తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

ఫిలిప్పీయులకు రాసిన పత్రిక

Chapter 1

1 {నేను} పౌలును ఫిలిప్పీ{యొక్క నగరం} లో మెస్సీయ యేసుకు జతపడిన దేవుని మనుష్యులు అందరికి {ఈ పత్రిక రాస్తున్నాను}. తిమోతి నాతో ఉన్నాడు. మేము మెస్సీయ యేసు యొక్క సేవకులం. విశ్వాసుల యొక్క నాయకుల కోసం మరియు {వారికి} పరిచారం చేసే వారి వారి కోసం {మేము ప్రత్యేకంగా ఈ పత్రికను రాస్తున్నాము}. 2 మన తండ్రి డు మరియు మన ప్రభువు మెస్సీయ యేసు మీకు దయగలిగియుండి మరియు {మిమ్మును} సమాధానముగా {చేయడం} {కొనసాగించును} గాక. 3 నేను మిమ్మును గురించి ఆలోచించిన ప్రతీసారి నేను {మీ యొక్క కారణంగా} నేను ఆరాధించు నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. 4 నేను మీ అందరి కోసం ప్రార్థన చేయు ప్రతీ సమయంలో నేను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. 5 {నేను సంతోషంతో ప్రార్థన చెయ్యడంలో కారణం ఇది} ఎందుకంటే మీరు {దీనిని} మొదట విశ్వసించిన సమయము నుండి శుభ వార్తను మనుష్యులకు చెప్పడంలో మీరు నాతో భాగస్వాములుగా ఉన్నారు మరియు ఇప్పుడు నాతో భాగస్వాములుగా ఉండడానికి కొనసాగుతున్నారు. 6 దేవుడు తన మంచి క్రియను మీలో {మీరు ఆయనలో మొదట విశ్వసించినప్పుడు} ఆరంభించాడు. మరియు మెస్సీయ యేసు తిరిగివచ్చు వరకు ఆ క్రియను ఆయన కొనసాగించును అని నేను నమ్మకంగా ఉన్నాను. 7 మిమ్ములను అందరిని నేను అధికముగా ప్రేమించుచున్నాను, ఎందుకంటే నేను మీ గురించి ఈ విధముగా ఆలోచించడానికి నాకు ఇది సరియైనదే. ఒక ఖైదీగా ఉండడంతో {నేను సహిస్తూ ఉండగా} పాటు {యేసు గురించిన} శుభవార్త ఎందుకు నిజమో మనుష్యులకు వివరిస్తూ ఉండగా కూడా {ఈ కార్యములో} కలిసి పంచుకోవడానికి దేవుడు మనలను దయతో ఆశీర్వదించాడు. 8 నేను మీ అందరితో ఉండడానికి చాలా అధికంగా అపేక్షించుచున్నాను మరియు మెస్సీయ యేసు మిమ్మును ప్రేమించుచున్నట్టు వలే అదే విధానములో నేను మిమ్ములను అందరిని ప్రేమించుచున్నాను. ఇది నిజమని దేవునికి తెలుసు 9 వృద్ధిచెందడానికి కొనసాగే ఒక విధానంలో మీరు {దేవుణ్ణీ మరియు ఇతరులను} ప్రేమించడానికి దేవుడు మిమ్మును శక్తివంతులను చేయాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇతరులను అధికముగా ప్రేమిస్తూ ఉండగా, మీరు {ఆయనను} మెరుగైన విధముగా తెలుసుకోవడానికి మరియు అన్ని పరిస్థితులలో {ఇతరులను ఏవిధంగా ప్రేమించాలో} అర్థం చేసుకోడానికి కూడా దేవుడు మీకు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. 10 నేను ప్రార్థన చెయ్యడానికి కారణం ఇది తద్వారా మీరు పరీక్షిస్తారు మరియు {దేవునికి} అత్యంత ప్రీతికరమైన దానిని ఎంచుకొంటారు తద్వారా మెస్సీయ తిరిగి వచ్చినప్పుడు మీరు ఎలాంటి తప్పునైనా చెయ్యడం విషయంలో సంపూర్తిగా స్వేచ్చగా ఉంటారు. 11 {తప్పుడు సంగతులు చేయడానికి బదులుగా, } నిజముగా మంచి సంగతులను మనం చేయడానికి మెస్సీయ యేసు మనలను శక్తితోనింపు వాటిని చెయ్యడంలో మీరు నిమగ్నమై ఉంటారు. ఈ సంగతులు మనుష్యులు దేవుణ్ణి ఘనపరచి మరియు స్తుతించేలా చేస్తాయి. 12 నా సహ విశ్వాసులారా, నాకు సంభవించినవి శుభ వార్తను వినడం నుండి మనుష్యులను అడ్డగించలేదు అని మీరు తెలుసుకోవడానికి అని నేను మిమ్మును కోరుతున్నాను. దానికి బదులుగా, నేను చెరసాలలో ఉన్నాను కనుక ఎక్కువమంది మనుష్యులు సహితం శుభ వార్తను వినగలిగారు. 13 వాస్తవానికి, ఇక్కడ సైనిక కావలివారు అందరూ మరియు అనేక ఇతర మనుష్యులు ఇప్పుడు నేను చెరసాలలో ఉన్నాను అని యెరుగుదురు ఎందుకంటే నేను మెస్సీయ గురించి సువార్తను ప్రకటించుచున్నాను. 14 అంతేకాకుండా, ఎందుకంటే {ఇక్కడ} విశ్వాసులు చెరసాలలో నా ద్వారా ప్రభువు చేసిన దానిని చూసారు, వారిలో ఎక్కువామంది యేసు గురించిన సువార్తను {ముందు వారు చేసిన దాని కంటే} మరింత ధైర్యముగా మరియు నిర్భయముగా ఇప్పుడు ప్రకటించారు. 