తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 నేను,} పౌలును, {మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను,} మరియు మా తోటి విశ్వాసి అయిన సొస్తెనేసును {నాతో ఉన్నాడు}. మెస్సీయ యేసుకు ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు నన్ను పంపడానికి ఎంచుకున్నాడు, ఎందుకంటే దేవుడు కోరుకున్నది అదే. 2 కొరింథు నగరంలో ఉన్న దేవునికి చెందిన విశ్వాసుల సమూహాలలో {భాగమైన మీకు} {నేను ఈ లేఖను పంపుచున్నాను}. మిమ్ములను మెస్సీయ యేసుతో ఏకం చేయడం ద్వారా {దేవుడు} తన కోసం {మిమ్ములను} ప్రత్యేక పరచుకొన్నాడు మరియు {ఆయన} తన స్వంత మనుష్యులుగా ఉండుటకు {మిమ్ములను} ఎంచుకున్నాడు. అనేక దేశాలు మరియు నగరాలలో మన ప్రభువైన యేసు మెస్సీయను ఆరాధించే విశ్వాసుల సమూహములో {మీరు} భాగం. {యేసు మెస్సీయ} వారి {ప్రభువు} మరియు మన {ప్రభువు}. 3 మన తండ్రి అయిన దేవుడు, మరియు మెస్సీయ {అయిన} ప్రభువైన యేసు మీకు దయ {కలిగియుండడం కొనసాగడానికి} మరియు సమాధానకరముగా ఉండేలా {మిమ్మును చేయును} గాక. 4 మీ గురించి నేను తరచూ నా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతాను. {నేను ఇది చేస్తున్నాను} ఎందుకంటే {నాకు తెలుసు} దేవుడు ఏవిధంగా మిమ్ములను మెస్సీయ యేసుతో ఏకం చేయడం ద్వారా మీ యెడల దయతో వ్యవహరిస్తున్నాడు. 5 దేవుడు మీ యెడల దయతో ప్రవర్తించాడని నేను చెప్పినప్పుడు, మీరు} చెప్పేది ఏదైనను మరియు మీకు తెలిసిననది ఏదైనను వాటితో సహా, {మీ జీవితములోని} ప్రతి ప్రాంతంలో మెస్సీయాతో మిమ్ములను ఏకం చేయడం చేత ఆయన మిమ్ములను సమృద్ధిగా ఆశీర్వదించాడు అని నేను అర్థం చేసుకున్నాను. 6 {దేవుడు మిమ్మును ఆశీర్వదించాడు} ఎందుకంటే మెస్సీయ గురించి మేము మీకు చెప్పినది నిజము అని ఆయన మీకు నిరూపించాడు. 7 మన ప్రభువైన యేసు మెస్సీయ తిరిగి వస్తాడని నమ్మకంగా ఎదురుచూసే {ఈ సమయంలో} మీరు ఆత్మీయముగా పూర్తిగా సిద్ధమయ్యేలా {దేవుడు మీ కోసం వీటిని చేసాడు}. 8 {మా సందేశం నిజమని ఆయన నిరూపించిన విధముగా,} {మీ భూసంబంధమైన జీవితాలు} ముగిసే వరకు {మెస్సీయలో} మీ నమ్మకాన్ని కూడా దేవుడు నిజమని రుజువు చేస్తాడు. {దీని కారణంగా,} మన ప్రభువైన యేసు మెస్సీయ {భూమికి} తిరిగి వచ్చినప్పుడు ఆయన మిమ్ములను దోషులు కాకుండా తీర్పు తీరుస్తాడు. 9 దేవుడు తాను వాగ్దానము చేసినవాటిని ఎల్లప్పుడు చేస్తాడు, {మరియు} తన కుమారుడైన యేసు మెస్సీయ, మన ప్రభువుతో సమస్తమును పంచుకోడానికి మిమ్మును ప్రత్యేకంగా ఏర్పరచుకొన్నవాడు {ఆయనే}. 10 నా తోటి విశ్వాసులారా, మన ప్రభువైన యేసు మెస్సీయ అధికారం ఇచ్చిన వ్యక్తి వలే నేను మీతో వేడుకుంటున్నాను, మీరు అందరు ఒకరితో ఒకరు ఏకీభవించాలి అని {నేను అడుగుచున్నాను}. మీరు ప్రత్యర్థి గుంపులలోనికి విడిపోకూడదు. అయితే మీరు తలంచుచున్నదానిలో అంగీకరించడం చేత మరియు చెయ్యడానికి మీరు తీర్మానించుకున్న దానిలో అంగీకరించడం చేత మీరు ఒకరితో ఒకరు సమాధానపడాలి {అని నేను అడుగుతున్నాను}. 11 {నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను} ఎందుకంటే క్లోయే యొక్క {ఇంటి సభ్యులు} కొంతమంది {సభ్యులు} మీ గురించి నాతో మాట్లాడారు. నా తోటి విశ్వాసులారా, మీరు మీ మధ్య కలహపడుతున్నారు అని {వారు చెప్పారు}. 12 మీలో ఎంతమంది ఉదాహరణకు, మీరు పౌలు యొక్క గుంపుకు చెందియున్నారు లేదా మీరు అపొల్లో యొక్క గుంపుకు చెందిన వారు అని లేదా మీరు కేఫా యొక్క గుంపుకు చెందినవారు అని లేదా మీరు మెస్సీయ యొక్క గుంపుకు చెందినవారు అని అని చెప్పుకుంటున్నారు అనే దాని గురించి నేను మాట్లాడుచున్నాను, 13 ఎవరూ మెస్సీయను ముక్కలలోనికి విడదీయ లేరు {,కాబట్టి మీరు కూడా ముక్కలలోనికి విడదీయ కూడదు}. మీ పక్షముగా పౌలును ఏ ఒక్కరు సిలువ వేయ లేదు మరియు మీరు పౌలుకు చెందిన వారుగా ఉండు నిమిత్తం ఏ ఒక్కరూ మీకు బాప్తిస్మం ఇవ్వలేదు. 14 {ఇద్దరు మనుష్యులు:} క్రిస్పు మరియు గాయి కోసం తప్పించి మీ గుంపుకు చెందిన మనుష్యులకు ఎవ్వరికీ బాప్తిస్మం ఇవ్వలేదు అని నేను {దేవునికి} కృతజ్ఞతలు తెలుపుచున్నాను. 15 ఎందుకంటే {నేను మీలో చాలా తక్కువ మందికి బాప్తిస్మం ఇచ్చాను,} మీరు నా గుంపుకు చెందినవారు అని చెప్పుకోనే విధముగా నేను మీకు బాప్తిస్మం ఇచ్చానని ఎవరూ చెప్పలేరు. 16 అవును, నేను స్తెఫను ఇంట్లో నివసించే వారికి కూడా బాప్తిస్మం ఇచ్చాను అని నాకు జ్ఞాపకం ఉంది. అది కాకుండా, నేను {మీ గుంపులో} ఎవరికీ బాప్తిస్మం ఇచ్చాను అని అనుకోవడం లేదు. 17 మెస్సీయ నన్ను {మనుష్యులకు} బాప్తిస్మం ఇవ్వడానికి నియమించలేదు అని {నేను మీలో కొద్దిమందికి బాప్తిస్మం ఇవ్వడమే} కారణం. బదులుగా, సువార్త ప్రకటించడానికి {ఆయన నన్ను నియమించాడు}. {మానవ ప్రమాణాల చేత} జ్ఞానవంతమైన మాటలు ఉపయోగించకుండా {నేను దీనిని చేస్తాను}. ఆ విధంగా, నేను సిలువ మీద మరణిస్తున్న మెస్సీయ {గురించిన సందేశం యొక్క ఉన్న శక్తిని} నాశనం చేయను. 18 {నేను తెలివైన పదాలను ఉపయోగించను,} ఎందుకంటే సిలువ మీద {మెస్సీయ యొక్క మరణం} గురించి నేను ప్రకటించే సందేశం తమ మీద తాము నాశనము తెచ్చుకుంటున్న మనుష్యులకు వెఱ్ఱితనముగా అనిపిస్తుంది. అయితే, దేవుడు తాను రక్షిస్తున్న మన కోసం ఈ సందేశంలో శక్తివంతంగా పనిచేస్తాడు. 19 {ఇది సత్యము అని మీరు చెప్పగలరు} ఎందుకంటే ప్రవక్త యెషయా వ్రాసాడు, “జ్ఞానులు ఆలోచించే జ్ఞానవంతమైన సంగతులు నేను పనికిరానివిగా మారుస్తాను, మరియు వివేకవంతులైన మనుష్యులు ఆలోచించే వివేకవంతమైన సంగతులను నేను వ్యర్థం చేస్తాను.” 20 {కాబట్టి అప్పుడు,} జ్ఞానులైన మనుష్యులు నిజంగా జ్ఞానవంతులు కారు, మరియు నిపుణులు నిజంగా నిపుణులు కాదు, మరియు వాదించడంలో నైపుణ్యం ఉన్న మనుష్యులు నిజంగా నిపుణులు కారు, ఎందుకంటే వారందరూ ప్రస్తుత లోక వ్యవస్థకు చెందినవారు. {వాస్తవానికి,} ఈ ప్రస్తుత లోకములో జ్ఞానవంతంగా ఉన్నట్టు కనిపించేది అస్సలు జ్ఞానవంతమైనది కాదు అని దేవుడు చూపించాడు. 21 ఇక్కడ ఈ విధంగా {దేవుడు దీనిని చేసాడు}. దేవుడు జ్ఞానయుక్తంగా ఎన్నుకున్న విధముగానే, అవిశ్వాసులు వారి యొక్క జ్ఞానవంతమైన ఆలోచన చేత దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. కాబట్టి, విశ్వాసులు ప్రకటించిన వెర్రితనపు సందేశం యొక్క విధానాల చేత {మెస్సీయలో} విశ్వాసం ఉన్నవారిని కాపాడడానికి దేవుడు నిర్ణయించాడు. 22 ఒక వైపు, {అనేక మంది} యూదు మనుష్యులు శక్తివంతమైన పనులను చూడడానికి కోరుకుంటున్నారు. మరో వైపు, {అనేకమంది} గ్రీకు మనుష్యులు జ్ఞాన వంతమైన ఆలోచన కోసం వెదకుతారు. 23 అయితే, మెస్సీయ సిలువ మీద మరణించాడు అని మేము ప్రకటిస్తున్నాము. {అనేక మంది} యూదు మనుష్యులు {ఈ సందేశాన్ని అభ్యంతరకరంగా భావిస్తారు} మరియు {అనేక మంది} యూదుయేతర మనుష్యులు {ఈ సందేశాన్ని వెర్రితనము అని భావిస్తారు}. 24 అయితే, దేవుడు ఏర్పరచుకున్న మనం, యూదు {మనుష్యులము} లేదా గ్రీకు {మనుష్యులము} అయినా, మెస్సీయ {గురించి ఈ సందేశం} ద్వారా దేవుడు శక్తివంతంగా మరియు జ్ఞానవంతంగా పనిచేస్తాడు అని {మనం}తెలుసుకున్నాము. 25 {ఇది} ఎందుకంటే దేవుడు చేసేది వెర్రితనముగా కనిపించడం మానవులు చేసేది దేని కంటే అయినా జ్ఞానవంతంగా ఉంటుంది, మరియు దేవుడు చేసేది బలహీనంగా కనిపించడం మానవులు {చేసే} దేని కంటే అయినా బలంగా ఉంటుంది. 26 {ఇది అలా ఉంది అని రుజువు} కోసం, తోటి విశ్వాసులారా, దేవుడు మిమ్ములను{మీరు ఉన్న విధంగా} ఎన్నుకున్నాడు అనే వాస్తవం గురించి ఆలోచించండి. మానవ దృక్ఫథం నుండి, మీలో చాలామంది జ్ఞానవంతంగా ఆలోచించ లేదు, శక్తివంతమైన పనులు చేయ లేదు, {లేదా} ముఖ్యమైన కుటుంబాలకు చెందియుండలేదు. 27 బదులుగా, జ్ఞానయుక్తంగా ఆలోచించేవారిని తగ్గించడానికి మానవులకు వెర్రితనముగా అనిపించే వాటిని ఉపయోగించాలని దేవుడు నిర్ణయించాడు. ఆ మనుష్యులను మరియు శక్తివంతంగా పని చేసే సంగతులను తగ్గించడానికి మానవులకు బలహీనంగా అనిపించే వాటిని ఉపయోగించాలని దేవుడు నిర్ణయించాడు. 28 మనుషులకు అప్రధానంగా అనిపించే వాటిని, మనుష్యులు చిన్నచూపు చూసే వాటిని ఉపయోగించడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఈ సంగతులు ఉనికిలో {కూడా} లేనట్టు {వలే ఇది ఉంది}, {అయితే} ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతులు అప్రధానమైనవిగా చెయ్యడానికి దేవుడు వాటిని ఉపయోగించడానికి దేవుడు నిర్ణయించాడు. 29 ఏ మానవుడూ దేవుని యొక్క దృష్టిలో తమ గురించి తాము గొప్ప సంగతులు చెప్పుకోకూడదు అనే {లక్ష్యంతో దేవుడు ఈ సంగతులు చేసాడు.} 30 దేవుడే మిమ్మును మెస్సీయ యేసుకు ఏకం చేసాడు. మెస్సీయ ద్వారా క్రియ చేయడం చేత దేవుడు మనలను జ్ఞానవంతులుగా చేసాడు. ఆయన మనలను నిర్దోషులమని ప్రకటించాడు, మనలను తన స్వంత మనుష్యులుగా ఏర్పరచుకున్నాడు మరియు {దుష్ట శక్తుల నుండి} మనలను విడిపించాడు. 31 కాబట్టి, {దేవుడే ఈ సంగతులు అన్నిటిని చేస్తున్న } కారణంగా , ప్రవక్త యిర్మియా రాసిన దానిని మనం చేయాలి}: “మనుష్యులు దేని గురించియైనా గొప్పగా చెప్పడానికి కోరుకున్న్ యెడల, వారు ప్రభువు గురించి ఆ గొప్ప సంగతులు చెప్పాలి.”

Chapter 2

1 నా తోటి విశ్వాసులారా, నేను మిమ్ములను సందర్శించి మరియు దేవుడు ఇప్పుడు మనకు బయలుపరచిన దాని గురించి మీకు చెప్పినప్పుడు నేను కూడా {ఈ నమూనా ప్రకారం ప్రవర్తించాను.} నేను ఇతరులు చేసిన దాని కంటే శక్తివంతమైన మార్గాలలో మాట్లాడ లేదు. నేను ఇతరులు చేసే దాని కంటే జ్ఞానవంతమైన మార్గాలలో వాదించ లేదు 2 {నేను దీనిని చేసాను} ఎందుకంటే మీరు ఉన్నట్టు నేను మీతో ఉన్నప్పుడు మెస్సీయ యేసు మరియు ఆయన సిలువ మీద ఎలా చనిపోయాడు అని అర్థం చేసుకున్న సంగతులను మాత్రమే నేను {మాట్లాడడం మరియు వ్యవహరించడానికి} ఎంచుకున్నాను. 3 నేను మీతో ఉన్నప్పుడు నేను కూడా {ఈ పద్ధతి ప్రకారం జీవించాను.} నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను భయపడ్డాను మరియు నేను తరచుగా వణికిపోయాను మరియు కదిలిపోయాను. 4 నేను {మీతో} మాట్లాడినప్పుడు మరియు నా సందేశాన్ని {మీతో} పంచుకున్నప్పుడు {మానవ ప్రమాణాల ప్రకారం} నేను జ్ఞానవంతంగా మరియు ఒప్పించే విధంగా మాట్లాడలేదు. బదులుగా, దేవుని యొక్క ఆత్మ { నా సందేశాన్ని పంచుకున్నప్పుడు నా చేత} శక్తివంతంగా పనిచేస్తున్నాడు అని నిరూపించాను 5 మీరు {దేవునిలో} విశ్వసించే విధంగా {నేను ఈ విధంగా నా సందేశాన్ని పంచుకున్నాను} ఎందుకంటే ఆయన శక్తివంతంగా వ్యవహరిస్తాడు, మానవులు {మీతో} జ్ఞానవంతమైన మాటలు మాట్లాడినందుకు కాదు. 6 {నేను ఏమి చెప్పినప్పటికీ,} {సువార్తను ప్రకటించే} మనం ఆత్మీయముగా పరిణతి చెందిన మనుష్యులతో ఉన్నప్పుడు జ్ఞానవంతంగా మాట్లాడతాము. అయితే, మానవీయ మార్గాలలో మాత్రమే ఆలోచించే మనుష్యులు మరియు ప్రస్తుతం పాలించే మనుష్యులు మనం జ్ఞానవంతంగా మాట్లాడతాము అని తలంచారు, {త్వరలో,} ఈ మనుష్యులు ఇక మీదట పాలించరు. 7 కాదు, దేవుడు మాకు బయలుపరచిన సంగతులను మేము {ప్రకటిస్తాము కాబట్టి} జ్ఞానవంతంగా మాట్లాడతాము. దేవుడు ఈ సంగతులను {ఇప్పటి వరకు} దాచిపెట్టాడు, ఆయన దేనినైనా సృష్టించడానికి ముందే వాటిని చేయడానికి నిర్ణయించుకున్నప్పటికీ. {ఆయన దీనిని అంతటినీ చేసాడు} తద్వారా ఆయన మనలను ఘనపరుస్తాడు. 8 ఇప్పుడు పరిపాలిస్తున్న మనుష్యులకు జ్ఞానవంతమైన ఈ సంగతుల గురించి తెలియదు. వారు యెరుగరు {అని మీరు చెప్పగలరు} ఎందుకంటే మన మహిమాన్విత ప్రభువును సిలువ మీద చంపారు. 9 బదులుగా, యెషయా ప్రవక్త వ్రాసిన దానితో {వారు ఎలా ప్రవర్తించారో} సరిపోతుంది: “ఆయనను ప్రేమించే మనుష్యుల కోసం దేవుడు ఇంతకు ముందు ఎవరూ చూడని సంగతులు మరియు ఇంతకు ముందు ఎవరూ వినని సంగతులు మరియు ఇంతకు ముందు ఏ మానవుడు ఊహించని సంగతులు సిద్ధంగా ఉంచాడు.” 10 దేవుడు ఈ సంగతులను {దేవుని యొక్క} ఆత్మ యొక్క శక్తి చేత మనకు తెలియజేసాడు. {దేవుడు తన ఆత్మ యొక్క శక్తి చేత పని చేస్తాడు} ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనుష్యులు అందరిని మరియు వస్తువులను అన్వేషిస్తాడు. అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన దేవుని గురించిన సంగతులను కూడా ఆయన అన్వేషిస్తాడు. 11 {దేవుని యొక్క ఆత్మ దేవుని గురించిన ప్రతిదానిని అన్వేషిస్తాడు అని మీరు చెప్పగలరు,} ఎందుకంటే ప్రతి మానవ జీవి అతని గురించి లేదా ఆమె గురించి ప్రతిదీ అర్థం చేసుకుంటాడు అని ప్రతి ఒక్కరికీ తెలుసు. అదే విధంగా, దేవుని గురించిన ప్రతిదానిని దేవుని యొక్క ఆత్మ మాత్రమే అర్థం చేసుకుంటాడు. 12 దేవుని నుండి వచ్చిన ఆత్మను మనం నిజంగా పొందాము. ప్రస్తుత లోకానికి చెందిన ఆత్మను మనము పొందలేదు. దేవుడు మన కోసం చేసిన ప్రతిదానిని మనం అర్థం చేసుకొను నిమిత్తం {మనం దేవుని యొక్క ఆత్మను పొందాము}. 13 మనం కూడా మాట్లాడుకునే సంగతులు ఇవి. మానవులు జ్ఞానంగా బోధించే పదాలను మేము ఉపయోగించము. బదులుగా, మనం ఆత్మ బోధించే పదాలను ఉపయోగిస్తాము, తద్వారా ఆత్మీయ పదాలతో ఆత్మీయ సత్యాలను వివరిస్తాము. 14 ఇప్పుడు, దేవుని యొక్క ఆత్మ లేని మనుష్యులు దేవుని యొక్క ఆత్మ ఇచ్చే మరియు బోధించే సంగతులను తిరస్కరిస్తారు. {వారు ఈ సంగతులను తిరస్కరిస్తారు,} ఎందుకంటే వారు తాము వెర్రివారు అని భావిస్తారు. వారు {దేవుని యొక్క ఆత్మ ఇచ్చే మరియు బోధించే సంగతుల} గురించి తెలుసుకోలేరు, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఉన్న మనుష్యులు మాత్రమే వాటి గురించి సరైన తీర్పు ఇవ్వగలరు. 15 మరోవైపు, దేవుని యొక్క ఆత్మ కలిగి యున్న మనుష్యులు ప్రతిదాని గురించి సరైన తీర్పు {ఇవ్వగలరు}. అయినప్పటికీ, ఏ {ఇతర} వ్యక్తి {ఇతర} వారి గురించి సరిగ్గా తీర్పు చెప్పలేరు. 16 ఇది {లేఖనము చెప్పేదానికి} సరిపోతుంది: “ప్రభువు ఏమి ఆలోచిస్తున్నాడో ఏ మానవునికి తెలియదు. ఏ మానవుడూ ఆయనకు దేని గురించి బోధించలేడు.” అయినప్పటికీ, మెస్సీయ ఆలోచిస్తున్న అవే సంగతులను మనం ఆలోచించవచ్చు.

