తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తిమోతికి రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 {నుండి} పౌలు, మెస్సీయ అయిన యేసును సూచిస్తూ ఉన్న మనిషిని ఎందుకంటే దేవుడు (నేను చేయడానికి) కోరుతున్నది ఇదే. మనం మెస్సీయ అయిన యేసుతో {శాశ్వత కాలం} జీవించగలం అని దేవుడు వాగ్దానం చేసాడు అని నేను ఇతరులకు చెపుతాను. 2 తిమోతికి రాస్తున్నాను. నువ్వు నా సొంత కుమారుడిగా ఉన్నావన్నట్టుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన తండ్రియైన దేవుడు మరియు మన ప్రభువు మెస్సీయ అయిన యేసు నీ విషయంలో దయగానూ, కరుణగానూ క్రియ జరిగించి, మరియు నిన్ను సమాధానంతో నింపును గాక.

3 నా పూర్వీకులు చేసిన విధంగానే నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, ఎందుకంటే ఆయన కోరుతున్న దానిని నిజముగా నేను చేయడానికి కోరుతున్నాను. నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను. నా ప్రార్థనలలో అన్ని సమయాలలో ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకొంటున్నాను. 4 నువ్వు ఏవిధంగా కన్నీరు విడిచావో {మనం వేరైనప్పుడు} నేను జ్ఞాపకం చేసుకొంటున్నప్పుడు నేను నిజంగా నిన్ను {మరల} చూడాలని కోరుతున్నాను. అప్పుడు నేను అధికంగా ఆనందిస్తాను. 5 నిజంగా నువ్వు ఏవిధంగా విశ్వసిస్తున్నావో {యేసులో} నేను కూడా జ్ఞాపకం చేసుకొంటున్నాను. నీ అమ్మమ్మ లోయి మొదట విశ్వసించింది, మరియు తరువాత నీ తల్లి యునీకే కూడా విశ్వసించింది. వారు చేసిన విధంగా నువ్వు కూడా నిజంగా విశ్వసించావు అని నాకు తెలుసు.

6 నువ్వు యేసులో బలంగా విశ్వసించావు కనుక దేవుడు నీకు అనుగ్రహించిన {ఆత్మీయ} వరమును తిరిగి వినియోగించడం ప్రారంభించడానికి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను నీ మీద నా చేతులు ఉంచినప్పుడు {మరియు నీ కోసం ప్రార్థన చేసినప్పుడు} ఈ వరాన్ని నువ్వు పొందావు {దేవుడు నిన్ను యెంచుకొన్న కార్యాన్ని చెయ్యడానికి అది నీకు శక్తిని కలిగిస్తుంది}. 7 {ఈ వరాన్ని ధైర్యంగా వినియోగించు,} ఎందుకంటే మనం భయంతో ఉండేలా చెయ్యడానికి దేవుడు తన ఆత్మను మనకు ఇవ్వ లేదు. దానికి బదులుగా, {మనం దేవుని కోసం పని చేస్తున్నప్పుడు}, ప్రేమించడానికి {ఆయనను మరియు ఇతరులను}, మరియు మనలను మనం నిగ్రహించుకోడానికి ఆయన ఆత్మ మనం శక్తివంతంగా ఉండేలా చేస్తుంది 8 కాబట్టి మన ప్రభువు గురించి ప్రజలకు చెప్పడానికి సిగ్గుపడ వద్దు. నేను ఆయన గురించి ప్రకటించిన కారణంగా నేను ఒక ఖైదీ అయినప్పటికి నా విషయం సిగ్గుపడ వద్దు. దానికి బదులు దేవుడు నిన్ను శక్తితో నింపుతాడు కాబట్టి {ఈ కష్టాలను భరించడానికి} శుభ వార్త గురించి నీవు {కూడా} ఇతరులకు చెపుతున్నప్పుడు నాతో పాటు కష్టాన్ని అనుభవించడానికి ఇష్టంగా ఉండు. 9 {ఆయన దీనిని చేస్తాడు ఎందుకంటే} ఆయన మనలను రక్షించాడు మరియు ఒక ప్రజగా ఉండడానికి మనలను పిలిచాడు, ఇందుకు ఆయన మనలను ప్రత్యేకపరచాడు {తన సొంతవారి వలే}. మనం చేసిన ఎటువంటి మంచి కార్యాల కారణంగా దేవుడు మనలను రక్షించ లేదు. దానికి బదులుగా మనం దానికి అర్హులము కాకపోయినప్పటికి మన పట్ల దయకలిగి ఉండడానికి ఇది ఆయన ప్రణాళిక కాబట్టి ఆయన మనలను రక్షించాడు. మన కోసం మెస్సీయ యేసు చేయబోవు దాని ద్వారా లోకం ఆరంభానికి ముందే దీనిని మనకోసం ఆయన ప్రణాళిక చేసాడు. 10 ఇప్పుడు మెస్సీయ అయిన యేసు, మనలను రక్షించువాడు, వచ్చాడు. ఫలితంగా, ప్రతిఒక్కరు తెలుసుకొనగలరు {మనలను రక్షించడానికి దేవుని కృపాభరిత ప్రణాళిక}. {ప్రత్యేకించి}, మనం చనిపోయిన తరువాత మనం చనిపోయిన వారముగా ఉండిపోము అనే శుభ వార్తను యేసు ప్రకటించాడు. దానికి బదులుగా మనము క్షయము కాని దేహాలలో శాశ్వతంగా జీవిస్తాము. 11 ఈ శుభ వార్తను ప్రకటించడానికి మరియు బోధించడానికి ప్రజలకు ఆయన ప్రతినిధి వలే వెళ్ళడానికి దేవుడు నన్ను నియమించాడు.

