తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యోహాను రాసిన మూడవ పత్రిక

Chapter 1

1 ఒక పెద్దగా నీకు నేను తెలుసు. నా ప్రియమైన స్నేహితుడు, నేను నిజంగా ప్రేమిస్తున్న గాయికి నేను రాస్తున్నాను. 2 ప్రియ స్నేహితుడా, నీవు దేవుని విషయాలలో ఆరోగ్యవంతుడివిగా ఉన్నట్టుగానే శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నావని మరియు అన్ని విషయాలలో ఆయన వర్ధిల్లింప చేయాలని నీ కోసం నేను దేవుని ప్రార్థన చేస్తున్నాను. 3 నీవు దేవుని విషయంలో ఆరోగ్యంగా ఉన్నావని నాకు తెలుసు ఎందుకంటే తోటి విశ్వాసులైన వారు ఇక్కడికి వచ్చారు మరియు నీ యదార్ధమైన జీవిత విధానం గురించి వారు చెప్పారు. క్రీస్తును గురించిన నిజమైన బోధకు అనుకూలంగా నీవు జీవిస్తున్నావని వారు చెప్పారు. అది నన్ను చాలా సంతోషపరచింది. 4 యేసును అనుసరించడంలో నేను సాయం చేసిన ప్రజలు దేవుని సత్యానికి అనుగుణ్యంగా జీవిస్తున్నారని ఒకరు నాకు చెప్పినప్పుడు ఇది నన్ను చాలా సంతోషపరుస్తుంది.

5 ప్రియ స్నేహితుడా, నీ తోటి విశ్వాసులకు, వారు నీకు తెలియని వారు అయినప్పటికీ వారికి నువ్వు సాయం చేస్తున్నప్పుడు నీవు యేసుకు సద్భక్తితో సేవ చేస్తున్నావు. 6 వారిలో కొందరు ఇక్కడి సంఘం ఎదుట వారికి నీవు చూపించిన నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అలాంటివారికి వారి ప్రయాణం కోసం ఉదారంగా ఇవ్వడానికి నీవు కొనసాగించడం మంచి విషయం తద్వారా ఇది దేవుణ్ణి ఘనపరుస్తుంది.

7 వారు యేసుకు విధేయులుగా ఉండడం కోసం వారు ప్రయాణం చేస్తున్నారు, మరియు యేసులో విశ్వాసముంచని ప్రజలు వారికి సహాయం చెయ్యలేదు. 8 కాబట్టి యేసులో విశ్వసిస్తున్న మనం ఈ ప్రజలకు కావలిసిన వాటన్నిటినీ ఇవ్వాలి. అప్పుడు ఇతరులు దేవుని సత్య సందేశాన్ని తెలుసుకోడానికి వారు సహాయం చేస్తున్నప్పుడు వారితో కలిసి మనం పని చేస్తున్నట్టుగా ఉంటుంది.

9 ఆ ఇతర విశ్వాసులకు సహాయం చెయ్యాలని చెప్పడానికి మీ విశ్వాసుల బృందానికి నేను ఒక ఉత్తరం రాసాను. అయితే దియోత్రెఫే నేను చెప్పిన దేనినీ అంగీకరించడం లేదు, ఎందుకంటే మీ బృందాన్ని అతను నియంత్రించాలని చూస్తున్నాడు. 10 కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసినదానిని బహిరంగంగా అందరికి చెపుతాను. మేము చెడుపనులు చేస్తున్నామని అందరికీ తప్పుగా చెపుతున్నాడు. అతడు చెప్పిన దాని చేత మాకు నష్టం కలిగేలా అతడు దీన్ని చేస్తున్నాడు. దానిని చెయ్యడంతో పాటు, దేవుని సువార్త పని చెయ్యడానికి ప్రయాణం చేస్తున్న సాటి విశ్వాసులను ఆహ్వానించడానికి నిరాకరిస్తున్నాడు. వారిని ఆహ్వానించాలని కోరుకున్న వారిని కూడా అడ్డగిస్తున్నాడు మరియు సంఘం నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు.

11 ప్రియ స్నేహితుడా, అటువంటి చెడ్డ ఉదాహరణను అనుకరించవద్దు. దానికి బదులుగా మంచి ఉదాహరణలను అనుకరిస్తూ ఉండు. మంచి పనులు చేసేవాడు నిజంగా దేవుని సంబంధి అని జ్ఞాపకం ఉంచుకో. అయితే నిత్యం చెడు చేస్తుండేవాడు దేవుణ్ణి తెలుసుకోలేదు.

12 దేమేత్రి గురించి తెలిసిన విశ్వాసులు అందరూ అతడు మంచి వ్యక్తి అని చెపుతున్నారు. దేవుని సత్య సందేశం ప్రకారం అతడు జీవించిన విధానం కూడా అతడు మంచి వ్యక్తి అని మీకు చూపిస్తుంది. మేము కూడా అతను ఒక మంచి వ్యక్తి అని ఋజువుపరుస్తున్నాము. మరియు మేము చెప్పింది నిజమని నీకు తెలుసు.

13 ఈ ఉత్తరం రాయడానికి మొదలు పెట్టినపుడు, నేను నీకు రాయడానికి ఉద్దేశించిన వాటికంటే చాలా విషయాలు నాకు ఉన్నాయి. అయితే వాటిని నీకు ఒక ఉత్తరంలో రాయడం నాకు ఇష్టం లేదు. 14 దానికి బదులుగా, నేను త్వరలో రావాలని మరియు నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను. అప్పుడు మనం నేరుగా ఒకరితో ఒకరం మాట్లాడుకుందాం. 15 దేవుడు నీ ఆత్మను శాంతియుతంగా కొనసాగించాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. ఇక్కడి స్నేహితులు నీకు అభివందనాలు చెపుతున్నారు. దయచేసి అక్కడి మన స్నేహితులందరికీ వ్యక్తిగతంగానూ మరియు పేరు పేరునా మా కోసం అభివందనాలు తెలియజెయ్యి.