తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

లూకా సువార్త

Chapter 1

1 అనేకమంది మనుష్యులు మన మధ్య జరిగిన సంగతులను గురించి ఇప్పటికే రాస్తూ ఉన్నారు. 2 ఈ సంగతులు జరగడం చూసిన మనుష్యులు వాటిని గురించి మనతో చెప్పిన వాటిని వారు నమోదు చేస్తూ ఉన్నారు. ఆ మనుష్యులు సమస్తము జరగడం ప్రారంభించిన సమయం నుండి వారు అక్కడ ఉన్నారు మరియు అప్పటి నుండి వారు వృత్తాంతమును పంచుకుంటూ ఉన్నారు. 3 నా మట్టుకు నేను మొదటి నుండి జరిగిన అన్నిటిని జాగ్రత్తగా పరిశోధించాను. కాబట్టి నేను కూడా నీ కోసం ఖచ్చితమైన వివరణ వ్రాయాలని నిర్ణయించుకున్నాను. నీ ఘనత, థెయొఫిలా, 4 యేసు గురించి మనుష్యులు నీకు చెప్పినది సత్యము అని నీవు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 5 హేరోదు యూదయ యొక్క అధిపతిగా ఉన్నప్పుడు, జెకర్యా అను పేరుగల ఒక యూదు యాజకుడు అక్కడ ఉన్నాడు. అతడు అబీయా యొక్క ఒక సంతానం, మరియు కాబట్టి దేవాలయములో అబీయా యొక్క వంశస్థులుగా కూడా ఉన్న ఇతర యాజకులతో సేవ చెయ్యడానికి తన వంతు అతడు తీసుకొన్నాడు. అతని భార్య ఎలీసబెతు అని పేరు పెట్టబడింది. ఆమె ఆహరోను యొక్క ఒక వంశస్థురాలు{, మరియు కాబట్టి ఆమె కూడా యాజక తరగతి నుండి ఉంది}. 6 వారు ఇద్దరు నీతిమంతులు అని దేవుడు యెంచాడు ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతీదానికి వారు ఎల్లప్పుడూ విధేయత చూపించారు. 7 అయితే వారు ఎటువంటి పిల్లలను కలిగియుండలేదు, ఎందుకంటే ఎలీసబెతు పిల్లలను కనడానికి శక్తిలేనిదిగా ఉంది. మరియు ఇప్పుడు ఆమె మరియు ఆమె భర్త పిల్లలు కలిగియుండడానికి చాలా ముసలివారు. 8 జెకర్యా యాజకుల యొక్క గుంపు కోసం {యెరూషలేంలో సేవచేయ్యడానికి} దాని వంతు తీసుకోడానికి సమయం వచ్చింది. కాబట్టి జెకర్యా దేవుని కోసం ఒక యాజకుని వలే పని చెయ్యడానికి అక్కడ ఉన్నాడు. 9 ప్రభువు ఆలయంలోనికి వెళ్ళడానికి మరియు అక్కడ దూపం దహించడానికి యాజకులు జెకర్యాను ఎంపిక చేసారు. వారు చీట్లు వెయ్యడం చేత{ఒక నిర్దిష్టమైన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడని నిర్దారించడానికి} తమ సాధారణ మార్గంలో అతనిని ఎంపిక చేసారు. 10 ధూపం దహించడానికి ఇది సమయం అయినప్పుడు, అనేకమంది మనుష్యులు {దేవాలయం} వెలుపల {ఆవరణలో} ప్రార్థన చేస్తూ ఉన్నారు.

11 అప్పుడే, ప్రభువు యొక్క దూత జెకర్యా దగ్గరకు వచ్చాడు. అతడు ధూపం వేస్తున్న బలిపీఠం యొక్క కుడివైపున నిలబడ్డాడు. అక్కడ అతడు దూపాన్ని మండిస్తున్నాడు. 12 జెకర్యా దేవదూతను చూచినప్పుడు, అతడు కంగారు పడ్డాడు మరియు భయపడ్డాడు. 13 అయితే దేవదూత అతనికి చెప్పాడు, "{నా విషయం} భయపడి యుండడానికి అక్కడ కారణం లేదు, జెకర్యా. నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావు, మరియు దేవుడు నీ పార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ భార్య ఎలీసబెతు నీ కోసం ఒక కుమారునికి జన్మ ఇస్తుంది. అతనికి యోహాను పేరు ఇవ్వు. 14 అతడు పుట్టినప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు మరియు అనేక ఇతర మనుషులు కూడా సంతోషంగా ఉంటారు.

15 నీవు మరియు వారు సంతోషంగా ఉంటారు ఎందుకంటే నీ కుమారుడు దేవుని కోసం చాలా ప్రభావవంతంగా ఉంటాడు. ఆయన ఎన్నడూ ద్రాక్షారసం లేదా ఏ ఇతర మద్య పానీయం త్రాగకూడదు. పరిశుద్ధ ఆత్మ ఆయన పుట్టక ముందు సహితం అతనిని ప్రభావితం చెయ్యడం ఆరంభిస్తాడు. 16 నీ కుమారుడు ఇశ్రాయేలీయుల యొక్క అనేకులను పాపం చెయ్యడం ఆపడానికి మరియు వారి ప్రభువు దేవునికి తిరిగి విదేయత చూపడం ఆరంభించడానికి ఒప్పిస్తాడు. 17 నీ కుమారుడు ప్రభువు కంటే ముందుగా వెళ్తాడు మరియు ప్రవక్తయైన ఏలీయా ఉన్న విధముగా ఆయన తన ఆత్మలో శక్తివంతంగా ఉంటాడు. తల్లిదండ్రులు తమ పిల్లలను మరల ప్రేమించడానికి అతడు చేస్తాడు. దేవునికి విధేయత చూపించని అనేకులైన మనుష్యులను ఆయనకు విధేయత చూపించడానికి కోరుకోడానికి మరియు జ్ఞానయుక్తంగా మరియు నీతిగా జీవించడానికి చేస్తాడు. ఆయన దీనిని చేస్తాడు తద్వారా ప్రభువు మనుష్యులు ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం సిద్ధంగా ఉంటారు.

18 అప్పుడు జెకర్యా దేవదూతకి చెప్పాడు, “నువ్వు చెప్పిన సంగతులు వాస్తవంగా జరుగుతాయని నేను ఖచ్చితంగా ఎలా ఉండగలను? నేను చాలా ముసలివాడిని, మరియు నా భార్య కూడా చాలా వృద్ధురాలు {, కాబట్టి అవి జరుగుతాయని నమ్మడానికి నా కోసం ఇది కష్టం}." 19 అప్పుడు దేవదూత అతనికి జవాబిచ్చాడు. "నేను గాబ్రియేలును! నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. నీకు జరగబోవుదాని గురించి ఈ శుభవార్త నీకు చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు. 20 ఇప్పుడు విను! దేవుడు నిర్ణయించిన సమయంలో నేను నీకు చెప్పినది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నా సందేశాన్ని నువ్వు విశ్వసించలేదు కనుక, మాట్లాడడం నుండి దేవుడు నిన్ను ఉంచుతాడు. నీ కుమారుడు పుట్టే దినము వరకు నువ్వు మాట్లాడలేక ఉంటావు.

21 {జెకర్యా మరియు దేవుదూత దేవాలయములో మాట్లాడుకొంటూ ఉండగా,}ఆవరణలో మనుష్యులు జెకర్యా వెలుపలికి రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత దీర్ఘ కాలం దేవాలయంలో ఎందుకు ఉంటున్నాడు అని వారు ఆశ్చర్యపోయారు. 22 అప్పుడు దేవాలయం నుండి వెలుపలికి వచ్చాడు, అయితే అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు మాట్లాడలేకపోతున్న కారణంగా జరిగిన దానిని వివరించడానికి ప్రయత్నించడానికి అతని చేతులతో అతడు కదలికలు చేసాడు. అతడు దేవాలయంలో ఉన్న సమయంలో దేవుని నుండి అతడు ఒక దర్శనం చూసాడని మనుష్యులు భావించేలా ఇది చేసింది. 23 అతడు దేవాలయంలో ఒక యాజకుని వలే పని చెయ్యడానికి అతనికి అవసరమైన సమయం జెకర్యా ముగించినప్పుడు, అతడు యెరూషలెం విడిచి పెట్టాడు మరియు అతని ఇంటికి తిరిగి వెళ్ళాడు.

24 దీని తరువాత కొంత సమయానికి, అతని భార్య, ఎలీసబెతు, గర్భవతి అయ్యింది, మరియు ఆమె ఐదు నెలల పాటు బహిరంగంగా బెలుపలికి రాలేదు. ఆమె తనలో తాను చెప్పుకొంది. 25 “గర్భవతి కావడానికి ప్రభువు నాకు శక్తి నిచ్చాడు. ఈ విధానంలో, ఆయన నాకు కరుణ చూపించాడు. ఆయన కృతజ్ఞతలు, నేను ఇతర మనుష్యుల చుట్టూ ఇక మీదట సిగ్గుతో బాధపడనవసరం లేదు."

26 ఎలీసబెతు ఆరవ నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు, దేవుడు తన దూత గాబ్రియేలును గలిలయ యొక్క జిల్లాలో నజరేతు అని పిలువబడిన ఒక పట్టణముకు పంపాడు. 27 దేవుడు అతనిని ఒక కన్యకతో మాట్లాడడానికి పంపాడు, ఆమె పేరు మరియ. ఆమె దావీదు రాజు యొక్క సంతానం అయిన యోసేపు అను పేరు గల ఒక మనిషిని వివాహం చేసుకుంటుంది {అని ఆమె తల్లిదండ్రులు వాగ్దానం చేసారు}. 28 ఆ దేవదూత మరియు ఉన్న చోటికి వచ్చాడు మరియు ఆమెకు చెప్పాడు, "“అమ్మా ఆశీర్వదించబడిన దానవు! నీవు ప్రభువుకు చాలా ప్రత్యేకమైనదానవు!"

29 అయితే అతడు దీనిని చెప్పినప్పుడు, ఆమె కంగారు పడింది. ఈ శుభవచనం ఏమిటి అని అర్థం చేసుకోడానికి ఆమె ప్రయత్నం చేసింది. , 30 అప్పుడు దూత చెప్పాడు, “దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు, కాబట్టి మరియ భయపడకు!. 31 ఇప్పుడు విను. నీవు గర్భం ధరిస్తావు మరియు ఒక కుమారుని కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. 32 ఆయన గొప్పవాడవుతాడు. మరియు ఆయన ‘సర్వోన్నతుని దేవుని యొక్క కుమారుడు’ అవుతాడు. ప్రభువైన దేవుడు తన ప్రజల మీద ఆయన పితరుడు దావీదు వలే ఆయనను రాజుగా చేస్తాడు. 33 ఆయన ఇశ్రాయేలు యొక్క మనుష్యుల మీద రాజుగా ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన వారి మీద శాశ్వతంగా పరిపాలిస్తాడు!"

34 అప్పుడు మరియ దేవదూతకు చెప్పింది, “అయితే నేను కన్యను. కాబట్టి ఇదెలా జరుగుతుంది?” 35 ఆ దూత జవాబిచ్చాడు, “పరిశుద్ధ ఆత్మ నీ మీదకు వస్తాడు. సర్వోన్నతుని దేవుని యొక్క శక్తి ఒక నీడ వలే నీ మీదకు వాలుతుంది. కాబట్టి నీవు కనబోయే శిశువు పరిశుద్ధుడిగా ఉంటాడు. ఆయన దేవుని యొక్క కుమారుడిగా ఉంటాడు. 36 దీనిని కూడా విను. నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది. మరియు ఆమె ఒక కుమారుడిని కలిగియుండబోతున్నది. ఆమె ముసలి వయసులో ఉన్నది కనుక ఆమెను పిల్లలను కలిగియుండలేదు అని మనుష్యులు తలంచారు, అయితే ఇప్పుడు ఆమె దాదాపు ఆరు నెలలుగా గర్భవతిగా ఉంది. 37 కాబట్టి చూడు, దేవుడు దేనినైనా చెయ్యగలడు!"

38 అప్పుడు మరియ చెప్పింది, “మంచిది. నేను ప్రభువుకు విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నాను. నువ్వు నాకు వివరించిన సంగతులు దేవుడు జరిగేలా చెయ్యగలడు." అప్పుడు దేవదూత ఆమెను విడిచింది.

39 ఇది జరిగిన కొద్దికాలానికే మరియ సిద్ధపడింది మరియు జెకర్యా నిసించిన నగరానికి సాధ్యమైనంత త్వరగా ప్రయాణం చేసింది, అది యూదయ యొక్క కొండల ప్రాంతం. 40 ఆమె జెకర్యా ఇంటిలోనికి ప్రవేశించింది మరియు అతని భార్య ఎలిసబెతుకు శుభములు చెప్పింది. 41 మరియ తనకు శుభములు చెప్పడం వినిన వెంటనే, ఎలీసబెతు లోపల ఉన్న శిశువు ఒక్కసారిగా కదిలింది. వెంటనే పరిశుద్ధ ఆత్మ ఎలీసబెతు మాట్లాడడానికి ప్రేరేపించాడు.

42 ఆమె మరియతో ఆశ్చర్యంతో బిగ్గరగా చెప్పింది, "దేవుడు మరే ఇతర స్త్రీని ఆశీర్వదించనంత ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాడు మరియు నువ్వు కనబోయే బిడ్డను ఆయన ఆశీర్వదించాడు! 43 నా ప్రభువు యొక్క తల్లివైన నీవు నన్ను దర్శించడానికి వచ్చునట్లు నేను దీనికి అర్హురాలిని కాదు! 44 ఇది అంతా నాకు తెలుసు ఎందుకంటే నువ్వు నాకు శుభములు చెప్పడం వినిన వెంటనే నా కడుపులో శిశువు చుట్టూ కదలడం ఆరంభించాడు ఎందుకంటే అతడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. 45 నీవు ఆశీర్వదించబడ్డావు ఎందుకంటే ప్రభువు నీకు చెప్పినది నెరవేరుతుంది అని నీవు విశ్వసించావు."

46 అప్పుడు మరియ దేవుణ్ణి స్తుతించింది చెప్పింది:

     “ఓహో నేను ప్రభువును ఎంతో స్తుతిస్తున్నాను 47 మరియు దేవుని గురించి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను.

     ఆయన నన్ను రక్షిస్తున్నాడు!

     48 చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను చాలా ముఖ్యమైనదానిని కానప్పటికీ ఆయన నాకు కృప చూపించాడు.

     ఒక్కసారి దీనిని ఊహించండి-ఇప్పటి నుండి, భవిష్యత్తులో అన్ని సమయాలలో జీవించే మనుష్యులు దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెపుతారు.

     49 వారు ఇది చెపుతారు ఎందుకంటే శక్తిమంతుడు, మరియు పరిశుద్ధుడు అయిన దేవుడు నా కోసం గొప్ప కార్యములు చేశాడు.

     50 ఆయనను గౌరవించు మనుష్యులకు అన్ని కాలాలు అంతటా ఆయన కరుణతో క్రియ జరిగిస్తాడు.

     51 ఆయన చాలా శక్తిమంతుడు అని ఆయన మనుష్యులకు కనుపరచాడు.

     తమలో తాము గర్వంగా ఆలోచించిన వారిని ఆయన విరుగగొట్టాడు.

     52 పాలకులు పరిపాలించడం ఆపేలా ఆయన చేసాడు,

     అయితే ఆయన దీనులైన మనుష్యులను ఘనపరచాడు.

     53 ఆకలితో ఉన్న వారు నిండియుండే వరకు మంచి ఆహారం భుజించేలా ఆయన చేసాడు.

     అయితే దేనినీ ఇవ్వకుండా ధనవంతులైన మనుష్యులను ఆయన పంపాడు.

     54 ఆయనను సేవించిన మనుష్యులు, ఇశ్రాయేలీయులకు ఆయన సహాయం చేసాడు.

     ఆయన వారికి కరుణకలిగి ఉంటాను అని మన పితరులకు చాలా కాలం క్రితం ఆయన వాగ్దానం చేసాడు.

     55 ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు మరియు అబ్రాహాము మరియు అతని నుండి వచ్చినవారు అందరి పట్ల ఎల్లప్పుడూ కరుణ చూపించాడు.

56 మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉంది, దాని తరువాత ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళింది.

57 ఎలీసబెతు తన బిడ్డకు జన్మ ఇవ్వడానికి సమయం వచ్చినప్పుడు, ఆమె ఒక కుమారుడిని కన్నది.. 58 ఆమెకు ఒక కుమారుడిని ఇవ్వడం చేత ప్రభువు ఆమె మీద ఎంతో జాలి చూపాడు అని ఆమె పొరుగువారు మరియు బంధువులు పై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగువారు మరియు బంధువులు విని నప్పుడు వారు ఎలీసబెతుతో కలిసి సంతోషించారు. 59 ఎనిమిది దినముల తరువాత, శిశువుకు సున్నతి చేయడానికి వేడుక కోసం {అతడు దేవునికి చెందినవాడని చూపించడానికి} మనుష్యులు ఒకచోట చేరారు. {ఇది బిడ్డకు పేరు పెట్టాడానికి సమయం కూడా.} మనుష్యులు బిడ్డకు జెకర్యా అని పేరు పెట్టాలని కోరుకున్నారు ఎందుకంటే అది అతని తండ్రి పేరు. 60 అయితే అతని తల్లి చెప్పింది, “కాదు. {అతని పేరు జెకర్యాగా ఉండదు.} అతని పేరు యోహానుగా ఉంటుంది." 61 కాబట్టి వారు ఆమెతో, చెప్పారు, “అయితే యోహాను నీ బంధువులలో ఎవరి పేరు కాదు!” , 62 అప్పుడు వారు అతని తండ్రికి తమ చేతులతో కదలికలు చేసారు, అతడు తన కుమారునికి ఏ పేరు పెట్టాలని కోరుకుంటున్నాడో సూచించమని అతనిని అడిగారు. . 63 కాబట్టి రాయడానికి పలకను ఇవ్వమని అతడు సంకేతాలిచ్చాడు. {వారు అతనికి ఒకటి ఇచ్చినప్పుడు,} అతడు దానిమీద రాసాడు, "అతని పేరు యోహాను.” ఇది అక్కడున్న మనుష్యులు అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. . 64 వెంటనే, జెకర్యా మళ్లీ మాట్లాడగలిగాడు మరియు అతడు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు.. 65 సమీపంలో నివసించే మనుష్యులు {ఈ విషయాల గురించి వినినప్పుడు, వారు} దేవుని కోసం లోతైన గౌరవాన్ని అనుభవించారు. {వారు జరిగిన దాని గురించి అనేకమంది ఇతరులకు చెప్పారు,} మరియు ఈ వార్త యూదయ యొక్క ఎత్తైన ప్రాంతముల అంతటా ఉన్న మనుష్యులకు వ్యాపించింది.. 66 ఈ విషయాల గురించి విన్న ప్రతి ఒక్కరూ వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారు తలంచారు, “ఖచ్చితంగా ఈ చిన్నబిడ్డ చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదుగుతాడు!” {వారు ఇది అనుకున్నారు} ఎందుకంటే ప్రభువు అతని జీవితంలో ఒక శక్తివంతమైన విధానంలో ఉన్నాడని {వారు చూడగలిగారు}.. 67 చిన్న బిడ్డ తండ్రి, జెకర్యా, మరల మాట్లాడగలిగిన తరువాత, పరిశుద్ధ ఆత్మ జెకర్యాను ప్రేరేపించాడు మరియు అతను దేవుని నుండి ఈ మాటలు చెప్పాడు.

     68 “ఇశ్రాయేలు యొక్క మనుష్యులమైన మనం ఆరాధించే దేవుడైన ప్రభువును స్తుతించండి,

     ఎందుకంటే ఆయన తన మనుష్యులైన మనలను విడిపించడానికి వచ్చాడు.

     69 మనలను శక్తివంతంగా రక్షించే వ్యక్తిని అయన పంపాడు,

     దావీదు నుండి సంతానంగా ఉన్నవానిని, రాజుగా ఉండడానికి ఆయన ఎంపిక చేసాడు..

     70 (ఆయన ఈ కార్యాలు చేస్తాను అని చాలా కాలం క్రితం తన ప్రవక్తలు చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడు.)

     71 మన శత్రువుల నుండి మనలను రక్షించడానికి {దేవుడు ఈ విమోచకుడిని పంపుతున్నాడు},

     మరియు మనల్ని ద్వేషించే ప్రతి ఒక్కరి శక్తి నుండి {అయన మనలను కాపాడతాడు}.

     72 దేవుడు దీనిని చేసాడు ఎందుకంటే ఆయన మన పూర్వీకులకు నమ్మకంగా ఉన్నాడు మరియు కాబట్టి ఆయన వారికి చేసిన పరిశుద్ధ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.

     73 ఆయన మన కోసం ఏమి చేస్తాడో మన పూర్వీకుడైన అబ్రాహాముకు ఆయన రూఢిగా ప్రమాణం చేసిన వాగ్దానం ఇది. .

     74 మన శత్రువుల యొక్క శక్తి నుండి మనలను రక్షిస్తానని ఆయన వాగ్దానం చేసాడు

     తద్వారా వారికి భయపడకుండా మనం ఆయనకు సేవ చేయగలము.

     75 దాని ఫలితంగా, మనం జీవించి ఉన్నంత కాలం ఆయనకు పూర్తిగా చెందిన మనుష్యులముగా సరైన మార్గంలో జీవించగలుగుతాము.

76 {అప్పుడు జెకర్యా తన కుమారుడైన శిశువుతో ఇలా అన్నాడు,}

     “మరియు నా బిడ్డ, నువ్వు సర్వోన్నతుడైన దేవునికి

     ప్రవక్తవు అవుతావు.

     ప్రభువు రాకముందే నీవు నీ పనిని ప్రారంభిస్తావు

     తద్వారా నీవు ఆయన కోసం సిద్ధంగా ఉండేందుకు ప్రజలను సిద్ధం చేయవచ్చు.

     77 వారి పాపాలను క్షమించడం చేత వారిని రక్షించడానికి కోరుకుంటున్నాడు అని నీవు దేవుని మనుష్యులకు చెపుతావు. 78 దేవుడు మనలను రక్షించడానికి కోరుకున్నాడు ఎందుకంటే ఆయన కనికరం మరియు దయగలవాడు.

     ఆ కారణంగా ఆయన మనకు సహాయం చేయడానికి పరలోకం నుండి ఈ రక్షకుని పంపుతున్నాడు.

     79 ఈ రక్షకుడు సత్యాన్ని తెలియని వారికి, అస్సలు తెలియని వారికి కూడా చూపిస్తాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఎలా జీవించాలో ఆయన మనకు చూపిస్తాడు.”

80 కాలం జరుగుతున్నకొద్దీ, జెకర్యా మరియు ఎలీసబెతుల మగబిడ్డ పెరిగాడు మరియు ఆత్మీయంగా బలవంతుడయ్యాడు. తరువాత అతడు ఒక నిర్జన ప్రాంతంలో నివసించడానికి వెళ్లాడు. దేవుని మనుష్యులు ఇశ్రాయేలుకు ఆయన బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించినప్పుడు అతను ఇంకా అక్కడే నివసిస్తున్నాడు.

Chapter 2

1 అంతే కాకుండా ఆ సమయంలో, {, రోమా సామ్రాజ్యం మొత్తాన్ని పరిపాలించిన వాడు} కైసరు ఔగుస్తు తన సామ్రాజ్యంలో నివసించే ప్రతి వ్యక్తి {అక్కడ నివసించిన ప్రజల అధికారిక జాబితాలో తన పేరును} నమోదు చేసుకోవడానికి ఆజ్ఞాపించాడు. 2 రోమనులు తమ సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేయడం ఇదే మొదటిసారి. సిరియా యొక్క ప్రాంతానికి కురేనియకు అధిపతిగా ఉన్న సమయంలో వారు ఇది చేశారు. 3 కాబట్టి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవడానికి తమ కుటుంబీకుల స్వగ్రామానికి వెళ్లాలి. 4 యోసేపు కూడా అతనికి నిశ్చితార్థం అయిన మరియు గర్భవతి అయిన మరియతో పాటు తన కుటుంబం యొక్క స్వగ్రామానికి వెళ్లాడు. యోసేపు దావీదు రాజు వంశస్థుడు కాబట్టి, వారు గలిలయ ప్రాంతంలోని నజరేతు పట్టణాన్ని విడిచిపెట్టి, 5 యూదయ ప్రాంతానికి, దావీదు యొక్క నగరం అని కూడా పిలువబడే బెత్లెహేము యొక్క పట్టణానికి ప్రయాణించారు. యోసేపు మరియు మరియ బహిరంగ గ్రంథంలో నమోదు చేసుకోవడానికి అక్కడికి వెళ్లారు. 6 వారు బేత్లెహేముకు వచ్చినప్పుడు, సందర్శకులు సాధారణంగా ఉండే చోట వారు ఉండడానికి స్థలం లేదు. కాబట్టి వారు రాత్రిపూట జంతువులు నిద్రించే ప్రదేశంలో ఉండవలసి వచ్చింది. 7 వారు అక్కడ ఉండగా మరియకు జన్మనిచ్చే సమయం వచ్చింది మరియు ఆమె తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆతనిని విశాలమైన గుడ్డ యొక్క పేలికలలో చుట్టింది మరియు గాదె లోపల జంతువులకు ఆహారం పెట్టే చోట అతనిని పరుండబెట్టింది. 8 ఆ రాత్రి బేత్లెహేముకు సమీపంలోని బహిరంగ పల్లె ప్రదేశంలో కొందరు కాపరులు మకాం చేశారు. వారు తమ గొర్రెలను మేపుకుంటూ అక్కడ ఉన్నారు. 9 అకస్మాత్తుగా యెహోవా నుండి వచ్చిన ఒక దేవదూత తమ ముందు నిలబడి ఉండడం వారు చూశారు. ప్రభువు నుండి ఒక మహిమాన్వితమైన కాంతి వారిమీద అంతటా ప్రకాశించింది. వారు చాలా భయపడ్డారు. 10 అయితే దేవదూత వారితో చెప్పాడు, “భయపడ వద్దు! జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను మీకు చాలా అంచి వార్త చెప్పడానికి వచ్చాను! ఈ వార్త మనుష్యులు అందరి కోసం మరియు ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలి! 11 వారు సంతోషిస్తారు ఎందుకంటే ఈ రోజు, దావీదు రాజు స్వస్థలం బెత్లెహేములో, మిమ్మును {మీ పాపాల నుండి} రక్షించే వ్యక్తి జన్మిస్తాడు! ఆయన మెస్సీయ, ప్రభువు! 12 మరియు ఇక్కడ మీకోసం ఒక సూచన ఉంది. {మీరు బెత్లెహేముకు వెళ్ళిన యెడల,} అక్కడ ఒక శిశువు గుడ్డ యొక్క పెలికలలో చుట్టబడి మరియు జంతువుల కోసం ఆహారం పెట్టే స్థలంలో పరుండపెట్టబడి ఉంది.

13 అకస్మాత్తుగా పరలోకం నుండి దేవదూతల యొక్క ఒక పెద్ద గుంపు ఇతర దేవదూతతో ప్రత్యక్షం అయ్యింది. వారు అందరూ చెప్పడం చేత దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు,

     14 “అత్యున్నతమైన పరలోకంలో దేవదూతలు అందరూ దేవుణ్ణి స్తుతిస్తారు గాక! మరియు భూమి మీద దేవుణ్ణి సంతోషపెట్టే మనుష్యులు అందరూ {దేవునితో మరియు ఒకరితో ఒకరు} సమాధానంతో ఉందురు గాక!

15 దేవదూతలు వారిని విడిచి పెట్టారు మరియు పరలోకానికి తిరిగి వెళ్ళినప్పుడు గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు చెప్పారు, "మనం ఇప్పుడే బెత్లెహేముకు వెళ్ళాలి మరియు జరిగిన అద్భుతమైన ఈ సంగతిని చూడాలి, దీని గురించి ప్రభువు మనకు చెప్పాడు! 16 కాబట్టి వారు త్వరగా వెళ్ళారు, మరియు వారు మరియ, యోసేపులు {ఉన్న ప్రదేశాన్ని} కనుగొన్నప్పుడు, జంతువుల కోసం ఆహారం పెట్టే స్థలంలో శిశువు పరుండి యుండడం వారు చూసారు. 17 వారు ఆయనను చూసిన తరువాత, ఈ శిశువును గురించి ప్రభువు తమకు బయలుపరచిన సంగతిని వారు ప్రతి ఒక్కరికి చెప్పారు. 18 వింటున్న మనుష్యులు అందరూ గొర్రెల కాపరులు తమతో చెప్పినది ఆశ్చర్యంగా ఉంది అని ఆలోచించారు. 19 అయితే మరియ ఈ విషయాలను అన్నిటిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకొంది మరియు వాటిని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉంది. 20 గొర్రెల కాపరులు {తమ గొర్రెలు ఉన్న పొలాలకు} తిరిగి వచ్చారు. వారు దేవుడు ఎంత గొప్పవాడుగా ఉన్నది అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు మరియు వారు వినిన మరియు చూసిన సంగతులు అన్నిటి గురించి ఆయనను స్తుతిస్తూనే ఉన్నారు. దేవదూత వారికి ఇది ఉంటుందని చెప్పిన ప్రతిదీ ఖచ్చితంగా జరిగింది.

21 శిశువు జన్మించిన తరువాత ఎనిమిదవ దినమున వారు ఆయనకు సున్నతి చేసారు మరియు ఆయనకు యేసు పేరు ఇచ్చారు. మరియ ఆయనను గర్భం దరించడానికి ముందు ఆయనకు ఇవ్వమని దేవదూత వారికి చెప్పిన పేరు ఇది.

22 మరియ మరియు యోసేపు ఒక శిశువును కలిగి ఉన్న తరువాత తిరిగి ఆచారబద్ధంగా శుద్ధి కావడానికి ఆమె కోసం మోషే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం అవసరమయ్యే రోజుల యొక్క సంఖ్య కోసం వేచి ఉన్నారు. అప్పుడు వారు ఆయనను యెరూషలేముకు తీసుకువచ్చారు, తద్వారా వారు ఆయనను ప్రభువుకు {ఆలయంలో} ప్రతిష్టించగల్గుతారు. 23 ప్రభువు యొక్క ధర్మశాస్త్రానికి విధేయత చూపించడానికి వారు ఇది చేసారు, అది చెపుతుంది, "మొదట పుట్టబోయే ప్రతి మగ సంతానాన్ని మీరు ప్రభువు కోసం ప్రత్యేక పరచాలి.” 24 అక్కడ నూతనంగా పుట్టిన కుమారుని యొక్క తల్లిదండ్రులు అర్పించడానికి ప్రభువు యొక్క ధర్మశాస్త్రం చెప్పిన బలిని, "రెండు గువ్వలు లేదా చిన్న పావురాలు" వారు అర్పించారు.

25 ఆ సమయంలో యెరూషలేములో ఒక మనిషి ఉన్నాడు, అతని పేరు సిమెయోను. దేవునికి ఇష్టమైనది అతడు చేశాడు మరియు దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించాడు. ఇశ్రాయేలు యొక్క మనుష్యులను ప్రోత్సహించడానికి దేవుడు మెస్సీయను పంపుతాడని అతడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ అతనిని నడిపిస్తున్నాడు. 26 అతడు చనిపోవడానికి ముందు, ప్రభువు మెస్సీయను పంపుతాడు మరియు అతడు ఆయనను చూస్తాడు అని పరిశుద్ధ ఆత్మ గతంలో అతనికి బయలుపరచాడు. 27 కాబట్టి పరిశుద్ధ ఆత్మ సిమెయోను దేవాలయం ప్రాంగణంలోనికి వెళ్లేలా నడిపించాడు. యోసేపు మరియు మరియ శిశువు యేసును తీసుకువచ్చినప్పుడు అతడు అక్కడ ఉన్నాడు, తద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన ఆయన కోసం వేడుకను వారు నిర్వహించగలిగారు. 28 {సిమెయోను యేసును చూసినప్పుడు,} అతడు ఆయన తన చేతులలోనికి ఎత్తుకొన్నాడు మరియు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు మరియు చెప్పాడు,

     29 “ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన నీ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నావు, మరియు ఇప్పుడు నీవు నన్ను చావనివ్వడానికి నేను సంతృప్తి చెందాను.

     30 ఎందుకంటే మనుష్యులను రక్షించడానికి నువ్వు పంపిన వానిని నేను చూసాను, 31 మనుష్యులు అందరూ చూడడం కోసం నీవు సిద్ధం చేసిన వాడు. 32 అతడు ఇతర దేశాలకు నీ సత్యాన్ని వెల్లడి చేసే ఒక వెలుగు వలే ఉంటాడు. నీ మనుష్యులైన ఇశ్రాయేలీయుల కోసం నీ ప్రణాళిక ఎంత మహిమాన్వితమైనదో ఆయన చూపుతాడు.”

33 యేసు తండ్రి మరియు తల్లి ఆయనను గురించి సిమెయోను చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయారు. 34 అప్పుడు సిమెయోను వారిని ఆశీర్వదించాడు, యేసు తల్లి మరియతో చెప్పాడు: “నేను చెప్పుచున్నది జాగ్రత్తగా గమనించాలి: దేవుడు దానిని నిర్ణయించాడు, ఈ శిశువు కారణంగా, ఇశ్రాయేలులో అనేకులైన మనుష్యులు దేవుణ్ణి తిరస్కరిస్తారు, మరియు అనేకులు దేవునికి తమ్మును తాము లోబరుచుకొంటారు. అనేకులైన మనుష్యులు వ్యతిరేకిస్తారు అని అతడు {దేవుని నుండి} ఒక సూచనగా ఉంటాడు. 35 మీ విషయానికొస్తే, {మనుష్యులు ఆయనకు చేసే క్రూరమైన కార్యములు నిన్ను చాలా బాధపెడతాయి} అది మీ ఆత్మలో కత్తి గుచ్చుకున్నట్లు వలే అనిపిస్తుంది. {అయితే ఇది అవసరం} తద్వారా ఆయన అనేకమంది మనుష్యుల రహస్య ఆలోచనలను బయలుపరచగలడు.

36 అన్న అను పేరుగల ప్రవక్త్రి కూడా అక్కడ {ఆలయ ప్రాంగణంలో} ఉంది. ఆమె చాలా వృద్ధురాలు. ఆమె ఆషేరు యొక్క గోత్రానికి చెందిన ఫనూయేలు కుమార్తె. ఒక యువతిగా, ఆమెకు పెళ్లయి ఏడు సంవత్సరాలు అయింది{, మరియు ఆమె భర్త చనిపోయాడు}. 37 దాని తరువాత, ఆమె 84 ఎక్కువ సంవత్సరాలు ఒక వితంతువు వలే జీవించింది. ఆమె ఎల్లప్పుడూ దేవాలయంలో ఉంటూ, పగలు మరియు రాత్రి {అన్ని సమయాలలో} ఉపవాసం మరియు ప్రార్ధన చేత దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్టు వలే అనిపించింది. 38 అదే సమయంలో, అన్న {యోసేపు మరియు మరియ మరియు శిశువు} దగ్గరికి వచ్చింది. అన్న {శిశువు కోసం} దేవునికి కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించింది. దాని తరువాత, ఇశ్రాయేలు యొక్క మనుష్యులను విడిపించే మెస్సీయను {దేవుడు పంపడానికి} ఎదురుచూసే అనేక ఇతర మనుష్యులతో ఆమె యేసు గురించి మాట్లాడుతూనే ఉంది.

39 యోసేపు మరియు మరియలు {మొదటి కుమారుని తల్లిదండ్రుల కోసం} ప్రభువు యొక్క ధర్మశాస్త్రానికి అవసరమైనది అంతటినీ చెయ్యడం ముగించిన తరువాత, వారు గలిలయ యొక్క జిల్లాలోని తమ సొంత పట్టణమైన నజరేతుకు తిరిగి వచ్చారు. 40 శిశువు ఎగుగుతూ ఉన్నప్పుడు, ఆయన బలమైనవాడుగా మరియు చాలా జ్ఞానవంతుడుగా మారాడు, మరియు ఆయన జీవితంలో దేవుడు ఉన్నాడు.

41 ప్రతి సంవత్సరం యేసు తల్లిదండ్రులు పస్కా పండుగను జరుపుకోవడానికి యెరూషలేముకు ప్రయాణించేవారు. 42 కాబట్టి యేసుకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, {పస్కా} పండుగ కోసం వారు అందరూ కలిసి యెరూషలేముకు ప్రయాణం అయ్యారు. 43 పండుగ జరుపుకునే రోజులు ముగిసినప్పుడు, యేసు తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడం ప్రారంభించారు, అయితే వారి కుమారుడు, యేసు యెరూషలేములో వెనుక నిలిచిపోయాడు. అతని తల్లిదండ్రులకు {ఆయన ఇంకా అక్కడే ఉన్నాడని} తెలియదు. 44 ఆయన తమతో ప్రయాణిస్తున్న ఇతర మనుష్యులతో ఉన్నాడని వారు తలంచారు. అయితే ఒకరోజు నడిచిన తరువాత, వారు ఆయన కోసం వారి బంధువులు మరియు స్నేహితుల మధ్య వెదకడం ప్రారంభించారు. 45 వారు ఆయనను కనుగొనకపోయినప్పుడు వారు ఆయన కోసం వెదకడానికి యెరూషలేముకు తిరిగి వచ్చారు. 46 {మరియ మరియు యోసేపు యెరూషలేమును విడిచిపెట్టిన} మూడు రోజుల తరువాత, వారు దేవాలయం వద్ద యేసును కనుగొన్నారు. ఆయన యూదు మత బోధకుల మధ్య కూర్చున్నాడు. ఆయన వారు బోధించేది వింటూ ఉన్నాడు మరియు ఆయన వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. 47 ఆయన చెప్పినది వినిన మనుష్యులు అందరూ ఆయన అర్థం చేసుకున్నది మరియు ఆయన {బోధకులు అడిగిన ప్రశ్నలకు} ఎంత చక్కగా సమాధానమిచ్చాడో అని ఆశ్చర్యపోయారు. 48 ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసినప్పుడు, వారు చాలా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి ఆయనతో చెప్పింది, “నా కుమారుడా, నువ్వు మాకు ఇది చేయకూడదు. నా మాట విను! మేము మీ కోసం వెదకుతూ ఉన్నప్పుడు నీ తండ్రి మరియు నేను చాలా ఆందోళన చెందాము! 49 ఆయన వారితో చెప్పాడు, "మీరు నన్ను వెదకవలసిన అవసరం వచ్చినందుకు నేను ఆశ్చర్యపోయాను. నేను నా తండ్రి ఇంటి వద్ద {, ఆయన గురించి తెలుసుకోవడం} ఉండవలసిన అవసరం ఉందని మీరు యెరుగుదురు అని నేను తలంచాను." 50 అయితే ఆయన వారితో చెప్పిన దాని భావం వారికి అర్థం కాలేదు. 51 అప్పుడు ఆయన వారితో నజరేతుకు తిరిగి వచ్చాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ వారికి విధేయుడయ్యాడు. జరిగిన సంగతులు అన్నింటిని ఆయన తల్లి లోతుగా ఆలోచిస్తూ ఉంది.

52 సంవత్సరాలు గడుస్తూ ఉండగా, యేసు జ్ఞానవంతుడు కావడానికి కొనసాగాడు మరియు ఆయన పొడవుగా పెరిగాడు. దేవుడు మరియు మనుష్యులు ఆయనను ఎక్కువగా మరియు ఎక్కువగా ఆమోదించడం కొనసాగించారు.

Chapter 3

1 తిబెరియ కైసరు సుమారు పదిహేను సంవత్సరాలు {రోమా సామ్రాజ్యాన్ని} పరిపాలిస్తున్నప్పుడు {చరిత్రలో ఈ తదుపరి భాగం జరిగింది}. ఆ సమయంలో, పొంతు పిలాతు యూదయ దేశానికి అధిపతిగా ఉన్నాడు, హేరోదు అంతిప గలిలయ యొక్క జిల్లాను పరిపాలిస్తున్నాడు, అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరియ మరియు త్రకోనీతు యొక్క ప్రాంతాలను పరిపాలిస్తున్నాడు మరియు లుసానియ అబిలీను ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. 2 ప్రధాన యాజకులు {యెరూషలేము దేవాలయంలో} అన్న, కయఫా ఉన్నారు. ఆ సమయంలో, దేవుడు జెకర్యా కుమారుడైన యోహానుతో {అతను నిర్జన ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు} మాట్లాడాడు. 3 యోహాను యోర్దాను నదికి సమీపంలో ఉన్న ప్రాంతమంతా ప్రయాణించాడు. ఆయన {తనను వినడానికి వచ్చిన ప్రజలకు} ప్రకటిస్తూనే ఉన్నాడు, “దేవుడు మీ పాపాలను క్షమించాలని మీరు కోరుకున్న యెడల, మీరు తప్పుడు జీవన విధానాలను తిరస్కరించాలి. అప్పుడు నేను మీకు బాప్తిస్మం ఇస్తాను!” 4 {యోహాను ఈ విధంగా బోధించినప్పుడు}, చాలా కాలం క్రితం యెషయా ప్రవక్త ఒక గ్రంథపు చుట్టమీద వ్రాసిన మాటలు నిజమయ్యాయి:

     “నిర్జనమైన ప్రదేశంలో, ఒకరు {మనుష్యులను} పిలుస్తున్నాడు:

     'ప్రభువును స్వీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి!

     ఆయన రావడం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి!'

     5 {ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఒక నిర్దిష్ట రహదారి చేత రావడానికి వెళ్తూ ఉన్నప్పుడు, } మనుష్యులు లోయలు అన్నిటినీ నింపుతారు మరియు దానిలోని నిటారుగా ఉన్న ప్రదేశాలన్నింటినీ చదును చేస్తారు.

     రోడ్డు వంకరగా ఉన్న ప్రతిచోటా వారు నేరుగా చేస్తారు,

     మరియు వారు అన్ని గుట్టలను నున్నవిగా చేస్తారు. {అదే విధంగా, మెస్సీయ కోసం సిద్ధంగా ఉన్న మనుష్యులు అలా ఉండేలా దేవుడు చేస్తాడు.}

     6 అప్పుడు మనుష్యులను రక్షించే దేవుని మార్గాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు.

7 మనుష్యుల యొక్క పెద్ద గుంపులు బయటికి వస్తున్నారు {యోహాను ఉన్న నిర్జన ప్రదేశానికి} తద్వారా అతడు వారికి బాప్తిస్మం ఇస్తున్నాడు. కాబట్టి యోహాను వారితో చెప్పాడు, “మీరు మనుష్యులు విషపూరితమైన పాముల వలె నీచులు మరియు ప్రమాదకరమైనవారు! నేను నీకు బాప్తిస్మం ఇచ్చిన యెడల దేవుడు పాపులను శిక్షించినప్పుడు మిమ్ములను తప్పిస్తాడని మీరు తలస్తున్నారు. {అయితే నేను అది చెప్పలేదు!} 8 మీరు మీ మునుపటి పాపపు జీవన విధానాన్ని నిజంగా తిరస్కరించారని చూపించే పనులు చెయ్యవలసిన అవసరం ఉంది! మరియు {ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని శిక్షించడు, ఎందుకంటే}మేము అబ్రహాము యొక్క సంతానం, అని మీకు మీరు చెప్పడానికి కూడా ఆరంభించవద్దు. {అది దేవుణ్ణి మెప్పించదు.} దేవుడు ఈ రాళ్లను అబ్రాహాము వారసులుగా మార్చగలడని నేను మీకు నిశ్చయత ఇస్తున్నాను. 9 మంచి ఫలాలు ఇవ్వని పండ్ల చెట్ల వలే మీరు ఉన్నారు. తన గొడ్డలి యొక్క తలను ఆ చెట్ల అడుగున ఉంచుచూ, వాటిని కిందకు నరికి మరియు వాటిని అగ్నిలో త్రోసివేయడానికి సిద్ధంగా ఉన్న మనిషి వలే దేవుడు ఉన్నాడు. మీరు పాపం చెయ్యడం కొనసాగిస్తూ ఉన్న యెడల దేవుడు మిమ్మల్ని ఆ విధంగా శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. 10 అప్పుడు గుంపులోని {మనుష్యులలలో అనేకమంది} ఆయనను అడిగారు, “అప్పుడు మేము ఎలాంటి పనులు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడా?” 11 అతడు వారికి జవాబిచ్చాడు, “మీలో ఎవరికైనా రెండు చొక్కాలు ఉన్న యెడల, వాటిలో ఒకదానిని ఒక చొక్కా లేని వారికి మీరు ఇవ్వాలి. మీలో ఎవరికైనా సమృద్ధియైన ఆహారం ఉన్న యెడల, ఆహారం లేని వారికి మీరు కొంత ఇవ్వాలి.” 12 యోహాను తమకు బాప్తిస్మమివ్వాలని కోరుతూ కొందరు పన్ను వసూలు చేసేవారు కూడా వచ్చారు. వారు అతనిని అడిగారు, “బోధకుడా, ఏమి చేయాలని {దేవుడు మమ్ములు కోరుతున్నాడు}? 13 అతడు వారితో చెప్పాడు, “రోమా ప్రభుత్వం మీరు వసూలు చేయమని చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బు {మనుష్యుల నుండి} వసూలు చేయకండి!” 14 అక్కడ కొంతమంది సైనికులుగా ఉన్నపురుషులు కూడా ఉన్నారు. వారు కూడా అతనిని అడిగారు, “మరియు మా గురించి ఏమిటి? మేము ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు?" అతడు వారితో చెప్పాడు, “మనుష్యులకు హాని చెయ్యడానికి బెదిరించడం చేత లేదా వారిమీద తప్పుడు ఆరోపణలు చేయడం చేత {తప్పు పని చెయ్యడం గురించి} మీకు డబ్బు ఇవ్వడానికి మనుష్యులను బలవంతం చేయవద్దు. ఒక సైనికుడిగా మీరు సంపాదించిన డబ్బుతో సంతృప్తిగా ఉండండి. 15 {మెస్సీయ రావడానికి కోసం చాలా కాలంగా} మనుష్యులు ఎదురు చూస్తున్నారు. {అయితే ఇప్పుడు వారు యోహాను గురించి చాలా ఆశాభావంతో ఉన్నారు}. అతడే మెస్సీయ కావచ్చు అని వారు భావించారు. 16 అయితే యోహాను వారందరితో చెప్పాడు, “{నేను మెస్సీయను కాను.} ఆయన వస్తున్నాడు, మరియు ఆయన నాకంటే చాలా గొప్పవాడు. ఆయన చాలా గొప్పవాడు, ఆయన చెప్పుల యొక్క పట్టీలను {ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు} విప్పే బానిస వలే ఉండడానికి కూడా నేను అర్హుడిని కాదు! నేను నీకు బాప్తిస్మమిచ్చినప్పుడు నేను నీళ్ళు మాత్రమే వినియోగించాను. అయితే {మెస్సీయ వచ్చినప్పుడు,} ఆయన మీకు పరిశుద్ధ ఆత్మతో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన మిమ్ములను తీర్పు తీరుస్తాడు మరియు శుద్ధి చేస్తాడు. 17 ఒక రైతు {వలే మెస్సీయ దీనిని చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు}, తూర్పార పట్టే ఆయన చేట వినియోగించడానికి సిద్ధంగా ఆయన కలిగియున్నాడు. ఒక రైతు మంచి ధాన్యాన్ని అంతటిని పనికిరాని పొట్టు నుండి వేరు చేస్తాడు. అతడు ధాన్యాన్ని తన గాదెలో భద్రంగా నిలువఉంచుతాడు, అయితే అతడు పొట్టు మొత్తం పోయే వరకు దానిని కాల్చుతాడు. {దేవునికి ఇష్టమైన మనుష్యులను మెస్సీయ ఏవిధంగా సమీకరిస్తాడో మరియు దేవునికి అసహ్యకరమైన మనుష్యులను శిక్షిస్తాడో అది సూచిస్తుంది.}” 18 ఈ విధంగా అనేక రకాలుగా, యోహాను {దేవుని నుండి} సువార్తను వారికి చెపుతూ ఉండగా, మనుష్యులు {పాపం చెయ్యడం ఆపడానికి మరియు దేవునికి తమ్మునుతాము లోబరుచుకొడానికి} ప్రాధేయపడ్డాడు. 19 హేరోదు చేసిన అనేకమైన దుష్ట క్రియలు అన్నిటి కోసం రాజు హేరోదును సహితం యోహాను గద్దించాడు. అయితే హేరోదు తన సోదరుడు ఇంకా జీవించి ఉండగానే తన సోదరుని భార్య హెరోదియను పెళ్లాడినందుకు హేరోదును యోహాను గద్దించినప్పుడు, 20 హేరోదు మరో దుష్ట కార్యం చేశాడు. అతడు తన సైనికులు యోహానును చెరసాలలో వేసేలా చేసాడు. 21 అయితే హేరోదు అది చెయ్యడానికి ముందు, యోహాను ఇంకా అనేక మంది మనుష్యులకు బాప్తిస్మం ఇస్తూ ఉండగా, యోహాను యేసుకు కూడా బాప్తిస్మం ఇచ్చాడు. దాని తరువాత, యేసు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆకాశం తెరుచుకుంది. 22 అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఒక పావురం యొక్క రూపంలో దిగి వచ్చి యేసు మీదికి వచ్చాడు. అప్పుడు దేవుడు పరలోకం నుండి {యేసుతో} మాట్లాడాడు. ఆయన చెప్పాడు, “నువ్వు నా కుమారుడవు, నేను ఎంతో ప్రేమించుచున్నాను. నేను మీతో చాలా సంతోషంగా ఉన్నాను! ” 23 ఆ సమయంలో యేసు దేవుని కోసం తన పనిని ప్రారంభించాడు. ఆయనకు దాదాపు 30 సంవత్సరాలు. ఇది యేసు వంశం: మనుష్యులు యేసును యోసేపు యొక్క కుమారునిగా భావించారు. యోసేపు హేలీ యొక్క కుమారుడు. 24 హేలీ మత్తతు యొక్క కుమారుడు. మత్తతు లేవీ యొక్కకుమారుడు. లేవీ మెల్కీ యొక్క కుమారుడు. మెల్కీ యన్నయొక్క కుమారుడు, యన్న యోసేపు యొక్క కుమారుడు 25 యోసేపు మత్తతీయ యొక్క కుమారుడు, మత్తతీయ ఆమోసు యొక్క కుమారుడు, ఆమోసు నాహోము యొక్క కుమారుడు, నాహోము ఎస్లి యొక్క కుమారుడు, ఎస్లి నగ్గయి యొక్క కుమారుడు. 26 నగ్గయి మయతు యొక్క కుమారుడు, మయతు మత్తతీయ యొక్క కుమారుడు, మత్తతీయ సిమియ యొక్క కుమారుడు, సిమియ యోశేఖు యొక్క కుమారుడు, యోశేఖు యోదా యొక్క కుమారుడు. 27 యోదా యోహన్న యొక్క కుమారుడు, యోహన్న రేసా యొక్క కుమారుడు, రేసా జెరుబ్బాబెలు యొక్క కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు యొక్క కుమారుడు, షయల్తీయేలు నేరి యొక్క కుమారుడు. 28 నేరి మెల్కీ యొక్క కుమారుడు, మెల్కీ అద్ది యొక్క కుమారుడు, అద్ది కోసాము యొక్క కుమారుడు, కోసాము యొక్క ఎల్మదాము కుమారుడు, ఎల్మదాము ఏరు యొక్క కుమారుడు. 29 ఏరు యెహోషువ యొక్క కుమారుడు, యెహోషువ ఎలీయెజెరు యొక్క కుమారుడు, ఎలీయెజెరు యోరీము యొక్క కుమారుడు, యోరీము మత్తతు యొక్క కుమారుడు, మత్తతు లేవి యొక్క కుమారుడు.

