తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

ఎఫెసీయులకు రాసిన పత్రిక

Chapter 1

1 నేను పౌలును. మెస్సీయ యేసు ఆయనకు ప్రాతినిథ్యం వహించడానికి నన్ను పంపించాడు ఎందుకంటే దేవుడు కోరుకున్నది అదే. దేవుడు తన కోసం ప్రత్యేక పరచుకొన్న ప్రజలకు ఈ ఉత్తరాన్ని నేను రాస్తున్నాను, వారు [ఎఫెసు నగరంలో] నివసిస్తున్నారు, మరియు మెస్సీయ యేసుకు విశ్వాసం గలవారుగా ఉన్నారు. 2 మన తండ్రి అయిన దేవుడు మరియు మన మెస్సీయ యేసు మరియు మన ప్రభువు మీకు దయ కలిగి యుండడం కొనసాగించడానికి మరియు సమాధానమైన ఆత్మను మీకు అనుగ్రహించడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. 3 మన ప్రభువు మెస్సీయ యేసు తండ్రి దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోకం నుండి వస్తున్న ప్రతీ విధమైన ఆత్మీయ ఆశీర్వాదంతో మనలను ఆశీర్వదించాడు. ఎందుకంటే మనం మెస్సీయకు చెందియున్నాము. 4 వాస్తవానికి, దేవుడు లోకాన్ని సృష్టించడానికి ముందే, మెస్సీయకు చెందియుండడానికి ఆయన మనలను ఎన్నుకున్నాడు, తద్వారా మెస్సీయ మనలను ఆయన కోసం పూర్ణంగా పరిశుద్ధులనుగా చేస్తాడు, ఎందుకంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, 5 మెస్సీయ యేసు ద్వారా ఆయన సొంత పిల్లలనుగా మనలను దత్తత తీసుకోడానికి చాలా ముందుగానే నిర్ణయించుకున్నాడు. దీనిని చేయడానికి ఇది ఆయనను సంతోషపరచింది, కాబట్టి ఆయన కోరుకున్న దానిని ఆయన చేసాడు.

6 ఈ కారణం చేత, మన పట్ల ఎంతో అద్భుతమైన కరుణతో ఉండడం విషయంలో, ఆయన ప్రేమిస్తూ ఉన్న ఆయన కుమారుని ద్వారా మనం అర్హులం కావడానికి మించి మనలను ఆశీర్వదించి యుండగా మనం ఇప్పుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాము.. 7 యేసు మన స్థానంలో చనిపోయినప్పుడు, ఆయన మన పాపం కోసం వెలను చెల్లించాడు. అంటే, ఆయన మన కోసం చనిపోయినప్పుడు, దేవుడు మనలను మన పాపాలను క్షమించాడు ఎందుకంటే ఆయన ఆ విధంగా సమృద్ధిగానూ మరియు ఉదారంగానూ దయ కలిగి ఉన్నాడు. 8 ఈ విధంగా ఆయన మన పట్ల అత్యధికమైన దయ కలిగి యుండడానికి మనకు ఆయన అవసరం అని దేవుడు యెరుగును ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు మరియు సంపూర్ణంగా జ్ఞానవంతుడు. 9 ఈ విధానంలో, దేవుడు ఇప్పుడు తన ప్రణాళికను మనకు వెల్లడించాడు, ఆయన ఇంతకు ముందు ఎవరికీ వెల్లడించలేదు - మెస్సీయా కార్యం ద్వారా సంపూర్తి చెయ్యడానికి ఆయన సంతోషపడిన ప్రణాళిక. 10 ఈ ప్రణాళికలో, సమయం సంపూర్ణంగా ఉన్నప్పుడు, మెస్సీయ సమస్త కార్యములను తన ఆధీనంలో ఏకం చేస్తాడు, తద్వారా పరలోకంలో సమస్తము మరియు భూమి మీద ఉన్న సమస్తము మెస్సీయకు చెందినవిగా ఉంటాయి.

11 మెస్సీయ జరిగించిన దాని కారణంగా, దేవుడు కూడా మనలను తన సొంతవారిగా చెపుతున్నాడు, దీనిని చెయ్యడానికి ఆయన అనాదికాలములో ప్రణాళిక చేసాడు మరియు ఆయన ఎల్లప్పుడూ ఆయన చేయడానికి కోరుతున్నదానిని ఖచ్చితంగా చేస్తున్నాడు. 12 దేవుని ప్రణాళికలో, మెస్సీయలో మొదట విశ్వసించిన యూదులమైన మనం దేవుణ్ణి స్తుతించడానికి జీవిస్తాము ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు.

13 అప్పుడు యూదేతరులైన మీరు కూడా నిజమైన సందేశాన్ని విన్నారు, దేవుడు మిమ్మును ఏ విధంగా రక్షిస్తున్నాడు అనే శుభవార్త మరియు మీరు మెస్సీయలో విశ్వాసం ఉంచారు. మీరు దానిని చేసినప్పుడు, ఆయన వాగ్దానం చేసిన విధంగా మీకు పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించడం ద్వారా మిమ్మల్ని మెస్సీయకు చెందినవారుగా దేవుడు గుర్తించాడు. 14 పరిశుద్ధ ఆత్మ ఒక బయానా వలే ఉన్నాడు. మన కోసం ఆయన కలిగియున్న సమస్తమును ఆయన విడుదల చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనకు ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేసిన సమస్తమును దేవుడు కూడా మనకు ఇస్తాడు అనేదానిని ఇది రుజువు చేస్తూ ఉంది. దేవునికి స్తుతులు ఎందుకంటే ఆయన చాలా గొప్పవాడు!

15 ఎందుకంటే దేవుడు మీ కోసం దీని నంతటిని చేసాడు మరియు ఎందుకంటే ప్రభువైన యేసును మీరు ఏవిధంగా విశ్వసించారో మరియు విశ్వాసులు అందరిని మీరు ఎంత ప్రేమిస్తారో మనుషులు నాకు చెప్పారు, 16 నేను ఆయనకు ప్రార్థించినప్పుడు మీ గురించి నేను దేవునితో మాట్లాడుతున్నప్పుడు నేను నిరంతరం మీ కోసం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 17 దేవుడు మన ప్రభువైన మెస్సీయ యేసు, మహిమగల తండ్రి, మిమ్మును జ్ఞానవంతులుగా చెయ్యడానికి మరియు మీకు దేవుణ్ణి బయలు పరచడానికి ఆయన ఆత్మను మీకు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను తద్వారా మీరు ఆయనను నిరంతరం ఉత్తమంగా తెలుసుకొంటారు. 18 సంగతులు అవి సత్యమైనవిగా చూడడానికి దేవుడు శక్తిని అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను తద్వారా దేవుడు మన కోసం కలిగియున్న అద్భుతమైన ప్రణాళికను మీరు తెలుసుకొంటారు ఎందుకంటే మనం ఆయన ప్రజలముగా ఉండడానికి ఆయన పిలిచాడు. మనకు మరియు విశ్వాసులు అందరికి ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేసిన సంగతులు ఎంత అద్భుతమైనవి మరియు సమృద్ధిగా ఉన్నాయో తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. 19 మరియు మెస్సీయను విశ్వసించే మన కోసం దేవుడు ఎంత అధికమైన శక్తివంతంగా పనిచేస్తాడో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన మన కోసం అంత శక్తివంతంగా బలవంతుడు. 20 ఆయన మరణించిన తరువాత మెస్సీయ తిరిగి సజీవుడుగా మారడానికి ఆయన కారణమైనప్పుడు మరియు పరలోకంలో అత్యున్నత ఘనత స్థానానికి ఆయనను లేపినప్పుడు ఆయన మెస్సీయ కోసం ఉన్నట్టుగా ఉన్నాడు. 21 అక్కడ ప్రతి అధికారి మీదను మరియు ప్రభుత్వం యొక్క ప్రతి స్థాయి మీద ఉన్న శక్తివంతమైన ఆత్మ మీదను మరియు మనుష్యులు గౌరవించే ప్రతి జీవి మీదను సర్వోన్నతుడిగా మెస్సీయ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన వారి మీద ప్రస్తుత కాలం మట్టుకే కాదు అయితే శాశ్వతకాలం రాజ్యపాలన చేస్తున్నాడు. 22 దేవుడు సమస్తాన్ని మెస్సీయకు స్వాధీనమైనదానిగా ఉండునట్లు చేసాడు మరియు ప్రతీ స్థలములోని విశ్వాసులు అందరి మధ్య సమస్తము మీద మెస్సీయను పాలకునిగా నియమించాడు. 23 శరీరంలోని భాగాలు దాని శిరస్సుతో సంబంధం ఉన్నందున విశ్వాసులం అయిన మనం మెస్సీయతో సంబంధం కలిగి ఉంటాము. ఆయన ప్రతిచోట సమస్తమును పూర్తి చేసినట్లే, విశ్వాసులు అందరి కోసం అక్కరగా ఉన్నవాటిని ఆయన అనుగ్రహిస్తున్నాడు.

