తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యోహాను రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 జీవమును ఇచ్చు వాడు {దేవుని యొక్క} వాక్యము, {యేసును} గురించి {యోహాననే నేను మీకు రాస్తున్నాను}. అక్కడ ముందు ఏమీ లేనప్పుడు ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. {అపొస్తలులమైన} మేము {ఆయన మనుష్యులకు బోధిస్తూ ఉండగా} ఆయన మాట విన్నాము. మేము ఆయనను వ్యక్తిగతంగా చూశాము. మేము ఆయన వైపు చూసాము మరియు ఆయనను తాకాము. మేము ఆయన వైపు చూసి, ఆయనను తాకాము. {కాబట్టి ఆయన నిజమైన మానవుడని మేము సాక్ష్యమివ్వగలము.} 2 ఎందుకంటే ఆయన ఇక్కడ భూమి మీదకు వచ్చాడు, మరియు మేము ఆయనను చూశాము, మేము ఆయనను మీకు స్పష్టంగా ప్రకటిస్తున్నాము. ఎల్లప్పుడూ ఉనికిలో ఉన్నవాడు, పరలోకంలో తన తండ్రితో పాటు ఉన్నవాడు, ఇక్కడ మన దగ్గరకు వచ్చాడు.

3 మీరు కూడా మాతో జీవాన్ని పంచుకోడానికి మేము కోరుకుంటున్నాము, మరియు కాబట్టి {యేసు చెయ్యడం } మేము చూసింది మరియు {యేసు చెప్పినది} మేము విన్నది మేము మీకు ప్రకటించుచున్నాము. {మీరు ఆయన యందు విశ్వాసం ఉంచిన యెడల} మేము చేసిన విధముగా మన తండ్రి దేవుడు మరియు ఆయన కుమారుడు మెస్సీయ యేసుతో మీరు జీవాన్ని పంచుకొంటారు. 4 నేను ఈ సంగతులను గూర్చి మీకు రాస్తున్నాను తద్వారా {అవి సత్యం అని మీరు గుర్తిస్తారు మరియు దాని ఫలితంగా } మనం కలిసి సంపూర్ణంగా సంతోషంగా ఉంటాము.

5 మేము యేసు నుండి వినినది మరియు మీకు ప్రకటించుచున్న సందేశం ఇదే: దేవుడు ఎల్లప్పుడూ మంచిదిగా ఉన్న దానిని చేస్తాడు మరియు ఆయన ఎప్పుడూ, ఎన్నడూ తప్పు అయిన దేనినీ చెయ్యడు. ఆయన ఒక పవిత్రమైన వెలుగు వలే ఉన్నాడు, దీనిలో ఎంతమాత్రము చీకటి లేదు. 6 మనం దేవునితో జీవం పంచుకొంటున్నాము అని చెప్పుకొని, అయితే ఒక దుష్ట విధానంలో మనం జీవిస్తున్న యెడల, మనం అబద్ధం ఆడుతున్నాము మనము సత్యంగా జీవించడం లేదు. మనం చీకటిలో జీవిస్తున్నాము అన్నట్టుగా ఇది ఉంది. 7 అయితే ప్రతీ విధానంలో దేవుడు పవిత్రంగా ఉన్న విధముగా మనము పవిత్రమైన విధానంలో జీవించిన యెడల, అప్పుడు మనం ఒకరితో ఒకరం జీవాన్ని పంచుకొంటాము. ఇది దేవుని పవిత్రమైన వెలుగులో జీవిస్తున్నట్టు వలే ఉంది. అప్పుడు దేవుడు మన పాపములు అన్నిటిని క్షమిస్తాడు మరియు మనలను అంగీకరిస్తాడు ఎందుకంటే ఆయన కుమారుడు యేసు మన కోసం మరణించాడు

8 మనము పాపం చేయలేదు అని చెప్పిన యెడల, మనలను మనమే మోసం చేసుకుంటున్నాము. మనం {దేవుడు మన గురించి చెప్పిన} నిజమైన సంగతులను విశ్వసించడానికి మనం నిరాకరిస్తున్నాము.

9 అయితే దేవుడు చేస్తానని చెప్పినది ఆయన ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాడు. మరియు ఆయన చేస్తున్నది ఎప్పుడూ సరైనదే. కాబట్టి మనం పాపం చేశాము అని ఆయనకు మనం ఒప్పుకొని, { మరియు ఆ పాపాన్ని నిరాకరించిన} యెడల ఆయన మన పాపముల విషయం మనలను క్షమిస్తాడు. మరియు మనం చేసిన ప్రతీ చెడు {యొక్క అపరాధం} నుండి మనలను విడిపిస్తాడు. 10 { ఎందుకంటే ప్రతి ఒక్కరూ పాపం చేసారని దేవుడు చెపుతున్నాడు,} మనం పాపం చెయ్యలేదు అని చెప్పిన యెడల దేవుడు అబద్దికుడు అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాము! మన గురించి దేవుడు చెప్పిన దానిని మనం నిరాకరిస్తున్నాము!

Chapter 2

1 మీరు నాకు నా సొంత పిల్లలు అన్నట్టు వలే ప్రియమైన వారుగా ఉన్నారు, కాబట్టి మీరు పాపం చెయ్యడం నుండి దూరంగా ఉంచడానికి నేను దీనిని మీరు రాయుచున్నాను. అయితే మీలో ఎవరైనా పాపం చేసిన యెడల, { జ్ఞాపకం ఉంచుకోండి} నీతిమంతుడైన వాడు, మెస్సీయ యేసు, తండ్రితో విజ్ఞాపన చేసుచున్నాడు {మరియు మనలను క్షమించడానికి ఆయనను అడుగుతున్నాడు}. 2 యేసు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు తద్వారా దేవుడు మనం పాపాలను క్షమిస్తాడు. మరియు మన పాపముల విషయంలో మాత్రమే కాదు, అయితే ప్రతీ చోట ఉన్న మనుష్యులు చేసిన పాపముల విషయంలో ఇది సత్యం.