15 కొందరు మనుష్యులు మెస్సీయ గురించి సువార్తను ప్రకటించుచున్నారు ఎందుకంటే వారు {దేవునికి విధేయత} చూపించడానికి కోరుతున్నారు మరియు ఎందుకంటే వారు {నన్నునూ మరియు ఇతరులనూ} ప్రేమించుచున్నారు. {యేసు గురించి} సువార్త ఎందుకు సత్యమైనదో మనుష్యులకు వివరించడానికి దేవుడు నన్ను నియమించాడు అని వారు అర్థం చేసుకొంటారు. అయితే కొందరు మెస్సీయ గురించి వారు శుభ వార్త ప్రకటించడం గురించి యదార్ధంగా లేరు. వారు దీనిని చేసారు ఎందుకంటే కేవలం వారు తమనుతాము వృద్ధి పరచుకోడానికి కోరుకున్నారు. వారు నా విషయం అసూయతో ఉన్నారు మరియు నా కోసం శ్రమ కలుగజేయడానికి కోరుతున్నారు. వారు శుభవార్త ప్రకటించడం కోసం పేరుగాంచి యుండగా నేను చెరసాలలో ఇంకా ఎక్కువగా శ్రమ పడాలి అని వారు ఆలోచించారు. 16 కొందరు మనుష్యులు మెస్సీయ గురించి సువార్తను ప్రకటించుచున్నారు ఎందుకంటే వారు {దేవునికి విధేయత} చూపించడానికి కోరుతున్నారు మరియు ఎందుకంటే వారు {నన్నునూ మరియు ఇతరులనూ} ప్రేమించుచున్నారు. {యేసు గురించి} సువార్త ఎందుకు సత్యమైనదో మనుష్యులకు వివరించడానికి దేవుడు నన్ను నియమించాడు అని వారు అర్థం చేసుకొంటారు. అయితే కొందరు మెస్సీయ గురించి వారు శుభ వార్త ప్రకటించడం గురించి యదార్ధంగా లేరు. వారు దీనిని చేసారు ఎందుకంటే కేవలం వారు తమనుతాము వృద్ధి పరచుకోడానికి కోరుకున్నారు. వారు నా విషయం అసూయతో ఉన్నారు మరియు నా కోసం శ్రమ కలుగజేయడానికి కోరుతున్నారు. వారు శుభవార్త ప్రకటించడం కోసం పేరుగాంచి యుండగా నేను చెరసాలలో ఇంకా ఎక్కువగా శ్రమ పడాలి అని వారు ఆలోచించారు. 17 కొందరు మనుష్యులు మెస్సీయ గురించి సువార్తను ప్రకటించుచున్నారు ఎందుకంటే వారు {దేవునికి విధేయత} చూపించడానికి కోరుతున్నారు మరియు ఎందుకంటే వారు {నన్నునూ మరియు ఇతరులనూ} ప్రేమించుచున్నారు. {యేసు గురించి} సువార్త ఎందుకు సత్యమైనదో మనుష్యులకు వివరించడానికి దేవుడు నన్ను నియమించాడు అని వారు అర్థం చేసుకొంటారు. అయితే కొందరు మెస్సీయ గురించి వారు శుభ వార్త ప్రకటించడం గురించి యదార్ధంగా లేరు. వారు దీనిని చేసారు ఎందుకంటే కేవలం వారు తమనుతాము వృద్ధి పరచుకోడానికి కోరుకున్నారు. వారు నా విషయం అసూయతో ఉన్నారు మరియు నా కోసం శ్రమ కలుగజేయడానికి కోరుతున్నారు. వారు శుభవార్త ప్రకటించడం కోసం పేరుగాంచి యుండగా నేను చెరసాలలో ఇంకా ఎక్కువగా శ్రమ పడాలి అని వారు ఆలోచించారు. 18 అయితే వారు నాకు చెయ్యడానికి కోరుకున్నది ముఖ్యమైనది కాదు! మనుష్యులు మెస్సీయ {గురించి సువార్తను} అది మంచి కారణం కోసం అయినా లేదా చెడుకారణాల కోసం అయినా ప్రకటించడం అనేది ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి మనుష్యులు మెస్సీయ గురించి సందేశాన్ని విస్తరిస్తున్నారు అని నేను సంతోషిస్తున్నాను. మరియు దానిలో సంతోషించడానికి కొనసాగుతాను. 19 {నేను సంతోషిస్తాను} ఎందుకంటే ఈ పరిస్థితి ఏవిధంగా మార్పుచెందుతుందో నేను యెరుగుదును: దేవుడు నన్ను {చెరసాల నుండి} విడిపిస్తాడు. ఆయన దీనిని చేస్తాడు ఎందుకంటే మీరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు మరియు ఎందుకంటే మెస్సీయ యేసు యొక్క ఆత్మ నాకు సహాయం చేస్తున్నాడు. 20 {ఇది జరుగుతుందని నాకు తెలుసు, ఎందుకంటే} నేను మెస్సీయను నమ్మకంగా ఘనపరచడానికి కొనసాగిస్తానని నేను చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నాను. ఇప్పడు మరియు ఎల్లప్పుడూ, నేను జీవించు విధానము చేత గాని లేదా నేను చనిపోవు విదానము చేత నా క్రియల చేత మెస్సీయను నేను ధైర్యముగా ఘనపరచుదును {అని నేను ఎదురుచూస్తున్నాను మరియు కోరుతున్నాను}. 