Chapter 2

1 మెస్సీయను విశ్వసించడానికి ముందు మీరు ఆత్మీయంగా చనిపోయారు - మీరు పాపం చేస్తూ ఉండడం ఆపలేకపోయారు. 2 మీరు పాప మార్గంలో నివసించేవారు, ఈ లోక ఆత్మ చేత మీరు నడిపించబడ్డారు. ఈ లోక సంబంధ అధికారులను నియంత్రిస్తున్న దుష్ట ఆత్మల పాలకుని చేత నడిపించబడ్డారు. దేవునికి అవిధేయత చూపు మనుషుల ద్వారా ఇప్పుడు పనిచేస్తూ ఉన్న ఈ పాలకుడు సాతాను, 3 మనం అందరము దేవునికి అవిదేయులైన ఈ ప్రజల వలే అదే మార్గంలో నివసిస్తూ ఉన్నాము; మనం కోరుకున్న దుష్ట క్రియలను చేసాము, మన శరీరాలకు మరియు మన మనసులకు సంతోషాన్ని తీసుకొని వచ్చిన క్రియలు. ఆయన ఇతర ప్రజలతో ఉన్న విధంగానే దేవుడు మనతో చాలా కోపంగా ఉండడానికి మనం అర్హులమే. 4 అయితే దేవుడు మన పట్ల చాలా కరుణ కలిగియున్నాడు ఎందుకంటే ఆయన మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. 5 దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు, మనం ఆత్మీయంగా చనిపోయినప్పుడు సహితం మరియు స్థిరంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు, మనలను మెస్సీయకు జత చెయ్యడం చేత ఆయన మనలను సజీవులనుగా చేసాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మీయంగా చనిపోయినవారుగా ఉండడం నుండి దేవుడు మిమ్మును రక్షించినప్పుడు, మీకు అర్హత లేని విధానంలో ఆయన మీ పట్ల చాలా దయను కలిగియున్నాడు. 6 శారీరకంగా చనిపోయి ఉండడం నుండి ఆయన యేసును లేపిన రీతిగా ఆత్మీయంగా చనిపోయి ఉండడం నుండి దేవుడు మనలను రక్షించాడు మరియు ఆయన మనలను ఆత్మీయంగా ఆయనతో సజీవులనుగా చేసాడు. అప్పుడు పరలోకంలో మెస్సీయ యేసుతో రాజ్యపాలన చెయ్యడానికి ఘనత సింహాసనములను ఆయన మనకు ఇచ్చాడు. 7 మెస్సీయ యేసుతో మనలను చేర్చడం ద్వారా ఆయన మన పట్ల ఎంత అపరిమితమైన కృపతో దయ కలిగియున్నాడో భవిష్యత్తు కాలములు అన్నిటిలో ప్రతిఒక్కరికి చూపించడానికి ఆయన దానిని చేసాడు.

8 కాబట్టి ఆత్మీయంగా చనిపోయి ఉండడం నుండి ఆయన మిమ్మును రక్షించినప్పుడు మీరు అర్హులుకాని విధానములో దేవుడు మీకు చాలా దయగా ఉన్నాడు. యేసులో మీరు విశ్వాసం ఉంచిన కారణంగా ఆయన దీనిని చేసాడు. మిమ్మల్ని మీరు రక్షించు కోలేదు. ఇది దేవుని నుండి ఒక బహుమానం. 9 ఏ ఒక్కరు సంపాదించుకోలేని బహుమానం, కాబట్టి ఏ ఒక్కరు అతిశయపడలేరు మరియు తననుతాను రక్షించుకొన్నానని చెప్పలేరు. 10 కాబట్టి మనం ఎలా ఉండాలని ఆయన కోరుకున్న విధంగా దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు; మంచి కార్యాలు చెయ్యడానికి మెస్సీయ యేసు ద్వారా ఆయన మనలను నూతన మనుష్యులుగా సృష్టించాడు - మనం చెయ్యడం కోసం దేవుడు ముందుగా సిద్ధపరచిన సంగతులు.

11 కాబట్టి మీ పితరులైన వారు ఉన్న ప్రకారం యూదేతరులైన మీరు పూర్వం దేవుని ప్రజకు చెందినవారు కారు అని జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్ములను "సున్నతి లేని వారు" అని పిలవడం ద్వారా యూదులు మిమ్మును అవమానపరచారు. వారు తమ్మునుతాము "సున్నతి పొందినవారు" అని పిలుచుకొన్నారు. దీని చేత మీరు కాదు, సున్నతి ఆత్మను మార్పు చెయ్యడానికి దేవుడు చేసిది కాదు, శరీరాన్ని మాత్రమే మార్పు చెయ్యడానికి మానవులు చేసేది అయినప్పటికీ వారు దేవుని ప్రజలు అని వారి భావన. 12 ఆ కాలంలో మీరు మెస్సీయకు వేరుగా ఉన్నారు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఇశ్రాయేలు ప్రజకు మీరు పరాయివారుగా ఉన్నారు. దేవుడు వారితో తన నిబంధనలలో వాగ్దానము చేసిన సంగతులలో మీరు భాగస్వామ్యం చెయ్యలేదు. దేవుడు మిమ్మును రక్షిస్తాడు అని మీరు ధైర్యంగా ఎదురుచూడలేదు లేదు, మీరు ఈ లోకంలో పూర్తిగా దేవుడు లేకుండా జీవిస్తున్నారు. 13 అయితే ఇప్పుడు మీరు మెస్సీయ యేసులో విశ్వాసం ఉంచారు కనుక ఇంతకు ముందు మీరు ఆయనను తెలుసుకొనక పోయినప్పటికి దేవుడు మిమ్మును ఆయన కుటుంబంలోనికి తీసుకొని వచ్చాడు. మెస్సీయ మీ కోసం సిలువ మీద చనిపోయాడు కనుక ఇది సాధ్యం అయ్యింది.