3 దేవుడు మనకు చేయడానికి ఆజ్ఞాపించిన దానికి మనం లోబడిన యెడల, అప్పుడు మనము దేవునితో సన్నిహితమైన సంభంధంలోనికి వచ్చామని నిశ్చయంగా ఉండవచ్చు. 4 “నేను దేవునితో సంబంధంలో జీవిస్తున్నాను” అని ఒకరు చెపుతూ, అయితే ఆ వ్యక్తి దేవుడు ఆజ్ఞాపించిన వాటికి విధేయత చూపించకపోయిన యెడల, అతడు అబద్ధికుడు. అతడు దేవుని నిజమైన సత్య సందేశం ప్రకారం ప్రవర్తించడం లేదు. 5 అయితే, ఒకరు దేవుడు చేయమని ఆజ్ఞాపించిన వాటికి విధేయత చూపిస్తున్న యెడల ఆ వ్యక్తి అన్ని విధాలలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఈ విధంగా మనం దేవునితో సన్నిహిత సంబంధం కలిగియున్నామని నిశ్చయంగా ఉండవచ్చు:

6 ఎవరైనా దేవునితో తనకు సన్నిహిత సంబంధం కలిగియున్నానని అని చెప్పిన యెడల, అప్పుడు అతడు దేవునితో తన జీవితాన్ని యేసు చేసిన విధంగా {ఆయన భూమి మీద ఉన్నపుడు} నడుచుకోవాలి. 7 ప్రియమైన స్నేహితులారా, మీరు ఏదైనా కొత్త దానిని చెయ్యడానికి మీకు చెప్పడానికి నేను రాయడం లేదు. బదులుగా మీరు యేసులో మొదట విశ్వాసం ఉంచినప్పటి నుండి, మీరు చెయ్యడానికి మీరు తెలుసుకొన్నదానిని మీరు చెయ్యాలని నేను రాయుచున్నాను. ఇది {యేసు మనకు ఇచ్చిన మరియు} మేము మీకు ఇప్పటికే చెప్పిన ఆ సందేశం యొక్క {ఒక భాగం}. 8 అయితే, దీనిని గురించి మరొక విధంగా ఆలోచించిన యెడల, మీరు కొత్తదానిని చెయ్యడానికి నేను మీకు చెప్పుచున్నాను. ఇది క్రొత్తది ఎందుకంటే మెస్సీయ జీవించిన విధానం క్రొత్తది మరియు మీరు జీవించుచున్నది క్రొత్తది. అది ఎందుకంటే మీరు చెడు చెయ్యడానికి మానివేస్తున్నారు మరియు మీరు ఎక్కువ మరియు ఎక్కువ మేలు చేస్తున్నారు. ఇది మీరు చీకటి నుండి వెలుపలికి వచ్చారు మరియు దేవుని నుండి వెలుగులో జీవించడానికి ఆరంభించిన విధంగా ఉంది. 9 ఒకడు దేవుడు తనను చెయ్యమని కోరిన విధంగా తాను ఒక మంచి మార్గంలో జీవిస్తున్నాను అని చెప్పవచ్చు. దేవుని నుండి వెలుగులో జీవిస్తున్నట్టు వలే అది ఉంటుంది. అయితే అతడు తన తోటి విశ్వాసులలో ఎవరినైనా ద్వేషిస్తే, అప్పుడు అతడు ఇప్పటికీ చెడు మార్గంలో జీవిస్తున్నాడు, చీకటిలో నివసించే వ్యక్తిలా దేవుడు కోరుకోనిది చేస్తున్నాడు. 10 అయితే తన తోటి విశ్వాసులను ప్రేమిస్తూ ఉన్నయెడల, అప్పుడు అతడు దేవుడు నుండి వెలుగులో జీవిస్తున్న వ్యక్తి వలే నిజముగా చక్కగా జీవిస్తున్నాడు. ఎటువంటి చెడు చెయ్యడానికి {అతడు ఒక తోటి విశ్వాసిని ద్వేషించిన యెడల అతడు కలిగియుండబోయేదాని వలే} అతనికి ఒక కారణం ఉండదు. దేని విషయంలోనూ జారి పోవడానికి కారణం లేకుండా పగటి వెలుగులో ఉన్న వ్యక్తి వలే ఇది ఉంది. 11 అయితే తోటి విశ్వాసిని ద్వేషించే ఎవరైనా పూర్తిగా తప్పు మార్గంలో జీవిస్తున్నారు. అతడు ఏవిధంగా జీవించాలో అతనికి అర్థం కాలేదు, ఎందుకంటే అతడు చేస్తున్న తప్పుడు పనులు అతడు దేవుని మార్గాన్ని అర్థం చేసుకోకుండా చేస్తున్నాయి. ఇది అతడు చీకటిలో నడుస్తున్నట్లు ఉంది, మరియు ఎక్కడికి వెళ్లాలో చూడలేడు. 12 నేను మీకు రాయుచున్నాను, మీరు నా సొంత పిల్లలు వలే నేను మిమ్ములను ప్రేమించుచున్నాను, ఎందుకంటే యేసు మీ కోసం చేసిన దాని కారణంగా దేవుడు మీ పాపములను క్షమించాడు.

13 ఇతరులకన్నా ఎక్కువ కాలం విశ్వాసులుగా ఉన్న మీకు నేను రాయుచున్నాను. నేను మీకు వ్రాస్తున్నాను ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ సజీవంగా ఉన్న వ్యక్తి {యేసు}తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. కొత్త వారు అయితే దృఢమైన విశ్వాసులైన మీకు నేను రాయుచున్నాను, ఎందుకంటే సాతాను, ఆ దుష్టుడైన జీవి, సాతాను, తప్పు చెయ్యడానికి మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నించాడు, అయితే మీరు అతనిని విజయవంతంగా ఎదిరించారు. 14 నేను మీకు రాయుచున్నాను, మీరు నా సొంత పిల్లలు వలే నేను మిమ్ములను ప్రేమించుచున్నాను, ఎందుకంటే తండ్రి దేవునితో సన్నిహిత సంబంధం కలిగియున్నారు. ఇతరుల కంటే ఎక్కువకాలం విశ్వాసులుగా ఉన్న మీకు నేను రాయుచున్నాను. ఎందుకంటే ఎల్లప్పుడూ సజీవుడిగా వ్యక్తి {యేసు}తో సన్నిహిత సంబంధం మీరు కలిగి యున్నారు. కొత్త వారు అయితే దృఢమైన విశ్వాసులు మీకు నేను రాయుచున్నాను ఎందుకంటే ఎందుకంటే మీరు ఆత్మీయంగా బలవంతులు. నేను మీకు కూడా రాసాను ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించువాటికి మీరు విధేయత చూపించడం కొనసాగించుచున్నారు, మరియు ఎందుకంటే దుష్టుడైన జీవి{,} {సాతాను} మీరు తప్పు చెయ్యడానికి శోధించడానికి అతడు ప్రయత్నింఛినప్పుడు మీరు విజయవంతంగా ఎదిరించారు.