Chapter 3

1 నా తోటి విశ్వాసులారా, {నేను మిమ్ములను సందర్శించినప్పుడు,} దేవుని యొక్క ఆత్మ కలిగిన మనుష్యులకు నేను బోధించే విధంగా మీకు బోధించలేకపోయాను. బదులుగా, మానవ మార్గాలలో మాత్రమే ఆలోచించే మనుష్యులకు నేను బోధించే విధంగా {నేను మీకు బోధించవలసి వచ్చింది}. {నేను దీనిని చేయవలసి వచ్చింది} ఎందుకంటే మీరు పరిణత లేని విధంగా మెస్సీయను విశ్వసించారు. 2 నేను మీకు సాధారణమైన సంగతుల గురించి బోధించాను. సంక్లిష్టమైన సంగతుల గురించి నేను బోధించలేదు. {నేను ఇది చేసాను} ఎందుకంటే మీరు సంక్లిష్టమైన బోధనల కోసం సిద్ధంగా లేరు. నిజానికి, మీరు ఇంకా సంక్లిష్టమైన బోధనలకు సిద్ధంగా లేరు. 3 {మీరు సంక్లిష్టమైన బోధనలకు సిద్ధంగా లేరని నాకు తెలుసు,} ఎందుకంటే మీరు ఇప్పటికీ మానవ మార్గాలలో మాత్రమే ఆలోచించే మనుష్యులు. మీలో కొందరు ఒకరి మీద ఒకరు ఈర్ష్య పడుచున్నారు, మరియు కొందరు ఒకరితో ఒకరు కలహ పడుచున్నారు. మీరు ఈ సంగతులు చేసినప్పుడు, మీరు మానవ మార్గాలలో మాత్రమే ఆలోచించే మనుష్యులు మరియు మానవ మార్గాలలో మాత్రమే ప్రవర్తించే మనుష్యులు అని రుజువు చేస్తుంది. 4 ఇంకా, మీలో కొందరు ఉదాహరణకు మీరు పౌలు యొక్క సమూహముకు చెందిన వారు అని లేదా మీరు అపొల్లో యొక్క సమూహముకు చెందినవారు అని వాదిస్తున్నారు. మీరు ఇలాంటి వాదనలు చేసినప్పుడు, మీరు మానవ మార్గాలలో మాత్రమే ఆలోచిస్తున్నారు అని మరియు ప్రవర్తిస్తున్నారని రుజువు చేస్తుంది. 5 అపొల్లో మరియు నేను, పౌలును, కేవలం {మెస్సీయకు} సేవ చేసే మనుష్యులము అని మీరు గ్రహించాలి. మనలో ప్రతి ఒక్కరు ప్రభువు మనకు అప్పగించిన పనిని చేస్తాము. మేము మెస్సీయ గురించి మీకు చెప్పినప్పుడు, మీరు ఆయనలో నమ్మకం ఉంచారు {, మాలో కాదు} 6 ముందుగా మీకు శుభవార్త ప్రకటించడానికి దేవుడు నన్ను నియమించాడు. నేను విత్తనాలు నాటిన వ్యక్తి వలే ఉన్నాను. మీకు శుభవార్త గురించి ఇంకా ఎక్కువ ప్రకటించడానికి అపొల్లోని {దేవుడు నియమించాడు}. అతడు విత్తనాలకు నీళ్ళు పోసే వ్యక్తి వలే ఉన్నాడు {తద్వారా అవి పెరుగుతాయి}. అయితే, సువార్తలో విశ్వసించడానికి మరియు అర్థం చేసుకోవడానికి దేవుడే మిమ్ములను సమర్ధులను చేసాడు. అదే విధానంలో మొక్కలను పెంచే వాడు ఆయనే. 7 మనుష్యులకు సువార్తను మొదట ప్రకటించే వ్యక్తి ముఖ్యమైనవాడు కాదు అని మీరు చూడవచ్చు. మనుష్యులకు సువార్త గురించి ఇంకా ఎక్కువగా ప్రకటించే వ్యక్తి ముఖ్యం కాదు. ఈ మనుష్యులు విత్తనాలు నాటడం మరియు మొక్కలకు నీరు పెట్టే వారి వలే ఉన్నారు. కాబట్టి వారు కూడా ముఖ్యమైనవారు కాదు. బదులుగా, దేవుడు ముఖ్యమైనవాడు, ఎందుకంటే మనుష్యులు సువార్తను విశ్వసించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఆయన సమర్థత కలిగిస్తాడు. అదే విధంగా, ఆయన మొక్కలు పెరిగేలా చేస్తాడు కాబట్టి ఆయన ముఖ్యమైనవాడు. 8 నిజానికి, మనుష్యులకు ముందుగా సువార్త ప్రకటించే వ్యక్తి మరియు మనుష్యులకు సువార్త గురించి ఎక్కువగా ప్రకటించే వ్యక్తి ఒకే లక్ష్యంతో ఉంటాడు. విత్తనాలు నాటిన వ్యక్తి మరియు మొక్కలకు నీరు పోసే వ్యక్తి వలే వారు ఉన్నారు, వారు కూడా అదే లక్ష్యంతో ఉంటారు. ఏ పని చేసినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారు చేసిన దానికి తగిన విధంగా {ఆయన వారికి ప్రతిఫలమిస్తాడు}. 9 మేము {సువార్తను ప్రకటించే} అందరం దేవుని కోసం పని చేస్తాము, అయితే మీరు దేవునికి చెందినవారు. మీరు దేవుని సొంతమైన వ్యవసాయ భూమి వలే ఉన్నారు, {, అందులో మేము విత్తనాలు నాటాము మరియు నీరు పోసాము}. నిజముగా, మీరు దేవునికి సొంతమైన ఒక ఇల్లు వలె ఉన్నారు. 10 మీకు ముందుగా సువార్తను జ్ఞానవంతంగా ప్రకటించే నైపుణ్యాలను దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఒక ఇల్లు కట్టే ముందు నేలలో పునాది వేసే నిర్మాణ యజమాని లాంటి వాడిని. {అపోల్లో వంటి} ఇతరులు, మీకు శుభవార్త గురించి మరింత ఎక్కువ ప్రకటిస్తారు. ఆ పునాది మీద ఒక ఇల్లు కట్టుకునే ఇతర నిర్మాణకులు లాంటి వారు. అంతిమంగా, సువార్త గురించి ఎక్కువగా ప్రకటించే మనుష్యులు అందరు దానిని సరిగ్గా ప్రకటిస్తారని నిర్ధారించుకోవాలి. వారు ఒక పునాది మీద సరైన విధముగా ఇల్లు కట్టుకునే నిర్మాణకుల వలె ఉండాలి. 11 మరొక వ్యక్తి ఇప్పటికే భూమిలో పునాది వేసిన యెడల ఎవరు భూమిలో ఏ ఒక్కరు వేయలేరు. అలాగే, మరెవరు ముందుగా మీకు సువార్త ప్రకటించలేరు, ఎందుకంటే నేను ఇప్పటికే అది చేసాను. నేను మీకు ప్రకటించినది {అది} యేసు మెస్సీయ {సాధించాడు}. యేసు గురించిన ఈ సందేశం ఒక ఇంటికి పునాది వలే ఉంది. 12 కట్టువారు దాని పునాది మీద ఇంటిని నిర్మించేటప్పుడు అనేక రకాల నిర్మాణ సామగ్రిని ఉపయోగించవచ్చు. బంగారం, వెండి, మరియు ఆభరణాలు, {ఇలాంటి మరింత మన్నికైన పదార్థాలు}, కలప, గడ్డి మరియు చెత్త వంటి {మరియు తక్కువ మన్నికైన పదార్థాలను}వారు ఉపయోగించవచ్చు. అదే విధంగా, సువార్త గురించి ఎక్కువగా ప్రకటించేవారిలో కొందరు దేవునికి మరింత ప్రీతికరమైన సంగతులను బోధిస్తారు. మరికొందరు దేవునికి తక్కువ ప్రీతికరమైన సంగతులను బోధిస్తారు. 13 ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చడానికి మెస్సీయ తిరిగి వచ్చిన దినమున, ప్రతి వ్యక్తి ఏ రకమైన పని చేసాడో ఆయన వెల్లడి చేస్తాడు. భవనం మంటల్లో చిక్కుకున్నప్పుడు కట్టువారు భవనాన్ని నిర్మించడానికి ఉపయోగించే పదార్థాల నాణ్యత స్పష్టమవుతుంది. అదే విధంగా, మెస్సీయ తిరిగి వచ్చిన దినమున అగ్ని వంటి తీర్పు సంభవిస్తుంది. ఈ తీర్పు సువార్త గురించి ఎక్కువగా ప్రకటించే వారు ఏమి బోధించారో దాని నాణ్యతను చూపుతుంది. 14 అగ్నిని తట్టుకునే భవనాన్ని నిర్మించిన కట్టువారెవరైనా గౌరవం మరియు డబ్బు పొందుతారు. అదే విధంగా, దేవుడు ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చినప్పుడు దేవుడు అంగీకరించే విధంగా సువార్త గురించి ఎక్కువగా బోధించే వారందరిని గౌరవిస్తాడు మరియు ప్రతిఫలమిస్తాడు. 15 అగ్ని దహించి వేసే భవనాన్ని నిర్మించిన కట్టువారు ఎవరైనా గౌరవాన్ని మరియు డబ్బును కోల్పోతారు. అయితే, కట్టువారు అగ్నిలో చనిపోరు, అయితే వారు జ్వాలల నుండి తప్పించుకుంటారు. అదే విధంగా, దేవుడు ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చేటప్పుడు, దేవుడు అంగీకరించని విధంగా సువార్త గురించి ఎక్కువగా బోధించే వారందరినీ దేవుడు గౌరవించడు లేదా ప్రతిఫలమివ్వడు. అయినప్పటికీ, ఈ బోధకులు వారు బోధించిన తప్పుడు విషయాలు ఉన్నప్పటికీ దేవుడు ఇంకను వీరిని అంగీకరిస్తాడు. 16 మీరు యెరూషలేములో దేవుని యొక్క దేవాలయము వలె ఉన్నారు అని జ్ఞాపకం ఉంచుకోవాలి {ఎందుకంటే దేవుడు దేవాలయములో ఉన్న విధముగా మీ మధ్య ఉన్నాడు}. దేవుని ఆత్మ నివసించే ఇల్లు వంటివారు వలే మీరు ఉన్నారు అని జ్ఞాపకం ఉంచుకోవాలి {ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు}. 17 తన ఆలయానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ వ్యక్తికి వ్యతిరేకంగా దేవుడు చర్య తీసుకుంటాడు. ఇది ఎందుకంటే దేవుని యొక్క దేవాలయము ఆయనకు మాత్రమే చెందుతుంది. మీరు దేవుని యొక్క దేవాలయం వంటివారు {కాబట్టి}, {మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ వ్యక్తికైనా వ్యతిరేకంగా దేవుడు చర్య తీసుకుంటాడు}. 18 మీ గురించి నిజం కాని వాటిని నమ్మవద్దు. మానవ ప్రమాణాల ప్రకారం మిమ్ములను మీరు జ్ఞానులుగా భావించుకునే మీరు {మానవ ప్రమాణాల ప్రకారం} వెర్రివారుగా మారాలి. ఈ విధంగా, మీరు {నిజంగా} జ్ఞానముగల మనుష్యులు అవుతారు. 19 {నేను ఈ మాటలు మాట్లాడుచున్నాను} ఎందుకంటే మానవులు జ్ఞానముగా ఉన్నాయని భావించే సంగతులను దేవుడు వెర్రివిగా ఉన్నాయని భావిస్తాడు. {ఇది నిజము అని మీకు తెలుసు} ఎందుకంటే యోబు యొక్క పుస్తకం యొక్క రచయిత వ్రాసాడు, “జ్ఞానులు ప్రణాళిక చేసే జ్ఞానవంతమైన పథకాలకు భంగం కలిగించేది దేవుడే.” 20 ఇంకా, {కీర్తన యొక్క రచయిత వ్రాసాడు}, “జ్ఞానముగల మనుష్యులు ప్రణాళిక చేసే ప్రతిదాని గురించి ప్రభువుకు తెలుసు, మరియు ఈ ప్రణాళికలు విజయవంతం కావు అని {ఆయనకు తెలుసు.}” 21 కాబట్టి, మీలో ఎవరునూ {మీరు ఇతర మనుష్యులను ఏ విధంగా అనుసరిస్తారో} గొప్పగా చెప్పుకోకూడదు. {నేను ఇది చెప్పుచున్నాను} ఎందుకంటే మీకు అన్నీ ఉన్నాయి {, కాబట్టి ఇతర మానవులను అనుసరించడం గురించి అతిశయించడం వెర్రితనము}. 22 మీకు పౌలు, అపొల్లో మరియు పేతురు {వంటి నాయకులు} ఉన్నారు. దేవుడు చేసినవి అన్నీయు మీరు కలిగి యున్నారు. మీరు జీవిస్తున్నప్పుడు {మీరు భయపడరు}, మరియు {మీరు చనిపోయినప్పుడు ఆదరణను కనుగొనగలరు}. మీరు ఇప్పుడు ఉనికి కలిగి ఉన్నవన్నీ మరియు భవిష్యత్తులో ఉండబోయేవన్నీ కలిగి ఉన్నారు. వాస్తవానికి, మీరు ప్రతిదీ కలిగి యున్నారు. 23 ఇంకా, మెస్సీయ మిమ్మును కలిగి ఉన్నాడు మరియు దేవుడు మెస్సీయను కలిగి ఉన్నాడు.

Chapter 4

1 మనుష్యులు {సువార్తను ప్రకటించే} మనలను మెస్సీయకు సేవ చేసేవారి వలే మరియు దేవుడు ఇప్పుడు మనకు వెల్లడించిన వాటిని ప్రకటించే బాధ్యతను కలిగి ఉన్నవారిగా తలంచడానికి నేను కోరుచున్నాను. 2 ఒక నాయకుడు మరొక వ్యక్తిని బాధ్యత నిర్వహించేవానిగా ఉంచినప్పుడల్లా, ఆ వ్యక్తి అతని లేదా ఆమె పనులను నమ్మకంగా చేయాలని నాయకుడు కోరతాడు. {అదే విధంగా, సువార్తను ప్రకటించే మనం మన పనిని నమ్మకంగా చేయాలని దేవుడు కోరుచున్నాడు.} 3 మీరు లేదా మరే ఇతర మానవ అధికారం {నేను నమ్మకముగా ప్రవర్తించానా లేదా అనే దాని గురించి} ఏమి నిర్ణయిస్తున్నారనే దాని గురించి నేను చింతించను. నిజానికి, {నేను నమ్మకంగా ప్రవర్తించానా లేదా అనే దాని గురించి} నేను నిర్ణయించుకునే దాని గురించి కూడా నేను చింతించను. 4 నిజానికి, నేను చేసిన తప్పు గురించి నాకు తెలియదు. అయినప్పటికీ, నా గురించి నాకు తెలిసినవి నేను నమ్మకంగా ప్రవర్తించానని నిరూపించలేదు. బదులుగా, {నేను నమ్మకంగా ప్రవర్తించానో లేదో} నిర్ణయించేది ప్రభువే. 5 కాబట్టి, ప్రభువు {ప్రతి ఒక్కరికీ మరియు ప్రతిదానికీ తీర్పు తీర్చడానికి} తిరిగి వచ్చే వరకు మీరు చివరకు దేని గురించీ నిర్ణయించుకోకూడదు. ఆయన ఇప్పుడు దాగి ఉన్నదానిని స్పష్టంగా తెలియజేస్తాడు మరియు ప్రతి వ్యక్తి ఏమి కోరుకుంటున్నాడో మరియు ప్రణాళికలను చేస్తున్నాడో ప్రతి ఒక్కరికీ చూపిస్తాడు. ఆ సమయములో, దేవుడు {నమ్మకంగా ప్రవర్తించిన} ప్రతి వ్యక్తిని ప్రశంసిస్తాడు. 6 నా తోటి విశ్వాసులారా, మీ ప్రయోజనం కోసం నా గురించి మరియు అపొల్లో గురించి ఈ విధముగా నేను మాట్లాడాను. లేఖనాల యొక్క రచయితలు వ్రాసిన వాటితో సరిపోయే మార్గాలలో మాత్రమే మీరు వ్యవహరించాలి అని మా ఉదాహరణ నుండి మీరు నేర్చుకోవడానికి నేను కోరుచున్నాను. అప్పుడు ఎవరూ ఒక నాయకుడి గురించి గొప్ప సంగతులు మరియు మరొక నాయకుడి గురించి చెడు సంగతులు మాట్లాడరు. 7 మిమ్ములను {ప్రతి ఇతర విశ్వాసి నుండి} ఎవరూ వేరు చేయలేరు. నిజానికి, దేవుడు మీరు కలిగి ఉన్న ప్రతి మంచి వస్తువును మీకు ఇచ్చాడు. ఇవి దేవుని నుండి వచ్చిన వరములు కాబట్టి, వాటిని మీరే సంపాదించుకున్నారు అని గర్వంగా చెప్పుకోకూడదు. 8 మీరు ప్రస్తుతం ఆత్మీయముగా మీకు కావలసినవన్నీ కలిగి ఉన్నట్టుగా {మీరు వ్యవహరిస్తున్నారు}. మీరు ప్రస్తుతం మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఆత్మీయ ఆశీర్వాదాలను కలిగి ఉన్నట్టుగా {మీరు వ్యవహరిస్తున్నారు}. {సువార్తను ప్రకటించే} మేము ఇప్పుడు క్రీస్తుతో పరిపాలించనప్పటికీ, మీరు ప్రస్తుతం క్రీస్తుతో పరిపాలించడం ప్రారంభించినట్లుగా {మీరు వ్యవహరిస్తున్నారు}. నిజానికి, మీరు నిజంగా అయనతో పరిపాలిస్తున్నారు అని నేను కోరుచున్నాను, తద్వారా మేము {సువార్తను ప్రకటించే} మీతో కలిసి పరిపాలించవచ్చు. 9 {మనం ఇప్పుడు క్రీస్తుతో పరిపాలిస్తున్నామని అనుకునే} బదులు, అవమానాన్ని అనుభవించడానికి మరియు చనిపోవడానికి దేవుడు నియమించిన అపొస్తలులముగా ఉండడానికి నేను భావిస్తున్నాను. మేము అవమానాన్ని అనుభవిస్తాము మరియు బహిరంగంగా చనిపోతాము, మరియు ఆత్మీయ జీవులు మరియు మానవులతో సహా దేవుడు సృష్టించిన ప్రతిదీ మమ్ములను చూడగలదు. 10 మేము మెస్సీయను సేవిస్తున్నాము కాబట్టి మేము వెర్రి మనుషులుగా ఉన్నట్టు {కనిపిస్తున్నాము}, అయితే దేవుడు మిమ్ములను మెస్సీయతో ఏకం చేస్తున్న కారణంగా మీరు జ్ఞానవంతులు అని {మీరు అనుకుంటున్నారు}. మేము శక్తి లేదా ప్రభావం లేని మనుష్యులుగా {కనిపిస్తున్నాము}, అయితే మీకు ఈ సంగతులు ఉన్నాయి అని {మీరు అనుకుంటున్నారు}. మనుష్యులు మిమ్ములను మెచ్చుకుంటారు {అని మీరు తలస్తున్నారు}, అయితే ఆ మనుష్యులు మనలను సిగ్గుపరుస్తారు. 11 ఇప్పుడు కూడా {నేను మీకు ఈ లేఖ వ్రాస్తున్నప్పుడు}, {క్రీస్తు పంపిన} మాకు తరచుగా తగినంత ఆహారం లేదా పానీయాలు లేవు. మేము చిరిగిన దుస్తులను ధరించాము, మరియు ఇతరులు పదేపదే మమ్ములను కొట్టారు. మేము నిరంతరం ప్రయాణం చేసాము మరియు ఇంటికి తిరిగి రాము. 12 మేము {జీవనం సంపాదించడానికి} చేతితో పని చేస్తాము. మనుష్యులు మనతో చెడుగా మాట్లాడినప్పుడు, మేము వారి గురించి మంచిగా మాట్లాడుతాము. మనుష్యులు మమ్ములను బాధపెట్టినప్పుడు {మేము మెస్సీయను సేవిస్తాము కాబట్టి}, మేము ఓపికగా దాని చేత జీవిస్తాము. 13 మనుష్యులు మన గురించి చెడుగా మాట్లాడినప్పుడు, మనం వారికి ప్రోత్సాహకరమైన మాటలు చెపుతాము. మానవ దృష్టికోణములో, ఒకరు పారవేయాల్సిన మురికి చెత్త వలే మేము విలువ లేనివాళ్ళము. {ఈ సంగతులు అన్నియు మా గురించి నిజమే} ఇప్పుడు కూడా {నేను మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను} 14 నేను ఇప్పుడే చెప్పడం ముగించిన దానిని నా లేఖలో చేర్చలేదు ఎందుకంటే నేను మిమ్ములను సిగ్గుపడేలా చేయాలనుకుంటున్నాను బదులుగా, {నేను ఈ సంగతులను చేర్చుచున్నాను} ఎందుకంటే నేను మీకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే మీరు నేను ప్రేమించే నా స్వంత పిల్లల వలే ఉన్నారు. 15 నేను మొదట మీకు సువార్త ప్రకటించినప్పుడు, మరియు దేవుడు మిమ్ములను మెస్సీయ యేసుకు ఏకం చేసినప్పుడు, నేను మీ ఆత్మీయ తండ్రిని అయ్యాను. కాబట్టి, మెస్సీయతో ఐక్యంగా జీవించడానికి మీకు సహాయం చేసిన లక్షలాది మంది ఉపాధ్యాయులు మీకు ఉన్నప్పటికీ, మీకు ఉన్న ఏకైక ఆత్మీయ తండ్రి నేను మాత్రమే. 16 ఎందుకంటే {నేను మీ ఆత్మీయ తండ్రిని}, నేను ఏ విధంగా జీవిస్తున్నానో అనుకరించమని మిమ్ములను వేడుకుంటున్నాను. 17 ఎందుకంటే {మీరు నన్ను అనుకరించాలని నేను కోరుచున్నాను}, నేను తిమోతి మిమ్ములను సందర్శించేలా చేసాను. అతడు నా స్వంత బిడ్డ వలే ఉన్నాడు, మరియు నేను అతనిని ప్రేమిస్తున్నాను. దేవుడు ప్రభువుతో ఐక్యం చేసిన వ్యక్తి వలే అతడు నమ్మకంగా {మెస్సీయకు సేవ చేస్తాడు. దేవుడు మెస్సీయ యేసుతో ఐక్యం చేసిన వ్యక్తి వలే నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో అతడు మీకు తిరిగి బోధిస్తాడు. నేను ప్రతి ప్రదేశంలో {నేను సందర్శించే} ప్రతి సంఘమునకు ఈ విధానములలో ప్రవర్తించమని ఆదేశిస్తాను. 18 మీలో కొందరు మీ గురించి గొప్ప విషయాలు తామే చెప్పుకుంటున్నారు. ఈ మనుష్యులు నేను మిమ్ములను సందర్శించబోవడం లేదు అన్నట్లు ప్రవర్తిస్తారు. 19 అయినప్పటికీ, ప్రభువు {నేను అలా చేయాలని} కోరుతున్నంత కాలం నేను మిమ్ములను అతి త్వరలో సందర్శిస్తాను. తమ గురించి గొప్పగా చెప్పుకునే ఈ మనుష్యులు ఏమి చెప్పుతారో నాకు ఇప్పటికే తెలుసు. {నేను మిమ్ములను సందర్శించినప్పుడు}, అవి నిజంగా శక్తివంతమైనవో కాదో నేను తెలుసుకుంటాను. 20 {నేను దీనిని చేస్తాను} ఎందుకంటే దేవుని రాజ్యం దేవుడు మనుష్యులు ద్వారా శక్తివంతంగా పనిచేయడం చేత పనిచేస్తుంది, మనుష్యులు గొప్ప మాటలు చెప్పడం చేత కాదు. 21 నేను చెప్పేదానికి మీరు ఏ విధంగా ప్రతిస్పందించాలో మీరు ఎంచుకున్నప్పుడు, నేను {నేను సందర్శించినప్పుడు} ఏ విధంగా ప్రవర్తించాలో కూడా మీరు ఎంచుకుంటున్నారు. నేను మిమ్ములను సందర్శించినప్పుడు, నేను మిమ్ములను కఠినంగా శిక్షించగలను {ఎందుకంటే మీరు విన లేదు}, లేదా నేను సున్నితంగా మరియు ప్రేమగా ప్రవర్తించగలను {ఎందుకంటే మీరు విన్నారు}.