14 యూదులు మరియు యూదేతరులు ఒకరితో ఒకరు సమాధానంగా జీవించడానికి మెస్సీయ తానే దీనిని సాధ్యం చేసాడు. రెండు వేరువేరు గుంపులను ఒక్క గుంపులోనికి ఆయన చేసాడు. రెండు గుంపులు ఒకరినొకరు ద్వేషించుకొన్నారు, అయితే ఆయన మన అందరి కోసం చనిపోయినప్పుడు ఒకరినొకరు ద్వేషించుకోవడం కోసం ఉన్న ప్రతి కారణాన్ని ఆయన తొలగించాడు. 15 ఆయన మనలను అంగీకరించడం కోసం యూదు ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలు మరియు విధులకు విధేయత చూపించడానికి ఇకమీదట మనకు అవసరం లేకుండా ఆయన చేసాడు. యూదులు మరియు యూదేతరులు ఆయనతో వారి సంబంధం కారణంగా కలిసి సమాధానముగా జీవించునట్లు ఒక్క నూతన ప్రజగా చెయ్యడం కోసం ఆయన దీనిని చేసాడు. 16 వారు అందరి కోసం సిలువ మీద చనిపోవడం ద్వారా రెండు గుంపులను ఒక్క గుంపుగా దేవునితో సమాధానపరచడానికి ఆయన దీనిని చేసాడు. వారి కోసం చనిపోవడం ద్వారా ఒకరితో ఒకరికి మరియు దేవునికి శత్రువులుగా ఉండడం ఆపివేయ్యడానికి వారి కోసం యేసు దీనిని సాధ్యపరచాడు. 17 యేసు వచ్చాడు మరియు మనం దేవునితో సమాదానముతో ఉండగలం అని శుభవార్తను ప్రకటించాడు; దేవుని గురించి యెరుగని వారు యూదేతరులైన మీకు మరియు దేవుని గురించి యెరిగిన యూదులమైన మాకు ఆయన దీనిని ఆయన ప్రకటించాడు. 18 మన కోసం యేసు జరిగించిన దాని కారణంగా యూదులు, యూదేతరులు ఇద్దరు ఇప్పుడు దేవుని ఆత్మ సహాయంతో తండ్రి దేవుని వద్దకు రాగలరు.

19 కాబట్టి ఇప్పుడు యూదేతరులైన మీరు ఇకమీదట దేవుని ప్రజ నుండి విడిచిపెట్టబడరు. అయితే దానికి బదులు మీరు దేవుడు తన కోసం ప్రత్యేక పరచుకొన్న వారితో సహా సభ్యులుగా ఉన్నారు, మరియు మీరు దేవుని కుటుంబానికి చెందియున్నారు. 20 ఒక కట్టడంలో దేవుడు కలిపి ఉంచిన రాళ్ళ వలే మీరు ఉన్నారు, మరియు అపొస్తలులు మరియు ప్రవక్తలు ఆ కట్టడం యొక్క పునాది రాళ్ళ వలే ఉన్నారు. కట్టడం యొక్క రాళ్ళు నిటారుగా మరియు దృఢంగా ఉండే ఒక గోడను రూపొందించడానికి వాటి కింద ఉన్న పునాది రాళ్ళ మీద ఆధారపడిన విధంగా వారు బోధించిన దానిమీద మీరు ఆధారపడి ఉన్నారు. మెస్సీయ యేసు తానే మూలరాయి వలే ఉన్నాడు, ఇది కట్టడం యొక్క చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. 21 కట్టడంలో ప్రతి రాయి ఎక్కడ ఇముడుతుంది అని మూల రాయి నిర్దేశించిన విధంగా ప్రతి వ్యక్తి ఎక్కడ చెందియుంటాడు అని యేసు నిర్దారిస్తాడు. కట్టువాడు ఒక పరిశుద్ధ ఆలయాన్ని కట్టడం కోసం రాళ్ళను కలిపి జతచేయునట్లు ప్రభువును సేవించే ఆయన విశ్వాసుల కుటుంబాన్ని ఒక పరిశుద్ధ గుంపుగా యేసు సమకూరుస్తూ ఉన్నాడు. 22 మీరు యేసుకు చెందియున్న కారణంగా, దేవుడు తన ఆత్మ ద్వారా నివసించు ఒక కట్టడం వలే ఉన్న ఒక్క కుటుంబంలోనికి యూదులు మరియు యూదేతరులు ఇద్దరు మిమ్మును ఆయన కలిపి కట్టుతున్నాడు.

Chapter 3

1 యూదులు కాని వారైన మీ కోసం దేవుడు ఈ ప్రణాళికను జరిగిస్తున్న కారణంగా, నేను పౌలును, నేను చెరలో ఉన్న విధముగా కూడా మీ కోసం తండ్రికి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే నేను మీకోసం మెస్సీయ యేసును సేవిస్తున్నాను. 2 దేవుడు మీ పట్ల అధికమైన దయ కలిగియున్నాడని ఆయన ప్రణాళికను యూదులు కాని వారైన మీకు తెలియపరచే పనిని ఆయన నాకు అనుగ్రహించాడని నా గురించి ప్రజలు మీతో చెప్పారు అని నేను అనుకుంటున్నాను. 3 నేను ఇంతకుముందు మీకు క్లుప్తంగా రాసిన విధంగా దీనిని నాకు నేరుగా ప్రత్యక్షంగా బయలుపరచడం ద్వారా ముందే ప్రజలు అర్థం చేసుకోలేదు అని ఈ సందేశాన్ని దేవుడు నాకు చెప్పాడు. 4 మీరు దానిని చదివినప్పుడు, మెస్సీయ గురించి ఇంతకుముందు దేవుడు బయలుపరచని సంగతులను నేను స్పష్టంగా అర్థం చేసుకొన్నానని మీరు గ్రహించగలరు.

5 గతంలో దేవుడు ఈ సందేశాన్ని ప్రజలకు పూర్తిగా వెల్లడి చెయ్యలేదు అయితే ఇప్పుడు ఆయన ఆత్మ దీనిని పరిశుద్ధులైన ఆయన అపొస్తలులకు, మరియు ప్రవక్తలకు వెల్లడి చేసాడు. 6 సందేశం ఇదే: దేవుని ఆత్మీయ సమృద్ధిని యూదేతరులు ఇప్పుడు యూదులతో కలిసి పంచుకొంటున్నారు మరియు దేవుని ప్రజల యొక్క అదే గుంపుకు చెంది యున్నారు మరియు దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన అన్ని విషయాలలో పంచుకొంటారు ఎందుకంటే శుభవార్తను విశ్వసించడం ఫలితంగా వారు మెస్సీయ యేసుతో కలిసారు.

7 ఈ శుభ వార్తను మనుష్యులకు చెప్పడం ద్వారా ఇప్పుడు నేను దేవుని సేవిస్తున్నాను. దేవుడు నా పట్ల చాలా దయ కలిగి యున్నాడు మరియు నేను దీని విషయంలో నేను యోగ్యుడను కాకపోయినప్పటికి చెయ్యడానికి దేవుడు ఈ పనిని నాకు అనుగ్రహించాడు. మరియు నాలో శక్తివంతంగా పనిచెయ్యడం ద్వారా దీనిని చెయ్యడానికి ఆయన నన్ను శక్తితో నింపుతున్నాడు. 8 దేవుని ప్రజలు అందరిలో నేను తక్కువ యోగ్యుడను అయినప్పటికి దేవుడు దయతో ఈ వరాన్ని నాకు ఇచ్చాడు: మెస్సీయ మన కోసం కలిగియున్న అపరిమితమైన ఆత్మీయ ఆశీర్వాదములను గురించిన శుభవార్తను యూదేతరులకు ప్రకటించడానికి ఆయన నన్ను నియమించాడు. 9 మరియు దేవుని ప్రణాళిక ఏమిటో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోడానికి సమర్ధులుగా చెయ్యడానికి. సమస్తాన్ని సృష్టించిన దేవుడు అనాది కాలం నుండి దాచి యుంచాడు అనునది ఈ ప్రణాళిక. 10 దేవుడు ఈ ప్రణాళికను దాచియుంచాడు తద్వారా విశ్వసించిన వారిలో ఇది జరుగునట్లు చెయ్యడం ద్వారా ఇప్పుడు ఆయన దీనిని బయలుపరచుచుండగా, ఉన్నత స్థలములలో ఉన్న ఆత్మీయ అధిపతులకు ఆయన మహా జ్ఞానవంతుడని కూడా ఆయన బయలుపరచుచున్నాడు. 11 దేవుడు ఎల్లప్పుడూ కలిగి యున్న ప్రణాళిక ఇది. మరియు మన ప్రభువు మెస్సీయ యేసు యొక్క కార్యం ద్వారా ఆయన దీనిని నెరవేర్చాడు.