21 నా కోసం అయితే, మెస్సీయను ఘనపరచడానికి నేను జీవిస్తున్నాను, మరియు నేను చనిపోయిన యెడల, నా కోసం ఇది ఇంకా మెరుగైనదిగా ఉంటుంది. 22 అయితే నా శరీరములో నేను ఇక్కడ జీవించడానికి నేను కొనసాగించిన యెడల, నేను మెస్సీయను ఫలకరమైన విధంగా సేవించడానికి శక్తిమంతుడను అవుతాను. కాబట్టి నేను దేనిని {జీవించడానికి లేదా చనిపోవడానికి} ఎంచుకోవలనో నాకు తెలియదు. 23 నేను దేనిని {జీవించడం లేదా చనిపోవడం} ఎంచుకోవలేనో నిర్ణయించుకోడానికి నాకు ఇది కష్టంగా ఉంది. {ఈ లోకాన్ని} విడిచి పెట్టడానికి మరియు మెస్సీయతో ఉండడానికి వెళ్లాలని నేను కోరుచున్నాను, ఎందుకంటే మెస్సీయతో ఉండడం {ఇక్కడ ఉండడం కంటే} చాలా మెరుగైనది. 24 అయితే మీకు సహాయం చెయ్యడానికి ఇక్కడ భూమి మీద సజీవంగా నిలిచియుండడం నాకు అవసరం. 25 దీని విషయంలో నేను ఒప్పించబడ్డాను కనుక, యేసులో విశ్వసించడానికి మీరు కొనసాగుతూ ఉండగా ఇంకా మరింత సంతోషంగా ఉండడానికి మీకు సహాయం చెయ్యడానికి మీ అందరితో సజీవంగా నిలిచి ఉంటాను అని నేను యెరుగుదును. 26 {నేను దీనిని చేస్తాను} తద్వారా మీరు నా యొక్క కారణంగా మెస్సీయ యేసును ఇంకా ఎక్కువగా స్తుతిస్తారు, ఎందుకంటే నేను మరల వస్తాను మరియు మిమ్మును దర్శిస్తాను. 27 మెస్సీయ గురించి సువార్తను ఘనపరచే విధానములో మీరు ప్రవర్తించడం ప్రాముఖ్యమైన సంగతి. {ఇది చెయ్యండి} తద్వారా మెస్సీయ గురించిన సందేశాన్ని వ్యతిరేకించేవారిని మీరు ఎదిరిస్తూ ఉండగా మరియు సువార్తకు అనుగుణంగా జీవించడానికి మనుష్యులకు మీరు సహాయం చేస్తూ ఉండగా ఒక ఏకీకృత మార్గంలో మీరు కలిసి కష్టించి పనిచేస్తున్నారు అని మనుష్యులు నాకు చెపుతారు. మరియు సువార్త ప్రకారం జీవించడానికి మీరు ప్రజలకు సహాయం చేస్తున్నప్పుడు. నేను మిమ్మల్ని మళ్లీ సందర్శించినా, లేకపోయినా { మీరు ఈ విధంగా ప్రవర్తించాలి}. 28 మీకు వ్యతిరేకంగా ఉన్న మనుష్యులు దేని చేతనైనా {వారు చేసేవి లేదా చెప్పినవి} మిమ్మల్ని భయపెట్టనివ్వ వద్దు. మీరు వారి విషయంలో భయపడరు అని వారు చూసినప్పుడు, దేవుడు వారిని నాశనం చేస్తాడు అని వారు తెలుసుకుంటారు, అయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఇది అంతా దేవుని నుండి వచ్చింది. 29 దేవుడు మీ కోసం ఇది చేస్తాడు, ఎందుకంటే ఆయన మీకు ఆయనలో విశ్వసించడం యొక్క వరముతో పాటు, మెస్సీయ కోసం శ్రమ యొక్క వరము ఆయన మీకు అనుగ్రహించాడు. 30 {నేను ఫిలిప్పీలో ఉన్నప్పుడు} నన్ను వ్యతిరేకించిన మనుష్యులను నేను ఏవిధంగా ఎదిరించ వలసి వచ్చిందో మీరు చూశారు. అదే విధంగా మిమ్మును వ్యతిరేకించే వారిని ఇప్పుడు మీరు ఎదిరించవలసి ఉంది. మనుష్యులు ఇంకా మీకు చెపుతూ ఉండగా, అటువంటి మనుష్యులను ఎదిరించడానికి నేను ఇంకా ఘర్షణ పడుతున్నాను.

Chapter 2

1 మెస్సీయ మనలను ప్రోత్సహిస్తాడు కనుక, ఆయన తన ప్రేమతో మనలను ఆదరిస్తున్నాడు కనుక, ఆత్మ {మీ మధ్య} సహవాసాన్ని కలిగించాడు కనుక, {ఒకరి పట్ల ఒకరికి} అనురాగము మరియు కనికరమును {దేవుడు మీకు ఇస్తాడు} కనుక, 2 ఈ క్రింది సంగతులు చెయ్యడం చేత నన్ను సంపూర్ణంగా సంతోషంగా చెయ్యండి: ఒకరితో ఒకరు అంగీకరించండి, ఒకరిని ఒకరు ప్రేమించండి, ఒకరితో ఒకరు సన్నిహితంగా ఐక్యంగా ఉండండి. మీ ఆలోచనలో ఐక్యంగా ఉండండి. 3 స్వార్థపూరితంగా ఇతరుల కంటే మిమ్మల్ని మీరు మరింత ముఖ్యమైనవారిగా చేసుకోడానికి ఎప్పుడూ ప్రయత్నించ వద్దు, మరియు ఇతరుల కంటే మిమ్మల్ని మీరు మేలైన వారిగా తలంచ వద్దు. దానికి బదులుగా, వినయపూర్వకంగా ఉండండి మరియు ఇతరులను మీ కంటే ముఖ్యమైనవారిగా పరిగణించండి. 4 మీలో ప్రతి ఒక్కరు మీ అవసరములను గురించి చింత కలిగియుండడం మాత్రమే కాదు, ఇతర మనుష్యులు మరియు వారి అవసరముల గురించి కూడా చింత కలిగి ఉండండి. 