Chapter 5

1 నిజానికి మీరు మీ సమూహములోని మనుష్యులను అక్రమమైన లైంగిక చర్యలో పాల్గొనడానికి అనుమతిస్తున్నారు అని నేను తెలుసుకున్నాను. దేవుణ్ణి ఆరాధించని వారు కూడా మీరు అనుమతించే కొన్నింటిని అనుమతించరు. మీ గుంపు నుండి ఒక వ్యక్తి తన సవతి తల్లితో లైంగిక చర్య చేస్తున్నాడు అని {ఒక మిక్కిలి చెడ్డ విషయం నేను విన్నాను. 2 {ఇది అయినప్పటికీ,} మీరు ఇప్పటికీ {ఆ పాపం} అని విలపించే బదులు మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ లైంగిక పాపం చేసిన వ్యక్తిని బహిష్కరించే లక్ష్యంతో {మీరు విలపించి ఉండాలి}. 3 {మీరు అతనిని బహిష్కరించాలి} ఎందుకంటే ఈ చెడు పని చేసిన వ్యక్తిని నేను ఇప్పటికే దోషిగా ప్రకటించాను. నేను శారీరకంగా మీతో లేకపోయినా, నేను మీ గురించి ఆలోచిస్తాను మరియు మీ గురించి శ్రద్ధ వహిస్తాను. {కాబట్టి, నేను ఈ వ్యక్తిని దోషిగా ప్రకటించినప్పుడు, నేను మీతో ఉన్నట్లే చెల్లుబాటు అవుతుంది}. 4 మీరు సమావేశమైనప్పుడు, నేను మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు, మరియు మేము మన ప్రభువైన యేసు మెస్సీయకు ప్రాతినిధ్యం వహిస్తాము. {మీరు ఈ విధంగా గుమిగూడినప్పుడు, మన ప్రభువైన యేసు మీకు అధికారం ఇచ్చినట్లుగా మీరు ఈ వ్యక్తిని శిక్షించాలి. 5 మీరు అతనిని వెళ్ళగొట్టాలి తద్వారా సాతాను అతనిని పరిపాలిస్తాడు. అది అతని పాపపు భాగాలను నాశనం చేస్తుంది మరియు అప్పుడు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు దేవుడు అతనిని రక్షిస్తాడు. 6 మీ గురించి గొప్పగా చెప్పుకోవడం సరైన పని కాదు. ఒక వ్యక్తి చెడు పనులు చేయడం పులిసిన పిండి వలే ఉన్నది అని మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు. కొద్దిగా పులియబెట్టిన పిండి కూడా మొత్తం పిండిని పులియబెట్టేలా చేస్తుంది మరియు ఒక వ్యక్తి కూడా చెడు పనులు చేస్తే మొత్తం సంఘమును దోషిగా చేస్తుంది. 7 యూదులు {పస్కా పండుగ సమయంలో} తమ ఇండ్ల నుండి పులిసిన పిండి తొలగించినట్టు వలే, కాబట్టి మీరు మీ సమూహము నుండి చెడు పనులు చేసే వారిని తొలగించాలి. అప్పుడు, మీరు తాజా, పులియని పిండిలో పులిసినది లేని విధంగా పాపం నుండి విముక్తి పొందుతారు. నిజానికి, మీరు పస్కా పండుగ వంటి కాలంలో జీవిస్తున్నారు. {ఇది ఎందుకంటే} పస్కా పండుగ సమయములో యూదులు బలి ఇచ్చే గొర్రెపిల్లను దేవుడు ఏ విధంగా విడిపించాడో సూచిస్తున్నట్లే, మీ కోసం మెస్సీయ మరణించాడు. 8 {మెస్సీయ మన కోసం చనిపోయాడు} కాబట్టి, మనం పస్కా పండుగలో పాల్గొన్నట్లుగా ప్రవర్తిద్దాం మరియు పాత పులిసిన పిండిని తీసివేద్దాం. మనం పులిసిన పిండిని వదిలించుకోవాలి, ఇది కీడు మరియు చెడ్డ పనులను సూచిస్తుంది. బదులుగా, మనం పులియబెట్టని రొట్టె తినాలి, ఇది నిజాయితీగా మరియు నమ్మదగినది చేయడం. 9 {దీనికి ముందు నేను మీకు పంపిన} లేఖలో, లైంగికంగా అనుచితంగా ప్రవర్తించే మనుష్యులతో సహవాసం చేయవద్దని నేను మీకు చెప్పాను. 10 లైంగిక అనైతిక మార్గాలలో ప్రవర్తించే అవిశ్వాసపు మనుష్యులతో లేదా తమకు అవసరమైన దానికంటే ఎక్కువ కావాలనుకునే మనుష్యులతో లేదా ఇతరులను మోసం చేసే మనుష్యులతో లేదా అబద్ధ దేవుళ్ళను ఆరాధించే మనుష్యులతో మీరు పూర్తిగా {విడిపోవాలని} {నా ఉద్దేశ్యం} కాదు. ఈ రకమైన మనుష్యులను నివారించడానికి, మీరు మొత్తం లోకము నుండి దూరంగా ఉండాలి. {మీరు చేయుటకు నేను మీకు ఆజ్ఞాపించినది అది కాదు.} 11 ఇప్పుడు, ఈ లేఖలో, మీరు తోటి విశ్వాసి అని పిలిచే వ్యక్తి పాప యుక్తంగా క్రియ జరిగిస్తున్నప్పుడు ఈ వ్యక్తితో సహవాసం చేయ వద్దు అని నేను మీకు చెప్పుచున్నాను. ఇందులో అక్రమమైన లైంగిక కార్యం కలిగియుండడం, ఒకటి కంటే ఎక్కువ అవసరాలు కోరుకోవడం, ఇతర దేవుళ్ళను ఆరాధించడం, ఇతరులను మాటలతో దుర్భాషలాడడం, మద్యంతో మత్తులుగా ఉండడం, మరియు ఇతరులను మోసం చేయడం వంటివి ఉన్నాయి. వీటిలో దేనినైనా చేసే వ్యక్తితో భోజనం చేయ వద్దు. 12 {మీరు తోటి విశ్వాసులతో మాత్రమే ఈ విధంగా ప్రవర్తించాలని నేను కోరుచున్నాను,} ఎందుకంటే {మీరు మరియు} నేను మన సమూహములో భాగం కాని వ్యక్తి దోషి లేదా నిర్దోషి అని నిర్ణయించాల్సిన అవసరం లేదు. బదులుగా, మీ గుంపులో భాగమైన మనుష్యులు దోషులా లేదా అమాయకులా అని నిర్ణయించడం మీద మీరు దృష్టి పెట్టాలి. 13 {మీ సమూహములో భాగం కాని మనుష్యుల గురించి చింతించకండి, ఎందుకంటే} వారు దోషులా లేదా నిర్దోషులా అని నిర్ణయించేది దేవుడే. {మీరు మీ సమూహములో భాగమైన మనుష్యుల మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే లేఖనం చెపుతోంది,} “మీ సమూహములో భాగమైన ఏ దుష్ట వ్యక్తినైనా మీరు తప్పక వదిలించుకోవాలి!”

Chapter 6

1 మీ సమూహములోని ఎవరైనా మీ సమూహములోని మరొక వ్యక్తితో కలహము పెట్టుకున్నప్పుడు, విశ్వసింపని మనుష్యుల ముందు మీరు కలహమును {ఒక బహిరంగ న్యాయస్థానములో} పరిష్కరించుకోకూడదు. బదులుగా, దేవుడు తన కోసం వేరుగా ఉంచుకున్న మనుష్యుల మధ్య {మీరు వ్యక్తిగతంగా కలహమును పరిష్కరించుకోవాలి}. 2 దేవుడు సృష్టించిన సమస్త వస్తువులు మరియు మనుష్యులు దోషులా లేదా నిర్దోషులా అని దేవుడు తన కోసం ప్రత్యేకంగా ఉంచుకున్న మనుష్యులు నిర్ణయిస్తారని మీకు ఖచ్చితంగా తెలుసు. ఈ సంగతులన్నీ మరియు మనుష్యులు దోషులా లేదా నిర్దోషులా అని మీరు నిర్ణయించుకుంటారు కాబట్టి, {మీ సమూహములో} చిన్న చిన్న కలహముల గురించి మీరు ఖచ్చితంగా నిర్ణయించుకోవచ్చు. 3 దేవదూతలు నిర్దోషులా లేక దోషులా అని మనము నిర్ణయిస్తామని మీరు గ్రహించాలి. {మనము అది చేస్తాము కాబట్టి,} మన ప్రస్తుత జీవితాలకు సంబంధించిన వివాదాల గురించి మనము నిశ్చయముగా నిర్ణయించుకోగలుగుతాము. 4 కాబట్టి, మీ ప్రస్తుత జీవితాల గురించి మీరు ఒకరితో ఒకరు కలహపడినప్పుడు, మీ విశ్వాసుల సమూహములో భాగం కాని మనుష్యులను ఎవరు దోషి లేదా నిర్దోషి అని మీరు నిర్ణయించకూడదు. 5 మీరు సిగ్గుపడేలా చేయడానికి నేను ఇప్పుడే చెప్పినదానిని చేర్చాను. తోటి విశ్వాసుల మధ్య వివాదాల గురించి నిర్ణయించడానికి తగిన జ్ఞానవంతమైన మనుష్యులు మీ సమూహములో ఖచ్చితంగా ఉంటారు. 6 అయితే బదులుగా, మీలో కొందరు విశ్వాసులు ఇతర విశ్వాసుల మీద చట్టపరమైన న్యాయస్థానంలో నిందారోపణ చేస్తారు మరియు నమ్మని మనుష్యులు వివాదాన్ని పరిష్కరిస్తారు. 7 ఎందుకంటే మీకు ఒకరితో ఒకరు వివాదాలు ఉన్నాయి, మీరు ఇప్పటికే యేసును అనుసరించడములో పూర్తిగా విఫలమయ్యారు. {ఈ విధంగా విఫలమవడం కంటే} బదులుగా, తోటి విశ్వాసులు మీకు వారు హాని చేసినప్పుడు లేదా మోసం చేసినప్పుడు మీరు వారిని క్షమించాలి. 8 {ఇతరులను క్షమించడం కంటే} బదులుగా, అయినప్పటికీ, మీరు {ఇతర మనుష్యులకు} హాని చేసారు మరియు మోసం చేసారు. నిజానికి, తోటి విశ్వాసులకు ఈ పనులు {మీరు చేసారు}! 9 ఇతరులకు హాని చేసే మనుష్యులు దేవుని యొక్క రాజ్యములో పాలుపంచుకోరని మీరు గ్రహించినప్పటికీ {మీరు ఈ పనులు చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది}. మీకు వేరే ఏదైనా చెప్పే వారిని నమ్మవద్దు. అక్రమమైన లైంగిక వాంఛ కలవారు లేదా ఇతర దేవుళ్ళను ఆరాధించే వారు లేదా ఒక వివాహమైన వ్యక్తితో లైంగిక చర్య కలిగినవారు లేదా ఒకే లింగానికి చెందిన వ్యక్తితో లైంగిక చర్యలలో పాల్గొనేవారు లేదా అదే లింగానికి చెందిన వ్యక్తితో లైంగిక చర్యలను ప్రారంభించే వారు. 10 లేదా ఇతరుల నుండి దొంగిలించేవారు లేదా తనకు అవసరమైన దానికంటే ఎక్కువ కావాలనుకునేవారు లేదా మద్యంతో నిండినవారు లేదా ఇతరులను మాటలతో దుర్భాషలాడేవారు లేదా ఇతరులను మోసం చేసేవారు దేవుని యొక్క రాజ్యంలో పాల్గొనరు. 11 మీలో కొందరు ఈ విధాలుగా ప్రవర్తించేవారు. అయితే, ఇప్పుడు దేవుడు మిమ్ములను శుద్ధి చేసాడు, మిమ్మును పరిశుద్ధపరచాడు, మిమ్ములను నిర్దోషులుగా ఉండడానికి ప్రకటించాడు. {మీరు ఈ సంగతులను అనుభవించారు} ఎందుకంటే ప్రభువైన యేసు మెస్సీయ మరియు పరిశుద్ధ ఆత్మ {వాటిని మీకు ఇవ్వడానికి} శక్తివంతంగా పనిచేస్తాడు. 12 {మీలో కొందరు చెపుతారు,} “నేను ఏదైనా చేయగలను మరియు దోషిగా మారను.” అయినప్పటికీ, కొన్ని విషయాలు {ఎవరికీ} ఉపయోగపడవు {అని నేను చెపుతాను}. {మరల, మీలో కొందరు చెపుతారు,} "నేను ఏదైనా చేయగలను మరియు దోషిగా మారను." అయినప్పటికీ, నన్ను దాని బానిసగా చేసే దేనిని నేను సేవించను {అని నేను చెపుతాను}. 13 {మీలో కొందరు చెపుతారు,} "ఆహారం ఒక వ్యక్తి కడుపు కోసం దానిని జీర్ణం చేయడానికి ఉనికి కలిగియుంటుంది, మరియు ఒక వ్యక్తి కడుపు ఆహారాన్ని జీర్ణం చేయడానికి.” నిజానికి, {అది నేను కూడా చెప్పుతాను} దేవుడు ఆహారం మరియు కడుపులను అప్రధానంగా చేస్తాడు. {వ్యక్తి కడుపు కోసం ఆహారం ఉందనేది నిజమే అయినప్పటికీ,} ఒక వ్యక్తి దానితో అక్రమమైన లైంగిక సంబంధం కోసం మానవ శరీరం ఉనికిలో లేదు. బదులుగా, ప్రభువును సేవించడానికి {మానవ శరీరం} ఉనికిలో ఉంది, మరియు మానవ శరీరమును రక్షించడానికి ప్రభువు పనిచేసాడు. 14 నిజానికి, దేవుడు ప్రభువును తిరిగి బ్రతికించాడు, మరియు మనలను కూడా తిరిగి బ్రతికించడానికి ఆయన శక్తివంతంగా పనిచేస్తాడు. 15 మీరు ఆయన శరీర భాగాల వలె మీ శరీరాలు మెస్సీయకు చెందినవవి అని మీకు ఖచ్చితంగా తెలుసు. ఆ కారణం చేత, మీరు మీ శరీరమును తిరిగి తీసుకొని, మరియు అప్పుడు ఒక వేశ్యకు ఇవ్వకూడదు, తద్వారా మీరు ఆమె శరీర భాగాలు అయినట్లుగా మీ శరీరం ఆమెకు చెందుతుంది. అది ఎప్పుడూ చేయవద్దు! 16 ఒక వేశ్యతో లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఒకే శరీరమును పంచుకున్నంత సన్నిహితంగా ఆమెతో కలిసిపోతాడని మీకు ఖచ్చితంగా తెలుసు. {మీరు దీనిని తెలుసుకోవాలి} ఎందుకంటే, “{పురుషుడు మరియు స్త్రీ,} ఇద్దరు మనుష్యులు అయినప్పటికీ}, {ఒక వ్యక్తి వలె} అవుతారు” అని లేఖనం చెపుతుంది. 17 అదే విధంగా, తమను తాము ప్రభువుతో ఐక్యం చేసుకునే ఏ మనుష్యులు అయినా ఆత్మీయంగా {ప్రభువుతో} ఏకమవుతారు. 18 ఉద్దేశపూర్వకంగా సరికాని లైంగికతను నివారించండి. మనుష్యులు పాపం చేసినప్పుడు, వారు సాధారణముగా తమ శరీరాలను నేరుగా గాయపరచకుండా చేస్తారు. అయినప్పటికీ, మనుష్యులు అక్రమ లైంగిక చర్యను కలిగి ఉన్నప్పుడు, వారు తమ సొంత శరీరములను గాయపరుస్తారు. 19 దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడని మీకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి, మీ శరీరాలు పరిశుద్ధ ఆత్మకు దేవాలయాల వలే ఉన్నాయి, ఎందుకంటే ఆయన తనను తాను మీతో ఐక్యం చేసుకుంటాడు {దేవుడు తన ఆలయానికి తనను తాను ఏ విధంగా ఐక్యం చేసుకుంటాడో}. దాని వలన మీరు మీకు చెందినవారు కాదు. 20 {బదులుగా, మెస్సీయ మీ కోసం మరణించాడు కాబట్టి మీరు దేవునికి చెందినవారు. ఆయన మీ కోసం చనిపోయినప్పుడు,} నిన్ను కొనడానికి దేవుడు డబ్బు చెల్లించినట్టు ఇది ఉంది. ఎందుకంటే {మీరు దేవునికి చెందినవారు}, మీరు మీ శరీరముతో ఏదైనా చేసినప్పుడు ఆయనను ఘనపరచాలి.

