తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

పేతురు రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 {నేనే} పేతురును, యేసు మెస్సీయ {ఆయనకు ప్రాతినిధ్యం వహించడానికి} పంపాడు. దేవుడు తనకు చెందినదిగా ఎంచుకున్న మీకు {నేను ఈ పత్రిక వ్రాస్తున్నాను}. {పరలోకములోని మీ నిజమైన ఇంటికి} దూరంగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా మరియు బితునియ దేశములలో తాత్కాలికంగా నివసిస్తున్న { మీకు నేను వ్రాస్తున్నాను}. 2 మన తండ్రి అయిన దేవుడు తాను ఇప్పటికే నిర్ణయించుకున్న దాని ప్రకారం {మిమ్ములను ఎన్నుకున్నాడు}. మీరు {ఆయనకు} విధేయత చూపడానికి మరియు యేసు మెస్సీయ మరణం మిమ్ములను దేవునితో నిబంధనలో సభ్యులుగా చేయడానికి మిమ్ములను ప్రత్యేక పరచి, తన ఆత్మ ద్వారా {ఆయన దీనిని చేసాడు}. దేవుడు మీ పట్ల తన దయగల చర్యలను పెంచి, మిమ్ములను మరింత సమాధానముగా ఉండేలా చేయాలి అని{నేను ప్రార్థిస్తున్నాను}. 3 మన ప్రభువైన యేసు మెస్సీయకు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించండి! ఆయన మన యెడల చాలా దయగలవాడు కాబట్టి, ఆయన చనిపోయిన తర్వాత మెస్సీయ అయిన యేసును తిరిగి బ్రతికించడం ద్వారా కొత్త జన్మను అనుభవించేలా చేసాడు. మనలను ఎప్పటికీ నిరుత్సాహపరచని నిరీక్షణ కోసం, 4 {అంటే,} మనం నశించలేని, అపవిత్రం కాని, లేదా వాడిపోని వాటిని వారసత్వంగా పొందడం కోసం {దేవుడు ఇది చేసాడు}, అదే దేవుడు మన కోసం పరలోకములో ఉంచాడు. 5 {యేసులో}మీ విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తి మిమ్ములను కాపాడుచున్నది. అంతిమ సమయంలో {యేసు ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చడానికి తిరిగి వచ్చునప్పుడు} మీ రక్షణను బయలుపరచడానికి {ఆయన మిమ్ములను కాపాడుచున్నాడు}. 6 ఇప్పుడు కొద్దికాలం పాటు అనేక రకాల కష్టాలు మిమ్ములను దుఃఖించవలసి వచ్చినప్పటికీ, అప్పుడు జరిగే దాని గురించి మీరు చాలా సంతోషిస్తున్నారు. 7 మీరు నిజంగా {యేసులో} విశ్వసిస్తున్నారని నిరూపించడానికి {ఈ కష్టాలు} జరుగుతాయి. బంగారం కంటే {ఆ విశ్వాసం} దేవునికి విలువైనది, దానిని ఎవరైనా అగ్ని ద్వారా {వెళ్ళుట ద్వారా} పరీక్షించినప్పటికీ ఎవరైనా నాశనం చేయగలరు. మీరు యేసును విశ్వసిస్తున్నందున, యేసు మెస్సీయ {తిరిగి వచ్చి} తనను తాను వెల్లడించినప్పుడు దేవుడు నిన్ను స్తుతిస్తాడు, మహిమపరుస్తాడు మరియు గౌరవిస్తాడు. 8 మీరు యేసును చూడనప్పటికీ ఆయనను ప్రేమిస్తున్నారు. మీరు ఇప్పుడు ఆయనను చూడనప్పటికీ, మీరు ఆయనను విశ్వసించి మరియు మీరు వ్యక్తపరచలేని ఆనందంతో సంతోషిస్తున్నారు, 9 ఎందుకంటే మీరు ఆయనను విశ్వసించడం వలన కలిగే ఫలితమును మీరు అనుభవిస్తున్నారు: మీ పాపాల అపరాధం నుండి దేవుడు మిమ్ములను రక్షిస్తున్నాడు. 10 దేవుడు మిమ్ములను రక్షించడం గురించి {చాలా కాలం క్రితం} ప్రవక్తలు చాలా జాగ్రత్తగా పరిశోధించారు. దేవుడు కృపతో మిమ్ములను రక్షించడం గురించి దేవుడు వారికి చెప్పినది వారు మాట్లాడారు. 11 వారు తమలో ఉన్న మెస్సీయ యొక్క ఆత్మ ఎవరిని సూచిస్తున్నాడో, మరియు ఆత్మ ఏ సమయాన్ని సూచిస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెస్సీయ శ్రమపడతాడని, ఆ తర్వాత మహిమాన్వితమైన విషయాలు జరుగుతాయి అని ముందే చెప్పినప్పుడు {ఆత్మ ఈ విషయాలను ప్రస్తావించాడు}. 