5 మెస్సీయ యేసు ఆలోచించిన అదే విధముగా ఆలోచన చెయ్యండి: 6 ఆయన ప్రతీ విధానంలో దేవుని వలే సమానంగా ఉన్నప్పటికీ, దేవునితో సమానముగా ఉండుట యొక్క ఆదిక్యతలు అన్నిటిని కలిగియుండడం మీద పట్టుబట్ట లేదు. 7 బదులుగా, ఆయన దైవిక ఆదిక్యతలు విడిచిపెట్టాడు మరియు ఇతరులకు ఒక సేవకుడు అయ్యాడు మరియు మనుష్యునిగా మారాడు. ఆయన ఒక మానవునిగా మారినప్పుడు 8 ఆయన తన్నుతాను ఇంకా తగ్గించుకొన్నాడు. ప్రత్యేకించి, మరణించడానికి ఇష్టపడేంత వరకు దేవునికి విధేయత చూపించడం చేత {తన్ను తాను తగ్గించుకొన్నాడు}. ఆయన సిలువ మీద సిలువ వేయబడి యుండడం చేత మరణించడానికి సహితం ఇష్టపడి యున్నాడు. 9 ఆ కారణం చేత {మెస్సీయ వినయంగా దేవునికి విధేయుడయ్యాడు} దేవుడు కూడా ఆయనను అధికంగా ఘనపరచాడు; ఆయన ఏ ఇతర వ్యక్తి లేదా జీవి కంటే అధికంగా ఆయనను ఘనపరచాడు, 10 తద్వారా యేసు ముందు ప్రతీ జీవి కిందకు వంగును మరియు ఆయనను ఘనపరచును, పరలోకములో ఉన్న జీవులు మరియు భూమి మీద జీవులు మరియు భూమి కింద జీవులు; 11 మరియు ప్రతీ నోరు మెస్సీయ యేసు ప్రభువు అని చెపుతుంది, తద్వారా తండ్రి దేవుడు ఘనపరచబడతాడు 12 ఈ సంగతుల యొక్క ఫలితంగా, ప్రియముగా ప్రేమించబడిన నా సహా విశ్వాసులారా, నేను మీతో ఉన్నప్పుడు మీరు ఎల్లప్పుడూ దేవునికి విధేయులైన ప్రకారం, ఇప్పుడు నేను మీనుండి దూరముగా ఉన్నాను అని, మీరు కూడా ఇంకా అధికముగా ఆయనకు విధేయత చూపించండి. మీలో ప్రతిఒక్కరు మీలో ఆయన రక్షణ కార్యములో దేవునితో శ్రమిస్తూ ఉండండి. మరియు దేవునికి భయపడుతూ విధేయతతో దీనిని చెయ్యండి. 13 ఎందుకంటే దేవుడు మీలో ఒక కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు తద్వారా మీరు చెయ్యడానికి కోరుకుంటారు –మరియు తరువాత వాస్తవంగా చేస్తారు – ఆయనను సంతోషపరచే మంచి సంగతులు. 14 సణుగులు లేదా వివాదాలు లేకుండా ప్రతీదానిని చెయ్యండి. 15 ఈ లోకం యొక్క దుష్టమైన మనుష్యుల మధ్య మీరు నివసిస్తూ ఉండగా చెడుతనం నుండి మిమ్ములను మీరు కాపాడుకొను వారు, దేవుని యొక్క పిల్లలు, సంపూర్ణంగా నిందారహితులుగా మీరు ఉండునట్లుగా ప్రవర్తించుడి. అప్పుడు మీరు వారి మధ్య జీవిస్తూ ఉండగా పాపం యొక్క చీకటికి వ్యతిరేకంగా ప్రకాశవంతంగా మీరు నిలబడతారు. 16 నిత్య జీవాన్ని కలిగి యుండడం గురించిన సందేశాన్ని ఇతరులకు చెప్పండి. {ఈ సంగతులు అన్నిటిని చెయ్యండి} తద్వారా మెస్సీయా తిరిగి వచ్చినప్పుడు ఆ సమయంలో, నేను మీ మధ్య నిష్‌ప్రయోజనముగా కష్టపడి పని చెయ్య లేదు అని నేను సంతోషించగల్గుతాను. 17 మరియు నేను ఆనందంగా ఉన్నాను మరియు అనుదినం శ్రమ పడుతూ లేదా సువార్తను వ్యతిరేకించే వారు నన్ను చంపడానికి ప్రయత్నించిన సమయాల ద్వారా వెళ్తున్నప్పటికీ నేను మీ అందరితో ఆనందిస్తాను. మీరు ఆయనలో విశ్వాసం ఉంచిన కారణంగా మీరు అందించే మీ సేవకు జతగా నేను మీతో పాటు సంతోషంతో శ్రమ పొందుతాను. 18 అదే విధానంలో కూడా మీలో ప్రతి ఒక్కరు ఈ సంగతులను గురించి సంతోషించండి; నాతో కలిసి మీరు సంతోషించాలి. 19 మిమ్మును దర్శించడానికి తిమోతిని పంపించడానికి శక్తికలిగి ఉండడానికి ప్రభువు యేసు త్వరలో నన్ను అనుమతిస్తాడు అని నేను ఎదురుచూస్తున్నాను. ఈ దర్శింపు జరగాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మీ యొక్క సమాచారంతో అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు నన్ను ప్రోత్సహించ గలడని నేను ఎదురుచూస్తూ ఉన్నాను. 20 మీ కోసం యథార్థముగా చింతించువాడు తిమోతి వంటి వాడు ఎవరును నాయొద్ద లేరు. 21 మీ వద్దకు నేను పంపబోవు ఇతరులు అందరూ తమ సొంత కార్యములను గురించి మాత్రమే శ్రద్ధ కలిగి యున్నారు. మెస్సీయ యేసు ప్రాముఖ్యమైనవిగా ఎంచు వాటిని గురించి వారు తగినంతగా శ్రద్ధ చూపించరు. 