెలిసిన దాని చేత {ఆయన దీనిని చేస్తాడు}. దేవుడు తన మహిమాన్వితమైన మరియు అద్భుతమైన స్వభావము చేత మనలను {తన మనుష్యులుగా ఉండడానికి} ఎంచుకొన్నవాడు. 4 {తన మహిమాన్విత మరియు అద్భుతమైన స్వభావము చేత, దేవుడు మన కోసం ప్రశస్తమైన మరియు గొప్ప సంగతులను జరిగిస్తాను అని వాగ్దానం చేశాడు. {ఆయన దీనిని చేసాడు} తద్వారా ఆయన వాగ్దానం చేసిన దానిని {విశ్వసించడం} చేత ద్వారా, మీరు దేవుని వలే ప్రవర్తించగలుగుతారు, {మరియు} పాపపు పనులు చేయడానికి కోరిక ద్వారా లోకములో ఉన్న నైతిక అవినీతిని మీరు ఇక మీద అనుభవించరు. 5 దేవుడు దానిని అంతటిని చేసాడు కాబట్టి, మెస్సీయ యందు విశ్వసించడమే కాకుండా, {అయితే} మంచి పనులు చేయడానికి {కూడా} మీ వంతు కృషి చేయండి. {మరియు మీరు} మంచి పనులు చెయ్యడం {మాత్రమే కాక}, {అయితే మీరు} దేవుని గురించి కూడా మరింత నేర్చుకొనేలా నిర్ధారించుకోండి 6 {మరియు మీరు} దేవుని గురించి మరింత {తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా}, {అయితే మీరు} {చేసే మరియు చెప్పేదానిలో కూడా} మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. {మరియు మీరు చేసే మరియు చెప్పేదానిలో} మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమే కాకుండా}, మీరు కష్టాలలో దేవునికి నమ్మకంగా ఉండేలా {కూడా} చూసుకోండి. {మరియు మీరు} కష్టాల్లో దేవునికి నమ్మకంగా ఉండడం {మాత్రమే కాకుండా}, {అయితే} ఆయనను ఘనపరచేలా {కూడా} నిర్ధారించుకోండి. 7 {మరియు మీరు} దేవుణ్ణి ఘనపరచడం {మాత్రమే కాకుండా} కుటుంబ సభ్యులు వలే ఒకరికొకరు అనురాగం చూపించేలా {కూడా నిర్దారించుకోండి}. {మరియు మీరు కుటుంబ సభ్యులు వలే ఒకరికొకరు అనురాగం చూపడం {మాత్రమే కాకుండా}, {అయితే} ఇతరులను కూడా ప్రేమిస్తున్నారు అని {కూడా మీరు} నిర్ధారించుకోండి. 8 {ఈ సంగతులు చేయండి,} ఎందుకంటే మీరు ఈ సంగతులు అన్నిటిని ఎక్కువగా మరియు ఎక్కువగా చేసిన యెడల, అప్పుడు మన ప్రభువు మెస్సీయ యేసును మీరు తెలుసుకునే విషయంలో అవి మిమ్మల్ని ఫలకరంగా చేస్తాయి. 9 {ఈ సంగతులు చెయ్యండి,} ఎందుకంటే ఈ సంగతులు చేయని ఒక వ్యక్తి {ఈ సంగతులు ప్రాముఖ్యమైనవి అని అవగాహన ఉండదు.} {ఈ వ్యక్తి} ఒక గుడ్డివాడైన వ్యక్తి {వలే} {తన చుట్టూ ఉన్నవాటిని చూడలేని,} {లేదా} సమీప దృష్టి గల వ్యక్తి {వలే ఉంటాడు} {తనకు సమీపంగా ఉన్న వాటిని మాత్రమే చూడగలడు.} {ఈ వ్యక్తి సహితం} గతంలో {తాను చేసిన} చేసిన పాపపు క్రియల కోసం తనను క్షమించాడు అని మరచిపోయాడు. 10 పర్యవసానంగా, తోటి విశ్వాసులైన మీరు, దేవుడు మిమ్మును తన మనుష్యులుగా ఉండుటకు ఎన్నుకున్నాడని నిర్ధారించుకోవడానికి మరింత ప్రయత్నం చెయ్యండి. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ సంగతులు మీరు చేసిన యెడల, అప్పుడు మీరు దేవుని నుండి ఎప్పటికీ వేరుచెయ్యబడలేరు. 11 {ఇది నిజం} ఎందుకంటే, {మీరు చేయడం చేత}, ఈ విధంగా మన ప్రభువు మరియు రక్షకుడు మెస్సీయ యేసు {ఆయన మనుష్యులను} శాశ్వతంగా పరిపాలించే స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు మిమ్మల్ని హృదయపూర్వకంగా అనుమతిస్తాడు. 