30 లేవీ షిమ్యోను యొక్క కుమారుడు. సిమియోను యూదా యొక్క కుమారుడు. యూదా యోసేపు యొక్క కుమారుడు. యోసేపు యోనాము యొక్క కుమారుడు. యోనాము ఎల్యాకీము యొక్క కుమారుడు. 31 ఎల్యాకీము మెలెయా యొక్క కుమారుడు. మెలెయా మెన్నా యొక్క కుమారుడు. మెన్నా మత్తత యొక్క కుమారుడు. మత్తతా నాతాను యొక్క కుమారుడు. నాతాను దావీదు యొక్క కుమారుడు. 32 దావీదు యెష్షయి యొక్క కుమారుడు. దావీదు యెష్షయి యొక్క కుమారుడు, యెష్షయి ఓబేదు యొక్క కుమారుడు, ఓబేదు బోయజు యొక్క కుమారుడు, బోయజు శల్మాను యొక్క కుమారుడు, శల్మాను నయస్సోను యొక్క కుమారుడు.

33 నయస్సోను అమ్మీనాదాబు యొక్క కుమారుడు, అమ్మీనాదాబు అరాము యొక్క కుమారుడు, అరాము ఎస్రోము యొక్క కుమారుడు, ఎస్రోము పెరెసు యొక్క కుమారుడు, పెరెసు యూదా యొక్క కుమారుడు.

34 యూదా యాకోబు యొక్క కుమారుడు, యాకోబు ఇస్సాకు యొక్క కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము యొక్క కుమారుడు, అబ్రాహాము తెరహు యొక్క కుమారుడు, తెరహు నాహోరు యొక్క కుమారుడు.

35 నాహోరు సెరూగు యొక్క కుమారుడు, సెరూగు రయూ యొక్క కుమారుడు, రయూ పెలెగు యొక్క కుమారుడు, పెలెగు హెబెరు యొక్క కుమారుడు, హెబెరు షేలహు యొక్క కుమారుడు.

36 షేలహు కేయినాను యొక్క కుమారుడు, కేయినాను అర్పక్షదు యొక్క కుమారుడు, అర్పక్షదు షేము యొక్క కుమారుడు, షేము నోవహు యొక్క కుమారుడు, నోవహు లెమెకు యొక్క కుమారుడు.

37 లెమెకు మెతూషెల యొక్క కుమారుడు, మెతూషెల హనోకు యొక్క కుమారుడు, హనోకు యెరెదు యొక్క కుమారుడు, యెరెదు మహలలేలు యొక్క కుమారుడు, మహలలేలు కేయినాను యొక్క కుమారుడు.

38 కేయినాను ఎనోషు యొక్క కుమారుడు, ఎనోషు షేతు యొక్క కుమారుడు, షేతు ఆదాము యొక్క కుమారుడు, ఆదాము దేవుని నుండి వచ్చాడు.

Chapter 4

1 యోహాను ఆయనకు బాప్తిస్మం ఇచ్చిన తరువాత, యేసు యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. పరిశుద్ధ ఆత్మ ఆయనను సంపూర్ణంగా శక్తితో నింపాడు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయనను అరణ్యంలోనికి నడిపించాడు. 2 యేసు 40 రోజులు అరణ్యంలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉండగా, సాతాను ఆయనను శోధిస్తూ ఉన్నాడు. ఆ సమయం అంతటిలో, యేసు ఏమీ తినలేదు. కాబట్టి 40 రోజులు పూర్తి అయినప్పుడు, ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు. 3 అప్పుడు సాతాను యేసుతో చెప్పాడు, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివైన యెడల, ఈ రాయిని {నువ్వు తినడం కోసం} ఒక రొట్టెగా మారడానికి ఆజ్ఞాపించు!” 4 యేసు జవాబిచ్చాడు, “{లేదు, నేను అది చెయ్యను, ఎందుకంటే} లేఖనాలు చెపుతున్నాయి, ‘మనుష్యులకు జీవించడానికి కేవలం ఆహారం కంటే ఎక్కువ అవసరం. 5 అప్పుడు సాతాను యేసును {ఒక ఎత్తైన పర్వత శిఖరానికి} తీసుకొని వెళ్ళాడు మరియు లోకం యొక్క అన్ని దేశాలను ఒకేసారి ఆయనకు చూపించాడు. 6 అప్పుడు సాతాను యేసుతో చెప్పాడు, “నేను నిన్ను ఈ దేశాలు అన్నిటి మీద పాలకునిగా చేస్తాను మరియు వారి యొక్క సంపద అంతా నువ్వు స్వాధీనం చేసుకుంటావు. వాటినన్నిటినీ నియంత్రించడానికి దేవుడు నన్ను అనుమతించాడు, మరియు కాబట్టి నేను వాటిని నేను కోరుకున్న వారికెవరికైనా ఇవ్వగలను. 7 నువ్వు చేయవలసినది అంతా కిందకు వంగాలి మరియు నన్ను ఆరాధించాలి. అప్పుడు వాటిని అన్నిటినీ పాలించడానికి నేను నిన్ను విడిచిపెడతాను." 8 అయితే యేసు జవాబిచ్చాడు, “{లేదు, నేను నిన్ను ఆరాధించను, ఎందుకంటే} లేఖనాలు చెపుతున్నాయి, ‘నీ దేవుడైన ప్రభువును మాత్రమే నీవు ఆరాధించాలి. నీవు సేవించగల ఒకే ఒక వ్యక్తి ఆయనే!’’

9 అప్పుడు సాతాను యేసును యెరూషలేముకు తీసుకొనివెళ్ళాడు. అతడు ఆయనను దేవాలయం యొక్క ఎత్తైన భాగం మీద ఏర్పాటు చేసాడు మరియు ఆయనతో చెప్పాడు, “నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడివైన యెడల, ఇక్కడ నుండి క్రిందికి దూకు. 10 నువ్వు గాయపడవు, ఎందుకంటే లేఖనాలు చెపుతున్నాయి,

     'నిన్ను రక్షించడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించును.' 11 మరియు లేఖనాలు కూడా ఇలా చెపుతున్నాయి,

     'నువ్వు పడుతున్నప్పుడు దేవదూతలు తమ చేతులలో నిన్ను పట్టుకుంటారు. తద్వారా నువ్వు గాయపడవు. 12 అయితే యేసు జవాబిచ్చాడు, “{లేదు, నేను దానిని చెయ్యను, ఎందుకంటే} లేఖనాలు కూడా చెపుతున్నాయి: ‘నీ దేవుడు ప్రభువును శోధించవద్దు.’"

13 అప్పుడు, సాతాను యేసును ఈ మార్గాలు అన్నిటిలో శోధించడానికి ప్రయత్నించడం ముగించిన తరువాత, సాతాను యేసును మరొక సమయం వరకు {అతడు యేసును తిరిగి శోధించడానికి ప్రయత్నించే వరకు} వేచి ఉండడానికి విడిచిపెట్టాడు.

14 దీని తరువాత, యేసు {నిర్జన ప్రాంతాన్ని విడిచిపెట్టాడు మరియు} గలిలయ జిల్లాకు తిరిగి వచ్చాడు. పరిశుద్ధ ఆత్మ ఆయనను శక్తితో నింపాడు. ఆ పూర్తి ప్రాంతం అంతటి ద్వారా, మనుష్యులు యేసును గురించి విన్నారు మరియు ఆయన గురించి ఇతరులకు చెప్పారు. 15 ఆయన వారి యూదుల సమావేశ స్థలాలలో మనుష్యులకు బోధించాడు. {ఫలితంగా,} మనుష్యులు అందరూ ఆయనను స్తుతించారు.

16 అప్పుడు యేసు తాను పెరిగిన నజరేతు పట్టణానికి వెళ్లాడు. ఆయన సాధారణంగా యూదుల విశ్రాంతి యొక్క రోజున చేసిన విధంగా, ఆయన యూదుల సమావేశ స్థలానికి వెళ్లాడు. {సముచితమైన సమయంలో,} ఆయన {లేఖనాల నుండి బిగ్గరగా ఏదైనా} చదవడానికి లేచి నిలబడ్డాడు. 17 {యేసు కొన్ని మాటలను చదవడానికి కోరుకున్నాడు, అవి} ప్రవక్త యెషయా {చాలా కాలం క్రితం పలికాడు. కాబట్టి ఆయన} ఈ మాటలను కలిగియున్న గ్రంథపు చుట్ట కోసం అడిగాడు. మరియు ఒక సమాజ మందిర పరిచారకుడు దానిని ఆయనకు అందించాడు. యేసు గ్రంథపు చుట్టను విప్పాడు మరియు ఆయన చదవాలని కోరుకున్న చోటును కనుగొన్నాడు. {ఆయన ఈ పదాలను చదివాడు:}

     18 “ప్రభువు యొక్క ఆత్మ నన్ను శక్తితో నింపుతున్నాడు,

     ఎందుకంటే పేదవారిగా ఉన్న మనుష్యులకు దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను ప్రత్యేకంగా నియమించాడు.

     చెరసాలలో ఉన్న మనుష్యులకు వారు విడుదల చేయబడతారని ప్రకటించడానికి,

     మరియు గుడ్డి వారుగా ఉన్నవారు తిరిగి వారు చూస్తారని చెప్పడానికి ఆయన నన్ను పంపాడు.

     ఇతరులు అణచివేసే మనుష్యులను విడుదల చేయడానికి ఆయన నన్ను పంపాడు,

     19 మరియు ప్రభువు మనుష్యుల పట్ల అనుకూలంగా జరిగించు సమయం ఇప్పుడే అని ప్రకటించడానికి నన్ను పంపాడు.

20 అప్పుడు ఆయన గ్రంథపు చుట్టను చుట్టాడు మరియు పరిచారకుడికి దానిని తిరిగి ఇచ్చాడు, మరియు ఆయన {మనుష్యులకు బోధించడానికి} క్రింద కూర్చున్నాడు. యూదుల సమావేశ స్థలంలో ప్రతి ఒక్కరూ ఆయన వైపు తీక్షణంగా చూస్తున్నారు. 21 “నేను దీనిని చదవడం మీరు వినిన విధముగా నేను ఈ లేఖన భాగాన్ని ఇప్పుడే నిజం అయ్యేలా చేసాను" అని చెప్పడం చేత ఆయన వారికి బోధించడానికి ఆరంభించాడు, 22 అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను అంగీకరించారు మరియు ఆయన చెప్పిన అద్భుతమైన మాటలకు వారు ఆశ్చర్యపోయారు. వారిలో అనేకమంది ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, “{ఆయన ఈ విధంగా మాట్లాడగలగడం ఇది ఆశ్చర్యంగా ఉంది!} ఈ మనిషి యోసేపు కుమారుడు మాత్రమే!” 23 ఆయన వారితో చెప్పాడు, “‘వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకో!’ అని చెపుతున్న సామెతను మీలో కొందరు ఖచ్చితంగా నాకు ఉటంకిస్తారు. {దీని చేత మీరు చెప్పేది ఏమిటి, 'మనుష్యులు మాకు చెప్పారు} నీవు కపెర్నహూము పట్టణంలో అద్భుతాలు చేసావు. {నీవు ప్రవక్త అని మేము నమ్మాలని మీరు కోరుకున్న యెడల, అప్పుడు} మీ సొంత పట్టణంలో ఇక్కడ అలాంటి అద్భుతాలు చెయ్యి!’’ 24 అప్పుడు ఆయన చెప్పాడు, “ప్రవక్త స్వస్థలంలోని మనుష్యులు ఆయన ఒక ప్రవక్త అని అంగీకరించరు అనేది ఖచ్చితంగా నిజం. 25 దీని గురించి ఆలోచించండి: ఏలీయా ప్రవక్త జీవించిన కాలంలో ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. ఆ సమయంలో మూడు మరియు అర సంవత్సరాల వరకు అక్కడ వర్షం లేదు, ఇది దేశం అంతా ఒక గొప్ప కరువుని కలిగించింది. 26 మరియు అయినా ఇశ్రాయేలులోని విధవరాండ్రలలో ఎవరికీ సహాయం చేయడానికి దేవుడు ఏలీయాను పంపలేదు. బదులుగా, దేవుడు అతనిని సీదోను యొక్క నగరానికి సమీపంలో సారెపతు యొక్క పట్టణానికి అక్కడ ఒక {ఇశ్రాయేలీయేతర} విధవరాలికి సహాయం చేయడానికి పంపాడు. 27 ఎలీషా ప్రవక్త జీవించిన కాలంలో కూడా ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠురోగులు ఉండేవారు. అయితే ఎలీషా వారిలో ఎవరినీ స్వస్థపరచలేదు. బదులుగా, అతడు సిరియా యొక్క దేశం నుండి {ఒక ఇశ్రాయేలీయుడేతరుడైన} నయమానును మాత్రమే స్వస్థపరిచాడు. 28 యూదుల సమావేశ స్థలంలో ఉన్న మనుష్యులు అందరూ ఆయన ఆ మాటలు చెప్పడం విన్నారు, అప్పుడు వారు చాలా కోపంగా మారారు. 29 కాబట్టి వారు పైకి లేచి నిలువబడ్డారు. యేసును పట్టుకున్నారు, మరియు నగరం యొక్క వెలుపలికి ఈడ్చుకెళ్లారు. వారు ఆయనను కొండ మీద నుండి త్రోసి చంపడానికి వారు ఆయనను తమ నగరం వెలుపల ఉన్న కొండ అంచుకు తీసుకెళ్లారు. 30 అయితే యేసు జన సమూహం నుండి నడిచాడు మరియు వెళ్ళిపోయాడు.

31 యేసు అక్కడి నుండి గలిలయ జిల్లాలోని కపెర్నహూము అనే ఒక నగరానికి కిందకు వెళ్లాడు. ప్రతి యూదుల విశ్రాంతి యొక్క రోజున, ఆయన మనుష్యులకు {అక్కడ యూదుల సమావేశ స్థలంలో} బోధించాడు. 32 యేసు మనుష్యులకు బోధించిన విషయాలు వారిని ఆశ్చర్యపరిచాయి, ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నదానిని యెరిగిన వ్యక్తి వలే మాట్లాడాడు. 33 ఇప్పుడు ఆ యూదుల సమావేశ స్థలంలో దుష్ట ఆత్మ అదుపులో ఉన్న ఒక మనిషి ఉన్నాడు. అతడు చాలా బిగ్గరగా అరిచాడు, 34 “అయ్యా! నజరేతు నుండి యేసూ! మాతో మీకు ఏమి కావాలి? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవరో నాకు తెలుసు! నీవు దేవుని నుండి పరిశుద్ధుడవు!” 35 అయితే యేసు దుష్ట ఆత్మతో కఠినంగా మాట్లాడాడు. అతను చెప్పాడు, "నిశ్శబ్దంగా ఉండు మరియు అతని నుండి బయటకు రమ్ము!" దుష్ట ఆత్మ ఆ మనిషిని మనుష్యుల యొక్క మధ్యలో నేలమీదకు త్రోసివేసింది. అయితే అప్పుడు అతడు అతనికి హాని చేయకుండా, ఆ మనిషి నుండి బయటకు వచ్చాడు. 36 {యూదుల సమావేశ స్థలంలో ఉన్న} మనుష్యులు అందరు ఆశ్చర్యపోయారు. వారిలో అనేక మంది ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు, "మనం దీని వలే దేనినీ ఎన్నడూ చూడ లేదు! ఆయన మాటలు చాలా శక్తివంతమైనవి! దుష్ట ఆత్మలు ఆయనకు విధేయత చూపాలి అన్నట్టుగా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, మరియు {ఆయన వారికి ఆజ్ఞాపించినప్పుడు,} అవి {మనుష్యుల నుండి} బయటకు వస్తున్నాయి! 37 చుట్టుపక్కల ప్రదేశం ప్రతి స్థలం అంతటిలో, మనుష్యులు యేసు చేసిన దానిని గురించి మాట్లాడుతూ ఉన్నారు.

38 అప్పుడు యేసు యూదుల సమావేశ స్థలం విడిచిపెట్టాడు మరియు సీమోను అనే పేరు గల మనిషి యొక్క ఇంటికి వెళ్లాడు. అతని అత్త అక్కడ ఉంది. ఆమె అనారోగ్యంతో ఉంది మరియు తీవ్ర జ్వరంతో ఉంది. అక్కడి మనుష్యులు ఆమెను స్వస్థపరచమని యేసును అడిగారు. 39 కాబట్టి యేసు ఆమె ఉన్న చోటికి వెళ్ళాడు మరియు ఆమె పక్కన నిలబడ్డాడు. జ్వరము ఆమెను విడిచిపెట్టడానికి ఆయన ఆజ్ఞాపించాడు మరియు అది జరిగింది! ఆమె వెంటనే పైకి లేచింది మరియు వారికి కొంత భోజనం వడ్డించింది.

40 సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు{, ఇది యూదుల విశ్రాంతి యొక్క దినం ముగిసింది}, అనేక మంది మనుష్యుల స్నేహితులు లేదా బంధువులు వివిధ వ్యాధులతో అనారోగ్యంతో ఉన్నవారిని యేసు వద్దకు తీసుకువచ్చారు. ఆయన ఒక్కొక్కరి మీద చేతులు ఉంచాడు మరియు వారిని స్వస్థపరిచాడు. 41 {రోగుల మీద యేసు తన చేతులు ఉంచి ఉండగా} వారిలో అనేక దుష్ట ఆత్మలు కూడా బయటికి వచ్చాయి. {దుష్ట ఆత్మలు బయటికి వచ్చు చుండగా,} అవి అరిచాయి {యేసుతో}, “నువ్వు దేవుని యొక్క కుమారుడివి!” అయితే ఆ దుష్ట ఆత్మలు తన గురించి మనుష్యులకు చెప్పవద్దని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే అతను మెస్సీయ అని వారికి తెలుసు.

42 మరుసటి రోజు తెల్లవారుజామున, యేసు ఒక నిర్జన ప్రదేశానికి బయటికి వెళ్లాడు. మనుష్యుల యొక్క సమూహాలు ఆయన కోసం వెదకుతూ వెళ్లారు. వారు ఆయన ఉన్న చోటికి వచ్చినప్పుడు, వారు అతనిని విడిచిపెట్టకుండా నిరోధించడానికి ప్రయత్నించారు. 43 అయితే యేసు వారితో చెప్పాడు, “ఇతర నగరాలలోని మనుష్యులకు కూడా దేవుడు తమ జీవితాలను పరిపాలించగలడనే శుభవార్తను నేను చెప్పాలి, ఎందుకంటే చెయ్యడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు. 44 కాబట్టి ఆయన యూదయ ప్రాంతం అంతటా యూదుల సమావేశ స్థలాలలో ప్రకటిస్తూ వెళ్ళాడు.

Chapter 5

1 ఒకరోజు అనేకమంది మనుష్యులు యేసు చుట్టూ గుమికూడి మరియు ఆయన దేవుని సందేశం బోధించడం వింటూ ఉండగా, ఆయన గెన్నెసరెతు సరస్సు పక్కన నిలబడి ఉన్నాడు. 2 అక్కడ సరస్సు యొక్క అంచున రెండు చేపలు పట్టే పడవలు ఆయన చూసాడు. జాలరులు పడవలను విడిచిపెట్టారు మరియు తమ చేపల వలలను శుభ్రపరుస్తున్నారు. 3 ఆ రెండు పడవలలో ఒకదానిలోనికి అడుగు పెట్టాడు, అది సీమోనుకు చెందినది. పడవను ఒడ్డునుండి కొంచెం దూరం కదిలించమని యేసు అతనిని అడిగాడు. అప్పుడు యేసు పడవలో కూర్చున్నాడు మరియు అక్కడ నుండి జనసమూహానికి బోధించడం కొనసాగించాడు.

4 ఆయన వారికి బోధించడం ముగించిన తరువాత, ఆయన సీమోనుతో చెప్పాడు, “పడవను లోతైన నీటికి తీసుకొని వెళ్ళు మరియు కొన్ని చేపలను పట్టుకోవడానికి నీ వలలను నీటిలోకి వెయ్యండి.” 5 సీమోను జవాబిచ్చాడు, “బోధకుడా, మేము రాత్రి అంతా కష్టపడి పని చేసాము మరియు అయినా మేము ఎటువంటి చేపలు పట్టలేదు. అయితే నేను మరలను వలలను కిందకు దించుతాను ఎందుకంటే నువ్వు నాకు చెప్పావు." 6 కాబట్టి సీమోను మరియు అతని సిబ్బంది తమ వలలను వేశారు మరియు వారు చాలా పెద్ద సంఖ్యలో చేపలను పట్టుకున్నారు, వారి వలలు పిగిలి పోవడం ఆరంభం అయ్యాయి. 7 వారు ఇతర పడవలో చేపలు పట్టడంలో తమ సహచరులు వచ్చి తమకు సహాయం చేయమని వారు సైగ చేశారు. కాబట్టి వారు వచ్చారు మరియు వచ్చి రెండు పడవలను చేపలతో నిండుగా నింపారు, పడవలు మునిగిపోవడానికి ఆరంభం అయ్యాయి.

8 దీనిని చూసి సీమోను పేతురు యేసు ముందు కిందకు వంగాడు మరియు చెప్పాడు, "దయచేసి నన్ను విడిచిపెట్టుము, ఎందుకంటే నేను పాపాత్ముడైన మనిషిని, ప్రభువా." 9 {అతడు ఇది చెప్పాడు} ఎందుకంటే వారు పట్టిన పెద్ద సంఖ్యలో చేపలను చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. అతనితో ఉన్న పురుషులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. 10 సీమోను సహచరులైన జెబెదయి యొక్క ఇద్దరు కుమారులు యాకోబు, యోహానులు అంతే ఆశ్చర్యపోయారు. అయితే యేసు సీమోనుతో, చెప్పాడు, “భయపడకు! {ఇప్పటి వరకు మీరు చేపలను పట్టావు, అయితే} ఇక నుండి నా శిష్యులు కావడానికి నువ్వు మనుష్యులను పట్టుకొంటావు. 11 కాబట్టి ఆ పురుషులు పడవలను ఒడ్డుకు తీసుకొని వచ్చిన తరువాత, చేపలు పట్టే తమ వ్యాపారాన్ని మరియు మిగిలి వాటిని అన్నిటినీ విడిచి పెట్టారు మరియు యేసుతో వెళ్లారు.

12 యేసు సమీపంలోని ఒక పట్టణానికి వెళ్లాడు. అక్కడ చర్మవ్యాధితో నింపబడిన ఒక మనిషి ఉన్నాడు. అతడు యేసును చూసినప్పుడు, అతడు ఆయన ముందు నేలకు వంగిపోయాడు. అతడు ఆయనను వేడుకున్నాడు, “ప్రభువా, {దయచేసి నన్ను స్వస్థపరచు!} నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవని నాకు తెలుసు!” 13 అప్పుడు యేసు తన చెయ్యి చాచాడు మరియు ఆ మనిషిని తాకాడు. ఆయన చెప్పాడు, "నిన్ను స్వస్థపరచడానికి నేను ఇష్టపడుతున్నాను మరియు ఇప్పడు నిన్ను నేను స్వస్థపరుస్తున్నాను!" వెంటనే ఆ మనిషి స్వస్థత పొందాడు. అతనికి ఇక మీదట కుష్టువ్యాధి లేదు! 14 అప్పుడు యేసు అతనితో చెప్పాడు, “నేను నిన్ను స్వస్థపరిచాను అని ఎవరికీ చెప్పవద్దు. మొదట, వెళ్ళు మరియు నిన్ను నీవు ఒక యాజకుడికి చూపించు తద్వారా అతడు నిన్ను పరీక్షించగలడు మరియు నీకు ఇక కుష్టు వ్యాధి లేకుండా చూస్తాడు. ఆచారబద్ధంగా తిరిగి శుద్ధి కావడానికి అర్పణ చెల్లించడానికి మోషే మీకు ఆజ్ఞాపించిన బలిని తీసుకురండి.

15 అయితే బదులుగా ఇంకా ఎక్కువ మంది మనుష్యులు {యేసు ఆ మనిషిని ఏవిధంగా స్వస్థపరిచాడనే దాని గురించి} విన్నారు. దాని ఫలితంగా, {యేసు బోధించడం} వినడానికి మరియు వారి రోగాల నుండి ఆయన చేత స్వస్థత పొందడానికి పెద్ద గుంపులు వచ్చారు. 16 అయితే ఆయన తరచుగా వారి నుండి దూరంగా ఏకాంత ప్రాంతాలకు వెళ్ళేవాడు మరియు ప్రార్థన చేసేవాడు.

17 ఒక రోజు యేసు బోధిస్తున్నప్పుడు, పరిసయ్యల వర్గానికి చెందిన కొందరు పురుషులు మరియు యూదా ధర్మశాస్త్రము యొక్క నిపుణులైన బోధకులు కొందరు సమీపంలో కూర్చున్నారు. వారు గలిలయ జిల్లాలోని అనేక గ్రామాల నుండి మరియు యెరూషలేము మరియు యూదయ ప్రాంతంలోని ఇతర నగరాల నుండి కూడా వచ్చారు. అదే సమయంలో, ప్రభువు యేసుకు మనుష్యులను స్వస్థపరచడానికి శక్తిని ఇస్తూ ఉన్నాడు. 18 యేసు అక్కడ ఉండగా, అనేక మంది పురుషులు మనుష్యులు పక్షవాతంతో ఉన్న ఒక మనిషిని పండుకొనే పరుపు మీద {వారు ఆ మనిషిని మోసుకొంటూ}ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు మరియు యేసు ముందు అతనిని పడుకోబెట్టడానికి అతనిని ఇంటిలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 19 అయితే ఇంటిలో అటువంటి మనుష్యుల పెద్ద గుంపు ఒకటి అక్కడ ఉండడం కారణంగా, వారు అతనిని లోపలికి తీసుకురాలేకపోయారు. కాబట్టి వారు {వెలుపలి మెట్లు} మీదుగా చదునైన పై కప్పు మీదకు వెళ్ళారు. {ఒక ప్రవేశాన్ని చెయ్యడానికి వారు పైకప్పు నుండి కొన్ని పెంకులను తొలగించారు.} తరువాత వారు తన పండుకొనే పరుపు మీద ఉన్న మనిషిని ప్రవేశం ద్వారా {సమూహం యొక్క} మధ్యలోనికి కిందకు దించారు. అతడు సరిగ్గా యేసు ముందుకు కిందికి వచ్చాడు.

20 తాను ఆ మనిషిని స్వస్థపరచగలనని వారు విశ్వసిస్తున్నారని యేసు గ్రహించినప్పుడు, ఆయన అతనితో చెప్పాడు, “స్నేహితుడా, నేను నీ పాపములను క్షమించుచున్నాను!” 21 ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు తమలో తాము ఆలోచించడం మొదలుపెట్టారు: “ఈ మనిషి అది మాట్లాడడం చేత దేవుణ్ణి అవమానిస్తున్నాడు! దేవుడు తప్ప మరెవరూ పాపాలను క్షమించలేరు!" 22 వారు ఏమి ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు. కాబట్టి ఆయన వారితో చెప్పాడు, "నేను చెప్పినదానిని మీలో మీరు ప్రశ్నించకూడదు! 23 ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించడానికి నేను కోరుకుంటున్నాను. ‘నేను నీ పాపాలను క్షమిస్తున్నాను’ లేదా ‘పైకి లెమ్ము మరియు నడువుము’ అనేవాటిలో చెప్పడానికి ఏది సులభం? {'నేను నీ పాపాలను క్షమిస్తున్నాను' అని చెప్పడం తేలిక అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే దానికి కనిపించే రుజువు ఏమీ అవసరం లేదు.} 24 అయితే భూమి మీద మనుష్యులను తమ పాపాలను క్షమించడానికి అధికారం దేవుడు మనుష్యకుమారుడైన నాకు ఇచ్చాడని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. {దానిని చూపించడానికి, నేను ఈ మనిషిని పైకి లేవమని కూడా చెపుతాను.}” అప్పుడు ఆయన పక్షవాయువు గల మనిషితో చెప్పాడు, “నేకు నేను చెపుతున్నాను, పైకి లెమ్ము, పండుకొనే నీ పరుపును తీసుకో, మరియు ఇంటికి వెళ్ళు!" 25 వెంటనే {మనిషి స్వస్థత పొందాడు!} అతను వారందరి ముందు లేచాడు. తను పడుకున్న నిద్రిస్తున్న పరుపును తీసుకుని దేవుడిని స్తుతిస్తూ ఇంటికి వెళ్ళాడు. 26 అక్కడ ఉన్న వారు అందరూ ఆశ్చర్యపోయారు! వారు దేవుణ్ణి స్తుతించారు మరియు {యేసు చేస్తున్న పనిని చూసి} పూర్తిగా ఆశ్చర్యపోయారు. వారు చెపుతూ ఉన్నారు, "మేము ఈ రోజు అద్భుతమైన విషయాలను చూశాము!”

27 అప్పుడు యేసు ఆ ప్రదేశాన్ని విడిచివెళ్ళాడు మరియు {రోమా ప్రభుత్వం కోసం} పన్నులు వసూలు చేస్తున్న లేవీ అనే పేరు గల ఒక మనిషిని చూశాడు. అతడు ఆవరణంలో కూర్చుని ఉన్నాడు {అక్కడ మనుష్యులు ప్రభుత్వానికి అవసరం అయ్యే పన్నులు చెల్లించడానికి అతని వద్దకు వచ్చారు}. యేసు అతనితో చెప్పాడు, "నాతో రమ్ము మరియు నా శిష్యుడిగా ఉండు!” 28 కాబట్టి లేవీ తన పనిని విడిచి పెట్టాడు మరియు యేసుతో వెళ్ళాడు.

29 తరువాత లేవీ యేసు {మరియు ఆయన శిష్యులు} కోసం తన సొంత ఇంటిలో ఒక పెద్ద విందు సిద్ధం చేశాడు. అక్కడ పన్ను వసూలు చేసేవారు మరియు ఇతరుల యొక్క ఒక పెద్ద గుంపు వారితో కలిసి భోజనం చేస్తున్నారు. 30 అప్పుడు పరిసయ్యుల వర్గానికి చెందిన కొందరు పురుషులు, యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలో కొంత మందితో సహా యేసు శిష్యులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పారు, “మీరు పన్ను వసూలు చేసేవారితో మరియు {ఇతర} పాపులతో విందును కలిగియుండకూడదు.” 31 అప్పుడు యేసు వారితో చెప్పాడు, "ఆరోగ్యంగా ఉన్న మనుష్యులకు వైద్యుడు అవసరం లేదు. అనారోగ్యంతో ఉన్న మనుష్యులకు వైద్యుడు అవసరం. 32 అదే విధముగా, నా దగ్గరకు రావడానికి తాము నీతిమంతులమని భావించే వారిని రమ్మని ఆహ్వానించడానికి నేను పరలోకం నుండి రాలేదు. దానికి విరుద్ధంగా, తాము పాపులు అని తెలుసుకొని తమ పాప ప్రవర్తన నుండి తిరగడానికి మరియు నా వద్దకు రావడానికి వారికి ఆహ్వానించడానికి నేను వచ్చాను.”

33 ఆ యూదు నాయకులు యేసుకు స్పందించారు, “బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు తరచుగా ఆహారానికి దూరంగా ఉంటూ ప్రార్థనలు చేస్తుంటారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. అయితే మీ శిష్యులు తింటూ ఉన్నారు మరియు తాగుతూ ఉన్నారు! వారు ఇతరుల వలే ఎందుకు ఉపవాసం ఉండరు?” 34 యేసు జవాబిచ్చాడు, “పెండ్లి వేడుకలు ఇంకా జరుగుతూ ఉండగా ఉపవాసం ఉండడానికి పెండ్లి కుమారుని యొక్క స్నేహితులకు ఎవరూ చెప్పరు! 35 అయితే ఒక దినమున పెండ్లి కుమారుడు తన స్నేహితులతో ఇక మీదట ఉండడు. అప్పుడు, ఆ సమయంలో, వారు ఆహారానికి దూరంగా ఉంటారు.

36 అప్పుడు యేసు తన ఉద్దేశాన్ని వివరించడానికి ఇతర ఉదాహరణలను చెప్పాడు. ఆయన చెప్పాడు, “మనుష్యులు ఎప్పుడూ ఒక కొత్త వస్త్రం నుండి ఒక గుడ్డ ముక్కను చింపి, మరియు దానిని సరిచేయడానికి పాత వస్త్రానికి జోడించరు. వారు దానిని చేసిన యెడల, దానిని చింపి వెయ్యడం చేత వారు కొత్త వస్త్రాన్ని పాడుచేస్తారు, మరియు కొత్త వస్త్రం ముక్క పాత వస్త్రానికి సరిపడదు. 37 మరియు ఎవరూ కొత్తగా పిండిన ద్రాక్షారాసాన్ని పాత చర్మపు సంచులలో {దానిని నిల్వ చేయడానికి} ఉంచరు. ఎవరైనా అది చేసిన యెడల, చర్మపు సంచులు చిరిగిపోతాయి {ఎందుకంటే కొత్త ద్రాక్షారసమును పులియబెట్టినప్పుడు మరియు విస్తరించినప్పుడు అవి సాగవు}. అప్పుడు చర్మపు సంచులు నిరుపయోగంగా మారతాయి, మరియు ద్రాక్షారసం {కూడా నిరుపయోగంగా దాని కారణంగా నిరుపయోగంగా మారుతుంది} బయటకు కారిపోతుంది. 38 దానికి విరుద్ధంగా, కొత్త ద్రాక్షారసం కొత్త చర్మపు సంచులలో వేయాలి.

39 పాత ద్రాక్షారసం మాత్రమే తాగిన వారు కొత్త ద్రాక్షారసాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడరు, ఎందుకంటే వారు తలంచుతారు, ‘పాత ద్రాక్షారసం సరిపోతుంది!'"

Chapter 6

1 ఒక విశ్రాంతి దినమున, యేసు మరియు ఆయన శిష్యులు కొన్ని ధాన్యపు పొలాల గుండా వెళ్తూ ఉండగా, శిష్యులు కొన్ని ధాన్యపు కంకులు తీసుకొన్నారు. పొట్టు నుండి ధాన్యాన్ని వేరు చేయడానికి వారు వాటిని చేతులలో రుద్దారు. అప్పుడు వారు ధాన్యాన్ని తిన్నారు. 2 కొంతమంది పరిసయ్యులు {దీనిని గమిస్తున్నారు. వారు} చెప్పారు {వారితో}, “మీరు అలాంటి పని చేస్తుండకూడదు! విశ్రాంతి దినమున మనం పని చేయడానికి మన ధర్మశాస్త్రం నిషేధిస్తుంది!” 3 యేసు పరిసయ్యులకు జవాబిచ్చాడు, “దావీదు తానూ మరియు అతనితో ఉన్న మనుష్యులు ఆకలిగొని ఉన్నప్పుడు చేసిన దానిని గురించి లేఖనాలు చెప్పిన దానిని పరిశీలించండి. 4 మీకు తెలిసిన విధముగా, దావీదు ప్రత్యక్షపు గుడారంలోకి ప్రవేశించాడు {కొంత ఆహారం కోసం అడిగాడు}. యాజకుడు దేవుని ముందు ఉంచిన రొట్టెను అతనికి ఇచ్చాడు. దావీదు కొంత తిన్నాడు, మరియు వారు దానిని చేయలేరని ధర్మశాస్త్రం చెప్పినప్పటికీ, అతడు కొంత అతనితో ఉన్న వారికి కూడా ఇచ్చాడు, యాజకులు మాత్రమే ఆ రొట్టెను తినగలరు.” 5 యేసు కూడా వారితో చెప్పాడు, "మనుష్య కుమారుడనైన నేను విశ్రాంతి దినమున {మనుషులు చెయ్యడానికి ఏది సరియైనది అని నిర్ణయించడానికి} నాకు అధికారం ఉంది!”

6 మరొక విశ్రాంతి దినమున యేసు సమాజ మందిరమునకు వెళ్ళాడు మరియు {మనుష్యులకు} బోధించాడు. అక్కడ ఒక మనిషి ఉన్నాడు అతడు తన కుడి చేతిని కదపలేక పోయాడు. 7 కొందరు యూదుల ధర్మశాస్త్రము యొక్క బోధకులు మరియు కొందరు పరిసయ్యులు {అక్కడ ఉన్నారు. వారు} యేసును దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. ఆయన ఆ మనిషిని స్వస్థత పరుస్తాడా అని చూడడానికి కోరారు. ఆయన చేసిన యెడల, అప్పుడు వారు {విశ్రాంతి దినమున రోజున పని చెయ్యకుండా ఉండడం గురించి వారి ధర్మశాస్తానికి అవిధేయత చూపడం విషయంలో} ఆయనను నిందిస్తారు. 8 అయితే వారు ఏమి ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు. కాబట్టి ఆయన ఎండిపోయిన చేయి ఉన్న మనిషితో చెప్పాడు, "రమ్ము మరియు ప్రతి ఒక్కరి ముందు ఇక్కడ నిలబడు!" కాబట్టి ఆ మనిషి పైకి లేచాడు మరియు అక్కడ నిలబడ్డాడు. 9 అప్పుడు యేసు వారితో చెప్పాడు, “నేను మిమ్ములను ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మ శాస్త్రం విశ్రాంతి దినమున మేలు చెయ్యడానికి మనుష్యులను ఆజ్ఞాపిస్తుందా లేదా హాని చెయ్యడానికా? విశ్రాంతి దినమున ఒక ప్రాణాన్ని రక్షించడానికి అవి మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాయా లేదా దానిని నాశనం చెయ్యడానికా?" 10 {ఎవరూ ఆయనకు జవాబు చెప్పలేదు, కాబట్టి} ఆయన వారి వైపు చుట్టూ చూసాడు మరియు ఆ మనిషితో చెప్పాడు, "ఎండిపోయిన నీ చెయ్యి చాచు!” ఆ మనిషి అది చేసాడు, మరియు అతని చేయి మళ్లీ పూర్తిగా తిరిగి బాగయ్యింది! 11 అయితే మత నాయకులు చాలా కోపంగా ఉన్నారు, మరియు వారు యేసును {వదిలించుకోవడానికి} ఏమి చేయాలో ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

12 ఆ సమయంలో యేసు ప్రార్థన చేయడానికి కొండలలోనికి పైకి వెళ్లాడు. అక్కడ ఆయన రాత్రి అంతా దేవునికి ప్రార్థన చేసాడు. 13 మరుసటి రోజు ఆయన తన శిష్యులు అందరిని తన వద్దకు రావడానికి పిలిచాడు. వారి మధ్య నుండి 12 మంది పురుషులను ఆయన ఎన్నుకొన్నాడు మరియు వారిని అపొస్తలులుగా చేసాడు. 14 {వారి పేర్లు ఇవి:} సీమోను, అతనికి యేసు పేతురు అని కొత్త పేరు ఇచ్చాడు; పేతురు సహోదరుడు అంద్రెయ, యాకోబు మరియు అతని సహోదరుడు యోహాను; ఫిలిప్పు; బర్తొలొమయి; 15 మత్తయి{, అతని మరొక పేరు లేవి}; తోమా, యాకోబు అను పేరుగల మరొక మనిషి, అతని తండ్రి పేరు అల్ఫయి; జెలోతే అనబడిన సీమోను; 16 యాకోబు అను పేరుగల మరొక మనిషి యొక్క కుమారుడు యూదా; మరియు ఇస్కరియోతు యూదా, తరువాత అతడు యేసును శత్రువులకు అప్పగించాడు.

17 యేసు తన శిష్యులతో కొండల నుండి దిగి వచ్చాడు మరియు ఒక ఒక సమతల ప్రాంతంలో నిలబడ్డాడు. అక్కడ ఆయన శిష్యుల యొక్క ఒక గొప్ప జనసమూహం ఉంది. యెరూషలేము నుండి మరియు యూదయ ప్రాంతంలోని అనేక ఇతర ప్రాంతాల నుండి మరియు తూరు మరియు సీదోనుల యొక్క నగరముల సమీపంలో ఉన్న తీరప్రాంతాల నుండి వచ్చిన పెద్ద మనుష్యుల గుంపు కూడా అక్కడ ఉంది. 18 వారు యేసును వినడం {వారికి బోధించడం} మరియు వారి రోగముల నుండి వారిని స్వస్థపరచడానికి వచ్చారు. దుష్ట ఆత్మలు బాధించిన వారిని కూడా ఆయన స్వస్థపరిచాడు. 19 జన సమూహంలో ఉన్న ప్రతిఒక్కరు ఆయనను తాకాలని ప్రయత్నించారు, ఎందుకంటే ఆయన తన శక్తి చేత ప్రతిఒక్కరిని స్వస్థపరుస్తున్నాడు. 20 అప్పుడు ఆయన తన శిష్యుల వైపు చూసాడు మరియు చెప్పాడు, "పేదలుగా ఉన్న మీ కోసం ఇది చాలా మంచిది. ఎందుకంటే దేవుడు మిమ్ములను పరిపాలిస్తున్నాడు. 21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీకు ఇది చాలా మంచిది, ఎందుకంటే దేవుడు మీకు కావలసినవన్నీ ఇస్తాడు.

ఇప్పుడు దుఃఖిస్తున్న మీకు ఇది చాలా మంచిది, ఎందుకంటే దేవుడు ఒక రోజు మిమ్ములను సంతోషంతో నవ్వేలా చేస్తాడు. 22 ఇతర మనుష్యులు నిన్ను ద్వేషించినప్పుడు, ఇది చాలా మంచిది, వారు నిన్ను తిరస్కరించినప్పుడు మరియు నిన్ను అవమానించినప్పుడు మరియు మీరు మనుష్యకుమారుడైన నన్ను అనుసరిస్తారు కాబట్టి మీరు చెడ్డవారు అని చెప్పినప్పుడు చాలా మంచిది. 23 అది జరిగినప్పుడు సంతోషించండి! పైకి మరియు కిందకి గెంతండి ఎందుకంటే మీరు చాలా సంతోషంగా ఉన్నారు! పరలోకంలో దేవుడు మీకు ఒక గొప్ప బహుమతిని ఇవ్వబోతున్నాడు అని జ్ఞాపకం ఉంచుకోండి! మీతో ఈ విధంగా ఇలా ప్రవర్తిస్తున్న మనుష్యుల యొక్క పూర్వీకులు {చాలా కాలం క్రితం} దేవుని ప్రవక్తలకు ఇలాంటి కార్యాలు చేసారు అని మరచిపోవద్దు.

24 అయితే ఐశ్వర్యవంతులుగా ఉన్న మీకు ఇది ఎంత విచారకరం. మీరు {ఇప్పటికే} పొందబోయే అన్ని సౌకర్యాలను {మీ సంపదల నుండి} పొందారు. 25 ఇప్పుడు ఆహారంతో మిమ్మల్ని మీరు నింపుకొంటున్న మీ కోసం ఇది ఎంత విచారం. తరువాత మీరు ఆకలితో ఉంటారు.

ఇప్పుడు నవ్వుతున్న వారికి శ్రమ, తరువాత మీరు చాలా విచారంగా ఉంటారు. 26 ప్రతి ఒక్కరు మీ గురించి మంచి మాటలు చెపుతున్నప్పుడు ఇది మీకు ఎంతో బాధగా ఉంటుంది. అదే విధంగా, వారి పూర్వీకులు దేవుని ప్రవక్తలుగా ఉండడానికి తప్పుగా చెప్పుకునే మనుష్యుల గురించి మంచి సంగతులు చెపుతూ ఉండేవారు.

27 అయితే నేను చెప్పేది వింటున్న మీలో ప్రతి ఒక్కరికీ నేను ఇది చెప్పుతున్నాను: మీ శత్రువులను ప్రేమించండి{, మీ స్నేహితులను మాత్రమే కాదు}! మిమ్ములను ద్వేషించే వారికి మంచి పనులు చెయ్యండి! 28 మిమ్ములను శపించేవారిని ఆశీర్వదించడానికి దేవుణ్ణి అడగండి! మీతో చెడుగా ప్రవర్తించే వారి కోసం ప్రార్థించండి! 29 ఎవరైనా మిమ్మల్ని మీ చెంపలలో ఒకదాని మీద కొట్టడం {చేత మిమ్ములను అవమానించినప్పుడు}, మీ ముఖాన్ని తిప్పండి తద్వారా అతడు మరో చెంప మీద కొడతాడు. ఎవరైనా మీ అంగీని తీసివేయాలని కోరుకున్న యెడల, మీ చొక్కాయిని కూడా అతడు కలిగియుండేలా చెయ్యండి. 30 మిమ్మల్ని అడిగే ప్రతి ఒక్కరికీ ఏదైనా ఇవ్వండి. ఎవరైనా మీకు చెందిన వస్తువులను తీసుకుంటే, వాటిని తిరిగి ఇచ్చేలా చేయకండి. 31 ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారో, అదే విధంగా మీరు వారి పట్ల ప్రవర్తించాలి.

32 మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు {మాత్రమే} ప్రేమించిన యెడల, అది చేసినందుకు దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడని ఎదురుచూడవద్దు. పాపులు కూడా తమను ప్రేమించేవారిని ప్రేమిస్తారు. 33 మీ కోసం మంచి పనులు చేసే మనుష్యుల కోసం మీరు మంచి పనులు చేస్తారు కాబట్టి దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడని ఎదురుచూడవద్దు. అన్నిటి కంటే, పాపులు కూడా అది చేస్తారు. 34 మీకు తిరిగి ఇచ్చే వారికి మాత్రమే మీరు {డబ్బు లేదా ఆస్తి} అప్పుగా ఇచ్చిన యెడల, అది చేసిన దానికి కోసం దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడని ఎదురు చూడవద్దు. పాపులు కూడా ఇతర పాపులకు అప్పు ఇస్తారు, వారు తమకు ప్రతిదీ తిరిగి ఇస్తారు. 35 బదులుగా, మీ శత్రువులను ప్రేమించండి! వారి కోసం మంచి పనులు చేయండి! వారికి అప్పు ఇవ్వండి మరియు వారు తిరిగి చెల్లించాలని ఎదురు చూడవద్దు! అప్పుడు దేవుడు నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. మరియు మీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క పిల్లలుగా ఉంటారు, ఎందుకంటే దేవుడు కృతజ్ఞత లేనివారు మరియు దుష్టల పట్ల కూడా దయకలిగి ఉన్నాడు. 36 కాబట్టి మీ తండ్రి అయిన దేవుడు మనుష్యుల పట్ల దయతో ప్రవర్తించినట్లే మీరు కూడా ఇతర మనుష్యుల పట్ల దయతో ప్రవర్తించాలి. 37 {ఇతర వ్యక్తులను} కఠినంగా విమర్శించవద్దు. అప్పుడు దేవుడు మిమ్ములను కఠినంగా విమర్శించడు. {ఇతర వ్యక్తులను} ఖండించవద్దు. అప్పుడు దేవుడు మిమ్ములను ఖండించడు. {ఇతరులు మీకు చేసిన తప్పు పనులకు} క్షమించండి. అప్పుడు దేవుడు మిమ్ములను క్షమిస్తాడు.