12 కాబట్టి ఇప్పుడు యేసు చేసిన దాని కారణంగా మనం దేవుని వద్దకు స్వేచ్చగా మరియు ధైర్యముగా రాగలము ఎందుకంటే మనం యేసులో విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మనలను తనతో కలుపుతాడు. 13 కాబట్టి మీ పక్షముగా ఇక్కడ చెరశాలలో నేను శ్రమపొందుతున్న సంగతుల ద్వారా దయచేసి నిరుత్సాహపడ వద్దు, ఎందుకంటే అవి మీకోసం మహిమాన్వితమైన ఫలితాన్ని కలుగ చేస్తాయి. 14 ఎందుకంటే దేవుడు దీనినంతటిని మీ కోసం చేసాడు. నేను మోకరించి మరియు మన తండ్రి దేవునికి ప్రార్థన చేస్తున్నాను. 15 ఆయన ఆది తండ్రి, పరలోకంలో మరియు భూమి మీద అనుసరించడానికి ప్రతి కుటుంబం కోసం ఒక నమూనాను అనుగ్రహించాడు. 16 ఆయన సమృద్ధియైన గొప్పవాడుగా ఉన్న ప్రమాణంలో మీ ఆత్మను బలపరచడానికి దేవుడు మీకు తన ఆత్మను అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. 17 మీ సొంత హృదయాలు వలే మెస్సీయ మీకు సమీపంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే మీరు ఆయనలో విశ్వాసం ఉంచుతున్నారు, మరియు మీరు చేయుచున్న సమస్తము మరియు చెప్పుచున్న సమస్తము మీ కోసం దేవుని ప్రేమ ఫలితంగా ఉంటుంది మరియు ఆయన కోసం మరియు ఇతరుల కోసం మీ ప్రేమ ఉంటుంది. 18 తద్వారా మీరు దేవుని ప్రజలు అందరితో పాటు మెస్సీయ మనలను ఎంత అధికంగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోడానికి పూర్ణంగా శక్తివంతులు అవుతారు. 19 ఆయన మనలను ఎంతో అధికంగా ప్రేమిస్తున్న దానిని మనం అర్థం చేసుకోలేకపోయినప్పటికి మెస్సీయ మనలను ఎంత అధికంగా ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన సమస్తము యొక్క పూర్ణ పరిమాణం దేవుడు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను.

20 దేవునికి స్తుతి. ఆయన మనలో ఎంతో శక్తివంతంగా పని చేయుచున్న కారణంగా చెయ్యడానికి మనం ఆయనను అడిగేవి లేదా ఆయన చెయ్యగలడని మనం భావించే వాటన్నిటి కంటే కూడా ఆయన అత్యధికంగా చెయ్యడానికి సమర్ధుడు! 21 విశ్వాసులు అందరు ఆయన ఎంతో గొప్పవాడు అని మరియు మెస్సీయా యేసు ద్వారా ఆయన చేసిన అత్యద్భుతమైన కార్యం కోసం ఆయనను స్తుతించుదురు గాక! వారు అన్ని తరములు అంతటా శాశ్వతకాలం స్తుతించుదురు గాక! ఆ విధంగా జరుగును గాక.

Chapter 4

1 దీని అంతటి కారణంగా, నేను ప్రభువైన యేసుకు సేవ చేస్తున్న కారణంగా చెరసాలలో ఉన్న వ్యక్తి వలే, ఆయన కోసం జీవించడానికి మిమ్మల్ని పిలిచిన యేసును ఘనపరచుచూ ఉన్న మార్గంలో మీరు జీవించడానికి నేను బతిమాలుతున్నాను. 2 ఎల్లప్పుడూ వినయంగా మరియు మృదువుగా ఉండండి. ఒకరితో ఒకరు సహనంతో ఉండండి, ఇతరులు చేసే కోపం తెప్పించే క్రియలను భరించండి ఎందుకంటే మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. 3 దేవుని ఆత్మ మిమ్మల్ని ఐక్యపరచాడు కనుక ఒకరితో ఒకరు ఐక్యంగా నిలిచియుండడానికి మీరు చెయ్యగలిగిన సమస్తము చెయ్యండి. ఒకరి పట్ల ఒకరు సమాధానంగా నడుచుకోవడం చేత మిమ్మల్ని మీరు బంధించుకోండి. 4 దేవుడు మాత్రమే ఒక్క విశ్వాసుల కుటుంబం మరియు ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే కలిగియున్నాడు. మనుషులు నిరీక్షించగలిగిన ఏకైక సంగతిని పొందడానికి ఆయన మిమ్మును అందరిని కూడా పిలిచిన విధంగా, దేవుడు పిలిచిన మీకు అది చెంది ఉంది. 5 ఒక్కడే ప్రభువు ఉన్నాడు, మెస్సీయ యేసు, ఆయనలో విశ్వాసముంచడానికి ఒకే ఒక మార్గం, మరియు మనం ఆయనకు మాత్రమే చెందియున్నామని చూపించడానికి వారు మనకు బాప్తిస్మం ఇచ్చారు. 6 ఒకే దేవుడు ఉన్నాడు, ఆయన మన అందరికి తండ్రి, యూడుడైనా లేదా యూదేతరుడైనా. మన అందరికి పైగా ఆయన రాజ్య పాలన చేస్తున్నాడు, మన అందరి ద్వారా పని చేయుచున్నాడు, మరియు మన అందరిలో ఉన్నాడు.

7 మనం వాటిని కలిగి యుండాలని మెస్సీయ నిర్ణయించిన విధముగానే దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ వరములను అనుగ్రహించాడు. 8 ఆ కారణంగా లేఖనం చెపుతుంది,

     ఆయన ఉన్నత ప్రదేశమునకు పైకి వెళ్ళినప్పుడు,

     ఆయన బంధించి యుంచిన అనేకులైన ప్రజలను ఆయనతో తీసుకొని వచ్చాడు,

     మరియు తన మనుషులకు బహుమానాలు ఇచ్చాడు.

9 “ఆయన పైకి వెళ్ళాడు” మాటలు ఇంతకు ముందు మెస్సీయ కూడా భూమి యొక్క లోపలి భాగాలకు దిగి వెళ్ళాడు అని మనం నిశ్చయంగా తెలుసుకొనేలా చేస్తున్నాయి. 10 పరలోకం నుండి భూమి మీదకు దిగి వచ్చిన వాడు మెస్సీయ కూడా, ఆయన విశ్వమును నింపడానికి పరలోకంలో ఉన్నతంగా హెచ్చించబడిన స్థానానికి పైకి తిరిగి వెళ్ళినవాడు.

