తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యోహాను రాసిన సువార్త

Chapter 1

1 విశ్వము ఉనికిలో ఉండడానికి ముందే వాక్యము ఉనికి కలిగి ఉన్నాడు. వాక్యం దేవునితో ఉన్నాడు. వాక్యము దేవుడై కూడా ఉన్నాడు. 2 ఆయన, వాక్యము, విశ్వము ఉనికిలో ఉండడానికి ముందే దేవునితో ఉన్నాడు. 3 దేవుడు ఆయన ద్వారా సమస్తమును చేసాడు. దేవుడు విశ్వములో ప్రతీ ఒక్క వస్తువును ఆయనతో చేసాడు. 4 వాక్యము నిత్య జీవమును ఇచ్చుచున్నాడు, మరియు ఆ నిత్య జీవము {దేవుని యొక్క మంచి మరియు సత్యము} వెలుగు మానవులకు {అది ఆయన బయలుపరచెను} 5 దేవుడు {ఆయన మంచి మరియు సత్యము} వెలుగును చెడ్డ లోకమునకు బయలుపరచాడు, మరియు ఆ చెడ్డ లోకము దానిని జయించలేదు. 6 దేవుడు యోహాను అను పేరుగల ఒక మనుష్యుని పంపాడు {అతడు బాప్తిస్మమిచ్చు యోహాను వలే పిలువబడినాడు.} 7 అతడు {వెలుగైయున్న, యేసును} గురించి మనుష్యులకు ప్రకటించడానికి వచ్చాడు. {అతడు దీనిని ప్రకటించాడు} తద్వారా అతని {సాక్ష్యము} ద్వారా ప్రతి ఒక్కరు వెలుగునందు నమ్మకముంచుతారు. 8 యోహాను అతడే ఆ వెలుగు కాదు, అయితే అతడు ఆ వెలుగును గురించి మనుష్యులకు చెప్పడానికి వచ్చాడు. 9 ఆ నిజమైన వెలుగు {యేసు,} ఆయన ప్రతిఒక్కరికి దేవుని యొక్క సత్యమును మరియు మంచితనమును బయలుపరచాడు. {ఆయన} లోకము లోనికి వచ్చుచున్నటువంటి ఆ వెలుగై ఉన్నాడు. 10 వాక్యము లోకములో ఉన్నాడు, మరియు ఆయన లోకాన్ని సృష్టించినప్పటికీ, దాని మనుష్యులలో ఏ ఒక్కరికీ ఆయన ఎవరో తెలియదు. 11 ఆ వాక్యము ఆయన స్వంత మనుష్యులు, {యూదుల} వద్దకు వచ్చాడు, అయితే వారు ఆయనను తిరస్కరించారు. 12 అయితే ఆయనను అంగీకరించే ప్రతిఒక్కరికి మరియు ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి దేవుని యొక్క పిల్లలు అగుటకు హక్కును ఆయన అనుగ్రహించాడు. 13 ఈ దేవుని యొక్క పిల్లలు సాధారణ మానవ జన్మ యొక్క పద్దతుల ద్వారా ఆత్మీయముగా పుట్టిన వారు కాదు, లేదా మానవ కోరిక చేత, లేదా వారి తండ్రుల కోరిక చేత పుట్టినవారు కారు. బదులుగా,వారు ఆత్మీయముగా దేవుని చేత పుట్టినవారు. 14 ఆ వాక్యము ఒక నిజమైన మానవ జీవిగా అయ్యాడు మరియు ఇక్కడ తాత్కాలికంగా {మనం నివసించే చోట} నివసించాడు. మనము ఆయన తన మహిమాన్వితమైన స్వభావాన్ని ఆయన కనుపరచడం చూసాము. {అది} తండ్రి నుండి వచ్చిన అద్వితీయ కుమారుడు యొక్క మహిమాన్వితమైన స్వభావం. ఆయన తండ్రి యొక్క దయగల కార్యములు మరియు నిజమైన బోధలు కలిగి ఉన్నాడు. 15 బాప్తిస్మమిచ్చే యోహాను వాక్యము గురించి మనుష్యులకు చెప్పుచు ఉన్నాడు. మరియు అతడు అరిచాడు {తన చుట్టూ ఉన్న వారికి}, "నా తరువాత ఒకరు వస్తారు అని నేను మీకు చెప్పాను {మరియు ఆయన}, నా కంటే చాలా ప్రాముఖ్యమైన వాడు ఎందుకంటే ఆయన నాకు చాలా కాలం ముందు ఉనికి కలిగి ఉన్నాడు.” 16 {దేవుని యొక్క దయగలిగిన కార్యములు మరియు నిజమైన బోధలను వాక్యం పూర్తిగా కలిగి ఉందని మనకు తెలుసు} ఎందుకంటే ఆయన పూర్తిగా కలిగియున్న దాని నుండి మనం అందరం ప్రయోజనం పొందాము కాబట్టి, ఒక దయగల కార్యము తరువాత మరియొక దాని {నుండి ప్రయోజనం పొందాము.} 17 {ఇది} దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా {ఇశ్రాయేలీయులకు} ఇచ్చాడు కాబట్టి. అయితే దేవుని యొక్క దయగల కార్యములు మరియు నిజమైన వర్తమానము మెస్సీయ అయిన యేసు ద్వారా పూర్తి ఉనికి లోనికి వచ్చింది. 18 ఏ ఒక్కరు ఎన్నడూ దేవుని చూడ లేదు. అయితే యేసు, అద్వితీయుడు, దేవుడై ఉన్నాడు. ఆయన తండ్రియైన దేవునికి సన్నిహితంగా ఉన్నాడు, మరియు ఆయన తానే తండ్రిని బయలుపరచాడు. 19 “నీవు ఎవరివని” అడగడానికి యెరూషలేము యొక్క నగరం నుండి యూదుల నాయకులు కొందరు యాజకులను మరియు లేవీయులను పంపి నప్పుడు బాప్తిస్మమిచ్చు యోహాను ఇచ్చిన సాక్ష్యం ఇదే. 20 {ఆ సమయములో} యోహాను గట్టిగా ఒప్పుకున్నాడు, “నేను మెస్సీయను కాను!” 21 అప్పుడు వారు అతనిని అడిగారు, “{ అది ఆలాగైన యెడల} అయితే నీవు ఎవరవు? నీవు ఏలియావా?” అతడు చెప్పాడు, “లేదు.” వారు మరల అడిగారు, “నీవు ప్రవక్తవా { వస్తాడని దేవుడు చెప్పిన}?” యోహాను సమాధానం ఇచ్చాడు, "లేదు." 22 కాబట్టి ఈ యాజకులు మరియు లేవీయులు యోహానును మరియొకసారి అడిగారు, “నీవు ఎవరివి? {మాకు చెప్పు} తద్వారా మేము తెలియజేయగలము { నీవు ఏమి చెపుతావు} మమ్ములను పంపిన ఆ నాయకులకు. నీవు ఎవరివి అని నీవు చెప్పుకొంటున్నావు?” 23 యోహాను వారితో చెప్పాడు, “ప్రభువు వచ్చునప్పుడు ఆయనను స్వీకరించడానికి మిమ్ములను మీరు సిద్ధపరచుకోవడానికి నేను నిర్జన ప్రాంతములో కేకలు వేయుచున్న వ్యక్తిని, {నేను} ప్రవక్తయైన యెషయా ముందుగా చెప్పిన వాడిని. 24 ఈ యాజకులను మరియు లేవీయులను యెరూషలేములో యోహాను వద్దకు పంపిన నాయకులు పరిసయ్యులు. 25 వారు అతనిని అడిగారు, "నీవు మెస్సీయ కాని లేదా ఏలీయా కాని లేదా ప్రవక్త కాని యెడల, అయితే, నీవు ఎందుకు మనుష్యులకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు?" 26 యోహాను ప్రత్యుత్తరమిచ్చాడు, "నేను నీటితో మనుష్యులకు బాప్తీస్మం ఇస్తున్నాను, అయితే ఇప్పుడు మీలో ఒకడు ఉన్నాడు, మీరు యెరుగని వాడు . 27 అయన నా వెనుక వచ్చుచున్నాడు, అయితే ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను చాలినంత ముఖ్యుడిని కాదు." 28 ఈ సంగతులు యొర్దాను నది యొక్క తూర్పు వైపు మీదుగా బేతనియ యొక్క గ్రామంలో సంభవించాయి. {ఆ స్థలంలో} యోహాను మనుష్యులకు బాప్తీస్మం ఇస్తున్నాడు. 29 మరుసటి రోజు యోహాను యేసు తన దగ్గరికి రావడం చూసాడు. అప్పుడు అతడు మనుష్యులతో చెప్పాడు, "చూడండి! {అతడు} దేవుని యొక్క గొఱ్ఱపిల్ల! ఆయన ఈ లోకములోని మనుష్యుల యొక్క పాపాలను క్షమించడానికి తనను తానే బలిగా అర్పించుకుంటాడు 30 ఆయన గురించి నేను చెప్పిన వాడు ఈయనే. “ఒకడు నా వెనుక వస్తాడు, ఆయన నా కంటే చాలా ప్రాముఖ్యమైనవాడు, ఎందుకంటే నాకు చాలా ముందుగానే {ఆయన ఉనికి కలిగి ఉన్నాడు.}” 31 {మొదటిలో} నేను ఆయన ఎవరో యెరుగను, అయినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలకు ఆయనను బయలుపరచే ఉద్దేశ్యముతో నేను మనుష్యులకు నీళ్ళతో బాప్తిస్మము ఇచ్చుచున్నాను." 32 మరియు యోహాను ప్రకటించాడు, “నేను దేవుని యొక్క ఆత్మ పరలోకము నుండి కిందికి ఒక పావురము వలె కనిపిస్తూ దిగి వచ్చుట యేసు మీద నిలిచియుండడం నేను చూసాను. 33 ఆయన ఎవరై ఉన్నాడో నాకు {మొదట} తెలియదు, అయితే దేవుడు {మనుష్యులకు} నీళ్ళతో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపాడు మరియు నాకు చెప్పాడు, ఏ మనుష్యుని మీద ఆత్మ దిగి వచ్చి మరియు నిలుచుట నీవు చూస్తావో ‘ఆ మనుష్యుడు పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు.’ 34 నేను ఇది చూసాను, మరియు ఈ మనుష్యుడు దేవుని యొక్క కుమారుడు అని నేను ప్రకటించాను.” 35 అది జరిగిన తరువాత రోజు, బాప్తిస్మమిచ్చు యోహాను మరల తన యొక్క ఇద్దరు శిష్యులతో ఉన్నాడు. 36 యేసు అటుగా వెళ్ళడం అతడు చూసి నప్పుడు, అతడు చెప్పాడు, "చూడండి! {ఆయన} దేవుని యొక్క గొర్రె పిల్ల!" 37 అప్పుడు యోహాను యొక్క ఇద్దరు శిష్యులు అతడు చెప్పినది విన్నారు మరియు యేసును వెంబడించారు. 38 యేసు వెనుకకు తిరిగినప్పుడు మరియు వారు తన వెనుక వచ్చుట వారిని చూచాడు, ఆయన వారిని అడిగాడు, మీరు దేని కోసం వెదకుచున్నారు?” వారు ఆయనకు చెప్పారు, “రబ్బీ (‘బోధకుడు’ అని దీని అర్థం {యూదయ అరామిక్ లో}), నీవు ఎక్కడ బసచేయుచున్నావు?” 39 ఆయన ప్రత్యుత్తర మిచ్చాడు, “నాతో రండి, మరియు మీరు చూస్తారు!” కాబట్టి వారు వచ్చారు మరియు యేసు ఎక్కడ బసచేయుచున్నాడో చూసారు. వారు ఆ రోజు ఆయనతో ఉన్నారు ఎందుకంటే అది ఆలస్యం అయ్యింది. (అది దాదాపు సాయంత్రం 4 గంటలు అయ్యింది.) 40 ఆ ఇద్దరి శిష్యులలో ఒకడు యోహాను చెప్పినది విన్నాడు మరియు యేసును వెంబడించాడు, {అతడు} అంద్రెయ. సీమోను పేతురు యొక్క సహోదరుడు. 41 అంద్రెయ మొదట {వెళ్ళాడు మరియు} తన సహోదరుడు సీమోనును కనుగొన్నాడు. {అతడు అతని దగ్గరకు వచ్చినప్పుడు,} అతడు చెప్పాడు, “మేము మెస్సీయను కనుగొన్నాము!" (మెస్సీయ గ్రీకు భాషలో “క్రీస్తు.”) 42 అంద్రెయ సీమోనుని యేసు దగ్గరకు తీసుకు వెళ్ళాడు. యేసు పేతురు వైపు చూసి నప్పుడు, ఆయన చెప్పాడు, “నీవు సీమోనువు, నీ తండ్రి యొక్క పేరు యోహాను. {ఇప్పటి నుండి} నీ పేరు కేఫాగా {కుడా} ఉంటుంది.” ({కేఫా ఒక అరామిక్ పదము, దాని అర్థం} “పేతురు” ( మరియు అర్ధము “రాయి”}.) 43 అది జరిగిన తరువాత రోజు యేసు ఆ ప్రాంతము విడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయన గలిలయ ప్రదేశమునకు వెళ్ళాడు మరియు ఫిలిప్పు అను పేరుగల ఒక మనుష్యుని కనుగొన్నాడు. యేసు అతనితో చెప్పాడు, “రమ్ము నా శిష్యునిగా ఉండు." 44 ఫిలిప్పు {గలిలయలోని} బేత్సయిదా యొక్క పట్టణము నుండి వచ్చిన వాడు. అంద్రెయ మరియు పేతురు {ఈ పట్టణము కూడా} వచ్చారు. 45 {అప్పుడు} ఫిలిప్పు {వెళ్ళాడు మరియు} నతనయేలును కనుగొన్నాడు. {అతడు తన వద్దకు వచ్చినప్పుడు,} అతడు చెప్పాడు, “{దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన} ధర్మశాస్త్రములో మోషే ఎవరిని గూర్చి వ్రాసాడో మరియు {ఎవరిని} ప్రవక్తలు {వస్తాడని చెప్పారో} ఆ మెస్సీయను మేము కనుగొన్నాము. {ఆ మెస్సీయ} యేసు. ఆయన తండ్రి యొక్క పేరు యోసేపు. ఆయన నజరేతు యొక్క పట్టణము నుండి వచ్చాడు. 46 నతనియేలు జవాబిచ్చాడు, "నజరేతు నుండి? నిశ్చయముగా ఆ పట్టణము నుండి మంచిది ఏదియు రాదు!" ఫిలిప్పు జవాబిచ్చాడు, "వచ్చి మరియు మీరే చూడండి!" 47 నతనియేలు ఆయన వద్దకు సమీపిస్తున్నప్పుడు యేసు చూసాడు, ఆయన అతనితో చెప్పాడు, "చూడండి యదార్ధమైన ఇశ్రాయేలీయుడు {ఇక్కడ ఉన్నాడు}! అతడు ఎవరినీ మోసగించడు. 48 నతనియేలు ఆయనను అడిగాడు, "నేను ఎలాంటి మనిషిని మీకు ఎలా తెలుసు? నేను నీకు తెలియదు.” యేసు ప్రత్యుత్తరమిచ్చాడు, "అంజూరపు చెట్టు కింద నీకై నీవే కూర్చున్నప్పుడు ఫిలిప్పు నిన్ను పిలవడానికి ముందు నేను నిన్ను చూసాను.” 49 అప్పుడు నతనియేలు ప్రకటించాడు, "బోధకుడా, నీవు దేవుని తప్పక దేవుని యొక్క కుమారుడవు! నీవు మేము ఎదురుచూస్తున్న ఇశ్రాయేలు రాజువు!” 50 యేసు అతనికి ప్రత్యుత్తర మిచ్చాడు, “నేను నిన్ను అంజూర చెట్టు కింద చూసాను అని చెప్పాను కాబట్టి నీవు నన్ను విశ్వసించు చున్నావా? దాని కంటే చాలా గొప్ప కార్యాలు నేను చెయ్యడం నీవు చూస్తావు!" 51 ప్పుడు యేసు అతనితో చెప్పాడు, “నేను మీకు నిజం చెప్పుచున్నాను: చాలా కాలం క్రితం మీ పూర్వీకుడైన యాకోబు చూసిన దర్శనం వలెనే, ఒక రోజున పరలోకము తెరవబడడం మీరు చూస్తారు, మరియు దేవుని దూతలు పైకి వెళ్లడం మరియు మనుష్యుని యొక్క కుమారుడను నా మీదకు దిగి రావడం మీరు చూస్తారు."

Chapter 2

1 రెండు రోజుల తరువాత, గలిలయ యొక్క ప్రదేశములో ఒక పట్టణమైన, కానాలో ఒక వివాహం ఉంది, మరియు యేసు యొక్క తల్లి అక్కడ ఉంది. 2 మరియు ఒకరు యేసును మరియు ఆయన శిష్యులను కూడా వివాహానికి ఆహ్వానించారు. 3 {వివాహానికి హాజరైన వారికి అతిధేయలు ద్రాక్షారసం అందించారు మరియు} వారు తమ వద్ద ఉన్న ద్రాక్షారసం అంతా త్రాగారు.{కాబట్టి} యేసు యొక్క తల్లి ఆయనతో చెప్పింది, “వారికి ద్రాక్షారసం అయిపోయింది. {దయచేసి దాని గురించి ఏదైనా చేయండి.}” 4 యేసు ఆమెతో చెప్పాడు, “అమ్మా, నాతో లేక నీకు ఏమి పని? {ఎంచుకున్న} సమయం {నా కొరకు ప్రారంభించడానికి} నా యొక్క {పనిని} ఇంకా రాలేదు.” 5 యేసు యొక్క తల్లి సేవకులతో చెప్పింది, “ఆయన మీరు చేయుటకు మీకు చెప్పునది చెయ్యండి.” 6 (అక్కడ ఆరు {ఖాళీ} రాతి కూజాలు అక్కడ ఉంచారు. వారు నీటిని పట్టియుంచారు తద్వారా మనుష్యులు తమను తాము కడుగుకొనగలుగుటకు} యూదుల శుద్ధి ఆచారాలు ప్రకారముగా. ప్రతి కూజా 80 నుండి 120 లీటర్లు కలిగి ఉంటుంది. 7 యేసు సేవకులతో చెప్పాడు, “కూజాలను నీళ్ళతో నింపండి!” కాబట్టి వారు కూజాలను పూర్తిగా అంచు వరకు నింపారు. 8 అప్పుడు ఆయన వారితో చెప్పాడు, “ఇప్పుడు ఒక కూజా నుండి కొంత నీళ్ళు తీసుకోండి మరియు పెండ్లి విందు యొక్క నిర్వాహకునికి వద్దకు దీనిని తీసుకొని వెళ్ళండి.” కాబట్టి సేవకులు దానిని చేసారు. 9 విందు యొక్క నిర్వాహకుడు నీటిని రుచి చూసాడు, అది ఇప్పుడు ద్రాక్షారసంగా మారింది. (నీటిని బయటికి తీసుకొని వచ్చిన సేవకులకు తెలిసినప్పటికీ, ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో అతనికి తెలియ లేదు.) మరియు అతడు పెండ్లి కుమారుని సేవకులను {తన వద్దకు పిలిచాడు}. 10 అప్పుడు అతడు పెండ్లికుమారునికి చెప్పాడు, "ప్రతి ఒక్కరు మొదట శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని వడ్డిస్తారు మరియు తరువాత చౌక ద్రాక్షారసాన్ని వడ్డిస్తారు, మరియు అతిథులు అధికంగా త్రాగినప్పుడు {మరియు తేడా చెప్పలేరు} అయినప్పటికి, నీవు ఇప్పటి వరకు శ్రేష్ఠమైన ద్రాక్షారసము పొదుపు చేసావు. 11 అది యేసు చేసిన మొదటి అద్భుతమైన సూచకక్రియ. ఆయన దీనిని గలిలయ యొక్క ప్రాంతములోని కానా యొక్క పట్టణములో చేసాడు. ఆయన ఎంత గొప్పవాడో అక్కడ చూపించాడు. కాబట్టి ఆయన శిష్యులు ఆయనలో నమ్మకం ఉంచారు. 12 ఈ అద్భుతం చేసిన కొంత సమయం తర్వాత, యేసు మరియు ఆయన తల్లి మరియు సహోదరులు, ఆయన శిష్యులతో పాటు, కపెర్నహూము యొక్క పట్టణానికి వెళ్ళారు, మరియు వారు కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. 13 ఇప్పుడు యూదుల పస్కా పండుగకు దాదాపు సమయం అది, కాబట్టి యేసు యెరూషలేము యొక్క నగరము వరకు వెళ్ళారు. 14 అక్కడ దేవాలయము {ప్రాంగణము}లో మనుష్యులు పశువులు, గొర్రెలు మరియు పావురాలను {అక్కడ బలులు అర్పించే వారికి} అమ్మడం అయన చూసాడు. మనుష్యులు బల్లల వద్ద కూర్చుండి, {ఆలయం డబ్బు కోసం}. డబ్బు మారకము చేస్తున్నారు. 15 కాబట్టి యేసు కొన్ని అల్లిన తోలు పేలికలతో ఒక కొరడా తయారు చేసాడు మరియు ఆయన ఆలయం నుండి బయటకు ఆ మనుష్యులందరి {తో పాటు} గొర్రెలను మరియు పశువులను వెళ్ళగొట్టడానికి దానిని ఉపయోగించాడు. అయన డబ్బు మారకం చేసేవారి యొక్క నాణేములను నేల మీద చెదరగొట్టాడు మరియు వారి యొక్క బల్లలను తలకిందులు చేసాడు. 16 పావురాలను అమ్ముచున్న వారికి ఆయన చెప్పాడు, "ఈ పావురాలను ఇక్కడి నుండి బయటకు తీసుకు వెళ్ళండి! నా తండ్రి యొక్క గృహమును వ్యాపార స్థలము లోనికి మార్చ వద్దు!” 17 {ఈ సంఘటన} “నేను నీ ఆలయమును చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, {ఓ దేవా,} నేను దాని కోసం చనిపోతాను.” అని {చాలా కాలం క్రితం లేఖనాలలో ఒకరు వ్రాసిన} దాని గురించి ఆయన శిష్యులకు జ్ఞాపకం చేసింది. 18 అప్పుడు యూదు నాయకులు యేసును అడుగుట ద్వారా ప్రతిస్పందించారు, “నేవు చేయుచున్నది చెయ్యడానికి దేవుని నుండి నీకు అధికారము ఉంది అని రుజువు చెయ్యడానికి మా కోసం నీవు ఏ అద్భుతం చేయగలవు?” 19 యేసు వారికి జవాబిచ్చాడు, “మీరు ఈ ఆలయాన్ని నాశనం చెయ్యండి, అప్పుడు మూడు రోజులలో నేను దీనిని తిరిగి నిర్మిస్తాను.” 20 కాబట్టి యూదు నాయకులు చెప్పారు, "ఈ దేవాలయమును నిర్మించడానికి 46 సంవత్సరాలు పట్టింది. కేవలం మూడు రోజులలో ఈ దేవాలయం అంతటిని తిరిగి కట్టబోవుచున్నాను {అని నీవు చెప్పుచున్నావా}?" 21 అయినప్పటికీ, యేసు మాట్లాడుచున్న ఆలయం ఆయన స్వంత శరీరమును గూర్చి, {దేవాలయం భవనం కాదు.} 22 {ఈ ప్రకటన యొక్క} ఫలితముగా, దేవుడు యేసును మృతులలోనుండి లేపిన తరువాత ఆయన ఈ విషయములు గురించి చెప్పిన మాటలను ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు వారు లేఖనాలు చెప్పిన వాటిని మరియు యేసు తానే చెప్పిన వాటిని రెంటినీ వారు విశ్వసించారు. 23 తర్వాత సమయములో, యేసు యెరూషలేములో పస్కాపండుగలో ఉన్నప్పుడు, వేడుక {రోజుల} సమయములో అనేకమంది మనుష్యులు ఆయనలో నమ్మకము ఉంచారు ఎందుకంటే ఆయన చేయుచు ఉన్న అద్భుతాలను వారు చూసారు. 24 అయినప్పటికీ, యేసుకు మనుషులు అందరు ఎలా ఉంటారో తెలుసు కాబట్టి, ఆయన వారిని నమ్మ లేదు. 25 యేసు {కుడా వారిని నమ్మ లేదు} ఎందుకంటే మానవుల గురించి ఆయనకు ఎవరు చెప్పవలసిని అవసరం లేదు. {ఇది } ఎందుకంటే మనుష్యులు ఏమి {ఆలోచిస్తున్నారో మరియు కోరుకుంటున్నారో} ఆయనకు తెలుసు.

Chapter 3

1 ఇప్పుడు అక్కడ నికోదేము అనే పేరుగల ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు పరిసయ్యులు అని {పిలువబడే ఒక కఠినమైన యూదు మత సమూహం} యొక్క ఒక సభ్యుడు. ఆనాటి యొక్క యూదుల విశ్వాసంలో చాలా కఠినమైన సమూహం. అతడు అత్యున్నత యూదు పాలక సభ ఒక సభ్యుడు. 2 అతడు రాత్రివేళ యేసును దర్శించాడు. అతడు యేసుతో చెప్పాడు, బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవు అని మాకు తెలుసు. {ఇది మాకు తెలుసు} ఎందుకంటే అతనికి దేవుడు సహాయం చేస్తేనే తప్ప ఏ ఒక్కడూ నీవు చేయుచున్న ఈ అద్భుతాలు చేయలేరు. 3 యేసు నీకొదేము జవాబిచ్చాడు మరియు చెప్పాడు, "నేను మీకు సత్యము చెప్పుచున్నాము: రెండవ సారి తిరిగి జన్మించ కుండా ఏ ఒక్కడు దేవుడు పరిపాలించే చోటుకి ప్రవేశించలేడు." 4 అప్పుడు నీకొదేము ఆయనకు చెప్పాడు, “ఒక వ్యక్తి అతడు ముసలివాడైనప్పుడు ఏవిధంగా తిరిగి జన్మిస్తాడు? ఏ ఒక్కరు తన తల్లి యొక్క గర్భములో ప్రేవేశించ లేడు మరియు రెండవ సారి జన్మించడు!” 5 యేసు జవాబిచ్చాడు, "నేను మీకు సత్యము చెప్పుచున్నాను: ఒకడు నీటి ద్వారా మరియు ఆత్మ ద్వారా అతడు తిరిగి జన్మించితేనే తప్ప ఏ ఒక్కడు దేవుడు పరిపాలించే చోటుకు ప్రవేశించలేడు. 6 ఒక మానవుడు ఒక వ్యక్తికి జన్మను ఇస్తే, {ఆ వ్యక్తి} ఒక మానవ జీవి. అయితే {దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యము} ద్వారా {తిరిగి} జన్మించిన వారిలో నూతన ఆత్మీయ స్వభావమును కలిగి ఉంటారు. {అది దేవుడు వారి లోపల చేస్తాడు}. 7 మీరు తిరిగి జన్మించాలి అని నేను చెప్పాను కాబట్టి మీరు ఆశ్చర్యపోవద్దు. 8 కోరుకున్న చోటుకు వీచే గాలి వలె పరిశుద్ధ ఆత్మ ఉన్నాడు. మీరు గాలి యొక్క ధ్వనిని వినినప్పటికి, అది ఎక్కడ నుండి వస్తుందో లేదా అది ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు. {మీరు ఈ విషయాలు అర్ధము చేసుకోనట్లే,} కాబట్టి {దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యము} ద్వారా {తిరిగి} జన్మించిన ప్రతి ఒక్కరు. {మీరు కూడా అర్ధము చేసుకొనరు} 9 నికోదేము ఆయనకు జవాబిచ్చాడు, “ఇది ఎలా సాధ్యము?” 10 యేసు అతనికి జవాబిచ్చాడు, “నీవు ఇశ్రాయేలు యొక్క మనుష్యుల మధ్య ఒక ముఖ్యమైన బోధకుడవు, కాబట్టి నేను ఏమి చెప్పుచున్నానో నీవు అర్థం చేసుకోవాలి. 11 నేను మీకు సత్యం చెప్పుచున్నాను, నేను మరియు నా శిష్యులు సత్యముగా ఉన్నాయి అని యెరిగిన సంగతులు మేము మీకు చెప్పుచున్నాము, మరియు మేము సాక్ష్యమిచ్చిన వాటిని మేము చెప్పుచున్నాము. అయినా మీరు మనుష్యులు {మేము ఎవరికీ ఈ విషయాలు చెప్పుచున్నమో} మేము చెప్పుచున్న వాటిని తిరస్కరిస్తారు. 12 కాబట్టి ఈ భూమి మీద జరిగే విషయాల గురించి నేను మీతో చెప్పినప్పుడు నేను చెప్పేది మీరు, మనుష్యులు నమ్మరు. పరలోకములో సంభవించే సంగతులను గురించి నేను మీకు చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా నమ్మరు. 13 మనుష్య కుమారుడనైన నేను ఒక్కడినే పరలోకానికి ఎక్కిపోయి ఉన్నాను, మరియు నేను ఒక్కడినే భూమి మీదకు దిగి వచ్చాను. 14 {చాలా కాలం క్రితం, ఇశ్రాయేలీయులు అరణ్యంలో తిరుగుచున్నప్పుడు,} మోషే {ఒక విషపూరిత పాము యొక్క ఇత్తడి నమూనాను} ఒక స్తంభం మీద పైకి ఎత్తాడు మరియు దాని వైపు చూసిన వారు అందరు పాముల నుండి రక్షింపబడినారు. అదే విధంగా, మనుష్యులు నన్ను, మనుష్య కుమారుడను {ఒక సిలువ మీద}.పైకి ఎత్తవలెను. 15 {వారు నన్ను పైకి ఎత్తుతారు} తద్వారా ఎవరైతే పైకి చూస్తారో మరియు నా యందు నమ్మిక ఉంచుతారో {నాతో పరలోకములో నాతో } నిత్యము జీవిస్తారు 16 {ఇది} ఎందుకంటే దేవుడు ఈ విధంగా లోకము యొక్క మనుష్యులను ప్రేమించాడు, తద్వారా ఆయన తన అద్వితీయ కుమారుడిని ఇచ్చాడు తద్వారా ఆయన కుమారునిలో విశ్వాసం ఉంచు వారు ఎవరైనా చనిపోరు అయితే నిత్యము జీవిస్తారు. 17 {ఇది సత్యము} ఎందుకంటే దేవుడు ఈ లోకం మీదకు శిక్ష, తన కుమారుడునైన, నన్ను ఈ లోకము యొక్క మనుష్యుల దోషమును ప్రకటించడానికి నన్ను ఈ లోకం లోనికి పంపలేదు, అయితే, నా ద్వారా లోకము యొక్క మనుష్యులను రక్షించడానికి {దేవుడు నన్ను పంపాడు}. 18 దేవుడు తన కుమారునిలో నమ్మకం ఉంచే వారిని దోషిగా ప్రకటించడు. అయితే దేవుడు తన కుమారుని మీద నమ్మకముంచని ప్రతి ఒక్కరినీ ఇప్పటికే దోషులుగా ప్రకటించాడు, ఎందుకంటే వారు దేవుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క నామములో వారి విశ్వాసం ఉంచలేదు. 19 ఇప్పుడు దేవుని యొక్క న్యాయపరమైన తీర్పు క్రింది విధంగా ఉంది: {వెలుగుగా ఉన్నవాడు} లోకములోకి ప్రవేశించాడు, అయితే మనుష్యులు ఆయనకు బదులుగా చెడును ప్రేమించారు, ఎందుకంటే వారు చెడు క్రియలు చేస్తారు. 20 {వారు చీకటిని ప్రేమిస్తారు} ఎందుకంటే నిరంతరం చెడు పనులు చేసే ప్రతి ఒక్కడు వెలుగును ద్వేషిస్తాడు చెడు క్రియలు చేసే ప్రతి ఒక్కడు {వెలుగై ఉన్నవానిని} ద్వేషిస్తాడు, మరియు వారు ఆయన వద్దకు ఎన్నడు రాడు. { వారు వెలుగును తప్పించుకుంటారు} తద్వారా వారు చేసే పనులను వెలుగు బహిర్గతం చేయదు. 21 అయితే నిరంతరం సత్యమైన క్రియలు చేసే వ్యక్తి వెలుగు అయిన వ్యక్తి వద్దకు వస్తాడు, తద్వారా ఆయన ఏమి చేస్తున్నాడో అందరికీ వెలుగు చూపుతుంది. మరియు తద్వారా ఈ క్రియలు చేయడానికి దేవుడు ఆయనకు సహాయం చేస్తున్నాడు అని {ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు}.” 22 ఆ సంగతులు జరిగిన తరువాత, యేసు మరియు ఆయన శిష్యులు యూదయ యొక్క ప్రాంతానికి వెళ్ళారు. ఆయన తన శిష్యులతో కొంతకాలం ఉన్నాడు మరియు ఆయన అనేకమంది మనుష్యులకు బాప్తిస్మం ఇచ్చాడు. 23 బాప్తిస్మమిచ్చు యోహాను సమరయ యొక్క ప్రాంతంలో సలీము దగ్గర ఐనోను యొక్క గ్రామం దగ్గర మనుష్యులకు బాప్తీస్మం ఇచ్చుచున్నాడు. {అతడు అక్కడ మనుష్యులకు బాప్తిస్మం ఇస్తున్నాడు} ఎందుకంటే ఆ స్థలములో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి, మరియు మనుష్యులు బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను వద్దకు వస్తూనే ఉన్నారు. 24 {యోహాను దీనిని చేయగలడు} ఎందుకంటే యోహాను యొక్క శత్రువులు అతనిని ఇంకా చెరసాలలో పెట్టలేదు. 25 అప్పుడు యోహాను శిష్యులు కొందరు యూదుల మత ప్రక్షాళన చట్టాల గురించి ఒక యూదు వ్యక్తితో వాదించడం ప్రారంభించారు. 26 వాదించేవారు యోహాను దగ్గరకు వచ్చారు మరియు చెప్పారు, “బోధకుడా, నీవు యొర్దాను నది యొక్క అవతల వైపు నీవు మనుష్యులకు బాప్తీస్మం ఇచ్చుచున్నప్పుడు నీతో ఒక మనిషి ఉన్నాడు. నీవు ఆయన ఎవరై యున్నాడో దాని గురించి సాక్ష్యమిచ్చాడు. చూడండి! ఇప్పుడు అతడు బాప్తిస్మం ఇచ్చుచున్నాడు మరియు అనేకమంది మనుష్యులు ఆయన వద్దకు వెళ్ళుచున్నారు. 27 యోహాను వారికి జవాబిచ్చాడు, "దేవుడు అతనికి దానిని ఇస్తే తప్ప ఎవడును ఏదియు పొందలేడు. 28 నేను మెస్సీయను కానని చెప్పడానికి మీరు ఖచ్చితంగా నాకు సాక్షులు, అయితే దేవుడు మెస్సీయ కంటే ముందుగా పంపిన వాడిని నేనే. 29 వధువు వరుడికి చెందినది. నేను పెండ్లికుమారుని యొక్క స్నేహితుడిలా ఉన్నాను. నేను నిలబడి ఆయన మాట వింటాను మరియు పెండ్లికుమారుడు గొంతు విన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి, {వధువు వరుడి వద్దకు వెళుతున్నందున}, నేను చాలా సంతోషిస్తున్నాను. 30 {యేసు, పెండ్లికుమారుడు} మరింత ప్రభావవంతంగా మారాలి మరియు నేను, {పెండ్లికుమారుని యొక్క స్నేహితుడను} తక్కువ ప్రభావవంతంగా మారాలి. 31 యేసు పరలోకము నుండి వచ్చాడు, మరియు ఆయన అందరికంటే మరియు అన్నిటికంటే గొప్పవాడు. భూమి నుండి వచ్చిన {నాలాంటి వారు} భూమి నుండి మాత్రమే {ఒకరి యొక్క పరిమిత దృక్పథంతో} మాట్లాడగలరు. పరలోకము నుండి వచ్చిన వ్యక్తి అందరికంటే మరియు భూమి మీద ఉన్న ప్రతిదాని కంటే గొప్పవాడు. 32 యేసు తాను {పరలోకములో} చూసిన మరియు వినిన విషయాల గురించి మనుష్యులకు చెపుతాడు, అయితే చాలా కొద్ది మంది మాత్రమే ఆయన చెప్పే దానిని అంగీకరిస్తారు. 33 {అయినప్పటికీ,} ఎవరైతే యేసు చెప్పిన దానిని విశ్వసిస్తారో వారు దేవుడు సత్యవంతుడని ధృవీకరించారు. 34 {ఇది} ఎందుకంటే దేవుడు పంపిన ఈ యేసు దేవుని యొక్క మాటలు చెప్పాడు. {ఆయన దేవుని యొక్క మాటలు చెప్పాడని మనకు తెలుసు} ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఆయనకు పరిమితి లేకుండా తన ఆత్మను ఇస్తాడు. 35 తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడిని ప్రేమిస్తాడు మరియు ఆయనకు ప్రతిదాని మీద అధికారము ఇచ్చాడు. 36 దేవుని యొక్క కుమారునిలో నమ్మకం ఉంచేవాడు {ఆయనతో పాటు పరలోకములో} నిత్యము జీవిస్తాడు. దేవుని కుమారునికి విధేయత చూపని వానికి నిత్య జీవం ఉండదు. బదులుగా, దేవుడు అతని మీద నిరంతరం కోపంగా ఉంటాడు.