38 {ఇతరులకు} ఇవ్వండి. అప్పుడు దేవుడు మీకు ఇస్తాడు. మీరు కలిగియున్న పాత్రలో వీలైనంత ఎక్కువ ధాన్యం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇది ఉంటుంది. ఆయన ధాన్యాన్ని కిందకు నొక్కుతాడు. ఆయన దానిని కలిసి కుదిస్తాడు. పాత్ర పొంగిపోయే వరకు ఆయన దీనిని నింపుతూనే ఉంటాడు. కాబట్టి మీరు ఇతరులకు ఇచ్చినప్పుడు, మీరు పెద్ద గరిటెని ఉపయోగిస్తున్నట్టు వలే ఇది ఉండాలి, ఎందుకంటే దేవుడు మీకు ఇవ్వడానికి అదే పరిమాణం గంటెను ఉపయోగిస్తాడు.

39 ఆయన తన శిష్యులకు ఈ ఉదాహరణను కూడా ఇచ్చాడు: “చూపులేని వాడు మరొక చూపులేనివాడిని {మార్గంలో} నడిపించడానికి ప్రయత్నించకూడదు. ఆతడు అది చేసిన యెడల, వారు ఇద్దరూ {రోడ్డు పక్కన ఉన్న} గుంటలో పడతారు! 40 ఒక శిష్యుడు తన బోధకుని కంటే గొప్పవాడు కాదు. అయితే బోధకుడు అతనికి శిక్షణ పూర్తి అయిన తరువాత, అతడు అతని బోధకుని వలే మారతాడు.

41 {మీలో ఎవరూ మరొక వ్యక్తి యొక్క చిన్న లోపాల గురించి ఆందోళన చెందకూడదు. మీ స్వంత గంభీరమైన లోపములను గురించి మీరు ఆందోళన చెందాలి.} లేనియెడల, అది మీ స్వంత కంటిలో ఒక పెద్ద చెక్క పలకను గమనించకుండా ఆ వ్యక్తి కంటిలో ఒక అణువును గమనించినట్లుగా ఉంటుంది. 42 మీరు మీ స్వంత లోపాలతో ఇంకా పరిష్కరించుకోనప్పుడు, ‘స్నేహితుడా, నీ లోపాలను సరిచెయ్యడానికి నన్ను నీకు సహాయం చేయనివ్వు' అని మరొక విశ్వాసితో చెప్పకూడదు. నువ్వు అది చేసిన యెడల, నువ్వు ఒక వేషదారివి! నువ్వు మొదట {మీ స్వంత పాపాలు చేయడం మానేయండి. అది} నీ స్వంత కంటి నుండి ఒక పెద్ద పలకను తీసివేయడం వలే ఉంటుంది. అప్పుడు, ఒక ఫలితంగా, ఇతరులు తమ కళ్ళల్లో {చిన్న లోపాల వలె ఉండే} చిన్న అణువులను తొలగించడంలో సహాయం చెయ్యడానికి మీకు అవసరమైన ఆత్మీయ అంతర్ద్రుష్టిని మీరు కలిగియుంటారు.

43 ఆరోగ్యవంతమైన చెట్లు చెడ్డ ఫలాలను ఉత్పత్తి చెయ్యవని మరియు అనారోగ్యకరమైన చెట్లు మంచి ఫలాలను ఉత్పత్తి చెయ్యవని ప్రతి ఒక్కరికి తెలుసు. 44 ఒక వ్యక్తి లోపల ఎలా ఉంటాడో వారు చేసే పనులను బట్టి మీరు చెప్పగలరు. {అప్పుడు వారి నుండి ఏమి ఆశించాలో మీకు తెలుస్తుంది. చెడు పనులు చేసే వ్యక్తి నుండి మీరు దయ లేదా మంచి సూచన కోసం వెతకరు.} అది ఒక ముళ్లపొద మీద అంజూర పండ్ల కోసం వెదకడం లేదా ఒక ముళ్ల తీగపై ద్రాక్షపండ్ల కోసం వెదకడం వంటిది.

45 మంచి మనుష్యులు మంచి పనులు చేస్తారు, ఎందుకంటే వారు మంచి విషయాలు ఆలోచిస్తారు. దుర్మార్గులైన మనుష్యులు దుష్ట క్రియలు చేస్తారు. ఎందుకంటే వారు దుష్ట సంగతులు ఆలోచిస్తారు. ఇది ఎందుకంటే మనుష్యులు మాట్లాడుతారు మరియు వారు ఆలోచిస్తున్న దాని మీద ఆధారంగా మాట్లాడుతారు."

46 {యేసు మనుష్యులతో చెప్పాడు,} “నేను మీతో చేయమని చెప్పినదానికి మీరు విధేయత చూపించనప్పుడు మీరు నన్ను ‘ప్రభువా’ అని ఎందుకు పిలుస్తారు? 47 నా వద్దకు వచ్చి, నా బోధలు విని, మరియు వాటికి విధేయత చూపే మనుష్యులు ఏవిధంగా ఉంటారో నేను మీకు చెపుతాను. 48 అలాంటి వ్యక్తులు తన ఇల్లు కట్టుకోవడానికి భూమి లోనికి లోతుగా తవ్విన ఒక వ్యక్తి వలే ఉంటారు. అతడు దృఢమైన రాతి మీద పునాదిని {ఇంటి కోసం} నిర్మించేలా చూసుకున్నాడు. అప్పుడు వరద వచ్చింది. ఆ ఇంటికి వ్యతిరేకంగా నీటి ప్రవాహము కొడుతోంది. అయితే అది దానిని నాశనం చేయలేకపోయింది, ఎందుకంటే ఆ వ్యక్తి ఇంటిని గట్టి పునాది మీద నిర్మించాడు. 49 అయితే నా బోధలు విను కొందరు మనుష్యులు వాటికి విధేయత చూపించారు. వారు మొదట పునాది తవ్వకుండా నేల పైన ఒక ఇల్లు కట్టుకున్న వ్యక్తి వలే ఉంటారు. వరదనీరు వచ్చినప్పుడు వెంటనే కూలిపోయింది. నీళ్ళు ఆ ఇంటిని పూర్తిగా నాశనం చేశాయి.

Chapter 7

1 యేసు ఈ విషయాలు అన్నిటినీ వింటున్న మనుష్యులతో చెప్పడం ముగించిన తరువాత, కపెర్నహూము యొక్క పట్టణానికి ఆయన వెళ్లాడు. 2 ఆ పట్టణంలో రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఉన్నాడు, అతనికి ప్రియమైన బానిస ఉన్నాడు. ఈ బానిస చాలా జబ్బుపడ్డాడు, అతడు చనిపోయేలా ఉన్నాడు. 3 శతాధిపతి యేసు గురించి వినినప్పుడు, ఆయన రావడానికి మరియు తన బానిసను స్వస్థపరచడానికి అడగడానికి యేసు వద్దకు కొందరు యూదు పెద్దలను అతడు పంపాడు. 4 వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, {శతాధిపతి బానిసకు సహాయం చేయడానికి} వారు ఆయనను ప్రాధేయపడి అడిగారు. వారు అడిగారు, "నీవు అతని కోసం ఇది చెయ్యడానికి అతడు అర్హుడు, 5 ఎందుకంటే అతడు మన మనుష్యులను ప్రేమిస్తున్నాడు మరియు అతడు మరియు మన కోసం మన సమాజమందిరాన్ని నిర్మించాడు.”

6 కాబట్టి యేసు వారితో {అధికారి ఇంటికి} వెళ్ళాడు. ఆయన దాదాపు అక్కడకు చేరుకున్నప్పుడు, ఆ అధికారి యేసుకు ఈ సందేశం ఇవ్వడానికి కొంతమంది స్నేహితులను పంపాడు: “ప్రభువా, {ఇక్కడకు రావడానికి} ఇబ్బంది పడకండి, ఎందుకంటే నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను అర్హుడిని కాదు. 7 అందుకే నీ దగ్గరకు ప్రత్యక్షంగా రావడానికి నేను అర్హుడనని నాకు అనిపించలేదు. నీవు కేవలం {ఆజ్ఞ} మాట్లాడటం చేత నా ప్రియమైన బానిసను స్వస్థపరచగలవు అని నేను యెరుగుదును. 8 {నీవు దీనిని చెయ్యగలవని నాకు తెలుసు} ఎందుకంటే నా మట్టుకు నేను నా యొక్క పై అధికారుల ఆదేశాలకు విధేయత చూపించవలసిన మనిషిని. నా ఆదేశాలకు విధేయత చూపించవలసిన సైనికులు నాకు కూడా ఉన్నారు. వారిలో ఒకరికి నేను "వెళ్ళు!' చెప్పినప్పుడు అతడు వెళ్ళును. మరొకరితో నేను 'రమ్ము!' అని చెప్పినప్పుడు అతడు వస్తాడు. నేను నా బానిసతో, 'ఇది చెయ్యి!' అని అని చెప్పినప్పుడు అతడు చేస్తాడు.”

9 ఆ అధికారి చెప్పినది యేసు వినినప్పుడు, ఆయన అతనిని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన తనతో ఉన్న జనసమూహం వైపు తిరిగాడు మరియు చెప్పాడు, "నన్ను మీకు చెప్పనివ్వండి, ఈ అన్యజనుడు చేసిన విధంగా ఇంత అధికంగా నన్ను విశ్వసించిన ఏ ఇశ్రాయేలీయుని నేను కలవలేదు!” అని అన్నాడు. 10 శతాధిపతి నుండి వచ్చిన స్నేహితులు అతని ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆ బానిస తిరిగి మంచి ఆరోగ్యంలో ఉన్నాడని కనుగొన్నారు.

11 దాని తరువాత వెంటనే యేసు నాయీను యొక్క పట్టణానికి ప్రయాణం అయ్యాడు. ఆయన శిష్యులు మరియు ఒక పెద్ద జనసమూహం ఆయనతో ఉన్నారు. 12 యేసు పట్టణ ద్వారం దగ్గరికి వచ్చి యుండగానే పెద్ద ఒక జనసమూహం పట్టణం నుండి బయటకు రావడం ఆయన చూశాడు. ఒక మనిషి ఇప్పుడే చనిపోయాడు మరియు అతనిని పాతిపెట్టడానికి వారు అతనిని మోస్తూ ఉన్నారు. అతని తల్లి జనసమూహంలో ఉంది. ఆమె ఒక వితంతువు, మరియు అతడు ఆమెకు ఏకైక కుమారుడుగా ఉన్నాడు. {అతడు బ్రతికుండగా అతడు ఆమెను చూసుకున్నాడు.} 13 యేసు ఆమెను చూసినప్పుడు, ఆమె కోసం ఆయన కరుణ చూపాడు మరియు ఆమెతో చెప్పాడు, "ఏడవ వద్దు!” 14 తరువాత ఆయన దగ్గరకు {వారి} వచ్చాడు మరియు పాడెను ముట్టాడు {దాని మీద దేహం పడి ఉంది}. దానిని మోస్తున్న పురుషులు నిశ్చలంగా నిలబడ్డారు. ఆయన చెప్పాడు, “యువకుడైన మనిషి, నేను నీతో చెప్పుచున్నాను, పైకి లెమ్ము!” 15 అప్పుడు చనిపోయిన మనిషి లేచి కూర్చున్నాడు మరియు మాట్లాడడానికి ఆరంభించాడు! మరియు యేసు అతనిని తన తల్లి వద్దకు తిరిగి నడిపించాడు.

16 అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విస్మయము చెందారు. వారు దేవుణ్ణి స్తుతించారు మరియు చెప్పారు {ఒకరితో ఒకరు}, “ఒక గొప్ప ప్రవక్త మన మధ్యకు వచ్చాడు!” మరియు "దేవుడు తన మనుష్యుల కోసం శ్రద్ధ తీసుకోవడానికి వచ్చాడు!" 17 యేసు {ఏమి} {చేసాడు} అనే దానిని గురించిన వార్త యూదయ యొక్క ప్రాంతం అంతటా మరియు సమీపంలోని ఇతర ప్రాంతాలు అన్నిటిలో వ్యాపించింది.

18 బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు ఈ సంగతులు అన్నిటి గురించి ఆయనకు చెప్పారు. కాబట్టి యోహాను ప్రభువు వద్దకు వెళ్ళాడానికి మరియు అతనిని అడగడానికి తన ఇద్దరు శిష్యుల కోసం పిలిచాడు: 19 “వస్తాడు అని దేవుడు వాగ్దానం చేసిన వాడవు నీవేనా, లేదా మేము మరొకరి కోసం ఎదురు చూడాలా?” 20 ఆ ఇద్దరు మనుష్యులు యేసు దగ్గరకు వచ్చినప్పుడు, వారు ఆయనతో చెప్పారు, “బాప్తిస్మమిచ్చు యోహాను నిన్ను అడగడానికి మమ్మల్ని పంపాడు, ‘వస్తాడని దేవుడు వాగ్దానం చేసినవాడవు నువ్వేనా? లేక మేము వేరొకరి కోసం ఎదురుచూడాలా?'" 21 అదే సమయంలో, యేసు అనేకమంది మనుష్యులను అనారోగ్యాలు మరియు తీవ్రమైన వ్యాధుల నుండి స్వస్థపరిచాడు మరియు ఆయన వారిని దుష్ట ఆత్మల నుండి విడిపించాడు. ఆయన అనేకమంది చూపులేని వారికి తిరిగి చూసే సామర్థ్యాన్ని కూడా ఇచ్చాడు. 22 కాబట్టి ఆయన ఆ ఇద్దరికి జవాబిచ్చాడు, “వెనుకకు వెళ్ళండి మరియు మీరు చూసినది మరియు వినినది యోహానుకు తెలియజేయండి. అంధులుగా ఉన్న మనుష్యులు ఇప్పుడు చూస్తున్నారు. కుంటి వారుగా ఉన్న మనుష్యులు ఇప్పుడు నడుస్తున్నారు. చర్మవ్యాధులు ఉన్న మనుష్యులు ఇక మీదట వాటిని కలిగియుండరు. వినలేకుండా ఉన్నవారు ఇప్పుడు వినగలరు. చనిపోయిన మనుష్యులు తిరిగి జీవానికి వచ్చారు. నేను పేద మనుష్యులకు శుభవార్త ప్రకటిస్తున్నాను. 23 {మరియు అతనికి కూడా చెప్పు,} “ఎవరైనా {నేను చేసే దానిని చూసేవారు మరియు నేను బోధించే దానిని వినేవారు మరియు} నాలో విశ్వాసముంచడం కొనసాగిస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు.”

24 యోహాను పంపిన మనుష్యులు వెళ్ళిపోయినప్పుడు, యేసు జనసమూహంతో యోహాను గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన చెప్పాడు, "ఏమి చూడడానికి అరణ్యంలోనికి మీరు వెళ్ళారు? గాలి చేత కదిలిన మొక్క యొక్క సన్నని కొమ్మ? 25 అయితే మీరు ఏమి చూడడానికి వెళ్ళారు? కొత్త దుస్తులు ధరించిన వ్యక్తి? వినండి, గంభీరమైన దుస్తులు ధరించేవారు మరియు అన్నిటికంటే ఉత్తమమైన వాటిని కలిగి ఉన్నవారు రాజుల అంతఃపురములలో నివసిస్తున్నారు. 26 అప్పుడు మీరు ఏమి చూడడానికి అక్కడికి వెళ్లారు? ఒక ప్రవక్త? అవును{, అదే యోహాను}! అయితే యోహాను ఒక సాధారణ ప్రవక్త కంటే గొప్పవాడు అని నేను మీకు చెప్పుచున్నాను.

     27 ప్రవక్త చాలా కాలం క్రితం వ్రాసిన వ్యక్తి ఆయనే: ‘చూడండి, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నీ రాకడ కోసం మనుష్యులను సిద్ధం చేస్తాడు.’

28 ఇప్పటివరకు జీవించిన మనుష్యులు అందరిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని నేను మీతో చెప్పుచున్నాను. అయినప్పటికీ, దేవుడు పరిపాలిస్తున్న జీవితాలలో అత్యంత అల్పమైన మనుష్యులు యోహాను కంటే గొప్పవారు.

29 యోహాను బాప్తిస్మం ఇచ్చిన మనుష్యులు అందరూ పన్నులు వసూలు చేసేవారితో సహా యేసు చెప్పినది వినినప్పుడు, వారు దేవుడు సరైన పని చేశాడని {యోహానును పంపడం చేత} అంగీకరించారు. 30 అయితే యోహాను బాప్తిస్మం ఇవ్వని పరిసయ్యులు మరియు యూదుల ధర్మశాస్త్ర నిపుణులు తమ కోసం దేవుని చిత్తాన్ని తిరస్కరించారు.

31 {అప్పుడు యేసు కూడా చెప్పాడు,} ఈ కాలంలో జీవిస్తున్న మనుష్యులైన మీరు ఎలా ఉన్నారో నేను మీతో చెపుతాను.“ 32 మీరు ఒక బహిరంగ ప్రదేశంలో ఆటలు ఆడుకునే పిల్లలు వలే ఉన్నారు. వారు ఒకరినొకరు బయటికి పిలుస్తారు, చెపుతారు, 'మేము మీ కోసం వేణువు మీద సంతోషకరమైన సంగీతాన్ని మ్రోగించాము, అయితే మీరు నాట్యం చెయ్యలేదు! అప్పుడు మేము మీ కోసం విచారకరమైన అంత్యక్రియల పాటలు పాడాము, అయితే మీరు ఏడవలేదు!’ 33 అదే విధంగా, యోహాను మీ దగ్గరకు వచ్చినప్పుడు మరియు సాధారణ ఆహారం తినకుండా లేదా ద్రాక్షారసం తాగకుండా ఉన్నప్పుడు, మీరు {అతనిని తిరస్కరించారు మరియు} చెప్పారు, ఒక దయ్యం అతనిని అదుపు చేస్తోంది!' 34 అయితే మనుష్యుని యొక్క కుమారుడు మీ వద్దకు వచ్చి మరియు తిని {సాధారణ ఆహారం} మరియు {ఇతరులు చేసే విధంగా ద్రాక్షారసం} త్రాగినప్పుడు, అప్పుడు మీరు {ఆయనను తిరస్కరించారు మరియు} చెప్పారు, 'చూడండి! ఈ మనిషి అధికంగా ఆహారం తింటాడు, మరియు ఎక్కువగా ద్రాక్షారసం తాగుతాడు, మరియు పన్ను వసూలు చేసేవారు మరియు ఇతర పాపులతో ఆయన సహవాసం చేస్తాడు!’ 35 అయితే యోహాను మరియు నేనూ చేసేది కూడా జ్ఞానం అని జ్ఞానవంతులైన వారు తమకై తాము గుర్తిస్తారు.”

36 ఒకరోజు సీమోను అను పేరుగల ఒకానొక పరిసయ్యుడు తనతో ఒక భోజనం చేయడానికి యేసును ఆహ్వానించాడు. కాబట్టి యేసు ఆ మనిషి ఇంటికి వెళ్ళాడు మరియు భోజనం చెయ్యడానికి ఒక బల్ల వద్ద వాలుగా కూర్చున్నాడు. 37 ఆ నగరంలో చెడ్డపేరు ఉన్న ఒక స్త్రీ కూడా ఉంది. పరిసయ్యుని ఇంటిలో యేసు భోజనం చేస్తున్నాడు అని ఆమె వినినప్పుడు, పరిమళ ద్రవ్యం ఉన్న ఒక రాతి జాడీను తీసుకుని {ఆమె అక్కడికి వెళ్లింది. 38 {యేసు భోజనం చెయ్యడానికి వాలుగా కూర్చొని యుండగా, ఆ స్త్రీ ఆయన వెనుక ఆయన పాదాల దగ్గర నిలబడి ఉంది.} ఆమె ఏడుస్తూ ఉంది, మరియు ఆమె కన్నీళ్లు యేసు పాదాలపై పడ్డాయి. ఆమె తన జుట్టుతో ఆయన పాదాలను నిరంతరం తుడుచుకుంది. ఆమె వాటికి ముద్దు పెడుతూ ఉంది మరియు పరిమళంతో అభిషేకం చేస్తూ ఉంది.

39 యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు {ఆ స్త్రీ చేస్తున్న దానిని} చూసినప్పుడు, అతడు తలంచాడు, "ఈ మనిషి నిజంగా ఒక ప్రవక్త అయిన యెడల, తనను తాకిన ఈ స్త్రీ ఎవరో అతనికి తెలిసి ఉండేది. ఆమె ఎలాంటి వ్యక్తి అని, ఆమె పాపి అని అతనికి తెలిసి ఉండేది. 40 దానికి జవాబుగా యేసు అతనితో చెప్పాడు, "సీమోను, నేను నీకు ఒక విషయం చెప్పాలని కోరుతున్నాను." అతడు జవాబిచ్చాడు, "బోధకుడా అది ఏమిటి?"

41 {యేసు అతనికి ఈ కథ చెప్పాడు:} “డబ్బు అప్పుగా ఇచ్చే వ్యాపారం చేసే ఒక మనిషికి ఇద్దరు మనుష్యులు డబ్బు అప్పు చేశారు. ఈ మనుష్యులలో ఒకడు అతనికి 500 వెండి నాణేలు బాకీ ఉన్నాడు. మరొకడు అతనికి 50 వెండి నాణేలు బాకీ ఉన్నాడు. 42 వారిలో ఎవ్వరూ తాను అచ్చియున్న దానిని తిరిగి చెల్లించలేకపోయారు, కాబట్టి వారిద్దరూ ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ఆ మనిషి చాలా దయతో చెప్పాడు. కాబట్టి, ఆ ఇద్దరిలో ఎవరు ఆ మనిషిని ఎక్కువగా ప్రేమిస్తారు? 43 సీమోను జవాబిచ్చాడు, “అతనికి పెద్ద మొత్తంలో బాకీ ఉన్నవాడు అతనిని ఎక్కువగా ప్రేమిస్తాడని నేను అనుకుంటున్నాను.” యేసు అతనితో, చెప్పాడు, “నువ్వు సరిగా ఉన్నావు." 44 అప్పుడు ఆయన ఆ స్త్రీ వైపు తిరిగాడు మరియు సీమోనుతో చెప్పాడు, "ఈ స్త్రీ చేసిన దానిని గురించి ఆలోచించు! నేను మీ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు{, అతిధేయులు తమ అతిథులను స్వాగతించడానికి సాధారణంగా చేసే పనిని నువ్వు చెయ్యలేదు.} నా పాదాలు కడగడానికి నువ్వు ఏ నీళ్లు ఇవ్వలేదు. అయితే ఈ స్త్రీ తన కన్నీళ్లతో నా పాదాలను కడిగింది మరియు తన జుట్టుతో తుడిచింది! 45 నువ్వు నాకు ఒక ముద్దుతో శుభములు చెప్పలేదు. అయితే నేను లోపలికి వచ్చిన క్షణం నుండి, ఆమె నా పాదాలను ముద్దాడటం ఆపలేదు! 46 నువ్వు నా తలను ఒలీవ నూనెతో అభిషేకించలేదు, అయితే ఆమె నా పాదాలను సుగంధ పరిమళంతో అభిషేకించింది. 47 కాబట్టి నేను మీతో చెప్పుచున్నాను, దేవుడు ఆమె అనేక పాపములను క్షమించాడు మరియు ఆ కారణంగా ఆమె నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. అయితే కొన్ని పాపముల కోసం మాత్రమే తనను క్షమించవలసి ఉందని భావించే వ్యక్తి నన్ను కొంచెం మాత్రమే ప్రేమిస్తాడు.

48 అప్పుడు యేసు ఆ స్త్రీతో చెప్పాడు, “నేను నీ పాపములను క్షమించాను.” 49 అప్పుడు ఆయనతో భోజనం చేస్తున్నవారు తమలో తాము చెప్పారు, “పాపాలను కూడా క్షమించగలనని చెపుతున్న ఈ మనిషి ఎవరు?” 50 అయితే యేసు ఆ స్త్రీతో చెప్పాడు, “నువ్వు నాలో విశ్వాసం ఉంచిన కారణంగా దేవుడు నిన్ను రక్షించాడు. నీవు వెళ్తూ ఉండగా దేవుడు నీకు సమాధానం అనుగ్రహించును గాక! ”

Chapter 8

1 దాని తరువాత, యేసు మరియు ఆయన పన్నెండు మంది శిష్యులు వివిధ నగరాలు మరియు గ్రామాల చుట్టూ ప్రయాణం చేసారు. వారు వెళ్ళి ఉండగా, యేసు మనుష్యులకు బోధించాడు, దేవుడు వారి జీవితాలను పరిపాలించగలడు అని సువార్తను వారికి చెప్పాడు. 2 ఆయన దుష్ట ఆత్మల నుండి విడిపించి, మరియు రోగాల నుండి స్వస్థపరిచిన అనేకమంది స్త్రీలు {కూడా వారితో పాటు ప్రయాణిస్తూ ఉన్నారు}. వీరిలో మగ్దల యొక్క గ్రామం నుండి మరియ ఉంది. ఆమెను విడిచి పెట్టడానికి ఏడు దుష్ట ఆత్మలను యేసు బలవంతం చేసాడు. 3 {ఈ స్త్రీలలో మరొకరు}యోహన్న. ఆమె హేరోదు రాజు కోసం గృహనిర్వాహకుడిగా ఉన్న కూజా యొక్క భార్య. సూసన్న మరియు అనేకులైన ఇతరులు {కూడా ఈ స్త్రీలలో ఉన్నారు}. వారు యేసు మరియు ఆయన శిష్యులకు సహాయం చెయ్యడానికి తమ స్వంత డబ్బును ఉపయోగించారు.

4 ఒకరోజు ఒక చాలా పెద్ద గుంపు గుమికూడుతోంది. యేసును చూడడానికి మనుష్యులు అనేక వివిధ పట్టణాల నుండి ప్రయాణిస్తున్నారు. ఆయన వారికి ఈ వృత్తాంతం చెప్పాడు: 5 “ఒక రైతు కొన్ని ధాన్యం గింజలు వేయడానికి బయలుదేరాడు. అతడు వాటిని నేలమీద చల్లుతూ ఉండగా, వాటిలో కొన్ని విత్తనాలు కఠినమైన మార్గంలో పడిపోయాయి. మనుష్యులు ఆ విత్తనాల మీద అడుగు పెట్టారు, మరియు పక్షులు వాటిని అన్నిటిని తినివేశాయి. 6 విత్తనాలలో కొన్ని రాతి {పొర పైన లోతులేని నేల} మీద పడ్డాయి. ఆ విత్తనాలు పెరిగిన వెంటనే, మొక్కలు ఎండిపోయాయి ఎందుకంటే వాటి వేర్లు తేమ వద్దకు చేరుకోవడానికి రాళ్లను దాటలేకపోయాయి.

7 ఈ విత్తనాలలో కొన్ని ముళ్ల మొక్కలు తమ స్వంత విత్తనాలను విడిచిపెట్టిన నేలమీద పడ్డాయి. కొత్త ముళ్ల మొక్కలు చిన్న ధాన్యపు మొక్కలతో కలిసి పెరిగాయి. {బలమైన} ముళ్ళు ధాన్యం మొక్కలను చుట్టుముట్టాయి, తద్వారా ధాన్యం బాగా పెరగలేదు. 8 అయితే ధాన్యపు విత్తనాలలో కొన్ని సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి ఎంత బాగా పెరిగాయి అంటే అనేక విత్తనాల వలే వంద రెట్లు ఉన్న పంటను ఉత్పత్తి చేశాయి.” ఈ విషయాలు చెప్పిన తరువాత, యేసు జనసమూహాన్ని పిలిచాడు, “నేను ఇప్పుడే చెప్పిన దానిని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి!”

9 అప్పుడు యేసు శిష్యులు ఆయన అడిగారు, “ఆ వృత్తాంతానికి అర్థం ఏమిటి?” 10 మరియు ఆయన చెప్పాడు, “దేవుడు రాజు వలే ఏవిధంగా పరిపాలిస్తాడనే దాని గురించి దాచబడిన సంగతులు తెలుసుకోవడం యొక్క ఆధిక్యత దేవుడు మీకు ఇచ్చాడు. అయితే ప్రతిఒక్కరితో {నేను మాట్లాడుతున్నాను} ఉపమానాలలో మాత్రమే, తద్వారా,

     ‘వారు చూసినప్పటికీ, వారు గ్రహించలేరు మరియు వారు విన్నప్పటికీ వారు అర్థం చేసుకోలేరు.’

11 ఇప్పుడు, వృత్తాంతం అర్థం ఇదే: మనుష్యులు అర్థం చేసుకోవడానికి దేవుడు కోరుకుంటున్న దానిని విత్తనాలు సూచిస్తాయి. 12 దారి మీద పడిన విత్తనాలు, మనుష్యులు దేవుని నుండి సందేశాన్ని కేవలం పైపైన అర్థం చేసుకున్నప్పుడు {ఏమి జరుగుతుందో చూపుతున్నాయి}. సాతాను రావడానికి మరియు ఆ సందేశాన్ని వారి మనసుల నుండి తీసుకొని వెళ్ళడానికి ఇది సులభం చేస్తుంది. ఫలితంగా, వారు దానిని విశ్వసించరు, మరియు కాబట్టి దేవుడు వారిని రక్షించడు. 13 రాతి నేల మీద పడిన విత్తనాలు, మనుష్యులు దేవుని నుండి సందేశాన్ని విని మరియు సంతోషంగా స్వీకరించినప్పుడు {ఏమి జరుగుతుందో చూపిస్తుంది} అయితే వారు తమ్మును తాము నిజముగా అర్పించుకోరు. వారు కొద్దికాలం మాత్రమే నమ్ముతారు. వారికి కష్టమైన సంగతులు సంభవించిన వెంటనే, వారు దేవుణ్ణి నమ్మడం మానేస్తారు. 14 ముళ్ల మొక్కల మధ్య పడిన విత్తనాలు దేవుని నుండి సందేశాన్ని వినిన {కొందరు ఇతర మనుష్యులకు ఏమి జరుగుతుందో చూపిస్తుంది} వారు జీవితంలో కొనసాగుతూ ఉండగా, వారు ఈ జీవితంలోని చింతలు, సంపదలు మరియు ఆనందాలు వారి దృష్టిని ఆక్రమించేలా అనుమతిస్తారు. ఫలితంగా, వారు ఆత్మీయంగా పరిణతి చెందలేరు. 15 అయితే సారవంతమైన నేల మీద పడిన విత్తనాలు, మనుష్యులు దేవుని గురించిన సందేశాన్ని విని మరియు గొప్ప యధార్ధతతో అంగీకరించినప్పుడు {ఏమి జరుగుతుందో చూపిస్తున్నాయి}. వారు దృఢమైన తీర్మానం చేస్తారు, మరియు వారు ఈ తీర్మానమును కొనసాగిస్తారు కనుక వారు ఆత్మీయంగా పరిణతి చెందుతారు.

16 దీని గురించి ఆలోచించండి. మనుష్యులు ఒక దీపం వెలిగించినప్పుడు, వారు దానిని బుట్టతో కప్పరు. వారు దానిని మంచం క్రింద ఉంచరు. బదులుగా, వారు దానిని ఒక దీపస్తంభం మీద ఉంచుతారు. ఆ విధంగా గదిలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ దాని వెలుగు చేత చూడగలరు. 17 ఒక రోజు ప్రతి ఒక్కరు ఇప్పుడు దాచబడిన వాటిని అన్నిటినీ చూడగలరని ఇది ఉదాహరిస్తుంది. మరియు ఒక రోజు ప్రతి ఒక్కరూ ఇప్పుడు రహస్యంగా ఉన్న ప్రతి దానిని బహిరంగంగా చూస్తారు. 18 కాబట్టి మీరు {నేను మీకు చెప్పే దానిని} శ్రద్ధగా వింటున్నారని నిర్ధారించుకోండి, ఎందుకంటే ఎవరైనా దేవుని సత్యాన్ని విశ్వసించిన యెడల, దేవుడు అతనికి మరింత ఎక్కువ అర్థమయ్యేలా చేస్తాడు. అయితే ఎవరైనా దేవుని సత్యాన్ని విశ్వసించకపోయిన యెడల, అతడు అర్థం చేసుకున్నాడని భావించే {కొద్ది మొత్తం} కూడా అర్థం చేసుకోకుండా దేవుడు చేస్తాడు.

19 ఒకరోజు యేసు తల్లి మరియు సహోదరులు ఆయనను చూడడానికి వచ్చారు, అయితే ఆయన దగ్గరకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే అక్కడ {అంత}ఒక {పెద్ద} జనసమూహం {ఇంటిలో ఆయన ఉన్న చోట ఆయన చుట్టూ} ఉంది. 20 అప్పుడు మనుష్యులు ఆయనకు చెప్పారు, “నీ తల్లి మరియు నీ సోదరులు నిన్ను చూడడానికి కోరుతూ వెలుపల నిలుచున్నారు." 21 అయితే ఆయన వారికి జవాబిచ్చాడు, "దేవుని నుండి సందేశం విని మరియు దానిని విధేయత చూపేవారు నా తల్లి మరియు నా సోదరుల వలే నాకు ఎంతో ఇష్టం.”

22 మరొక రోజు యేసు తన శిష్యులతో పడవలోనికి వెళ్ళాడు. ఆయన వారితో చెప్పాడు, “మనం సరస్సు యొక్క అవతలి వైపుకు దాటి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను.” కాబట్టి వారు సరస్సు మీదుగా ప్రయాణించడం ప్రారంభించారు. 23 అయితే వారు ఓడలో వెళ్తుండగా యేసు గాఢ నిద్రపోయాడు. అప్పుడు సరస్సు మీద శక్తివంతమైన గాలి తుఫాను ప్రారంభమైంది. కొద్దిసేపటికే పడవ నీళ్లతో నిండిపోతూ ఉంది మరియు వారు ప్రమాదంలో ఉన్నారు. 24 కాబట్టి యేసు శిష్యులు ఆయనను లేపడానికి వచ్చారు. వారు ఆయనతో చెప్పారు, “ప్రభువా! ప్రభువా! మేము అందరం చనిపోబోతున్నాము!” ఆయన మేల్కొన్నాడు మరియు గాలిని మరియు హింసాత్మక అలలను తిట్టాడు. గాలి వీయడం ఆగిపోయింది, అలలు పడవను కొట్టడం ఆగిపోయింది, మరియు ప్రతీది ప్రశాంతంగా మారింది. 25 అప్పుడు ఆయన వారితో చెప్పాడు, “మీకు విశ్వాసం లేనట్లుగా ప్రవర్తించారు!” శిష్యులు {అప్పుడే అక్కడ జరిగిన దాని కారణంగా} ఆందోళన చెందారు మరియు ఆశ్చర్యపోయారు. వారు ఒకరినొకరు అడుగుతూ ఉన్నారు, “యేసు ఎవరై ఉండవచ్చు? ఆయన గాలులను మరియు అలలను కూడా ఆజ్ఞాపించగల్గుతున్నాడు మరియు అవి ఆయనకు లోబడుచున్నాయి."

26 యేసు మరియు ఆయన శిష్యులు ఓడ ప్రయాణం కొనసాగించారు మరియు గెరాసేను మనుష్యులు నివసించిన ప్రాంతానికి వచ్చారు. ఇది గలలీ జిల్లా నుండి సరస్సు యొక్క వ్యతిరేక ఒడ్డుమీద ఉంది. 27 యేసు పడవలోంచి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఒకానొక మనిషి ఆయనకు ఎదురుగా ఉన్నాడు. ఈ మనిషిలో దయ్యాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ వ్యక్తి బట్టలు ధరించలేదు మరియు ఇంటిలో నివసించలేదు. బదులుగా, అతను సమాధి గుహలలో నివసించాడు.

28 ఆ మనిషి యేసును చూసినప్పుడు, అతడు బిగ్గరగా కేకలు వేసాడు మరియు ఆయన ముందు ముఖాన్ని కిందకు ఉంచాడు. అతడు అరిచాడు, “యేసూ, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడా, నాతో నువ్వు ఏమి కోరుతున్నావు? నేను నిన్ను బతిమాలుచున్నాను, నన్ను హింసించవద్దు! ” 29 {ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఎందుకంటే} తనలో నుండి దుష్ట ఆత్మను బయటకు రమ్మని యేసు అప్పుడే ఆజ్ఞాపించాడు. గతంలో మనుష్యులు అతడిని గొలుసులు, మరియు సంకెళ్లతో బంధించారు మరియు అతని మీదా ఎక్కువ నిఘా పెట్టారు. అయినప్పటికీ, అనేక సార్లు దుష్ట ఆత్మ అకస్మాత్తుగా అతనిని బలం చేత పట్టుకుంటుంది. అప్పుడు మనిషి స్వేచ్చగా విడిపించుకుంటాడు, మరియు దయ్యం అతనిని నిర్జన ప్రదేశాలలోనికి వెళ్ళేలా చేస్తుంది.

30 అప్పుడు యేసు, “నీ పేరు ఏమిటి?” అని అడిగాడు. దయ్యం జవాబిచ్చాడు, “{నా పేరు} వేలు” అని జవాబిచ్చాడు. ఎందుకంటే మనిషిలో అనేమైన దయ్యాలు ప్రవేశించాయని చెప్పాడు. 31 దేవుడు దయ్యాలను శిక్షించే లోతైన గోతిలోనికి వెళ్లమని ఆజ్ఞాపించవద్దని దయ్యాలు యేసును వేడుకుంటూనే ఉన్నాయి. 32 సమీపంలోని కొండల వైపు ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. దయ్యాలు పందులలోకి ప్రవేశించడానికి అనుమతించమని యేసును వేడుకున్నాయి, మరియు ఆయన వాటిని అనుమతించాడు. 33 కాబట్టి దయ్యాలు మనిషిని విడిచి వెళ్ళాయి మరియు పందులలోనికి ప్రవేశించాయి, మరియు పందుల గుంపు ఏటవాలు ఒడ్డు నుండి సరస్సులోనికి వేగంగా పరుగెత్తాయి మరియు మునిగిపోయాయి.

34 పందులను మేపుతున్న వారు ఏమి జరిగిందో చూసినప్పుడు, వారు పారిపోయారు! వారు తమ చుట్టూ నివసించే మనుష్యులు అందరికీ తాము చూసిన వాటిని నివేదించారు. 35 అప్పుడు జరిగిన దానిని చూడడానికి మనుష్యులు బయటికి వచ్చారు. వారు యేసు ఉన్న చోటికి వచ్చినప్పుడు, దయ్యాలు విడిచిపెట్టిన మనిషి యేసు యొక్క పాదాల దగ్గర కూర్చోవడం వారు చూశారు. అతడు వస్త్రాలు కలిగి ఉన్నాడని మరియు అతని మనస్సు తిరిగి యధాస్థితిలో ఉందని వారు చూశారు. {యేసు ఎంత శక్తివంతమైనవాడో వారు గ్రహించారు,} మరియు వారు భయపడ్డారు. 36 జరిగిన దానిని చూసిన వారు, దయ్యాల చేత నియంత్రించబడిన మనిషిని యేసు ఏవిధంగా రక్షించాడో అప్పుడే వచ్చిన మనుష్యులకు చెప్పారు. 37 అప్పుడు గెరాసేనులు నివసించే ఆ స్థలము నుండి అనేక మంది మనుష్యులు తమ ప్రాంతాన్ని విడిచి పెట్టాడానికి యేసును అడిగారు ఎందుకంటే వారు చాలా భయపడ్డారు. కాబట్టి యేసు మరియు ఆయన శిష్యులు సరస్సు దాటి తిరిగి వెళ్ళడానికి పడవ ఎక్కారు.

38 వారు వెళ్ళడానికి ముందు, దయ్యాలు విడిచిపెట్టిన మనిషి బయటికి వెళ్ళాడు యేసును బతిమాలాడు, చెప్పాడు, “దయచేసి నన్ను నీతో వెళ్లనివ్వు!” అయితే బదులుగా, యేసు అతనికి చెప్పడం చేత అతనిని బయటికి పంపాడు, 39 “కాదు, నీ ఇంటికి తిరిగి వెళ్ళు మరియు దేవుడు నీ కోసం చేసినదానిని {ప్రతి ఒక్కరికి} చెప్పు!" కాబట్టి ఆ మనిషి వెళ్ళాడు మరియు అతనికోసం యేసు ఎంత చేసాడో ఆ నగరం అంతటా మనుష్యులకు చెప్పాడు.

40 మరియు యేసు మరియు ఆయన శిష్యులు సరస్సు దాటి కపెర్నహూముకు తిరిగి వచ్చినప్పుడు, ఒక మనుష్యుల గుంపు వారిని స్వాగతించారు. వారు అందరూ ఆయన కోసం అక్కడ ఎదురుచూస్తూ ఉన్నారు. 41 అప్పుడే అక్కడ ఉన్న సమాజ మందిరపు నాయకులలో యాయీరు అను పేరు గల ఒక మనిషి యేసు దగ్గరికి వచ్చాడు. అతడు ఆయన ముందు ముఖాన్ని కిందకు ఉంచాడు. యేసు తన ఇంటికి రావడానికి యేసును బతిమాలాడు. 42 అతడు దీనిని చేసాడు ఎందుకంటే అతడు ఒకే ఒక కుమార్తెను కలిగియున్నాడు, ఆమెకు దాదాపు 12 సంవత్సరాల వయస్సు, మరియు ఆమె చనిపోతూ ఉంది. {ఆయన ఆమెను స్వస్థపరచడానికి అతడు కోరుకున్నాడు.} ఇప్పుడు యేసు {అతనితో} వెళ్ళినప్పుడు, అనేకమంది మనుష్యులు ఆయన చుట్టూ గుమిగూడారు. 43 ఇప్పుడు జన సమూహంలో నిరంతర రక్తస్రావం కలిగించే వ్యాధితో 12 సంవత్సరాలుగా బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమెకు సహాయం చేయడానికి ఆమె తన డబ్బు మొత్తాన్ని వైద్యులకు చెల్లించడానికి ఖర్చు చేసింది, అయితే వారిలో ఎవరూ ఆమెను స్వస్థపరచలేక పోయారు. 44 ఆమె యేసు వెనుకకు వచ్చింది మరియు ఆయన అంగీ యొక్క అంచును తాకింది. ఒక్కసారిగా ఆమె రక్తస్రావం ఆగిపోయింది.

45 యేసు చెప్పాడు, "నన్ను ఎవరు ముట్టారు?" {యేసు చుట్టూ ఉన్న} ప్రతి ఒక్కరు వారు ఆయనను తాకలేదు అని చెప్పారు. పేతురు చెప్పాడు, “బోధకుడా, నీ చుట్టూ అనేక మంది మనుష్యులు గుంపుకూడారు మరియు నీకు వ్యతిరేకంగా పడుతున్నారుగా ఉన్నారు మరియు మీకు వ్యతిరేకంగా ఒత్తిడి చేస్తున్నారు. {కాబట్టి వారిలో ఎవరైనా ఒకరు నిన్ను తాకి ఉండవచ్చు!}” 46 అయితే యేసు చెప్పాడు, “ఒకరు {ఉద్దేశపూర్వకంగా} నన్ను తాకారు అని నాకు తెలుసు, ఎందుకంటే నా నుండి {ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి} శక్తి బయటికి వెళ్ళింది.” 47 అప్పుడు ఆ స్త్రీ తాను దాచలేనని గ్రహించింది. ఆమె వణుకుతూ యేసు వద్దకు వచ్చింది మరియు {గౌరవంగా} ఆయన ముందు నేల మీద ముఖాన్ని కిందకు ఉంచుకొంది. ఇతర మనుష్యులు వింటూ ఉండగా, ఆమె యేసును ఎందుకు తాకిందో మరియు ఆమె వెంటనే ఎలా మెరుగుపడిందో వివరించింది. 48 మరియు యేసు ఆమెతో చెప్పాడు, “నా ప్రియమైన స్త్రీ, నేను నిన్ను స్వస్థపరచగలనని నీవు విశ్వసించిన కారణంగా, {నీవు నిన్ను స్వస్థపరచగలను అని}, ఇప్పుడు నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు నీ దారిలో వెళ్ళు, మరియు దేవుని సమాధానం నీతో ఉంటుంది గాక!.”

49 యేసు ఇంకా {ఆ స్త్రీతో} మాట్లాడుతుండగా, యాయీరు ఇంటి నుండి ఒక మనిషి వచ్చాడు మరియు యాయీరుతో చెప్పాడు, "నీ కుమార్తె చనిపోయింది. కాబట్టి ఇకపై బోధకుని సమయాన్ని వ్యర్ధపరచవద్దు.” 50 అయితే యేసు అది నినినప్పుడు, ఆయన యాయీరుతో చెప్పాడు, “భయపడకు. కేవలం {నాలో } విశ్వసించు, మరియు ఆమె తిరిగి జీవిస్తుంది. 51 అతడు ఇంటి వెలుపలికి వచ్చినప్పుడు, పేతురు, యోహాను మరియు యాకోబు మరియు అమ్మాయి తండ్రి మరియు తల్లి తప్ప ఇతరులను తనతో పాటు ఇంటిలోనికి వెళ్లడానికి యేసు అనుమతించలేదు. 52 అక్కడ ఉన్న మనుష్యులు అందరూ ఆ అమ్మాయి చనిపోయింది అని ఎంత బాధగా ఉన్నారో బిగ్గరగా చూపిస్తూ ఉన్నారు. అయితే యేసు వారితో చెప్పాడు, “ఏడ్వడం ఆపండి! ఆమె చనిపోలేదు! ఆమె కేవలం నిద్ర పోతోంది! ” 53 మరియు మనుష్యులు ఆయనను చూచి నవ్వారు ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిందని వారికి తెలుసు. . 54 అయితే యేసు ఆమె యొక్క చెయ్యి పట్టుకున్నాడు మరియు {ఆమెను} పిలిచాడు, చెప్పాడు, "చిన్నదానా, పైకి లెమ్ము!" 55 మరియు వెంటనే ఆమె తిరిగి బ్రతికింది మరియు ఆమె పైకి లేచింది. ఆమె తినడానికి ఏదైనా ఇవ్వమని యేసు వారికి చెప్పాడు. 56 మరియు ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, అయితే జరిగిన దానిని {ఇంకా} మరి ఎవరికీ చెప్పవద్దని యేసు వారికి చెప్పాడు.

Chapter 9

1 అప్పుడు యేసు తన పన్నెండు మంది శిష్యులను కలిపి పిలిచాడు, మరియు అన్ని రకాల దయ్యాలను వెళ్లగొట్టడానికి మరియు {మనుష్యుల} వ్యాధులను స్వస్థపరచడానికి అధికారాన్ని మరియు శక్తిని వారికి ఇచ్చాడు. 2 దేవుడు రాజు వలే ఏవిధంగా పరిపాలిస్తాడో {సువార్తను గురించి} ప్రకటించడానికి వారిని పంపించాడు. అనారోగ్యంతో ఉన్న మనుష్యులను స్వస్థపరచడానికి వారికి ఆయన చెప్పాడు.

3 {వారు వెళ్ళడానికి ముందు,} ఆయన వారితో చెప్పాడు, “మీ ప్రయాణం కోసం మీతో ఏమీ తీసుకువెళ్ళకండి. నడకలో సాయపడే కర్రను లేదా ఒక ప్రయాణీకుల సంచి లేదా ఆహారం లేదా డబ్బును తీసుకోవద్దు. అదనపు అంగీ తీసుకొని వెళ్ళవద్దు. 4 మీరు ప్రవేశించిన ఏ ఇంటిలోనైనా, మీరు ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లేంత వరకు ఆ ఇంటిలోనే ఉండండి.

5 ఏ ఊరిలోనైనా మనుష్యులు మిమ్ములను స్వాగతించకపోయిన యెడల, మీరు అక్కడ ఉండకూడదు. బదులుగా, ఆ పట్టణాన్ని విడిచిపెట్టండి మరియు, మీరు వెళ్తూ ఉండగా, మీ పాదాల నుండి దాని దుమ్మును కదిలించండి. అది వారికి {మిమ్మల్ని తిరస్కరించినందుకు} హెచ్చరిక అవుతుంది. 6 అప్పుడు యేసు శిష్యులు వెళ్ళారు మరియు అనేక గ్రామాల గుండా ప్రయాణించారు. వారు వెళ్లిన ప్రతిచోటా, దేవుని నుండి సువార్త గురించి మనుష్యులతో మాట్లాడారు మరియు వారు రోగులను స్వస్థపరిచారు.

7 గలిలయ యొక్క జిల్లా మీద పాలకుడు, హేరోదు జరుగిన దాని నంతటిని గురించి విన్నాడు మరియు అతడు కంగారుపడ్డాడు. బాప్తిస్మమిచ్చు యోహాను తిరిగి బ్రతికాడని కొందరు మనుష్యులు అంటున్నారు. 8 ఇతర మనుష్యులు ఏలీయా ప్రవక్త మరల ప్రత్యక్ష్యం అయ్యాడు అని చెప్పారు. ఇంకా కొందరు చాలా కాలం క్రితం నుండి వచ్చిన ఇతర ప్రవక్తలలో ఒకరు మళ్లీ సజీవంగా మారారని చెప్పారు. 9 అయితే హేరోదు చెప్పాడు, “ఇది యోహాను కాలేడు, ఎందుకంటే నేను అతని తలను నరికివేసాను. కాబట్టి ఈ మనిషి ఎవరు? నేను అతని గురించి అద్భుతమైన విషయాలు వింటూనే ఉన్నాను! ” మరియు అతడు యేసును చూడటానికి మార్గం కోసం వెతుకుతూనే ఉన్నాడు

10 అపొస్తలులు తమ ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు, తాము చేసినదంతా యేసుకు చెప్పారు. తర్వాత అతను తనతో పాటు బేత్సయిదా పట్టణానికి ఒంటరిగా వెళ్లడానికి వారిని పక్కకు తీసుకెళ్లాడు. 11 అయితే యేసు ఎక్కడికి వెళ్లాడో జనసమూహం తెలుసుకొన్నప్పుడు, వారు అక్కడ ఆయనను వెంబడించారు. ఆయన వారిని స్వాగతించాడు మరియు దేవుడు రాజు వలే ఏవిధంగా పరిపాలించబోతున్నాడనే దాని గురించి వారితో మాట్లాడాడు. అనారోగ్యంతో ఉన్నవారిని కూడా ఆయన స్వస్థపరిచాడు.

12 ఇప్పుడు పగటిపూట ఆలస్యం అవుతూ ఉంది, కాబట్టి పన్నెండు మంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు మరియు చెప్పారు, “దయచేసి ఈ పెద్ద జనసమూహాన్ని పంపివేయండి, తద్వారా వారు చుట్టుపక్కల గ్రామాలకు మరియు పొలాలకు వెళ్లి ఆహారం పొందదానికి మరియు నిలిచియుండడానికి స్థలాలను వెదకుతారు, ఎందుకంటే మనం ఈ ఏకాంత ప్రదేశంలో ఉన్నాము. " 13 అయితే ఆయన వారితో చెప్పాడు, “మీరు వారికి తినడానికి ఏదైనా ఇవ్వాలి!” వారు జవాబిచ్చారు, "మా దగ్గర ఉన్నది అంతా ఐదు చిన్న రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు. ఈ మనుష్యులు అందరికీ సరిపడా ఆహారాన్ని కొనడానికి మేము ఎప్పటికీ వెళ్లలేము! 14 {వారు ఇది చెప్పారు} ఎందుకంటే అక్కడ దాదాపు 5000 మంది పురుషులు ఉన్నారు. అప్పుడు యేసు శిష్యులతో చెప్పాడు, "మనుష్యులు గుంపులుగా కూర్చోబెట్టండి. ఒక్కో గుంపులో దాదాపు 50 మందిని ఉంచండి. 15 కాబట్టి శిష్యులు దానిని చేసారు మరియు మనుష్యులు అందరూ కింద కూర్చున్నారు. 16 అప్పుడు యేసు ఐదు రొట్టెలు మరియు రెండు చేపలు తీసుకున్నాడు. ఆయన పరలోకం వైపుకు పైకి చూసాడు మరియు వాటి కోసం దేవుణ్ణి స్తుతించాడు. అప్పుడు ఆయన రొట్టె మరియు చేపలను ముక్కలుగా విభజించాడు మరియు మనుష్యులకు పంచడానికి వారికోసం శిష్యులకు వాటిని ఇచ్చాడు. 17 వారు అందరూ తిన్నారు, మరియు ప్రతిఒక్కరు తినడానికి సరిపడా ఉంది. అప్పుడు శిష్యులు 12 బుట్టలను నింపిన మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించారు!

18 ఒకరోజు యేసు తన శిష్యులతో కలిసి సమీపంలో ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉండగా, ఆయన వారిని అడిగాడు, “జన సమూహాలు నేను ఎవరు అని చెపుతున్నారు?” 19 వారు జవాబిచ్చారు, "{కొందరు మనుష్యులు చెపుతున్నారు, నువ్వు} బాప్తిస్మం ఇచ్చే యోహాను, అయితే ఇతరులు నువ్వు ప్రవక్త ఏలీయా అని చెపుతున్నారు, మరియు ఇంకా ఇతరులు చాలా కాలం నుండి తిరిగి బ్రతికిన ఇతర ప్రవక్తలలో ఒకడివి అని చెపుతున్నారు." 20 ఆయన వారిని అడిగాడు, “మీ గురించి ఏమిటి? నేనెవరిని అని మీరు చెపుతారు?" పేతురు జవాబిచ్చాడు, "నీవు దేవుని నుండి వచ్చిన మెస్సీయవు.” 21 అప్పుడు ఆ విషయాన్ని ఇంకా ఎవరికీ చెప్పవద్దు అని యేసు వారిని గట్టిగా హెచ్చరించాడు. 22 అప్పుడు ఆయన చెప్పాడు, “మనుష్యకుమారుడనైన నేను అనేక శ్రమలు అనుభవించాలి: పెద్దలు, ప్రధాన యాజకులు, మరియు యూదుల ధర్మశాస్త్ర బోధకులు నన్ను తిరస్కరిస్తారు మరియు నన్ను చంపుతారు. అప్పుడు మూడవ రోజున నేను మళ్లీ బ్రతికి వస్తాను.”

23 అప్పుడు ఆయన వారు అందరితో చెప్పాడు, “మీలో ఎవరైనా నాకు శిష్యులుగా ఉండాలని కోరుకున్న యెడల, మీరు చేయాలనుకున్నది మాత్రమే చేయకూడదు. బదులుగా, ప్రతి దినం మీరు మీ ప్రాణాన్ని ఇచ్చివేసుకోనేంత వరకు శ్రమ పడడానికి ఇష్టంగా ఉండాలి. ఆ విధంగా నా శిష్యునిగా ఉండాలి. 24 {మీరు అది చెయ్యాలి} ఎందుకంటే తమ సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు శాశ్వతంగా వాటిని కోల్పోతారు, అయితే నా శిష్యులు కావడానికి తమ ప్రాణాలను కోల్పోయే వారు తమ ప్రాణాలను శాశ్వతంగా కాపాడుకుంటారు. 25 అన్నింటికంటే, మీరు ఈ లోకంలోని సమస్తాన్ని సంపాదించుకున్న యెడల, ఆయిత మీరు తరువాత కోల్పోవడం లేదా మీ స్వంతాన్ని నాశనం చేసుకోవడం ద్వారా మీకు ఏవిధంగా ప్రయోజనం చేకూరుతుంది? 26 ఎవరైనా నాలో విశ్వసిస్తున్నారని మరియు నా బోధను వారు అనుసరిస్తున్నారని చెప్పడానికి భయపడుతున్నారని అనుకుందాం. అప్పుడు, మనుష్యకుమారుడనైన నేను, అటువంటి వ్యక్తి నాకు చెందినవాడు కాదని చెపుతాను. నేను నా మహిమలో మరియు తండ్రి అయిన దేవుని యొక్క మరియు పరిశుద్ధ దేవదూతల యొక్క మహిమలో తిరిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. 27 అయితే మీరు దీని గురించి నిశ్చయంగా ఉండవచ్చు: ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్న మీలో కొందరు దేవుడు రాజు వలే పరిపాలించడం మీరు చూసే వరకు చనిపోరు.

28 యేసు ఆ మాటలు చెప్పిన దాదాపు ఎనిమిది రోజుల తరువాత, ఆయన పేతురు, యోహాను, మరియు యాకోబులను తనతోపాటు తీసుకెళ్ళాడు మరియు {అక్కడ} ప్రార్థన చేయడానికి ఒక కొండపైకి వెళ్లాడు. 29 ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖం యొక్క రూపం చాలా భిన్నంగా మారింది మరియు ఆయన వస్త్రాలు ప్రకాశవంతంగా వెలిగిపోవడం ఆరంభం అయ్యింది. 30 ఒకేసారి, ఇద్దరు {చాలా కాలం నుండి ప్రవక్తలు} అక్కడ యేసుతో మాట్లాడుతూ ఉన్నారు. వారు మోషే మరియు ఏలీయాలు. 31 ఈ మనుషులు మహిమలో చుట్టుముట్టబడి ప్రత్యక్షం అయ్యారు. వారు యేసుతో ఆయన ఏవిధంగా చనిపోతాడనే దాని గురించి వారు ఆయనతో మాట్లాడారు. యెరూషలేములో త్వరలో జరగబోయేది ఇదే. 32 పేతురు మరియు అతనితో ఉన్న ఇతర శిష్యులు చాలా నిద్రగా ఉన్నారు. అయితే వారు పూర్తిగా మేల్కొన్నప్పుడు, యేసు ఎంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడో వారు చూశారు. మోషే మరియు ఏలీయా ఆయనతో పాటు నిలబడటం కూడా వారు చూశారు. 33 మోషే, ఏలీయాలు యేసును విడిచి వెళ్లడం మొదలుపెట్టినప్పుడు పేతురు ఆయనతో చెప్పాడు, “బోధకుడా, ఇక్కడ ఉండడం ఇక్కడ ఉండడం మన కోసం మంచిది! మనం మూడు గుడారాలను ఏర్పాటు చేయాలి, ఒకటి నీ కోసం, ఒకటి మోషే కోసం మరియు ఒకటి ఏలీయా కోసం! అయితే అతడు ఏమి చెబుతున్నాడో అతనికి నిజంగా అర్థం కాలేదు. 34 ఆయన ఈ మాటలు చెపుతూ ఉండగా ఒక మేఘం ఏర్పడింది మరియు వారిని చుట్టూముట్టింది. మేఘం వారిని చుట్టుముట్టడంతో శిష్యులు భయపడ్డారు. 35 మేఘం నుండి దేవుని స్వరం వారితో చెప్పింది: “ఈయన నేను ఏర్పాటు చేసుకొన్న నా కుమారుడు. ఆయన మాట వినండి!" 36 ఆ స్వరం మాట్లాడడం ముగిసిన తరువాత, అక్కడ యేసు మాత్రమే ఉన్నట్లు {ముగ్గురు శిష్యులు చూశారు}. దీనిని అంతటిని వారు తమకైతాము దాచుకొన్నారు. ఎందుకంటే చాలా కాలం వరకు తాము చూసిన విషయాన్ని వారు ఎవరికీ చెప్పలేదు.

37 మరుసటి రోజు, వారు కొండ దిగి వచ్చినప్పుడు, మనుష్యుల యొక్క ఒక పెద్ద గుంపు యేసును కలుసుకొన్నారు. 38 అకస్మాత్తుగా జన సమూహంలో నుండి ఒక మనిషి పిలిచాడు, “బోధకుడా, నేను నిన్ను వేడుకుంటున్నాను, నా కుమారునికి సహాయం చెయ్యడానికి ఏదైనా చెయ్యి! అతడు నాకు ఒక్కడే సంతానం. 39 ఇక్కడ ఇది జరుగుతోంది. ఒక దుష్ట ఆత్మ అకస్మాత్తుగా అతనిని పట్టుకుంటుంది మరియు అతడు కేకలు వేసేలా చేస్తుంది. ఇది అతనిని తీవ్రంగా వణికిస్తుంది మరియు అతని నోటి వద్ద నురుగును కలిగిస్తుంది. ఈ ఆత్మ ఎప్పుడూ నా కుమారుడిని విడిచిపెట్టదు మరియు అది చేసినప్పుడు, అది అతనిని తీవ్రంగా గాయపరుస్తుంది. 40 అతనిలో నుండి దుష్ట ఆత్మను బయటకు రావడానికి ఆజ్ఞాపించడానికి నీ శిష్యులతో వేడుకున్నాను, అయితే వారు దానిని చేయలేకపోయారు.

41 ప్రతిస్పందనగా, యేసు చెప్పాడు, “ఈ తరం యొక్క మనుష్యులు నమ్మరు, మరియు కాబట్టి దాని ఆలోచన చెడిపోయింది! మీరు విశ్వసించడానికి ముందు నేను మీతో ఇంకెంత కాలం ఉండాలి?” {అప్పుడు ఆయన బాలుడి తండ్రితో చెప్పాడు,} "నీ కుమారుడిని నా దగ్గరకు ఇక్కడకు తీసుకొనిరమ్ము!" 42 వారు బాలుడిని ఆయన వద్దకు తీసుకొని వస్తూ ఉండగా, ఆ దయ్యం బాలుడిని నేలమీదకు త్రోసివేసింది మరియు తీవ్రంగా కదిలించింది. అయితే యేసు దుష్ట ఆత్మను గద్దించాడు మరియు ఆ బాలుడిని స్వస్థపరిచాడు. అప్పుడు ఆయన అతనిని తన తండ్రికి తిరిగి ఇచ్చాడు. 43 అప్పుడు అక్కడ ఉన్న మనుష్యులు అందరూ దేవుడు చూపిన గొప్ప శక్తిని చూసి పూర్తిగా ఆశ్చర్యపోయారు.

యేసు చేస్తున్న అన్ని అద్భుతాలను చూసి వారు అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా, ఆయన తన శిష్యులతో చెప్పాడు, 44 “నేను మీకు చెప్పబోవుచున్నదానిని గురించి జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఒకరు త్వరలో మనుష్యకుమారుడైన నన్ను నా శత్రువులకు అప్పగిస్తారు." 45 అయితే శిష్యులకు ఆయన ఏమి చెప్పాడో అర్థం కాలేదు. ఆయన చెప్పినదానిని అర్థం చేసుకోకుండా దేవుడు వారిని అడ్డుకున్నాడు, తద్వారా ఆయన ఉద్దేశ్యం వారికి ఇంకా తెలియకుండా పోయింది మరియు ఆయన చెప్పిన దాని గురించి అడగడానికి వారు భయపడ్డారు.

46 కొంతకాలం తరువాత, శిష్యులు తమలో ఎవరు ముఖ్యమైన వ్యక్తి అని తమ మధ్యలో తాము వాదించుకోవడం మొదలుపెట్టారు. 47 అయితే వారు ఏమి ఆలోచిస్తున్నారో యేసుకు తెలుసు కాబట్టి అతను ఒక చిన్న బిడ్డను తీసుకు వచ్చాడు మరియు ఆయన ప్రక్కను చిన్నబిడ్డను నిలబెట్టుకున్నాడు. 48 ఆయన వారితో చెప్పాడు, “నా కారణంగా ఇటువంటి ఒక చిన్నబిడ్డను స్వాగతించిన యెడల అది నన్ను స్వాగతించిన విధంగానే ఉంటుంది. మరియు మరియు ఎవరైనా నన్ను స్వాగతించిన యెడల, అది నన్ను పంపిన దేవునిని స్వాగతించిన విధంగా ఉంటుంది. మీ మధ్యలో ఎవరు అతి తక్కువ ప్రాముఖ్యమైన వారుగా ఉండడానికి కనిపిస్తున్నారో అటువంటి వారిని దేవుడు అత్యంత ముఖ్యమైనవారిగా భావిస్తాడు అని జ్ఞాపకం ఉంచుకోండి.

49 యోహాను యేసుకు జవాబిచ్చాడు, “బోధకుడా, మనుషులలో నుండి దయ్యాలను బయటకు రావడానికి ఆజ్ఞాపించడానికి నీ పేరును ఉపయోగిస్తున్న ఒక మనిషిని మేము చూశాం. అయితే అతడు మేము ఉన్న విధంగా నీతో సన్నిహితంగా పనిచేయడం లేదు కాబట్టి అలా చేయడం మానేయమని మేము అతనికి చెప్పాము. 50 అయితే యేసు యోహానుతో, చెప్పాడు, “అది చెయ్యడం నుండి అతనిని ఆపవద్దు! ఎవరైనా మీకు హాని కలిగించే పని చేయకపోయిన యెడల, అతడు చేసేది మీకు ప్రయోజన కరం అవుతుంది! ”

51 దేవుడు ఆయనను తిరిగి పరలోకానికి తీసుకొని వెళ్ళే సమయం సమీపిస్తున్నప్పుడు, యేసు యెరూషలేముకు వెళ్లాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. 52 ఆయన తనకు ముందుగా కొంతమంది దూతలను పంపాడు. వారు ప్రయాణం చేసారు మరియు ఆయన బస చెయ్యడానికి ఆయన కోసం ఏర్పాటు చెయ్యడానికి ప్రయతించడానికి సమరయ ప్రాంతంలోని ఒక గ్రామానికి వెళ్ళారు. 53 అయితే ఆయన యెరూషలేముకు వెళ్తున్న మార్గంలో ఉన్న కారణంగా సమరయులు యేసును తమ గ్రామంలో ఉండనివ్వలేదు. 54 ఆయన శిష్యులలో ఇద్దరు, యాకోబు మరియు యోహాను, {సమూహాలు తమను స్వాగతించకపోవడాన్ని} చూసి {కోపం చెందారు}. కాబట్టి వారు యేసును అడిగారు, “ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి ఈ మనుష్యులను నాశనం చేయమని మేము ఆజ్ఞాపించాలని నీవు కోరుకుంటున్నావా?” 55 అయితే యేసు {వారి వైపు} తిరిగాడు, మరియు వారు అది చెప్పడం తప్పు అని వారికి కఠినంగా చెప్పాడు. 56 కాబట్టి వాళ్లు భిన్నమైన గ్రామానికి వెళ్లారు.

57 యేసు మరియు శిష్యులు మార్గంలో నడుచుకుంటూ వెళ్తూ ఉండగా, ఒకరు ఆయనతో చెప్పాడు, “నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీతో వస్తాను!” 58 యేసు జవాబిచ్చాడు, “నక్కలకు నివసించడానికి భూమిలో రంధ్రాలు ఉన్నాయి, మరియు పక్షులకు గూళ్లు ఉన్నాయి, అయితే మనుష్యకుమారుడైన నాకు నిద్రించడానికి ఒక ఇల్లు లేదు!”

59 యేసు మరొక వ్యక్తితో చెప్పాడు, “నాతో రా!” అయితే ఆ వ్యక్తి చెప్పాడు, “ప్రభువా, నేను ముందుగా ఇంటికి వెళ్లి మరియు నా తండ్రిని పాతిపెట్టనివ్వండి” 60 అయితే యేసు అతనితో, చెప్పాడు, “చనిపోయినవారు తమ సొంత చనిపోయినవారిని పాతిపెట్టనివ్వండి. మీరు వెళ్ళాలి మరియు ప్రతిచోటా ఉన్న మనుష్యులు తన జీవితాలకు దేవుని పరిపాలన కలిగియుండగలరని చెప్పాలని నేను కోరుకుంటున్నాను.

61 మరొకరు చెప్పారు, "ప్రభువా, నేను నీతో వస్తాను మరియు నీ శిష్యునిగా ఉంటాను, అయితే ముందుగా నా కుటుంబానికి వీడ్కోలు చెప్పడానికి నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి" 62 యేసు అతనితో చెప్పాడు, “రైతు వలే ఉన్న ఎవరైనా తన పొలమును దున్నడానికి ప్రయత్నించేవాడు తన వెనుక వైపు చూస్తూ ఉండగా దేవుణ్ణి తన పరిపాలకుడి వలే సేవించలేడు.”

Chapter 10

1 ఆ తర్వాత, యేసు మరో 72 మంది శిష్యులను {వెళ్ళడానికి మరియు ఆయన మాట వినడానికి మనుష్యులను సిద్ధపరచడానికి}నియమించాడు. తనకుతాను వెళ్ళడానికి ఆయన ఉద్దేశించిన ప్రతి పట్టణం మరియు గ్రామానికి ఆయనకు ముందుగా వెళ్లడానికి ఆయన వారిని జంటలుగా పంపాడు. 2 ఆయన వారితో చెప్పాడు, “అనేక మంది మనుష్యులు నన్ను విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారు, అయితే మీలో కొందరిని మాత్రమే వారికి సహాయం చేయడానికి నేను పంపగలను. కాబట్టి {, విశ్వసించడానికి కోరుతున్న ఆ మనుష్యులు అందరు ప్రజలందరూ} దేవునికి ప్రార్థన చెయ్యండి మరియు వెళ్ళగలిగి మరియు వారికి సహాయం చెయ్యగలిగిన ఎక్కువమంది శిష్యుల కోసం విజ్ఞాపన చెయ్యండి. 3 ఇప్పుడే వెళ్ళండి, అయితే మీ విషయంలో శత్రుత్వం కలిగియుండే మనుష్యుల వద్దకు నా సందేశం చెప్పడానికే నేను మిమ్మును పంపుతున్నాను అని జ్ఞాపకం చేసుకోండి. 4 ఎటువంటి డబ్బును వెంట తీసుకురావద్దు. ఒక సంచిలో {మీతో అనేకమైన వస్తువులను} తీసుకురావద్దు. {అదనపు చెప్పులు} తీసుకురావద్దు. దారిలో ఉన్న వ్యక్తులతో {ఆగి} మాట్లాడకండి. 5 మీరు ఒక ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు, ముందుగా అక్కడ నివసించే మనుష్యులతో చెప్పండి, "ఈ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవుడు సమాధానముతో ఆశీర్వదించును గాక! 6 అక్కడ నివసించే మనుష్యులు దేవుని సమాధానమును కోరుకున్న యెడల, మీరు వారికి అందిస్తున్న సమాధానమును వారు అనుభవిస్తారు. అయితే వారు దేవుని సమాధానమును కోరుకోకపోయిన యెడల, అప్పుడు ఆ సమాధానమును మీరే అనుభవిస్తారు. 7 మీరు ఆ గ్రామం విడిచి వెళ్లేంత వరకు ఆ ఇంటిలోనే ఉండండి. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి తిరగవద్దు. మీ కోసం వారు అందించినవన్నీ తినండి మరియు త్రాగండి, ఎందుకంటే ఒక పనివాడు తన పని కోసం చెల్లింపు పొందేందుకు అర్హుడు.

8 మీరు ఏదైనా పట్టణంలో ప్రవేశించి, మరియు అక్కడి మనుష్యులు మిమ్మల్ని స్వాగతించిన యెడల, వారు మీ కోసం అందించే ఆహారం ఏదైనా తినండి. 9 ఆ నగరంలో అనారోగ్యంతో ఉన్న మనుష్యులను స్వస్థపరచండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, 'దేవుడు రాజు వలే ప్రతిచోటా పరిపాలిస్తున్నప్పుడు అది ఏవిధంగా ఉంటుందో మీరు చాలా దగ్గరగా చూస్తున్నారు.’ 10 అయితే మీరు ఏదైనా పట్టణంలోకి ప్రవేశించినప్పుడు, మరియు అక్కడి మనుష్యులు మిమ్ములను స్వాగతించకపోయిన యెడల, దాని ప్రధాన వీధుల్లోకి వెళ్ళండి మరియు చెప్పండి, 11 {ఒక హెచ్చరిక వలే} మీకు వ్యతిరేకంగా, {మీ పట్టణాన్ని వదిలి వెళ్తూ ఉండగా}మేము మా పాదాలకు అంటుకొని యున్న దుమ్మును సహితం తుడిచివేస్తాము. అయితే దేవుడు ప్రతిచోటా రాజు వలే పరిపాలించినప్పుడు ఏవిధంగా ఉంటుందో మీరు చాలా దగ్గరగా చూశారని మీరు గ్రహించాలి!' 12 దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే సమయంలో దేవుడు ఆ పట్టణ మనుష్యులను చాలా కాలం క్రితం సొదొమ యొక్క నగరంలో నివసించిన దుష్ట మనుష్యుల కంటే మరింత కఠినంగా శిక్షిస్తాడని నేను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను! 13 కొరాజీనా మరియు బేత్సయిదా యొక్క నగరాలలో నివసించే మీరు మనుష్యులైన మీ కోసం ఇది చాలా భయంకరంగా ఉంటుంది. నేను ఇది చెపుతున్నాను ఎందుకంటే నేను మీ నగరాలలో ఉన్నప్పుడు గొప్ప అద్భుతాలు చేశాను. నేను అదే అద్భుతాలను {పురాతన నగరాలైన} తూరు మరియు సీదోనులలో చేసి ఉన్న యెడల, అక్కడ నివసించిన {దుష్ట} మనుష్యులు తమ పాపముల కోసం చాలా పశ్చాత్తాపపడి ఉండేవారు. గోనె పట్టాలు ధరించి, మరియు తమ తలల మీద బూడిద ఉంచుకొని నేల మీద కూర్చోవడం ద్వారా వారు చాలా విచారంగా ఉన్నారని చూపించేవారు. 14 కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చినప్పుడు, తూరు, సీదోనులలో నివసించిన దుర్మార్గులైన మనుష్యుల కంటే మిమ్మల్ని ఆయన కఠినంగా శిక్షిస్తాడు. 15 కపెర్నహూము యొక్క పట్టణంలో నివసించే మనుష్యులు మీతో కూడా నేను చెప్పడానికి ఒక విషయం ఉంది. దేవుడు మీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడని మీరు అనుకోవచ్చు. లేదు, దేవుడు నీకు ఎటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వబోవడం లేదు!”

16 {యేసు శిష్యులతో కూడా చెప్పాడు,}"మీ సందేశాన్ని వింటున్న వారు {, నిజానికి,} నా మాట వింటున్నారు. మీ సందేశాన్ని తిరస్కరిస్తున్న వారు {, నిజానికి,} నన్ను తిరస్కరిస్తున్నారు. మరియు నన్ను తిరస్కరించిన వారు {, నిజానికి,} నన్ను పంపిన దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు.”

17 యేసు నియమించిన 72 మంది మనుష్యులు {వెళ్ళారు మరియు ఆయన వారికి చెప్పినది చేసారు.} వారు తిరిగి వచ్చినప్పుడు వారు చాలా సంతోషించారు. వారు చెప్పారు, “ప్రభువా, నీ అధికారం చేత మేము మనుష్యులను విడిచి పెట్టాడానికి వాటికి ఆజ్ఞాపించినప్పుడు దయ్యాలు సహితం మాకు విధేయత చూపాయి!” 18 యేసు వారితో చెప్పాడు, {మీరు దూరంగా ఉండి దానిని చేస్తూ ఉండగా,}, మెరుపు వచ్చినంత హఠాత్తుగా మరియు త్వరగా సాతాను ప్రయోజనం యొక్క స్థానాన్ని కోల్పోవడం నేను చూశాను. 19 వినండి! దుష్ట ఆత్మలను ఓడించే శక్తిని నేను నీకు ఇచ్చాను. మన శత్రువు అయిన సాతానును ఓడించడానికి తగినంత శక్తిని కూడా నేను నీకు ఇచ్చాను. ఏదీ మిమ్మల్ని ఎన్నటికీ బాధించదు. 20 అయితే దుష్ట ఆత్మలు మీకు లోబడతున్నాయని {మాత్రమే} సంతోషించకండి. దేవుడు మీ పేర్లను పరలోకంలో వ్రాసినందుకు మీరు {మరింత} సంతోషించాలి{, ఎందుకంటే మీరు ఎప్పటికీ దేవునితో శాశ్వతం ఉంటారు అని దాని అర్థం}.”

21 ఆ సమయంలోనే పరిశుద్ధ ఆత్మ యేసుకు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. ఆయన చెప్పాడు, “నా తండ్రీ దేవా, పరలోకంలోనూ మరియు భూమి మీద ఉన్న సమస్తం మీద నువ్వు ప్రభుడవు. సంగతులను అర్థం చేసుకోవడం తాము బుద్ధిమంతులమని తలంచే మనుష్యులను నువ్వు నిరోధించినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నాను. బదులుగా, నీ సత్యాన్ని చిన్నపిల్లల వలె సిద్ధబాటుతో అంగీకరించే మనుష్యులకు నీవు వాటిని బయలుపరచావు. అవును, తండ్రీ, నీవు దానిని చేసావు ఎందుకంటే ఆ విధంగా చెయ్యడం నీకు ఇష్టం అయ్యింది.

22 దేవుడు, నా తండ్రి, నాకు ప్రతి దానిని ఇచ్చాడు. నా తండ్రి మాత్రమే ఆయన కుమారుడనైన నన్ను నిజముగా యెరుగును. మరియు నేను, ఆయన కుమారుడను, మాత్రమే, నిజంగా నా తండ్రిని యెరుగుదును. అయితే ఆయన ఎవరో కొంతమంది మనుష్యులకు చూపించడానికి నేను ఎంచుకున్నాను.

23 అప్పుడు యేసు తన శిష్యులతో చెప్పాడు, “నేను చేస్తున్న పనులు మీరు చూడనివ్వడం ద్వారా దేవుడు మీకు ఒక గొప్ప బహుమతి ఇచ్చాడు. 24 నేను చేస్తున్న పనులను చూడడానికి అనేక మంది ప్రవక్తలు మరియు రాజులు ఇష్టపడతారని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే వారు వాటిని చూడలేకపోయారు {, ఎందుకంటే వారు చాలా కాలం క్రితం జీవించారు}. నేను చెప్పుచుండగా మీరు వింటున్న సంగతులు వినడానికి వారు ఇష్టపడతారు. అయితే వారు వాటిని వినలేకపోయారు{, ఎందుకంటే వారు చాలా కాలం క్రితం జీవించారు}.”

25 అక్కడ యూదుల ధర్మశాస్త్ర బోధకుడైన ఒక మనిషి ఉన్నాడు. అతడు యేసును పరీక్షించడానికి కోరాడు {కష్టమైన ప్రశ్న అడగడం చేత}. కాబట్టి అతడు పైకి లేచాడు మరియు అడిగాడు, "బోధకుడా, దేవునితో శాశ్వతంగా జీవించడానికి నేను ఏమి చెయ్యవలసి ఉంది?” 26 యేసు అతనితో చెప్పాడు, “దేవుడు తనకు ఇచ్చిన ధర్మశాస్త్రాలలో మోషే వ్రాసినది నువ్వు చదివావు. ఆ నియమాలు ఏమి చెపుతున్నాయి?" 27 ఆ మనిషి జవాబిచ్చాడు, “నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, మరియు నీ పూర్ణ బుద్ధితో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. మరియు నిన్ను నీవు ప్రేమించినట్లే నీ పొరుగువారిని ప్రేమించుము.” 28 యేసు అతనితో చెప్పాడు, “నువ్వు సరిగా జవాబు చెప్పావు. నువ్వు దానిని అంతటిని చేసిన యెడల, నువ్వు {దేవునితో శాశ్వత కాలం} జీవిస్తావు.

29 అయితే ఆ మనిషి దేవుడు తనను ఆమోదిస్తాడని కనుపరచుకోవాలని కోరుకున్నాడు. కాబట్టి అతడు యేసుతో చెప్పాడు, “{నేను ప్రేమించడానికి} ఏ మనుష్యులు నా పొరుగువారు? 30 యేసు జవాబిచ్చాడు, “ఒకరోజు, ఒక యూదుడైన మనిషి యెరూషలేము నుండి యెరికోకు వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్నాడు. కొందరు బందిపోట్లు అతని మీద దాడి చేశారు. వారు ఆ మనిషి యొక్క దుస్తులు అన్నిటిని మరియు అతడు కలిగియున్న ప్రతీ దానిని తీసివేసారు. అతను దాదాపు చనిపోయే వరకు వారు అతనిని కొట్టారు. తర్వాత అతన్ని అక్కడే వదిలేశారు.

31 ఆ దారిలో ఒక {యూదు} యాజకుడు వెళ్తున్నాడు. అతను ఆ వ్యక్తిని చూసినప్పుడు, {అతనికి సహాయం చేయడానికి బదులుగా}, అతను రహదారికి అవతలి వైపున వెళ్ళాడు. 32 అలాగే, ఒక లేవీయుడు {దేవుని మందిరంలో పనిచేసేవాడు} కూడా ఆ స్థలానికి వచ్చి ఆ మనిషిని చూశాడు. అయితే అతడు కూడా రహదారికి అవతలి వైపున వెళ్ళాడు. 33 అప్పుడు సమరయ ప్రాంతానికి చెందిన ఒక మనిషి ఆ దారిలో ఆ మనిషి పడుకున్న చోటుకి వచ్చాడు. ఆ మనిషిని చూడగానే అతనికి జాలి కలిగింది. 34 ఆయన అతని దగ్గరికి వెళ్ళాడు మరియు అతని గాయాలపై {అవి స్వస్థపడడడంలో సహాయపడడానికి} కొంచెం ఒలీవల నూనె మరియు ద్రాక్షారసాన్ని అతని పండ్ల మీద పూసాడు. గాయాల చుట్టూ గుడ్డ కుట్లు చుట్టాడు. ఆ తర్వాత ఆ మనిషిని తన సొంత గాడిదపై ఎక్కించుకుని సత్రానికి తీసుకొచ్చి చూసుకున్నాడు. 35 మరుసటి రోజు ఉదయం అతను రెండు వెండి నాణేలు సత్రం యజమానికి ఇచ్చి, ‘ఈ మనిషిని జాగ్రత్తగా చూసుకో. మీరు అతని సంరక్షణ కోసం ఇంతకంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తే, నేను తిరిగి వచ్చిన తర్వాత మీకు తిరిగి చెల్లిస్తాను. 36 {అప్పుడు యేసు ఇలా అడిగాడు,} “బందిపోటు దొంగలు దాడి చేసిన మనిషిని ముగ్గురు వ్యక్తులు కనుగొన్నారు. వారిలో ఎవరిని ఆ మనిషికి నిజమైన పొరుగువాడని మీరు చెపుతారు?" 37 ధర్మశాస్త్ర బోధకుడు, “అతని పట్ల దయతో ప్రవర్తించినవాడు” అని జవాబిచ్చాడు. యేసు అతనితో, “{అది సరైనది.} కాబట్టి నీవు వెళ్ళాలి మరియు నీ సహాయం అవసరమైన వారిపట్ల అలా ప్రవర్తించాలి” అని చెప్పాడు.

38 యేసు, ఆయన శిష్యులు ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా వారు ఒక గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడ మార్త అను పేరుగల ఒక స్త్రీ తన ఇంటికి రమ్మని వారిని ఆహ్వానించింది. 39 మరియ అనే పేరు గల ఆమె సోదరి యేసు పాదాల దగ్గర కూర్చుంది మరియు ఆయన బోధిస్తూ ఉన్న దానిని విన్నది. 40 అయితే వారందరికీ భోజనాన్ని సిద్ధం చేయడం గురించి మార్త ఆందోళన చెందుతోంది. ఆమె యేసు దగ్గరకు వెళ్ళింది, “ప్రభువా, నా సోదరి నేనే అన్నీ సిద్ధం చేయడానికి నన్ను విడిచిపెట్టింది. ఇది న్యాయం కాదని మీరు తెలుసుకోవాలి. దయచేసి నాకు సహాయం చేయమని ఆమెకు చెప్పండి! ” 41 అయితే యేసు ఆమెకు జవాబిచ్చాడు, “మార్తా, మార్తా, నువ్వు అనేకమైన సంగతులను గురించి చాలా చింతిస్తున్నావు. 42 అయితే ఒక్క సంగతి నిజంగా ప్రాముఖ్యమైనది {నేను బోధిస్తున్నది వినడం}. ఎందుకంటే మరియ ఉత్తమమైన సంగతిని చెయ్యడానికి ఎంచుకొంది. ఆమె మరొక దానిని చెయ్యడానికి నేను ఆమెకు చెప్పను.

Chapter 11

1 ఒకరోజు యేసు ఒకానొక ప్రదేశంలో ప్రార్థిస్తున్నాడు. ఆయన ముగించినప్పుడు, ఆయన శిష్యులలో ఒకరు ఆయనతో చెప్పాడు, “ప్రభువా, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పండి. బాప్తిస్మం ఇచ్చు యోహాను తన స్వంత శిష్యుల కోసం దానిని చేసాడు, మరియు నీవు మా కోసం అది చెయ్యాలని మేము ఇష్టపడుతున్నాము." 2 ఆయన వారితో చెప్పాడు, “మీరు ప్రార్థన చేసినప్పుడు, {ఇలాంటి సంగతులు} చెప్పండి: ‘తండ్రీ, మనుష్యులు అందరూ నీ నామాన్ని పరిశుద్ధమైనదిగా ఘనపరచుదురు గాక. నీవు త్వరలో ప్రతీ స్థలములో మనుష్యులు అందరిని పరిపాలిస్తావు గాక! 3 దయచేసి మాకు ప్రతి రోజూ కావలసిన ఆహారాన్ని ఇవ్వండి. 4 మేము చేసిన తప్పుల విషయంలో దయచేసి మమ్ములను క్షమించండి. మనుష్యులు మాకు చేసిన తప్పుల విషయంలో మా మట్టుకు మేము క్షమిస్తాము. ఏదైనా మనల్ని శోధించినప్పుడు పాపం చేయకుండా ఉండేందుకు మాకు సహాయం చేయండి.’’

5 అప్పుడు ఆయన వారితో చెప్పాడు, “మీలో ఒకరు అర్ధరాత్రి ఒక స్నేహితుడి ఇంటికి వెళ్తున్నారు అని అనుకోండి. మీరు {బయట నిలబడి} అతనిని పిలిచి, 'నా స్నేహితుడా, దయచేసి నాకు మూడు రొట్టెలు ఇవ్వండి! 6 ప్రయాణంలో ఉన్న నా మరో స్నేహితుడు ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు. అయితే అతనికి వడ్డించడానికి నా దగ్గర ఏ ఆహారం సిద్ధంగా లేదు!’ 7 మరియు అతను ఇంటి లోపల నుండి, ‘నన్ను ఇబ్బంది పెట్టకు! నేను ఇప్పటికే తలుపు గొళ్ళెం పెట్టాను మరియు నా కుటుంబం మొత్తం మంచం మీద ఉంది. నేను పైకి లేవడానికి మరియు మీకు ఏదైనా ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది!’ అని అతడు స్పందించాడు అనుకుందాం. 8 నేను మీకు చెప్పుచున్నాను, అతడు పైకి లేవాలని మరియు అతని స్నేహితునికి ఎటువంటి ఆహారమైనా ఇవ్వడానికి అతడు కోరుకుంటూ ఉండకపోవచ్చు. అయితే అతడు అడుగుతూ ఉన్న యెడల, లోపల ఉన్న మనిషి ఖచ్చితంగా పైకి లేస్తాడు మరియు అతనికి అవసరమైన దానిని అతనికి ఇస్తాడు. 9 కాబట్టి నేను మీకు చెప్పుచున్నాను: మీకు అవసరమైన వాటి కోసం దేవుణ్ణి అడుగుతూ ఉండండి, మరియు ఆయన వాటిని మీకు ఇస్తాడు. దేవుని నుండి వాటిని వెదకుతూ ఉండండి, మరియు మీరు వాటిని పొందుతారు. మీ కోసం విషయాలు సాధ్యమయ్యేలా చేయమని దేవుడిని అడగండి మరియు ఆయన మీ తరపున పని చేస్తాడు. 10 మీరు ఇలా చేయాలి, ఎందుకంటే ఎవరైనా దేవుణ్ణి తనకు అవసరమైన వాటిని అడిగేవాడు వాటిని పొందుతాడు. దేవుని నుండి వాటిని కోరుకునే ఎవరైనా వాటిని పొందుతారు. తనకు పనులు సాధ్యమయ్యేలా చేయమని ఎవరైనా దేవుణ్ణి అడిగిన యెడల, దేవుడు అతని తరపున పని చేస్తాడు.

11 మీ తండ్రులలో ఒకరికి ఒక కుమారుడు ఉన్నాడని అనుకుందాం, అతడు తినడానికి మిమ్మల్ని ఒక చేపను అడిగాడు. బదులుగా అతనికి మీరు ఖచ్చితంగా ఒక విషపూరిత పామును ఇవ్వరు! 12 అతడు నిన్ను ఒక గుడ్డు అడిగాడనుకుందాం. బదులుగా మీరు ఖచ్చితంగా అతనికి ఒక తేలును ఇవ్వరు! 13 మీరు పాపాత్ములైనప్పటికీ, మీ పిల్లలకు మంచి బహుమతులు ఎలా ఇవ్వాలో ఇంకా మీకు తెలుసు. కాబట్టి పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి పరిశుద్ధ ఆత్మను ఇస్తాడని మరింత ఖచ్చితంగా చెప్పవచ్చు.

14 ఒక రోజు యేసు ఒక మనిషిని మాట్లాడనీయకుండా చేస్తున్న ఒక దయ్యాన్ని బలవంతంగా వెళ్లగొట్టాడు. యేసు ఒక దయ్యాన్ని బలవంతంగా బయటకు పంపిన తరువాత, ఆ మనిషి మాట్లాడటం ప్రారంభించాడు. ఇది అక్కడ ఉన్న మనుష్యుల యొక్క సమూహాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. 15 అయితే వారిలో కొందరు చెప్పారు, “దయ్యాల పాలకుడైన బయెల్జెబూలు ఈ మనిషి దయ్యాలను వెళ్లగొట్టేలా చేస్తున్నాడు!”

16 అక్కడున్న ఇతర మనుషులు ఆయన అధికారాన్ని ప్రశ్నించారు. దేవుడు ఆయనను పంపాడని నిరూపించేందుకు ఒక ఆశ్చర్య కార్యాన్ని జరిగించాలని గట్టిగా అడిగారు. 17 అయితే వారు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వారితో చెప్పాడు, “ఒక దేశంలోని మనుష్యులు ఒకరితో ఒకరు పోరాడిన యెడల, వారు తమ దేశాన్ని నాశనం చేస్తారు. ఒక ఇంటిలోని మనుష్యులు ఒకరినొకరు వ్యతిరేకించిన యెడల, వారు వారి కుటుంబాన్ని నాశనం చేస్తారు. 18 అదేవిధంగా, సాతాను మరియు అతని దయ్యాలు ఒకరితో ఒకరు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న యెడల, వారి మీద అతడి పాలన ఖచ్చితంగా నిలవదు! నేను ఇది చెప్పుచున్నాను ఎందుకంటే దయ్యముల యొక్క పాలకుని యొక్క శక్తితో నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను అని మీరు చెప్పుచున్నారు. 19 దయ్యాలను వెళ్లగొట్టడానికి బయెల్జెబూలు నన్ను బలపరుస్తున్నాడు అనేది నిజం అయిన యెడల, అతడు దయ్యాలను వెళ్లగొట్టడానికి మీ శిష్యులకు సహాయం చేస్తున్నాడు అనేది కూడా నిజం. {అయితే అది నిజం కాదని మీకు తెలుసు.} కాబట్టి మీ స్వంత శిష్యులు మీరు తప్పు అని నిరూపించారు. 20 నిజానికి నేను దేవుని యొక్క శక్తి చేత దయ్యాలను వెళ్లగొట్టాలి. దేవుడు మీ మీద పరిపాలించడానికి ప్రారంభించాడని దీని అర్థం.

21 {యేసు కొనసాగించాడు,} “అనేక ఆయుధాలు కలిగి ఉన్న ఒక బలవంతుడైన మనిషి తన సొంత ఇంటికి కాపలా పెట్టుకొన్నప్పుడు, లోపల ఉన్న వస్తువులను ఎవరూ దొంగిలించలేరు. 22 అయితే బలవంతుడైన మరొకరు ఆ మనిషి మీద దాడి చేసి మరియు అతనిని లోబరుచుకొన్నప్పుడు, అతడు ఆధారపడిన ఆయుధాలను తీసివేస్తాడు. అప్పుడు అతడు ఆ వ్యక్తి ఇంటిలో నుండి తాను కోరుకున్నది దొంగిలించవచ్చు. 23 నన్ను బలపరచిని వాడు ఎవరైనా నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. మనుష్యులను నా వద్దకు తీసుకురాని ఎవరైనా వారిని నానును దూరంగా పంపిస్తున్నాడు."

24 {అప్పుడు యేసు చెప్పాడు,} “ఒక దుష్ట ఆత్మ ఎవరినైనా విడిచిపెట్టి మరియు నిర్జన ప్రాంతాలలో నివసించడానికి మరొకరి కోసం చూస్తూ తిరుగుతుంది. అది అక్కడ మరొకరిని కనుగొనని యెడల, అది, ‘నేను గతంలో నివసించిన వ్యక్తి వద్దకు తిరిగి వెళ్లబోతున్నాను!’ అని చెప్పవచ్చు!' 25 కాబట్టి అది తిరిగి వెళ్తుంది మరియు ఆ వ్యక్తి మరొకరు తుడిచి శుభ్రం చేసిన మరియు క్రమంలో ఉంచినట్టుగా ఉన్న{, కానీ అందులో ఎవరూ నివసించని} ఇల్లు వలే ఉన్నదని కనుగొంటుంది 26 అప్పుడు ఈ దుష్ట ఆత్మ వెళ్తుంది మరియు అది ఉన్నదాని దానికంటే ఎక్కువ చెడ్డవైన ఏడు ఇతర ఆత్మలను పట్టుకుంది. అవి అన్ని ఆ మనిషిలోనికి ప్రవేసిస్తాయి మరియు అతనిలో జీవించడం ప్రారంభిస్తాయి, మరియు అది మరింత హీనంగా మారుతుంది.

27 యేసు అది చెప్పినప్పుడు, జనసమూహంలో {వింటున్న} ఒక స్త్రీ బిగ్గరగా ఆయనను పిలిచింది, “నిన్ను కని మరియు నీకు పాలిచ్చిన స్త్రీ విషయం దేవుడు సంతోషిస్తున్నాడు!” 28 అప్పుడు ఆయన జవాబిచ్చాడు, “తన సందేశాన్ని విని మరియు దానికి విధేయత చూపే వారి విషయంలో దేవుడు మరింత సంతోషిస్తాడు!”

29 యేసు చుట్టూ ఉన్న గుంపులో చేరడానికి ఎక్కువ మరియు ఎక్కువ మంది మనుష్యులు వస్తున్నారు. ఆయన చెప్పాడు, “ఈ సమయంలో నివసించే మనుష్యులు దుర్మార్గులైన మనుష్యులు. వారు {నేను దేవుని నుండి వచ్చానని నిరూపించడానికి} నన్ను ఒక అద్భుతం చేయడానికి కోరుకుంటున్నారు, అయితే వారు చూసే ఏకైక రుజువు యోనాకు జరిగిన ఒక అద్భుతం వంటిది. 30 నీనెవె పట్టణంలో నివసిస్తున్న మనుష్యులకు తాను పంపినట్లు చూపించడానికి చాలా కాలం క్రితం దేవుడు యోనా కోసం ఒక అద్భుతం చేశాడు. అదే విధంగా, ఆయన నన్ను పంపాడు అని ఇప్పుడు జీవిస్తున్న మనుష్యులు అందరికి చూపించడానికి దేవుడు మనుష్యకుమారుడైన నా కోసం అలాంటి ఆశ్చర్యకార్యం చేస్తాడు,

31 చాలా కాలం క్రితం షేబా యొక్క రాణి సొలొమోను చెప్పిన జ్ఞానవంతమైన సంగతులు వినడానికి చాలా దూరం ప్రయాణించింది. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడు మీతో ఇక్కడే ఉన్నాడు. {అయితే నేను చెప్పుచున్న దానిని మీరు నిజంగా వినలేదు.} కాబట్టి, దేవుడు మనుష్యులు అందరికీ తీర్పు తీర్చే సమయంలో, ఆమె లేచి నిలబడుతుంది మరియు ఇప్పుడు జీవిస్తున్న మనుష్యులను ఖండిస్తుంది.

32 ప్రాచీన నగరమైన నీనెవెలో నివసించిన మనుష్యులు యోనా వారికి బోధించినప్పుడు తమ పాపపు మార్గాల నుండి వెనుకకు తిరిగారు. మరియు ఇప్పుడు యోనా కంటే గొప్పవాడైన నేను వచ్చాను మరియు మీకు బోధించాను. {అయితే మీరు మీ పాపపు మార్గాలను విడిచిపెట్టలేదు.} కాబట్టి, దేవుడు మనుష్యులు అందరికీ తీర్పు తీర్చే సమయంలో, నీనెవెలో నివసించిన మనుష్యులు లేస్తారు మరియు ఇప్పుడు నివసిస్తున్న మనుష్యులను ఖండిస్తారు.

33 ఒక దీపం వెలిగించేవారు దానిని దాచి యుంచరు లేదా ఒక బుట్ట కింద పెట్టరు. బదులుగా, గదిలోకి ప్రవేశించేవారికి వెలుగు కనిపించేలా దానిని ఒక దీపస్తంభం మీద ఉంచుతారు. 34 నీ కన్ను నీ శరీరంలోకి వెలుగును రానిస్తుంది. మీ కన్ను సరిగ్గా పనిచేసిన యెడల, అప్పుడు మీ మొత్తం శరీరం పూర్తి వెలుగును కలిగియుంటుంది. అయితే మీ కన్ను సరిగ్గా పని చేయకపోయిన యెడల, అప్పుడు మీ శరీరం ఎటువంటి వెలుగును పొందదు. 35 కాబట్టి, అది నిజానికి సరిగా పనిచెయ్యడం మరియు ఎటువంటి వెలుగును లోనికి రానివ్వడం చెయ్యని యెడల మీ కన్ను సరిగ్గా పని చేస్తుంది మరియు వెలుగును లోనికి రానిస్తుంది అని తలంచకుండా జాగ్రత్త వహించండి. 36 కాబట్టి మీ శరీరంలోని ప్రతి అవయవానికి వెలుగు వస్తూ, తద్వారా దానిలోని ఏ భాగమూ చీకటిలో లేకుండా ఉన్న యెడల, అపుడు మీ శరీరం అంతా పూర్తి వెలుగుతో నిండి యుంటుంది. ఒక దీపం యొక్క ప్రకాశవంతమైన కాంతి మీ వెలుపల ప్రకాశిస్తున్న విధముగా ప్రకాశవంతమైన వెలుగు లోపల మీ అంతటి మీద ప్రకాశిస్తుంది.

37 యేసు ఆ సంగతులు చెప్పడం ముగించిన తరువాత, ఒక పరిసయ్యుడు తనతో కలిసి ఒక భోజనం చేయడానికి ఆయనను ఆహ్వానించాడు. కాబట్టి యేసు పరిసయ్యుని ఇంటిలోనికి వెళ్ళాడు మరియు భోజనం చెయ్యడానికి బల్ల దగ్గర ఆనుకుని ఉన్నాడు. 38 భోజనానికి ముందు యేసు ఆచారబద్దంగా చేతులు కడుగుకొనకుండా ఉండడం చూసి పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.

39 యేసు అతనితో చెప్పాడు, “పరిసయ్యులారా మీరు భోజనం చెయ్యడానికి ముందు గిన్నెలు మరియు పాత్రల వెలుపలి భాగాన్ని కడుగుతారు, అయితే మీలో మీరు చాలా దురాశపరులు మరియు దుష్టులు. 40 మూర్ఖులారా! దేవుడు వెలుపల మాత్రమే చెయ్యడు అయితే లోపల కూడా చేసాడని మీకు ఖచ్చితంగా తెలుసు! 41 {పాత్రలు ఆచారపరంగా శుద్ధి చెయ్యడం గురించి ఆందోళన చెందడానికి కరుణ గలవారుగా ఉండాలి మరియు} పాత్రలలోపల ఉన్నది దేనినైనా అవసరంలో మనుష్యులకు ఇవ్వండి. అప్పుడు నీ యొక్క లోపల మరియు వెలుపల ఉన్నవి రెండూ దేవునికి అంగీకారంగా ఉంటుంది.

42 అయితే పరిసయ్యులారా! ఇది మీకు చాలా భయంకరంగా ఉంటుంది. మీరు మీ తోటలో పండించే మూలికలతో సహా మీ వద్ద ఉన్నదానంతటిలో ఒక పదవభాగం దేవునికి జాగ్రత్తగా ఇవ్వండి. అయితే అప్పుడు మీరు ఇతరుల పట్ల దేవుని ప్రేమను లేదా న్యాయాన్ని చూపించరు. దేవునికి ఇవ్వడంతో జతగా మీరు దానిని చేసేలా నిశ్చయపరచాలి. 43 పరిసయ్యులారా మీకు ఇది చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే మీరు సమాజ మందిరాలలో అత్యంత ప్రాముఖ్యమైన ఆసనాలలో కూర్చోవడానికి మీరు ఇష్టపడతారు మరియు మనుష్యులు బజారులలో మీకు {ప్రత్యేక గౌరవంతో} శుభములు చెప్పడం మీకు ఇష్టం. 44 ఇది మీకు ఎంత భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే మీరు గుర్తు తెలియని సమాధుల వలే ఉన్నారు, మనుష్యులు తాము దానిని గుర్తించకుండా మీద నడుస్తారు మరియు కాబట్టి ఆచారబద్ధంగా అపవిత్రులు అవుతారు.

45 అక్కడ ఉన్న యూదుల ధర్మశాస్త్ర బోధకులలో ఒకరు యేసుకు పిర్యాదు చేసారు , “బోధకుడా, నువ్వు ఆ విధంగా సంగతులు చెప్పినప్పుడు, నీవు మమ్మలను కూడా విమర్శిస్తున్నావు!” 46 అయితే యేసు స్పందించాడు, “యూదుల ధర్మశాస్త్ర బోధకులైన మీకు కూడా ఇది ఎంత భయంకరంగా ఉంటుంది! నేను ఇలా చెప్పుచున్నాను! ఎందుకంటే మీరు అనేకమైన నియమాలను వెంబడించడానికి మనుష్యులకు చెపుతారు, అయినా వారికి సహాయం చెయ్యడానికి అత్యంత చిన్న సంగతి కూడా చెయ్యరు.

47 ఇది మీకు ఎంత భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ప్రవక్తల యొక్క సమాధులను గుర్తించడానికి భవనాలు నిర్మిస్తారు, అయితే మీ పూర్వీకులు వారిని చంపారు! 48 కాబట్టి మీరు ఈ భవనాలను నిర్మించినప్పుడు, వారు ప్రవక్తలను చంపినప్పుడు మీ పూర్వీకులు చేసినదానిని మీరు ఆమోదిస్తున్నారని మీరు ప్రకటిస్తున్నారు. 49 కాబట్టి జ్ఞాని అయిన దేవుడు కూడా చెప్పాడు, ‘నా ప్రజలను నడిపించడానికి ప్రవక్తలు మరియు అపొస్తలులను నేను పంపుతాను. అయితే అవి వారిని గొప్ప శ్రమను అనుభవించేలా చేస్తాయి. వారు వారిలో కొందరిని చంపుతారు కూడా.’ 50 ఫలితంగా, లోకం సృష్టించబడిన మొదలు మనుష్యులు చంపిన ప్రవక్తలు అందరి యొక్క హత్య కోసం ఈ సమయంలో నివసిస్తున్న మనుష్యులు శిక్షించబడతారు. 51 {ఆదాము కుమారుడు} హెబెలు {, అతని సోదరుడు కయీను అతనిని చంపాడు} నుండి, {ప్రవక్త} జెకర్యా యొక్క హత్య వరకు, రాజు యొక్క ప్రతినిధులు అతనిని బలిపీఠం మరియు పరిశుద్ధ స్థలం మధ్య {దేవాలయంలో} చంపిన ప్రతి హత్య కోసం వారు శిక్షించబడతారు.

52 యూదుల ధర్మశాస్త్రాలను బోధించే మీకు ఇది ఎంత భయంకరంగా ఉంటుంది. మీరు దేవుని గురించి మనుష్యులకు తెలియకుండా చేస్తున్నారు! మీరు స్వయంగా దేవుణ్ణి తెలుసుకోలేరు మరియు దేవుణ్ణి బాగా తెలుసుకోవాలనుకునే ఇతర వ్యక్తులకు మీరు విషయాలను కష్టతరం చేస్తారు.

53 {యేసు ఆ మాటలు చెప్పడం ముగించిన తరువాత} ఆయన పరిసయ్యుని ఇల్లు విడిచిపెట్టాడు. అప్పుడు యూదుల ధర్మశాస్త బోధకులు మరియు పరిసయ్యులు ఆయన పట్ల చాలా శతృత్వ రీతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. అనేక సంగతులను గురించి వారు ఆయనను తీవ్రంగా ప్రశ్నించారు. 54 ఆయన తప్పుగా మాట్లాడడానికి వారు వింటూనే ఉన్నారు, తద్వారా వారు తప్పుడు బోధ విషయంలో ఆయన మీద ఆరోపించుతారు.

Chapter 12

1 ఇంతలో, అనేక వేల మంది మనుష్యులు {యేసు చుట్టూ} గుమిగూడారు. ఒకరి మీద ఒకరు అడుగులు వేసుకునేంత అనేక మంది ఉన్నారు. ఆయన తన శిష్యులతో చెప్పిన మొదటి విషయం, “మీరు బహిరంగంలో మతపరంగా ప్రవర్తించి అయితే రహస్యంలో దుష్ట క్రియలు చెడు పనులు చేసే పరిసయ్యుల వలే మారకుండా జాగ్రత్తపడండి. 2 మనుష్యులు తమ పాపాలను రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించడం నిష్ఫలమైనది. ఒక రోజు మనుష్యులు దాచడానికి ప్రయత్నిస్తున్న ప్రతీ దానిని దేవుడు ప్రతి ఒక్కరూ తెలుసుకొనేలా చేస్తాడు. 3 ఒకరోజు మీరు రహస్యంగా చెప్పిన ప్రతీది మనుష్యులు బహిరంగంగా వింటారు. మీ గదిలో మీరు గుసగుసలాడే దానిని ప్రతిఒక్కరు వినడానికి ఒకరు ఒక రోజున అరచిచెపుతారు.

4 నా స్నేహితులారా, జాగ్రత్తగా వినండి! మనుష్యుల విషయంలో భయపడవద్దు. వారు మిమ్మును చంపగలరు, అయితే దాని తరువాత వారు మీకు ఎక్కువ ఏమీ చేయలేరు! 5 మీరు నిజంగా ఎవరికి భయపడాలో నేను మీకు చెప్పుతాను. మీరు దేవుని విషయంలో భయపడాలి. ఆయన మనుషులను చనిపోవడానికి చేసే హక్కును కలిగియుండడం మాత్రమే కాదు, ఆ తరువాత వారిని నరకంలోనికి త్రోసివేసే హక్కును కూడా కలిగియున్నాడు! అవును, నేను మీకు చెప్పుచున్నాను, మీరు నిజంగా భయపడవలసిన వాడు దేవుడే! 6 పిచ్చుకల గురించి ఆలోచించండి. {వాటికి చాలా తక్కువ విలువ ఉంది} మీరు వాటిలో ఐదింటిని కేవలం రెండు చిన్న నాణేలకే కొనుగోలు చేయవచ్చు. మరియు అయినా దేవుడు వాటిలో దేనినీ ఎప్పటికీ మరచిపోడు! 7 మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. భయపడవద్దు, ఎందుకంటే మీరు అనేకమైన పిచ్చుకల కంటే {దేవునికి} చాలా విలువైనవారు.

8 వారు నా శిష్యులు అని మనుష్యులు ఇతరులకు చెప్పిన యెడల, అప్పుడు నేను, మనుష్యకుమారుడను, ఆ మనుష్యులు నా శిష్యులు అని దేవుని దూతలతో చెపుతాను అని మీతో కూడా చేపుచున్నాను. 9 అయితే వారు నా శిష్యులు కాదు అని ఇతరులకు చెప్పిన యెడల, అప్పుడు ఆ మనుష్యులు నా శిష్యులు కాదు అని నేను దేవుని దూతలతో చెపుతాను. 10 మనుష్యకుమారుడను, నా గురించి మనుష్యులు చెడుగా మాట్లాడిన యెడల, దాని విషయంలో దేవుడు వారిని క్షమిస్తాడు అని కూడా నేను మీకు చెపుతున్నాను. అయితే మనుష్యులు పరిశుద్ధ ఆత్మ గురించి చెడుగా మాట్లాడిన యెడల, దేవుడు దాని విషయంలో వారిని క్షమించడు.

11 కాబట్టి మనుష్యులు మిమ్మును సమాజ మందిరములలోనికి {అక్కడ మతపరమైన పెద్దల ముందు ప్రశ్నించడానికి} మరియు దేశంలో అధికారం ఉన్న ఇతర మనుష్యుల వద్దకు మిమ్మల్ని తీసుకువచ్చినప్పుడు, మీరు వారికి ఏవిధంగా సమాధానం ఇస్తారో లేదా మీరు ఏమి చెప్పాలో అనేదానిని గురించి ఆందోళన చెందవద్దు. 12 ఎందుకంటే మీరు ఏమి చెప్పాలో ఆ సమయంలోనే పరిశుద్ధ ఆత్మ మీకు చెపుతాడు.”

13 అప్పుడు జన సమూహంలో ఒకడు యేసుకు చెప్పాడు, “బోధకుడా, నా తండ్రి ఆస్తిని నాతో విభజించమని నా సోదరునికి చెప్పు!” 14 అయితే యేసు అతనికి జవాబిచ్చాడు, “మనుష్యుడా, ఆస్తిని గురించి మనుష్యులు కలిగియున్న వాదనలను పరిష్కరించడానికి నన్ను ఎవరూ ఒక న్యాయాధిపతిగా చేయలేదు!” 15 అప్పుడు ఆయన జన సమూహం అంతటికి చెప్పాడు, “ఏవిషయంలోనూ అత్యాశగలవారుగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి! ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమైనది అతడు ఎన్ని వస్తువులను కలిగి ఉన్నాడు అనేది కాదు."

16 అప్పుడు యేసు జనసమూహానికి ఈ వృత్తాంతం చెప్పాడు: “ఒక ధనవంతుని యొక్క భూములు సమృద్ధి మైన పంటలను ఉత్పత్తి చేసాయి. 17 అతడు తనలో తాను ఆలోచన చేసాడు, 'నా పంటలు అన్నిటిని నిల్వచేయడానికి ఎటువంటి స్థలము {తగినంత పెద్దది}నాకు లేదు కాబట్టి, ఏమి చెయ్యడానికి నాకు తెలియదు!' 18 అప్పుడు అతడు తనలో తాను ఆలోచించాడు, 'నేను ఏమి చేయాలో నాకు తెలుసు! నేను నా ధాన్యపు గాదెలను కూల్చివేస్తాను మరియు పెద్ద వాటిని నిర్మిస్తాను! అప్పుడు నేను నా ధాన్యం అంతటినీ మరియు ఇతర వస్తువులను పెద్ద కొత్త గాదేలలో నిల్వ చేయగలను. 19 అప్పుడు నేను నాలో చెపుతాను, “ఇప్పుడు నేను అనేక సంవత్సరాలకు తగినంత వస్తువులను నిల్వ చేసుకొన్నాను. కాబట్టి నేను జీవితాన్ని తేలికగా తీసుకుంటాను. నేను తింటాను మరియు త్రాగుతాను మరియు సంతోషంగా ఉంటాను!’’ 20 అయితే దేవుడు అతనితో చెప్పాడు, ‘నువ్వు బుద్ధిహీనుడైన మనిషి! ఈ రాత్రి నువ్వు చనిపోతావు! అప్పుడు నువ్వు నీ కోసం పొదుపు చేసుకున్న సమస్తము మరొకరికి చెందుతాయి, నీకు కాదు!”

21 అప్పడు యేసు చెప్పడం చేత ఈ ఉపమానాన్ని ముగించాడు, “తమ కోసం మాత్రమే వస్తువులను నిల్వచేసుకోవడం మరియు దేవుడు విలువైనవిగా యెంచే వాటికి విలువ ఇవ్వకుండా ఉండేవారికి అదే జరుగుతుంది”

22 అప్పుడు యేసు తన శిష్యులతో చెప్పాడు, “ఈ వృత్తాంతం నుండి మీరు నేర్చుకోవలసినది ఇక్కడ ఉంది. సజీవంగా ఉండడానికి తినడానికి తగిన ఆహారం మీరు కలిగియున్నారా లేదా వెచ్చగా ఉండడానికి తగిన దుస్తులు ఉన్నాయా అని ఆందోళన చెందవద్దు. 23 ఏమైనా, నువ్వు తినే ఆహారం కంటే నీ ప్రాణం చాలా ప్రాముఖ్యం, మరియు నువ్వు ధరించే వస్త్రాల కంటే నీ శరీరం చాలా ప్రాముఖ్యం. 24 పక్షులను గురించి ఆలోచించండి. అవి విత్తనాలను నాటవు, మరియు అవి పంటలను పండించవు. పంటలను నిల్వ చేయడానికి వారికి గదులు లేదా భవనాలు లేవు, అయితే దేవుడు వారికి ఆహారం ఇస్తాడు. మరియు మీరు ఖచ్చితంగా పక్షుల కంటే చాలా విలువైనవారు. 25 దాని గురించి చింతిస్తూ మీలో ఎవరూ తన జీవితానికి ఒక్క నిమిషం కూడా జోడించలేరు! 26 కాబట్టి మీరు ఆ చిన్న పని కూడా చేయలేరు కాబట్టి మీరు ఖచ్చితంగా మరొక దానిని గురించి ఆందోళన చెందవద్దు. 27 పువ్వులు పెరిగే విధానం గురించి ఆలోచించండి. అవి డబ్బు సంపాదించడానికి పని చేయవు, మరియు వాటి స్వంత దుస్తులు తయారు చేసుకోవు. అయితే, సొలొమోను రాజు {చాలా కాలం క్రితం జీవించాడు, మరియు}, మహిమాన్వితమైన దుస్తులు ధరించాడు, ఒక్క పువ్వు వలే ఎప్పుడూ అందంగా దుస్తులు ధరించలేదని నేను మీకు చెప్పుచున్నాను. 28 మొక్కలు కొద్దికాలం మాత్రమే పెరిగినప్పటికీ దేవుడు వాటిని అందంగా చేస్తాడు. అప్పుడు ప్రజలు వాటిని నరికి అగ్నిలో విసిరారు. {అయితే మీరు దేవునికి చాలా విలువైనవారు.} అతను మొక్కల పట్ల శ్రద్ధ వహించే దానికంటే ఎక్కువగా మీ పట్ల శ్రద్ధ వహిస్తాడు. మీరు మీ కంటే ఎక్కువగా దేవుణ్ణి నమ్మాలి. 29 మీ విషయానికొస్తే, మీరు ఏమి తింటారు మరియు త్రాగాలి అని ఆశ్చర్యపోకండి మరియు {ఆ విషయాల గురించి} చింతించకండి. 30 దేవుణ్ణి ఎరుగని మనుష్యులు అలాంటి వాటి గురించి చింతిస్తున్నప్పుడు, అవి మీకు అవసరమని పరలోకంలో ఉన్న మీ తండ్రికి తెలుసు {అని మీరు ధైర్యంగా ఉండవచ్చు. 31 బదులుగా, దేవుని యొక్క రాజ్యం కోసం మీరు ఏమి చేయగలరో దాని మీద దృష్టి పెట్టండి. మీరు చేసినప్పుడు, మీకు కావాల్సినవన్నీ సమకూర్చడానికి మీరు దేవుణ్ణి నమ్మవచ్చు.

32 నా స్నేహితులారా, మీరు భయపడవద్దు. పరలోకంలో ఉన్న మీ తండ్రి మీరు తన రాజ్యంలో భాగం కావాలని {మరియు దాని ప్రయోజనాలన్నింటినీ పొందాలని} కోరుకుంటున్నాడు. 33 కాబట్టి మీ స్వంత వస్తువులను అమ్మివేయండి మరియు ఆహారం లేదా దుస్తులు లేదా నివసించడానికి స్థలం అవసరమైన మనుష్యులకు డబ్బు ఇవ్వండి. పాడైపోని సంచులను మీకు మీరు పొందండి. నా ఉద్దేశ్యం పరలోకంలో ఎల్లప్పుడూ భద్రంగా ఉండే సంపదను నిల్వ చేసుకోండి. అక్కడ ఏ దొంగ దేనినీ దొంగిలించడు మరియు ఏ చిమ్మటలు మీ దుస్తులను నాశనం చేయవు. 34 అన్నింటికంటే, మీరు దేనిని సంపదగా ఉంచుకున్నారో, దాని గురించి మీరు ఆలోచిస్తారు మరియు దానిమీద మీ సమయాన్ని వెచ్చిస్తారు.

35 తమ పని బట్టలు వేసుకుని మరియు రాత్రి అంత దీపాలు వెలిగించే మనుష్యుల వలే {దేవుని పని చేయడానికి సిద్ధంగా} {ఎల్లప్పుడూ} ఉండండి. 36 పెండ్లి విందులో ఉండి తమ యజమాని తిరిగి వస్తాడని ఎదురుచూసే సేవకుల వలే {నేను తిరిగి రావడానికి సిద్ధంగా} ఉండండి. అతడు వచ్చినప్పుడు మరియు తలుపు తట్టుచూ ఉన్నప్పుడు ఆయన కోసం తలుపు తెరవడానికి వారు ఎదురు చూస్తున్నారు.

37 ఆ సేవకులు తమ యజమాని తిరిగి వచ్చినప్పుడు వారు మెలకువగా ఉన్న యెడల చాలా మేలుగా ఉంటుంది. నేను మీకు ఈ విషయం చెపుతాను: ఒక సేవకుని వలే దుస్తులు ధరించడం చేత ఆయన వీకీకి బహుమతి ఇస్తాడు, వారిని క్రింద కూర్చోనమని చెపుతాడు, మరియు వారికి ఒక భోజనం వడ్డిస్తాడు. 38 ఆయన సాయంత్రంలో లేదా రాత్రి యొక్క మధ్యలో వచ్చినప్పటికీ, ఆయన తన సేవకులు మెలకువగా మరియు తన కోసం సిద్ధంగా ఉన్నారని కనుగొన్న యెడల, ఆయన వారితో చాలా సంతోషిస్తాడు. 39 మరియు మీరు దీనిని పరిగణించాలని నేను కోరుకుంటున్నాను: ఒక ఇంటి యజమానికి దొంగ వస్తున్నాడని తెలిసిన యెడల, మరియు ఏ సమయంలో, అతడు మెలకువగా నిలిచి ఉంటాడు మరియు దొంగ తన ఇంటిలోనికి చొరబడనివ్వడు. 40 కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు నన్ను ఊహించని సమయంలో మనుష్యకుమారుడనైన నేను తిరిగి వస్తాను.”

41 పేతురు అడిగాడు, “ప్రభువా, కేవలం నీ శిష్యులమైన మా కోసమే ఈ ఉపమానం చెపుతున్నావా? లేక జనసమూహం కోసం కూడానా?” 42 యేసు జవాబిచ్చాడు, “తన యజమానుని ఇంటిలో నమ్మకమైన మరియు జ్ఞానవంతమైన సేవకుని వలే ఉన్న ప్రతి ఒక్కరి కోసం నేను దీనిని చెపుతున్నాను. అతని యజమాని తన యొక్క ఇతర సేవకులకు సరైన సమయానికి ఆహారం అందేలా చూడడానికి అతనిని అధికారిగా నియమించుతాడు. 43 అతని యజమాని ఇంటికి వచ్చి మరియు అతడు ఆ పని చేస్తున్నాడని చూసిన యెడల, ఆయన ఆ సేవకుడికి ప్రతిఫలమిస్తాడు. 44 నేను మీకు ఈ విషయం చెపుతాను: యజమాని ఆ సేవకుడికి తనకున్న వాటన్నింటి మీద అధికారిగా ఉంచుతాడు.

45 అయితే ఆ అధికారిగా నియమించబడిన ఆ సేవకుడు తనతో చెపుతాడు, ‘నా యజమాని చాలా కాలం కోసం దూరంగా ఉండడానికి వెళ్తున్నాడు.’ తరువాత అతడు ఇతర సేవకులను కొట్టడం ప్రారంభించవచ్చు. అతడు ఎక్కువగా తినడం మరియు త్రాగడం మరియు మత్తుగా ఉండడం ప్రారంభించవచ్చు. 46 అతడు దానిని చేసిన యెడల, సేవకుడు ఆయనను ఎదురుచూడని సమయంలో అతని యజమాని తిరిగి రావచ్చు. అప్పుడు అతని యజమాని అతనిని కఠినంగా శిక్షిస్తాడు మరియు అతనికి నమ్మకంగా సేవ చేయని వారితో అతనికి స్థానం నియమిస్తాడు. 47 తన యజమాని కోరుకున్న దానిని తెలిసి అయితే సిద్ధపడి ఉండకుండా మరియు దానిని చెయ్యని సేవకుడు కఠినంగా శిక్షించబడతాడు. 48 అయితే తనను చెయ్యమని తన యజమాని కోరుకుంటున్న దానిని యెరుగని ప్రతి సేవకుడు, మరియు అప్పుడు తప్పుగా చేసినప్పుడు, తేలికపాటి శిక్ష మాత్రమే పొందుతాడు. యజమాని తాను ఎక్కువగా ఇచ్చిన సేవకులందరి నుండి చాలా ఎక్కువ ఆశిస్తాడు. మరియు తాను అనేక బాధ్యతలు అప్పగించిన సేవకుల నుండి యజమాని ఇంకా అధికంగా ఆశిస్తాడు.

49 మనుష్యులలో ఆత్మీయ అభిలాషలను రేకెత్తించడానికి నేను వచ్చాను. ఇప్పటికే అవి వారి మీద క్రియ జరిగిస్తున్నారని నేను కోరుకుంటున్నాను! 50 త్వరలో నేను భయంకరమైన శ్రమ ద్వారా వెళ్ళవలసి ఉంది. నా శ్రమను ముగించేంత వరకు నేను దుఃఖపడడం కొనసాగిస్తాను 51 మనుష్యులు శాంతియుతంగా కలిసి జీవించునట్లు నేను రాలేదని మీరు తెలుసుకోవాలి. లేదు, మీరు దానిని అర్థం చేసుకోవాలి, బదులుగా, మనుష్యులు నాకు అనుకూలంగా మరియు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు. 52 సిద్ధపడి ఉండండి, ఎందుకంటే ఇది జరగబోతోంది. ఐదుగురు మనుష్యులు ఉన్న ఒక కుటుంబంలో కొందరు నాలో విశ్వాసముంచుతారు మరియు కొందరు నమ్మరు. ముగ్గురు కుటుంబ సభ్యులు మిగిలిన ఇద్దరికి వ్యతిరేకంగా కలిసి ఉంటారు. 53 కుటుంబ సభ్యులు ఘర్షణ పడతారు. ఒక తండ్రి తన కుమారుడిని వ్యతిరేకిస్తాడు, లేదా ఒక కుమారుడు తన తండ్రిని వ్యతిరేకిస్తాడు. ఒక తల్లి తన కుమార్తెను వ్యతిరేకిస్తుంది, లేదా ఒక కుమార్తె తన తల్లిని వ్యతిరేకిస్తుంది. ఒక అత్త తన కోడలిని వ్యతిరేకిస్తుంది, లేదా కోడలు తన అత్తని వ్యతిరేకిస్తుంది.

54 ఆయన జనసమూహానికి చెప్పాడు కూడా, "పశ్చిమంలో ఒక చీకటి మేఘం ఏర్పడటం మీరు చూసినప్పుడు, మీరు వెంటనే చెపుతారు ‘వర్షం రాబోతుంది!' మరియు అదే జరుగుతుంది. 55 దక్షిణం నుండి గాలి వీచినప్పుడు, మీరు చెపుతారు ‘ఇది చాలా వేడి రోజుగా ఉండబోతుంది.!’ మరియు మీరు చెప్పింది నిజమే. 56 మీరు వేషధారులు! మేఘాలు మరియు గాలిని గమనించడం చేత, వాతావరణం గురించి ఏమి జరుగుతుందో మీరు వివేచించగలుగుతారు. ఈ ప్రస్తుత సమయంలో దేవుడు ఏమి చేస్తున్నాడో మీరు వివేచించగలగాలి!

57 ఏది సరైనదో మీలో ప్రతి ఒక్కరూ మీరే నిర్ణయించుకోవాలి. 58 ఇక్కడ మీరు చేయవలసిన పని ఒకటి ఉంది. మీరు న్యాయస్థానానికి వెళ్లే మార్గంలో ఉన్నప్పుడు మీపై ఆరోపణలు చేసిన వారితో విషయాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అతడు మిమ్మల్ని న్యాయాధిపతి వద్దకు వెళ్ళడానికి బలవంతం చేసిన యెడల, న్యాయాధిపతి మీరు దోషి అని నిర్ణయించి మరియు మిమ్మల్నిన్యాయస్థానం అధికారికి అప్పగించవచ్చు. అప్పుడు ఆ అధికారి నిన్ను చెరసాలలో వేస్తాడు. 59 మీరు చెరసాలకు వెళ్ళిన యెడల, నీవు అచ్చియున్నావని న్యాయమూర్తి చెప్పిన దానిని అంతటిని మీరు చెల్లించ గలుగునంత వరకు మీరు అక్కడ నుండి ఎప్పటికీ బయటపడరని నేను మీకు చెప్పుచున్నాను.

Chapter 13

1 ఆ సమయంలో, జనసమూహంలో ఉన్న కొందరు గలీలయులకు ఇటీవల జరిగిన దాని గురించి యేసుకు చెప్పారు. రోమా అధిపతి అయిన పిలాతు, యెరూషలెం దేవాలయంలో వారు బలులు అర్పించే సమయంలో గలీలయులను చంపమని సైనికులను ఆదేశించాడు. 2 యేసు వారికి జవాబిచ్చాడు, “గలిలయ నుండి వచ్చిన మనుష్యులు మిగిలిన గలీలయులు అందరి కంటే ఎక్కువ పాపాత్ములు కాబట్టి వారికి ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారా? 3 నేను మీకు నిశ్చయత ఇస్తున్నాను, అది కారణం కాదు! బదులుగా, మీరు మీ పాపపు ప్రవర్తన నుండి తిరుగక పోయిన యెడల దేవుడు మీ అందరినీ అదే విధంగా శిక్షిస్తాడు.

4 లేదా సిలోయం {పొరుగున} ఉన్న గోపురం వారి మీద పడినప్పుడు మరణించిన ఆ 18 మంది మనుష్యుల సంగతి ఏమిటి? వారు యెరూషలేములో ఉన్న అందరికంటే ఘోరమైన పాపులు కాబట్టి వారికి ఇలా జరిగిందని మీరు అనుకుంటున్నారా? 5 నేను మీకు నిశ్చయత ఇస్తున్నాను, అది కారణం కాదు! అయితే బదులుగా, మీరు మీ పాపపు ప్రవర్తన నుండి తిరుగక పోయిన యెడల దేవుడు మీ అందరినీ అదే విధంగా శిక్షిస్తాడని మీరు గుర్తించాలి!

6 అప్పుడు యేసు వారితో ఈ వృత్తాంతం చెప్పాడు: “ఒక మనిషి తన తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. {ప్రతి సంవత్సరం} అతడు అంజూరపు పండ్లను కోయడానికి వచ్చాడు, అయితే దానిమీద {ఎల్లప్పుడూ} ఏవీ లేవు. 7 అప్పుడు అతడు తోటమాలితో చెప్పాడు, ‘ఈ చెట్టును చూడు! నేను గత మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాని ఫలం కోసం చూస్తున్నాను, అయితే అంజూరపు పండ్లు అక్కడ లేవు. దీనిని నరికి వెయ్యి! ఇది కేవలం మట్టిలోని పోషకాలను ఏమీ లేకుండా వినియోగిస్తోంది!’ 8 అయితే తోటమాలి జవాబిచ్చాడు, ‘అయ్యా, ఇంకో సంవత్సరం ఇక్కడే వదిలేయండి. నేను దాని చుట్టూ తవ్వి ఎరువులు వేస్తాను. 9 వచ్చే ఏడాది అది అంజూరపు పండ్లు కలిగి ఉన్న యెడల, అది పెరుగుతూ ఉండడానికి మనం అనుమతించవచ్చు, అయితే అప్పటికి అది ఫలించకపోయిన యెడల నీవు దానిని నరికివేయవచ్చు." 10 ఒక యూదుల యొక్క విశ్రాంతి దినమున, యేసు ఒక సమాజ మందిరంలో మనుష్యులకు బోధిస్తున్నాడు. 11 అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమెను 18 సంవత్సరాలుగా దుష్ట ఆత్మ చేత కుంగదీసింది. ఆమె ఎప్పుడూ వంగి ఉండేది. ఆమె నిటారుగా నిలబడలేకపోయింది. 12 యేసు ఆమెను చూసినప్పుడు, ఆయన ఆమెను తన దగ్గరికి పిలిచాడు. ఆయన ఆమెతో చెప్పాడు, “అమ్మా, ఈ వ్యాధి నుండి నేను నిన్ను స్వస్థపరిచాను!” 13 ఆయమ ఆమె మీద తన చేతులు ఉంచాడు. వెంటనే ఆమె నిటారుగా నిలబడింది మరియు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది! 14 అయితే యూదుల విశ్రాంతి రోజున యేసు ఆమెను స్వస్థపరిచినందుకు సమాజ మందిర నాయకుడికి కోపం వచ్చింది. కాబట్టి అతడు మనుష్యులతో చెప్పాడు, “ప్రతి వారంలో ఆరు రోజులు ఉంటాయి వాటిలో మన ధర్మశాస్త్రాలు మనుష్యులు పని చేయడానికి అనుమతిస్తాయి. మీకు స్వస్థత అవసరం అయిన యెడల, ఎవరైనా మిమ్మల్ని స్వస్థపరచడానికి సమాజ మందిరానికి రావాల్సిన రోజులు అవి. మన విశ్రాంతి యొక్క దినమున రావద్దు! ” 15 అప్పుడు యేసు అతనికి జవాబిచ్చాడు, “నువ్వు మరియు నీ తోటి మతనాయకులు వేషధారులు! మీలో ప్రతి ఒక్కరూ {కొన్నిసార్లు విశ్రాంతి యొక్క దినమున కూడా పని చేస్తారు! ఉదాహరణకు, మీరు} మీ ఎద్దు లేదా గాడిదను దాని స్థానం నుండి నీరు త్రాగే ప్రదేశానికి తీసుకెళ్లడానికి దానిని విప్పుతారు. 16 ఈ స్త్రీ అబ్రాహాము సంతతికి చెందిన యూదురాలు! అయితే సాతాను ఆమెను 18 సంవత్సరాలుగా అంగవైకల్యంతో అతడు కట్టివేసినట్లుగా ఉంచాడు! ఈ వికలాంగ వ్యాధి నుండి నేను ఆమెకు విడుదల కలిగించడం సరైనదని మీరు ఖచ్చితంగా అంగీకరిస్తారు, నేను విశ్రాంతి యొక్క దినమున చేసినప్పటికీ! ”

17 ఆయన చెప్పిన తరువాత, ఆయన శత్రువులు తమ గురించి తాము సిగ్గుపడ్డారు. అయితే ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు అన్నిటిని ఇతర మనుష్యులు అందరూ సంతోషించారు.

18 అప్పుడు ఆయన చెప్పాడు, “దేవుడు రాజు వలే పరిపాలిస్తున్నప్పుడు ఏవిధంగా ఉంటుందో నేను వివరించడానికి కోరుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి నేను ఒక చిత్రాన్ని ఇస్తాను. 19 అది ఒక మనిషి తన పొలంలో నాటిన ఒక చిన్న ఆవ విత్తనం వలే ఉంది. అది చెట్టు వలే పెద్దది అయ్యే వరకు పెరిగింది. అది దాని కొమ్మలలో పక్షులు గూళ్లు కట్టుకోనేంత పెద్దది.”

20 అప్పుడు మరలా ఆయన చెప్పాడు, “దేవుడు పరిపాలిస్తున్నప్పుడు ఏవిదంగా ఉంటుందో నేను మీకు మరొక {విధానంలో} చెపుతాను. 21 ఒక స్త్రీ దాదాపు 25 కిలోల పిండితో కలిపిన కొంచెం పులిసిన పిండి వలే ఉంది. ఆ చిన్న మొత్తంలో ఉన్న పులిసిన పిండి మొత్తం పిండి ఉబ్బిపోయేలా చేసింది.

22 యేసు యెరూషలేము వైపు ప్రయాణం కొనసాగించాడు. ఆయన దారిపొడవునా అన్ని పట్టణాల్లోనూ, మరియు గ్రామాల్లోనూ ఆగాడు మరియు మనుష్యులకు బోధించాడు. 23 ఒకడు, ఆయనను అడిగాడు, “ప్రభువా, దేవుడు కొందరిని మాత్రమే రక్షిస్తాడా?” అక్కడున్న వారందరు వినగలిగేలా యేసు జవాబిచ్చాడు, 24 “మీరు ప్రవేశించడానికి చాలా కష్టపడాలి, ఎందుకంటే ఇది చాలా కష్టం. అనేకులైన మనుష్యులు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు, అయితే వారు చేయలేరు అని నేను మీకు చెపుతున్నాను. 25 ఇంటి యజమాని లేచి మరియు తలుపు తాళం వేసిన తరువాత, మీరు బయట నిలబడతారు మరియు తలుపు మీద తడతారు. మరియు మీరు యజమానిని వేడుకొని, 'ప్రభువా మా కోసం తలుపు తెరవండి' అయితే ఆయన జవాబిస్తాడు, 'లేదు, నేను దానిని తెరవను, ఎందుకంటే నాకు మీరు తెలియదు మరియు మీరు ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు.!' 26 అప్పుడు మీరు చెపుతారు, 'మేము నీతో కలిసి భోజనం చేశాము, నీవు మా పట్టణాల యొక్క వీధులలో మాకు బోధించావు {దానిని నీవు మరచిపోయి ఉంటావు!') 27 అయితే ఆయన చెపుతాడు, 'నేను మీకు మరల చెపుతున్నాను, మీరు ఎక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు. మీరు అందరూ దుర్మార్గులైన మనుష్యులు! ఇక్కడి నుండి వెళ్ళిపొండి!’’

28 {అప్పుడు యేసు చెప్పడం చేత కొనసాగించాడు,}“మీరు అబ్రాహాము మరియు ఇస్సాకు మరియు యాకోబును {దూరంలో} చూస్తారు. దేవుడు రాజు వలే సమస్తాన్ని పరిపాలించే చోట చాలా కాలం క్రితం జీవించిన ప్రవక్తలందరూ కూడా అక్కడ ఉంటారు. అయితే మీరు బయట ఉంటారు, ఏడుస్తూ, మరియు బాధతో పళ్లు కొరుకుతూ ఉంటారు! 29 అయితే లోపల లోకంలోని ప్రతి ప్రాంతం నుండి{, అనేకమంది యూదులు కాని వ్యక్తులతో కలిపి} ఉంటారు. దేవుడు సమస్తాన్ని రాజు వలే పరిపాలించే చోట వారందరూ కలిసి వేడుక జరుపుకుంటారు. 30 దీని గురించి ఆలోచించండి: ఇప్పుడు స్వల్పమైన ప్రాముఖ్యమైనవారుగా కనిపించే కొందరు మనుషులు అప్పుడు చాలా ప్రాముఖ్యమైనవారుగా ఉంటారు మరియు ఇప్పుడు ప్రాముఖ్యమైన వారుగా కనిపించే ఇతరులు తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటారు.

31 అదే రోజున, కొంతమంది పరిసయ్యులు వచ్చారు మరియు యేసుకు చెప్పారు, “ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళు, ఎందుకంటే పాలకుడైన హేరోదు అంతిప నిన్ను చంపాలనుకుంటున్నాడు!” 32 ఆయన వారికి జవాబిచ్చాడు, “వెళ్ళు, మరియు {నన్ను బాధపెట్టగలనని భావించేవాడు అయితే నిజానికి చెయ్యలేనివాడు} అయిన ఆ మోసపూరిత మనిషికి చెప్పు, ఈ సందేశం నా నుండి వస్తుంది: 'విను! నేను ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టుతున్నాను మరియు అద్భుతాలు చేస్తున్నాను, మరియు ఆ విధంగా చెయ్యడం కొద్ది కాలం వరకు కొనసాగిస్తాను. దాని తరువాత, నేను నా కార్యాన్ని పూర్తి చేస్తాను.' 33 అయితే రాబోయే రోజులలో నేను యెరూషలేముకు నా పర్యటనను కొనసాగించాలి, ఎందుకంటే యెరూషలేము కాకుండా వేరే ప్రదేశంలో ఒక ప్రవక్తను చంపడానికి సరికాదని {యూదు నాయకులు ఎల్లప్పుడూ ప్రవర్తించారు.}

34 అయ్యో, యెరూషలేము యొక్క మనుష్యులారా! మీరు చాలా కాలం క్రితం జీవించిన ప్రవక్తలను చంపారు. అప్పుడు దేవుడు మీ దగ్గరకు పంపిన ఇతరులను మీరు చంపారు. మీరు వారి మీద రాళ్లు విసరడం చేత వారిని చంపారు. ఒక కోడి తన కోడిపిల్లలను తన రెక్కల క్రింద పోగుచేసుకున్న విధముగా, మిమ్ములను రక్షించడానికి చాలాసార్లు మిమ్ములను ఒకచోట చేర్చుకోవాలని నేను కోరుకున్నాను. అయితే నేను అలా చేయడం నువ్వు కోరుకోలేదు. 35 ఇప్పుడు చూడండి! యెరూషలేము మనుష్యులారా, దేవుడు ఇకపై మిమ్మల్ని రక్షించడు. నేను మీకు ఇది కూడా చెప్తాను: నేను మీ నగరంలోనికి మరోసారి ప్రవేశిస్తాను. ఆ తర్వాత, నేను తిరిగి వచ్చే వరకు మీరు నన్ను చూడలేరు, మరియు ఆ మీదట మీరు నా గురించి చెపుతారు, ‘దేవుని అధికారంతో వచ్చిన ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించునుగాక!

Chapter 14

1 ఒక రోజు, అది విశ్రాంతి యొక్క దినం, పరిసయ్యుల నాయకులలో ఒకరి ఇంటికి భోజనానికి యేసు వెళ్లాడు. {ఈ నాయకుడు ఇతర పరిసయ్యులను అదే భోజనానికి ఆహ్వానించాడు.} వారందరూ యేసును జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు {ఆయనను నిందించడానికి ఆధారాలు వెతకడానికి ప్రయత్నించడానికి}. 2 అక్కడే యేసు ఎదురుగా ఒక మనిషి తన చేతులు మరియు కాళ్ళు బాగా ఉబ్బిపోయే వ్యాధితో ఉన్నాడు. 3 అక్కడికి హాజరయిన యూదుల ధర్మశాస్త్ర నిపుణులను మరియు పరిసయ్యులను యేసు అడిగాడు, “విశ్రాంతి యొక్క దినమున మనుష్యులకు స్వస్థత చేకూర్చేందుకు ధర్మశాస్త్రంలో అనుమతి ఉందా లేదా?” 4 వారు సమాధానం చెప్పలేదు. కాబట్టి యేసు ఆ వ్యక్తిపై చేతులు ఉంచాడు మరియు స్వస్థపరిచాడు. అప్పుడు అతడు వెళ్ళవచ్చు అని ఆయన చెప్పాడు. 5 మరియు ఆయన అక్కడున్న వాళ్లతో చెప్పాడు, “మీలో ఎవరికైనా ఒక కుమారుడు లేదా ఒక ఎద్దు విశ్రాంతి యొక్క దినమున ఒక బావిలో పడిన యెడల, మీరు అతనిని వెంటనే బయటకు తీస్తారు.” 6 మరల, వారు ఆయనకు సమాధానం చెప్పలేకపోయారు.

7 భోజనానికి ఆహ్వానించబడిన మనుష్యులు సాధారణంగా ముఖ్యమైన మనుష్యులు కూర్చునే ప్రదేశాల్లో కూర్చోవడానికి యెంచుకోవడం యేసు గమనించాడు. కాబట్టి ఆయన వారికి ఈ సూచన ఇచ్చాడు. 8 “మీలో ఒకరిని ఎవరైనా పెండ్లి విందుకు ఆహ్వానించినప్పుడు, ముఖ్యమైన వ్యక్తులు కూర్చునే స్థలములో కూర్చొనవద్దు. అతడు మీ కంటే చాలా ముఖ్యమైన ఒక వ్యక్తిని విందుకు ఆహ్వానింఛి ఉండవచ్చు. 9 మీ ఇద్దరినీ ఆహ్వానించిన అతిధేయుడు మీరిద్దరూ ఎక్కడ కూర్చున్నారో చూసినప్పుడు, అతడు మీతో ఇలా అంటాడు, ‘ఈ వ్యక్తి మీ ఆసనమును కలిగి యుండనివ్వండి!' అప్పుడు మీరు తక్కువ ప్రాముఖ్యత కలిగిన ఆసనమును మీరు తీసుకోవాల్సి వస్తుంది, మరియు మీరు సిగ్గుపరచబడతారు. 10 బదులుగా, ఎవరైనా మిమ్మల్ని విందుకు ఆహ్వానించినప్పుడు, వెళ్ళండి మరియు తక్కువ ప్రాముఖ్యత కలిగిన ఆసనంలో కూర్చోండి. అప్పుడు అందరినీ ఆహ్వానించిన అతిధేయుడు వచ్చినప్పుడు అతడు నీతో చెపుతాడు, ‘స్నేహితుడా, రమ్ము మంచి ఆసనంలో కూర్చో!’ అప్పుడు అతడు నిన్ను గౌరవిస్తున్నాడని నీతో కలిసి భోజనం చేస్తున్న మనుష్యులు అందరూ చూస్తారు. 11 ఎందుకంటే తమను తాము హెచ్చించుకునేవారిని దేవుడు తగ్గిస్తాడు, మరియు తమ్మును తాము తగ్గించుకునేవారిని ఆయన హెచ్చిస్తాడు.

12 యేసు తనను భోజనానికి పిలిచిన పరిసయ్యునితో అన్నాడు కూడా, “మధ్యాహ్నం లేదా సాయంత్రం భోజనానికి మనుష్యులను నీవు ఆహ్వానించినప్పుడు, నీ స్నేహితులను, బంధువులను లేదా ధనవంతులైన పొరుగువారిని మాత్రమే ఆహ్వానించ వద్దు, ఎందుకంటే వారు మిమ్మల్ని భోజనానికి ఆహ్వానించడం చేత నీకు తిరిగి చెల్లిస్తారు. 13 బదులుగా, మీరు విందు ఇచ్చేటప్పుడు, పేద ప్రజలను, వికలాంగులైన మనుషులను, కుంటివారైన మనుషులను లేదా గుడ్డివారైన మనుషులను ఆహ్వానించండి. 14 మీరు దానిని చేసిన యెడల, దేవుడు మీకు ప్రతిఫలమిస్తాడు, ఎందుకంటే వారు మీకు తిరిగి చెల్లించలేరు. నీతిమంతులైన మనుషులను ఆయన తిరిగి సజీవులను చేసే సమయంలో దేవుడు మీకు తిరిగి చెల్లిస్తాడని మీరు నిశ్చయతతో ఉండవచ్చు.” 15 ఆయనతో భోజనం చేస్తున్న వారిలో ఒకడు ఆయన చెప్పడం విన్నాడు. అతడు యేసుతో అన్నాడు, “దేవుడు రాజు వలే సమస్తాన్ని పరిపాలించే చోట వేడుక జరుపుకునే ప్రతి ఒక్కరినీ దేవుడు నిజంగా ఆశీర్వదించాడు!” 16 యేసు అతనికి జవాబిచ్చాడు, “ఒకసారి ఒక మనిషి ఒక పెద్ద విందు సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. అనేకమంది రావడానికి అతడు ఆహ్వానించాడు. 17 విందు కోసం సమయం అయినప్పుడు తాను ఆహ్వానించిన వారితో, ‘ఇప్పుడు రండి, ఎందుకంటే అంతా సిద్ధంగా ఉంది!' అని చెప్పడానికి ఆయన తన సేవకులను పంపాడు.

18 అయితే సేవకుడు అలా చేయడంతో, అతడు ఆహ్వానించిన మనుష్యులు అందరు తాము ఎందుకు రాలేకపోయారో అని చెప్పడం ఆరంభించారు. సేవకుడు వెళ్లిన మొదటి వ్యక్తి చెప్పాడు, ‘నేను ఇప్పుడే ఒక పొలాన్ని కొన్నాను, మరియు నేను అక్కడికి వెళ్లి దానిని చూడాలి. దయచేసి రానందుకు నన్ను క్షమించమని మీ యజమానిని అడగండి!’ 19 మరొక వ్యక్తి చెప్పాడు, ‘నేను ఇప్పుడే ఐదు జతల ఎద్దులు కొన్నాను, మరియు వాటిని పరిశీలించడానికి నేను వెళ్లాలి. దయచేసి రానందుకు నన్ను క్షమించమని మీ యజమానిని అడగండి!’ 20 మరొక వ్యక్తి చెప్పాడు ‘నాకు ఇప్పుడే పెళ్లి అయింది కాబట్టి నేను రాలేను’ అన్నాడు. 21 కాబట్టి ఆ సేవకుడు తన యజమాని వద్దకు తిరిగి వచ్చాడు మరియు అందరూ చెప్పినది తెలియజేసాడు. ఇంటి యొక్క యజమాని కోపంతో ఉన్నాడు మరియు తన సేవకుడితో చెప్పాడు. “త్వరగా నగరంలోని వీధులలోనికి మరియు నగరం యొక్క సందులలోనికి బయటికి వెళ్ళండి మరియు పేదలను, మరియు వికలాంగులను మరియు గుడ్డివారిని, మరియు కుంటివారైన మనుష్యులను కనుగొనండి మరియు వారిని ఇక్కడకు నా ఇంటికి తీసుకురండి!” 22 {తరువాత} సేవకుడు {బయటకు వెళ్ళాడు మరియు దానిని చేసాడు, అతను తిరిగి వచ్చి మరియు} చెప్పాడు, 'అయ్యా, చెయ్యడానికి నీవు నాకు చెప్పినట్లు నేను చేసాను, అయితే ఇంకా ఎక్కువ మంది కోసం స్థలం ఉంది.' 23 కాబట్టి అతని యజమాని అతనితో చెప్పాడు, ‘అప్పుడు నగరం వెలుపలికి వెళ్లు. రహదారుల వెంబడి మనుష్యుల కోసం వెదకండి. కంచెలతో ఇరుకైన మార్గాల వెంబడి వెదకండి. ఆ ప్రాంతాల్లోని మనుష్యులను నా ఇంటికి రావాలని గట్టిగా కోరండి. ఇది మనుష్యులతో నిండి ఉండాలని నేను కోరుకుంటున్నాను! 24 ఇంకా నేను మీకు ఇది చెపుతున్నాను, నేను మొదట ఆహ్వానించిన ఆ మనుష్యులు నా విందులో ఆనందించలేరు, {, ఎందుకంటే వారు రావడానికి నిరాకరించారు}.'"

25 మనుష్యుల యొక్క ఒక పెద్ద జనసమూహం యేసుతో పాటు ప్రయాణిస్తున్నారు. ఆయన మనుష్యుల వైపు తిరిగాడు మరియు వారికి చెప్పాడు, 26 “నా కంటే ఎక్కువగా తన తండ్రిని, మరియు తల్లిని, మరియు భార్యను, మరియు పిల్లలను, మరియు అన్నదమ్ములను మరియు అక్క చెల్లెళ్ళను ప్రేమించే ఎవరైనా నా దగ్గరకు వచ్చిన యెడల, అతడు నా శిష్యుడు కాలేడు. అతడు తన సొంత ప్రాణాన్ని ప్రేమించే దాని కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాలి! 27 తన సొంత సిలువను మోయని వాడు మరియు నాకు విధేయత చూపనివాడు నా శిష్యుడు కాలేడు.

28 అన్నింటికంటే, మీలో ఎవరైన ఒకరు ఒక గోపురమును నిర్మించాలని కోరుకున్న యెడల, మీరు మొదట కూర్చుంటారు మరియు దాని ధర ఎంత అని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా పూర్తి చేయడానికి మీ వద్ద తగినంత డబ్బు ఉందో లేదో మీకు తెలుస్తుంది. 29 లేకపోతే, మీరు పునాది వేసి, మరియు మిగిలిన గోపురాన్ని పూర్తి చేయలేకపోయిన యెడల, దానిని చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. 30 వాళ్లు చెపుతారు, ‘ఈ మనిషి ఒక గోపురం కట్టడం మొదలుపెట్టాడు, అయితే దానిని పూర్తి చేయలేకపోయాడు!