12 దేవుడు ఈ ప్రవక్తలకు ఈ విషయాలు బయలుపరచడం వారి స్వలాభం కోసం కాదని, అయితే మీ ప్రయోజనం కోసమేనని చెప్పాడు. ఇప్పుడు మీకు సువార్త ప్రకటించిన వారు దేవుడు పరలోకము నుండి పంపిన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ విషయాలను మీకు ప్రకటించారు, {అది చేయుటకు వారిని బలపరుస్తూ}. ఈ మనుష్యులు మీకు ప్రకటించిన దాని గురించి దేవదూతలు మరింత తెలుసుకొనుటకు ఇష్టపడుచున్నారు. 13 ఈ అన్ని విషయాల ఒక ఫలితంగా, మీ మనస్సులను చర్య కోసం సిద్ధం చేయండి. అప్రమత్తంగా ఉండండి. యేసు మెస్సీయ {తిరిగి వచ్చి} తనను తాను బహిర్గతం చేసికొనునప్పుడు దేవుడు కృపతో మిమ్ములను రక్షిస్తాడని పూర్తిగా నమ్మకంగా ఉండండి. 14 పిల్లలు తమ తండ్రులకు విధేయత చూపాల్సిన విధంగా మీరు దేవునికి విధేయులై ఉంటారు కాబట్టి, మీకు {దేవుని గురించిన సత్యం} తెలియనప్పుడు మీరు కలిగి ఉండే {పాపపూరిత} కోరికల ద్వారా నియంత్రించుకొనబడడానికి మిమ్ములను మీరు అనుమతించ వద్దు. 15 బదులుగా, కేవలం దేవుని వలె, మిమ్ములను {ఆయనకు చెందినవారుగా} ఎన్నుకున్న ఆయన పరిశుద్దుడు, మీరు ఏదైనా చేయునప్పుడు పరిశుద్ధముగా చేయండి. 16 పరిశుద్ధముగా ఉండండి, ఎందుకంటే మోషే వ్రాసాడు {దేవుడు చెప్పిన లేఖనాలలో}, “పరిశుద్ధముగా ఉండండి, ఎందుకనగా నేను పరిశుద్ధుడను.” 17 దేవుడు ప్రతి వ్యక్తి చేసే పనిని తీర్పు తీర్చేవాడు, పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు. మీరు ఆయనను 'తండ్రీ' అని పిలుస్తున్నారు కాబట్టి, మీరు తాత్కాలికంగా {పరలోకంలోని మీ నిజమైన ఇంటికి దూరంగా} నివసిస్తున్నప్పుడు మీరు ఆయనకు భయపడుతున్నారని చూపించే విధంగా ప్రవర్తించండి. 18 {ఆ విధంగా ప్రవర్తించండి} ఎందుకంటే మీ పూర్వీకులు మీకు {ప్రవర్తించడం} నేర్పించినట్లుగా, మూర్ఖంగా ప్రవర్తించడం నుండి {దేవుడు మిమ్ములను విడిపించడానికి చెల్లించాడని} మీకు తెలుసు. ఎప్పటికీ ఉండని వెండి లేదా బంగారం వంటి వాటితో మిమ్ములను విడిపించడానికి దేవుడు చెల్లించలేదు. 19 బదులుగా, మెస్సీయ యొక్క అమూల్యమైన మరణం {సిలువ మీద}. {మీరు స్వేచ్ఛగా ఉండటానికి దేవుడు చెల్లించాడు. {ఆ మరణం} పూర్తిగా పరిపూర్ణమైన గొర్రెపిల్లల {మరణాల} వంటిది {యూదు యాజకులు బలి అర్పించారు}. 20 దేవుడు లోకమును సృష్టించకముందే దీనిని చేయడానికి ఆయనను ఎన్నుకున్నాడు. అయితే {అది ఇప్పుడు,} ఈ చివరి కాలంలో, దేవుడు ఆయనను మీకు బయలుపరచాడు. 21 మెస్సీయ చేసిన పనిని బట్టి, మీరు దేవుణ్ణి నమ్ముచున్నారు. అయన చనిపోయిన తర్వాత మెస్సీయను తిరిగి బ్రతికించేలా చేసాడు మరియు ఆయన ఎంత గొప్పవాడో చూపించాడు. ఫలితంగా, మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు మరియు {ఆయన గొప్ప కార్యములు చేయాలని} ఆశిస్తున్నారు. 22 ఎందుకంటే మీరు ఇతర విశ్వాసులను యథార్థముగా ప్రేమించేందుకు, ఒకరినొకరు యథార్థముగా మరియు మిక్కుటముగాను ప్రేమించేందుకు {యేసు యొక్క} నిజమైన బోధనలకు విధేయత చూపడం ద్వారా మిమ్ములను మీరు పరిశుద్ధముగా చేసుకున్నారు. 23 {ఇది చేయండి} ఎందుకంటే దేవుడు మీరు కొత్త జన్మను అనుభవించేలా చేసాడు. నశించే ఏదో ద్వారా {మీరు ఈ కొత్త జన్మను అనుభవించలేదు} బదులుగా, ఎప్పటికీ నశించని దాని ద్వారా {మీరు దానిని అనుభవించారు}: దేవుని నుండి వచ్చిన {యేసు గురించి} సందేశం మరియు నిజంగా శాశ్వతంగా ఉంటుంది. 24 {ఇది నిజమని మనకు తెలుసు} ఎందుకంటే, {యెషయా ప్రవక్త వ్రాసినట్లు,}