11 ఆయన మనుషులకు బహుమానాల వలే, వారిలో కొందరిని అపొస్తలులుగా ఉండడానికి, కొందరు ప్రవక్తలుగా ఉండడానికి, కొందరు యేసును గురించి శుభ వార్తను చెప్పడానికి మనుషులను వెదకడానికి, మరియు కొందరు విశ్వాసుల గుంపులను గురించి శ్రద్ధ తీసుకోడానికి మరియు బోధించడానికి ఆయన నియమించాడు. 12 ఇతరులకు సేవ చేసే కార్యాన్ని చెయ్యడానికి దేవుని మనుషులను సిద్ధం చెయ్యడానికి వారి నందరిని దేవుడు నియమించాడు తద్వారా మెస్సీయకు చెందిన వారు అందరు ఆత్మీయంగా బలవంతులుగా తయారవుతారు. 13 మనం అందరం కలిసి ఉండాలని దేవుడు కోరుకున్న విధంగా అయ్యేవరకు ఈ కార్యం కొనసాగుతుంది: మనం అందరం కలిసి దేవుని కుమారుడిని పూర్తిగా విశ్వసిస్తున్నాము మరియు మనలో ఆయన కార్యాన్ని అనుభవిస్తాము, మరియు ఒక విశ్వాసుల గుంపుగా సంపూర్ణంగా పరిణతి చెందుతాము - మెస్సీయ వలె దేవుడిని విశ్వసించడం మరియు తెలుసుకోవడంలో పూర్తిగా పరిణతి చెందిన వారముగా. 14 అప్పుడు మనం ఇకమీదట చిన్న పిల్లలు అపరిణతగా ఉన్నవిధంగా మనం ఆత్మీయంగా అపరిణతగా ఉండము. గాలి మరియు అలలు దిశను మార్చినప్పుడు ఒక వైపుకు మరియు అప్పుడు మరోక వైపుకు వెళ్లు పడవ లాగా మనం విశ్వసించు దానిని ఎల్లప్పుడూ మారుస్తూ, ప్రతి నూతన బోధను ఇకమీదట అనుసరించము. వారి అబద్దాలతో మనలను మోసగించడానికి తప్పు అయినవాటిని బోధించు తెలివైన మనుషులను మనం అనుమతించము. 15 దానికి బదులుగా, సత్యం అయిన దానిని మనం ఒకరితో ఒకరం ప్రేమతో మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క శిరస్సు వ్యక్తి శరీరాన్ని నిర్దేశించిన విధంగా ప్రతి మార్గంలో ఆయన మనలను నిర్దేశించినప్పుడు మనం అంత కంతకు మెస్సీయ వలే మార్పుచెందుదాం. 16 ఆయనే మనలను అందరిని కలుపుతాడు మరియు ఒకరికొకరికి సంబంధపడేలా ఉంచుతాడు. ఒక వ్యక్తి యొక్క శిరస్సు తన శరీర భాగాల కోసం చేసిన విధంగా, మనం ఒకరికొకరం సహకరించుకోవడానికి మరియు ఒక నిరూపిత మార్గంలో పనిచెయ్యడానికి మనలో ఒక్కొక్కరికి సముచితమైన సామర్ధ్యమును ఆయన ఇస్తున్నప్పుడు ఆయన ఇప్పుడు మనకు బోధిస్తున్నాడు. ఈ విధానంలో, మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నట్లుగా, మనం కలిసి ఎదుగుతాము మరియు ఒకరినొకరు బలవంతులుగా చేస్తాము. 17 ఆ కారణంగా, మరియు ప్రభువు యేసు యొక్క అధికారముతో, దీనిని నేను మీకు చెప్పుచున్నాను: ఇప్పటి నుండి మీరు ఇతర యూదేతరులు జీవించిన విధంగా అదే విధానంలో జీవించకూడదు. వారు నివసించే విధానం శూన్యపు ఆలోచన విధానం నుండి వస్తుంది. 18 వారు దేవుని నుండి పూర్తిగా వేరైపోయి జీవించడానికి ప్రయత్నించారు కనుక సరైనది లేదా తప్పు అయినదానిని గురించి స్పష్టంగా ఆలోచించలేరు. వారు దీనిని చేస్తున్నారు ఎందుకంటే వారు తప్పిపోతున్నారని వారు యెరుగరు మరియు ఎందుకంటే వారు దేవునికి విధేయత చూపించడానికి మూర్ఖంగా నిరాకరిస్తున్నారు. 19 ఏదైనా మంచిది లేదా చెడు అని గ్రహించడానికి వారు శక్తి లేని వారుగా అయ్యారు, మరియు కాబట్టి వారు తమ శరీరాలు కోరుకునే సిగ్గుకరమైన పనులు చెయ్యడానికి తమ్మునుతాము అప్పగించుకొన్నారు. వారు అన్ని రకాల అనైతిక చర్యలకు పాల్పడతారు మరియు వాటిని మరింత ఎక్కువగా చేయాలనుకుంటున్నారు.

20 అయితే మీరు మెస్సీయ గురించి తెలుసుకున్నప్పుడు, జీవించడానికి ఆ విధంగా మీరు నేర్చుకోలేదు, 21 మీరు యేసు గురించి సందేశాన్ని విని మరియు అర్థం చేసుకున్న మేర మరియు ఆయన నుండి నేర్చుకున్నారు, ఎందుకంటే ఆయన మార్గం జీవించడానికి సత్యమైన మార్గం. 22 మీరు జీవిస్తున్న విధంగా జీవించడం మాని వెయ్యడానికి మీ బోధకులు మీకు బోధిస్తున్నారు. ఎందుకంటే మీరు దుష్ట క్రియలు చెయ్యడానికి కోరుకుంటున్నారు, ఆ విషయాలు మంచివిగా ఉన్నాయి అని ఆలోచనలోనికి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. ఆ విధంగా జీవించడం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా నాశనం చేస్తుంది. 23 కాబట్టి దేవుడు మీకు ఒక నూతన ఆత్మను మరియు ఒక నూతన ఆలోచన విధానమును ఇవ్వడానికి మీరు అనుమతించాలి. 24 మరియు దేవుడు తన స్వరూపంలో ఉండడానికి మిమ్మును సృష్టించిన నూతన వ్యక్తి వలే జీవించడం మీరు ప్రారంభించాలి. యేసు యొక్క సత్య మార్గంలో ఒకరితో ఒకరు మరియు ఆయనతో సరియైన మార్గంలో జీవించడానికి ఆయన మిమ్మును సృష్టించాడు. 25 కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధం చెప్పడం మానివెయ్యండి. ఒకరికొకరు యథార్థముగా మాట్లాడండి ఎందుకంటే మనం దేవుని కుటుంబ సభ్యులముగా ఒకరికి ఒకరు చెంది ఉన్నాము. 26 పాపపు ప్రవర్తన గురించి కోపంగా ఉండండి, అయితే మీరు కోపంగా ఉన్నందున పాపం చేయకండి. ప్రతి రోజు ముగింపుకు ముందు, మిమ్మల్ని కోపానికి గురి చేసిన వాటిని గురించి జాగ్రత్త పడండి. 27 తద్వారా మీ మధ్య దుష్ట క్రియలు చెయ్యకుండా ఉండడానికి అపవాదిని మీరు అనుమతించరు. 28 దొంగతనం చేస్తూ ఉన్నవారు ఇక మీదట దొంగతనం చేయకూడదు. బదులుగా, వారు కష్టపడి పనిచేయాలి, వారి స్వంత ప్రయత్నాల ద్వారా మంచి పని చేయాలి, తద్వారా అవసరతలో ఉన్న వారికి ఇవ్వడానికి వారు కొంత కలిగియుంటారు. 29 హానికరమైన విషయాలు చెప్పవద్దు. బదులుగా, వారికి సహాయం అవసరమైనప్పుడు మనుషులను ప్రోత్సహించే మంచి విషయాలు చెప్పండి తద్వారా విను వారు ప్రయోజనం పొందడానికి మీ మాటల ద్వారా దేవుడు కార్యం చెయ్యగలడు. 30 మెస్సీయ ఈ లోకం నుండి మిమ్మల్ని రక్షించే రోజు వరకు మీతో పాటు ఉండే పరిశుద్ధ ఆత్మను మీకు ఇవ్వడం ద్వారా దేవుడు మిమ్మల్ని తన సొంత వారిగా గుర్తించాడు. కాబట్టి మీరు జీవించు విధానము ద్వారా దేవుని పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచవద్దు. 31 ఈ విధాలుగా ప్రవర్తించడం పూర్తిగా మానివేయడానికి మీ వంతు కృషి చేయండి: ఇతరుల పట్ల ఆగ్రహంగా లేదా కోపంగా ఉండకండి లేదా ఇతరులతో కోపంగా కూడా మారవద్దు. ఇతరుల వైపు దుర్భాషతో కేకలు వెయ్యకండి లేదా నిందించవద్దు. ఏ విధంగానూ ద్వేషముగా ఎప్పుడూ క్రియ జరిగించవద్దు 32 ఆ విధంగా ప్రవర్తించడానికి బదులు, ఒకరికి ఒకరు దయకలిగి ఉండండి. ఒకరి పట్ల ఒకరు కరుణతో క్రియ జరిగించండి. మెస్సీయ మీ కోసం చేసిన దాని ద్వారా దేవుడు కూడా మిమ్మును క్షమించిన విధంగానే ఒకరినొకరు క్షమించండి.