15 దేవుణ్ణి గౌరవించని మనుష్యుల వలే ఉండాలని ఆపేక్షించ వద్దు. వారు కలిగియుండడానికి కోరుకుంటున్న వస్తువులను ఆపేక్షించవద్దు. ఎవరైనా ఆ మనుష్యుల వలే ఉండాలని ఆపేక్షించిన యెడల అతడు తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించడం లేదు {అని అతడు నిరూపిస్తున్నాడు}. 16 {అటువంటి ఒక వ్యక్తి తండ్రియైన దేవుణ్ణి ప్రేమించడు అని నేను చెప్పుచున్నాను} ఎందుకంటే భక్తిహీనులు జీవించే విధానం మన తండ్రి అయిన దేవుడు మనకు జీవించమని బోధించే మార్గం కాదు. వారు తమ శారీరక కోరికలను తీర్చుకోవడానికి కోరుకుంటున్నారు. వారు చూసే వస్తువులను తాము పొందాలని కోరుకుంటున్నారు. వారు తమ వద్ద ఉన్న అన్ని వస్తువుల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఈ సంగతులు అన్నీ స్వార్థపూరితమైన మరియు భక్తిహీనమైన ఆలోచనా విధానం నుండి వచ్చాయి. 17 దేవుణ్ణి గౌరవించని మనుష్యులు వారు అపేక్షించే వస్తువులు అన్నిటితో పాటుగా కనుమరుగౌతారు. అయితే వారు చేయాలని దేవుడు తమను కోరుంటున్న వాటిని చేసే మనుష్యులు శాశ్వతంగా జీవిస్తారు! 18 మీరు నా స్వంత పిల్లల వలే నాకు చాలా ప్రియమైన వారు, { మీరు తెలుసుకోవడానికి నేను కోరుకుంటున్నాను} ఇది యేసు భూమికి తిరిగి రావడానికి ముందు సమయం. మెస్సీయాను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి వస్తున్నాడని మీరు ఇప్పటికే విన్నారు. నిజానికి, నిజమైన మెస్సీయకు వ్యతిరేకమైన అలాంటి చాలా మంది మనుష్యులు ఇప్పటికే ఇక్కడ ఉన్నాడు. ఈ కారణంగా అది ఆ సమయమని మనకు తెలుసు. 19 మన సమాజములలో నిలిచియుండడానికి ఈ మనుష్యులు నిరాకరిస్తున్నారు. అయితే, మొదటి స్థానంలో వారు నిజంగా ఎన్నటికీ మనతో చెందియుండలేదు. అన్నిటి కంటే, వారు మనతో చెందియుండిన యెడల వారు విడిచిపెట్టి యుండేవారు కారు. అయితే {వారు మనలను విడిచి పెట్టినప్పుడు} అప్పడు వారిలో ఏ ఒక్కరూ మనతో నిజానికి కలవలేదని మనం స్పష్టంగా చూసాము.

20 అయితే మీ విషయమైన, పరిశుద్దుడైన మెస్సీయ తన ఆత్మను మీకు ఇచ్చాడు. దాని ఫలితంగా మీరు అందరు {సత్యం} యెరుగుదురు. 21 మీరు సత్య సంగతులు యెరుగరు అని నేను ఈ లేఖ మీకు రాయడం లేదు {దేవుడు మనకు చెప్పిన} అయితే ఎందుకంటే మీరు వాటిని యెరుగుదురు. {దేవుడు మనకు చెప్పిన} సత్య సంగతులలో ఒకటి కాని ప్రతీ అబద్ధాన్ని గుర్తించి మరియు తిరస్కరించడానికి కూడా మీరు తగినంత యెరిగియున్నారు. 22 యేసు మెస్సీయ అని నిరాకరించు వారు మిక్కిలి చెడ్డవారైన అబద్దికులు. అది చేసే వారు అందరూ మెస్సీయకు వ్యతిరేకం. వారు తండ్రి దేవునిలో మరియు ఆయన కుమారుడు యేసును విశ్వసించడానికి నిరాకరిస్తున్నారు. 23 యేసు దేవుని కుమారుడు అని అంగీకరించడానికి నిరాకరించువారు ఏ విధంగానూ తండ్రి దేవునితో కలిసి ఉండరు. అయితే యేసు దేవుని కుమారుడు అని అంగీకరించే వారు కూడా తండ్రియైన దేవునితో జతకట్టబడ్డారు. 24 మీరు చేయవలసినది ఇక్కడ ఉంది{, యేసును తిరస్కరించే వారి వలే కాకుండా}. మీరు మొదట విన్న మెస్సీయ అయిన యేసు గురించిన సత్యాన్ని విశ్వసించడం మరియు జీవించడం కొనసాగించాలి. మీరు మొదట విన్న మెస్సీయ యేసు గురించిన సత్యాన్ని మీరు విశ్వసించడం మరియు జీవించడం చేత కొనసాగించిన యెడల, మీరు అప్పుడు కుమారుడు యేసు మరియు తండ్రి అయిన దేవునితో జీవాన్ని పంచుకోవడం కొనసాగిస్తారు. 25 మరియు, మనం శాశ్వతంగా జీవించడానికి ఆయన మనలను శక్తితో నింపును అని దేవుడు మనకు వాగ్దానం చేసాడు! 26 {యేసును గురించి} మిమ్ములను మోసం చేయడానికి కోరుకొను మనుష్యులను గురించి మిమ్మును హెచ్చరించడానికి నేను ఈ లేఖ రాయుచున్నాను.