12 పర్యవసానంగా, {ఎందుకంటే ఈ సంగతులు చాలా ముఖ్యమైనవి,} ఈ సంగతులను గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉండటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. మీకు {అవి} ఇప్పటికే తెలిసినప్పటికీ మరియు ఇప్పుడు మీరు కలిగి ఉన్న సత్యమైన బోధన గురించి దృఢంగా విశ్వసించినప్పటికీ {నేను మీకు జ్ఞాపకం చేస్తాను}. 13 అయినప్పటికీ, నేను సజీవంగా ఉన్నంత వరకు {ఈ సంగతులను గురించి} మీకు జ్ఞాపకం చేస్తూ ఉండడం సరైనదిగా ఉంది అని నేను పరిగణిస్తున్నాను. 14 {నేను ఈ సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను,} ఎందుకంటే నేను త్వరలో చనిపోతాను అని నాకు తెలుసు. మన ప్రభువు మెస్సీయ నాకు {గతంలో} స్పష్టం చేసిన విధముగానే {నేను చనిపోతాను}. 15 అదనంగా, నేను చనిపోయిన తరువాత ఈ సంగతులను మీరు జ్ఞాపకంలో గుర్తుంచుకొంటూ ఉండేలా చెయ్యడానికి {ఈ సంగతులను వ్రాయడం చేత} నేను ప్రతి ప్రయత్నం చేస్తాను. 16 {నేను దీనిని చేస్తాను} ఎందుకంటే, మన ప్రభువు మెస్సీయ యేసు {ఒక రోజు} తిరిగి అధికారంలో తిరిగి వస్తున్నాడని అపొస్తలులమైన మేము మీకు చెప్పినప్పుడు, {మేము మీకు చెప్పిన దానిని} మేము తెలివిగా రూపొందించిన కథల మీద ఆధారం చేసుకోలేదు. దీనికి విరుద్ధంగా, మేము మా స్వంత కళ్లతో చూసిన వాటిని, దైవికమైన మహాత్య్ముడైన యేసు, {మేము మీకు చెప్పాము}. 17 {మేము ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాము అని నేను చెప్పగలను} ఎందుకంటే {మేము అక్కడ ఉన్నప్పుడు} తండ్రి దేవుడు ఆయనను ఘనపరచాడు మరియు మహిమపరచాడు. {మహిమాన్వితమైన మహిమ గల దేవుని నుండి ఒక స్వరం యేసు వినినప్పుడు} {మరియు స్వరం పలికింది} “ఈయన నా కుమారుడు, ఈయనను నేను అధికంగా ప్రేమిస్తున్నాను. ఈయనతో నేను చాలా సంతోషిస్తున్నాను.” 18 ఆ పవిత్ర పర్వతం మీద మేము యేసుతో ఉన్నప్పుడు పరలోకం నుండి వచ్చిన ఈ దేవుని యొక్క స్వరాన్ని కూడా మా మట్టుకు మేము విన్నాము. 19 మరియు ప్రవక్తలు {గతంలో} వ్రాసినవి మనం కలిగి యున్నాము. {ఇది} సంపూర్ణంగా నమ్మదగినది. వారు వ్రాసిన వాటి మీద శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఇది ఒక చీకటి ప్రదేశంలో ప్రకాశించే దీపం వలే ఉంది. {వారు ఎక్కడికి వెళ్తున్నారో చూడడానికి మనుష్యులకు అది సహాయపడుతుంది}. {మెస్సీయ తిరిగి వచ్చే} రోజు తెల్లవారుజాము వరకు {ఆ వెలుగు} ప్రకాశిస్తుంది మరియు ఉదయానికి ముందు కనిపించే నక్షత్రం {యేసు} మీ మనస్సులకు గొప్ప అవగాహనను ఇస్తుంది. 20 అన్నింటికి మించి, ఏ ప్రవక్త కూడా తన స్వంత ఊహ చేత {తన ప్రవచనాన్ని} అర్థీకరించలేడని మీరు తెలుసుకోవాలి. 21 {ఇది సత్యం} ఎందుకంటే మానవుడు కోరుకున్న దాని ప్రకారం ఎవరూ ఒక {నిజమైన} ప్రవచనాన్ని ప్రవచించలేదు. దీనికి విరుద్ధంగా, దేవుని నుండి {ప్రవచనాలు} పలికిన వారు పరిశుద్ధ ఆత్మ వారిని నడిపించడం చేత ఆ విధంగా చేసారు.

