తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

మార్కు రాసిన సువార్త

Chapter 1

1 ఇది దేవుని కుమారుడైన మెస్సీయ యేసు గురించిన శుభవార్త ప్రారంభం. దేవుని కుమారుడు ఎవరు. 2 యెషయా ప్రవక్త చెప్పిన విధముగా ఇది జరుగుతుంది అని అతడు చాలా కాలం క్రితం ఈ శుభ వార్త ఆరంభం అయ్యింది, “చూడు, నేను నా సందేశకుడుని నీకు ముందుగా పంపుచున్నాను. నీవు వచ్చినప్పటి కోసం ఆయన మనుష్యులను సిద్ధం చేస్తాడు. 3 అతడు నిర్జన ప్రదేశంలో బయటికి తన మాట వినేవారు ఎవరినైనా పిలిచే స్వరంగా ఉంటాడు, చెప్పుచున్నాడు, ప్రభువును స్వాగతించడానికి మిమ్ములను మీరు సిద్ధం చేసుకోండి. ఆయన రాకడ కోసం ప్రతిదానిని సిద్ధచరచండి.” 4 యెషయా వ్రాసిన సందేశకుడు యోహాను. మనుష్యులు అతనిని పిలిచారు "బాప్తిస్మం ఇచ్చువాడు." యోహాను యొర్దాను నదికి సమీపంలోని నిర్జన ప్రాంతంలో ఉన్నాడు. అతడు మనుష్యులకు బాప్తిస్మం ఇస్తున్నాడు మరియు వారు పశ్చాత్తాపపడిన యెడల, అప్పుడు అతడు వారికి బాప్తిస్మం ఇస్తాడు మరియు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు అని వారికి ప్రకటించుచున్నాడు. 5 యోహాను మాట వినడానికి యూదయ ప్రాంతం, మరియు యెరూషలేం నగరం నుండి గొప్ప సంఖ్యలో మనుష్యులు అరణ్యానికి వెళ్ళారు. అతని మాటలు విన్న వారిలో అనేకులు తాము పాపం చేసాము అని అంగీకరించారు. అప్పుడు యోహాను వారికి యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. 6 యోహాను ఒంటె యొక్క వెంట్రుకలతో చెయ్యబడిన దుస్తులు ధరించాడు మరియు తన నడుము చుట్టూ ఒక తోలు దట్టీ ధరించాడు. అతడు ఆ నిర్జన ప్రాంతంలో దొరికిన మిడుతలను మరియు తేనెను తిన్నాడు. 7 అతడు బోధిస్తున్నాడు, “చాలా త్వరలో ఒకడు వస్తాడు ఆయన చాలా గొప్పవాడు. ఆయనతో పోల్చినప్పుడు నేను ఏమీ కాదు. నేను కిందకు వంగి మరియు ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాదు. 8 నేను మీకు నీళ్ళతో మీకు బాప్తిస్మం ఇచ్చాను, అయితే ఆయన మీకు పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు.” 9 యోహాను బోధిస్తున్నప్పుడు ఆ సమయంలో, యేసు గలిలయ ప్రాంతంలోని ఒక పట్టణం, నజరేతు నుండి వచ్చాడు. ఆయన యోహాను బోధిస్తున్న చోటికి వెళ్ళాడు, మరియు యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చాడు. 10 యేసు నీళ్ళలో నుండి బయటకు వస్తున్నప్పుడు, ఆకాశం తెరుచుకోవడం, మరియు దేవుని యొక్క ఆత్మ ఆయన మీదికి దిగడం అతను చూసాడు. దేవుని ఆత్మ ఒక పావురం వలె పరలోకం నుండి దిగి వచ్చాడు. 11 అప్పుడు దేవుడు పరలోకం నుండి మాట్లాడాడు మరియు చెప్పాడు, “నీవు నా కుమారుడవు, నేను ప్రియముగా ప్రేమించు వాడవు. నేను నీతో చాలా సంతోషిస్తున్నాను. ” 12 అప్పుడు దేవుని యొక్క ఆత్మ యేసును బయట నిర్జన ప్రదేశము లోనికి పంపాడు. 13 యేసు 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. ఆ సమయంలో, సాతాను ఆయనను శోధిస్తున్నాడు. ఆ స్థలంలో క్రూర జంతువులు ఉన్నాయి, మరియు దేవదూతలు ఆయనను గురించి జాగ్రత్త తీసుకుంటున్నారు. 14 తరువాత, అధిపతియైన హేరోదు అంతిపా, బాప్తిస్మమిచ్చు యోహానును చెరసాలలో వేసిన తరువాత, యేసు గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన గలిలయలో దేవుని యొక్క శుభ వార్తను ప్రకటిస్తున్నాడు. 15 ఆయన ఈ సందేశాన్ని బోధించాడు: “{దేవుడు దీని కోసం నిర్ణయించిన} ఆ సమయం {చివరికి} వచ్చింది. దేవుడు ఇప్పుడు మీరు తన రాజ్యంలో భాగం అయ్యేలా చేస్తున్నాడు. మీ పాపపు జీవన విధానాన్ని పూర్తి చేయండి. ఈ శుభవార్తను నమ్మండి.” 16 ఒక రోజు యేసు గలిలయ సముద్ర తీరం వెంబడి నడుచుకుంటూ వెళుచుండగా, సీమోను మరియు సీమోను యొక్క సహోదరుడు అంద్రెయ అనే ఇద్దరు మనుష్యులను చూసాడు. వారు చేపలు పట్టుటకు తమ చేపలుపట్టే వలను సముద్రం లోనికి వేస్తున్నారు. చేపలు పట్టడం మరియు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించారు. 17 అప్పుడు యేసు వారితో చెప్పాడు, “మీరు చేపలు సేకరిస్తున్న విధముగా, నాతో రండి, మరియు నా శిష్యులుగా ఉండేందుకు మనుష్యులను ఎలా సమకూర్చలో నేను మీకు నేర్పుతాను.” 18 తరువాత యేసు ఇది చెప్పిన వెంటనే వాళ్ళు పని చేయడం ఆపివేసారు, మరియు ఆయనతో వెళ్ళారు. 19 వారు ఒక కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత, యేసు మరో ఇద్దరు మనుష్యులను చూసాడు, యాకోబు మరియు యాకోబు యొక్క సహోదరుడు యోహాను. వారు జెబెదయి అను పేరుగల ఒక మనుష్యుని కుమారులు. వారందరూ పడవలో తమ చేపల వలలను బాగుచేసుకుంటున్నారు. 20 యేసు వారిని చూసిన వెంటనే, ఆయన తనతో రమ్మని వారికి చెప్పాడు. కాబట్టి వారు తమ తండ్రి జెబెదయిని అతని సేవకులతో పడవలో విడిచిపెట్టారు, మరియు వారు యేసుతో కలిసి వెళ్ళిపోయారు. 21 యేసు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులతో కలిసి సమీపంలోని కపెర్నహూము యొక్క పట్టణానికి వెళ్ళాడు. అక్కడ, యేసు విశ్రాంతి దినమున యూదుల సమావేశ స్థలంలో బోధించడం ప్రారంభించాడు. 22 వింటున్నవారు ఆయన బోధించే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన తనకు తెలిసినదాని మీద ఆధారపడే ఒక బోధకుడి వలె బోధించాడు. ఆయన యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించిన వారి వలె బోధించ లేదు, ఇతర మనుష్యులు బోధించిన విభిన్న విషయాలను పునరావృతం చేసాడు. 23 యూదుల బోధించే స్థలంలో యేసు బోధించాడు, ఒక దురాత్మ చేత నియంత్రించబడిన ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడు. దురాత్మాతో ఉన్న మనుష్యుడు అరవడం ప్రారంభించాడు, 24 “ఓ! నజరేతు నుండి యేసూ! దుష్ట ఆత్మలైన మాకు నీతో చేసేది ఏమీ లేదు! మమ్ములను నాశనం చేయడానికి వచ్చావా? నీవు ఎవరివో నాకు తెలుసు. నీవు దేవుని నుండి వచ్చిన పరిశుద్ధుడవు!” 25 యేసు ఆ దుష్ట ఆత్మను గద్దించాడు, చెప్పుచున్నాడు “నిశ్శబ్దంగా ఉండు మరియు ఆ మనుష్యుని నుండి బయటికి రా!” 26 దుష్ట ఆత్మ ఆ మనుష్యుని హింసాత్మకంగా కదిలించింది. అది బిగ్గరగా అరిచింది, మరియు అప్పుడు అది ఆ మనుష్యుని నుండి బయటకు వచ్చింది మరియు వెళ్ళిపోయింది. 27 సమాజ మందిరంలో ఉన్న మనుష్యులు అందరు ఆశ్చర్యపోయారు. ఫలితంగా, వారు తమలో తాము చర్చించుకున్నారు, చెప్పుచున్నారు, “ఇది మేము ఇంతకు ముందెన్నడూ చూడని విషయం! ఆయన కొత్త మరియు అధికారిక విధముగా బోధించడమే కాకుండా, అయితే ఆయన దుష్ట ఆత్మలకు కూడా ఆజ్ఞాపించాడు మరియు అవి ఆయనకు లోబడినాయి! 28 యేసు చేసిన పనిని గలిలయ ప్రాంతమంతటా మనుష్యులు అనేక ఇతరులకు చాలా త్వరగా చెప్పారు. 29 వారు యూదుల బోధించే స్థలం నుండి బయలుదేరిన తరువాత, యేసు, సీమోను మరియు అంద్రెయ, యాకోబు మరియు యోహానులతో కలిసి నేరుగా సీమోను మరియు అంద్రెయ ఇంటికి వెళ్ళెను . 30 సీమోను యొక్క అత్త మంచం మీద పడుకుని ఉంది ఎందుకంటే ఆమె అనారోగ్యంగా ఉంది. ఆమెకు జ్వరం వచ్చింది. ఆమె అనారోగ్యంతో ఉండటం గురించి వెంటనే ఒకరు యేసుకు చెప్పారు. 31 యేసు ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమె చెయ్యి పట్టుకున్నాడు, మరియు పైకి లేవడానికి సహాయం చేసాడు. ఆమె వెంటనే జ్వరం నుండి కోలుకుంది మరియు వారికి సేవ చేయడం ప్రారంభించింది. 32 ఆ సాయంత్రం, సూర్యుడు అస్తమించిన తరువాత, పరిసర ప్రాంతం నుండి మనుష్యులు అనేకమంది అనారోగ్యంతో ఉన్నవారిని మరియు దుష్ట ఆత్మల నియంత్రణలో ఉన్న వారిని యేసు దగ్గరకు తీసుకొచ్చారు. 33 పట్టణంలో నివసించే వారంతా సీమోను ఇంటి ద్వారం దగ్గర గుమి కూడినట్టుగా అనిపించింది. 34 వివిధ వ్యాధులతో అనారోగ్యంతో ఉన్న అనేక మంది మనుష్యులను యేసు స్వస్థపరిచాడు. ఆయన అనేక దుష్ట ఆత్మలను కుడా మనుష్యుల నుండి బయటకు వచ్చేలా బలవంతం చేసాడు. దుష్ట ఆత్మలు తన గురించి మనుష్యులకు చెప్పడానికి ఆయన అనుమతించలేదు, ఎందుకంటే ఆయన దేవుని నుండి వచ్చిన పరిశుద్దుడు అని వాటికి తెలుసు. 35 మరుసటి ఉదయం పెందలకడనే ఇంకా చీకటి ఉండగానే యేసు లేచాడు. ఆయన ఇల్లు విడిచిపెట్టాడు మరియు పట్టణం నుండి మనుష్యులు లేని ఒక ప్రదేశానికి వెళ్ళాడు. అప్పుడు ఆయన ప్రార్థించాడు. 36 సీమోను మరియు అతని సహచరులు ఆయన కోసం వెదకారు. 37 వారు ఆయనను కనుగొనినప్పుడు వారు చెప్పారు, “పట్టణంలో ప్రతి ఒక్కరు నీ కోసం వెదకుచున్నారు.” 38 యేసు వారితో చెప్పాడు, “మనము ఈ ప్రాంతంలోని ఇతర పట్టణాలకు వెళ్ళాలి తద్వారా నేను అక్కడ కూడా బోధించగలను. నేను ఇక్కడికి వచ్చాను కారణం ఇదే.” 39 కాబట్టి వారు గలిలయ ప్రాంతం అంతట వెళ్ళారు. వారు వెళ్ళియుండగా, యేసు యూదుల బోధించే ప్రదేశాలలో బోధించేవాడు మరియు మనుష్యుల నుండి దుష్ట ఆత్మలు బయటకు వచ్చేలా బలవంతం చేసేవాడు. 40 ఒక రోజు కుష్ఠువ్యాధి అని పిలువబడే ఒక చెడ్డ చర్మవ్యాధి ఉన్న ఒక మనుష్యుడు యేసు వద్దకు వచ్చాడు. అతడు యేసు ముందు మోకాళ్లూనాడు మరియు ఆయనను వేడుకున్నాడు, చెప్పాడు “దయచేసి నన్ను శుద్దునిగా చేయండి, ఎందుకంటే నీ చిత్తమైన యెడల నీవు నన్ను శుద్దునిగా చేయగలవు!” 41 యేసు అతనిపట్ల కనికరం కలిగింది. ఆయన తన చేయి చాచాడు మరియు ఆ వ్యక్తిని తాకాడు. అప్పుడు ఆయన అతనితో చెప్పాడు, “నిన్ను స్వస్థపరచడం నా చిత్తం, కాబట్టి స్వస్థత పొందు!” 42 వెంటనే ఆ మనుష్యుడు స్వస్థపరచబడ్డాడు! అతడు ఇకమీదట ఒక కుష్ఠురోగి కాదు! 43 యేసు ఆ మనుష్యుని పంపివేయుచుండగా అతనికి ఒక హెచ్చరిక ఇచ్చాడు, 44 చెప్పాడు: “ఇప్పుడు జరిగినదానిని ఎవరికీ చెప్ప వద్దు. బదులుగా, ఒక యాజకుని వద్దకు వెళ్ళు మరియు అతనికి నిన్నునీవు కనబరచుకొనుము, తద్వారా అతడు నిన్ను పరీక్షిస్తాడు మరియు నీకు ఇక కుష్టు వ్యాధి లేదు అని చూస్తాడు. అప్పుడు దేవుడు కుష్ఠువ్యాధి నుండి స్వస్థపరిచిన మనుష్యుల కోసం మోషే ఆజ్ఞాపించిన కానుకను సమర్పించుము. నీకు ఇక మీదట కుష్టువ్యాధి లేదు అని సమాజానికి ఇది సాక్ష్యముగా ఉంటుంది.” 45 ఆ మనుష్యుడు యేసు యొక్క ఆదేశమును అనుసరించ లేదు. యేసు తనను ఎలా స్వస్థపరిచాడో అనేక మంది మనుష్యులకు అతడు చెప్పడం ప్రారంభించాడు. దాని ఫలితంగా, యేసు ఇక మీదట బహిరంగంగా పట్టణాలలోనికి ప్రవేశించలేకపోయాడు, ఎందుకంటే మనుష్యుల యొక్క గుంపులు ఆయనను చుట్టుముడతారు. బదులుగా, ఆయన పట్టణాల వెలుపల ఎవరూ నివసించని ప్రదేశాలలో ఉండిపోయాడు. అయితే ఆ ప్రాంతం అంతట నలుమూలల నుండి మనుష్యులు ఆయన వద్దకు వస్తూనే ఉన్నారు.

Chapter 2

1 కొన్ని దినములు గడిచిన తరువాత, యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. యేసు తిరిగి వచ్చాడు అని మరియు ఒక నిర్దిష్టమైన ఇంట్లో ఉన్నాడు అని మనుష్యులు త్వరగా ఇతరులకు వార్తలను వ్యాప్తి చేసారు. 2 వెంటనే చాలా మంది మనుష్యులు యేసు ఉంటున్న చోటికి కూడుకున్నారు. సంఖ్య చాలా ఎక్కువగా ఉంది కనుక ఇల్లు నిండిపోయింది. ఇక నిలబడటానికి స్థలం లేదు, ద్వారము చుట్టూ కూడా లేదు. యేసు వారికి దేవుని యొక్క సందేశాన్ని చెప్పాడు. 3 కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని యేసు వద్దకు తీసుకుని ఇంటికి వచ్చారు. నలుగురు మనుష్యులు అతనిని పరుపు మీద తీసుకువెళ్ళారు. 4 గుమిగూడిన సమూహం కారణంగా ఆ మనుష్యుని యేసు దగ్గరకు తీసుకొని రాలేక పోయారు. కాబట్టి, వారు ఇంటి పైకప్పు మీదకు వెళ్ళారు మరియు యేసు మీద ఉన్న పైకప్పుకు పెద్ద రంధ్రం చేసారు. వారు పక్షవాయువు గల మనుష్యుడు పరుపును పెద్ద రంధ్రం ద్వారా యేసు ముందు కిందకు దించారు. 5 తాను ఈ మనుష్యుని స్వస్థపరచగలను అని ఆ మనుష్యులు విశ్వసించారు అని యేసు గ్రహించిన తరువాత, ఆయన పక్షవాయువుగల మనుష్యునితో చెప్పాడు, “నా బిడ్డా, నేను నీ పాపములను క్షమించాను!” 6 అక్కడ యూదుల ధర్మశాస్త్రం బోధించే కొందరు మనుష్యులు కూర్చుని ఉన్నారు. వారు తమలో తాము ఆలోచించుకోవడం మొదలుపెట్టారు, 7 ఆ విధముగా మాట్లాడుచున్న ఈ మనుష్యుడు ఎవరని అనుకుంటున్నాడు? అది చెప్పడం చేత ఆయన దేవుని అవమానిస్తాడు! ఏ వ్యక్తి పాపములను క్షమించలేడు-దేవుడు మాత్రమే చేయగలడు! 8 వెంటనే, వారు ఏమి ఆలోచిస్తున్నారో యేసు తనలో తాను తెలుసుకొన్నాడు. ఆయన వారితో చెప్పాడు, “నేను పాపములను క్షమించే అధికారము నాకు లేదు అని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? 9 పక్షవాయువుగల మనుష్యునితో ఏది చెప్పడం నాకు సులభముగా ఉంటుంది, ‘నేను నీ పాపములను క్షమించాను’ లేదా ‘లేచి నిలబడు! నీ పరుపు తీసుకొని మరియు నడువు’? 10 దేవుడు మనుష్యుని యొక్క కుమారునికి భూమి మీద పాపములను క్షమించే అధికారం ఇచ్చాడు అని నేను మీకు కనుపరుస్తాను.” అప్పుడు ఆయన పక్షవాయువుగల మనుష్యునితో, 11 “పైకి లేచి నిలబడు! నీ పరుపు తీసుకొనుము మరియు ఇంటికి వెళ్ళుము!” 12 ఆ మనుష్యుడు వెంటనే లేచి నిలబడ్డాడు. అతడు పరుపును తీసుకున్నాడు, మరియు అక్కడ ఉన్న మనుష్యులు అందరు చూస్తుండగా అతడు ఇంటి నుండి బయటికి నడిచాడు. వారు అందరు ఆశ్చర్యపోయారు, మరియు వారు దేవుని స్తుతించారు మరియు చెప్పారు, “ఇప్పుడు జరిగిన విధముగా మేము ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు!” 13 యేసు కపెర్నహూము పట్టణం విడిచిపెట్టాడు మరియు తిరిగి గలిలయ సముద్రం తీరము వెంబడి నడిచాడు. ఒక పెద్ద సమూహం ఆయన వద్దకు వచ్చారు, ఆయన వారికి బోధించాడు. 14 ఆయన నడుచుచుండగా, లేవీ అను పేరుగల ఒక మనుష్యుని చూసాడు, అతని తండ్రి యొక్క పేరు అల్ఫయి. అతడు తన పని ప్రదేశంలో కూర్చున్నాడు, అక్కడ అతడు పన్నులు వసూలు చేసాడు. యేసు అతనితో చెప్పాడు, “నాతో వచ్చి మరియు నా శిష్యుడిగా ఉండు” అతడు లేచాడు మరియు యేసుతో వెళ్ళాడు. 15 తరువాత, యేసు లేవీ యొక్క ఇంట్లో భోజనం చేస్తున్నాడు. పన్నులు వసూలు చేసిన అనేకమంది మనుష్యులు—మరియు మత నాయకులు పాపులుగా భావించే ఇతరులు—యేసు మరియు ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఈ విధముగా అనేక మంది మనుష్యులు యేసుతో పాటు ప్రతి చోటకు వెళ్ళుచున్నారు. 16 యూదుల చట్టాలను బోధించే, పరిసయ్య వర్గానికి చెందిన వ్యక్తులు యేసు పాపులతో, పన్నులు వసూలు చేసే మనుష్యులతో కలిసి భోజనం చేయడం చూశారు. మరియు వారు యేసు శిష్యులను అడిగారు, “ఆయన పాపులతో మరియు పన్నులు వసూలు చేసే మనుష్యులతో కలిసి ఎందుకు తినుచున్నాడు మరియు త్రాగుచున్నాడు?” 17 యేసు వారు అడుగుతున్నది వినిన తరువాత, యూదుల ధర్మశాస్త్రాలను బోధించే వారితో చెప్పాడు: “ఆరోగ్యముగల మనుష్యులకు వైద్యుడు అవసరం లేదు. దీనికి విరుద్ధంగా, అనారోగ్యంతో ఉన్నవారికి వైద్యుడు అవసరం. నీతిమంతులని భావించేవారిని నా వద్దకు రమ్మని ఆహ్వానించడానికి నేను రాలేదు, అయితే తాము పాపం చేసాము అని తెలుసుకున్న వారిని నా వద్దకు రమ్మని ఆహ్వానించాను.” 18 ఇప్పుడు ఈ సమయంలో, బాప్తిస్మమిచ్చు యోహాను అనుచరులు మరియు పరిసయ్య వర్గానికి చెందిన కొందరు మనుష్యులు తరచుగా చేసిన విధముగా భోజనము మానుకున్నారు. కొందరు మనుష్యులు యేసు దగ్గరకు వచ్చారు మరియు ఆయనను అడిగారు, “యోహాను యొక్క మరియు పరిసయ్యుల యొక్క శిష్యులు తరచుగా ఆహారం మానుకుంటారు. మీ విద్యార్థులు ఆహారానికి ఎందుకు మానుకొనుట లేదు?" 19 యేసు వారితో చెప్పాడు: “ఒక పురుషుడు స్త్రీని పెండ్లి చేసుకున్నప్పుడు, అతని స్నేహితులు అతడు ఇంకను వారితో ఉన్నప్పుడు భోజనం మానుకొనరు. పెండ్లి అంటే పెండ్లికుమారుడితో కలిసి విందు మరియు వేడుక జరుపుకునే సమయం. ఇది ఆహారం మానేయడానికి సమయం కాదు, ముఖ్యంగా పెండ్లికుమారుడు వారితో ఉన్నప్పుడు. 20 అయితే ఒక దినము, పెండ్లికుమారుడు ఆయన స్నేహితుల నుండి కొనిపోబడతాడు. అప్పుడు ఆ దినములలో, వారు ఆహారం మానివేస్తారు.” 21 యేసు వారితో చెప్పడం కొనసాగించాడు: “మనుష్యులు పాత వస్త్రం మీద ఒక మాసిక సరిచేయడానికి ముడుచుకోని గుడ్డను కుట్టరు. వారు చేసిన యెడల, వారు వస్త్రాన్ని ఉతికినప్పుడు, మాసిక ముడుచుకుపోతుంది, మరియు క్రొత్త గుడ్డ యొక్క ముక్క పాత గుడ్డను మరింత చింపివేస్తుంది. ఫలితంగా, రంధ్రం మరింత పెద్దదిగా అవుతుంది! 22 అదేవిధంగా, మనుష్యులు క్రొత్త ద్రాక్షారసాన్ని పాత జంతువుల చర్మం సంచులలో ఉంచరు. వారు ఆలాగు చేసిన యెడల, క్రొత్త ద్రాక్షారసము చర్మపు సంచులను పగిలిపోయేలా చేస్తుంది ఎందుకంటే ద్రాక్షారసము పులియబెట్టినప్పుడు మరియు విస్తరించినప్పుడు అవి సాగవు. ఫలితంగా, ద్రాక్షారసము మరియు చర్మపు సంచులు రెండూ పాడైపోతాయి! దీనికి విరుద్ధంగా, మనుష్యులు క్రొత్త ద్రాక్షారసాన్ని క్రొత్త చర్మపు సంచులలో పోయవలెను!” 23 ఒక యూదు విశ్రాంతి దినమున, యేసు తన శిష్యులతో కలిసి కొన్ని ధాన్యపు పొలాల ద్వారా వెళ్ళుచున్నాడు. వారు ధాన్యపు పొలాల గుండా వెళ్ళుచుండగా, యేసు శిష్యులు కొన్ని ధాన్యపు యొక్క వెన్నులను త్రుంచుచున్నారు. 24 పరిసయ్యులలో కొందరు వారు చేస్తున్న పనిని చూసారు మరియు యేసుతో చెప్పారు, “దీనిని చూడుము! వారు విశ్రాంతి దినమునకు సంబంధించిన యూదు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. వారు ఎందుకు అలా చేస్తున్నారు?” 25 యేసు వారితో ఇలా అన్నాడు: “దావీదు రాజు మరియు అతనితో ఉన్న మనుష్యులు ఆకలితో ఉన్నప్పుడు వారి గురించిన లేఖనాలను మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలంలో దావీదు రాజు దేవుని యొక్క మందిరంలోకి ప్రవేశించాడు మరియు కొన్ని రొట్టెలు కోసం అడిగాడు. ప్రధాన యాజకుడు దేవుని ముందు ప్రదర్శన ఉంచబడిన రొట్టెలో కొంత అతనికి ఇచ్చాడు. మన ధర్మశాస్త్రం ప్రకారం, యాజకులు మాత్రమే ఆ రొట్టె తినవచ్చు! అయితే దావీదు అందులో కొంత తిన్నాడు. అప్పుడు అందులో కొంత భాగాన్ని తనతో ఉన్న మనుష్యులకు కూడా ఇచ్చాడు.” 27 యేసు వారితో ఇంకా చెప్పాడు: “దేవుడు మానవాళి కోసం విశ్రాంతి దినమును చేసాడు. ఆయన విశ్రాంతి దినమును మానవాళి మీద భారంగా చేయలేదు. 28 కాబట్టి, స్పష్టంగా ఉండుటకు, విశ్రాంతి దినానికి కూడా మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు.”