27 {మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ మనుష్యుల గురించి} మీరు చెయ్యవలసినది ఇక్కడ ఉంది. యేసు నుండి మీరు పొందిన దేవుని ఆత్మ మీలో నివసించడానికి కొనసాగుతాడు. కాబట్టి మరొకరు మీకు బోధకులుగా ఉండనవసరం లేదు. మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం దేవుని ఆత్మ మీకు బోధిస్తాడు. ఆయన ఎల్లప్పుడూ సత్యాన్ని బోధిస్తాడు మరియు తప్పు అయినది ఏదీ ఎన్నడూ చెప్పడు కాబట్టి ఆయన మీకు బోధించిన మార్గంలో నివసించడానికి కొనసాగండి, మరియు యేసు జీవాన్ని పంచుకోడానికి కొనసాగండి.

28 ఇప్పుడు, నా ప్రియులారా, యేసుతో జీవాన్ని పంచుకోవడానికి కొనసాగించమని { నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను}. ఆ విధంగా, ఆయన తిరిగి వచ్చినప్పుడు, {ఆయన మనలను అంగీకరిస్తాడు అని} మనం ధైర్యంగా ఉంటాము. {మనం దానిని చేసిన యెడల,} ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడటానికి మనం సిగ్గుపడము. 29 దేవుడు ఎల్లప్పుడూ సరైనదే చేస్తాడని మీకు తెలుసు కాబట్టి, సరైనది చేయడం కొనసాగించే వారు అందరూ దేవుని ఆత్మీయ పిల్లలుగా మారారని మీకు తెలుసు.

Chapter 3

1 మన తండ్రి దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించండి! మనం తన పిల్లలము అని ఆయన చెపుతున్నాడు. ఆత్మీయ కోణంలో, ఇది పూర్తిగా నిజం. ఆ కారణంగా అవిశ్వాసులైన మనుష్యులు మనలను అర్థం చేసుకోరు. దేవుడు ఎవరో వారు అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణం{, పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తున్నట్లే మనం ఆయనను అనుసరిస్తాము}. 2 ప్రియమైన స్నేహితులారా, ప్రస్తుతం మనం దేవుని ఆత్మీయ పిల్లలం. మనం {భవిష్యత్తులో} ఎలా ఉంటామో ఆయన ఇంకా మనకు కనుపరచలేదు. {అయితే,} యేసు తిరిగి వచ్చినప్పుడు, మనం ఆయనకు వలే మార్పు చెందుతామని మనకు తెలుసు, ఎందుకంటే మనం ఆయనను నిజంగా ఉన్నట్లు వలే చూస్తాము. 3 కాబట్టి ధైర్యంగా యేసును ఆయన నిజంగా ఉన్న విధంగా చూడడానికి ఎదురుచూచువారు అందరు తమ్మును తాము పాపం నుండి విముక్తి చేసుకొంటారు, ఎందుకంటే యేసు స్వయంగా పాపం నుండి స్వేచ్చగా ఉన్నాడు. 4 అయితే పాపం చెయ్యడానికి కొనసాగుతున్న ప్రతి ఒక్కరు దేవుడు ధర్మ శాస్త్రానికి విధేయత చూపించడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే పాపం అంటే అదే, దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించడానికి నిరాకరించడం.

5 యేసు వచ్చాడు తద్వారా దేవుడు మన పాపాలను క్షమిస్తాడు అని మీరు ఎరుగుదురు. అంతేకాకుండా {మీకు తెలుసు} అంతేకాకుండా ఆయన తాను ఎన్నడూ పాపం చెయ్యలేదు {అని}. 6 యేసుతో జీవాన్ని పంచుకునే వారు పాపం చేయడం కొనసాగించరు. అయితే పాపం చేస్తూనే ఉన్న వారందరూ యేసు ఎవరో అర్థం చేసుకోలేదు మరియు వారికి నిజంగా ఆయన గురించి తెలియదు. 7 కాబట్టి నాకు అత్యంత ప్రియమైన వారు మిమ్ములను ఎవరూ {పాపం చెయ్యడానికి ఇది అంతా సరియైనది అని మీకు చెప్పడం చేత}మోసగించనియ్యకుండా ఉండాలని నేను మిమ్ములను బతిమాలుచున్నాను. మీరు సరైనది చెయ్యడం కొనసాగిస్తూ ఉన్న యెడల, ఎల్లప్పుడూ యేసు దేవుణ్ణి సంతోషపరచేదానిని చేసిన విధంగా అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది, 8 అయితే పాపం చెయ్యడానికి కొనసాగించే వారు ఎవరైనా సాతాను వలే ప్రవర్తిస్తున్నారు, ఎందుకంటే లోకం ప్రారంభమైనప్పటి నుండి సాతాను ఎప్పుడూ పాపం చేస్తూనే ఉన్నాడు, దేవుని కుమారుడు మానవుడిగా మారడానికి కారణం, సాతాను యొక్క ఈ కార్యాన్ని {మనుష్యులు నిరంతరం పాపం చేస్తూనే ఉండడం} రద్దు చేయడమే. 9 మనుష్యులు దేవుని ఆత్మీయ పిల్లలుగా మారిన యెడల పాపంచెయ్యడం కొనసాగించరు, ఎందుకంటే దేవుడు వారిని తనకు వలే ఉండడానికి చేసాడు. వారు నిరంతరం పాపం చేయలేరు, ఎందుకంటే వారు దేవుని ఆత్మీయ పిల్లలు. 10 దేవునికి చెందిన మనుష్యులు, సాతానుకు చెందిన మనుష్యులకు స్పష్టమైన రీతిలో భిన్నంగా ఉంటారు. సరైన దానిని చెయ్యని వారు దేవునికి చెంది యుండరు. తమ తోటి విశ్వాసులను ప్రేమించని వారు దేవునికి చెంది యుండరు.