12 ఆ కారణం చేత నేను ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాను {ఈ చెరసాలలో}, అయితే నేను {ఇక్కడ ఉండడం విషయం} సిగ్గు పడను. ఎందుకంటే మెస్సీయ నేను యేసును యెరుగుదును మరియు నేను ఆయనను విశ్వసిస్తున్నాను. ఆ రోజు వరకు {ఆయన తిరిగి వచ్చినప్పుడు} ఆయనకు నన్ను నమ్మకంగా ఉంచడానికి ఆయన శక్తిగలవాడు అని నేను నమ్ముతున్నాను. 13 నా నుండి నువ్వు వినిన ఇదే ఖచ్చితమైన సందేశాన్ని ఇతరులతో నువ్వు చెప్పేలా చూసుకో. {నువ్వు దానిని చెప్పినప్పుడు} మెస్సీయ యేసులో విశ్వాసం ఉంచుతూ ఉండు మరియు మెస్సీయ యేసు నువ్వు చెయ్యడానికి శక్తిని ఇస్తున్నప్పుడు ఇతరులను ప్రేమిస్తూ ఉండు. 14 దేవుడు నీకు అప్పగించిన {ఆయన ప్రజల కోసం} ఈ శుభ సందేశాన్ని కాపాడు. మనలో నివసిస్తున్న పరిశుద్ధ ఆత్మ నీకు {దానిని చెయ్యడానికి} సహాయం చేస్తాడు.

15 ఆసియ {మైనర్} {దేశాలలో} దాదాపు విశ్వాసులు అందరు నన్ను విడిచిపెట్టారని నీకు తెలుసు. వారిలో ఫుగెల్లు మరియు హెర్మొగెనే ఉన్నారు. 16 {అయితే} ప్రభువు ఒనేసిఫోరు కుటుంబం మీద దయ చూపించాలని నేను ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే అతడు తరచుగా నాకు సహాయం చేసాడు, మరియు నేను చెరసాలలో ఉన్న కారణంగా అతడు సిగ్గుపడ లేదు. 17 అదియు గాక, అతడు రోమ్ నగరానికి {ఇక్కడికి} వచ్చినప్పుడు, అతడు నన్ను కనుగొనే వరకు నా కోసం వెదకుతూ ఉన్నాడు. 18 ఎఫెసు {పట్టణం} లో {నేను ఉన్నప్పుడు నాకు} అతడు యెంత సహాయం చేసాడో నీకు కూడా చాలా బాగా జ్ఞాపకం ఉంది. {కాబట్టి} ఆ {చివరి} రోజున {ప్రభువు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేటప్పుడు} ఒనేసిఫోరు విషయంలో ప్రభువు కనికరం చూపించాలని నేను ప్రార్థిస్తున్నాను.

Chapter 2

1 కాబట్టి {ఈ విషయంలో} నువ్వు, {తిమోతి,} మెస్సీయ యేసు నీ పట్ల దయతో కార్యాన్ని జరిగిస్తుండగా ఆయన నిన్ను బలపరచ నివ్వు. నువ్వు నాకు కుమారుడి వలే ఉన్నావు. 2 వాటిని స్థిరపరచగల వారు అనేకులైన ప్రజల సమక్షంలో నీవు నా బోధలు విన్నావు, {ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా} జాగ్రత్తగా ఈ సంగతులను {కొంతమంది ఇతర ప్రజలకు} బోధించాలి. {వీరు ఖచ్చితంగా} నమ్మదగిన ప్రజలుగా ఉండాలి, క్రమంగా ఇతరులకు బోధించడానికి యోగ్యమైన వారుగా ఉండాలి.