     “మనుష్యులు అందరు గడ్డి వంటి వారు, మనుష్యులలో గొప్పతనం అంతా గడ్డిలోని పువ్వులు వంటిది.

     గడ్డి చచ్చిపోయి మరియు పువ్వులు ఎండిపోవు విధముగానే, {ఆ విధముగా మనుష్యులు చనిపోతారు మరియు వారి గొప్పతనం కొద్దికాలం మాత్రమే ఉంటుంది}, 25 అయితే దేవుని సందేశం శాశ్వతంగా ఉంటుంది.”

ఈ సందేశం {అది శాశ్వతంగా ఉంటుంది} ఈ శుభవార్త {మెస్సీయ గురించి} మేము మీకు ప్రకటించాము.

Chapter 2

1 {ఈ విషయములు నిజమైనవి} కాబట్టి, దుర్మార్గముగా ప్రవర్తించవద్దు లేదా ఇతరులను ఏ విధంగానూ మోసం చేయవద్దు. వేషధారులుగా ఉండ వద్దు, ఇతరులను అసూయపడ వద్దు. ఎవరి గురించి తప్పుగా చెడు విషయాలు మాట్లాడ వద్దు. 2 క్రొత్తగా జన్మించిన శిశువులు తమ తల్లుల యొక్క స్వచ్ఛమైన పాలను ఎంత బలంగా కోరుకుంటారో, అలాగే మీరు దేవుని గురించి నిజమైన విషయాలను తెలుసుకోవాలని బలంగా కోరుకోవాలి, తద్వారా మీరు వాటిని {నేర్చుకోవడం} ద్వారా ఆత్మీయముగా పరిణతి చెందుతారు. దేవుడు మిమ్ములను పూర్తిగా {ఈ పాపపు లోకము నుండి} రక్షించే వరకు {మీరు దీనిని తప్పక చేయాలి}. 3 ప్రభువు {మీ యెడల} చాలా దయగా ప్రవర్తిస్తున్నాడు అని మీరు అనుభవించినారు కాబట్టి {మీరు దీనిని తప్పక చేయాలి}. 4 మీరు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. {ఆయన} ఒక రాయి వలె {అది ఒక కట్టడములో భాగం, అయితే ఆయన} సజీవంగా ఉన్నాడు. మనుష్యులు ఆయనను తిరస్కరించి నప్పటికీ, దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు మరియు ఆయనకు గొప్పగా విలువనిచ్చాడు. 5 మరియు మీరు సజీవంగా ఉన్న రాళ్ళ వలె ఉన్నారు. {మనుష్యులు రాళ్ళతో ఇళ్ళు కట్టిన విధముగా,} దేవుడు తన ఆత్మ నివసించే భవనం వలె మిమ్ములను కలుపుచున్నాడు. మెస్సీయ అయిన యేసు ద్వారా దేవునికి ప్రీతికరమైన, ఆత్మీయ కార్యాలు చేయడానికి ఆయన ప్రత్యేకించిన యాజకుల వలె {ఆయన మిమ్ములను కూడా తయారు చేస్తున్నాడు. 6 {యెషయా} లేఖనాలలో {దేవుడు చెప్పినట్లు} వ్రాసాడు ఇది నిజము అని మనకు చూపిస్తుంది: “శ్రద్ధ వహించండి! నేను యెరూషలేములో ఒక భవనములో అతి ముఖ్యమైన రాయిలాంటి ఒకనిని ఉంచుచున్నాను. నేను ఆయనను ఎన్నుకున్నాను. ఆయన చాలా విలువైనవాడు. మరియు ఆయనను విశ్వసించే ఎవరైనా ఖచ్చితంగా ఎప్పుడూ అవమానించబడరు. 7 కాబట్టి, {దేవుడు} యేసును విశ్వసించే మిమ్ములను గౌరవిస్తాడు. అయినప్పటికీ, ఆయనను విశ్వసించుటకు తిరస్కరించు వారు {కీర్తనలలో ఎవరో వ్రాసిన విధముగా కట్టువారు వలె ఉంటారు}: “కట్టువారు తిరస్కరించిన రాయి భవనములో అత్యంత ముఖ్యమైన రాయి అయింది.” 8 {యెషయా} కూడా {మెస్సీయ ఆ విధముగా ఉంటాడు అని లేఖనాలలో వ్రాసాడు}

     “మనుషులు తొట్రుపడేలా చేసే రాయి,

     మరియు మనుష్యులను అభ్యంతరపరిచే రాయి.”

{మనుష్యులు ఒక రాయి మీద పడటం వలన గాయపడిన విధముగా,}

     మనుష్యులు దేవుని సందేశానికి అవిధేయత చూపడం వలన అభ్యంతరపడతారు;

     వారికి సంభవించాలని దేవుడు నిర్ణయించాడు.