Chapter 4

1 తరువాత, బాప్తిస్మమిచ్చు యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను సంపాదించుకుంటున్నాడని పరిసయ్యులు {అని పిలువబడే మత సమూహం} విన్నారు మరియు యోహాను బాప్తిస్మం ఇస్తున్న వారి కంటే ఎక్కువ మందికి బాప్తిస్మం ఇస్తున్నాడని పరిసయ్యులు విన్నారు. పరిసయ్యులు ఈ మాట విన్నారని యేసు కూడా తెలుసుకున్నాడు. 2 (యేసు నిజానికి ఎవరికీ బాప్తిస్మం ఇవ్వలేదు, అయితే ఆయన శిష్యులు మనుష్యులకు బాప్తిస్మం ఇస్తున్నారు.) 3 పరిసయ్యులు ఆయనను గురించి తెలుసుకున్నారని ఆయన తెలుసుకున్నప్పుడు,} యేసు యూదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరోసారి గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. 4 ఇప్పుడు {గలిలయ ప్రాంతానికి వెళ్ళాలంటే} ఆయన సమరయ ప్రాంతం గుండా వెళ్ళాలి. 5 తరువాత, వారు సమరయ ప్రాంతంలోని సుఖారు అని పిలువబడిన అనే పట్టణానికి చేరుకున్నారు. యాకోబు తన కుమారుడైన యోసేపుకు {చాలా కాలం క్రితం} ఇచ్చిన మైదానానికి సమీపములో సుఖార ఉన్నది. 6 {యాకోబు బావి ఆ ప్రాంతంలో ఉంది} {సుఖారు వద్దకు చేరుకున్న} తరువాత తన సుదీర్ఘ ప్రయాణం కారణంగా యేసు చాలా అలసిపోయాడు కాబట్టి {విశ్రాంతి తీసుకోవడానికి} ఆయన యాకోబు బావి వద్ద కూర్చున్నాడు. ఇది దాదాపు మధ్యాహ్నం అయింది. 7 సమరయ నుండి ఒక స్త్రీ కొంచెం నీళ్ళు చేదుకోవడానికి తాడు మీద ఒక కుండను దించడానికి బావి దగ్గరకు వచ్చింది. యేసు ఆమెతో చెప్పాడు, "దయచేసి తాగడానికి నాకు నీళ్ళు ఇవ్వు" 8 {ఆయన ఇది చెప్పాడు} ఎందుకంటే ఆయన శిష్యులు {ఆయనను ఒంటరిగా} విడిచిపెట్టారు, మరియు ఆహారం కొనడానికి పట్టణము లోనికి వెళ్ళారు. 9 మరియు ఆ సమరయ స్త్రీ యేసుతో చెప్పింది, "ఒక యూదుడువైన నీవు, ఒక సమరయ నుండి స్త్రీ నీళ్ళ కోసం నన్ను అడుగుచున్నందుకు నేను ఆశ్చర్యపోయాను." ({ఆమె ఇది చెప్పింది} ఎందుకంటే యూదులకు సాధారణంగా సమరయులతో ఎలాంటి సంబంధం ఉండదు.) 10 యేసు ఆమెకు జవాబిచ్చాడు, "దేవుడు నీకు ఇవ్వాలనుకున్న వరము నీకు తెలిసి ఉన్న యెడల, మరియు నీళ్ళ కోసం నిన్ను అడుగుచున్న నేను ఎవరో నీకు తెలిసి ఉన్న యెడల, నీవు నన్ను నీళ్ళ కోసం అడిగి ఉండేదానివి, మరియు నేను నీకు జీవ జలము ఇచ్చి ఉండేవాడిని." 11 ఆ స్త్రీ జవాబిచ్చింది, "అయ్యా, బావిలో నుండి బయటకు నీటిని పైకి చేదుకోవడానికి నీకు బొక్కెన లేదు, మరియు ఈ బావి లోతుగా ఉంది. { నీవు ఈ బావి నుండి నీటిని బయటకు తీయలేరు కాబట్టి,} నీవు ఈ జీవ జలము ఎక్కడ నుండి పొందుతావు? 12 నీవు ఖచ్చితంగా మా తండ్రి యాకోబు కంటే గొప్పవాడవు కావు. అయన ఈ రోజు మేము వాడుచున్న {ఈ బావిని తవ్వాడు} మరియు ఆయన దాని మాకు ఇచ్చాడు. ఆయన, ఆయన కుమారులు, మరియు అదేవిధంగా ఆయన పశువులు దాని నుండి నీళ్ళు త్రాగాయి." 13 యేసు ఆమెకు జవాబిచ్చాడు, "ఈ బావిలోని నీళ్ళు త్రాగిన ప్రతి ఒక్కరికి మరల దాహం వేస్తుంది. 14 అయితే నేను ఇచ్చే నీళ్ళు త్రాగే వాడు ఎన్నడు మరల దాహం గొనడు. బదులుగా, నేను అతనికి ఇచ్చే నీళ్ళు అతని లోపల {అతని నింపే} ఒక నీటి బుగ్గగా అవుతుంది మరియు పరలోకములో అతడు నిత్యము జీవించుటకు కారణం అవుతుంది." 15 ఆ స్త్రీ యేసుతో చెప్పింది, "అయ్యా, దయచేసి నాకు ఈ నీళ్ళు కొంచెము నాకు ఇవ్వండి, తద్వారా నేను ఎన్నడు మరల దాహం గొనను లేదా నీళ్ళు తోడుకోవడానికి ఈ బావి వద్దకు మరల రావాలి." 16 యేసు ఆమెకు చెప్పాడు, "వెళ్ళు నీ భర్తని పిలువు మరియు అతనిని ఇక్కడకు తీసుకొని రమ్ము. 17 ఆ స్త్రీ ఆయనకు జవాబిచ్చింది, “నాకు భర్త లేడు.” యేసు ఆమెతో చెప్పాడు, నీవు భర్తను కలిగి లేవు అని నీవు సరిగ్గా చెప్పుచున్నావు, 18 ఎందుకంటే నీవు ఒకరిని కలిగి లేవు, అయితే ఐదుగురు, భర్తలు, మరియు ప్రస్తుతం {నీతో జీవిస్తున్న} వాడు నీ భర్త కాడు. నీవు {ఒక భర్తను కలిగి లేవనే దానిని గురించి} నీవు చెప్పినది నిజం." 19 ఆ స్త్రీ యేసుతో చెప్పింది, "అయ్యా, నీవు ఒక ప్రవక్త అని నేను గ్రహిస్తున్నాను. 20 మా పితరులు ఇక్కడే ఈ పర్వతం మీద దేవుని ఆరాధించారు, అయితే యూదులైన మీరు యెరూషలేములో {మీ ఆలయము} వద్ద మేము దేవుని ఆరాధించవలెను అని మీరు చెప్పుదురు.?" 21 యేసు ఆమెతో చెప్పాడు, "అమ్మా, నన్ను నమ్మండి ఒక సమయం వస్తుంది అని నేను చెప్పినప్పుడు ఇక్కడ గానీ ఈ పర్వతం మీద గానీ లేదా యెరూషలేములో గానీ, మీరు తండ్రిని ఆరాధింపరు. 22 ఇక్కడ సమరయలో ఉన్న మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు, మేము యూదు ఆరాధికులము, ఎవరిని ఆరాధించాలో మాకు తెలుసు. {ఇది సత్యం} ఎందుకంటే {పాపముల నుండి} రక్షించబడి యుండడానికి మార్గం యూదులలో నుండి వస్తుంది. 23 అయినప్పటికీ, దేవుని నిజముగా ఆరాధించే వారు తండ్రిని ఆత్మీయముగా మరియు సత్యముగా ఆరాధించే సమయం వస్తోంది మరియు ఇప్పుడు వచ్చింది. {ఇది} ఎందుకంటే తండ్రి తనను ఆరాధించడానికి అలాంటి వ్యక్తుల కోసం నిజముగా వెదకుతాడు. 24 దేవుడు ఆత్మ జీవి, మరియు ఆయనను ఆరాధించే వారు ఆయనను ఆత్మీయంగా మరియు సత్యవంతంగా ఆరాధించాలి. 25 ఆ స్త్రీ యేసుతో చెప్పింది, "మెస్సీయ వస్తాడని నాకు తెలుసు (గ్రీకులో “క్రీస్తు” అని ఆయన పిలువబడుచున్నాడు) ఆయన వచ్చినప్పుడు, అయన {మనము తెలుసుకొనవలసిన} ప్రతి విషయం మనకు చెపుతాడు." 26 యేసు ఆమెతో చెప్పాడు, "నేనే, ఇప్పుడు నీతో మాట్లాడుచున్నాను, నేను ఆ మెస్సీయను!” 27 అదే సమయంలో, ఆయన శిష్యులు నగరం నుండి తిరిగి వచ్చారు. వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే యేసు {ఆయనకు తెలియని} ఒక స్త్రీతో {ఒంటరిగా} మాట్లాడుచున్నాడు. అయినప్పటికీ, “ఆమె నుండి నీకు ఏమి కావాలి?” అని అడిగే ధైర్యం ఎవరూ చేయలేదు. లేదా "అసలు నీవు ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావు?" 28 ఆ సమయంలో స్త్రీ తన నీళ్ళ కుండను అక్కడ విడిచి పెట్టింది మరియు తిరిగి నగరములోనికి వెళ్ళింది. ఆమె ఆ పట్టణము యొక్క మనుష్యులతో చెప్పింది, 29 "రండి మరియు నేను ఇప్పటివరకు చేసినవి అన్నియు నాకు చెప్పిన ఈ మనుష్యుని చూడండి! ఆయన మెస్సీయ కాడా, ఆయనే కదా?" 30 ఆ మనుష్యులు పట్టణం విడిచి మరియు యేసు దగ్గరకు వచ్చారు. 31 {ఆ స్త్రీ వెళ్ళినప్పుడు,} యేసు యొక్క శిష్యులు, {అప్పుడే ఆహారంతో తిరిగి వచ్చారు,} ఆయనను భుజించమని వేడుకున్నారు. వారు చెప్పారు, “బోధకుడా, దయచేసి కొంచెం భుజించండి!” 32 యేసు వారితో చెప్పాడు, "నా దగ్గర మీకు ఏమీ తెలియని పోషక ఆహారము ఉంది! 33 కాబట్టి వారు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నారు, "ఖచ్చితంగా మరెవరూ ఆయనకు తినడానికి ఏదైనా తెచ్చి ఉండరు, వారు చేయగలరా?" 34 యేసు వారికి చెప్పాడు, "ఇది నన్ను పోషించేది: నన్ను పంపిన నా తండ్రి కోరుకున్నది చేయడం మరియు నా తండ్రి యొక్క పనిని పూర్తి చేయడం. 35 ఈ సంవత్సరము యొక్క ఈ సమయములో మీరు సాధారణంగా చెపుతారు, “నాలుగు నెలలు మిగిలి ఉన్నాయి, మరియు అప్పుడు మనము పంటలు కోస్తాము.’ నేను మీకు చెప్పుచున్నది వినండి. ఇదిగో, చూడండి, ఈ మనుషులు ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్న పొలముల వలె ఉన్నారు! 36 ఈ పంటలను కోసేవాడు జీతమును పొందును మరియు ఫలము సేకరిస్తాడు. ఇది మనుష్యులు నిత్య జీవమును {పరలోకములో} పొందుతున్నారు. ఫలితం ఏమిటంటే, విత్తనం వేసిన వాడు మరియు పంటను కోసే వాడు కలిసి సంతోషిస్తారు. 37 నేను చెప్పబోయేది నిజం: ఒక వ్యక్తి విత్తనాలు నాటుతాడు, మరియు మరో వ్యక్తి పంటలు కోస్తాడు. 38 మీరు నాటని పంట నుండి పంటను సేకరించడానికి నా శిష్యులైన మిమ్ములను పంపాను. ఇతరులు చాలా కష్టపడ్డారు {పంటను నాటుటకు}, అయితే మీరు ఇప్పుడు వారి పనిలో చేరుచున్నారు." 39 ఇప్పుడు ఆ స్త్రీ చెప్పిన మాటలను బట్టి సుఖారు యొక్క పట్టణములో నివసించే అనేకమంది సమరయులు యేసులో విశ్వాసముంచారు. ఆమె చెప్పింది, "నేను చేసిన చాల పనులు ఆయన నాకు చెప్పాడు." 40 సమరయులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారితో ఎక్కువ కాలం ఉండమని ఆయనను వేడుకొన్నారు. కాబట్టి అయన అక్కడ మరో రెండు దినములు ఉన్నాడు. 41 ఆయన వారికి ప్రకటించిన దాని కారణంగా వారిలో అనేక మంది యేసు మీద నమ్మకం ఉంచారు. 42 ఆ పట్టణవాసులు ఆ స్త్రీతో చెప్పారు, “మేము ఇప్పుడు యేసును నమ్ముచున్నాము, అయితే ఆయన గురించి నీవు మాతో చెప్పిన దాని కారణంగా మాత్రమే కాదు {మేము నమ్ముచున్నాము} ఎందుకంటే మా మట్టుకు మేము ఆయన సందేశాన్ని విన్నాము. ఇప్పుడు ఈ మనుష్యుడు నిజంగా లోకము యొక్క విశ్వాసులను {తమ పాపముల నుండి} రక్షించు వాడు అని మేము తెలుసుకొన్నాము.” 43 ఆయన రెండు రోజులు {సమరయులతో} ఉన్న తరువాత, యేసు సుఖార నగరమును విడిచిపెట్టాడు మరియు గలిలయ ప్రాంతములోనికి ప్రవేశించాడు. 44 (యేసు తాను పెరిగిన ప్రదేశములో ఒక ప్రవక్తకు గౌరవం లభించదని {మరియు ఆయన ప్రచారం కోరుకోలేదని} స్వయంగా ధృవీకరించినందున ఆయన గలిలయకు వెళ్ళాలనుకున్నాడు.) 45 ఇది నిజం గనుక, ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడున్న చాలా మంది మనుష్యులు ఆయనకు స్వాగతం పలికారు, ఎందుకంటే వారు కూడా అప్పుడే జరిగిన పస్కా పండుగకు వెళ్ళిన సందర్భంగా యెరూషలేములో ఆయన చేసిన అద్భుతమైన పనులన్నీ చూసారు. 46 తరువాత యేసు గలిలయ యొక్క ప్రాంతంలో కానా యొక్క పట్టణానికి మరల వెళ్ళాడు. (అక్కడే} అయన నీటిని ద్రాక్షారసముగా మార్చాడు.) అక్కడ ఒక రాజు యొక్క అధికారి కపెర్నహోము యొక్క నగరానికి దగ్గరలో నివసించాడు. మరియు అతనికి ఒక కుమారుడు ఉన్చానాడు, అతడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చాడనే విషయం ఆ అధికారి వినినప్పుడు, కానాలో ఉన్న యేసు దగ్గరకు అతడు వెళ్ళాడు మరియు “కపెర్నహోముకు వచ్చి, మరియు అతని కుమారుడిని స్వస్థపరచుమని ఆయనను అడిగాడు ఎందుకంటే అతని కుమారుడు త్వరలో చనిపోతాడు!” 48 యేసు అప్పుడు అతనితో చెప్పాడు, "మీరు మనుష్యులు {నేను అద్భుతమైన అద్భుతాలు చేయడం} చూస్తేనే మాత్రమే {మెస్సీయగా} నన్ను నమ్ముతారు!" 49 రాజు యొక్క అధికారి ఆయనతో చెప్పాడు, "అయ్యా, దయచేసి నా కుమారుడు చనిపోయడానికి ముందు నా ఇంటికి రండి!" 50 యేసు అతనితో చెప్పాడు, "ఇంటికి వెళ్ళు. నీ కుమారుడు బ్రతుకుతాడు.” యేసు చెప్పిన దానిని ఆ మనుష్యుడు నమ్మాడు మరియు అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళడం ప్రారంభించాడు. 51 అతడు కపెర్నహూములోని తన ఇంటికి ప్రయాణిస్తూ ఉండగా, అతని సేవకులు మార్గములో అతనిని కలుసుకొన్నారు. వారు అతనికి చెప్పారు,” నీ బిడ్డ బ్రతకబోతున్నాడు." 52 ఆయన అతని సేవకులను అడిగాడు, “ఏ సమయానికి నా కుమారుడు బాగుపడడం ఆరంభించాడు?” వారు అతనికి చెప్పారు, “నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకు అతని జ్వరం అతనిని విడిచిపెట్టింది.” 53 అప్పుడు బాలుడి యొక్క తండ్రి యేసు అతనితో “నీ కుమారుడు జీవించును” అని చెప్పిన ఖచ్చితమైన సమయం ఇదే అని గ్రహించాడు కాబట్టి అతడు అతని గృహములో నివసిస్తున్న ప్రతి ఒక్కరితో పాటు యేసు నందు నమ్మకము ఉంచాడు. 54 అది యేసు చేసిన రెండవ గొప్ప అద్భుతం. ఆయన యూదయ ప్రాంతాన్ని విడిచిపెట్టి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. {ఆ సమయములో ఆయన చేసాడు}

Chapter 5

1 ఆ సంగతులు జరిగిన తరువాత, మరొక యూదుల పండుగకు సమయం వచ్చింది, మరియు యేసు {పండుగ జరుపుకోవడానికి} యెరూషలేము యొక్క నగరము వరకు నడిచాడు. 2 యెరూషలేములో {నగరములోనికి వెళ్ళే ద్వారాలలో ఒకటి, అది గొర్రెల ద్వారం అని పిలువబడే {ఒక స్థలం ఉంది.} ఆ ద్వారం వద్ద యూదులు ఉపయోగించే భాషలో బేతెస్ద అని మనుష్యులు పిలిచే ఒక కోనేరు ఉంది. కోనేరు ప్రక్కన ఐదు పైకప్పుగల మంటపములు ఉన్నాయి. 3 చాలా మంది మనుష్యులు ఈ మంటపముల మీద పడి ఉన్నారు. వారు అనారోగ్యంతో, చూడలేని, నడవలేని లేదా కదలలేని మనుష్యులు. 4 [{వారు అక్కడ పడుకొని ఉన్నారు} ఎందుకంటే ప్రభువు నుండి ఒక దేవదూత అప్పుడప్పుడు దిగి వచ్చి నీటిని కదిలిస్తాడు. దేవదూత నీటిని కదిలించిన తరువాత నీటిలోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అతడు ఏ వ్యాధితో బాధపడినా స్వస్థపర్చబడతాడు.] 5 బేతేస్థ అని పిలువబడే కోనేరు దగ్గర ఒక మనుష్యుడు ఉన్నాడు అతడు ముప్పై-ఎనిమిది సంవత్సరాలుగా అనారోగ్యముతో పడి ఉన్నాడు. 6 యేసు ఈ మనుష్యుడు ఆ కోనేరు దగ్గర పడి ఉండుట చూసాడు, మరియు అతడు చాలా కాలం నుండి అక్కడ పడి ఉన్నాడు అని ఆయనకు తెలుసు. అయన ఆ మనుష్యుని అడిగాడు, "నీ ఆరోగ్యం బాగుండాలని నీవు కోరుచున్నావా?" 7 అనారోగ్యంతో ఉన్న మనుష్యుడు ఆయనకు జవాబిచ్చాడు, “అయ్యా, ఒక దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కొలనులో ఉంచే వారు నాకు ఎవరు లేరు. నా అంతట నేను కోనేరు వద్దకు వెళ్ళు సమయానికి, ఎవరో ఒకరు అప్పటికే నాకు ముందుగా కోనేరు లోనికి వెళ్ళి దిగుచున్నారు {మరియు స్వస్థపరచబడుతు ఉన్నారు} {తద్వారా నేను స్వస్థపరచబడడం లేదు}." 8 యేసు అతనితో చెప్పాడు, “లేచి నిలబడు! {నీవు పడుకుని ఉన్న చాపను ఎత్తుకుని} మరియు నడవు!” 9 ఒక్కసారిగా ఆ మనుష్యుడు స్వస్థపరచబడ్డాడు, మరియు అతడు తన పరుపు ఎత్తుకొన్నాడు మరియు నడిచాడు. ఇప్పుడు ఆ దినము సబ్బాతు అని పిలువబడే యూదుల విశ్రాంతి యొక్క దినము. 10 ఎందుకంటే {అది యూదుల విశ్రాంతి దినము} యేసు స్వస్థపరచిన మనుష్యునితో యూదు నాయకులు చెప్పారు, "ఈ దినము విశ్రాంతి కొరకైన ఒక దినము. నీవు నీ చాపను మోసుకెళ్ళడానికి నీవు అనుమతించబడవు {ఈ దినమున, ఎందుకంటే ఇది పని}." 11 యేసు స్వస్థపరచిన మనుష్యుడు వారికి జవాబిచ్చాడు, "నన్ను స్వస్థపరచిన మనుష్యుడు నీ చాప ఎత్తుకొనుము {నేను పండుకొనిన} మరియు నడువుము.” 12 యూదు నాయకులు ఆయనను అడిగారు, "నీ చాప ఎత్తుకొని మరియు నడువుమని నీకు ఎవరు చెప్పారు?” 13 అయినప్పటికీ, యేసు స్వస్థపరచిన మనుష్యునికి అతనిని ఎవరు స్వస్థపర్చారో తెలియదు, ఎందుకంటే ఆ ప్రాంతం గుంపుకూడి ఉంది కాబట్టి. యేసు గమనించబడకుండ ఆ మనుష్యుని విడిచిపెట్టాడు. 14 తరువాత, యేసు తాను స్వస్థపరచిన ఆ మనుష్యుని ఆలయములో కనుగొన్నాడు మరియు అతనితో చెప్పాడు, “చూడుము, నీవు ఇప్పుడు బాగున్నావు! ఇకమీదట పాపము చేయ వద్దు, తద్వారా {నీ మునుపటి అనారోగ్యం కంటే} మరి యెక్కువ కీడు నీకు కలుగకుండా ఉండదు." 15 ఆ మనుష్యుడు వెళ్ళిపోయాడు మరియు అతనిని స్వస్థపరిచిన మనుష్యుడు యేసు అని యూదు నాయకులతో చెప్పాడు. 16 కాబట్టి యూదులు నాయకులు యేసును హింసించడం ప్రారంభించారు ఎందుకంటే ఆయన యూదుల విశ్రాంతి దినమున ఆశ్చర్యకరముగా మనుష్యులను స్వస్థపరచుచున్నాడు. 17 యేసు వారికి ఈ జవాబు ఇచ్చాడు, "నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు, మరియు నేను కూడా పని చేస్తున్నాను. 18 {ఆయన దీనిని చెప్పడం} పర్యవసానంగా, యూదు నాయకులు యేసును చంపడానికి ప్రయత్నించారు {వారు ఇంతకు ముందు ప్రయత్నించిన దానికంటే}. {వారు ఆయనను చంపాలనుకున్నారు} ఎందుకంటే ఆయన విశ్రాంతిదిన నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాదు, అయితే అయిన తాను దేవుడు తన స్వంత తండ్రి అని కూడా చెప్పుట ద్వారా, తాను దేవునితో సమానుడు అని చెప్పుచున్నాడు. 19 {ఈ నేరముల} కారణంగా యేసు వారికి జవాబిచ్చాడు, “నేను మీకు {మనుష్యులు} సత్యము చెప్పుచున్నాను: మనుష్యుని యొక్క కుమారుడనైన నేను నా స్వంత అధికారంతో ఏమీ చేయలేను. నేను తండ్రి దేవుడు చేయడం నేను చూసినది మాత్రమే నేను చేయగలను. తండ్రి చేయుచున్న దేనినైనా, కుమారుడనైన నేను కూడా దానిని చేస్తాను. 20 {ఇది నిజం} ఎందుకంటే తండ్రి కుమారుడనైన నన్ను ప్రేమిస్తున్నాడు, మరియు ఆయన చేస్తున్నదంతా నాకు చూపిస్తున్నాడు. మీరు వాటిని చూసి ఆశ్చర్యపోయేలా (నేను ఇప్పటికే చేసిన) అద్భుతాల కంటే గొప్పగా ఉండే అద్భుత కార్యాలను కూడా తండ్రి నాకు తెలియజేస్తాడు. 21 {ఇది జరుగుతుంది} ఎందుకంటే కుమారుడనైన నేను, తండ్రి చనిపోయిన వారిని ఎలా బ్రతికించి, వారికి తిరిగి నిత్య జీవం ప్రసాదిస్తాడో అదే విధంగా చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు మరియు వారికి జీవాన్ని తిరిగి ఇస్తాడు. 22 {ఇది నిజం} ఎందుకంటే తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు, బదులుగా, కుమారుడైన నాకు మనుష్యులకు తీర్పు తీర్చే అధికారము అంతయు ఆయన నాకు ఇచ్చాడు. 23 తద్వారా ప్రతి ఒక్కరు తండ్రిని ఎలా గౌరవిస్తారో అదే విధంగా కుమారుడైన నన్ను గౌరవించాలని {తండ్రి ఇది చేసాడు}. నన్ను ఘన పరచని వాడు నన్ను పంపిన తండ్రిని ఘన పరచలేడు. 24 నేను మనుష్యులైన మీకు సత్యము చెప్పుచున్నాను: ఎవరైనను నా బోధనలను అంగీకరించి మరియు లోబడునో మరియు దేవుడు నన్ను పంపాడు అని నమ్మిన వాడు {నాతో పరలోకములో} నిత్య జీవము కలిగి యున్నాడు, మరియు దేవుడు అతనిని దోషిగా తీర్పు తీర్చడు. బదులుగా, ఆ వ్యక్తి ఆత్మీయంగా చనిపోయినప్పటి నుండి ఆత్మీయంగా జీవించే స్థితికి చేరుకున్నాడు. 25 నేను మీతో సత్యము చెప్పుచున్నాను: ఒక సమయం రాబోవుచున్నది మరియు నిజానికి ఇప్పటికే ఇక్కడే ఉంది, చనిపోయినవారు దేవుని యొక్క కుమారుడనైన వాని స్వరము, నా స్వరం వినినప్పుడు, మరియు నా మాట వినిన వారు జీవిస్తారు. 26 {ఇది నిజం} ఎందుకంటే మనుష్యులు జీవించడానికి తండ్రి చేసిన విధముగా, అదే విధానములో ఆయన కుమారుడనైన, నాకు మనుషులు జీవింప చేసే అధికారం ఇచ్చాడు. 27 మొత్తం మానవాళికి తీర్పు తీర్చడానికి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు, ఎందుకంటే నేను మనుష్యుని యొక్క కుమారుడను. 28 {తండ్రి చేసిన దీనిని} చూసి ఆశ్చర్యపోకండి, ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరు నా స్వరము వినే ఒక సమయం వస్తుంది. 29 అప్పుడు వారు తమ సమాధులలో నుండి వెలుపలికి వస్తారు. దేవుడు మేలు చేసిన వారికి నిత్య జీవము ఇవ్వడానికి లేపుతాడు. అయితే దేవుడు కీడు చేసిన వారిని దోషియని తీర్పుచేయడానికి మరియు వారిని శాశ్వతంగా శిక్షించడానికి లేపుతాడు. 30 నేను నా స్వంతంగా ఏమీ చేయలేను. {తండ్రి నుండి} నేను ఏదైతే వింటానో, దాని ప్రకారం నేను తీర్పు తీరుస్తాను, మరియు నేను న్యాయమైన విధానములో తీర్పు తీరుస్తాను. {నేను న్యాయముగా తీర్పు తీరుస్తాను} ఎందుకంటే నేను కోరుకున్నది చేయడానికి నేను ప్రయత్నం చెయ్యను, బదులుగా, నన్ను పంపిన నా తండ్రి కోరుకున్నది చేస్తాను. 31 నా గురించి నేను మాత్రమే ఒక్క సాక్షిగా ఉండిన యెడల, {మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం} నా సాక్ష్యము నమ్మదగినది కాదు. 32 అయినప్పటికీ, నా గురించి సాక్ష్యమిచ్చేవాడు మరొకరు ఉన్నాడు, మరియు ఆయన నా గురించి సాక్ష్యమిచ్చేది నమ్మదగినది అని నాకు తెలుసు. 33 యూదు నాయకులైన మీరు బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరకు వార్తాహరులను పంపారు, అతడు నా గురించి మీకు నిజము చెప్పాడు. 34 అయినప్పటికీ, నాకు ఎవరు ఒక సాక్షిగా ఉండాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, దేవుడు మిమ్ములను రక్షించడానికి బాప్తిస్మమిచ్చే యోహాను గురించి నేను ఇది చెప్పుచున్నాను. 35 బాప్తిస్మమిచ్చు యోహాను {దేవుని యొక్క సత్యమును మీకు ప్రకటించాడు} ఒక మండుచున్న మరియు ప్రకాశిస్తున్న దీపం వలె ఉన్నాడు. మీరు ఆ వెలుగులో కొంత కాలము ఆనందించడానికి ఇష్టపడిరి {అది అతడు ప్రకటించిన సత్యము}. 36 అయితే, యోహాను నా గురించి ఇచ్చిన సాక్ష్యము కంటే నా గురించి నేను చెప్పే సాక్ష్యము చాలా గొప్పది. {ఇది} ఎందుకంటే ఈ సాక్ష్యము తండ్రియైన దేవుడు నన్ను చేయడానికి అనుమతించిన అద్భుత క్రియలు. నేను చేయుచున్న ఈ క్రియలే తండ్రి నన్ను పంపాడు అని రుజువు. 37 ఇంకా, నన్ను పంపిన నా తండ్రి నన్ను గురించి సాక్ష్యమిచ్చిన వాడు. మీలో ఎవ్వరూ ఆయన స్వరమును ఎన్నడు వినలేదు మరియు మీరు ఆయనను ఎలా ఉంటాడో ఎన్నడూ చూడలేదు. 38 మీరు కూడా తండ్రి యొక్క బోధనలకు లోబడరు. {ఇది నిజమని నాకు తెలుసు} ఎందుకంటే మీరు ఆయన పంపిన వ్యక్తినైన నన్ను నమ్మలేదు! 39 మీరు లేఖనాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు, ఎందుకంటే వాటిని అధ్యయనం చేయడం ద్వారా మీరు నిత్యము {పరలోకములో} జీవించగలరని మీరు విశ్వసిస్తారు. ఆ లేఖనాలే నేనెవరో ప్రకటిస్తున్నాయి. 40 అయినప్పటికీ మీరు {పరలోకములో నిత్యము} జీవించడానికి నా శిష్యులుగా ఉండడానికి నిరాకరిస్తున్నారు. 41 నేను ఎవరి నుండి గౌరవాన్ని స్వీకరించను. 42 అయితే, మీరు దేవుణ్ణి అస్సలు ప్రేమించరు అని నాకు తెలుసు. 43 నేను నా తండ్రి యొక్క అధికారముతో వచ్చాను, అయితే ఇంకా మీరు నన్ను అంగీకరించరు. ఎవరైనా తన సొంత అధికారంతో వచ్చిన యెడల, మీరు అతనిని అంగీకరిస్తారు. 44 మిమ్ములను ఘనపరచాలానే ఒకే ఒక్క దేవుని కోరుకునే బదులు మీరు ఒకరినొకరు ఘనపరచుకొనుచున్నప్పుడు మీరు నన్ను విశ్వసించలేరు! 45 నా తండ్రి యెదుట నేను మీ మీద నిందలు మోపువాడను అని తలంచ వద్దు. మోషే మిమ్మును రక్షిస్తాడని మీరు ఆశించారు. కాబట్టి అతని మీద మీ ఆశలు పెట్టుకున్నారు, వాస్తవానికి మిమ్ములను నిందించే వ్యక్తిగా ఉన్నాడు. 46 {ఆయన మిమ్మోమును నిందిస్తాడు} ఎందుకంటే మోషే చెప్పిన దానిని మీరు అంగీకరించిన యెడల, సత్యము వలే నేను చెప్పిన దానిని నమ్ముదురు ఎందుకంటే అతడు నా గురించి వివరిస్తున్నాడు. 47 మోషే వ్రాసిన వాటిని కూడా మీరు విశ్వసించరు కాబట్టి, నేను మీతో చెప్పిన దానిని మీరు విశ్వసించలేరు!