3 ఒక మంచి సైనికుడు {తన సేనా నాయకునికి అతడు విధేయత చూపుతూ ఉన్న విధంగా} కష్టాలు భరించు విధంగా మనం మెస్సీయ యేసుకు విధేయత చూపుతున్నప్పుడు కష్టాలలో {నాతో} చేరుము. 4 {నీకు తెలుసు} సైనికుల వలే సేవ చేసేవారు తమ సేనా నాయకుని సంతోషపరచడం కోసం సాధారణ జీవిత పనులలో చిక్కుకోడు. 5 అదేవిధంగా ఆటలలో పోటీ చేసే క్రీడాకారులు నియమాలకు వారు లోబడకపోతే విజయాన్ని పొందలేరు. 6 కష్టపడుతున్న రైతు మొదటి పంటలో తన భాగాన్ని పొందాలి. 7 నేను ఇప్పుడు రాసిన వాటిని గురించి ఆలోచించు, ఎందుకంటే {, నీవు చేసినట్లయితే} నీవు {దానిని} సంపూర్ణంగా అర్థం చేసుకోడానికి ప్రభువు నీకు సమర్ధత కలిగిస్తాడు.

8 {నువ్వు కష్టాలను భరిస్తూ ఉన్నప్పుడు} మెస్సీయ యేసును జ్ఞాపకం చేసుకో, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడు. ఆయన రాజైన దావీదు సంతానం. నేను ప్రకటించించిన శుభవార్త ఇదే. 9 దీని {శుభవార్త} కోసం నేను అనేకమైన సంగతులను అనుభవించాను, వీటిలో ఇప్పుడు సైనికులు నన్ను ఒక నేరస్థుడి వలే చెరసాలలో బంధించారు. అయితే దేవుని నుండి సందేశాన్ని ఏ ఒక్కరూ బంధించలేరు.

10 కాబట్టి దేవుడు ఎన్నిక చేసుకొన్న వారి కోసం నేను భరిస్తున్న అంతటిని నేను ఇష్టపూర్వకంగా సహిస్తున్నాను. మెస్సీయ యేసు వారిని కూడా రక్షించడం కోసం నేను దీనిని చేస్తున్నాను, మరియు వారు ఆయన మహిమగల సన్నిధిలో శాశ్వతం ఉంటారు.

     11 నువ్వు ఈ సందేశం {మేము ప్రకటించేది} మీద ఆదారపడగలవు: "యేసు మన కోసం చనిపోయినప్పుడు ఇది పాత పాపాత్ముడైన వ్యక్తి అయినప్పటికీ మనం కూడా ఆయనతో చనిపోయినట్టు ఉంది. మనం దానిని చేసిన యెడల మనం కూడా ఆయనతో జీవిస్తాము.

     12 మనం కష్టాలను {ఈ జీవితంలో యేసుకు విధేయత చూపించడం నుండి వచ్చే} సహించిన యెడల, అప్పుడు మనం కూడా ఆయనతో పాటు {అన్నిటి మీద } రాజ్య పరిపాలన చేస్తాం.

     అయితే మనం ఆయనను యెరుగమని చెప్పిన యెడల ఆయన కూడా మనలను యెరుగనని చెపుతాడు.

     13 మనం {యేసుకు}అపనమ్మకస్థులంగా ఉన్న యెడల, ఆయన {మనకు} నమ్మకస్థుడుగా ఉండడానికి కొనసాగుతున్నాడు.

     ఎందుకంటే ఆయన తనను తాను ఎరుగననలేడు.

14 {విశ్వాసులకు}ఈ సంగతులను గురించి {నేను మీకు చెప్పినవి} జ్ఞాపకం చేస్తూ ఉండు. దేవుడు వింటూ ఉన్నాడని మరియు వారు {ఈ} మాటల {దేవుని సందేశాన్ని వ్యక్తీకరించడం కోసం సరైనవి} మీద వాదము పెట్టుకోవడం వద్దు అని వారిని హెచ్చరించు. ఈ విధంగా వాదులాడుకోవడం దేనికీ సహాయం చెయ్యదు, మరియు వినేవారు యేసును అనుసరించడం విడిచిపెట్టాడానికి కారణం అవుతుంది. 15 దేవుడు ఆమోదించు ఒక వ్యక్తిగా ఉండడానికి నీ వంతు ఉత్తమమైనదానిని చెయ్యి. నీవు నిజమైన సందేశాన్ని సరిగా బోధిస్తున్నప్పుడు తాను మంచి కార్యాన్ని చేస్తున్నాడని తెలుసుకొను పనివాని వలే ఉండు.