Chapter 3

1 మరొక యూదు విశ్రాంతి దినమున, యేసు తిరిగి యూదుల సమావేశ స్థలం లోనికి వెళ్ళాడు. అక్కడ ఊచచెయ్యిగల ఒక మనుష్యుడు ఉన్నాడు. 2 పరిసయ్యుల వర్గానికి చెందిన కొందరు మనుష్యులు విశ్రాంతి దినమున ఆ మనుష్యుని ఆయన స్వస్థపరుస్తాడో లేదో అని జాగ్రత్తగా చూసారు, ఎందుకంటే వారు ఆయన ఏదైన తప్పు చేయడం గురించి ఆయనను నిందించాలని కోరుకున్నారు. 3 ఊచచెయ్యిగల మనుష్యునితో యేసు చెప్పాడు, “అందరి యెదుట ఇక్కడ లేచి నిలబడు!” {కాబట్టి ఆ మనుష్యుడు లేచి నిలబడ్డాడు.} 4 అప్పుడు యేసు ఆ మనుష్యులతో చెప్పాడు: “దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం మనుష్యులు విశ్రాంతి దినమున మంచి చేయడానికి లేదా చెడు చేయడానికి అనుమతిస్తున్నాదా? విశ్రాంతి దినమున ఒక మనుష్యుని యొక్క ప్రాణమును రక్షించడానికి ధర్మశాస్త్రం అనుమతిస్తున్నాదా లేదా ఒక మనుష్యునికి సహాయం చేయడానికి నిరాకరించి వారిని చనిపోయేలా అనుమతిస్తుందా?" అయితే వారు సమాధానం చెప్పలేదు. 5 ఆయన కోపంగా వారివైపు చుట్టూ చూసాడు. వారు కఠినంగా ఉన్నారు అని {మరియు ఆ మనుష్యునికి సహాయం చేయడానికి ఇష్టపడ లేదు} ఆయన చాలా నిరాశ చెందాడు. కాబట్టి ఆయన ఆ మనుష్యునితో చెప్పాడు, “నీ చెయ్యి చాపు!” ఆ మనుష్యుడు తన ఊచ చెయ్యి చాచినప్పుడు, అది తిరిగి ఆరోగ్యంగా మారింది! 6 పరిసయ్యులు సమావేశ స్థలం నుండి వెళ్ళిపోయారు. వారు వెంటనే గలిలయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదు అంతిపాకు మద్దతునిచ్చిన కొంతమంది యూదులను కలిసారు. వారందరు కలిసి యేసును ఏ విధంగా చంపాలో కుట్ర చేసారు. 7 యేసు మరియు ఆయన శిష్యులు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి గలిలయ సముద్ర తీరాన ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. మనుష్యుల యొక్క పెద్ద సమూహం ఆయనను అనుసరించారు. ఆయనను అనుసరించిన మనుష్యులు గలిలయ మరియు యూదయ ప్రాంతాల నుండి వచ్చారు, 8 యెరూషలేము యొక్క నగరం నుండి, ఇదూమయ ప్రాంతం నుండి, యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్న ప్రాంతం నుండి, మరియు తూరు మరియు సీదోను పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతం నుండి వచ్చారు. వారు అందరు యేసు వద్దకు వచ్చారు ఎందుకంటే ఆయన ఏమి చేయుచున్న దాని గురించి వారు విన్నారు. 9-10 ఆయన అనేక మంది మనుష్యులను స్వస్థపరిచాడు కాబట్టి, వివిధ అనారోగ్యాలు ఉన్న చాలా మంది మనుష్యులు ఆయనను తాకడానికి ముందుకు తోసుకొని వచ్చారు. వారు ఆయనను కేవలం తాకిన చాలు అని, ఆ స్పర్శ వారిని బాగుచేస్తుంది అని నమ్మారు. కాబట్టి జనసమూహం తనను తాకడానికి ముందుకు తోసుకొని వచ్చినప్పుడు తనకు ఇరుకు కలిగింపకుండ ఉండటానికి, తన కోసం ఒక చిన్న దోనెను సిద్ధం చేయాలి అని ఆయన తన శిష్యులతో చెప్పాడు. 11 దుష్ట ఆత్మలు యేసును చూసినప్పుడు, అవి నియంత్రించిన మనుష్యులు యేసు ముందు పడిపోయేలా చేసాయి మరియు అవి ఆయనను పిలిచాయి, “నీవు దేవుని యొక్క కుమారుడివి!” 12 ఆయన ఎవరో ఎవరికీ చెప్పకూడదు అని యేసు ఆ దుష్ట ఆత్మలకు ఖండితముగా ఆజ్ఞాపించాడు. 13 యేసు కొండల మీదకు వెళ్ళాడు. అక్కడ, ఆయన తనతో వెళ్ళాలి అని కోరుకున్న వారిని పిలిపించాడు మరియు వారు ఆయనను అనుసరించారు. 14 ఆయనతో ప్రయాణించడానికి పన్నెండు మందిని ఆయన నియమించాడు, వారిని ప్రకటించడానికి కూడా పంపేవాడు. ఆయన వారిని తన ప్రత్యేక ప్రతినిధులుగా పిలిచాడు. 15 మనుష్యుల నుండి అపవిత్రాత్మలను బలవంతంగా బయటకు వచ్చేలా చేయగల శక్తిని కూడా ఆయన వారికి ఇచ్చాడు. 16 యేసు 12 మంది మనుష్యులను నియమించాడు. ఆయన సీమోనును నియమించాడు మరియు అతనికి పేతురు అనే క్రొత్త పేరు పెట్టాడు. 17 యేసు పేతురుతో పాటు జెబెదయి కుమారుడైన యాకోబును, మరియు యాకోబు సహోదరుడైన యోహానును కూడా నియమించాడు. వారి మండుచున్న ఆసక్తి కారణంగా ఆయన వారి ఇద్దరికీ ‘ఉరిమెడు వంటి మనుష్యులు’ అనే క్రొత్త పేరు పెట్టాడు; 18 మరియు ఆయన అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి యొక్క కుమారుడగు యాకోబును నియమించాడు; మరియు ఆయన తద్దయి, కనానీయుడైన జెలోతీయుడైన సీమోను 19 మరియు ఇస్కరియోతు యూదాను (తరువాత ఆయన బంధింపబడుటకు కారణమైన వాడు) నియమించాడు. 20 యేసు మరియు ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. ఆయన ఉన్న చోట తిరిగి ఒక సమూహం గుమిగూడారు. అనేక మంది మనుష్యులు ఆయన చుట్టూ సమూహంగా కూడారు. ఆయన మరియు ఆయన శిష్యులకు ఆహారం తినడానికి కూడా సమయం లేదు. 21 ఆయనకు మతి చలించియున్నది అని కొందరు చెప్పుచున్న కారణంగా ఆయన బంధువులు దీని గురించి విని, వారు ఆయనను తమతో ఇంటికి తీసుకు వెళ్ళడానికి వెళ్ళారు. 22 యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే కొందరు మనుష్యులు యెరూషలేము నగరం నుండి దిగి వచ్చారు. యేసు మనుష్యుల నుండి అపవిత్రాత్మలు బయటకు రావాలని బలవంతం చేస్తున్నాడు అని వారు విన్నారు. కాబట్టి వారు మనుష్యులతో చెప్పుచున్నారు, “దుష్ట ఆత్మలను పాలించే బయల్జెబూలు యేసును అదుపులో ఉంచుతాడు. మనుష్యుల నుండి దుష్ట ఆత్మలను బలవంతంగా వెళ్ళగొట్టే శక్తిని యేసుకు ఇచ్చేది వాడే!” 23 కాబట్టి యేసు ఆ మనుష్యులను తన దగ్గరికి పిలిపించుకున్నాడు. యేసు వారితో ఉపమానములలో మాట్లాడాడు మరియు చెప్పాడు, “సాతాను సాతానును ఏ విధంగా వెళ్ళగొట్టగలడు? 24 ఒకే దేశంలో నివసించే మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచున్న యెడల, వారి ఒక దేశం సమైక్య దేశంగా ఉండడం నిలిచిపోతుంది. 25 మరియు ఒకే ఇంట్లో నివసించే మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుకొనుచున్న యెడల, వారు నిశ్చయముగా ఒకే కుటుంబంగా నిలిచి ఉండరు. 26 అదే విధంగా, సాతాను మరియు అతని దుష్ట ఆత్మలు ఒకరితో ఒకరు పోరాడుచున్న యెడల, బలవంతంగా ఉండడానికి బదులు, వాడు శక్తిహీనుడు అవుతాడు. 27 బలవంతుని యొక్క ఇంటిలోనికి వెళ్ళి, మరియు బలవంతుడిని మొదట కట్టివేయక పోయిన యెడల అతని నుండి ఆస్తులను ఎవరూ తీసుకోపోలేరు. అప్పుడు మాత్రమే అతడు ఆ మనుష్యుని యొక్క ఇంటిలోని వస్తువులను దొంగిలించగలడు.” 28 యేసు కూడా చెప్పాడు, “దీనిని జాగ్రత్తగా ఆలోచించండి! మనుష్యులు అనేక విధాలుగా పాపం చేయవచ్చు, మరియు వారు దేవుని గురించి చెడుగా మాట్లాడవచ్చు, అయినప్పటికీ దేవుడు వారిని ఇంకా క్షమిస్తాడు. 29 అయితే ఎవరైనా పరిశుద్ధ ఆత్మ గురించి చెడు మాటలు మాట్లాడిన యెడల, దేవుడు వారిని ఎన్నడు క్షమించడు. ఆ మనుష్యుడు నిత్యముగా పాపము యొక్క దోషియై ఉంటాడు.. 30 యేసు వారికి ఇది చెప్పాడు ఎందుకంటే వారు చెప్పుచున్నారు, “ఒక దుష్ట ఆత్మ ఆయనను నియంత్రిస్తోంది” 31 యేసు బోధిస్తున్న చోటికి యేసు యొక్క తల్లి మరియు తోబుట్టువులు వచ్చారు. వారు బయట నిలబడి ఉండగా, యేసును తమ దగ్గరకు రమ్మని చెప్పడానికి ఒకరిని లోపలికి పంపించారు. 32 ఒక సమూహం యేసు చుట్టూ కూర్చుని ఉన్నారు. వారిలో కొందరు ఆయనతో చెప్పారు, “వినండి! నీ తల్లి, మరియు తోబుట్టువులు బయట ఉన్నారు. వారు నిన్ను చూడాలనుకుంటున్నారు." 33 యేసు వారిని అడిగాడు, “నా తల్లి ఎవరు? నా తోబుట్టువులు ఎవరు?" 34 ఆయన తనతో కూర్చున్న వారి వైపు చుట్టూ చూసాడు, మరియు చెప్పాడు, “ఇక్కడ చూడండి! మీరు నా తల్లి మరియు నా తోబుట్టువులు. 35 ఎందుకంటే దేవుడు కోరుకున్న దానిని చేసే వారు నా సహోదరుడు, నా సహోదరి లేదా నా తల్లి!

Chapter 4

1 మరొకసారి యేసు గలిలయ సముద్రం పక్కన ఉన్న మనుష్యులకు బోధించడం ప్రారంభించాడు. ఆయన బోధిస్తూ ఉండగా, చాలా పెద్ద సమూహం ఆయన చుట్టూ గుమిగూడారు. ఎందుకంటే {సమూహము చాలా పెద్దది}, ఆయన ఒక దోనెలోనికి ఎక్కాడు మరియు నీటి మీదకి త్రోసాడు. సమూహం సముద్రము యొక్క తీరము నుండి ఆయన బోధ విన్నారు. 2 ఆయన సాధారణ కథలను ఉపయోగించడం చేత ఒక పాఠంతో వారికి బోధించాడు. ఆయన వారితో దీనిని చెప్పాడు 3 ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ఒక మనుష్యుడు కొన్ని విత్తనాలు నాటడానికి తన పొలమునకు వెళ్ళాడు. 4 అతడు వాటిని మట్టి మీద చల్లుచుండగా, కొన్ని విత్తనాలు దారి మీద పడ్డాయి. అప్పుడు కొన్ని పక్షులు వచ్చాయి మరియు ఆ విత్తనాలను తినివేసాయి. 5 తక్కువ మట్టి అయితే చాలా రాళ్ళు ఉన్నచోట మరికొన్ని విత్తనాలు నేలమీద పడ్డాయి. నేల చాలా లోతుగా లేనందున అతి త్వరలో మొలక నేల ద్వారా కనిపించింది. 6 ఆ రోజు తరువాత, చిన్న మొక్క మీద సూర్యుడు ప్రకాశించిన తరువాత, భూమిలోని రాళ్ల మధ్య లోతు లేని వేళ్ళుకు నీరు దొరకకపోవడంతో అది వాడిపోయి మరియు ఎండిపోయింది. 7 అతడు విత్తుచున్నప్పుడు ముళ్ల మొక్కల వేళ్ళు ఉన్నచోట మరో విత్తనం నేలమీద పడింది. మొలక పెరిగింది, అయితే ముళ్ళ మొక్కలు కూడా పెరిగాయి మరియు మంచి మొక్కను చుట్టుముట్టాయి. కాబట్టి మొక్క ధాన్యాన్ని ఉత్పత్తి చేయ లేదు. 8 అయితే అతడు విత్తిన విధముగా, మరో విత్తనం మంచి నేల మీద పడింది. తత్ఫలితంగా, అది మొలకెత్తింది, పెద్దదిగా పెరిగింది, మరియు అప్పుడు విస్తారమైన ధాన్యాన్ని పండించింది. ఈ మొక్కలలో కొన్ని మనుష్యుడు నాటిన విత్తనానికి 30 రెట్లు ఎక్కువ కాపు కాసాయి. కొన్ని 60 రెట్లు ఎక్కువ కాపు కాసాయి. కొన్ని 100 రెట్లు ఎక్కువ కాపు కాసాయి. 9 అప్పుడు యేసు చెప్పాడు, “వినడానికి ఎవరైతే ఇష్టపడతారో, నేను చెప్పేది వింటారు.” 10 తరువాత, కేవలం 12 మంది శిష్యులు మరియు ఇతర సన్నిహిత అనుచరులు మాత్రమే ఆయనతో ఉన్నప్పుడు, వారు ఉపమానాల గురించి ఆయనను అడిగారు. 11 ఆయన వారితో చెప్పాడు, “దేవుడు తనను తాను రాజు వలె ఏవిధంగా బయలుపరుస్తాడు అనే దాని గురించిన సందేశాన్ని నేను మీకు వివరించాను, అయితే ఇతరులకు నేను ఉపమానాలలో చెప్పాను. 12 నేను ఏమి చేస్తున్నానో వారు చూసినప్పుడు, {నేను దీనిని ఎందుకు చేస్తున్నానో} వారు నేర్చుకోరు. నేను చెప్పేది వారు వినినప్పుడు, దాని అర్థం ఏమిటో వారు అర్థం చేసుకోలేరు. ఇది వారు పశ్చాత్తాపపడకుండా ఉండేందుకు ఇది ఆ విధంగా ఉంది. మరియు దేవుడు వారిని క్షమించకపోవచ్చు.” 13 యేసు తన శిష్యులతో కూడా చెప్పాడు, “మీరు ఈ ఉపమానం అర్థం చేసుకోలేదా? నేను మీకు ఇతర ఉపమానాలు బోధించినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు? 14 నేను మీకు చెప్పిన ఉపమానంలో, విత్తనాలు విత్తే మనుష్యుడు దేవుని యొక్క సందేశాన్ని ఇతరులకు బోధించే ఒకరిని సూచిస్తున్నాడు. 15 కొందరు మనుష్యులు దారి వెంట పడిన విత్తనాలు ఉదాహరణ వలె ఉంటారు. వారు దేవుని యొక్క సందేశాన్ని విన్నప్పుడు, సాతాను ఒక్కసారిగా వస్తాడు మరియు వారు వినిన దానిని మరచిపోయేలా చేస్తాడు. 16 కొందరు మనుష్యులు రాతి నేల మీద రైతు విత్తే విత్తనం వలె ఉన్నారు. వారు దేవుని సందేశాన్ని విన్నప్పుడు, వారు వెంటనే దానిని సంతోషముతో అంగీకరిస్తారు. 17 అయితే, వారు తమ స్వంత బలమైన వేర్లు కలిగి లేరు, మరియు వారికి సహించే సామర్థ్యం లేదు. దీని కారణంగా, మనుష్యులు దేవుని యొక్క సందేశం కారణంగా వారిని శ్రమపెట్టినప్పుడు, వారు త్వరగా విశ్వసించడం మాని వేస్తారు. 18 కొందరు మనుష్యులు ముళ్ల కలుపు మొక్కలు ఉన్న నేల వలె ఉన్నారు. ఆ మనుష్యులు దేవుని సందేశాన్ని వింటారు. 19 అయితే భూసంబంధమైన వాటి గురించి మరియు ధనవంతులు కావడం గురించి మాత్రమే శ్రద్ధ వహిస్తారు, మరియు వారు దేవుని సందేశాన్ని మరచిపోతారు. ఈ సంగతులు, వ్యక్తి యొక్క జీవితాన్ని నింపి, వారు స్వీకరించిన సందేశాన్ని అణచి వేస్తాయి, మరియు ఆ వ్యక్తి ఫలం ఫలించలేడు. 20 అయితే కొందరు మనుష్యులు మంచి నేల మీద నాటిన విత్తనం వలె ఉన్నారు. వారు దేవుని సందేశాన్ని వింటారు మరియు వారు దానిని అంగీకరిస్తారు మరియు వారు దానిని విశ్వసిస్తారు మరియు దేవుడు తాము చేయాలనుకున్న పనులను వారు చేస్తారు. అవి 30, 60, లేదా 100 గింజలు పండించే మంచి మొక్కల వలె ఉంటారు. 21 ఆయన శిష్యులకు మరోక ఉపమానం చెప్పాడు: “మనుష్యులు నిశ్చయంగా నూనె దీపాన్ని వెలిగించి మరియు దాని వెలుగును కప్పి ఉంచేందుకు ఇంటి లోనికి తీసుకురారు. బదులుగా, వారు దానిని దీపస్తంభం మీద ఉంచుతారు, తద్వారా కాంతి ప్రకాశిస్తుంది. 22 అదేవిధంగా, దాచిపెట్టబడిన సంగతులు-ఒక దినమున ప్రతి ఒక్కరు వాటిని తెలుసుకుంటారు-మరియు రహస్యంలో జరిగిన విషయాలు –ఒక దినమున ప్రతి ఒక్కరు వాటిని పూర్తిగా వెలుగులో చూస్తారు. 23 మీరు దీనిని అర్థం చేసుకోవాలనుకొనిన యెడల, మీరు ఇప్పుడే వినిన దానిని జాగ్రత్తగా పరిశీలించాలి.” 24 “నేను మీతో చెప్పేది మీరు విని దానిని జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే నేను చెప్పేది మీరు ఏ స్థాయిలో పరిశీలిస్తారో అదే స్థాయిలో దేవుడు మీకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆయన మీకు అంతకంటే ఎక్కువ అర్థమయ్యేలా చేస్తాడు. 25 ఎందుకంటే ఒక మనుష్యునికి కొంత అవగాహన ఉన్న యెడల, అతడు ఇంకా ఎక్కువ పొందుతాడు. అయితే ఒక మనుష్యునికి అవగాహన లేని యెడల, అతని వద్ద ఉన్న కొంచెం కూడా, అతడు పోగొట్టుకొంటాడు. 26 యేసు కూడా చెప్పాడు: “దేవుడు తనను తాను రాజు వలె చూపించుకోవడం ప్రారంభించినప్పుడు, అది నేల మీద విత్తనాన్ని చల్లిన ఒక మనుష్యుని వలే ఉంటుంది. 27 ఆ తరువాత అతడు ప్రతి రాత్రి నిద్రపోయి మరియు విత్తనాల గురించి చింతించకుండా ప్రతి దినము లేచేవాడు. ఆ సమయంలో విత్తనాలు మొలకెత్తాయి మరియు అతనికి అర్థం కాని విధంగా పెరిగాయి. 28 భూమి తనంతట తానుగా పంటను పండించింది. మొదట కాండాలు కనిపించాయి. అప్పుడు తలలు కనిపించాయి. అప్పుడు తలలలో పూర్తి గింజలు కనిపించాయి. 29 ధాన్యం పండిన వెంటనే, ధాన్యం కోయడానికి అది సమయం కాబట్టి కోయడానికి మనుష్యులను పంపాడు.” 30 యేసు వారికి ఒక పాఠంతో మరో కథ చెప్పాడు. ఆయన చెప్పాడు, “దేవుడు తనను తాను రాజుగా చూపించుకోవడం ప్రారంభించినప్పుడు, అది ఎలా ఉంటుంది? దానిని వివరించడానికి నేను ఏ పద చిత్రాన్ని ఉపయోగించగలను? 31 ఇది ఆవాలు విత్తనాలు వంటిది, భూమిలో నాటబడిన అతి చిన్న విత్తనాలు, భూమి మీద ఉన్న ఏ ఇతర విత్తనాల కంటే చాల చిన్నవి. 32 అవి నాటబడిన తరువాత, అవి పెరుగుతాయి మరియు ఇతర తోట మొక్కల కంటే పెద్దవిగా మారతాయి. ఇతర తోట మొక్కల కంటే పెద్దవిగా మారతాయి. అవి పెద్ద కొమ్మలను వేస్తాయి తద్వారా పక్షులు వాటి నీడలో గూళ్లు చేసుకోగలుగుతాయి.” 33 యేసు మనుష్యులతో దేవుని సందేశం గురించి మాట్లాడినప్పుడు చాలా ఉపమానాలు ఉపయోగించాడు. ఆయన వారికి అర్థము చేసుకోగలిగే అంత వరకు చెప్పాడు. 34 అతడు వారితో మాట్లాడేటప్పుడు ఎల్లప్పుడూ పాఠాలతో కథలను ఉపయోగించాడు. అయితే ఆయన వారితో ఒంటరిగా ఉన్నప్పుడు తన స్వంత శిష్యులకు అన్ని ఉపమానాలను ఆయన వివరించాడు. 35 అదే దినమున, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, యేసు తన శిష్యులతో చెప్పాడు, “మనం గలిలయ సముద్రము యొక్క అవతలి ప్రక్కకు వెళ్ళుదాం.” 36 యేసు అప్పటికే దోనెలో ఉన్నాడు, కాబట్టి వారు జనసమూహాము యొక్క మనుష్యులను విడిచిపెట్టారు మరియు వెళ్ళిపోయారు. వారితో పాటు ఇతర మనుష్యులు కూడా తమ దోనెలలో వెళ్ళారు. 37 బలమైన గాలి వీచింది మరియు అలలు దోనె లోనికి రావడం ప్రారంభించాయి. దోనె నీళ్ళతో నింపబడే ప్రమాదం ఉంది. 38 యేసు దోనె యొక్క వెనుక భాగంలో ఉన్నాడు. తలగడ దిండు మీద తల ఉంచి నిద్రపోవుచున్నాడు. కాబట్టి శిష్యులు ఆయనను నిద్రలేపారు మరియు ఆయనకు చెప్పారు, “బోధకుడా! మనం చనిపోబోతున్నాము అని నీవు చింతించుటము లేదా? ” 39 కాబట్టి యేసు లేచాడు మరియు గాలిని గద్దించాడు, మరియు ఆయన సరస్సుతో మాట్లాడాడు, “నిశ్శబ్దంగా ఉండు! నిశ్చలముగా ఉండు!" గాలి వీచడం ఆగిపోయింది, మరియు అప్పుడు గలిలయ యొక్క సముద్రం చాలా ప్రశాంతంగా మారింది. 40 ఆయన శిష్యులతో చెప్పాడు, “మీరెందుకు భయపడుచున్నారు? నేను మిమ్ములను రక్షించగలను అని మీరు ఇంకా నమ్ముట లేదా?” 41 వారు భయపడిపోయారు. వారు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, “ఈ మనుష్యుడు ఎవరు? గాలి మరియు అలలు కూడా ఆయనకు లోబడుచున్నవి.

Chapter 5

1 యేసు మరియు ఆయన శిష్యులు గలిలయ సముద్రము యొక్క అవతలి వైపు చేరుకున్నారు. వారు దిగిన ప్రదేశానికి సమీపంలో గెరాసేనులు అని పిలువబడే మనుష్యులు నివసించారు. 2 యేసు దోనె బయట అడుగుపెట్టినప్పుడు, ఒక మనుష్యుడు ఒక స్మశానవాటికలోని సమాధులలో నుండి బయటికి వచ్చాడు. దుష్ట ఆత్మలు ఆ మనుష్యుని నియంత్రించాయి. 3 ఆ మనుష్యుడు స్మశానవాటిక నుండి బయటకు వస్తున్నాడు ఎందుకంటే అతడు సమాధుల మధ్య నివసించాడు. ఒక్కోసారి మనుష్యులు అతనిని అడ్డుకునే ప్రయత్నం చేసారు. వారు అతనిని {లోహపు} గొలుసులతో కూడా అడ్డుకోలేకపోయారు. 4 వారు గొలుసులు, మరియు సంకెళ్ళు ఉపయోగించిన ప్రతీ సారి ఆ మనుష్యుడు వాటిని తెంపివేసేవాడు. అతడు చాలా బలంగా ఉన్నాడు, తద్వారా అతనిని ఎవరూ నియంత్రించలేకపోయారు. 5 ఆ మనుష్యుడు పగలు మరియు రాత్రి స్మశానవాటికలో మనుష్యులు పాతిపెట్టబడిన ప్రదేశాల మధ్య గడిపాడు. కొండప్రాంతంలో అతడు బిగ్గరగా అరుస్తూ మరియు పదునైన రాళ్ళతో తనను తాను కోసుకున్నాడు. 6 యేసు దోనెలోంచి దిగడం దూరం నుండి అతడు చూసినప్పుడు, ఆయన దగ్గరకు పరుగెత్తాడు మరియు ఆయన ముందు మోకరించాడు. 7-8 ఆ దయ్యం ఒక పెద్ద స్వరంలో అరచింది, “యేసూ, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు! నీవు నన్ను హింసించవు అని దేవుని పేరు మీద ప్రమాణం చేయండి! ” ఆ దయ్యము దీనిని చెప్పింది ఎందుకంటే యేసు వానితో చెప్పుచున్నాడు, “దుష్ట ఆత్మా, ఆ మనుష్యుని నుండి బయటికి వెళ్ళు!” 9 యేసు ఆ దుష్ట ఆత్మను అడిగాడు, “నీ పేరు ఏమిటి?” వాడు జవాబిచ్చాడు, "నా పేరు సేన ఎందుకంటే మాలో అనేక మంది దుష్ట ఆత్మలు ఈ మనుష్యునిలో ఉన్నాము." 10 అప్పుడు దుష్టా ఆత్మలు తమను ఆ ప్రాంతం నుండి పంపించవద్దు అని యేసును తీవ్రముగా అడుగుచూనే ఉన్నాయి. 11 అదే సమయంలో, కొండ మీద ఒక పెద్ద పందుల సమూహము మేస్తూ ఉన్నది. 12 కాబట్టి ఆ దుష్టా ఆత్మలు యేసుతో చెప్పుచు వేడుకున్నాయి, “మేము వాటి లోనికి ప్రవేశించడానికి ఆ పందుల దగ్గరికి వెళ్ళడానికి మమ్ములను అనుమతించండి!” 13 దానిని చేయడానికి యేసు వాటిని అనుమతించాడు. కాబట్టి దుష్ట ఆత్మలు ఆ మనుష్యుని విడిచిపెట్టాయి మరియు పందులలోనికి ప్రవేశించాయి. దాదాపు 2,000 సంఖ్యతో ఉన్న మంద, నిటారుగా ఉన్న కొండ మీద నుండి గలిలయ సముద్రం లోనికి పరుగెత్తింది, అక్కడ అవి మునిగిపోయారు. 14 పందుల మందను మేపుచున్న మనుష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు మరియు పట్టణంలో మరియు పల్లెలో జరిగిన విషయాన్ని తెలియజేసారు. అనేకులు {ఆ ప్రదేశాల నుండి} ఏమి జరిగిందో తమకై తాము చూడడానికి వెళ్ళారు. 15 మనుష్యులు అందరు యేసు ఉన్న చోటికి వచ్చారు. అప్పుడు వారు దుష్ట ఆత్మలు గతంలో నియంత్రించిన ఆ మనుష్యుని చూసారు. అతడు అక్కడ వస్త్రములు ధరించి కూర్చున్నాడు మరియు ఇక మీదట దుష్ట ఆత్మలు అతనిని నియంత్రించిన విధముగా వ్యవహరించ లేదు. వారు ఇది అంతయు చూసినప్పుడు వారు భయపడ్డారు. 16 యేసు చేసినది చూసిన మనుష్యులు పట్టణం నుండి మరియు పల్లె నుండి వచ్చిన వారికి చెప్పారు. దుష్ట ఆత్మలు గతంలో నియంత్రించిన మనుష్యునికి ఏమి జరిగిందో వారు ఆ మనుష్యులకు చెప్పారు. పందులకు ఏం జరిగిందో కూడా వివరించారు. 17 అప్పుడు మనుష్యులు తమ ప్రాంతం విడిచి వెళ్ళమని యేసును వేడుకున్నారు. 18 యేసు బయలుదేరడానికి దోనె ఎక్కుచుండగా, మునుపు దుష్ట ఆత్మలు అదుపులో ఉన్న మనుష్యుడు యేసును వేడుకున్నాడు, “దయచేసి నన్ను మీతో వెళ్ళనివ్వండి!” 19 అయితే యేసు ఆ మనుష్యుని తనతో వెళ్ళనివ్వలేదు. బదులుగా, ఆయన అతనితో చెప్పాడు, “మీ కుటుంబం వద్ద ఉన్న ఇంటికి వెళ్ళుము మరియు ప్రభువు నీ కోసం చేసిన ప్రతీది వారికి చెప్పు, మరియు ఆయన నీకు ఎలా చాల దయగా ఉన్నాడో వారికి చెప్పు.” 20 కాబట్టి ఆ మనుష్యుడు వెళ్ళాడు మరియు ఆ ప్రాంతంలోని పది పట్టణాలు తిరిగాడు. యేసు తన కోసం చేసిన ప్రతీది మనుష్యులకు చెప్పాడు. ఆ మనుష్యుడు చెప్పిన మాటలు విన్న మనుష్యులు అందరు ఆశ్చర్యపోయారు. 21 యేసు తిరిగి దోనెలో గలిలయ సముద్రానికి అవతలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత, తీరమున ఒక పెద్ద సమూహం ఆయన చుట్టూ చేరారు. 22 యూదుల సమావేశ స్థలానికి అధికారిగా ఉన్న వారిలో యాయీరు అనే పేరుగల మనుష్యుడు అక్కడికి వచ్చాడు. అతడు యేసును చూసినప్పుడు, అతడు ఆయన పాదముల వద్ద మోకరించాడు. 23 అప్పుడు అతడు యేసును ప్రాధేయపడి వేడుకున్నాడు: “నా కుమార్తె అనారోగ్యంతో ఉంది మరియు దాదాపు చనిపోయింది! దయచేసి నా ఇంటికి రమ్ము మరియు ఆమె మీద నీ చేయి వేయండి. ఆమెను స్వస్థపరచండి మరియు ఆమెను బతికించండి!” 24 కాబట్టి యేసు అతనితో వెళ్ళాడు. ఒక పెద్ద సమూహము ఆయనను వెంబడించింది, మరియు అనేకులు ఆయన దగ్గరకు త్రోసుకొనివచ్చారు. 25 జనసమూహంలో రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమెకు పన్నెండు సంవత్సరాలుగా ప్రతిరోజూ రక్తస్రావం అవుతోంది. 26 ఆమె చాలా మంది వైద్యుల చేతులలో అనేక సార్లు బాధపడింది. అదే సమయంలో, ఆమె తన డబ్బు మొత్తం ఖర్చు చేసింది మరియు బాగుపడలేదు. బదులుగా, ఆమె మరింత దిగజారింది. 27-28 యేసు మనుష్యులను స్వస్థపరిచాడు అని ఆమె వినినప్పుడు, ఆయన వెంట వస్తున్న జనసమూహంతో కలిసింది. ఆమె ఆయన దగ్గరికి రాగానే, ఆమె ఆయన వస్త్రమును తాకింది. ఆమె ఆలోచిస్తోంది, "నేను ఆయన వస్త్రములు ముట్టు కున్న యెడల, అది నన్ను స్వస్థపరుస్తుంది." కాబట్టి ఆమె యేసు వస్త్రములను తాకింది. 29 ఒక్కసారిగా ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. అదే సమయంలో, యేసు తన అనారోగ్యమును స్వస్థపరచాడు అని ఆమె తన శరీరంలో భావించింది. 30 తన శక్తి ఒకరిని స్వస్థపరిచింది అని యేసు వెంటనే గ్రహించాడు కూడా. కాబట్టి ఆయన సమూహములో చుట్టూ తిరిగాడు మరియు అప్పుడు అయన అడిగాడు, “నా వస్త్రములు ఎవరు ముట్టుకున్నారు?” 31 ఆయన శిష్యులు జవాబిచ్చారు, “అనేక మనుష్యులు నీ దగ్గరకు త్రోసుకొని వస్తున్నారు అని నీవు చూడవచ్చు! బహుశా అనేకమంది మనుష్యులు నిన్ను తాకి ఉంటారు! కాబట్టి నీవు ఎందుకు అడుగుచున్నావు, ‘నన్ను ఎవరు ముట్టుకున్నారు?'' 32 అయితే యేసు తనను తాకిన వానిని చూడడానికి చుట్టూ చూస్తూనే ఉన్నాడు. 33 ఆ స్త్రీ చాలా భయపడింది మరియు వణికుతుంది. ఎందుకంటే ఆమె యేసును తాకినప్పుడు, ఆయన తనను స్వస్థపరచాడు అని ఆమెకు తెలుసు. ఆమె ఆయన ముందు మోకరించింది మరియు ఆమె ఏమి చేసినదో ఆయనకు చెప్పింది. 34 ఆయన ఆమెతో చెప్పాడు, “కుమారి, నేను నిన్ను స్వస్థపరచగలను అని నీవు నమ్ముచున్నావు కాబట్టి, నేను ఇప్పుడు నిన్ను స్వస్థపరచాను. నీ అనారోగ్యం నుండి నేను నిన్ను శాశ్వతంగా స్వస్థపరచాను అని తెలిసికొని సమాధానముగా ఉండు.” 35 యేసు ఇంకా ఆ స్త్రీతో మాట్లాడుచుండగా, యాయీరు యొక్క ఇంటి నుండి వచ్చిన కొందరు మనుష్యులు చేరుకున్నారు. వారు యాయీరుతో చెప్పారు, “నీ కుమార్తె ఇప్పుడు చనిపోయింది. కాబట్టి బోధకుని మీ ఇంటికి తీసుకురావడంలో ఇకమీదట ఇబ్బంది పెట్టనవసరం లేదు.” 36 అయితే ఆ మనుష్యులు చెప్పినది యేసు విన్నాడు, ఆయన యాయీరుతో చెప్పాడు, “నీ కుమార్తె చనిపోయింది అని భయపడకు! ఆమె జీవిస్తుంది అని కేవలం విశ్వసించు! ” 37 అప్పుడు ఆయన తన ముగ్గురు సన్నిహిత శిష్యులు పేతురు, యాకోబు మరియు యోహానులను మాత్రమే తనతో పాటు ఇంటికి వెళ్ళడానికి అనుమతించాడు. తనతో పాటు వెళ్ళుటకు ఏ ఇతర మనుష్యులను ఆయన అనుమతించలేదు. 38 వారు యాయీరు యొక్క ఇంటి దగ్గరికి చేరుకొనిన తరువాత, అక్కడ మనుష్యులు అలజడిగా ఉండడం యేసు చూసాడు. వారు ఏడ్చారు మరియు బిగ్గరగా విలపించారు. 39 ఆయన ఇంటిలోనికి ప్రవేశించాడు, మరియు అప్పుడు ఆయన అక్కడ ఉన్న మనుష్యులకు చెప్పాడు, “మీరు ఎందుకు చాల కలత చెంది మరియు ఏడుస్తున్నారు? బిడ్డ చనిపోలేదు, అయితే కేవలం నిద్రపోవుచున్నది. 40 ఆమె చనిపోయింది అని వారికి తెలుసు కాబట్టి ఆ మనుష్యులు ఆయనను చూసి నవ్వారు. మిగిలిన మనుష్యులు అందరిని ఆయన ఇంటి బయటికి పంపించాడు. అప్పుడు ఆయన బిడ్డ యొక్క తండ్రి మరియు తల్లి మరియు ఆయనతో ఉన్న ముగ్గురు శిష్యులను తీసుకొన్నాడు, మరియు వారు బిడ్డ పడుకున్న గదిలోకి వెళ్ళారు. 41 ఆయన బిడ్డ యొక్క చెయ్యి పట్టుకుని మరియు ఆమె స్వంత భాషలో ఆమెతో చెప్పాడు, “తలితా కుమీ!” దాని అర్ధం, “చిన్న అమ్మాయి, పైకి లెమ్ము!” 42 ఒక్కసారిగా ఆ అమ్మాయి పైకి లేచింది మరియు చుట్టూ తిరిగింది. (ఆమె నడవగలిగింది అని ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆమెకు పన్నెండు సంవత్సరాలు.) ఇది జరిగినప్పుడు అక్కడున్న వారందరూ చాలా ఆశ్చర్యపోయారు. 43 యేసు వారికి కఠినంగా ఆజ్ఞాపించాడు, “నేను చేసిన దాని గురించి ఎవరికీ చెప్ప వద్దు!” అప్పుడు ఆయన ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని చెప్పాడు.