Chapter 7

1 మీరు నన్ను అడిగిన దానిని గురించి, మీ లేఖలో మనుష్యులు ఒకరితో ఒకరు లైంగిక కార్యము చేయకపోవడమే ఇది సముచితము అని చెప్పారు. 2 మరోవైపు, మనుష్యులు తరచుగా లైంగిక కార్యము చేయాలని కోరుకుంటారు, అక్రమమైన లైంగిక కార్యము కూడా. అందుచేత, భర్త తన స్వంత భార్యతో వివాహం చేసుకొని ఉండాలి, మరియు భార్య తన స్వంత భర్తతో వివాహం చేసుకొని ఉండాలి. 3 భర్తలు తమ భార్యలతో క్రమం తప్పకుండా లైంగిక సంబంధం పెట్టుకోవాలి. అదేవిధంగా, భార్యలు తమ భర్తలతో క్రమం తప్పకుండా లైంగిక సంబంధం కలిగి ఉండాలి. 4 భార్యల యొక్క శరీరాలు తమ భర్తలకే చెందుతాయి, వారికే కాదు. అదేవిధంగా, భర్తల యొక్క శరీరాలు వారి భార్యలకు చెందినవి, వారికే కాదు. 5 మీరు ఇద్దరు అంగీకరించినప్పుడు మాత్రమే కొద్దికాలం పాటు మీరు క్రమం తప్పకుండా లైంగిక కార్యము చేయడం మానివేయాలి. మీరు దేవునికి ప్రార్థించడం మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే మీరు దీనిని చేయాలి మరియు మీరు త్వరలో క్రమం తప్పకుండా లైంగిక కార్యము చేయడం కొనసాగించాలి. మీరు దీనిని త్వరగా చేయకుంటే, మీరు లైంగిక కార్యము చేయడములో ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో, తప్పు చేసేలా మిమ్ములను ప్రలోభపెట్టడానికి సాతాను ఉపయోగిస్తాడు. 6 {ప్రార్థన మీద దృష్టి పెట్టడానికి క్రమం తప్పకుండా లైంగిక కార్యము చేయడం మానేయమని} నేను మీకు ఆజ్ఞాపించను. బదులుగా, నేను మిమ్ములను{ఆలాగు చేయడానికి} మాత్రమే అనుమతిస్తున్నాను. 7 నా విషయానికి వస్తే, మనుష్యులు అందరు నా వలే ఉంటారు {మరియు అవివాహితులుగా ఉంటారు}. అయినప్పటికీ, దేవుడు ప్రతి వ్యక్తికి అతడు లేదా ఆమె తన స్వంత మార్గాన్ని జీవించడానికి ఇస్తాడు. కొంతమంది {మనుష్యులు} ఒక మార్గములో జీవిస్తారు, మరికొందరు మరో మార్గములో {జీవిస్తారు}. 8 ఇక్కడ నేను వివాహాము చేసుకోని వారితో, మరియు భర్త చనిపోయిన స్త్రీలతో మాట్లాడుచున్నాను. నేను చేయు చున్నట్లు వలే {వివాహం చేసుకోకుండా} ఉండటమే {ఈ మనుష్యులకు} ఉత్తమమైన విషయం. 9 అయితే, కొందరు మనుష్యులు లైంగిక కార్యములో ఏ విధంగా ఉండాలనే కోరికను నియంత్రించుకోవడానికి చాలా కష్టపడతారు. ఈ మనుష్యులు వివాహం చేసుకోవాలి, ఎందుకంటే నిరంతరం లైంగిక కార్యము చేయాలనుకోవడం కంటే ఇది మంచి ఎంపిక. 10 పెండ్లి చేసుకున్న వారితో ప్రభువు స్వయంగా చెప్పినట్లు నేను ఇక్కడ మాట్లాడుచున్నాను. భార్యలు తమ భర్తలతో ఉండాలని నేను కోరుచున్నాను. 11 ఇప్పుడు వారు తమ భర్తలతో ఉండనప్పుడు, వారు తిరిగి పెండ్లి చేసుకోకూడదు, లేదా వారు తమ భర్తల వద్దకు తిరిగి వెళ్ళాలి. ఇంకా, భర్తలు తమ భార్యలతోనే ఉండాలి. 12 ఇప్పుడు మిగిలిన వారితో {విశ్వాసి కాని జీవిత భాగస్వామి ఉన్న మీతో}, ప్రభువు దీని గురించి మాట్లాడలేదు, కాబట్టి నేనే ఆజ్ఞాపించినట్లు మాట్లాడుచున్నాను. కొంతమంది తోటి విశ్వాసులకు అవిశ్వాసులైన భార్యలు ఉన్నారు, మరియు భార్యలు తమ నమ్మిన భర్తలతో కలిసి ఉండాలని కోరుకోవచ్చు. ఈ పరిస్థితిలో, భర్తలు వారి భార్యలతో ఉండాలి. 13 అదేవిధంగా, కొంతమంది తోటి విశ్వాసులకు అవిశ్వాసి భర్తలు ఉన్నారు, మరియు భర్తలు తమ విశ్వాసులైన భార్యలతో కలిసి ఉండాలనుకోవచ్చు. ఈ పరిస్థితిలో, భార్యలు తమ భర్తలతో కలిసి ఉండాలి. 14 {మీరు అవిశ్వాసి భర్త లేదా భార్యతో ఉండాలి} ఎందుకంటే దేవుడు అవిశ్వాసి అయిన భర్తను నమ్మిన భార్యకు ఆమోదయోగ్యమైన జీవిత భాగస్వామిగా భావిస్తాడు. అదేవిధంగా, దేవుడు నమ్మని భార్యను నమ్మిన భర్తకు ఆమోదయోగ్యమైన జీవిత భాగస్వామిగా భావిస్తాడు. దీని కారణంగా, ఇద్దరు విశ్వాసులైన తల్లిదండ్రుల పిల్లలతో దేవుడు పరిగణించినట్లే ఈ పరిస్థితిలో ఉన్న పిల్లలను చూస్తాడు. నేను చెప్పినది నిజం కాకపోతే, దేవుడు విశ్వాసం లేని ఇద్దరు తల్లిదండ్రుల పిల్లలతో వ్యవహరించినట్లే ఈ పరిస్థితిలో పిల్లలను చూస్తాడు. 15 మరోవైపు, కొందరు అవిశ్వాసులైన భర్తలు లేదా భార్యలు తమ నమ్మిన జీవిత భాగస్వాములను విడిచిపెట్టాలని అనుకోవచ్చు. ఈ పరిస్థితిలో, నమ్మిన జీవిత భాగస్వాములు వారిని విడిచిపెట్టడానికి అనుమతించాలి. నమ్మిన జీవిత భాగస్వాములు తమ అవిశ్వాస భర్తలు లేదా భార్యలతో ఉండవలసిన అవసరం లేదు. {ఇలాంటి ఏ పరిస్థితిలోనైనా, గుర్తుంచుకోండి} దేవుడు మనం సమాధానకరమైన మనుషులుగా ఉండాలి అని కోరుచున్నాడు. 16 {అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామిని విడిచిపెట్టడానికి మీరు అనుమతించాలి} ఎందుకంటే యేసులో విశ్వసించేలా ఆమె తన భర్తకు సహాయం చేయగలదో లేదో ప్రతి భార్యకు తెలియదు. యేసులో విశ్వసించేలా అతడు తన భార్యకు సహాయం చేయగలడో లేడో కూడా ప్రతి భర్తకు తెలియదు. 17 సాధారణంగా, మనుష్యులు అందరు ప్రభువు తమను ఏమి చేయాలని నియమించాడో మరియు ఏ విధంగా ప్రవర్తించాలని దేవుడు కోరుచున్నాడో దానికి తగిన విధంగా ప్రవర్తించాలి. {నేను సందర్శించే} విశ్వాసుల యొక్క ప్రతి సమూహములో మనుష్యులు ఈ బోధనను అనుసరించాలని నేను కోరుచున్నాను. 18 యేసును విశ్వసించకముందే ఇతరులు సున్నతి చేసిన కొందరు మనుష్యులు ఉన్నారు. ఈ మనుష్యులు తిరిగి సున్నతి పొందకుండా ఉండడానికి ప్రయత్నించకూడదు. యేసును విశ్వసించే ముందు ఇతరులు సున్నతి చేయని మనుష్యులు ఉన్నారు. ఈ మనుష్యులు సున్నతిపొందినవారివలే మారడానికి ప్రయత్నించకూడదు. 19 ఒక వ్యక్తి ఎవరైనా సున్నతి చేయించుకున్నాడా లేదా అనేది {మనకు లేదా దేవునికి} పట్టింపు లేదు. మరోవైపు, దేవుడు మన నుండి కోరినది చేయడం {మనకు మరియు దేవునికి ముఖ్యమైనది}. 20 దేవుడు వారిని మార్చినప్పుడు వారు ఇప్పటికే చేస్తున్న సాధారణ పనులను చేస్తూనే మనుష్యులు అందరు దేవునికి నమ్మకంగా సేవ చేయాలి. 21 యేసును విశ్వసించినప్పుడు కొంతమంది మనుష్యులు బానిసలుగా ఉన్నారు. ఈ మనుష్యులు బానిసలుగా ఉన్నందుకు చింతించకూడదు. మరోవైపు, వారు స్వతంత్రులు అగుటకు ఏదైనా అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. 22 {మీ సామాజిక స్థితి గురించి చింతించకండి} ఎందుకంటే ప్రభువు తనను విశ్వసించినప్పుడు బానిసలుగా ఉన్న వారందరినీ ఇప్పుడు స్వతంత్రులుగా పరిగణిస్తున్నాడు. అదేవిధంగా, మెస్సీయ తనను విశ్వసించినప్పుడు స్వేచ్ఛగా ఉన్న మనుష్యులు అందరిని ఇప్పుడు తన బానిసలుగా పరిగణిస్తున్నాడు. 23 {యేసు నీ కోసం చనిపోయినప్పుడు} అది నిన్ను కొనడానికి దేవుడు డబ్బు చెల్లించినట్లే. {దానిని బట్టి,} మీరు ఇతర మానవులకు సేవ చేయకూడదు, అయితే దేవునికి మాత్రమే. 24 నా తోటి విశ్వాసులారా, దేవుడు వారిని మార్చినప్పుడు వారు ఇప్పటికే చేస్తున్న సాధారణ పనులను చేస్తూనే మనుష్యులు అందరు దేవునికి నమ్మకంగా సేవ చేయాలి. 25 నేను ఇప్పుడు పెండ్లి చేసుకోని వారి గురించి మాట్లాడుచున్నాను. ఈ సమస్య మీద, మీకు చెప్పడానికి ప్రభువు చెప్పినది ఏదైనా నా దగ్గర లేదు. అయితే, నాకు ఏది ఉత్తమం అని నేను తలస్తున్నానో దానిని మీకు చెపుతాను. {నేను ఇది చేస్తున్నాను} ఎందుకంటే దేవుడు నన్ను నమ్మదగిన {ఉపాధ్యాయుడుగా చేయడం చేత నా యెడల దయగా వ్యవహరించాడు.} 26 మనుష్యులు తమ జీవన విధానాన్ని మార్చుకోవద్దని నేను సూచిస్తున్నాను. నేను ఇది చెప్పుచున్నాను ఎందుకంటే త్వరలో ప్రమాదకరమైన విషయాలు జరగబోతున్నాయి అని నాకు తెలుసు. 27 కొంతమంది మనుష్యులు నిశ్చితార్థం చేసుకున్నారు. వారు విడిపోకూడదు. ఇతర మనుష్యులు ఎప్పుడూ నిశ్చితార్థం చేసుకోలేదు. వారు నిశ్చితార్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. 28 అయినప్పటికీ, పెండ్లి చేసుకున్న ఒంటరి పురుషుడు లేదా స్త్రీ పాపం చేయరు. వివాహం చేసుకోవద్దని మాత్రమే నేను మీకు సలహా ఇస్తున్నాను ఎందుకంటే వివాహం చేసుకున్న మనుష్యులు వారు జీవిస్తుండగా ఇబ్బందులు అనుభవిస్తారు. 29 నా తోటి విశ్వాసులారా, నేను మీకు చెప్పబోయేది {ముఖ్యమైనది}. అంత్యకాలం ఎంతో దూరములో లేదు. అందుకే అప్పటి వరకు భార్య ఉన్న ప్రతి పురుషుడు భార్య లేని మనిషి వలె జీవించాలి. 30 ఏడ్చే ప్రతివాడు ఏడవని వ్యక్తి వలే జీవించాలి. ఆనందముగా ఉన్న ప్రతి వ్యక్తి ఆనందం లేని ఒక వ్యక్తి వలే జీవించాలి. ఏదైనా సంపాదించిన ప్రతి వ్యక్తి ఏమీ లేని ఒక వ్యక్తి వలే జీవించాలి. 31 లోక సంబంధమైన వస్తువులను ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి వీటిని ఉపయోగించని వ్యక్తి వలే జీవించాలి. {మీరు ఈ మార్గాలలో ప్రవర్తించాలి} ఎందుకంటే దేవుడు త్వరలో పనులను లోక సంబంధమైన విధానంలో చేసే విధానాన్ని దేవుడు రద్దు చేస్తాడు. 32 మీరు కొన్ని సంగతుల గురించి శ్రద్ధ వహించాలని నేను కోరుచున్నాను. ఒంటరి పురుషులు ప్రభువును సేవించడానికి తాము చేయగల వాటి గురించి శ్రద్ధ వహిస్తారు. 33 మరోవైపు, వివాహిత పురుషులు లోక సంబంధమైన సంగతుల మీద శ్రద్ధ వహిస్తారు, ముఖ్యంగా వారు తమ భార్యలకు ఏ విధంగా సేవ చేయాలి. దీని కారణంగా, వారు రెండు వేర్వేరు సంగతుల మీద శ్రద్ధ వహిస్తారు {: వారి భార్యలకు సేవ చేయడం మరియు ప్రభువును సేవించడం}. ఒంటరి స్త్రీలు మరియు ఎన్నడు పెండ్లి చేసుకోని స్త్రీలు 34 ప్రభువును సేవించడానికి వారు చేయగల వాటి గురించి శ్రద్ధ వహిస్తారు. పూర్తిగా పరిశుద్ధంగా ఉండటమే వారి లక్ష్యం. మరోవైపు, వివాహిత స్త్రీలు లోక సంబంధమైన సంగతుల మీద శ్రద్ధ వహిస్తారు, ప్రత్యేకించి వారు తమ భర్తలకు ఏ విధంగా సేవ చేయాలి. 35 నేను ఈ విషయాలు చెప్పాను ఎందుకంటే అవి మీకు ఉపయోగకరముగా ఉంటాయని భావించాను. నేను మిమ్ములను ఒకే విధంగా ప్రవర్తించమని బలవంతం చేయుటకు కోరుట లేదు. బదులుగా, మీరు గౌరవప్రదంగా ప్రవర్తించగలరని మరియు ప్రభువును బాగా మరియు శ్రద్ధగా సేవించగలిగి ఉండాలని నేను మిమ్ములను కోరుచున్నాను. 36 కొన్ని సందర్భాలలో, నిశ్చితార్థం చేసుకున్న పురుషుడు తన కాబోయే భార్యతో లైంగికంగా అనుచితంగా ప్రవర్తించవచ్చని భావించవచ్చు. ఇంకా, అతని కాబోయే భార్య పూర్తిగా పరిణతి చెంది లైంగిక కార్యము చేయడానికి సిద్ధంగా ఉండవచ్చు. ఈ సందర్భాలలో, ఏమి చేయాలో ఇక్కడ ఉంది: పురుషుడు తనకు కాబోయే భాగస్వామిని వివాహం చేసుకోవాలి. {అతడు ఇది చేసినప్పుడు},అతడు పాపం చేయడు మరియు వారిద్దరు వివాహం చేసుకోవాలి. 37 ఇతర సందర్భాలలో, నిశ్చితార్థం చేసుకున్న పురుషుడు తన మనస్సును సిద్ధపరచుకొని ఉండవచ్చు మరియు ఏ వ్యక్తి లేదా విషయము అతనిని {వివాహం చేసుకోవద్దని} బలవంతం చేయలేదు. అతడు కోరుకున్నదానిని అతడు నియంత్రించగలడు మరియు అతడు తన కోసం {వివాహం చేసుకోకూడదని} నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంలో, అతడు తన కాబోయే భార్యను వివాహం చేసుకోకూడదని సరిగ్గా ఎంచుకోవచ్చు. 38 చివరికి, తన కాబోయే భార్యను పెండ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా మంచి పని చేస్తాడు. ఇంకా, ఏ వ్యక్తి అయినా {తనకు కాబోయే భార్యతో} పెండ్లి చేసుకోని మంచి పని చేస్తాడు. 39 వారి భర్తలు చనిపోతే తప్ప భార్యలు తమ భర్తలతోనే వివాహితగా ఉండాలి. అప్పుడు, వారు పెండ్లి చేసుకోవాలనుకునే విశ్వాసియైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు 40 అయినప్పటికీ, భర్త చనిపోయిన ఏ స్త్రీ అయినా తిరిగి పెండ్లి చేసుకోని యెడల, ఆమె మరింత ధన్యురాలుగా ఉంటుంది {అని నేను భావిస్తున్నాను}. అది నా అభిప్రాయం అయితే, దేవుని యొక్క ఆత్మ నా చేత మాట్లాడుచున్నాడు అని నేను భావిస్తున్నాను

Chapter 8

1 ఒకరు మరొక దేవుడికి అర్పించిన మాంసం గురించి ఇప్పుడు నేను మాట్లాడుచున్నాను. {విశ్వాసం ఉన్న} మనకు అందరికీ ఇతర దేవుళ్ళ గురించి తెలుసు. అయితే,} {తరచుగా ఏది నిజమో} తెలుసుకోవడం వలన మనుష్యులు గర్వపడతారు. ఇతరులను ప్రేమించడమే ఇతర విశ్వాసులకు నిజంగా సహాయం చేస్తుంది. 2 వారు ఒక దానిని అర్థం చేసుకున్నారు అని భావించే మనుష్యులు అందరు దానిని అర్థం చేసుకోవలసిన ఈ విధానంలో ఇంకా అర్థం చేసుకోలేదు. 3 అయితే, దేవుడు తనను ప్రేమించే మనుష్యులు అందరిని అర్థం చేసుకుంటాడు మరియు శ్రద్ధ వహిస్తాడు. 4 ఒకరు మరొక దేవుడికి అర్పించిన మాంసాన్ని తినాలా వద్దా అనే దాని గురించి ఇప్పుడు {నేను తిరిగి మాట్లాడుచున్నాను}. ఇతర దేవుళ్ళు నిజంగా లేరని {దేవుని నమ్మే వారమైన} మనం అర్థం చేసుకుంటాము. నిజానికి, ఒకే దేవుడు ఒక్కడే అని {మనం అర్థం చేసుకున్నాము}. 5 మనుష్యులు “దేవతలు” అని పిలుచుకునే అనేక వస్తువులు ఉన్నాయి అవి పరలోకములో లేదా భూమి మీద ఉన్నాయి అనేది ఇది నిజం. ఈ విధంగా, అనేక "దేవతలు" మరియు "ప్రభువులు" ఉన్నారు. 6 అయితే, {నమ్మిన వారమైన} మనం తండ్రి అయిన ఒకే దేవుడిని అంగీకరిస్తాము. ఆయన సమస్తము సృష్టించాడు, మరియు మనం ఆయనను గౌరవించటానికి ఉన్నాము. మనం కూడా ఒక్క ప్రభువును గుర్తిస్తున్నాము, ఆయనే యేసు మెస్సీయ. ఆయన తండ్రితో సమస్తము సృష్టించాడు మరియు ఆయన{మన కోసం} చేసే దాని చేత మనం ఉనికిలో ఉన్నాము. 7 అయితే, కొంతమందికి {నేను చెప్పినది} పూర్తిగా అర్థం కాలేదు. వారు గతంలో ఇతర దేవుళ్ళను పూజించేవారు, మరియు వారు అసంపూర్ణంగా ఏది ఒప్పు మరియు తప్పు అని అర్థం చేసుకున్నారు. ఎవరైనా మరొక దేవుడికి సమర్పించిన మాంసాన్ని వారు తిన్నప్పుడు, వారు అపరాధ భావంతో ఉంటారు. 8 ఇప్పుడు ఆహారం మనలను దేవునితో కలిపేది కాదు. {కొన్ని ఆహారాలు} తినని వారు {దేవుని నుండి ఏదీ} కోల్పోరు. అలాగే, {కొన్ని ఆహారాలు} తినే వారు {దేవుని నుండి} అదనంగా పొందరు. 9 అయితే, {ఆహారం ముఖ్యమైనది కాదు అని} మీకు తెలిసిన యెడల, మీరు ఏ విధంగా జీవిస్తారనే దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ విధంగా జీవిస్తున్నారు అనేది అసంపూర్ణంగా ఏది ఒప్పు మరియు తప్పు అని అర్థం చేసుకోలేని ఒకరిని {యేసును అనుసరించడానికి} పోరాడేలా చేయకూడదు. 10 {మీరు జాగ్రత్తగా ఉండాలి} ఎందుకంటే {ఇతర దేవుళ్ళ గురించి ఏది నిజమో} తెలిసిన విశ్వాసి మరొక దేవుని ఆలయంలో {మాంసం} తినడానికి కూర్చోవడం తోటి విశ్వాసులు గమనించవచ్చు. ఏది ఒప్పు మరియు తప్పు అని అసంపూర్ణంగా అర్థం చేసుకున్న ఆ తోటి విశ్వాసులు, ఒకరు మరొక దేవుడికి అర్పించిన మాంసాన్ని కూడా తినగలరని నమ్మకంగా ఉంటారు. 11 తత్ఫలితంగా, {ఇతర దేవుళ్ళ గురించి నిజం} మీకు తెలిసిన దాని ఆధారముగా ప్రవర్తించడం చేత, ఏది ఒప్పు మరియు తప్పు అని అసంపూర్ణంగా అర్థం చేసుకున్న ఇతరులకు మీరు హాని చేస్తారు. వీరు తోటి విశ్వాసులు, మరియు మెస్సీయ వారి కోసం మరణించాడు 12 మీరు ఈ మార్గాలలో ప్రవర్తించినప్పుడు, తోటి విశ్వాసులను నడిపించడం చేత మీరు వారికి వ్యతిరేకంగా పాపం చేస్తారు, వారు ఏది ఒప్పు ఏది మరియు ఏది తప్పు అని అసంపూర్ణంగా అర్థం చేసుకుంటారు. {మీరు దీనిని చేసినప్పుడు,} మీరు కూడా మెస్సీయకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. 13 పర్యవసానంగా, నేను తినేవి తోటి విశ్వాసిని పాపం చెయ్యడానికి దారితీసే సందర్భాలలో, {, ఒకరు దానిని మరొక దేవుడికి సమర్పించినా లేదా} నేను మాంసాన్ని తిరిగి ఎప్పుడూ తినను. ఈ విధంగా, నేను నా తోటి విశ్వాసులలో ఎవరినీ పాపం చెయ్యడానికి నడిపించను.

Chapter 9

1 నేను {కొన్ని ఆహారాలు మాత్రమే తినడానికి} కట్టుబడి లేను. మన ప్రభువైన యేసు ఆయనకు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను పంపాడు మరియు నేను ఆయనను {నా స్వంత కళ్ళతో} చూసాను. దేవుడు మనలను ప్రభువుతో ఏకం చేసాడు, మరియు దాని కారణంగా నేను మీ కోసం కష్టపడి పనిచేసాను. 2 మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను పంపాడని ఇతరులు అనుకోకపోవచ్చు, అయితే అది మీకు తెలుసు. {మీకు అది తెలుసు} ఎందుకంటే దేవుడు మిమ్మును ప్రభువుతో కలిపినప్పుడు మెస్సీయ నన్ను పంపాడని మీరు రుజువు చేసారు. 3 నన్ను {మెస్సీయ పంపాడో లేదో} {ఆయనకు ప్రాతినిధ్యం వహించడానికి} ప్రశ్నించాలనుకునే వారికి వ్యతిరేకంగా నేను ఇప్పుడు నన్ను రక్షించుకుంటాను. 4 బర్నబా మరియు నేను నిశ్చయముగా మీరు మాకు ఆహారం మరియు పానీయాలు పంపడానికి కోరుతున్నాము. 5 మెస్సీయలో విశ్వసించే ఒక భార్య చుట్టూ మనం నిశ్చయముగా ప్రయాణించవచ్చు. పేతురు మరియు ప్రభువు సహోదరులతో సహా మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి పంపిన ఇతరులు ఇదే చేస్తారు. 6 బర్నబా మరియు నేను మాత్రమే {మెస్సీయకు ప్రాతినిధ్యం వహించేవాళ్ళం} {మనలను మనం ఆదుకోవడానికి} కృషి చేయాలి అనేది నిజం కాదు. 7 ఏ సైనికుడు సైన్యములో సేవ చేయడానికి తమ స్వంత డబ్బుతో చెల్లించరు. రైతులెవరూ తీగలను నాటరు మరియు ఆ తీగలు ఉత్పత్తి చేసే వాటిని తినరు. గొర్రెల కాపరులు ఎవరూ గొర్రెలను సంరక్షించరు మరియు వారు ఉత్పత్తి చేసే పాలు తాగరు. 8 నేను వాదిస్తున్నది కేవలం మానవ ఆలోచన మీద ఆధారపడి ఉండదు. బదులుగా, నేను వాదిస్తున్నదానిని మీరు {మోషే యొక్క} ధర్మశాస్త్రములో చదవగలరు. 9 మోషే ధర్మశాస్త్రములో ఇక్కడ ఇది వ్రాసాడు: “ధాన్యం నుండి పొట్టును వేరు చేయడానికి ఎద్దు మీకు సహాయం చేస్తున్నప్పుడు దానిని ధాన్యము తినడం నుండి మీరు దూరంగా ఉంచకూడదు.” {,అయినప్పటికీ} దేవుడు ప్రాథమికంగా ఎద్దులలో ఆసక్తి కలిగి లేడు. 10 బదులుగా, దేవుడు మన గురించి {ఈ ధర్మశాస్త్రములో} ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మోషే మన కోసం ఈ ఆజ్ఞను వ్రాసేలా చేసాడు. ఎందుకంటే పొలాన్ని దున్నే వ్యక్తి ఎవరైనా కొంత పంటను పొందాలని ఆశించాలి. గోధుమ కాడల నుండి ధాన్యాన్ని వేరుచేసే వ్యక్తి ఎవరైనా కూడా కొంత పంటను పొందాలని ఆశించాలి. 11 మేము ఆత్మీయ విత్తనాలను నాటుతున్నట్లుగా మీకు శుభ వార్త ప్రకటించాము. దాని కారణం చేత మేము వేసిన విత్తనం నుండి పండిన పంటలో కొంత మేము అందుకుంటున్నట్లు మీ నుండి ఆర్థిక సహాయం అందుకోవడం మామూలుగా ఉంటుంది. 12 ఇతర వ్యక్తులు మీ నుండి ఆర్థిక సహాయాన్ని పొందారు. బర్నబా మరియు నేను మీ నుండి స్వీకరించడానికి ఇంకా ఎక్కువ అర్హులం. అయితే, మేము మీ నుండి ఎలాంటి సహాయాన్ని కోరలేదు. బదులుగా, మెస్సీయ గురించిన సువార్త వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మేము విషయాలు లేకుండా వెళ్లాలని ఎంచుకుంటాము. 13 దేవాలయములో వారి విధులు నిర్వర్తించే మనుష్యులు దేవాలయములో అందించే ఆహారములో కొంత భుజిస్తారు అని మీకు ఖచ్చితంగా తెలుసు. మరింత ప్రత్యేకంగా, బలిపీఠం మీద బలి అర్పించే యాజకులు బలిపీఠం మీద అర్పించడానికి మనుష్యులు తమ వద్దకు తీసుకువచ్చే దానిలో కొంత భాగాన్ని స్వీకరిస్తారు. 14 ఆ విధంగానే, సువార్త ప్రకటించే ఏ ఒక్కరైనా శుభ వార్త {ప్రకటించడం} నుండి వారి జీవనం జరిగించుకోవాలి అని ప్రభువు ఆదేశించాడు. 15 అయినప్పటికీ, నేను మీ నుండి ఈ సహాయం ఏదీ అడగలేదు. ఇంకా, నా కోసం సహాయం కోసం నేను ఇప్పుడు మీకు వ్రాయడం లేదు. నేను అతిశయించ గల దానిని ఎవరైనా తీసివేయడం కంటే నేను చనిపోవడానికి ఇష్టపడతాను. 16 ఇప్పుడు నేను సువార్త ప్రకటించడం గురించి అతిశయించలేను, ఎందుకంటే నేను దానిని ప్రకటించాలని దేవుడు కోరుచున్నాడు. నిజానికి, నేను సువార్త ప్రకటించడం మానివెయ్యవలసి వస్తే దేవుడు నన్ను క్రమశిక్షణలో ఉంచుతాడు. 17 నేను సువార్త ప్రకటించిన యెడల, దేవుడు నాకు ప్రతిఫలమిస్తాడు, ఎందుకంటే నా అంతట నేనే దానిని ఎంచుకున్నాను. అయితే, నేను అలా చెయ్యడానికి ఎంపిక చేసుకోలేదు, ఎందుకంటే నేను ఏమి చేయాలో దేవుడే నాకు చెప్పాడు. 18 దేవుడు ఇంకా నాకు ప్రతిఫలమిస్తున్నాడు. అయితే మనుష్యులు నాకు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేను సువార్త ప్రకటించేటప్పుడు {ఆయన అలా చేస్తాడు}. నేను సువార్త గురించి మనుష్యులకు ఈ విధంగా చెప్పుచున్నాను, తద్వారా నేను సువార్త ప్రకటించడం కారణంగా నేను కోరగలిగేదానిని దుర్వినియోగం చేయను. 19 {నేను సువార్తను ఉచితంగా బోధిస్తాను కాబట్టి} నేను ఏ మానవులకు సేవ చేయవలసిన అవసరం లేదు. అయినప్పటికీ, నేను మానవులందరికీ సేవ చేయడానికి ఎంచుకుంటాను, తద్వారా వారిలో ఎక్కువమందికి {మెస్సీయలో విశ్వసించడానికి} నేను సహాయం చేయగలను. 20 నేను యూదు మనుష్యులతో ఉన్నప్పుడు, నేను యూదు వ్యక్తి వలే ప్రవర్తిస్తాను. ఆ విధంగా, నేను యూదు మనుష్యులకు {మెస్సీయలో విశ్వసించడానికి} సహాయం చేయగలను. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాలని భావించే మనుష్యులతో నేను ఉన్నప్పుడు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని భావించే వాని వలే నేను ప్రవర్తిస్తాను. నేను మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు అని నాకు తెలుసు, {నేను ఈ విధంగా ప్రవర్తిస్తాను}, తద్వారా మోషే యొక్క ధర్మశాస్త్రాన్నిపాటించాలని భావించే మనుష్యులకు {మెస్సీయలో నమ్మునట్లు} నేను సహాయం చేయగలను. 21 మోషే ధర్మశాస్త్రాన్ని పాటించని మనుష్యులతో నేను ఉన్నప్పుడు, నేను మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించని వాని వలే ప్రవర్తిస్తాను. {నేను ఈ విధంగా ప్రవర్తిస్తాను} తద్వారా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించని మనుష్యులకు {మెస్సీయలో విశ్వసించడానికి} నేను సహాయం చేయగలను. వాస్తవానికి, నేను మెస్సీయ ఆజ్ఞాపించినట్లే చేస్తాను కాబట్టి నేను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను. 22 ఏది ఒప్పు మరియు తప్పు అని అసంపూర్తిగా అర్థం చేసుకునే మనుష్యులతో నేను ఉన్నప్పుడు, ఏది ఒప్పు మరియు తప్పు అని అసంపూర్ణంగా అర్థం చేసుకున్న వాని వలే నేను ప్రవర్తిస్తాను. {నేను ఈ విధంగా ప్రవర్తిస్తాను} తద్వారా ఏది ఒప్పు మరియు తప్పు అని అసంపూర్ణంగా అర్థం చేసుకునే మనుష్యులకు {మెస్సీయను విశ్వసించడానికి} నేను సహాయం చేయగలను. {మీరు చూడగలుగునట్లుగా,} నేను ఏ మనుష్యులతోనైనా ఉన్నప్పుడు, నేను వారు చేయు విధంగా ప్రవర్తిస్తాను తద్వారా వారిలో కొందరిని రక్షించడానికి నేను చేసే అన్ని పనుల ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. 23 మీరు చూస్తున్నట్లుగా, నేను ఈ విధానాలు అన్నిటిలో పనిచేస్తున్నాను ఎందుకంటే మనుష్యులు సువార్తను విశ్వసించడానికి నేను కోరుచున్నాను {ఇంకా, నేను ఈ సంగతులు చేస్తున్నాను} తద్వారా నేను కూడా సువార్తలో దేవుడు వాగ్దానం చేసిన వాటిని పొందుతాను. 24 పరుగెత్తువారు అందరూ ఒక పందెములో పాల్గొంటారు అని మీకు ఖచ్చితంగా తెలుసు, అయితే చివరికి పరుగెత్తువాడు ఒకడు మాత్రమే పందెములో గెలుస్తాడు మరియు గెలిచినందు కోసం బహుమానము తీసుకుంటాడు. మీరు దేవుని సేవిస్తున్నప్పుడు, అది ఈ రకమైన పందెము వలే ఉంది. పరుగు పందెంలో గెలవడానికి పరుగెత్తువాడు కష్టపడి పరుగెత్తిన విధముగా దేవుడు మీకు వాగ్దానం చేసిన వాటిని పొందేందుకు మీరు కష్టపడి పనిచేయాలి. 25 క్రీడాకారులు అందరు వారు చేసే ప్రతిదానిని జాగ్రత్తగా నియంత్రిస్తారు {తద్వారా వారు గెలవగలరు}. వేరుగా పడిపోయేటటు వంటి ఆకులతో తయారు చేసిన కిరీటం కోసం వారు పోటీ పడతారు. అయితే, మనలను మనం నియంత్రించుకుంటాము తద్వారా దేవుడు మనకు ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని} మనం పొందుతాము. 26 దీని కారణంగా, నేను ముగింపు రేఖ వైపు నేరుగా పరుగెత్తే వాని వలే ఉన్నాను. నేను ప్రత్యర్థిని తప్పిపోకుండా కొట్టే గుద్దులాడువాని వలే ఉన్నాను. 27 నేను నా శరీరమును పూర్తిగా నియంత్రిస్తాను మరియు అది నాకు సేవ చేసేలా చేస్తున్నాను. నేను అది చేస్తాను ఎందుకంటే నేను ఇతర మనుష్యులకు సువార్త ప్రకటించకూడదనుకుంటున్నాను అయితే అప్పుడు దేవుడు నన్ను అమోదించడం లేదు.