Chapter 6

1 ఆ విషయాలు జరిగిన తరువాత, యేసు గలిలయ యొక్క సముద్రానికి మీదుగా అవతలి వైపుకు దాటి వెళ్ళాడు, దానిని కొందరు మనుష్యులు తిబెరియ యొక్క సముద్రం అని కూడా పిలుస్తారు. 2 ఒక పెద్ద జనసమూహం ఆయనను వెంబడించారు, ఎందుకంటే ఆయన ఎక్కువగా జబ్బుపడిన మనుష్యులను స్వస్థపరచడములో చేసిన అద్భుతాలను వారు చూసారు. 3 యేసు ఒక నిటారుగా ఉన్న కొండ వైపుకు పైకి నడిచాడు మరియు అక్కడ తన శిష్యులతో కూర్చున్నాడు. 4 (ఇప్పుడు ఆ సమయములో యూదుల పస్కా పండుగ వేడుక జరగబోతోంది.) 5 యేసు అప్పుడు పైకి చూసాడు మరియు మనుష్యుల యొక్క ఒక చాలా పెద్ద గుంపు తన వైపుకు నడవడం చూసాడు. యేసు ఫిలిప్పును అడిగాడు, “ఈ ప్రజలందరికీ ఆహారం ఇవ్వడానికి మనము రొట్టె ఎక్కడ కొనుగోలు చేస్తాము?" 6 (అతని విశ్వాసమును పరీక్షించడానికి ఆయన ఫిలిప్పును ఈ ప్రశ్న అడిగాడు, ఎందుకంటే యేసు ఈ సమస్య గురించి ఆయన ఏమి చేయబోతున్నాడో యేసుకు ముందే తెలుసు. 7 ఫిలిప్పు ఆయనకు జవాబిచ్చాడు, "ఒక మనిషి రెండు వందల రోజుల పనిలో సంపాదించగల డబ్బు మన దగ్గర ఉన్న యెడల, ఈ పెద్ద గుంపులో ప్రతీ వ్యక్తి కనీసం తినడానికి చిన్న రొట్టె కొనడానికి ఇది సరిపడినంత డబ్బుగా ఉండదు.” 8 ఆయన శిష్యులలో మరొకడు, సీమోను పేతురు యొక్క సహోదరుడు , అంద్రెయ యేసుతో చెప్పాడు, 9 “ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు, అతని వద్ద ఐదు చిన్న యవల రొట్టె యొక్క ముద్దలు మరియు రెండు చిన్న చేపలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ప్రజలందరికీ ఆహారం ఇవ్వడానికి ఈ కొన్ని రొట్టెలు మరియు చేపలు ఖచ్చితంగా సరిపోవు! 10 ప్రజలను కూర్చోబెట్టమని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆ విధంగా దాదాపు 5,000 మంది పురుషులు కూర్చున్నారు. (ఆ స్థలంలో {వారు కూర్చోవడానికి} చాలా గడ్డి ఉంది.) 11 యేసు అప్పుడు చిన్న యవల రొట్టెలు తీసుకున్నాడు మరియు ఆ ఆహారము కోసం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. {అప్పుడు} ఆయన {మరియు ఆయన శిష్యులు} తినుటకు {గడ్డి మీద} కూర్చున్న ప్రజలకు రొట్టెలు ఇచ్చారు. ఆయన రెండు చేపల తోనూ అలాగే చేసాడు. మనుష్యులు తినాలనుకున్న చేపలు మరియు రొట్టెలు అన్నీయు తిన్నారు. 12 ప్రతి ఒక్కరు వారు నిండే వరకు తినినప్పుడు, యవల రొట్టె యొక్క తినని ముక్కలు అన్నీయు అందులో ఏదీ వృధా కాకుండా ఉండేందుకు మిగిలినవన్నీ సేకరించమని యేసు తన శిష్యులతో చెప్పాడు. 13 ఆ విధంగా ఆయన శిష్యులు ఆ ముక్కలను సేకరించి, ఐదు చిన్న బార్లీ రొట్టెల నుండి మనుష్యులు విడిచిపెట్టిన విరిగిన ముక్కలతో 12 పెద్ద బుట్టలను నింపారు. 14 {దీని} వలన యేసు {వారి ఎదుట} చేసిన ఈ అద్భుత సూచకక్రియలను మనుష్యులు చూసినప్పుడు, వారు చెప్పారు, మనుష్యులు తమ ఎదుట యేసు చేసిన అద్భుతాన్నిచూసిన తరువాత, వారు చెప్పారు, “నిశ్చయంగా ఈయనే లోకము లోనికి పంపుతానని {దేవుడు వాగ్దానం చేసిన} ప్రవక్త!" 15 మనుష్యులు తనను తమ రాజుగా ఉండుటకు బలవంతం చేయడానికి తనను పట్టుకోవాలని యోచిస్తున్నారని యేసుకు తెలియగానే, ఆయన తిరిగి వారిని విడిచిపెట్టి పూర్తిగా ఒంటరిగా ఉండటానికి కొండ మీదకు వెళ్ళాడు. 16 సాయంత్రం అయినప్పుడు, యేసు యొక్క శిష్యులు కొండ మీద నుండి గలిలయ యొక్క సముద్రం వరకు నడిచారు. 17 {వారు} ఒక దోనె లోనికి ఎక్కారు మరియు కపెర్నహోము యొక్క పట్టణమునకు సముద్రము మీదుగా ప్రయాణం చేయడం ఆరంభించారు. (ఇది ఇప్పటికే చీకటిగా ఉంది మరియు యేసు ఇంకా వారిని చేరుకోలేదు.) 18 ఎందుకంటే గాలి బలంగా వీస్తుంది, ఇది సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉండేలా చేస్తుంది. 19 యేసు శిష్యులు దోనెను నాలుగు మరియు ఒక అర లేక అయిదు మరియు ఒక అర కిలోమీటర్లు సముద్రం లోనికి నడిపించిన తరువాత, యేసు నీటి మీద నడుస్తూ పడవ దగ్గరికి రావడం మరియు పడవను సమీపించడం శిష్యులు చూసారు. వారు భయపడ్డారు! 20 యేసు వారితో చెప్పాడు, "ఇది నేనే! యేసు! భయపడడం ఆపండి!” 21 వారు ఆయనను పడవలోనికి తీసుకోడానికి చాలా సంతోషించారు. ఆయన పడవలో వారితో ఉండగానే, వారి పడవ వారు వెళ్తున్న ప్రదేశానికి చేరింది. 22 జనసమూహానికి భోజనం పెట్టిన రోజు తరువాత, సముద్రానికి అవతలి వైపున ఉన్న మనుష్యుల గుంపు {ముందు రోజు} అక్కడ ఒకే ఒక పడవ ఉందని గ్రహించారు. యేసు తన శిష్యులతో కలిసి పడవలో వెళ్ళలేదని {వారికి కూడా తెలుసు.} 23 (తిబెరియ నగరం నుండి మనుష్యులు ఇతర పడవలలో వచ్చారు. ప్రభువైన యేసు దేవునికి కృతజ్ఞతలు తెలిపిన తరువాత జనసమూహం రొట్టెలు తిన్న ప్రదేశానికి సమీపంలో {వారు తమ పడవలను ఉంచారు}.) 24 అక్కడ యేసు గానీ లేదా ఆయన శిష్యులుగానీ లేరు అని జనసమూహం గ్రహించినప్పుడు, వారు ఆ పడవల లోనికి ఎక్కారు మరియు యేసును వెదకడానికి కపెర్నహూము యొక్క నగరానికి వెళ్ళారు. 25 జనసమూహం గలిలయ యొక్క సముద్రం యొక్క ఒడ్డున ఉన్న కపెర్నహూములో యేసును కనుగొన్నారు అది {ఆయన వారికి ఆహారముపెట్టిన ప్రదేశానికి} ఎదురుగా ఉంది. వారు ఆయనను అడిగారు, "బోధకుడా, {నీవు ఒక దోనెలో రాలేదు అని మాకు తెలుసు,} కాబట్టి నీవు ఇక్కడ కపెర్నహూముకు ఎప్పుడు చేరుకున్నారు?" 26 యేసు వారికి జవాబిచ్చాడు, “నేను మీతో సత్యము చెప్పుచున్నాను: మీరు నా కోసం వెదకడం లేదు ఎందుకంటే నేను చేసిన అద్భుత సూచకక్రియలను మీరు చూసారు. బదులుగా, {మీరు నా కోసం వెదకుచున్నారు} ఎందుకంటే నేను మీకు ఇచ్చిన రొట్టెలు నిండినంత వరకు మీరు తిన్నారు., 27 త్వరగా పాడైపోయే ఆహారం కోసం పని చెయ్యడం ఆపివెయ్యండి! బదులుగా, {పరలోకములో} మీకు నిత్య జీవాన్ని తీసుకొని వచ్చే తెచ్చే ఆహారం కోసం పని చెయ్యండి! {ఆ ఆహారం} మనుష్య కుమారుడనైన నేను మీకు ఇచ్చే రొట్టె. నా {నేను మాత్రమే దానిని మీకు ఇవ్వగలను} ఎందుకంటే తండ్రి అయిన దేవుడు నన్ను ఆమోదిస్తాడు." 28 అప్పుడు జనసమూహము యేసును అడిగారు, “దేవునిని సంతోషపరచడానికి మేము ఏ క్రియలు చేయాలి?” 29 యేసు వారికి జవాబిచ్చాడు, “మీరు ఏమి చేయడానికి దేవుడు కోరుకుంటున్న పని ఇదే: ఆయన పంపిన నాలో నమ్మకం ఉంచండి.” 30 జనసమూహము ఆయనను అడిగారు, “అప్పుడు మేము దానిని చూసి మరియు నీ మీద నమ్మకం ఉంచడానికి నీవు ఏమి అద్భుతం చేస్తావు? నీవు మా కోసం ఏమి చేస్తావు? 31 మన పితరులు ఆ అరణ్యంలో {మోషేతో} కలిసి {వారు తిరుగుచున్నప్పుడు} మన్నా తిన్నారు, ప్రవక్తలు వ్రాసినట్లుగానే: ‘దేవుడు వారికి తినడానికి పరలోకము నుండి రొట్టె ఇచ్చాడు.’” 32 యేసు వారికి జవాబిచ్చాడు, "నేను మీతో సత్యము చెప్పుచున్నాను: పరలోకము నుండి ఆ రొట్టెను మీ పితరులకు ఇచ్చినది మోషే కాదు. లేదు, నా తండ్రీ, పరలోకము నుండి ఆ నిజమైన రొట్టెను ఇప్పుడు మీకు ఇచ్చుచున్నాడు. 33 {ఇది సత్యం} ఎందుకంటే దేవుని నుండి నిజమైన రొట్టె పరలోకం నుండి దిగి వచ్చింది మరియు లోకములోని మనుష్యులకు నిత్య జీవము ఇచ్చుచున్నది. 34 {ఆయన భావం ఏమిటో జనసమూహమునకు అర్థం కాలేదు}, కాబట్టి వారు యేసుతో చెప్పారు, “అయ్యా, దయచేసి ఈ రొట్టెను మాకు ఎల్లప్పుడూ ఇవ్వండి.” 35 యేసు జనసమూహముతో చెప్పాడు, “{ఆహారం భౌతిక జీవితాన్ని నిలబెట్టిన విధముగా}, నేను నిత్య జీవమును ఇచ్చే రొట్టెను. {ఆహారం లేదా పానీయం వలె కాకుండా}, నాలో విశ్వసించే ఎవరైనా నిశ్చయముగా నిత్యము సంతృప్తి చెందుతారు 36 అయినప్పటికీ, నేను ఇప్పటికే మీకు దానిని చెప్పాను, మీరు నన్ను చూసినప్పటికీ, మీరు ఇంకా నన్ను నమ్మరు. 37 నా తండ్రి నాకు ఇచ్చిన వారు అందరు నా వద్దకు వస్తారు {మరియు నా శిష్యులుగా ఉంటారు}, మరియు నేను నిశ్చయముగా వారిని ఎన్నడును వెళ్ళగొట్టను. 38 {నేను ఎన్నడు అది చేయను} ఎందుకంటే నేను కోరుకున్నది చేయడానికి నేను పరలోకము నుండి దిగి రాలేదు, బదులుగా, నన్ను పంపిన నా తండ్రి నేను ఏమి చేయాలని కోరుచున్నాడో అది చేయడానికి {నేను దిగి వచ్చాను}. 39 నన్ను పంపిన నా తండ్రి కోరుకునేది ఇదే: ఆయన నాకు ఇచ్చిన వారందరినీ నేను కాపాడుకోవాలని {ఆయన నన్ను కోరుచున్నాడు}. అంత్య దినమున {నేను ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చునప్పుడు} నేను వీరిని తిరిగి బ్రతికించాలని {ఆయన కూడా కోరుచున్నాడు}. 40 {ఇది నిజం} ఎందుకంటే నా తండ్రి కోరుకునేది కూడా ఇదే: నేను, కుమారుడను, ఎవరో గుర్తించి, నాలో విశ్వసించే ప్రతి ఒక్కరు {నాతో పాటు పరలోకములో} నిత్యము జీవించాలని {ఆయన కోరుచున్నాడు}. {నేను ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చునప్పుడు} అంత్య దినమున నేను వీరిని తిరిగి సజీవులను చేస్తాను." 41 యూదు నాయకులు యేసు గురించి సణగడం ఆరంభించారు, ఎందుకంటే పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన రొట్టెను నేనే అని ఆయన చెప్పాడు. 42 వారు చెప్పారు, "ఈయన కేవలం యేసు, యోసేపు యొక్క కుమారుడు! ఇతని తల్లిదండ్రులు ఎవరో మాకు తెలుసు. ఆయన చెప్పినట్లు ఆయన బహుశ పరలోకము నుండి దిగి రాలేడు! ” 43 యేసు వారికి జవాబిచ్చాడు, "{నేను ఇప్పుడే చెప్పినదాని గురించి} మీ మధ్య మీరే సణుగుకోవడం ఆపండి. 44 నన్ను పంపిన నా తండ్రి ఎవరిని {మరియు నా శిష్యులుగా ఉండుటకు} వచ్చునట్లు చేస్తాడో వారు మాత్రమే అలా చేయగలరు. అంత్య దినమున {నేను ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చేటప్పుడు} నేనే వారిని { నా దగ్గరకు వచ్చే} వారిని తిరిగి సజీవులను చేస్తాను. 45 దేవుడు ప్రతిఒక్కరికి బోధిస్తాడు అని ప్రవక్తలు వ్రాసారు. నా తండ్రి నుండి విని మరియు నేర్చుకునే ప్రతి ఒక్కరు వస్తారు {మరియు నా శిష్యులుగా ఉంటారు.} 46 నా తండ్రి అయిన దేవుని నేను తప్ప మరెవరూ చూడలేదు. నేను దేవుని నుండి వచ్చిన వాడను. నేను ఒక్కడినే మాత్రమే ఆయనను చూసాను. 47 నేను మీకు సత్యము చెప్పు చున్నాను. నాలో విశ్వాసం ఉంచు వాడు నిత్యము జీవిస్తాడు {నాతో పరలోకములో}. 48 నిత్య జీవమును ఇచ్చే నిజమైన రొట్టెను నేనే. 49 మీ పితరులు అరణ్యములో {మోషేతో} సంచరించినప్పుడు మన్నా తిన్నారు, అయితే వారు ఇంకా మరణించారు. 50 {అయితే} నేను మాట్లాడుచున్న ఈ రొట్టె పరలోకము నుండి దిగి వచ్చింది, ఎవరైనా దానిని తినేందుకు మరియు ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఎన్నడు చనిపోదు. 51 నిత్య జీవమును ఇచ్చే ఆ నిజమైన రొట్టె నేను మరియు పరలోకము నుండి దిగి వచ్చాను. ఈ రొట్టె తినేవాడు {నాతో పాటు పరలోకములో} నిత్యము జీవిస్తాడు. నా శరీరం కూడా ఈ రొట్టె. లోకములోని ప్రతి ఒక్కరి నిత్య జీవము కోసం నేను నా శరీరాన్ని వదులుకుంటాను. 52 అప్పుడు యూదు నాయకులు ఒకరితో ఒకరు వాదించుకోవడం ప్రారంభించారు. వారు చెప్పారు, “ఈ మనుష్యుడు నిశ్చయముగా తన శరీరమును మనము తినుటకు దానిని మనకు ఇవ్వలేడు!” 53 యేసు వారికి చెప్పాడు: నేను మీకు సత్యము చెప్పు చున్నాను: మనుష్య కుమారుడనైన నా యొక్క శరీరము తినవలెను మరియు నా రక్తము త్రాగవలెను. {మీరు ఈ పనులు చేయని యెడల, అప్పుడు} మీరు ఎన్నడు నిత్య జీవము కలిగి ఉండరు. 54 ఎవరైనా నా శరీరము తిని మరియు నా రక్తం త్రాగేవాళ్ళు {నాతో పాటు పరలోకములో} నిత్యము జీవిస్తారు. అంత్య దినమున {నేను ప్రతిఒక్కరికి తీర్పు తీర్చునప్పుడు} నేను ఆ వ్యక్తిని తిరిగి జీవించేలా కూడా చేస్తాను. 55 {ఇది అలా} ఎందుకంటే నా శరీరము నిజమైన ఆత్మీయ ఆహారం మరియు నా రక్తము నిజమైన {ఆత్మీయ} పానీయం. 56 నా శరీరము తిని మరియు నా రక్తము త్రాగే వారు నాతో ఐక్యపరచబడి ఉంటారు, మరియు నేను వారితో ఐక్యపరచబడి ఉంటాను. 57 నా తండ్రి ప్రతి ఒక్కరిని సజీవులను చేస్తాడు. ఆయన నన్ను ఇక్కడకు పంపాడు, మరియు నేను మనుష్యులను సజీవులనుగా చేయగలను ఎందుకంటే ఆయన నేను అలా చేయగలిగేలా చేసాడు. అదే విధముగా, ఎందుకంటే నేను వారి కోసం చేయు దానిని కారణంగా నన్ను తిను వారు నిత్యము జీవిస్తారు. 58 నేను పరలోకము నుండి దిగి వచ్చిన నిజమైన రొట్టెని. {ఈ రొట్టె} ఇశ్రాయేలీయుల పితరులు {అరణ్యములో} తిన్న రొట్టె లాంటిది కాదు. అయితే ఇంకను చివరికి మరణించారు. నన్ను-ఈ రొట్టెని తినే ఎవరైనా {నాతో పాటు పరలోకములో} నిత్యము జీవిస్తారు. 59 యేసు తాను కపెర్నహూము యొక్క నగరంలో బోధిస్తున్నప్పుడు ఒక సమాజ మందిరములో ఈ ప్రకటనలను {యూదు నాయకులకు} చెప్పాడు. 60 వారు {ఆయన చెప్పినది} విన్న తరువాత, యేసు యొక్క శిష్యులలో చాలామంది చెప్పారు, “ఆయన బోధిస్తున్నది అంగీకరించడం కష్టం. నిజముగా, ఎవరూ అంగీకరించలేరు! 61 ఆయనకు {ఎవరు చెప్పనప్పటికీ}, తన శిష్యులు తాను చెప్పినదాని గురించి సణుగుచున్నట్లు యేసుకు తెలుసు. {కాబట్టి} ఆయన వారిని అడిగాడు, “నా బోధ మిమ్ములను అభ్యంతర పరచినదా? 62 {ఈ బోధ మిమ్ములను అభ్యంతర పరచిన యెడల,} మనుష్య కుమారుడనైన నన్ను మునుపు నేను ఉన్న పరలోకమునకు ఎక్కుట మీరు చూచిన యెడల అప్పుడు {మీరు కూడా అభ్యంతర పరచబడతారా}? 63 పరిశుద్ధ ఆత్మ ఒకే ఒక్కడే ఎవరికైనా నిత్య జీవమును ఇవ్వగలడు. ఈ విషయంలో మానవ స్వభావం పనికిరాదు. నేను మీకు బోధించినది పరిశుద్ధ ఆత్మ నుండి వచ్చింది మరియు నిత్య జీవమును ఇస్తుంది. 64 అయినప్పటికీ, మీలో కొందరు నేను చెప్పింది విశ్వసించరు." (యేసు ఇది చెప్పాడు, ఎందుకంటే ఆయన తన పనిని ప్రారంభించినప్పటి నుండి తనను ఎవరు నమ్మరో మరియు చివరికి ఎవరు ఆయనను అప్పగిస్తారో ఆయనకు తెలుసు.) 65 అప్పుడు యేసు చెప్పాడు, "ఎందుకంటే {మీలో కొందరు నన్ను విశ్వసించరు}, తండ్రి అయిన దేవుడు రావడానికి {మరియు నా శిష్యుడిగా} ఉండగల సామర్థ్యాన్ని ఎవరికి ఇచ్చాడో వారు మాత్రమే అలా చేయగలరని నేను మీకు ముందే చెప్పాను. 66 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత, చాలా మంది శిష్యులు తిరిగి వెళ్ళి {ఆయనను కలవడానికి ముందు వారు చేస్తున్న పనిని చేయడానికి} మరియు ఆయన శిష్యులుగా ఉండడం మానివేసారు 67 ఎందుకంటే {చాలా మంది ఆయనను విడిచిపెట్టారు}, యేసు తన పన్నెండు మంది శిష్యులను అడిగాడు, “నిశ్చయముగా మీరు కూడా నన్ను విడిచిపెట్టడానికి కోరడం లేదా, అవునా?” 68 సీమోను పేతురు జవాబిచ్చాడు, “ప్రభువా, {మేము నిన్ను విడిచిపెట్టిన యెడల}, మేము వెళ్ళగలిగే వారు ఎవరు లేరు! నిత్యము {పరలోకములో} జీవించడానికి {మమ్ములను అనుమతించే} సందేశాన్ని నీవు మాత్రమే బోధిస్తావు! 69 మేము నీలో నమ్మకము ఉంచియున్నాము, మరియు నీవు దేవుని నుండి వచ్చిన పరిశుద్ధుడు అని మేము నిశ్చయముగా యెరుగుదుము!” 70 యేసు వారికి జవాబిచ్చాడు, “నేను నిశ్చయముగా మీ పన్నెండు మందిని ఎన్నుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను ఆధీనంలో ఉన్నాడు! 71 ({యేసు ఇది చెప్పినప్పుడు} ఆయన సీమోను ఇస్కరియోతు యొక్క కుమారుడు, యూదా గురించి మాట్లాడుచున్నాడు, ఎందుకంటే యూదా పన్నెండు మందిలో ఒకడు అయినప్పటికీ, తరువాత అతడు యేసును అప్పగించువాడుగా ఉన్నాడు.)

Chapter 7

1 ఆ విషయాలు జరిగిన తరువాత, యేసు గలిలయ ప్రాంతంలో తిరిగాడు ఎందుకంటే ఆయన యూదయ ప్రాంతంలో చుట్టూ తిరగడానికి ఇష్టపడలేదు. {ఆయన యూదయను తప్పించాడు} ఎందుకంటే అక్కడున్న యూదు నాయకులు ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని వెదకడానికి ప్రయత్నిస్తున్నారు. 2 (ఇప్పుడు ఆ సమయములో అది యూదుల గుడారాల పండుగ జరగబోతుంది.) 3 యేసు యొక్క సహోదరులు ఆయనకు చెప్పారు, "ఇక్కడ విడిచి మరియు యూదయ ప్రాంతమునకు వెళ్ళుము నీవు చేయుచున్న అద్భుత కార్యములు నీ శిష్యులు కూడా గమనించగలరు. 4 {యూదయలో నీ అద్భుత కార్యములు చేయుము} ఎందుకంటే ప్రసిధ్ధి కావాలనుకునే వారెవరూ రహస్యంగా ఏమీ చేయరు. నీవు ఈ అద్భుతాలు అన్నీ చేస్తున్నావు కాబట్టి, నీవు ఎవరు {అని చెప్పుకుంటున్నావో} ప్రతిఒక్కరికి {అద్భుత కార్యాలు చేయడం ద్వారా}!” బయలుపరచుకొనుము. 5 {యేసు యొక్క సహోదరులు ఇది చెప్పారు} ఎందుకంటే ఆయన మెస్సీయ అని కూడా వారు నమ్మలేదు. 6 {వారు ఆయనను నమ్మలేదు,} కాబట్టి యేసు వారితో చెప్పాడు, , “{యెరూషలేము వెళ్ళడానికి} ఇది నాకు సరైన సమయం కాదు, అయితే మీరు కోరుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళవచ్చు. 7 లోకములో ఎవరూ మిమ్ములను ద్వేషించలేరు. అయినప్పటికీ, వారు చెడు పనులు చేస్తారని నేను ప్రకటించడం వలన అందరూ నన్ను ద్వేషిస్తారు. 8 మీరు వేడుక కోసం {యెరూషలేముకు} వెళ్ళండి. నేను ఇంకా వేడుకకు వెళ్ళను, ఎందుకంటే నేను వెళ్ళడానికి ఇది సరైన సమయం కాదు. 9 యేసు తన సహోదరులతో ఆ మాట చెప్పిన తరువాత, గలిలయ ప్రాంతములో మరికొంత కాలం ఉన్నాడు. 10 అయితే, ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిన కొన్ని రోజుల తరువాత, ఆయన కూడా వెళ్ళాడు, అయితే ఆయన రహస్యంగా వెళ్ళాడు. 11 ఎందుకంటే యూదు నాయకులు వేడుకలో యేసు ఉంటాడని {ఆశించారు}, వారు ఆయనను కనుగొనడానికి ప్రయత్నించారు. వారు మనుష్యులను అడిగారు, “ఆ మనుష్యుడు ఎక్కడ ఉన్నాడు?” 12 జనసమూహము నిశ్శబ్దంగా యేసు గురించి చాలా మాట్లాడుకొనుచున్నారు. కొందరు మనుష్యులు చెప్పుచున్నారు, “ఆయన ఒక మంచి మనుష్యుడు!” అయితే ఇతరులు చెప్పారు, “కాదు! ఆయన జనసమూహమును మోసగిస్తున్నాడు!" 13 ఎందుకంటే వారు యేసు యొక్క యూదు శత్రువుల యొక్క భయంతో ఉన్నారు, వారు చెప్పునది ఇతర మనుష్యులు వినకుండా ఏ ఒక్కరు ఆయనను గురించి బహిరంగ ప్రదేశంలో మాట్లాడలేదు. 14 గుడారాల పండుగ దాదాపు సగము అయినప్పుడు, యేసు దేవాలయ {ప్రాంగణము} నకు ప్రవేశించాడు మరియు అక్కడ మనుష్యులకు బోధించడం మొదలుపెట్టాడు. 15 యూదు నాయకులు {ఆయన బోధకు} ఆశ్చర్యపోయారు. వారు చెప్పారు, ఈ మనుష్యుడు మతపరమైన శిక్షణ పొందలేదు. ఆయన లేఖనాలను అంత బాగా తెలుసుకోలేడు! ” 16 యేసు వారికి జవాబిచ్చాడు, “నేను బోధించేది నా నుండే రాలేదు. దానికి విరుద్ధంగా, నన్ను పంపిన దేవుని నుండి వస్తుంది. 17 ఎవరైనా దేవుడు కోరుకున్నది చేయాలనుకుంటే, అప్పుడు నేను బోధిస్తున్నది నా స్వంత అధికారం ద్వారా మాత్రమే కాకుండా దేవుని నుండి వచ్చినదని ఆ వ్యక్తికి తెలుస్తుంది. 18 తన స్వంత అధికారముతో మాట్లాడే ఎవరైనా తనను తాను ఘనపరచుకోవాలని మాత్రమే కోరుకుంటాడు. అయినప్పటికీ, తనను పంపిన వ్యక్తిని ఘనపరచాలానుకునే ఎవరైనా నిజం మాట్లాడతారు మరియు నీతిగా ప్రవర్తిస్తారు. 19 మోషే నిజముగా మీకు ధర్మశాస్త్రం {దేవుని నుండి} ఇచ్చాడు. మీరెవరు ఆ ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించరు. {అది నిజం కాబట్టి,} {మీరు లోబడని అదే ధర్మశాస్త్రముకు అవిధేయత చూపినందుకు} నన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు?" 20 జనసమూహములో కొందరు మనుష్యులు జవాబిచ్చారు, "ఒక దయ్యము నిన్ను నియంత్రిస్తుంది! నిన్ను చంపడానికి ఎవరు ప్రయత్నించడం లేదు!” 21 యేసు జనసమూహానికి జవాబిచ్చాడు, "{ఎందుకంటే} నేను విశ్రాంతి దినమున ఒక అద్భుతమైన స్వస్థత చేసాను, మీరు అందరు నిర్ఘాంతపోయారు. 22 ఎందుకంటే {విశ్రాంతి దినమున స్వస్థత వంటి కొన్ని కార్యములు జరుగుతాయి}, సున్నతి గురించి మోషే మీకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. {మీరు మీ కుమారులు పుట్టిన ఏడు దినముల తరువాత వారికి సున్నతి చేయాలి అని ఆ ధర్మశాస్త్రము చెపుతుంది.} ({సున్నతి} నిజానికి మోషేతో ప్రారంభం కాలేదు, అయితే {ఈ ఆచారం} మీ పితరులు, {అబ్రహం, ఇస్సాకు మరియు యాకోబుల}తో ప్రారంభమైంది.) {ఆ ధర్మశాస్త్రము కారణంగా,} కొన్నిసార్లు మీరు మీ మగ శిశువులకు సున్నతి చేయడం ద్వారా విశ్రాంతి దినమున మీరు ఖచ్చితంగా పని చేయాలి. 23 మోషే ధర్మశాస్త్రానికి అవిధేయత చూపకుండా ఉండటానికి మీరు కొన్నిసార్లు విశ్రాంతి దినమున ఎవరికైనా సున్నతి చేస్తారు కాబట్టి, ఆ రోజున ఎవరినైనా బాగుచేసినందుకు {ఒక మంచి పని చేసినందుకు} మీరు నా మీద కోపం తెచ్చుకోకూడదు! 24 మీరు చూసిన దాని ప్రకారం నాకు తీర్పు చెప్పడం ఆపండి! బదులుగా, ఏది సరైనదని దేవుడు చెప్పుచున్నాడో దాని ప్రకారం నాకు తీర్పు తీర్చండి.” 25 అప్పుడు యెరూషలేములో నివసించిన జనసమూహములోని కొందరు చెపారు, “మన నాయకులు చంపడానికి ప్రయత్నిస్తున్న మనుష్యుడు ఈయనే! 26 చూడండి! ఆయన ఈ విషయములు బహిరంగముగా చెప్పుచున్నాడు, అయితే నాయకులు ఆయనను ఎదిరించడానికి ఏమీ చెప్పడం లేదు. ఆయన మెస్సీయ అని మన నాయకులకు నిజంగా తెలిసి ఉండగలదా? 27 అయితే {ఈ మనుష్యుడు మెస్సీయ కాలేడు!} ఈయన మెస్సీయ కాలేడు! ఈ మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చాడో మనకు తెలుసు. అయితే మెస్సీయ వచ్చునప్పుడు, ఆయన ఎక్కడ నుండి వస్తాడో ఎవరికీ తెలియదు.” 28 యేసు అప్పుడు దేవాలయ {ప్రాంగణములో} ఆయన బోధిస్తున్నప్పుడు బిగ్గరగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు, “అవును, మీకు నేను తెలుసు, నేను ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు. అయితే నేను నా స్వంత అధికారముతో ఇక్కడికి రాలేదు. బదులుగా, నన్ను పంపినవాడు నిజమైన దేవుడు, మరియు మీరు ఆయనను ఎరుగరు. 29 నేను ఆయనను ఎరుగుదును ఎందుకంటే నేను ఆయన నుండి వచ్చాను. నన్ను పంపినవాడు ఆయనే.” 30 {యేసు ఈ విషయాలు చెప్పాడు} కాబట్టి, యూదు నాయకులు ఆయనను బంధించాలని కోరుకున్నారు, అయితే ఎవరు ఆయనను పట్టుకోలేకపోయారు, ఎందుకంటే అది ఆయన {చనిపోవడానికి} సరైన సమయం కాదు. 31 {యూదు నాయకులకు} భిన్నంగా, మనుష్యుల గుంపులో చాలామంది యేసులో విశ్వసించారు. వారు చెపుతూనే ఉన్నారు, “మెస్సీయ వచ్చినప్పుడు, ఈ మనుష్యుని కంటే ఎక్కువ అద్భుతమైన సూచకక్రియలు నిశ్చయముగా చేయలేడు!” 32 పరిసయ్యులలో కొందరు యేసును గూర్చి ఈ విషయాలు మాట్లాడుకోవడం వారిని మౌనంగా విన్నారు. అప్పుడు వారు మరియు పాలక యాజకులు ఆయనను పట్టుకోవడానికి ఆలయ కాపలాదారులను పంపారు. 33 {వారు ఇది చేసారు} కాబట్టి, అప్పుడు యేసు చెప్పాడు, "నేను కొద్దికాలం మాత్రమే మీతో ఉంటాను. త్వరలో నేను నన్ను పంపిన దేవుని దగ్గరకు తిరిగి వెళ్తాను. 34 మీరు నా కోసం వెదుకుతారు, అయితే మీరు నన్ను కనుగొనలేరు, నేను ఉండే చోటుకి మీరు రాలేరు.” 35 కాబట్టి యూదు నాయకులు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, “మనము ఆయనను కనుగొనని చోటికి ఈ మనుష్యుడు ఎక్కడికి వెళ్ళగలడు? ఇశ్రాయేలు వెలుపల లోకమంతట విస్తరించి ఉన్న యూదుల వద్దకు ఆయన నిజంగా వెళ్తాడా? యూదులు కాని అక్కడి మనుష్యులకు కూడా ఆయన బోధిస్తాడా? 36 మనము ఆయన కోసం వెదుకుతాము, అయితే మనము ఆయనను కనుగొన లేము, మరియు ఆయన ఉండే ప్రదేశానికి మనం రాలేము అని ఆయన చెప్పినప్పుడు ఆయన అర్థం ఏమిటి?” 37 ఇప్పుడు {గుడారాలు} వేడుక యొక్క చివరి మరియు అత్యంత ముఖ్యమైన దినము, యేసు {ఆలయ ప్రాంగణములో} లేచి నిలబడి బిగ్గరగా మాట్లాడాడు. ఆయన చెప్పాడు, “ఎవరైనా దాహం వేస్తే నా వద్దకు వచ్చి {నేను వారికి ఇచ్చేది} త్రాగవలెను! 38 నాలో విశ్వసించే ఎవరి గురించి అయినను ప్రవక్తలు లేఖనములో వ్రాసినది ఇదే: ‘నిత్య జీవమును ఇచ్చే నీరు ఆ వ్యక్తి యొక్క అంతరంగం నుండి సమృద్ధిగా ప్రవహిస్తుంది. 39 (ఇప్పుడు యేసులో నమ్మిన వారికి దేవుడు ఇవ్వబోతున్న పరిశుద్ధ ఆత్మను గూర్చి యేసు ఇది చెప్పాడు. {ఆయన ఇది చెప్పాడు} ఎందుకంటే {ఆ సమయములో దేవుడు ఆయనను నమ్మిన వారిలో నివసించడానికి} ఇంకా పరిశుద్ధ ఆత్మను పంపలేదు, ఎందుకంటే యేసు తన మరణం, పునరుత్థానం మరియు పరలోకమునకు తిరిగి రావడం ద్వారా ఇంకా ఘనత పొందలేదు.) 40 జనసమూహములో కొంతమంది యేసు చెప్పిన మాటలు వినిన తరువాత, వారు చెప్పారు, "ఆయన నిజంగా ప్రవక్త {దేవుడు వస్తాడని చెప్పిన వాడు}!" 41 జనసముహములో ఉన్న మరికొందరు చెప్పారు, “ఆయన మెస్సీయ!” అయితే, ఇతరులు {యేసు గలిలయలో జన్మించాడని తప్పుగా భావించిన వారు,} చెప్పారు, “అయితే మెస్సీయ గలిలయ ప్రాంతం నుండి రాలేడు. 42 మెస్సీయ దావీదు రాజు యొక్క వంశస్థుల నుండి మరియు దావీదు వచ్చిన బెత్లెహేము యొక్క గ్రామం నుండి {ఆయన రావలెను} అని ప్రవక్తలు లేఖనాలలో వ్రాసారు! 43 ఆ విధంగా జనసమూహములోని మనుష్యులు యేసు కారణంగా {వ్యతిరేక సమూహాలుగా} విడిపోయారు. 44 (జనసమూహములో ఉన్న కొంతమంది ఆయనను బంధించడానికి కోరుకున్నారు. అయినప్పటికీ ఎవరూ ఆయనను పట్టుకోలేదు. 45 ఆలయ కాపలాదారులు పాలక యాజకులు మరియు పరిసయ్యుల వద్దకు తిరిగి వచ్చారు, వారిని అడిగారు, "మీరు ఆయనను ఎందుకు బంధించి మరియు ఇక్కడకు తీసుకుని రాలేదు?" 46 ఆలయ కాపలాదారులు జవాబిచ్చారు, “ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఏ ఒక్కరు ఎప్పుడు మాట్లాడలేదు!” 47 {కాపలదారులు అది చెప్పారు} కారణంగా, పరిసయ్యులు అడుగుట ద్వారా జవాబిచ్చారు, "ఆయన మిమ్ములను కూడా మోసం చేసాడా? 48 నిశ్చయంగా, మన అత్యున్నత పరిపాలక సభ సభ్యులు లేదా పరిసయ్యులు ఎవ్వరు ఆయనలో నమ్మకం ఉంచలేదు! 49 అయితే, ఈ జనసమూహము యొక్క మనుష్యులకు దేవుని యొక్క ధర్మశాస్త్రము తెలియదు, మరియు దేవుడు వారిని శపించాడు!” 50 అప్పుడు నీకొదేము మాట్లాడాడు. (అతడు రాత్రి సమయంలో యేసును చూడడానికి ఆయనతో మాట్లాడడానికి గతములో వచ్చిన మనుష్యుడు. అతడు పరిసయ్యులలో {ఇది సాధారణంగా యేసును వ్యతిరేకించే సమూహం}.) ఒకడు అయినప్పటికీ, అతడు యూదు మత నాయకులతో చెప్పాడు, 51 "మన యూదుల ధర్మశాస్త్రము ఎవరైనా ఒకని మాటలు వినడానికి ముందు మరియు అతడు ఏమి చేసాడో దాని గురించి మొదట మనం వినకుండా మరియు తెలుసుకోకుండ ఒక మనుష్యుని మనం తీర్పు తీర్చడానికి అనుమతించదు.” 52 వారు అతనికి అవమానకరంగా జవాబిచ్చారు, "ఖచ్చితంగా, నీవు కూడా గలిలయ ప్రాంతము నుండి వచ్చావా? నీవు వచ్చావా? లేఖనాలను జాగ్రత్తగా చదవండి! {మీరు అది చేస్తే,} గలిలయ నుండి ఏ ప్రవక్త ఎవరు రాడు అని నీవు చూస్తావు.” 53 అప్పుడు వారు అందరు విడిచిపెట్టారు మరియు వారి సొంత గృహాలకు వెళ్ళారు.