22 అయితే తిమోతి తాను ప్రభువును మరియు ఇతరులను నమ్మకంగా సేవిస్తాడు అని రుజువు పరచుకొన్నాడు అని మీకు తెలుసు. మనుష్యులకు సువార్తను ప్రకటించడంలో నాతో కలిసి సన్నిహితంగా అతడు ప్రభువును సేవించాడు అని మీకు తెలుసు. 23 నాకు ఏమి సంభవింపనైయున్నదో తెలుసుకొన్న వెంటనే తిమోతిని మీ వద్దకు పంపడానికి నేను ఎదురుచూస్తూ ఉన్నాను. 24 మరియు నేను త్వరలో విడిపించబడునట్లు ప్రభువు నన్ను అనుమతిస్తాడు అని నేను ధైర్యంగా ఉన్నాను, తద్వారా నా మట్టుకు నేను కూడా మీ వద్దకు వస్తాను. 25 నేను ఎపఫ్రొదితును మీ వద్దకు తిరిగి పంపవలెను అని నేను నిర్ణయించుకొన్నాను. అతడు ఒక సహ విశ్వాసి, మరియు నా సహ పనివాడు, మరియు సైనికులు కలిసి కష్టాలను సహించిన విధముగానే అతడు నాతో కలిసి కష్టాలను సహించాడు. అతడు మీ సందేశకుడు, మరియు సేవకుడు, నేను అవసరత కలిగి ఉన్నప్పుడు నాకు సహాయం చెయ్యడానికి అతనిని మీరు పంపారు. 26 ఎపఫ్రొదితు మీతో ఫిలిప్పీలో ఉండడానికి ఆతృతతో కోరుకుంటున్నాడు, మరియు మీరు అతని యొక్క అనారోగ్యము విషయం తెలుసుకొన్నారు కనుక {మీరు అతని గురించి ఆందోళన చెందుతారు అని} అతడు మీ కోసం విచారపడుచున్నాడు. 27 నిజముగా అతడు రోగియై ఉన్నాడు, అతడు దాదాపు చనిపోయిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు అతని మీద జాలి పడ్డాడు. మరియు ఆయన నా మీద కూడా జాలి పడ్డాడు. {, మరియు ఫలితముగా, ఆయన అతనిని స్వస్థపరచాడు}. దేవుడు నా యందు జాలి పడ్డాడు తద్వారా నేను ఇంకా అధికంగా దుఃఖించకుండా ఉంటాను. 28 కాబట్టి నేను అతనిని సాధ్యమైనంత శీఘ్రముగా మీ యొద్దకు పంపుచున్నాను. మీరు అతనిని మరల చూచినప్పుడు సంతోషించు నిమిత్తమును మరియు తద్వారా నేను తక్కువగా దుఃఖించు నిమిత్తమును నేను దీనిని చేస్తాను 29 ఎపఫ్రొదితును ఒక సహ విశ్వాసి వలే సంతోషంతో స్వీకరించండి మరియు అతని వలే ఉన్న ఇతర విశ్వాసులను ఘనపరచండి. 30 దీనిని చెయ్యండి, ఎందుకంటే మెస్సీయ కోసం ఎపఫ్రొదితు పని చేయుచుండగా, అతడు దాదాపుగా చనిపోయాడు. నాకు సహాయం చెయ్యడం యొక్క ఫలితంగా అతడు చనిపోవచ్చును అని అతనికి తెలుసు మరియు అతడు చావుకు సిద్ధమై ఉన్నాడు. నాకు అవసరమైన సంగతులను అందించడానికి అతడు నాకు సహాయం చేశాడు. దానిని మీరు చెయ్యలేక పోయారు ఎందుకంటే నా నుండి మీరు చాలా దూరంలో ఉన్నారు.

Chapter 3

1 చివరకు, నా సహా విశ్వాసులారా, దేవుడు ఎవరై ఉన్నాడో దానిలో ఆనందించండి, మరియు ఆయన చేసినది మరియు చేస్తూ ఉన్న దానిని గురించి ఆనందించండి. నేను ఇంతకుముందు మీతో ప్రస్తావించడానికి అవే సంగతులను గురించి నేను ఇప్పుడు మీకు రాయుచున్నప్పటికీ, ఇది నా కోసం అలసట కాదు, మరియు సత్యము కాని సంగతులను బోధించే వారి చేత దారి తప్పి నడిపించ బడి యుండడం నుండి ఇది మిమ్మును కాపాడుతుంది. 2 మురికి కుక్కల వలే ఉన్నవారికి వ్యతిరేకంగా మిమ్ములను మీరు కాపాడుకోండి. తప్పు అయిన దానిని బోధించు వారికి వ్యతిరేకంగా మిమ్ములను మీరు కాపాడుకోండి. తమ శరీరాలను చేధించుకొనువారికి వ్యతిరేకంగా మిమ్ములను మీరు కాపాడుకోండి. 3 అయితే మన విషయంలో, సున్నతి పొంది యుండడం అంటే నిజంగా ఉన్న విధంగా మన మట్టుకు మనం ఉన్నాము. దేవుణ్ణి సత్యముతో ఆరాధించడానికి దేవుని యొక్క ఆత్మ మనలను శక్తివంతులనుగా చేస్తాడు. మరియు సున్నతి పొందడం వంటి మతసంబంధ కార్యకలాపాలలో విశ్వసించడం కంటే బదులుగా మెస్సీయ యేసులో మనం అతిశపడతాము. 4 అయితే ఎవడైనను వారు మతసంబంధ క్రియలలో విశ్వాసం ఉంచగలము అని తలంచిన యెడల, నేను చెయ్యగలను, మరియు ఇతరుల కంటే ఇంకా ఎక్కువగా ఉండగలను. {ఎందుకో నేను మీతో చెపుతాను}. 