Chapter 2

1 అయితే ఇశ్రాయేలీయుల మధ్య కూడా {దేవుని నుండి సందేశాలను} తప్పుగా ప్రకటించిన వారు ఉన్నారు. అదే విధంగా మీ మధ్య కూడా తప్పుడు {సందేశాలు} బోధించే వారు ఉంటారు. వారు శాశ్వతమైన శిక్షకు {దారితీసే} అభిప్రాయాలను పరిచయం చేస్తారు. తమను విమోచించిన వారి యజమాని {యేసును} సహితం వారు తిరస్కరిస్తారు. {దీని ఫలితంగా,} దేవుడు వారిని {శాశ్వతంగా} త్వరలోనే శిక్షిస్తాడు. 2 మరియు అనేక మంది {మనుష్యలు} {ఈ తప్పుడు బోధకుల వలే} ఇవే అనియంత్రిత అనైతిక చర్యలను జరిగిస్తారు. ఎందుకంటే ఈ అబద్దపు బోధకులు {అవిశ్వాసులు} క్రైస్తవ్యం గురించి చేదుగా మాట్లాడుతారు. 3 మరియు లోభంతో కూడిన వారి హృదయాల కారణంగా, {ఈ తప్పుడు బోధకులు} మీకు అబద్ధాలు చెప్పి మీ నుని లాభాన్ని చేసుకొంటారు. దేవుడు చాలా కాలం క్రితం వారిని శిక్షించాడు, మరియు దేవుడు వారిని ఖచ్చితంగా నాశనం చేస్తాడు.

4 {ఈ తీర్పు ఖచ్చితంగా ఉంది} ఎందుకంటే పాపం చేసిన దేవదూతలను దేవుడు శిక్షించకుండా ఉండనివ్వలేదు. దానికి విరుద్ధంగా, ఆయన వారిని చీకటిలో బంధించబడియుండడానికి నరకంలోనికి {వారు ఉన్నచోట} త్రోసివేసాడు. దేవుడు {ఈ పాపాత్ములైన దేవదూతలను} అక్కడ బంధించాడు మరియు వారికి తీర్పు తీర్చడానికి వారిని అక్కడ ఉంచాడు. 5 మరియు దేవుడు చాలా కాలం క్రితం లోకంలో {నివసించిన మనుష్యులను} శిక్షించకుండా ఉండనివ్వలేదు. అయితే, ఆయన {ఆ సమయంలో} {లోకంలో నివసించిన} దైవభక్తి లేని మనుష్యులను ఒక జలప్రళయం చేత నాశనం చేసినప్పుడు.నీతిమంతుడైన ప్రచారకుడు నోవహుతో సహా ఎనిమిది మందిని మనుష్యులను ఆయన కాపాడాడు. 6 మరియు దేవుడు సొదొమ మరియు గొమొర్రా {అని పిలువబడిన} నగరాలను పూర్తిగా బూడిద చేయడం చేత నాశనం చేయడం ద్వారా శిక్షించాడు. ఫలితంగా దేవుణ్ణి అగౌరవపరచే మనుష్యులకు జరగబోవుదాని యొక్క ఒక ఉదాహరణగా {ఆ నగరాలను} {దేవుడు} చేసాడు. 7 మరియు దేవుడు లోతును రక్షించాడు, అతడు నీతిమంతుడైన మనిషి. {సోదొమలో} విధివిరుద్ధంగా ప్రవర్తించే మనుష్యుల యొక్క విశృంఖల అనైతిక చర్యల కారణంగా లోతు చాలా బాధపడ్డాడు 8 (అతడు ఆ దుష్టులైన మనుష్యులతో {సొదొమలో} నివసించినప్పుడు, ఆ నీతిమంతుడైన మనిషి లోతు తాను చూసిన మరియు విన్నవాటిని బట్టి ప్రతీ దినం తనను తాను బాధపెట్టుకున్నాడు. దేవుని చట్టానికి వ్యతిరేకంగా మనుష్యులు చేసిన సంగతుల కారణంగా {అతడు ఆ విధంగా చేశాడు}.) 9 {ఈ సంగతులు అన్నీ వాస్తవం కాబట్టి, అప్పుడు} తనను ఘనపరచు మనుష్యులు పరీక్షించబడడం నుండి కాపాడడానికి ప్రభువుకు తెలుసు {అని మీరు నిశ్చయంగా ఉండవచ్చు}. మరియు దుర్నీతి క్రియలు చేయు వారిని తాను తీర్పు తీర్చే సమయంలో వారిని శిక్షించడానికి {సిద్ధంగా} ఉంచడం {కూడా ప్రభువుకు తెలుసు}. 