31 లేదా ఒక రాజు తన సైన్యంలో 10, 000 మంది సైనికులను కలిగియున్నాడని అనుకుందాం. మరియు మరొక రాజు 20, 000 మంది సైనికులను కలిగియున్నాడు, అతని మీదా దాడి చెయ్యడానికి వస్తున్నాడని అనుకుందాం. తన సైన్యాన్ని యుద్ధానికి పంపడానికి ముందు, ఆ మొదటి రాజు ఖచ్చితంగా తన సలహాదారులతో కూర్చుని ఇతర రాజు సైన్యాన్ని ఓడించగలడో లేదో నిర్ణయించుకుంటాడు. 32 అతడు తన సైన్యం ఇతర సైన్యాన్ని ఓడించలేదు అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతడు తన సైన్యం ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇతర రాజు వద్దకు దూతలను పంపుతాడు. 'మీతో శాంతిగా ఉండాలంటే నేనేం చేయాలి?' అని అడగమని దూతలతో ఆయన చెపుతాడు 33 కాబట్టి, అదేవిధంగా మీలో ఎవరైనా మీకు ఉన్నదంతా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మొదట నిర్ణయించుకోకపోయిన యెడల, మీరు నా శిష్యులుగా ఉండలేరు."

34 {యేసు కూడా చెప్పాడు, మీరు} ఉప్పు {వలే ఉన్నారు,} {, అది} చాలా ప్రయోజనకరం. అయితే ఉప్పు దాని ఉప్పదనాన్ని కోల్పోయిన యెడల, అది మరల ఉప్పదనపు రుచి ఇచ్చేలా ఎవరూ చేయలేరు. 35 {ఇకమీదట ఉప్పు మరల ఉప్పదనపు రుచి చూపించక పోయిన యెడల} అది మట్టికి లేదా పేడ కుప్పకు కూడా మంచిది కాదు. మనుష్యులు దానిని కేవలం పారవేస్తారు. నేను ఇప్పుడే చెప్పిన దాని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి! ”

Chapter 15

1 ఇప్పుడు, అనేకమంది పన్ను వసూలు చేసేవారు మరియు మత పెద్దలు పాపులుగా భావించే ఇతర మనుష్యులు యేసు చెప్పే బోధ వినడానికి ఆయన దగ్గరకు వస్తూనే ఉన్నారు. 2 పరిసయ్యులు మరియు యూదుల ధర్మశాస్త్ర బోధకులు {ఇది చూసారు, వారు} {అప్పుడు} సణగడం ప్రారంభించారు. వారు చెప్పారు, “ఈ మనిషి పాపులను స్వాగతిస్తున్నాడు మరియు వారితో కలిసి భోజనం కూడా చేస్తున్నాడు.” {యేసు అలా చేయడం ద్వారా తనను తాను అపవిత్రం చేసుకుంటున్నాడని వారు భావించారు.} 3 కాబట్టి యేసు వారికి ఈ ఉపమానం చెప్పాడు: 4 “మీలో ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయని, మీరు వాటిలో ఒకదానిని పోగొట్టుకున్నారని అనుకోండి. ఖచ్చితంగా మీరు 99 ఇతర గొర్రెలను అరణ్యంలో విడిచిపెట్టి, మరియు తప్పిపోయిన గొర్రెను మీరు కనుగొనే వరకు వెదకడానికి వెళ్తారు. 5 నీవు దానిని కనుగొన్నప్పుడు, నువ్వు దానిని ఇంటికి తీసుకొనివెళ్ళడానికి దానిని సంతోషంగా నీ భుజముల మీద ఉంచుకొంటావు. 6 అప్పుడు మీరు ఇంటికి వచ్చినప్పుడు, మీరు మీ స్నేహితులను మరియు పొరుగువారిని కలిపి పిలుస్తారు మరియు వారితో చెపుతారు: "నాతో సంతోషంగా ఉండండి ఎందుకంటే తప్పిపోయిన నా గొర్రెను నేను కనుగొన్నాను.!' 7 అదే విధంగా, ఒక పాపి తన పాపాల నుండి పశ్చాత్తాపపడినప్పుడు పరలోకంలో ఉన్నవారిలో గొప్ప సంతోషం ఉంటుంది. అప్పటికే దేవునితో సమాధానంతో ఉన్న మనుష్యులు మరియు పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేని అనేకమంది వ్యక్తుల కున్న సంతోషం కంటే ఆ ఆనందం గొప్పది.

8 లేదా ఒక స్త్రీ దగ్గర పది విలువైన వెండి నాణేలు కలిగి ఉంది అని అనుకొందాం. అయితే వాటిలో ఒకదానిని పోగొట్టుకుంది. ఖచ్చితంగా ఆమె ఒక దీపం వెలిగిస్తుంది మరియు నేల తుడుస్తుంది మరియు అది దొరికే వరకు జాగ్రత్తగా వెదకుతూ ఉంటుంది. 9 ఆమె దానిని కనుగొనినప్పుడు, ఆమె తన స్నేహితులను మరియు పొరుగువారిని కలిపి పిలుస్తుంది, మరియు వారితో చెపుతుంది, "నాతో చాలా సంతోషంగా ఉండండి, ఎందుకంటే నేను పోగొట్టుకున్న నాణెం నాకు దొరికింది!' 10 అదే విధంగా నేను మీకు చెపుతున్నాను, ఒక పాపి తన పాపాల నుండి పశ్చాత్తాపపడినప్పుడు దేవుని యొక్క దూతల మధ్య అధికమైన సంతోషం ఉంటుంది.

11 అప్పుడు యేసు కొనసాగించాడు మరియు చెప్పాడు, "ఒకప్పుడు ఒక మనిషి ఉన్నాడు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 12 ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రితో చెప్పాడు, ‘తండ్రీ, నువ్వు చనిపోయినప్పుడు నేను పొందే నీ ఆస్తిలో భాగాన్ని ఇప్పుడు నాకు ఇవ్వు. కాబట్టి తండ్రి తన ఆస్తిని తన ఇద్దరు కుమారుల మధ్య విభజించాడు.’ 13 కేవలం కొద్దిరోజుల తరువాత, చిన్న కుమారుడు తాను కలిగియున్న వాటిని అన్నిటిని సమకూర్చుకొన్నాడు మరియు చాలా దూరంగా ఉన్న ఒక దేశానికి ప్రయాణం చేసాడు. అక్కడ ఆ దేశంలో అతడు తన డబ్బు అంతటిని వృధాగా, అనైతికంగా జీవనంలో ఖర్చు చేసాడు. 14 అతడు తన ధనమంతా ఖర్చుపెట్టిన తరువాత ఆ దేశమంతటా ఒక తీవ్రమైన కరువు వచ్చింది. త్వరలో అతనికి జీవించడానికి ఏమీ లేకుండా అయ్యాడు. 15 కాబట్టి అతడు ఆ దేశంలో నివసించే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు మరియు తనను కూలికి తీసుకోడానికి అడిగాడు. కాబట్టి ఆ మనిషి తన పందులను మేపడానికి అతనిని తన పొలాలకు పంపించాడు. 16 {అతడు చాలా ఆకలి గొన్నాడు} పందులు తిన్న చిక్కుడు గింజలు తినాలని అతను కోరుకున్నాడు, అయినా ఎవరూ అతనికి ఏమీ ఇవ్వలేదు.

17 చివరగా, అతడు తాను చాలా తెలివితక్కువవాడిని అని స్పష్టంగా ఆలోచించడం ప్రారంభించాడు మరియు అతను తనలో తాను చెప్పాడు: ‘నా తండ్రి కూలి సేవకులు అందరు తినడానికి తగినంత ఆహారం ఉంది, అయితే ఇక్కడ నేను చనిపోతున్నాను ఎందుకంటే తినడానికి నాకు ఏమీ లేదు! 18 కాబట్టి నేను ఈ స్థలాన్ని విడిచిపెడతాను, ఆయనతో నేను చెపుతాను, "తండ్రీ, నేను దేవునికి వ్యతిరేకంగా మరియు మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. 19 ఇక మీదట నీ కుమారునిగా నువ్వు భావించే అర్హత నాకు లేదు. దయచేసి నీ కూలి సేవకులలో ఒకని వలే నీ కోసం నన్ను పని చేయనివ్వండి.

20 కాబట్టి అతడు అక్కడి నుండి బయలు దేరాడు మరియు తన తండ్రి ఇంటికి తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. అయితే అతడు ఇంటికి చాలా దూరంలో ఉండగా, అతని తండ్రి అతనిని చూసాడు మరియు అతని కోసం లోతైన కరుణను చూపించాడు. ఆయన తన కుమారుని వద్దకు పరుగెత్తుకొని వెళ్ళాడు మరియు అతనిని కౌగలించుకొన్నాడు మరియు బుగ్గమీద అతనిని ముద్దు పెట్టు కొన్నాడు. 21 అతని కుమారుడు అతనితో చెప్పాడు, ‘తండ్రీ, నేను దేవునికి, మరియు నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. కాబట్టి నీవు నన్ను నీ కుమారునిగా భావించడానికి అర్హత నాకు లేదు.’

22 అయితే అతని తండ్రి తన సేవకులతో అన్నాడు; ‘త్వరగా వెళ్ళండి మరియు నా ఉత్తమ వస్త్రాన్ని తీసుకురండి మరియు నా కుమారుని మీద ఉంచండి. అంతేకాకుండా అతని వేలికి ఒక ఉంగరం మరియు అతని పాదాలకు పాదరక్షలు ఉంచండి! 23 మరియు ఒక ప్రత్యేక సందర్భం కోసం మనం ఒక కొవ్విన దూడను కలిగియుండడానికి మరియు దానిని చంపడానికి తీసుకు రండి, తద్వారా మనం దానిని తింటాము మరియు వేడుక చేసుకొంటాము! 24 మనం వేడుక చేసుకోవాలి ఎందుకంటే ఈ నా కుమారుడు చనిపోయిన మనిషి వలే ఉన్నాడు, అయితే ఇప్పుడు తిరిగి బ్రతికాడు! అతడు తప్పిపోయిన వ్యక్తి వలే ఉన్నాడు, అయితే మనం అతనిని తిరిగి కనుగొన్నాము!’ కాబట్టి వారు అందరూ సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.

25 {అదంతా జరుగుతుండగా} తండ్రి పెద్ద కుమారుడు పొలాలలో పని చేస్తూ ఉన్నాడు. {అతడు పని ముగించిన తరువాత,} అతడు ఇంటికి బయలుదేరాడు. అతడు ఇంటికి దగ్గరగా వస్తున్నప్పుడు, మనుష్యులు సంగీతం వాయించడం మరియు నృత్యం చేయడం అతనికి వినిపించింది. 26 అతడు సేవకులలో ఒకరిని పిలిచాడు మరియు ఏమి జరుగుతుందని అడిగాడు. 27 సేవకుడు అతనితో చెప్పాడు, ‘నీ సోదరుడు ఇంటికి వచ్చాడు. వేడుక చేయడానికి ఒక కొవ్విన దూడను చంపడానికి నీ తండ్రి మాతో చెప్పాడు ఎందుకంటీ నీ సోదరుడు క్షేమంగా మరియు ఆరోగ్యంగా తిరిగి వచ్చాడు.

28 అయితే పెద్ద సోదరుడు కోపంతో ఉన్నాడు మరియు వేడుకలో పాల్గొనడానికి ఇష్టపడలేదు. కాబట్టి అతని తండ్రి బయటకు వచ్చాడు మరియు లోపలికి రమ్మని అతనిని వేడుకున్నాడు. 29 అయితే అతడు తన తండ్రికి జవాబిచ్చాడు, ‘వినండి! ఇన్ని సంవత్సరాలు నీ కోసం బానిస వలే చాలా కష్టపడ్డాను. చెయ్యడానికి నీవు నాకు చెప్పిన ప్రతిదానికీ నేను ఎల్లప్పుడూ లోబడి ఉన్నాను. అయితే నా స్నేహితుల కోసం విందు చేయడానికి నేను ఉపయోగించేలా ఒక చిన్న మేక పిల్లను కూడా నీవు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. 30 అయితే ఇప్పుడు నీ యొక్క ఈ కుమారుడు నీ డబ్బునంతా వేశ్యల మీద వృధా చేసిన తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు, ఒక వేడుక కోసం కొవ్విన దూడను చంపమని నీవు నీ సేవకులకు చెప్పావు!’ 31 అయితే అతని తండ్రి అతనితో చెప్పాడు, ‘నా కుమారుడా, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు, మరియు నేను కలిగియున్నది అంతా నీదే. 32 అయితే మనం వేడుక చేసుకోడానికి మరియు సంతోషించడానికి మనకు సరియైనదే, ఎందుకంటే నీ సోదరుడు చనిపోయాడు మరియు తిరిగి సజీవుడయ్యాడు! అతడు చేనిపోయాడు మరియు మనం అతనిని మరల కనుగొన్నట్టు ఉంది!’’

Chapter 16

1 యేసు తన శిష్యులతో కూడా చెప్పాడు, “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, అతడు ఒక ఇంటి నిర్వాహకుడిని కలిగి ఉన్నాడు. ఒకరోజు ఒకరు ఆ నిర్వాహకుడు ఒక చెడ్డ పనిని చేస్తున్నాడని ఆ ధనవంతుడు చాలా డబ్బు పోగొట్టుకుంటున్నాడని ధనవంతినికి తెలియజేశాడు. 2 కాబట్టి అతడు నిర్వాహకుని తన దగ్గరకు రమ్మని పిలిచాడు, మరియు అతనికి చెప్పాడు, ‘నువ్వు చేస్తున్నది చాలా భయంకరమైనది అని నేను విన్నాను! నీవు నిర్వహించే విషయాలను గురించి నాకు తుది వ్రాతపూర్వక నివేదిక ఇవ్వు, ఎందుకంటే నీవు ఇక మీద నా ఇంటి నిర్వాహకుడివిగా ఉండవు!’ 3 అప్పుడు నిర్వాహకుడు తనలో తాను చెప్పుకున్నాడు, ‘నా యజమాని నన్ను తన నిర్వాహకుడిగా ఉండడం నుండి తొలగించబోతున్నాడు, కాబట్టి నేను ఏమి చేయాలో ఆలోచించాలి. గుంటలు తవ్వడం ద్వారా పని చెయ్యడానికి నేను శక్తిమంతుడను కాను, మరియు డబ్బు కోసం అడుక్కోవడానికి సిగ్గుపడుతున్నాను. 4 అతడు నా నిర్వహణ పని నుండి నన్ను తొలగించిన తరువాత మనుష్యులు నన్ను వారి ఇండ్లలోనికి తీసుకెళ్లడానికి {మరియు నాకు అందించడానికి} నేను ఏమి చేయాలో నాకు తెలుసు!’

5 కాబట్టి తన యజమానికి అరువు ఉన్న ప్రతి ఒక్కరినీ ఒక్కొక్కరుగా తన వద్దకు రమ్మని అడిగాడు. అతడు మొదటి వ్యక్తిని అడిగాడు, 'నీవు నా యజమానికి ఎంత బాకీ ఉన్నావు?' 6 ఆ మనిషి జవాబిచ్చాడు, '3, 000 లీటర్ల ఒలీవల నూనె.' నిర్వాహకుడు అతనితో చెప్పాడు, 'నీ రసీదు తీసుకో, కూర్చో, మరియు త్వరగా దానిని 1, 500 లీటర్లకు మార్చుకో!’ 7 అతడు మరొక మనిషితో చెప్పాడు, ‘నీవు ఎంత బాకీ ఉన్నావు?’ ఆ మనిషి జవాబిచ్చాడు, ‘1, 000 బుట్టల గోధుమలు.’ నిర్వాహకుడు అతనితో చెప్పాడు, ‘నీ రసీదు తీసుకో మరియు దానిని 800 బుట్టలకు మార్చు!' 8 {అప్పుడు}యజమాని {అతని నిర్వాహకుడు చేసిన పనిని విన్నప్పుడు, అతడు} నిజాయితీ లేని నిర్వాహకుడు చాలా తెలివైనవాడుగా ఉన్నాడని అతనిని మెచ్చుకొన్నాడు. నిజం ఏమిటంటే, ఈ లోకానికి చెందిన మనుష్యులు తమను తాము తమ చుట్టూ ఉన్న వారితో ఏవిధంగా సంబంధ పరచుకొంటారో అనే విషయంలో దేవునికి చెందిన మనుష్యుల కంటే చాలా తెలివైనవారు. 9 నేను మీకు చెపుతున్నాను, ఈ లోకంలో మీకున్న డబ్బును మీ కోసం స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఆ డబ్బు పోయినప్పుడు, ఆ స్నేహితులు మిమ్మల్ని వారి ఇళ్లలోకి స్వాగతిస్తారు, అది శాశ్వతంగా ఉంటుంది. 10 డబ్బు యొక్క తక్కువ మొత్తాలను నమ్మకంగా నిర్వహించే మనుష్యులు మరింత ఎక్కువ మొత్తాలలో కూడా నమ్మకంగా ఉంటారు. డబ్బు యొక్క తక్కువ మొత్తాలలో డబ్బును నిర్వహించే విధానంలో నమ్మకంగా లేని మనుష్యులు మరింత అధిక మొత్తాలలో కూడా నమ్మకత్వం లేకుండా ఉంటారు. 11 కాబట్టి మీరు ఈ లోకంలో {దేవుడు మీకు ఇచ్చిన} ధనాన్ని నమ్మకంగా నిర్వహించకపోయిన యెడల, నిజమైన {పరలోకం యొక్క} సంపదతో ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా విశ్వసించడు. 12 ఇతరులకు చెందిన ఆస్తిని మీరు నమ్మకంగా నిర్వహించకపోయిన యెడల, మీ స్వంత ఆస్తిని ఎవరైనా మీకు ఇస్తారని మీరు ఆశించకూడదు.

13 ఏ సేవకుడు ఒకే సమయంలో ఇద్దరు వేరు వేరు యజమానులకు సేవ చేయలేడు. అతడు అలా చేయడానికి ప్రయత్నించిన యెడల, అతడు వారిలో ఒకరిని ద్వేషిస్తాడు మరియు మరొకరిని ప్రేమిస్తాడు, లేదా అతను వారిలో ఒకరికి విధేయుడిగా మరియు మరొకరిని తృణీకరిస్తాడు. మీరు డబ్బు మరియు ఇతర వస్తువులను పొందియుండడానికి కూడా మీ జీవితాన్ని సమర్పించుకొన్న యెడల దేవుణ్ణి సేవించడానికి మీ జీవితాన్ని సమర్పించుకోలేరు.

14 {అక్కడ ఉన్న} పరిసయ్యులు యేసు బోధిస్తున్నది వినినప్పుడు, డబ్బు సంపాదించడానికి ఇష్టపడి ఆయనను ఎగతాళి చేశారు. 15 అయితే యేసు వారితో చెప్పాడు, “మీరు నీతిమంతులని ఇతర మనుష్యులు తలంచేలా చెయ్యడానికి ప్రయత్నిస్తారు, అయితే మీరు నిజంగా ఎలా ఉంటారో దేవునికి తెలుసు. మనుష్యులు చాలా ముఖ్యమైనవిగా మెచ్చుకునే అనేక విషయాలను దేవుడు అసహ్యకరమైనవిగా పరిగణిస్తాడని జ్ఞాపకం ఉంచుకోండి.

16 దేవుడు మోషేకు ఇచ్చిన నియమాలు, మరియు ప్రవక్తలు వ్రాసిన విషయాలు బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చే వరకు అమలులో ఉన్నాయి. అప్పటి నుండి, దేవుడు రాజు వలే ఏవిధంగా పరిపాలిస్తాడనే సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. అనేక మంది మనుష్యులు {నా సందేశాన్ని అంగీకరిస్తున్నారు మరియు} దేవుని యొక్క రాజ్యంలో భాగం కావాలని చాలా ఆసక్తిగా ప్రయత్నిస్తున్నారు. 17 దేవుని నియమాలు అన్నీ, చిన్నవిగా అనిపించేవి అయినప్పటికీ, ఆకాశం మరియు భూమి కంటే శాశ్వతమైనవి.

18 తన భార్యకు విడాకులు ఇచ్చి మరియు మరొక స్త్రీని పెళ్లాడిన ఏ పురుషుడు అయినా వ్యభిచారం చేస్తున్నాడు, మరియు భర్త చేత విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లాడిన ఏ పురుషుడు అయినా కూడా వ్యభిచారం చేస్తున్నాడు.”

19 {యేసు అన్నాడు కూడా,} “ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు అతడు ఖరీదైన ఊదా, మరియు నార వస్త్రాలు ధరించాడు. పతీ దినం విలాసవంతమైన విందులు ఇచ్చాడు. 20 మరియు {ప్రతిరోజు} మనుష్యులు ధనవంతుని ఇంటి ద్వారం వద్ద లాజరు అను పేరుగల పేద మనిషిని పరుండ బెట్టారు. లాజరు శరీరం పుండ్లతో కప్పబడి ఉంది. 21 {అతడు చాలా ఆకలిగొనిఉన్నాడు} ధనవంతుడు తినిన బల్ల మీద నుండి పడిన ఆహారపు ముక్కలను తినాలనుకున్నాడు. {అతను అక్కడ పడుకుని ఉండగా,} కుక్కలు వచ్చేవి మరియు అతని పుండ్లను నాకేవి. 22 చివరికి ఆ పేద మనిషి చనిపోయాడు. అప్పుడు దేవదూతలు అతడు {అతని పూర్వీకుడైన} అబ్రాహాముతో ఉండడానికి తీసుకొనివెళ్ళారు. ధనవంతుడు కూడా చనిపోయాడు, మనుష్యులు అతని మృతదేహాన్ని పాతిపెట్టారు. 23 చనిపోయినవారి యొక్క స్థానంలో ధనవంతుడు గొప్ప బాధను అనుభవించారు. అతడు పైకి చూసాడు మరియు దూరంగా అబ్రాహాము మరియు లాజరు అబ్రాహాముకు చాలా దగ్గరగా కూర్చుండడం చూసాడు. 24 కాబట్టి ఆ ధనవంతుడు బిగ్గరగా అరిచాడు, ‘తండ్రియైన అబ్రాహాము, ఈ అగ్నిలో నేను చాలా బాధ పడుతున్నాను! కాబట్టి దయచేసి నన్ను కరుణించు, మరియు లాజరును ఇక్కడికి పంపండి, తద్వారా అతడు తన వేలును నీటిలో ముంచి, మరియు చల్లబరచడానికి నా నాలుకను తాకగలడు!’ 25 అయితే అబ్రాహాము జవాబిచ్చాడు, “కుమారుడా, నువ్వు భూమి మీద జీవించి ఉన్నప్పుడు నువ్వు చాలా మంచి సంగతులు ఆనందించావు. అయితే లాజరు దయనీయంగా ఉన్నాడు. ఇప్పుడు అతడు ఇక్కడ సంతోషంగా ఉన్నాడు మరియు నీవు బాధపడుతున్నావు. 26 దానితో పాటు, దేవుడు మీకు మరియు మాకు మధ్య ఒక పెద్ద లోయను ఉంచాడు. కాబట్టి ఇక్కడి నుండి అక్కడ మీ దగ్గరకు వెళ్లాలనుకొనువారు చెయ్యలేరు. అంతేకాదు, మేము ఉన్న చోట నుండి కూడా అక్కడికి ఎవరూ వెళ్లలేరు.

27 అప్పుడు ధనవంతుడు చెప్పాడు, “అలా అయిన యెడల, తండ్రివైన అబ్రాహామా, లాజరును నా కుటుంబం వద్దకు పంపడానికి నేను నిన్ను అడుగుతున్నాను. 28 నాకు ఐదుగురు సోదరులు {అక్కడ నివసిస్తున్నారు} ఉన్నారు. మేము గొప్ప బాధలు అనుభవిస్తున్న ఈ ప్రదేశానికి వారు కూడా రాకుండా వారిని హెచ్చరించమని చెప్పండి!’ 29 అయితే అబ్రాహాము జవాబిచ్చాడు, '{లేదు, నేను అలా చేయను, ఎందుకంటే}నీ సోదరులకు మోషే మరియు ప్రవక్తలు చాలా కాలం క్రితం రాసినవి ఉన్నాయి. వారు వ్రాసిన వాటికి వారు లోబడి ఉండాలి!’ 30 అయితే ఆ ధనవంతుడు జవాబిచ్చాడు, ‘కాదు, తండ్రివైన అబ్రాహామా {, అది సరిపోదు}! అయితే మరణించిన వారిలో ఎవరైన వారి దగ్గరకు వెళ్లి మరియు వారిని హెచ్చరించిన యెడల, వారు వారి పాపపు ప్రవర్తనను విడిచిపెడతారు.’ 31 అబ్రాహాము అతనితో చెప్పాడు, ‘కాబట్టి మోషే మరియు ప్రవక్తలు వ్రాసిన వాటికి వారు విధేయత చూపించరు. అలాంటప్పుడు చనిపోయిన వారిలో ఎవరైనా వెళ్లి మరియు హెచ్చరించినా అది సహాయం చేయదు. వారు తమ పాపపు ప్రవర్తన నుండి బయటపడాలని వారు ఇప్పటికీ నమ్మరు.’’

Chapter 17

1 యేసు తన శిష్యులతో చెప్పాడు, “మనుష్యులను పాపం చేయడానికి ప్రేరేపించేవి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే అలాంటివి జరగడానికి కారణమయ్యే ఎవరికైనా అది ఎంతో భయంకరంగా ఉంటుంది! 2 విశ్వాసం బలహీనంగా ఉన్న వ్యక్తి పాపం చెయ్యడానికి ఎవరైనా కారణం కావడం కంటే ఒకరు ఆ వ్యక్తి మెడ చుట్టూ ఒక పెద్ద రాయిని కట్టి మరియు అతనిని సముద్రంలోనికి పడవేసిన యెడల ఆ వ్యక్తికి ఇది మేలుగా ఉంటుంది. 3 మీరు ఏవిధంగా వ్యవహరిస్తారో జాగ్రత్తగా ఉండండి. మరొక విశ్వాసి పాపం చేసిన యెడల, మీరు అతనిని గద్దించాలి. అతడు పాపం చేసినందుకు విచారపడుతున్నానని చెప్పిన యెడల మరియు తనను క్షమించమని అడిగినప్పుడు, అప్పుడు మీరు అతనిని క్షమించాలి. 4 అతడు ఒకే రోజులో ఏడుసార్లు నీకు వ్యతిరేకంగా పాపం చేసిన యెడల, అతడు ప్రతిసారీ నీ దగ్గరకు వచ్చి మరియు, ‘నేను చేసిన దానికి నేను విచారపడుతున్నాను,' అని చెప్పిన యెడల మీరు అతనిని క్షమించడం కొనసాగించాలి.”

5 అప్పుడు అపొస్తలులు యేసుతో చెప్పారు, “మాకు మరింత విశ్వాసం ఇవ్వు!” 6 యేసు జవాబిచ్చాడు, “మీకు ఈ చిన్న ఆవ గింజ కంటే పెద్ద విశ్వాసం లేనప్పటికీ, ఈ కంబలి చెట్టుతో మీరు చెప్పవచ్చు, 'నేల నుండి, వేర్లు మరియు అన్నింటి నుండి నిన్ను నీవు లాగి వేసుకొని, మరియు సముద్రంలో నిన్ను నీవు నాటుకో,' మరియు అది నీకు విధేయత చూపుతుంది!" 7 {యేసు ఇంకా అన్నాడు,} “మీలో ఒకరికి మీ పొలాలను దున్నుతున్న లేదా మీ గొర్రెలను మేపే ఒక సేవకుడు ఉన్నాడనుకోండి. అతను పొలం నుండి ఇంట్లోకి వచ్చిన తరువాత, ‘వెంటనే రమ్ము, మరియు భోజనం చేయడానికి కూర్చో!’ అని నువ్వు చెప్పవు, 8 బదులుగా నువ్వు అతనితో చెపుతావు, ‘నా కోసం భోజనం సిద్ధం చేయి! అప్పుడు నీ వడ్డన దుస్తులు ధరించు మరియు దానిని నాకు వడ్డించు, తద్వారా నేను తినగలను మరియు త్రాగగలను! తరువాత మీరు తినవచ్చు మరియు త్రాగవచ్చు.’

9 పని చెయ్యడానికి నీ సేవకునికి చెప్పబడిన పనిని అతడు చేసినందు వలన అతనికి నీవు కృతజ్ఞతలు చెప్పవు! 10 అదే విధంగా, మీరు చెయ్యడానికి దేవుడు మీకు చెప్పిన ప్రతీదానిని మీరు చేసినప్పుడు, మీరు చెప్పాలి, ‘మేము దేవుని సేవకులం మాత్రమే. మీరు మాకు కృతజ్ఞతలు చెప్పే అర్హత మాకు లేదు. మేము చెయ్యడానికి ఆయన చెప్పిన పనులు మాత్రమే మేము చేశాం.’’’ 11 యేసు, మరియు ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్లే దారిలో నడుస్తూ ఉండగా వారు సమరయ మరియు గలిలయ ప్రాంతాల మధ్య ఉన్న ప్రాంతం గుండా వెళ్తున్నారు. 12 యేసు ఒక గ్రామంలోకి ప్రవేశించినప్పుడు పదిమంది కుష్టురోగులు ఆయన దగ్గరికి వచ్చారు, అయితే వారు కొంత దూరంలో నిలబడ్డారు. 13 వారు బిగ్గరగా పిలిచారు, “యేసూ, ప్రభువా, దయచేసి మా మీద కరుణ చూపించు!” 14 యేసు వారిని చూచినప్పుడు, ఆయన వారికి చెప్పాడు, “వెళ్ళండి మరియు యాజకులు మిమ్మల్ని పరీక్షించనివ్వండి.” కాబట్టి వారు వెళ్ళారు, మరియు మార్గంలో, వారి కుష్టు వ్యాధి కనుమరుగైపోయింది. 15 అప్పుడు వారిలో ఒకడు తనకు ఇక మీదట కుష్ఠురోగం లేదని చూసాడు, దేవుణ్ణి బిగ్గరగా స్తుతిస్తూ వెనక్కి వెళ్లిపోయాడు. 16 {అతడు యేసు దగ్గరకు వచ్చాడు, మరియు} అతడు యేసు పాదాల వద్ద ముఖం పెట్టి నేలమీద పండుకొన్నాడు మరియు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ మనిషి సమరయుడు. 17 అప్పుడు యేసు చెప్పాడు, “నేను పదిమంది కుష్ఠురోగులను స్వస్థపరిచాను! మిగిలిన తొమ్మిది మంది కూడా తిరిగి వస్తారని నేను ఎదురు చూచాను! 18 ఈ విదేశీ మనిషి ఒక్కడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చాడు. మిగిలిన వారెవరూ తిరిగి రాలేదు! 19 అప్పుడు ఆయన ఆ మనిషితో చెప్పాడు, "పైకి లెమ్ము మరియు నీ దారిలో వెళ్ళు. దేవుడు నిన్ను స్వస్థపరచాడు ఎందుకంటే నా యందు నీవు విశ్వాసముంచావు.”

20 ఒకరోజు కొంతమంది పరిసయ్యులు యేసును అడిగారు, “దేవుడు అందరినీ ఎప్పుడు పరిపాలిస్తాడు?” ఆయన జవాబిచ్చాడు, “మనుష్యులు వాటి కోసం గమనించిన యెడల మనుష్యులు గుర్తించగల సంకేతాలతో ఇది జరగదు. 21 ప్రజలు చెప్పలేరు, 'చూడండి! దేవుడు ఇక్కడ పరిపాలిస్తున్నాడు!’ లేదా ‘అక్కడ దేవుడు పరిపాలిస్తున్నాడు!’ {మీరు అనుకుంటున్న దానికి విరుద్ధంగా,} దేవుడు ఇప్పటికే మీలో పాలించడం ప్రారంభించాడు.

22 యేసు తన శిష్యులతో చెప్పాడు, “మనుష్యకుమారుడైన నన్ను శక్తివంతంగా పరిపాలించడం మీరు చూడాలని కోరుకునే సమయం వస్తుంది. అయితే మీరు దానిని చూడలేరు. 23 మనుష్యులు మీతో చెపుతారు, ‘చూడండి, మెస్సీయ అక్కడ ఉన్నాడు! లేదా వారు చెపుతారు, "చూడండి, ఆయన ఇక్కడ ఉన్నాడు!' {వారు దానిని చెప్పినప్పుడు} వారిని వెంబడించవద్దు. 24 ఎందుకంటే మెరుపులు మెరిసి ఆకాశాన్ని ఒక వైపు నుండి మరొక వైపుకు వెలిగించినప్పుడు{, ప్రతి ఒక్కరూ దానిని చూడగలరు}. అలాగే మనుష్యకుమారుడనైన నేను మళ్లీ తిరిగి వచ్చినప్పుడు అందరూ నన్ను చూస్తారు. 25 అయితే అది జరగకముందే, నేను అనేక విధాలుగా శ్రమపడాలి, మరియు మనుష్యులు నన్ను తిరస్కరిస్తారు. 26 అయితే మనుష్యకుమారుడనైన నేను తిరిగి వచ్చినప్పుడు, నోవహు జీవించిన కాలంలో మనుష్యులు చేసిన విధముగానే మనుష్యులు చేస్తూ ఉంటారు. 27 ఆ సమయంలో, నోవహు మరియు అతని కుటుంబం పెద్ద ఓడలో ప్రవేశించిన రోజు వరకు, మనుష్యులు {ఎప్పటిలాగే} తిన్నారు మరియు తాగారు, మరియు వారు {ఎప్పటిలాగే} పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పుడు వరద వచ్చింది మరియు పడవలో లేని వారందరినీ నాశనం చేసింది.

28 అదేవిధంగా, లోతు {సొదొమ యొక్క నగరంలో} నివసించినప్పుడు, {అక్కడ} మనుష్యులు {ఎప్పటిలాగే} తిన్నారు మరియు త్రాగారు. వారు వస్తువులను కొనుగోలు చేసారు మరియు వారు వస్తువులను విక్రయించారు. వారు పంటలు వేశారు మరియు వారు ఇళ్ళు నిర్మించారు {ఎప్పటిలాగే}. 29 అయితే లోతు సొదొమను విడిచిపెట్టిన రోజు, ఆకాశం నుండి అగ్ని మరియు మండుతున్న గంధకం కిందకు వచ్చింది మరియు నగరంలో నివసించిన వారి నందరినీ నాశనం చేసింది.

30 ఆ విధంగానే, మనుష్య కుమారుడనైన నేను భూమికి తిరిగి వచ్చినప్పుడు, మనుష్యులు సిద్ధపడకుండా ఉంటారు. 31 ఆ రోజున, తమ ఇళ్ల వెలుపల ఉన్నవారు, ఇండ్లలో తమకున్న అన్ని వస్తువులతో, లోపలికి వెళ్లి వాటిని తెచ్చుకోవడానికి సమయం కేటాయించకూడదు. అదే విధంగా, బయట పొలంలో పని చేస్తున్న వారు ఏదైనా పొందడానికి ఇంటికి తిరిగి రాకూడదు. {వారు త్వరగా పారిపోవాలి.} 32 లోతు భార్యకు ఏమి జరిగిందో జ్ఞాపకం ఉంచుకోండి! 33 తన సొంత జీవన విధానంలో కొనసాగే వ్యక్తి ఎవరైనా చనిపోతాడు. అయితే ఎవరైనా తన పాత జీవన విధానాన్ని {నా కోసం} విడిచిపెట్టు వాడు శాశ్వతంగా జీవిస్తారు.

34 నేను మీతో దీనిని చెపుతున్నాను: నేను తిరిగి వచ్చు రాత్రి, ఒక మంచం మీద ఇద్దరు మనుష్యులు పండుకుంటారు. నాలో విశ్వసించిన వారిని దేవుడు తీసుకొని వెళ్తాడు మరియు మరొకరిని వెనుక విడిచి పెడతాడు. 35 ఇద్దరు స్త్రీలు కలిసి ధాన్యం రుబ్బుతుంటారు. వారిలో ఒకరిని దేవుడు తీసుకొని వెళ్తాడు మరియు మరొకరిని వెనుక విడిచిపెడతాడు.

36 [“పొలంలో ఇద్దరు ఉంటారు; ఒకరు తీసుకోబడతారు, మరియు మరొకరు విడిచిపెట్టబడతారు.”] 37 ఆయన శిష్యులు ఆయనతో చెప్పారు, “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” ఆయన వారికి జవాబిచ్చాడు, "మృతమైన శరీరం ఎక్కడ ఉంటే, రాబందులు దానిని తినడానికి గుమిగూడుతాయి."

Chapter 18

1 వారు నిరంతరం ప్రార్థించాలని, మరియు {దేవుడు వారి ప్రార్థనలకు వెంటనే జవాబివ్వకపోయిన యెడల} నిరుత్సాహపడ కూడదని వారికి బోధించడానికి యేసు తన శిష్యులకు మరో వృత్తాంతం చెప్పాడు. 2 ఆయన చెప్పాడు, “ఒకానొక నగరంలో దేవుణ్ణి గౌరవించని మరియు మనుష్యులను గురించి పట్టించుకొనని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. 3 ఆ నగరంలో ఒక విధవరాలు ఉంది, ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరికి వస్తూ ఉంది, ‘న్యాయస్థానంలో నన్ను ఎదిరిస్తున్న మనిషికి వ్యతిరేకంగా నాకు దయచేసి న్యాయం చేయండి.’ 4 చాలా కాలం వరకు న్యాయాధిపతి ఆమెకు సహాయం చేయడానికి నిరాకరించాడు. అయితే తరువాత, అతడు తనలో తాను చెప్పుకున్నాడు, 'నేను దేవుణ్ణి గౌరవించను మరియు నేను మనుష్యులను పట్టించుకోను. 5 అయితే ఈ విధవరాలు నన్ను ఇబ్బంది పెడుతోంది! కాబట్టి నేను ఆమె విషయంలో న్యాయం జరిగిస్తాను మరియు ఆమె న్యాయంగా వ్యవహరించబడేలా చూస్తాను. నేను దానిని చేయకపోయిన యెడల, ఆమె నిరంతరం నా దగ్గరకు రావడం చేత నేను అలసిపోయేలా చేస్తుంది అని నేను ఆందోళన చెందుతున్నాను!’’

6 అప్పుడు యేసు చెప్పాడు, “అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన దాని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. 7 {మరింత ఎక్కువగా} రోజు అంతా తనకు హృదయపూర్వకంగా ప్రార్థించే వారు, ఆయన ఎన్నుకొన్న మనుష్యుల కోసం దేవుడు{, ఆయన నీతిమంతుడు,} ఖచ్చితంగా న్యాయం తీసుకొని వస్తాడు! మరియు ఆయన వారితో ఎల్లప్పుడూ ఓపికగా ఉంటాడు. 8 నేను మీకు చెపుతున్నాను, తాను ఎన్నుకున్న వారికి దేవుడు త్వరగా న్యాయం తీసుకొనివస్తాడు! అయినప్పటికీ, మనుష్యకుమారుడనైన నేను భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు, నన్ను విశ్వసించని వారు ఇంకా అనేక మంది ఉంటారు.

9 తాము నీతిమంతులమని భావించి మరియు ఇతరులను చిన్నచూపు చూసే కొందరు మనుష్యులకు యేసు ఈ వృత్తాంతమును కూడా చెప్పాడు. 10 {ఆయన చెప్పాడు,} “ఇద్దరు పురుషులు ప్రార్థన చేయడానికి యెరూషలేములోని దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. మరొక మనిషి రోమా ప్రభుత్వం కోసం మనుష్యుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. 11 ఆ పరిసయ్యుడు నిలబడ్డాడు మరియు తన గురించి ఈ విధానంలో ప్రార్థించాడు, ‘ఓ దేవా, నేను ఇతర మనుష్యుల వలే లేనందుకు నీకు కృతజ్ఞతలు. కొందరు ఇతరుల నుంచి డబ్బు దొంగిలిస్తారు. కొందరు ఇతరులను అన్యాయంగా చూస్తారు. కొందరు వ్యభిచారం చేస్తారు. నేను ఆ పనులేవీ చేయను. మరియు నేను ఖచ్చితంగా ప్రజలను మోసం చేస్తున్న పాపాత్ముడైన ఈ పన్నులు వసూలు చేసేవాడి వలే కాదు! 12 నేను ప్రతి వారం రెండు రోజులు ఉపవాసం ఉంటాను, మరియు నేను సంపాదించిన దానిలో పది శాతాన్ని దేవాలయానికి ఇస్తాను!’ 13 అయితే పన్ను వసూలు చేసేవాడు దేవాలయం ప్రాంగణంలో ఇతర మనుష్యులకు దూరంగా ఉన్నాడు. అతడు పరలోకం వైపుకు పైకి చూడడం కూడా చెయ్యడు. బదులుగా, అతను అతని రొమ్ము మీద కొట్టుకొంటున్నాడు మరియు చెప్పాడు, 'ఓ దేవా, దయచేసి నన్ను క్షమించు, ఎందుకంటే నేను భయంకరమైన పాపిని!'" 14 అప్పుడు యేసు, చెప్పాడు, "నేను మీతో చెప్పుచున్నాను, వారు ఇంటికి వెళ్ళడానికి విడిచిపెట్టినప్పుడు దేవుడు పన్ను వసూలు చేసే వ్యక్తిని క్షమించాడు, అయితే దేవుడు పరిసయ్యుడిని క్షమించలేదు. ఇది ఎందుకంటే దేవుడు తనను తాను హెచ్చించుకునే ప్రతి ఒక్కరినీ తగ్గిస్తాడు మరియు తనను తాను తగ్గించుకునే ప్రతి ఒక్కరినీ దేవుడు హెచ్చిస్తాడు."

15 ఒకరోజు మనుష్యులు తమ పిల్లలను కూడా యేసు దగ్గరికి తీసుకు వస్తున్నారు తద్వారా ఆయన వారి మీద చేతులు ఉంచి ఆశీర్వదిస్తాడు. శిష్యులు దీనిని చూసినప్పుడు దానిని చేయవద్దని వారు వారికి చెప్పారు. 16 అయితే తన వద్దకు పిల్లలు తీసుకురాబడడం కోసం యేసు పిలిచాడు. ఆయన చెప్పాడు, “చిన్న పిల్లలను నా దగ్గరకు రానివ్వండి! వారిని ఆపవద్దు, ఎందుకంటే {వినయం మరియు విశ్వసిస్తూ ఉన్న} మనుష్యలు దేవుడు తమ జీవితాలను పరిపాలించనిచ్చే చిన్న పిల్లలు వలే ఉంటారు. 17 వాస్తవానికి, నేను మీతో చెప్పుచున్నాను, వినయంగా, మరియు నమ్మకంగా ఉండని వారు ఎవరైనా తన జీవితాన్ని దేవుడు పరిపాలించ నివ్వడానికి అంగీకరించరు.”

18 ఒకసారి ఒక యూదు నాయకుడు యేసును అడిగాడు, “మంచి బోధకుడా, నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలి?” 19 యేసు అతనితో చెప్పాడు, “నన్ను మంచివాడని ఎందుకు పిలుస్తావు? నిజంగా మంచివాడుగా ఉన్నవాడు దేవుడు ఒక్కడే!

20 {నీ ప్రశ్నకు సమాధానంగా, ఖచ్చితంగా} ఆజ్ఞలు {మనం విధేయత చూపించడానికి దేవుడు మోషేకు ఇచ్చాడు}నీకు తెలుసు : ‘వ్యభిచారం చేయవద్దు. ఎవరినీ హత్య చేయవద్దు. దొంగతనం చేయవద్దు. తప్పుడు నివేదిక ఇవ్వ వద్దు. నీ తండ్రిని, మరియు తల్లిని సన్మానించుము.” 21 ఆ మనిషి చెప్పాడు, “నేను చిన్నప్పటి నుండి ఆ ఆజ్ఞలు అన్నిటికి విధేయత చూపిస్తూ ఉన్నాను." 22 అతడు దానిని చెప్పడం యేసు వినినప్పుడు, ఆయన అతనికి జవాబిచ్చాడు, "నువ్వు మరొక దానిని చెయ్యవలసిన అవసరం ఉంది. మీకు సొంతంగా ఉన్నది అంతా అమ్మి వెయ్యండి. అప్పుడు జీవించడానికి చాలా తక్కువగా ఉన్న మనుష్యులకు డబ్బు ఇవ్వండి. ఫలితంగా మీరు పరలోకంలో ఆధ్యాత్మిక సంపదను కలిగియుంటారు. అప్పుడు రమ్ము మరియు నా శిష్యుడిగా ఉండు!” 23 అతడు అది వినినప్పుడు ఆ మనిషి చాలా బాధ పడ్డాడు ఎందుకంటే అతడు చాలా ధనవంతుడు. 24 యేసు ఆ మనిషి వైపు చూసాడు మరియు చెప్పాడు, “ధనవంతులుగా ఉన్నవారు తమను దేవుడు పరిపాలించనివ్వడం చాలా కష్టం. 25 వాస్తవానికి, ధనవంతులు తమ జీవితాలను దేవుడు పరిపాలించనివ్వడం కంటే ఒక ఒంటె సూది యొక్క బెజ్జం ద్వారా వెళ్డానికి సులభం.”

26 యేసు చెప్పిన మాట విన్నవారు జవాబిచ్చారు, “అప్పుడు ఎవరైనా నిత్యజీవం కలిగి ఉండాలని దేవుడు భావించడం లేదన్నట్టు కనిపిస్తుంది!" 27 అయితే యేసు చెప్పాడు, “మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే.” 28 అప్పుడు పేతురు చెప్పాడు, “మన గురించి ఏమిటి? నీ శిష్యులుగా మారడం కోసం మేము కలిగి యున్న దానినంతా మేము విడిచిపెట్టాము.” 29 యేసు వారితో చెప్పాడు, “నేను మీకు నిశ్చయత ఇస్తున్నాను, దేవుడు తమ మీద పరిపాలించడం కోసం తమ ఇళ్లను, తమ భార్యలను, తమ సోదరులను, తమ తల్లిదండ్రులను లేదా తమ పిల్లలను విడిచిపెట్టిన వారు 30 ఈ జీవితంలో వారు వెనుక విడిచి పెట్టిన దాని అంతటికంటే అనేక రెట్లు పొందుతారు మరియు రాబోయే యుగంలో వారు నిత్యజీవాన్ని పొందుతారు.”

31 యేసు 12 మంది శిష్యులను తమకు తాముగా ఒక ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. ఆయన వారికి చెప్పాడు, "జాగ్రత్తగా వినండి! మనం యెరూషలేముకు వెళ్తున్న మార్గంలో ఉన్నాము. మనం అక్కడ ఉన్నప్పుడు, మనుష్యకుమారుడైన నా గురించి చాలా కాలం క్రితం ప్రవక్తలు వ్రాసిన ప్రతిదీ జరుగుతుంది. 32 నా శత్రువులు నన్ను యూదులు కాని అధికారుల వద్దకు నన్ను తీసుకొని వెళ్లినప్పుడు ఇది జరుగుతుంది. వారు నన్ను ఎగతాళి చేస్తారు, అలక్ష్యంతో ప్రవర్తిస్తారు మరియు నాపై ఉమ్మి వేస్తారు. 33 వాళ్లు నన్ను కొరడాతో కొడతారు మరియు అప్పుడు వారు నన్ను చంపుతారు. అయితే రెండు రోజుల తరువాత నేను తిరిగి సజీవునిగా మారతాను. 34 అయితే శిష్యులు ఆయన చెప్పిన వాటిలో దేనినీ అర్థం చేసుకోలేదు. వాటి ప్రాముఖ్యతను గుర్తించడం నుండి దేవుడు వారిని నిరోధించాడు, కాబట్టి యేసు వారికి చెపుతున్న దాని చేత ఆయన భావం ఏమిటో వారికి తెలియదు. 35 యేసు, మరియు ఆయన శిష్యులు యెరికో యొక్క నగరానికి దగ్గరకు వచ్చియుండగా, ఒక గుడ్డి మనిషి మార్గం ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అతడు డబ్బు కోసం అడుక్కొంటూ ఉన్నాడు. 36 మనుష్యుల యొక్క ఒక జనసమూహం ప్రక్కగా వెళ్ళుస్తూ ఉండడం అతడు వినినప్పుడు, “ఏం జరుగుతోంది?” అని {తన చుట్టూ ఉన్నవారిని} అడుగుతూ ఉన్నాడు. 37 వారు అతనికి చెప్పారు, “{అక్కడ ఒక జనసమూహం ఉంది ఎందుకంటే} నజరేతు యొక్క పట్టణం నుండి ఒక మనిషి యేసు, ఈ మార్గం నుండి వస్తున్నాడు." 38 అతడు అరిచాడు, “యేసూ, నువ్వు దావీదు రాజు నుండి సంతానంగా వచ్చావు, నా మీద జాలి కలిగి యుండు!” 39 జనసమూహం ముందు నడుచుకుంటూ వెళ్తున్నవారు అతనిని తిట్టారు మరియు మౌనంగా ఉండాలని అతనికి చెప్పారు. అయితే అతడు మరింత బిగ్గరగా అరిచాడు, “నువ్వు దావీదు రాజు నుండి సంతానంగా వచ్చావు, నా మీద జాలి కలిగి యుండు!”