5 నేను పుట్టిన ఎనిమిది రోజుల తరువాత నేను సున్నతి చెయ్యబడ్డాను. ఇశ్రాయేలు యొక్క మనుష్యుల నుండి వచ్చిన వాడను మరియు నేను బెన్యామీను యొక్క గోత్రము యొక్క సంతానంగా ఉన్నాను. నేను హెబ్రీ భాషను మరియు జీవనం యొక్క విధానాన్ని నిలబెట్టుకున్న వాడనైన హెబ్రీయుడను. మోషే యొక్క ధర్మశాస్త్ర విషయములో, నేను ఒక పరిసయ్యుడను, మరియు కాబట్టి నేను మోషే యొక్క ధర్మశాస్త్రము మరియు శాస్త్రుల యొక్క ఉపదేశములు అన్నిటికీ కఠినంగా విధేయత చూపాను. 6 నేను విశ్వసించిన దానిని గురించిన ఆసక్తి కలిగియుండడం విషయంలో నేను విశ్వసించిన దానిని గురించి యేసును అనుసరించిన వారు శ్రమపడడానికి నేను చేసేంత చాలా తీవ్రమైన ఆసక్తి కలిగి యున్నాను. మోషే ధర్మశాస్త్రం విషయంలో దేవునికి అపేక్షితమైన దానిని చెయ్యడం మరియు దాని విషయంలో శాస్త్రులకు అపేక్షితమైన దానిని చెయ్యడం విషయంలో నేను అనింద్యుడనై యున్నాను. 7 అయితే నేను మునుపు విశ్వసించిన సంగతులు అన్నీ, ఆ సంగతులనే మెస్సీయ యొక్క కారణంగా ఇప్పుడు నేను నిరుపయోగమైనవిగా ఎంచుచున్నాను. 8 దానికి బదులుగా ఇంకా ఎక్కువగా, నా ప్రభువు యేసు, మెస్సీయను తెలుసుకోవడం ఎంత గొప్పదో దానితో పోల్చినప్పుడు నేను ఇప్పుడు సమస్తమైన సంగతులు విలువలేనివిగా పరిగణిస్తున్నాను. ఆయన కోసం నేను ఇష్టపూర్వకంగా అన్ని సంగతులను విడిచిపెట్టాను మరియు నేను మెస్సీయను కలిగి ఉండటానికి వాటిని వెలుపలికి త్రోసివెయ్యడానికి పెంటగా నేను భావిస్తున్నాను. 9 నేను మునుపు విశ్వసించిన సంగతులను నేను ఇష్టపూర్వకంగా విడిచిపెట్టాను తద్వారా దేవుడు మోషేకు అనుగ్రహించిన ధర్మశాస్త్రమునకు విధేయత చూపించడం చేత కాకుండా మరియు నేను మెస్సీయతో సంపూర్ణంగా ఐక్యంగా ఉంటాను. మెస్సీయలో విశ్వసించడం చేత దేవుణ్ణి సంతోషపరచడానికి ఏకైక మార్గం అని {నాకు తెలుసు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను.} 10 నేను మెస్సీయను మెరుగుగా మరియు మెరుగుగా తెలుసుకోడానికి కోరుతున్నాను. మెస్సీయ మరణించిన తరువాత సజీవుడు కావడానికి ఆయన చేసినప్పుడు దేవుడు శక్తివంతంగా కార్యం చేసిన విధముగా నా జీవితంలో ఆయన శక్తివంతంగా పని చేయడం నిరంతరం అనుభవించడానికి నేను కోరుకుంటున్నాను. మెస్సీయ దేవునికి విధేయత చూపునట్లు శ్రమపడిన విధముగా, నేను కూడా దేవునికి విధేయత చూపునట్లు శ్రమలను అనుభవించడానికి నిరంతరం ఇష్టపడి ఉండడానికి కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన మరణంలో ఆయనకు వలే మారడానికి నేను కోరుకుంటున్నాను. 11 {నేను దీనిని అంతటిని కోరుకుంటున్నాను ఎందుకంటే} ఏ విధముచేతనైనను నేను చనిపోయిన తరువాత మరల జీవించడానికి దేవుడు చెయ్యడానికి నేను కోరుకుంటున్నాను. 12 నేను ఇప్పటికే పొందితిని అని నేను చెప్పుకోవడం లేదు. నన్ను యేసు వలే చెయ్యడానికి దేవుడు నాలో క్రియ జరిగించడం ముగించాడు అని అయినను నేను చెప్పడం లేదు. అయితే నేను యేసు వలే అధికముగా మరియు అధికముగా మారడానికి నేను మనఃపూర్తిగా ప్రయతించుచున్నాను, ఎందుకంటే ఈ కారణంగా మెస్సీయ యేసు నన్ను పట్టుకొన్నాడు. 13 నా సహ విశ్వాసులారా, నేను ఇప్పటికే సంపూర్ణంగా యేసు వలే మారానని ఖచ్చితంగా తలంచడం లేదు. లేదా ఆయనను పూర్తిగా యెరుగను. బదులుగా గతంలో ఉన్న సంగతులను గురించి మరచిపోడానికి మరియు నాకు ముందు ఉన్న సంగతుల కోసం కష్టపడి పనిచేయడానికి నేను నిర్ణయించుకున్నాను. 14 బదులుగా నేను చనిపోవు వరకు యేసు వలే అధికముగా మరియు అధికముగా మారడానికి కొనసాగడం మీద మాత్రమే నేను కేంద్రీకరించుచున్నాను. దాని ఫలితంగా మెస్సీయ యేసుతో నా సంబంధం కారణంగా, దేవుడు పరలోకంలో నాకు బహుమానము ఇస్తాడు. 15 కాబట్టి అప్పుడు మనలో సంపూర్ణ విశ్వాసులముగా ఉన్న మనం అందరమూ ఇదే విధానంలో ఆలోచించాలి. అయితే నేను ఇప్పుడే రాసిన దేనిగురించియైనను మీకు భిన్నంగా ఆలోచించిన యెడల, దేవుడు కూడా దీనిని మీకు చూపించును. 