11 {మీరు దీనిని గుర్తించాలి ఎందుకంటే} మీరు మొదట యేసులో విశ్వసించినప్పుడు మీరు వినిన సందేశం మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేదే. 12 {ఆదాము కుమారుడు} కయీను చేసిన విధంగా మనం ఇతరులను ద్వేషించకూడదు. అతడు ఆ దుష్ట జీవి {సాతాను}కు చెందినవాడు. కయీను అతని {చిన్న} సోదరుడు {హెబెలు}ని చంపాడు. అతడు దానిని ఎందుకు చేసాడో నేను మీకు చెపుతాను. దీనికి కారణం కయీను చెడు మార్గంలో ప్రవర్తించాడు మరియు {అతడు తన చిన్న సోదరుడిని ద్వేషించాడు ఎందుకంటే} అతని చిన్న సోదరుడు సరియైన మార్గంలో ప్రవర్తించాడు.

13 కాబట్టి నా తోటి విశ్వాసులారా, అవిశ్వాసులు మిమ్ములను ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్య పోవద్దు. 14 మనం మన తోటి విశ్వాసులను ప్రేమిస్తాం, మరియు దేవుడు మనలను ఆత్మీయంగా సజీవంగా మార్చాడని ఇది మనకు నిశ్చయతను ఇస్తుంది. అయితే ఎవరైనా {ఇతర విశ్వాసులను} ప్రేమించకపోయిన యెడల, ఇది అతని కోసం జరగలేదని ఇది చూపిస్తుంది. 15 తన తోటి విశ్వాసులను ద్వేషించే వ్యక్తి ఎవరైనా హత్య చేసినంత చెడ్డ పని చేస్తున్నాడు. మరియు మరొక వ్యక్తిని హత్య చేసే వ్యక్తి దేవుడు మనలను జీవించడానికి బలపరచే కొత్త మార్గంలో జీవించడం లేదని మీకు తెలుసు. 16 తన స్వీయ చిత్తము ప్రకారం మన కోసం చనిపోయిన యేసు యొక్క మాదిరి మనం కలిగియున్నాము. మన తోటి విశ్వాసులను నిజంగా ఏవిధంగా ప్రేమించాలో అది మనకు చూపించింది. మన భాగం కోసం, మన తోటి విశ్వాసుల కోసం, వారి కోసం చనిపోవడంతో సహా మనం చెయ్యాలి. 17 మనలో అనేకమందిమి ఈ లోకంలో జీవితం కోసం అవసరమైన వస్తువులు కలిగి ఉన్నాము. అయితే తోటి విశ్వాసి తనకు అవసరమైనవి లేకుండా ఉన్నాడని మనకు అవగాహన కలిగి యున్నాము అనుకొందాం. మరియు అతని కోసం సమకూర్చడానికి మనం నిరాకరించాం అనుకొందాం. అప్పుడు మనం {మనుష్యులను} ప్రేమించడానికి దేవుడు మనకు బోధించిన విధానంలో మనం ఆయనను ప్రేమించడం లేదు. 18 మీరు నా స్వంత పిల్లల వలే నాకు ప్రియమైన వారు, మనం {ఒకరినొకరు} ప్రేమిస్తున్నామని {కేవలం} చెప్పవద్దు. {ఒకరికొకరు} సహాయం చేయడం ద్వారా మనం {ఒకరినొకరు} మనం యథార్థంగా ప్రేమిద్దాం. 19 దానిని చెయ్యడం చేత, మనం దేవునికి చెంది యున్నాము అని మనం తెలుసుకోగలం, ఆయన సత్యంగా ఉన్న సమస్తము యొక్క ఆధారం. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం పాపముల యొక్క కారణంగా మనం దేవునికి చెందియుండలేదు అని మనం భావించవచ్చు. 20 అది జరిగినప్పుడు, మనం ఆయనకు నిజముగా చెందియున్నాము అని మనలను మనం తిరిగి నిశ్చయపరచుకోవచ్చు. ఇది ఎందుకంటే దేవుడు మన భావాల కంటే అధికంగా నమ్మదగినవాడు మరియు మన గురించి సమస్తము ఆయనకు తెలుసు {మనం ఆయనలో విశ్వాసం కలిగి యున్నాము అనేది కూడా}. 21 ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనలను {పాపం చేసినందుకు} ఖండించలేదని మనకు అనిపించినప్పుడు, అప్పుడు మనం దేవునికి ధైర్యంగా ప్రార్థించవచ్చు. 22 మనం దేవునికి ధైర్యంగా ప్రార్థించి మరియి దేని కోసమైనా అడిగినప్పుడు, ఆయన దానిని మనకు ఇస్తాడు అని మనం కనుగొంటాము. {మనం ధైర్యంగా ఇలా ప్రార్థిస్తాము} ఎందుకంటే {ఆయనకు చెందిన వ్యక్తులు వలే} మనం ఏమి చేయమని ఆయన ఆజ్ఞాపించిన దానిని మనం చేస్తాము మరియు ఆయనను సంతోషపరచే దానిని మనం చేస్తాము. 23 దేవుడు మనలను ఏమి చేయమని ఆజ్ఞాపించాడో నేను మీకు చెపుతాను. మెస్సీయ యేసు ఆయన కుమారుడు అని మనం విశ్వసించాలి. మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అవును, అలా చేయమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు.

24 దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసే మనుష్యులు దేవునితో జీవాన్ని పంచుకుంటారు మరియు దేవుడు వారితో జీవాన్ని పంచుకుంటాడు. దేవుడు మనతో జీవాన్ని పంచుకుంటున్నాడని మనం ఎలా నిశ్చయించుకోవాలో నేను మీకు చెప్పుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఆయన ఆత్మ మనకు ఉన్నాడు కాబట్టి మనం దాని గురించి నిశ్చయంగా ఉండగలం.