Chapter 6

1 యేసు కపెర్నహూము యొక్క పట్టణాన్ని విడిచిపెట్టాడు మరియు తన జన్మము యొక్క స్థలము, నజరేతుకు వెళ్ళెను. ఆయనతో శిష్యులు కూడా వెళ్ళారు. 2 యూదుల యొక్క విశ్రాంతి దినమున, ఆయన యూదులు బోధించే స్థలంలోనికి ప్రవేశించాడు మరియు మనుష్యులకు బోధించాడు. ఆయన మాటలు వినుచున్న అనేకులు ఆశ్చర్యపోయారు. ఆయన తన జ్ఞానాన్ని మరియు అద్భుతాలు చేసే శక్తిని ఎక్కడ సంపాదించాడో అని వారు ఆశ్చర్యపోయారు. 3 వారు చెప్పారు, “ఆయన మామూలు వడ్రంగి! ఆయన మరియు ఆయన కుటుంబం మాకు తెలుసు! ఆయన తల్లి మరియ మాకు తెలుసు! ఆయన తమ్ముళ్ళు యాకోబు, యోసేపు, యూదా మరియు సీమోను మాకు తెలుసు! మరియు ఆయన చెల్లెళ్ళు కూడా మాతో ఇక్కడ నివసిస్తున్నారు! కాబట్టి వారు ఆయన బోధలకు ఇబ్బంది పడ్డారు. 4 యేసు వారితో చెప్పాడు: “ఇది నిశ్చయముగా నిజం మనుష్యులు ఇతర ప్రాంతాలలో ప్రవక్తలను గౌరవిస్తారు అని, అయితే వారి స్వంత పట్టణాలలో కాదు! వారి బంధువులు మరియు వారి స్వంత ఇళ్ళలో నివసించే మనుష్యులు కూడా వారిని గౌరవించరు! 5 అక్కడ ఉన్న కొద్ది మంది అనారోగ్య మనుష్యుల తలల మీద చేతులు వేయడం ద్వారా ఆయన స్వస్థపరిచినప్పటికీ, ఆయన మరే ఇతర అద్భుతం చేయలేకపోయాడు. 6 చాలా తక్కువ మంది మనుష్యులు ఆయనను విశ్వసించడం పట్ల ఆయన ఆశ్చర్యపోయాడు. యేసు, మరియు ఆయన శిష్యులు తమ గ్రామాల గుండా వెళ్లి వారికి బోధించడం కొనసాగిస్తూ ఉన్నారు. 7 ఒక దినము యేసు 12 మంది శిష్యులను కలిపి పిలిచాడు. అప్పుడు ఆయన వివిధ పట్టణాలలోని మనుష్యులకు బోధించడానికి ఇద్దరిని ఇద్దరిని తాను బయటకు పంపబోవుచున్నాను అని వారికి చెప్పాడు. వారు నియంత్రించే మనుష్యుల నుండి దుష్ట ఆత్మలను బలవంతంగా బయటకు పంపే శక్తిని కూడా ఆయన వారికి ఇచ్చాడు. 8-9 వారు ప్రయాణించేటప్పుడు చెప్పులు మాత్రమే ధరించాలని, మరియు నడిపించే కర్రను వెంట తీసుకువెళ్లాలని కూడా ఆయన వారికి హెచ్చరించాడు. ఆహారం లేదా సామాగ్రి ఉంచడానికి ఒక సంచి లేదా వారి ప్రయాణానికి డబ్బు తీసుకువెళ్ళవద్దు అని ఆయన వారికి చెప్పాడు. ఆయన ఒక అదనపు వస్త్రం తీసుకునేందుకు కూడా వారిని అనుమతించలేదు. 10 ఆయన వారికి హెచ్చరించాడు ఇచ్చాడు, “ఎవరైనా మిమ్ములను అతని ఇంటిలో ఉండుటకు ఆహ్వానించిన యెడల, మీరు ఆ ఊరు విడిచి వెళ్ళేంత వరకు వారి ఇంటిలోనే ఉండండి. 11 ఎక్కడైనా మనుష్యులు మిమ్ములను స్వాగతించకపోయినా మరియు ఎక్కడైనా మనుష్యులు మీ మాట వినకపోయినా, మీరు అక్కడి నుండి వెళ్ళేటప్పుడు మీ పాదాల ధూళిని వదలండి. అలా చేయడం ద్వారా, వారు {మిమ్ములను లేదా మీ సందేశాన్ని స్వాగతించలేదు} అని మీరు సాక్ష్యమిస్తారు. 12 కాబట్టి శిష్యులు బయటకు వివిధ పట్టణాలకు వెళ్ళిన తర్వాత, మనుష్యులు {తమ పాపాల గురించి} పశ్చాత్తాపపడు విధముగా బోధిస్తూ ఉన్నారు. 13 వారు అనేక దుష్ట ఆత్మలను మనుష్యుల నుండి బలవంతంగా బయటకు పంపారు, మరియు వారు చాలా మంది రోగులకు ఒలీవ నూనెతో అభిషేకం చేసి మరియు వారిని స్వస్థపరిచారు. 14 ఇప్పుడు హేరోదు అంతిప రాజు యేసు చేయుచున్న పని గురించి విన్నాడు, ఎందుకంటే అనేకమంది మనుష్యులు ఆయన పేరు గురించి మాట్లాడుచున్నారు. కొంతమంది మనుష్యులు యేసు గురించి చెప్పారు, “ఆయన బాప్తిస్మమిచ్చు యోహాను అయి ఉండాలి! ఆయన మృతులలోనుండి లేచాడు! అందుకే ఈ అద్భుతాలు చేసే శక్తి ఆయనకు ఉంది!” 15 మరికొందరు యేసు గురించి చెప్పారు, “ఆయన ప్రాచీన ప్రవక్తయైన ఏలీయా, దేవుడు తిరిగి పంపుతానని వాగ్దానం చేసినవాడు.” మరికొందరు యేసు గురించి చెప్పారు, “కాదు, ఆయన చాలా కాలం క్రితం జీవించిన ఇతర ప్రవక్తలలో ఒకరిలాగా ఒక భిన్నమైన ప్రవక్త.” 16 మనుష్యులు చెప్పేది వినన తరువాత, హేరోదు అంతిప స్వయంగా చెప్పాడు, “ఆ అద్భుతాలు చేస్తున్న మనుష్యుడు బాప్తిస్మమిచ్చే యోహానే! అతని తల నరికివేయమని నేను నా సైనికులకు ఆజ్ఞాపించాను, అయితే అతడు తిరిగి బ్రతికాడు! 17 ఎందుకంటే ఇంతకు ముందు, హేరోదు రాజు యోహానును బంధించాడు మరియు చెరసాలలో వేసాడు. అతడు దీనిని చేసాడు ఎందుకంటే హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య, హేరోదియను వివాహం చేసుకున్నాడు. 18 హేరోదు యోహానును చెరసాలలో ఉంచాడు ఎందుకంటే అతడు హేరోదుతో చెప్పాడు, “నీ సహోదరుని భార్యను నీవు పెండ్లి చేసుకోవడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రము అనుమతించదు.” 19 అయితే హెరోదియా యోహాను మీద మరింత పగ తీర్చుకోవాలని కోరుకుంది కాబట్టి, అతనిని ఎవరైనా ఉరితీయాలని కోరుకుంది. అయితే ఆమె దానిని చేయలేకపోయింది, ఎందుకంటే యోహాను చెరసాలలో ఉన్నప్పుడు, హేరోదు యోహానును ఆమె నుండి సురక్షితంగా ఉంచాడు. 20 హేరోదు దీనిని చేసాడు ఎందుకంటే అతడు యోహానును గౌరవించాడు, ఎందుకంటే అతడు దేవునికి సమర్పించుకొన్న నీతిమంతుడు అని అతనికి తెలుసు. హేరోదు యోహాను మాట విన్నప్పుడల్లా, హేరోదు చాలా కలవరంగా అయ్యాడు, అయితే అతడు యోహానును వినడానికి ఇష్టపడతాడు. 21 హేరోదు పుట్టినరోజున హేరోదును సన్మానించినప్పుడు యోహాను మరణశిక్ష విధించబడడాన్ని హేరోదియ చూసే అవకాశం వచ్చింది. అతడు ముఖ్యమైన ప్రభుత్వ అధికారులను, అత్యంత ముఖ్యమైన సైన్యాధిపతులను మరియు గలిలయ జిల్లాలోని అత్యంత ముఖ్యమైన మనుష్యులు అనేకులు తనతో కలిసి భోజనం చేసి వేడుకలు జరుపుకోవడానికి ఆహ్వానించాడు. 22 వారు తినుచుండగా చేస్తుండగా, హేరోదియ యొక్క కుమార్తె గది లోనికి వచ్చింది మరియు రాజు కోసం మరియు అతని అతిథుల కోసం నృత్యం చేసింది. ఆమె హేరోదు రాజును మరియు అతని అతిథులను చాల ఎక్కువగా సంతోషపెట్టింది అతడు ఆమెతో చెప్పు విధముగా, "నీకు ఏది కావాలంటే అది నన్ను అడుగు, మరియు నేను నీకు ఇస్తాను!" 23 అతడు ఆమెకు వాగ్దానం చేసాడు కూడా, “నీవు ఏది అడిగినా, అది నీకు ఇస్తాను! నీవు అడిగిన యెడల, నా స్వంతంగా కలిగి ఉన్న మరియు పాలించే దానిలో సగభాగం వరకు నీకు ఇచ్చి వేస్తాను.” 24 దీని తరువాత, కుమార్తె తన తల్లి, హేరోదియ దగ్గరికి వెళ్ళింది, మరియు రాజు అయిన హేరోదు తనతో చెప్పిన విషయం చెప్పింది. ఆమె తన తల్లిని అడిగింది, "నేను ఏమి అడగాలి?" ఆమె తల్లి జవాబిచ్చింది, “బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తల నీకు ఇవ్వమని రాజును అడుగు!” 25 ఆ అమ్మాయి హడావిడిగా తిరిగి గదిలోకి వెళ్ళింది మరియు తన కోరికతో రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమె చెప్పింది, “బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క తలను నరికి వేయుటకు మరియు వడ్డించే పళ్ళెములో ఇప్పుడే నా దగ్గరకు తీసుకురావాలని నీవు ఎవరికైనా ఆజ్ఞాపించుటకు కోరుచున్నాను!” 26 ఆమె అడిగినది విని నప్పుడు రాజు చాలా నిరాశ పడ్డాడు ఎందుకంటే యోహాను చాలా నీతిమంతుడు అని అతనికి తెలుసు. అయితే అతడు ఆమె కోరినదానిని తిరస్కరించలేకపోయాడు, ఎందుకంటే అతడు ఆమె కోరినదంతా ఇస్తానని వాగ్దానం చేసాడు మరియు అతని అతిథులు అతని వాగ్దానం విన్నారు. 27 కాబట్టి రాజు వెంటనే ఒకరిని వెళ్ళి మరియు యోహాను యొక్క తలను నరికి అమ్మాయి దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ మనుష్యుడు చెరసాలలోనికి వెళ్ళి యోహాను యొక్క తలను నరికివేసాడు. 28 అతడు దానిని ఒక వడ్డించే పళ్ళెములో ఉంచాడు, వెనుకకు తీసుకువచ్చాడు మరియు ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి దానిని తన తల్లి వద్దకు తీసుకు వెళ్ళింది. 29 యోహాను యొక్క శిష్యులు ఏమి జరిగిందో వినిన తరువాత, వారు చెరసాలలోనికి వెళ్ళారు మరియు యోహాను యొక్క మృతదేహాన్ని తీసుకున్నారు; అప్పుడు వారు దానిని పాతిపెట్టారు. 30 యేసు తనకు ప్రాతినిధ్యం వహించడానికి ఎన్నుకున్న వారు ఆయన పంపిన ప్రదేశాల నుండి తిరిగి వచ్చారు. వారు ఏమి చేసారో మరియు వారు మనుష్యులకు ఏమి బోధించారో వాటిని ఆయనకు నివేదించారు. 31 ఆయన వారితో చెప్పాడు, “మనం ఒంటరిగా ఉండి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి, ఎవరూ నివసించని ప్రదేశానికి నాతో రండి!” ఆయన దీనిని చెప్పాడు, ఎందుకంటే అనేక మంది మనుష్యులు నిరంతరం వారి వద్దకు వస్తున్నారు మరియు తిరిగి వెళ్ళిపోతున్నారు, ఫలితంగా యేసు మరియు ఆయన శిష్యులకు తినడానికి లేదా వేరే ఏమీ చేయడానికి సమయం లేదు. 32 కాబట్టి వారు తమకై హాము ఒంటరిగా దోనె ఎక్కి మనుష్యులు లేని ప్రదేశానికి వెళ్ళిపోయారు. 33 అయితే అనేకమంది మనుష్యులు వారు వెళ్ళిపోవడం చూసారు. వారు యేసు మరియు శిష్యులు అని కూడా గుర్తించారు, మరియు వారు ఎక్కడికి వెళ్ళుచున్నారో చూసారు. కాబట్టి వారు సమీపంలోని అన్ని పట్టణాల నుండి యేసు మరియు ఆయన శిష్యులు వెళ్ళుచున్న ప్రదేశానికి ముందుకు పరుగెత్తారు. వారు నిజానికి యేసు మరియు ఆయన శిష్యుల కంటే ముందే అక్కడికి చేరుకున్నారు. 34 యేసు మరియు ఆయన శిష్యులు దోనెలో నుండి దిగుచుండగా, యేసు ఈ గొప్ప సమూహమును చూసాడు. కాపరి లేని గొఱ్ఱెలవలె కలవరంగా ఉన్న కారణంగా ఆయన వారి యెడల కనికరపడ్డాడు. కాబట్టి ఆయన వారికి అనేక సంగతులు బోధించాడు. 35 మధ్యాహ్నాము చివరిలో శిష్యులు ఆయన వద్దకు వచ్చారు మరియు చెప్పారు, “ఇది ఎవరూ నివసించని స్థలం, మరియు ఇది చాలా ఆలస్యం అయింది. 36 కాబట్టి మనుష్యులను చుట్టుపక్కల ఉన్న పట్టణాలకు మరియు గ్రామాలకు పంపించండి మరియు తద్వారా వారు తమ కోసం ఆహారాన్ని కొనుగోలు చేస్తారు!” 37 అయితే ఆయన వారికి జవాబిచ్చాడు, “లేదు, మీరే వారికి తినడానికి ఏదైనా ఇవ్వండి!” వారు ఆయనకు జవాబిచ్చారు, “ఒక మనుష్యుడు 200 రోజులు పనిచేసి సంపాదించినంత డబ్బు మా వద్ద ఉన్నప్పటికీ, ఈ సమూహానికి తిండికి సరిపడా రొట్టెలు కొనలేము!” 38 అయితే ఆయన వారికి జవాబిచ్చారు, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? వెళ్ళండి మరియు కనుగొనండి!” వారు వెళ్ళారు మరియు కనుగొన్నారు మరియు అప్పుడు వారు ఆయనకు చెప్పారు, “మా దగ్గర ఐదు చదునైన రొట్టెలు మరియు రెండు వండిన చేపలు మాత్రమే ఉన్నాయి!” 39 మనుష్యులు అందరిని పచ్చటి గడ్డి మీద కూర్చోడానికి చెప్పమని శిష్యులకు ఆజ్ఞాపించాడు. 40 కాబట్టి మనుష్యులు గుంపులలో కూర్చున్నారు. కొన్ని గుంపులో 100 మంది మరియు మరికొన్ని గుంపులో 50 మంది ఉన్నారు. 41 యేసు ఐదు చదునైన రొట్టెలను మరియు రెండు చేపలను తీసుకున్నాడు. అతడు ఆకాశము వైపు చూసాడు మరియు వాటి కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు ఆయన రొట్టెలు మరియు చేపలను ముక్కలుగా చసాడు మరియు వాటిని మనుష్యులకు పంచడానికి శిష్యులకు ఇస్తూనే ఉన్నాడు. 42 వారు అందరు తినడానికి సరిపోయేంత వరకు ప్రతి ఒక్కరు ఈ ఆహారం తిన్నారు! 43 శిష్యులు అప్పుడు పన్నెండు గంపల నిండా రొట్టె ముక్కలను మరియు మిగిలిన చేపలను సేకరించారు. 44 రొట్టెలు మరియు చేపలు తినిన వారు దాదాపు 5,000 మనుష్యులు ఉన్నారు. వారు స్త్రీలు మరియు పిల్లలను కూడా లెక్కపెట్ట లేదు. 45 వెంటనే, యేసు తన శిష్యులకు దోనె ఎక్కి తనకంటే ముందుగా గలిలయ యొక్క సముద్రం ముందుకు చుట్టూ ఉన్న బేత్సయిదా అనే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ఆయన అక్కడే ఉన్నాడు మరియు మరియు అక్కడ ఉన్న అనేకమంది మనుష్యులను పంపింఛి వేసాడు. 46 ఆయన మనుష్యులకు వీడ్కోలు పలికిన తరువాత, ఆయన ప్రార్థన చేయడానికి కొండల మీదకు వెళ్ళాడు. 47 ఇది సాయంత్రం అయినప్పుడు, శిష్యుల యొక్క దోనె సరస్సు యొక్క మధ్యలో ఉంది, మరియు యేసు ఒంటరిగా నేల మీద ఉన్నాడు. 48 ఆయన వారు దోనె నడుపుచుండగా వారికి వ్యతిరేకంగా గాలి వీస్తుండడం చూసాడు. ఫలితంగా, వారు గొప్ప కష్టం పడ్డారు. ఆయన తెల్లవారుజామున, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, నీటి మీద నడుస్తూ వారి వద్దకు చేరుకున్నాడు. ఆయన వారి వెంట నడవాలని ఉద్దేశించాడు. 49 ఆయన నీళ్ళ మీద నడవడం వారు చూసారు, అయితే వారు ఆయన ఒక భూతం అనుకున్నారు. వారు బిగ్గరగా అరిచారు. 50 ఎందుకంటే వారు ఆయనను చూసినప్పుడు వారు అందరు భయపడ్డారు. అయితే ఆయన వారితో మాట్లాడాడు. ఆయన వారితో చెప్పాడు, “నెమ్మదిగా ఉండండి! భయపడ వద్దు, ఎందుకంటే అది నేనే!” 51 ఆయన దోనెలోనికి ఎక్కాడు మరియు వారితో కూర్చున్నాడు, మరియు గాలి వీచడం ఆగిపోయింది. ఆయన చేసిన దానికి వారు పూర్తిగా ఆశ్చర్యపోయారు. 52 యేసు రొట్టెలు మరియు చేపలను హెచ్చించడం వారు చూసినప్పటికీ, వారు కలిగియుండవలసిన విధంగా దాని యొక్క అర్థం గ్రహించలేదు. 53 వారు దోనెలో గలిలయ యొక్క సముద్రం చుట్టూ మరింత వెళ్ళిన తరువాత, వారు గెన్నెసరెతు పట్టణము యొక్క తీరము వద్దకు వచ్చారు. అప్పుడు వారు ఆ దోనెను అక్కడ బిగించారు. . 54 వారు దోనె నుండి బయటకు దిగిన వెంటనే అక్కడ ఉన్న మనుష్యులు యేసును గుర్తించారు. 55 కాబట్టి యేసు అక్కడ ఉన్నాడు అని ఇతరులకు చెప్పడానికి వారు జిల్లా అంతటా పరిగెత్తారు. అప్పుడు మనుష్యులు అనారోగ్యంతో ఉన్నవారిని పడకల మీద ఉంచారు మరియు యేసు ఉన్నాడు అని మనుష్యులు చెప్పడం విన్న ఏ చోటికి తీసుకువెళ్ళారు. 56 ఆయన ఏ ఊరిలో, పట్టణం లేదా పల్లెలలో ఏ ప్రాంతానికి వెళ్ళినా, అనారోగ్యంతో ఉన్న వారిని అంగడి స్థలాలకు తీసుకొని వచ్చేవారు. అప్పుడు జబ్బుపడిన మనుష్యులు యేసును స్వస్థపరచేలా ఆయనను లేదా ఆయన బట్టల అంచుని కూడా తాకనివ్వమని వేడుకున్నారు. ఆయనను లేదా ఆయన వస్త్రాన్ని తాకిన వారందరూ స్వస్థపరచబడ్డారు.