9 {వారికి} భిన్నంగా, మీరు {విశ్వాసులు} దేవుడు {తన కోసం} ఎన్నుకున్న మనుష్యులు. {దేవుని ఆరాధించే} మరియు {ఆయనతో} పరిపాలించే యాజకుల సమూహం వంటి {మీరు ఉన్నారు}. {మీరు} దేవుడు {తన కోసం} ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మనుష్యుల సమూహం. {మీరు} దేవునికి చెందినవారు, తద్వారా ఆయన చేసిన స్తుతియోగ్యమైన పనులను మీరు ప్రకటించవచ్చు. మీరు పాపాత్ములుగా మరియు దేవుని గురించి అజ్ఞానంతో ఉన్నప్పుడు, మీ పూర్వపు జీవన విధానం నుండి ఆయన మిమ్ములను పిలిచి, తన గురించిన అద్భుతమైన వాస్తవాలను మీకు అర్థమయ్యేలా చేసాడు. 10 "మీ గురించి హోషేయా వ్రాసినది నిజమే} అతడు "అస్సలు ప్రజల సమూహం కాదు", అయితే ఇప్పుడు "దేవుని ప్రజల సమూహం." ఒకప్పుడు “దేవుడు మీ యెడల కరుణతో ప్రవర్తించలేదు,” అయితే ఇప్పుడు “ఆయన మీ యెడల కరుణతో ప్రవర్తించాడు.” 11 నేను ప్రేమించే తోటి విశ్వాసులారా, మీరు {వారి నిజమైన ఇల్లు పరలోకములో ఉన్నది} విదేశీయుల వంటి వారు. కాబట్టి మీ పాపపు మానవ స్వభావాలు చేయాలనుకుంటున్న పనులను చేయవద్దని నేను మిమ్ములను కోరుచున్నాను. ఆ కోరికలు నిన్ను నాశనం చేస్తాయి. 12 దేవుణ్ణి ఎరుగని వారితో మంచిగా ప్రవర్తించండి, తద్వారా మీరు చేస్తున్న, చెడు అని అబద్ధంగా చెప్పే పనుల విషయంలో, {వాస్తవానికి} మీరు మంచి పనులు చేస్తున్నారని వారు చూస్తారు మరియు ఆయన ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు వారు దేవుణ్ణి గౌరవిస్తారు. 13 ప్రభువైన యేసును గౌరవించాలంటే, {మనుష్యులను పరిపాలించడానికి} అధికారం ఉన్న ప్రతి ఒక్కరికీ లోబడండి. ఇందులో రాజు కూడా ఉన్నాడు, ఎందుకంటే అతనికి గొప్ప {మానవ} శక్తి ఉంది. 14 అందులో పరిపాలకులు కూడా ఉన్నారు, ఎందుకంటే చెడు పనులు చేసేవారిని శిక్షించడానికి మరియు మంచి పనులు చేసేవారిని మెచ్చుకోవడానికి రాజు వారిని పంపాడు. 15 {మనుష్యులను పరిపాలించే వారికి లోబడండి} ఎందుకంటే దేవుడు కోరుకునేది ఇదే: మూర్ఖులు {దేవుని ఎరుగని వారు} తెలివితక్కువవారు మీరు చెడు పనులు చేసారని అజ్ఞానంతో అనకుండా ఉండేందుకు మూర్ఖులను ఆపడానికి మంచి పనులు చేయాలని {ఆయన మిమ్ములను కోరుచున్నాడు.} 16 స్వచ్ఛందంగా చేసే స్వేచ్ఛ ఉన్న వ్యక్తులుగా, {మనుష్యులను పరిపాలించే వారికి విధేయత చూపండి} అయితే మీ హోదాను స్వేచ్ఛా వ్యక్తులుగా ఉపయోగించుకుని చెడు పనులను దాచుకోవద్దు. బదులుగా, దేవుణ్ణి సేవించే వారిలా {లోబడండి}. 17 అందరితో గౌరవంగా ఉండండి. {మీ} తోటి విశ్వాసులందరినీ ప్రేమించండి. దేవుణ్ణి గౌరవించండి. రాజు పట్ల గౌరవంగా ఉండండి. 18 ఇంటి దాసులారా, {విశ్వాసులారా}, మీ యజమానులకు పూర్తిగా గౌరవపూర్వక దృక్పథంతో లోబడండి. మీ పట్ల చాలా దయగా ప్రవర్తించే వారికే కాకుండా మీ పట్ల అన్యాయంగా ప్రవర్తించే వారికి కూడా {ఇది చేయండి}. 19 {మీ యజమానులకు లొంగిపోండి,} ఎందుకంటే ఇది దేవుడు ఇష్టపడేది—ఎవరైనా కష్టాలను ఓర్చుకుని అనర్హులుగా శ్రమపడుతుంటే, ఆ వ్యక్తికి దేవుడు ఎవరో {మరియు తనకు ఏమి కావాలో} తెలుసు. 20 {మీ యజమానులకు లొంగండి} ఎందుకంటే మీరు పాపం చేసినందుకు ఎవరైనా మిమ్ములను కొట్టినప్పుడు మీరు సహిస్తే మీకు ఖచ్చితంగా గౌరవం ఉండదు. ఏది ఏమైనప్పటికీ, ఇది దేవుడు ఇష్టపడే విషయం: మీరు మంచి చేసినప్పటికీ మీరు శ్రమపడినప్పుడు మీరు సహిస్తే. 21 మంచిపనులు చేస్తూ కష్టాలు అనుభవించమని మిమ్ములను పిలిచినందున {దేవుడు దీనిని అనుగ్రహిస్తాడు}. ఆయన చేసిన పనిని మీరు అనుకరిస్తారనే ఉద్దేశ్యంతో మీకు ఉదాహరణగా ఉండటానికి మెస్సీయ కూడా మీ కోసం శ్రమపడినాడు కాబట్టి {ఆయన మిమ్ములను దీనికి పిలిచాడు}. 22 “ఆయన ఎప్పుడూ పాపం చేయలేదు.

     అయన మనుష్యులను మోసం చేయడానికి ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. 23 మనుష్యులు ఆయనను అవమానించినప్పుడు, ఆయన వారిని ఎప్పుడూ అవమానించలేదు.

     ఆయన శ్రమపడ్డప్పుడు, ఆయన ఎప్పుడూ {తనకు శ్రమ కలిగించిన వారిని} బెదిరించలేదు.

     బదులుగా, ఆయన దేవుణ్ణి విశ్వసించాడు, ఆయన ఎల్లప్పుడూ న్యాయంగా తీర్పు చెప్పేవాడు, {తాను నిర్దోషి అని నిరూపించుకోవడానికి}. 24 మనం ఇకమీదట పాపం చేత నియంత్రించబడకుండ మనం సరిగ్గా జీవించాలనే ఉద్దేశ్యంతో సిలువ మీద తన శరీరములో మన పాపాల కోసం మెస్సీయ స్వయంగా శిక్షించబడినాడు {ఆయన చనిపోయినప్పుడు}.

మనుష్యులు మెస్సీయను గాయపరిచారు కాబట్టి దేవుడు మిమ్ములను స్వస్థపరిచాడు. 25 {దేవుడు మిమ్ములను స్వస్థపరిచాడు} ఎందుకంటే మీరు తప్పిపోయిన గొఱ్ఱెలవలె {దేవునికి దూరమయ్యారు} గనుక, అయితే ఇప్పుడు దేవుడు నిన్ను తిరిగి యేసు దగ్గరకు తీసుకువచ్చాడు, ఆయన నీ కోసం శ్రద్ధవహించి, నిన్ను కాపాడువాడు {ఒక గొఱ్ఱెల కాపరి తన గొఱ్ఱెల కోసం శ్రద్ధవహించునట్లుగా}.