Chapter 10

1 తోటి విశ్వాసులారా, మన యూదు పితరులు దేవుడు వారికి మేఘములో కనిపించినప్పుడు అందరు ఆయనను అనుసరించారు అని ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చెయ్యడానికి కోరుతున్నాను. నీటి ద్వారా దేవుడు వారికి ఒక పొడి మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు వారందరు ఎర్ర సముద్రం ద్వారా నడిచారు. 2 వారందరికీ బాప్తిస్మం ఇచ్చిన {విధముగా ఇది ఉంది} తద్వారా వారు మోషేకు చెందినవారు. వారు మేఘాన్ని అనుసరించి మరియు ఎర్ర సముద్రం ద్వారా నడిచినప్పుడు {ఇది జరిగింది}. 3 అందరూ కలిసి దేవుడు వారికిచ్చిన ప్రత్యేక ఆహారాన్ని భుజించారు. 4 వారు అందరు కలిసి దేవుడు ఇచ్చిన ప్రత్యేక నీళ్ళను తాగారు. దేవుడు అందించిన ప్రత్యేకమైన బండ నుండి వచ్చిన నీటిని వారు త్రాగినప్పుడు మరియు అది వారిని వెంబడించినప్పుడు ఇది జరిగింది. ఆ నీరు మెస్సీయ ఇచ్చినదిగా ఉంది. 5 అయితే, మన యూదుల పితరులు చాలామంది దేవుణ్ణి సంతోషపెట్టలేదు. {ఇది సత్యము అని మీరు చెప్పగలరు} ఎందుకంటే వారు ఎడారి ప్రదేశాల ద్వారా ప్రయాణించేటప్పుడు మరణించారు. 6 వారికి జరిగిన విషయాలు మనం ఏ విధంగా ప్రవర్తించాలో వివరిస్తాయి. వారికి జరిగిన దాని ద్వారా, వారు చేసిన చెడు పనులు వంటి చెడు పనులు చేయకుండా ఉండమని దేవుడు మనలను హెచ్చరించాడు. 7 మీరు విగ్రహాలను ఆరాధించకూడదు, అదే మన యూదు పితరులలో కొందరు చేసారు. {వారు విగ్రహాలను ఆరాధించారు అని మీరు చెప్పగలరు,} ఎందుకంటే మోషే వ్రాసాడు, “ఇశ్రాయేలీయులు తినడం మరియు త్రాగడం ప్రారంభించారు మరియు లైంగిక అనైతిక మార్గాలలో ఇతర దేవతలను ఆరాధించారు.” 8 మన యూదు పితరులలో కొందరు చేసిన అక్రమమైన లైంగిక సంబంధం మనం కలిగి ఉండకూడదు. వారు అలా చేసిన కారణంగా, వారిలో 23,000 మంది ఒకే రోజు సమయములో మరణించారు. 9 మనం ప్రభువును సవాలు చేయకూడదు, మన యూదు పితరులలో కొందరు ఇదే చేసారు. వారు ఇది చేయడం కారణంగా, సర్పములు వారిని చంపాయి. 10 మీరు ఫిర్యాదు చేయకూడదు, మన యూదు పితరులలో కొందరు అదే చేసారు. వారు అది చేసిన కారణముగా, {దేవుడు పంపిన} ఒక ప్రమాదకరమైన ఆత్మ జీవి వారిని చంపాడు. 11 మన పితరులు అనుభవించిన ఆ విషయాలు {మనం ఏ విధంగా ప్రవర్తించాలో} వివరిస్తాయి. నిజానికి, వారికి జరిగిన దానిని ఒకరు వ్రాసారు తద్వారా వారి నుండి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే కడవరి దినాలను అనుభవిస్తున్న వారము మనమే. 12 ఆ వృత్తాంతములు వివరిస్తున్నట్లుగా, తాము {మెస్సీయలో} దృఢంగా విశ్వసిస్తున్నాము అని భావించే మనుష్యులు {మెస్సీయను వెంబడించడానికి} విఫలం కాకుండా చూసుకోవాలి. 13 మిమ్ములను శోధించే సంగతులను ఇతరులు అనుభవించారు. ఇంకా, దేవుడు నమ్మకంగా వ్యవహరిస్తాడు. మీరు దానిని ఎదిరించలేకపోయిన యెడల, మిమ్ములను శోధించే దేనినైనా అనుభవించడానికి ఆయన మిమ్ములను అనుమతించడు. బదులుగా, ఏదైనా మిమ్ములను శోధించినప్పుడు, దానిని నమ్మకంగా ఎదిరించడానికి మీకు కావలసినది ఆయన మీకు ఇస్తాడు. 14 {దాని కారణంగా నేను చెప్పాను}, నేను ప్రేమించే తోటి విశ్వాసులు ఉద్దేశపూర్వకంగా ఇతర దేవుళ్ళను ఆరాధించడం మానివేయండి. 15 నేను ఈ విధంగా మాట్లాడుచున్నాను ఎందుకంటే మీరు సహేతుకమైన మనుష్యులు అని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను చెప్పబోయేది ఒప్పో లేదా తప్పో మీకై మీరే నిర్ణయించుకోవాలి. 16 ప్రభువు యొక్క రాత్రి భోజనములో మనం ఆశీర్వదించే ద్రాక్షారసాన్ని త్రాగినప్పుడు, మనం కలిసి మెస్సీయ యొక్క రక్తముతో మనలను కలుపుకుంటాము. మనం రొట్టె తిన్నప్పుడు, మనం కలిసి మెస్సీయ యొక్క శరీరముతో మనలను మనం కలుపుకుంటాము. 17 మనము {ప్రభువు యొక్క రాత్రి భోజనంలో} ఒక రొట్టెని ఉపయోగిస్తాము మరియు మనం అందరం కలిసి ఆ రొట్టె ముక్కలను భుజిస్తాము. మనం ఇది చేయడం వలన, మనమందరం ఒకే శరీరమును ఏర్పరచుకున్న విధముగా మనం కలిసి ఉంటాము. 18 ఇశ్రాయేలు యొక్క మనుష్యులను ఒక ఉదాహరణ వలే తీసుకోండి. ఒక దానిని అర్పించిన మనుష్యులు అర్పించిన దానిలో కొంత భుజిస్తారు. దీని అర్థం వారు బలిపీఠముతో తమను తాము కలుపుకున్నారని అర్థం {, అక్కడ యాజకుడు వారు దేవునికి అర్పించిన దానిలో మిగిలినది సమర్పిస్తాడు}. 19 కాబట్టి ఒకరు మరొక దేవుడికి మరియు ఇతర దేవతలకు అర్పించిన ఆ మాంసం శక్తివంతమైనది లేదా ముఖ్యమైనది కాదు అని నేను వాదిస్తున్నాను. 20 అయినప్పటికీ, దేవుని ఆరాధించని వారు బలులు అర్పించేటప్పుడు, వారు వాటిని దేవునికి కాదు, దుష్ట ఆత్మ జీవులకు అర్పిస్తున్నారు అని {మీరు తెలుసుకోవాలి}. చెడు ఆత్మ జీవులతో మిమ్ములను మీరు కలుపుకొనుట మానుకోవాలని నేను కోరుచున్నాను. 21 ప్రభువుకు చెందిన ద్రాక్షారసాన్ని, మరియు దుష్ట ఆత్మ జీవులకు చెందిన ద్రాక్షారసాన్ని మీరు త్రాగలేరు. మీరు ప్రభువుకు చెందిన ఆహారాన్ని మరియు చెడు ఆత్మ జీవులకు చెందిన ఆహారాన్ని కూడా తినలేరు. 22 ఆ రెండు పనులు చేసేవారు తమ మీద ప్రభువు అసూయతో ప్రవర్తించడానికి ఆశించాలి. ఇంకా, మనము ఖచ్చితంగా ఆయన కంటే తక్కువ శక్తివంతులం. 23 {మీలో కొందరు చెప్పుతారు,} “నేను ఏదైనా చేయగలను మరియు దోషిగా మారను.” అయినప్పటికీ, కొన్ని విషయాలు {ఎవరికీ} ఉపయోగకరము కాదు {అని నేను చెపుతాను}. {తిరిగి, మీలో కొందరు చెపుతారు,} "నేను ఏదైనా చేయగలను మరియు దోషిగా మారను." అయినప్పటికీ, కొన్ని విషయాలు మీకు ఎదగడానికి సహాయపడవు {అని నేను చెప్పుచున్నాను}. 24 మీ కోసం ఏది ఉత్తమమైనదో దానిని సంపాదించుకోవడానికి కష్టపడకండి. బదులుగా, ఇతర మనుష్యులకు ఏది ఉత్తమమైనదో దానిని పొందేందుకు {మీరు కష్టపడి పనిచేయాలి}. 25 మీరు బహిరంగ అంగడిలో కొనుగోలు చేసే ఆహారాన్ని దేనినైనా భుజించ వచ్చు. మీరు {అది ఎక్కడ నుండి వచ్చిందో} కనుక్కోనవసరం లేదు, తద్వారా {దానిని తినడానికి} ఇది సరియైనదా లేదా మీకు తెలుస్తుంది. 26 {మీరు దీనిని చేయవచ్చు} ఎందుకంటే "భూమి మరియు దానితో అనుసంధానించబడిన ప్రతిదీ ప్రభువుకు చెందినది" అని {దావీదు వ్రాసాడు}. 27 ఒక సమయములో, నమ్మని మనుష్యులు మిమ్ములను {వారితో కలిసి భోజనం చేయమని} అడగవచ్చు మరియు మీరు {అలా చేయాలని} నిర్ణయించుకోవచ్చు. ఇది జరిగినప్పుడు, వారు మీకు వడ్డించే ఆహారమును అంతయు మీరు తినవచ్చు. మీరు {అది ఎక్కడ నుండి వచ్చిందో} కనుక్కోనవసరం లేదు, తద్వారా {దానిని భుజించడానికి} ఇది సరియైనదా లేదా తప్పో మీకు తెలుస్తుంది. 28 (అయితే, ఒక వ్యక్తి ఆహారాన్ని దేవతకు సమర్పించాడు అని ఒకరు మీకు చెప్పవచ్చు. ఈ పరిస్థితిలో, మీరు ఆహారం భుజించకూడదు. మీకు {ఆహారం గురించి} చెప్పిన వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడానికి మరియు ఏది ఒప్పు మరియు తప్పు అని తెలుసుకోవడం కారణంగా {మీరు ఈ విధంగా ప్రవర్తించాలి} 29 “ఏది ఒప్పు ఏది తప్పు అని తెలుసుకోవడం” చేత అవతలి వ్యక్తికి ఏమి తెలుసు అని నా ఉద్దేశం, నీకు తెలిసినది కాదు.) సాధారణంగా, మరొక వ్యక్తి సరైనది లేదా తప్పు అని భావించేది నేను చేయగలిగిన దానిని చేయకుండా నన్ను నిరోధించకూడదు. 30 నేను ఏదైనా ఆహారం భుజించినప్పుడు నేను దేవునికి కృతజ్ఞతతో ఉన్నంత కాలం, నేను దేవునికి కృతజ్ఞతలు తెలిపిన కారణముగా ఏ ఒక్కరూ నా గురించి చెడుగా మాట్లాడకూడదు. 31 సంగ్రహంగా చెప్పడానికి, ఎప్పుడైనా మీరు భుజించిన లేదా ఏదైనా త్రాగిన, మరియు నిజానికి మీరు ఏదైనా చేసినప్పుడు, మీరు మరియు ఇతరులు దేవుణ్ణి ఘనపరచు నిమిత్తము మీరు ఎల్లప్పుడూ ప్రవర్తించాలి. 32 యూదు మనుష్యులు, యూదులు కాని మనుష్యులు లేదా తోటి విశ్వాసులు మెస్సీయను విశ్వసించకుండా నిరుత్సాహపరిచే విధాలుగా ప్రవర్తించకండి. 33 నేను ఏ విధంగా జీవిస్తాను అనే దానితో{దీనిని ఏ విధంగా చేయాలో} వివరిస్తాను. నేను ఎల్లప్పుడూ నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరించే విధాలుగా వ్యవహరిస్తాను. నాకు ఏది ఉత్తమమైనదో దానిని పొందేందుకు నేను కష్టపడను. బదులుగా, ఇతర మనుష్యుల కోసం ఉత్తమమైనదానిని పొందేందుకు నేను కష్టపడి పనిచేస్తాను}. దేవుడు వారిని రక్షించు నిమిత్తం అని {నేను ఇది చేస్తున్నాను}.

Chapter 11

1 క్రీస్తు చేసిన దానిని నేను చేసే విధంగా నేను చేసిన దానిని చేయండి. 2 నేను మిమ్మును మెచ్చుకొనుచున్నాను ఎందుకంటే నేను బోధించు దానిని మీరు ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నారు మరియు చేయుచున్నారు, ఎందుకంటే మీరు జాగ్రత్తగా విశ్వసిస్తారు మరియు విశ్వసించడానికి మరియు చెయ్యడానికి నేను మీకు బోధించిన దానిని చేయుచున్నారు. 3 ప్రతి పురుషుడు మెస్సీయ నుండి వచ్చాడు అని నేను మీకు చెప్పుచున్నాను. ఒక భార్య తన భర్త నుండి వస్తుంది. చివరగా, మెస్సీయ దేవుని నుండి వస్తాడు. 4 పురుషులు వారు ప్రార్థన చేసినప్పుడు లేదా దేవుడు చెప్పుచున్న దానిని ప్రకటించేటప్పుడు తమ తలలను కప్పుకోవచ్చును. ఇది చేసేవారు తాము ఎవరి నుండి: {మెస్సీయ} వచ్చుచున్నారో ఆ వ్యక్తిని సిగ్గుపరుస్తారు. 5 ఇప్పుడు స్త్రీలు వారు ప్రార్థించేటప్పుడు లేదా దేవుడు చెప్పేది ప్రకటిస్తున్నప్పుడు తమ తలలు వట్టిగా ఉంచవచ్చు. ఇది చేసే వారు ఎవరి దగ్గర నుండి వస్తున్నారో వారిని {తమ భర్తలను} అవమానిస్తారు. {ఇది నిజమని మీరు చెప్పగలరు,} ఎందుకంటే తన తలను వట్టిగా ఉంచిన ఒక స్త్రీ ఒకరు జుట్టును క్షౌరము చేసిన ఒక స్త్రీ వలే ఉంటుంది. 6 నిజానికి, తన తలను వట్టిగా ఉంచిన స్త్రీ జుట్టును ఒకరు చిన్నగా కత్తిరించాలి. చిన్న వెంట్రుకలు ఉన్న స్త్రీని మనుష్యులు సిగ్గుపరుస్తారు కనుక స్త్రీలు తమ తలలను వట్టిగా ఉంచ కూడదు. 7 ఇంకా, ఒక వైపు, పురుషులు తమ తలలను కప్పుకోకూడదు, ఎందుకంటే వారు దేవునికి ప్రాతినిధ్యం వహిస్తారు మరియు ఘనపరుస్తారు. మరోవైపు, భార్యలు వారి భర్తలను గౌరవిస్తారు. 8 {ఇది నిజము అని మీరు చెప్పగలరు} ఎందుకంటే దేవుడు ఆదామును స్త్రీ హవ్వ నుండి సృష్టించలేదు. బదులుగా, ఆయన ఆదాము అనే మనుష్యుడు నుండి స్త్రీ హవ్వను చేసాడు. 9 {ఇది నిజము అని మీరు చెప్పగల మరో మార్గం} ఎందుకంటే దేవుడు ఆదామును స్త్రీ హవ్వ కోసం చేయలేదు. బదులుగా, ఆయన ఆదాము అనే పురుషుని కోసం స్త్రీ హవ్వను చేసాడు. 10 ఎందుకంటే {భార్యలు తమ భర్తలను గౌరవిస్తారు}, స్త్రీలు తమ తలల మీద {వారు ధరించే వాటిని} నియంత్రించాలి. శక్తివంతమైన ఆత్మీయ జీవుల కారణంగా {వారు దీనిని కూడా చెయ్యాలి}. 11 అవన్నీ ఉన్నప్పటికీ, దేవుడు మనుష్యులను మెస్సీయతో ఏకం చేసినప్పుడు, పురుషులు లేకుండా స్త్రీలు ఉనికిలో లేరు మరియు స్త్రీలు లేకుండా పురుషులు ఉనికిలో లేరు. 12 నిజానికి, స్త్రీ {హవ్వ} పురుషుడు {ఆదాము} నుండి వచ్చినప్పటికీ, స్త్రీలు వారికి జన్మనిచ్చినందున పురుషులు మాత్రమే ఉనికిలో ఉన్నారు. అయితే, ఉనికిలో ఉన్న ప్రతిదీ{, స్త్రీలు మరియు పురుషులతో సహా} దేవుని నుండి వస్తున్నారు. 13 తలలు కప్పుకోకుండా దేవునికి ప్రార్థించే స్త్రీలు తగిన విధంగా ప్రవర్తిస్తారో లేదో మీరే నిర్ణయించుకోవాలి. 14 పురుషులకు పొడవాటి జుట్టు కలిగి ఉండడం ఇది అగౌరవం అని పరిస్థితులను ఎలా ఉన్నాయి అని మీరు గమనించడం నుండి నేర్చుకోవచ్చు. 15 అయినప్పటికీ, స్త్రీలు పొడవాటి జుట్టు కలిగి ఉండడం గౌరవప్రదమైనదని { పరిస్థితులను ఎలా ఉన్నాయి అని మీరు గమనించడం నుండి కూడా మీరు తెలుసుకోవచ్చు}. {ఇది} ఎందుకంటే దేవుడు స్త్రీలకు వారి పొడవాటి జుట్టును ఇచ్చాడు, ఇది {వారి తలలను} కప్పి ఉంచేలా పని చేస్తుంది. 16 ఇప్పుడు ఏ మనుష్యులైనా నేను చెప్పిన దాని గురించి వాదించుకోవాలని భావించిన యెడల, మేము లేదా దేవుని యొక్క సంఘములు స్త్రీలు {ప్రార్థిస్తున్నప్పుడు లేదా ప్రవచించేటప్పుడు} తమ తలల మీద ముసుకు తీయడానికి అనుమతించము. 17 నేను ఇప్పుడు మీకు మరొక అంశం గురించి ఉపదేశించబోచున్నాను మరియు ఈ విషయములో నేను మిమ్ములను మెచ్చుకోలేను. {నేను మిమ్మును మెచ్చుకోలేను,} ఎందుకంటే మీరు తోటి విశ్వాసులుగా సమావేశమైనప్పుడు వారికి సహాయం చేయడానికి బదులుగా మీరు తోటి విశ్వాసులకు హాని చేస్తారు. 18 ఇక్కడ నేను మాట్లాడబోయే మొదటి విషయం ఉంది: మీరు దేవుణ్ణి ఆరాధించడానికి తోటి విశ్వాసులుగా సమావేశమైనప్పుడు మీరు ప్రత్యర్థి గుంపులలోనికి విడిపోతారని కొందరు మనుష్యులు నాతో చెప్పారు. ఇది పాక్షికంగా నిజమని నేను నమ్ముచున్నాను. 19 {నేను ఇది నమ్ముచున్నాను} ఎందుకంటే మీ గుంపులో భిన్నాభిప్రాయాలు ఉండాలి. ఆ విధంగా, మీ గుంపులో దేవుడు ఎవరిని {ఆయనకు} అంగీకారయోగ్యంగా ఉండడానికి భావిస్తాడో {ప్రతి ఒక్కరికీ} ఇది స్పష్టమవుతుంది. 20 ఈ విభజనల కారణంగా, మీరు తోటి విశ్వాసులుగా కలిసి {భోజనం చేయడానికి} వాస్తవానికి మీరు ప్రభువు యొక్క రాత్రి భోజనం చేయడం లేదు. 21 మీ భోజన సమయములో, కొందరు మనుష్యులు తమ స్వంత ఆహారాన్ని {ఇతరులు కొంత స్వీకరించకముందే} భుజిస్తున్నారు. ఈ విధానంలో, కొందరు మనుష్యులకు తినడానికి సరిపడా ఉండదు, మరికొందరు మత్తులో పడి ఉన్నారు. 22 మీరు మీ సొంత గృహాలలో ఆహారం భుజించవచ్చు మరియు ద్రాక్షారసం త్రాగవచ్చు అనే వాస్తవం ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారు. బదులుగా, మీరు దేవుని యొక్క సంఘము గురించి అవమానకరంగా ఆలోచించినప్పటికీ, ముఖ్యంగా, మీ కంటే తక్కువ ఉన్న మనుష్యులను మీరు సిగ్గుపరుస్తారు. నేను మీకు ఏమి చెప్పాలో మీకు ముందే తెలిసి ఉండాలి. ఈ పనులు చేసినందుకు నేను మిమ్ములను మెచ్చుకోను. నేను ఖచ్చితంగా అది చేయను! 23 యూదా ప్రభువైన యేసును {ఆయనను శిక్షించిన అధికారులకు} అప్పగించిన రాత్రి గురించి నేను ప్రభువు నుండి నేర్చుకున్నది మీకు ముందే చెప్పాను. వారు ఆయనను శిక్షించారు. ఆ రాత్రి సమయంలో, యేసు ఒక రొట్టె తీసుకున్నాడు. 24 ఆయన దేవునికి {రొట్టె కోసం} కృతజ్ఞతలు తెలిపాడు, మరియు అప్పుడు ఆయన దానిని ముక్కలుగా చేసాడు {తద్వారా శిష్యులు దానిని భుజిస్తారు}. అప్పుడు ఆయన చెప్పాడు, “ఈ {రొట్టె} నా శరీరం, ఇది నేను మీ కోసం అర్పిస్తున్నాను. నేను చేసిన పనిని పునరావృతం చేయండి, తద్వారా నన్ను నేను {మీ కోసం} {నేను ఏ విధంగా అర్పించుకొనుచున్నాను} అని గుర్తుంచుకోవాలి." 25 {ఆయన రొట్టెను పైకి తీసుకున్న} విధముగా, వారు భుజించిన తరువాత ఆయన {ద్రాక్షారసం యొక్క} పాత్ర కూడా పైకి తీసుకున్నాడు. ఆయన చెప్పాడు, “ఈ {ద్రాక్షారసం యొక్క} పాత్ర నా రక్తముతో {నేను ప్రారంభించే} క్రొత్త నిబంధన. మీరు ఈ పాత్ర ద్రాక్షారసం తాగునప్పుడు నేను చేసిన పనిని పునరావృతం చేయండి, తద్వారా మీరు నన్ను {మీ కోసం} {నేను ఏ విధంగా సమర్పిస్తున్నాను} అని గుర్తుంచుకోండి." 26 దీని అర్థం, ప్రభువు తిరిగి వచ్చే వరకు, {మీరు ఈ రొట్టె భుజిస్తూ మరియు ఈ పాత్రలో {నుండి ద్రాక్షారసం} తాగడం చేత ప్రభువు యొక్క రాత్రి భోజనం చేసినప్పుడల్లా, ప్రభువు మరణించాడు అని మీరు ప్రకటిస్తారు. 27 కాబట్టి అప్పుడు, కొందరు మనుష్యులు ప్రభువు యొక్క రాత్రి భోజనములో పాల్గొంటున్నప్పుడు, {మెస్సీయను} అగౌరవపరిచే విధంగా రొట్టెలు భుజిస్తారు లేదా పాత్ర {నుండి ద్రాక్షారసాన్ని} త్రాగుతారు. ప్రభువు యొక్క శరీరం మరియు రక్తానికి {వారు ఏ విధంగా వ్యతిరేకంగా ప్రవర్తించారో} దేవుడు వారిని బాధ్యులను చేస్తాడు. 28 దానిని నివారించడానికి, విశ్వాసులు తాము ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడు, వారు రొట్టె తినవచ్చు మరియు పాత్ర నుండి {ద్రాక్షారసం} త్రాగవచ్చు. 29 {మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలించాలి,} ఎందుకంటే కొందరు మనుష్యులు {ప్రభువు యొక్క రాత్రి భోజనం సమయములో} భుజిస్తారు మరియు త్రాగుతారు, అయితే {దేవుడు తోటి విశ్వాసులను ప్రభువు యొక్క శరీరం వలె ప్రభువుతో ఐక్యం చేసాడు అని వారు } గుర్తించరు. ఆ మనుష్యులు {ప్రభువు యొక్క రాత్రి భోజనం సమయములో} ఏ విధంగా భుజిస్తారో మరియు త్రాగుతారో దేవుడు వారిని శిక్షించడంలో కనిపిస్తుంది. 30 {మీ గుంపులోని మనుష్యులు ఆ సరికాని విధంగా ప్రవర్తించిన} కారణంగా వారిలో అనేకమంది మంది అనారోగ్యానికి గురయ్యారు మరియు వారిలో కొందరు మరణించారు. 31 కాబట్టి, విశ్వాసులమైన మనం {ప్రభువు రాత్రి భోజనంలో పాల్గొనడానికి ముందు} మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నామో జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడు దేవుడు మనలను శిక్షించడు. 32 అయితే, ప్రభువు మనలను శిక్షించినప్పుడు, ఆయన మనకు శిక్షణ ఇచ్చేందుకు దీనిని చేస్తాడు. ఆ విధంగా, మెస్సీయను విశ్వసించని ప్రతి ఒక్కరినీ దోషులుగా ప్రకటించినప్పుడు దేవుడు మనలను చేర్చడు. 33 ముగింపులో, నా తోటి విశ్వాసులారా, మీరు {ప్రభువు భోజనం} భుజించడానికి ఒకచోట చేరినప్పుడు, ప్రతి ఒక్కరు ఆహారం మరియు పానీయాలు పొందే వరకు మీరు భుజించడం ప్రారంభించకూడదు. 34 {ఎక్కువ} ఆకలితో ఉన్నవారు ఏ మనుష్యులైనా {ప్రతిఒక్కరు ఆహారం మరియు పానీయాలు పొందడానికి ముందు భుజించడం ప్రారంభిస్తారు} వారి స్వంత గృహాలలో భుజించాలి. ఆ విధంగా, మీరు తోటి విశ్వాసులుగా సమావేశమైనప్పుడు, దేవుడు మిమ్ములను శిక్షించడు. నేను చెప్పడానికి అవసరమైనవి ప్రతీదీ నేను చెప్పలేదు. కాబట్టి, నేను మిమ్ములను సందర్శించినప్పుడల్లా ఆ సంగతులను గురించి మీకు హెచ్చరిక చేస్తాను.