Chapter 7

1 ఒక రోజు కొందరు పరిసయ్యులు మరియు యూదుల ధర్మశాస్త్రాలు బోధించే మనుష్యులు కొందరు మరియు యెరూషలేము నుండి వచ్చిన వారు యేసు చుట్టూ చేరారు. 2 ఆయన శిష్యులలో కొందరు తమ ప్రత్యేక సంప్రదాయ విధానంలో తమ చేతులు మొదట కడుక్కోకుండా తరచుగా భోజనం చేయడం పరిసయ్యులు చూసారు. 3 (వారు దీనిని గమనించారు) ఎందుకంటే పరిసయ్యులు మరియు ఇతర యూదులు అందరు తమ పితరులు బోధించిన తమ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఉదాహరణకు, వారు ఒక ప్రత్యేక ఆచారంతో మొదట చేతులు కడుక్కోనంత వరకు తినడానికి నిరాకరిస్తారు. 4 ప్రత్యేకంచి అంగడిలో వస్తువులను కొనడం నుండి వారు తిరిగి వచ్చిన తరువాత. వారు అలా చేయకపోయిన యెడల, దేవుడు తమపై కోపగించుకుంటాడు అని వారు భావిస్తారు, ఎందుకంటే ఒక వ్యక్తి లేదా దేవునికి ఆమోదయోగ్యం కాని వస్తువు తమను లేదా వారు కొనిన వస్తువులను తాకి ఉండవచ్చు. 5 ఆ రోజు, యూదుల ధర్మశాస్త్రాలను అధ్యయనం చేసిన పరిసయ్యులు మరియు మనుష్యులు ఆయన శిష్యులలో కొందరు ప్రత్యేకమైన ఆచారాన్ని ఉపయోగించి కడుగుకోకుండా ఆహారాన్ని చేతులతో తినడం చూసారు. కాబట్టి వారు యేసును ప్రశ్నించారు మరియు చెప్పారు, “నీ శిష్యులు మన పెద్దల యొక్క సంప్రదాయాలకు అవిధేయత చూపుచున్నారు! మన ఆచారాన్ని ఉపయోగించి చేతులు కడుగుకొనని యెడల వారు ఆహారం ఎందుకు తింటారు! 6 యేసు వారితో చెప్పాడు,“యెషయా మీ పితరులను గద్దించాడు, మరియు అతని మాటలు కేవలం మంచివారిగా నటించే మీ గురించి చాలా చక్కగా వివరిస్తున్నాయి!దేవుడు చెప్పిన ఈ మాటలు వ్రాసాడ: ‘ఈ మనుష్యులు నన్ను గౌరవించిన విధముగా మాట్లాడతారు, అయితే నన్ను గౌరవించడం గురించి వారు నిజంగా ఎంత మాత్రము ఆలోచించరు. 7 నన్ను ఆరాధించడం వారి కోసం నిరూపయోగం. ఎందుకంటే నేనే ఆజ్ఞాపించినట్లుగా మనుష్యులు చెప్పేది మాత్రమే వారు బోధిస్తారు.. 8 మీరు, మీ పితరుల వలె, దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయుటకు నిరాకరిస్తారు. బదులుగా, మీరు ఇతరులు బోధించిన సంప్రదాయాలను మాత్రమే అనుసరిస్తారు. 9 యేసు కూడా వారితో చెప్పాడు,“మీరు మీ స్వంత సంప్రదాయాలకు లోబడే విధముగా దేవుడు ఆజ్ఞాపించిన వాటిని చేయడానికి మీరు తెలివిగా తిరస్కరిస్తున్నారు అని అనుకుంటున్నారు. 10 ఉదాహరణకు, మన పితరుడైన మోషే, ‘మీ తండ్రులను మరియు మీ తల్లులను గౌరవించండి’ అనే దేవుని యొక్క ఆజ్ఞను వ్రాసాడు. తన తండ్రి లేదా తల్లి గురించి చెడుగా మాట్లాడే ఒక వ్యక్తిని అధికారులు శిక్షించాలి’ అని కూడా వ్రాసాడు. 11 అయితే మనుష్యులు తమ వస్తువులను వారి తల్లిదండ్రులకు ఇవ్వడానికి బదులు దేవునికి ఇచ్చిన యెడల ఇది సరియైనది అని మీరు మనుష్యులకు బోధిస్తారు. వారి తల్లిదండ్రులతో ఇలా చెప్పడానికి మీరు వారిని అనుమతిస్తున్నారు, 'మీ కోసం నేను మీకు ఏమి ఇవ్వబోవుచున్నానో, నేను ఇప్పుడు దేవునికి ఇస్తానని వాగ్దానం చేసాను. కాబట్టి నేను ఇక మీదట మీకు సహాయం చేయలేను!’ 12 ఫలితంగా, వారు ఇక మీదట వారి తల్లిదండ్రులకు సహాయం చేయవలసిన అవసరం లేదు అని మీరు నిజంగా మనుష్యులకు చెప్పుచున్నారు. 13 ఈ విధంగా మీరు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని అగౌరపరుస్తున్నారు! మీరు మీ స్వంత విషయాలను ఇతరులకు బోధిస్తారు మరియు వారు వాటిని పాటించాలి అని వారికి చెప్పుతారు. మరియు మీరు అలాంటి అనేక ఇతర పనులు చేస్తారు. 14 అప్పుడు యేసు మరల సమూహాన్ని దగ్గరగా రావడానికి ఆహ్వానించాడు. అప్పుడు ఆయన వారితో చెప్పాడు,“మీరు మనుష్యులు అందరు నా మాట వినండి! నేను మీకు ఏమి చెప్పబోవుచున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 15 మనుష్యులు తినే ఏదీ దేవుడు వారిని అపవిత్రంగా భావించేలా చేయదు. దానికి విరుద్ధంగా, మనుష్యుల హృదయాల నుండి వచ్చినదే దేవుడు వారిని అపవిత్రులుగా పరిగణించేలా చేస్తుంది. 16 [మీలో ప్రతి ఒక్కరు నేను చెప్పిన దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.] 17 యేసు సమూహాన్ని విడిచిపెట్టి మరియు తన శిష్యులతో కలిసి ఒక ఇంటిలోనికి ప్రవేశించిన తరువాత. ఇప్పుడే చెప్పిన ఉపమానం గురించి వారు ఆయనను ప్రశ్నించారు. 18 ఆయన వారికి జవాబిచ్చాడు, “దీని అర్థం ఏమిటో మీరు అర్థం చేసుకోలేదా? బయటి నుండి మనలోనికి ప్రవేశించే ఏదీ దేవుడు మనలను తనకు అంగీకారయోగ్యం కాదు అని భావించేలా చేయదు అని మీరు అర్థం చేసుకోవాలి. 19 మన మనస్సులలోనికి ప్రవేశించి మరియు నాశనం చేసే బదులు, అది మన కడుపులోనికి వెళుతుంది, ఆ తరువాత మన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. దీనిని చెప్పడం ద్వారా, దేవుడు తనకు అంగీకారయోగ్యంగా వారిని భావించకుండా మనుష్యులు ఎలాంటి ఆహారాన్ని అయినా తినవచ్చును అని యేసు ప్రకటిస్తున్నాడు. 20 ఆయన ఇంకా చెప్పాడు, “మనుష్యులలో నుండి వచ్చే ఆలోచనలు మరియు చర్యలే దేవుడు వారిని తనకు అంగీకారయోగ్యంగా లేరు అని భావించేలా చేస్తాయి. 21 ప్రత్యేకించి, ఒక వ్యక్తి యొక్క అంతరంగమే వారిని దుష్ట సంగతులు ఆలోచించేలా చేస్తుంది; వారు అనైతికంగా వ్యవహరిస్తారు, వారు వస్తువులను దొంగిలిస్తారు, వారు హత్య చేస్తారు. 22 వారు వ్యభిచారం చేస్తారు, వారు అత్యాశపరులు, వారు ద్వేషపూరితంగా ప్రవర్తిస్తారు, వారు మనుష్యులను మోసం చేస్తారు. వారు అసభ్యకరంగా ప్రవర్తిస్తారు, వారు మనుష్యులపై అసూయపడతారు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు, వారు గర్విష్టులుగా ఉంటారు మరియు వారు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. 23 మనుష్యులు ఈ ఆలోచనలనే ఆలోచిస్తారు, మరియు ఆ తరువాత ఈ దుష్టకార్యాలు చేస్తారు, మరియు దేవుడు వారిని తనకు అంగీకారయోగ్యం కాదు అని పరిగణించేలా అవి చేస్తాయి.” 24 యేసు మరియు ఆయన శిష్యులు గలిలయను విడిచిన తరువాత, వారు తూరు మరియు సీదోను నగరాల చుట్టూ ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ఒకానొక ఇంటిలో ఉండగా, అది ఎవరికీ తెలియకూడదు అని అనుకున్నాడు, అయితే ఆయన అక్కడ ఉన్నాడు అని మనుష్యులు వెంటనే కనుగొన్నారు. 25 ఒకానొక స్త్రీ, తన కుమార్తెలో దుష్ట ఆత్మ ఉంది, ఆమె యేసు గురించి విన్నది. ఒక్కసారిగా ఆమె అయన వద్దకు వచ్చింది మరియు ఆయన పాదముల వద్ద మోకరించింది. 26 ఇప్పుడు ఈ స్త్రీ ఒక యూదురాలు కాదు. ఆమె పితరులు యూదులు కాదు. ఆమె స్వయంగా సిరియా యొక్క జిల్లాలో, ఫియోనిసియా యొక్క ప్రాంతంలో జన్మించింది. తన కుమార్తె నుండి దుష్ట ఆత్మను బలవంతంగా బయటకు పంపమని ఆమె యేసును వేడుకుంది. 27 ఆయన ఆ స్త్రీతో చెప్పాడు: “మొదట పిల్లలు వారికి కావలసినవన్నీ తిననివ్వండి, ఎందుకంటే తల్లి పిల్లల కోసం తయారు చేసిన ఆహారాన్ని ఎవరైనా తీసుకువెళ్ళి చిన్న కుక్కలకు విసిరివేయడం మంచిది కాదు.” 28 ఆమె ఆయనకు జవాబిచ్చింది, “అయ్యా, మీరు చెప్పేది సరైనదే, అయితే బల్ల కింద పడుకునే ఇంటి కుక్కలు కూడా పిల్లలు పడేసే ముక్కలను తింటాయి.” 29 యేసు ఆమెతో చెప్పాడు: “నీవు చెప్పిన దాని ప్రకారం, ఇంటికి వెళ్ళు. దుష్ట ఆత్మ నీ కుమార్తెను విడిచిపెట్టేలా నేను చేసాను.” 30 ఆ స్త్రీ తన ఇంటికి తిరిగి వచ్చింది మరియు తన బిడ్డ మంచం మీద నిశ్శబ్దంగా పడుకోవడం మరియు దుష్ట ఆత్మ విడిచిపెట్టడం చూసింది. 31 యేసు మరియు ఆయన శిష్యులు తూరు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టారు మరియు ఉత్తరాన సీదోను మీదుగా, తరువాత తూర్పున పది పట్టణాల ప్రాంతం ద్వారా, మరియు తరువాత దక్షిణాన గలిలయ సముద్రం దగ్గర ఉన్న పట్టణాలకు వెళ్ళారు. 32 అక్కడ మనుష్యులు మాట్లాడలేని మరియు చెవిటి మనుష్యుని ఆయన వద్దకు తీసుకువచ్చారు. అతనిని స్వస్థపరడానికి అతని మీద చేతులు వేయమని యేసును వారు వేడుకున్నారు. 33 కాబట్టి వారిద్దరూ ఒంటరిగా ఉండేందుకు యేసు అతనిని గుంపు నుండి దూరంగా తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ మనుష్యుని యొక్క చెవులలో ఆయన యొక్క వ్రేళ్ళలో ఒకటి పెట్టాడు. ఆయన తన వ్రేళ్ళ మీద ఉమ్మి వేసిన తరువాత, ఆయన తన వ్రేళ్ళతో ఆ మనుష్యుని యొక్క నాలుకను తాకాడు. 34 అప్పుడు ఆయన ఆకాశము వైపు చూసాడు, ఆయన నిట్టూర్చాడు మరియు అప్పుడు తన స్వంత భాషలో ఆ మనుష్యుని యొక్క చెవులకు “ఎఫ్ఫతా” అని చెప్పాడు, దాని అర్థం“తెరవబడుము!” 35 ఒక్కసారిగా ఆ మనుష్యుడు స్పష్టంగా వినగలిగాడు. అతడు స్పష్టంగా మాట్లాడటం కూడా ప్రారంభించాడు, ఎందుకంటే అతడు మాట్లాడలేకపోవడానికి కారణమైనది స్వస్థపరచబడింది. 36 ఆయన చేసినది ఎవరికీ చెప్పవద్దు అని యేసు మనుష్యులకు చెప్పాడు. అయితే, దాని గురించి ఎవరికీ చెప్పవద్దు అని ఆయన వారికి మరియు ఇతరులకు పదేపదే ఆజ్ఞాపించినప్పటికీ, వారు దాని గురించి ఎక్కువగా మాట్లాడుచునే ఉన్నారు. 37 అది వినిని మనుష్యులు పూర్తిగా ఆశ్చర్యపోయారు మరియు చెప్పుచున్నారు, “ఆయన చేసినదంతా ఆశ్చర్యముగా ఉంది! ఇతర అద్భుతమైన పనులు చేయడంతో పాటు, ఆయన చెవిటి వారిని వినేలా చేసాడు! మరియు మాట్లాడలేని వారిని మాట్లాడగలిగేలా చేసాడు!”

Chapter 8

1 ఆ దినములలో, మనుష్యుల యొక్క సమూహము ఒకటి తిరిగి గుమిగూడారు. వారు అక్కడ రెండు దినములు ఉండిన తరువాత, వారికి తినడానికి ఆహారము లేదు. కాబట్టి యేసు తన శిష్యులను తన వద్దకు రమ్మని పిలిచాడు, మరియు అప్పుడు ఆయన వారితో చెప్పాడు, 2 “ఈ మనుష్యులు నాతో ఉండడం ఇది మూడవ దినము, వారికి తినడానికి ఏమీ మిగలలేదు, కాబట్టి ఇప్పుడు నేను వారి కోసం చాలా ఆందోళన చెందుచున్నాను. 3 వారు ఇంకా ఆకలితో ఉన్నప్పుడే నేను వారిని ఇంటికి పంపిన యెడల, వారిలో కొందరు ఇంటికి వెళ్ళే మార్గంలో మూర్ఛపోతారు. వారిలో కొందరు దూరప్రాంతాల నుండి వచ్చారు.” 4 ఆ మనుష్యులకు తినడానికి ఏదైనా ఇవ్వమని ఆయన సూచిస్తున్నాడు అని ఆయన శిష్యులకు తెలుసు, కాబట్టి వారిలో ఒకరు జవాబిచ్చారు, “ఈ సమూహమును సంతృప్తి పరచడానికి మాకు ఆహారం దొరకదు. ఈ స్థలంలో ఎవరూ నివసించరు! 5 అప్పుడు వారిని అడిగాడు, “మీకు దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” వారు జవాబిచ్చారు, “మా దగ్గర ఏడు చదునైన రొట్టెలు ఉన్నాయి.” 6 యేసు సమూహానికి ఆజ్ఞాపించాడు, “నేలమీద కూర్చోండి” వారు కూర్చున్న తరువాత, ఆయన ఏడు రొట్టెలు తీసుకుని, వాటి కోసం దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు, వాటిని ముక్కలుగా చేసాడు, మరియు మనుష్యులకు ఇవ్వడానికి తన శిష్యులకు ఇచ్చాడు. 7 వారి దగ్గర కొన్ని చిన్న చేపలు కూడా ఉన్నాయి అని గుర్తించారు. కాబట్టి ఆయన వీటి కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పిన తరువాత, అతడు తన శిష్యులతో చెప్పాడు, “వీటిని కూడా వారికి ఇవ్వండి.” వారు ఆ చేపలను సమూహానికి ఇచ్చిన తరువాత, 8 ఆ మనుష్యులు ఈ ఆహారాన్ని తిన్నారు, మరియు వారు తమను తాము తృప్తి పరచుకోవడానికి విస్తారంగా కలిగి ఉన్నారు. ఆయన శిష్యులు మిగిలిపోయిన ఆహారపు ముక్కలను సేకరించారు మరియు ఏడు పెద్ద గంపలను నింపారు. 9 ఆ దినమున దాదాపు 4,000 మంది తిన్నారు అని ఆయన శిష్యులు అంచనా వేసారు. అప్పుడు యేసు సమూహాన్ని పంపివేసాడు. 10 ఆ తరువాత వెంటనే, ఆయన తన శిష్యులతో పాటు దోనెలోనికి ఎక్కాడు మరియు వారు గలిలయ సముద్రం మీదుగా దల్మనుత జిల్లాకు ప్రయాణించారు. 11 అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చారు. వారు ఆయనతో వాదించడం ప్రారంభించారు మరియు దేవుడు ఆయనను పంపాడు అని చూపడానికి ఆయన ఒక అద్భుతం చేయాలి అని పట్టుబట్టారు. 12 యేసు తనలోపల తానే గాఢంగా నిట్టూర్చాడు మరియు అప్పుడు ఆయన చెప్పాడు, “ఒక అద్భుతం చేయమని ఈ తరము వారు అయిన మీరు నన్ను ఎందుకు అడుగుచున్నారు? నిజముగా నేను మీ కోసం ఒక అద్భుతం చేయను!” 13 అప్పుడు ఆయన వారిని విడిచిపెట్టాడు. ఆయన మరియు ఆయన శిష్యులు తిరిగి దోనెలోనికి ఎక్కారు మరియు గలిలయ సముద్రం మీదుగా ప్రయాణించారు. 14 ఆయన శిష్యులు తగినంత ఆహారాన్ని తీసుకురావడం మర్చిపోయారు. ప్రత్యేకంగా, వారు దోనెలో వారితో ఒక చదునుగా ఉన్న రొట్టె మాత్రమే కలిగి ఉన్నారు. 15 వారు వెళ్ళుచుండగా యేసు వారిని హెచ్చరించాడు మరియు చెప్పాడు, “జాగ్రత్తగా ఉండండి! పరిసయ్యుల మరియు హేరోదు యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త వహించండి! 16 శిష్యులు ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి వారు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, “మన దగ్గర రొట్టెలు లేవు కాబట్టి ఆయన అది చెప్పి ఉంటాడు.” 17 వారు తమలో తాము ఏమి చర్చించుకుంటున్నారో యేసుకు తెలుసు, కాబట్టి ఆయన వారితో చెప్పాడు, “చాలినంత రొట్టె కలిగి లేమని మీరెందుకు మాట్లాడుకొనుచున్నారు? ఇప్పటికే నేను చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి! మీరు ఆలోచించడం లేదు! 18 మీకు కళ్ళు ఉన్నాయి, అయితే మీరు చూసేది అర్థం చేసుకోలేదు! మీకు చెవులు ఉన్నాయి, అయితే నేను ఏమి చెప్పానో మీరు అర్థం చేసుకోలేదు! ” అప్పుడు ఆయన అడిగాడు, ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం లేదా 19 “నేను కేవలం ఐదు రొట్టెలు విరిచి, మరియు 5,000 మందిని పోషించినప్పుడు, తినిపించినప్పుడు ప్రతి ఒక్కరు సంతృప్తి చెందడమే కాదు, అయితే ఆహారం మిగిలి ఉంది! మిగిలిపోయిన రొట్టె ముక్కల యొక్క గంపలు ఎన్ని సేకరించారు?” వారు జవాబిచ్చారు, “మేము 12 గంపల నిండుగా సేకరించాము” 20 అప్పుడు ఆయన అడిగాడు, “నేను 4,000 మందికి ఆహారం ఇవ్వడానికి ఏడు రొట్టెలు విరిచినప్పుడు, తిరిగి అందరికీ తినడానికి విస్తారంగా ఉన్నప్పుడు, మీరు తినని రొట్టె ముక్కలను ఎన్ని పెద్ద గంపలను సేకరించారు?” వారు జవాబిచ్చారు, “మేము ఏడు పెద్ద గంపలు నిండుగా సేకరించాము.” 21 అప్పుడు ఆయన వారితో చెప్పాడు, “ఇంకా మీకు అర్థం కాలేదంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు.” 22 వారు బేత్సయిదా యొక్క పట్టణానికి చేరుకున్నారు. మనుష్యులు ఒక గ్రుడ్డివాడిని యేసు వద్దకు తీసుకువచ్చారు మరియు అతనిని స్వస్థపరచేందుకు ఆ మనుష్యుని తాకమని ఆయనను వేడుకున్నారు. 23 యేసు ఆ గుడ్డివాని యొక్క చెయ్యి పట్టుకున్నాడు మరియు అతనిని పట్టణం వెలుపలకు నడిపించాడు. ఆయన ఆ మనుష్యుని యొక్క కళ్ళలోకి ఉమ్మివేసిన తరువాత, మరియు ఆ మనుష్యుని మీద చేతులు ఉంచి, ఆయన అతనిని అడిగాడు, “నీవు ఏమైనా చూస్తున్నావా?” 24 ఆ మనుష్యుడు పైకి చూసాడు మరియు అతడు చెప్పాడు, “అవును, నేను మనుష్యులను చూస్తున్నాను! వారు చుట్టూ తిరుగుచున్నారు, అయితే నేను వారిని స్పష్టంగా చూడలేను. వారు చెట్ల వలె కనిపిస్తున్నారు! ” 25 అప్పుడు యేసు తిరిగి గ్రుడ్డివాని కళ్ళను తాకాడు. ఆ మనుష్యుడు నిశితంగా చూసాడు, మరియు ఆ సమయంలో అతడు పూర్తిగా స్వస్థపరచబడ్డాదు, అతడు ప్రతిదానిని స్పష్టంగా చూడగలిగాడు. 26 యేసు అతనితో చెప్పాడు, “పట్టణంలోనికి వెళ్ళ వద్దు!” అప్పుడు ఆయన ఆ మనుష్యుని అతని ఇంటికి పంపించాడు. 27 యేసు మరియు ఆయన శిష్యులు బేత్సయిదా పట్టణాన్ని విడిచిపెట్టారు మరియు ఫిలిప్పీ కైసరయ యొక్క నగరానికి సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్ళారు. దారిలో ఆయన వారిని ప్రశ్నించాడు, “నేను ఎవరు అని మనుష్యులు చెప్పుచున్నారు?” 28 వారు జవాబిచ్చారు, “కొందరు నీవు బాప్తిస్మమిచ్చు యోహానువు అని చెప్పుచున్నారు. మరికొందరు నీవు ఏలీయా ప్రవక్తవు అని చెప్పుచున్నారు. మరియు మరికొందరు నీవు ఇతర పూర్వ ప్రవక్తలలో ఒకడవు అని చెప్పుచున్నారు.” 29 ఆయన వారిని అడిగాడు, “మీ సంగతి ఏమిటి? నేను ఎవరు అని మీరు చెప్పుకొనుచున్నారు?" పేతురు ఆయనకు జవాబిచ్చాడు, “నీవు మెస్సీయవు అని మేము నమ్ముచున్నాము!” 30 అప్పుడు తాను మెస్సీయ అని ఇంక ఎవరికీ చెప్పవద్దు అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు. 31 అప్పుడు యేసు, మనుష్య కుమారుడైన తాను చాలా శ్రమ పడతాడు అని వారికి బోధించడం ప్రారంభించాడు. ఆయన పెద్దలు, ప్రధాన యాజకులు మరియు యూదుల ధర్మశాస్త్రాలను బోధించే మనుష్యుల చేత తిరస్కరించబడతాడు. ఆయన చంపబడతాడు కూడా, అయితే ఆయన చనిపోయిన తరువాత మూడవ దినమున, ఆయన తిరిగి సజీవుడు అవుతాడు. 32 ఆయన వారితో ఈ విషయం స్పష్టంగా చెప్పాడు. అయితే పేతురు యేసును పక్కకు తీసుకువెళ్ళి ఈ విధంగా మాట్లాడినందుకు ఆయనను తిట్టడం మొదలుపెట్టాడు. 33 యేసు వెనుకకు తిరిగాడు మరియు తన శిష్యుల వైపు చూసాడు. అప్పుడు ఆయన పేతురును గద్దించాడు, చెప్పుచున్నాడు, “ఆ విధముగా ఆలోచించడం ఆపివెయ్యి! సాతాను నీవు ఆ విధముగా మాట్లాడేల చేస్తూ ఉన్నాడు! దేవుడు నేనేం చేయాలనుకుంటున్నాడో దానికి బదులుగా, మనుష్యులు నేను ఏమి చేయాలనుకుంటున్నారో అది మాత్రమే చేయాలని నీవు కోరుకుంటున్నావు. 34 అప్పుడు ఆయన తన శిష్యులతో పాటు సమూహాన్ని తన మాట వినడానికి పిలిచాడు. ఆయన వారితో చెప్పాడు,“మీలో ఎవరైనా నా శిష్యుడుగా ఉండుటకు కోరుకొనిన యెడల, మీరు సులభంగా జీవించేలా చేసేదానిని మాత్రమే చేయకూడదు. సిలువ వేయబడే ప్రదేశాలకు బలవంతంగా సిలువలను మోసుకు వెళ్ళే నేరస్థుల వలె మీరు శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి. ఎవరైనా నా శిష్యుడుగా ఉండడానికి కోరుకున్నవారు చేయవలసినది అదే. 35 మీరు అలా చేయాలి, ఎందుకంటే తాము నాకు చెందిన వారు అని సొంతమని నిరాకరించి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు తమ ప్రాణాలను కోల్పోతారు. వారు శిష్యులు కాబట్టి ఇతరులకు శుభవార్త చెప్పడం వలన చంపబడిన వారు నాతో కలకాలం జీవిస్తారు. 36 ఈ ప్రపంచంలో ప్రజలు కోరుకున్నదంతా పొందవచ్చు, కానీ వారు శాశ్వత జీవితాన్ని పొందకపోతే వారు నిజంగా ఏమీ పొందలేరు! 37 మనుష్యులు నిత్యజీవాన్ని పొందడానికి వారిని సమర్ధులను చేసేలా దేవునికి ఇవ్వగలిగేది ఖచ్చితంగా ఏదీయు లేదు అనే వాస్తవం గురించి జాగ్రత్తగా ఆలోచించండి! 38 మరియు దీని గురించి ఆలోచించండి: అనేక మంది మనుష్యులు వారు నాకు చెందిన వారు అని చెప్పడానికి నిరాకరిస్తారు. అనేకమంది మనుష్యులు దేవునికి దూరమై పాపంలో జీవిస్తున్న ఈ దినములలో నేను చెప్పేవాటిని వారు తిరస్కరిస్తారు, మనుష్యుని యొక్క కుమారుడైన నేను కూడా పరిశుద్ధ దూతలతో తిరిగి వచ్చి తండ్రి కలిగి ఉన్న మహిమను పొందినప్పుడు వారు నాకు చెందినవారు అని చెప్పడానికి నిరాకరిస్తాను!”