Chapter 5

1 దేవుడు మీ కోసం చేసిన దాని కారణంగా, పిల్లలు తమను అమితంగా ప్రేమించే తండ్రిని అనుకరించిన విధంగా ఆయనను అనుకరించండి. 2 మీరు ఇతరులను ప్రేమిస్తున్నట్టుగా చూపించే విధానంలో ప్రతీదీ చెయ్యండి. మెస్సీయ వలే ఉండండి, ఆయన మనలను ఎంతో ప్రేమించాడు, ఆయన మన స్థానంలో దేవునికి అర్పణగా మరియు బలిగా మన కోసం సిలువ మీద ఇష్టపూర్వకంగా చనిపోయాడు. ఈ బలి దేవుణ్ణి ఎంతో సంతోషపరచింది. 3 అయితే మీలో ఎవరైనను లైంగిక పాపంలో లేదా ఎలాంటి అపవిత్రత లేదా మనసంతా నిండియున్న లైంగిక సంబంధ ప్రవర్తనలో పాలుపంచుకొన్నారని సూచించడానికి కూడా ఎవరికీ ఎటువంటి కారణం ఉండకూడదు. అటువంటి పాపాలు దేవుని ప్రజల మధ్య చెందియుండకూడదు. 4 మీరు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు అసహ్యమైన కథలు లేదా బుద్ధిహీనమైన సంగతులు లేదా పాపాలు జరిగించడం గురించిన పరిహాసం చెప్పవద్దు. అటువంటి సంగతులు దేవునికి చెందిన మనుషులు మాట్లాడవలసినవి కాదు. దానికి బదులు మీరు కృతజ్ఞత చెల్లించవలసిన సంగతులను వ్యక్తపరచండి. 5 దేవుడు అయిన మెస్సీయ రాజ్యము నుండి ఈ మనుషులు వెలివేయబడతారనేది పూర్తిగా నిజం: లైంగికంగా అనైతికంగా లేదా అసభ్యంగా లేదా లైంగికతతో మనసంతా నిండియున్న ప్రతి ఒక్కరు విగ్రహాన్ని ఆరాధిస్తున్న వారి వలే సమానం. 6 ఈ పనులు చేసే మనుషులను దేవుడు శిక్షించడు అని చెప్పడం ద్వారా ఎవరును మిమ్మును మోసపరచనీయ వద్దు. ఈ సంగతుల కారణంగా దేవుడు తనకు అవిధేయత చూపు మనుషులను శిక్షిస్తాడు.

7 కాబట్టి ఈ రకమైన పాపాలు చేయడంలో ఆ మనుషులతో చేరవద్దు. 8 ప్రభువైన యేసులో మీరు విశ్వాసం ఉంచడానికి ముందు చీకటి ప్రదేశంలో ఉన్న మనుషులు తమ చుట్టూ ఏమి ఉన్నదో తెలియకుండా ఉన్న విధంగా సత్యం అయిన దానిని మీరు యెరుగరు అని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చినట్లుగా ఉంది, ఎందుకంటే సత్యమైన దానిని ప్రభువు మీకు చూపించాడు. కాబట్టి ప్రభువు మీకు చూపిన విధంగా జీవించండి 9 ఎందుకంటే వెలుగు కలిగిన మనుషులు సరైన మార్గంలో నడిచిన విధముగా యేసును తెలుసుకోవడం ఫలితంగా మీరు ఎల్లప్పుడూ మంచిది, సరైనది మరియు సత్యమైన మార్గంలో జీవించ గలరు. 10 మీరు ఈ విధంగా జీవిస్తున్నప్పుడు, ప్రభువును సంతోషపరచు దానిని నేర్చుకుంటూ ఉండండి. 11 కాబట్టి ఆధ్యాత్మిక చీకటిలో వారు చేయుచున్న నిరుపయోగమైన కార్యాలను చేస్తూ ఉన్న వారితో కలిసి పాల్గొన వద్దు. బదులుగా, ఆ క్రియలు నిరుపయోగమైనవని ప్రతి ఒక్కరికి బహిర్గతం చేయండి. 12 ఆ మనుషులు రహస్యంలో చేసిన దుష్ట క్రియలను గురించి మాట్లాడడం కూడా దేవుని మనుషుల విషయంలో ఖచ్చితంగా ఇది సిగ్గుకరం. 13 అయితే వాటిని బహిర్గతం చెయ్యడానికి ఇది మన విషయంలో అవసరం తద్వారా ఈ క్రియలు దుష్టమైనవని మనుషులు తెలుసుకొనగలరు మరియు అర్థం చేసుకొనగలరు. నిజంగా ఇది ఏమై ఉన్నదని ప్రతి ఒక్కరికి బయలుపరచడానికి మనం దేనినైనా వెలుగులోనికి తీసుకొని వచ్చిన విధంగా ఉంటుంది. అప్పుడు వెలుగు బహిర్గతం చేసిన దానిని మనుషులు పరీక్షించగలరు మరియు తీర్పు తీర్చగలరు. 14 మీరు దేవుణ్ణి తెలుకోడానికి ముందు మీరు నిద్రిస్తున్న వారు లేదా ఒక చీకటి ప్రదేశంలో చనిపోయిన వారు వలే ఉన్నారు. విశ్వాసులు మాట్లాడుతున్నది ఇదే వారు మాట్లాడినప్పుడు,

     నిద్రిస్తున్న నువ్వు మేలుకో!

     చనిపోయిన నువ్వు, చీకటి నుండి వెలుపలికి రా మరియు జీవించు!

     ప్రకాశిస్తున్న వెలుగు చీకటిలో ఉన్న దానిని మనుషులకు చూపించు విధముగా,

     మెస్సీయ సత్యమైన దానిని నీకు కనుపరుస్తాడు." 15 కాబట్టి మీరు ఏవిధంగా జీవిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. మూర్ఖులైన మనుషులు చేస్తున్న విధముగా ప్రవర్తించ వద్దు. దానికి బదులు జ్ఞానులైన మనుషుల వలే ప్రవర్తించండి. 16 మీకు ఉన్న సమయంతో మీరు చెయ్యగలిగిన ఎక్కువ మేలును చెయ్యండి, ఎందుకంటే మనుషులు ప్రతి రోజు అంత కంతకు ఎక్కువ దుష్ట క్రియలు చేస్తున్నారు. 17 కాబట్టి జ్ఞానంగా ఉండండి, ప్రభువైన యేసు మీరు ఏమి చేయాలని కోరుతున్నాడో బాగా అర్థం చేసుకోండి మరియు దానిని చెయ్యండి! 18 మద్యానికి సంబంధించిన పానీయాలను త్రాగడం ద్వారా మత్తులుగా మార వద్దు, ఎందుకంటే వారు మత్తుగా ఉన్నప్పుడు మనుషులు తమ్మును తాము నియంత్రించుకోలేరు. బదులుగా, అన్ని సమయాలలో మీరు చేయువాటిని దేవుని ఆత్మ నియంత్రించనివ్వండి. 19 మెస్సీయ గురించి కీర్తనలు మరియు పాటలు మరియు దేవుని ఆత్మ మీకు ఇచ్చే పాటలను ఒకరికొకరు పాడండి. ఈ సంగీతం ప్రభువుకు యదార్థమైన స్తుతి వలే మీ లోపలి నుండి రానివ్వండి. 20 మన ప్రభువు మెస్సీయ యేసు మీ కోసం చేసిన ప్రతిదాని కారణంగా ప్రతి దాని కోసం తండ్రి దేవునికి అన్ని సమయాలలో కృతజ్ఞతలు చెప్పండి.