Chapter 12

1 దేవుని యొక్క ఆత్మ ఏవిధంగా విశ్వాసులను ప్రత్యేకంగా సంసిద్ధపరుస్తాడో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుటకు ముందుకు కదులుచున్నాను. నా తోటి విశ్వాసులారా, ఈ సంగతుల గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. 2 మీరు విశ్వాసులు కానప్పుడు {మీరు ఏమి చేసారో} మీకు జ్ఞాపకం ఉంది. మీరు ఇతర దేవుళ్ళను పూజించారు. ఈ ఇతర దేవుళ్ళు కనీసం మాట్లాడలేరు, అయితే మీరు ఈ ఇతర దేవుళ్ళను ఆరాధించడం కోసం {మనుష్యులు మీకు చెప్పిన తప్పు పనులు} చేసారు. 3 కాబట్టి అప్పుడు, యేసును శపిస్తున్న ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తితో మాట్లాడడు అని నేను మీకు తెలియచేస్తున్నాను. మరోవైపు, యేసే ప్రభువు అని చెప్పే వ్యక్తి పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తితో మాట్లాడుతుండ వలెను. 4 ఆత్మ అనేక విభిన్నవిధాలుగా మనుష్యులను శక్తివంతులుగా చేస్తాడు, అయితే ఒకే ఒక్క ఆత్మ ఉన్నాడు. 5 మనుష్యులు అనేక విధాలుగా ప్రభువును సేవిస్తారు, అయితే ఒకే ఒక్క ప్రభువు ఉన్నాడు. 6 మనుష్యులు అనేక విభిన్న విధాలుగా దేవుని కోసం పని చేస్తారు, అయితే ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఈ అన్ని విధాలలో పనిచేయడానికి మనుష్యులు అందరిని శక్తివంతము చేయువాడు ఆయన ఒక్కడే. 7 తోటి విశ్వాసులకు సహాయం చేయడానికి దేవుని యొక్క ఆత్మ వారి ద్వారా పనిచేసే నిర్దిష్ట మార్గాలను ప్రతి విశ్వాసి దేవుని నుండి పొందుతాడు. 8 ఉదాహరణకు, జ్ఞానయుక్తముగా మాట్లాడడానికి దేవుని యొక్క ఆత్మ కొంతమంది విశ్వాసులను శక్తివంతులను చేస్తాడు. ఇతర విశ్వాసులు తెలివితేటలుగా మాట్లాడగలరు మరియు అదే ఆత్మ వారు దీనిని చేయడానికి శక్తిని ఇస్తాడు. 9 అదే ఆత్మ కొంతమంది విశ్వాసులను ప్రత్యేక మార్గాలలో దేవుని విశ్వసించడానికి శక్తివంతంగా చేస్తాడు. అదే ఆత్మ ఇతరులను స్వస్థపరచుటకు ఇతర విశ్వాసులను శక్తివంతంగా చేస్తాడు. 10 ఇతర విశ్వాసులు శక్తివంతమైన పనులు చేయగలరు. ఇతర విశ్వాసులు దేవుని నుండి సందేశాలను మాట్లాడగలరు. ఇతర విశ్వాసులు ఏదైనా దేవుని ఆత్మ నుండి వచ్చినదా లేదా అనేది నిర్ణయించగలరు. కొంతమంది విశ్వాసులు తెలియని భాషలు మాట్లాడగలరు. ఇతర విశ్వాసులు ఆ తెలియని భాషలను వివరించగలరు. 11 విశ్వాసులను ఈ సంగతులు అన్నిటినీ చేయడానికి శక్తివంతం చేయడానికి అదే ఆత్మ పనిచేస్తాడు. కేవలం ఒక్క పరిశుద్ధ ఆత్మ మాత్రమే ఉన్నాడు, మరియు ప్రతి విశ్వాసి ద్వారా ప్రత్యేకంగా ఏ విధంగా పని చేయాలో ఆయన నిర్ణయిస్తాడు. 12 ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని ఐక్యంగా ఉండడానికి {మనం పరిగణిస్తాము}, అయితే శరీరం అనేక శరీర భాగాలు కలిగి ఉన్నది. కాబట్టి, ఆ శరీర భాగాలు అన్నీ, అవి ఎన్ని ఉన్నప్పటికీ పర్వాలేదు, కలిసి ఒక శరీరాన్ని తయారు చేస్తాయి. అదే విధంగా మెస్సీయ గురించి {మనం ఆలోచించవచ్చు}. 13 ఇప్పుడు, {మనం ఒకే శరీరాన్ని ఏర్పరచుకున్న విధంగా} దేవుడు మనలను కలిపి ఐక్యముగా దగ్గరగా ఉంచాడు. మనుష్యులు మనకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు {ఇది జరిగింది,} దాని ఫలితంగా మనకు ఒకే ఆత్మ ఉన్నాడు. మనలో కొందరు యూదులు మరియు మరికొందరు యూదులు కాని మనుష్యులు అయినప్పటికీ, మరియు మనలో కొందరు బానిసలు మరియు మరికొందరు స్వేచ్ఛా మనుష్యులు అయినప్పటికీ {మనము ఈ ఒక్క శరీరాన్ని తయారు చేస్తాము.} ఇంకా, మనమందరం ఒక్క ఒక్క పాత్ర నుండి పానీయాన్ని పంచుకున్న విధముగా ఈ ఒక్క ఆత్మలో మనమందరం పంచుకున్నాము. 14 మీకు తెలిసిన విధముగా, ఒక శరీర భాగం ఒక శరీరమును తయారు చేయదు. బదులుగా, {శరీరమును రూపొందించడానికి} అనేక శరీర భాగాలు అవసరం. 15 మీ పాదము {మీతో మాట్లాడగల్గుతుంది మరియు అది} ఒక చెయ్యి కానందున, అది మీ శరీరానికి చెందియుండదు అని చెప్పింది అని ఊహించండి. ఆ కారణము అది మీ శరీరానికి చెందియుండడం నుండి దానిని దూరం చెయ్యదు. 16 తిరిగి, మీ చెవి {మీతో మాట్లాడగలదని మరియు అది} కన్ను కానందున, అది మీ శరీరానికి చెందదు అని చెప్పింది అని ఊహించండి. ఆ కారణము అది మీ శరీరానికి చెందయుండడం నుండి దానిని దూరం చెయ్యదు. 17 కళ్ళు మాత్రమే మీ శరీరాన్ని తయారు చేసాయని ఊహించుకోండి. మీరు ఏమీ వినలేరు! చెవులు మాత్రమే మీ శరీరాన్ని తయారు చేసాయని ఊహించుకోండి. మీరు దేనినీ వాసన చూడలేరు! 18 అయితే {శరీరం గురించి} నిజం ఇక్కడ ఉంది: ప్రతి శరీర భాగం ఏ విధంగా పని చేయాలో దేవుడు నిర్ణయించాడు మరియు ఆయన ఒక నిర్దిష్ట కారణం కోసం ప్రతి శరీర భాగాన్ని శరీరానికి అనుసంధానించాడు. 19 {మీ శరీర భాగాలు} అన్నీ ఒకే {రకమైనవి} శరీర భాగము అని ఊహించండి. అస్సలు మీకు నిజంగా శరీరం ఉండదు! 20 అయితే ఇక్కడ {శరీరం గురించి} నిజం ఇలా ఉంది: అనేక {భిన్నమైన} శరీర భాగాలు ఉనికిలో ఉన్నాయి. అయినప్పటికీ, {అవి కలిసి} ఒకే శరీరాన్ని ఏర్పాటు చేస్తాయి. 21 మీ శరీర భాగాలు మాట్లాడగలవు అని మరల ఊహించండి. "నాకు నువ్వు అవసరం లేదు" అని ఒక కన్ను చేతికి ఎప్పటికే చెప్పదు. అదేవిధంగా, "నాకు నువ్వు అవసరం లేదు" అని తల ఎన్నడు పాదాలకు చెప్పదు. 22 బదులుగా, మనం సున్నితంగా ఉన్నాయని భావించే శరీర భాగాలు వాస్తవానికి అవసరమైనవి అనేది వాస్తవమై ఉంది. 23 ఇంకా, మనం తక్కువ విలువైనవి అని భావించే శరీర భాగాలకు ఎక్కువ విలువ ఇస్తాం. మనము మన అసభ్యకరమైన శరీర భాగాలను మరింత యుక్తముగా చూస్తాము, 24 అయితే మనం మన మంచి శరీర భాగాలను ఒక ప్రత్యేక పద్ధతిలో చూసుకోము. అంతిమంగా, శరీర భాగాలు అన్నిటినీ ఒకే శరీరానికి చేర్చిన వాడు దేవుడే, మరియు ఆయన తక్కువ విలువైన భాగాలను మరింత విలువైనవిగా చేస్తాడు. 25 {దేవుడు దీనిని చేసాడు} తద్వారా శరీరం వేరు వేరు భాగాలుగా విడిపోకుండా ఉంటుంది. బదులుగా, శరీర భాగాలు కలిసి పనిచేస్తాయి మరియు ఇతర శరీర భాగాల మీద ఒక శరీర భాగానికి ప్రత్యేక హక్కు ఉండదు. 26 కాబట్టి, ఒక శరీర భాగానికి బాధ వచ్చినప్పుడు శరీర భాగాలు అన్ని బాధపడతాయి. ఎవరైనా ఒక శరీర భాగాన్ని ప్రశంసించినప్పుడు అన్ని శరీర భాగాలు వేడుక జరుపుకుంటాయి. 27 {నేను ఇది అంతా చెప్పుచున్నాను ఎందుకంటే} మీరు అందరూ మెస్సీయ శరీరంము {వలె} ఉన్నారు. మీలో ప్రతి ఒక్కరు {ఆ శరీరములో} ఒక శరీర భాగం {వలే} ఉన్నారు. 28 దానికి అనుగుణంగా, దేవుడు తనను ఆరాధించే మనుష్యులను ప్రత్యేకంగా శక్తివంతులను చేస్తాడు. మొదటిగా, కొందరు మనుష్యులు మెస్సీయకు ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు పంపిన వారు. రెండవది, కొందరు మనుష్యులు దేవుడు చెప్పే దానిని ప్రకటిస్తారు. మూడవది, కొందరు మనుష్యులు ఇతర విశ్వాసులకు బోధిస్తారు. ఇంకా, కొంతమంది శక్తివంతమైన పనులు చేస్తారు. కొందరు ఇతరులను స్వస్థపరచవచ్చు, ఇతరులు ఇతర విశ్వాసులకు సహాయం చేయవచ్చు, విశ్వాసుల యొక్క గుంపుకు మార్గనిర్దేశం చేయవచ్చు లేదా తెలియని భాషలు మాట్లాడవచ్చు. 29 మెస్సీయకు ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు పంపిన విశ్వాసులు కొందరు మాత్రమే. కొందరు మాత్రమే దేవుడు చెప్పిన దానిని ప్రకటిస్తారు. కొందరు మాత్రమే ఇతర విశ్వాసులకు బోధిస్తారు. కొందరు మాత్రమే శక్తివంతమైన పనులు చేస్తారు. 30 కొందరు మాత్రమే ఇతరులను స్వస్థపరుస్తారు. కొందరు మాత్రమే తెలియని భాషలు మాట్లాడతారు. కొందరు మాత్రమే {ఆ తెలియని భాషలను} అర్థీకరిస్తారు. 31 ఇప్పుడు మీరు అత్యంత ప్రయోజనకరమైన వరములను ఆతురముగా వెదకాలని నేను కోరుచున్నాను. తర్వాత, మీరు చేయగలిగిన అత్యుత్తమమైన పని గురించి నేను మీకు చెపుతాను.

Chapter 13

1 నేను అనేక మానవ మరియు దేవదూతల భాషలను మాట్లాడగలను అని ఊహించుకోండి, అయితే నేను ఇతరులను ప్రేమించలేదు. నేను పెద్ద లోహ పరికరము వలే {ఎక్కువ శబ్దం చేయగలను} {, అయితే నేను ఎవరికీ సహాయం చేయను}. 2 మరల, నేను దేవుడు చెప్పే దానిని ప్రకటించగలను అని, నేను ప్రతిదీ అర్థం చేసుకోగలను మరియు ప్రతీది తెలుసుకోగలను అని మరియు పర్వతాలను స్థలాలను మార్చేలా చేయగలనని నేను ఎంతో విశ్వసిస్తున్నాను అని ఊహించండి. అయితే నేను ఇతరులను ప్రేమించలేదు అని ఇంకా ఊహించుకోండి. దాని కారణంగా మరేమియు ముఖ్యం కాదు. 3 అయినా ఇంకా, నేను కలిగి ఉన్నదంతా {ఆహారం అవసరమైన మనుష్యులకు} వరముగా ఇచ్చాను అని, మరియు నా స్వంత శరీరాన్ని నేను రక్షించుకోలేదు అని, ఫలితంతో మనుష్యులు నన్ను గౌరవిస్తారు అని ఊహించుకోండి. అయితే ఇంకా నేను ఇతరులను ప్రేమించలేదు అని ఊహించుకోండి. {ఎందుకంటే నేను ఇతరులను ప్రేమించలేదు}, నేను చేసిన వాటిలో ఏవీ నాకు సహాయం చేయలేదు. 4 ఇతరులను ప్రేమించేవారు ఓపికగా వేచి ఉంటారు మరియు కృపతో వ్యవహరిస్తారు. వారు కలిగియున్న మంచి వస్తువులను ఇతరులు పోగొట్టుకోవాలి అని వారు కోరుకోరు. వారు తమ గురించి గొప్ప సంగతులు చెప్పుకోరు లేదా తామే గొప్ప వారి వలే ప్రవర్తించరు. 5 వారు అవమానకరమైన పనులు చేయరు. వారు తమ గురించి మాత్రమే పట్టించుకోరు. వారు త్వరగా కోపం తెచ్చుకోరు. ఇతరులు ఏమి తప్పు చేసారో వారు కంట కనిపెట్టరు. 6 మనుష్యులు చెడ్డ క్రియలు చేసినప్పుడు వారు వేడుక చేసుకోరు. బదులుగా, వారు నిజమైన దానిని వేడుక చేసుకొంటారు. 7 వారు ఎల్లప్పుడూ {ఇతరులతో} సహిస్తారు. వారు ఎల్లప్పుడూ {దేవుడు ఉత్తమమైనది చేస్తాడు అని} విశ్వసిస్తారు మరియు {దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని చేస్తాడు అని} వారు ఎల్లప్పుడూ విశ్వసిస్తారు. వారు ఎల్లప్పుడూ {చెడు విషయాలు జరిగినప్పుడు} పట్టుదలతో ఉంటారు. 8 ఇతరులను ప్రేమించేవారు అలా చేయడం మానివెయ్యరు. అయితే, ఒక రోజు మనుష్యులు దేవుడు చెప్పే దానిని ప్రకటించరు. ఒక రోజు, మనుష్యులు తెలియని భాషలు మాట్లాడటం మానివేస్తారు. ఒక రోజు, మనుష్యులకు ప్రత్యేక విషయాలు తెలియవు. 9 {ఈ సంగతులు ఇక మీదట జరగవు,} ఎందుకంటే మనకు ప్రత్యేక విషయాలు అసంపూర్ణంగా తెలుసు, మరియు దేవుడు చెప్పే దానిని అసంపూర్ణంగా ప్రకటిస్తాము. 10 కాబట్టి, మనము సంపూర్ణమైన దానిని అనుభవించినప్పుడు {యేసు తిరిగి వచ్చినప్పుడు}, అసంపూర్ణమైనది ఇక మీదట ముఖ్యమైనదిగా ఉండదు. 11 {ఇక్కడ ఒక సారూప్యత ఉంది:} మనము చిన్నతనములో ఉన్నప్పుడు, మనం పిల్లలు మాట్లాడిన విధంగా మాట్లాడాము. పిల్లలు ఆలోచనచేసిన విధముగా మనం ఆలోచించాము. పిల్లలు నిర్ణయాలు చేసిన విధముగా మనము నిర్ణయాలు చేసాము. అయితే మనం పెద్దవారం అయిన తరువాత మనం చిన్నపిల్లల వలె నటించడం మాని వేసాము. 12 ప్రస్తుతం, మనం అద్దంలో ప్రతిబింబాన్ని చూసిన విధంగా, పరోక్షంగా {దేవుణ్ణి} చూస్తాము. అయితే, {యేసు తిరిగి వచ్చినప్పుడు}, {మనం దేవుణ్ణి వ్యక్తిగతంగా చూస్తాము}. ప్రస్తుతం, మనం {దేవుణ్ణి} అసంపూర్ణంగా యెరుగుదుము. అయితే, {యేసు తిరిగి వచ్చినప్పుడు}, ఆయన మనలను యెరిగినంత విధముగా మనము దేవుణ్ణి తెలుసుకుంటాము. 13 ముగింపులో, మనం ఎల్లప్పుడూ చేస్తూనే ఉండే మూడు విషయాలు ఉన్నాయి. మనము {మెస్సీయలో} విశ్వసిస్తాము, {దేవుడు తాను వాగ్దానము చేసిన దానిని చేస్తాడు అని} మరియు {దేవుణ్ణి మరియు ఇతర మనుష్యులను} ప్రేమిస్తాము అని నమ్మకంగా ఎదురుచూస్తున్నాము. అయితే, ఈ మూడు సంగతులలో {దేవుణ్ణి మరియు ఇతరులను} ప్రేమించడం చాలా ముఖ్యమైనది.