Chapter 9

1 యేసు సమూహములు మరియు తన శిష్యులతో కూడా చెప్పాడు,“జాగ్రత్తగా వినండి! ఇప్పుడు ఇక్కడ ఉన్న మీలో కొందరు దేవుడు శక్తివంతంగా పరిపాలించడం చూడకముందే చనిపోరు!” 2 ఆరు దినముల తరువాత యేసు పేతురును, యాకోబును, మరియు యాకోబు సహోదరుడు యోహానును తనతో తీసుకొన్నాడు, మరియు ఒక ఎత్తైన పర్వతం మీదకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ వారు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన వారికి చాలా భిన్నంగా ప్రత్యక్షం అయ్యాడు. 3 ఆయన వస్త్రములు మిరుమిట్లు గొలిపేవిగా తెల్లగా మారాయి. వాటిని తెలుపు చేయడం ద్వారా భూమి మీద ఎవరైనా తయారు చేయగలిగే దానికంటే అవి తెల్లగా ఉన్నాయి. 4 చాలా కాలం క్రితం జీవించిన ఇద్దరు ప్రవక్తలు, మోషే మరియు ఏలీయా, వారికి ప్రత్యక్షం అయ్యారు. అప్పుడు వారు ఇద్దరు యేసుతో మాట్లాడటం మొదలుపెట్టారు. 5 కొద్ది సమయం తరువాత, పేతురు చెప్పాడు, “బోధకుడా, ఇక్కడ ఉండడం చాలా అద్భుతం! కాబట్టి మూడు పర్ణశాలలను తయారు చేయడానికి మమ్ములను అనుమతించండి. ఒకటి నీ కోసం ఉంటుంది, ఒకటి మోషే కోసం ఉంటుంది, మరియు మరొకటి ఏలీయా కోసం ఉంటుంది! ” 6 అతడు దీనిని చెప్పాడు ఎందుకంటే ఆయన ఒకటి చెప్పాలని కోరుకున్నాడు, అయితే అతనికి ఏమి చెప్పాలో తెలియదు, ఎందుకంటే అతడు మరియు మిగిలిన ఇద్దరు శిష్యులు చాలా భయపడ్డారు. 7 అప్పుడు ఒక మేఘం ప్రత్యక్షం అయ్యింది, మరియు అది వారిని కప్పివేసింది. దేవుడు మేఘం నుండి వారితో మాట్లాడాడు, చెప్పాడు,“ఈయన నా కుమారుడు. ఈయనే నేను ప్రేమించే వాడు. కాబట్టి, మీరు ఆయన చెప్పేదాని మీద శ్రద్ధ వహించాలి!” 8 ముగ్గురు శిష్యులు చుట్టూ చూసినప్పుడు, యేసు మాత్రమే తమతో ఉన్నాడు అని మరియు ఏలీయా మరియు మోషే అక్కడ లేరు అని వారు అకస్మాత్తుగా చూసారు. 9 వారు కొండ దిగి వస్తున్నప్పుడు, తనకు ఇప్పుడేం జరిగిందో ఎవరికీ చెప్పవద్దు అని యేసు వారితో చెప్పాడు. ఆయన, “మనుష్యుని యొక్క కుమారుడనైన నేను చనిపోయి, తిరిగి జీవించిన తరువాత మీరు వారితో చెప్పవచ్చు.” 10 కాబట్టి వారు చాలా కాలం వరకు దాని గురించి ఇతరులకు చెప్పలేదు. అయితే ఆయన మృతులలో నుండి లేస్తాను అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో వారు తమలో తాము చర్చించుకున్నారు. 11 ఆ ముగ్గురు శిష్యులు యేసును అడిగారు, “మెస్సీయ భూమి మీదకు రాకముందే ఏలీయా తిరిగి భూమి మీదకు రావాలి అని యూదుల ధర్మశాస్త్రాలను బోధించే వారు చెప్పుచున్నారు, {అయితే మేము ఏలీయాను ఇప్పుడే చూసాము,} కాబట్టి వారు బోధించేది తప్పా?" 12-13 యేసు వారికి జవాబిచ్చాడు,“ప్రతిదీ ఉండవలసిన విధంగా ఉంచడానికి ఏలీయాను మొదటగా పంపుతాను అని దేవుడు వాగ్దానం చేసిన మాట నిజం. అయితే ఏలీయా అప్పటికే వచ్చాడు, మరియు మన నాయకులు చాలా కాలం క్రితం ప్రవక్తలు చెప్పినట్లే చేయాలనుకున్నట్లుగానే అతనితో చాలా చెడుగా ప్రవర్తించారు. అయితే మనుష్యుని యొక్క కుమారుడనైన నా గురించి లేఖనాలలో చాలా వ్రాయబడి ఉన్నాయి. నేను చాలా శ్రమపడతాను మరియు ఆ మనుష్యులు నన్ను తిరస్కరిస్తారు అని లేఖనాలు చెప్పుచున్నాయి.” 14 యేసు మరియు ఆ ముగ్గురు శిష్యులు ఇతర శిష్యులు ఉన్న చోటికి చేరుకున్నారు. ఇతర శిష్యుల చుట్టూ ఒక పెద్ద సమూహము మరియు యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే కొందరు మనుష్యులు వారితో వాదించడం చూసారు. 15 యేసు రావడం చూసి జనసమూహం చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి వారు అయన వద్దకు పరుగెత్తారు మరియు ఆయనకు నమస్కరించారు. 16 యేసు వారిని అడిగాడు, “మీరు దేని గురించి వాదిస్తున్నారు?” 17 ఆ సమూహములో ఉన్న ఒక మనుష్యుడు ఆయనకు జవాబిచ్చాడు,“బోధకుడా, నేను నా కుమారుడిని నీ వద్దకు తీసుకొని వచ్చాను. అతనిలో ఒక దుష్ట ఆత్మ ఉంది, అది అతనిని మాట్లాడనీయకుండా చేస్తుంది. 18 ఆ ఆత్మ అతనిని అదుపు చేయడం ప్రారంభించినప్పుడు, అది అతనిని కింద పడవేస్తుంది. అతడు నోటి నుండి నురుగును తెస్తాడు, అతడు తన పళ్ళు కలిపి కొరుకుతాడు, మరియు అతడు గట్టిపడుతాడు. ఆత్మను పారద్రోలమని నేను మీ శిష్యులను అడిగాను, అయితే వారు దానిని చేయలేకపోయారు. 19 “మీరు విశ్వాసం లేని మనుష్యులు! మీ అవిశ్వాసం వలన నేను బాగా అలసిపోయిన వానిగా మారాను, ఆ బాలుడుని నా వద్దకు తీసుకురండి” అని చెప్పడం ద్వారా వారికి జవాబిచ్చాడు. 20 కాబట్టి వారు ఆ బాలుడుని యేసు వద్దకు తీసుకొచ్చారు. దుష్ట ఆత్మ యేసును చూసిన వెంటనే, అది బాలుడిని తీవ్రంగా కదిలించింది, మరియు బాలుడు నేలమీద పడిపోయాడు. అతడు చుట్టూ దొర్లాడు మరియు నోటి నుండి నురుగు వచ్చింది. 21 యేసు బాలుడి యొక్క తండ్రిని అడిగాడు, “ఎంతకాలం అతడు ఈ విధముగా ఉన్నాడు?” అతడు జవాబిచ్చాడు, “అతడు పిల్లవాడుగా ఉన్నప్పుడు ఇది జరగడం ప్రారంభమైంది. 22 ఆ ఆత్మ దీనిని చేయడమే కాదు, అయితే అది అతనిని చంపడానికి కూడా తరచుగా అగ్నిలోనికి లేదా నీటిలోనికి విసిరివేస్తుంది. మా మీద జాలి చూపించండి మరియు నీవు చేయగలిగిన యెడల మాకు సహాయం చేయండి! ” 23 యేసు అతనితో బిగ్గరగా చెప్పాడు,“ఔను నేను చేయగలను! దేవుడు చేయగలడు అని నమ్మే మనుష్యుల కోసం దేవుడు దానిని చేయగలడు!” 24 ఆ పిల్లవాని యొక్క తండ్రి వెంటనే కేకవేసాడు, “నీవు నాకు సహాయం చేయగలవు అని నమ్ముచున్నాను, అయితే నేను బలంగా నమ్మను. మరింత బలంగా నమ్మడానికి నాకు సహాయం చెయ్యండి! 25 జన సమూహము పెరగడం యేసు చూసాడు. ఆయన దుష్ట ఆత్మను గద్దించాడు: “దుష్ట ఆత్మా నీవు, ఈ అబ్బాయిని చెవిటివాడు అయ్యేలా చేస్తున్నావు మరియు మాట్లాడలేని స్థితిని కలిగిస్తున్నావు! అతని నుండి బయటకు రమ్మని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ఇక ఎన్నడు అతనిలోనికి ప్రవేశించ వద్దు! 26 ఆ దుష్ట ఆత్మ అరిచింది మరియు ఆ బాలుడిని తీవ్రంగా కదిలించింది, మరియు అప్పుడు అది ఆ బాలుడిని విడిచిపెట్టింది. బాలుడు కదల లేదు. ఒక మృత దేహం వలె కనిపించాడు. కాబట్టి అక్కడ ఉన్న అనేక మంది మనుష్యులు చెప్పారు, “అతడు చనిపోయాడు!” 27 అయినప్పటికీ, యేసు బాలుడి చెయ్యి పట్టుకున్నాడు మరియు లేవడానికి సహాయం చేసాడు. అప్పుడు ఆ బాలుడు లేచి నిలబడ్డాడు. 28 తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు ఒంటరిగా ఒక ఇంట్లో ఉన్నప్పుడు, వారు ఆయనను అడిగారు, “మేము ఎందుకు దుష్ట ఆత్మను బయటకు పంపలేకపోయాం?” 29 యేసు వారితో చెప్పాడు,“మీరు ఆహారం నుండి మానుకోవడం ద్వారా మరియు దేవునికి ప్రార్థించడం ద్వారా మాత్రమే ఇలాంటి దుష్ట ఆత్మలను బలవంతంగా వెళ్ళగొట్టగలరు. మీరు వాటిని వెళ్ళగొట్టడానికి వేరే మార్గం లేదు.” 30 యేసు మరియు ఆయన శిష్యులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిన తరువాత, వారు గలిలయ ప్రాంతం గుండా ప్రయాణించారు. తాను ఎక్కడ ఉన్నాడో ఇంకా ఎవరికీ తెలియకూడదని యేసు కోరుకున్నాడు. 31 యేసు తన శిష్యులకు బోధించడానికి సమయం కావాలని కోరుకున్నాడు. ఆయన వారితో చెప్పుచున్నాడు: “ఏదో ఒక దినము నా శత్రువులు మనుష్యుని యొక్క కుమారుడుడనైన నన్ను బంధిస్తారు, మరియు నేను ఇతర మనుష్యుల చేతులలో పెట్టబడతాను. ఆ మనుష్యులు నన్ను చంపుతారు. అయితే నేను చనిపోయిన మూడవ దినమున, నేను తిరిగి సజీవుడను అవుతాను! 32 శిష్యులకు యేసు ఏమి చెప్పుచున్నాడో అర్థం చేసుకోలేదు, మరియు ఆయన భావం ఏమిటోఆయనను అడగడానికి వారు భయపడ్డారు. 33 యేసు మరియు ఆయన శిష్యులు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు యేసు వారిని అడిగాడు, “మనం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు దేని గురించి మాట్లాడుచున్నారు?” 34 అయితే శిష్యులు జవాబు చెప్పలేదు. వారు జవాబివ్వడానికి సిగ్గుపడ్డారు, ఎందుకంటే వారు ప్రయాణిస్తున్నప్పుడు, వారిలో ఎవరు ముఖ్యమైన వారు అని ఒకరితో ఒకరు వాదించుకున్నారు. 35 యేసు కూర్చున్నాడు. ఆయన తన 12 మంది శిష్యులను తన వద్దకు రమ్మని పిలిచాడు, మరియు అప్పుడు ఆయన వారితో చెప్పాడు,“దేవుడు తనను అందరికంటే ముఖ్యమైన మనుష్యుడుగా పరిగణించాలని ఎవరైనా కోరుకున్న యెడల, అతడు తనను తాను అందరికంటే తక్కువ ముఖ్యమైన మనుష్యుడుగా పరిగణించుకోవాలి, మరియు ప్రతి ఒక్కరికి సేవ చేయాలి." 36 అప్పుడు యేసు ఒక బిడ్డను తీసుకొని వారి మధ్య ఉంచాడు. ఆయన ఆ బిడ్డను తన చేతుల లోనికి తీసుకున్నాడు, మరియు అప్పుడు వారితో చెప్పాడు, 37 “నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఇలాంటి బిడ్డను స్వాగతించే వారు నన్ను స్వాగతిస్తున్నారు అని దేవుడు భావిస్తాడు. ఎవరైతే నన్ను స్వాగతిస్తారో, వారు తనకు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను పంపిన దేవుని కూడా స్వాగతిస్తున్నట్లే.” 38 యోహాను యేసుతో చెప్పాడు, “బోధకుడా, మనుష్యులలో నుండి దుష్ట ఆత్మలను బలవంతంగా వెళ్ళగొట్టే ఒకరిని మేము చూసాము. దానిని చేసే అధికారం నీ నుండి తనకు ఉంది అని అతడు చెప్పుచున్నాడు. అతడు మా శిష్యులలో ఒకడు కాదు, కాబట్టి దీనిని చేయడం మానేయమని మేము అతనికి చెప్పాము. 39 యేసు చెప్పాడు, “దానిని చేయడం ఆపమని అతనికి చెప్ప వద్దు. ఎందుకంటే నా అధికారంతో శక్తివంతమైన కార్యం చేసిన వెంటనే నా గురించి ఎవరు చెడుగా మాట్లాడరు. 40 మనలను వ్యతిరేకించని వారు మనకున్న అవే లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. 41 మీరు మెస్సీయ అయిన నన్ను వెంబడించిన కారణంగా, మీకు ఏ విధంగానైనా సహాయం చేసేవారికి, ఒక పాత్ర నీరు త్రాగడానికి ఇచ్చినా కూడా వారికి దేవుడు నిశ్చయంగా ప్రతిఫలమిస్తాడు!” 42 యేసు ఇంకా చెప్పాడు, “అయితే నాలో విశ్వసించే ఒకరిని నీవు పాపం చేసేలా చేసిన యెడల {, దేవుడు నిన్ను కఠినంగా శిక్షిస్తాడు}. ఎవరైనా నీ మెడలో ఒక చాలా బరువైన రాయిని కట్టి మరియు సముద్రం లోనికి విసిరిన యెడల, అది నన్ను విశ్వసించిన ఒకరిని పాపం చేసేలా చేసినందుకు దేవుడు నిన్ను శిక్షించిన దానికంటే నీకు మంచిది. 43 కాబట్టి మీరు పాపం చేయడానికి మీ చేతులలో ఒకదానిని ఉపయోగించాలనుకున్న యెడల, దానిని ఉపయోగించ వద్దు! పాపం చేయకుండా ఉండేందుకు నీ చేయి నరికి మరియు దానిని పారవేయవలసిన యెడల, దానిని చేయండి! మీరు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మీ చేతులలో ఒకటి లేకపోయినా, మీరు నిత్యము జీవించడం మంచిది. అయితే మీరు పాపం చేయడం మంచిది కాదు మరియు దాని ఫలితంగా దేవుడు మీ మొత్తం శరీరమును నరకంలో పడవేస్తాడు. అక్కడ, మంటలు ఎన్నడు ఆరిపోవు! 44 [అది పురుగులు వారిని తినకుండా ఎన్నడు ఆగిపోని ప్రదేశం, వారిని కాల్చే మంట ఎన్నడు ఆరిపోదు.] 45 పాపం చేయడానికి మీరు మీ పాదాలలో ఒకదానిని ఉపయోగించాలనుకున్న యెడల, మీ పాదాలను ఉపయోగించడం మాని వెయ్యండి! పాపం చేయకుండా ఉండదానికి కాలు నరికి వేయవలసి ఉన్న యెడల, దానిని చేయండి! మీరు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు మీ పాదాలలో ఒకటి లేకపోయినా, మీరు {పాపం చేయకుండా మరియు} నిత్యము జీవించడం మంచిది. అయితే {నీవు పాపం చేయడం, మరియు దాని ఫలితంగా,} దేవుడు నీ శరీరము అంతటిని నరకంలోనికి ఉంచడం ఇది మంచిది కాదు. 46 [అది పురుగులు వారిని తినకుండా ఎన్నడు ఆగిపోని ప్రదేశం, వారిని కాల్చే మంట ఎన్నడు ఆరిపోదు.] 47 మీరు చూసే దాని కారణంగా మీరు పాపం చేయడానికి శోధించబడిన యెడల, ఆ విషయాలను చూడటం మాని వెయ్యండి! పాపం చేయకుండా ఉండటానికి మీరు మీ కన్ను బయటికి తీసి మరియు విసిరివేయవలసి వచ్చినప్పటికి ఆపండి, దానిని చేయండి! రెండు కళ్ళతో నువ్వు నరకంలో పడవేయటం కంటే ఒక్క కన్ను మాత్రమే ఉండి దేవుడు పరిపాలిస్తున్న రాజ్యంలో ప్రవేశించడం మేలు. 48 అది పురుగులు వారిని తినకుండా ఎన్నడు ఆగిపోని ప్రదేశం, వారిని కాల్చే మంట ఎన్నడు ఆరిపోదు. 49 దేవుడు మీ చేత సంతోషపెట్టబడడానికి మీరు కష్టాలను సహించాలి. మీ శ్రమలు వస్తువులను పరిశుద్దము చేసే ఒక నిప్పులాంటివి. మీ సహనం కూడా మనుష్యులు తమను పరిశుద్దముగా మార్చడానికి వారి బలులకు ఉప్పు వేసినట్లే ఉంది. 50 ఉప్పు ఆహారంలో పెట్టడానికి ఉపయోగపడుతుంది, అయితే అది రుచిలేకుండా మారితే మీరు దానిని తిరిగి ఉప్పగా రుచి చూడలేరు. అదేవిధంగా, మీరు దేవునికి ఉపయోగకరంగా ఉండాలి, ఎందుకంటే మీరు పనికిరానివారైతే మీరు తిరిగి దేవునికి ఎలా ఉపయోగపడగలరు. మీరు కూడా ఒకరితో ఒకరు సమాధానముగా జీవించాలి.”

Chapter 10

1 యేసు తన శిష్యులతో ఆ ప్రదేశమును విడిచి, మరియు వారు యూదయ ప్రాంతం ద్వారా యొర్దాను నదికి తూర్పు వైపునకు వెళ్ళేరు. మనుష్యుల యొక్క సమూహములు తిరిగి తన చుట్టూ గుమిగూడినప్పుడు, ఆయన క్రమముగా చేసిన విధముగా, తిరిగి వారికి బోధించాడు. 2 యేసు బోధిస్తున్నప్పుడు, కొందరు పరిసయ్యులు ఆయనను సమీపించారు మరియు ఆయనను అడిగారు, “ఒక పురుషుడు తన భార్యను పరిత్యజించుటకు మన ధర్మశాస్త్రం అనుమతిస్తుందా?” ఆయన "అవును" లేదా "కాదు" అని సమాధానమిచ్చినా ఆయనను విమర్శించడానికి వారు అడిగారు. 3 యేసు వారికి జవాబిచ్చాడు, “ఒక పురుషుడు తన భార్యను పరిత్యజించడం గురించి మోషే మీ పితరులకు ఏమి ఆజ్ఞాపించాడు?” 4 వారిలో ఒకడు జవాబిచ్చాడు, “ఒక వ్యక్తి పరిత్యాగ పత్రాలు వ్రాసి ఆమెను పంపించడానికి మోషే అనుమతించాడు.” 5 యేసు వారితో చెప్పాడు,“మీ తిరుగుబాటు వైఖరి కారణంగానే మోషే మీ కోసం ఆ నియమము మీకు ఇచ్చాడు. 6 దేవుడు మొదట మనుష్యులను సృష్టించినప్పుడు, ఒక పురుషుడిని చేసాడు, మరియు ఆ పురుషుడికి భార్యగా ఒక స్త్రీని చేసాడు అని గుర్తుంచుకోండి. 7 దేవుడు ఎందుకు చెప్పాడో అది వివరిస్తుంది, ‘ఒక పురుషుడు మరియు స్త్రీ వివాహం చేసుకున్నప్పుడు, వారు ఇక మీదట వారి తండ్రులు మరియు తల్లులతో నివసించకూడదు. 8 బదులుగా, వారు ఇద్దరు కలిసి జీవిస్తారు, మరియు వారు ఒక మనుష్యుడులాగా చాలా సన్నిహితంగా ఐక్యం అవుతారు. 'కాబట్టి, వివాహం చేసుకునే మనుష్యులు ఇంతకు ముందు ఇద్దరు వేర్వేరు మనుష్యులు అయినప్పటికీ, వివాహం తరువాత దేవుడు వారిని ఒక మనుష్యుడుగా పరిగణిస్తాడు. {కాబట్టి వారు ఒకరికొకరు వివాహితులుగా ఉండిపోవాలని ఆయన కోరుచున్నాడు}. 9 అది నిజం కాబట్టి, ఒక పురుషుడు తన భార్యను పరిత్యజించకూడదు. దేవుడు వారిని ఒకటిగా కలిపి వేసాడు, మరియు వారు కలిసి ఉండాలని ఆయన కోరుచున్నాడు! 10 యేసు మరియు ఆయన శిష్యులు ఒంటరిగా ఒక ఇంటిలో ఉన్నప్పుడు, వారు దానిని గురించి ఆయనను తిరిగి అడిగారు. 11 యేసు వారితో చెప్పాడు,“ఏ పురుషుడైన తన భార్యను పరిత్యజించి మరియు మరొక స్త్రీని పెళ్ళిచేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు అని దేవుడు పరిగణిస్తున్నాడు. 12 తన భర్తను పరిత్యజించి మరియు మరొక పురుషుని పెళ్ళి చేసుకునే స్త్రీని కూడా దేవుడు వ్యభిచారం చేస్తున్నది అని పరిగణిస్తాడు.” 13 ఇప్పుడు మనుష్యులు పిల్లలను యేసు వద్దకు తీసుకువస్తున్నారు తద్వారా ఆయన వారి మీద చేతులు ఉంచి మరియు వారిని ఆశీర్వదిస్తాడు. ఆయిత ఆయన శిష్యులు ఆ మనుష్యులను గద్దించారు. 14 యేసు అది చూసినప్పుడు, ఆయనకు కోపం వచ్చింది. ఆయన తన శిష్యులతో చెప్పాడు,“పిల్లలు నా వద్దకు వచ్చుటకు అనుమతించండి! వారిని నిషేధించవద్దు! వినయంగా మరియు దేవుని విశ్వసించే మనుష్యులు తమ జీవితాలలో దేవుని పాలనను అనుభవించగలరు. 15 దీనిని గమనించండి: పిల్లలు చేసిన విధముగా తమ మీద దేవుని యొక్క పరిపాలనను స్వాగతించని వారు దేవుడు పరిపాలించే రాజ్యంలోనికి ఖచ్చితంగా ప్రవేశించరు.” 16 అప్పుడు యేసు పిల్లలను తన చేతులలో పట్టుకున్నాడు. ఆయన వారి మీద చేతలు కుడా ఉంచాడు మరియు వారికి మేలు చేయుటకు దేవునికి ప్రార్థించాడు. 17 యేసు తన శిష్యులతో కలిసి తిరిగి ప్రయాణం మొదలు పెట్టియుండగా, ఒక మనుష్యుడు ఆయన వద్దకు పరిగెత్తి వచ్చాడు. అతడు యేసు ముందు మోకరించాడు మరియు ఆయనను అడిగాడు, “మంచి బోధకుడా, నేను దేవునితో నిత్యముగా జీవించు నట్లు నేను ఏమి చేయాలి?” 18 యేసు అతనితో చెప్పాడు, “నీవు నన్ను మంచివాడిని అని పిలుచుట ద్వారా ఏమి చెప్పుచున్నావో నీవు గ్రహించ లేదు. దేవుడు మాత్రమే మంచివాడు! 19 {అయితే నీ ప్రశ్నకు సమాధానం చెప్పుటకు} నీకు మోషే యొక్క ఆజ్ఞలు తెలుసు: 'ఎవరినీ హత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, ఎవరి దగ్గర దొంగిలించవద్దు, దేని గురించి అబద్ధం చెప్పవద్దు, ఎవరినీ మోసం చేయవద్దు మరియు నీతండ్రి మరియు తల్లి యెడల గౌరవంగా ఉండండి.'” 20 ఆ మనుష్యుడు ఆయనతో చెప్పాడు, “బోధకుడా, నేను చిన్నప్పటి నుండి ఆ ఆజ్ఞలు అన్నిటికి విధేయుడైనాను.” 21 యేసు అతని వైపు ఆసక్తితో కూడిన ప్రేమతో చూసాడు. ఆయన అతనితో చెప్పాడు, “నీవు ఇంకా చేయని పని ఒకటి ఉంది. నీవు ఇంటికి వెళ్ళాలి, నీకు కలిగినది అంతా అమ్మివెయ్యి, మరియు అప్పుడు ఆ డబ్బును పేద మనుష్యులకు ఇవ్వాలి. ఫలితంగా, నీవు పరలోకములో ఆత్మీయముగా ధనవంతుడవు అవుతావు. నేను నీతో చెప్పినట్టు నీవు చేసిన తరువాత, నాతో వచ్చి మరియు నా శిష్యుడిగా ఉండు!” 22 ఆ మనుష్యుడు యేసు యొక్క హెచ్చరికలతో కలత చెందాడు. ఎందుకంటే అతడు తన సంపదతో విడిపోలేక గొప్ప దుఃఖముతో వెళ్ళిపోయాడు. 23 యేసు చుట్టూ ఉన్న మనుష్యుల వైపు చూసాడు. అప్పుడు ఆయన తన శిష్యులతో ఆశ్చర్య పడ్డాడు, “సంపన్నులైన మనుష్యులు తమ్మును తాము దేవుని యొక్క పరిపాలన క్రింద ఉంచుకోవడం చాలా కష్టం.” 24 యేసు చెప్పిన మాటల చేత శిష్యులు ఆశ్చర్యపోయారు. {దేవుడు ధనవంతుల యెడల అనుగ్రహం చూపాడని వారు తలంచారు, కాబట్టి దేవుడు వారిని రక్షింపని యెడల, ఆయన ఎవరినీ రక్షించడు.} యేసు మరల చెప్పాడు, “నా సంరక్షణలో ఉన్న ప్రియమైన విశ్వాసులారా, దేవుడు తన జీవితాన్ని పరిపాలించనివ్వడానికి నిర్ణయించుకోవడం ఎవరికైనా చాలా కష్టం. 25 ఒంటెలాంటి చాల పెద్ద జంతువు కుట్టు సూదిలోని చిన్న రంధ్రం గుండా వెళ్ళడం అసాధ్యం. ధనవంతులు తమ జీవితాలను దేవుడే పరిపాలించనివ్వడానికి నిర్ణయించుకోవడం దాదాపు కష్టం.” 26 శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి వారు యేసుతో చెప్పారు, “అది ఆలాగైన యెడల, అప్పుడు ఎవరైనా ఎలా రక్షించబడగలరు!” 27 యేసు వారి వైపు చూసాడు, మరియు అప్పుడు ఆయన చెప్పాడు, “అవును, మనుష్యులు తమ్మును తాము రక్షించుకోవడం అసాధ్యం! అయితే దేవుడు నిశ్చయముగా వారిని రక్షించగలడు, ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు! ” 28 పేతురు, “చూడండి, మేము అన్నీ విడిచిపెట్టి, మీకు శిష్యులమైపోయాము” అన్నాడు. 29 యేసు జవాబిచ్చాడు,“మీరు దీనిని తెలుసుకోవాలని నేను కోరుచున్నాను: నా శిష్యులుగా ఉండేందుకు మరియు శుభ వార్త ప్రకటించుటకు తమ ఇండ్లను, సహోదరులను, సహోదరీలను, వారి తండ్రిని, వారి తల్లిని, వారి పిల్లలను, వారి భూమి యొక్క స్థలాలు విడిచిపెట్టిన వారు, 30 వారు వదిలిపెట్టిన దానికంటే వంద రెట్లు ఈ జీవితములో పొందుతారు. అందులో ఇళ్ళు మరియు కుటుంబ సభ్యులు ఉంటారు: సహోదరులు మరియు సహోదరీలు మరియు తల్లులు మరియు పిల్లలు మరియు భూమి యొక్క స్థలాలు. అంతేకాకుండా, మనుష్యులు వారిని హింసిస్తారు {ఇక్కడ భూమి మీద వారు నన్ను విశ్వసిస్తారు కాబట్టి}, అయితే భవిష్యత్ యుగంలో వారు నిత్యముగా దేవునితో జీవిస్తారు. 31 ఇతరులు చాలా ముఖ్యమైన మనుష్యులుగా భావించే అనేక మందిని దేవుడు ప్రాముఖ్యతలేని వారిగా పరిగణిస్తాడు, మరియు ఇతరులు ప్రాముఖ్యతలేని వారిగా భావించే అనేక మందిని దేవుడు చాలా ముఖ్యమైనవారిగా పరిగణిస్తారు!” 32 కొన్ని దినముల తరువాత వారు ప్రయాణం కొనసాగిస్తుండగా, యేసు మరియు ఆయన శిష్యులు యెరూషలేము పట్టణానికి నడిపే దారిలో నడుస్తున్నారు. యేసు వారికి ముందుగా నడుచుచున్నాడు. శిష్యులు ఆశ్చర్యపోయారు మరియు వారితో ఉన్న ఇతర మనుష్యులు భయపడ్డారు. మార్గం మధ్యలో యేసు 12 మంది శిష్యులను తిరిగి ఒక చోటికి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆయన తనకు ఏమి జరగబోతుందో వారితో చెప్పడం ప్రారంభించాడు. 33 ఆయన చెప్పాడు, “జాగ్రత్తగా వినండి! మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము. అక్కడ ప్రధాన యాజకులు మరియు యూదుల చట్టాల యొక్క బోధకులు మనుష్యుని యొక్క కుమారుడుడనైన నన్ను నిర్భందిస్తారు. నేను చనిపోవాలి అని వారు దానిని ప్రకటిస్తారు. అప్పుడు వారు నన్ను రోమా అధికారుల వద్దకు తీసుకువెళతారు. 34 వారి మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు మరియు నా మీద ఉమ్మివేస్తారు. వారు నన్ను కొరడాలతో కొడతారు, మరియు అప్పుడు వారు నన్ను చంపుతారు. అయితే ఆ తరువాత మూడవ దినమునేను మరల సజీవుడవుతాను! 35 మార్గం మధ్యలో, జెబెదయి ఇద్దరు కుమారులైన యాకోబు, మరియు యోహానులు యేసు వద్దకు వచ్చారు మరియు ఆయనతో చెప్పారు, “బోధకుడా, మేము నిన్ను ఏమి చేయమని కోరుచున్నామో అది మాకు చేయాలని మేము కోరుచున్నాము!” 36 యేసు వారితో చెప్పాడు, “నేను మీ కోసం చేయాలి అని మీరు కోరుచున్నది ఏమిటి?” 37 వారు ఆయనతో చెప్పారు, “నీవు మహిమాన్వితంగా పరిపాలిస్తున్నప్పుడు, మాలో ఒకరు నీ కుడి వైపున మరియు ఒకరు నీ ఎడమ వైపున కూర్చోనివ్వండి.” 38 అయితే యేసు వారితో చెప్పాడు, “మీరు ఏమి అడుగుచున్నారో మీకు అర్థం కావడం లేదు.” {అప్పుడు ఆయన వారిని అడిగాడు,} “నేను శ్రమ పడబోవుచున్న విధముగా మీరు కూడా భరించగలరా? మనుష్యులు నన్ను చంపిన విధంగా మిమ్ములను చంపడాన్ని మీరు భరించగలరా? ” 39 వారు ఆయనకు చెప్పారు, “అవును, మేము దానిని చేయగలం!” అప్పుడు యేసు వారితో చెప్పాడు,“నేను శ్రమలు అనుభవిస్తున్నట్లు విధముగా మీరు కూడా భరిస్తారు, మరియు మనుష్యులు నన్ను చంపిన విధంగా మిమ్ములను చంపడాన్ని కూడా మీరు భరిస్తారు. 40 అయితే నా పక్కన ఎవరు కూర్చోవాలో ఎంపిక చేసుకునే వాడిని నేను కాదు. దేవుడు ముందుగా ఆయన ఎంపిక చేసుకున్న వారికి ఆ స్థానాలను ఇస్తాడు.” 41 మిగిలిన పది మంది శిష్యులు యాకోబు మరియు యోహాను కోరిన దాని గురించి తరువాత విన్నారు. {ఫలితంగా,} వారు వారి మీద కోపంగా ఉన్నారు. 42 అప్పుడు, యేసు వారి అందరిని పిలిచిన తరువాత, ఆయన వారితో చెప్పాడు,“యూదులు కానివారిని పరిపాలించేవారు తాము శక్తిమంతులము అని చూపించడంలో ఆనందిస్తారు అని మీకు తెలుసు. వారి అధికారులు ఇతరులను ఆజ్ఞాపించడాన్ని ఆనందిస్తారు అని కూడా మీకు తెలుసు. 43 అయితే వారి వలె ఉండకండి! దీనికి విరుద్ధంగా, మీలో ఎవరైనా గొప్పతనాన్ని సాధించాలనుకున్న యెడల, అతడు తనను తాను ఇతరుల సేవకుడిగా భావించాలి. 44 మరియు, మీలో ఎవరైనా దేవుడు తనను అత్యంత ముఖ్యమైన మనుష్యుడుగా పరిగణించాలి అని కోరుకున్న యెడల, అతడు మీ మిగిలిన వారికి బానిస పాత్రను తప్పక తీసుకోవాలి. 45 మనుష్య కుమారుడనైన నేను కూడా, సేవను స్వీకరించేందుకు రాలేదు అయితే సేవ చేయడానికి మరియు పాపానికి పరిహారంగా మనుష్యుల కోసం చనిపోవడానికి వచ్చాను, పాపులకు దేవుడు విధించిన శిక్ష నుండి వారికి విముక్తిని కొనుటకు వచ్చాను.” 46 యెరూషలేము పట్టణానికి వెళ్ళే మార్గంలో, యేసు మరియు ఆయన శిష్యులు యెరికో పట్టణానికి వచ్చారు. అప్పుడు, వారు గొప్ప సమూహంతో పాటు యెరికో నుండి బయలుదేరుచుండగా, చూడలేని ఒక మనుష్యుడు మరియు ఇతరులను తరచుగా డబ్బు అడిగే వాడు రోడ్డు పక్కన కూర్చున్నాడు. అతని పేరు బర్తిలోమయి, మరియు అతని తండ్రి యొక్క పేరు తీమయి. 47 నజరేతు నుండి వచ్చిన యేసు అటుగా వెళ్ళుచున్నాడు అని మనుష్యులు చెప్పడం విని, అతడు అరిచాడు, “యేసూ! దావీదు రాజు నుండి సంతానంగా వచ్చిన వాడా, నాకు సహాయం చేయండి! 48 అనేకమంది మనుష్యులు అతనిని తిట్టారు మరియు అతని మౌనంగా ఉండవలెను అని చెప్పారు. బదులుగా, అతడు మరింత బిగ్గరగా కేకలు వేసాడు, "యేసూ! దావీదు రాజు నుండి సంతానంగా వచ్చన వాడా, నన్ను కరుణించుము!" 49 యేసు నిలిచాడు మరియు చెప్పాడు, “అతనిని ఇక్కడికి రమ్మని పిలవండి!” వారు గ్రుడ్డివాడిని పిలిచారు, చెప్పుచున్నారు,“యేసు నిన్ను పిలుస్తున్నాడు! కాబట్టి ఉత్సాహంగా ఉండు మరియు నిలబడు మరియు రమ్ము! ” 50 అతడు పైకి దూకుచు తన అంగీని పక్కన పడవేసాడు, మరియు అతడు యేసు వద్దకు వచ్చాడు. 51 యేసు అతనిని అడిగాడు, “నేను నీకు ఎలా సహాయం చేయాలని ఇష్టపడుచున్నావు?” గ్రుడ్డివాడు ఆయనతో చెప్పాడు, “బోధకుడా, నేను మరల చూడగలగాలి అని కోరుచున్నాను!” 52 యేసు అతనితో చెప్పాడు, “నీవు నాయందు విశ్వాసము ఉంచావు కాబట్టి, నేను నిన్ను స్వస్థపరిచాను! కాబట్టి నీవు వెళ్ళవచ్చు!" అతడు వెంటనే చూడగలిగాడు. మరియు అతడు యేసుతో పాటు మార్గమున వెళ్ళాడు.