16 దేవుణ్ణి నిరాకరించు వ్యర్ధమైన సంభాషణలకు దూరంగా ఉండు. ఎందుకంటే ఈ విధమైన సంబాషణ ప్రజలు అధికంగా మరియు మరింత అధికంగా దేవుణ్ణి అగౌరవపరచడానికి కారణం అవుతాయి. 17 ఈ విధమైన సంబాషణ అంటువ్యాధి వలే వ్యాపిస్తుంది. ఈ విధంగా మాట్లాడు మనుషులకు హుమెనై, మరియు ఫిలేతులు రెండు ఉదాహరణలుగా ఉన్నారు. 18 ఈ మనుషులు సత్యము కాని సంగతులను విశ్వసిస్తున్నారు మరియు బోధిస్తున్నారు. వారు {తప్పుగా} దేవుడు తన ప్రజలను ఇంతకుముందే మృతులలో నుండి లేపాడని {మరియు ఆ విధంగా తిరిగి చెయ్యడు} చెపుతున్నారు. ఈ విధంగా వారు కొందరు {విశ్వాసులు}విశ్వాసం {మెస్సీయలో} ఉంచడం నిలిపివేసేలా ఒప్పించారు.

19 అయితే దేవుని గురించిన సత్యం ఇంకా నిలిచియుంది. ఇది ఒక కట్టడం యొక్క ఒక స్థిరమైన పునాది వలే ఉంది. దీని మీద ఒకరు ఈ మాటలు రాసారు: "తనకు చెందిన వారిని ప్రభువు యెరుగును" మరియు "ప్రభువుకు చెందియున్నామని చెప్పుకొను ప్రతి ఒక్కరూ దుష్ట క్రియలు చెయ్యడం నిలిపి వెయ్యాలి."

20 ఒక ధనవంతుని ఇంటిలో బంగారంతోనూ మరియు వెండితోనూ చేసిన పాత్రలు మాత్రమే ఉండవు, అయితే కొయ్యతోనూ మరియు మట్టితోనూ చేసిన పాత్రలు కూడా ఉంటాయి. యజమాని బంగారం మరియు వెండి పాత్రలను గొప్పవీ మరియు గౌరవప్రదమైన సందర్భాలలో వినియోగిస్తాడు. అయితే అతడు కోయ్యవీ మరియు మట్టి పాత్రలను సామాన్యమైన, ఘనహీనమైన పనులు చెయ్యడానికి వినియోగిస్తాడు. 21 కాబట్టి ఎవరైనా తన జీవితంలో చెడుగా ఉన్నవాటి నుండి విడిపించుకొన్న యెడల ఒకడు సంపూర్ణంగా శుద్ధి చేసిన పాత్ర వలే ఉంటాడు, తద్వారా యజమానుడు దానిని ఎటువంటి సందర్భానికైనా వినియోగించుకోగలడు, అత్యంత ప్రత్యేకమైన వాటికోసం కూడా. అదేవిధంగా ఒక వ్యక్తి తన జీవితంలో చెడుగా ఉన్నవాటి నుండి విడిపించుకొన్నప్పుడు దేవుడు అతనిని యోగ్యమైన వానిగా యెంచుతాడు మరియు ఎటువంటి మంచి కార్యాన్నైనా చెయ్యడానికి వినియోగించుకోగలడు.

22 కాబట్టి యవనస్థులు సాధారణంగా కోరుకొనే పాపయుక్తమైన వాటిని చెయ్యడం విసర్జించు. దానికి బదులు ప్రభువుని యదార్ధంగా ఆరాధించు ప్రజలతో కలిసి సరిగా ఉన్న సంగతులను చెయ్యడానికి ప్రయాసపడుము, దేవునిలో నమ్మకం ఉంచుము మరియు ఆయనను మరియు ఇతరులను ప్రేమించు, మరియు ఇతర ప్రజలతో సమాధానంగా జీవించు. 23 కేవలం తెలివి తక్కువ వారు మాట్లాడు సంగతుల గురించి మరియు బుద్ధిహీనమైన ప్రజలు మాట్లాడు వాటిని గురించి ఎవరూ నీతో వాదించడానికి ఆరంభించనీయకుండా చూసుకోండి. మనుషులు అటువంటి మాటలు మాట్లాడునప్పుడు వారు పోట్లాడడానికి ఆరంభిస్తారని నీకు తెలుసు. 24 అయితే ప్రభువుకు సేవ చేసేవాడు పోట్లాడకూడదు. దానికి బదులు మనుష్యులు అందరి విషయంలో దయ కలిగి యుండాలి. అతడు బోధించడానికి {దేవుని సత్యాన్ని సరిగా} సమర్ధత కలిగి యుండాలి. అతడు ప్రజలతో ఓర్పు కలిగి యుండాలి. 25 అతనికి వ్యతిరేకంగా వాదించు ప్రజలను సాత్వికంతో హెచ్చరించాలి. ఒకవేళ దేవుడు వారిని పశ్చాత్తాపానికి {వారి చెడు ఆలోచన విషయంలో}మరియు సత్యం తెలుసుకోడానికి నడిపించవచ్చు. 26 ఈ విధానంలో వారు మరల సరిగా ఆలోచించవచ్చు. అపవాది వారిని మోసగిస్తున్నాడని మరియు వారిని నియంత్రిస్తున్నాడని వారు గుర్తిస్తారు తద్వారా ఆయన కోరుకున్న దానిని వారు చేస్తారు.