Chapter 4

1 ప్రియమైన స్నేహితులారా, తప్పుడు సందేశాన్ని కలిగి ఉన్న అనేకమైన మనుష్యులు ఉన్నారు మరియు వారు దానిని ఇతరులకు బోధిస్తూ తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి బోధకుడిని నమ్మవద్దు. బదులుగా, ప్రతి బోధకుడు చెప్పేదాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి మరియు అది దేవుని ఆత్మ నుండి వచ్చిందా లేదా మరొక ఆత్మ నుండి వచ్చినదా అని నిర్ణయించుకోండి. 2 ఎవరైనా దేవుని ఆత్మ నుండి వచ్చిన సత్యాన్ని బోధిస్తున్నయెడల {లేదా అతడు చెప్పని యెడల} అది ఏవిధంగా తెలుసుకోవాలో నేను మీకు చెపుతాను. మెస్సీయ యేసు దేవుని నుండి వచ్చాడు మరియు మన వలే మానవుడిగా మారాడని ధృవీకరించే వారు దేవుని నుండి వచ్చిన సందేశాన్ని బోధిస్తున్నారు. 3 అయితే యేసు {నిజమైన మానవుడు అయ్యాడు} (అని} ధృవీకరించని వారు దేవుని సందేశాన్ని బోధించదం లేదు. వారు మెస్సీయాను వ్యతిరేకించే బోధకులు. అటువంటి ఆ మనుష్యులు {మన మధ్యకు} వస్తున్నారని మీరు విన్నారు. ఇప్పుడు కూడా వారు ఇప్పటికే ఇక్కడ ఉన్నారు. 4 నాకు చాలా ప్రియమైనవారైన మీ విషయంలో, మీరు దేవునికి చెందినవారు, మరియు ఆ మనుష్యులు బోధించే వాటిని మీరు నమ్మడానికి నిరాకరించారు. దేవుణ్ణి గౌరవించని ప్రతి ఒక్కరినీ పురికొల్పే సాతాను కంటే దేవుడు, తాను కోరుకున్నది చేయడానికి మిమ్మల్ని అనుమతించేవాడు కాబట్టి మీరు ఇలా చేసారు. 5 అబద్దం అయిన దానిని బోధించే వారి విషయంలో, వారు చేయుచున్న వాటిని వారు ఆలోచిస్తారు ఎందుకంటే వారు దేవుణ్ణి ఘనపరచడానికి వారు నిరాకరిస్తారు. ఆ కారణంగా వారు చెప్పేది కూడా దేవుడిని ఘనపరచదు, మరియు ఆ కారణంగా దేవుణ్ణి ఘనపరచని ఇతర మనుష్యులు వారు చెప్పేదానిని నమ్ముతారు. 6 మన విషయంలో, దేవుడు మనలను పంపాడు. దేవునితో సంబంధంలో జీవించే వారు మనం బోధించే వాటిని విశ్వసిస్తారు మరియు విధేయత చూపిస్తాడు.. దేవునితో సంబంధంలో జీవించని వ్యక్తి మనం బోధించే వాటిని విశ్వసించడు లేదా విధేయత చూపించడు. దేవుని ఆత్మ నుండి నిజమైన సందేశాలను బోధించే మనుష్యులకు మరియు సాతాను నుండి తప్పుడు సందేశాలను బోధించే మనుష్యుల మధ్య తేడాను గుర్తించడానికి ఆ వ్యత్యాసం మనకు సహాయం చేస్తుంది. 7 ప్రియమైన స్నేహితులారా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దేవుడు మన కోసం కోరుకునేది ఇదే, మరియు ఆయన {మనలను} ప్రేమిస్తున్నందున మనం {ఇతరులను} ప్రేమించగలం. {తమ తోటి విశ్వాసులను} ప్రేమించే వారు దేవుని ఆత్మీయ పిల్లలుగా మారారు మరియు ఆయనతో సంబంధంలో జీవిస్తున్నారు. 8 దేవుని స్వవభావం {మనుష్యులను} ప్రేమించడం. కాబట్టి ఎవరైతే {ఇతరులను} ప్రేమించని వారు దేవునితో సంబంధం కలిగి ఉండరు. 9 దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని ఏవిధంగా కనుపరచాడో నేను మీకు చెపుతాను. ఆయన తన ఏకైక కుమారుడిని ఈ భూమి మీదకు పంపాడు, తద్వారా తన కుమారుడు మన కోసం చేసిన దాని కారణంగా మనం శాశ్వతంగా జీవించేలా మనలను బలపరచాడు. 10 {ఎవరినైనా} ప్రేమించడం అంటే ఏమిటో నేను మీకు చెపుతాను. దేవుణ్ణి ప్రేమించడానికి మన ప్రయత్నాలు {ఒకరిని} ప్రేమించడం అంటే అర్థం నిర్వచించవు. లేదు, దేవుడు తానే మనలను ఎంతో ప్రేమించడం చేత దానిని చేశాడు, మన స్థానంలో తనను తాను బలిగా అర్పించుకోవడానికి తన కుమారుడిని పంపాడు. యేసు దానిని చేసినప్పుడు, దేవుడు వారిని శిక్షించడానికి బదులు యేసు మీద విశ్వాసం ఉంచే మనుష్యుల యొక్క పాపాలను దేవుడు క్షమించగలడు, 11 ప్రియ స్నేహితులారా, దేవుడు మనలను ఆ విధంగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12 దేవుణ్ణి ఎవరూ చూడలేదు. అయినప్పటికీ, మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నప్పుడు, దేవుడు మనలో నివసిస్తున్నాడని మరియు మనం ఇతరులను ప్రేమించేలా ఆయనే మనల్ని ఉద్దేశించినట్లుగానే మనం చూడగలం. 13 ఈ విధంగా మనం దేవునితో జీవాన్ని పంచుకుంటున్నామని మరియు దేవుడు మనతో జీవాన్ని పంచుకుంటున్నాడని మనం ఖచ్చితంగా చెప్పగలం: ఆయన తన సొంత ఆత్మను మనకు ఇచ్చాడు. 14 అపొస్తలులమైన మేము దేవుని కుమారుడిని {భూమి మీద ఉన్న యేసు} చూశాము, మరియు లోకంలోని మనుష్యులను {వారి పాపాల కోసం శాశ్వతంగా శ్రమ పడడం నుండి} రక్షించడానికి తండ్రి ఆయనను పంపాడని మేము ఇతరులకు రూఢిగా చెపుతాము. 15 కాబట్టి దేవుడు యేసు గురించి సత్యం చెప్పే వారితో జీవాన్ని పంచుకోవడం కొనసాగిస్తున్నాడు. “ఆయన దేవుని యొక్క కుమారుడు” అని వారు చెపుతారు. మరియు కాబట్టి వారు దేవునితో జీవాన్ని పంచుకోవడం కొనసాగిస్తున్నారు. 16 దేవుడు మనలను ఏవిధంగా ప్రేమిస్తున్నాడో మనం అనుభవించాము మరియు ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడని మనల్ని ప్రేమిస్తున్నాడని మనం విశ్వసిస్తున్నాము. ఎందుకంటే దేవుని స్వభావం మనుష్యులను ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం కొనసాగించే వారు దేవునితో జీవాన్ని పంచుకుంటారు మరియు దేవుడు వారితో జీవాన్ని పంచుకుంటాడు. 17 మనం దేవునితో జీవాన్ని పంచుకోవడం కొనసాగించినప్పుడు, అప్పుడు దేవుడు మనలను ప్రేమించడంలో తన ఉద్దేశ్యాన్ని సాధించాడు. దాని ఫలితంగా దేవుడు మనల్ని తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు, {ఆయన మనలను శిక్షించడు} అనే ధైర్యంతో ఉంటాము. దీనికి కారణం యేసు చేసిన విధంగా ఈ లోకంలో {మనం జీవిస్తూ ఉండగా ఇతరులను ప్రేమిస్తున్నాము}. 18 మనం నిజముగా ఆయనను ప్రేమించిన యెడల {దేవుని విషయంలో} మనం భయపడము, ఎందుకంటే {దేవుణ్ణి} సంపూర్ణంగా ప్రేమించే వారు {ఆయన విషయంలో} భయపడలేరు. ఆయన మనలను శిక్షిస్తాడు అని మనం తలంచిన యెడల మాత్రమే మనం భయపడతాం. కాబట్టి {దేవునికి} భయపడే వారు ఆయన తమను ఎంతగా ప్రేమిస్తున్నాడో పూర్తిగా అర్థం చేసుకోలేదు మరియు వారు {దేవుని} పూర్తిగా ప్రేమించడం లేదు. 19 {దేవుణ్ణి మరియు మన తోటి విశ్వాసులను} మనం ప్రేమిస్తున్నాము ఎందుకంటే దేవుడు మనలను మొదట ప్రేమించాడు. 20 మనుష్యులు తాము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి అయితే వారు తోటి విశ్వాసిని కూడా ద్వేషించిన యెడల వారు అబద్దం చెపుతున్నారు. అన్నిటికంటే మనం మన తోటి విశ్వాసులను చూడగలం. అయితే మనం దేవుడిని చూడలేదు. కాబట్టి తమ తోటి విశ్వాసులలో ఒకరిని ప్రేమించని వారు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించలేరు, {ఎందుకంటే మీరు చూడలేని వ్యక్తి కంటే మీరు చూడగలిగే వారిని ప్రేమించడం చాలా సులభం}. 21 దేవుడు మనకు ఆజ్ఞాపించినది ఇదే అని జ్ఞాపకం ఉంచుకోండి: మనం ఆయనను ప్రేమించిన యెడల, మన తోటి విశ్వాసులను కూడా తప్పనిసరిగా ప్రేమించాలి.