Chapter 14

1 మీరు ఎల్లప్పుడూ ఇతరులను ప్రేమించడానికి కోరుకోవాలి. అంతేకాకుండా, పరిశుద్ధ ఆత్మ మిమ్ములను ప్రత్యేకంగా శక్తితో నింపాలి అని, ప్రత్యేకించి మీరు దేవుడు చెప్పేది ప్రకటించగలరు అని మీరు ఆతురతతో వెదకాలి. 2 {మీరు దీనిని కోరుకోవాలి} ఎందుకంటే తెలియని భాషలలో మాట్లాడే మనుష్యులు దేవునితో మాట్లాడుచున్నారు, ఇతర మనుష్యులతో కాదు. {ఇది} ఎందుకంటే వారు ఏమి చెప్పుచున్నారో ఎవరికీ తెలియదు. బదులుగా, పరిశుద్ధ ఆత్మ వారికి శక్తిని ఇస్తుండగా వారు రహస్య విషయాలు చెపుతారు. 3 మరోవైపు, దేవుడు చెప్పినట్లు ప్రకటించేవారు ఇతర మనుష్యులతో మాట్లాడుతారు. ఇతర విశ్వాసులు బలపడటానికి వారు సహాయపడతారు, ఇతర విశ్వాసులను సరైన మార్గాలలో ప్రవర్తించమని బతిమిలాడుతాయి, మరియు ఇతర విశ్వాసులను ఓదార్పునిస్తాయి. 4 తెలియని భాషలలో మాట్లాడే మనుష్యులు తమను తాము బలంగా మార్చుకోవడానికి సహాయం చేసుకుంటారు. మరోవైపు, దేవుడు చెప్పినదానిని ప్రకటించే మనుష్యులు విశ్వాసుల యొక్క గుంపు బలపడేందుకు సహాయం చేస్తారు. 5 మీరందరూ తెలియని భాషలలో మాట్లాడాలని నేను కోరుచున్నాను. అయితే, దేవుడు చెప్పేదానిని మీరు ప్రకటించాలి అని నేను ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాను. తెలియని భాషలలో మాట్లాడడం కంటే దేవుడు చెప్పేదానిని ప్రకటించడం చాలా ముఖ్యమైనది మరియు సహాయకరంగా ఉంటుంది. అయితే, ఎవరైనా {తెలియని భాషను} వివరించిన యెడల, అప్పుడు అది {కూడా} విశ్వాసులు బలంగా మారడంలో సహాయపడుతుంది. 6 ఇక్కడ {నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఉంది}, నా తోటి విశ్వాసులారా: నేను {, ఉదాహరణకు,} మిమ్ములను సందర్శించినట్లు ఊహించుకోండి, మరియు నేను తెలియని భాషలలో మాట్లాడాను. నేను మీకు ఏమీ సహాయం చెయ్యడం లేదు. మీకు నిజంగా సహాయం చేయడానికి, సంగతులను {మీకు} వెల్లడించడానికి నాకు అవసరంగా ఉంది, మీకు విషయాలు తెలుసుకోవడంలో సహాయపడడం, దేవుడు {మీకు} చెప్పుచున్న దానిని ప్రకటించాలి లేదా {మీకు} బోధించాలి. 7 సజీవంగా లేనివి సహితం అయితే మనం శబ్దాలు చేయడానికి ఉపయోగించేవి {నేను చెపుతున్న దానిని వివరిస్తాయి}. {ఒకరు ఒక వేణువు లేదా ఒక వీణ మ్రోగించినప్పుడు, ఆ వాయిద్యం తప్పనిసరిగా వివిధ రకాల శబ్దాలు చేయాలి. లేకపోతే, ఒక వ్యక్తి వేణువు లేదా వీణ మీద ఏమి వాయిస్తాడో {అన్ని శబ్దాలు ఒకేలా ఉంటాయి కాబట్టి}. ఎవరికీ అర్థం కాదు. 8 ఇంకా, {ఒక వ్యక్తి ఇతరులను హెచ్చరించడానికి దానిని ఉపయోగించినప్పుడు}. బూర స్పష్టమైన శబ్దాలు చేయలేదు అని అనుకుందాం. శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉండవలసిన అవసరం ఎవరికీ తెలియదు. 9 మీరు మాట్లాడేటప్పుడు ఇతర మనుష్యులు గుర్తించే పదాలను మీరు ఉపయోగించనప్పుడు, మీరు {స్పష్టమైన శబ్దం చేయని పరికరం} వలె ఉంటారు. మీరు చెప్పుచున్న దానిని ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేరు మరియు మీరు ఎవరితోనూ మాట్లాడని వ్యక్తి {వలే} ఉంటారు. 10 అనేక రకాల భాషలు ఉనికిలో ఉన్నాయి అనేది నిజం అనిపిస్తుంది. వాటిలో ప్రతి ఒక్కటి స్పష్టంగా తెలియ చేస్తుంది. 11 కాబట్టి, {, ఉదాహరణ కోసం,} ఒక భాష ఏ విధంగా తెలియ చేస్తుందో నేను అర్థం చేసుకోలేనప్పుడు, {ఆ భాష} మాట్లాడే ప్రతి ఒక్కరికీ నేను అపరిచితుడిగా ఉంటాను, మరియు వారు నాకు అపరిచితులుగా ఉంటారు. 12 కాబట్టి, మీరు చేయవలసినది ఇక్కడ ఉంది: పరిశుద్ధ ఆత్మ మిమ్ములను ప్రత్యేకంగా శక్తితో నింపాలి అని మీరు కోరుకుంటారు కాబట్టి, {మీరు చెయ్యడానికి పరిశుద్ధ ఆత్మ మిమ్మును శక్తివంతులుగా చేయుచున్నాడో దానిని ఉపయోగించడానికి} విశ్వాసుల యొక్క గుంపు బలంగా మారడంలో సహాయం చెయ్యడానికి మీరు అధికంగా మరియు అధికంగా ప్రయత్నించాలి. 13 కాబట్టి, తెలియని భాషలలో మాట్లాడే వారు {వారు చెప్పుచున్నదానిని} వివరించడానికి సామర్ధ్యం ఇవ్వడానికి దేవుణ్ణి ప్రార్థించాలి. 14 నేను {, ఉదాహరణకు,} తెలియని భాషలో {దేవునికి} ప్రార్థించినప్పుడు, నేను చెప్పేదాని గురించి నేను ఆలోచించనందున నాలో కొంత భాగం మాత్రమే ప్రార్థిస్తోంది. 15 కాబట్టి, ఇదిగో {నీవు మరియు నేను} చెయ్యవలసింది ఇక్కడ ఉంది. మనలోని కొన్ని భాగాలతో మాత్రమే కాకుండా అయితే మనం చెపుతున్న దాని గురించి ఆలోచించడం చేత కూడా మనం {దేవునికి} ప్రార్థించాలి. మనలోని కొన్ని భాగాలతో మాత్రమే కాకుండా అయితే మనం పాడుచున్న దాని గురించి ఆలోచించడం చేత కూడా మనం {దేవునికి} పాడాలి. 16 మీరు మీలోని కొన్ని భాగాలను ఉపయోగిస్తున్నప్పుడు {తెలియని భాషలు} అర్థం చేసుకోలేని మనుష్యులు మీరు దేవుణ్ణి స్తుతించడం వింటారని ఊహించండి, {, మరియు మీరు చెప్పుచున్న దానిని గురించి ఆలోచించడం లేదు}. మీరు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆ మనుష్యులు పాల్గొనలేరు ఎందుకంటే మీరు మాట్లాడుచున్నది వారికి {తెలియని భాష} అర్థం కాలేదు. 17 ఈ పరిస్థితిలో, మీరు దేవుణ్ణి సముచితంగా స్తుతిస్తారు. అయినప్పటికీ, మీరు ఇతర మనుష్యులు బలంగా మారడానికి సహాయం చేయరు. 18 మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలలో మాట్లాడుచున్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. 19 అయితే, నేను దేవుణ్ణి ఆరాధించడానికి తోటి విశ్వాసులతో కలిసి వచ్చినప్పుడు, నేను ఆలోచించే కొన్ని మాటలు మాత్రమే మాట్లాడడానికి నేను కోరుకుంటున్నాను. ఈ విధానంలో, నేను ఇతర విశ్వాసులకు బోధించగలను మరియు {నాకే మాత్రమే కాదు}. తెలియని భాషలో పది లక్షలు పదాలు చెప్పడం కంటే {అది చేయడం నాకు మంచిది}. 20 నా తోటి విశ్వాసులారా, {ఈ సంగతులను గురించి} మీరు చిన్నపిల్లలు వలె బుద్ధి హీనముగా ఉండడానికి నేను కోరుకోవడం లేదు. బదులుగా, మీరు {ఈ సంగతులను గురించి} పూర్తిగా ఎదిగిన పెద్దల {చేసినట్టు} వలే చాలా తెలుసుకోవాలి. మీరు తప్పు అనేదానిని చేయకుండా ఉండటం చేత {మాత్రమే} మీరు చిన్న పిల్లల వలె ఉండాలి. 21 యెషయా ప్రవక్త లేఖనాలలో ప్రభువు చెప్పిన దానిని రాసాడు, “నేను నా విదేశీయ భాషలు మాట్లాడు మనుష్యుల విధానాల చేత నా మనుష్యులు ఇశ్రాయేలుతో నేను మాట్లాడుతాను. అయితే, వారు ఈ విధానంలో నా మాట వినరు. 22 కాబట్టి, తెలియని భాషలలో మాట్లాడటం {మెస్సీయలో} విశ్వసించని మనుష్యులను దేవుడు తీర్పు తీరుస్తాడు, {మెస్సీయలో} విశ్వసించే మనుష్యులను కాదు అని సూచిస్తుంది. మరోవైపు, దేవుడు చెప్పుచున్న దానిని ప్రకటించడం {మెస్సీయలో} విశ్వసించే మనుష్యుల {యెడల దేవుడు దయగా వ్యవహరిస్తాడని సూచిస్తుంది}, {మెస్సీయలో} విశ్వాసం ఉంచని మనుష్యులయెడల కాదు. 23 కాబట్టి, విశ్వాసుల గుంపు అంతా దేవుణ్ణి ఆరాధించడానికి సమావేశమయ్యారని, మీరందరూ తెలియని భాషలలో మాట్లాడారు అని ఊహించుకోండి. {తెలియని భాషలు} అర్థం చేసుకోని లేదా {మెస్సీయను} విశ్వసించని మనుష్యులు మీ గుంపును సందర్శిస్తారు అని ఊహించండి. వారు మీకు పిచ్చి అని {ఇతరులకు} చెప్పుతారు. 24 మరోవైపు, మీరందరు దేవుడు చెప్పేది ప్రకటించారు అని ఊహించుకోండి. {మెస్సీయను} విశ్వసించని లేదా {తెలియని భాషలు} అర్థం చేసుకోని ఎవరైనా మీ గుంపును సందర్శిస్తారు అని ఊహించండి. మీరు చెప్పే ప్రతి విషయం వారికి చూపుతుంది మరియు {వారు చేసిన తప్పును} ఎదుర్కొంటారు. 25 {ఈ విధంగా,} ఈ {సందర్శకులు} ఇతరుల నుండి దాచిపెట్టే సంగతులను ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ప్రతిస్పందనగా, వారు కింద మోకరిస్తారు మరియు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు నిజంగా మీతో ఉన్నాడని వారు {ఇతరులకు} ప్రకటిస్తారు. 26 నా తోటి విశ్వాసులారా, ఇక్కడ నా ఉద్దేశ్యం. మీరు {దేవుని ఆరాధించడానికి} కలిసి వచ్చినప్పుడల్లా, ప్రతి విశ్వాసికి {ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది}. కొందరు పాటలు పాడతారు, మరికొందరు బోధిస్తారు, మరికొందరు విషయాలు వెల్లడిస్తారు, మరికొందరు తెలియని భాషలో మాట్లాడతారు, మరికొందరు తెలియని భాషను అర్థీకరిస్తారు. ఇతర విశ్వాసులు బలపడేందుకు విశ్వాసులు ఈ పనులన్నీ చేయాలి. 27 విశ్వాసులు తెలియని భాషలలో మాట్లాడుచున్నప్పుడు, అత్యధికంగా ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే {మాట్లాడాలి}. వారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి మరియు ఎవరైనా {వారు ఏమి చెప్పుచున్నారో} వివరించవలసిన అవసరం ఉంది. 28 మరోవైపు, విశ్వాసులు దేవుని ఆరాధించడానికి సమావేశమైనప్పుడు మరియు తెలియని భాషను వివరించగల వ్యక్తి అక్కడ లేనప్పుడు, తెలియని భాషలలో మాట్లాడగల ప్రతి ఒక్కరు మౌనంగా ఉండాలి. {బిగ్గరగా మాట్లాడే బదులు}, వారు దేవునితో ఏకాంతముగా{తెలియని భాషలలో} మాట్లాడాలి. 29 అదేవిధంగా, దేవుడు చెప్పినదానిని ప్రకటించే మనుష్యులు {దాదాపు} ఇద్దరు లేదా ముగ్గురు మనుష్యులు మాట్లాడాలి. మిగిలిన ప్రతి ఒక్కరు{వారు చెప్పే దానిని} సరైనదా లేదా తప్పు అని నిర్ణయించుకోవాలి. 30 ఇప్పుడు, వినుచున్న వ్యక్తికి దేవుడు దేనినైనా బయలుపరచినప్పుడు {విశ్వాసులు ఒకచోట సమావేశమైనప్పుడు దేవుడు చెప్పే దానిని మరొకడు ప్రకటిస్తాడు}, మాట్లాడే వ్యక్తి మాట్లాడటం మానివేయాలి. 31 {మీరు అలా చేయాలి} తద్వారా దేవుడు చెప్పేదానిని ఒకదాని తరువాత మరొకటి ప్రకటించడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుంది. ఆ విధానంలో, ప్రతి ఒక్కరూ ఏదైనా నేర్చుకుంటారు మరియు ప్రతి ఒక్కరు బలంగా మారతారు. 32 దేవుడు చెప్పిన దానిని ప్రకటించే వారు దానిని ఏ విధంగా, మరియు ఎప్పుడు ప్రకటిస్తారో నియంత్రిస్తారు. 33 {అది నిజం} ఎందుకంటే సమాధానకరమైనది మరియు క్రమబద్ధమైనది, క్రమరహితమైనది కాదు, దేవుణ్ణి స్వభావాన్ని తెలియపరుస్తుంది. దేవుణ్ణి ఆరాధించడానికి వారు ఒక చోట చేరినప్పుడు దేవుడు తన కోసం ప్రత్యేకపరచుకొన్న{ఇతర} మనుష్యులు అందరు వలే మీరు కూడా వ్యవహరించాలని నేను కోరుచున్నాను. 34 విశ్వాసులు ఒకచోట చేరినప్పుడు {మరియు వారి భర్తలు మాట్లాడుతున్నప్పుడు} భార్యలు మౌనంగా ఉండాలి. వారు మాట్లాడకూడదు, అయితే బదులుగా {వారి భర్తలను} గౌరవించాలి మరియు విధేయత చూపాలి. {వారు దీనిని చేయాలి} ఎందుకంటే మనం {దేవుని యొక్క} ధర్మశాస్త్రములో కనుగొన్నది ఇదే. 35 ఇప్పుడు, భార్యలు {తమ భర్తలు చెప్పుచున్నదానిని గురించి} మరింత తెలుసుకోవాలని కోరుకున్నప్పుడు, వారు తమ గృహాలలో తమ భర్తలను ప్రశ్నలు అడగాలి. {వారు దీనిని చేయాలి} ఎందుకంటే విశ్వాసులు ఒకచోట చేరినప్పుడు {మరియు వారి భర్తలు మాట్లాడేటప్పుడు} మాట్లాడే భార్యలు {తమనుతాము మరియు వారి కుటుంబాలను} సిగ్గుపరుస్తారు. 36 {నేను చెప్పిన దానిని మీరు ఇష్టపడక పోయిన యెడల,} దేవుడు చెప్పినదానికి మీరు మూలం కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు మీరు మాత్రమే దేవుడు చెప్పిన దానిని వినినవారు {మరియు విశ్వసించినవారు} కాదు. 37 దేవుడు చెప్పుచున్న దానిని ప్రకటించేవారిగా తమను తాము భావించుకునే మనుష్యులు అందరు లేదా పరిశుద్ధ ఆత్మ ప్రత్యేకంగా శక్తితో నింపిన వారు నేను మీకు వ్రాస్తున్నది ప్రభువు తానే కోరుచున్నాడు అని గుర్తించాలి. 38 మరోవైపు, {ప్రభువు నేను చెప్పినదానిని కోరుచున్నాడు అని} గుర్తించని మనుష్యులను ఎవరినైనా మీరు {అధికారికంగా} గుర్తించకూడదు. 39 చివరికి, నా తోటి విశ్వాసులారా, దేవుడు చెప్పుచున్న దానిని ప్రకటించడానికి ఆతురముగా ప్రయత్నించండి. ఇంకా, తెలియని భాషలు మాట్లాడడం నుండి మనుష్యులను నిషేధించవద్దు. 40 చివరగా, {మీరు దేవుణ్ణి ఆరాధించడానికి సమావేశమైనప్పుడు}, మీరు ఎల్లప్పుడూ గౌరవప్రదమైన మరియు క్రమమైన మార్గాలలో ప్రవర్తించాలి.