Chapter 3

1 ఇదే విధంగా, స్త్రీలారా, {విశ్వాసులైన మీరు} మీ భర్తలకు లోబడండి. {మెస్సీయ గురించిన} సందేశాన్ని విశ్వసించని భర్తలను మీరు వారితో ఏమీ చెప్పకుండానే విశ్వాసులుగా మారేలా మీరు ఒప్పించేందుకు {ఇలా చేయండి}. 2 మీరు నిష్కపటంగా ప్రవర్తిస్తున్నారని మరియు {వారి యెడల} గౌరవముగా {ప్రవర్తిస్తున్నారు} అని వారు చూస్తారు కాబట్టి వారు మెస్సీయను విశ్వసిస్తారు. 3 కల్పన కేశాలంకరణ లేదా బంగారు నగలు లేదా శ్రేష్టమైన బట్టలు ధరించడం ద్వారా మీ శరీరాల వెలుపలి భాగాన్ని అందంగా మార్చుకోకండి. 4 బదులుగా, మీ కనపడని మనసును ఎన్నడు వాడిపోని విధంగా అందంగా మార్చుకోండి. నా ఉద్దేశ్యం, వినయపూర్వకమైన మరియు సమాధానకరమైన వైఖరిని కలిగి ఉండండి. ఇది దేవుడు చాలా ఎక్కువ విలువ ఇచ్చు నటువంటిది. 5 {ఇది చేయండి} ఎందుకంటే చాలా కాలం క్రితం ఇదే విధముగా పరిశుద్ధముగా జీవించిన స్త్రీలు తమను తాము అందంగా చేసుకున్నారు. వారు దేవుణ్ణి నమ్మి మరియు తమ భర్తలకు లోబడినారు. 6 ఉదాహరణకు, శారా తన భర్త అబ్రాహాముకు విధేయత చూపి, అతనిని {ఆమె యొక్క} యజమాని అని పిలిచింది. మీరు మంచి కార్యములు చేస్తే దేవుడు మిమ్ములను ఆమె కుమార్తెలుగా పరిగణిస్తాడు మరియు మీకు ఏదైనా భయంకరమైనది సంభవిస్తుందని భయపడరు. 7 మీరు పురుషులు {విశ్వాసులైన వారు}, అదే విధంగా, అర్ధముచేసుకొను విధముగా మీ భార్యలతో కలిసి జీవించండి. {మీ కంటే} బలహీనంగా ఉన్న వారిని {మీరు ఎలా వ్యవహరిస్తారో} అలాగే {వారితో వ్యవహరించండి}. మీతో పాటు దేవుని యొక్క కృపగల వరమును కూడా పొందే వారిగా వారిని గౌరవించండి, అది నిత్య జీవం. {ఇది చేయండి} తద్వారా మీరు ప్రార్ధించకుండా ఏదీయు ఆటంకపరచదు. 8 {నా లేఖ యొక్క ఈ భాగాన్ని} ముగించడానికి, మీ అందరికీ {నేను చెప్పుచున్నాను} ఒకే ఆలోచనతో ఉండండి. {మీ మధ్య} ఒకే మనస్తత్వం కలిగి ఉండండి. {ఒకరి యెడల ఒకరు} సానుభూతితో ఉండండి. తోటి విశ్వాసులుగా ఒకరినొకరు ప్రేమించుకోండి. {ఒకరి యెడల ఒకరు} కనికరముతో వ్యవహరించండి. వినయంగా ఉండండి. 9 మనుష్యులు మీకు కీడు చేసినప్పుడు లేదా మిమ్ములను అవమానించినప్పుడు, వారికి అదే చేయవద్దు. బదులుగా, వారిని ఆశీర్వదించండి, ఎందుకంటే దేవుడు మిమ్ములను ఆశీర్వదించేలా చేయడానికి మిమ్ములను ఎంచుకున్నాడు. 10 {ఇది నిజమని మనకు తెలుసు} ఎందుకంటే, {దావీదు వ్రాసిన విధముగా,}

     “నిజంగా మంచి జీవితాలను అనుభవించాలనుకునే వారి విషయానికి వస్తే,

     వారు చెడు మాటలు మాట్లాడకూడదు లేదా మోసపూరిత మాటలు మాట్లాడకూడదు. 11 వారు కూడా చెడు చేయడానికి నిరాకరించాలి, మరియు మంచిని చేయాలి {బదులుగా}.

     వారు ఇతర మనుష్యులతో సమాధానకరమైన సంబంధాలను కలిగి ఉండటానికి శ్రద్ధగా ప్రయత్నించాలి. 12 {వారు ఈ పనులు చేయాలి}ఎందుకంటే ప్రభువు నీతిమంతులను కనిపెట్టుచున్నాడు.

     ఆయన నీతిమంతుల ప్రార్థనలు వింటాడు {మరియు ప్రతిస్పందిస్తాడు}.

     అయితే అతడు కీడు చేసే మనుష్యులను వ్యతిరేకిస్తాడు.