Chapter 3

1 అయితే చివరి రోజుల కాలం {మెస్సీయ తిరిగి రావడానికి ముందు} చాలా ప్రమాదకరంగా {విశ్వాసులకు} ఉంటుందని నీవు గ్రహించాలి. 2 ఇది ఎందుకంటే మనుషులు తక్కిన వారికంటే ఎక్కువగా తమ్మునుతాము ప్రేమిస్తారు. వారు డబ్బును ప్రేమిస్తారు. వారు తమను గురించి తాము గొప్పలు చెప్పుకొనే వారుగా ఉంటారు. వారు గర్విష్టులుగా ఉంటారు. వారు ఇతరులను అవమానిస్తారు. వారు తమ తల్లిదండ్రులకు విధేయత చూపించరు. వారు దేని కోసం ఎవరికీ కృతజ్ఞత చెప్పరు. వారు దేవుణ్ణి గౌరవించరు. 3 వారు ఇతరులను ప్రేమించరు. వారు ఏ ఒక్కరితోను సమాధానంగా ఉండడానికి నిరాకరిస్తారు. వారు ఇతరులను దుర్భాషలాడుతారు. వారు తమ్మునుతాము నియంత్రించుకోరు. వారు ఇతరుల పట్ల కూరంగా ఉంటారు. వారు మంచిదిగా ఉన్న దేనినైనా ద్వేషిస్తారు. 4 వారు ద్రోహం చేస్తారు {వారు కాపాడవలసిన వారికి}. ఆలోచన లేకుండా వారు ప్రమాదపు కార్యాలు చేస్తారు. వారు గర్విష్టులుగా ఉంటారు. దేవుణ్ణి ప్రేమించడానికి బదులు తమను సంతోషపరచు వాటిని చేస్తారు. 5 వారు భక్తి గలవారుగా ఉండడంలోని {వెలుపలి} రూపాన్ని కొనసాగిస్తారు. అయితే దేవుడు తన శక్తివంత కార్యాన్ని {వారిలో} వాస్తవంగా చెయ్యడంలో అనుమతించడానికి వారు నిరాకరిస్తారు. అటువంటి మనుషుల నుండి దూరంగా ఉండు.

6 వారిలో కొందరు తమను వారి గృహాలలోనికి అనుమతించమని మోసం చేస్తారు, అక్కడ బుద్ధిహీనమైన స్త్రీలు ఆలోచించే దానిని వారు నియంత్రించడం ఆరంభిస్తారు. ఈ స్త్రీలు నిరంతరం పాపం చేస్తుంటారు, మరియు వారు చేయాలని అనుకున్న దేనినైనా చేస్తుంటారు. 7 ఈ స్త్రీలు నూతన సంగతులను నేర్చుకోడానికి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నప్పటికీ వాస్తవంగా సత్యమైన దానిని వారు ఎప్పటికీ గ్రహించలేకపోయారు. 8 ఇదే విధానంలో {ఫరో యొక్క మాంత్రికులు} యన్నే, మరియు యంబ్రే అనువారు మోషేను {అతనికి చెపుతున్నాడు} ఆపడానికి ప్రయత్నించారు {ఫరో విశ్వాసం ఉంచకుండా}, కాబట్టి ఈ మనుషులు కూడా {యేసును గురించిన} సత్య సందేశాన్ని ఆపడానికి {మనుషులు విశ్వసించకుండా} ప్రయత్నిస్తున్నారు. ఈ మనుషులు వారు ఆలోచించడంలో నాశనం అయ్యారు. {వారు బోధకులుగా ఉండడానికి అర్హులు కాదు ఎందుకంటే} వారు యేసులో విశ్వాసం ఉంచడానికి కేవలం కపటంగా ప్రవర్తిస్తున్నారు. 9 కాబట్టి వారు కొందరికి తప్పు సంగతులు బోధించడానికి సమర్ధత కలిగిన వారుగా ఉన్నప్పటికి, వారు విజయవంతంగా కొనసాగరు, ఎందుకంటే ఈ మనుషులు దేనినీ అర్థం చేసుకోలేరని అనేకులైన ఇతరులు స్పష్టంగా గ్రహిస్తారు. వారు బుద్ధిహీనులు అని మనుషులు గ్రహించినప్పుడు యన్నే, మరియు యంబ్రే లకు జరిగిన విధానంలోనే ఇది వారికి జరుగుతుంది.