10 మరియు {అతడు శిక్షిస్తాడు} ముఖ్యంగా తమ పాప హృదయాలు చేయాలనుకుంటున్న వాటిని చేస్తూ ఉన్నవారిని, {అవి వారిని} దేవునికి అసంతృప్తిని {కలిగించే వారిగా చేస్తాయి}. {ఈ మనుష్యులు} కూడా దైవిక అధికారాన్ని అవమానిస్తారు. {వారు} ఎంత ధైర్యంగా ఉన్నారు! వారు కోరుకున్న దానిని చేస్తారు. దేవుని మహిమగల దేవదూతలను సహితం అవమానించడానికి వారు భయపడరు. 11 అయితే {దేవుని} దేవదూతలు, వారు ఈ మనుష్యుల కంటే చాలా శక్తివంతమైనవారు, {అయినప్పటికీ} దేవుని యెదుట అవమానకరమైన రీతిలో మహిమాన్వితమైన వ్యక్తులను నిందించరు! 12 అయితే, ఈ {తప్పుడు బోధకులు} హేతుబద్ధంగా ఆలోచించలేని జంతువుల వంటివారు. వారు సహజంగా ప్రవర్తించే విధానం ప్రకారం, వారు జన్మించారు తద్వారా ఇతరులు వారిని పట్టుకుని మరియు నాశనం చేస్తారు. తమకు కనీసం తెలియని సంగతులను గురించి చెడుగా పలుకుతారు. వారి నాశనానికి సమయం వచ్చినప్పుడు దేవుడు వారిని తప్పకుండా నాశనం చేస్తాడు. 13 {ఈ తప్పుడు ఉపాధ్యాయులు} వారి హానికరమైన క్రియల కోసం సరియైన శిక్ష వలే హానిని అనుభవిస్తారు. పగటిపూట అనైతికంగా {కూడా} విందులు చేసుకోవడానికి {వారు} సంతోషిస్తారు. {ఒకరి దుస్తులపై} {అవి మీ సమావేశాలకు అవమానకరమైనవి} మురికి మరకలు! {వారు కూడా} మీతో కలిసి {భోజనం} చేస్తున్నప్పుడు వారి మోసపూరిత క్రియలను వేడుకగా చేసుకొంటారు! . 14 వారు నిరంతరం {వారు చూసే} {ప్రతి} స్త్రీతో అనైతిక లైంగిక సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటారు. వారు పాపం చేయడం ఆపలేరు. ఆత్మీయంగా బలహీనమైన మనుష్యులను {పాపంలోనికి} ప్రలోభపెడతారు. {క్రీడాకారూ క్రీడల కోసం శిక్షణ పొందినట్లు, ఈ తప్పుడు బోధకులు} తమ్మును తాము లోభత్వంతో ఉండేలా తర్ఫీదు చేసుకొంటారు. {దేవుడు} వారిని శపించాడు! 15 15 వారు దేవుడు కోరుకున్న విధంగా జీవించడానికి నిరాకరిస్తారు. వారు దుర్మార్గంగా క్రియ జరిగిస్తున్నారు. బోసోరు యొక్క కుమారుడు బిలాము {చాలా కాలం క్రితం} చేసిన దానిని వారు అనుకరిస్తున్నారు. అతడు దుష్టమైన క్రియల కోసం {డబ్బును స్వీకరించడానికి} ప్రతిఫలముగా అతడు ప్రేమించాడు. 16 అయినప్పటికీ, {ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా} అతని దుష్టమైన కార్యం కోసం దేవుడు అతనిని గద్దించాడు. {మరియు గాడిదలు కూడా మాట్లాడకుండా ఉన్నప్పటికీ}, అతనితో ఒక మానవ స్వరంతో మాట్లాడడానికి మరియు బుద్ధిహీనమైన కార్యాన్ని ఆపివెయ్యడానికి దేవుడు {బిలాము యొక్క} గాడిదను వినియోగించాడు.