16 అయితే ఇప్పటికే దేవుడు మనకు బయలుపరచిన నిజమైన సంగతుల విషయం, ఈ సంగతుల ప్రకారం మనం అందరం మన జీవితాలను జరిగించుకొందాము. 17 నా సహ విశ్వాసులారా, నన్ను అనుకరించడానికి కలిసి చేరండి, మరియు మనం చేయుచున్న విధముగా జీవించు మనుష్యులను సమీపంగా గమనించండి. 18 మెస్సీయ సిలువ మీద చనిపోవడం గురించిన సందేశాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు అని చూపించే ఒక మార్గంలో జీవించు మనుష్యలు అనేకమంది ఉన్నారు. ఇంతకుముందు అనేక సార్లు ఈ మనుష్యులను గురించి నేను మీకు చెప్పాను, మరియు వారిని గురించి నేను మీకు మరల చెపుతూ ఉండగా నేను విచారంగా ఉన్నాను, ఏడ్చుచున్నాను కూడా. 19 దేవుడు ఈ మనుష్యులను కఠినంగా శిక్షిస్తాడు. ఈ మనుష్యులు దేవునికి బదులు తమ శారీరక కోరికలను తీర్చుకొనుచున్నారు, మరియు వారు సిగ్గుగా ఉండవలసిన సంగతులను గురించి వారు అతిశయపడుచున్నారు. ఈ మనుష్యులు పరలోకపు సంగతులకు బదులు భూసంబంధమైన సంగతులను గురించి మాత్రమే ఆలోచించుచున్నారు. 20 మన విషయంలో మనం పరలోకం యొక్క పౌరులం, మరియు పరలోకం నుండి తిరిగి రావడానికి మరియు మనలను రక్షించడానికి మన ప్రభువు మెస్సీయ యేసు కోసం మనం ఆతురముగా ఎదురుచూచుచున్నాము. 21 దేవుడు ఇప్పుడు మనం కలిగియున్న బలహీనమైన మరియు దీనమైన శరీరాలను యేసు యొక్క మహిమాన్వితమైన పునరుత్థాన శరీరం వలె మారుస్తాడు. ఆయన తన శక్తితో దీనిని చేస్తాడు, దాని ద్వారా ఆయన అన్ని సంగతులను నియంత్రించగలడు.

Chapter 4

1 నా సహా విశ్వాసులారా, నేను మిమ్మును ప్రేమించుచున్నాను, మరియు నేను మిమ్మును చూడడానికి అధికంగా కోరుచున్నాను. మీ యొక్క కారణంగా నేను సంతోషించుచున్నాను. దేవుడు నాకు బహుమానం ఇవ్వడానికి మీరు కారణం. నేను మీకు {ఈ పత్రికలో} ఇప్పుడే వివరించిన విధంగా, నేను ప్రేమించే నా సహ విశ్వాసులు, ప్రభువుకు స్థిరంగా సమర్పించుకొని ఉండడానికి కొనసాగండి. 2 ఒకరితో ఒకరు సమాధానపూర్వకమైన సంబంధం మరల ఉండడానికి యువొదియ నేను నిన్ను బతిమాలుచున్నాను, మరియు సుంటుకే నేను నిన్ను బతిమాలుచుచున్నాను, ఎందుకంటే మీరు ఇద్దరూ ప్రభువుకు కలిసి యున్నారు. 3 మరియు నా నమ్మకమైన సహ భాగస్వామి, ఈ స్త్రీలకు సహాయం చెయ్యడానికి నేను కూడా నిన్ను బతిమాలుచున్నాను. {దయచేసి వారికి సహాయం చెయ్యండి ఎందుకంటే} క్లెమెంతు మరియు మిగిలిన నా యొక్క సహ పనివారు శుభ వార్త వ్యాప్తిలో నాకు సహాయం చేసారు, దేవుడు తనతో శాశ్వతకాలం జీవించు వారి యొక్క తన గ్రంథంలో వారి పేర్లను రాసాడు. 4 దేవుడు ఎవరై ఉన్నాడో మరియు ఆయన ఏమి చేసాడో మరియు ఏమి చేయుచున్నాడో అనే దానిలో ఎల్లప్పుడూ ఆనందించుడి! నేను మరల చెప్పుదును, ఆనందించుడి! 5 మీరు మృదువైన వారు అని మనుషులు అందరూ చూచే ఒక విధానంలో ప్రవర్తించండి. {దీనిని చెయ్యండి ఎందుకంటే} ప్రభువు త్వరలో తిరిగి వస్తాడు. 6 దేనిని గూర్చియు చింతపడకుడి, దానికి బదులుగా, ప్రతి పరిస్థితిలో దేవునికి ప్రార్థన చెయ్యండి, మరియు ఖచ్చితంగా మీకు అవసరమైన దానిని ఆయనకు చెప్పండి, మరియు మీకు సహాయం చెయ్యడానికి ఆయనను అడగండి. మరియు ఆయన మీ కోసం చేస్తున్న సమస్తం కోసం దేవునికి కృతజ్ఞత చెప్పండి. 7 దాని ఫలితంగా మీరు దేనివిషయం గురించి ఆందోళన చెందకుండా ఉండడానికి దేవుడు మిమ్మును శక్తివంతులను చేస్తాడు, మరియు మీరు మెస్సీయ యేసుతో కలిసి యుండగా మీరు ఏవిధంగా ఆలోచన చేస్తారో మరియు అనుభూతి చెందుతారో ఆయన మిమ్మును కాపాడుతాడు. 8 చివరకు, నా సహ విశ్వాసులారా, సత్యమైన దేదో, ఘనతకు యోగ్యమైనదేదో, సరియైనదేదో, నిర్దోషమైనదేదో, సంతోషాన్ని కలిగించేదేదో, ఖ్యాతికి యోగ్యమైనదేదో, మంచిది ఏదో, మెచ్చుకొనదగినదేదో వాటిని గురించి ఆలోచన చెయ్యండి. ఇవి మీరు ఎల్లపుడూ ఆలోచించ వలసిన సంగతులు. 