Chapter 11

1 యేసు మరియు ఆయన శిష్యులు యెరూషలేము సమీపమునకు వచ్చినప్పుడు, వారు ఒలీవల యొక్క కొండకు సమీపంలో ఉన్న బేత్ఫాగే మరియు బేతనియ యొక్క గ్రామాలకు వచ్చారు. అప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని వారికి ముందుగా పంపించాడు. 2 యేసు వారితో చెప్పాడు, “కేవలం మన ముందున్న ఆ గ్రామానికి వెళ్ళండి. మీరు దానిలోనికి ప్రవేశించిన వెంటనే, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టివేయబడి ఉండడం మీరు చూస్తారు. ఇది ఇప్పటి వరకు ఎవరూ స్వారీ చెయ్యని ఒక జంతువు. దానిని విప్పండి మరియు నా వద్దకు తీసుకురండి. 3 ‘మీరు ఎందుకు దానిని చూచుచున్నారు?’ ఎవరైనా మిమ్ములను అడిగిన యెడల, ‘యేసుకు ఇది కావాలి. ఆయనకు ఇక అవసరం లేనప్పుడు దానిని ఎవరితోనైనా తిరిగి ఇక్కడికి పంపుతాడు.’’ 4 కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళారు, మరియు వారు గాడిదను కనుగొన్నారు. అది ఒక ఇంటి తలుపుకు దగ్గరగా కట్టివేయబడిఉంది మరియు వీధిలో నిలబడి ఉంది. అప్పుడు వారు దానిని విప్పారు. 5 అక్కడ ఉన్న కొందరు మనుష్యులు యేసు యొక్క ఇద్దరు శిష్యులను అడిగారు, “ఎందుకు మీరు గాడిదను విప్పుచున్నారు?” 6 యేసు చెప్పమని వారికి హెచ్చరించిన దానిని వారికి చెప్పారు. కాబట్టి ఆ మనుష్యులు గాడిదను తీసుకువెళ్ళాడానికి అనుమతించారు. 7 ఆ ఇద్దరు శిష్యులు ఆ గాడిదను యేసు వద్దకు తీసుకువెళ్ళారు మరియు ఆయన కూర్చోవడానికి ఒకదానిని తయారుచేయడానికి} దాని మీద తమ వస్త్రాలు ఉంచారు అప్పుడు యేసు గాడిద మీద కూర్చున్నాడు. 8 ఆయన ఎదురుగా దారిలో అనేక మంది మనుష్యులు తమ వస్త్రాలు పరిచారు. ఇతరులు సమీపంలోని పొలాలలోని తాటి చెట్ల కొమ్మలను కత్తిరించారు మరియు దారి పొడవునా పరిచారు. 9 ఆయన ముందు మరియు వెనుక వెళ్ళుచున్న మనుష్యులు అందరూ, “దేవుని స్తుతించండి!” {మరియు} "దేవుడు తన ప్రతినిధిగా వచ్చుచున్న ఈయనను ఆశీర్వదించును గాక" అని కేకలు వేసారు. 10 {వారు కూడా కేకలు వేసారు,} మా పితరుడైన దావీదు రాజు పాలించిన విధముగా నీవు పరిపాలించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక!” "అత్యున్నతమైన పరలోకములో ఉన్న దేవుని స్తుతించండి!" 11 యేసు వారితో యెరూషలేములోనికి ప్రవేశించాడు, మరియు అప్పుడు ఆలయ ప్రాంగణంలోనికి వెళ్ళాడు. ఆయన అక్కడ చుట్టూ ప్రతీది చూసిన తరువాత, ఆయన నగరాన్ని విడిచిపెట్టాడు ఎందుకంటే అప్పటికే మధ్యాహ్నం ఆలస్యమైంది. ఆయన 12 మంది శిష్యులతో బేతనియ గ్రామానికి తిరిగి వచ్చాడు. 12 మరుసటి దినము, యేసు మరియు ఆయన శిష్యులు బేతనియను విడిచిపెట్టుచుండగా, ఆయనకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో, ఆకులు అన్నీ ఉన్న అంజూరపు చెట్టును ఆయన చూసాడు, కాబట్టి దాని మీద తాను ఏమైనా ఏదైనా అంజూరపు పండ్లను కనుగొనగలనేమో అని ఆయన దాని వద్దకు వెళ్ళాడు. అయితే ఆయన దానివద్దకు వచ్చినప్పుడు, ఆయన దాని మీద పండు కనుగొన లేదు, ఆకులు మాత్రమే. ఇది ఎందుకంటే అంజూరపు చెట్లు పండిన అంజూరపు పండ్లను ఉత్పత్తి చేసే సంవత్సరము యొక్క సాధారణ సమయం అది ఇంకా కాదు. 14 ఆయన చెట్టుతో చెప్పాడు, “ఇక నీ నుండి ఎవరూ ఎన్నడు పండు తినరు.” మరియు ఆయన శిష్యులు దీనిని విన్నారు. 15 యేసు మరియు ఆయన శిష్యులు యెరూషలేముకు తిరిగి వెళ్ళారు మరియు ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించారు. బలుల కోసం జంతువులను అమ్మడం మరియు కొనుగోలు చేసే వారిని ఆయన చూసాడు. ఆలయ ప్రాంగణం నుండి ఆ మనుష్యులను తరిమివేసాడు. రోమా నాణేలకు బదులుగా ఆలయ పన్ను సొమ్మును అమ్ముచున్న వారి బల్లలను కూడా ఆయన పడద్రోసాడు. మరియు ఆయన బలి ఇవ్వడానికి కొనుగోలుదారుల కోసం పావురాలను అమ్ముచున్న మనుష్యుల యొక్క బల్లలను పడద్రోసాడు. 16 అమ్మడానికి ఏదైనా తీసుకువెళ్ళే వారిని ఆలయ ప్రాంతం గుండా ఆయన అనుమతించ లేదు. 17 అప్పుడు ఆయన ఆ మనుష్యులకు బోధిస్తూ ఉండగా, ఆయన వారితో చెప్పాడు, “దేవుడు చెప్పినది ప్రవక్తలలో ఒకడు లేఖనాలలో వ్రాసాడు,‘మనుష్యులు నా ఇంటిని అన్ని దేశాల మనుష్యులు ప్రార్థన చేసే ఇల్లు అని పిలవాలని నేను కోరుచున్నాను’ అయితే మీరు దానిని దొంగలు దాక్కునే గుహ వలె చేసారు.” 18 ప్రధాన యాజకులు మరియు యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే మనుష్యులు యేసు చేసిన దాని గురించి తరువాత విన్నారు. వారు ఆయనను ఎలా చంపాలో ప్రణాళిక చేస్తున్నారు, అయితే ఆయన బోధిస్తున్నదానిని బట్టి మొత్తం సమూహము ఆశ్చర్యపోయారు అని వారు గ్రహించారు కాబట్టి వారు ఆయనకు భయపడ్డారు. 19 ఆ సాయంకాలం, యేసు మరియు ఆయన శిష్యులు నగరం విడిచారు {మరియు తిరిగి బేతనియలో నిద్రపోయారు}. 20 మరుసటి దినము ఉదయం వారు యెరూషలేము వైపు దారిలో వెళ్ళుచుండగా, యేసు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది మరియు పూర్తిగా ముడుచుకుపోయి ఉండడం వారు చూసారు. 21 యేసు అంజూరపు చెట్టుతో చెప్పిన మాటలు పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు, “బోధకుడా, చూడు! నీవు శపించిన ఆ అంజూరపు చెట్టు ఎండిపోయింది!” 22 యేసు జవాబిచ్చాడు, “దేవుడు నేను అడిగినది చేసాడు అని మీరు ఆశ్చర్యపోకూడదు. మీరు ఏమి చేయమని అడిగినా దేవుడు చేస్తాడు అని మీరు నమ్మాలి! 23 ఇది కూడా గమనించండి: ఎవరైనా ఈ పర్వతముతో 'లేచి మరియు నిన్ను నీవే సముద్రంలోనికి విసరివేసుకొనుము', అని చెప్పిన యెడల, అతడు కోరినది జరుగుతుంది అని సందేహం లేకున్న యెడల, అనగా, అది జరుగుతుంది అని అతడు నమ్మిన యెడల, దేవుడు దానిని అతని కోసం చేస్తాడు. 24 కాబట్టి నేను మీకు చెప్పుచున్నాను, మీరు ప్రార్థించేటప్పుడు మీరు దేవునిని దేని కోసమైనా అడిగినప్పుడు, మీరు దానిని స్వీకరిస్తారు అని విశ్వసించండి, మరియు, మీరు ఆయన యందు నమ్మకం ఉంచిన యెడల, దేవుడు దానిని మీ కోసం చేస్తాడు. 25 ఇప్పుడు నేను మీకు దీనిని కూడా చెప్పుచున్నాను: మీరు ప్రార్థిస్తున్నప్పుడు, మీకు వ్యతిరేకంగా పాపం చేసిన కారణముగా, ఏ మనుష్యుడు మీద నైనా మీకు ద్వేషం ఉన్న యెడల, పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ పాపాల కోసం మీ రుణాన్ని రద్దు చేసేలా వారి రుణాన్ని రద్దు చేయండి." 26 [అయితే మీరు వారి రుణాన్ని రద్దు చేయకపోయిన యెడల, పరలోకంలో ఉన్న, మీ తండ్రి కూడా మీ పాపాల కోసం మీ రుణాన్ని రద్దు చేయడు.] 27 యేసు మరియు ఆయన శిష్యులు తిరిగి యెరూషలేము ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. యేసు అక్కడ నడుస్తూ ఉండగా, ప్రధాన యాజకులు, యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే కొందరు మనుష్యులు, మరియు పెద్దలతో కూడిన ఒక గుంపు ఆయన వద్దకు వచ్చారు. 28 వారు ఆయనతో చెప్పారు, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీవు నిన్న ఇక్కడ చేసినట్లుగా చేయడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ” 29 యేసు వారితో చెప్పాడు, “నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నాకు సమాధానం ఇచ్చిన యెడల, ఆ పనులు చేయడానికి నాకు ఎవరు అధికారం ఇచ్చారో నేను మీకు చెప్పుతాను. 30 తన వద్దకు వచ్చిన వారికి బాప్తిస్మం ఇవ్వడానికి యోహానుకు అధికారం ఇచ్చింది దేవుడా? లేదా అతనికి అధికారం ఇచ్చిన మనుష్యులేనా?” 31 వారు ఏమి సమాధానం చెప్పాలి అని తమలో తాము చర్చించుకున్నారు. వారు ఒకరికొకరు చెప్పుకొన్నారు,“అతనికి అధికారం ఇచ్చింది దేవుడు అని మనం చెప్పిన యెడల, ఆయన మనతో చెప్పుతాడు, ‘అప్పుడు యోహాను చెప్పినది మీరు నమ్మి ఉండ వలసినది! 32 మరోవైపు, యోహానుకు అధికారం ఇచ్చింది మనుష్యులే అని మనం చెప్పిన యెడల, అప్పుడు మనకు ఏమి జరుగుతుంది? యోహాను తన అధికారాన్ని ఎక్కడనుండి పొందాడు అని చెప్పడానికి వారు భయపడ్డారు, ఎందుకంటే మనుష్యులు తమ మీద చాలా కోపంగా ఉంటారు అని వారికి తెలుసు. యోహాను దేవుడు పంపిన ప్రవక్త అని మనుష్యులు అందరు నిజంగా విశ్వసిస్తున్నారు అని వారికి తెలుసు. 33 కాబట్టి వారు యేసుకు జవాబిచ్చారు, “మనుష్యులకు బాప్తిస్మం ఇవ్వడానికి యోహానుకు ఎవరు అధికారం ఇచ్చారో మాకు తెలియదు” అప్పుడు యేసు వారితో చెప్పాడు, “మీరు నా ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు కాబట్టి, నిన్న ఇక్కడ ఆ కార్యములు చేయడానికి నాకు ఎవరు అధికారం ఇచ్చారో నేను మీకు చెప్పను.”

Chapter 12

1 అప్పుడు యేసు యూదు నాయకులకు పాఠంతో కూడిన కథ చెప్పడం ప్రారంభించాడు. ఆయన చెప్పాడు,“ఒకానొక మనుష్యుడు ద్రాక్షతోటను నాటాడు. దానిని కాపాడేందుకు చుట్టూ కంచెను నిర్మించాడు. వారు ద్రాక్ష నుండి బయటకు త్రొక్కిన ద్రాక్షా రసాన్ని సేకరించడానికి అతడు ఒక రాతి తొట్టిని తయారు చేసాడు. అతడు తన ద్రాక్షతోటను కాపలాగా ఉంచడానికి ఎవరైనా కూర్చోవడానికి ఒక గోపురం కూడా నిర్మించాడు. అతడు ద్రాక్షతోటను చూసుకునే కొందరుకి అద్దెకు ఇచ్చాడు మరియు అతడు వేరే దేశానికి ప్రయాణించడానికి బయలుదేరాడు. 2 ద్రాక్షపండ్లను కోయడానికి సమయం వచ్చినప్పుడు, ద్రాక్షతోట యజమాని తన ద్రాక్షతోటను చూసుకుంటున్న మనుష్యుల వద్దకు ఒక సేవకుడిని పంపాడు, ఎందుకంటే అతడు ద్రాక్షతోట పండించిన ద్రాక్షలో తన భాగమును వారి నుండి స్వీకరించుటకు కోరుకున్నాడు. 3 అయితే ఆ సేవకుడు వచ్చినప్పుడు, వారు అతనిని పట్టుకుని మరియు ఆ సేవకుడిని కొట్టారు, మరియు వారు అతనికి ఫలం ఏమీయు ఇవ్వలేదు. అప్పుడు వారు అతనిని పంపివేసారు. 4 తరువాత యజమాని తన సేవకులలో మరొకరిని వారి వద్దకు పంపాడు. అయితే వారు అతని తల మీద కొట్టారు, మరియు వారు అతనిని అవమానించారు. 5 తరువాత యజమాని మరొక సేవకుడిని పంపాడు. ద్రాక్షతోటను సంరక్షిస్తున్న వారు ఆ మనుష్యుని చంపారు. అతడు పంపిన అనేక ఇతర సేవకులను కూడా వారు దుర్మార్గంగా ప్రవర్తించారు. వారు కొందరిని కొట్టారు మరియు కొందరిని వారు చంపారు. 6 యజమాని తనతో ఇంకా మరొక వ్యక్తి ఉన్నాడు, అతని కుమారుడు, అతడు చాలా ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి, చివరకు అతడు తన కుమారుని వారి వద్దకు పంపాడు, ఎందుకంటే వారు తన కుమారుడును గుర్తించి మరియు మంచిగా వ్యవహరిస్తారు అని అతడుతలంచాడు. 7 అయితే ద్రాక్షతోటను చూసుకుంటున్న మనుష్యులు అతని కుమారుడు రావడం చూసారు, వారు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, ‘చూడండి! ఇక్కడ యజమాని యొక్క కుమారుడు వస్తాడు, అతడు ఏదో ఒక దినము ద్రాక్షతోటను వారసత్వంగా పొందుతాడు! కాబట్టి ఈ ద్రాక్షతోట మనది కావడానికి అతనిని చంపుదాం!’ 8 వారు యజమాని యొక్క కుమారుని పట్టుకున్నారు మరియు అతనిని చంపారు. అప్పుడు వారు అతని దేహమును ద్రాక్షతోట బయట పడవేసారు. 9 కాబట్టి ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడో నేను మీకు చెప్పుతాను. అతడు వస్తాడు, మరియు తన ద్రాక్షతోటను చూసుకుంటున్న ఆ దుర్మార్గులను చంపుతాడు. అప్పుడు ఇతర మనుష్యులు దానిని చూసుకునేలా అతడు ఏర్పాటు చేస్తాడు. 10 లేఖనం ఏమి చెపుతుందో మీకు తెలియదా? భవనాన్ని నిర్మిస్తున్న మనుష్యులు ఒక నిర్దిష్ట రాయిని ఉపయోగించడానికి నిరాకరించారు. అయితే ప్రభువు అదే రాయిని దాని సరైన స్థానంలో ఉంచాడు, మరియు అది భవనంలో అత్యంత ముఖ్యమైన రాయిగా మారింది! 11 యెహోవా దీనిని చేసాడు, మరియు మనము దానిని చూసి నప్పుడు ఆశ్చర్యపోతాం. 12 ఆ దుష్టులు చేసిన దాని గురించి యేసు ఈ కథ చెప్పినప్పుడు యూదు నాయకులు వారిని ఆరోపిస్తున్నాడు అని గ్రహించారు. కాబట్టి యూదు నాయకులు ఆయనను బంధించాలని కోరుకున్నారు, అయితే యూదు నాయకులు దానిని చేస్తే సమూహం ఏమి చేస్తారో అని భయపడ్డారు. కాబట్టి వారు ఆయనను వదిలి వెళ్ళిపోయారు. 13 యూదుల నాయకులు కొందరు పరిసయ్యులను యేసు వద్దకు పంపారు {వారు తమ సొంత యూదు అధికారులు చెల్లించాల్సిన పన్నును మాత్రమే యూదులు చెల్లించాలని తలంచారు}. వారు హేరోదు అంతిపా మరియు రోమా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పక్షములోని కొందరు సభ్యులను కూడా పంపారు. వారు యేసును మోసగించాలనుకున్నారు; వారు ఆయన మీద నిందారోపణలు మోపడానికి ఆ గుంపులలో ఒకరికి ఆయన మీద కోపం వచ్చేలా ఏదో ఒకటి చెప్పాలి అని యేసును కోరుకున్నారు. 14 వారు చేరుకున్న తరువాత, వారిలో ఒకరు యేసుతో చెప్పారు, “బోధకుడా, నీవు సత్యమే బోధిస్తావు అని మాకు తెలుసు. నీవు మనుష్యుల అభిప్రాయాల చేత ప్రభావితం చేయబడవు అని కూడా మాకు తెలుసు. బదులుగా, దేవుడు వారు ఏమి చేయుటకు కోరుచున్నాడో మనుష్యులు అందరికి నీవు నిజాయితీగా బోధిస్తావు; నీవు వారి సామాజిక స్థితిని గౌరవించవు. {కాబట్టి ఈ విషయం గురించి నీవు ఏమి అనుకుంటున్నావో మాకు చెప్పండి:} మేము రోమా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం సరైనదేనా, కాదా? మేము పన్నులు చెల్లించాలా, లేదా వాటిని చెల్లించకూడదా? ” 15 దేవుడు తాము ఏమి చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి అని వారు నిజంగా కోరుకోవడం లేదు అని యేసుకు తెలుసు. కాబట్టి ఆయన వారితో చెప్పాడు, “మీరు కేవలం నన్ను తప్పుగా మాట్లాడేలా చేయడానికి దాని కోసం మీరు నన్ను నిందించవచ్చు అని ప్రయత్నిస్తున్నారు అని నాకు తెలుసు, {అయితే నేను మీ ప్రశ్నకు ఎలాగైనా సమాధానం ఇస్తాను.} నేను దానిని చూసేందుకు ఒక నాణెం తీసుకురండి.” 16 వారు ఆయనకు ఒక నాణెం తెచ్చిన తరువాత, ఆయన వారిని అడిగాడు, “ఈ నాణెం మీద ఎవరి చిత్రం ఉంది? మరియు దాని మీద ఎవరి పేరు ఉంది?” వారు జవాబిచ్చారు, “ఇది కైసరు యొక్క పేరు మరియు చిత్రం {, ఆ మనుష్యుడు రోమా ప్రభుత్వాన్ని పరిపాలించు వాడు}.” 17 యేసు వారితో చెప్పాడు, “{దాని విషయములో} ప్రభుత్వానికి చెందినది ప్రభుత్వానికి ఇవ్వండి మరియు దేవునికి చెందినది దేవునికి ఇవ్వండి” ఆయన చెప్పిన దాని చేత వారు ఆశ్చర్యపోయారు. 18 సద్దూకయిలు గుంపుకు చెందిన మనుష్యులు మరణించిన తరువాత తిరిగి బ్రతికుతారు అనునది నిరాకరిస్తారు. {మనుష్యులు తిరిగి జీవిస్తారనే ఆలోచనతో యేసును అపహాస్యం చేయడానికి, వారిలో కొందరు} ఆయన వద్దకు వచ్చి మరియు ఆయనను అడిగారు, 19 “బోధకుడా, పిల్లలు లేని ఒక మనుష్యుడు చనిపోయిన యెడల, అతని సహోదరుడు చనిపోయిన మనుష్యుని యొక్క విధవరాలును వివాహం చేసుకోవాలి అని మోషే యూదులమైన మాకు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ ఇద్దరు పిల్లలను కనిన యెడల, ఆ పిల్లలు చనిపోయిన మనుష్యుడు యొక్క పిల్లలు అని ప్రతి ఒక్కరు భావిస్తారు, మరియు ఆ విధంగా చనిపోయిన మనుష్యుడుకి వారసులు కొనసాగుతారు. 20 కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది: ఒక కుటుంబంలో ఏడుగురు సహోదరులు ఉన్నారు. పెద్దవాడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, అయితే అతడు మరియు అతని భార్య ఏ పిల్లలైనా కన లేదు. ఆ తరువాత అతడు మరణించాడు. 21 రెండవ సహోదరుడు {ఈ నియమాన్ని అనుసరించాడు మరియు} ఆ స్త్రీని వివాహం చేసుకున్నాడు మరియు అతడు కూడా పిల్లలు కనలేదు. అప్పుడు తరువాత అతడు మరణించాడు. మూడవ సహోదరుడు తన ఇతర సహోదరులు చేసిన విధముగా చేసాడు. అయితే అతనికి కూడా పిల్లలు పుట్టలేదు మరియు తరువాత మరణించాడు. 22 చివరికి ఏడుగురు అన్నదమ్ములు ఒక్కొక్కరుగా ఆ స్త్రీని వివాహం చేసుకున్నారు, అయితే ఎవరును పిల్లలు కలిగి లేరు, మరియు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. ఆ తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. 23 {కాబట్టి, మనుష్యులు చనిపోయిన తరువాత తిరిగి బ్రతుకుతారు అని కొందరు మనుష్యులు చెప్పేది నిజమైన యెడల,} మనుష్యులు తిరిగి సజీవులైనప్పుడు ఆ స్త్రీ ఎవరి భార్య అవుతుంది అని మీరు అనుకొనుచున్నారు? ఆమె మొత్తం ఏడుగురు సహోదరులను వివాహం చేసుకున్నది అని గుర్తుంచుకోండి! 24 యేసు వారికి జవాబిచ్చాడు, “మీరు నిశ్చయంగా తప్పు. దీని గురించి లేఖనాలు ఏమి బోధిస్తున్నాయో మీకు తెలియదు. మనుష్యులను తిరిగి సజీవులుగా చేసే దేవుని యొక్క శక్తిని కూడా మీరు అర్థం చేసుకోలేదు. 25 {ఆ స్త్రీ ఆ సహోదరులలో ఎవరికీ భార్యగా ఉండదు,} ఎందుకంటే మనుష్యులు తిరిగి సజీవులైనప్పుడు, పురుషులు భార్యలు కలిగి ఉండడం మరియు స్త్రీలు భర్తలు కలిగి ఉండడానికి బదులుగా, వారు పరలోకంలోని దేవదూతల వలె ఉంటారు. {దేవదూతలు వివాహం చేసుకోరు.} 26 అయితే మనుష్యులు చనిపోయిన తరువాత తిరిగి జీవించడం గురించి నన్నుమాట్లాడనివ్వండి. మోషే వ్రాసిన గ్రంథంలో, అతడు చనిపోయిన మనుష్యుల గురించి చెప్పాడు, దానిని మీరు చదివారు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మోషే కాలిపోవుచున్న పొదను చూస్తున్నప్పుడు, దేవుడు అతనితో చెప్పాడు, 'నేను అబ్రాహాము ఆరాధించే దేవుడను మరియు ఇస్సాకు ఆరాధించే దేవుడను మరియు యాకోబు ఆరాధించే దేవుడను. ఆయన ఆ మనుష్యులను తిరిగి సజీవంగా చేయని యెడల మరియు ఆయన ఇప్పటికీ వారి దేవుడు కాని యెడల దేవుడు దానిని చెప్పి ఉండేవాడు కాదు.} 27 ఇప్పుడు దేవుని ఆరాధించేవారు మృతులైన మనుష్యులు కాదు. ఆయనను ఆరాధించే వారు జీవముగల మనుష్యులు. కాబట్టి మృతులైన మనుష్యులు తిరిగి జీవించరని మీరు చెప్పినప్పుడు, మీరు చాలా తప్పుగా ఉన్నారు. 28 యూదు ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక మనుష్యుడు వారి చర్చను విన్నాడు. సద్దూకయ్యుల యొక్క ప్రశ్నకు యేసు చాలా బాగా సమాధానమిచ్చాడు అని అతనికి తెలుసుకున్నాడు. కాబట్టి అతడు ముందుకు వచ్చాడు మరియు యేసును అడిగాడు, “ఏ ఆజ్ఞ అత్యంత ముఖ్యమైనది?” 29 యేసు జవాబిచ్చాడు, “అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇది: ‘ఇశ్రాయేలు యొక్క మనుష్యులారా, వినండి! మన దేవుడైన యెహోవా, ఆయన మాత్రమే మన దేవుడు. 30 నీవు కోరుకునే మరియు అనుభూతిచెందే వాటి అన్నిటిలోను, నీవు ఆలోచించే వాటి అన్నిటిలో, మరియు చేసేవాటి అన్నిటిలోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను!’ 31 తరువాత అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ: ‘నిన్ను నీవు ప్రేమించుకున్న విధంగా నీ చుట్టూ ఉన్న మనుష్యులను నీవు ప్రేమించవలెను.’ ఈ రెంటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదు!” 32 ఆ మనుష్యుడు యేసుతో చెప్పాడు, “బోధకుడా, నీవు బాగా జవాబిచ్చావు. దేవుడు ఒక్కడే దేవుడు అని మరియు వేరే దేవుడు లేడు అని నీవు సత్యంగా చెప్పుచున్నావు. 33 మనం కోరుకునే మరియు అనుభూతి చెందే ప్రతిదానిలో, మనం ఆలోచించే ప్రతిదానిలో మరియు మనం చేసే ప్రతిదానిలో మనం దేవుని ప్రేమించాలి అని నీవు సరిగ్గానే చెప్పావు. మరియు మనలను మనం ఎంతగా ప్రేమిస్తామో మనకు పరిచయం ఉన్న మనుష్యులను మనం అంతగా ప్రేమించాలి అని కూడా నీవు సరిగ్గా చెప్పావు. మరియు ఆహారమును లేదా జంతువులను అర్పణగా కాల్చడం లేదా ఇతర బలులు ఇవ్వడం కంటే ఈ పనులు చేయడం దేవుని సంతోషపరుస్తుంది అని కూడా నీవు సరిగ్గా చెప్పావు. 34 ఈ మనుష్యుడు జ్ఞాన యుక్తంగా సమాధానం చెప్పాడు అని యేసు గ్రహించాడు. కాబట్టి ఆయన అతనితో చెప్పాడు, “దేవుడు నిన్ను పరిపాలించనివ్వాలని నిర్ణయించుకోవడానికి నీవు దగ్గరగా ఉన్నావు అని {నేను దానిని గ్రహించాను}” దాని తరువాత, యూదు నాయకులు ఆయనను చిక్కించుకొవడానికి ప్రయత్నించడానికి ఇటువంటి ప్రశ్నలను ఎక్కువగా అడగుటకు భయపడ్డారు. 35 తరువాత, యేసు దేవాలయ ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు, ఆయన మనుష్యులతో చెప్పాడు,“యూదు ధర్మశాస్త్రాన్ని బోధించే వారు – మరియు వారు సరిగా చెప్పుచున్నారు -మెస్సీయ దావీదు రాజు యొక్క వంశస్థుడు అని చెప్పడం ఎలా ఉంది? 36 పరిశుద్ధ ఆత్మ దావీదు మెస్సీయ గురించి చెప్పేలా చేసాడు, ‘దేవుడు నా ప్రభువుతో చెప్పాడు,“ఇక్కడ నా కుడివైపున నా పక్కన, ప్రతి ఒక్కరు కంటే నేను నిన్ను గొప్పగా ఘనపరచే స్థలములో కూర్చుండుము! నేను నీ శత్రువులను పూర్తిగా ఓడించే ఆ సమయము వరకు ఇక్కడే కూర్చొనుము! 37 కాబట్టి, దావీదు స్వయంగా మెస్సీయను ‘నా ప్రభువు’ అని పిలుస్తున్న కారణంగా మెస్సీయ కేవలం దావీదు రాజు నుండి వచ్చిన వ్యక్తిగా ఎలా ఉండగలడు? ఆయన దావీదు కంటే చాలా గొప్పవాడై ఉండాలి!” ఆయన ఆ విషయాలు బోధిస్తున్నప్పుడు చాలా మంది సంతోషంతో విన్నారు. 38 యేసు మనుష్యులకు బోధిస్తున్నప్పుడు, ఆయన వారితో చెప్పాడు, “మీరు మన యూదు ధర్మశాస్త్రాన్ని బోధించే మనుష్యుల వలె ప్రవర్తించకుండా జాగ్రత్తపడండి. మనుష్యులు తమను గౌరవించడాన్ని ఇష్టపడతారు, కాబట్టి వారు ఎంత ముఖ్యమైన వారో మనుష్యులకు చూపించడానికి పొడవాటి వస్త్రాలు ధరిస్తారు మరియు చుట్టూ నడుస్తారు. సంతలో మనుష్యులు తమను గౌరవంగా పలకరించడం కూడా వారికి ఇష్టం. 39 వారు యూదు సమావేశ స్థలంలో అతి ముఖ్యమైన స్థానాలలో కూర్చోవడానికి ఇష్టపడతారు. పండుగలలో, అత్యంత గౌరవనీయులు కూర్చునే స్థానాలలో వారు కూర్చోవడానికి ఇష్టపడతారు. 40 వారు విధవరాండ్రు యొక్క ఆస్తి అంతయు {కూడా} దొంగిలిస్తారు. అయితే ఇతర మనుష్యులు తాము నీతిమంతులు అని భావించేలా చేయడానికి, వారు దీర్ఘ సమయం పాటు {బహిరంగంగా} ప్రార్థిస్తారు. దేవుడు వారిని నిశ్చయముగా కఠినంగా శిక్షిస్తాడు!" 41 తరువాత, మనుష్యులు దేవునికి అర్పణలు ఉంచే పెట్టెలకు ఎదురుగా ఉన్న ఆలయ ప్రాంతంలో యేసు కూర్చున్నాడు. ఆయన అక్కడ కూర్చుని యుండగా, అనేక మంది మనుష్యులు పెట్టెలలో ఒక దానిలో డబ్బు పెట్టడం ఆయన గమనించాడు, మరియు ధనవంతులైన అనేక మంది మనుష్యులు పెద్ద మొత్తంలో డబ్బు వేయడం గమనించాడు. 42 అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చింది మరియు రెండు చిన్న రాగి నాణేలను వేసింది, అవి ఒక రోమా చతుర్భుజాలతో కలిసి విలువలో సమానంగా ఉంటాయి. 43-44 యేసు తన శిష్యులను తన చుట్టూ చేర్చుకొన్నాడు మరియు వారితో చెప్పాడు: “ఇతర మనుష్యుల వద్ద చాలా డబ్బు ఉంది అనేది సత్యం, అయితే వారు అందులో కొంత భాగమును మాత్రమే ఇచ్చారు. అయితే చాలా పేదరాలైన, ఈ స్త్రీ ఈ దినము తనకు కావాల్సిన వస్తువుల కోసం తన వద్ద ఉన్న డబ్బునంతా పెట్టింది. కాబట్టి ఈ పేద విధవరాలు అందరి కంటే ఎక్కువ డబ్బు పెట్టెలో పెట్టింది!