Chapter 5

1 యేసు మెస్సీయ అని విశ్వసించే వారు అందరూ ఆత్మీయంగా దేవుని పిల్లలు. ఇప్పుడు, ఎవరైతే తండ్రి అయిన వానిని ప్రేమిస్తారో {ఖచ్చితంగా} తన బిడ్డను కూడా ప్రేమిస్తాడు. { కాబట్టి మనం యేసును విశ్వసించిన యెడల, అప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తాము, మరియు కాబట్టి మనం మన తోటి విశ్వాసులను కూడా ప్రేమిస్తాము.} 2 మనం దేవుణ్ణి ప్రేమించి మరియు చెయ్యడానికి ఆయన మనకు ఆజ్ఞాపించిన దానిని చేసినప్పుడు యేసే మెస్సీయ అని విశ్వసించు ఇతరులను మనం నిజంగా ప్రేమిస్తున్నాము అని మనం ఖచ్చితంగా ఉండగలం. 3 నేను దీనిని చెపుతున్నాను ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మనకు ఆజ్ఞాపించిన దానిని మనం చేస్తున్నాము. మరియు ఆయన ఆజ్ఞాపించిన దానికి చెయ్యడానికి ఇది కష్టం కాదు. 4 దేవుడు ఆజ్ఞాపించినట్లు చేయడం మనకు కష్టంగా ఉండకపోవడానికి కారణం ఇక్కడ ఉంది. దేవుని ఆత్మీయ పిల్లలుగా మారిన మనమందరం అవిశ్వాసులు మనం ఏమి చేయాలని కోరుకొంటున్నారో దానిని చేయడానికి నిరాకరించగలిగాము. దేవునికి వ్యతిరేకమైన ప్రతిదానికంటే మనం బలంగా ఉండటానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మనం యేసును విశ్వసిస్తున్నాము. 5 దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతీదాని కంటే బలవంతులైన మీకు నేను చెపుతున్నాను. ఇది యేసు దేవుని యొక్క కుమారుడు అని విశ్వసించే ఎవరైనా.