17 ఈ {తప్పుడు ఉపాధ్యాయులు} {పనికిరానివి}, నీళ్ళు ఇవ్వని నీటి ఊటలు {వలే} ఉన్నాయి. {అవి వర్షాన్ని ఇవ్వడానికి ముందే} తుఫానును దూరంగా నెట్టివేసే మేఘాల {వలే వారు ఉన్నారు}. {దేవుడు} వారి కోసం {నరకం యొక్క} చీకటిని ప్రత్యేకించి ఉంచాడు. 18 {ఇది సత్యం} ఎందుకంటే వారు నూతనంగా {విశ్వాసులుగా మారినవారు} మరియు దుష్టులైన చెడ్డ అవిశ్వాసులు చేసే వాటిని ఆపివేసిన మనుష్యులను పాపం చెయ్యడానికి ఒప్పిస్తారు. దేనికీ విలువ లేని గర్వపు మాటలు మాట్లాడటం చేత {ఈ తప్పుడు బోధకులు దీనిని చేస్తారు}. వారి పాప స్వభావాలు చేయాలనుకుంటున్న వాటిని చెయ్యడం ద్వారా {వారు ఈ మనుష్యులు పాపం చెయ్యడానికి ఒప్పిస్తారు}. 19 వారు కోరుకున్న దానిని చెయ్యడానికి వారు స్వేచ్చగా ఉన్నారు అని వారి శ్రోతలకు చెప్పడం చేత {వారి దీనిని కూడా చేస్తారు}, అయితే అదే సమయంలో వారు తమకై తాము {వారి పాపయుక్తమైన కోరికల చేత} వారు స్వయంగా నియంత్రించబడతారు. {ఇది వాస్తవం} ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క చిత్తాన్ని అధిగమించే విషయం ఆ వ్యక్తిని నియంత్రిస్తుంది. 20 మరియు మనలను పరిపాలించే మరియు మనలను రక్షించే మెస్సీయ యేసు గురించి తెలుసుకోవడం చేత పాపయుక్తమైన మానవ సమాజాన్ని అపవిత్రం చేసే సంగతులు వారు చేయడం మానేసినట్లయిన యెడల, ఆ {అపవిత్రపరచు సంగతులు} తిరిగి వారిని నియంత్రించడం {ఆరంభిస్తాయి}, {అప్పుడు} వారి పరిస్థితి ఇప్పుడు ఆరంభంలో {ఉన్నదాని} కంటే మిక్కిలి చెడ్డదిగా ఉంటుంది. 21 {ఇది ఎందుకంటే} {అపొస్తలులు} వారికి బోధించిన {దేవుని} పరిశుద్ధ ఆజ్ఞలను {ఈ విధంగా} నేర్చుకుని మరియు తిరస్కరించడం కంటే వారు దేవునిని సంతోషపరచే మార్గంలో జీవించడానికి ఎప్పటికీ నేర్చుకోకుండా ఉన్నట్లయిన యెడల వారికి మేలైనదిగా ఉంటుంది. 22 ఇది {ఈ తప్పుడు బోధకులకు} జరుగుతున్న దానిని {వివరించే} నిజమైన సామెత ఇది: “వారు తమ సొంత వాంతిని తినడానికి తిరిగి వచ్చే కుక్కల వలే ఉన్నారు,” మరియు, “వారు తమనుతాము కడుగుకొని మరియు అప్పుడు బురదలో మరల దొర్లిన పందుల వలే ఉన్నారు."