10 అయితే నీ మట్టుకు, నేను బోధిస్తున్నదీ మరియు నీవు బోధిస్తున్నదీ నీవు బాగా యెరుగుదువు. నా జీవన విధానమును, మరియు దేవుణ్ణి సేవించడానికి నేను సమస్తాన్ని ఏవిధంగా చేస్తానో నీవు తెలుసుకో మరియు అనుకరించు. నేను కలిగియున్న విధంగా నువ్వు దేవుణ్ణి విశ్వసించావు. నేను కష్టాలు భరిస్తున్నప్పుడు కూడా నేను సమాధానం కలిగియుండడం నీవు చూసావు. నేను దేవుణ్ణి మరియు విశ్వాసులను ప్రేమిస్తున్నానని నీవు చూసావు. సేవ చెయ్యడం చాలా కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి సేవించడం నేను కొనసాగించడం నీవు చూసావు. 11 మనుషులు నన్ను హింసించడం నీవు చూసావు. నేను అంతియొకయ, ఈకొనియ, మరియు లుస్త్ర {యొక్క పట్టణాలలో} నేను హింస పొందినప్పుడు నీవు చూసావు. {నీవు చూసావు ఎలా} నేను {ఆ స్థలాలలో} మనుషులు నన్ను హింసించిన విధానాలను సహించాను, అయితే ఆ పరిస్థితులు అన్నిటిలో జీవించి యుండడానికి ప్రభువు నాకు శక్తినిచ్చాడు.

12 మెస్సీయ యేసుతో తమ సంబంధం ద్వారా దేవుణ్ణి ఘనపరచే మార్గంలో జీవించడానికి కోరుకొనే విశ్వాసులు అందరిని మనుషులు హింసకు గురి చేస్తారు అనేది వాస్తవం. 13 కపటంగా ప్రవర్తించే {విశ్వాసులుగా ఉండడానికి} చెడ్డ మనుషులు అంతకంతకు చెడ్డ వారుగా మారడానికి కొనసాగుతారు. సత్యం కాని సంగతులను తాము అంతకంతకు విశ్వసిస్తూ, సత్యం కాని సంగతులను మనుషులు విశ్వసించేలా వారు చేస్తారు. 14 అయితే దీనికి భిన్నంగా నువ్వు నేర్చుకొన్నదానిని మరియు రూఢిగా నమ్మినదానిని విశ్వసించడానికి ఖచ్చితంగా కొనసాగాలి. {ఈ సంగతులు సత్యం అని నువ్వు నమ్మవచ్చు,} ఎందుకంటే నీకు {దీనిని} ఈ సంగతులను బోధించిన మనుషులు {నమ్మదగినవారు} [అని] నీకు తెలుసు. 15 {నువ్వు} కూడా {ఈ సంగతులు సత్యం అని యెరుగుదువు} ఎందుకంటే నువ్వు చిన్న బిడ్డగా ఉన్న సమయం నుండి లేఖనాలలో దేవుడు చెపుతున్న దానిని యెరిగియున్నావు. మనం మెస్సీయ యేసులో విశ్వాసముంచినప్పుడు దేవుడు మనలను ఏవిధంగా రక్షిస్తాడో అర్థం చేసుకోడానికి లేఖనాలు నీకు సామర్ధ్యాన్ని కలిగిస్తాయి.

