తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యూదా రాసిన పత్రిక

Chapter 1

1 {నేను,} యూదాను, మెస్సీయ యేసును సేవిస్తాను మరియు నేను యాకోబు సోదరుడిని. దేవుడు పిలిచిన మీకు, తండ్రి దేవుడు ప్రేమించే మీకు, మెస్సీయ యేసు {తన కోసం} కలిగియున్న మీకు {నేను వ్రాస్తున్నాను}. 2 దేవుడు మీ పట్ల తన కరుణగల క్రియలను విస్తరింప చెయ్యాలని మరియు మిమ్ములను మరింత సమాధానపూరితంగా చెయ్యాలని మరియు ఆయన ప్రేమను మీరు మరింత అనుభవించేలా చెయ్యాలని నేను ప్రార్థిస్తున్నాను. 3 నేను ప్రేమించే {సహ విశ్వాసులు}, దేవుడు (విశ్వసించే} మనలను మనందరినీ ఏవిధంగా రక్షించాడు అనే దాని గురించి మీకు {ఒక పత్రిక} వ్రాయడానికి నేను నా వంతు ప్రయత్నం చేసాను. అయితే, మనం విశ్వసించే సత్యమైన సంగతులను సమర్థించడానికి మిమ్ములను కోరడానికి నేను {బదులుగా ఈ పత్రిక} వ్రాయవలసి వచ్చింది. {ఈ సంగతులు} దేవుడు తాను పరిశుద్ధపరచిన వారందరికీ ఎల్లకాలము కొరకు అనుగ్రహించిన {సంగతులు}. 4 కొందరు పురుషులు దొంగచాటుగా {మీ సమావేశములలోనికి} ప్రవేశించారు కాబట్టి {దీనిని చేయమని నేను మిమ్ములను కోరుతున్నాను}. చాలా కాలం క్రితం దేవుడు శిక్షించడానికి ఎంచుకున్న {పురుషులు వారు}. వారు భక్తిహీనమైన పనులు చేస్తారు. మన దేవుడు దయగలవాడు కాబట్టే ప్రజలు లైంగిక అనైతికంగా ఉండేందుకు అనుమతిస్తున్నాడని వారు అనుకుంటారు. {వారు కూడా} మెస్సీయ యేసు గురించి సత్యాన్ని వ్యతిరేకిస్తారు, ఆయన మాత్రమే మనలను కలిగి ఉన్నాడు మరియు మన మీద పరిపాలిస్తాడు. 5 ఈ విషయాలు అన్నీ మీకు ఇంతకు ముందు తెలిసినప్పటికీ, నేను మీకు {వాటిని} జ్ఞాపకం చెయ్యడానికి కోరుతున్నాను. ఐగుప్తు యొక్క దేశం నుండి {ఇశ్రాయేలీయుల యొక్క }మనుష్యులను యేసు రక్షించిన తరువాత, ఆయనను విశ్వసించని ఆ మనుష్యులను {వారి మధ్య} నాశనం చేశాడని {జ్ఞాపకముంచుకోండి}. 6 అంతే కాకుండా, {కొందరు} దేవదూతలు తాము అధికారం కలిగి ఉన్న వారి సరైన ప్రదేశాలలో నిలిచి యుండడానికి కొనసాగలేదు. అయితే వాటిని విడిచిపెట్టారు. {వారు దీనిని చేసిన కారణంగా} దేవుడు వారిని శాశ్వతంగా చీకటిలో {నరకంలో} బంధించాడు. ముఖ్యమైన రోజున వారిని తీర్పు తీర్చడానికి {ఆయన ప్రతీదానినీ తీర్పు తీర్చునప్పుడు} {దేవుడు దీనిని చేసాడు}. 7 సొదొమ మరియు గొమొర్రా {యొక్క నగరాలలో నివసించిన మనుష్యులు} మరియు వాటికి సమీపంలో ఉన్న నగరాల విషయంలో కూడా ఇదే సత్యం. వారు ఆ దేవదూతలు చేసిన విధంగానే లైంగిక అనైతికంగా ప్రవర్తించారు. వారు అన్ని రకాల అక్రమ లైంగిక చర్యలలో పాల్గొన్నారు. ఈ {దేవదూతలు మరియు మనష్యులు} నరకం యొక్క అగ్నిలో శాశ్వతంగా బాధపడేలా చేయడం ద్వారా, దేవుడు వారిని {తనను తిరస్కరించే వారికి} ఒక ఉదాహరణగా చేస్తున్నాడు. 