Chapter 3

1 నేను ప్రేమించే సహా విశ్వాసులారా, నేను ఇప్పుడు మీకు వ్రాస్తున్న ఈ {పత్రిక} {నేను మీకు వ్రాసిన రెండవ పత్రిక}. మీ హృదయపూర్వక మనస్సులకు ఇప్పటికే తెలిసిన సంగతులు మీకు జ్ఞాపకం చెయ్యడానికి ఈ రెండు {పత్రికలు మీకు} {నేను రాసాను}. 2 చాలా కాలం క్రితం పరిశుద్ధ ప్రవక్తలు పలికిన ప్రవచనాలను మీకు జ్ఞాపకం చెయ్యడానికి {నేను ఈ పత్రికలు వ్రాసాను}. మన మీద పరిపాలించేవాడు మరియు మనలను రక్షించేవాడు {మేము పంపిన} అపొస్తలుల యొక్క బోధన ద్వారా మీకు ఆజ్ఞాపించిన దానిని {మీరు} జ్ఞాపకం చేసుకోవాలని {నేను కూడా కోరుతున్నాను}.

3 ఎగతాళి చేసే మనుష్యులు యేసు తిరిగి రావడానికి కొంచెం ముందు సమయంలో వస్తారు మరియు {యేసు తిరిగి రావడాన్ని} ఎగతాళి చేస్తారని మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. {ఆ మనుష్యులు} వారు చేయాలని కోరుకున్న దానిని చేస్తారు. 4 {ఈ అపహాసకులు} చెపుతారు, “తిరిగి వస్తానని యేసు చేసిన వాగ్దానం సత్యం కాదు! {ఇది మాకు తెలుసు} ఎందుకంటే ఇశ్రాయేలు పూర్వీకులు చనిపోయినప్పటి నుండి, ప్రతిదీ అలాగే ఉండిపోయింది. దేవుడు సమస్తమును సృష్టించినప్పటి నుండి ఇదే పద్ధతిగా ఉంది!” 5 {వారు దీనిని చెపుతారు} ఎందుకంటే దేవుడు చాలా కాలం క్రితం ఆకాశాలను ఆ విధంగా ఉండడానికి ఆజ్ఞాపించడం చేత దేవుడు వాటిని ఉనికి కలిగియుండడానికి చేసాడు అని వారు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. మరియు నీళ్ళ నుండి భూమి వెలుపలికి వచ్చేలా చేసాడు మరియు నీళ్ళ ద్వారా పైకి {ఆ విధంగా ఉండాలని ఆజ్ఞాపించడం ద్వారా} 6 మరియు దేవుడు, ఆయన ఆజ్ఞ మరియు నీళ్ళ చేత ఆ కాలంలో ఉన్న లోకాన్ని నీళ్ళతో భూమిని జలప్రలయం చేత {ఆయన ఆవిధంగా చేసాడు}. 7 అయితే, దేవుడు అదే ఆజ్ఞ హేత ఇప్పుడు ఉన్న ఆకాశాలను మరియు భూమిని అగ్ని కోసం వేరు పరచాడు. దుర్మార్గంగా ప్రవర్తించే మనుష్యులను ఆయన తీర్పుతీర్చి మరియు నాశనం చేసే సమయం కోసం దేవుడు వారిని ఉంచుతున్నాడు. 8 ప్రియమైనేను ప్రేమించే సహా విశ్వాసులారా, ఈ ఒక్క సత్యాన్ని విస్మరించవద్దు: దేవుని దృక్కోణం నుండి సమయం యొక్క కొద్ది భాగం సమయం యొక్క సుదీర్ఘ భాగానికి వ్యత్యాసం ఏమీ లేదు! 9 యేసు యొక్క రాకడ యొక్క తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభువు నెమ్మదిగా కార్యం జరిగించడం లేదు. కొంతమంది మనుష్యులు {ఇది అలా అని} ఆలోచిస్తున్నారు. దానికి విరుద్ధంగా, దేవుడు మీతో ఓర్పుతో ఉన్నాడు, ఎందుకంటే మీలో ఎవ్వరూ శాశ్వతంగా శిక్షించబడాలని ఆయన కోరుకోవడం లేదు. దానికి బదులుగా, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడాలని ఆయన కోరుకుంటున్నాడు. 10 {ఆ అపహాస్యం చేసేవారు చెప్పేదానికి} విరుద్ధంగా, ప్రభువు తిరిగి వచ్చే సమయం అనుకోకుండా వస్తుంది. ఆ సమయంలో గొప్ప గర్జన శబ్దం వస్తుంది మరియు ఆకాశాలు ఉనికిని కోల్పోతాయి. దేవుడు ప్రకృతిలోని ప్రాథమిక అంశాలను కూడా అగ్ని చేత నాశనం చేస్తాడు. అప్పుడు దేవుడు భూమిని మరియు దానిలో చేసిన ప్రతిదానిని బయలుపరుస్తాడు.