21 మీరు మెస్సీయను లోతుగా గౌరవిస్తారు కాబట్టి వినయంగా మిమ్మల్ని మీరు ఒకరికొకరు లోబరచుకోండి. 22 ప్రభువైన యేసుకు వారు చేసిన విధముగా భార్యలు తమ స్వంత భర్తల నాయకత్వానికి లోబడి ఉండాలి ఎందుకంటే మెస్సీయ విశ్వ వ్యాపిత విశ్వాసుల సంఘానికి నాయకుడిగా ఉన్న విధముగా భర్త భార్యకు నాయకుడుగా ఉన్నాడు. 23 ఆయన విశ్వాసులను అందరిని వారి పాపాల కోసం శిక్షించబడకుండా రక్షించిన రక్షకుడు. 24 భార్యల విషయములో, విశ్వాసులు అందరు మెస్సీయ అధికారానికి తమ్మును తాము లోబరుచుకొన్న విధముగా, అదే విధానములో భార్యలు కూడా తమ భర్తల అధికారానికి సంపూర్ణంగా తమ్మును తాము లోబరచుకోవాలి.

25 భర్తలారా మీలో ప్రతి ఒక్కరు, ఆయనలో విశ్వసించువారిని అందరిని మెస్సీయ ప్రేమించి నంతమట్టుకు మీ భార్యలను ప్రేమించాలి. ఆయన సిలువ మీద మన కోసం తన సొంత ప్రాణాన్ని సహితం అర్పించి వేసాడు. 26 తద్వారా ఆయన మనలను తన కోసం ప్రత్యకపరచుకొన్నాడు. మనలను క్షమించడానికి మనకు ఆయన ప్రణాళిక చెప్పడం ద్వారా మరియు మన పాపములను నీటిలో కడిగి వేసిన విధంగా తొలగించడం ద్వారా ఆయన మనలను శుద్ధి చేసాడు. 27 తద్వారా విశ్వాసుల అందరి గుంపును ఎటువంటి పాపం లేదా నైతిక అసంపూర్ణత లేకుండా అయితే బదులుగా పరిశుద్ధమైనది మరియు పరిపూర్ణమైనదిగా, తన పెండ్లి కుమారుడిని కలుసుకోడానికి సిద్ధంగా ఉన్న ఒక మహిమాన్వితమైన పెండ్లి కుమార్తె వలే ఒక మహిమకరమైన గుంపుగా ఆయన తన యెదుట నిలబెట్టుకోవడం కోసం ఆయన దీనిని చేసాడు. 28 అదే విధంగా, ప్రతి పురుషుడు తన స్వంత శరీరాన్ని తాను ప్రేమించి నంతమట్టుకు తన సొంత భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించుచున్న పురుషుడు కూడా ఆ విధంగా చేయడం ద్వారా తనను తాను ప్రేమించుకొంటున్నాడు. 29 ఎందుకంటే ఎవరూ తన సొంత శరీరాన్ని ఎప్పుడూ ద్వేషించలేదు. బదులుగా, మెస్సీయ కూడా ఆయన విశ్వ వ్యాపిత సంఘంలో విశ్వాసులు మన అందరి కోసం శ్రద్ధ వహించిన విధంగా అతడు తన సొంత శరీరాన్ని పోషిస్తాడు మరియు దాని కోసం శ్రద్ధ వహిస్తాడు. . 30 మనం ఆయనకు చెందిన ఒక విశ్వాసుల గుంపుగా మారాము.

31 వివాహం చేసుకొన్న మనుషుల గురించి లేఖనం దీనిని చెపుతుంది: "అందుచేత ఒక మనిషి తన తండ్రిని మరియు తన తల్లిని విడిచి పెడతాడు, మరియు తాను తన భార్యతో కలుస్తాడు, మరియు వారు ఇద్దరు ఒకే వ్యక్తిగా ఉన్నట్టు మారతారు."

32 దీని గురించి మనం అర్థం చేసుకోలేనిది చాలా ఉంది, అయితే మెస్సీయ మరియు ఆయనకు చెందిన మనుషులు గుంపు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి భర్త మరియు భార్యల ఈ ఉదాహరణ కూడా మనకు సహాయపడుతుందని నేను మీకు చెపుతున్నాను. 33 అయితే, మీ విషయంలో, ప్రతి పురుషుడు తనను తాను ప్రేమించుకొన్న విధముగా తన భార్యను ప్రేమించాలి మరియు ప్రతి స్త్రీ తన భర్తను పూర్ణముగా గౌరవించాలి.

Chapter 6

1 పిల్లలైన మీ విషయంలో, ప్రభువైన యేసుకు సేవ చేసే విధంగా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఎందుకంటే దానిని చెయ్యడానికి మీ విషయంలో ఇది సరియైనది. 2 మీ దేవుడు లేఖనాలలో ఆజ్ఞాపించాడు,

తండ్రిని మరియు తల్లిని అధికంగా గౌరవించండి.” ఇది దేవుడు ఆజ్ఞాపించిన మొదటి ధర్మం. దీనిలో ఆయన ఒక దానిని కూడా వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసాడు, 3 "మీరు దానిని చేసిన యెడల, మీరు వృద్ధి చెందుతారు, మరియు భూమి మీద దీర్ఘకాలం జీవిస్తారు."

4 తండ్రులైన మీ విషయంలో, మీ పిల్లలు కోపంగా అయ్యేలా చేసే విధానంలో వారితో వ్యవహరించవద్దు. బదులుగా, వారికి బోధించడం ద్వారా మరియు మీరు చెయ్యాలని ప్రభువైన యేసు కోరుకుంటున్న విధానంలో వారిని క్రమశిక్షణ చేయడం ద్వారా వారిని చక్కగా పైకి తీసుకు రండి.

5 బానిసలుగా ఉన్న మీ విషయంలో, మెస్సీయకు మీరు విధేయత చూపు విధముగా, ఇక్కడ భూమి మీద మీ యజమానులుగా ఉన్నవారికి చాలా గౌరవ పూర్వకంగా మరియు యదార్ధంగా విధేయత చూపించండి. 6 కష్టపడి పనిచేయడానికి కనిపించడం గురించి మాత్రమే శ్రద్ధ చూపించే మనుషుల వలే, వారు మిమ్మల్ని గమనిస్తున్నప్పుడు మాత్రమే వారికి విధేయత చూపించడం కాదు, . బదులుగా, మీరు చేయాలని దేవుడు కోరుతున్నదానిని ఉత్సాహంగా చేస్తూ మీరు మెస్సీయకు బానిసలు అన్నట్టు పని చేయండి. 7 మీరు మనుషుల కంటే ప్రభువైన యేసుకు సేవ చేస్తున్నట్లుగా, మీ యజమానులకు ఇష్టపూర్వకంగా సేవ చేయండి. 8 ఆ వ్యక్తి చేసిన ఎటువంటి మంచి క్రియల కోసం అయినా ప్రభువైన యేసు ప్రతి వ్యక్తికి ప్రతిఫలం ఇస్తాడని మీరు యెరుగుదురు కనుక దీనిని చెయ్యండి. ఆ వ్యక్తి ఒక బానిస లేదా ఒక స్వతంత్రుడు అయినా గాని ఎటువంటి వ్యత్యాసం లేదు.