8 అదేవిధంగా, ఈ {అబద్దపు బోధకులు} కలలు కనేవారు, వారు అనైతికంగా జీవించడం ద్వారా తమ శరీరాలను మురికిగా మార్చుకోవడమే కాకుండా, అయితే ప్రభువు యొక్క ఆజ్ఞలను కూడా తిరస్కరించారు. వారు దేవుని మహిమగల దేవదూతలను కూడా అవమానిస్తారు. 9 ప్రధాన దేవదూత మిఖాయేలు సహితం మోషే మృత దేహం గురించి సాతానుతో అతడు వాదించినప్పుడు అతనిమీద అపవాదుల ఆరోపణలు చెప్పాడానికి వలే ధైర్యంగా లేడు. బదులుగా, అతడు {కేవలం} అన్నాడు, "ప్రభువు నిన్ను గద్దించును గాక!” 10 దీనికి విరుద్ధంగా, ఈ {అబద్ధపు బోధకులు} తమకు అర్థం కాని ఆత్మీయ సంగతులను గురించి చెడు మాటలు మాట్లాడతారు. వారు హేతుబద్ధంగా ఆలోచించలేని జంతువుల వలే ఉన్నారు. వారు సహజంగా అర్థం చేసుకోగలిగే సంగతులు వారిని నాశనం చేస్తున్నాయి. 11 ఇది వారికోసం ఎంత బాధగా ఉంది! వారు కయీను వలె ప్రవర్తిస్తారు, {అతడు తన సోదరుడిని చంపాడు.}. డబ్బు సంపాదించడం కోసం బిలాము చేసిన అదే పాపానికి వారు తమను తాము సమర్పించుకొన్నారు. కోరహును మరియు {అతనితో మోషేకు వ్యతిరేకంగా} తిరుగుబాటు చేసిన వారిని నాశనం చేసినట్లు దేవుడు ఖచ్చితంగా వారిని నాశనం చేస్తాడు. 12 ఈ వ్యక్తులు సిగ్గు లేకుండా మీతో భోజనం చేస్తున్నారు. మీ సహవాస భోజనాల వద్ద వారు నీటి కింద దాగియున్న ఓడలు ఢీకొట్టే రాళ్ల వలే ఉంటారు. వారు తమను గురించి తాము మాత్రమే చూసుకుంటారు. వారు వర్షం ఇవ్వకముందే గాలి తీసుకువెళ్లే మేఘాల వలే ఉంటారు {పనికిరాని వారు}. వారు {పనికిరాని వారు}, కోత సమయంలో ఫలించని చెట్ల వలే ఉంటారు. {అవి చెట్లలాంటి వారు} అవి రెండుసార్లు చనిపోతాయి ఎందుకంటే దేవుడు వాటిని పెకిలించివేస్తాడు. 13 వార {నియంత్రించబడలేని}ఘర్జన చేసే సముద్రపు అలల వలే ఉంటారు. కెరటాలు నురగను పైకి లేపిన విధంగా వారు తమ అవమానకరమైన చర్యలను ప్రదర్శిస్తారు. ఆకాశంలో ఉండాల్సిన చోట ఉండని నక్షత్రాలు {వలే వారు ఉంటారు}. దేవుడు వారి కోసం కటిక చీకటిని {నరకం} శాశ్వతంగా ఉంచుతున్నాడు. 14 ఆదాము నుండి జన్మించిన మనుష్యుల యొక్క వంశంలో ఏడవ వ్యక్తి హనోకు సహితం, అతడు “ఇది శ్రద్ధగా వినండి: ప్రభువు లెక్కలేనంత మంది తన పరిశుద్ధ {దూతలతో} ఖచ్చితంగా వస్తాడు” అని చెప్పినప్పుడు ఈ అబద్ధపు బోధకుల గురించి చెప్పాడు: 15 వారు ప్రతి ఒక్కరినీ తీర్పుతీర్చడానికి మరియు భక్తి హీనమైన మార్గాలలో వారు చేసిన వారి దుష్టమైన క్రియలు అన్నిటి కోసం మరియు యేసుకు వ్యతిరేకంగా మాట్లాడి, పాపం చేసి మరియు దేవుణ్ణి అగౌరవపరహిన ప్రతిఒక్కరిని గద్దించడానికి {వారు వస్తారు}. 