6 మెస్సీయ యేసు {దేవుని నుండి భూమికి} వచ్చినవాడు, {తన బాప్తిస్మము యొక్క} నీళ్ళు మరియు {} {సిలువ మీద ఆయన మరణం యొక్క} రక్తము రెండింటినీ అనుభవించాడు. నీళ్లలో { యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు } మాత్రమే కాదు, అయితే { అయన చనిపోయినప్పుడు } కూడా యేసు రక్తం ఆయన శరీరం నుండి ప్రవహించినప్పుడు దేవుడు తాను యేసును నిజంగా పంపినట్లు చూపించాడు. మరియు దేవుని ఆత్మ {యేసు మెస్సీయ ఈ కార్యాలను చేశాడని యదార్ధంగా } ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ సత్యమే చెపుతాడు. 7 కాబట్టి మనం {యేసు దేవుని నుండి వచ్చిన మెస్సీయ అని} తెలుసుకోవడానికి మూడు మార్గాలు ఉన్నాయి. 8 {ఆ మూడు మార్గాలు:} దేవుని ఆత్మ మనకు ఏమి చెపుతున్నాడు, {యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు} నీళ్ళలో ఏమి జరిగింది, మరియు {యేసు యొక్క} రక్తం {ఆయన సిలువ మీద మరణించినప్పుడు} ఆయన శరీరం నుండి ప్రవహించినప్పుడు ఏమి జరిగింది. ఈ మూడు విషయాలన్నీ మనకు ఒకే సంగతిని చెపుతున్నాయి{, యేసు దేవుని నుండి వచ్చాడు అని}. 9 మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనుష్యులు మనకు చెప్పేదాని మీద ఆధారపడతాము. అయితే దేవుడు మనకు చెప్పేదాని మీద మనం ఖచ్చితంగా చాలా ఎక్కువగా ఆధారపడవచ్చు. కాబట్టి దేవుడు తన కుమారుడు ఎవరో మనకు చెప్పిన దానిని నేను మీకు చెపుతాను. 10 {అయితే, మొదటగా, నన్ను చెప్పనివ్వండి} దేవుని యొక్క కుమారునిలో విశ్వాసముంచిన వారికి దేవుడు ఆయన గురించి చెప్పినది సత్యం అని ముందే తెలుసు. అయితే దేవుడు చెప్పినది నమ్మని వారు ఆయనను అబద్ధికుడు అని పిలుస్తున్నారు, ఎందుకంటే దేవుడు తన కుమారుని గురించి సాక్ష్యమిచ్చిన దానిని నమ్మడానికి వారు నిరాకరించారు. 11 ఇప్పుడు దేవుడు మనతో {తన కుమారుడెవరో దాని గురించి} ఇది చెప్పాడు: “నేను నీకు నిత్యజీవము ఇచ్చాను, మరియు నా కుమారుడే ఈ జీవితాన్ని సాధ్యం చేస్తాడు.” 12 దేవుని కుమారుడు {యేసు}తో జీవాన్ని పంచుకునే వారు {దేవునితో} శాశ్వతంగా జీవించడం ప్రారంభించారు. దేవుని కుమారునితో జీవాన్ని పంచుకోని వారు శాశ్వతంగా జీవించడం ప్రారంభించలేదు. 13 ఎందుకంటే మీరు శాశ్వతంగా జీవిస్తారని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను, నేను మీకు ఈ లేఖ రాశాను. ఇది యేసు దేవుని కుమారుడు అని విశ్వసించే మీకోసం. 14 ఆయన కోరుచున్న దాని కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఆయన నుండి అడిగిన దానిని దేవుడు చెయ్యడానికి కోరుతున్నాడు అని మనం చాలా ధైర్యంగా ఉండగలమని కూడా మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. 15 మనం ఏది అడిగినా దేవుడు మనకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అని మనకు తెలుసు కాబట్టి, {ఆయన కోరుకున్న యెడల}, అప్పుడు మనం కోరినది దేవుడు మనకు ఇప్పటికే ఇస్తున్నాడని కూడా మనకు తెలుసు. 16 ఉదాహరణకు, తన తోటి విశ్వాసులలో ఒకరు తనను దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయని విధంగా పాపం చేయడం ఎవరైనా చూశారనుకుందాం. అప్పుడు అతడు {పాపం చేస్తున్న వ్యక్తిని పునరుద్ధరించమని దేవుణ్ణి} అడగాలి. అతడు దానిని చేసిన యెడల అప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని తిరిగి తనతో ఆధ్యాత్మిక జీవితంలోనికి తీసుకువస్తాడు. అయితే, దేవుని నుండి తమను శాశ్వతంగా వేరు చేయని విధంగా పాపం చేస్తున్న మనుష్యులను గురించి మాత్రమే నేను చెప్పుచున్నాను. మనుష్యులను దేవుని నుండి శాశ్వతంగా వేరు చేసే పాపం ఉంది. ఆ విధంగా పాపం చేస్తున్న వారి కోసం మీరు ప్రార్థించాలని నేను చెప్పడం లేదు. 17 మనుష్యులు చేసే ప్రతి తప్పు {దేవునికి వ్యతిరేకంగా} పాపమే, అయితే కొన్ని పాపాలు ఒక వ్యక్తిని దేవుని నుండి శాశ్వతంగా వేరు చేయవు. 18 దేవుని ఆత్మీయ కుమారుడు లేదా కుమార్తెగా మారిన ప్రతి ఒక్కరూ నిరంతరం పాపం చేయరని మనకు తెలుసు. బదులుగా, దేవుని యొక్క కుమారుడు ఆ వ్యక్తిని రక్షిస్తాడు, తద్వారా సాతాను, ఆ దుష్టుడు అతనికి హాని కలిగించడు. 19 మనం దేవునికి చెందినవారమని మనకు తెలుసు. సాతాను, ఆ దుష్ట జీవి, అవిశ్వాసులు అయిన మనుష్యులు అందరిని నియంత్రిస్తున్నాడని కూడా మనకు తెలుసు. 20 దేవుని యొక్క కుమారుడు మన మధ్యకు వచ్చాడు మరియు {ఏది నిజమో} అర్థం చేసుకోవడానికి సాధ్యపరచాడు అని కూడా మనకు తెలుసు. ఆయన దీనిని చేసాడు తద్వారా మనం యదార్ధమైన దేవుణ్ణి నిజంగా తెలుసుకొంటాము. మరియు మనము యదార్ధమైన దేవునితో, {అంటే,} ఆయన కుమారుడు మెస్సీయ యేసుతో జీవాన్ని పంచుకుంటున్నాము. యేసు నిజంగా దేవుడు, మరియు ఆయనే మనకు {ఈ కొత్త,} నిత్యజీవాన్ని ఇచ్చేవాడు. 21 మీరు నా స్వంత పిల్లలు వలే నాకు చాలా ప్రియమైన మీతో నేను ఇది చెపుతున్నాను: "అబద్ధ దేవుడు అయిన దేనికీ మిమ్మల్ని మీరు అప్పగించుకోకుండా జాగ్రత్తపడండి."