Chapter 15

1 తరువాత, తోటి విశ్వాసులారా, నేను మీకు చెప్పిన శుభవార్త గురించి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఈ శుభవార్తను {నా నుండి} తెలుసుకున్నారు, మరియు మీరు దానిని దృఢంగా విశ్వసిస్తున్నారు. 2 నేను మీకు ప్రకటించిన సందేశాన్ని మీరు దృఢంగా విశ్వసించినప్పుడు, ఆ సందేశం చేత దేవుడు మిమ్ములను రక్షిస్తాడు. లేకపోతే, మీరు ఏమీ లేకుండా {సందేశాన్ని} విశ్వసించారు. 3 నేను మీకు చెప్పిన మొదటి సంగతులలో ఒకటి ఇక్కడ ఉంది, అది నేను {ప్రభువు నుండి} నేర్చుకున్నాను: పరిశుద్ధ గ్రంథాల {యొక్క రచయితలు} {వ్రాసిన} విధముగా మెస్సీయ మన పాపాలను తీసివేయడానికి {సిలువ మీద} మరణించాడు. 4 మనుష్యులు ఆయనను సమాధి చేసారు, అయితే మూడవ రోజు {ఆ తర్వాత}, పరిశుద్ధ గ్రంథాల {యొక్క రచయితలు} {వ్రాసిన} విధముగా దేవుడు ఆయనను తిరిగి సజీవుడిగా చేసాడు. 5 ఆయన పేతురుకు మరియు తరువాత {యేసు యొక్క మిగిలిన} 12 మంది {సమీప అనుచరులకు} కనిపించాడు. 6 దాని తరువాత, ఆయన 500 కంటే ఎక్కువ మంది తోటి విశ్వాసులకు ఒకేసారి కనిపించాడు. వీరిలో కొందరు మరణించినప్పటికీ, దాదాపు అందరు ఇంకా సజీవంగా ఉన్నారు. 7 దాని తరువాత, ఆయన యాకోబుకు మరియు ఆ తరువాత తనకు ప్రాతినిధ్యం వహించడానికి ఆయన పంపిన ప్రతి ఒక్కరికీ కనిపించాడు. 8 చివరకు, ఆయన వారు అందరికీ కనిపించిన తరువాత, ఆయన నాకు కూడా కనిపించాడు. కాబట్టి, {ఎందుకంటే అందరి తరువాత తనకు ప్రాతినిధ్యం వహించడానికి యేసు పంపిన వాడను అయ్యాను}, నేను అసాధారణ విధానంలో జన్మించిన శిశువు వలే ఉన్నాను. 9 నిజానికి, మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి పంపిన ప్రతి ఒక్కరి కంటే నేను తక్కువ ప్రాముఖ్యత మరియు గౌరవప్రదంగా ఉన్నాను. నిజానికి, మెస్సీయలో విశ్వసించేవారిని నేను నాశనం చేయడానికి ప్రయత్నించాను కాబట్టి, మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి పంపిన వాడను అని ఇతరులు నన్ను పిలిచినప్పుడు నేను దానికి అర్హుడను కాను. 10 అయినప్పటికీ, దేవుడు నన్ను కృపతో మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి పంపిన వానిగా నన్ను చేసాడు. ఇంకా, ఆయన నాకు ఇచ్చిన దాని ఫలితంగా గొప్ప విషయాలు జరిగాయి. నిజానికి, {ఆయనకు ప్రాతినిథ్యం వహించడానికి మెస్సీయ పంపిన ఇతరులు} అందరి కంటే నేను ఎక్కువ కష్టపడ్డాను. అయితే, నిజంగా {ఇది అంత కష్టపడి పని చేసింది} నేను కాదు. బదులుగా, దేవుడు కృపతో నా ద్వారా పని జరిగిస్తున్నాడు {ఆయన చాలా ఎక్కువ చేసాడు}. 11 చివరికి, నేను మరియు ఇతర అపొస్తలులు ఇద్దరం నేను వివరించిన శుభ వార్తను ప్రకటిస్తున్నాము, మరియు మీరు ఈ శుభవార్తను విశ్వసించారు. 12 దేవుడు మెస్సీయను తిరిగి సజీవుడిగా చేసాడు అని విశ్వాసులు అందరు చెప్పుచున్నారు కాబట్టి, చనిపోయిన మనుష్యులు తిరిగి బ్రతకరు అని మీ గుంపులో ఎవరు చెప్పకూడదు. 13 చనిపోయిన మనుష్యులు తిరిగి బ్రతకరు అని {అది నిజము అని} అనుకుందాం. {అటువంటి సందర్భంలో,} దేవుడు మెస్సీయను తిరిగి సజీవుడిగా లేపలేదు. 14 దేవుడు మెస్సీయను తిరిగి సజీవుడిగా చెయ్యలేదు {అని అది నిజమని} అనుకుందాం. అలాంటప్పుడు, ఎటువంటి కారణం లేకుండా మేము {సువార్తను} ప్రకటించాము మరియు మీరు దానిని విశ్వసించారు. 15 ఇంకా, మేము దేవుని గురించి అబద్ధాలు చెప్పేవారిగా ఉంటాం, ఎందుకంటే ఆయన నిజంగా చెయ్యకుండా దేవుడు మెస్సీయను తిరిగి సజీవుడిగా చేసాడు అని మేము దేవుని ఎదుట ప్రకటించాము. దేవుడు చనిపోయిన వారిని తిరిగి సజీవులనుగా చెయ్యకుండా చేసి ఉంటే ఇది అంతా నిజం అవుతుంది. 16 చనిపోయిన మనుష్యులను దేవుడు తిరిగి సజీవులను చెయ్యడని భావించినప్పుడు మీరు {ఇది నిజము అని మీరు చెప్పగలరు.} {అటువంటి సందర్భంలో}, దేవుడు మెస్సీయను కూడా తిరిగి సజీవునిగా చెయ్యలేదు. 17 దేవుడు మెస్సీయను తిరిగి సజీవునిగా చెయ్యలేదు అని {అది నిజము అని} అనుకుందాం. {అటువంటి సందర్భంలో,} మీరు ఎటువంటి కారణం లేకుండా {శుభ వార్తను} విశ్వసించారు మరియు పాపం మిమ్ములను నియంత్రిస్తూనే ఉంది. 18 అటువంటి సందర్భములో మరల, చనిపోయిన విశ్వాసులు ఎన్నటికీ తిరిగి సజీవులు కారు. 19 మనం చనిపోయే ముందు మాత్రమే మెస్సీయ {మనకు సహాయం చేస్తాడు అని} నమ్మకంగా ఎదురుచూడవచ్చు అని ఊహించండి. {అటువంటి సందర్భంలో,} మనుష్యులు అందరు మిగిలిన ప్రతి ఒక్కరి కోసం {వారు జాలిపడడం} కంటే ఎక్కువగా మన విషయంలో జాలిపడాలి. 20 అయితే ఇక్కడ నిజం ఉంది: దేవుడు మెస్సీయను తిరిగి సజీవునిగా చేసాడు, మరియు చనిపోయిన వారిలో ఆయన మొదటివాడు {ఆయనను దేవుడు తిరిగి సజీవునిగా చేస్తాడు}. 21 {ఇది నిజము అని మీరు చెప్పగలరు} ఎందుకంటే ఒకే మనిషి {ఆదాము} చేసిన దాని ద్వారా మనుష్యులు చనిపోతారు. అదే విధంగా చనిపోయిన మనుష్యులు కూడా ఒకే మనిషి {యేసు} చేసిన దాని ద్వారా తిరిగి జీవిస్తారు. 22 నా ఉద్దేశ్యం, దేవుడు వారిని ఆదాముతో ఐక్యం చేసిన కారణంగా మనుష్యులు అందరు చనిపోయే విధంగానే, అదే విధంగా {విశ్వాసులు} అందరు దేవుడు వారిని మెస్సీయతో ఏకం చేసిన కారణంగా తిరిగి జీవిస్తారు. 23 ఇప్పుడు, {తిరిగి జీవించబోయే} మనుష్యులు అందరు తిరిగి ఆ విధంగా చేస్తారు: మొదట మెస్సీయ మరియు తరువాత మెస్సీయకు చెందిన వారు ఆయన {తిరిగి} వచ్చినప్పుడు. 24 దాని తరువాత, దేవుడు సృష్టించినది అంతా ఎదురుచూసేది {జరుగుతుంది}. ఆ సమయంలో, మెస్సీయ ప్రతి ఒక్కరిని మరియు పాలించే మరియు పరిపాలించే మరియు నియంత్రించే ప్రతిదానిని తొలగిస్తాడు. అప్పుడు, ఆయన దేవుని, {మన} తండ్రి, రాజ్యంతో అందజేస్తాడు {తద్వారా దేవుడు ప్రతిదానిని పరిపాలిస్తాడు}. 25 ఇది ఏ విధంగా {పని చేస్తుందో} ఇక్కడ ఉంది: మెస్సీయ తనను వ్యతిరేకించే వారు అందరిని జయించే వరకు ఆయనే పరిపాలించాలని దేవుడు నిర్ణయించాడు. 26 క్రీస్తును వ్యతిరేకించే చివరి విషయం, తన మనుష్యులు చనిపోవడాన్ని ఆయన తొలగించివేస్తాడు. 27 ఇప్పుడు, {దావీదు వ్రాసాడు,} "తనను ఎదిరించే ప్రతిదానిని ఆయన జయించేలా చేసాడు." వాస్తవానికి, “ప్రతిదీ” అంటే దానిలో “ఆయన అన్నిటినీ జయించేలా” చేసిన దేవుడు చేర్చబడలేదు 28 కాబట్టి, ఆయన సమస్తమును జయించిన తరువాత, కుమారుడైన దేవుడు తనను సమస్తమును జయించునట్లు చేసిన వానికి లోబడతాడు. ఈ విధానంలో దేవుడు సమస్తమును జయించి పరిపాలిస్తాడు. 29 ఇప్పుడు, చనిపోయిన వారికి సహాయం చేయడానికి ఇతరులకు బాప్తిస్మం ఇచ్చే మనుష్యులను పరిగణించండి. ఇంకా, చనిపోయిన వారిని దేవుడు తిరిగి సజీవులుగా ఎప్పటికీ చెయ్యడు అని మరల అనుకుందాం. {అటువంటి సందర్భంలో,} మరణించిన వారికి సహాయం చేయడానికి మనుష్యులు ఇతరులకు బాప్తిస్మం ఇవ్వడానికి ఎటువంటి కారణం లేదు. 30 ఇంకా, {అటువంటి సందర్భంలో,} మనం {సువార్తను ప్రకటించే} మనకు {మనం చేస్తున్నట్టుగా} నిరంతరం ప్రమాదానికి గురికావడానికి ఎటువంటి కారణం లేదు. 31 నిజానికి, నేను చాలా తరచుగా చనిపోయే ప్రమాదంలో ఉన్నాను. తోటి విశ్వాసులారా, నేను మీ గురించి ఏ విధంగా అతిశయిస్తానో {ఇది నిజం అని} ప్రమాణం చేస్తున్నాను, ఎందుకంటే దేవుడు మనలను అందరినీ మెస్సీయకు ఏకం చేసాడు. {ఆయన} మన ప్రభువు యేసు. 32 నేను ఎఫెసు యొక్క నగరాన్ని సందర్శించినప్పుడు నన్ను వ్యతిరేకించిన వారితో పోరాడుచున్నప్పుడు నేను కేవలం మానవ సంగతుల గురించి ఆలోచిస్తున్నాను అనుకుందాం. {అటువంటి సందర్భంలో, వారికి వ్యతిరేకంగా పోరాడటం} నాకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. మరల దేవుడు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడు అని అనుకుందాం. {అటువంటి సందర్భంలో,} మనం {అనేకమంది మనుష్యులు ఏమి చెయ్యడానికి చెప్పారో అది చేయాలి}: {ఆహారం} భుజించడం మరియు {ద్రాక్షారసము} త్రాగడం. ఎందుకంటే మనం అతి త్వరలో చనిపోతాము. 33 తప్పు అయిన దానిని మీరు నమ్మకూడదు. {ఈ ప్రసిద్ధ సామెత నిజం:} "సాధారణంగా సరైన దానిని జరిగించే వ్యక్తిని చెడు స్నేహితులు తప్పుదారి పట్టిస్తారు." 34 మీరు అప్రమత్తంగా మరియు క్రమంగా వ్యవహరించడం ప్రారంభించడానికి నేను కోరుచున్నాను. తప్పు అయిన దానిని చేస్తూనే ఉండకూడదు. {నేను ఈ సంగతులు ఆజ్ఞాపిస్తున్నాను} ఎందుకంటే మీ గుంపులోని కొంతమందికి దేవుడు తెలియదు. మీకు సిగ్గు కలిగించేందుకే నేను దానిని చెప్పుచున్నాను 35 ఇప్పుడు మరణించిన మనుష్యులు తిరిగి ఏ విధంగా జీవిస్తారో మరియు వారు ఏ రూపంలో ఉంటారో ఒక వ్యక్తి అడగవచ్చు. 36 {ఆ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలియకపోయిన యెడల,} మీరు స్పష్టంగా ఆలోచించడం లేదు! {కేవలం దీని గురించి ఆలోచించండి:} మీరు భూమిలో వేసిన ఒక విత్తనం అది పెరగక ముందే చనిపోవాలి. 37 మీరు భూమిలో వేసిన ఒక విత్తనం {గురించి చెప్పడానికి}, అది మొక్క రూపంలో లేదు అని {మీకు తెలుసు}. బదులుగా, అది కేవలం విత్తనం. గోధుమలు లేదా ఇతర పంటల గురించి {మనం మాట్లాడుచున్నది} ఇది నిజం. 38 నిజానికి, దేవుడు తాను ఎంచుకున్న రూపాలలో విత్తనాలు పెరిగేలా చేస్తాడు మరియు ప్రతి రకమైన విత్తనానికి ఒక నిర్దిష్ట రూపం ఉంటుంది {దానిలో అది పెరుగుతుంది}. 39 వివిధ జీవుల భౌతిక భాగాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, మానవులు, క్షీరదాలు, పక్షులు మరియు చేపలు అన్ని రకాల భౌతిక భాగాలను కలిగి ఉంటాయి. 40 కొన్ని వస్తువులు పరలోకములో ఉనికి కలిగి ఉన్నాయి, మరియు మరికొన్ని వస్తువులు భూమి మీద ఉనికి కలిగి ఉన్నాయి. పరలోకములోని వస్తువుల రూపాలు ఒక విధంగా మహిమాన్వితమైనవి అయితే, భూమి మీద ఉన్న వాటి రూపాలు మరొక విధంగా మహిమాన్వితమైనవిగా ఉన్నాయి. 41 {ఇంకా,} సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు వివిధ మార్గాలలో మహిమాన్వితమైనవిగా ఉన్నాయి. వాస్తవానికి, ప్రతి నక్షత్రం దాని స్వంత నిర్దిష్ట మార్గంలో మహిమాన్వితంగా ఉంది. 42 మరణించిన మనుష్యులు తిరిగి జీవించడానికి {ఏ విధంగా అన్వయించాలో దాని నంతటికి} ఇక్కడ మార్గం ఉంది. మనుష్యులు కుళ్ళిపోతున్న శరీరాన్ని భూమిలో ఉంచుతారు, అయితే దేవుడు దానిని తిరిగి సజీవంగా చేస్తాడు తద్వారా అది చనిపోకుండా ఉంటుంది. 43 మనుష్యులు గౌరవం పొందని శరీరాన్ని భూమిలో ఉంచుతారు, అయితే దేవుడు దానిని తిరిగి సజీవంగా చేస్తాడు, తద్వారా ప్రతి ఒక్కరు దానిని గౌరవిస్తారు. మనుష్యులు బలహీనమైన శరీరాన్ని భూమిలో ఉంచుతారు, అయితే దేవుడు దానిని తిరిగి సజీవంగా చేస్తాడు, తద్వారా అది బలంగా ఉంటుంది. 44 మనుష్యులు ఈ లోకానికి చెందిన శరీరాన్ని భూమిలో ఉంచుతారు, అయితే దేవుడు దానిని తిరిగి జీవింపజేస్తాడు, తద్వారా అది దేవుడు పునరుద్ధరించే లోకానికి చెందినది. కొన్ని శరీరాలు ఈ లోకానికి చెందిన విధముగా, ఆలాగే కొన్ని శరీరాలు దేవుడు పునరుద్ధరించే లోకానికి చెందినవి. 45 “దేవుడు మొదటి మానవుడైన ఆదామును ఈ లోకానికి చెందిన జీవిగా సృష్టించాడు” అని మోషే వ్రాసాడు కాబట్టి {ఇది నిజము అని మీరు చెప్పగలరు}. {మరోవైపు, మరొక ఆదాము లాంటి యేసు, ఇప్పుడు దేవుడు పునరుద్ధరించే మరియు ఇతరులకు జీవమును ఇచ్చే లోకానికి చెందినవాడు. 46 ఇప్పుడు ఈ లోకానికి చెందిన {మొదటి ఆదాము} శరీరం మొదట ఉనికిలో ఉంది మరియు ఆ తరువాత మాత్రమే దేవుడు పునరుద్ధరించబోయే లోకానికి చెందిన {ఆదాము యొక్క చివరి శరీరం} ఉనికిలో ఉంది. 47 మొదటి {విధమైన} మానవునికి ప్రాతినిధ్యం వహించే {ఆదాము} భూమికి చెందినవాడు. {నిజానికి,} దేవుడు అతనిని మట్టి నుండి చేసాడు. {మరోవైపు, రెండవ {విధమైన} మానవునికి ప్రాతినిధ్యం వహించే యేసు పరలోకానికి చెందినవాడు. 48 భూమి మీదకు చెందియున్న మనుష్యులు అందరు ఆదాము వలే ఉన్నారు. పరలోకములో చెందియున్న వారు అందరు యేసు వలే ఉన్నారు. 49 ప్రస్తుతం మన శరీరాలు ఈ లోకానికి చెందిన {ఆదాము శరీరం} వలే ఉన్నాయి. అదే విధానంలో, మన శరీరాలు చివరికి దేవుడు పునరుద్ధరించే లోకానికి చెందిన {యేసు శరీరం} వలె ఉండే విధంగా మనం జీవించాలి. 50 నా తోటి విశ్వాసులారా, ఇది వినండి: ప్రస్తుతం ఉనికి కలిగియున్న మానవ శరీరాలు శాశ్వతం నిలిచి యుండే దేవుని యొక్క రాజ్యములో పాలుపంచుకోలేవు, ఎందుకంటే అవి విడిపోయి మరియు చనిపోతాయి. 51 శ్రద్ధ వహించండి! దేవుడు ఇప్పుడు బయలుపరచిన ఒకదానిని మీకు చెప్పబోవుచున్నాను. మనము అందరము చనిపోము, అయితే దేవుడు మనలను అందరిని మార్పుచేస్తాడు. 52 ఒక వ్యక్తి కన్ను కదిపినంత వేగంగా ఒక్క క్షణంలో {ఆయన మనలను మారుస్తాడు}. ఈ లోకము ముగిసిపోతోందని సూచించే బూరను {దేవదూత ఊదినప్పుడు} {ఇది సంభవిస్తుంది}. {ఒక దేవదూత} ఆ బూర ఊదినప్పుడు, దేవుడు మరణించిన వారిని తిరిగి సజీవులను చేస్తాడు, తద్వారా వారు ఎన్నటికీ చనిపోలేరు, మరియు ఇంకా జీవించే ప్రతి ఒక్కరినీ ఆయన మార్చివేస్తాడు. 53 కాబట్టి, విడిపోయి మరియు చనిపోయే శరీరాలు నిత్యము ఉండే మరియు ఎప్పటికీ చావని శరీరాలుగా రూపాంతరం చెందాలి. 54 విడిపోయి మరియు చనిపోయే మన శరీరాలు నిత్యము ఉండే మరియు ఎప్పటికీ చావని శరీరాలుగా రూపాంతరం చెందినప్పుడు, ఆ సమయములో ప్రవక్తలు వ్రాసినది చివరికి సంభవిస్తుంది: “దేవుడు దానిని సృష్టించాడు తద్వారా మనుష్యులు ఇక మీదట చనిపోరు.” 55 {ఇంకా,}"మనుష్యులు చనిపోయినప్పుడు, ఇది వారిని నాశనం చేయదు లేదా బాధించదు." 56 పాపం చనిపోయేలా చేస్తుంది కాబట్టి మనుష్యులు చనిపోతారు మరియు పాపం కోసం శిక్షగా చనిపోవడాన్ని ధర్మశాస్త్రము పేర్కొన్న కారణంగా అది జరుగుతుంది. 57 అయినప్పటికీ, నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఎందుకంటే {మనం ఏ విధంగా పాపం చేస్తామో మరియు చనిపోతాము అనేదానిని} జయించడానికి ఆయన మనలను సమర్ధులను చేసాడు. మన ప్రభువు యేసు మెస్సీయ చేసిన దాని చేత {ఆయన దీనిని చేసాడు}. 58 కాబట్టి, నేను ప్రేమించే తోటి విశ్వాసులారా, {మీరు నిజమని యెరిగినదానినిది} దృఢంగా విశ్వసించండి. ప్రభువును స్థిరంగా అధికంగా మరియు అధికంగా సేవించండి. {మీరు ఈ సంగతులు చెయ్యాలి} ఎందుకంటే {ప్రభువును సేవించడం కోసం} దేవుడు మిమ్మును ప్రభువుతో ఐక్యం చేసాడు కాబట్టి మీరు చేసేది గొప్ప సంగతులకు కారణం అవుతుంది అని మీకు తెలుసు.

Chapter 16

1 నేను ఇప్పుడు దేవుని యొక్క {యూదులైన} మనుష్యుల కోసం సేకరిస్తున్న డబ్బు గురించి మాట్లాడుచున్నాను. గలతియ ప్రాంతంలో {నివసిస్తున్న} విశ్వాసుల గుంపులకు నేను హెచ్చరిక చేసిన విధముగా మీరు చేయాలి అని నేను కోరుచున్నాను. 2 ప్రతి ఆదివారం రోజున, మీలో ప్రతి ఒక్కరు మీరు సంపాదించిన దానిలో కొంత డబ్బు తీసుకోవాలి మరియు దానిని పొదుపు చేయాలి. ఆ విధంగా, నేను మిమ్ములను సందర్శించినప్పుడు నేను డబ్బు వసూలు చేయవలసిన అవసరం లేదు. 3 మీ గుంపు నుండి కొంతమంది విశ్వసనీయ మనుష్యులను ఎంచుకోండి. నేను మిమ్ములను సందర్శించినప్పుడు, యెరూషలేము నగరానికి {మీరు సేకరించిన} డబ్బును వారిని తీసుకువెళ్ళేలా చేస్తాను. అంతే కాకుండా, నేను వారికి {నేను వారికి అధికారం ఇచ్చాను అని తెలిపే} పత్రికలను కూడా ఇస్తాను. 4 మీరు మరియు నేను కూడా నేను {యెరూషలేముకు} వెళ్ళాలి అని నిర్ణయించుకోవచ్చు. అ విషయంలో, {మీరు ఎంచుకున్న} మనుష్యులు నాతో పాటు ప్రయాణిస్తారు. 5 నేను మాసిదోనియా యొక్క ప్రాంతములో ప్రయాణించిన తరువాత నేను మిమ్ములను సందర్శించబోవుచున్నాను, అది నేను ప్రయాణించే మార్గం. 6 నిజానికి, నేను మీతో కొంత సమయం గడపవచ్చు, బహుశా మొత్తం శీతాకాలం. ఆ విధంగా, నేను తదుపరి ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నానో అక్కడికి ప్రయాణించడములో మీరు నాకు సహాయం చేయవచ్చు. 7 {నేను ఈ ప్రణాళికలు చేస్తున్నాను} ఎందుకంటే ఇప్పుడే కొద్దికాలం మిమ్ములను సందర్శించడం కంటే చాలా కాలం పాటు మీతో ఉండటానికి నేను ఇష్టపడతాను. {నేను చేయాలని} ప్రభువు కోరుతూ ఉన్నంత వరకు నేను దీనిని చేయాలని నమ్మకముగా ఆశిస్తున్నాను. 8 ప్రస్తుతానికి, పెంతెకొస్తు పండుగ వరకు నేను ఇక్కడ ఎఫెసు నగరములోనే ఉండాలనుకుంటున్నాను. 9 సువార్తను సమర్థవంతంగా మరియు స్వేచ్ఛగా ప్రకటించడానికి దేవుడు నన్ను అనుమతించాడు కాబట్టి {నేను ఇక్కడే ఉన్నాను}. {ఇంకా, నాకు వ్యతిరేకముగా పని చేస్తున్న పెద్ద సంఖ్యలో మనుష్యులను నేను ప్రతిఘటించాలి. 10 తిమోతి {మీ నగరంలోనికి} వచ్చినప్పుడల్లా, అతడు మీతో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు నిర్ధారించుకోండి. {మీరు దీనిని చేయాలి} ఎందుకంటే అతడు నా వలే {సువార్తను ప్రకటించడం చేత} ప్రభువును సేవిస్తున్నాడు. 11 కాబట్టి, అతనిని అగౌరవంగా చూడ వద్దు. బదులుగా, నా వద్దకు తిరిగి వెళ్ళడంలో అతనికి సహాయం చేయడం చేత స్నేహపూర్వక విధానంలో ప్రవర్తించండి. {మీరు దీనిని చేయాలి} ఎందుకంటే అతడు {నన్ను సందర్శించడానికి ప్రయాణిస్తున్న} ఇతర విశ్వాసులతో నా వద్దకు తిరిగి వస్తాడు అని నేను ఎదురు చూస్తున్నాను. 12 నేను ఇప్పుడు మా తోటి విశ్వాసి, అపొల్లో గురించి మాట్లాడడానికి కదులుతున్నాను. {మిమ్ములను సందర్శించడానికి ప్రయాణిస్తున్న} ఇతర విశ్వాసులతో కలిసి మిమ్ములను సందర్శించడానికి నేను అతనిని గట్టిగా బతిమాలాను. అయితే, మిమ్ములను సందర్శించడానికి ఇది సరైన సమయం కాదని అతడు గట్టిగా నిర్ణయించుకున్నాడు. బదులుగా, ఇది సరైన సమయం అని అతడు భావించినప్పుడు అతడు మిమ్ములను సందర్శిస్తాడు. 13 {తప్పు అయిన దాని కోసం} గమనించండి! {శుభవార్తను} దృఢంగా విశ్వసించండి! ధైర్యంగా ఉండండి! నిశ్చయంగా ఉండండి! 14 మీరు ఏదైనా ఆలోచించినప్పుడు లేదా ఏదైనా చేసినప్పుడు మీరు ఇతరులను ప్రేమించడం మీద దృష్టి పెట్టాలి. 15 అకయ యొక్క ప్రాంతంలో స్తెఫను యొక్క గృహంలో నివసించే వారు {సువార్తను విశ్వసించడానికి} మొదటి మనుష్యులు అని మీకు తెలుసు. ఇంకా, వారు దేవుని మనుష్యులకు సేవ చేయడానికి ఎంచుకున్నారు. నా తోటి విశ్వాసులారా, నేను మిమ్ములను అడుగుచున్నాను, 16 వారిని మరియు వారిలాంటి ఇతర మనుష్యులను గౌరవించడం మరియు లోబడడం నిజానికి, మాతో {సువార్తను ప్రకటించడానికి} కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తిని {మీరు గౌరవించాలి మరియు లోబడాలి}. 17 స్తెఫను, ఫొర్మూనాతు, మరియు అకయి ఇక్కడికి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. {అంటే} ఎందుకంటే మీరు నాతో లేనప్పుడు కూడా మీ అందరితో కలవడానికి వారు నన్ను అనుమతించారు. 18 వారు నన్ను మరియు మిమ్మును ఇద్దరినీ ప్రోత్సహించారు మరియు ఉత్తేజపరిచారు. అందువలన, మీరు వారిని మరియు వారిలాంటి ఇతర మనుష్యులను గౌరవించాలి. 19 ఇక్కడ ఆసియా యొక్క ప్రాంతములోని విశ్వాసుల యొక్క గుంపులు మీకు శుభములు చెప్పుచున్నారు. అకుల మరియు ప్రిస్కిల్ల, దేవుడు ప్రభువుతో ఏకం చేసిన వారిగా కూడా, మీకు ఆప్యాయంగా మీకు శుభములు చెప్పుచున్నారు. వారి గృహములో కూడుకొనే విశ్వాసులు {కూడా మీకు శుభములు చెప్పుచున్నారు}. 20 {నాతో ఉన్న} తోటి విశ్వాసులు అందరు మీకు శుభములు చెప్పుచున్నారు. ఒకరినొకరు ప్రేమపూర్వక విధానంలో స్వాగతించండి. 21 నేను, పౌలు, {మీకు} శుభములు చెప్పుచున్నాను. నేను {ఈ చివరి పదాలను} నేనే {నా లేఖకుడు వ్రాయడానికి బదులుగా} వ్రాస్తున్నాను. 22 ప్రభువును ప్రేమించడానికి విఫలమైన ప్రతి ఒక్కరినీ దేవుడు శపిస్తాడు గాక! ప్రభువు త్వరగా తిరిగి రావాలి అని నేను ప్రార్థిస్తున్నాను. 23 ప్రభువైన యేసు మీ యెడల కృప చూపాలి అని {నేను ప్రార్థిస్తున్నాను.} 24 దేవుడు మనలను మెస్సీయ యేసుతో ఐక్యం చేసాడు కాబట్టి నేను మీ అందరినీ ప్రేమించడానికి కొనసాగిస్తూ ఉంటాను. అది అలా ఉండను గాక!