16 ఈ {అబద్ధపు బోధకులు} {వారిలో వారు} సణుగుతారు. మరియు {ఇతరులతో} ఫిర్యాదు చేస్తారు. వారు తమ పాపసంబంధ కోరికల ప్రకారం జీవిస్తారు మరియు తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. వారు కోరుకున్న వాటిని {వారి నుండి} పొందడానికి వారు మనుష్యులను పొగుడుతారు. 17 అయితే నేను ప్రేమించే {సహ విశ్వాసులు} మీరు, చాలా కాలం క్రితం మన ప్రభువు మెస్సీయ యేసు యొక్క అపొస్తలులు చెప్పిన వాటిని జ్ఞాపకం ఉంచుకోండి. 18 వారు మీకు చెప్పిన విధంగా {జ్ఞాపకం ఉంచుకోండి}, “ఆఖరి రోజులలో {యేసు తిరిగి రాకముందు}, {దేవుడు మనకు చెప్పిన వాస్తవాలను} అపహాస్యం చేసే మనుష్యులు ఉంటారు. దేవుణ్ణి అగౌరవపరచే వారి స్వంత పాపపు కోరికల ప్రకారం {వారు} జీవిస్తారు. 19 ఈ {అపహాసకులు} విశ్వాసులను పరస్పరం కోపగించుకునే వారిగా చేసే మనుష్యులు. {వారు తమ} సహజ ప్రవృత్తుల {ప్రకారం జీవిస్తారు}. {పరిశుద్ధ} ఆత్మ వారిలో నివాసం ఉండడు. 20 అయితే నేను ప్రేమించే {సహ విశ్వాసులు} మీరు, దేవునిలో మీ విశ్వాసం వృద్ధి చెందడం చేత మరియు పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయంతో ప్రార్థన చెయ్యడం చేత, 21 దేవుని యొక్క ప్రేమను అనుభవించడానికి మిమ్మును శక్తితో నింపే విధంగా జీవిస్తూ ఉండండి. మన ప్రభువు యేసు మెస్సీయ యొక్క కనికరపూరిత పునరాగమనం కోసం ఎదురుచూస్తూ ఉండగా {దీనిని చేయండి}, {దీని ఫలితంగా} శాశ్వతంగా జీవిస్తారు {ఆయనతో}. 22 మరియు {వారు విశ్వసించవలసిన వాటి గురించి} కలవరపడిన వారి పట్ల కరుణకలిగి యుండండి. 23 అయితే మీరు నరకం యొక్క అగ్ని నుండి వారిని బయటకు లాగినట్లు వలే చేసిన యెడల, ఇతర మనుష్యులను అత్యవసరంగా రక్షించండి. మరియు మరికొందరు వ్యక్తుల పట్ల కనికరంతో ఉండండి, అయితే కేవలం వారి దుస్తులను తాకడం వల్ల మీకు పాపం కలుగుతుంది అన్నట్టు వలే వారితో జాగ్రత్తగా ఉండండి. 24 పాపభరిత జీవితానికి తిరిగి వెళ్ళడం నుండి మిమ్ములను అడ్డగించాడానికి దేవుడు శక్తిగలవాడుగా ఉన్నాడు. తన మహిమగల సన్నిధిలోనికి పాపం లేకుండా మిమ్ములను తీసుకొని వెళ్ళడానికి {కూడా ఆయన శక్తిగలవాడుగా ఉన్నాడు}. {మీరు అక్కడ} గొప్ప సంతోషంతో నిలుస్తారు. 25 అద్వితీయుడైన దేవుడు ఉన్నాడు. మన ప్రభువు యేసు మెస్సీయ {మన కోసం చేసిన} దాని ఫలితంగా ఆయన మనలను రక్షించాడు. దేవుడు మహిమ గలవాడు, మహిమాన్వితుడు, శక్తిమంతుడు, మరియు గొప్ప అధికారంతో పరిపాలిస్తున్నాడు అని ప్రతిఒక్కరూ గుర్తించాలని నేను ప్రార్థిస్తున్నాను. కాలం ఆరంభించడానికి ముందు {ఆయన ఆ విధంగా ఉన్నాడు}. ఈ రోజు {ఆయన ఆ విధంగా ఉన్నాడు}, మరియు {ఆయన ఆవిధంగా నిలిచియుంటాడు} శాశ్వతంగా! ఇది యదార్ధంగా అలా ఉంటుంది గాక!