16 లేఖనాలు అన్నీ దేవుని ఆత్మ నుండి వచ్చాయి. అవి బోధించడం కోసం {దేవుని గురించిన సత్యాన్ని మనుషులకు} ప్రయోజనకరం. వారు తప్పు చేసినప్పుడు తెలుసుకోడానికి కూడా (మనుషులకు} సహాయం చేస్తాయి మరియు సరియైన దానిని అర్థం చేసుకోడానికి {వారికి}సహాయం చేస్తాయి, మరియు సరియైన దానిని ఏవిధంగా చెయ్యాలో {మనుషులకు} తర్ఫీదు కోసం అవి ప్రయోజనకరం. 17 ఈ విధానాలలో దేవుణ్ణి సేవిస్తున్న విశ్వాసులు సంపూర్ణంగా సిద్ధపడి ఉండడానికి మరియు ప్రతివిధమైన మంచి కార్యాన్ని చెయ్యడానికి వారికి అవసరమైన ప్రతీ దానిని కలిగియుండడానికి లేఖనాలు శక్తినిస్తాయి.

Chapter 4

1 {తిమోతి,}దేవుడు మరియు మెస్సీయ యేసు మనలను చూస్తున్నాడు మరియు వింటున్నప్పుడు {, నువ్వు వాటిని చెయ్యాలని వారు కూడా ఎదురుచూస్తున్నారు} ఇప్పుడు నేను నిన్ను రూఢిగా {కొన్ని సంగతులను చెయ్యడానికి, మరియు} ఆజ్ఞాపిస్తున్నాను. {జ్ఞాపకం ఉంచుకో} ఇప్పటి వరకు జీవించి యున్న మనుషులు అందరికీ తీర్పు తీర్చడానికి మెస్సీయ యేసు వస్తున్నాడు. నువ్వు యేసును చూడడానికీ, మరియు ఆయన రాజుగా రాజ్య పాలన చెయ్యడానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఒక భాగంగా ఉండడానికి బలంగా కోరుకొంటూ ఉన్నప్పుడు నేను నిన్ను రూఢిగా ఆజ్ఞాపిస్తున్నాను,

2 {మెస్సీయ గురించి} సందేశాన్ని ప్రకటించడానికి. చెయ్యడానికి ఇది తేలికగా ఉన్నప్పుడు మరియు చెయ్యడానికి ఇది తేలికగా లేనప్పుడు దీనిని చెయ్యడానికి సిద్ధంగా ఉండు. మనుష్యులు తప్పు చేసినప్పుడు వారిని సరిచెయ్యి. వారిని గద్దించు {పాపం చెయ్యకుండా ఉండడానికి}. సరియైన దానిని చెయ్యడానికి వారిని ప్రోత్సహించు. {ఈ సంగతులను నీవు జరిగిస్తున్నావు గనుక} చాలా సహనంతో వారికి బోధిస్తూ ఉండు.

3 {నేను ఈ సంగతులు నీకు చెపుతున్నాను ఎందుకంటే} తరువాతికాలంలో మనుషులు ఖచ్చితమైన బోధను వినడానికి కోరుకోరు. దానికి బదులుగా మనుషులు తాము కోరుకున్న దానిని వారు చెయ్యవచ్చు అని వారికి చెప్పేవారిని వారు పోగు చెయ్యగలిగినంత మంది ఉపదేశకులను పోగుచేసుకొంటారు. వారు వినడానికి ఆతృత కలిగి యుండేది ఇదే. 4 కాబట్టి సత్యం అయిన దానిని వినడానికి వారు నిలుపు చెయ్యడం మాత్రమే కాదు, అయితే దానికి బదులుగా వారు ఈ బోధకులు బుద్ధిహీనమైన కథలతో వారిని మోసపుచ్చేలా చెయ్యనిస్తారు.

5 అయితే నీవు మాత్రం, తిమోతి, ఏమి జరిగినప్పటికీ నిన్ను నీవు నియంత్రించుకో. కష్టమైన సంగతులను సహించు {ఇష్టపూర్వకంగా ఉండు}. శుభ వార్తను ప్రకటించు పనిని చెయ్యి. ప్రభువును సేవించడానికి నువ్వు ఖచ్చితంగా చెయ్యవలసిన కార్యాన్ని సంపూర్తి చెయ్యి.

6 {ఈ సంగతులను నేను నీకు చెపుతున్నాను} ఎందుకంటే నా జీవితం దేవునికి ఒక నీటి అర్పణ వలే ఉంది. ఇది యాజకుడు దాదాపు కుమ్మరించినదిగా ఉంది. నా మరణ సమయం దగ్గరగా ఉంది. 7 ఒక క్రీడాకారుడు ఒక పందెములో తన ఉత్తమమైన దానిని చేసిన విధంగా నేను ఉన్నాను. నేను పరుగుపందెమును ముగించిన పరుగెత్తువాని వలే ఉన్నాను. {ఈ పోలికల ద్వారా, నేను ఉద్దేశిస్తున్నాను} నేను ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపించడం కొనసాగిస్తున్నాను. 8 కాబట్టి {, తన పరుగు పందెంలో గెలుపొందిన పరుగెత్తే వాని వలే} ఇప్పుడు నా కోసం నిలిచి యున్నది {పొందడానికి} దేవుణ్ణి సంతోషపరచిన మార్గంలో జీవించిన దానికోసం బహుమతి. న్యాయవంతంగా తీర్పు తీర్చువాడు, ప్రభువు నాకోసం ఈ బహుమతిని సిద్ధంగా ఉంచాడు మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన నాకు దానిని ఇస్తాడు. ఆయన దానిని నాకు ఇవ్వడం మాత్రమే కాదు, అయితే ఆయన కోసం తిరిగి రావడానికి ఆతృతగా ఎదురుచూచేవారందరికీ అనుగ్రహిస్తాడు కూడా.