Chapter 13

1 యేసు ఆలయ ప్రాంతాన్ని విడిచి వెళ్తుండగా, శిష్యులలో ఒకరు ఆయనతో చెప్పాడు, “బోధకుడా, గోడల మీద ఉన్న ఈ చెక్కిన భారీ రాతి దిమ్మెలు ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఈ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి!” 2 యేసు అతనితో చెప్పాడు, “అవును, నీవు చూస్తున్న ఈ కట్టడాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. {అయితే నేను వాటి గురించి మీకు కొంత చెప్పడానికి కోరుతున్నాను}.{విదేశీ ఆక్రమణదారులు} వాటిని పూర్తిగా నాశనం చేస్తారు, దీని ఫలితంగా ఈ ఆలయ ప్రాంతంలోని ఏ రాయి మరొక రాయి మీద మిగిలి ఉండదు.” 3 వారు దేవాలయం నుండి లోయలో ఉన్న ఒలీవల కొండ వద్దకు వచ్చిన తరువాత, యేసు కూర్చున్నాడు. పేతురు, యాకోబు, యోహాను, మరియు అంద్రెయ ఆయనతో ఒంటరిగా ఉన్నప్పుడు, వారు ఆయనను అడిగారు, 4 “మాకు చెప్పండి, దేవుడు సంకల్పించిన ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? ఈ విషయాలు జరగబోవుచున్నాయి అని మాకు చూపించడానికి ఏమి సంభవిస్తుంది?” 5 యేసు వారికి జవాబిచ్చాడు,“ఏమి సంభవింపబోవుచున్నదో దానికి సంబంధించి ఎవరూ మిమ్ములను మోసం చేయకుండా జాగ్రత్తపడండి! 6 అనేక మంది మనుష్యులు వస్తారు, ప్రతిఒక్కరు నేనే అని చెప్పుకుంటారు. ప్రతిఒక్కరు తన గురించి చెప్పుతారు, ‘నేనే మెస్సీయను!’ వారు అనేక మనుష్యులను మోసం చేస్తారు. 7 జరుగుతున్న యుద్ధాల గురించి, జరగబోయే యుద్ధాల గురించి మనుష్యులు మీకు చెప్పినప్పుడు, మిమ్ములను మీరు కలవరం చెందనివ్వకండి. ఈ విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. అయితే అవి జరిగినప్పుడు, అది లోకం యొక్క అంతం అని అనుకొన వద్దు! 8 వివిధ దేశాలలో నివసించే గుంపులు ఒకరితో ఒకరు పోరాడుతారు, మరియు వివిధ ప్రభుత్వాలు ఒకరితో ఒకరు పోరాడుతాయి. వివిధ ప్రాంతాలలో భూకంపాలు కూడా ఉంటాయి, మరియు కరువులు కూడా ఉంటాయి. అయినప్పటికీ, ఈ విషయాలు సంభవించినప్పుడు, మనుష్యులు ఇప్పుడే శ్రమపడటం ప్రారంభిస్తారు. వారు అనుభవించే ఈ మొదటి విషయాలు బిడ్డను కనబోతున్న స్త్రీ అనుభవించే మొదటి నొప్పిలాగా ఉంటాయి. ఆ తరువాత వారు చాలా శ్రమపడతారు. 9 ఆ సమయంలో మనుష్యులు మీకు ఏమి చేస్తారో దానికి సిద్ధంగా ఉండండి. మీరు నన్ను విశ్వసిస్తారు కాబట్టి, వారు మిమ్ములను నిర్బంధిస్తారు మరియు మతపరమైన సభల ముందు విచారణలో ఉంచుతారు. యూదు సమావేశ స్థలంలో, ఇతరులు మిమ్ములను కొడతారు. ఉన్నత ప్రభుత్వ అధికారుల సమక్షంలో మనుష్యులు మిమ్ములను విచారణలో ఉంచుతారు. ఫలితంగా, మీరు నా గురించి వారికి చెప్పగలుగుతారు. 10 దేవుడు తాను సంకల్పించినది ప్రతీది సంపూర్తి చేసే ముందు నా అనుచరులు అన్ని దేశాల మనుష్యులకు సువార్త ప్రకటించవలెను. 11 మిమ్ములను విచారించడానికి మనుష్యులు మిమ్ములను నిర్బంధించినప్పుడు, మీరు ఏమి చెప్పాలో అని చింతించకండి. బదులుగా, ఆ సమయంలో దేవుడు మీ మనస్సులో ఏమి ఉంచుతాడో చెప్పండి. అప్పుడు మాట్లాడేది మీరు మాత్రమే కాదు. మీ ద్వారా పరిశుద్ధ ఆత్మ మాట్లాడుతాడు. 12 {ఇతర చెడు సంగతులు జరుగుతాయి:} నన్ను నమ్మని మనుష్యులు తమ సహోదరులు మరియు సహోదరీలను ప్రభుత్వం మరణశిక్ష విధించడానికి ఇతరులకు సహాయం చేస్తారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను అప్పగిస్తారు మరియు కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులను అప్పగిస్తారు తద్వారా ప్రభుత్వ అధికారులు వారి తల్లిదండ్రులను చంపుతారు. 13 మీరు నన్ను విశ్వసిస్తున్నారు కాబట్టి అనేక మంది మనుష్యులు మిమ్ములను ద్వేషిస్తారు. అయితే{మీ జీవితం ముగిసే వరకు} నన్ను బలంగా విశ్వసించే మీ అందరినీ దేవుడు రక్షిస్తాడు. 14 ఆ సమయంలో అసహ్యకరమైన వస్తువు ఆలయంలోనికి ప్రవేశిస్తుంది. అది ఆలయమును అపవిత్రం చేస్తుంది మరియు మనుష్యులు దానిని విడిచిపెట్టేలా చేస్తుంది. అది ఉండకూడని చోట మీరు దాని చూచినప్పుడు, మీరు త్వరగా పారిపోవలెను! (ఇది చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ హెచ్చరికను గమనించాలి!) ఆ సమయంలో యూదయ జిల్లాలో ఉన్న మనుష్యులు ఎత్తైన కొండలకు పారిపోవాలి. 15 తమ ఇళ్ళ వెలుపల ఉన్నవారు ఏదైనా పొందేందుకు తమ ఇళ్ళలోకి ప్రవేశించకూడదు. 16 పొలంలో పని చేసే వారు అదనపు వస్త్రములు తెచ్చుకోవడానికి తమ ఇళ్ళకు తిరిగి రాకూడదు. 17 ఇది జరిగినప్పుడు, గర్భిణీ స్త్రీలకు మరియు వారి పిల్లలకు పాలిచ్చే వారికి ఎంత భయంకరంగా ఉంటుంది. 18-19 ఆ దినములలో మనుష్యులు చాలా తీవ్రముగా శ్రమ పడతారు. దేవుడు మొదట లోకమును సృష్టించినప్పటి నుండి ఇప్పటివరకు మనుష్యులు ఎప్పుడూ అలాంటి శ్రమలను అనుభవించలేదు, మరియు మనుష్యులు ఆ విధముగా తిరిగి శ్రమ పడరు. కాబట్టి ఈ బాధాకరమైన సమయం శీతాకాలంలో జరగకూడదని ప్రార్థించండి{, ప్రయాణం కష్టంగా ఉంటుంది}. 20 మనుష్యులు చాలా ఎక్కువ శ్రమలు పడినప్పుడు దేవుడు ఆ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించని యెడల ప్రతిఒక్కరు చనిపోతారు. అయితే తాను ఏర్పరచుకొనిన మనుష్యుల గురించి ఆందోళన చెందుచున్న కారణంగా ఆ సమయాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. 21-22 ఆ సమయంలో మనుష్యులు తామే మెస్సీయ అని తప్పుగా చెప్పుకుంటారు. మరియు కొందరు దేవుని నుండి ప్రవక్తలుగా చెప్పుకుంటారు. అప్పుడు వారు అనేక రకాల అద్భుతాలు చేస్తారు. దేవుడు ఏర్పరచుకొన్న మనుష్యులను కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ సమయంలో ఎవరైనా మీతో చెప్పిన యెడల, ‘చూడండి, ఇక్కడ మెస్సీయ ఉన్నాడు!’ లేదా ‘చూడండి, ఆయన అక్కడ ఉన్నాడు!’ ఎవరైనా చెప్పిన యెడల, దీనిని నమ్మవద్దు! 23 అప్రమత్తంగా ఉండండి! ఇవన్నీ జరగకముందే నేను మిమ్ములను హెచ్చరించాను అని గుర్తుంచుకోండి! 24 మనుష్యులు ఆ విధముగా శ్రమపడే కాలం తరువాత, దేవుడు సూర్యుడిని చీకటిగా మారుస్తాడు మరియు చంద్రుడు ప్రకాశించడు; 25 దేవుడు ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోయేలా చేస్తాడు మరియు ఆకాశంలో ఉన్నవాటిని వాటి స్థానంలో నుండి కదిలిస్తాడు. 26 అప్పుడు మనుష్యుని యొక్క కుమారుడుడైన నేను శక్తివంతంగా మరియు మహిమాన్వితంగా మేఘాల మీద రావడం మనుష్యులు చూస్తారు. 27 అప్పుడు నేను నా దేవదూతలను పంపుతాను కాబట్టి వారు ప్రతిచోటా నుండి, భూమి మీద అత్యంత మారుమూల ప్రాంతాల నుండి దేవుడు ఏర్పరచుకొనిన మనుష్యులను ఒకచోట చేరుస్తారు. 28 అంజూరపు చెట్లు ఎలా పెరుగుతాయో ఇప్పుడు మీరు కొంత నేర్చుకోవాలని నేను కోరుచున్నాను. వాటి కొమ్మలు లేతగా మారినప్పుడు మరియు వాటి ఆకులు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు, వేసవి దాదాపుగా వచ్చిందని మీకు తెలుసు. 29 అదే విధంగా, నేను ఇంతకు ముందు వివరించినది జరుగుచుండడం మీరు చూసినప్పుడు, నేను తిరిగి వచ్చే సమయం చాలా సమీపమైనది అని మీకు మీరే తెలుసుకొంటారు. నేను ఇప్పటికే తలుపు వద్ద ఉన్న విధముగా ఉంటుంది. 30 ఇది మనస్సులో ఉంచుకోండి: వీటిలో ప్రతి ఒక్కటి జరిగే వరకు ఈ తరం చనిపోదు. 31 {నేను ప్రవచించినవి జరుగుతాయి అని మీరు నిశ్చయించుకోవచ్చు.} భూమి మరియు ఆకాశంలో ఉన్నవి ఒక దినము నాశనం చేయబడతాయి, అయితే నేను మీకు చెప్పినవి ఈ విషయాలు నిశ్చయముగా జరుగుతాయి. 32 అయితే నేను ఎప్పుడు తిరిగి వస్తానో ఎవరికీ ఖచ్చిత సమయం తెలియదు. పరలోకములోని దేవదూతలకు కూడా తెలియదు. దేవుని యొక్క కుమారుడైన నాకు కూడా తెలియదు. నా తండ్రికిమాత్రమే తెలుసు. 33 కాబట్టి సిద్ధంగా ఉండండి! ఎల్లప్పుడూ అప్రమత్తంగా మరియు ప్రార్థనతో ఉండండి, ఎందుకంటే నేను తిరిగి వచ్చే సమయం మీకు తెలియదు! 34 దీనికి ఇది పోలి ఉంటుంది. ఒక దూరప్రాంతానికి ప్రయాణించాలని కోరుకున్న ఒక మనుష్యుడు తన ఇంటిని విడిచిపెట్టబోవుచున్నప్పుడు, వారు తన ఇంటిని నిర్వహించాలి అని అతడు తన సేవకులకు చెప్పుతాడు. అతడు ప్రతి ఒక్కరు ఏమి చేయాలో చెప్పుతాడు. అప్పుడు అతడుతన రాక కోసం సిద్ధంగా ఉండమని ద్వార పాలకునితో చెప్పుతాడు. 35 ఆ మనుష్యుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే తన యజమానుడు సాయంకాలం, అర్ధరాత్రి, తెల్లవారుజామున కోడి కూయినప్పుడు లేదా ఆకాశములో సూర్యుని నుండి కాంతి కనిపించిన తరువాత ఉదయాన్నే వస్తాడో లేదో అతనికి తెలియదు. అదేవిధంగా, మీరు కూడా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే నేను ఎప్పుడు తిరిగి వస్తానో మీకు తెలియదు. 36 నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు అది జరుగ కూడదు, మీరు సిద్ధంగా లేరు అని నేను కనుగొంటాను! 37 శిష్యులగు మీతో నేను ఈ మాటలు చెప్పుచున్నానునేను ప్రతి ఒక్కరికి చెప్పుచున్నాను: ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి!

Chapter 14

1 మనుష్యులు పస్కా అని పిలిచే వారం దినముల పండుగను జరుపుకోవడానికి ముందు కేవలం రెండు దినముల మాత్రమే ఉంది. ఆ దినములలో వారు పులియని రొట్టెల పండుగ అని పిలిచే పండుగను కూడా జరుపుకున్నారు. ప్రధాన యాజకులు మరియు యూదు ధర్మశాస్త్రాన్ని బోధించే మనుష్యులు యేసును మోసపూరితంగా ఎలా బంధించవచ్చో ఆలోచన చేస్తున్నారు. వారు ఆయనను మరణశిక్ష విధించాడానికి రోమా అధికారుల ముందు ఆయన మీద నిందారోపణ చేసి తద్వారా వారు ఆయనకు మరణశిక్ష విధించాలని కోరుకున్నారు. 2 వారు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు,“పండుగ సమయంలో మనం దీనిని చేయకూడదు, ఎందుకంటే మనం దీనిని చేసిన యెడల, మనుష్యులు మన మీద చాలా కోపంగా ఉంటారు మరియు అల్లర్లు జరుగుతాయి!” 3 బేతనియ గ్రామంలో యేసు, అంతకు ముందు కుష్ఠురోగంతో ఉన్న సీమోను ఇంట్లో ఒక అతిథిగా ఉన్నాడు. వారు భోజనం చేస్తుండగా, ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చింది. ఆమె చాలా ఖరీదైన, స్వచ్ఛమైన అచ్చ జటామాంసితో చేసిన ఖరీదైన, సువాసనగల అత్తరు ఉన్న రాతి కూజాను తీసుకువచ్చింది. ఆమె కూజాను తెరిచింది మరియు సువాసనగల అత్తరును యేసు తల మీద పోసింది. 4 అక్కడున్న కొందరు మనుష్యులకు కోపంగా మారారు మరియు తమలో తాము చెప్పుకున్నారు, “ఆ సువాసనగల అత్తరు ఆమె వృధా చేయడం భయంకరం! 5 ఇది ఒక సంవత్సరపు వేతనాలకు అమ్మవచ్చు, మరియు అప్పుడు ఆ డబ్బును పేద మనుష్యులకు ఇచ్చి ఉండవలసినది!!” వారు ఆమెను మందలించారు. 6 అయితే యేసు చెప్పాడు, “ఆమెను తిట్టడం ఆపండి! నేను చాలా సముచితంగా భావించే దానిని ఆమె నాకు చేసింది. కాబట్టి మీరు ఆమెను ఇబ్బంది పెట్టకూడదు! 7 మీ మధ్యలో పేద మనుష్యులు ఎల్లప్పుడు ఉంటారు. కాబట్టి మీకు కావలసినప్పుడు మీరు వారికి సహాయం చేయవచ్చు. అయితే నేను మీతో ఇక్కడ ఎక్కువ కాలం ఉండను. 8 {ఇది సముచితం} ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నేను త్వరలో చనిపోతాను అని ఆమెకు తెలిసిన విధముగా మరియు వారు దానిని పాతిపెట్టుట కోసం నా శరీరానికి అభిషేకం చేసింది. 9 నేను మీకు దీనిని చెప్పుతాను: నా అనుచరులు లోకమంతట ఎక్కడ సువార్త ప్రకటిస్తారో, వారు కూడా ఆమె ఏమి చేసిందో చెప్పుతారు, మరియు మనుష్యులు ఆమెను గుర్తుంచుకుంటారు. 10 అప్పుడు యూదా ఇస్కరియోతు యేసును పట్టుకోవడానికి సహాయం చేయడం గురించి మాట్లాడదానికి ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళాడు. అతడు 12 మంది శిష్యులలో ఒకడు {అయినప్పటికీ అతడు దానిని చేసాడు} 11 అతడు తమ కోసం ఏమి చేయుటకు ఇష్టపడున్నాడో ప్రధాన యాజకులు వినినప్పుడు, వారు చాలా సంతోషించారు. అందుకు బదులుగా డబ్బులు బహుమానంగా ఇస్తాము అని వాగ్దానం చేసారు. యూదా అంగీకరించాడు మరియు యేసును వారికి అప్పగించదానికి ఒక అవకాశం కోసం చూడటం ప్రారంభించాడు. 12 వారు పులియని రొట్టె అని పిలిచే మొదటి దినమున, వారు పస్కా పండుగకు గొర్రెపిల్లలను చంపినప్పుడు, యేసు యొక్క శిష్యులు ఆయనతో చెప్పారు,“మేము ఎక్కడికి వెళ్ళాలి మరియు పస్కా పండుగ కోసం భోజనం సిద్ధం చేయాలని నీవు కోరుచున్నావు తద్వారా మనం దానిని తింటాము?” 13 కాబట్టి యేసు తన శిష్యులలో ఇద్దరిని ప్రతీదానిని సిద్ధం చేయడానికి ఎన్నుకున్నాడు. ఆయన వారితో చెప్పాడు, “యెరూషలేము యొక్క పట్టణంలోనికి వెళ్ళండి. నీళ్ళతో నిండిన ఒక పెద్ద కూజాను మోసుకు వెళ్ళుచుండే ఒక మనుష్యుని మీరు కలుస్తారు. అతనిని వెంబడించండి. 14 అతడు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు, ఆ ఇంటి యజమానితో ఇలా చెప్పండి, ‘మా బోధకుడు పస్కా పండుగ భోజనం సిద్ధం చేయమని తద్వారా ఆయన తన శిష్యులమైన మాతో కలిసి భోజనం చేయాలని కోరుచున్నాడు. దయచేసి మాకు గది చూపించండి.’ 15 ఇంటి మీద అంతస్తులో ఉన్న ఒక పెద్ద గదిని మీకు చూపిస్తాడు. దానిలో తివాచీలు, తినే పడకలు, తినే బల్ల ఒకటి ఉంటాయి, మరియు అందులో మనం భోజనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు మనకు అక్కడ భోజనం సిద్ధం చేయండి. 16 కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళిపోయారు. వారు పట్టణంలోనికి వెళ్ళారు మరియు ఆయన వారికి చెప్పిన విధంగా ప్రతిదీ ఉన్నట్లు కనుగొన్నారు. అప్పుడు వారు పస్కా పండుగకు భోజనం సిద్ధం చేసారు. 17 సాయంకాలంఅయినప్పుడు, యేసు 12 మంది శిష్యులతో ఆ ఇంటి వద్దకు చేరుకున్నాడు. 18 వారు అందరు బల్ల పక్కన వెనుకకు పడుకుని భోజనం చేస్తుండగా, యేసు చెప్పాడు, “దీనిని జాగ్రత్తగా వినండి: మీలో ఒకడు నా శత్రువులు నన్ను నిర్బంధించేలా బలపరుస్తాడు. ప్రస్తుతం నాతో కలిసి భోజనం చేస్తున్న మీలో ఒకడు!" 19 శిష్యులు చాలా విచారపడ్డారు, మరియు ఒక్కొక్కరు ఒకరి తరువాత ఒకరు యేసుతో చెప్పారు, “నిశ్చయంగా నిన్ను అప్పగించేది నేను కాదు, సరియేనా?” 20 అప్పుడు ఆయన వారితో చెప్పాడు, “ఇది మీ 12 మంది శిష్యులలో ఒకడు, నాతో పాటు పాత్రలో పులుసు లోనికి రొట్టె ముంచుచున్న వ్యక్తి. 21 మనుష్యకుమారుడు తనను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన వెళ్లిపోవుచున్నాడు గాని మనుష్యకుమారుడు ఎవరి ద్వారా అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ! నిజానికి, ఆ మనుష్యుడు ఎన్నడు పుట్టకపోయి ఉంటే బాగుండేది!” 22 వారు భోజనం చేస్తుండగా, ఆయన ఒక చదునైన రొట్టె ముక్కను తీసుకున్నాడు మరియు దాని కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు ఆయన దానిని ముక్కలుగా చేసాడు మరియు దానిని వారికి ఇచ్చాడు మరియు వారికి చెప్పాడు, “ఈ రొట్టె నా శరీరం. దీనిని తీసుకోండి మరియు దీనిని తినండి.” 23 తరువాత, ఆయన ద్రాక్షారసం కలిగి ఉన్న ఒక పాత్ర తీసుకున్నాడు మరియు దాని కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు ఆయన దానిని తన శిష్యులకు ఇచ్చాడు, మరియు వారు అందరు పాత్రలో నుండి త్రాగారు. 24 యేసు తన శిష్యులతో చెప్పాడు,“ఈ ద్రాక్షారసం నా రక్తం, నా శత్రువులు నన్ను చంపినప్పుడు నా శరీరం నుండి ప్రవహించబోవునది. అనేక మంది మనుష్యుల యొక్క పాపాలను క్షమించడానికి దేవుడు చేసిన ఒప్పందాన్ని ఈ రక్తంతో నేను ధృవీకరిస్తాను. 25 నేను మీరు దీనిని తెలుసుకోవాలని కోరుచున్నాను: దేవుడు రాజుగా ప్రతిచోటా పరిపాలిస్తున్నప్పుడు నేను తిరిగి ద్రాక్షారసం త్రాగే సమయం వరకు నేను ఇక మీదట ద్రాక్షారసాన్ని త్రాగను” 26 వారు దేవుని స్తుతిస్తూ ఒక పాట పాడిన తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు ఒలీవల కొండ వైపుకు బయటకు వెళ్ళారు. 27 వారు తమ మార్గములో ఉండగా, యేసు తన శిష్యులతో చెప్పాడు,“దేవుడు నా గురించి చెప్పాడు అని జెకర్యా ప్రవక్త లేఖనాలలో వ్రాసాడు, ‘నేను కాపరిని చంపుతాను మరియు ఆయన గొర్రెలు చెల్లాచెదురు అవుతాయి.’ఆ మాటలు నిజమవుతాయి. మీరు అందరు నన్ను వదలివేస్తారు మరియు పారిపోతారు. 28 అయితే దేవుడు నన్ను తిరిగి సజీవునిగా చేసిన తరువాత, నేను మీకంటే ముందుగా గలిలయ యొక్క జిల్లాకు వెళ్ళతాను మరియు అక్కడ మిమ్ములను కలుస్తాను.” 29 పేతురు యేసుతో చెప్పాడు, “బహుశా మిగిలిన శిష్యులు అందరు నిన్ను విడిచిపెట్టవచ్చు, అయితే నేను కాదు! నేను నిన్ను విడువను!" 30 అప్పుడు యేసు పేతురుతో చెప్పాడు, “ఈ రాత్రి, కోడి రెండుసార్లు కూయకముందే, నేనెవరో తెలియదు అని మూడుసార్లు నా గురించి చెప్పుతావు అనేది సత్యం.” 31 అయితే పేతురు గట్టిగా జవాబిచ్చాడు, “వారు నన్ను చంపినప్పటికి కూడా, నేను ఎన్నడు నిన్ను ఎరుగను అని చెప్పను.” మరియు ఇతర శిష్యులు అందరు అదే విషయం చెప్పారు. 32 యేసు మరియు ఆయన శిష్యులు మనుష్యులు గెత్సేమనే అని పిలిచే ప్రదేశానికి వెళ్ళారు. యేసు తన శిష్యులలో కొందరితో చెప్పాడు, “నేను ప్రార్థిస్తున్నప్పుడు ఇక్కడే ఉండండి!” 33 ఆయన పేతురు, యాకోబు మరియు యోహానులను తనతో తీసుకువెళ్ళాడు. యేసు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడు. 34 ఆయన వారితో చెప్పాడు, “నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నేను చనిపోవబోతున్నట్లుగా ఉంది. మీరు మనుష్యులు ఇక్కడే ఉండండి మరియు జాగ్రత్తగా చూస్తూ ఉండండి! 35 యేసు కొంచెం దూరం వెళ్ళాడు మరియు తనను తాను నేలమీద త్రోసివేసుకొన్నాడు. సాధ్యమైన యెడల, ఆయన శ్రమపడ పడకుండా ఉండవలసింది అని ప్రార్థించాడు. 36 ఆయన చెప్పాడు, “ఓ నా తండ్రీ, నీవు సమస్తమును చేయగలవు కాబట్టి, నేను ఇప్పుడు శ్రమ పడకుండా నన్ను రక్షించుము! అయితే నేను కోరుకున్నది చేయవద్దు. బదులుగా, నీవు కోరుకున్నది చేయండి!” 37 యేసు పేతురు, యాకోబు, మరియు యోహానులను విడిచిపెట్టిన చోటికి తిరిగి వచ్చాడు. ఈ శిష్యులులు నిద్రపోవుచుండుట ఆయన కనుగొన్నాడు. ఆయన వారిని మేల్కొలిపాడు మరియు సీమోను అని కూడా పిలువబడే పేతురుతో చెప్పాడు, “సీమోను! మీరు నిద్రపోయినందుకు మరియు మీరు కొద్దిసేపు మెలకువగా ఉండలేకపోయినందుకు నేను నిరాశ చెందాను! 38 {మరియు యేసు వారితో చెప్పాడు,} “నేను చెప్పేది మీరు చేయాలనుకుంటున్నారు, అయితే మీరు తగినంత బలంగా లేరు. మీరు మెలకువగా ఉండి మరియు ప్రార్థించండి తద్వారా మీరు శోధింపబడినప్పుడు మీరు ఎదిరించగలరు!” 39 అప్పుడు ఆయన మరల వెళ్ళిపోయాడు మరియు తాను ఇంతకు ముందు ప్రార్థించినదే తిరిగి ప్రార్థించాడు. 40 యేసు తిరిగి వచ్చినప్పుడు, వారు మరల నిద్రపోవడం ఆయన కనుగొన్నాడు. వారు కళ్ళు తెరచి ఉంచ లేని విధంగా వారు చాల నిద్రమత్తుగా ఉన్నారు. వారు సిగ్గుపడారు కాబట్టి, ఆయన వారిని మేల్కొలిపినప్పుడు ఆయనకు ఏమి చెప్పాలో వారికి తెలియ లేదు. 41 తరువాత ఆయన వెళ్ళాడు మరియు మరల ప్రార్థించాడు. ఆయన మూడవసారి తిరిగి వచ్చాడు మరియు వారు మరల నిద్రపోతున్నట్లు కనుగొన్నాడు. ఆయన వారితో, “మీరు మళ్లీ నిద్రపోతున్నందుకు నేను నిరాశ చెందాను! మీరు తగినంత నిద్రపోయారు. నేను శ్రమపడే సమయం ప్రారంభం కానుంది. చూడు! మనుష్య కుమారుడైన నన్ను పట్టుకోవడానికి ఒకరు పాపాత్ములైన మనుష్యులను సిద్ధం చేయబోతున్నాడు. 42 కాబట్టి లేవండి! మనం వెళ్ళుదాం! చూడండి! నన్ను పట్టుకొనుటకు వారిని సహాయం చేసేవాడు ఇక్కడకు వచ్చాడు!” 43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, యూదా చేరుకున్నాడు. అతడు యేసు యొక్క 12 మంది శిష్యులలో ఒకడు అయినప్పటికీ, యేసు యొక్క శత్రువులు ఆయనను పట్టుకోవడానికి సహాయం చేయడానికి వచ్చాడు. కత్తులు మరియు కర్రలు పట్టుకున్న జనసమూహం అతనితో ఉన్నారు. యూదు సభ నాయకులు వారిని పంపారు. 44 యేసును పట్టుకోవడానికి ఆయన శత్రువులకు సహాయం చేస్తున్న యూదా, ఇంతకు ముందు ఈ జనసమూహముతో చెప్పాడు,“నేను ముద్దు పెట్టుకునే మనుష్యుడు మీరు కోరుకున్న వ్యక్తి. నేను ఆయనను ముద్దు పెట్టినప్పుడు, ఆయనను పట్టుకోండి మరియు మీరు ఆయనను జాగ్రత్తగా భద్రపరుస్తున్నప్పుడు ఆయనను దూరంగా తీసుకువెళ్ళండి. 45 కాబట్టి యూదా చేరుకున్నప్పుడు, అతడు వెంటనే యేసును సమీపించాడు మరియు చెప్పాడు, “నా బోధకుడా!” అప్పుడు అతడు యేసును ముద్దు పెట్టుకున్నాడు. 46 అప్పుడు జనసమూహం యేసును పట్టుకున్నారు మరియు ఆయనను బంధించారు. 47 అయితే సమీపంలో నిలబడి ఉన్న ఆయన శిష్యులలో ఒకడు అతని కత్తి దూసాడు. అతడు దానితో ప్రధాన యాజకుని యొక్క సేవకుడిని కొట్టాడు, అయితే అతడు సేవకుడి యొక్క చెవిని మాత్రమే నరికాడు. 48 యేసు వారితో చెప్పాడు: “నేను బందిపోటు దొంగలా నన్ను పట్టుకోవడానికి మీరు కత్తులు మరియు కర్రలతో ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది. 49 ఎందుకంటే అనేక దినములు నేను మీతో పాటు ఆలయ ప్రాంగణంలో మనుష్యులకు బోధించాను. అప్పుడు మీరు నన్ను ఎందుకు బంధించుటకు ప్రయత్నించ లేదు? అయితే నా గురించి ప్రవక్తలు లేఖనాలలో వ్రాసినది జరిగేలా ఇది జరుగుతోంది.” 50 అప్పుడు యేసు యొక్క శిష్యులు అందరు ఆయనను విడిచారు మరియు పారిపోయారు. 51 ఆ సమయంలో, ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతడు తన శరీరం చుట్టూ ఒక నార వస్త్రం మాత్రమే ధరించాడు. ఆ సమూహం ఆ యువకుడిని పట్టుకున్నారు, 52 అయితే, అతడు వారి నుండి దూరంగా వెళ్ళిపోవుచుండగా, అతడు వారి చేతులలో ఆ నారబట్టను విడిచిపెట్టాడు, మరియు అప్పుడు అతడు నగ్నంగా పరుగెత్తాడు. 53 యేసును పట్టుకున్న మనుష్యులు ఆయనను ప్రధాన యాజకుడు నివసించే ఇంటికి తీసుకు వెళ్ళారు. యూదుల సభ అంతా అక్కడ గుమిగూడారు. 54 పేతురు దూరంగా యేసును వెంబడించాడు. అతడు ప్రధాన యాజకుడు నివసించే ఇంటి ఆవరణలోకి వెళ్ళాడు, మరియు ప్రధాన యాజకుని ఇంటిని కాపలా కాసిన మనుష్యులతో కలిసి అక్కడ కూర్చున్నాడు. అతడు అగ్ని పక్కన తనను తాను వేడిచేసుకుంటున్నాడు. 55 ప్రధాన యాజకులు మరియు మిగిలిన యూదుల సభలోని మిగిలిన వారు అందరు యేసును చంపడానికి తగినంత బలమైన అబ్ధ సాక్ష్యం చెప్పే ప్రజలను కనుకొనడానికి ప్రయత్నించారు, అయితే రోమా అధికారులు ఆయనకు మరణశిక్ష విధించేలా ఎలాంటి ఆధారాలు వారు కనుగొన లేదు. వారు విజయం సాధించలేదు. 56 యేసు గురించి అనేక మంది మనుష్యులు అబద్ధాలు చెప్పారు, అయితే వారు చేసిన ప్రకటనలు ఒకదానికొకటి ఏకీభవించలేదు. 57 చివరగా, కొందరు మనుష్యులు లేచి నిలబడ్డారు మరియు ఈ విధముగా చెప్పడం ద్వారా యేసును అబద్దముగా ఆరోపించారు, 58 “ఆయన చెప్పినప్పుడు మేము విన్నాము, ‘మనుష్యులు చేత కట్టబడిన ఈ ఆలయమును నేను నాశనం చేస్తాను, మరియు అప్పుడు మూడు దినములలోపు మరొక ఆలయమును ఎవరి సహాయం లేకుండా నేను నిర్మిస్తాను.’” 59 అయితే ఈ మనుష్యులలో కొందరు చెప్పిన దానికి ఇతరులు చెప్పినదానికి అంగీకారంగా లేదు. 60 అప్పుడు ప్రధాన యాజకుడు తానే వారి ఎదుట లేచి నిలబడ్డాడు మరియు యేసుతో చెప్పాడు,“వారు చెప్పినదానికి దేనికైనా నీవు జవాబివ్వడం లేదా? నిన్ను నిందించదానికి వారు చెప్పుచున్నఆ విషయాలు అన్నిటి గురించి నీవు ఏమి చెప్పుతావు?” 61 అయితే యేసు మౌనంగా ఉన్నాడు మరియు జవాబు చెప్పలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు తిరిగి ప్రయత్నించాడు. అతడు ఆయనను అడిగాడు, “నీవు మెస్సీయావా? నీవు దేవుని యొక్క కుమారుడవు అని చెప్పుచున్నావా?” 62 యేసు చెప్పాడు, “నేనే. ఇంకా, మనుష్యుని యొక్క కుమారుడుడనైన నన్ను పూర్తిగా శక్తిమంతుడైన దేవుని ప్రక్కన పరిపాలించడం మీరు చూస్తారు. ఆకాశంలో మేఘాల ద్వారా క్రిందికి రావడం కూడా మీరు నన్ను చూస్తారు! 63 యేసు యొక్క మాటలకు ప్రతిస్పందనగా, ప్రధాన యాజకుడు నిరసనగా తన పై వస్త్రాన్ని చింపుకొన్నాడు, మరియు ప్రధాన యాజకుడు చెప్పాడు, “ఈ మనుష్యునికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి మాకు ఖచ్చితంగా ఇక మీదట సాక్షులు అవసరం లేదు! 64 తాను దేవుడనని అతని దేవదూషణ వాదన మీరు విన్నారు! యేసు దోషి అని మరియు ఆయన చంపబడడానికి అర్హుడు అని వారు అందరూ అంగీకరించారు. 65 అప్పుడు వారిలో కొందరు యేసు మీద ఉమ్మివేయడం ప్రారంభించారు. వారు ఆయన కళ్ళకు గంతలు కట్టారు, మరియు అప్పుడు ఆయనను కొట్టడం మొదలుపెట్టారు మరియు ఆయనకు చెప్పుచున్నారు, “నీవు ప్రవక్త అయిన యెడల, నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పు!” మరియు యేసును కాపలాగా ఉన్నవారు తమ అరచేతులతో కొట్టారు. 66 పేతురు ప్రధాన యాజకుని యొక్క ఇంటి ఆవరణలో బయట ఉండగా, ప్రధాన యాజకుని వద్ద పని చేసే ఒక అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. 67 పేతురు మంటల పక్కన తనను తాను వేడికాచుకోవడం చూసింది, ఆమె అతని వైపు దగ్గరగా చూసింది. అప్పుడు ఆమె చెప్పింది, “నీవు కూడా నజరేతు పట్టణానికి చెందిన మనిషి యేసుతో ఉన్నావు!” 68 అయితే దీనిని చెప్పుట చేత పేతురు తిరస్కరించాడు, “నీవు ఏమి మాట్లాడుచున్నావో నాకు తెలియడం లేదు లేదా అర్థం కావడం లేదు!” అప్పుడు అతడు అక్కడి నుండి ప్రాంగణం యొక్క ద్వారం దగ్గరకు వెళ్ళాడు. 69 ఆ పనిమనిషి అతనిని అక్కడ చూసింది మరియు దగ్గరలో నిలబడి ఉన్న వారితో మరల చెప్పింది, “వారు బంధించిన ఆ మనుష్యునితో కలిసి ఉన్న వారిలో ఇతడు ఒకడు.” 70 అయితే అతడు దానిని మరల తిరస్కరించాడు. కొద్దిసేపటి తరువాత, అక్కడ నిలబడి ఉన్నవారు తిరిగి పేతురుతో చెప్పారు, “{నీవు మాట్లాడే తీరు దానిని చూపుతుంది} నీవు కూడా గలిలయ యొక్క జిల్లావాడివే. కాబట్టి యేసుతో పాటు వచ్చిన మనుష్యులలో నీవు కూడా ఒకడివి ఇదినిశ్చయం!” 71 అయితే అతడు అరవడం మొదలుపెట్టాడు, “నీవు మాట్లాడుచున్న ఆ మనుష్యుడు ఎవరో నాకు తెలియదు! ఎందుకంటే నేను సత్యముగా మాట్లాడుచున్నాను అని దేవునికి తెలుసు, మరియు నేను అబద్ధం చెప్పిన యెడల ఆయన నన్ను శిక్షిస్తాడు!” 72 వెంటనే కోడి రెండోసారి కూసింది. అప్పుడు పేతురు యేసు తనతో ఇంతకు ముందు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడు: “కోడి రెండవసారి కూయకముందే, నీవు నన్ను ఎరుగనని మూడుసార్లు నిరాకరిస్తావు.” అతడు తాను మూడుసార్లు తిరస్కరించాడని గుర్తించి చాలా బాధపడడు, పేతురు ఏడ్వడం ప్రారంభించాడు.