9 యజమానులైన మీ విషయంలో, మీ బానిసలు మీకు బాగా సేవ చెయ్యవలసి ఉన్న విధంగా, అదే విధానంలో మీరు వారిని బాగా చూసుకోవాలి. వారిని బెదిరించడం మాని వెయ్యండి. ఇద్దరికి వారి ప్రభువు మరియు మీ ప్రభువు అయినవాడు పరలోకంలో ఉన్నాడని మర్చిపోవద్దు మరియు మనుషులు వారి స్థానం ఉన్నతంగా ఉన్నా లేదా తక్కువగా ఉన్నా అందరికి ఆయన సమానంగా తీర్పు తీరుస్తాడు.

10 చివరగా, మిమ్మును ఆత్మీయంగా బలపరచడానికి ప్రభువైన యేసు మీద సంపూర్ణంగా ఆధారపడండి ఎందుకంటే ఆయన అపరిమితంగా బలవంతుడుగా ఉన్నాడు. 11 ఒక సైనికుడు అతని శత్రువుతో పోరాడడానికి సిద్ధంగా ఉండటానికి అతని పూర్తి కవచాన్ని ధరించకొన్నట్లుగా, దేవుడు మీకు అనుగ్రహించే ప్రతి ఆధ్యాత్మిక వనరును మీరు ఉపయోగించాలి, తద్వారా అపవాది మీకు వ్యతిరేకంగా తెలివిగా పన్నాగాలను పన్నినప్పుడు మీరు అపవాదిని విజయవంతంగా ప్రతిఘటిస్తారు.

12 మనం ఇతర మానవ మాత్రులకు వ్యతిరేకంగా పోరాడడం లేదని జ్ఞాపకం ఉంచుకోండి. బదులుగా, ఈ దుష్ట సమయంలో దుష్ట క్రియలు చేసే మనుషుల మీద పాలన చెయ్యడానికి అధికారం కలిగియున్న దయ్యాలకు వ్యతిరేకంగా అంటే గాలిలో నివసిస్తున్న దుష్ట ఆత్మలకు వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాము.

13 ఆ కారణంగా అతని కవచం అంతటిని ధరించిన సైనికుని వలే దేవుడు మీకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక వనరులు అన్నిటిని మీరు చక్కగా వినియోగించుకోవాలి. మీరు ఆ విధంగా చేసినట్లయితే అవి మీ మీద దాడి చేసినప్పుడు మీరు దుష్ట ఆత్మలను ఎదిరించడానికి శక్తివంతులు అవుతారు. అవి మరల మీ మీద దాడి చేసినప్పుడు మీరు సిద్ధపడి కూడా ఉంటారు మరియు దేవుని కోసం చక్కగా జీవించడం కొనసాగిస్తారు. 14 శత్రువుని ఎదిరించడానికి సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న విధంగా అపవాదిని మరియు అతడి దుష్ట ఆత్మలను ఎదిరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ విధంగా చెయ్యడానికి దేవుడు మీకు చూపించిన నిజమైన సంగతులను గురించి ఆలోచిస్తూ ఉండండి. అంతే కాకుండా నీతిమంతంగా క్రియను జరిగించడానికి కొనసాగండి. సైనికుడి కవచం అతని ఛాతీని సంరక్షించు విధముగా ఇది మిమ్మును కాపాడుతుంది. 15 ఒక సైనికుడు తన కాలిజోడును తొడుగుకొన్న విధంగా దేవునితో సమాధానముగా ఉండడం గురించి మనుషులకు చెపుతున్న శుభవార్త కోసం మీరు అవసరమైన ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. 16 అతని శత్రువు తన వైపుకు సంధించే వెలుగుతూ ఉన్న అగ్ని బాణాలను అడ్డుకోడానికి ఒక సైనికుడు ఒక డాలును ఎత్తి పట్టుకొన్న విధముగా అన్ని సమయాలలో మీరు ప్రభువులో స్థిరంగా విశ్వసించడం కొనసాగించాలి. మీ శత్రువు, దుష్టుడైన సాతాను మీకు ఆధ్యాత్మికంగా హాని చేయడానికి ప్రయత్నించే అన్ని విషయాల నుండి అది మిమ్మల్ని కాపాడుతుంది. 17 అంతేకాకుండా, ఒక సైనికుడు తన శిరస్సును భద్రపరచుకోవడానికి శిరస్త్రాణం మీద ఆధారపడుతూ ఉన్న విధంగా, దేవుడు మిమ్మును రక్షించాడనే వాస్తవం మీద ఆధారపడండి. మరియు ఒక సైనికుడు తన శత్రువులను ఓడించడానికి ఖడ్గాన్ని ఉపయోగించిన విధంగా దేవుని ఆత్మ మీకు ఇస్తున్న ఆయుధాన్ని ఉపయోగించండి, ఇది దేవుని నుండి వస్తున్న సందేశం.

18 మీరు దేవునికి ప్రార్థన చేసిన ప్రతీసారి మరియు ఆయన నుండి సంగతులను అభ్యర్థించినప్పుడు, మీరు ఏవిధంగా ప్రార్థన చెయ్యాలో మరియు దేని కోసం ప్రార్థన చెయ్యాలో దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మిమ్మును నడిపించనివ్వండి. అత్యంత ప్రభావవంతంగా ఉండటానికి, దేవుడు ఏమి చేస్తున్నాడో చూస్తూ ఉండండి మరియు మీరు దేవుని మనుషులు అందరి కోసం ప్రార్థన చెయ్యడం కొనసాగిస్తూ ఉన్నప్పుడు పట్టుదలతో ఉండండి. 19 మనుషులు ఇంతకు ముందు యెరుగని మెస్సీయ గురించిన శుభవార్తను నేను ధైర్యంగా ఇతరులకు చెప్పగల్గునట్లుగా నేను మాట్లాడిన ప్రతిసారి నేను పలకవలసిన దానిని దేవుడు నాకు చెప్పునట్లు నా కోసం కూడా ప్రార్థన చెయ్యండి. 20 దీనికి కారణం నేను మెస్సీయ గురించి మనుషులకు చెపుతూ ఉన్నాను అంటే ఇప్పుడు నేను ఇక్కడ చెరసాలలో ఆయనకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను మెస్సీయ గురించి ఇతరులకు చెపుతూనే ఉన్నప్పుడు, నేను ధైర్యంగా మాట్లాడునట్లు ప్రార్థన చెయ్యండి ఎందుకంటే నేను ఆ విధంగా మాట్లాడవలసి ఉంది. 21 ఇప్పుడు నాకు జరుగుతున్న దానిని గురించి మరియు నేను చేయుచున్నదానిని గురించి మీరు తెలుసుకోడానికి, తుకికు ఇక్కడ జరుగుతున్న దానినంతటి గురించి మీకు చెపుతాడు. అతడు మనం అందరం చాలా ఎక్కువగా ప్రేమించే ఒక తోటి విశ్వాసి. మరియు అతడు ప్రభువైన యేసును నమ్మకంగా సేవిస్తున్నాడు. 22 ఆ కారణంగా అతనిని నేను ఈ పత్రికతో మీ యొద్దకు పంపుతున్నాను మరియు మేము ఎలా ఉన్నామో నువ్వు తెలుసుకోవాలని కోరుతున్నాను మరియు అతడు మిమ్మును ఆదరించాలని మరియు ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను. 23 మన తండ్రియైన దేవుడు మరియు ప్రభువు మెస్సీయ యేసు తోటి విశ్వాసులైన మీకు అందరికి ఒక సమాధానకరమైన ఆత్మను అనుగ్రహించాలని మరియు ఒకరిని ఒకరు ప్రేమించడానికి మరియు దేవునిలో విశ్వాసం ఉంచడం కొనసాగించడానికి మిమ్మును శక్తితో నింపును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. 24 మన ప్రభువు మెస్సీయ యేసును స్థిరముగా ప్రేమించు మనుషులు అందరి మధ్య దేవుడు కృపాభరితంగా కార్యాన్ని జరిగించడం కొనసాగించడానికి నేను ప్రార్థన చేస్తున్నాను.