9 నేను మీకు బోధించినవాటిని మరియు నేను చెప్పడం మీరు వినిన సంగతులు మరియు నేను చెయ్యడం మీరు చూసిన సంగతులు నిరంతరం చెయ్యండి. మీరు ఈ సంగతులను చేసిన యెడల మనం సమాధానంగా ఉండడానికి చేసిన దేవుడు మీతో ఉంటాడు. 10 నేను చాలా సంతోషిస్తున్నాను మరియు ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు, కొంతకాలం తరువాత, {నాకు ధనమును పంపించడం చేత} మీరు నా గురించి శ్రద్ధ కలిగియున్నారని మరొక సారి చూపించారు. నిజానికి, మీరు నా గురించి అన్ని సమయాలలో శ్రద్ద కలిగియున్నారు. అయితే దానిని చూపించడానికి మీకు ఎటువంటి అవకాశం లేదు. 11 నాకు అవసరమైన దాని విషయంలో కొదువ కలిగి యుండడం గురించి నేను శ్రద్ధ కలిగియున్న కారణంగా నేను దీనిని చెపుతున్నాను అని ఆలోచన చెయ్య వద్దు. బదులుగా నేను ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ సంతోషంగా ఉండడానికి నేను నేర్చుకొన్నాను. 12 నాకు అవసరమైన వాటిని నేను కలిగియుండనప్పుడు మరియు అవసరమైనదాని కంటే ఎక్కువగా నేను కలిగియున్నప్పుడు సంతోషంగా ఉండడానికి నేను నేర్చుకొన్నాను. నేను ఆకలితో ఉన్నప్పుడు మరియు తినడానికి ఆహారం యొక్క సమృద్ధిని నేను కలిగియున్నప్పుడు సంతోషంగా ఉండడానికి నేను నేర్చుకొన్నాను. అన్ని పరిస్థితులలో మరియు అన్ని సమయాలలో సంతోషంగా ఉండడానికి నేను నేర్చుకొన్నాను. 13 మెస్సీయ నన్ను బలపరచుచున్నాడు గనుక, నేను ప్రతీ పరిస్థితికి చక్కగా స్పందించ గలుగుతాను. 14 అయినను నా కఠినమైన పరిస్థితిలో నాకు సహాయం చెయ్యడానికి మీరు సరియైన కార్యాన్ని చేసారు. 15 ఫిలిప్పీ వద్ద ఉన్న నా స్నేహితులారా, మీరు మీ మట్టుకు, మీకు సువార్తను నేను మొదట ప్రకటించిన ఆ సమయం తెలుసును. మాసిదోనియ ప్రాంతం నుండి బయటికి వెళ్ళడానికి నేను ఆ ప్రాంతమును విడిచినప్పుడు మీరు తప్పించి ఏ విశ్వాసుల యొక్క సంఘము వారు నాకు ధనమును పంపించలేదు లేదా ఏ విధంగానూ సహాయం చెయ్యలేదు. 16 నేను థెస్సలొనీక యొక్క నగరంలో ఉన్నపుడు సహితం, నాకు అవసరమైన వాటిని తీర్చడానికి ఒకటి కంటే ఎక్కువసార్లు మీరు నాకు ధనమును పంపారు. 17 మీరు నాకు ధనమును ఇవ్వాలి అని నేను కోరుతున్నాను కనుక నేను దీనిని చెప్పడం లేదు. దానికి బదులుగా {మీరు నాకు చేసిన సహాయానికి ఫలితముగా} దేవుడు మీకు సమృద్ధియైన ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని నేను కోరుతున్నాను. 18 మీరు చాలా దాతృత్వముతో కూడిన బహుమానమును నాకు ఇచ్చారు, మరియు, దాని ఫలితంగా, నాకు అవస్యమైనవి అన్నీ మరియు ఎక్కువగా కలిగియున్నాను, నాకు అవసరమైనవాటి విషయంలో సమృద్ధి కలిగియున్నాను, ఎందుకంటే మీ బహుమానంతో ఎపఫ్రొదితును నా వద్దకు మీరు పంపారు. మీ బహుమానం చాలా అంగీకారంగా ఉన్నది అని దేవుడు పరిగణిస్తున్నాడు, మరియు దానితో ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. 19 నేను సేవించుచున్న దేవుడు మీకు అవసరమైన ప్రతీ దానిని అనుగ్రహించును, ఎందుకంటే మీరు మెస్సీయ యేసుకు చెందియున్నారు మరియు ఎందుకంటే ఆయన సమస్తమైన సంగతులను కలిగి యున్నాడు. 20 ఇప్పుడు, మన దేవుడు మరియు తండ్రి శాశ్వతకాలం స్తుతింపబడును మరియు ఘనపరచబడును గాక! ఆమేన్! 21 అక్కడ దేవుని యొక్క మనుష్యులు అందరికి నా కోసం శుభములు చెప్పండి. వారు అందరు మెస్సీయ యేసుకు చెందినవారు. నాతో ఉన్న విశ్వాసులు కూడా మీకు అందరికి శుభములు చెప్పుచున్నారు. 22 ఇక్కడ దేవుని యొక్క మనుష్యులు అందరు మీకు శుభములు పంపుతున్నారు. చక్రవర్తి, కైసరు యొక్క అంతఃపురములో పని చేయుచున్న సహ విశ్వాసులు ప్రత్యేకంగా మీకు వారి శుభములు పంపుతున్నారు. 23 మన ప్రభువు మెస్సీయ యేసు మీ అందరి పట్ల దయాపూర్వకంగా ఉండడానికి కొనసాగించును అని నేను కోరుతున్నాను మరియు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్.