Chapter 15

1 రోమా గవర్నరు ముందు యేసును ఎలా నిందారోపణ చేయాలో నిర్ణయించుకోవడానికి ప్రధాన యాజకులు ఉదయమున చాల ముందుగా మిగిలిన యూదు సభతో సమావేశమయ్యారు. వారి కాపలాదారులు తిరిగి యేసు యొక్క చేతులు కట్టివేసారు. వారు ఆయనను అధిపతి పిలాతు యొక్క నివాసానికి తీసుకు వెళ్ళారు. 2 పిలాతు యేసును అడిగాడు, “నీవు యూదుల యొక్క రాజు అని చెప్పుచున్నావా?” యేసు అతనికి జవాబిచ్చాడు, “నీకు నీవే అలా చెప్పావు.” 3 అప్పుడు ప్రధాన యాజకులు యేసు చాలా చెడ్డ పనులు చేసాడు అని చెప్పారు. 4 కాబట్టి పిలాతు తిరిగి ఆయనను అడిగాడు, “నీకు చెప్పడానికి ఏమీయు లేదా? నీవు ఎన్ని చెడ్డ పనులు చేసావు అని వారు చెప్పుచున్నారో వినండి!” 5 అయితే {యేసు దోషి కాదు అయినప్పటికీ} అంతకు మించి ఏమీయు చెప్పలేదు. ఫలితంగా పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు. 6 ఇప్పుడు ప్రతి సంవత్సరం పస్కా పండుగ సందర్భంగా చెరసాలలో ఉన్న ఒక వ్యక్తిని విడుదల చేయడం అధిపతి యొక్క ఆచారం. మనుష్యులు కోరిన ఖైదీని అతడు ఆచారంగా విడుదల చేసాడు. 7 ఆ సమయంలో బరబ్బా అనే మనుష్యుడు ఉన్నాడు. {సైనికులు వీరిని} మరికొందరు మనుష్యులతో చెరసాలలో ఉంచారు. రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక తిరుగుబాటు సమయంలో ఈ మనుష్యులు కొందరు సైనికులను హత్య చేసారు. 8 ఒక జనసమూహం పిలాతు దగ్గరకు వచ్చారు మరియు పస్కా పండుగ సమయంలో అతడు ఆచారంగా వారి కోసం చేసిన విధముగా, ఎవరినైనా విడుదల చేయుటకు అడిగారు. 9 పిలాతు వారికి జవాబిచ్చాడు, “యూదు మనుష్యులయిన మీరు మీ రాజు అని చెప్పుకునే మనుష్యుని నేను మీ కోసం విడుదల చేయుటకు ఇష్టపడుచున్నారా?” 10 ప్రధాన యాజకులు ఏమి చేయుటకు కోరుచున్నారో అతడు గ్రహించి దీనిని అడిగాడు. వారు యేసు మీద నేరారోపణ చేస్తున్నారు, ఎందుకంటే వారు ఆయన గురించి అసూయపడ్డారు {ఎందుకంటే అనేక మంది మనుష్యులు ఆయన శిష్యులు అవుచున్నారు}. 11 అయితే ప్రధాన యాజకులు తమ కోసం యేసుకు బదులు బరబ్బను విడుదల చేయుము అని పిలాతును అభ్యర్థించుటకు సమూహమును కోరారు. 12 మరొకసారి, పిలాతు వారితో చెప్పాడు, “నేను బరబ్బాను విడుదల చేసిన యెడల, మీలో కొందరు యూదులు మీ రాజు అని చెప్పుకునే ఈ మనుష్యుని నేనేం చేయాలనుకుంటున్నారు?” 13 అప్పుడు వారు తిరిగి కేకలు వేసారు, “ఆయనను సిలువ వేయుటకు నీ సైనికులకు ఆజ్ఞాపించు!” 14 అప్పుడు పిలాతు వారితో చెప్పాడు, “ఎందుకు? ఆయన చేసిన నేరం ఏమిటి?" అయితే వారు మరింత బిగ్గరగా కేకలు వేసారు, “ఆయనను సిలువ వేయుటకు మీ సైనికులకు ఆజ్ఞాపించండి!” 15 ఎందుకంటే పిలాతు సమూహాన్ని సంతోషపెట్టుటకు కోరుకున్నాడు కాబట్టి, అతడు బరబ్బను వారి కోసం విడుదలచేసాడు. అప్పుడు, అతని సైనికులు తోలు పట్టీలతో వారు లోహం మరియు ఎముక ముక్కలను బిగించిన కొరడాతో యేసును కొట్టిన తరువాత, ఆయనను సిలువ వేయడానికి యేసును తీసుకువెళ్ళమని పిలాతు సైనికులకు చెప్పాడు. 16 పిలాతు సైనికులు యేసును పిలాతు నివసించే రాజభవనంలోనికి తీసుకువెళ్ళారు. ఆ స్థలం ప్రభుత్వ ప్రధాన కార్యాలయం. అప్పుడు వారు అక్కడ విధులలో ఉన్న మొత్తం సైనికుల యొక్క గుంపును పిలిచారు. 17 సైనికులు ఒకచోట చేరిన తరువాత, యేసుకు ఊదారంగు వస్త్రం తొడిగారు. అప్పుడు వారు ముళ్ల యొక్క కొమ్మలతో అల్లిన ఒక కిరీటాన్ని ఆయన తల మీద ఉంచారు. {ఆయనను రాజుగా వారు భావించి ఆయనను ఎగతాళి చేయడానికి వారు ఆ పనులు చేసారు.} 18 అప్పుడు వారు ఒక రాజుకు నమస్కరించిన విధముగా ఆయనకు నమస్కరించారు, తిరిగి ఆయనను ఎగతాళి చేయడానికి, చెప్పుచున్నారు, “యూదులను పరిపాలించే రాజుకు హుర్రే!” 19 బరువైన రెల్లుతో ఆయన తలను తిరిగి మరియు తిరిగి కొట్టారు, మరియు వారు ఆయన మీద ఉమ్మి వేసారు. ఆయనను గౌరవిస్తున్నట్లు నటించడానికి వారు ఆయన ముందు మోకరించారు. 20 వారు ఆయనను ఎగతాళి చేయడం ముగించినప్పుడు, ఊదారంగు వస్త్రాన్ని తీసివేసారు. వారు ఆయన స్వంత వస్త్రములు ఆయనకు తొడిగారు, మరియు కాబట్టి అప్పుడు వారు ఆయనను ఒక సిలువకు మేకులతో కొట్టడానికి వారు నగరం వెలుపలకు ఆయనను నడిపించారు. 21 యేసు తన సిలువను ఒక కొంతదూరం మోసుకువెళ్ళిన తరువాత, కురేనే పట్టణానికి చెందిన సీమోను అనే పేరుగల మనుష్యుడు వెంట వచ్చాడు. అతడు అలెగ్జాండరు మరియు రూపు యొక్క తండ్రి. అతడు నగరం వెలుపల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అతడు అటుగా వెళ్ళుచున్నాడు. కాబట్టి యేసు కోసం సిలువను మోయమని సైనికులు సీమోనును బలవంతం చేసారు, ఎందుకంటే ఆయన పొందిన అన్ని వేధింపుల చేత యేసు బలహీన పరచబడ్డాడు. 22 సైనికులు వారిద్దరినీ గొల్గొతా అని పిలిచే ప్రదేశానికి తీసుకొచ్చారు. ఆ పేరుకు అర్థం, "కపాల స్థలం". 23 అప్పుడు వారు బోళము అనే మందు కలిపిన ద్రాక్షారసాన్ని యేసుకు ఇవ్వడానికి ప్రయత్నించారు, అయితే ఆయన దానిని త్రాగడానికి నిరాకరించాడు. 24 సైనికులలో కొందరు ఆయన వస్త్రములు తీసుకున్నారు. అప్పుడు వారు ఆయనను ఒక సిలువకు మేకులతో కొట్టారు. తరువాత, వారు పాచికలతో వాటి కోసం జూదం ఆడుతూ ఆయన వస్త్రములు తమలో తాము పంచుకున్నారు. ప్రతి ఒక్కరికి ఏ వస్త్రం యొక్క ముక్క లభిస్తుందో నిర్ణయించడానికి వారు దీనిని చేసారు. 25 వారు ఆయనను సిలువ వేసినప్పుడు ఉదయం తొమ్మిది గంటలైంది. 26 యేసు తల మీద ఉన్న సిలువకు వారు ఆయనను సిలువకు ఎందుకు మేకులతో కొట్టుచున్నారో కారణాన్ని ఎవరో వ్రాసిన గుర్తును అతికించారు. అది చెపుతుంది, “యూదుల యొక్క రాజు” 27 బందిపోటులుగా ఉన్న మరో ఇద్దరు ఖైదీలను కూడా వారు ఇతర సిలువలకు మేకులతో కొట్టారు. వారు ఒకరిని యేసు కుడి వైపున ఉన్న ఒక సిలువకు మరియు ఒకరిని యేసు ఎడమ వైపున ఉన్న ఒక సిలువకు మేకులతో కొట్టారు. 28 [ఆయనను బందిపోటు దొంగలతో సిలువ వేయడం ద్వారా, ‘ఆయన దుర్మార్గులైన మనుష్యుల మధ్య ఉన్న విధముగా ఎంచబడినాడు’ అనే లేఖన భాగాన్ని వారు నెరవేర్చారు. 29 అటుగా వెళ్ళుచున్న మనుష్యులు తమ తలలు ఊపుతూ ఆయనను అవమానించారు. వారు చెప్పారు, “హా! నీవు ఆలయాన్ని ధ్వంసం చేస్తావు అని మరియు మూడు దినములలో తిరిగి కట్టుతాను అని చెప్పావు. 30 నీవు దానిని చేయగలిగిన యెడల, అప్పుడు సిలువ నుండి దిగి రావడం చేత నిన్ను నీవే రక్షించుకో!” 31 ప్రధాన యాజకులు, యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే మనుష్యులు కూడా యేసును ఎగతాళి చేయుటకు కోరుకున్నారు. కాబట్టి వారు ఒకరినొకరు చెప్పుకున్నారు,“మనుష్యులు ఈయన ఇతరులను కష్టాల నుండి రక్షించాడు అని చెప్పుకుంటారు, అయితే ఆయన తనను తాను రక్షించుకొనలేడు! 32 ఈయన ఇశ్రాయేలు మనుష్యులను పరిపాలించే మెస్సీయ మరియు రాజు అని చెప్పుకున్నాడు. ఈయన మాటలు నిజమైన యెడల, ఆయన ఇప్పుడు సిలువ నుండి దిగి రావాలి! అప్పుడు మేము ఆయనను నమ్ముతాము! ” ఆయన పక్కన సిలువలకు మేకులతో కొట్టబడిన ఇద్దరు మనుష్యులు కూడా ఆయనను అవమానించారు. 33 మధ్యాహ్నానికి దేశం అంతా చీకటిగా మారింది, మరియు మధ్యాహ్నం మూడు గంటల వరకు చీకటిగా ఉంది. 34 మూడు గంటల సమయంలో యేసు పిలిచాడు, “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ?” దాని అర్థం, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?” 35 అక్కడ నిలబడి ఉన్న కొందరు మనుష్యులు ‘ఎలోయీ’ పదం విన్నారు, వారు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారు మరియు చెప్పారు, “వినండి! ఈయన ఏలీయా ప్రవక్తను పిలుస్తున్నాడు!” 36 వారిలో ఒకడు పరిగెత్తాడు మరియు ఒక చిరకను పుల్లటి ద్రాక్షారసముతో నింపాడు. అతడు దానిని ఒక రెల్లు కొన మీద ఉంచాడు, మరియు అప్పుడు దానిలో ఉన్న ద్రాక్షారసాన్ని పీల్చడానికి యేసును ప్రయత్నించేలా దానిని పైకి పట్టుకున్నాడు. అతడు దానిని చేస్తుండగా, ఒకరు చెప్పారు, “వేచి ఉండండి! ఆయనను సిలువ నుండి దింపడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం!" 37 మరియు అప్పుడు, యేసు బిగ్గరగా కేకవేసిన తరువాత, ఆయన శ్వాసించడం ఆపివేసాడు మరియు చనిపోయాడు. 38 ఆ క్షణములో ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలమును మూసివేసిన బరువైన, మందపాటి తెర పైనుండి క్రిందికి రెండు ముక్కలుగా చీలిపోయింది. 39 యేసును సిలువకు కొట్టిన సైనికులను పర్యవేక్షించే అధికారి యేసు ముందు నిలబడి ఉన్నాడు. యేసు ఎలా చనిపోయాడో అతడు చూసినప్పుడు, అతడు అరచాడు, “నిశ్చయంగా, ఈ యేసు దేవుని యొక్క కుమారుడు!” 40-41 అక్కడ కొందరు స్త్రీలు కూడా ఉన్నారు; వారు ఈ సంఘటనలను దూరం నుండి చూస్తున్నారు. యేసు గలిలయలో ఉన్నప్పుడు వారు ఆయనతో ఉన్నారు, మరియు వారు ఆయనకు అవసరమైనవి అందించారు. వారు మరియు అనేక స్త్రీలు ఆయనతో యెరూషలేముకు వచ్చారు. ఆ స్త్రీల్లో మగ్దలా పట్టణం నుండి మరియ ఉంది. అక్కడ మరొక మరియ ఉంది, ఆమె చిన్న యాకోబు మరియు యోసే యొక్క తల్లి. అక్కడ సలోమీ కూడా ఉంది. 42-43 సాయంకాలము దగ్గరగా ఉన్నప్పుడు, అరిమతయి అనే ఊరి నుండి యోసేపు అను పేరుగల ఒక మనుష్యుడు అక్కడికి వచ్చాడు. అతడు యూదు సభ సభ్యుడు, ప్రతి ఒక్కరు గౌరవించే వాడు. దేవుడు తన రాజును పరిపాలించడానికి పంపే సమయం కోసం ఎదురుచూసిన వారిలో అతడు కూడా ఒకడు. {యూదుల చట్టం ప్రకారం, వ్యక్తి చనిపోయిన రోజున మృతదేహాన్ని ఖననం చేయాలని అతనికి తెలుసు. ఇది సిద్ధపటు దినం అని, యూదుల విశ్రాంతి దినం కోసం ప్రజలు వస్తువులను సిద్ధం చేసే రోజు అని మరియు సూర్యుడు అస్తమించినప్పుడు యూదుల విశ్రాంతి దినం ప్రారంభమవుతుందని కూడా అతను గ్రహించాడు.} ఇప్పుడు సాయంకాలం సమీపిస్తోంది. ఇది విశ్రాంతి దినమునకు ముందు రోజు, యూదులు సిద్ధపరచు దినం అని పిలిచేవారు. కాబట్టి అతడు ధైర్యంగా, పిలాతు వద్దకు వెళ్ళాడు మరియు యేసు యొక్క దేహమును సిలువ మీద నుండి దించి మరియు వెంటనే పాతిపెట్టడానికి అతని అనుమతి కోరాడు. 44 యేసు అప్పటికే చనిపోయాడు అని విన్నప్పుడు పిలాతు ఆశ్చర్యపోయాడు. కాబట్టి అతడు యేసును సిలువ వేసిన సైనికుల అధికారిని పిలిచాడు, మరియు అతడు యేసు అప్పటికే చనిపోయాడా అని అతనిని అడిగాడు. 45 యేసు చనిపోయాడు అని ఆ అధికారి పిలాతుకు చెప్పినప్పుడు, పిలాతు యోసేపు దేహమును తీసుకువెళ్ళేందుకు అనుమతించాడు. 46 యోసేపు నారబట్ట కొనిన తరువాత, అతడు మరియు ఇతరులు యేసు యొక్క దేహామును సిలువ మీద నుండి దించారు. వారు దానిని నార గుడ్డలో చుట్టారుమరియు గతంలో రాతి శిఖరం నుండి చెక్కిన ఒక సమాధిలో ఉంచారు. అప్పుడు వారు సమాధి ప్రవేశ ద్వారం ముందు ఒక పెద్ద చదునైన రాయిని దొర్లించారు. 47 మగ్డల నుండి మరియ మరియు యోసే యొక్క తల్లి మరియ వారు యేసు దేహాన్ని ఉంచిన చోటును గమనిస్తున్నారు.

Chapter 16

1 శనివారం సాయంత్రం యూదుల విశ్రాంతి యొక్క దినం ముగిసినప్పుడు, మగ్దలా నుండి మరియ, చిన్న యాకోబు యొక్క తల్లి, మరియ మరియు సలోమీ యేసు యొక్క శరీరమును అభిషేకించడం కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యములను కొనుగోలు చేసారు. {ఈ స్త్రీలు ఈ యూదుల సమాధి ఆచారాన్ని అనుసరించాలని కోరుకున్నారు}. 2 వారంలో మొదటి దినము, ఆదివారం చాలా ముందుగా, అప్పుడే సూర్యుడు ఉదయించిన తరువాత, వారు సుగంధ ద్రవ్యములతో సమాధి వద్దకు వెళ్ళారు. 3 వారి దారిలో, వారు ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు, “సమాధి ద్వారం మూసే బరువైన రాయిని దొర్లించి మన కోసం సహాయం ఎవరు చేస్తారు?” 4 చేరుకుని, వారు పైకి చూసారు మరియు ఆ రాయిని ఒకరు దొర్లించడం చూసి అని చూసి ఆశ్చర్యపోయారు, ఎందుకంటే అది చాలా పెద్దదిగా ఉన్నది. 5 వారు సమాధిలోనికి ప్రవేశించారు మరియు ఒక పడుచువానిని చూసారు. అతడు తెల్లటి వస్త్రాన్ని ధరించాడు మరియు అతడు గుహకు కుడి వైపున కూర్చున్నాడు. ఆ దృశ్యం వారిని కలవరపచింది! 6 ఆ పడుచు మనుష్యులు వారితో చెప్పాడు, “కలవరపడ వద్దు! మీరు నజరేతు పట్టణానికి చెందిన మనుష్యుడు, వారు ఒక సిలువకు మేకులతో కొట్టబడిన యేసు కోసం చోచుచున్నారు అని నాకు తెలుసు. అయితే ఆయన తిరిగి సజీవుడైనాడు! ఆయన ఇక్కడ లేడు! చూడండి! వారు ఆయన దేహమును ఉంచిన స్థలం ఇక్కడ ఉంది. 7 అయితే, ఇక్కడ ఉండడానికి బదులుగా, వెళ్ళండి మరియు ఆయన శిష్యులతో చెప్పండి! ముఖ్యంగా, మీరు పేతురుకు చెప్పారు అని నిర్ధారించుకోండి. వారికి చెప్పండి, ‘యేసు మీ కంటే ముందుగా గలిలయ యొక్క జిల్లాకు వెళ్ళుచున్నాడు, మరియు ఆయన మీకు ముందుగా చెప్పిన విధముగానే మీరు ఆయనను అక్కడ చూస్తారు, ’” 8 ఆ స్త్రీలు బయటికి వెళ్ళారు మరియు సమాధి నుండి పరుగెత్తారు. వారు వణికిపోవుచున్నారు ఎందుకంటే వారు భయపడుచున్నారు, మరియు వారు ఆశ్చర్యపోయారు. అయితే వారు దీనిని గురించి ఏవిషయము ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే వారు భయపడ్డారు. 9 [వారం యొక్కమొదటి దినమున ఆదివారం తెల్లవారుజామున యేసు తిరిగి సజీవుడైనప్పుడు, మగ్దలా యొక్క పట్టణం నుండి వచ్చిన మరియకు ఆయన మొదట కనిపించాడు. ఆయన ఇంతకుముందు ఏడు దుష్ట ఆత్మలను బలవంతంగా బయటకు పంపిన స్త్రీ ఆమె. 10 యేసుతో ఉన్నవారు దుఃఖిస్తూ మరియు ఏడుస్తూ ఉండగా ఆమె వారి దగ్గరకు వెళ్ళింది. ఆమె చూసిన వాటిని వారికి చెప్పింది. 11 అయితే యేసు తిరిగి సజీవుడైనాడు అని మరియు ఆమె ఆయనను చూసింది అని ఆమె వారితో చెప్పినప్పుడు, ఆమె చెప్పినది నమ్మడానికి వారు నిరాకరించారు. 12 ఆ దినము చివరిలో, యేసు తన ఇద్దరు అనుచరులు యెరూషలేము నుండి చుట్టుపక్కల ప్రదేశంలో ఉన్న తమ ఇళ్ళకు వెళ్ళుచుండగా వారికి ప్రత్యక్షం అయ్యాడు. వారు ఆయనను త్వరగా గుర్తించ లేదు ఎందుకంటే ఆయన చాలా భిన్నంగా కనిపించాడు. 13 {వారు ఆయనను గుర్తించిన తరువాత,} ఆ ఇద్దరు యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. వారు ఆయన ఇతర అనుచరులకు ఏమి జరిగిందో చెప్పారు, అయితే వారు వినినది నమ్మలేదు. 14 తరువాత పదకొండు మంది శిష్యులు తినుచున్నప్పుడు యేసు వారికి కనిపించాడు. ఆయన వారిని తీవ్రంగా గద్దించాడు, ఎందుకంటే ఆయన తిరిగి సజీవుడైన తరువాత తనను చూసిన వారి నివేదికలను నమ్మడానికి వారు మొండిగా నిరాకరించారు. 15 ఆయన వారితో చెప్పాడు, “లోక మంతటి లోనికి వెళ్ళండి మరియు ప్రతిఒక్కరికి సువార్త ప్రకటించండి! 16 మీ సందేశాన్ని నమ్మి మరియు బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరిని దేవుడు రక్షిస్తాడు. అయితే మీ సందేశాన్ని నమ్మని ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షిస్తాడు. 17 సువార్తను నమ్మేవారు అద్భుతాలు చేస్తారు. ప్రత్యేకంగా, నా శక్తి చేత వారు మనుష్యుల నుండి దుష్ట ఆత్మలను బలవంతంగా బయటకు పంపుతారు. వారు నేర్చుకొనని భాషలలో మాట్లాడతారు. 18 వారు పామును ఎత్తిపట్టుకున్నప్పుడు లేదా ఏదైనా విషపూరితమైన ద్రవం తాగిన యెడల వారు హాని పొందరు. వారు ఎవరి మీద చేతులు ఉంచుతారో, అనారోగ్యంతో ఉన్న మనుష్యులను దేవుడు స్వస్థపరుస్తాడు. 19 ప్రభువైన యేసు తన శిష్యులతో దీనిని చెప్పిన తరువాత, దేవుడు ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు యేసు ఆయనతో పరిపాలించడానికి దేవుని యొక్క కుడి ప్రక్కన అత్యున్నత గౌరవ స్థానమున తన సింహాసనం మీద కూర్చున్నాడు. 20 శిష్యుల విషయంలో, వారు యెరూషలేము నుండి బయటకు వెళ్ళారు, మరియు అప్పుడు వారు ప్రతిచోటా బోధించారు. వారు ఎక్కడికి వెళ్ళినా, అద్భుతాలు చేయడానికి ప్రభువు వారిని బలపరచాడు. దానిని చేయడం చేత, దేవుని యొక్క సందేశం నిజము అని ఆయన మనుష్యులకు చూపించాడు.]