11 దేవుడు ఈ సంగతులు అన్నిటిని {నేను ఇప్పుడే ప్రస్తావించాను} {నేను వివరించిన} విధానంలో నాశనం చేస్తాడు, మీరు ఖచ్చితంగా పరిశుద్ధ విధానంలో ప్రవర్తించాలి మరియు దేవునికి ఇష్టమైనది చేయాలి. 12 యేసు తిరిగి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తూ ఉండగా మరియు వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు {ఈ సంగతులు చెయ్యండి}. ఆ రోజు కారణంగా, దేవుడు ఆకాశాలను అగ్నితో నాశనం చేస్తాడు మరియు ప్రకృతిలోని ప్రాథమిక అంశాలను వేడితో కరిగించివేస్తాడు. 13 {ఆ సంఘటనలు అన్నీ జరిగినప్పటికీ,} దేవుడు సృష్టిస్తానని వాగ్దానం చేసిన నూతన ఆకాశం మరియు నూతన భూమి కోసం మనం ఎదురుచూస్తున్నాము. ఆ నూతన విశ్వంలో ప్రతి ఒక్కరూ నీతిమంతులుగా ఉంటారు. .

14 ఇది వాస్తవం కాబట్టి, నేను ప్రేమించే సహా విశ్వాసులారా, మీరు ఈ సంగతులు {జరగడానికి} కోసం ఎదురు చూస్తున్నప్పుడు, మీరు పాపభరితంగా జీవించడం లేదని {మరియు మీరు} {దేవునితో} సమాధానముగా ఉన్నారు అని యేసు చూసేలా చేయడానికి మీ వంతు కృషి చేయండి. 15 మరియు దీని గురించి ఆలోచించండి: మన ప్రభువు యేసు ఓర్పుతో ఉన్నాడు, తద్వారా ఎక్కువ మంది మనుష్యులు రక్షించబడతారు. మనం ప్రేమించే సహా విశ్వాసి పౌలు కూడా మీకు వ్రాసినప్పుడు ఇలా చెప్పాడు. దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని వినియోగించి రాశాడు. 16 పౌలు వ్రాసిన అన్ని పత్రికలలో, ఆయన ఈ సంగతులను గురించి {నేను ఇప్పుడే ప్రస్తావించిన} గురించి కూడా రాస్తున్నాడు. అతని పత్రికల అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్న కొన్ని {బోధలు} కూడా ఉన్నాయి. జ్ఞానం మరియు స్థిరత్వం కొదువగా ఉన్న మనుష్యులు ఆ కష్టమైన బోధనలను, అలాగే మిగిలిన లేఖనాలను తప్పుగా అర్థీకరిస్తారు. ఫలితంగా {దేవుడు} వారిని శిక్షిస్తాడు. 17 ఈ సంగతులు అన్నీ వాస్తవం కాబట్టి, నేను ప్రేమించే సహా విశ్వాసులారా, మరియు ఎనుకంటే ఈ సంగతులను గురించి మీకు ఇప్పటికే తెలుసు. నమ్మకంగా జీవించడం ఆపి వెయ్యకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఎందుకంటే ధర్మ శాస్త్రం లేనట్లుగా జీవించే వారి యొక్క తప్పుడు బోధలు మిమ్మల్ని పాపంలోనికి మోసం చెయ్యడానికి మీరు అనుమతిస్తున్నారు. 18 బదులుగా, మనలను పరిపాలించే మరియు మనలను రక్షించే మెస్సీయ యేసు యొక్క దయగల క్రియలను మీరు ఎక్కువగా మరియు ఎక్కువగా అనుభవించే విధానంలో జీవించండి. మరియు మీరు ఆయనను గురించి ఎక్కువగా మరియు ఎక్కువగా తెలుసుకునే విధానంలో జీవించండి. ప్రతి ఒక్కరూ ఈ సమయంలో మరియు శాశ్వతము యేసును మహిమపరచాలని నేను ప్రార్థిస్తున్నాను