13 మీరు మంచి చేయాలనే ఉత్సాహంతో ఉంటే ఎవరైనా మీకు హాని చేసే అవకాశం లేదు. 14 అయినప్పటికీ, మీరు సరైనది చేసినందుకు శ్రమపడినా, దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు. "ఇతరులు భయపడే వాటికి భయపడకండి లేదా ఇబ్బంది పడకండి." 15 బదులుగా, ప్రభువైన మెస్సీయ పరిశుద్ధుడని మీ మనస్సులలో గుర్తించండి. మీరు {దేవుడు మీ కోసం ఏమి చేస్తాడని} నమ్మకంగా ఆశిస్తున్నారో వారితో చెప్పమని మిమ్ములను అడిగిన వారికి సమాధానం ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. 16 మెస్సీయాతో ఐక్యమైన వ్యక్తులుగా మీరు చేసే మంచి పనులను తృణీకరించేవారిని దేవుడు సిగ్గుపడేలా, ఎలాంటి చెడ్డపనులు చేయకుండా వినయంగా మరియు భక్తితో {వారికి సమాధానం చెప్పండి}. వారు మీకు వ్యతిరేకంగా అబద్ధంగా మాట్లాడుతున్న విషయాల గురించి {దేవుడు వారిని సిగ్గుపరుస్తాడు}. 17 {ఈ పనులు చేయండి} ఎందుకంటే, దేవుడు {మీరు శ్రమపడాలని} కోరుకున్న యెడల, మీరు చెడు చేసినందుకు {శ్రమపడటం} కంటే మేలు చేసినందుకు శ్రమపడటం మీకు మేలు. 18 {ఇది నిజం} ఎందుకంటే మెస్సీయ కూడా శ్రమపడ్డాడు. {ఇతరుల మనుష్యుల యొక్క} పాపాల కోసం ఒకసారి {ఆయన} శ్రమపడ్డాడు. ఆయన నీతిమంతుడైన వ్యక్తి అనీతిమంతులైన వ్యక్తుల ప్రయోజనం కోసం {ఆయన మరణించాడు}. మీరు దేవునితో ఉండేందుకు {ఆయన మరణించాడు}. మనుష్యులు ఆయనను చంపినప్పటికీ, దేవుని యొక్క ఆత్మ ఆయనను తిరిగి బ్రతికించేలా చేసాడు. 19 దేవుడు బంధించిన {దుష్ట} ఆత్మలకు వెళ్ళి {దేవుని యొక్క విజయాన్ని} ప్రకటించడానికి కూడా ఆత్మ ఆయనకు సహాయం చేసాడు. 20 {ఆ దుష్ట ఆత్మలు} నోవహు జీవితకాలంలో చాలా కాలం క్రితం దేవునికి అవిధేయత చూపించారు. నోవహు ఒక పెద్ద ఓడను నిర్మిస్తున్నప్పుడు, దేవుడు {మనుష్యులు చెడు చేయడం మానేస్తారో లేదో} ఓపికగా వేచి ఉన్నాడు. ఆ ఓడలో {కొంతమంది మాత్రమే} {రక్షింపబడ్డారు}. ప్రత్యేకించి, దేవుడు కేవలం ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళలో {ప్రళయం} నుండి సురక్షితంగా తీసుకువచ్చాడు. 21 ఆ నీరు ఇప్పుడు మిమ్ములను రక్షించే బాప్టిస్మముకు చిహ్నం. {ఈ బాప్టిస్మము} మీ శరీరంలోని మురికిని కడగదు. బదులుగా, దేవుడు మన పాపాలను క్షమించాడని హామీ ఇవ్వమని మనం అడుగుతున్నామని అది చూపిస్తుంది. మెస్సీయ అయిన యేసును తిరిగి సజీవంగా మార్చేటట్లు చేసిన దేవుని ద్వారా {ఈ బాప్టిస్మము మిమ్ములను రక్షిస్తుంది}. 22 దేవుడు ప్రతి చెడు మరియు శక్తివంతమైన ఆత్మను తనకు లొబరచుకున్న తర్వాత, మెస్సీయ పరలోకానికి వెళ్ళాడు, అక్కడ దేవుని ప్రక్కన అత్యంత గౌరవనీయమైన స్థానంలో ఉన్నాడు.