40 యేసు నడవడం నిలిపివేసాడు మరియు ఆ మనిషిని తన దగ్గరకు తీసుకురావాలని మనుష్యులకు ఆజ్ఞాపించాడు. గ్రుడ్డివాడు దగ్గరికి వచ్చినప్పుడు, యేసు అతనిని అడిగాడు, 41 “నేను నీ కోసం ఏమి చేయాలని కోరుకుంటున్నావు?” అతడు జవాబిచ్చాడు, “ప్రభువా చూడడానికి నన్ను శక్తిమంతునిగా నేను నిన్ను కోరుతున్నాను!" 42 యేసు అతనికి చెప్పాడు, “అందువలన నేను ఇప్పుడు నీ దృష్టిని పూర్వస్థితికి తెస్తున్నాను! ఎందుకంటే నువ్వు నాలో విశ్వాసం ఉంచావు, నేను నిన్ను స్వస్థపరిచాను!” 43 వెంటనే అతడు చూడగలిగాడు. మరియు అతడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసుతో వెళ్ళాడు. మరియు అక్కడ ఉన్న మనుష్యులు అందరూ దీనిని చూసారు, వారు కూడా దేవుణ్ణి స్తుతించారు.

Chapter 19

1 యేసు యెరికోలో ప్రవేశించాడు మరియు నగరం గుండా వెళ్తున్నాడు. 2 అక్కడ జక్కయ్య అనే పేరు ఉన్న ఒక మనిషి ఉన్నాడు. అతడు పన్నులు వసూలు చేసే బాధ్యతను కలిగి ఉన్నాడు మరియు అతను చాలా ధనవంతుడు. 3 అతడు యేసును చూడడానికి కోరుకున్నాడు, అయితే అతడు జనసమూహము మీద ఆయన చూడలేకపోయాడు. అతడు చాలా పొట్టి మనిషి {మరియు యేసు చుట్టూ అనేకమంది మనుష్యులు ఉన్నారు}. 4 కాబట్టి అతడు మార్గం వెంబడి మరింత దూరం పరుగెత్తాడు. అతడు ఒక మేడి చెట్టు ఎక్కాడు, కాబట్టి ఆయన ఆ మార్గం ద్వారా యేసు వచ్చినప్పుడు ఆయనను చూస్తాడు. 5 యేసు అక్కడికి చేరుకున్నప్పుడు, ఆయన పైకి చూసాడు మరియు అతనితో చెప్పాడు, “జక్కయా, త్వరగా కిందకు దిగు, నేను ఈ రాత్రికి నీ ఇంటి వద్ద బస చేయాలి.” 6 కాబట్టి అతడు త్వరగా దిగి వచ్చాడు. అతడు యేసును తన ఇంటిలోనికి స్వాగతించడానికి సంతోషంగా ఉన్నాడు. 7 అయితే యేసు అక్కడికి వెళ్లడం చూసిన మనుష్యులు సణిగారు, చెప్పారు, "అతడు ఒక నిజమైన పాపికి అతిథిగా ఉండడానికి వెళ్లాడు!” 8 వారు భోజనం చేయుచుండగా జక్కయ్య పైకి లేచాడు మరియు యేసుకు చెప్పాడు, "ప్రభువా, నేను కలిగియున్న దాని యొక్క సగభాగం పేదలైన మనుష్యులకు ఇవ్వబోతున్నానని నువ్వు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరియు నేను మోసం చేసిన వ్యక్తుల విషయానికొస్తే, నేను వారి నుండి తీసుకున్న మొత్తం కంటే నాలుగు రెట్లు తిరిగి చెల్లిస్తాను. 9 యేసు అతనితో చెప్పాడు, “ఈ రోజు దేవుడు ఈ ఇంటిని రక్షించాడు ఎందుకంటే ఈ మనిషి అబ్రాహాము యొక్క నిజమైన సంతానం అని చూపించుకొన్నాడు. 10 దీనిని జ్ఞాపకం ఉంచుకోండి: మనుష్యుని యొక్క కుమారుడనైన నేను దేవునికి అవిధేయత చూపుతున్న {మీకు వలే}మనుష్యులను కనుగొనడానికి మరియు రక్షించడానికి వచ్చాను.”

11 ప్రజలు యేసు చెప్పిన ప్రతీదానిని వింటూ ఉన్నారు. ఆయన యెరూషలేముకు దగ్గరగా వస్తున్నాడు{, మరియు ప్రజలకు తప్పుడు ఆలోచన ఉందని ఆయనకు తెలుసు}. ఆయన యెరూషలేముకు వచ్చిన వెంటనే దేవుని ప్రజల మీద రాజు వలే పరిపాలించడం ప్రారంభిస్తాడని వారు అనుకున్నారు. కాబట్టి యేసు వారికి మరో వృత్తాంతం చెప్పాలని నిర్ణయించుకున్నాడు {ఆ ఆలోచనను సరిదిద్దడానికి}. 12 ఆయన చెప్పాడు, "ఒక యువ రాజు ఒక సుదూర దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు, తద్వారా అతడు తాను నివసించే దేశాన్ని పాలించే హక్కు ఒక ఉన్నతమైన రాజు అతనికి ఇవ్వగలిగాడు. అతడు దానిని స్వీకరించిన తరువాత, అతడు తన ప్రజలను పరిపాలించడానికి తిరిగి వస్తాడు. 13 {అతడు బయలుదేరే ముందు,} అతడు తన సేవకులలో పదిమందిని పిలిపించాడు. వారిలో ప్రతి ఒక్కరికీ ఒక సమాన మొత్తంలో డబ్బు ఇచ్చాడు. అతడు వారితో చెప్పాడు, ‘నేను తిరిగి వచ్చేంత వరకు ఈ డబ్బుతో వ్యాపారం చేయండి!' {అప్పుడు అతడు విడిచివెళ్ళాడు.} 14 అయితే అతని దేశంలోని అనేకమంది మనుష్యులు ఆయనను ద్వేషించారు. కాబట్టి వారు అతనిని అనుసరించడానికి కొంతమంది దూతలను పంపారు మరియు చెప్పారు {ఉన్నతుడైన రాజుకు} 'ఈ మనిషి మా రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు!' 15 {అయితే అతడు ఏవిధంగానైనా రాజు అయ్యాడు. తరువాత} అతడు కొత్త రాజు వలే తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు డబ్బు ఇచ్చిన సేవకులను పిలిచాడు. అతడు వారికి ఇచ్చిన డబ్బుతో వ్యాపారం చెయ్యడం ద్వారా వారు ఎంత సంపాదించారో తెలుసుకోడానికి అతడు కోరుకున్నాడు.

16 మొదటి సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు మరియు చెప్పాడు, ‘అయ్యా, నీ డబ్బుతో నేను పదిరెట్లు మొత్తం సంపాదించాను!’ 17 అతడు ఈ మనిషితో చెప్పాడు, 'నువ్వు మంచి సేవకుడివి! నువ్వు చాలా బాగా చేసావు! ఎందుకంటే కొద్దిపాటి డబ్బు యొక్క మొత్తాన్ని నమ్మకంగా జాగ్రత్త తీసుకొన్నావు, పరిపాలించడానికి నేను నీకు పది నగరాలను ఇస్తాను. 18 అప్పుడు రెండవ సేవకుడు వచ్చాడు మరియు చెప్పాడు, ‘అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన డబ్బు ఇప్పుడు ఐదు రెట్లు ఎక్కువ విలువ! 19 అతడు ఆ సేవకుడితో కూడా చెప్పాడు, ‘{బాగా చేశావు!} నిన్ను ఐదు నగరాల మీద అధిపతిగా ఉంచుతాను.’

20 అప్పుడు మరొక సేవకుడు వచ్చాడు. అతడు చెప్పాడు, ‘అయ్యా, ఇదిగో నీ డబ్బు. నేను దానిని ఒక గుడ్డలో చుట్టాను మరియు దానిని భద్రంగా ఉంచడానికి దాచాను. 21 నేను సంపాదించినదంతా నీవు తీసుకుంటావని నేను భయపడ్డాను. నిజంగా నీకు చెందని వస్తువులను నీవు ఇతరుల నుండి తీసుకునే కఠినమైన మనిషి అని నాకు తెలుసు. మరొక రైతు నాటిన ధాన్యాన్ని పండించే రైతు వలే నువ్వు ఉన్నావు. 22 అతడు ఆ సేవకుడితో చెప్పాడు, ‘నువ్వు దుష్ట సేవకుడవు! నువ్వు ఇప్పుడే చెప్పిన మాటలతో చేత నేను నిన్ను ఖండిస్తాను. నేను కఠినమైన మనిషినని నువ్వు చెప్పావు. నాకు చెందనిది నేను తీసుకుంటాను నువ్వు చెప్పావు. నేను మరొక రైతు నాటిన పంటలను పండించే రైతు వలే ఉన్నాను అని నువ్వు చెప్పావు. 23 కాబట్టి నువ్వు నా డబ్బును కనీసం అప్పు ఇచ్చేవాళ్లకైనా ఇచ్చి ఉండాలి! అప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని దానితో పాటు అది సంపాదించే వడ్డీని కలిపి సేకరించేవాడిని!’ 24 అప్పుడు రాజు దగ్గర నిలబడి ఉన్నవారితో చెప్పాడు, ‘అతని దగ్గర డబ్బు తీసుకొండి మరియు పదిరెట్లు సంపాదించిన దాసుడికి ఇవ్వండి!’ 25 వారు అభ్యంతరపరచారు, ‘అయితే అయ్యా, అతడు ఇప్పటికే చాలా డబ్బును కలిగి యున్నాడు!’ 26 అయితే రాజు చెప్పాడు, ‘నేను మీతో ఇది చెపుతున్నాను: వారు పొందినవాటిని బాగా ఉపయోగించుకుంటారో ఆ మనుష్యులకు, నేను ఇంకా ఎక్కువ ఇస్తాను. అయితే వారు పొందినవాటిని సరిగా ఉపయోగించని మనుష్యుల నుండి, నేను ఇప్పటికే ఉన్న వాటిని కూడా తీసి వేసుకొంటాను. 27 ఇప్పుడు, తమ మీద పరిపాలించడానికి నన్ను ఇష్టపడని నా యొక్క శత్రువుల విషయంలో వారిని ఇక్కడికి తీసుకు రండి మరియు నేను గమనిస్తుండగా ఉరితీయండి!’’

28 యేసు ఆ సంగతులు చెప్పిన తర్వాత యెరూషలేము వైపుకు వెళ్ళు మార్గం మీదుగా ఆయన దూరం ప్రయాణం చేసాడు. 29 వారు ఒలీవల కొండకు సమీపంలో ఉన్న బేత్ఫగే మరియు బేతనియ గ్రామాలకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన తన ఇద్దరు శిష్యులను ముందుగా పంపించాడు. 30 ఆయన వారితో చెప్పాడు, "మీ యొక్క ముందున్న గ్రామానికి వెళ్ళండి, మీరు దానిలోనికి ప్రవేశించగానే అక్కడ ఎవ్వరూ ఎప్పుడూ నడపని గాడిద పిల్ల కట్టివేయబడి ఉండడం మీరు చూస్తారు. దానిని విప్పండి మరియు నా దగ్గరకు తీసుకురండి. 31 ‘ఎందుకు గాడిదను విప్పుతున్నావు?’ అని ఎవరైనా మిమ్మల్ని అడిగిన యెడల, ‘యేసుకు ఇది కావాలి’ అని అతనితో చెప్పండి.

32 కాబట్టి ఇద్దరు శిష్యులు గ్రామానికి వెళ్ళారు మరియు వెళ్లి, యేసు తమకు చెప్పిన విధంగా గాడిదను కనుగొన్నారు. 33 వారు దాన్ని విప్పుతుండగా, దాని యజమానులు వారితో చెప్పారు, “మా గాడిదను మీరు ఎందుకు విప్పుతున్నారు?” 34 వారు జవాబిచ్చారు, “యేసుకు ఇది అవసరం.” మరియు యజమానులు వాటిని ఉపయోగించడానికి వారికి అనుమతి ఇచ్చారు. 35 అప్పుడు శిష్యులు ఆ గాడిదను యేసు దగ్గరికి తీసుకువచ్చారు. వారు తమ వస్త్రాలను గాడిద వీపుమీదకు విసిరారు మరియు యేసు దానిపైకి వెళ్లేందుకు సహాయం చేశారు. 36 అప్పుడు, ఆయన నడిపిస్తున్నప్పుడు, ఇతరులు ఆయనను ఘనపరచడానికి ఆయన ముందు మార్గం మీద తమ అంగీలను పరిచారు. 37 యేసు ఒలీవల కొండ నుండి క్రిందికి వెళ్లే దారి దగ్గరికి సమీపిస్తూ ఉండగా, ఆయన యొక్క శిష్యుల గుంపు అంతా ఆయన చెయ్యడం చూసిన గొప్ప అద్భుతాలు అన్నిటి కోసం బిగ్గరగా, సంతోషమైన కేకలతో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. 38 వారు “దేవుని అధికారంతో వస్తున్న మన రాజును దేవుడు ఆశీర్వదించును గాక! పరలోకంలో ఉన్న దేవునికి మరియు ఆయన ప్రజలమైన మనకు మధ్య సమాధానం ఉండును గాక, మరియు ప్రతి ఒక్కరు దేవుణ్ణి స్తుతిస్తారు గాక!" వంటి సంగతులు చెపుతున్నారు.

39 జన సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు ఆయనతో చెప్పారు, “బోధకుడా, ఆ మాటలు చెప్పడం మానేయమని నీ శిష్యులతో చెప్పు!” 40 ఆయన జవాబిచ్చాడు, “నేను మీతో దీనిని చెపుతాను: ఈ మనుష్యులు మౌనంగా ఉన్న యెడల, రాళ్ళు వాటికవే నన్ను స్తుతించడానికి అరుస్తాయి!”

41 యేసు యెరూషలేము దగ్గరికి వచ్చి మరియు నగరాన్ని చూచినప్పుడు, దాని మనుష్యుల గురించి ఆయన అరిచాడు. 42 ఆయన చెప్పాడు, "దేవుని సమాధానమును ఏవిధంగా కలిగియుండాలో మీరు మనుష్యులు ఈ రోజు మీకు తెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీరు దీనిని తెలుసుకోలేకపోతున్నారు. 43 మీరు దీనిని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను: మీరు కష్ట సమయాలను అనుభవించబోతున్నారు. మీ శత్రువులు వస్తారు మరియు మీ నగరం చుట్టూ ముళ్ళకంచెలను ఏర్పాటు చేస్తారు. వారు నగరాన్ని చుట్టుముట్టారు మరియు అన్ని వైపులా దానిని దాడి చేస్తారు. 44 వారు {గోడలను ఛేదిస్తారు మరియు} వాటిని మరియు మిగిలిన నగరాన్ని నాశనం చేస్తారు. వారు మీ అందరినీ చంపుతారు. వారు ప్రతీ దానినీ పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఇది అంతా జరుగుతుంది ఎందుకంటే దేవుడు మిమ్ములను రక్షించడానికి వచ్చిన సమయాన్ని మీరు గుర్తించలేదు! ”

45 యేసు యెరూషలేములో ప్రవేశించాడు మరియు దేవాలయం ప్రాంగణంలోనికి వెళ్లాడు. అక్కడ వస్తువులు అమ్ముతున్న వారిని అక్కడి నుంచి వెళ్లమని బలవంతం చేయడం ప్రారంభించాడు. 46 ఆయన వారితో చెప్పాడు, 'లేఖనాలు చెపుతున్నాయి, "దేవుని మందిరం మనుష్యులు ప్రార్థన చేసే స్థలంగా ఉండాలి,’ అయితే మీరు దానిని 'దొంగల కోసం దాగుకొనే స్థలంగా' చేసారు!"

47 ఆ వారంలో ప్రతిరోజూ యేసు దేవాలయం వద్ద మనుష్యులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకులు, మత నియమాల యొక్క బోధకులు, మరియు ఇతర యూదు నాయకులు ఆయనను చంపడానికి ఒక మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. 48 అయితే దానిని చెయ్యడానికి ఎటువంటి మార్గాన్ని వారు కనుగొనలేక పోయారు, ఎందుకంటే అనేకమంది మనుష్యులు ఆయన మాట వినడానికి ఆసక్తిగా ఉన్నారు.

Chapter 20

1 ఆ వారంలో ఒకరోజు, దేవాలయం వద్ద మనుష్యులకు యేసు బోధిస్తూ ఉన్నాడు మరియు దేవుని మంచి సందేశాన్ని వారికి చెపుతున్నాడు. ఆయన దానిని చేస్తూ ఉండగా, ప్రధాన యాజకులు, యూదా ధర్మశాస్త్ర బోధకులు, మరియు ఇతర పెద్దలు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు. 2 వారు అతనితో చెప్పారు, “మాతో చెప్పు, ఈ సంగతులు చేయడానికి నీవు ఎటువంటి హక్కును నీవు కలిగియున్నావు? మరియు ఎవరి నీకు ఈ హక్కును ఇచ్చారు?” 3 ఆయన జవాబిచ్చాడు, “నేను కూడా మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. నాకు చెప్పండి 4 యోహాను మనుష్యులకు బాప్తిస్మం ఇవ్వడం గురించి: అతడు బాప్తిస్మం ఇవ్వడానికి దేవుడు ఆజ్ఞాపించాడా లేక మానవులు అతనికి ఆజ్ఞాపించారా?" 5 దీనిని వారు తమలో తాము చర్చించుకున్నారు. వారు చెప్పారు, "‘దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు’ అని మనం జవాబిచ్చినన యెడల, అప్పుడు అతడు చెపుతాడు, ‘మీరు ఆయనను ఎందుకు విశ్వసించలేదు?’ 6 అయితే 'ఇది కేవలం అతడు బాప్తిస్మం ఇవ్వడానికి మానవులు అతనికి చెప్పారు' అని చెప్పిన యెడల మనుష్యులు మనలను మరణం వరకు రాళ్ళతో కొడతారు, ఎందుకంటే వారిలో అనేకులు యోహాను {దేవుడు పంపిన} ఒక ప్రవక్త అని విశ్వసిస్తారు. 7 కాబట్టి యోహాను బాప్తిస్మమివ్వడానికి ఎవరు చెప్పారో తమకు తెలియదని వారు జవాబిచ్చారు. 8 అప్పుడు యేసు వారితో చెప్పాడు, "మీరు నాకు చెప్పకుండా ఉన్న విధముగానే, ఆ సంగతులు చెయ్యడానికి నన్ను ఎవరు పంపించారో నేను మీకు చెప్పను.”

9 అప్పుడు మనుష్యులకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక మనిషి ఒక ద్రాక్షతోట నాటాడు. ద్రాక్షతోటను చూసుకునే కొంతమందికి అతడు దానిని అద్దెకు ఇచ్చాడు. అప్పుడు అతడు ఇతర దేశానికి వెళ్ళాడు మరియు అక్కడ చాలా కాలం ఉన్నాడు. 10 ద్రాక్షపండ్లు కోసే సమయం వచ్చినప్పుడు, ఈ యజమాని ద్రాక్షతోటను చూసుకుంటున్న వారి దగ్గరికి ఒక సేవకుడిని పంపాడు. ద్రాక్షతోట పండించిన ద్రాక్షపండ్లలో తన భాగం తనకు ఇవ్వాలని అతడు వారిని కోరుకున్నాడు. అయితే {సేవకుడు వచ్చిన తర్వాత,} వారు ఆ సేవకుడిని కొట్టారు మరియు అతనికి ఎటువంటి ద్రాక్షపండ్లు ఇవ్వకుండా పంపించి వేసారు. 11 తరువాత, యజమాని మరొక సేవకుని పంపాడు, అయితే వారు ఆ సేవకుని కూడా కొట్టారు మరియు ఆ సేవకుడిని అవమానపరిచారు. ఎటువంటి ద్రాక్షాపండ్లు లేకుండా వారు అతనిని పంపించివేసారు. 12 ఇంకా తరువాత, యజమాని ఇంకొక సేవకుని పంపాడు. రైతులు ఈ సేవకుని కూడా గాయపరచారు మరియు ద్రాక్షతోటను విడిచిపెట్టడానికి బలవంతం చేశారు. 13 కాబట్టి ద్రాక్షతోట యొక్క యజమాని తనకు తాను చెప్పాడు, ‘ఇప్పుడు నేను ఏమి చేయాలి? నేను చాలా ప్రేమించే నా కుమారుడిని పంపిస్తాను. వారు అతణ్ణి బహుశా గౌరవిస్తారు.' 14 {కాబట్టి ఆయన తన కుమారుడిని పంపించాడు,} అయితే ద్రాక్షతోటను చూసుకుంటున్న మనుష్యులు అతడు రావడం చూసారు, వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, 'ఈ ద్రాక్షతోటను ఒక రోజు వారసత్వంగా పొందే వ్యక్తి వచ్చాడు! మనం అతనిని చంపివేద్దాం! అప్పుడు ద్రాక్షతోట మనది అవుతుంది!’ 15 కాబట్టి వారు అతనిని ద్రాక్షతోట వెలుపలికి లాగారు మరియు వారు అతనిని చంపారు. ద్రాక్షతోట యజమాని వారిని ఏమి చేస్తాడో నేను మీకు చెపుతాను! 16 అతడు వస్తాడు మరియు ద్రాక్షతోటను చూసుకుంటున్న వారిని చంపుతాడు. తరువాత దానిని చూసుకునేలా ఇతర మనుష్యుల కోసం ఏర్పాటు చేస్తాడు.” యేసు మాటలు వింటున్న మనుష్యులు అది విన్నారు మరియు చెప్పారు, “ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకుండును గాక!” 17 అయితే యేసు నేరుగా వారి వైపు చూసాడు, మరియు చెప్పాడు, “మీరు అలా చెప్పవచ్చు, అయితే లేఖనాలలో వ్రాయబడిన ఈ మాటల భావాన్ని గురించి ఆలోచించండి.

     ‘కట్టువారు తిరస్కరించిన రాయి కట్టడంలో అత్యంత ముఖ్యమైన రాయిగా మారింది.

18 ఈ రాయి దాని మీద పడిన ప్రతి ఒక్కరినీ ముక్కలు చేస్తుంది, మరియు అది ఎవరి మీద పడుతుందో దానిని నలిపివేస్తుంది.

19 ఆ దుర్మార్గులైన మనుష్యులను గురించి వృత్తాంతాన్ని చెప్పినప్పుడు ఆయన వారిని నిందిస్తున్నాడు అని గుర్తించిన ప్రధాన యాజకులు మరియు యూదు ధర్మ శాస్త్రము యొక్క బోధకులు గుర్తించారు. కాబట్టి వారు వెంటనే ఆయన బంధించడానికి ఒక మార్గం కనుగొనడానికి ప్రయత్నం చేసారు. {అయితే వారు అతనిని బంధించలేదు,} ఎందుకంటే వారు ఆ విధంగా చేసిన యెడల మనుష్యులు ఏమి చేస్తారో అని వారు భయపడ్డారు. 20 కాబట్టి వారు అతనిని జాగ్రత్తగా గమనించారు. వారు గూఢచారులను కూడా పంపారు {యేసుతో మాట్లాడటానికి} వారు యదార్ధంగా ఉన్నట్లు నటించారు, అయితే వారు యేసు తప్పుగా మాట్లాడాలని నిజంగా కోరుకున్నారు. వారు {రోమా ప్రభుత్వానికి ప్రతిఘటనను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించగల్గునట్లు తద్వారా వారు} ఆయనను {ప్రాంతం యొక్క} అధిపతికి అప్పగించాలని వారు కోరుకున్నారు. 21 వారిలో ఒకడు ఆయనతో చెప్పాడు, “బోధకుడా, నువ్వు మాట్లాడుతావని మరియు సరైనది మాట్లాడతావని మాకు తెలుసు. ముఖ్యమైన వ్యక్తులు దానిని ఇష్ట పడక పోయినప్పుడు సహితం నీవు దానిని చేస్తావు. మనం ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దానిని నీవు నమ్మకంగా బోధిస్తావు. 22 {కాబట్టి ఈ విషయం గురించి నీవు ఏమి ఆలోచిస్తున్నావో మాకు చెప్పు.} రోమా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ఇది సరైనదేనా, కాదా? 23 అయితే ఆ పన్నులు చెల్లించడానికి ఇష్టపడని యూదుల విషయంలో లేదా రోమా ప్రభుత్వం విషయంలో తనను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు వారు తనను మోసగించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన వారితో చెప్పాడు, 24 “నాకు ఒక రోమా నాణాన్ని చూపించండి. అప్పుడు ఎవరి చిత్రం మరియు పేరు దాని మీదా ఉందో నాకు చెప్పండి." కాబట్టి వారు {ఆయనకు ఒక నాణెం చూపించారు మరియు}, చెప్పారు “ఇది కైసరు యొక్క చిత్రం మరియు పేరు కలిగి ఉంది.” 25 ఆయన వారితో చెప్పాడు, “అలా అయితే, ప్రభుత్వానికి చెందినది దానికి ఇవ్వండి మరియు ఆయనకు చెందినది దేవునికి ఇవ్వండి.” 26 మనుష్యులు ఆయన చుట్టూ నిలబడి ఉండగా యేసు చెప్పిన దానిలో వేగులు ఎటువంటి తప్పును కనుగొనలేకపోయారు. ఆయన సమాధానానికి వేగులు ఎంతో ఆశ్చర్యపోయారు, అంతకు మించి ఏమీ మాట్లాడలేదు.

27 దాని తరువాత కొందరు సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చారు. వారి యూదుల యొక్క గుంపు మృతులలో నుండి ఎవరూ లేవరని బోధించారు. వారు యేసును ఒక సవాలుతో కూడిన ప్రశ్న అడగాలని కూడా అనుకున్నారు. 28 వారిలో ఒకడు అతనితో చెప్పాడు, “బోధకుడా, భార్యను కలిగి యుండి అయితే పిల్లలు లేని మనిషి చనిపోయిన యెడల ఏమి చేయాలో యూదులమైన మాకు మోషే బోధించాడు. అతని సోదరుడు వితంతువును వివాహం చేసుకోవాలి, తద్వారా ఆమె అతని చేత ఒక బిడ్డను పొందుతుంది. అప్పుడు మనుష్యులు ఆ బిడ్డను చనిపోయిన వ్యక్తి వంశస్థుడిగా పరిగణిస్తారు. 29 మంచిది, ఒక కుటుంబంలో అక్కడ ఏడుగురు సోదరులు ఉన్నారు. పెద్దవాడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు, అయితే ఆమెకు ఏ పిల్లలు పుట్టకముందే, అతడు చనిపోయాడు, ఆమెను ఒక వితంతువుగా విడిచిపెట్టాడు. 30 రెండవ సోదరుడు ఈ నియమాన్ని అనుసరించాడు మరియు వితంతువును వివాహం చేసుకున్నాడు, అయితే అతనికి అదే జరిగింది. 31 అప్పుడు మూడో సోదరుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, అయితే మరల అదే జరిగింది. చివరిలో, ఏడుగురు సోదరులు అందరు, ఒకరి తర్వాత ఒకరు ఆ స్త్రీని వివాహం చేసుకున్నారు, అయితే పిల్లలు లేకుండా చనిపోయారు. 32 ఆ తర్వాత ఆ స్త్రీ చనిపోయింది. 33 కాబట్టి, చనిపోయినవాళ్లు తిరిగి సజీవులుగా మారతారు అనే సమయం వస్తుందనేది నిజం అయిన యెడల, అప్పుడు ఆ స్త్రీ ఎవరి భార్యగా ఉంటుందని నీవు అనుకుంటున్నావు? ఆమె మొత్తం ఏడుగురు సోదరులను వివాహం చేసుకున్నదని జ్ఞాపకం ఉంచుకోండి! 34 యేసు వారికి జవాబిచ్చాడు, “ఈ లోకంలో పురుషులు స్త్రీలను పెండ్లి చేసుకుంటారు, మరియు తలిదండ్రులు పురుషులకు వివాహంలో కుమార్తెలను ఇస్తారు. 35 అయితే చనిపోయిన తరువాత ఆయన వారిని తిరిగి బ్రతికించినప్పుడు వారు పరలోకంలో ఉండేందుకు దేవుడు అర్హులుగా భావించే మనుష్యులు పెళ్లి చేసుకోరు. 36 {వారు పెండ్లి చేసుకోరు} ఎందుకంటే వారు ఇకమీదట చనిపోలేరు, బదులుగా వారు దేవదూతల {ఎప్పటికీ జీవించేవారు} వలే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత దేవుడు వారిని తిరిగి సజీవులను చేసాడు కాబట్టి వారు దేవుని పిల్లలు. 37 {ఇప్పుడు నేను వివాహం గురించిన మీ ప్రశ్నకు సమాధానమిచ్చాను, నేను లేఖనం నుండి చూపిస్తాను} మనుష్యులు చనిపోయిన తరువాత దేవుడు తిరిగి సజీవులను చేసాడు. మోషే కూడా దీని గురించి రాశాడు. మండుతున్న పొదలో దేవుణ్ణి కలుసుకోవడం గురించి ఆయన వివరించిన స్థలంలో, ప్రభువు తనను తాను 'అబ్రాహాము యొక్క దేవుడు మరియు ఇస్సాకు యొక్క దేవుడు మరియు యాకోబు యొక్క దేవుడు' అని తనను తాను దేవుడు ఎలా పిలుచుకొన్నాడో నమోదు చేశాడు. {ఈ మనుష్యులను ఆయన తిరిగి సజీవులను చేసి మరియు ఆయన ఇంకా వారికి దేవుడుగా ఉండని యెడల దేవుడు చెప్పియుండే వాడు కాదు.} 38 ఎందుకంటే, ఆయన చనిపోయిన మనుష్యులకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్న మనుష్యులకు దేవుడు, ఎందుకంటే దేవునికి, ప్రతి ఒక్కరూ {వారు చనిపోయిన తర్వాత కూడా} సజీవంగా ఉంటారు.

39 యూదుల యొక్క బోధకులు కొందరు {అక్కడ ఉన్నవారు} జవాబిచ్చారు, “బోధకుడా, నువ్వు చాలా బాగా జవాబిచ్చావు!” 40 {శాస్త్రులు దీనిని చెప్పారు} ఎందుకంటే యేసును పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న మనుష్యులు {ఆయనను కష్టమైన ప్రశ్నలు అడగడం ఆపివేశారు. ఆయన చాలా చక్కగా సమాధానమిచ్చాడు, వారు} ఆయనను ఇంకా ఏమైనా అడగడానికి భయపడ్డారు.

41 కాబట్టి ప్రతిగా, {యేసు వారిని తనదైన ఒక కష్టమైన ప్రశ్న అడిగాడు.} ఆయన చెప్పాడు, "మెస్సీయ {ఒక్కడే} దావీదు రాజు యొక్క వంశస్థుడని మనుష్యులు ఎందుకు అంటారు? 42 దావీదు స్వయంగా కీర్తనల యొక్క పుస్తకంలో {మెస్సీయ గురించి} రాసిన దానిని ఆలోచించండి,

     ‘దేవుడు నా ప్రభువుతో చెప్పాడు,

     “ఇక్కడ నా కుడి వైపున నా ప్రక్కన కూర్చో{, ఆ గొప్ప గౌరవప్రదమైన స్థానంలో}.

     43 నేను నీ శత్రువులను పూర్తిగా ఓడించేంత వరకు {ఇక్కడ కూర్చో}.”

44 ఈ కీర్తనలో, దావీదు రాజు మెస్సీయను ‘నా ప్రభువు’ అని పిలుస్తున్నాడు. {అది చాలా గౌరవనీయమైన బిరుదు.} కాబట్టి మెస్సీయ దావీదు వంశస్థుడుగా ఎలా ఉంటాడు? {పితరునికి వంశస్థుడే గొప్ప గౌరవం చూపిస్తాడు.}”

45 అప్పుడు, మిగిలిన ఇతర మనుష్యులు అందరూ వింటూ ఉండగా, యేసు తన శిష్యులతో చెప్పాడు, 46 "మన యూదుల నియమాలను బోధించే వారి వలే ప్రవర్తించకుండా ఉండేలా జాగ్రత్త పడండి. వారు పొడవాటి వస్త్రాలు ధరించి, మరియు తాము చాలా ప్రాముఖ్యమైనవిగా మనుష్యులు భావించేలా చేయడానికి చుట్టూ నడవడానికి ఇష్టపడతారు. వారు బజారులో మనుష్యులు వారిని గౌరవంగా శుభములు చెప్పడం కూడా వారికి ఇష్టం. వారు సమాజ మందిరాలలో అతి ముఖ్యమైన ఆసనాలలో కూర్చోవడానికి ఇష్టపడతారు. రాత్రి విందు భోజనాలలో వారు అత్యంత గౌరవప్రదమైన వ్యక్తుల కోసం స్థలాలలో కూర్చోవడానికి ఇష్టపడతారు. 47 వారు వితంతువుల ఆస్థి అంతటిని {కూడా} దొంగిలిస్తారు. అయితే తాము నీతిమంతులని ఇతరులు భావించేలా చేయడానికి, వారు దీర్ఘ కాలం {బహిరంగంగా} ప్రార్థిస్తారు. వారు చేసిన దానికి దేవుడు వారిని కఠినంగా శిక్షిస్తాడు.”

Chapter 21

1 అప్పుడు యేసు {తాను కూర్చున్న చోటు నుండి} పైకి చూసాడు మరియు ధనవంతులైన మనుష్యులు తమ కానుకలను {డబ్బును} {ఆలయ ప్రాంగణంలోని} అర్పణ పెట్టెలలో ఉంచడం చూశాడు. 2 ఒక పేద విధవరాలు ఒక పెట్టెలో రెండు చిన్న రాగి నాణేలు వేయడం కూడా ఆయన చూశాడు. 3 మరియు ఆయన చెప్పాడు {తన శిష్యులతో}, “ఈ పేద విధవరాలు {ఈ ధనవంతులైన మనుష్యులు} అందరి కంటే {అర్పణల పెట్టెలలోనికి} ఎక్కువ ఉంచింది అనేది సత్యం. 4 అది ఎందుకు సత్యమో నేను మీకు చెపుతాను. ఆ {ధనవంతులు} అందరూ చాలా డబ్బు ఇచ్చారు, అయితే అది వారికి నిజంగా అవసరం లేని అదనపు డబ్బు. అయితే చాలా పేదరాలైన ఈ వితంతువు తాను జీవించడానికి నిజంగా అవసరమైనప్పటికీ తన వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ఇచ్చింది.

5 కొంతమంది {యేసు యొక్క శిష్యులు} దేవాలయము అందమైన రాళ్లతో మరియు మనుష్యులు ఇచ్చిన అలంకరణలతో ఏవిధంగా అలంకరించబడిన దాని గురించి మాట్లాడుతున్నారు. అయితే యేసు చెప్పాడు, 6 “నీవు మెచ్చుకుంటున్న ఈ విషయాలకు {ఏమి జరగబోతుందో చెప్పనివ్వు}. ఒక రోజు నీ శత్రువులు వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తారు.”

7 అప్పుడు వారు ఆయనను అడిగారు, “బోధకుడా, ఈ సంగతులు అన్ని ఎప్పుడు జరుగుతాయి? మరియు ఈ విషయాలు జరగబోతాయనే దాని గురించి ఏమి చూపుతుంది? ” 8 యేసు జవాబిచ్చాడు, “ఎవరూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించనివ్వకండి. ఎందుకంటే అనేకమంది వస్తారు మరియు ప్రతి ఒక్కరూ నేను అని చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరూ తన గురించి చెపుతారు, ‘నేనే మెస్సీయను!’ వారు ఇంకా చెపుతారు, ‘దేవుడు రాజు వలే పరిపాలించే సమయం దాదాపు ఇక్కడ ఉంది!’ వారు చెప్పుచున్నది నమ్మవద్దు! 9 అంతేకాకుండా, మీరు యుద్ధాల గురించి మరియు మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం గురించి వింటారు. {లోకం యొక్క} అంతం రాకముందే ఇలాంటివి జరగాలి. కాబట్టి {మీరు ఆ విషయాల గురించి విన్నప్పుడు,} భయపడకండి.

10 వివిధ మనష్యుల గుంపులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు మరియు వివిధ రాజ్యాల యొక్క మనుష్యులు ఒకరితో ఒకరు పోరాడుతారు. 11 మరియు వివిధ ప్రాంతాల్లో గొప్ప భూకంపాలు వస్తాయి. కరువులు, మరియు భయంకరమైన వ్యాధులు కూడా వస్తాయి. మనుష్యులు అధికంగా భయానికి గురి చేసే అనేక సంఘటనలు జరుగుతాయి. మనుష్యులు ఆకాశంలో వింతలను చూస్తారు {అది చాలా ముఖ్యమైనది జరగబోతోందని చూపిస్తుంది}. 12 అయితే ఈ సంగతులు అన్నీ {జరగడానికి} ముందే నీ శత్రువులు నిన్ను పట్టుకొంటారు మరియు నీచంగా చూస్తారు. వారు మిమ్మల్ని సమాజ మందిరాలకు తీసుకువెళతారు{, వారి న్యాయమూర్తులు మిమ్మల్ని విచారణలో ఉంచుతారు} మరియు చెరసాలలలో {మిమ్మల్ని ఉంచుతారు}. మీ శత్రువులు రాజులను కూడా కలిగి ఉంటారు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు మిమ్మల్ని విచారణలో ఉంచుతారు ఎందుకంటే మీరు నా యందు విశ్వాసముంచారు. 13 మీరు వారికి నా గురించి సత్యం చెప్పాల్సిన సమయం అది. 14 కాబట్టి మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి మీరు ఏమి చెపుతారనే దాని గురించి ముందుగా చింతించవద్దని దృఢంగా నిర్ణయించుకోండి, 15 ఎందుకంటే నేను మీకు సరైన పదాలను ఇస్తాను తద్వారా మీరు ఏమి చెప్పాలో తెలుసుకుంటారు. దాని ఫలితంగా, మీ మీద ఆరోపణలు చేసే మనుషులలో ఎవరూ మీరు తప్పు అని చెప్పలేరు. 16 మరియు మీ తల్లిదండ్రులు మరియు సోదరులు మరియు సోదరీలు మరియు {ఇతర} బంధువులు మరియు స్నేహితులు కూడా మీకు ద్రోహం చేస్తారు మరియు వారు మీలో కొందరిని చంపుతారు. 17 అనేకులైన మనుష్యులు నిన్ను ద్వేషిస్తారు ఎందుకంటే మీరు నా యందు విశ్వాసముంచుతున్నారు. 18 అయితే నీ సర్వస్వం {ఆత్మీయంగా} సురక్షితంగా ఉంటుంది. 19 మీరు కష్ట సమయాల ద్వారా వెళ్తున్న యెడల మరియు మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారని నిరూపించిన యెడల, మీరు చనిపోయిన తరువాత మీ ఆత్మలు దేవుని సన్నిధిలో జీవిస్తాయి.

20 సైన్యాలు యెరూషలేము యొక్క {నగరమును}ను చుట్టుముట్టడం మీరు చూసినప్పుడు, అప్పుడు వారు త్వరలోనే ఆ నగరాన్ని నాశనం చేస్తారని మీరు తెలుసుకొంటారు. 21 ఆ సమయంలో మీలో యూదయ ప్రాంతంలోని ఇతర స్థలములలో ఉన్నవారు పర్వతాలకు పారిపోవాలి. మరియు మీలో యూదయ యొక్క {ప్రాంతంలోని ఇతర ప్రదేశాలు} ఉన్నవారు పర్వతాలకు తప్పించుకొని వెళ్ళాలి. మరియు మీలో ఈ నగరంలో ఉన్నవారు విడిచి వెళ్ళాలి. మీలో సమీపంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారు నగరంలోకి రాకూడదు. 22 {మీరు పారి పోవాలి} ఎందుకంటే దేవుడు ఈ సమయంలో {యెరూషలేము యొక్క నగరాన్ని} శిక్షిస్తాడు. {ఆయన దానిని చేసినప్పుడు} దేవుడు దీని గురించి లేఖనాల్లో చెప్పినది నిజమవుతుంది. 23 ఇది జరిగినప్పుడు, గర్భిణీ స్త్రీలకు మరియు వారి పిల్లలకు పాలిచ్చే వారికి ఇది ఎంతో భయంకరంగా ఉంటుంది. భూమిలో గొప్ప శ్రమ ఉంటుంది. దేవుడు ఈ మనుష్యులతో కోపంగా ఉంటాడు మరియు వారిని కఠినంగా శిక్షిస్తాడు. 24 వారిలో అనేకులు చనిపోతారు ఎందుకంటే సైనికులు తమ ఆయుధాలతో వారిని చంపుతారు. వారి శత్రువులు ఇతరులను ఖైదీలు వలే తీసుకొంటారు మరియు లోకంలోని అనేక ప్రాంతాలకు వారిని పంపుతారు. దేవుడు అనుమతించినంత వరకూ అన్యజనులు యెరూషలేము {యొక్క నగరాన్ని} ఆధీనంలో ఉంచుకుంటారు.”

25 “ఈ సమయంలో సూర్యునికి, చంద్రునికి, మరియు నక్షత్రాలకు వింతైన సంగతులు జరుగుతాయి. మరియు భూమి మీద, మనుష్యుల సమూహాలు చాలా భయపడతాయి. అతిపెద్దవైన అలలతో గర్జించే సముద్రంలో ఉన్నట్టుగా వారు భయపడతారు. 26 లోకంలో జరగబోయే దాని కోసం వారు ఎదురుచూస్తూ వారు స్పృహ తప్పి పడిపోయేంతగా మనుష్యులు చాలా భయపడతారు. ఎందుకంటే తరువాతి లోకంలో జరుగబోతున్నదాని కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఆకాశంలోని నక్షత్రాలు వాటి సాధారణ ప్రదేశాల నుండి కదులుతాయి. 27 అప్పుడు మనుష్యకుమారుడైన నేను మేఘాల మీద శక్తివంతంగా మరియు తేజోవంతమైన కాంతితో రావడం మనుష్యులు అందరూ చూస్తారు. 28 కాబట్టి ఆ భయంకరమైన విషయాలు జరగడం ప్రారంభించినప్పుడు, నమ్మకం యొక్క స్థితిని ఊహించుకోండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని త్వరలోనే రక్షిస్తాడు.”

29 అప్పుడు యేసు వారికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఆయన చెప్పాడు, “అంజూరపు చెట్ల గురించి మరియు అన్ని చెట్ల గురించి కూడా ఆలోచించండి. 30 వాటి ఆకులు మొలకెత్తడం మీరు చూసినప్పుడు అది వేసవికాలం ప్రారంభం అని మీరు తెలుసుకొంటారు. 31 అదే విధంగా, నేను ఇంతకుముందు వివరించిన ఈ సంగతులు జరుగుతున్నాయని మీరు చూసినప్పుడు, దేవుడు త్వరలో తనను తాను రాజు వలే కనుపరచుకొంటాడని మీరు తెలుసుకొంటారు. 32 నేను మీతో సత్యం చెపుతున్నాను. నేను వివరించిన మొదటి సూచనలను చూసే మనుష్యులు ఖచ్చితంగా ఇవన్నీ జరిగే వరకు జీవించి ఉంటారు. 33 మీరు ఆకాశాన్ని, మరియు భూమిని శాశ్వతమైనదాని వలే భావించవచ్చు. అవి కావు, అయితే నా మాటలు శాశ్వతం.

34 మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మత్తులుగా ఉన్న యెడల, మీ మనసులు ఆ తరువాత అప్రమత్తంగా ఉండవు. మరియు మీరు రోజువారీ సంగతులను గురించి ఆందోళన చెందుతున్న యెడల, మీరు కలవరపడతారు. {అప్పుడు నేను మీకు చెప్పిన సంకేతాలను గురించి మీరు శ్రద్ధ చూపరు, మరియు} నేను తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను. 35 {నేను చాలా అకస్మాత్తుగా వస్తాను} అది ఒక జంతువుమీద ఉచ్చు మూసుకుపోయినట్లు వలే ఉంటుంది. {కాబట్టి మీరు నా రాకడ కోసం ఎదురుచూస్తూ ఉండాలి,} ఎందుకంటే ఇది లోకంలోని ప్రతి వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. 36 కాబట్టి మీరు నా రాకడ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. నేను మాట్లాడుతున్న ఈ కష్టమైన విషయాలను మీరు అనుభవిస్తున్నప్పుడు మీరు నాకు నమ్మకంగా ఉండగలుగునట్లు ప్రార్థించండి. ఆ విధంగా, మెస్సీయ అయిన నేను, {లోకానికి తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు} నిన్ను నిర్దోషిగా ప్రకటిస్తాను.

37 యేసు ప్రతీరోజు దేవాలయం వద్ద మనుష్యులకు బోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రతి సాయంత్రం ఆయన {నగరం వెలుపలికి} వెళ్ళేవాడు మరియు ఒలీవల కొండ మీద రాత్రంతా ఉండేవాడు. 38 మరియు ప్రతిరోజు తెల్లవారుజామున, {ఆయన బోధిస్తూ ఉండగా} ఆయన మాటలు వినడానికి మనుష్యుల యొక్క గొప్ప సమూహాలు దేవాలయముకు ఆయన వద్దకు వచ్చారు.

Chapter 22

1 మనుష్యులు పస్కా పండుగ అని కూడా పిలిచే పులియని రొట్టెల యొక్క వేడుకకు ఇప్పుడు దాదాపు సమయం వచ్చింది. 2 ప్రధాన యాజకులు మరియు యూదుల యొక్క బోధకులు {అనేకులైన} మనుష్యుల {ఆయన ఒక గొప్ప మనిషి అని తలస్తున్నవారు}మధ్య అల్లరి ఆరంభించడం లేకుండా యేసును చంపడానికి మార్గం కోసం వెదకుతున్నారు,

3 అప్పుడు సాతాను యూదాలోకి ప్రవేశించాడు. అతని మరొక పేరు ఇస్కరియోతు. అతడు 12 మంది శిష్యులలో ఒకడు. 4 అతడు వెళ్ళాడు మరియు ప్రధాన యాజకులు మరియు దేవాలయం యొక్క కాపలా అధికారులతో యేసును పట్టుకోవడానికి వారికి ఎలా సహాయం చేయాలో మాట్లాడాడు. 5 వారు చాలా సంతోషించారు {అతడు దానిని చేయాడానికి అంగీకరించినప్పుడు}. వారు అతనికి డబ్బు చెల్లిస్తారని చెప్పారు {అతడు దానిని చేసిన యెడల}. 6 కాబట్టి యూదా అంగీకరించాడు, మరియు జనసమూహం దానిని చూడని చోట యేసును పట్టుకోవడంలో వారికి సహాయపడడానికి ఒక మార్గం కోసం చూడడం ఆరంభించాడు.

7 అప్పుడు పులియని రొట్టెల యొక్క దినం వచ్చింది. యూదులు పస్కా పండుగ వేడుక కోసం వారు తినే గొర్రె పిల్లలను మనుష్యులు చంపడానికి రోజు ఇది. 8 కాబట్టి పేతురు మరియు యోహానులను ఈ హెచ్చరికలతో యేసు బయటికి పంపాడు: “వెళ్ళండి మరియు పస్కా పండుగ వేడుక కోసం సిద్ధపరచండి తద్వారా మనం అంతా కలిసి పస్కా విందును భుజిద్డాము.” 9 వారు ఆయనకు జవాబిచ్చారు. “మేము భోజనం ఎక్కడ సిద్ధం చేయాలని నీవు కోరుకుంటున్నావు?” 10 ఆయన జవాబిచ్చాడు, "జాగ్రత్తగా వినండి. మీరు నగరంలోనికి వెళ్లినప్పుడు, ఒక పెద్ద నీటి యొక్క కుండ మోసుకొని వెళ్తున్న ఒక మనిషి మిమ్మల్ని కలుసుకొంటాడు. అతడు ప్రవేశించే ఇంటిలోనికి అతనిని అనుసరించండి. 11 ఇంటి యొక్క యజమానితో చెప్పండి, 'మా బోధకుడు తన శిష్యులమైన మాతో కలిసి పస్కా భోజనం చేసే గదిని మాకు చూపించమని చెపుతున్నాడు.' 12 అతడు మీకు ఒక పెద్ద గదిని చూపిస్తాడు. ఇంటి మీద అంతస్తులో ఉంది. ఇది అతిథులను అలరించేందుకు అంతా సిద్ధంగా ఉంటుంది. అక్కడ మాకు భోజనం సిద్ధం చెయ్యి.” 13 కాబట్టి ఇద్దరు శిష్యులు {నగరంలోనికి} వెళ్లారు. యేసు చెప్పిన విధముగానే ప్రతిదీ ఉంది అని వారు కనుగొన్నారు. కాబట్టి వారు అక్కడ పస్కా పండుగ {భోజనం కోసం} సిద్ధం చేశారు.

14 భోజనం చేయడానికి సమయం అయినప్పుడు, యేసు వచ్చాడు మరియు అపొస్తలులతో కూర్చున్నాడు. 15 ఆయన వారితో చెప్పాడు, “నేను చనిపోవడానికి ముందు మీతో ఈ ప్రత్యేకమైన పస్కా విందు భుజించడానికి చాలా కోరుకున్నాను. 16 నేను మీతో చెప్పుచున్నాను, దేవుడు రాజు వలే ప్రతిచోటా పరిపాలిస్తున్నప్పుడు దాని లోతైన అర్థాన్ని దానిని ఇచ్చినప్పుడు నేను తదుపరిసారి భుజిస్తాను. 17 అప్పుడు ఆయన ద్రాక్షారసం యొక్క ఒక పాత్రను తీసుకొన్నాడు. మరియు దాని కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన {తన అపొస్తలులతో} చెప్పాడు, "ఈ ద్రాక్షారసాన్ని తీసుకోండి మరియు దీనిని మీ మధ్య పంచుకొండి. 18 {మీరు ఇది చెయ్యాలని నేను కోరుతున్నాను} ఎందుకంటే, నేను మీతో చెప్పుచున్నాను, దేవుడు రాజు వలే ప్రతిచోటా పరిపాలించే వరకు నేను మరల ద్రాక్షారసం తాగను." 19 అప్పుడు ఆయన కొంచెం రొట్టె తీసుకొన్నాడు మరియు కొని దాని కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆయన దానిని ముక్కలుగా విరిచాడు మరియు తినడానికి వారికి ఇచ్చాడు. ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పాడు, "ఈ రొట్టె నా శరీరం, నేను మీ కోసం త్యాగం చేయబోతున్నాను. నన్ను గౌరవించడం కోసం దీన్ని మళ్లీ చేయండి." 20 అదే విధంగా, వారు భోజనం చేసిన తర్వాత, ఆయన ద్రాక్షారసం యొక్క గిన్నెను తీసుకొన్నాడు మరియు చెప్పాడు, “ఇది నా స్వంత రక్తాన్ని ఉపయోగించి నేను చేసే కొత్త నిబంధన. నేను మీ కోసం చనిపోయినప్పుడు నా గాయాల నుండి ఇది ప్రవహిస్తుంది. 21 అయితే నన్ను శత్రువుల చేతికి అప్పగించే వ్యక్తి ఇక్కడ నాతో పాటు భోజనం చేస్తున్నాడని మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 22 {నేను దీనిని చెపుతున్నాను}. ఎందుకంటే మనుష్య కుమారుడనైన నేను దేవుడు ప్రణాళిక ప్రకారం నిజంగా చనిపోతాను అయితే నన్ను {నా శత్రువులకు} అప్పగించే మనిషికి అది ఎంతో భయంకరంగా ఉంటుంది!” 23 అప్పుడు అపొస్తలులు తమలో ఎవరు యేసును అప్పగించడానికి సిద్ధపడి ఉన్నారని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టారు.

24 దాని తరువాత, అపొస్తలులు తమలో ఎవరిని అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని భావించాలని తమలో తాము వాదించుకోవడం మొదలుపెట్టారు. 25 యేసు వారికి స్పందించాడు, “అన్యజనుల దేశాల యొక్క రాజులు తాము శక్తిమంతులమని మనుష్యులకు చూపించడానికి ఇష్టపడతారు. అయినప్పటికీ వారు తమకు తాము ‘మనుష్యులకు సహాయం చేసేవారు’ అని పేరు పెట్టుకుంటారు. 26 అయితే మీరు ఆ పాలకుల వలే ఉండకూడదు! బదులుగా, మీ మధ్య అత్యంత గౌరవప్రదమైన మనుష్యులు తక్కువ గౌరవం పొందిన వారు అన్నట్టుగా ప్రవర్తించాలి. నడిపించే వారు ఎవరైనా సేవకుడి వలే వ్యవహరించాలి. 27 ఎందుకంటే భోజనం తెచ్చే సేవకుడు కాదు, బల్ల దగ్గర భోజనం చేసేవాడే ముఖ్యమైన వ్యక్తి అని మీరు యెరుగుదురు. అయితే మీ నాయకుడనైన నేను మీ మధ్య ఉంటూ ఉన్నప్పుడు మీకు సేవ చెయ్యడం చేత మీకు మాదిరి నియమిస్తూ ఉన్నాను.

28 నేను శ్రమ పడిన కష్టమైన సంగతులు అన్నిటి మధ్య నాతో పాటు నిలిచిన మనుష్యులు మీరే. 29 కాబట్టి ఇప్పుడు నా తండ్రి నన్ను రాజు వలే పరిపాలించడానికి నియమించిన విధంగా ఇప్పుడు మీరు పరిపాలించే ముఖ్యమైన స్థానాల్లో మిమ్మల్ని నేను నియమిస్తున్నాను. 30 నేను రాజు అయ్యాక మీరు నాతో కూర్చుంటారు మరియు భోజనం చేస్తారు. నిజానికి, మీరు సింహాసనాలపై కూర్చుంటారు మరియు ఇశ్రాయేలులోని 12 గోత్రాల మనుష్యులకు తీర్పు తీరుస్తారు.”

31 “సీమోను, సీమోను, శ్రద్ధ వహించు! ఒకరు జల్లెడలో ధాన్యాన్ని కదిలించిన విధంగా మిమ్ములను అందరినీ పరీక్షించడానికి {అతనిని చెయ్యానియ్యాలని} సాతాను {దేవుణ్ణి} అడిగాడు {, మరియు అది చెయ్యడానికి దేవుడు అతనిని అనుమతించాడు}. 32 అయితే సీమోను, నేను నీ కోసం ప్రార్థించాను. నీవు నన్ను నమ్మడం పూర్తిగా మాన కూడదని {నేను దేవుణ్ణి అడిగాను}. కాబట్టి నువ్వు నన్ను నిజంగా విశ్వసిస్తున్నావని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర అపొస్తలులను {నన్ను కూడా విశ్వసించడానికి} ప్రోత్సహించు. 33 పేతురు ఆయనకు జవాబిచ్చాడు, “ప్రభువా, నేను నీతో చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీతో చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను! ” 34 యేసు జవాబిచ్చాడు, “పేతురూ, ఈ రాత్రి కోడి కూయకముందే నువ్వు నన్ను ఎరుగనని మూడుసార్లు చెపుతావు అని నీకు తెలియాలని నేను కోరుకుంటున్నాను!”

35 అప్పుడు యేసు శిష్యులను అడిగాడు, “నేను మిమ్మును బయటకు పంపినప్పుడు ఎటువంటి డబ్బు, ఆహారం లేదా చెప్పులు లేకుండా{గ్రామాలకు, మరియు మీరు వెళ్ళారు} అప్పుడు, అయితే పొందలేకుండా మీకు అవసరమైనవి ఏమైనా ఉన్నాయా?” వారు జవాబిచ్చారు, "లేదు, అక్కడ ఏమీ లేదు!" 36 అప్పుడు యేసు చెప్పాడు, “అయితే, ఇప్పుడు, {మీ మధ్య} ఎవరికైనా కొంత డబ్బు ఉన్న యెడల, అతడు దానిని తనతో తీసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా, ఎవరైనా ఆహారం కలిగి దానిని అతనితో తీసుకొని వెళ్ళాలి. మరియు ఒక కత్తి లేని ఎవరైనా తన అంగీ అమ్మి ఒకటి కొనాలి! ” 37 ఒక ప్రవక్త నన్ను గూర్చి లేఖనాలలో వ్రాసినది తప్పక జరగాలి కాబట్టి నేను మీకు ఇది చెపుతున్నాను: ‘మనుష్యులు అతనిని నేరస్థుని వలే చూసారు.’ నా గురించి లేఖనాలు చెపుతున్నవి అన్నీ జరగబోతున్నాయి. 38 శిష్యులు జవాబిచ్చారు, “ప్రభువా, చూడు! మేము రెండు కత్తులు కలిగియున్నాము!" ఆయన జవాబిచ్చాడు, "మనకు రెండు కంటే ఎక్కువ అవసరం లేదు."

39 యేసు నగరాన్ని విడిచి పెట్టాడు మరియు ఆయన సాధారణంగా చేసినట్టు వలే ఒలీవల యొక్క కొండకు వెళ్లాడు. ఆయన శిష్యులు అతనితో వెళ్ళారు. 40 యేసు తాను తరచుగా రాత్రి గడిపే ప్రదేశానికి {తన శిష్యులతో} వచ్చినప్పుడు, ఆయన వారితో చెప్పాడు, “మీరు శోధించబడినప్పుడు మీరు పాపం చేయకుండా ఉండడానికి దేవుడు మీకు సహాయం చేయాలి అని ప్రార్థించండి.” 41 తరువాత ఆయన వారి నుండి దాదాపు 30 మీటర్ల దూరం వెళ్ళాడు, మోకాళ్లమీద కూర్చున్నాడు మరియు ప్రార్థన చేశాడు. 42 ఆయన చెప్పాడు, “తండ్రీ, నీకు ఇష్టమైన యెడల, దయచేసి జరగబోతున్న భయంకరమైన సంగతులను అనుభవించకుండా నన్ను అనుమతించండి. అయితే నేను కోరుకున్న దానిని చేయవద్దు. నీవు కోరుకున్న దానిని చెయ్యి." 43 [అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత ఆయన దగ్గరకు వచ్చాడు మరియు ఆయన ధైర్యం ఇచ్చాడు. 44 ఆయన చాలా శ్రమపడుతున్నాడు. కాబట్టి అతను చాలా తీవ్రంగా ప్రార్థించాడు. ఆయన చెమట పెద్ద రక్తపు బిందువుల వలే నేలమీద పడింది.] 45 యేసు ప్రార్థిస్తూ ఉండడం నుండి పైకి లేచినప్పుడు, ఆయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చాడు. వారు నిద్రిస్తూ ఉన్నారని ఆయన కనుగొన్నాడు. వారు చాలా విచారంగా ఉన్నారు మరియు ఇది వారిని అలసిపోయేలా చేసింది. 46 ఆయన {వారిని నిద్రలేపాడు మరియు} వారితో చెప్పాడు, “ఇది మీరు నిద్రపోయే సమయం కాదు! పైకి లేవండి! పాపం చేయడానికి మిమ్మల్ని ఏదీ శోధించకుండా {దేవుడు మీకు సహాయం చేసేలా ప్రార్థించండి.}

47 యేసు ఇంకా మాట్లాడుతూ ఉండగా, ఒక మనుష్యుల జనసమూహం ఆయన దగ్గరికి వచ్చింది. 12 మంది శిష్యులలో ఒకరైన యూదా వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. అతడు చెంప మీద ముద్దుతో ఆయనకు శుభములు చెప్పడానికి యేసు వద్దకు వచ్చాడు. 48 అయితే యేసు అతనితో చెప్పాడు, “యూదా, మనుష్యకుమారుడనైన నన్ను నా శత్రువులకు అప్పగించడానికి ఒక ముద్దును వినియోగించడంలో నీకు ఎంత ధైర్యం!” 49 ఏమి జరుగుతుందో శిష్యులు గ్రహించి నప్పుడు వారు చెప్పాడు, “ప్రభువా, {వారు నిన్ను బంధించకుండా ఉండేందుకు} మేము మా ఆయుధములను ఉపయోగించాలా?” 50 వారిలో ఒకడు {తన కత్తిని తీసాడు మరియు} ప్రధాన యాజకుని యొక్క సేవకుని కొట్టాడు, అయితే అతని కుడి చెవిని {మాత్రమే} నరికాడు. 51 అయితే యేసు చెప్పాడు, “అది ఇంకా ఎక్కువ చేయవద్దు!” అప్పుడు అతడు గాయపడిన చోట సేవకుడిని ముట్టుకొన్నాడు మరియు అతనిని స్వస్థపరిచాడు. 52 అప్పుడు యేసు తనను బంధించడానికి వచ్చిన ప్రధాన యాజకులు, దేవాలయ కాపలాదారులు, మరియు యూదు పెద్దలతో చెప్పాడు, "నేను బందిపోటు అన్నట్టుగా మీరు నన్ను బంధించడానికి కత్తులు మరియు కర్రలతో ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అనేక దినములు దేవాలయములో నేను మీతో ఉన్నాను, అయితే మీరు నన్ను బాధించడానికి ఏమాత్రం ప్రయత్నం చెయ్యలేదు!

53 అయితే మీరు కోరుకున్నదానిని చెయ్యడానికి సమయం ఇది. సాతాను తాను చేయాలని కోరుకున్న విధంగా చెడు పనులు చేస్తున్న సమయం కూడా ఇదే. 54 యూదుల నాయకులు మరియు సైనికులు యేసును పట్టుకున్నారు మరియు ఆయనను బయటకు నడిపించారు. వారు ఆయనను ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువచ్చారు. పేతురు {సురక్షితమైన దూరం నుండి} చాలా వెనుకగా వారిని అనుసరించాడు. 55 కొందరు మనుష్యులు ప్రాంగణం మధ్యలో ఒక మంట వెలిగించారు మరియు కలిసి కింద కూర్చున్నారు. పేతురు వచ్చాడు మరియు వారి మధ్య కూర్చున్నాడు. 56 అతని మీద అగ్ని ప్రకాశిస్తూ ఉండగా అక్కడ కూర్చున్న ఒక దాసి పేతురుని చూసింది. ఆమె అతని వైపు జాగ్రత్తగా చూసింది మరియు చెప్పింది, “ఈ వ్యక్తి కూడా వారు బంధించిన వారితో ఉన్నాడు!” 57 అయితే అతడు దానిని నిరాకరించాడు, చెప్పాడు, “యువతీ, నేను ఆయనను యెరుగను!” 58 కొద్దిసేపటి తరువాత మరొకరు పేతురును చూసాడు, చెప్పాడు, “వారు బంధించిన మనిషితో ఉన్నవారిలో నువ్వు కూడా ఒకడివే!” అయితే పేతురు చెప్పాడు, “అయ్యా, లేదు, నేను వారిలో ఒకడిని కాదు!” 59 దాదాపు ఒక గంట తరువాత మరొకరు బిగ్గరగా చెప్పాడు, “ఈ మనిషి {విధానం} {మాట్లాడడం చూపిస్తుంది, అతడు} గలిలయ యొక్క {ప్రాంతం}నుండి వచ్చాడని. కాబట్టి వారు బంధించిన మనిషితో అతడు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఉంటాడు! 60 అయితే పేతురు చెప్పాడు, “అయ్యా, అది నిజం కాదు!” పేతురు ఇంకా మాట్లాడుతూ ఉండగా వెంటనే కోడి కూసింది. 61 యేసు వెనుకకు తిరిగాడు మరియు పేతురు వైపుకు చూశాడు. అప్పుడు యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకొన్నాడు: “ఈ రాత్రి కోడి కూయకముందే నేను నీకు తెలుసు అని మూడుసార్లు నిరాకరిస్తావు” 62 మరియు అతడు ప్రాంగణం నుండి బయటకు వెళ్ళాడు మరియు చాలా దుఃఖంతో అరిచాడు.

63 యేసును కావలి కాస్తున్న పురుషులు ఆయనను ఎగతాళి చేసారు మరియు ఆయనను కొట్టారు. 64 వారు ఆయన మీద కళ్లకు గంతలు కట్టారు {కాబట్టి ఆయన చూడలేదు అరియు ఆయన కొట్టడానికి వంతులు తీసుకొన్నారు}. వారు అతనితో, చెప్పారు, “నువ్వు ఒక ప్రవక్తవు అని మాకు కనపరచు! ఇప్పుడే నిన్ను ఎవరు కొట్టారో మాకు చెప్పు! 65 వారు ఎగతాళి చేస్తూ ఆయనను గురించి అనేక ఇతర {క్రూరమైన} విషయాలు చెప్పారు.

66 మరుసటి ఉదయం తెల్లవారుజామున అనేకమంది యూదా నాయకులు కలిసి సమావేశమయ్యారు. ఈ గుంపులో ప్రధాన యాజకులు మరియు యూదుల నియమాలను బోధించే పురుషులు ఉన్నారు. యేసును యూదుల సభా గదిలోనికి తీసుకొని వచ్చే సైనికులను వారు కలిగియున్నారు. 67 అక్కడ వారు ఆయనతో చెప్పారు, “నువ్వు మెస్సీయవు అయిన యెడల మాకు చెప్పు!” అయితే ఆయన జవాబిచ్చాడు, “నేను మెస్సీయని అని చెప్పిన యెడల, మీరు నన్ను నమ్మరు. 68 అయితే నేను మెస్సీయను అని మీరు అనుకుంటున్నారా అని నేను మిమ్మల్ని అడిగిన యెడల, మీరు నాకు సమాధానం చెప్పరు. 69 అయితే ఇక నుండి, మెస్సీయనైన నేను, సర్వశక్తిమంతుడైన దేవుని పక్కన కూర్చుంటాను {మరియు పరిపాలిస్తాను}!" 70 అప్పుడు వారు అందరూ, "అలా అయిన యెడల, నువ్వు దేవుని యొక్క కుమారుడివని {నువ్వు చెపుతున్నావా}?” ఆయన జవాబిచ్చాడు, "అవును, మీరు చెప్పేది నిజమే.” 71 అప్పుడు వారు ఒకరితో ఒకరు చెప్పారు, “అతడు {అతడు దేవునితో సమానం అని} చెప్పడం మా మట్టుకు మేము విన్నాం! మరియు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి {దేవదూషణ యొక్క ఆరోపణ మీద}ఖచ్చితంగా మాకు ఎక్కువమంది మనుష్యులు అవసరం లేదు.

Chapter 23

1 అప్పుడు గుంపు అంతా పైకి లేచింది మరియు యేసును {, రోమా అధిపతి} పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. 2 వారు ఆయనను {పిలాతు ముందు} నిందించారు. వారు చెప్పారు, “ఈ మనిషి మా మనుష్యులను తప్పుదోవ పట్టించడం {కష్టం కలిగించడం చేత} మేము చూశాము. రోమా చక్రవర్తి కైసరు విధించిన పన్నులు చెల్లించ వద్దు అని అతడు వారికి చెపుతూ వస్తున్నాడు. ఆయన తానే మెస్సీయ, ఒక రాజు అని కూడా చెపుతూనే ఉన్నాడు!” 3 పిలాతు అప్పుడు ఆయనను అడిగాడు, “నువ్వు యూదుల యొక్క రాజువా?” యేసు జవాబిచ్చాడు, “అవును, నువ్వు నన్ను అడిగినట్లే” 4 అప్పుడు పిలాతు ప్రధాన యాజకులు మరియు జనసమూహంతో చెప్పాడు, “ఈ మనిషి ఏ నేరం విషయంలో దోషి కాదు” అన్నాడు. 5 అయితే యూదుల పాలక మండలి నుండి గుంపు యేసు మీద ఆరోపణలు చేస్తూనే ఉంది. వారు చెప్పారు, “మనుష్యులు అల్లర్లు చెయ్యడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు! అతడు యూదయ యొక్క {ప్రాంతం} అంతటా తన ఆలోచనలను బోధిస్తూ ఉన్నాడు. అతడు దానిని గలిలయ యొక్క {ప్రాంతంలో} దానిని చేయడం ప్రారంభించాడు, మరియు ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తున్నాడు!”

6 పిలాతు వారు చెప్పినది వినినప్పుడు, అతడు అడిగాడు, “ఈ మనిషి గలిలయ యొక్క {ప్రాంతం} నుండి వచ్చాడా?” 7 హేరోదు అంతిప పరిపాలిస్తున్న గలిలయ నుండి యేసు వచ్చాడని పిలాతు కనుగొన్నప్పుడు, అతడు యేసును అతని దగ్గరకు పంపాడు. ఆ సమయంలో హేరోదు కూడా యెరూషలేములో ఉన్నాడు. 8 హేరోదు యేసును చూసినప్పుడు అతడు చాలా సంతోషించాడు, ఎందుకంటే అతడు చాలా కాలంగా యేసును చూడాలని కోరుకున్నాడు. ఇది ఎందుకంటే హేరోదు యేసు గురించి అనేక సంగతులు విన్నాడు మరియు అతడు ఒక అద్భుతం చేయడాన్ని చూడాలని కోరుకున్నాడు. 9 కాబట్టి అతడు యేసును అనేక ప్రశ్నలు అడిగాడు, అయితే యేసు వాటిలో దేనికీ జవాబివ్వలేదు. 10 మరియు ప్రధాన యాజకులు మరియు యూదుల ధర్మశాస్త్ర నిపుణులు కొందరు యేసు దగ్గర నిలబడ్డారు, ఆయనను {చాలా నేరాలు చెయ్యడం గురించి} చాలా బలంగా నిందిస్తున్నారు. 11 అప్పుడు హేరోదు మరియు అతని సైనికులు యేసును అవమానించారు మరియు ఎగతాళి చేశారు. వారు అతని మీద {అతడు రాజు అని నటించడానికి} ఖరీదైన దుస్తులు వేశారు. అప్పుడు హేరోదు అతనిని పిలాతు దగ్గరకు తిరిగి పంపాడు. 12 ఆ సమయం వరకు ఇద్దరు మనుష్యులు ఒకరికొకరు చాలా విరోధంగా ఉన్నారు, అయితే ఆ రోజున హేరోదు మరియు పిలాతు స్నేహితులు అయ్యారు.

13 పిలాతు అప్పుడు ప్రధాన యాజకులను, మరియు ఇతర యూదు నాయకులను, మరియు ఇంకా అక్కడ ఉన్న జనసమూహాన్ని కలిపి సమకూర్చాడు. 14 అతడు వారితో చెప్పాడు, “మనుష్యులను తిరుగుబాటుకు నడిపిస్తున్నాడని చెప్పి మీరు ఈ మనిషిని నా దగ్గరికి తీసుకొని వచ్చారు. అయితే మీరు వింటూ ఉండగా అతనిని పరీక్షించిన తరువాత, మీరు తెలుసుకోడానికి నేను కోరుతున్నాను, ఆయన చేసాడని మీరు చెప్పిన వాటిలో ఏ ఒక్కటి చేసినందుకు అతడు దోషి కాదని నేను నిర్ధారించాను. 15 అంతేకాకుండా, హేరోదు అతనిని {అతన్ని శిక్షించకుండా} మా దగ్గరకు తిరిగి పంపాడు. అంటే దాని అర్థం అతడు కూడా {అతను దోషి కాదని తేల్చాడు}. కాబట్టి ఈ మనిషి చనిపోవడానికి అర్హమైనది ఏమీ చేయలేదని స్పష్టమవుతుంది. 16 కాబట్టి నేను అతనిని కొరడాతో కొట్టిస్తాను {నా సైనికులతో చెపుతాను.} మరియు అప్పుడు అతనిని విడుదల చేస్తాను." 17 [{పిలాతు ఇది అన్నాడు ఎందుకంటే} అతడు ప్రతి పస్కా పండుగ వేడుకలో ఒక ఖైదీని విడిపించవలసి ఉంటుంది.] 18 అయితే జనసమూహం అంతా కలిసి కేకలు వేసింది, “ఈ మనిషిని చంపండి! బదులుగా బరబ్బాను మా కోసం విడిపించు!” 19 ఇప్పుడు బరబ్బా అనే ఒక మనిషి రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి {యెరూషలెం} నగరంలో కొంతమంది మనుష్యులను నడిపించాడు. అతడు హంతకుడు కూడా. ఈ నేరాల కారణంగా అతడు చెరసాలలో ఉన్నాడు. 20 అయితే పిలాతు యేసును విడిపించాలని చాలా కోరుకున్నాడు కాబట్టి అతను తిరిగి జనసమూహంతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. 21 అయితే వారు కేకలు వేస్తూ ఉన్నారు, “అతనిని సిలువ వేయండి! అతనిని సిలువ వేయండి! ” 22 పిలాతు మూడోసారి జనసమూహంతో మాట్లాడాడు. “లేదు! అతడు ఏ నేరం చేయలేదు! అతడు చనిపోవడానికి అర్హమైనది ఏమీ చేయలేదు. కాబట్టి నేను అతనిని నా సైనికులు కొరడాతో కొట్టేలా చేస్తాను, తరువాత నేను అతనిని విడిపిస్తాను." 23 అయితే జనసమూహంలోని మనుష్యులు పిలాతు యేసును సిలువ మీద శిక్షించాలని ఒత్తిడి చేస్తూ అరుస్తూ ఉన్నారు. చివరికి, వారు బిగ్గరగా అరవడం కొనసాగించిన కారణంగా, వారు పిలాతును ఒప్పించారు. 24 కాబట్టి పిలాతు వారు కోరుకున్నది చేస్తానని ప్రకటించాడు. 25 అప్పుడు జనసమూహం విడుదల చేయమని తనను అడుగుతున్న వ్యక్తిని పిలాతు విడిపించాడు. ఆ మనిషి చెరసాలలో ఉన్నాడు ఎందుకంటే అతడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు మరియు మనుష్యులను హత్య చేసాడు. పిలాతు అప్పుడు యేసును తీసుకొని వెళ్లి, మరియు జనసమూహం కోరుకున్నది చేయాలని సైనికులకు ఆజ్ఞాపించాడు.

26 ఇప్పుడు సీమోను అనే పేరు గల ఒక మనిషి ఉన్నాడు, అతను {ఆఫ్రికాలోని} కురేనే యొక్క నగరం నుండి వచ్చినవాడు. అతడు గ్రామీణ ప్రాంతం నుండి యెరూషలేముకు వస్తున్నాడు. సైనికులు యేసును నడిపిస్తూ ఉండగా, వారు సీమోనును పట్టుకున్నారు. వారు {యేసు మోసుకొని వెళ్ళేలా చేసిన సిలువను ఆయన నుండి తీసుకున్నారు మరియు వారు} దానిని సీమోను భుజముల మీద ఉంచారు. దానిని మోయాలని మరియు యేసు వెనుక వెంబడించమని వారు అతనికి చెప్పారు. 27 ఇప్పుడు ఒక పెద్ద జనసమూహము యేసు వెనుక నడుస్తూ ఉంది. జనసమూహంలో అనేకమంది స్త్రీలు ఉన్నారు వారు తమ రొమ్ము మీద కొట్టుకుంటూ {తమ దుఃఖాన్ని చూపించడానికి} మరియు అతని కోసం {బాధతో} విలపిస్తున్నారు. 28 అయితే {వారి సానుభూతిని అంగీకరించడానికి బదులుగా} యేసు ఆ స్త్రీల వైపు తిరిగాడు, “మీరు యెరూషలేము స్త్రీలు, నా కోసం ఏడవకండి! బదులుగా, మీరు మరియు మీ పిల్లల మీద {జరగబోయే భయంకరమైన విషయాల గురించి} ఏడవండి! 29 ఎందుకంటే మనుష్యులు 'ఎప్పుడూ పిల్లలకు జన్మనివ్వని లేదా పాలిచ్చి పెంచని స్త్రీలు ఎంత భాగ్యవంతులు!' అని చెప్పే ఒక సమయం {త్వరలో} ఉంటుందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను! 30 అప్పుడు ఈ నగరంలోని మనుష్యులు చెపుతారు, 'కొండలు మా మీద పడాలని మరియు పర్వతాలు మమ్మును కప్పి ఉంచాలని మేము కోరుకుంటున్నాము!' 31 ప్రస్తుతం తాజా చెక్కకు నిప్పు పెట్టడం కష్తంగా ఉన్న విధంగా మనుష్యులు ఇతరులకు చెడు పనులు చేయడం కష్టం, అయితే తరువాత, మనుష్యులు ఎండిన చెక్కకు నిప్పు పెట్టడం సులభంగా ఉన్నట్టు మనుష్యులు ఇతరులకు భయంకరమైన పనులు చేయగలుగుతారు.

32 నేరస్థులైన మరో ఇద్దరు మనుష్యులు కూడా యేసుతో పాటు రోమనులు తమను చంపే ప్రదేశానికి నడుస్తున్నారు. 33 కపాలం అని పేరుగల ప్రదేశానికి వారు చేరుకున్నప్పుడు, అక్కడ సైనికులు యేసును సిలువ వేశారు, సిలువకు మేకులతో కొట్టారు. ఇద్దరు నేరస్థులకు కూడా వారు అదే చేశారు. వారు వారిలో ఒకరిని యేసు కుడి వైపున, మరియు మరొకరిని ఎడమవైపు ఉంచారు. 34 [అయితే యేసు చెప్పాడు, “తండ్రీ, దయచేసి ఈ మనుష్యులను క్షమించు. వారు ఏమి చేస్తున్నారో వారికి గుర్తించడం లేదు”] అప్పుడు సైనికులు ఆయన వస్త్రాలను పంచుకున్నారు మరియు ప్రతి ఒక్కరికి వస్త్రంలోని ఏభాగం ఎవరికీ లభిస్తుందో నిర్ణయించడానికి పాచికలు వంటి వాటితో జూదం ఆడారు. 35 అనేకమంది మనుష్యులు దగ్గర నిలబడ్డారు, గమనిస్తున్నారు. వారు యేసును ఎగతాళి చేశారు. యూదు నాయకులు కూడా అదే పని చేశారు. వారు చెప్పారు, "అతడు ఇతర మనుష్యులను రక్షించాడు! దేవుడు నిజంగా అతనిని మెస్సీయగా ఎన్నుకున్న యెడల, అతడు తనను తాను రక్షించుకోవాలి! ” 36 సైనికులు కూడా ఆయనను అపహాస్యం చేసారు. వారు అతని దగ్గరకు వచ్చారు మరియు ఆయనకు కొద్దిగా పుల్లని ద్రాక్షారసాన్ని అందించారు. 37 వారు ఆయనతో చెప్పారు, “నువ్వు యూదుల యొక్క రాజువైన యెడల నిన్ను నువ్వు రక్షించుకో!” 38 ఆయన తలకు పైగా సిలువమీద సైనికులు, “ఈయన యూదుల యొక్క రాజు” అని రాసి ఉన్న ఒక బోర్డును కూడా బిగించారు.

39 వేలాడుతున్న నేరస్థులలో ఒకడు {యేసు ప్రక్కన ఉన్న సిలువ మీద } కూడా ఆయనను అవమానించాడు. అతడు చెప్పాడు, "నువ్వు నిజంగా మెస్సీయవు అయిన యెడల, నిన్ను నీవు రక్షించుకుంటావు మరియు మమ్ములను కూడా రక్షిస్తావు!" 40 అయితే మరో నేరస్థుడు అతనిని {అలా మాట్లాడినందుకు} తిట్టాడు. అతడు అతనితో చెప్పాడు, “దేవుడు {నిన్ను శిక్షిస్తాడని} నీవు భయపడాలి! నీవు కూడా సిలువ మీద చనిపోతున్నావు{, మరియు త్వరలో దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు}. 41 మనం ఇద్దరం {చనిపోవడానికి} అర్హులం. మనం చేసిన చెడు పనులకు మనలను తగిన విధంగా వారు మనలను శిక్షిస్తున్నారు. అయితే నీవు అపహసిస్తున్న మనిషి ఏ తప్పు చేయలేదు! 42 అప్పుడు అతడు యేసుతో చెప్పాడు, “యేసూ, నువ్వు రాజుగా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు దయచేసి నా గురించి ఆలోచించు మరియు నువ్వు రాజు వలే పరిపాలించడం ఆరంభించినప్పుడు నన్ను బాగా చూసుకో!” 43 యేసు జవాబిచ్చాడు, “ఈ రోజు నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావని నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను!” అన్నాడు.

44 అప్పటికి ఇది దాదాపు మధ్యాహ్న సమయం. అయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ ప్రాంతం అంతటా చీకటిగా మారింది. 45 సూర్యుని నుండి కాంతి లేదు. మరియు దేవాలయంలోని {అతి పరిశుద్ద స్థలాన్ని మూసివేసిన} {మందపాటి} తెర రెండు ముక్కలుగా విడిపోయింది. 46 అది జరిగినప్పుడు, యేసు బిగ్గరగా అరిచారు, “తండ్రీ, నా ఆత్మను నీ సంరక్షణలో ఉంచుతున్నాను!” ఆయన దానిని పలికిన తరువాత ఆయన ఊపిరి పీల్చడం ఆపివేసాడు మరియు చనిపోయాడు.

47 శతాధిపతి {సైనికులకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి} జరిగిన దానిని చూసాడు, అప్పుడు అతడు చెప్పాడు “నిజముగా, ఈ మనిషి తప్పు ఏమీ చేయలేదు!” అతడు చెప్పినది దేవుణ్ణి ఘనపరచింది. 48 ఈ మనుష్యులు చనిపోవడాన్ని చూసేందుకు గుమికూడిన జనసమూహం వాస్తవానికి జరిగిన దానిని చూసారు, అప్పుడు వారు తాము దుఃఖంతో ఉన్నామని కనుపరచడానికి రొమ్ము మీద కొట్టుకొంటూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. 49 {అయితే జనసమూహంలోని మిగిలిన వారు వెళ్లిన తర్వాత,} యేసును ఎరిగిన వారు అందరూ, ఆయనతో పాటు గలిలయ యొక్క {ప్రాంతం) నుండి వచ్చిన స్త్రీలు, కొంత దూరంలో తాము నిలబడి ఉన్న చోటు నుండి ఏమి జరుగుతుందో చూస్తూనే ఉన్నారు.

50 యోసేపు అనే పేరుగల ఒక మనిషి {యెరూషలేములో నివసించేవాడు} అక్కడ ఉన్నాడు. అతడు మంచివాడు మరియు నీతిమంతుడు, అతడు యూదు సభ యొక్క సభ్యుడు. 51 అయితే వారు యేసును చంపాలని నిర్ణయించుకున్నప్పుడు మరియు దానిని ఎలా చేయాలో ప్రణాళిక చేసినప్పుడు సభలోని ఇతర సభ్యులతో అతడు అంగీకరించలేదు. అతడు యూదయలోని అరిమతయ పట్టణం నుండి వచ్చినవాడు. దేవుడు తన రాజు పరిపాలించడం ఆరంభించడానికి పంపే సమయం కోసం అతడు ఎదురుచూస్తూ ఉన్నాడు. 52 యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళాడు మరియు యేసు దేహాన్ని తీసుకువెళ్లి మరియు దానిని పాతిపెట్టడానికి తనను అనుమతించాలని పిలాతును అడిగాడు. {పిలాతు అతనికి అనుమతి ఇచ్చాడు,} 53 కాబట్టి యోసేపు యేసు దేహాన్ని {సిలువ నుండి} క్రిందికి తీసుకొన్నాడు. అతడు దానిని నార వస్త్రములో చుట్టాడు. అప్పుడు అతడు యేసు దేహాన్ని మరొకరు ఒక రాతి కొండలోనికి పైకి తోలిపించిన సమాధి గదిలో అతడు ఉంచాడు. ఇంతకు ముందు ఎవరూ ఆ గదిలో దేహాన్ని పెట్టలేదు. 54 యూదు మనుష్యులు తమ విశ్రాంతి యొక్క దినానికి సిద్ధమైన రోజున ఇది జరిగింది. ఇది త్వరలో సూర్యాస్తమయం కానుంది, అది విశ్రాంతి యొక్క దినం ప్రారంభం. 55 గలిలయ యొక్క {జిల్లా} నుండి యేసుతో పాటు వచ్చిన స్త్రీలు {యోసేపు మరియు అతనితో ఉన్న పురుషులను} వెంబడించారు. వారు సమాధి గదిని చూసారు మరియు పురుషులు దాని లోపల యేసు దేహాన్ని ఏవిధంగా ఉంచారో వారు చూశారు. 56 అప్పుడు ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు మరియు లేపనాలు సిద్ధం చేయడానికి {యేసు దేహం మీద ఉంచడానికి} తాము ఉన్న చోటికి తిరిగి వెళ్లారు. అయితే, యూదుల ధర్మశాస్త్రం ప్రకారం, విశ్రాంతి యొక్క దినం ప్రారంభమైనప్పుడు వారు పని చేయడం మాని వేశారు.

Chapter 24

1 ఆదివారం తెల్లవారుజాములో ఆ స్త్రీలు సమాధి గది వద్దకు వెళ్లారు. వారు {యేసు దేహానికి పూయడానికి} తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తమతో తెచ్చుకున్నారు. 2 {వారు వచ్చినప్పుడు,} సమాధి గదికి {ప్రవేశాన్ని మూసివేసిన} రాయిని ఎవరో దొర్లించారని వారు కనుగొన్నారు. 3 వారు {సమాధి గది} లోనికి వెళ్లారు, అయితే అక్కడ యేసు యొక్క దేహం అక్కడ లేదు!

4 దాని గురించి ఏమి ఆలోచించాలో వారికి తెలియలేదు. అప్పుడు అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ప్రకాశవంతమైన, వెలుగుతున్న దుస్తులు ధరించి వారి పక్కన నిలబడ్డారు! 5 ఇది ఆ స్త్రీలను చాలా భయపడేలా చేసింది. వారు నేలకు కిందకు వంగారు. ఇద్దరు వ్యక్తులు వారితో చెప్పారు, “చనిపోయిన మనుష్యుల యొక్క దేహాలను వారు పాతిపెట్టే ప్రదేశంలో జీవించి ఉన్నవారి కోసం మీరు వెదకకూడదు! 6 ఆయన ఇక్కడ లేడు, లేదు, ఆయన తిరిగి సజీవుడు అయ్యాడు! ఆయన గలిలయలో మీతో ఇంకా ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పినది జ్ఞాపకం చేసుకొండి, 7 ‘వారు మనుష్యకుమారుడనైన నన్ను పాపాత్ములైన మనుష్యులకు అప్పగించాలి. ఆ మనుష్యులు నన్ను ఒక సిలువకు మేకులు కొట్టడం చేత నన్ను చంపుతారు. అయితే రెండు రోజుల తర్వాత నేను తిరిగి సజీవుడిగా మారతాను.'’’

8 ఆ స్త్రీలు యేసు తమతో చెప్పినదానిని జ్ఞాపకం చేసుకున్నారు. 9 కాబట్టి వారు సమాధి గదిని విడిచిపెట్టారు మరియు 11 మంది అపొస్తలుల దగ్గరకు మరియు యేసు యొక్క ఇతర శిష్యుల దగ్గరికి వెళ్ళారు మరియు జరిగినది వారికి చెప్పారు. 10 ఈ సంగతులు అపొస్తలులకు చెప్పిన స్త్రీలు మగ్దల గ్రామానికి చెందిన మరియ, యోహన్న, యాకోబు యొక్క తల్లి మరియ మరియు వారితో ఉన్న ఇతర స్త్రీలు. 11 అయితే అపొస్తలులు ఈ వార్తను బుద్ధిహీనత అని తలంచారు, కాబట్టి వారు స్త్రీలను నమ్మలేదు. 12 అయితే, పేతురు {వృత్తాంతం నిజమా కాదా చూడాలని} నిర్ణయించుకున్నాడు. అతడు సమాధి గదికి పరుగెత్తాడు. అతడు కిందకు వంగాడు {మరియు లోపలికి చూశాడు}. అతడు నారబట్టలను చూశాడు, {వాటిలో యేసు దేహము చుట్టబడి ఉంది, అయితే యేసు అక్కడ లేడు.} కాబట్టి అతడు సమాధిని విడిచిపెట్టాడు, జరిగిన దాని మీద కలవర పడ్డాడు.

13 అదే రోజు యేసు శిష్యులలో ఇద్దరు ఎమ్మాయి అనే పేరుగల మారుమూల గ్రామానికి నడుస్తూ ఉన్నారు. ఇది యెరూషలేము నుండి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. 14 వారు {యేసుకు} జరిగిన విషయాలన్నిటి గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. 15 వారు మాట్లాడుకుంటూ మరియు చర్చిస్తూ ఉండగా, యేసు తానే వారిని సమీపించాడు మరియు వారితో నడవడం ప్రారంభించాడు. 16 అయితే అది యేసు అని గుర్తించకుండా దేవుడు వారిని అడ్డగించాడు.

17 యేసు వారితో చెప్పాడు, “మీరు ఇద్దరూ నడుస్తూ ఉండగా ఏమి మాట్లాడుకున్నారు?” వారు ఆగిపోయారు మరియు వారి ముఖాలలో చాలా విచారకరమైన భావాలు ఉన్నాయి. 18 అయితే వారిలో ఒకడు, అతని పేరు క్లియోపా, జవాబిచ్చాడు, “యెరూషలేమును సందర్శిస్తూ ఈ మధ్య రోజులలో అక్కడ జరిగిన సంఘటనల గురించి తెలియని ఒకే వ్యక్తి నీవే అయి ఉండాలి!” 19 ఆయన వారితో చెప్పాడు, “ఏ సంఘటనలు?” వారు జవాబిచ్చారు, “నజరేతు నుండి ఒక ప్రవక్త అయిన మనిషి యేసుకు జరిగిన సంగతులు. గొప్ప అద్భుతాలు చేయడానికి మరియు అద్భుతమైన సందేశాలను బోధించడానికి దేవుడు ఆయనను బలపరచాడు. అనేకమంది మనుష్యులు ఆయన అద్భుతం అని తలంచారు. 20 అయితే మన ప్రధాన యాజకులు, మరియు నాయకులు ఆయనను {రోమా అధికారులకు} అప్పగించారు. వారు ఆయనకు మరణశిక్ష విధించారు, మరియు వారు ఆయనను ఒక సిలువకు మేకులు కొట్టడం చేత ఆయనను చంపారు. 21 ఇశ్రాయేలీయులమైన మనలను మన శత్రువుల నుండి విడిపించే వ్యక్తి ఆయనే అని మనం ఎదురు చూసాము! అయితే రోమనులు ఆయన చంపివేసి మూడు రోజులు గడిచినందున ఇది ఇప్పుడు సాధ్యం అనిపించడం లేదు. 22 అయినప్పటికీ, మా గుంపు నుండి కొందరు స్త్రీలు మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. ఈ తెల్లవారుజామున వారు {యేసును సమాధి చేయబడిన} గదికి వెళ్లారు, 23 అయితే అక్కడ యేసు యొక్క దేహం అక్కడ లేదు! వారు తిరిగి వచ్చారు మరియు వారు ఒక దర్శనంలో కొంతమంది దేవదూతలను చూశారని మాకు చెప్పారు. యేసు సజీవంగా ఉన్నాడని దేవదూతలు చెప్పారు! 24 అప్పుడు మాతో ఉన్న ఆ స్త్రీలలో కొందరు {స్త్రీలు వచ్చారు మరియు ఇది చెప్పినప్పుడు| సమాధి గది వద్దకు వెళ్ళారు. స్త్రీలు నివేదించిన విధంగానే విషయాలు ఉన్నాయని వారు చూశారు. అయితే వారు యేసును చూడలేదు.” 25 అప్పుడు యేసు వారితో చెప్పాడు, “మీరు ఇద్దరు బుద్ధిహీనులు! మెస్సీయ గురించి ప్రవక్తలు వ్రాసినవి అన్నీ విశ్వసించడానికి మీరు చాలా నిదానంగా ఉన్నారు! 26 మెస్సీయ వాటన్నిటినీ అనుభవించి {మరియు చనిపోయి}, మరియు దేవుని నుండి గొప్ప ఘనతను పొందడం అవసరమని మీరు ఖచ్చితంగా తెలిసి ఉండాలి!” 27 అప్పుడు తన గురించి లేఖనాలు చెప్పిన విషయాలు అన్నిటినీ యేసు వారికి వివరించాడు. ఆయన మోషే వ్రాసిన దానితో ప్రారంభించాడు, మరియు అప్పుడు ఆయన ప్రవక్తలు అందరూ వ్రాసిన వాటిని వివరించాడు.

28 వారు ఆ ఇద్దరు మనుష్యులు వెళ్తున్న గ్రామానికి దాదాపుగా చేరుకున్నప్పుడు, యేసు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఇది కనిపించింది. 29 అయితే వారు ఆయనను {అలా చేయవద్దని} వేడుకున్నారు. వారు చెప్పారు, “ఈ రాత్రి మాతో ఉండు, ఎందుకంటే ఇది మధ్యాహ్నం ఆలస్యం అవుతుంది మరియు త్వరలో చీకటి పడుతుంది.” కాబట్టి ఆయన వారితో ఉండడానికి {ఇంటికి} వెళ్ళాడు. 30 వారు అందరూ భోజనం చెయ్యడానికి కింద కూర్చున్నప్పుడు యేసు కొంచెం రొట్టెను తీసుకొన్నాడు మరియు దాని కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు ఆయన దానిని ముక్కలుగా విరిచాడు మరియు ఇద్దరు మనుషులకు ఇవ్వడం ప్రారంభించాడు. 31 మరియు అప్పుడు దేవుడు ఆయనను గుర్తించేలా చేశాడు. అయితే వెంటనే ఆయన అదృశ్యమయ్యాడు! 32 వారు ఒకరితో ఒకరు చెప్పారు, “మనం మార్గంలో నడుచుకుంటూ, మరియు ఆయన మనతో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నప్పుడు, మరియు మనం లేఖనాలను అర్థం చేసుకునేలా చేస్తున్నప్పుడు, మనం లోపల చాలా ఉత్సాహంగా ఉన్నాము! {మెస్సీయ శ్రమలు భరించవలసి ఉంది అయితే అప్పుడు గొప్ప ఘనత లభిస్తుందని ఇది అంతా అర్థమైంది.}” 33 కాబట్టి వారు వెంటనే వెళ్ళారు మరియు యెరూషలేముకు తిరిగి వచ్చారు. అక్కడ వారు 11 మంది అపొస్తలులను మరియు వారితో కూడి ఉన్న మరికొంతమందిని కనుగొన్నారు. 34 అపొస్తలులు ఆ ఇద్దరు మనుషులతో చెప్పారు, “యేసు తిరిగి సజీవుడుగా మారాడు అనేది సత్యం. ఆయన సీమోనుకు ప్రత్యక్షం అయ్యాడు!” 35 అప్పుడు ఆ ఇద్దరు మనుష్యులు తాము దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా జరిగిన విషయాన్ని ఇతరులకు చెప్పారు. ఆయన వారి కోసం కొంత రొట్టెను విరిచినప్పుడు వారు ఇద్దరు యేసును ఏవిధంగా గుర్తించారో కూడా వారు చెప్పారు. 36 వారు దానిని చెపుతూ ఉండగా, యేసు వారి మధ్య అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన వారితో చెప్పాడు, “దేవుడు మీకు శాంతిని ఇస్తాడు గాక!” 37 అయితే {వారు శాంతిగా లేరు.} వారు కంగారుపడ్డారు మరియు భయపడ్డారు ఎందుకంటి వారు ఒక దయ్యాన్ని చూస్తున్నాము అని తలంచారు. 38 ఆయన వారితో చెప్పాడు, “మీరు కంగారుపడకండి! మరియు మీరు {నేను సజీవంగా ఉన్నాను అని} సందేహించకూడదు. 39 {నా చేతులలోని గాయాలను} మరియు నా పాదాలను చూడండి! ఆ విధంగా ఇది నిజంగా నేనే అని మీరు నిశ్చయించుకోవచ్చు. నేను కలిగి యున్నట్టుగా మీరు చూహిన విధంగా దయ్యాలకు దేహాలు ఉండవు, మరియు నా శరీరం నిజమైనదని నిరూపించడానికి మీరు నన్ను తాకవచ్చు. ” 40 ఆయన అది చెప్పిన తరువాత ఆయన వారికి {దెబ్బలను} తన చేతులనూ, మరియి ఆయన కాళ్ళనూ వారికి చూపించాడు. 41 వారు చాలా సంతోషించారు, వారు ఇప్పటికీ {ఆయన నిజంగా సజీవుడిగా ఉన్నాడని} నమ్మలేకపోతున్నారు. కాబట్టి ఆయన వారితో చెప్పాడు, “నేను తినడానికి మీకు ఇక్కడ ఏదైనా ఉందా?” 42 కాబట్టి వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43 వారు చూస్తూ ఉండగానే ఆయన దానిని తీసుకొన్నాడు మరియు దానిని తిన్నాడు.

44 అప్పుడు ఆయన వారితో చెప్పాడు, “నేను ఇంతకు ముందు మీతో ఉన్నప్పుడు మీతో చెప్పినది మరల చెపుతాను. దేవుడు ఆయన నా గురించి{, మెస్సీయ} గురించి లేఖనాలు అన్నిటిలో చెప్పినవి ప్రతీదానిని జరిగేలా చేయబోతున్నాడు. 45 అప్పుడు లేఖనాలు {తన గురించి చెప్పిన విషయాలను} అర్థం చేసుకునేలా ఆయన వారిని శక్తితో నింపాడు. ఆయన వారితో చెప్పాడు, 46 “మీరు లేఖనాలలో చదవగలిగేది ఇదే: మెస్సీయ శ్రమ పడతాడు {మరియు చనిపోతాడు}, అయితే దాని తరువాత మూడవ దినమున ఆయన తిరిగి సజీవుడు అవుతాడు. 47 {లేఖనాలు ఇంకా చెపుతున్నాయి} మెస్సీయను విశ్వసించే వారు వెళతారు మరియు పాపం చేయడం మాని వేసిన మనుష్యులను దేవుడు క్షమిస్తాడు అని ఆయన పక్షంగా ప్రకటిస్తారు. మీరు దీనిని ఇక్కడ యెరూషలేము నుండి ప్రారంభించి, మరియు లోకంలోని ప్రతి మనుషుల గుంపు వద్దకు మీరు దీనిని చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. 48 మెస్సీయకు సంభవిస్తుందని లేఖనాలు చెప్పినవన్నీ నాకు సంభవించాయని మీరు చూసినవి అన్నియు {మీరు మనుషులకు చెప్పాలి.} 49 మరియు నా తండ్రి వాగ్దానం చేసిన విధంగా నేను మీ దగ్గరకు పరిశుద్ధ ఆత్మను పంపబోతున్నాను. అయితే దేవుడు మీకు {పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క} శక్తిని ఇచ్చే వరకు మీరు ఈ నగరంలోనే ఉండాలి.”

50 అప్పుడు యేసు వారిని బేతనియ {గ్రామం} దగ్గరకు వచ్చే వరకు వారిని {నగరం} వెలుపలికి నడిపించాడు. అక్కడ తన చేతులు పైకి ఎత్తాడు మరియు వారిని ఆశీర్వదించాడు. 51 ఆయన దానిని చేస్తూ ఉండగా ఆయన వారిని విడిచిపెట్టాడు మరియు పరలోకానికి పైకి వెళ్లాడు. 52 వారు ఆయనను ఆరాధించిన తరువాత చాలా సంతోషంగా యెరూషలేముకు తిరిగి వచ్చారు. 53 వారు ప్రతిరోజూ దేవాలయమునకు వెళ్ళారు మరియు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ సమయాన్ని గడిపేవారు.