9 {తిమోతి,}నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నించు. 10 ఎందుకంటే దేమా నన్ను విడిచిపెట్టాడు మరియు తెస్సలోనిక {నగరానికి} వెళ్ళిపోయాడు. అతడు ఈ లోకంలో ఉన్న జీవితాన్ని {అమితంగా} ప్రేమించాడు. క్రేస్కే గలతీయ {దేశము}కు {వెళ్ళిపోయాడు} మరియు తీతు దల్మతియ {జిల్లా} కు {వెళ్లిపోయాడు}. 11 లూకా మాత్రమే ఇంకా నా దగ్గర ఉన్నాడు. మార్కును తీసుకో మరియు అతనిని నీతో తీసుకొనిరా. {ఇది చెయ్యి} ఎందుకంటే నాకు అవసరం ఉన్న విషయాలతో అతడు నాకు సహాయం చెయ్యగలడు. 12 తుకికు విషయం, నేను {అతనిని} ఎఫెసు {నగరం} కు పంపాను.

13 నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయ {నగరం} లో కర్పు దగ్గర ఉంచి వచ్చిన వెలుపలి అంగీని తీసుకొనిరా. అంతే కాకుండా చుట్టలను, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకురా. 14 అలెగ్జాండర్ అనే లోహపు పనివాడు నాకు అనేక దుష్ట కార్యాలు చేసాడు. అతడు చేసిన పనుల కోసం ప్రభువు అతనిని శిక్షించును. 15 నువ్వు కూడా అతనికి వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మేము ప్రకటించకుండా మమ్మును నిలువరించడానికి సాధ్యమైనదంతా చేసాడు.

16 మొదట సారి నేను {న్యాయస్థానంలో} నా పక్షంగా వాదించుకొన్నాను, విశ్వాసులు ఎవరూ నన్ను బలపరచడానికి రాలేదు. వారు అందరూ దూరంగా నిలిచారు. దాని విషయంలో దేవుడు వారిని బాధ్యులుగా ఉంచకుండును గాక.

17 అయితే ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నన్ను బలవంతునిగా చేసాడు. తద్వారా నేను ఆయన వాక్కును సంపూర్ణంగా ప్రకటించాను మరియు తద్వారా అన్యజనులు అందరూ దానిని విన్నారు. ఒక సింహం నోటి నుండి ఆయన నన్ను కాపాడిన విధంగా చాలా ప్రమాదకరమైన ఒక పరిస్థితి నుండి దేవుడు నన్ను కాపాడాడు. 18 వారు చేసిన ప్రతీ దుష్ట కార్యం నుండి ప్రభువు నన్ను కాపాడుతాడు. పరలోకంలో ఆయన రాజ్య పాలన చేసే స్థలానికి ఆయన నన్ను సురక్షితంగా తీసుకొని వస్తాడు. మనుషులు ఆయనను నిత్యము మరియు శాశ్వతమూ స్తుతించుదురు గాక. ఆమేన్.

19 ప్రిస్కల్ల మరియు అకులకూ శుభములు చెప్పు. ఒనేసిఫోరు యొక్క ఇంటిలో ఉన్న మనుషులకు శుభములు చెప్పు. 20 ఎరస్తు కొరింథు {నగరం} లో నిలిచిపోయాడు. త్రోఫిము విషయం, నేను అతనిని మిలేతు {పట్టణం} లో విడిచి వచ్చాను ఎందుకంటే అతడు జబ్బు పడ్డాడు.

21 చలికాలం ముందే రావడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, మరియు {అనేకులైన} {ఇతర} విశ్వాసులు {ఇక్కడ} నీకు శుభములు చెపుతున్నారు.

22 ప్రభువు నీ ఆత్మతో ఉంటాడు గాక {, తిమోతి}. మీ అందరికి {అక్కడ ఉన్న విశ్వాసులు} దయ చూపించును గాక.