Chapter 4

1 కాబట్టి, మెస్సీయ శారీరకంగా శ్రమపడ్డాడు, యేసు {శ్రమ గురించి} ఆలోచించిన {శ్రమల గురించి} ఆలోచించడం ద్వారా మిమ్ములను మీరు {క్రైస్తవులుగా శ్రమపడేందుకు} సిద్ధం చేసుకోండి. {ఇది చేయండి} ఎందుకంటే శారీరకంగా శ్రమపడేవారు పాపములో చిక్కుకొనరు. 2 ఎందుకంటే పాపాత్ములు తమ జీవితాంతం చేయాలనుకున్న పనులను వారు చేయరు. బదులుగా, వారు దేవుడు చేయాలనుకున్న పనులు చేయడానికి జీవిస్తారు. 3 {నేను మీతో చెప్పుచున్నాను} ఎందుకంటే మీరు ఇప్పటికే మీ జీవితకాలంలో దేవుని గురించి తెలియని మనుష్యులు చేయాలనుకుంటున్నారు. {వారివలె,} మీరు లైంగిక అనైతిక మరియు కామంతో కూడిన చర్యలను చేసారు, త్రాగి, అనైతిక విందులు మరియు మద్యపాన విందులలో పాల్గొన్నారు, మరియు దేవుడు నిషేధించిన విగ్రహాలను పూజించారు. 4 ఆ విషయాల గురించి, దేవుణ్ణి ఎరుగని వారు ఈ నిర్లక్ష్యపు అనైతిక పనులు చేస్తున్నప్పుడు మీరు వారితో {ఇకమీదట} చేరకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఫలితంగా, వారు {మీ గురించి} చెడుగా చెపుతారు. 5 {ఒకరోజు} ఈ వ్యక్తులు {తాము చేసిన ప్రతిదాన్ని} దేవునికి ఒప్పుకోవలసి ఉంటుంది. మనుష్యులందరికి తీర్పు తీర్చేవాడు ఆయనే. 6 {మనుష్యులు} {ప్రస్తుతం చనిపోయిన విశ్వాసులకు} {యేసు గురించి} శుభవార్త ప్రకటించడానికి ఇదే కారణం: {ఆ విశ్వాసులు} తమ జీవితకాలంలో మానవ {ప్రమాణాల} ప్రకారం తీర్పు ఇచ్చినప్పటికీ , పరిశుద్ధ ఆత్మ ద్వారా {ఇప్పుడు} దేవుని యొక్క {ప్రమాణాల} ప్రకారం {నిత్యము} జీవిస్తారు. 7 {ఈ భూమి మీద} అన్నీ త్వరలో ముగుస్తాయి. కాబట్టి బాగా ప్రార్థించడానికి తెలివిగా మరియు స్పష్టంగా ఆలోచించండి. 8 అన్నింటికంటే ముఖ్యమైనది, ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించండి, ఎందుకంటే మీరు ఇతరులను ప్రేమిస్తే, మీరు చాలా పాపాలను క్షమించి (వారు మీకు వ్యతిరేకంగా చేసే) పాపాలను క్షమించగలరు. 9 తోటి క్రైస్తవులకు {మీ దగ్గరకు వచ్చే} వారికి ఆహారం మరియు పడుకోవడానికి స్థలం అందించండి మరియు ఉల్లాసంగా చేయండి. 10 దేవుడు మీకు ఇచ్చిన వరములతో మీ తోటి విశ్వాసులకు సేవ చేయండి. దేవుడు మీకు దయతో ఇచ్చిన వివిధ వరములను చక్కగా నిర్వహించండి. 11 మాట్లాడేవాళ్ళు దేవుడు మాట్లాడిన మాటలు {వారు మాట్లాడుచున్న} విధముగా {మాట్లాడవలెను}. దేవుడు ఇచ్చే శక్తితో సేవ చేసే వారు {ఇతరులకు సేవ చేయాలి}. మెస్సీయ అయిన యేసు మిమ్ములను బలపరచిన ప్రతిదానిని {చేయడం} ద్వారా దేవుణ్ణి మహిమపరచడానికి {ఆ విధముగా చేయండి}. ఆయన ఎంత మహిమాన్వితుడో మరియు శక్తిమంతుడో అందరూ ఎప్పటికీ చూడాలని నేను ప్రార్థిస్తున్నాను. అది ఆలాగున ఉండును గాక! 12 నేను ప్రేమించే తోటి విశ్వాసులారా, మీరు అనుభవిస్తున్న బాధాకరమైన విషయాలను చూసి ఆశ్చర్యపోకండి. {ఆ విషయాలు} మిమ్ములను పరీక్షిస్తున్నాయి {మనుష్యులు లోహాన్ని అగ్నిలో పెట్టి పరీక్షిస్తున్నట్లుగా} పరీక్షిస్తున్నారు. మీకు అసాధారణమైనది ఏదో జరుగుతుంది {అని అనుకో వద్దు.} 13 బదులుగా, మెస్సీయ అనుభవించిన వాటినే మీరు అనుభవిస్తున్నారని ఆ స్థాయికి సంతోషించండి. {మీరు శ్రమపడునప్పుడు సంతోషించండి,} మెస్సీయ తిరిగి వచ్చినప్పుడు మరియు ఆయన ఎంత మహిమాన్వితుడో అందరికీ చూపించినప్పుడు మీరు కూడా చాలా సంతోషిస్తారు. 14 మీరు మెస్సీయను విశ్వసించినందుకు ఇతరులు మిమ్ములను అవమానిస్తే, దేవుడు మిమ్ములను ఆశీర్వదించాడు, ఎందుకంటే {మీ శ్రమ} దేవుని ఆత్మ, అంటే దేవుడు ఎంత గొప్పవాడో వెల్లడించే ఆత్మ మీలో నివసిస్తున్నాడు అని చూపిస్తుంది. 15 మీరు ఎవరినైనా హత్య చేసినందుకు లేదా ఏదైనా దొంగిలించినందుకు లేదా వేరే రకమైన చెడు పనులు చేసినందుకు లేదా మీరు వేరొకరి యొక్క వ్యవహారాలలో జోక్యం చేసుకున్నందుకు శ్రమ పడకుండా చూసుకోండి. 16 అయితే మీరు క్రైస్తవులుగా ఉన్నందున మీరు శ్రమపడుతుంటే సిగ్గుపడకండి. బదులుగా, మీకు “క్రైస్తవుడు” అనే పేరు ఉందని దేవుణ్ణి స్తుతించండి. 17 నేను ఇది చెప్పుచున్నాను} ఎందుకంటే దేవుడు మనుష్యులకు తీర్పు తీర్చడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. విశ్వాసులమైన మనలను ముందుగా {ఆయన తీర్పుతీర్చుతాడు} కాబట్టి, ఆయన నుండి వచ్చే శుభవార్తకు లోబడని వారికి చివరకు ఏమి {భయంకరమైన విషయాలు} జరుగుతాయో ఆలోచించండి! 18 {సొలొమోను} కూడా {లేఖనాలలో వ్రాసాడు},

     “నీతిమంతులు పరలోకానికి వెళ్ళేముందు ఎన్నో కష్టమైన పరీక్షలను ఎదుర్కొంటే,

     భక్తిహీనులు మరియు పాపాత్ములు నిశ్చయంగా ఎంత శ్రమ పడతారు!”

19 కావున, దేవుడు {శ్రమపడాలని} కోరుతున్నందున శ్రమపడేవారు మంచిని చేస్తూనే తమ జీవితాలతో దేవుణ్ణి నమ్మాలి. దేవుడే వాటిని సృష్టించాడు, మరియు ఆయన ఎల్లప్పుడూ చేస్తానని వాగ్దానం చేస్తాడు.