Chapter 8

1 యేసు తన శిష్యులతో ఒలీవల యొక్క పర్వతానికి వెళ్ళాడు, {మరియు ఆ రాత్రి అక్కడికి దగ్గరలో ఉన్నారు.} 2 మరుసటి ఉదయము తెల్లవారుజామున, యేసు ఆలయ {ప్రాంగణం}లోనికి తిరిగి వచ్చాడుమరియు ఆయన అనేకమంది మనుష్యులు ఆయన వద్దకు వచ్చారు. 3 కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు పరిసయ్యులు ఒక స్త్రీని ఆయన వద్దకు తీసుకు వచ్చారు. ఆమె వ్యభిచారం చేస్తుండగా వారు ఆమెను పట్టుకున్నారు.వారు ఆమెను ఈ గుంపు మధ్యలో నిలబెట్టారు. 4 {అత్యున్నత యూదుల పరిపాలక సభ ముందు మోషే ధర్మశాస్త్రమును ఉల్లంఘించినందుకు} ఆయన మీద ఆరోపణలు చేయడానికి యాజకులు యేసును పరీక్షించాలనుకున్నారు. కాబట్టి వారు ఆయనతో చెప్పారు, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు, అదే చర్యలో మేము పట్టుకున్నాము! 5 అలాంటి ఒక స్త్రీని రాళ్ళతో చంపాలి అని ఇప్పుడు మోషే మనకు ధర్మశాస్త్రములో ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ, మేము ఏమి చేయాలని నీవు చెపుతావు?” 6 అయితే, యేసు వంగి తన వ్రేలితో నేలపై ఏదో వ్రాసాడు. 7 వారు ఆయనను ప్రశ్నించుటకు కొనసాగించి ఉండగా, ఆయన లేచి నిలబడ్డాడు మరియు వారితో చెప్పాడు, “మీలో ఎవరైనా ఒకరు ఎన్నడు పాపం చేయని వాడు, ఆమె మీద మొదటి రాయి విసరండి{మరియు ఆమెను చంపడానికి మిగిలిన వారిని నడిపించండి}!” 8 అప్పుడు యేసు మరల వంగి మరియు తన వ్రేలితో నేల మీద ఏదో వ్రాసాడు. 9 {ఆయన ఇది చేసిన తర్వాత,} ఆ యూదు నాయకులు {ఆయనను ప్రశ్నిస్తున్న వారు} ఒక్కొక్కరుగా నడచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు.మొదట పెద్ద వారు, మరియు తరువాత చిన్న వారు వెళ్ళిపోయారు. అప్పుడు యేసు మాత్రమే ఆ స్త్రీతో మనుష్యుల మధ్య ఉన్నాడు. 10 యేసు పైకి లేచి నిలబడ్డాడు మరియు ఆమెను అడిగాడు, “నీ మీద ఆరోపిస్తున్న వారు ఎక్కడ ఉన్నారు? నీవు {శిక్షింపబడాలని} ఎవరు నీకు శిక్ష విధింపలేదా?” 11 ఆమె స్త్రీ చెప్పింది, "అయ్యా, ఎవరూ లేరు." అప్పుడు యేసు చెప్పాడు, "నేను నిన్ను {శిక్షింపబడాలని} కూడా శిక్షించను. వెళ్ళు, మరియు ఇప్పటి నుండి, ఇకమీదట ఈ విధముగా పాపం చేయవద్దు!"] 12 యేసు మరల మనుష్యులతో మాట్లాడాడు. ఆయన చెప్పాడు, “లోకములోని మనుష్యులకు దేవుని మంచి మరియు నిజమైన వెలుగును ఇచ్చేది నేనే. నా శిష్యులుగా మారిన వారు ఎప్పటికీ {పాపపు} చీకటిలో {మరల} నడవరు. బదులుగా, ఆ వ్యక్తి నిత్యజీవమును ఇచ్చే దేవుని యొక్క మంచి మరియు నిజమైన వెలుగు కలిగి ఉంటాడు. 13 పరిసయ్యులు అప్పుడు ఆయనతో చెప్పారు, "నీ కోసం సాక్ష్యం నీవు మాత్రమే ఉన్నావు {మోషే ధర్మశాస్త్రము కనీసం ఇద్దరు సాక్ష్యులను కోరుతుంది కనుక} నువ్వు చెప్పుచున్నది సత్యము కాలేదు. 14 యేసు జవాబిచ్చాడు, "నాకు నేనే సాక్షిని అయినప్పటికీ, నేను చెప్పేది ఇంకను సత్యము ఎందుకనగా నేను ఎక్కడి నుండి వచ్చానో మరియు నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నాకు తెలుసు. అయినప్పటికీ, నేను ఎక్కడ నుండి వచ్చానో మీకు తెలియదు మరియు నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో {మీకు తెలియదు}. 15 మీరు మానవ ప్రమాణాలు ప్రకారం మనుష్యులకు తీర్పు తీరుస్తారు. { అయినప్పటికీ,} నేను ఎవరినీ { ఆ విధంగా} తీర్పు తీర్చడానికి రాలేదు. 16 నేను మనుష్యులకు తీర్పు తీర్చినప్పటికీ, నిజమైన ప్రమాణం ప్రకారం నేను తీర్పు ఇస్తాను, ఎందుకనగా నేను మనుష్యులను నా స్వంతంగా తీర్పు తీర్చను. బదులుగా, నేను మరియు నన్ను పంపిన నా తండ్రి, { కలిసి మనుష్యులకు తీర్పు తీరుస్తాము}. 17 కనీసం ఇద్దరు సాక్షులు ఒకే విషయము చెప్పినప్పుడు వారు చెప్పేది నిజమని మోషే మీ ధర్మశాస్త్రములో కూడా వ్రాసాడు. 18 నేనే నాకు స్వంత సాక్షిని, అయితే నన్ను పంపిన నా తండ్రి కూడా నాకు సాక్షి. {అందుకే, నేను చెప్పేది నిజం}.” 19 {తన తండ్రి తనకు సాక్షి అని యేసు చెప్పాడు,} కాబట్టి, పరిసయ్యులు అడిగారు, “నీ తండ్రి ఎక్కడఉన్నాడు?” యేసు జవాబిచ్చాడు, “మీరు నన్ను ఎరుగరు, మరియు మీరు నా తండ్రిని ఎరుగరు. మీరు నన్ను ఎరిగియున్న యెడల, మీరు నా తండ్రిని కూడా ఎరిగి ఉంటారు.” 20 ఆయన ఆలయ {ప్రాంగణం} బోధిస్తున్నప్పుడు తన గురించి ఈ విషయాలు చెప్పాడు. మనుష్యులు డబ్బు అర్పణలు తెచ్చే స్థలము వద్ద {ఆలయ ప్రాంగణములో} {ఆయన వారికి చెప్పాడు}. ఎవరు ఆయనను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన చనిపోవడానికి ఇది సరైన సమయం కాదు. 21 అప్పుడు యేసు ఆ మనుష్యులతో మరల చెప్పాడు, “నేను వెళ్ళిపోవుచున్నాను, మరియు మీరు నన్ను వెదకుదురు, అయితే మీరు నన్ను పాపముగా తిరస్కరించారు కాబట్టి, దేవుడు మీ పాపములు క్షమించకుండానే మీరు చనిపోతారు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు.” 22 అప్పుడు యూదు నాయకులు {తమలో తాము} చెప్పుకున్నారు,"బహుశా ఆయన తనను తాను చంపుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు, మరియు “నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు” అని ఆయన చెప్పునప్పుడు {ఆయన అర్థం అదే.}” 23 యేసు వారితో చెప్పాడు, "మీరు ఈ భూమి క్రింది వారు, అయితే నేను పరలోకము పైన ఉండు వాడను. మీరు ఈ పాపభరితమైన లోకమునకు చెందినవారు. నేను ఈ లోకమునకు చెందిన వాడను కాను. 24 మీరు చేసిన పాపములు అన్నిటి కోసం దేవుని క్షమాపణ పొందకుండానే మీరు చనిపోతారు అని దీని కారణముగా నేను చెప్పాను. నేను {దేవుడను, నేను చెప్పినట్లు నేనే} అని మీరు విశ్వసించని యెడల ఇది నిశ్చయముగా జరుగుతుంది. 25 {ఆయన అది చెప్పాడు} కాబట్టి, వారు ఆయనను అడిగారు, “నీవు ఎవరు?”యేసు జవాబిచ్చాడు, "అదే మొదటి నుండి నేను మీకు చెప్పుచునే ఉన్నాను! 26 నేను మీ గురించి చాలా విషయాలు చెప్పగలను మరియు మిమ్ములను తీర్పు తీర్చగలను,{అయితే నేను ఈ సమయములో ఆ పనులు చేయను}.బదులుగా, నన్ను పంపిన వాని నుండి నేను విన్నదానిని మాత్రమే లోకములోని మనుష్యులకు చెపుతాను. ఆయన ఎల్లప్పుడు సత్యము చెపుతాడు.” 27 (ఆయన {పరలోకములో} ఉన్న తన తండ్రి గురించి యేసు చెప్పుచున్నాడు అని వారు అర్థం చేసుకోలేదు. 28 కాబట్టి యేసు వారికి చెప్పాడు, "మనుష్యు కుమారుడునైన నన్ను,మీరు చంపడానికి నన్ను పైకి ఎత్తినప్పుడు, నేను {దేవుడు} అయి ఉన్నాను అని, మరియు నా స్వంత అధికారముతో నేను ఏమీయు చేయను అని {మీరు తెలుసుకుంటారు}, బదులుగా, నేను చెప్పడానికి నాకు నా తండ్రి ఏమి బోధించాడో అది మాత్రమే నేను చెపుతాను. 29 నన్ను పంపిన నా తండ్రి ఎల్లప్పుడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఎన్నడు విడిచిపెట్టలేదు ఎందుకంటే నేను ఆయనను సంతోషపెట్టు కార్యములు మాత్రమే ఎల్లప్పుడు చేస్తాను. 30 యేసు ఈ విషయములు చెప్పుచుండగా, ఇంకా అనేక మంది మనుష్యులు ఆయన మెస్సీయ అని విశ్వసించారు. 31 అప్పుడు యేసు ఆయనను మెస్సీయ అని విశ్వసించామని ఇప్పుడు చెప్పుచున్న యూదులతో చెప్పాడు, “నేను మీకు బోధించిన వాటికి మీరు లోబడిన యెడల, అప్పుడు మీరు నా యదార్ధమైన శిష్యులు. 32 {ఇంకా,} మీరు దేవుని యొక్క సత్యమును తెలుసుకుంటారు, మరియు {మిమ్ములను బానిసలుగా చేసుకున్న దాని నుండి} సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది {అని విశ్వసిస్తారు}. 33 వారు ఆయనకు జవాబిచ్చారు, "మేము అబ్రాహాము యొక్క సంతానం. మేము ఎన్నడు ఎవరి యొక్క బానిసలముగా ఉండలేదు!. మేము స్వతంత్రులుగా ఉండాలి అని నీవు ఎందుకు చెప్పుచున్నావు? 34 యేసు జవాబిచ్చాడు, “నేను మీకు సత్యము చెప్పుచున్నాను: పాపం చేసే ఎవరైనా {అతని పాపపు కోరికల చేత నియంత్రించబడతాడు} ఒక బానిస {తన యజమాని చేత నియంత్రించబడినట్లుగా}. 35 బానిసలు ఎప్పటికీ {వారి యజమాని} కుటుంబ సభ్యులుగా ఉండరు, {అయితే స్వేచ్ఛగా విడిపించబడవచ్చు లేదా అమ్మబడవచ్చు}.అయినప్పటికీ, ఒక కుమారుడు శాశ్వతం కుటుంబంలో ఒక సభ్యుడుగా ఉంటాడు. 36 కాబట్టి {పాపానికి బానిసలుగా ఉండటం నుండి}, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల, మీరు పూర్తిగా {పాపం చేయుటము నుండి} మానుకుంటారు. 37 మీరు అబ్రాహాము యొక్క భౌతిక సంతానం అని నాకు తెలుసు. అయినప్పటికి, మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకనగా నేను చెప్పునది మీరు తిరస్కరిస్తారు. 38 నా తండ్రి నాకు చూపించిన విషయాలు గురించి నేను మీకు చెప్పుచున్నాను. కాబట్టి, {నేను చెప్తున్నాను} మీరు మీ తండ్రి మీరు చేయుటకు చెప్పినది చేస్తున్నారు.” 39 వారు ఆయనకు జవాబిచ్చారు, “అబ్రాహాము మా పితరుడు.” యేసు వారితో చెప్పాడు, “మీరు అబ్రహాము సంతానము అయిన యెడల, అతడు చేసిన అవే కార్యములు మీరు చేస్తూ ఉంటారు. 40 దేవుడు నాతో చెప్పిన నిజమైన విషయాలను నేను మీకు చెప్పుచునే ఉన్నాను, అయితే మీరు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము అలాంటిదిఏదైనా చేయలేదు. 41 మీరు మీ నిజమైన తండ్రి చేసిన అవే కార్యములు మీరు చేస్తున్నారు.వారు ఆయనతో చెప్పారు, "మేము అక్రమమైన పిల్లలం కాదు, {నీకు వలె}! మాకు ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు, మరియు అనగా దేవుడు.” 42 యేసు వారితో చెప్పాడు, “దేవుడు మీ తండ్రి అయిన యెడల, ఆయన కాదు, మీరు నన్ను ప్రేమించే వారు ఎందుకనగా నేను ఆయన యొద్ద నుండి వచ్చాను మరియు ఈ లోకానికి వచ్చాను. {ఇది నిజం} ఎందుకనగా నేను నా స్వంత అధికారం మీద రాలేదు.బదులుగా, దేవుడు నన్ను పంపాడు కాబట్టి నేను వచ్చాను. 43 నేను చెప్పేది మీకు ఎందుకు అర్థం కాలేదో మీకు తెలుసా? అది ఎందుకనగా నేను మీకు చెప్పినదానిని మీరు అంగీకరించకపోవడమే {మరియు లోబడకపోవడమే}! 44 మీరు మీ తండ్రి, సాతానుకు చెందినవారు, మరియు వాడు కోరుకున్నది చేయాలని మీరు ఆశ పడుచున్నారు. మనుష్యులు మొదట {పాపం చేసినప్పటి} నుండి వాడు మనుష్యులను హత్యచేస్తునే ఉన్నాడు. వాడు సత్యమైనది తిరస్కరించాడు, ఎందుకనగా వాడు ఆ సత్యమైన విషయాలు ఎన్నడు మాట్లాడడు. వాడు అబద్ధమాడునప్పుడు, వాడు సహజంగా ఏమి చేస్తున్నాడో అదే చేస్తున్నాడు,ఎందుకనగా వాడు ఒక అబద్దికుడు.అబద్ధానికి మూలం కూడా వాడే. 45 అయినా మీరు నన్ను నమ్మ లేదు! ఎందుకంటే నేను మీకు సత్యం చెప్పాను! 46 {నేనెప్పుడూ పాపం చేయలేదు కాబట్టి,} మీలో ఎవ్వరూ నేను పాపం చేశానని నిరూపించలేరు. నేను మీకు సత్యము చెప్పుచున్నాను కాబట్టి, నేను చెప్పేది మీరు నమ్మకపోవడానికి సరైన కారణం లేదు! 47 దేవునికి చెందిన వారు ఆయన చెప్పిన దానిని అంగీకరించి { మరియు లోబడతారు}. {ఇది నిజం,} కాబట్టి మీరు దేవుడు చెప్పినదానిని అంగీకరించరు {మరియు విధేయత చూపించరు}, ఎందుకంటే మీరు దేవునికి చెందినవారు కాదు. 48 యేసును వ్యతిరేకిస్తున్న యూదులు ఆయనకు జవాబిచ్చారు, “నువ్వు సమరయులలో ఒకడివి అని {వారిని మేము ద్వేషిస్తున్నాము,} మరియు నిన్ను ఒక దయ్యం నిన్ను నియంత్రిస్తున్నది అని మేము చెప్పినప్పుడు మేము ఖచ్చితంగా సరైనవాళ్లమే!” 49 యేసు జవాబిచ్చాడు, "ఒక దయ్యం నన్ను నియంత్రించడం లేదు! దానికి భిన్నంగా {పరలోకంలో} నేను నా తండ్రిని నేను ఘనపరచుచున్నాను, మరియు మీరు నన్ను అగౌరవపరుస్తున్నారు. 50 నన్ను ప్రశంసించడానికి మనుష్యులను ఒప్పించడానికి నేను ప్రయత్నం చెయ్యను. దానిని చెయ్యడానికి కోరుకునే మరొకరు ఉన్నారు, మరియు {నువ్వు గానీ లేదా నేను సత్యము చెప్పుచుండడం విషయం} తీర్పు తీరుస్తాడు. 51 నేను మీకు సత్యం చెప్పుచున్నాను: నా బోధకు విధేయత చూపే వ్యక్తి ఎప్పటికీ చనిపోడు! 52 యేసును వ్యతిరేకిస్తున్న యూదులు ఆయనతో చెప్పారు, “ఇప్పుడు ఒక దయ్యం నిన్ను నియంత్రిస్తుంది అని మాకు తెలుసు! అబ్రాహాము మరియు ప్రవక్తలు చాలా కాలం క్రితం చనిపోయారు! అయినా నీ బోధకు లోబడే ఎవరైనా ఖచ్చితంగా ఎప్పటికీ చనిపోరని నీవు చెపుతున్నావు! 53 నీవు మన పితరుడైన అబ్రాహాము కంటే గొప్పవాడివి కావు. అతడు చనిపోయాడు మరియు ప్రవక్తలు కూడా చనిపోయారు. {కాబట్టి} నీవు ఎవరివి అనుకుంటున్నావు?” 54 యేసు జవాబిచ్చాడు, "మనుష్యులు నన్ను ప్రశంసించేలా చేయడానికి ప్రయత్నించిన యెడల, అది నిరుపయోగమైనది అవుతుంది. నా తండ్రి నన్ను ప్రశంసించు వాడు. ఆయనే మీ దేవుడు అని మీరు చెప్పుకుంటారు. 55 ఆయనను మీరు ఎరుగనప్పటికీ, ఆయనను నేను ఎరుగుదును. ఆయన నాకు తెలియదని నేను చెప్పిన యెడల, నేను మీలో ప్రతి ఒక్కరి వలే ఒక అబద్ధికుడను అవుతాను. మీకు విరుద్ధంగా, నేను ఆయనను ఎరుగుదును, మరియు ఆయన చెప్పేదానికి నేను ఎల్లప్పుడూ విదేయుడనై ఉంటాను. 56 మీ పితరుడైన అబ్రహాము నేను ఈ లోకానికి రావడం చూడగలనని {ఆలోచించి} ఎంతో సంతోషించాడు. నేను రావడాన్ని చూడటానికి {దేవుడు అతనిని అనుమతించాడు మరియు అతను సంతోషంగా ఉన్నాడు.” 57 ఎందుకంటే {యేసు ఇది చెప్పాడు}, ఆయనను వ్యతిరేకిస్తున్న యూదులు ఆయనతో చెప్పారు, “{అబ్రాహాము చాలా కాలం క్రితం చనిపోయాడు, మరియు} నీకు యాభై సంవత్సరాలు కూడా లేవు! నువ్వు అబ్రాహామును ఎలా చూశావు?” 58 యేసు వారితో చెప్పాడు, "నేను మీకు సత్యము చెప్పుచున్నాను: అబ్రాహాము పుట్టక ముందు నేను {దేవుడనై} ఉన్నాను!" 59 ఎందుకంటే {ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు,} యేసును వ్యతిరేకిస్తున్న యూదులు ఆయన మీద విసరడానికి {ఆయనను చంపడానికి} రాళ్లను ఎత్తారు. అయితే యేసు {సమూహంలో} దాక్కున్నాడు మరియు ఆలయం {ప్రాంగణం} ను విడిచిపెట్టాడు.

Chapter 9

1 యేసు మార్గమున నడిచి వెళ్ళుచుండగా, అతడు పుట్టిన దినము నుండి, తన జీవితమంతా గుడ్డివాడిగా ఉన్న ఒక మనుష్యుడుని ఆయన చూసాడు. 2 ఆయన శిష్యులు ఆయనను అడిగారు, “బోధకుడా, ఈ మనుష్యుడు గుడ్డివాడిగా ఉండడానికి పుట్టినప్పుడు ఎవరి పాపము కారణము అయ్యింది? ఈ మనిషి లేదా ఇతని తల్లిదండ్రుల పాపమా?” 3 యేసు జవాబిచ్చాడు, "{ఇతడు పుట్టినప్పుడు గుడ్డివాడిగా ఉండడానికి కారణం అయినది} ఇతడు గాని లేదా ఇతని తల్లిదండ్రుల పాపం గానీ కాదు. బదులుగా,{ఇతడు పుట్టినప్పుడు గుడ్డివాడిగా ఉన్నాడు} తద్వారా దేవుడు ఇతనిలో చేసే అద్భుతమైన కార్యములు మనుష్యులకు నేను కనుపరుస్తాను. 4 నేను మీతో ఇంకా ఉన్నప్పుడు, నన్ను పంపినవాడు నేను చేయుటకు నన్ను కోరిన అద్భుతమైన కార్యములు మనము చేయవలెను. పగలు తరువాత రాత్రి వచ్చిన విధముగా దేవుడు కోరుకున్నది చేయడానికి మనకు మరింత ఆలస్యం అయ్యే ఒక సమయం వస్తుంది. 5 నేను ఇంకా ఈ లోకములో జీవిస్తూ ఉండగా, లోకములో మనుష్యులకు దేవుని మంచి మరియు నిజమైన వెలుగును ఇచ్చువాడను నేనే.” 6 ఆయన ఇది చెప్పినప్పుడు, ఆయన నేల మీద ఉమ్మివేసాడు మరియు అతని లాలాజలముతో కలుపుతూ {మట్టితో} బురద చేసాడు. అప్పుడు మరియు గుడ్డివాడైన మనుష్యుని కళ్ళ మీద ఆ బురదను పూసాడు. 7 అప్పుడు యేసు గుడ్డివాడైన వ్యక్తితో చెప్పాడు, “వెళ్ళు మరియు సిలోయము యొక్క కోనేటిలో {మట్టి తొలగిపోవడానికి} కడుగుకొనుము!” (సిలోయము అంటే {అరామిక్ భాషలో} పంపబడిన అని అర్థం} కాబట్టి ఆ మనుష్యుడు వెళ్ళాడు మరియు {కోనేటిలో బురదను} కడుగుకున్నాడు. అప్పుడు అతడు చూడద గల్గినప్పుడు {ఇంటికి} వెళ్ళాడు. 8 ఆ వ్యక్తి ఇరుగు పొరుగువారు మరియు అతనిని గతంలో చూసిన వారు మరియు అతడు బిచ్చగాడు అని తెలుసుకున్న ఇతరులు చెప్పారు, “ఖచ్చితంగా ఇక్కడ కూర్చుని అడుక్కునే వ్యక్తి ఇతడే!” 9 కొందరు మనుష్యులు చెప్పారు, “అవును, ఆ మనుష్యుడు అతడే” ఇతర మనుష్యులు చెప్పారు, “లేదు, అయితే ఇతడు ఆ మనుష్యుని వలె కనిపిస్తున్నాడు.” అయితే, ఆ మనుష్యుడు తానే చెప్పాడు, “అవును, నేనే గుడ్డివాడిగా ఉన్న మనిషిని!” 10 కాబట్టి వారు అతనిని అడిగారు, "ఇప్పుడు నీవు ఏవిధంగా చూడగలుగుచున్నావు?” 11 అతడు జవాబిచ్చాడు, “మనుష్యులు యేసు అని పిలుచే మనిషి బురదను {మట్టి మరియు అతని లాలాజలంతో} తయారు చేసి నా కళ్ల మీద పరిచాడు. అప్పుడు అతదు నన్ను సిలోయం కోనేటి వద్దకు వెళ్లి మరియు {బురదను కడగమని చెప్పాడు. కాబట్టి నేను అక్కడికి వెళ్లాను మరియు {బురదను} కడుగుకొన్నాను. అప్పుడు నేను {మొదటిసారి} చూడగలిగాను.” 12 వారు అతనిని అడిగారు, “ఆ మనుష్యుడు ఎక్కడ ఉన్నాడు?" అతడు జవాబిచ్చాడు, “అతడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు.” 13 {అక్కడ ఉన్న కొందరు} ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్న ఆ మనుష్యుని కొందరు పరిసయ్యుల వద్దకు తీసుకువెళ్ళారు. 14 (ఇప్పుడు యేసు మట్టిని {తన లాలాజలంతో} చేసి, మరియు మనిషిని చూసేలా చేసిన రోజు యూదుల విశ్రాంతి దినం.) 15 అప్పుడు పరిసయ్యులు ఆ వ్యక్తిని రెండవసారి ప్రశ్నించారు. {ఈసారి} కూడా, అతను ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడని వారు అడిగారు. అతడు వారికి చెప్పాడు, “ఆ వ్యక్తి నా కళ్ల మీద బురద చల్లాడు, మరియు నేను {దానిని కడిగి} వేసాను, మరియు ఇప్పుడు నేను {మొదటిసారి} చూడగలుగుతున్నాను. 16 పరిసయ్యులలో కొందరు అప్పుడు చెప్పారు, “ఈ మనుష్యుడు యేసు దేవుని నుండి వచ్చినవాడు కాదు {అని మాకు తెలుసు} ఎందుకంటే ఆయన మన యూదుల విశ్రాంతి యొక్క దినము నియమాలను అనుసరించడం లేదు. మరికొందరు పరిసయ్యులు అడిగారు, "ఖచ్చితంగా పాపి అయిన మనిషి ఈ మనిషి చేసిన ఆద్భుతమైన కార్యముల వంటివి చెయ్యలేదు!” కాబట్టి పరిసయ్యులు {యేసు ఎవరు అనేదాని గురించి} ఒకరితో ఒకరు ఏకీభవించలేదు. 17 కాబట్టి పరిసయ్యులు గుడ్డి మనుష్యుని మరల అడిగారు, “నిన్ను చూసేలా చేసినది ఆయనే కాబట్టి నీవు ఆయనను గురించి ఏమి చెపుతావు,?" ఆ మనుష్యుడు చెప్పాడు, “ఆయన ఒక ప్రవక్త అయి ఉండాలి.” 18 {ఆ వ్యక్తి యేసు ప్రవక్త అని నమ్మినందున}, యూదు నాయకులు ఆ వ్యక్తి గుడ్డివాడు అని మరియు అప్పుడు వారు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులను పిలిచిన {వారిని ప్రశ్నించడానికి} తరువాత అతడు చూపు పొందగలిగాడు అని విశ్వసించలేదు. 19 వారు అతని తల్లిదండ్రులను అడిగారు, “ఈ మనిషి మీ కుమారుడేనా? అతడు పుట్టినప్పుడు అతడు గుడ్డివాడు అని మీరు చెప్పుచున్నారా? {ఇది అలా అయిన యెడల,} అప్పుడు అతడు ఈ సమయంలో ఏవిధంగా చూడగలుగుచున్నాడు?” 20 అతని తల్లిదండ్రులు జవాబిచ్చారు, "ఇతడు మా కుమారుడు అని మాకు ఖచ్చితంగా తెలుసు. అతడు పుట్టినప్పుడు గుడ్డివాడు అని కూడా మాకు ఖచ్చితంగా తెలుసు. 21 అయినప్పటికి, అతడు ఈ సమయంలో ఏవిధంగా చూడగలుగుతున్నాడో మాకు తెలియదు. అతడు చూడగలిగేలా చేసినది ఎవరోకూడా మాకు తెలియదు, అతనిని అడగండి, అతనికి తనకోసం మాట్లాడుటకు చాలినంత వయస్సు ఉంది.” 22 (యేసు మెస్సీయ అని ప్రకటించేవారిని యూదుల సమావేశ స్థలంలోనికి రాకుండా నిషేధిస్తామని యూదు నాయకులు గతంలో తమలో తాము అంగీకరించారు. దీని కారణంగా, ఆ వ్యక్తి తల్లిదండ్రులు వారికి భయపడ్డారు మరియు వారికి ఆ సంగతులు చెప్పారు.) 23 అందు కోసం కూడా వారు యూదు నాయకులకు చెప్పారు, “అతనిని అడగండి, అతడు తగినంత వయస్సులో ఉన్నాడు.” 24 కాబట్టి యూదు నాయకులు గుడ్డివాడుగా ఉన్న మనుష్యుని కోసం రెండవసారి పిలిపించారు. వారు అతనితో చెప్పారు, “{సత్యమే మాత్రమే మాట్లాడడం చేత} దేవుణ్ణి మహిమ పరచు! {నిన్ను స్వస్థపరచిన} ఈ మనుష్యుడు పాపాత్ముడు అని మాకు ఖచ్చితంగా తెలుసు.” 25 యేసు స్వస్థపరచిన వాడు జవాబిచ్చాడు, "ఆయన ఒక పాపియో లేదా కాదో, నాకు తెలియదు. ఒకప్పుడు నేను గుడ్డివాడనుగా ఉన్నాను అయితే ఇప్పుడు నేను చూడగలను అని ఒక విషయం నాకు తెలుసు.” 26 వారు అతనిన అడిగారు, "ఆయన {నిన్ను స్వస్థపరచడం కోసం} నీకు ఏమి చేసాడు? నువ్వు చూడగలిగేలా ఆయన ఎలా చేసాడు?” 27 ఆయన జవాబిచ్చాడు, "నేను ఆ ప్రశ్నలకు జవాబులను ఇప్పటికే మీకు చెప్పాను, అయితే మీరు నేను చెప్పిన దానిని మీరు వినలేదు. నేను మీకు మరల చెప్పాలని మీరు ఎందుకు కోరుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని కోరిక కలిగి ఉండడమేనా?” 28 అప్పుడు వారు ఆయనతో అవమానకరంగా మాట్లాడారు: "నీవు ఆ మనుష్యుని యొక్క శిష్యుడవు, మీము అయితే మేము మోషే యొక్క శిష్యులం! 29 దేవుడు మోషేతో {చాలా కాలం క్రితం} మాట్లాడాడు అని మేము ఖచ్చితంగా ఉన్నాము. ఆ మనిషి విషయంలో, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మాకు తెలియదు.” 30 ఆ మమనుష్యుడు జవాబిచ్చాడు, "నేను ఆశ్చర్యపోయాను! ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియదు, అయితే నేను చూడడానికి నన్ను సమర్దుడిగా చేసిన వాడు ఈయనే! 31 పాపులైన మనుష్యుల {యొక్క ప్రార్థనలకు} దేవుడు స్పందించలేదు అని మనం ఖచ్చితంగా ఉన్నాము. బదులుగా, ఆయనను ఆరాధించు మనుష్యులు మరియు చెయ్యడానికి వారిని ఆయన కోరినవాటిని చేయువారి {యొక్క ప్రార్థనలకు} స్పందిస్తాడు. 32 అతడు పుట్టినప్పుడు గుడ్డిగా ఉన్నవాడు చూడడానికి ఒక మనిషిని ఒకడు సమర్ధుడిగా చెయ్యడం ఏ ఒక్కరూ ఎప్పుడైనా ఇంతకుముందు జరగలేదు! 33 ఈ మనుష్యుడు దేవుని నుండి రాకపోయిన యెడల, ఆయన {ఆ అద్భుతం వలే} ఒక్కటి కూడా చెయ్యగలిగే వాడు కాదు.!” 34 యూదు నాయకులు ఆయనకు జవాబిచ్చారు, "నీవు పూర్తిగా {నీ తల్లితండ్రుల} పాపముల యొక్క ఫలితముగా గుడ్డివాడిగా పుట్టావు! మాకు బోధించడానికి నీకు ఎంత ధైర్యం!” అప్పుడు వారు అతనిని యూదులు సమావేశ స్థలం నుండి బహిష్కరించారు. 35 ఆయన స్వస్థపరిచిన మనుష్యుని యూదు నాయకులు యూదుల సమావేశ స్థలం నుండి బహిష్కరించారు అని యేసు విన్నాడు. ఆయన {అతని కోసం వెదికాడు మరియు కనుగొని} నప్పుడు, ఆయన అతనిని అడిగాడు, "నీవు మనుష్యుని యొక్క కుమారునిలో విశ్వాసముంచుచున్నావా?” 36 ఆ మనుష్యుడు జవాబిచ్చాడు, "అయ్యా, ఆయన ఎవరు? {దయచేసి నాకు చెప్పండి,} తద్వారా నేను ఆయనలో విశ్వాసముంచుతాను.” 37 యేసు అతనితో చెప్పాడు, "నీవు ఆయనను ఇప్పటికే చూసావు. ఇప్పుడు నీతో మాట్లాడుచున్నవాడను నేనే ఆయనను.” 38 ఆ మనుష్యుడు చెప్పాడు, "ప్రభువా, {నీవు మనుష్యుని యొక్క కుమారుడవు అని} నేను నమ్ముచున్నాను.” అప్పుడు అతడు తన మోకాళ్ళ మీద వంగాడు మరియు ఆయనను ఆరాధించాడు. 39 యేసు చెప్పాడు, “నేను దాని ప్రజలకు తీర్పు తీర్చడానికి ఈ లోకములోనికి వచ్చాను. {ఫలితం} తాము దేవుని సత్యాన్ని గ్రహించలేదని గ్రహించిన వ్యక్తులు గుడ్డి వ్యక్తి చూడగలిగిన విధముగా దానిని గ్రహించేలా మారతారు. {మరో ఫలితం,} దేవుని సత్యాన్ని తాము గ్రహించినట్లు భావించే వ్యక్తులు దానిని చూసి అంధుడిగా మారినట్లు గ్రహించలేరు." 40 యేసుతో ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన ఇది చెప్పడం విన్నారు, వారు యేసును అడిగారు, “మేము కూడా గుడ్డివాళ్ళము వలే దేవుని సత్యంను గ్రహించలేము అని నీవు తలస్తున్నావా?” 41 యేసు జవాబిచ్చాడు, "మీరు ఆత్మీయంగా గుడ్డివారు అని గ్రహించిన యెడల, మీకు పాపం విషయంలో అపరాధులుగా ఉండరు. అయితే, ఎందుకంటే చూచుచున్న వారి వలే, దేవుని యొక్క సత్యాన్ని గ్రహించడానికి చెప్పుదురు, మీరు ఇంకనూ మీ పాపం విషయంలో అపరాధులుగా ఉన్నారు.

Chapter 10

1 “నేను మీతో సత్యము చెప్పుచున్నాను: గొర్రెల దొడ్డి గుమ్మం ద్వారా కాకుండా మరే ఇతర మార్గం ద్వారా అయినా గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించే వ్యక్తి ఒక దొంగ లేదా బందిపోటు {అతడు గొర్రెలను దొంగిలించడానికి వచ్చినవాడు}. 2 ద్వారము ద్వారా గొర్రెల దొడ్డిలోనికి ప్రవేశించే వ్యక్తి {గొర్రెలను గురించిన} శ్రద్ధ తీసుకొనే గొర్రెల కాపరి. 3 {గొర్రెల కాపరి దూరంగా ఉన్నప్పుడు} ద్వారమును కాపలా కాసే మనిషి {అతడు వచ్చినప్పుడు} కాపరి కోసం ద్వారాన్ని తెరుస్తాడు. గొర్రెలు కాపరి స్వరం యొక్క శబ్దాన్ని వింటాయి. అతడు తనకు చెందిన గొర్రెలను {ఒక్కొక్కదానిని} పేరు పెట్టి పిలుస్తాడు మరియు దొడ్డి లోనుండి వాటిని పెనం నుండి బయటకు నడిపిస్తాడు. 4 అతడు తనకు చెందిన వాటిని అన్నిటిని బయటికి తెచ్చిన తరువాత, అతడు వాటికి ముందు నడుస్తాడు. అతని గొర్రెలు {వెనుక నుండి} అతనిని వెంబడిస్తాయి ఎందుకంటే అతని స్వరము యొక్క శబ్దాన్ని అవి గుర్తుపడతాయి. 5 అతని గొర్రెలు అవి యెరుగని వానిని ఎన్నడూ అనుసరించవు, బదులుగా అవి అతని నుండి పారిపోతాయి ఎందుకంటే అవి యెరుగని మనుష్యుల యొక్క స్వరాలను అవి గుర్తించవు. 6 యేసు పరిసయ్యులకు {గొర్రెల కాపరుల యొక్క పని నుండి} ఈ ఉదాహరణను చెప్పాడు, అయినప్పటికి, ఆ ఉదాహరణ అర్థాన్ని వారు అర్థం చేసుకోలేదు. 7 కాబట్టి యేసు మరల వారితో మాట్లాడాడు, "నేను మీకు సత్యం చెప్పుచున్నాను: నేను గొర్రెలు దొడ్డి లోనికి ప్రవేశించే ద్వారమును. 8 నా ముందు {దేవుని యొక్క అధికారం లేకుండా} వచ్చిన నాయకులు అందరు దొంగలు మరియు దోచుకొనువారు. అయితే నిజమైన గొర్రెలు వారికి వారికి విధేయత చూపించ లేదు. 9 నేనే {పరలోకానికి} ఆ ద్వారమునై ఉన్నాను. నాలో నమ్మకముంచుట చేత ఆయన వద్దకు వచ్చు ఎవరినైనా దేవుడు {శాశ్వతమైన శిక్ష} నుండి రక్షిస్తాడు. {నాలో నమ్మకం ఉంచు ఎవరైనను} సురక్షితంగా చుట్టూ తిరుగుతూ మరియు ఆహారము కనుగొను గొర్రెల వలే ఉంటారు. 10 మీ నాయకులు దొంగలు వలే ఉన్నారు వారు కేవలం దొంగిలించడానికి, చంపడానికి, మరియు నాశనము చేయడానికి మాత్రమే వస్తారు. నేను గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది {పూర్తి ఆశీర్వాదములతో} నిండి ఉంటుంది. 11 నేనే మంచి గొర్రెల కాపరి వలె ఉన్నాను. మంచి గొర్రెల కాపరి తన గొఱ్ఱెలను {కాపాడడం మరియు రక్షించడం కోసం} చనిపోవుటకు ఇష్టపడుచు ఉన్నాడు, {మరియు ఆ విధంగా నేను నా గొర్రెల కోసం చనిపోవడానికి ఇష్టపడి ఉన్నాను}. 12 ఎవరైనా గొర్రెల కాపరి కాని వ్యక్తిని ఆ మనిషికి చెందని గొర్రెలను రక్షించడానికి నియమించుకున్నారు {అనుకుందాం}. తోడేలు {గొర్రెలను చంపడానికి} రావడం అతడు చూసినప్పుడు, అతను గొర్రెలను విడిచి పెడతాడు మరియు పారిపోతాడు, కాబట్టి తోడేలు వాటిలో కొన్నింటిని లాక్కొంటుంది మరియు మరికొన్ని చెల్లాచెదురు అయ్యేలా చేస్తుంది. 13 {అద్దెకు పెట్టుకొన్న పనివాడు పారిపోతాడు} ఎందుకంటే అతడు డబ్బు పొందడం కోసం {గొర్రెలను కాపాడడానికి మాత్రమే} ఉన్నాడు. అతడు గొర్రెలకు జరుగుతున్న దానిని గురించి అతడు పట్టించుకోడు. 14 నేనే, మంచి గొర్రెలకాపరి వలే ఉన్నాను. {తన గొర్రెలను యెరిగిన మరియు గొర్రెలు అతనిని యెరిగిన ఒక మంచి కాపరి వలే,} నాకు చెందినా వాటిని నేను ఎరుగుదును, మరియు అవి నన్ను ఎరుగును. 15 నా తండ్రి మరియు నేను ఒకరి నొకరు యెరిగిన విధముగా {మేము ఒకరినొకరం యెరుగుదుము} {నాకు చెందిన} ఆ గొర్రెల ప్రయోజనం కోసం చనిపోవడానికి నేను ఇష్టంగా ఉన్నాను. 16 నాకు చెందిన మరియు వేరే గొర్రెల దొడ్డి నుండి వచ్చిన గొర్రెలు కూడా ఉన్నాయి. { వారు యూదులు కాని వ్యక్తులు.} నేను వాటిని కూడా నా దగ్గరకు తీసుకురావాలి. నేను చెప్పేదానికి వారు ప్రతిస్పందిస్తారు, మరియు నాకు చెందినవి అన్నీ ఒకే మందలా ఏకంగా ఉంటారు, మరియు నేను వాటికి ఒకే కాపరిగా ఉంటాను. 17 నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎందుకంటే నన్ను నేను తిరిగి సజీవునిగా నేను చేసుకోవడం కోసం నేను ఇష్టపూర్వకంగా చనిపోవుదును. 18 చనిపోవడానికి ఏ ఒక్కరు నన్ను బలవంతం చెయ్యరు. బదులుగా చనిపోవడానికి నాకై నేనే ఎన్నుకొంటున్నాను. ఇష్టపూర్వకంగా చనిపోవడానికి నాకు అధికారం ఉంది మరియు నన్ను నేను తిరిగి సజీవునిగా చేసుకోడానికి నాకు అధికారం ఉంది. చెయ్యడానికి నా తండ్రి నన్ను ఆజ్ఞాపించిన కార్యము ఇదే.” 19 యూదు నాయకులు యేసు చెప్పిన దాని ప్రకారం {వ్యతిరేకించు గుంపులలోనికి} విభజించ బడ్డారు. 20 యూదు నాయకులలో అనేకులు చెప్పారు, “ఒక దయ్యం ఆయనను అదుపులో ఉంచుతుంది మరియు ఆయన వెర్రివాడు! ఆయన చెప్పునది వినవద్దు!” 21 ఇతర మనుష్యులు కొందరు చెప్పారు, "ఆయన చెప్పునది ఒక దయ్యం చేత అణచివేయబడిన ఒక మనుష్యుడు ఎప్పుడూ చెప్పేది కాదు. ఖచ్చితంగా ఒక గ్రుడ్డివాడు చూచేలా ఏ దయ్యం చెయ్యలేదు!" 22 అప్పుడు యెరూషలేములో ఆలయ ప్రతిష్ఠిత వేడుక చెయ్యడానికి పండుగ చోటు చేసుకోండి. 23 యేసు ఆలయ ప్రాంగణంలో సొలొమోను మంటపము అని పిలువబడే స్థలములో నడుచుచున్నాడు. 24 యూదు నాయకులు యేసు చుట్టూ చేరారు మరియు చెప్పారు, “నీవు ఎవరైయున్నావో దానిని గురించి ఎంతకాలం మమ్ములను ఆశ్చర్యములో ఉంచుతావు? నీవు మెస్సీయ అయిన యెడల, మాకు స్పష్టంగా చెప్పుము {తద్వారా మేము తెలుసుకొనగలము}.” 25 యేసు వారికి జవాబిచ్చాడు, “నేను మీకు చెప్పాను, అయితే మీరు ఇంకా నాలో నమ్మకం ఉంచలేదు. నా తండ్రి యొక్క అధికారం చేత నేను చేసే అద్భుతమైన క్రియలు నా గురించి మీరు తెలుసుకోవలసిన వాటిని మీకు చెపుతాయి. 26 అయితే, మనుష్యులైన మీరు నాలో ఇంకనూ నమ్మకం ఉంచలేదు, ఎందుకంటే మీరు నాకు చెందినవారు కారు. నా యొక్క మందలో భాగం కాని గొర్రెల వలే మీరు ఉన్నారు. 27 {వాటి గొఱ్ఱెల కాపరి యొక్క స్వరముకు లోబడే గొర్రెల వలే,} నా మనుష్యులు నేను చెప్పేవాటికి స్పందిస్తారు, నేను వారిని ఎరుగుదును, మరియు వారు నా శిష్యులు. 28 {పరలోకంలో దేవునితో} నిత్యము జీవించడానికి నేను వారిని సమర్ధులుగా చేస్తాను. ఎవరును ఎప్పటికీ వారిని నాశనం చేయలేరు, మరియు {ఎవరును ఎప్పటికి} వారిని నా నుండి తీసి వెయ్యలేరు. 29 నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు. ఆయన అందరికంటే గొప్పవాడు, మరియు ఆయన నుండి ఎవ‌రు వాటిని తీసుకొన లేరు. 30 నా తండ్రి మరియు నేను ఏక దేవుడై ఉన్నాము.” 31 ఆయన వైపు విసరడం కోసం మరియు ఆయనను చంపడానికి యూదు నాయకులు మరల రాళ్ళను ఎత్తారు. 32 యేసు వారితో చెప్పాడు, "చేయుటకు నాకు నా తండ్రి చెప్పిన అనేక అద్భుతమైన మంచి కార్యములు నేను చేయడం మీరు చూసారు. వాటిలో దేని కోసం మీరు నన్ను రాళ్ళతో కొట్టబోతున్నారు?” 33 యూదు నాయకులు జవాబిచ్చారు, "రాళ్ళతో మేము నిన్ను చంపడానికి మేము కోరుకోవడం లేదు ఎందుకంటే నీవు మంచి క్రియ చేసావు. బదులుగా, {మేము నిన్ను చంపడానికి కోరుతున్నాము} ఎందుకంటే నీవు కేవలం ఒక మనుష్యుడవు అయినప్పటికీ దేవునిగా ఉండడానికి చెప్పుకోవడం చేత నీవు దేవుణ్ణి దేవదూషణ చేస్తున్నావు!” 34 యేసు వారికి ప్రత్యుత్తరమిచ్చాడు, “‘మీరు దేవతలు అని నేను చెప్పాను’ అని దేవుడు చెప్పాడు అని పాత నిబంధనలో ఒక ప్రవక్త రాసాడు. 35 దేవుడు తాను ఎవరితో మాట్లాడాడో వారిని ‘దేవతలు’ అని పిలిచాడు కాబట్టి, మరియు ఆ లేఖనం తప్పు అని ఏ ఒక్కరు రుజువుపరచ లేరు, 36 నేను దేవుని యొక్క కుమారుడను అని నేను చెప్పాను కాబట్టి నేను దేవుణ్ణి దేవదూషణ చేస్తున్నాను అని మీరు ఎందుకు చెప్పుచున్నారు? నా తండ్రి {ఆయనకు చెంది యుండడానికి} నన్ను ప్రత్యేకంగా ఎన్నిక చేసుకొని మరియు ఈ లోకములోనికి పంపిన వాడిని నేనే, 37 చెయ్యడానికి నా తండ్రి నన్ను కోరుకొంటున్న అద్భుతమైన క్రియలు నేను చేయకపోయిన యెడల, అప్పుడు మీరు నన్ను నమ్మరు. 38 అయితే, నేను ఈ {అద్భుత} కార్యములు చేస్తున్నాను కాబట్టి, మీరు నన్ను నమ్మకపోయినప్పటికి ఈ కార్యములు {నా గురించి బయలు పరచుచున్న} {వాటిని} మీరు నమ్మాలి. నా తండ్రి మరియు నేను సంపూర్ణంగా ఐక్యమై ఉన్నాము అని నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోడానికి {మీరు దానిని చెయ్యాలి}. 39 ఎందుకంటే {ఆయన ఈ సంగతులు చెప్పాడు}, యూదు నాయకులు మరల యేసును బంధించడానికి ప్రయత్నించారు, అయితే ఆయన వారి నుండి వెళ్ళిపోయాడు. 40 అప్పుడు యొర్దాను నది యొక్క {తూర్పు వైపుకు} తిరిగి వెళ్ళాడు. బాప్తిస్మమిచ్చు యోహాను {తన యొక్క పరిచర్య} ప్రారంభములో మనుష్యులకు బాప్తీస్మమిచ్చు యోహాను బాప్తిస్మమిచ్చిన ప్రదేశానికి ఆయన వెళ్ళాడు. యేసు అక్కడ కొంత కాలం ఉన్నాడు. 41 అక్కడ అనేకులైన మనుష్యులు యేసు వద్దకు వచ్చారు. వారు చెప్పారు, బాప్తిస్మమిచ్చు యోహాను ఎన్నడూ అద్భుతమైన సూచక క్రియ చేయలేదు, అయితే ఈ మనుష్యుని గురించి యోహాను చెప్పినది అంతయు సత్యమే!” 42 అనేక మంది మనుష్యులు ఆ స్థలంలో ఆయనలో నమ్మకాన్ని ఉంచారు.

Chapter 11

1 లాజరు అను పేరుగల ఒక మనిషి చాలా జబ్బు పడ్డాడు. అతను బేతనియ యొక్క గ్రామంలో నివసించాడు, అక్కడ అతని అక్కలు మరియ మరియు మార్తా కూడా నివసించారు. 2 ఇదే మరియ తరువాత ఆమె ప్రభువు మీద పరిమళాన్ని పోసింది మరియు తన తలవెంట్రుకలతో ఆయన పాదాల {యొక్క నూనెను తుడిచింది}. ఆమె సోదరుడు లాజరు అనారోగ్యంతో ఉన్నాడు. 3 కాబట్టి ఇద్దరు సహోదరీలు లాజరు గురించి చెప్పడానికి యేసు వద్దకు ఒకరిని పంపారు; వారు చెప్పారు, “ప్రభువా, నీవు ప్రేమించేవాడు అనారోగ్యంతో ఉన్నాడు.” 4 యేసు లాజరు వ్యాధిని గురించి వినినప్పుడు, ఆయన చెప్పాడు, “ఈ వ్యాధి లాజరు యొక్క మరణంతో అంతం కాదు. బదులుగా ఈ వ్యాధి యొక్క ఉద్దేశం దేవుడు ఎంత గొప్పవాడో బయలుపరుస్తుంది. లాజరు రోగి అయ్యాడు తద్వారా ఈ వ్యాధి దేవుని యొక్క కుమారుడనైన నేను ఎంత గోప్పవాదినో బయలు పరుస్తుంది. 5 (యేసు మార్తను, ఆమె సహోదరి మరియను, మరియు లాజరును ప్రేమించాడు.) 6 కాబట్టి, లాజరు అనారోగ్యంతో ఉన్నాడు అని యేసు వినినప్పుడు, ఆయన ఉన్న చోట ఆయన రెండు రోజులు ఉద్దేశపూర్వకంగా నిలిచాడు. 7 అప్పుడు {ఆ రెండు రోజులు} తరువాత యేసు తన శిష్యులతో చెప్పాడు, “మనం యూదయ యొక్క ప్రాంతానికి తిరిగి వెళ్దాం.” 8 ఆయన శిష్యులు చెప్పారు, “బోధకుడా, {యూదయలో} యూదు నాయకులు ప్రస్తుతం నిన్ను రాళ్లతో చంపడానికి కోరుకుంటున్నారు! నువ్వు ఖచ్చితంగా అక్కడికి తిరిగి వెళ్ళకూడదు. 9 యేసు జవాబిచ్చాడు, "పగటి వెలుగు యొక్క పన్నెండు గంటలు ఉన్నాయి అని మీకు తెలుసు. పగటిపూట నడిచే వాడు సురక్షితంగా నడుస్తాడు. ఎందుకంటే అతడు ఎక్కడికి వెళుతున్నాడో చూడడానికి వెలుగు అతనిని అనుమతిస్తుంది. 10 అయితే, ఒక వ్యక్తి రాత్రి సమయంలో నడిచినప్పుడు, అతడు తొట్రుపడతాడు, ఎందుకంటే అతడు ఎక్కడికి వెళుతున్నాడో చూడడానికి అతనిని అనుఅతించడానికి వెలుగు లేదు. 11 ఈ సంగతులు చెప్పిన తరువాత, ఆయన వారితో చెప్పాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, అయితే నేను అతనిని మేల్కొలపడానికి అక్కడికి వెళ్తాను.” 12 కాబట్టి ఆయన శిష్యులు ఆయనతో చెప్పారు, "ప్రభువా, అతడు నిద్ర పోయిన యెడల, అతడు బాగుపడతాడు." 13 {యేసు నిజంగా లాజరు మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు, అయితే ఆయన నిజమైన నిద్ర గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని తలంచారు. 14 కాబట్టి ఆయన వారికి స్పష్టంగా చెప్పాడు, “లాజరు చనిపోయాడు.” 15 మరియు {అతడు చనిపోయినప్పుడు} నేను అక్కడ లేనందుకు నేను సంతోషిస్తున్నాను తద్వారా మీరు నాలో విశ్వాసం ఉంచుతారు. {ఇది} మీ ప్రయోజనం కోసం. ఇక్కడ నిలిచి యుండడం బదులుగా అతడు ఉన్న చోటికి మనం వెళ్దాం." 16 కాబట్టి వారు దిదుమ అని పిలిచిన తోమా, మిగిలిన శిష్యులతో చెప్పాడు, “మనం కూడా బోధకునితో వెళ్దాము తద్వారా మనం ఆయనతో చనిపోదాము.” 17 కాబట్టి వారు {బేతనియ యొక్క గ్రామంలో} యేసు వచ్చినప్పుడు, మనుష్యులు లాజరు చనిపోయిన దేహాన్ని అప్పటికి ముందు నాలుగు రోజులు సమాధిలో ఉంచారు అని ఆయన తెలుసుకొన్నాడు. 18 {యెరూషలేము బేతనియ యొక్క గ్రామం నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది.} 19 అనేక మంది యూదు మనుష్యులు {బేతనియలో} మార్త మరియ వద్దకు వారి సోదరుడు మరణం గురించి వారిద్దరిని ఓదార్చడం కోసం వచ్చారు. 20 యేసు వచ్చుచున్నాడు అని {ఒకరు చెప్పడం} మార్త వినినప్పుడు, ఆయనను కలవడానికి బయటికి వెళ్ళింది. మరియా {ఆమెతో వెళ్ళలేదు} అయితే ఇంటిలో ఉండిపోయింది. 21 మార్త యేసును కలుసుకొన్నప్పుడు, ఆమె ఆయనతో చెప్పింది, “ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు! 22 అయితే, ఇప్పుడు అయినను {అతడు చనిపోయాడు అని} చెయ్యడానికి నీవు దేవుణ్ణి ఏదైనా అడిగినా దేవుడు నీ కోసం దానిని ఇస్తాడని నేను ఖచ్చితంగా ఉన్నాను." 23 యేసు ఆమెతో చెప్పాడు, “నీ సహోదరుడు తిరిగి జీవిస్తాడు.” 24 మార్త ఆయనతో చెప్పింది, "దేవుడు చనిపోయిన వారందరినీ అంత్య దినమున {ఆయన ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చినప్పుడు} లేపునప్పుడు నా సహోదరుడు తిరిగి బ్రతుకుతాడు అని నేను నిశ్చయంగా ఉన్నాను.” 25 యేసు ఆమెతో చెప్పాడు, “నేను చనిపోయిన మనుష్యులు మరల జీవింప జేయువాడను. మనుష్యులకు జీవము నిచ్చువాడను నేనే. నాలో విశ్వాసం ముంచు వాడు ఎవరైనను, అతని శరీరం చనిపోయిననూ అతడు నిత్యము జీవించును. 26 నిత్య జీవం పొందే వారు అందరూ మరియు నాలో విశ్వాసం ఉంచేవారు ఖచ్చితంగా శాశ్వతం జీవిస్తారు. ఇది సత్యం అని నీవు విశ్వసించు చున్నావా?” 27 మార్త ఆయనతో చెప్పింది, “అవును ప్రభువా! నేను చేయుచున్నాను! నీవు మెస్సీయవు, దేవుని యొక్క కుమారుడవు అని నేను నమ్ముతున్నాను {నీవు} ఈ లోకం లోనికి వస్తాడని దేవుడు వాగ్దానం చేసిన వాడవు నీవు. 28 ఆమె దానిని చెప్పిన తరువాత, ఆమె {ఇంటికి} తిరిగి వచ్చింది మరియు తన సహోదరి మరియను రహస్యంగా పిలిపించింది. ఆమె మరియతో చెప్పింది, “బోధకుడు వచ్చాడు, మరియు ఆయన నిన్ను పిలిస్తున్నాడు.” 29 తన సోదరి చెప్పినది మరియ వినినప్పుడు, ఆమె త్వరగా పైకి లేచింది మరియు యేసును కలుసు కోడానికి బయటికి వెళ్ళింది. 30 (ఆ సమయంలో యేసు ఇంకా బేతనియ యొక్క గ్రామంలోనికి ప్రవేసించ లేదు. బదులుగా మార్త తనను కలిసిన స్థలం లోనే ఆయన ఉన్నాడు. 31 మరియను తన గృహంలో ఓదార్చుతూ ఉన్న యూదు మనుష్యులు ఆమె త్వరగా లేవడం మరియు బయటకు వెళ్లడం చూసారు. కాబట్టి వారు ఆమెను అనుసరించారు. ఆమె అక్కడ దుఃఖించడం కోసం {వారు లాజరును పాతిపెట్టిన} సమాధి వద్దకు వెళ్తున్నది అని ఆలోచించారు. 32 యేసు మార్తతో మాట్లాడిన స్థలము వద్దకు మరియ వచ్చి మరియు ఆయనను చూచినప్పుడు, ఆమె ఆయన పాదాల ముందు నేల మీద తనకు తాను కిందకు పడింది. ఆమె ఆయనతో చెప్పింది, “ప్రభువా, నువ్వు ఇక్కడ త్వరగా ఉన్న యెడల, నా సహోదరుడు చావకుండా ఉండేవాడు.” 33 ఆమె దుఃఖించడం మరియు తనతో ఉన్న యూదు మనుష్యులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన తీవ్రంగా కలవరపడ్డాడు. 34 ఆయన అడిగాడు, “అతని దేహాన్ని ఎక్కడ సమాధి చేసారు?” వారు ఆయనతో చెప్పారు, “ప్రభువా, {అతడు ఎక్కడ ఉన్నాడో} రమ్ము మరియు చూడు.” 35 35 యేసు ఏడ్వడం మొదలుపెట్టాడు. 36 కాబట్టి {మరియతో ఉన్న} యూదు మనుష్యులు తమ మధ్య తాము చెప్పారు, “చూడండి ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో!” 37 అయితే, వారి మధ్య ఇతరులు చెప్పారు, “ఆయన గుడ్డి మనిషి చూసేలా చేసాడు. అయితే ఈ మనిషి చనిపోకుండా ఉంచడానికి ఇతనికి సరిపడిన శక్తి లేదు!” 38 యేసు సమాధి వద్దకు వచ్చినప్పుడు తిరిగి భావోద్రేకంగా కలవర పడ్డాడు. {అది ఒక గుహ, మరియు దాని ద్వారం ఒక పెద్ద బండతో కప్పబడి ఉంది. 39 యేసు చెప్పాడు, “సమాధి ద్వారం నుండి రాయిని తొలగించండి.” {అయితే,} లాజరు సోదరి మార్త ఆయనకు చెప్పింది, “ప్రభువా ఈ సమయానికి అతని శరీరం కుళ్ళిన వాసన ఉంటుంది, ఎందుకంటే అతడు నాలుగు దినముల క్రితం చనిపోయాడు.” 40 యేసు ఆమెతో చెప్పాడు, "నీవు నన్ను విశ్వసించిన యెడల దేవుడు ఎంత గొప్పవాడో నీవు చూస్తావు చూస్తావు అని నేను ఖచ్చితంగా చెప్పాను!” 41 కాబట్టి కొందరు మనుష్యులు గుహ ద్వారం నుండి రాయిని తొలగించారు. యేసు ఆకాశం వైపు పైకి చూశాడు మరియు చెప్పాడు, "తండ్రీ, నీవు నా మాట వినడం కోసం నేను నిన్ను స్తుతిస్తున్నాను. 42 నీవు నా ప్రార్థన ఎల్లప్పుడూ వింటావు అని నాకు తెలుసు అయితే ఇక్కడ నిలబడి ఉన్న మనుష్యుల కోసం నేను దానిని చెప్పాను, తద్వారా నీవు నన్ను పంపావు అని వారు విశ్వాసం కలిగి ఉంటారు." 43 ఆయన ఆ ప్రార్థన చెప్పిన తరువాత, ఆయన బిగ్గరగా అరిచాడు, “లాజరూ, సమాదిలోనుంది బయటికి రా!” 44 చనిపోయిన మనిషి సమాధి నుండి బయటకు వచ్చాడు! {సమాధి కోసం అతనిని సిద్ధపరచిన మనుష్యులు} అతని కాళ్ళను మరియు అతని చేతులను వస్త్రం యొక్క ముక్కలతో చుట్టారు మరియు అతని ముఖం చుట్టూ ఒక వస్త్రాన్ని చుట్టారు. {కాబట్టి} యేసు అక్కడ నిలిచియున్న మనుష్యులతో చెప్పాడు, “అతనిని బంధించిన వస్త్రం యొక్క ముక్కలు తొలగించండి. అతనిని వెళ్ళనివ్వండి.” 45 దాని ఫలితంగా, మరియను ఆదరించడానికి వచ్చిన అనేక మంది యూదు మనుష్యులు మరియు యేసు చేసిన దానికి సాక్ష్యమిచ్చిన వారు ఆయనను విశ్వసించారు. 46 అయితే, అక్కడ మనుష్యులలో కొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు మరియు యేసు చేసిన దానిని వారికి చెప్పారు. 47 కాబట్టి పాలక యాజకులు మరియు పరిసయ్యులు యూదుల ఉన్నత సభ యొక్క సభ్యులను ఒకచోటికి చేర్చారు. వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, "ఈ మనిషి గురించి మనము ఏమి చెయ్యబోతున్నాము? ఆయన అనేక అద్భుతమైన సూచక క్రియలు చేస్తున్నాడు. 48 ఈ అద్భుతాలను చెయ్యడం చేస్తూ ఉండడానికి మనం అతనిని అనుమతించిన యెడల, ప్రతి ఒక్కరు ఆయనలో నమ్మకం ఉంచుతారు {మరియు ఆయనను తమకు రాజుగా చేస్తారు}. అప్పుడు రోమా సైన్యం వస్తుంది మరియు మన దేవాలయాన్నీ మరియు మన దేశాన్నీ రెండింటినీ నాశనం చేస్తుంది!" 49 ఈ సభలో ఒక సభ్యుడు కయప. అతడు ఆ సంవత్సరములో ప్రధాన యాజకుడు. అతడు వారితో అన్నాడు, "మీకు అందరికి ఏమీ తెలియదు! 50 రోమనులు యూదు మనుష్యులు అందరిని చంపనీయడం కంటే మనుష్యుల పక్షంగా మీ కోసం ఒక్క మనిషి చనిపోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది అని మీరు గ్రహించ లేదు.” 51 కయప దీనిని చెప్పలేదు ఎందుకంటే అతడు తనకు తాను దీనిని ఆలోచించాడు, బదులుగా అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, యేసు యూదు మనుష్యుల పక్షంగా చనిపోతాడు అని అతడు ప్రవచించాడు. 52 {యేసు కేవలం యూదు మనుష్యుల కోసం మాత్రమే కాదు, అయితే లోకం అంతటా దేవుడు చెదరగొట్టిన దేవుని యొక్క పిల్లలు అందరినీ ఒక్క ప్రజలోనికి సమకూర్చడానికి చనిపోతాడు అని కూడా అతడు ప్రవచించాడు. 53 కాబట్టి కయప ప్రవచించిన ఆ రోజు నుండి, యేసును చంపడానికి యూదు సభ ప్రణాళికలు చేసింది. 54 ఆ కారణంగా, యేసు ఇక మీదట తన యూదు ప్రత్యర్థుల మధ్య బహిరంగంగా ప్రయాణించలేదు. బదులుగా, ఆయన యెరూషలేమును విడిచిపెట్టాడు మరియు తన శిష్యులతో నిర్మానుష్యమైన ఎడారి ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎఫ్రాయిము అని పిలువబడిన ఒక పట్టణానికి వెళ్లాడు. అక్కడ ఆయన {కొంతకాలం} తన శిష్యులతో ఉన్నాడు. 55 ఆ సమయంలో యూదుల పస్కా పండుగ వేడుక కోసం దాదాపు సమయం వచ్చింది. అనేక మంది మనుష్యులు ఆ ప్రాంతం నుండి యెరూషలేము వరకు వెళ్లారు. {వేడుకకు హాజరవ్వడం కోసం యూదుల యొక్క నియమాల ప్రకారం} వారు తమ్మును తాము శుద్ధి చేసుకోడానికి పస్కా పండుగ వేడుక ఆరంభానికి ముందు వచ్చారు. 56 {పస్కా పండుగ వేడుక కోసం యెరూషలేముకు వచ్చిన} మనుష్యులు యేసు కోసం వెదకుచున్నారు. వారు వచ్చి మరియు దేవాలయం {ఆవరణ} లో నిలబడినప్పుడు, వారు ఒకరి నొకరు అడుగుతూ ఉన్నారు, "మీరు ఏమి తలస్తున్నారు?" ఆయన పస్కా పండుగకు ఖచ్చితంగా రాడు!” 57 {కొంత సమయం ముందు} యూదుల పాలక యాజకులు మరియు పరిసయ్యులు యేసు ఎక్కడున్నాడో ఎవరైనా కనుగొన్న యెడల, వారు దానిని తమకు తెలియ పరచాలి అని ఒక ఆజ్ఞ చేశారు, తద్వారా వారు ఆయనను బంధిస్తారు.

Chapter 12

1 యూదుల పస్కా పండుగ ప్రారంభానికి ఆరు రోజుల ముందు యేసు బేతనియ యొక్క గ్రామానికి వచ్చాడు. {బేతనియ ఒక గ్రామము} ఇక్కడ లాజరు నివసించాడు. చనిపోయిన ఈ మనిషినే అతడు చనిపోయిన తరువాత యేసు తిరిగి బ్రతికించాడు. 2 అక్కడ బేతనియలో, యేసు యొక్క కొంతమంది స్నేహితులు యేసును ఘనపరచుటకు విందు-భోజనం ఏర్పరచారు. మార్త అతిధులకు భోజనం వడ్డించినది, మరియు లాజరు యేసుతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్నవారిలో ఉన్నాడు. 3 అప్పుడు మరియ దాదాపు అర లీటరు మిక్కిలి ఖరీదైన పరిమళ ద్రవ్యం ఉన్న ఒక సీసా తీసుకుంది, అది జటామాంసి మొక్కల నుండి తీయబడిన శుద్ధమైన తైలము, మరియు ఆమె దానిని యేసు యొక్క పాదముల పైన పోసినది మరియు తరువాత ఆమె తలవెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. పరిమళంతైలము యొక్క ఇంపైన సువాసన ఇల్లు అంతా నిండినది. 4 అయితే, ఇస్కరియోతు యూదా {అభ్యంతరపరచాడు}. (అతడు యేసు యొక్క శిష్యులలో ఒకడు, త్వరలో అతడు యేసును పట్టుకొనుటకు యూదుల నాయకులకు సహాయము చేయనున్నాడు.) అతను అన్నాడు, 5 "మనము ఈ పరిమళ తైలమును ఒక పురుషుడు మూడు వందల రోజుల యొక్క పనికి సంపాదించే డబ్బుకు అమ్మి ఉండాల్సింది. అప్పుడు ఆ డబ్బును పేదలకు మనము ఇచ్చి ఉండేవాళ్ళం." 6 (యూదా అతడు పేదవారి గురించి శ్రద్ధచూపాడు కాబట్టి ఇలా చెప్ప లేదు. {అతడు ఇది చెప్పాడు} ఎందుకంటే అతడు ఒక దొంగ. అతడు వారి డబ్బుని ఉంచే సంచికి బాధ్యతగా ఉంచబడ్డాడు, అయితే ప్రజలు అతనికి ఆ సంచిలో వేయమని ఇచ్చిన డబ్బును అతడు దొంగిలించేవాడు.) 7 అప్పుడు యేసు చెప్పాడు, “ఆమెను ఒంటరిగా వదిలిపెట్టండి! నేను చనిపోయి మరియు సమాధి చేయబడు సమయము కోసం నన్ను సిద్దపరచుటకు దానిని ఉంచునట్లు ఆమె ఆ పరిమళాన్ని బద్రపరచినది. 8 {ఆమె సరైన పని చేసినది} ఎందుకంటే పేదవారు ఎప్పుడూ మీ మధ్యనే ఉంటారు {వారికి మీరు సహాయం చేయవచ్చు}, కాని నేను మీతో ఎక్కువ కాలము ఉండను.” 9 యేసు బేతనియలో ఉన్నాడు అని ఒక పెద్ద యూదుల సమూహం విన్నారు, కాబట్టి వారు అక్కడికి వెళ్ళారు. యేసు అక్కడ ఉన్నాడు అని మాత్రమే {వారు రావడం} కాదు, కాని ఎందుకంటే వారు లాజరును చూడడాలని కూడా వచ్చారు. యేసు అతడు చనిపోయిన తరువాత తిరిగి సజీవంగా లేపిన మనుష్యుడు ఇతడే. 10 దీనికి వ్యత్యాసంగా, పరిపాలించుచున్న యాజకులు లాజరును అదే రీతిగా యేసును కూడా చంపుటకు కుట్రలు పన్నారు. 11 {పరిపాలించుచున్న యాజకులు లాజరును చంపాలి అనుకున్నారు} ఎందుకంటే, అతని కారణముగా యూదులలో అనేకులు వారు బోధించుచున్న వాటిని ఇక మీదట విశ్వసించడం లేదు మరియు బదులుగా వారు యేసులో నమ్మిక ఉంచుతున్నారు. 12 మరుసటి రోజు పస్కా పండుగ వేడుక చేసుకొనుటకు {యేరుషలేముకు} వచ్చిన పెద్ద జనుల యొక్క సమూహము యేసు అక్కడకి తన మార్గములో ఉన్నాడు అని తెలుసుకున్నారు. 13 కాబట్టి వారు ఈత చెట్ల కొమ్మలను నరికారు మరియు {ఆయన పట్టణము లోపలికి వచ్చి యుండగా} ఆయనను స్వాగతించుటకు బయట త్రోవమీదకు వెళ్లారు. వారు అరుస్తున్నారు “దయచేసి మమ్మును రక్షించు! తన అదికారముతో వచ్చుచున్న వానిని దేవుడు ఆశీర్వదించును గాక. ఆ వ్యక్తి ఇశ్రాయేలు యొక్క రాజు!” 14 యేసు యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ఒక చిన్న గాడిదను కనుగొన్నాడు మరియు దాని మీద {పట్టణము లోనికి స్వారి చేసి వెళ్ళుటకు} కూర్చున్నాడు.{ఇలా చేయుట ద్వారా} లేఖనంలో కొందరు ప్రవక్తలు వ్రాసిన దానిని ఆయన నెరవేర్చాడు: 15 "యెరూషలేములో నివసించే వారైన మీరు భయపడ వద్దు. ఇదిగో, మీ రాజు వచ్చుచున్నాడు. ఆయన ఒక గాడిద పిల్ల మీద స్వారీ చేస్తున్నాడు!" 16 ఈ సంఘటనలు సంభవించినప్పుడు, ఇవి ఆ ప్రవక్తలు వ్రాసిన వాటి యొక్క నెరవేర్పు అని ఆయన శిష్యులు అర్థం చేసుకోలేదు. అయితే, దేవుడు యేసును {తిరిగి జీవమునకు తెచ్చుట ద్వారా} మహిమపరచిన తరువాత, వారు ఆయనను గూర్చి ప్రవక్తలు వేటిని వ్రాసిరో మరియు ఆయన పట్ల ప్రజలు చేసిన ఆ సంఘటనలను జ్ఞాపకము చేసుకొన్నారు. 17 యేసుతో పాటు అనుసరిస్తున్న జనుల యొక్క సమూహము లాజరును సమాధి నుండి యేసు బయటికి పిలుచుట వారు చూసారు అని మరియు అతడు చనిపోయిన తరువాత అతనిని యేసు తిరిగి సజీవునిగా చేయుట చూసారు అని ఇతరులకు చెపుతూ ఉన్నారు. 18 మరొక జనుల యొక్క సమూహము, యేసును కలవడానికి నగర ద్వారం నుండి బయటకు వెళ్ళింది.{వారు ఆ విధంగా చేసారు} ఎందుకంటే {లాజరును మరలా బ్రతికించుట} అను అద్బుతమైన సూచక క్రియ ఆయన చేసాడు అని వారు విన్నారు. 19 కాబట్టి పరిసయ్యులు ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, “చూడండి! మనము ఆయనను అపుటలో విఫలులమవుతున్నాము. చూడండి! ప్రతిఒక్కరు ఆయన శిష్యులు అవుతున్నారు." 20 పస్కాపండుగ వేడుకలో దేవుణ్ణి ఆరాధించడానికి {యెరూషలేముకు} వెళ్లిన జనము మధ్య యూదులు కాని వారు కొంత మంది ఉన్నారు. 21 వారు ఫిలిప్పు దగ్గరకు వచ్చారు, అతడు బెత్సయిదా యొక్క నగరం నుండి వచ్చినవాడు, అది గలిలయ యొక్క ప్రాంతంలో ఉన్నది. వారు అతనిని అడిగారు, “అయ్యా, నీవు మాకు యేసును పరిచయం చేస్తావా?" 22 అప్పుడు ఫిలిప్పు దీనిని అంద్రెయకు తెలియజేసాడు, మరియు వారు ఇద్దరు వెళ్లారు మరియు యేసుకు {గ్రేకీయుల గురించి} చెప్పారు. 23 యేసు ఫిలిప్పు మరియు అంద్రెయకు జవాబిచ్చాడు, "నేను, మనుష్యుని యొక్క కుమారుడు, ఎంత గొప్పవాడని ప్రతివొక్కరికి చూపుటకు ఇప్పుడు ఇది దేవునికి సమయం. 24 నేను మీకు సత్యమును చెప్పుచున్నాను: {నా జీవితము ఒక విత్తనము లాంటిది.} గోధుమ యొక్క విత్తనము భూమిలో నాటబడి మరియు చనిపోక పోతే, అది ఒక్క విత్తనంగా మాత్రమేయుంటుంది; కాని అది భూమిలో చనిపోతే, అప్పుడు అది పెరుగుతుంది మరియు అధికమైన గోధుమలను ఉత్పన్నం చేస్తుంది. 25 ఎవరైనా {నా శిష్యునిగా ఉండుట} కంటే ఎక్కువగా జీవిస్తూ కొనసాగాలి అని కోరుకుంటే వారు మరణిస్తారు, కాని ఈ పాపపు లోకములో ఎవరైనా జీవిస్తూ ఉండాలని కోరుకునే దానికన్నా నా శిష్యునిగా ఉండాలని కోరుకుంటే వారు తన ప్రాణాన్ని శాశ్వతంగా నిలుపుకుంటాడు. 26 ఎవరైనా నాకు సేవ చేయాలని కోరిన యెడల, అతడు నాకు శిష్యుడిగా ఉండాలి. నా సేవకుడు {పరలోకములో} నాతో ఉంటాడు. నన్ను సేవించే ఎవరినైనా నా తండ్రి ఘనపరుస్తాడు. 27 ఈ సమయంలో నేను చాలా కలవరంగా భావిస్తున్నాను. నేను ఖచ్చితంగా చెప్పకూడదు, ‘తండ్రీ {నేను శ్రమపడి మరియు మరియు చనిపోయినప్పుడు} ఈ సమయం నుండి నన్ను తప్పించు!’ కాదు {నేను దానిని చేయను} ఎందుకంటే ఈ కారణం కోసమే {నేను శ్రమపడి మరియు చనిపోయినప్పుడు} నేను ఈ సమయం వరకు జీవించాను 28 తండ్రీ, నీవు ఎంత గొప్ప వాడవో కనుపరచు! అప్పుడు దేవుడు పరలోకము నుండి మాట్లాడాడు, “నేను ఎంత గొప్ప వాడనో ఇప్పటకే కనుపరచాను; నేను మరలా దానిని చేస్తాను! 29 అక్కడ ఉన్న జనము యొక్క సమూహము వారు కూడా దేవుని యొక్క స్వరము విన్నారు. వారిలో కొందరు ఇది కేవలం ఉరుము యొక్క శబ్దము అని చెప్పారు. మరి కొంతమంది జనులు ఒక దేవదూత యేసుతో మాట్లాడాడు అని అన్నారు. 30 యేసు వారికి జవాబిచ్చాడు, "మీరు వినిన స్వరము అది దేవుని యొక్క స్వరము. నా ప్రయోజనం కొరకు {ఆయన మాట్లాడలేదు} అయితే, మీ కోసం! 31 ఇప్పుడు ఈ లోకములో ఉన్న మనుష్యులకు తీర్పుతీర్చుటకు దేవుని ఇప్పుడు సమయం. ఇప్పుడు ఈ లోకాన్ని పరిపాలించుచున్న {సాతానును} ఆయన బయటకు త్రోసి వేసే సమయం ఇది. 32 నా విషయమైతే, మనుష్యులు నన్ను {సిలువ మీద} పైకి ఎత్తినప్పుడు, నేను ప్రతి ఒక్కరు నా వైపుకు వచ్చునట్లు చేస్తాను. 33 (ఆయన ఏ విధముగా త్వరలో చనిపోతాడో మనుష్యులకు తెలియనివ్వడానికి దీనిని ఆయన చెప్పాడు). 34 మనుష్యుల యొక్క సమూహము అప్పుడు ఆయనకు బదులిచ్చారు, “మెస్సీయ శాశ్వతకాలం జీవిస్తాడు అని లేఖనాల నుండి మేము తెలుసుకున్నాము. అయితే మనుష్యుని యొక్క కుమారుడు {మరణించడానికి సిలువపై} పైకేత్తబదతాడని అని నీవు ఎందుకు చెప్పుచున్నావు? నీవు మాట్లాడుతున్న ఈ మనుష్యుని యొక్క కుమారుడు ఎవరు?” 35 యేసు వారోతో అన్నాడు, "నేను వెలుగై యున్నాను {అది దేవుని యొక్క సత్యమును మరియు మంచితనమును బయలు పరచుచున్నది}. నేను కొద్ది కాలం మాత్రమే మీతో ఉంటాను. నేను ఇంకా ఇక్కడ ఉన్నప్పుడే అంధకారము {అనగా పాపము మరియు దుష్టత్వము} మిమ్ములను నియంత్రించకుండా అదువు చేయునట్లు నా మాధిరి ప్రకారము జీవించండి. పాపయుక్తముగా జీవించు వారు, వారు ఎక్కడికి వెళ్లుతున్నారో తెలియకుండా అంధకారములో అటుయిటు తిరుగులాడు జనుల వలే ఉన్నారు, 36 నేను మీతో ఇంకా ఉండగానే {దేవుని యొక్క సత్యము మరియు మంచితనము బయలుపరచు} వెలుగునైన, నాలో నమ్మక ఉంచండి; దేవుని యొక్క మనుష్యులుగా, {ఆయన యొక్క సత్యము మరియు మంచితనమును తెలుసుకున్న వారిగా} ఉండు నిమిత్తము {దీనిని చేయండి}. “ఆయన ఆ విషయములను చెప్పిన తరువాత, యేసు వారిని విడిచి పెట్టాడు మరియు మనుష్యుల నుండి తనకు తాను దాచుకొనెను.” 37 యేసు అనేక అద్భుతమైన సూచకక్రియలు మనుష్యుల యెదుట చేసినప్పటికీ, వారిలో అనేక మంది ఆయనలో నమ్మిక ఉంచలేదు. 38 యెషయా ప్రవక్త {చాలా కాలం క్రితం} వ్రాసిన దాని సత్యం నేరవేర్చబడుటకు వారి యొక్క అవిశ్వాసము చోటు చేసుకుంది: "ప్రభువా, మేము చెప్పినది ఎవరునూ విశ్వసించలేదు! ఎవరునూ ప్రభువు బయలుపరచిన శక్తిని చూడలేదన్నట్లు {అగపడుతున్నది}. 39 యెషయా వ్రాసిన ఈ కారణమును బట్టి వారు యేసునందు నమ్మకం ఉంచ లేక పోయారు: 40 "ప్రభువు వారు చూచునది వారు గ్రహింపలేకుండునట్లు వారిని చేసాడు, మరియు ఆయన వారిని మొండివారిగా చేసాడు; వారు చూచు వాటిని గ్రహింపకున్డునట్లును, మరియు నిజముగా అర్ధము చేసుకొనకుండునట్లును, మరియు పాపను నుండి దేవుని వైపు తిరగకుండునట్లును, మరియు నేను వారిని క్షమించకుండు నట్టులును{ఆయన ఇలాగు చేసెను}. 41 యెషయా {చాలా కాలం క్రితం} దానిని వ్రాశాడు, ఎందుకంటే ఆతడు యేసు ఎంత గొప్పవాడో చూశాడు మరియు ఆయనను గూర్చి మాట్లాడాడు. 42 ఇది వాస్తవం అయినప్పటికీ, యూదుల ఉన్నతమైన పాలనా సభ యొక్క అనేక సభ్యులు యేసులో నమ్మిక ఉంచారు. అయినప్పటికీ, వారు {వారు యేసునందు నమ్మిక ఉంచారని} ఇతరులతో చెప్పలేదు, ఎందుకంటే పరిసయ్యులు వారిని యూదుల సభా స్థలం నుండి నిషేదిస్తారని వారు భయపడ్డారు. 43 {వారు దీనికి భయపడ్డారు} ఎందుకంటే వారు వారిని దేవుడు ఘనపరచడానికి బదులుగా ఇతర మనుష్యుల ఘనతను వారు ఎంచుకొన్నారు. 44 యేసు {మనుష్యుల యొక్క సమూహముతో} గట్టిగా చెప్పాడు, "నన్ను నమ్ము వారు ఎవరో వారు నన్ను నమ్మడం మాత్రమే కాదు గాని నన్ను పంపిన వాడైన {నా తండ్రిని నమ్ముచున్నారు} కూడా. 45 నన్ను చూచుచున్న వారు, నన్ను పంపిన వాడైన నా తండ్రిని కూడా చూచుచున్నారు. 46 నేను ఈ లోకములో ప్రతిఒక్కరికి {దేవుని యొక్క సత్యమును మరియు మంచితనమును బయలుపరచుటకు} ఒక వెలుగు వలే వచ్చాను తద్వారా నాలో నమ్మిక యుంచు వారెవరైనా చీకటిలో {అనగా పాపములో మరియు దుష్టత్వములో} ఉండకుండా ఉంటారు. 47 నా బోధనలు వినుచూ కూడా వాటిని తిరస్కరించుచు అయితే వాటిని విధేయత చూపించడానికి నిరాకరించు వారెవరినైనా నేను ఖండించను, ఎందుకనగా లోకములో ఉన్న మనుష్యులను ఖండించుటకు నేను ఈ లోకమునకు రాలేదు. బదులుగా, నేను ఈ లోకములోకి వారిని {తమ యొక్క పాపముల నిమిత్తము శిక్షించబడుట నుండి} రక్షించడానికి వచ్చాను. 48 ఎవరైనా నన్ను తృణీకరించి మరియు నా బోధనలు అంగీకరించక {మరియు విధేయత చూపక} ఉండువాడు నేను చెప్పిన ఆ బోధనల ఆధారముగా తీర్పుతీర్చ బడతారు. ఆ అంత్య దినమున {దేవుడు ప్రతిఒక్కరిని తీర్పు తీర్చునప్పుడు} దేవుడు ఆ వ్యక్తిని నా బోధనల యొక్క ఆధారముగా తీర్పు తీర్చుతాడు. 49 {ఇది ఇలా జరుగుతుంది} ఎందుకంటే నేను నా సొంత అధికారముతో మాట్లాడలేదు. బదులుగా, నన్ను పంపినవాడైన నా తండ్రియే నేను దేనిని మాట్లాడాలో మరియు నేను దేనిని ఎలా చెప్పాలో అన్నదాని గూర్చి నాకు ఆజ్ఞాపించాడు. 50 నా తండ్రి నాకు ఏమని చెప్పమని ఆజ్ఞాపించాడో వాటిని మనుష్యులు శాశ్వతకాలం {పరలోకములో} జీవించుటకు ఖచ్చితంగా విశ్వసించాలి అనే దాని గురించి నేను నిశ్చయముగా ఉన్నాను. కాబట్టి నా తండ్రి ఏమి చెప్పాలని నాకు చెప్పాడో దానినే నేను చెపుతున్నాను.

Chapter 13

1 పస్కా పండుగ వేడుక ప్రారంభమవడానికి ముందు రోజున, యేసు ఈ లోకాన్ని విడిచి పెట్టడానికి మరియు తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లాలని తనకు ఇది సమయం అని యేసుకు తెలుసు. ఆయనఈ లోకంలో ఆయనతో ఉన్నవారైన తన శిష్యులను ఎప్పుడూ ప్రేమించాడు, మరియు ఆయన ఉంతము వరకు వారిని ప్రేమించాడు. 2 యేసు మరియు ఆయన శిష్యులు సాయంత్ర భోజనం చేస్తున్నప్పుడు, సాతాను అప్పటికే సీమోను ఇస్కరియోతు యొక్క కుమారుడైన యూదాను అతడు యూదుల నాయకులకు యేసును బంధించుటకు సహాయము చేయవలెనన్న ఆలోచన కలుగజేసెను. 3 తన తండ్రి తనకు అన్నిటి మీద సంపూర్ణ శక్తి మరియు అధికారము ఇచ్చాడు అని యేసు యెరిగియున్నాడు, మరియు ఆయన దేవుని యొద్దనుండి వచ్చాడని మరియు త్వరలో దేవుని వద్దకు వెళ్తాడు అని కూడా ఆయనకు తెలుసు. 4 {ఆయన అ విషయాలు యెరిగియున్నాడు గనుక} యేసు వారు సాయంకాలము భోజనం చేయుచున్న బల్ల దగ్గర నుండి పైకి లేచాడు, తన పై వస్త్రమును తీసివేశాడు, మరియు ఒక తువ్వాలు తన నడుము చుట్టూ చుట్టుకున్నాడు. 5 ఆయన ఒక పెద్ద గిన్నెలో కొంత నీళ్లు పోసాడు మరియు తన శిష్యుల యొక్క పాదములను కడగడము మరియు తన నడుము చుట్టూ చుట్టుకున్న తువ్వాలుతో వాటిని పొడిగా తుడవడం ప్రారంభించాడు. 6 ఆయన సీమోను పేతురు వద్దకు {అతని కాళ్ళను కడగడానికి} వచ్చినప్పుడు, పేతురు ఆయనతో చెప్పాడు, “ ప్రభువా, నీవు నా పాదములను కడగ కూడదు!” 7 యేసు అతనికి జవాబిచ్చాడు, “నేను ఇప్పుడు నీకు నేను ఏమి చేయుచున్నానో నీకు అర్ధం కాదు, అయితే తరవాత నీవు అర్ధం చేసుకుంటావు.” 8 పేతురు చెప్పాడు, “నీవు ఖచ్చితంగా ఎన్నడూ నా కాళ్ళను కడుగకూడదు!” యేసు అతనికి జవాబిచ్చాడు, “నేను నిన్ను కడుగకుంటే, అప్పుడు నీవు దేవుని యొక్క ఆశీర్వాదములు నాతో పాటు స్వతంత్రించుకోవు.” 9 సీమోను పేతురు ఆయనతో అన్నాడు, "ప్రభువా, నా పాదములు కడగడం మాత్రమే కాదు! నా చేతులను మరియు నా తలను కూడా కడుగు!” 10 యేసు అతనితో అన్నాడు, “ఎవరైనా ఒకరిని కడిగినప్పుడు తన పాదములు మాత్రమే కడుగుకోడానికి అవసరం ఉంది. మిగిలిన అతని యొక్క శరీరం అంతా శుభ్రముగా ఉన్నది. శిష్యులైన మీరు పవిత్రులుగా ఉన్నారు, అయితే {మీలో అందరూ పవిత్రులు} కాదు." 11 ({యేసు ఆత్మీయముగా పవిత్రులుగా ఉండుటను గూర్చి ఇది చెప్పాడు} ఎందుకంటే యూదుల నాయకుల ఆయనను పట్టుకొనుటకు సహాయము చేయబోవు వారెవరో ఆయన ఎరిగియుండెను.ఆ కారణాన్ని బట్టి {మీలో అందరు పవిత్రులు కాదు.” అని ఆయన చెప్పాడు.) 12 ఆయన వారి పాదములు కడగడం ముగించిన తరువాత, ఆయన తన పై వస్త్రాన్ని తిరిగి ధరించుకున్నాడు. తరువాత ఆయన మరలాఆ బల్ల యొద్ద క్రింద కూర్చున్నాడు మరియు వారితో అన్నాడు, “ నేను మీకు ఇప్పుడే ఏమి చేశానో దానిని మీరు అర్ధం చేసుకోవాలి!” 13 మీరు నన్ను ‘బోధకుడు’ మరియు ‘ప్రభువు’ అని సరిగ్గా పిలుస్తున్నారు, ఎందుకంటే అది నేనై యున్నాను. 14 మీ బోధకుడను మరియు ప్రభువును, అయున్న నేను పాదములు కడుగుట ద్వారా వినయంగా సేవచేసి యున్నాను గనుక, మీరు కూడా ఒకరి యొక్క పాదములో ఒకరు వినయంగా కడుగుట ద్వారా సేవ చేయాలి. 15 {మీ పాదములు కడుగుట ద్వారా} నేను మీరు అనుసరించుటకు ఒక మాదిరిని ఇచ్చియున్నాను తద్వారా నేను మీకు {వినయంగా} సేవచేసిన రీతిగా మీరును {ఒకరినొకరు వినయంగా సేవ} చేయాలి. 16 నేను మీకు సత్యము చెప్పుచున్నాను: ఒక సేవకుడు తన యజమాని కంటే ఎక్కువ ప్రముఖుడు కాదు అన్నట్లుగా, లేదా ఒక సందేశకుడూ తనను పంపిన వ్యక్తి కంటే ఎక్కువ ప్రముఖుడు కాదు అన్నట్లు, {మీరు నాకంటే ఎక్కువ ప్రముఖులు కాదు}. 17 {మీరు ఒకరినొకరు వినయంగా సేవ చేసుకోవాలి అని} మీకు ఇప్పుడు తెలుసు గనుక, మీరు ఆలాగు చేసినయెడల దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. 18 మీరు అందరు ఆశీర్వదించబడతారు అని నేను చెప్పటలేదు. నేను {నా శిష్యులుగా ఉండుటకు} నేను ఏర్పరచుకున్న వారైన మనుష్యులను నేను బాగుగా ఎరుగుదును. అయితే, జరుగబోతున్నది తప్పక జరగవలసి ఉంది తద్వారా లేఖనములో ఒక ప్రవక్త వ్రాసినది నేరవేర్చబడుతుంది: నాతో ఒక స్నేహితునిగా భోజనం పంచుకున్న వాడు నన్ను వ్యతిరేకించాడు.” 19 ఇది జరిగినప్పుడు, నేనే {దేవుడిని} అని మీరు విశ్వసించటానికి, అది జరగడానికి ముందు ఏమి జరుగుతుందో ఇప్పటి నుండి నేను మీకు చెప్పుచున్నాను. 20 నేను మీకు సత్యము చెప్పుచున్నాను: నేను పంపించిన వ్యక్తిని ఎవరైతే స్వీకరిస్తారో వారు నన్ను కూడా స్వీకరిస్తారు; మరియు ఎవరైతే నన్ను స్వీకరిస్తారో నన్ను పంపిన వాడైన నా తండ్రిని కూడా స్వీకరిస్తారు.” 21 యేసు దీనిని చెప్పిన తరువాత, ఆయన తనలో తాను కలవరపడినట్లు బావించాడు. ఆయన గంభీరంగా ప్రకటించాడు, “నేను మీకు సత్యము చెప్పుచున్నాను: మీలో ఒకడు నన్ను {నా శత్రువులకు} అప్పగించబోతున్నాడు.” 22 ఆయన శిష్యులు ఒకరి వైపు ఒకరు చూసుకొనుచూ ఉన్నారు మరియు వారిలో ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని వారు ఆశ్చర్యపోయారు. 23 అయన శిష్యులలో ఒకడు, యేసు ప్రేమించిన {యోహాను}, ఆ బల్ల వద్ద యేసు ప్రక్కన కూర్చొని ఉన్నాడు. 24 యేసు ఏ శిష్యుడి గురించి ఆయన మాట్లాడుతున్నాడో అడుగు అని అతనికి సూచించదానికి సీమోను పేతురు సైగ చేశాడు. 25 కాబట్టి యోహాను యేసుకు ఎదురుగా వెనుకకు వంగాడు మరియు నెమ్మదిగా ఆయనను అడిగాడు. “ప్రభువా ఏ వ్యక్తి నిన్ను అప్పగించనైయున్నది, ఎవరు?” 26 యేసు జవాబిచ్చాడు, “నేను గిన్నెలో రొట్టె యొక్క ముక్కను ముంచిన తరువాత నేను దానిని ఎవరికీ ఇస్తానో అది అతడే.” అప్పుడు ఆయన రొట్టెను గిన్నెలో ముంచాడు మరియు సీమోను ఇస్కరియోతు యొక్క కుమారుడు యూదాకు దానిని ఇచ్చాడు. 27 రొట్టె యొక్క ముక్కను యేసు నుండి యూదా తీసుకున్న వెంటనే, సాతాను అతనిని స్వాదీనములోకి తీసుకున్నాడు. అప్పుడు యేసు అతనితో అన్నాడు, “నీవు చేయాలని ప్రణాళిక వేసినదానిని త్వరగా చెయ్యి.” 28 (యేసు యూదాతో అలా ఎందుకు అన్నాడో అక్కడ ఆ బల్ల వద్ద కూర్చున్న వారిలో ఏ ఒక్కరికీ తెలియదు. 29 యేసు అతనిని వెళ్ళమని మరియు వారికి పస్కా పండుగ వేడుకకు అవసరమైన కొన్ని వస్తువు కొనుటకు లేదా కొంత డబ్బు బీదవారికి ఇచ్చుటకు యేసు అతనితో చెపుతున్నాడని వారిలో కొందరనుకున్నారు. {వారు ఇలా అనుకున్నారు} ఎందుకంటే యూదా యొద్ద సంచి ఉన్నది దానిలో వారి యొక్క డబ్బు ఉన్నది. 30 కాబట్టి యూదా యేసు నుండి ఆ రొట్టె అందుకున్న తరువాత, వెంటనే అతడు బయటకు వెళ్లాడు. (ఇది రాత్రి.) 31 కాబట్టి యూదా వెళ్లిన తరువాత, యేసు చెప్పాడు, “మనుష్యుని యొక్క కుమారుడనైన నేను ఎంత గొప్పవాడనో ఇప్పుడు దేవుడు మనుష్యులకు కనుపరచాడు. దేవుడు ఎంత గొప్పవాడో నేను కూడా మనుష్యులకు కనుపరచాను. 32 దేవుడే తనకు తాను మనుష్యుని యొక్క కుమారుడనైన నేను ఎంత గొప్పవాడనో మనుష్యులకు కనపరచును, మరియు ఆయన దీనిని ఇప్పుడే చేస్తాడు. 33 {మీరు నా పిల్లలై యున్నారు అన్నట్లుగా నేను ప్రేమిస్తున్న మీరు, నేను మీతో కొంత కాలము మాత్రమే ఉంటాను. అప్పుడు మీరు నా కోసం వెదకుతారు, అయితే నేను యూదుల నాయకులకు చెప్పిన రీతి గానే ఇది ఉండబోతుంది మరియు ఇప్పుడు నేను మీతో చెప్పుచున్నాను: నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో ఆ చోటుకి మీరు వచ్చుటకు వీలు కాదు. 34 మీరు ఒకరినొకరు ప్రేమించుకొనునట్లు మీకు ఈ ఇప్పుడు ఈ కొత్త ఆజ్ఞ ఇస్తాను: నేను మిమ్మును ప్రేమించిన విధము గానే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. 35 మీరు ఒకరినొకరు ప్రేమించిన యెడల {ఆ ప్రేమను చుసిన వారు} మీరు నా శిష్యులను అని ప్రతిఒక్కరు తెలుసుకుంటారు.” 36 సీమోను పేతురు ఆయనతో చెప్పాడు, “ప్రభువా, నీవు ఎక్కడికి వేల్లుచున్నావు?” యేసు జవాబిచ్చాడు, “నేను వెళ్ళుచున్న చోటికి ఇప్పుడు మీరు రాలేరు, అయితే మీరు తరువాత అక్కడికి వెళతారు." 37 పేతురు ఆయనతో చెప్పాడు, “ప్రభువా, ఇప్పుడు నేను నీతో ఎందుకు రాలేను? నేను నీ కోసం చనిపోవడానికి ఇష్టపడుతున్నాను!” 38 యేసు జవాబిచ్చాడు, “నా కోసం నీవు నిజముగా చావడానికి ఇష్టంగా లేవు! నేను నీతో సత్యము చెపుతున్నాను: నీవు నన్ను యెరుగవు అని మూడుసార్లు ఉదయకాలములో కోడి కూయక మునుపు నీవు ఖచ్చితంగా చెపుతావు.

Chapter 14

1 "కలవరం చెందకండి. దేవుణ్ణి నమ్మండి, నన్ను కూడా నమ్మండి. 2 నా తండ్రి ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ మనుష్యులు నివసించడానికి అనేకమైన స్థలములు ఉన్నాయి. అది నిజం కాని యెడల, నేను అలా మీకు చెప్పి ఉండేవాడిని, ఎందుకంటే మీ కోసం ఒక స్థలాన్ని నివసించడానికి సిద్ధం చేయడానికి నేను అక్కడికి వెళ్తాను. 3 మరియు మీరు నివసించుటకు ఒక స్థలం సిద్దపరచదానికి నేను అక్కడికి వెళ్ళిన తరువాత, నేను తిరిగి వస్తాను మరియు మీరు నాతో ఉండునట్లు తీసుకువెళతాను, తద్వారా నేను ఉండు చోట మీరు నాతో కూడా ఉంటారు. 4 నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో ఆ చోటుకి ఎలా వెళ్ళాలో మీకు తెలుసు. 5 తోమా ఆయనతో చెప్పాడు, “ప్రభువా, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నారో మాకు తెలియదు. మేము అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోలేము!” 6 యేసు అతనితో చెప్పాడు, “అక్కడి వెళ్ళే విధానమును నేనే. దేవుని గూర్చి సత్యమైన దానిని బయలుపరచే వాడను, మరియు మనుష్యులకు నిత్యజీవము ఇచ్చు వాడను నేనే .నా తండ్రి వద్దకు మనుష్యులు వచ్చుటకు ఒకే విధము నన్ను నమ్ముట చేతనే. 7 నేను ఎవరినై ఉన్నానో మీకు తెలుసు గనుక మీకు నా తండ్రి కూడా తెలుసు. ఈ సమయము మొదలుకొని, మీరు ఆయనను ఎరుగుదురు, మరియు ఇది మీరు ఆయనను చూసినట్లే యుండును.” 8 ఫిలిప్పు యేసుతో చెప్పాడు, “ప్రభువా, తండ్రిని మనము చూసాము మరియు అది మమ్ములను సంతృప్తి పరుస్తుంది!” 9 యేసు అతనితో చెప్పాడు, “ నేను ఇంత ఎక్కువ కాలము మీ అందరితో పాటు ఉన్నాను. మీకు ఖచ్చితంగా నేను తెలుసు ఫిలిప్పూ! నన్ను చూసిన వారెవరైనా వారు నా తండ్రిని చూసిన వారి వాలే ఉన్నారు. కాబట్టి "మనం తండ్రిని చూద్దాము" అని చెప్పడానికి నీకు కారణం లేదు! 10 నేను మరియు నా తండ్రియు సంపూర్ణముగా ఏకమై ఉన్నాము అని మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి! నేను మీతో చెప్పినది అంతా నా సొంతంగా నేను చెప్పలేదు. బదులుగా, నాతో ఏకమై యున్న నా తండ్రి నా ద్వారా తన సొంత అద్బుత క్రియలను జరిగించుచున్నాడు. 11 నేను మరియు నా తండ్రి సంపూర్ణముగా ఏకమై యున్నామని నేను చెప్పిన్నప్పుడు నన్ను నమ్మండి! లేనియడల, నేను చెపుతున్న దానిని బట్టి నమ్మకపోయిన యెడల, కనీసం {నేను చేయుట మీరు చూసిన} అద్భుతమైన క్రియలన్నిటిని బట్టియైనను నమ్మండి. 12 నేను మీతో సత్యము చెప్పుచున్నాను: నాలో నమ్మకము ఉంచుతున్న వారెవరైనా కూడా నేను చేయుచున్న అద్భుత కార్యములను చేస్తారు. వాడు నేను చేయుచున్న ఆ కార్యముల కంటే మరింత గొప్ప కార్యములు చేస్తాడు ఎందుకంటే నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. 13 నా ప్రతినిదిగా మీరు మనవి చేసిన దానిని ఏదైనా నేను చేస్తాను. నేను నా తండ్రి ఎంత గొప్పవాడో కనబరచునట్లు నేను, ఆయన కుమారుడిని, దీనిని నేను చేస్తాను. 14 నా ప్రతినిదిగా నా నుండి మీరు మనవి చేసిన దానిని నేను చేస్తాను 15 మీరు నన్నునిజముగా ప్రేమించిన యెడల, నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటికి మీరు విధేయత చూపుతారు. 16 అప్పుడు నేను నా తండ్రి నుండి వేడుకుంటాను, మరియు ఆయన మీకు మరొకరిని మీకు సహాయము చేయుటకు ఆయన తరపును మీతో సదాకాలం ఉండుటకు పంపుట ద్వారా నాకు ఉత్తరమిస్తాడు. 17 {ఆయన} దేవుని గూర్చి నిజము ప్రకటించే వాడు పరిశుద్ధ ఆత్మ. ఈ లోకంలోని అవిశ్వాసులైన మనుష్యులు ఆయనను స్వీకరించలేరు, ఎందుకంటే వారు ఆయనను చూడరు లేదా ఆయనను తెలుసుకోరు. శిష్యులైన మీరు ఈ ఆత్మను తెలుకొనియున్నారు ఎందుకంటే ఆయన మీతో నివసిస్తాడు, మరియు ఆయన తరువాత మీలో నివసిస్తాడు. 18 మీ కోసం శ్రద్ధ తీసుకోవడానికి ఎవరూ లేకుండా మిమ్మును నేను విడిచి పెట్టను. నేను వెంటనే మీ వద్దకు వస్తాను. 19 కొంచెం కాలంలో లోకం ఉన్న అవిశ్వాసులు నన్ను ఇక ఎన్నటికి చూడరు, అయితే మీ అంతట మీరే మరలా నన్ను చూస్తారు. ఎందుకంటే నేను త్వరలో మరలా జీవిస్తాను, మీరు కూడా మరలా జీవిస్తారు. 20 మీరు నన్ను మరలా చూచినప్పుడు, నేను నా తండ్రితో ఏకమై యున్నాము అని మరియు మీరు మరియు నేను సంపూర్ణముగా ఏకమై యున్నాము అని మీరు తెలుసుకొంటారు. 21 నేను ఆజ్ఞాపించిన వాటిని తెలుసుకొను వారు మరియు విధేయత చూపువారు {వారు } నన్ను నిజముగా ప్రేమించుచున్నారు. మరియు నన్ను ప్రేమించుచున్న వారిని నా తండ్రి ప్రేమించుచున్నాడు. నేను కూడా ఆ వ్యక్తిని ప్రేమిస్తాను, మరియు నన్ను నేను ఆ వ్యక్తికి బయలుపరచకుంటాను. 22 యూదా (యూదా ఇస్కరియోతు కాదు, {అయితే అదే పేరుతో ఉన్న వేరొక శిష్యుడు) యేసుతో మాట్లాడాడు.{అతడు చెప్పాడు,} "ప్రభువా, నిన్ను నీవు లోకములో ఉన్న మనుష్యులందరికీ కాక నీవు మాకు మాత్రమే బయలుపరచుకొనుటకు నిన్ను మార్చుటకు దోహదపడినది ఏమిటి?” 23 యేసు అతనికి జవాబిచ్చాడు, “ నన్ను ప్రేమించు వారు నా బోధలు గైకొంటారు. నా తండ్రి ఆ వ్యక్తిని ప్రేమిస్తాడు. ఆయన మరియు నేను ఆ వ్యక్తి వద్దకు వస్తాము మరియు ఆ వ్యక్తి లోపల నివసిస్తాము. 24 నన్ను ప్రేమించని వారు నా బోధలు గైకొనరు. మీరు నేను చెప్పుచున్న దానిని ఇప్పుడు మీరు వినినది నేను నా సొంతంగా చెప్పలేదు. బదులుగా,{ నేను చెప్పినది} అది నన్ను పంపిన నా తండ్రి నుండి వచ్చినది.} 25 నేను ఇంకా మీతో ఉండగానే ఈ సంగతులు నేను మీతో చెప్పాను. 26 అయితే నా తండ్రి నా స్థానములో పరిశుద్ధ ఆత్మను పంపుతాడు. మీకు సహాయము చేసే వ్యక్తి ఆయనే. ఆయన {మీరు తెలుసుకోవలసిన దేవుని యొక్క సత్యము అంతటిని} మీకు బోధిస్తాడు. ఆయన నేను మీకు చెప్పిన అన్ని సంగతులను జ్ఞాపకముంచుకోడానికి చేస్తాడు. 27 నేను మిమ్మును విడిచివెళ్ళుచుండగా, నేను మీకు సమాధాన బావనను ఇస్తాను. అది నా సమాధాన బావమును మీకు నేను ఇచ్చుచున్నాను. ఈ లోకములోని మనుష్యులు ఇచ్చు దాని కంటే భిన్నమైన రీతిలో నేను మీకు {ఆ సమాధాన బావమును} ఇచ్చుచున్నాను. కలవరపడ వద్దు లేదా భయపడకండి. 28 నేను వెళ్లిపోతున్నాను అని మరియు తరువాత మీ వద్దకు తిరిగి వస్తాను అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను నిజముగా ప్రేమించిన యెడల, నేను {పరలోకములోని} నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను అని మీరు సంతోషిస్తారు, ఎందుకంటే ఆయన నా కంటే గొప్పవాడు. 29 ఈ సంగతులు జరగక ముందే నేను మీకు చెప్పాను. తద్వారా అవి జరిగినప్పుడు, మీరు నన్ను నమ్మడం కొనసాగిస్తారు. 30 నేను మీతో ఎక్కువసేపు మాట్లాడలేను, ఎందుకంటే ఈ లోకమును ఏలువాడు {సాతాను} వచ్చుచున్నాడు. అయితే,వానికి నా మీద నియంత్రణ లేదు, 31 అయితే, నేను నా తండ్రిని ప్రేమించుచున్నాను అని లోకములోని మనుష్యులు అందరు తెలుసుకొనడం కోసం ఇది జరుగును మరియు నా తండ్రి నాకు ఏమి చేయమని నాకు ఆజ్ఞాపించిన దానిని నేను ఖచ్చితంగా చేస్తాను. లేవండి, ఈ స్థలమును విడిచి వెళ్ళదాము."

Chapter 15

1 నేను ఒక యదార్ధమైన ద్రాక్షావల్లి వలే ఉన్నాను {అది ఫలాన్ని పెంచుతుంది}. నా తండ్రి ఒక తోటమాలి వలే ఉన్నాడు {ఆయన దాని జాగ్రత్త తీసుకొంటాడు}. 2 నాలో భాగంగా ఉన్నట్టుగా కనిపించి అయితే ఫలాన్ని కలుగజేయని ప్రతి కొమ్మను నా తండ్రి నరికి వేస్తాడు మరియు తొలగిస్తాడు. ఫలాన్ని కలుగజేసే ప్రతి కొమ్మ కోసం సంబంధించి, ఆయన దానిని కత్తిరించడం చేత దానిని శుభ్రం చేస్తాడు, తద్వారా అది మరింత ఎక్కువ ఫలాలను కలుగజేస్తుంది. 3 నేను మీతో ముందే చెప్పిన బోధల యొక్క కారణంగా కత్తిరించడం చేత ఇప్పటికే శుద్ధి చెయ్యబడిన కొమ్మల వలే మీరు ఉన్నారు. 4 నాతో ఐక్యమై నిలిచియుండి మరియు నేను మీతో ఐక్యమై నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షావల్లితో అతుకబడి నిలిచినంత వరకు అది ఎటువంటి ఫలమును ఫలించని విధముగా కాబట్టి మీరు నాతో ఐక్యమై నిలిచి ఉండనంత వరకు మీరు ఆత్మీయ ఫలము ఫలించరు. 5 నేను ద్రాక్షావల్లి వలే ఉన్నాను; మీరు కొమ్మ వలే ఉన్నారు. మీరు నాతో కలిసి నిలిచియుండి మరియు నేను మీతో కలిసి నిలిచి యున్న యెడల, మీరు అధిక ఫలాన్ని ఫలిస్తారు, ఎందుకంటే నా నుండి వేరుగా మీరు ఏమియూ చెయ్యలేరు. 6 నాతో ఐక్యంగా నిలువని వాడు విషయంలో ఆ వ్యక్తి తోటమాలి నరికి వేసిన మరియు పారవేసిన కొమ్మ వలే ఉంటాడు. అవి ఎండిపోయిన తరువాత, తోటమాలి వాటిని పైకి పోగుచేస్తాడు మరియు వాటిని అగ్నిలోనికి త్రోసి వేస్తాడు మరియు వాటిని కాల్చివేస్తాడు. 7 మీరు నాతో ఐక్యంగా నిలిచి యుండి మరియు నేను బోదించిన దానికి విధేయత చూపించిన యెడల, మీరు కోరుకునే దేనికోసమైనా దేవుణ్ణి మనవి చెయ్యవచ్చు మరియు అయన మీ మనవిని మంజూరు చేస్తాడు. 8 మీరు అధిక ఫలాన్ని కలిగించడం మరియు నా శిష్యులుగా ఉండడం చేత నా తండ్రి ఎంత గొప్పవాడో మీరు మనుష్యులకు చూపించండి. 9 నా తండ్రి నన్ను ప్రేమించిన అదే విధముగా నేను మిమ్మును ప్రేమించాను. ఇప్పుడు నేను ప్రేమించే వారి కోసం తగిన విధానంలో జీవిస్తూ ఉండండి. 10 నేను మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరు లోబడిన యెడల, నా తండ్రి నాకు ఆజ్ఞాపించిన వాటికి నేను లోబడి మరియు ఆయన ప్రేమిస్తున్న వారి కోసం తగిన విధానములో నేను క్రియ జరిగించునట్లు వలే నేను ప్రేమించే వారి కోసం తగిన విధానంలో మీరు ప్రవర్తిస్తారు. 11 నేను ఈ సంగతులను మీకు చెప్పాను తద్వారా నేను ఉన్న విధముగా మీరు సంతోషంగా ఉంటారు మరియు {తద్వారా} ఉన్నత స్థాయిలో మీరు సంతోషంగా ఉంటారు. 12 మీరు చెయ్యడానికి నేను మీకు ఆజ్ఞాపించునది ఇదే: నేను మిమ్మును ప్రేమించిన విధానంలో ఒకరినొకరు ప్రేమించండి. 13 తన స్నేహితుల కోసం చనిపోవడానికి ఇష్టపడే ఒక వ్యక్తి కంటే గొప్ప ప్రేమ ఏ ఒక్కరికీ ఉండదు. 14 చెయ్యడానికి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తూ ఉన్న యెడల మీరు నిజంగా నా స్నేహితులుగా ఉంటారు. 15 నేను ఇకమీదట మిమ్మును నా సేవకులని పిలువబోవడం లేదు, ఎందుకంటే ఒక సేవకుడు అతని యజమాని చేస్తున్న దానిని అర్థం చేసుకో లేదు. నేను ఇప్పుడు మిమ్మును స్నేహితులు అని పిలుస్తున్నాను, ఎందుకంటే నేను నా తండ్రి నాకు చెప్పినది ప్రతీదానినీ మీరు అర్థం చేసుకొనేలా చేసాను. 16 మీరు {నా శిష్యులుగా ఉండడానికి} ఎంచుకొన లేదు, బదులుగా {నా శిష్యులుగా ఉండడానికి} నేను మిమ్మును ఎంచుకున్నాను, మరియు {ఈ భాద్యతకు} మిమ్ములను నియమించాను తద్వారా మీరు బయటకు వెళతారు మరియు ఆత్మీయ ఫలాన్ని కలిగిస్తారు మరియు {తద్వారా} మీరు కలిగించిన ఫలం శాశ్వతంగా ఉంటుంది. నా ప్రతినిధుల వలే ఆయన నుండి మీరు మనవి చేసిన ప్రతీదానిని నా తండ్రి మీకు ఇవ్వడం నిమిత్తం {కూడా నేను మిమ్మును ఎంచుకొన్నాను}. 17 మీరు చెయ్యడానికి నేను ఈ సంగతులను ఆజ్ఞాపిస్తున్నాను ఎదుకంటే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు. 18 లోకంలో దేవుణ్ణి వ్యతిరేకించు మనుష్యులు మిమ్మును ద్వేషిస్తారు కాబట్టి, వారు మొదట నన్ను ద్వేషించారు అని మీరు గ్రహించాలి. 19 మీరు ఈ లోకంలో దేవుణ్ణి వ్యతిరేకించే మనుష్యు యొక్క భాగమై ఉన్న యెడల ఆ అవిశ్వాసులు తమ సొంతాన్ని ప్రేమిస్తున్న విధముగా మిమ్మును ప్రేమిస్తారు. అయితే వారి మధ్య నుండి బయటకు రావడానికి నేను మిమ్మును ఎంచుకున్నాను. ఈ లోకంలో దేవుణ్ణి వ్యతిరేకించే మనుష్యులు మిమ్మును ద్వేషిస్తారు ఎందుకంటే మీరు వారి యొక్క భాగం కాదు. 20 ఒక సేవకుడు తన యజమాని కంటే ప్రాముఖ్యం కాదు అని నేను మీకు చెప్పాను అని జ్ఞాపకం చేసుకోండి. నేను శ్రమ పడేలా వారు చేసారు కాబట్టి, వారు మిమ్మును కూడా శ్రమ పెడతారు. వారిలో ఎవరైనా నా బోధకు విధేయులైన యెడల, మీరు వారికి బోధించిన వాటికి కూడా విధేయత చూపిస్తారు. 21 అయినప్పటికీ ఈ లోకంలోని అవిశ్వాసులు మీకు ఈ ద్వేషపూరిత కార్యములు చేస్తారు, ఎందుకంటే మీరు నాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు {మరియు} ఎందుకంటే నన్ను ఇక్కడికి పంపిన నా తండ్రిని వారు యెరుగరు. 22 నేను వచ్చి మరియు {దేవుని సత్యమును} వారికి చెప్పకుండా ఉన్న యెడల యెడల, {నన్ను మరియు నా సందేశమును తిరస్కరించడం యొక్క }దోషాన్ని కలిగి ఉండేవారు కాదు. అయితే, {నేను వచ్చాను మరియు వారికి బోధించాను కాబట్టి}, ఇప్పుడు వారి పాపం కోసం ఎటువంటి క్షమాపణ లేదు. 23 నన్ను ద్వేషించువాడు నా నా తండ్రిని కూడా ద్వేషిస్తాడు. 24 వారి మధ్య ఏ ఒక్కరును ఎన్నడూ చెయ్యని అద్భుత కార్యములను నేను చెయ్యకుండా ఉండిన యెడల, వారు పాపం గురించి దోషులుగా ఉండరు, అయినప్పటికీ ఇప్పుడు వారు ఈ కార్యములు చూచారు, మరియు నన్ను ద్వేషిస్తున్నారు. నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. 25 అయితే ఇది జరిగింది ఎందుకంటే ఒక ప్రవక్త వారి లేఖనములలో వ్రాసిన ఈ మాటలు నిజం అయ్యాయి: ‘వారు కారణం లేకుండా నన్ను ద్వేషించారు.’ 26 నేను మీకు సహాయం చేయువానిని నేను నా తండ్రి నుండి పంపినప్పుడు, నేను ఎవరినో ప్రతిఒక్కరికి ఆయన చెపుతాడు. ఆయన పరిశుద్ధ ఆత్మ, దేవుని గురింఛి మరియు నన్ను గురించి సత్యమైన దానిని ఆయన ప్రకటిస్తాడు మరియు నా తండ్రి నుండి బయలు దేరుతాడు. 27 నా గురించి మీరు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చెప్పాలి ఎందుకంటే నేను నా పనిని ప్రారంభించిన మొదటి దినముల నుండి మీరు నాతో ఉన్నారు.

Chapter 16

1 జరిగే ఈ విషయాల గురించి నేను మీకు చెప్పాను, తద్వారా {అవి జరిగినప్పుడు} మీరు నా మీద విశ్వాసం ఉంచడం కొనసాగిస్తారు. 2 నన్ను వ్యతిరేకించే యూదులు మిమ్ములను యూదుల సమావేశ స్థలాలకు రాకుండా నిషేధిస్తారు. ఇంకా {ఇంతకంటే ఘోరం జరుగుతుంది.} మిమ్ములను చంపేవాళ్ళందరూ అలా చేయడం ద్వారా దేవునిని సంతోషపెట్టుచున్నారు అని అనుకునే సమయం రాబోతుంది. 3 వారు అలాంటి పనులు చేస్తారు, ఎందుకంటే నేను నిజంగా ఎవరో లేదా నా తండ్రి ఎవరో వారికి తెలియదు. 4 ఈ విషయాల గురించి నేను మీకు చెప్పాను, అవి జరిగినప్పుడు, అవి జరుగుతాయి అని నేను మీతో చెప్పినట్లు మీరు గుర్తుంచుకుంటారు. నేను నా పని ప్రారంభించిన మొదటి దినాలలో నేను వారి గురించి చెప్పలేదు, ఎందుకంటే అప్పుడు నేను మీతో ఉన్నాను. 5 “ఇప్పుడు నేను నన్ను పంపిన నా తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళుచున్నాను. అయినా ఇప్పుడు మీరెవరూ నన్ను ఎక్కడికి వెళ్ళుచున్నావని అడగడం లేదు! 6 నేను మీకు ఈ విషయాలు చెప్పిన కారణంగా మీరు చాలా విచారంగా ఉన్నారు. 7 అయినప్పటికీ, నేను ఇప్పుడు మీకు నిజమైన సమాచారం చెప్పుచున్నాను: నేను {నేను ఉండడం కంటే} వెళ్ళిపోవడమే మీకు మంచిది. {ఇది నిజం} ఎందుకంటే నేను వెళ్ళకపోతే, మీకు సహాయం చేసేవాడు మీ వద్దకు రాడు. అయితే, నేను వెళ్ళిన యెడల, నేను ఆయనను మీ వద్దకు పంపుతాను. 8 సహాయం చేసే వ్యక్తి వచ్చినప్పుడు, ఆయన లోకములోని మనుష్యులను {వారు చేసిన} పాపాల గురించి ఒప్పిస్తాడు. నీతిమంతులు కాదని {ఆయన వారిని నేరారోపణ చేస్తాడు} మరియు దేవుడు వారికి తీర్పుతీరుస్తాడని వారిని {ఆయన ఒప్పిస్తాడు}. 9 వారు నాలో నమ్మకముంచి పాపం చేసిన కారణంగా, వారి పాపం గురించి {ఆయన మనుష్యులను ఒప్పిస్తాడు}. 10 నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళుచున్నాను, మరియు మీరు నన్ను {నీతిమంతులుగా ఉండడానికి ఉదాహరణగా} మీరు ఇక మీదట నన్ను చూడరు కాబట్టి, నీతిమంతులుగా ఉండని {మనుష్యులను ఆయన ఒప్పిస్తాడు}. 11 ఈ లోకమును పరిపాలించే {సాతానును} ఆయన ఖండించినందున, దేవుడు వారికి తీర్పు తీరుస్తాడని {ఆయన మనుష్యులను ఒప్పిస్తాడు}. 12 నేను మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే, ఇప్పుడు చెప్పిన యెడల, మీరు వాటిని అంగీకరించలేరు. 13 దేవుని గురించిన సత్యాన్ని ప్రకటించే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు, ఆయన {మీరు తెలుసుకోవలసిన} అన్ని సత్యములను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తాడు. { ఆయన అలా చేయగలడు} ఎందుకంటే తన స్వంత అధికారం నుండి మాట్లాడడు. బదులుగా, ఆయన దేవుని నుండి విన్నదానిని చెపుతాడు మరియు జరగబోయే వాటి గురించి ముందుగానే చెపుతాడు. 14 పరిశుద్ధ ఆత్మ తను నా నుండి విన్నదానిని మీకు చెప్పడం ద్వారా నేను ఎంత గొప్పవాడిని అని చూపిస్తాడు. 15 నా తండ్రికి ఉన్నదంతా నాకే చెందుతుంది. అందుకే పరిశుద్ధ ఆత్మ నా నుండి ఏమి విన్నాడో మీకు చెపుతాడు అని చెప్పాను. 16 కొద్దికాలం తరువాత మీరు నన్ను చూడలేరు మరియు కొద్దికాలము తరువాత, మీరు నన్ను తిరిగి చూస్తారు. 17 అప్పుడు ఆయన శిష్యులలో కొందరు ఒకరినొకరు అడిగారు, “‘కొద్ది కాలం తరువాత మీరు నన్ను చూడలేరు, మరికొంత కాలం తరువాత తిరిగి చూస్తారు’ అని యేసు మనతో చెప్పినప్పుడు అర్థం ఏమిటి? మరియు 'నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్ళుచున్నాను కాబట్టి' అని ఆయన చెప్పినప్పుడు ఆయన అర్థం ఏమిటి?" 18 కాబట్టి వారు అడుగుచూనే ఉన్నారు, “‘కొంచెము కాలము తరువాత’ అంటే ఏమిటి? ఆయన ఏమి చెప్పుచున్నాడో మనకు అర్థం కావడం లేదు. 19 తన శిష్యులు తనను మరిన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు అని యేసు గుర్తించాడు. కాబట్టి ఆయన వారితో అన్నాడు, “‘కొంత కాలం తరువాత మీరు నన్ను చూడలేరు, మరికొంత కాలం తరువాత తిరిగి చూస్తారు’ అని నేను చెప్పినప్పుడు నా ఉద్దేశ్యం ఏమిటని మీరు ఒకరినొకరు అడుగుచున్నారు. 20 నేను మీకు నిజం చెప్పుచున్నాను: మీరు ఏడుస్తారు మరియు దుఃఖిస్తారు, అయితే లోకములో దేవుణ్ణి వ్యతిరేకించే మనుష్యులు సంతోషిస్తారు. మీరు చాలా విచారంగా ఉంటారు, అయితే మీరు విచారంగా ఉండటం నుండి ఆనందంగా ఉంటారు. 21 ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నొప్పిని అనుభవిస్తుంది, ఎందుకంటే ఆమెకు జన్మనిచ్చే సమయం ఇది. అయినప్పటికీ, ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తాను శ్రమపడ్డాను అని మరచిపోతుంది, ఎందుకంటే ఆమె ఒక మనుష్యుని లోకములోనికి తీసుకువచ్చిన కారణంగా ఆమె ఆనందంగా ఉంది. 22 అదే విధంగా, మీరు ఈ సమయములో విచారంగా ఉన్నప్పటికీ, నేను మిమ్ములను తిరిగి చూస్తాను, మరియు మీరు సంతోషిస్తారు మరియు ఎవరూ మిమ్ములను సంతోషించకుండా ఆపలేరు. 23 మీరు నన్ను తిరిగి చూసినప్పుడు, మీరు నన్ను ఏమీ అడగరు. నేను మీకు నిజం చెప్పుచున్నాను: మీరు నా ప్రతినిధులుగా ఆయన నుండి కోరిన దానిని నా తండ్రి మీకు ఇస్తాడు. 24 ఇప్పటి వరకు మీరు నా ప్రతినిధులుగా {నా తండ్రి నుండి} ఏమీ అభ్యర్థించలేదు. {నా తండ్రి నుండి ఏదైనా} అభ్యర్థించండి మరియు మీరు {మీరు కోరినది} స్వీకరిస్తారు. మీరు గొప్ప స్థాయిలో ఆనందంగా ఉండేలా దేవుడు దానిని మీకు ఇస్తాడు. 25 నేను ఈ విషయాలు మీకు అలంకారిక భాషను ఉపయోగించి చెప్పాను, అయితే మీతో మాట్లాడటానికి నేను అలాంటి భాషను ఉపయోగించని సమయం త్వరలో వస్తుంది. బదులుగా, మీరు సులభంగా అర్థం చేసుకోగలిగే భాషను ఉపయోగించి నా తండ్రి గురించి నేను మీకు చెపుతాను. 26 మీరు నన్ను తిరిగి చూసినప్పుడు, మీరు నా ప్రతినిధులుగా {దేవుని నుండి ఏదైనా} అభ్యర్థిస్తారు మరియు నేను మీ తరపున నా తండ్రిని అడగవలసిన అవసరం లేదు, 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమిస్తారు మరియు నేను దేవుని నుండి ఇక్కడకు వచ్చాను అని నమ్ముచున్న కారణంగా నా తండ్రి స్వయంగా మిమ్ములను ప్రేమిస్తున్నాడు. 28 నేను నా తండ్రి నుండి వచ్చాను మరియు ఈ లోకములో ప్రవేశించాను. నేను ఈ లోకమును విడిచిపెట్టి నా తండ్రి వద్దకు తిరిగి వెళతాను అని తిరిగి మీకు చెప్పుచున్నాను. 29 ఆయన శిష్యులు ప్రతిస్పందించారు, “చివరిగా! ఇప్పుడు నీవు మేము సులభంగా అర్థం చేసుకోగలిగే భాషను ఉపయోగిస్తున్నావు మరియు అలంకారిక భాషను ఉపయోగించడం లేదు. 30 మీకు అన్నీ తెలుసు అని ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాము. నిన్ను ఎవరు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు {ఎందుకంటే ఆ వ్యక్తి ఏమి అడుగుతాడో నీకు ముందే తెలుసు}. అందుకే నీవు దేవుని నుండి ఇక్కడికి వచ్చావని మేము నమ్ముచున్నాము. 31 యేసు వారికి జవాబిచ్చాడు, “ఇప్పుడు మీరు చివరకు నన్ను నమ్ముతారు! 32 చూడండి! త్వరలో ఒక సమయం వస్తుంది, మరియు ఆ సమయం చాలా త్వరగా వస్తుంది, ఇతరులు మిమ్ములను ప్రతిచోటా చెదరగొట్టుతారు. మీలో ప్రతి ఒక్కరు తన స్వంత ఇంటికి పోతారు, మరియు మీరు నన్ను ఒంటరిగా విడిచిపెడతారు. అయితే, నేను ఒంటరిగా ఉండను, ఎందుకంటే నా తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. 33 మీరు సమాధానముగా ఉండడం కోసం {ఎందుకంటే మీరు నాతో ఐక్యంగా ఉన్నందున} జరగబోయే విషయాలన్నీ నేను మీకు చెప్పాను. ఈ లోకములో మీరు శ్రమపరచబడతారు, అయితే ధైర్యంగా ఉండండి! లోకములో దేవుణ్ణి వ్యతిరేకించే వారిని నేను ఓడించాను!

Chapter 17

1 జరగబోయే ఈ విషయాల గురించి యేసు తన శిష్యులకు చెప్పిన తరువాత, అయన పరలోకము వైపు చూసాడు మరియు చెప్పాడు, “తండ్రీ, ఇప్పుడు నేను శ్రమపడి చనిపోయే సమయం వచ్చింది. నీ కుమారుడైన నేను ఎంత గొప్పవాడో అందరికీ చూపించు, తద్వారా నువ్వు ఎంత గొప్పవాడివో అందరికి చూపిస్తాను. 2 {దయచేసి ఇది చేయండి} ఎందుకంటే నీవు మనుష్యులు అందరి మీద నాకు అధికారం ఇచ్చావు, ఎందుకంటే నీవు నా వద్దకు రావడానికి ఎంచుకున్న వారందరు {నాతో పాటు పరలోకములో} నిత్యము జీవించేలా నేను చేయగలను. 3 నిత్యము జీవించడం అంటే ఇదే: ఏకైక నిజమైన దేవుడు అయిన నిన్ను తెలుసుకోవడం మరియు నువ్వు లోకములోనికి పంపిన మెస్సీయ అయిన యేసు అనే నన్ను తెలుసుకోవడం. 4 నేను భూమి మీద ఉన్నప్పుడు నీవు ఎంత గొప్పవాడవో అందరికీ చూపించాను. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేయడం ద్వారా {నేను దీనిని చేసాను}. 5 తండ్రీ, మనం లోకమును సృష్టించే సమయానికి ముందు మీ సమక్షంలో నేను కలిగి ఉన్న గొప్పతనంతో నీ సమక్షంలో నేను ఎంత గొప్పవాడినో ఈ సమయంలో చూపించండి. 6 లోకములోని మనుష్యుల నుండి నీవు నాకు ఇచ్చిన మనుష్యులకు నీవు నిజంగా ఎవరో నేను చూపించాను. వారు నీకు చెందిన వారు మరియు నీవు వారిని నాకు ఇచ్చారు. వారు నీ బోధను పాటించారు. 7 ఈ సమయంలో నీవు నాకు ఇచ్చినవి అన్నీ నీ నుండి వచ్చినవి అని వారికి తెలుసు. 8 {వారికి ఇది తెలుసు} ఎందుకంటే నీవు నాకు చెప్పిన బోధనలను నేను వారికి చెప్పాను. వారు స్వయంగా ఆ బోధనలను అంగీకరించారు, మరియు నేను నీ నుండి వచ్చాను అని వారు నిశ్చయించుకున్నారు మరియు నీవు నన్ను ఇక్కడికి పంపావు అని వారు నమ్ముతారు. 9 నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. లోకములో నిన్ను వ్యతిరేకించే మనుష్యుల కోసం నేను ప్రార్థించడం లేదు. బదులుగా, నీవు నాకు ఇచ్చిన వారి కోసం {నేను ప్రార్థిస్తున్నాను}, ఎందుకంటే వారు నీకు చెందినవారు. 10 నా శిష్యులు అందరూ నీకు చెందినవారు, మరియు నీకు చెందిన {శిష్యులు అందరు} నా వారే. నేను ఎంత గొప్పవాడినో వారు అందరికీ చూపిస్తారు. 11 నేను ఇక మీదట ఈ పాపపు లోకములో ఉండను. అయితే అందులో నా శిష్యులు ఉంటున్నారు. నేను త్వరలో నీ వద్దకు తిరిగి వస్తాను. ప్రత్యేకంగా ఉన్నవాడవు, నా తండ్రీ, నీవు నాకు ఇచ్చిన అదే నీ శక్తితో వారిని సురక్షితంగా ఉంచండి, తద్వారా మనం ఐక్యముగా ఉన్న విధంగా వారు ఐక్యముగా ఉంటారు. 12 నేను వారితో కలిసి ఉన్న సమయములో, నీవు నాకు ఇచ్చిన నీ అదే శక్తితో నేను వారిని సురక్షితంగా ఉంచాను. నేను వారిని కాపాడాను, వారిలో ఒకరు మాత్రమే నిత్యముగా నాశనం చేయబడుతాడు. లేఖనాలు నిజమయ్యేలా నీవు నిత్యముగా నాశనం చేయబడాలని నిర్ణయించుకున్నవాడు {అతడే}. 13 ఈ సమయములో నేను నీ వద్దకు తిరిగి రాబోవుచున్నాను. నేను ఈ పాపపు లోకములో ఉన్నప్పుడు వారికి నా పూర్తి ఆనందాన్ని ఇవ్వడానికి ఈ విషయాలు చెప్పాను. 14 నేను వారికి నీ బోధను చెప్పాను. {ఈ విధంగా లోకములోని నిన్ను వ్యతిరేకించే మనుష్యులు} వారిని అసహ్యించుకున్నారు, ఎందుకంటే వారు నా వలె వారు నిన్ను వ్యతిరేకించే వారికి చెందినవారు కాదు. 15 నీవు నా శిష్యులను ఈ పాపభరిత లోకము నుండి బయటకు తీసుకు వెళ్ళమని నేను కోరడం లేదు. బదులుగా, దుష్టుడైన సాతానుచే హాని చేయబడడం నుండి నీవు వారిని రక్షించమని {నేను అభ్యర్థిస్తున్నాను}. 16 నా వలే, వారు లోకములో నిన్ను వ్యతిరేకించే మనుష్యులకు చెందినవారు కారు. 17 {తెలుసుకొనుటకు మరియు దాని ప్రకారం జీవించుటకు వారిని సమర్దులను చేయడం} ద్వారా నా శిష్యులను సత్యమైన దానికి, నీకు సేవ చేయడానికి ప్రత్యేకించండి. నీ బోధ సత్యము. 18 నీవు నన్ను వారి మధ్యకు పంపిన విధంగానే నేను వారిని లోకములోని మనుష్యుల మధ్యకు పంపుతున్నాను. 19 సత్యము అయిన దానిని {తెలుసుకోవడం మరియు దాని ప్రకారం జీవించడం} చేత వారు కూడా నీకు సేవ చేయడం కోసం వారి పక్షంగా ఒక బలియాగము వలే నన్ను నేను ప్రత్యేకంగా ఉంచుకొంటున్నాను.” 20 ఇప్పుడు నేను ఇక్కడ ఈ శిష్యుల కోసమే కాకుండా అయితే, నా శిష్యులు చెప్పే వాక్యము ద్వారా నాలో విశ్వసించే మనుష్యుల కోసం కూడా {నేను ప్రార్థిస్తున్నాను}. 21 నా తండ్రి మరియు నేను పూర్తిగా ఐక్యంగా ఉన్న విధముగానే వారందరూ ఐక్యంగా ఉండాలని {నేను ప్రార్థిస్తున్నాను}. నీవు నన్ను ఇక్కడికి పంపావు అని లోకములోని మనుష్యులు తెలుసుకునేలా వారు కూడా మనతో ఐక్యంగా ఉండాలని { నేను ప్రార్థిస్తున్నాను}. 22 మనం ఐక్యంగా ఉన్న విధముగానే వారు కూడా ఐక్యంగా ఉండేందుకు, నీవు నన్ను ఘనపరచినట్లే నా మీద నమ్మకం ఉంచే మనుష్యులను నేను ఘనపరచాను. 23 {దీని అర్థం} నేను వారితో ఐక్యంగా ఉన్నాను, మరియు నీవు నాతో ఐక్యంగా ఉన్నావు. నీవు నన్ను ఇక్కడికి పంపావు అని మరియు నీవు నన్ను ప్రేమిస్తున్న విధంగానే నన్ను విశ్వసించే మనుష్యులను నీవు ప్రేమిస్తున్నావు అని లోకములోని మనుష్యులు తెలుసుకోవాలని వారు పూర్తిగా ఐక్యంగా ఉండటానికి {నేను దీనిని చేసాను}. 24 “నా తండ్రీ, నీవు నాకు ఇచ్చిన ఈ మనుష్యులు నేను పరలోకములో ఎక్కడ ఉంటానో అక్కడ నాతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మనం విశ్వాన్ని సృష్టించినప్పటి నుండి నీవు నన్ను ప్రేమిస్తున్న కారణంగా నీవు నన్ను మహిమాన్వితంగా చేసావు. 25 నా తండ్రి, ఎల్లప్పుడూ సరైనది చేసేవాడవు, లోకములో నిన్ను వ్యతిరేకించే మనుష్యులకు నీవు ఎవరో తెలియదు, అయితే నీవు ఎవరో నాకు తెలుసు. నీవు నన్ను ఇక్కడికి పంపించావు అని నన్ను నమ్మిన ఈ మనుష్యులకు తెలుసు. 26 నీవు ఎవరో వారికి తెలియ చేసాను. నీవు నన్ను ప్రేమిస్తున్నట్లుగా వారు ఇతరులను ప్రేమించాలని మరియు నేను వారితో ఐక్యంగా ఉండటానికి నేను అలా చేయుటకు కొనసాగిస్తాను.

Chapter 18

1 యేసు ప్రార్ధన ముగించిన తరువాత, తన శిష్యులతో బయలుదేరి కిద్రోను లోయ దాటాడు. లోయకు అవతలి వైపున వారు {ఒలీవ చెట్ల యొక్క} ఒక తోటలోనికి ప్రవేశించారు. 2 యూదా యేసు యొక్క ప్రత్యర్థులకు ఆయనను బంధించడములో సహాయం చేయబోతున్నాడు. యేసు తన శిష్యులతో కలిసి తరచుగా అక్కడికి వెళ్ళడం వలన యేసు ఉన్న స్థలం అతనికి తెలుసు. 3 కాబట్టి యూదా రోమా సైనికుల సమూహాన్ని మరియు పాలక యాజకులు మరియు పరిసయ్యులు పంపిన కొంతమంది ఆలయ కాపలాదారులను ఆ తోటకు తీసుకువచ్చాడు. వారు దివిటీలు, దీపాలు మరియు ఆయుధాలు తీసుకువెళ్ళారు. 4 తనకు ఏమి జరగబోవుచున్నదో యేసుకు తెలుసు కాబట్టి, ఆయన ముందుకు వెళ్ళి సైనికులను మరియు దేవాలయ కాపలాదారులను అడిగాడు, "మీరు ఎవరి కోసం వెదకుచున్నారు?" 5 వారు ఆయనకు జవాబిచ్చారు, "నజరేతు నుండి వచ్చిన యేసు" అని బదులిచ్చారు. యేసు వారితో, “నేనే {ఆ వ్యక్తిని}” అని చెప్పాడు. (యూదా వారితో నిలబడి ఉన్నాడు. యేసు యొక్క ప్రత్యర్థులకు ఆయనను బంధించడములో సహాయం చేసేవాడు.) 6 యేసు వారితో చెప్పినప్పుడు, “నేను {ఆ వ్యక్తిని},” అని చెప్పినప్పుడు, వారు వెనక్కి వెళ్ళి అసంకల్పితంగా నేల మీద పడిపోయారు. 7 అప్పుడు యేసు వారిని తిరిగి అడిగాడు, "మీరు ఎవరి కోసం వెదకుచున్నారు?" వారు జవాబిచ్చారు, “నజరేతు నుండి వచ్చిన యేసు” 8 యేసు జవాబిచ్చాడు, “నేను {ఆ వ్యక్తిని} అని మీతో చెప్పాను. మీరు వెదుకుచున్న వానిని నేనే కాబట్టి, ఈ ఇతర మనుష్యులను వెళ్ళనివ్వండి. 9 (ఆయన తన తండ్రితో చెప్పిన ఈ మాటలు నిజమయ్యేలా ఇది జరిగింది: "నీవు నాకు ఇచ్చిన వారిలో ఒకరిని కూడా నేను పోగొట్టుకోలేదు.") 10 సీమోను పేతురు ఒక చిన్న కత్తిని కలిగి ఉన్నాడు. అతడు దాని తొడుగులో నుండి దానిని తీసాడు మరియు దానితో ప్రధాన యాజకుని యొక్క సేవకుని కొట్టాడు, అతని కుడి చెవిని తెగనరికాడు. మల్కు అనేది ఆ సేవకుని యొక్క పేరు. 11 అప్పుడు యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నీ పొట్టి కత్తిని దాని తొడుగులో పెట్టు! నా తండ్రి నా కోసం {శ్రమపడాలని} అనుకున్న విధంగా నేను తప్పకుండా శ్రమపడాలి!” 12 రోమా సైనికుల సమూహము, వారి నాయకుడు మరియు యూదు నాయకుల నుండి కొంతమంది ఆలయ కాపలదారులతో పాటు, యేసును పట్టుకొన్నారు మరియు ఆయన చేతులు కట్టారు. 13 అప్పుడు వారు ఆయనను మొదట అన్న వద్దకు తీసుకువెళ్ళారు, ఎందుకంటే అతడు కయప యొక్క మామ, మరియు కయప ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు. 14 (రోమీయులు వారిని చంపడానికి అనుమతించడం కంటే, మనుష్యుల తరపున ఒక మనుష్యుడు చనిపోవడం {రోమనులు వారిని చంపనివ్వడం కంటే} ఇది చాలా మంచిదని ఇతర యూదు నాయకులకు కయప సలహా ఇచ్చాడు.) 15 సీమోను పేతురు యేసును అనుసరించాడు, మరియు మరొక శిష్యుడు కూడా చేసాడు. ప్రధాన యాజకుడైన అన్నకు ఇతర శిష్యుడు తెలుసు, కాబట్టి { సైనికులు మరియు కాపలాదారులు యేసును అక్కడికి తీసుకు వెళ్ళినప్పుడు. అతడు ప్రధాన యాజకుని ప్రాంగణంలోనికి ప్రవేశించడానికి అనుమతించబడ్డాడు 16 అయితే, పేతురు తలుపు వద్ద బయట ఉండవలసి వచ్చింది. అందుచేత, ప్రధాన యాజకునికి తెలిసిన ఆ శిష్యుడు తిరిగి బయటికి వెళ్ళి, తలుపు దగ్గర కాపలకాస్తున్న పనిమనిషితో మాట్లాడాడు. తరువాత పేతురును {ప్రాంగణంలోనికి} తీసుకురావడానికి అనుమతించబడ్డాడు. 17 ద్వారమును కాపలాకాస్తున్న ఆ సేవకురాలు పేతురుతో చెప్పింది, “నీవు ఖచ్చితంగా ఆ మనుష్యుని (వారు బంధించిన) శిష్యులలో ఒకడివి!” అతడు జవాబిచ్చాడు, "లేదు, నేను కాదు!" 18 (ఇది చలిగా ఉంది, కాబట్టి ప్రధాన యాజకుల సేవకులు మరియు ఆలయ కాపలాదారులు మంటలు వేసి దాని చుట్టూ నిలబడి వేడి చేసుకుంటున్నారు. పేతురు కూడా వారితో పాటు నిలబడి వేడిచేసుకుంటున్నాడు.) 19 అప్పుడు ప్రధాన యాజకుడు తన శిష్యుల గురించి మరియు ఆయన వారికి ఏమి బోధిస్తున్నాడు అని యేసును ప్రశ్నించాడు. 20 యేసు అతనికి జవాబిచ్చాడు, “నేను ప్రతి ఒక్కరితో (వినేవారికి) బహిరంగంగా మాట్లాడాను. నేను ఎల్లప్పుడూ యూదుల సమావేశ స్థలాలలో మరియు దేవాలయములో బోధించాను. చాలా మంది యూదులు గుమిగూడే ప్రదేశాలలో నేను బోధించాను. నేనెప్పుడూ రహస్యంగా ఏమీ చెప్పలేదు. 21 మీరు నన్ను అడగకూడదు! నేను వారికి ఏమి బోధించానో విన్న వారిని అడగండి. నేను చెప్పేది వారికి నిశ్చయముగా తెలుసు.” 22 యేసు ఇది చెప్పిన తరువాత, అతని దగ్గర నిలబడి ఉన్న ఆలయ కాపలాదారులలో ఒకడు ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. అతడు, “ప్రధాన యాజకునికి అలా జవాబివ్వకూడదు!” అన్నాడు. 23 యేసు అతనికి జవాబిచ్చాడు, “నేను చెప్పింది తప్పు అయితే, అది ఏమిటో నాకు చెప్పండి. అయితే, నేను చెప్పింది సరైనదైతే, నీవు నన్ను చెంపదెబ్బ కొట్టకూడదు.” 24 అప్పుడు అన్న యేసును ఇతర ప్రధాన యాజకుడు అయిన కయప వద్దకు పంపాడు, ఆయన చేతులు ఇంకా కట్టబడి ఉన్నాయి. 25 ఇంతలో, సీమోను పేతురు ఇంకా నిలబడియున్నాడు మరియు {ప్రాంగణములో} తనను తాను వేడి చేసుకుంటూ ఉన్నాడు, ఒకరు అతనితో చెప్పాడు, "నీవు కూడా వారు బంధించిన ఈ మనుష్యుని యొక్క శిష్యులలో ఒకడవు!" పేతురు దీనిని తిరస్కరించి, “లేదు, నేను కాదు!” అన్నాడు. 26 ప్రధాన యాజకుని యొక్క సేవకులలో ఒకరు పేతురు చెవి తెగనరికిన మనుష్యునికి బంధువు. అతడు పేతురుతో చెప్పాడు, “వాళ్ళు బంధించిన వ్యక్తితో కలిసి నిన్ను {ఒలీవ చెట్టు} తోటలో ఖచ్చితంగా చూసాను!” 27 పేతురు అప్పుడు తిరిగి {తాను యేసుతో ఉండడాన్ని} ఖండించాడు. ఒక కోడి వెంటనే {అతడు అది చేసిన తరువాత} కూసింది. 28 యూదు నాయకులు యేసును కయప ఇంటి నుండి రోమా గవర్నర్ అయిన పిలాతు ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. (అది తెల్లవారుజామున. యూదు నాయకులు పిలాతు ప్రధాన కార్యాలయములోనికి ప్రవేశించలేదు { ఎందుకంటే పిలాతు యూదుడు కాదు. వారు యూదులు కాని వారి ఇంట్లోకి ప్రవేశిస్తే, వారు తమను తాము అపవిత్రం చేసుకుంటారు అని మరియు పస్కా పండుగ భోజనమును తినలేరని భావించారు.) 29 కాబట్టి పిలాతు వారితో మాట్లాడటానికి బయటకు వచ్చాడు. అతడు వారిని అడిగాడు, “ఈ మనుష్యుడు ఏమి చేస్తున్నాడని మీరు ఆరోపిస్తున్నారు?” 30 యూదు నాయకులు సమాధానమిచ్చారు, "ఈ మనుష్యుడు ఒక నేరస్థుడు కాకపోతే, మేము ఆయనను నీ వద్దకు తీసుకు వచ్చే వారము కాము!" 31 కాబట్టి పిలాతు వారితో చెప్పాడు, "మీరే అతనిని తీసుకొని మీ స్వంత ధర్మశాస్త్రము ప్రకారం ఆయనకు తీర్పు తీర్చండి." యూదు నాయకులు జవాబిచ్చారు, "మేము ఆయనను చంపాలనుకుంటున్నాము, అయితే మీ రోమా చట్టం మమ్ములను అది చేయకుండా అడ్డుకుంటుంది." 32 (తాను త్వరలో ఎలా చనిపోతాడనే దాని గురించి యేసు చెప్పినది నిజం కావడానికి ఇది జరిగింది.) 33 పిలాతు తిరిగి తన ప్రధాన కార్యాలయం లోపలికి వెళ్ళాడు. యేసును తన దగ్గరకు తీసుకురావాలని సైనికులకు ఆజ్ఞాపించి, “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. 34 యేసు జవాబిచ్చాడు, "నీవు స్వయంగా ఆలోచించి నన్ను ఈ ప్రశ్న అడుగుచున్నావా లేక నా గురించి ఇతరులు నీకు చెప్పారా?" 35 పిలాతు జవాబిచ్చాడు, “నేను యూదుడిని కాదు! మీ స్వంత దేశస్థులు మరియు పాలక యాజకులు నిన్ను నా దగ్గరకు తీసుకువచ్చారు. నీవు ఏమి తప్పు చేసావు?” 36 యేసు జవాబిచ్చాడు, “నేను పరిపాలించే రాజ్యం ఈ పాపభరిత లోకానికి చెందినది కాదు. అది జరిగితే, యూదుల నాయకులు నన్ను బంధించకుండా నిరోధించడానికి నా సేవకులు పోరాడి ఉండేవారు. అయితే, నేను పరిపాలించే రాజ్యం ఈ పాపభరిత లోకానికి చెందినది కాదు. 37 అప్పుడు పిలాతు ఆయనను అడిగాడు, "కాబట్టి నీవు రాజువా?" యేసు జవాబిచ్చాడు, “నీవు నీవే అలా చెప్పుచున్నావు. అందుకే నేను ఈ లోకములో పుట్టాను: దేవుని గురించిన సత్యాన్ని మనుష్యులకు తెలియజేయడానికి వచ్చాను. దేవుని గురించి నిజమని నమ్మే ప్రతి ఒక్కరూ నేను చెప్పేది అంగీకరిస్తారు మరియు లోబడతారు. 38 పిలాతు ఆయనతో చెప్పాడు, "నిజంగా ఏది సత్యమో ఎవరికీ తెలియదు!" పిలాతు అది చెప్పిన తరువాత, అతడు బయటికి వెళ్ళి యూదు నాయకులతో తిరిగి మాట్లాడాడు. అతడు వారితో, “ఈ మనుష్యుడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించినట్లు నాకు ఎటువంటి రుజువు దొరకలేదు. 39 అయితే, యూదులైన మీకు ఒక ఆచారం ఉంది: ప్రతి సంవత్సరం పస్కా వేడుకలో మీరు నన్ను అడుగుతారు మరియు నేను చెరసాలలో ఉన్న ఒకరిని మీకు విడుదల చేస్తాను. కాబట్టి నేను మీ రాజును మీకు విడుదల చేయాలనుకుంటున్నారా? ” 40 యూదు నాయకులు అప్పుడు తిరిగి అరిచారు, "వద్దు, ఈ మనుష్యుని విడుదల చేయవద్దు, అయితే బరబ్బాను విడుదల చేయండి!" (బరబ్బా ఒక విప్లవకారుడు.)

Chapter 19

1 కాబట్టి ఆ సమయంలో పిలాతు {తన సైనికులను ఆజ్ఞాపించాడు} యేసును తీసుకు వెళ్ళారు మరియు కొరడాలతో కొట్టారు. 2 సైనికులు కూడా కొన్ని కొమ్మలను వాటి మీద ముళ్లతో తీసి, ఒక కిరీటం వంటి దానిని వాటిని తయారు చెయ్యడానికి వాటిని చుట్టారు. అప్పుడు వారు దానిని యేసు యొక్క తల మీద ఉంచారు మరియు {ఆయనను అపహాస్యం చేయడానికి} ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు తొడిగారు. 3 వారు ఆయనను సమీపిస్తూ వచ్చారు మరియు ఆయనను ఎగతాళి చేస్తూ ఉన్నారు, "యూదుల యొక్క రాజా, మేము నీకు నమస్కరిస్తున్నాము!" మరియు ఆయన ముఖాన్ని చరిచారు. 4 పిలాతు తిరిగి బయటికి వచ్చాడు మరియు యూదు నాయకులతో చెప్పాడు, "చూడండి, ఈ మనుష్యుడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించినట్లు నేను ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు అని మీరు తెలుసుకోడానికి నేను ఆయనను మీ దగ్గరకు తీసుకురాబోవుచున్నాను," 5 కాబట్టి యేసు బయటకు వచ్చాడు. ఆయన ముళ్ళతో ఉన్న కొమ్మలతో చేసిన కిరీటం మరియు ఊదారంగు వస్త్రాన్ని ధరించాడు. పిలాతు యూదు నాయకులతో చెప్పాడు, “చూడండి, ఇక్కడ ఈ మనుష్యుడు!” 6 పాలక యాజకులు మరియు ఆలయ కాపలదారులు యేసును చూసినప్పుడు, వారు అరిచారు, "ఆయనను సిలువ వేయండి! ఆయనను సిలువ వేయండి! ” పిలాతు వారితో వ్హేప్పాడు, “మీరే అతన్ని తీసుకు వెళ్ళండి మరియు సిలువ వేయండి! నా విషయానికొస్తే, ఈ మనుష్యుడు ధర్మశాస్త్రమును ఉల్లంఘించినట్లు నేను ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. 7 యూదు నాయకులు పిలాతుకు జవాబిచ్చారు, "ఆయన దేవుని యొక్క కుమారుడని చెప్పుకున్న కారణంగా ఆయన చనిపోవాలని మాకు ఒక నిర్దిష్ట చట్టం ఉంది." 8 పిలాతు అది విన్నప్పుడు, అతడు {యేసును చనిపోవాలని శిక్షించిన యెడల తనకు ఏమి జరుగుతుందో అని ముందు కంటే ఎక్కువ భయపడ్డాడు}. 9 అతడు మరోసారి తన ప్రధాన కార్యాలయములోనికి ప్రవేశించాడు { మరియు యేసును తిరిగి లోపలికి తీసుకురావాలని సైనికులను ఆజ్ఞాపించాడు. అప్పుడు} అతడు యేసును అడిగాడు, “నీవు ఎక్కడి నుండి వచ్చావు?” అయితే, యేసు అతని ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. 10 కాబట్టి పిలాతు ఆయనతో చెప్పాడు, “నీవు నాకు సమాధానం చెప్పాలి! నిన్ను విడిపించే అధికారము నాకు ఉందని, నిన్ను సిలువ వేయడానికి కూడా నాకు అధికారం ఉందని నీకు ఖచ్చితంగా తెలుసు!” 11 యేసు అతనికి జవాబిచ్చాడు, “నా మీద నీకు ఉన్న ఒకే అధికారము దేవుడు నీకు ఇచ్చిన అధికారము. కాబట్టి నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చిన మనుష్యుడు నీవు చేస్తున్న పాపం కంటే ఘోరమైన పాపం చేసాడు.” 12 ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ, యూదా నాయకులు అరిచారు, “నీవు ఈ మనుష్యుని విడుదల చేసిన యెడల, నీవు కైసరుకు విధేయుడవు కాదు! రాజు అని చెప్పుకునే ఎవరైనా కైసరును వ్యతిరేకిస్తాడు. 13 పిలాతు అది విన్నప్పుడు, అతడు యేసును బయటకు తీసుకురావాలని తన సైనికులను ఆజ్ఞాపించాడు. అప్పుడు పిలాతు సాధారణముగా తీర్పులు చెప్పే పీఠము మీద{ తీర్పు చెప్పడానికి} కూర్చున్నాడు. ఇది యూదులు మాట్లాడే భాషలో "గబ్బతా" అని మనుష్యులు పిలిచే పిలువబడే "రాతి కాలిబాట" అని పిలువబడే ప్రదేశములో ఉంది. 14 (అది {పస్కా పండుగకు ముందు రోజు, ఇది} యూదులు వేడుకకు సిద్ధమైన రోజు. దాదాపు మధ్యాహ్నమైంది.) పిలాతు యూదు నాయకులతో, చెప్పాడు, “చూడండి, ఇక్కడ మీ రాజు!” 15 వారు అరిచారు, “ఆయనను చంపండి! ఆయనను చంపండి! ఆయనను సిలువ వేయండి! ” పిలాతు వారిని {ఎగతాళి చేసాడు}, “నేను {నా సైనికులను మీ రాజును సిలువ వేయమని ఆజ్ఞాపించాలా}?” అని అడగడం చేత {ఎగతాళి చేసాడు}. పాలక యాజకులు జవాబిచ్చారు, “కైసరు మాత్రమే మాకు రాజు!” జవాబిచ్చారు. 16 అప్పుడు, వారు చెప్పిన దాని ప్రకారం, యేసును సిలువ వేయమని పిలాతు తన సైనికులను ఆజ్ఞాపించాడు. అప్పుడు సైనికులు యేసును {సిలువ వేయడానికి ఆయనను} తీసుకువెళ్ళారు. 17 యూదులు మాట్లాడే భాషలో "గొల్గొతా" అని మనుష్యులు పిలిచే "కపాలము యొక్క స్థలము" అని పిలిచే ప్రదేశానికి యేసు తన సిలువను ఒంటరిగా బయటికి మోసుకెళ్ళాడు. 18 సైనికులు ఆయనను ఆ స్థలములో సిలువ వేసారు. వారు ఆయనతో పాటు మరో ఇద్దరు మనుష్యులను కూడా సిలువ వేసారు. ఒక వ్యక్తి యేసుకు ఒక వైపున ఉన్నాడు, కాబట్టి యేసు వారి మధ్య ఉన్నాడు. 19 పిలాతు కూడా ఒక ఫలకము మీద ప్రకటన వ్రాయడానికి మరియు దానిని యేసు యొక్క సిలువకు బిగించమని {ఒకరిని ఆజ్ఞాపించాడు}. {ఆ వ్యక్తి} దాని మీద, ‘నజరేతు నుండి వచ్చిన యేసు, యూదుల రాజు’ అని వ్రాసాడు. 20 అనేకమంది యూదు మనుష్యులు ఈ ప్రకటనను చదివారు ఎందుకంటే సైనికులు యేసును సిలువ వేసిన ప్రదేశం యెరూషలేము నగరానికి దగ్గరగా ఉంది మరియు {ఎందుకంటే} యూదులు, రోమీయులు మరియు గ్రీకులు మాట్లాడే మూడు భాషలలో ప్రకటనను ఒకరు వ్రాసారు. 21 పాలక యూదు యాజకులు పిలాతు వద్దకు తిరిగి వచ్చి, “మీరు ఆ ప్రకటన మీద 'యూదుల రాజు' అని వ్రాసి ఉండకూడదు. బదులుగా, {మీరు ఇలా వ్రాసి ఉండాలి,} 'ఈ మనుష్యుడు తాను రాజు అని చెప్పాడు.’" 22 పిలాతు జవాబిచ్చాడు, “వారు రాయడానికి నేను వారికి ఏమి చెప్పానో, వారు వ్రాసారు, మరియు నేను దానిని మార్చను.” 23 సైనికులు యేసును సిలువ మీద ఉంచిన తరువాత, వారు ఆయన వస్త్రాలు తీసుకొని వాటిని నాలుగు సమాన భాగాలుగా విభజించారు, ప్రతి సైనికుడికి ఒక భాగం. {అయితే, వారు ఆయన} అంగీని {వేరుగా} ఉంచారు. నేత కార్మికుడు ఎలాంటి అతుకులు లేని ఒక గుడ్డ ముక్క నుండి పై నుండి క్రిందికి ఈ అంగీని నేసాడు. 24 కాబట్టి సైనికులు ఒకరితో ఒకరు చెప్పారు, “మనం ఈ అంగీను చింపివేయవద్దు. బదులుగా, జూదం ఆడటం ద్వారా దానిని ఎవరు ఉంచుకోవాలో నిర్ణయించుకుందాం { మరియు విజేతకు ఇవ్వడం}.” ఈ లేఖనాన్ని నిజం చేయడానికి ఇది జరిగింది: “వారు నా వస్త్రాలు వారి మధ్య పంచుకున్నారు. వారు నా అంగీ కోసం జూదం ఆడారు." అందుకే సైనికులు ఆ పనులు చేసారు. 25 యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ మరియు మగ్దలేనే మరియ అందరూ ఆయన వ్రేలాడుచున్న సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. 26 యేసు తన తల్లిని {అక్కడ నిలుచున్నాడు} మరియు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఆమె దగ్గర నిల్చున్నప్పుడు, ఆయన తన తల్లితో చెప్పాడు, "అమ్మా, ఇదిగో నిన్ను కుమారుని వలె చూసుకునే వాడు." 27 తరువాత, ఆయన యోహానుతో చెప్పాడు, "ఇక్కడ నీవు నీ స్వంత తల్లి వలె చూసుకుంటావు!" ఆ క్షణం నుండి, యోహాను ఆమెను తన స్వంత ఇంటిలో నివసించడానికి తీసుకువెళ్ళాడు. 28 కొద్దిసేపటి తరువాత, దేవుడు తనను పంపిన ప్రతిదానిని తాను ఇప్పటికే చేసానని యేసుకు తెలుసు కాబట్టి, {మరియు} లేఖనములోని మరొక {ప్రవచనాన్ని} నిజం చేయడానికి, ఆయన చెప్పాడు, “నేను దాహం గొనుచున్నాను!” 29 అక్కడ ఒకరు చవకైన ద్రాక్షారసము ఉన్న కూజాను ఉంచారు {మరియు యేసు దాహముతో ఉన్నాడు}. కాబట్టి సైనికులు హిస్సోపు మొక్క నుండి ఒక రెల్లు తీసుకొని దాని మీద స్పంజీని ఉంచారు. {తరువాత వారు స్పంజీని చౌకగా ఉన్న ద్రాక్షారసములో ముంచి, యేసు నోటికి అందించారు. 30 కాబట్టి యేసు చవకైన ద్రాక్షారసమును త్రాగాడు మరియు అప్పుడు చెప్పాడు, “నేను {నేను ఇక్కడ చేయడానికి వచ్చిన ప్రతిదానిని} పూర్తి చేసాను!” మరియు ఆయన తల వంచాడు మరియు స్వచ్ఛందంగా మరణించాడు. 31 యూదు నాయకులు పిలాతును సిలువ మీద ఉన్న ముగ్గురు మనుష్యుల కాళ్ళను విరగ్గొట్టమని {తన సైనికులను ఆదేశించమని} అడిగారు. తద్వారా ఆ మనుష్యులు మరింత త్వరగా చనిపోతారు} మరియు మృతదేహాలు యూదుల విశ్రాంతి దినము సమయములో వాటి మీద ఉండకుండా వారి శరీరాలను తీసుకువెళ్ళండి. {వారు ఇది అడిగారు} ఎందుకంటే ఇది యూదు మనుష్యుల పస్కా వేడుకకు సిద్ధమైన దినము { మరియు విశ్రాంతి దినము, మరియు ఆ దినాలలో మృతదేహాలను సిలువల మీద వదిలివేయడం యూదుల ధర్మశాస్త్రమును ఉల్లంఘించడం}. (మరుసటి రోజు కూడా విశ్రాంతి దినము కాబట్టి, అది చాలా ముఖ్యమైన దినము.) 32 కాబట్టి సైనికులు వచ్చారు మరియు యేసు వలె అదే సమయంలో సిలువ వేయబడిన వాడు మొదటి మనుష్యుని యొక్క కాళ్ళు విరుగగొట్టారు. {అప్పుడు వారు అవతలి మనుష్యుని కాళ్ళువిరుగగొట్టారు}. 33 అయితే, వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడు అని వారు చూసారు. కాబట్టి వారు అయన కాళ్ళు విరుగగొట్టలేదు. 34 బదులుగా, సైనికులలో ఒకడు యేసు ప్రక్కలో ఈటెతో పొడిచాడు, వెంటనే రక్తం మరియు నీరు {గాయం నుండి} కారింది. 35 (యోహాను అనే నేనే ఇది జరగడం చూసి దాని గురించి సాక్ష్యమిచ్చాను మరియు నేను సాక్ష్యమిచ్చినది నిజమే. నేను చెప్పేది నిజమని నాకు ఖచ్చితంగా తెలుసు; మీరు యేసును విశ్వసించు లాగున నేను చెప్పుచున్నాను.) 36 లేఖనంలోని {ఈ ప్రవచనాన్ని} నిజం చేయడానికి ఈ విషయాలు {యేసు శరీరానికి} జరిగాయి: "ఏ ఒక్కరూ ఆయన ఎముకలలో దేనిని విరుగగొట్టరు." 37 {అవి} లేఖనములో మరో {ప్రవచనాన్ని} కూడా నిజమయ్యేలా} చేసాయి. అది చెపుతుంది: “వారు తాము పొడిచిన మనుష్యుని చూస్తారు.” 38 ఈ విషయాలు జరిగిన తరువాత, యోసేపు, మొదట అరిమతీయా నగరానికి చెందిన మనుష్యుడు, యేసు యొక్క దేహాన్ని తీసుకు వెళ్ళడానికి పిలాతును అనుమతించమని అడిగాడు. అతడు యేసు యొక్క శిష్యులలో ఒకడు కాబట్టి {అతడు ఇలా చేసాడు}. ఎందుకంటే అతడు ఇతర యూదు నాయకులకు భయపడి, ఎవరికీ చెప్పలేదు. యేసు యొక్క దేహాన్ని తీసుకు వెళ్ళడానికి పిలాతు యోసేపును అనుమతించాడు, కాబట్టి యోసేపు వెళ్ళాడు మరియు అలా చేసాడు. 39 నికోదేము కూడా వచ్చాడు. {అతడు} ఒకసారి రాత్రి వేళ వచ్చిన వాడు మరియు యేసుతో {మాట్లాడినవాడు}. అతడు బోళము మరియు అగరు సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని తీసుకువచ్చాడు {యేసు యొక్క దేహాన్ని పాతిపెట్టడానికి సిద్ధం చేయడానికి}. ఆ సుగంధ ద్రవ్యాలు దాదాపు 33 కిలోగ్రాముల బరువు ఉన్నాయి. 40 వారు యేసు దేహాన్ని తీసుకొన్నారు మరియు దాని చుట్టూ నార బట్టను చుట్టారు మరియు {బోళము మరియు అగరు} సుగంధ ద్రవ్యాలను {బట్టల మడతల క్రింద} ఉంచారు. దేహాలను పాతిపెట్టే యూదుల ఆచారాల ప్రకారం {వారు ఇది చేసారు}. 41 (సైనికులు యేసును సిలువ వేసిన ప్రదేశానికి సమీపంలో ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక క్రొత్తగా చేయబడిన సమాధి గుహ ఉంది. ఆ గుహలో ఎవరూ ఎవరినీ పాతిపెట్టలేదు.) 42 కాబట్టి వారు యేసు యొక్క దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు ఎందుకంటే మరియు అది సమీపంలోనే ఉంది మరియు యూదు మనుష్యులు పస్కా వేడుకకు సిద్ధము చేసిన దినము{ కాబట్టి వారు సూర్యాస్తమయానికి ముందే దేహాన్ని పాతిపెట్టవలసి వచ్చింది}.

Chapter 20

1 ఆదివారము ఉదయం పెందలకడనే, అది ఇంకా చీకటిగా ఉండగా, మగ్దలేనే మరియ సమాధి వద్దకు వచ్చింది. {అక్కడ వారు యేసును సమాధి చేసారు}. సమాధికి ప్రవేశ ద్వారం నుండి ఒకరు రాయిని జరిపారు అని ఆమె చూసింది. 2 కాబట్టి ఆమె సీమోను పేతురు మరియు యేసు ప్రేమించిన మరొక ఇతర శిష్యుడు యోహాను {నివసిస్తున్న} చోటికి పరుగెత్తింది. ఆమె వారికి చెప్పినది, "కొందరు మనుష్యులు ప్రభువు యేసు దేహాన్ని సమాధి నుండి తొలగించారు, మరియు వారు దానిని ఎక్కడ ఉంచారో మాకు తెలియదు!" 3 వారు ఇది విన్నప్పుడు, పేతురు మరియు యోహాను వారున్న చోటు విడిచిపెట్టారు మరియు సమాధి వద్దకు వెళ్ళారు. 4 వారు ఇద్దరు పరుగెత్తారు, అయితే యోహాను పేతురు కంటే వేగంగా పరుగెత్తాడు మరియు సమాధి వద్దకు అతనికి ముందు చేరుకున్నాడు. 5 యోహాను కిందకు వంగి {మరియు సమాదిలోనికి చూసినప్పుడు}, అతడు {యేసు దేహం చుట్టూ వారు చుట్టిన} నార వస్త్రం యొక్క ముక్కలు ఆయన దేహం ఉంచబడిన చోట చూసాడు, అయితే అతడు సమాధి లోపలికి వెళ్లలేదు. 6 సీమోను పేతురు యోహాను వెనుక పరుగెత్తుచున్నాడు. అతడు అక్కడకు చేరుకున్నాడు, మరియు సమాధి లోపలికి వెళ్ళాడు. అతడు యేసు దేహం ఉంచబడిన చోట నార వస్త్రం యొక్క ముక్కలు కూడా చూసాడు. 7 యేసు యొక్క తల చుట్టూ ఒకరు చుట్టిన వస్త్రాన్ని కూడా పేతురు చూసాడు. {అది} నార వస్త్రం యొక్క ముక్కలతో ఉంచబడి ఉండ లేదు, బదులుగా, ఒకరు దానిని చుట్టారు మరియు వాటిని దూరంగా ఏర్పరచి ఉంచారు. 8 అప్పుడు పేతురుకు ముందు సమాధిని చేరుకొన్న మరొక శిష్యుడు, యోహాను కూడా లోపలికి వెళ్ళాడు. అతడు ఈ విషయములు చూసాడు మరియు {యేసు తిరిగి సజీవుడు అయ్యాడు అని} విశ్వసించాడు. 9 (ఆ సమయంలో యేసు చనిపోయి మరియు తిరిగి సజీవుడు కావలసి ఉంది అని చెప్పిన ఆ లేఖనములలో ప్రవక్తలు వ్రాసిన దానిని వారు అర్థము చేసుకోలేదు.) 10 శిష్యులు అప్పుడు {యెరూషలేములో} వారు నివసిస్తూ ఉన్న స్థలములకు తిరిగి వెళ్లారు. 11 మగ్దలేనే మరియ సమాధి బయట ఏడ్చుకుంటూ మరియు నిలబడిపోయింది. ఆమె ఏడ్చుచూ ఉన్నప్పుడు, ఆమె కిందకు వంగింది {మరియు} సమాధిలోనికి చూసింది. 12 ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రాలను ధరించియుండడం ఆమె చూసింది. {వారు} యేసు యొక్క దేహము ఉంచిన స్థలంలో కూర్చుని ఉన్నారు. ఒక దేవదూత యేసు తల ఉంచబడిన చోట కూర్వ్హుని యున్నాడు. మరొక దేవదూత యేసు పాదములు ఉంచబడిన చోట కూర్చుని ఉన్నాడు. 13 వారు ఆమెను అడగారు, “ఆమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు?” ఆమె వారితో చెప్పింది, “{నేను ఏడ్చుచూ ఉన్నాను} ఎందుకంటే కొంతమంది మనుష్యులు నా ప్రభువు యేసు యొక్క దేహమను {ఈ సమాధి నుండి} తొలగించారు, మరియు వారు దానిని ఎక్కడ పెట్టారో నాకు తెలియదు!" 14 ఆమె అది చెప్పిన తరువాత, ఆమె చుట్టూ తిరిగింది మరియు అక్కడ ఒకరు ఎవరో నిలబడి ఉండడం చూసింది, {అది యేసు,} అయితే ఆమె ఆయనను గుర్తు పట్టలేదు. 15 ఆయన ఆమెను అడిగాడు, "అమ్మా, ఎందుకు ఏడ్చు చున్నావు? ఎవరి కోసం చూస్తూ ఉన్నావు?” ఆమె తనతో మాట్లాడుచున్న మనుష్యుడు తోటమాలి అని తలంచింది, కాబట్టి ఆమె ఆయనతో చెప్పింది, "అయ్యా, మీరు ఆయన దేహమును ఎత్తుకొనిపోయిన యెడల, దానిని నీవు ఎక్కడ ఉంచావో నాకు చెప్పు. నేను దానిని తీసుకొంటాను {మరియు దానిని మరల సమాధి చేస్తాను}.” 16 యేసు {ఆమెను పేరు చేత పిలిచాడు,} చెప్పాడు, "మరియా!" ఆమె {ఆయన వైపుకు మరల} తిరిగింది మరియు ఆయనకు చెప్పింది, “రబ్బూనీ”(అంటే యూదులు మాట్లాడే భాషలో "బోధకుడు" అని అర్థం). 17 యేసు ఆమెతో చెప్పాడు, "నన్ను ముట్టుకోవడం నిలిపి వెయ్యి, ఎందుకంటే నేను ఇంకా నా తండ్రితో {ఉండడానికి పరలోకానికి} తిరిగి వెళ్ళలేదు. నా శిష్యులు, నా సహోదరుల వద్దకు వెళ్ళుము మరియు వారితో నేను నా తండ్రితో {ఉండడానికి పరలోకానికి} వెళ్ళబోతున్నాను అని చెప్పుము, ఆయన మీ తండ్రియు మరియు మీ తండ్రియు కూడా. 18 మగ్దలేనే మరియ యేసు శిష్యుల వద్దకు వెళ్ళింది మరియు వారికి చెప్పింది, "నేను ప్రభువు యేసును చూసాను" యేసు తనతో చెప్పినది కూడా {ఆమె} వారితో చెప్పింది. 19 అదే ఆ అదివారం యొక్క సాయంకాలమున, శిష్యులు తాము నివసిస్తున్న చోట తలుపులు తాళం వేసారు, ఎందుకంటే యూదుల నాయకుల గురించి వారు భయపడ్డారు. అకస్మాత్తుగా యేసు వచ్చాడు మరియు వారి మధ్యలో నిలబడ్డాడు. ఆయన వారితో చెప్పాడు, "దేవుడు మీకు సమాధానము కలుగజేయును గాక." 20 ఆయన ఇది చెప్పిన తరువాత, ఆయన తన శిష్యులకు తన చేతులు మరియు ప్రక్కలో ఉన్న గాయాలను చూపించాడు. వారు ప్రభువు యేసును చూసినప్పుడు వారు చాలా సంతోషించారు! 21 యేసు మరల రెండవసారి వారితో చెప్పాడు, "దేవుడు మీకు సమాధానమును అనుగ్రహించును గాక!. నా తండ్రి నన్ను పంపిన విధముగా నేను మిమ్మును {లోకము లోనికి} పంపుచున్నాను." 22 ఆయన ఇది చెప్పిన తరువాత, యేసు వారి మీద ఊదాడు మరియు చెప్పాడు, “పరిశుద్ధ ఆత్మను అంగీకరించండి. 23 మీరు ఒకరి పాపములు క్షమించిన యెడల, దేవుడు ఆ వ్యక్తిని వారి పాపముల కోసం క్షమిస్తాడు. మీరు ఒకరి పాపములను క్షమించని యెడల, దేవుడు ఆ వ్యక్తిని వారి పాపముల కోసం క్షమించడు.” 24 "దిదుమ" అని వారు పిలిచిన వాడు, పన్నెండు మంది శిష్యులలో ఒకడు, తోమా, యేసు వారి మధ్యకు వచ్చినప్పుడు ఇతర శిష్యులతో లేడు. 25 ఇతర శిష్యులు తోమాతో చెప్పారు, “మేము ప్రభువు యేసును మేము చూసాము.” అయితే అతడు వారితో చెప్పాడు, “నేను ఆయన చేతులలో మేకుల చేత కలిగిన రంధ్రములు చూసి వాటిలో నా వేళ్ళు ఉంచిన యెడల మరియు ఆ పక్క మీద {ఒక బళ్ళెం చేత చెయ్యబడిన} గాయంలో నా చేతిని ఉంచిన యెడల మాత్రమే నేను మిమ్మును విశ్వసిస్తాను.” 26 ఎనిమిది దినముల తరువాత, యేసు శిష్యులు మరల ఒక ఇంటిలో ఉన్నారు, మరియు ఈసారి తోమా వారితో ఉన్నాడు. వారు తలుపులు తాళం వేసి నప్పటికీ, యేసు వచ్చాడు మరియు వారి మధ్య నిలువబడ్డాడు. ఆయన వారితో చెప్పాడు, "దేవుడు మీకు సమాధానము అనుగ్రహించును గాక!" 27 అప్పుడు ఆయన తోమాతో చెప్పాడు, "నీ వ్రేలు ఇక్కడ రంద్రములలో ఉంచుము, మరియు నా చేతులలో రంద్రములు చూడుము, మరియు నీ చెయ్యి ఉంచుము, మరియు నా ప్రక్కలో దానిని ఉంచుము!. {నేను తిరిగి సజీవుడను అయ్యాను అని} అనుమానించడం మానుము. బదులుగా {ఇది సత్యము అని} విశ్వసించు!” 28 తోమా జవాబు ఇచ్చాడు, “నీవు నా ప్రభువు మరియు నా దేవుడవు!” 29 యేసు అతనితో చెప్పాడు, "ఇప్పుడు {నేను తిరిగి సజీవుడను అయ్యాను అని} నీవు విశ్వసించుచున్నావు ఎందుకంటే నీవు నన్ను చూసావు. నన్ను చూడకుండా ఉండి అయితే ఇంకను నమ్మిన వారిని దేవుడు {ఖచ్చితంగా} ఆశీర్వదిస్తాడు." 30 ఇప్పుడు ఆయన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు యేసు అనేక ఇతర అద్భుతమైన సూచక క్రియలు కూడా చేసాడు {అయితే} నేను వాటిని గురించి ఈ గ్రంథంలో రాయలేదు. 31 అయినప్పటికీ, యేసు దేవుని యొక్క కుమారుడైన మెస్సీయ అని మీరు పూర్తి విశ్వాసము కలిగియుండాలి అని మరియు ఆయనను నమ్ముట ద్వారా, ఆయన నామములో మీరు నిత్య జీవము కలిగియుండాలని నేను వీటిని వ్రాసాను. అయినప్పటికీ, యేసు దేవుని యొక్క కుమారుడు, మెస్సీయ అని మీరు విశ్వసించడం నిమిత్తం ఈ గ్రంథంలో సూచక క్రియలను గురించి నేను రాసాను. {యేసు మెస్సీయ అని} విశ్వసించడం చేత ఆయన ద్వారా మీరు నిత్య జీవాన్ని కలియుండడం నిమిత్తం {నేను ఈ సంగతులను గురించి కూడా రాసాను}.

Chapter 21

1 ఆ సంగతులు జరిగిన తరువాత, యేసు శిష్యులకు తిబెరియ యొక్క సముద్రము వద్ద మరల ప్రత్యక్షం అయ్యాడు {ఇది గలిలయ యొక్క సముద్రము అని కూడా పిలువబడుతుంది}. ఈ విధంగా ఆయన తనను తాను ప్రత్యక్ష పరచుకొన్నాడు: 2 సీమోను పేతురు, తోమా (దిదుమ అని వారు పిలిచారు), నతానియేలు (ఇతడు గలలియ యొక్క ప్రాంతంలో ఒక పట్టణం, కానా నుండి వచ్చినవాడు), జబదయ యొక్క కుమారులు(యాకోబు మరియు యోహాను), మరియు యేసు యొక్క ఇతర శిష్యులు ఇద్దరు కలిసి ఉన్నారు. 3 సీమోను పేతురు తనతో ఉన్న ఇతర శిష్యులతో చెప్పాడు, "నేను కొన్ని చేపలు పట్టడానికి వెళ్తున్నాను.” వారు అతనితో చెప్పారు, “మేము నీతో వస్తాము.” వారు బయటికి వెళ్ళారు మరియు దోనే లోనికి వెళ్ళారు. {మరియు చేపలు పట్టారు}, అయితే వారు ఆ రాత్రి ఏ చేపలూ పట్టలేదు. 4 ఉదయం తెల్లవారుతున్న సమయంలో యేసు సముద్రం యొక్క తీరం మీద నిలుచున్నాడు, అయితే చేపలు పడుతున్న శిష్యులకి అది ఆయన అని తెలియలేదు. 5 అప్పుడు యేసు వారిని పిలిచాడు, "ప్రియ స్నేహితులారా, మీ వద్ద ఏ చేప లేదు, మీకు ఉందా?" వారు జవాబిచ్చారు, “మాకు లేదు." 6 అయన వారితో చెప్పాడు, “మీ వలను పడవ యొక్క కుడివైపు విసరండి మరియు మీరు కొన్ని చేపలను పట్టుకొంటారు.” కాబట్టి వారు అలా చేసారు, మరియు వలను {దోనెలోనికి} లాగ లేక పోయిన విధంగా వారు అనేకమైన చేపలను వలలో పట్టారు. 7 యేసు ప్రేమించిన శిష్యుడను నేను, తరువాత పేతురుతో చెప్పాను, “ఇది ప్రభువైన యేసు!” కాబట్టి సీమోను పేతురు ఇది వినినప్పుడు, అతడు తన పై వస్తాన్ని తన చుట్టూ దోపుకున్నాడు (అతడు పని చెయ్యడానికి దీనిని తీసి వేసాడు) మరియు {దరికి ఈదడానికి} నీళ్ళలోనికి దూకాడు. 8 చేపలు పడుతున్న మిగిలిన శిష్యులు చేపలతో నిండిన వల {పడవ వెనుకకు} లాగుతూ పడవలో తీరానికి వచ్చారు. (వారు తీరానికి దూరంగా లేరు, కేవలం తొంభై మీటర్ల దూరంలో ఉన్నారు.) 9 వారు తీరానికి చేరుకున్నప్పుడు, వారు {యేసు సిద్ధపరచిన} ఒక నిప్పును చూసారు మరియు ఆయన దాని మీద ఒక చెప్పాను వండుతూ ఉన్నాడు. {అక్కడ} ఒక రొట్టె యొక్క ముద్ద కూడా ఉంది. 10 యేసు వారితో చెప్పాడు, “మీరు ఇప్పుడే పట్టుకున్న వాటిలో కొన్ని చేపలను {ఇక్కడకు} తీసుకురండి!” 11 కాబట్టి సీమోను పేతురు {పడవ వద్దకు} తిరిగి వెనుకకు వెళ్ళాడు మరియు దోనెను తీరానికి లాగాడు. {ఇది} 153 పెద్ద చేపలతో నిండి ఉంది. అక్కడ అనేకమైన చేపలు ఉన్నప్పటికీ, వల చినిగిపోలేదు. 12 యేసు వారితో చెప్పాడు, “రండి {ఇక్కడికి మరియు} ఉదయకాల భోజనం చెయ్యండి. శిష్యులలో ఏ ఒక్కరూ ఆయన ఎవరు అని ఆయనను అడగడానికి ధైర్యంగా లేరు. ఆయన ప్రభువు యేసు అని వారు యెరుగుదురు. 13 యేసు వచ్చాడు మరియు రొట్టెను తీసుకున్నాడు మరియు దానిని వారికి ఇచ్చాడు. ఆయన చేపతో అదే చేసాడు. 14 (దేవుడు ఆయనను తిరిగి సజీవుడిగా చేసిన తరువాత శిష్యులకు యేసు ప్రత్యక్షమవడం ఇది మూడవసారి.) 15 వారు ఉదయకాల భోజనం ముగించినప్పుడు, యేసు సీమోను పేతురును అడిగాడు, “సీమోను, యోహాను యొక్క కుమారుడా, {నన్ను ప్రేమిస్తున్న ఇతరులు} వీరి కంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా?" పేతురు ఆయనకు జవాబిచ్చాడు, “అవును, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు తెలుసు.” యేసు అతనితో చెప్పాడు, “నాలో విశ్వాసం ఉంచువారిని జాగ్రత్తగా చూసుకో.” 16 యేసు రెండవసారి అతనిని అడిగాడు, “సీమోను, యోహాను యొక్క కుమారుడా, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా?" అతడు ఆయనకు జవాబిచ్చాడు, "అవును, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీకు తెలుసు." యేసు అతనితో చెప్పాడు, “నాలో విశ్వాసం ఉంచువారిని జాగ్రత్తగా చూసుకో.” 17 యేసు అతనిని మూడవసారి అడిగాడు, “సీమోను, యోహాను యొక్క కుమారుడా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు దుఃఖపడ్డాడు, ఎందుకంటే యేసు అతడు తనను ప్రేమించుచున్నాడా అని మూడుసార్లు అతనిని అడిగాడు. పేతురు ఆయనకు జవాబిచ్చాడు, “ప్రభువా, నీవు ప్రతీదానిని యెరుగుదువు. నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవు యెరుగుదువు.” యేసు అతనితో చెప్పాడు, “నాలో విశ్వాసం ఉంచువారిని జాగ్రత్తగా చూసుకో.” 18 నేను నీకు సత్యం చెప్పుచున్నాను: నీవు చిన్నవానిగా ఉన్నప్పుడు, నీవు నీ సొంత వస్త్రాలను ధరించు కొన్నావు, మరియు నువ్వు ఎక్కడికి వెళ్లాలని కోరుకున్నావో నువ్వు నడిచావు, అయితే, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, నువ్వు నీ దేహం నుండి నీ చేతులు చాచుతావు, మరియు ఒకరు నీ మీద వస్త్రాలు ధరింప చేస్తారు, మరియు నువ్వు వెళ్లకూడదని కోరుకొనే చోటికి నిన్ను నడిపిస్తారు." 19 (దేవుడు ఎంత గొప్పవాడో చూపించడం కోసం పేతురు ఏవిధంగా మరణిస్తాడో సూచించడానికి యేసు దీనిని చెప్పాడు)’ అప్పుడు యేసు అతనితో చెప్పాడు, “రమ్ము, నా శిష్యునిగా ఉండు!” 20 పేతురు వెనుక తిరిగినప్పుడు, అతడు యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను వారి వెనుక నడవడం చూసాడు. {యేసు చనిపోవడానికి ముందు} రాత్రి భోజనం సమయంలో యోహాను యేసుకు సమీపంగా ఆనుకొని కూర్చున్నవాడు, మరియు అడిగాడు, "ప్రభువా, నిన్ను ఎవరు నీ శత్రువులకు అప్పగించ బోతున్నారు?” 21 కాబట్టి పేతురు యోహానుని చూచినప్పుడు, అతడు యేసును అడిగాడు, “ప్రభువా, ఈ మనిషికి ఏమి జరగబోతుంది?” 22 యేసు అతనితో చెప్పాడు, “ నేను నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలి అని నేను కోరుకొన్న యెడల, అది నీ ఆందోళన కాదు! నీ విషయంలో నా శిష్యునిగా ఉండడానికి {కొనసాగు}. 23 {యేసు ఇది చెప్పాడు} కాబట్టి, శిష్యుడు యోహాను చనిపోబోవడం లేదు అని విశ్వాసుల మధ్య ఒక వదంతి పునరావృతం అయ్యింది. అయినప్పటికీ యోహాను చనిపోతాడని యేసు పేతురుకు చెప్ప లేదు. బదులుగా ఆయన చెప్పాడు, “నేను తిరిగి వచ్చువరకు అతడు జీవించడం కొనసాగడానికి నేను కోరుకున్న యెడల అది నీ ఆందోళన కాదు!" 24 నేను, యోహాను, ఈ సంగతులన్నిటి గురించి సాక్ష్యమిచ్చుచున్న శిష్యుడను. మరియు నేను వాటిని ఈ గ్రంథంలో వ్రాసాను. నేను సాక్ష్యం ఇచ్చినది సత్యము అని మనకు తెలుసు. 25 యేసు అనేక ఇతర కార్యాలు కూడా చేశాడు, వాటిలో ప్రతీ ఒక్కటి వ్రాసినట్లయిన యెడల, వాటిని గురించి ఆ మనుష్యులు వ్రాయబోయే గ్రంథాలను కలిగి యుండడానికి లోకం అంతా చాలినంత పెద్దదిగా ఉండదు అని నేను ఊహిస్తున్నాను.