Chapter 5

1 ఇప్పుడు నేను {పేతురు}, మీలో పెద్దలైన {విశ్వాసుల సమావేశాలకు నాయకత్వం వహించే} వారిని కోరుతున్నాను; {నేను కూడా} ఒక పెద్దవాడిని. మెస్సీయ శ్రమను నేను వ్యక్తిగతంగా చూసాను మరియు దేవుడు త్వరలో వెల్లడి చేయబోయే ఆయన మహిమాన్వితమైన స్వభావాన్ని నేను పంచుకుంటాను. 2 {పెద్దలారా,} మీరు గొర్రెల మందలను మేపుకునే గొర్రెల కాపరులా మీతో పాటు విశ్వాసులను జాగ్రత్తగా చూసుకోండి. {వారిని జాగ్రత్తగా చూసుకోండి} మీరు దీనిని తప్పక చేయాలి కాబట్టి కాదు, దేవుడు కోరుకున్నట్లుగా మీరు నిజంగా కోరుకుంటున్నారు కాబట్టి. అత్యాశతో {దీనిని} చేయవద్దు {దీనిని చేసినందుకు డబ్బు పొందడానికి}, అయితే ఉత్సాహంగా చేయండి. 3 దేవుడు మీకు నియమించిన వ్యక్తులపై ఆధిపత్యం వహించే అధికారులలా ప్రవర్తించకండి. బదులుగా, ఆ విశ్వాసులకు {మంచి} ఉదాహరణగా ఉండండి {మీరు మీ జీవితాలను ఎలా నిర్వహిస్తారు}. 4 {మీరు ఆ పనులు చేస్తే}, మన పాలక కాపరి వంటి యేసు కనిపించినప్పుడు, ఆయన మీలో ప్రతి ఒక్కరికి {నాయకులకు} ప్రతిఫలం ఇస్తాడు. {ఆ బహుమానము} మహిమాన్వితమైనది {మరియు} శాశ్వతంగా ఉంటుంది. 5 అదే విధంగా, యువకులారా, {విశ్వాసుల సంఘాలకు నాయకత్వం వహించే} పెద్దలకు లోబడండి. ఇప్పుడు మీరందరూ {విశ్వాసులు} ఒకరియెడల ఒకరు వినయంగా ప్రవర్తించాలి ఎందుకంటే {సొలొమోను లేఖనాలలో వ్రాసినది నిజం:} “దేవుడు గర్వించేవారిని ఎదిరిస్తాడు, అయితే వినయస్థుల యెడల దయతో వ్యవహరిస్తాడు.” 6 అది నిజం గనుక, సరైన సమయంలో మిమ్ములను గౌరవించేలా, {మనుష్యులను రక్షించడానికి మరియు శిక్షించడానికి} అధికారం ఉన్న దేవుని ముందు మిమ్ములను మీరు తగ్గించుకోండి. 7 దేవుడు మీ గురించి శ్రద్ధ వహిస్తాడు కాబట్టి మీకు ఆందోళన కలిగించే ప్రతిదాన్ని దేవుడు చూసుకుంటాడని నమ్మండి. 8 స్పష్టంగా మరియు అప్రమత్తంగా ఆలోచించండి, {ఎందుకంటే} అపవాది మీ శత్రువు, మరియు వాడు మనుష్యులను నాశనం చేయాలని చూస్తున్నాడు. మనుషులను చంపి మరియు తినడానికి వెదకుచూ గర్జించే సింహం వలె ఉన్నాడు. 9 {మెస్సీయ మరియు ఆయన సందేశాన్ని} దృఢంగా విశ్వసించడం ద్వారా సాతానును ఎదిరించండి. {ఇది చేయండి} ఎందుకంటే లోకములో ఉన్న మీ తోటి విశ్వాసులు ఇదే విధంగా శ్రమపడుచున్నారని మీకు తెలుసు. 10 అయితే మీరు కొంతకాలం పాటు శ్రమలు అనుభవించిన తర్వాత, అన్ని విధాలుగా {మీ యెడల} దయగా వ్యవహరించే దేవుడు తానే {మీరు కోల్పోయిన వాటిని} పునరుద్ధరించి, అన్ని విధాలుగా మిమ్ములను పూర్తిగా బలపరుస్తాడు. మీరు మెస్సీయతో కలిసినందున, పరలోకంలో తన మహిమాన్వితమైన ఉనికిని శాశ్వతంగా అనుభవించడానికి దేవుడు మిమ్ములను ఎన్నుకున్నాడు. 11 ఆయన ఎప్పటికీ శక్తివంతంగా పరిపాలించాలని నేను ప్రార్థిస్తున్నాను. అది అలా ఉండును గాక! 12 సిల్వాను నా కోసం ఈ ఉత్తరం వ్రాసాడు {నేను అతనికి చెప్పిన విధముగా}. నేను అతనిని నమ్మకమైన తోటి విశ్వాసిగా పరిగణిస్తాను. మిమ్ములను ప్రోత్సహించడానికి మరియు నేను వ్రాసినది దేవుని నుండి నిజమైన మరియు దయగల సందేశం గురించి మీకు తెలియజేయడానికి ఈ చిన్న లేఖను మీకు వ్రాసాను. ఈ సందేశాన్ని దృఢంగా విశ్వసించడాన్ని కొనసాగించండి! 13 {మేము బబులోను అని పిలుస్తున్న ఈ నగరములో}, దేవుడు మిమ్ములను ఎన్నుకున్న విధముగా {ఆయనకు చెందినవారుగా} ఎన్నుకున్న విశ్వాసులు మీకు వందనాలు చెప్పుచున్నారు. నాకు ఒక కుమారుడు లాంటి మార్కు కూడా {మీకు తన వందనములు తెలియజేస్తున్నాడు}. 14 మీరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని చూపించడానికి ఒకరినొకరు ముద్దుతో ఆప్యాయంగా పలకరించుకోండి. మెస్సీయాతో చేరిన మీ అందరిని సమాధాన అనుభూతి కొనసాగించాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను.