తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తిమోతికి రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 పౌలు {నుండి}, మెస్సీయ యేసును సూచిస్తున్న మనిషిని. మనలను రక్షిస్తున్న దేవుడు, మరియు మనం నిరీక్షిస్తున్న {మన} ప్రభువు మెస్సీయ యేసు నన్ను చెయ్యమని ఆజ్ఞాపించినది ఇదే. 2 నువ్వు, తిమోతి, ఒక తోటి విశ్వాసిగా నాకు నిజమైన కుమారుడి వలే ఉన్నావు. తండ్రి అయిన దేవుడు మరియు మన ప్రభువు మెస్సీయ యేసు నీకు దయాపూరితంగాను మరియు కరుణాపూరితంగాను క్రియ జరిగించును గాక, మరియు నిన్ను సమాధానముగా ఉంచును గాక.

3 {ఇప్పుడు నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను} ఎఫెసు నగరంలో నువ్వు నిలిచి యుండడానికి నేను మాసిదోనియ ప్రాంతానికి వెళ్తున్నపుడు నిన్ను ప్రేరేపించిన విధంగా. అక్కడే నిలిచియుండు తద్వారా అక్కడ కొందరు మనుషులు భిన్నంగా ఉన్న (సత్యం నుండి} సంగతులను మనుషులకు బోధించడం నిలిపివెయ్యాలని నువ్వు ఆజ్ఞాపించు. 4 పాతకాలపు నిరుపయోగమైన కథలు మరియు అంతం లేని వంశావళుల జాబితాల మీద లక్ష్యముంచడం నిలుపు చెయ్యడానికి వారిని హెచ్చరించు. ఆ సంగతులు {మాత్రమే} మనుషులు ఒకరితో ఒకరు వాదులాడుకొనేలా చేస్తాయి. దేవుని ప్రణాళిక ముందుకు కదలడానికి అవి సహాయం చెయ్యవు. మనం దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు అవి జరుగుతాయి. 5 ఈ సంగతుల మీద మేము నొక్కి చెపుతున్నాము. తద్వారా {దేవుని} ప్రజలు {ఒకరినొకరు} ప్రేమించుకొంటారు. వారు మంచిది అయిన దానిని మాత్రమే ఆశించినప్పుడు, వారు సరైన కార్యాలను చేస్తున్నారని వారు ధైర్యంగా తెలుసుకొన్నప్పుడు మరియు దేవునిలో వారు యదార్ధంగా విశ్వసించినప్పుడు వారు ఇది చేస్తారు,

6 కొంత మంది మనుషులు ఈ మంచి సంగతులను నిరాకరించారు. దానికి బదులుగా వారు నిరుపయోగమైన సంగతులను బోధించడానికి ఎంచుకొన్నారు. 7 వారు {దేవుడు మోషేకు ఇచ్చిన} ధర్మశాస్త్ర నియమాలకు ఉపదేశకులుగా ఉండడానికి కోరుకుంటారు, అయితే వారు మాట్లాడు సంగతులను గురించి అర్థం చేసుకోరు, అంతే కాకుండా సత్యం అని వారు నొక్కి చెప్పే సంగతులు. 8 అయితే మనుషులు {దేవుడు మోషేకు ఇచ్చిన}ధర్మశాస్త్ర నియమాలను సరియైన విధానంలో వినియోగించిన యెడల అవి ప్రయోజనకరంగా ఉంటాయి అని మనకు తెలుసు.

9 మంచి దానిని చేయుచున్న మనుషులు కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని నియమించ లేదు అయితే ధర్మశాస్త్రం లేదు అన్నట్టుగా ప్రవర్తించే మనుషులు మరియు ఎవరికైనా విధేయత చూపించడానికి నిరాకరించు వారి కోసం అని మనకు తెలుసు. దేవుని ఘనపరచని వారి కోసం మరియు పాపం చేయువారి కోసం, దేవునికి భయపడని వారి కోసం మరియు ఆయనను లక్ష్యపెట్టని వారి కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాడు. తమ తండ్రులను హత్య చేయువారి కోసం, తమ తల్లులను హత్య చేయువారి కోసం, మరియు ఇతర మనుష్యులను హత్య చేయువారి కోసం ఆయన ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాడు. 10 లైంగికంగా అనైతికంగా ఉన్న ప్రజలు, ఇతర మనుష్యులతో లైంగిక సంబంధాలు కలిగియున్నవారు, మనుషులను అపహరించే వారు {మరియు వారిని బానిసలుగా అమ్ముతారు}, అబద్దికులు, అబద్ద సాక్ష్యాలు చెప్పేవారు {న్యాయ స్థానాలలో}, మరియు {మన} సత్య బోధకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఇతర చర్య {కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాడు}. 11 {ఈ ఉపదేశం} మనం స్తుతిస్తున్న {మన} అద్భుతమైన దేవుని గురించిన శుభవార్త నుండి వస్తుంది. ఈ శుభవార్తను ఆయన నాకు అనుగ్రహించాడు {ఇతరులకు ప్రకటించడానికి}. 12 నన్ను బలపరచిన {ఈ కార్యం చెయ్యడానికి} మన ప్రభువు మెస్సీయ యేసుకు నేను కృతజ్ఞుణ్ణి ఎందుకంటే ఆయన నన్ను నమ్మగలడని ఎంచాడు. కాబట్టి {ఆయనను} సేవించడానికి ఆయన నన్ను నియమించాడు. 13 ఇంతకు ముందు ఆయన గురించి నేను చెడు సంగతులు చెప్పాను, ఆయన ప్రజలు కష్టపడడానికి కారణం అయ్యాను, మరియు నేను {వారి పట్ల} హింసాత్మకంగా జరిగించాను. అయితే నేను చేయుచున్నది తప్పు అని నాకు తెలియదు కనుక మెస్సీయ నా విషయంలో దయగా క్రియ చేసాడు, నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. 14 మన ప్రభువు సమృద్ధిగా {నా కోసం} చేసాడు, దానికి నేను అర్హుడను కాను, మెస్సీయ యేసులో విశ్వాసం ఉంచడానికి మరియు ఆయనకు చెందియున్నవారి వలే ఆయనను ప్రేమించడానికి నన్ను అనుమతించాడు. 15 ప్రతిఒక్కరు ఈ ప్రకటనను విశ్వసించాలి మరియు దీనిని సంపూర్ణంగా అంగీకరించాలి: "మెస్సీయ యేసు పాపులైన మనుషులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాడు {తద్వారా దేవుడు వారిని వారి పాపముల విషయంలో శిక్షించడు}."{నా మట్టుకైతే} ఇతరులు అందరి కంటే నేను మిక్కిలి చెడ్డగా పాపం చేసాను.

16 అయితే ఈ కారణంగా మెస్సీయ యేసు నా విషయంలో కరుణాపూరితంగా క్రియ జరిగించాడు. నేను ఇతరులు అందరి కంటే మిక్కిలి చెడ్డగా పాపం చేసాను కనుక, ఆయన మనుషులతో సంపూర్ణ ఓర్పును చూపించడానికి ఒక నమూనాగా ఆయన నన్ను వినియోగించాడు. తరువాత ఆయనలో విశ్వాసముంచు మనుషులకు ఆయన దీనిని చూపించడానికి కోరుతున్నాడు మరియు ప్రతిఫలంగా శాశ్వతంగా జీవిస్తారు 17 కాబట్టి శాశ్వతుడైన రాజుగా ఉన్నవానిని మనం ఘనపరుద్దాము మరియు స్తుతిద్దాము, ఆయనను ఎవరూ చూడలేదు మరియు ఆయన ఎప్పటికీ చనిపోలేదు. ఆయన మాత్రమే దేవుడు. మనం ఆయనను నిరంతరం మరియు శాశ్వతము స్తుతిద్దాము. ఆ విధంగా జరుగును గాక!

18 తిమోతీ, నువ్వు నాకు కుమారుని వలే ఉన్నావు. నీ గురించి మనుషులు గతంలో ప్రవచించిన దానితో అనుగుణంగా ఈ సంగతులు చెయ్యడానికి నేను నీకు చెపుతున్నాను. ఆదేశించే అధికారికి మెలకువగా విధేయత చూపించిన ఒక సైనికుడు వలే దేవుణ్ణి సేవించడానికి ఆ సందేశాలు నిన్ను ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను 19 విశ్వసించడం {ప్రభువైన యేసులో} మరియు సరియైనదిగా ఉన్నది అని నీకు తెలిసిన దానిని మాత్రమే చెయ్యడానికి కొనసాగించు! కొందరు మనుషులు దీనిని చెయ్యడం ఆపివేశారు మరియు కాబట్టి దేవునితో వారి సంబంధాన్ని నాశనం చేసుకొన్నారు. 20 వారిలో దీనిని చేసిన వారు హుమెనై మరియు అలెగ్జాండర్. నేను వారిని సాతాను నియంత్రణలో ఉంచాను తద్వారా {సాతాను వారు కష్టపడేలా చేసినప్పుడు} దేవుణ్ణి అవమాన పరచకుండా ఉండడానికి వారు నేర్చుకొంటారు.

Chapter 2

1 ఆ సంగతుల కారణంగా ప్రతి ఒక్కరి పక్షమున {నిరంతరం} దేవునికి {విశ్వాసులు చెయ్యడానికి} ప్రార్థన చెయ్యాలని అన్నిటికంటే ముఖ్యంగా నేను ప్రోత్సహిస్తున్నాను. వారికి అవసరమైనదాని కోసం, మరియు ఇతర ప్రజలకు అవసరమైన దానికోసం వారు దేవుణ్ణి అడగాలి, మరియు వారు దేవునికి కృతజ్ఞత చెప్పాలి {ఆయన చేసిన సమస్తము కోసం}. 2 రాజుల కోసం, మరియు {ఇతరుల మీద } పరిపాలన చేయు ప్రతి ఒక్కరి కోసం {వారు ప్రార్థన చెయ్యాలి} తద్వారా మనం సమాధానంతోనూ మరియు నెమ్మదితోనూ జీవిస్తాము. దేవుడు మరియు ఇతరులు సత్యమైనది మరియు సరియైనది అని యెంచే ప్రతీ దానిని {ఆ విధంగా మనం చెయ్యగలం} .

3 ఇది మంచిది {ఆ విధంగా ప్రార్థించడానికి}, మరియు మనలను రక్షిస్తున్న దేవుణ్ణి ఇది సంతోషపరుస్తుంది. 4 మనుషులు అందరిని రక్షించడానికి దేవుడు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరు ఆయన సత్య సందేశాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని మరియు అంగీకరించాలని ఆయన కోరుతున్నాడు.

5 అది ఎందుకంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు {ప్రతి ఒక్కరికి}, మరియు దేవుణ్ణి మరియు మానవులను ఒకచోట చేర్చగల వాడు కేవలం ఒక్కడే ఉన్నాడు. ఆ వ్యక్తి మెస్సీయ యేసు, ఆయన తానే మానవుడు. 6 మనుష్యులందరినీ రక్షించడానికి {పాపం మరియు మరణం నుండి} ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు {ఒక బలిగా}. సంపూర్ణ సమయంలో {ఆయన చనిపోయాడు}, మరియు ఆయన మరణం చూపించింది {మనుషులు అందరిని రక్షించడానికి దేవుడు కోరుతున్నాడు}.

7 ఆయన కోసం మాట్లాడడానికి ఈ సందేశాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను నియమించాడు మరియు ఆయనకు ప్రాతినిద్యం వహించదానికి నన్ను పంపాడు. నేను ఖచ్చితంగా మెస్సీయకు చెందియున్న ప్రకారముగా, నేను సత్యమును చెపుతున్నాను. నేను అబద్దం చెప్పడం లేదు! {దేవుడు నన్ను పంపాడు} యూదులు కాని వారికి బోధించడానికి, తద్వారా వారు దేవుని సత్య సందేశాన్ని విశ్వసించాలి.

8 కాబట్టి ప్రతి స్థలములోను {విశ్వాసులు ఆరాధించు చోట} మనుషులు {దేవునికి} ప్రార్థన చెయ్యాలని నేను కోరుతున్నాను. దేవుణ్ణి సంతోష పరచు విధానంలో వారు జీవించాలి, వారు కోపంగా ఉండడం లేదా {మరొకరితో} పోట్లాటలాడడానికి బదులు ఎందుకంటే ప్రార్థించడానికి వారి చేతులు పైకెత్తాలి,

9 అలాగే {దేవుణ్ణి ఆరాధించడానికి కలుసుకొన్నప్పుడు} స్త్రీలు సక్రమమైన వస్త్రాలు ధరించుకోవాలి, అవి సాధువైనవిగాను మరియు నిరాడంబరమైనవిగాను ఉండాలి. వారు విస్తృతమైన జడల విధానాలు, లేదా బంగారు ఆభరణాలతో లేదా ముత్యాలతో లేదా ఖరీదైన వస్త్రాలతో తమ్మును తాము అలంకరించుకోడానికి ప్రయతించకూడదు. 10 దానికి బదులు {చెయ్యడం ద్వారా వారు తమ్మును తాము అలంకరించుకోవాలి} దేవుణ్ణి ఆరాదిస్తున్నామని చెప్పుకొంటున్న స్త్రీలు చేసే సంగతులను వారు చెయ్యాలి. అవి {వారు చేస్తున్నవి} మంచి కార్యాలు {ఇతర మనుషుల కోసం}.

11 స్త్రీలు మౌనంగా నేర్చుకోవాలి {సంఘం యొక్క నాయకుల నుండి}, అన్ని సమయాల్లో వారికి సహాయంగా ఉండాలి. 12 అయితే పురుషులకు ఉపదేశించడానికి మరియు పురుషుల మీద అధికారం కలిగియుండడానికి స్త్రీలను నేను అనుమతించను, దానికి బదులు స్త్రీలు మౌనంగా ఉండాలి. 13 ఎందుకంటే దేవుడు మొదట ఆదామును చేసాడు, మరియు తరువాత ఆయన హవ్వను చేసాడు. 14 మరియు సర్పము ఆదామును మోసగించలేదు. సర్పము స్త్రీని మోసగించాడు {తద్వారా దేవుడు చెయ్యవద్దని కోరిన దానిని ఆమె చేసింది,} మరియు ఆమె పాపి అయ్యింది.

15 అయితే {ఆమె దానిని చేసినప్పటికీ} అయినప్పటికి {వారు ఇంకా బాధను సహించాలి} పిల్లలు కనడం, వారు దేవుణ్ణి విశ్వసించడం,మరియు ఇతరులను ప్రేమించడం, మరియు దేవుణ్ణి సంతోష పరచే విధానంలో నివసించడం, మరియు వివేకంతో ప్రవర్తిచడం కొనసాగించిన యెడల దేవుడు స్త్రీలను కాపాడుతాడు,

Chapter 3

1 ప్రతిఒక్కరూ ఈ ప్రకటనను విశ్వసించాలి: "ఎవరైనా విశ్వాసులకు నాయకుడిగా ఉండడానికి ఆకాంక్షించిన యెడల, అతడు మంచి పనిని చెయ్యడానికి కోరుతున్నాడు. 2 ఆ కారణం కోసం విశ్వాసుల నాయకుడు ఏదైనా తప్పు చేసారని ఏ ఒక్కరూ సరిగా నింద మోపేవానిగా ఉండ కూడదు. అతడు తన భార్యకు నమ్మకంగా ఉండాలి. అతడు దేనినైనా అధికంగా చెయ్యకూడదు. అతడు జ్ఞానవంతమైన మార్గాలలో ఆలోచించాలి. అతడు సరిగా ప్రవర్తించాలి. అతడు అతిథులను తన ఇంటిలోనికి ఆహ్వానించాలి. అతడు ఇతరులకు బోధించువాడిగా ఉండాలి. 3 అతడు తాగుబోతుగా ఉండకూడదు, మరియు పోట్లాడడానికి త్వరపడువాడుగా ఉండకూడదు. దానికి బదులుగా అతడు మృదువుగా ఉండాలి మరియి జగడాలమారిగా ఉండకూడదు. అతడు డబ్బును ప్రేమించకూడదు. 4 అతడు తన సొంత కుటుంబాన్ని చక్కగా నడిపించాలి మరియు శ్రద్ధ వహించాలి. అతని పిల్లలు అతనికి లోబడాలి మరియు పూర్ణంగా అతనిని గౌరవించాలి.

5 వీటన్నిటికి మించి ఎవడైనా తన సొంత కుటుంబంలో నివసించే ప్రజల విషయంలో ఏవిధంగా శ్రద్ధ వహించడం మరియు నడిపించడం తెలియకుండా ఉన్న యెడల అతడు దేవుని ప్రజల గుంపు కోసం శ్రద్ధను ఖచ్చితంగా చూపించ లేడు. 6 ఒక నూతన విశ్వాసిని నియమించవద్దు {విశ్వాసులకు నాయకునిగా}, ఎందుకంటే అతడు గర్విష్టిగా మారతాడు. అప్పుడు దేవుడు తాను అపవాదిని తీర్పు తీర్చునట్లు అదే కారణం కోసం అతనిని తీర్పు తీరుస్తాడు. 7 అవిశ్వాసులు అతని గురించి చక్కగా మాట్లాడే విధానంలో విశ్వాసుల నాయకుడు కూడా తనను తాను నిర్వహించుకోవాలి. అప్పుడు మనుష్యులు అతని గురించి చెడు సంగతులు మాట్లాడరు, మరియు ఒక ఉచ్చులో ఉన్న జంతువు వలే అతనిని అపవాది బంధించడు. 8 అదే విధంగా, నాయకులకు సహాయకులుగా (నియమించబడిన వారు} ఉన్నవారు గంభీరంగానూ మరియు పరిణతి చెందినవారుగానూ ఉండాలి. వారు మాట్లాడునప్పుడు యదార్ధంగా ఉండాలి. వారు అధికంగా మద్యాన్ని తాగకూడదు, మరియు డబ్బు కోసం బలమైన ఆశ కలిగియుండకూడదు. 9 ఆయనలో విశ్వాసం ఉంచడం గురించి ఇప్పుడు దేవుడు మనకు బయలుపరచిన సందేశంలో వారు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచాలి, అయితే వారు చేస్తున్నదానిని దేవుడు ఆమోదిస్తున్నాడని తమలో తాము తెలుసుకొని ఉండాలి. 10 అయితే {నాయకుల కోసం ఇప్పుడు నువ్వు చేస్తున్న విధంగా,} ఈ పరిచారకులు ప్రవర్తిస్తున్న విధానాన్ని నువ్వు మొదట పరీక్షించాలి. తరువాత వారిలో ఏ లోపమూ కనుగొనని యెడల, వారిని {పరిచారకులుగా} సేవ చేయనియ్యవచ్చు.

11 ఆలాగే వారి భార్యలు గంభీరంగానూ పరిణత చెందినవారిగానూ ఉండాలి, వారు మనుషుల గురించి చెడుగా మాట్లాడకూడదు, మరియు వారు ప్రతీ దానిని మితముగా చెయ్యాలి. వారు చేయుచున్న ప్రతీ దానిలో వారు నమ్మదగినవారుగా ఉండాలి. 12 ఒక పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉండాలి, మరియు తన పిల్లలనూ మరియు తన ఇంటిలో ఉన్న మిగిలిన వారిని అతడు చక్కగా నడిపించాలి మరియు శ్రద్ధ వహించాలి. 13 చక్కగా సేవ చేసిన పరిచారకులు అధికముగా ప్రయోజనాన్ని పొందుతారు {ఈ విదానంలో సేవచేయ్యడం ద్వారా} ఎందుకంటే మనుషులు వారిని గౌరవిస్తారు, మరియు మెస్సీయ యేసు గురించి వారు విశ్వసించిన దానిని గురించి వారు చాలా ధైర్యంగా మాట్లాడడానికి నేర్చుకొంటారు.

14 నేను నీ దగ్గరకు రావడానికి త్వరలో రాగలనని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పడు నేను ఈ సంగతులు నీకు రాస్తున్నాను. 15 నేను త్వరగా రాలేకపోయిన యెడల, దేవుని కుటుంబంలో విశ్వాసులు ఏవిధంగా ప్రవర్తించాలో నీవు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. యేసులో విశ్వాసం ఉంచిన వారు అందరూ ఉన్న గుంపు మరియు సజీవుడైన దేవునికి చెందినవారు. ఈ గుంపులో మనుషులు సత్య సందేశాన్ని విశ్వసిస్తారు మరియు బోధిస్తారు.

     16 మరియు ప్రతి ఒక్కరు ఈ సత్య సందేశం దేవుడు మనకు బయలుపరచినది ఆశ్చర్యకరమైనది అని అంగీకరించాలి.

     "మెస్సీయ మానవ శరీరంలో లోకానికి వచ్చిన దేవుడు.

     ఆయన యదార్ధవంతుడు అని పరిశుద్ధ ఆత్మ రుజువు చేసాడు.

     దేవుని దూతలు ఆయనను చూశారు.

     విశ్వాసులు దేశాలకు ఆయన ఎవరో ప్రకటించారు.

     లోకంలోని అనేక భాగాలలో మనుషులు ఆయనలో విశ్వాసముంచారు.

     దేవుడు శక్తివంతంగా ఆయనను తీసుకొనివెళ్ళాడు {పరలోకంలో తనవద్దకు}"

Chapter 4

1 ఇప్పుడు దేవుని ఆత్మ మనకు స్పష్టంగా చెపుతున్నాడు, ఈ చివరి రోజులలో కొందరు మనుషులు యేసును గురించిన నిజమైన సందేశాన్ని విశ్వసించడం నిలిపివేస్తారు. దానికి బదులుగా మనుషులను మోసపుచ్చే దుష్ట ఆత్మల మాటలు, మరియు ఈ దుష్ట ఆత్మలు బోధించే తప్పుడు సంగతులను వారు వింటారు. 2 దుష్ట ఆత్మలు అబద్ధాలు చెప్పడం మరియు మంచిదిగా ఉన్నదానిని చెయ్యడానికి కపటంగా ప్రవర్తించడం మాత్రమే చేస్తున్న మనుష్యుల ద్వారా ఈ సంగతులను బోధిస్తున్నారు. ఈ మనుషులు తప్పుడు సంగతులు బోధిస్తున్నప్పుడు అపరాధ భావాన్ని కూడా కనుపరచరు. 3 వివాహం చేసుకోకుండా మనుషులను వారు నిరోదిస్తారు. వారు కొన్ని రకాలైన ఆహారాలను తినకూడదని వారికి చెపుతారు. అయితే మనం ఆయన నుండి పొందడానికి మరియు వాటి కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం కోసం దేవుడు మన కోసం వాటిని ఆహారపదార్ధంగా సృష్టించాడు. ఆయన యందు విశ్వాసముంచు మనం మరియు సత్యం అని ఎరిగిన మన కోసం ఆయన దానిని సృష్టించాడు.

4 ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. మనం దానిని తినినప్పుడు మనం దాని కోసం దేవునికి కృతజ్ఞత చెల్లించిన యెడల ఎటువంటి ఆహార పదార్ధం అయినా తినడానికి అంగీకరమే. 5 మనం దేవునికి ప్రార్థన చేసి మరియు ఆయన చెప్పిన దానిని {ఆయన సృష్టించిన సమస్తమూ మంచిది అని} విశ్వసించినప్పుడు అప్పుడు మనం తినిన ఆహారం ఆయనకు అంగీకారం. 6 ఈ సంగతులను నీ తోటి విశ్వాసులకు నీవు బోధిస్తూ ఉన్న యెడల, నువ్వు మెస్సీయ యేసును చక్కగా సేవిస్తున్నావు. మనం అందరం విశ్వసిస్తున్న సత్య సందేశానికి నీవు విధేయత చూపిస్తున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా దృఢమైన వ్యక్తివిగా మారతావు. నువ్వు అనుసరిస్తూ ఉన్న ఆ సత్య సందేశం మంచి ఉపదేశం.

7 అయితే అయోగ్యమైన వాటితో, బుద్ధిహీనమైన కథలతో సంబంధం కలిగి ఉండవద్దు, దానికి బదులు దేవుణ్ణి సంతోషపరచే క్రియలు చెయ్యడానికి నీకు నీవే సాధన చేసుకో. 8 "నీ శరీరాన్ని సాధన చెయ్యడం నీకు కొంత వరకే సహాయపడుతుంది, అయితే దేవుణ్ణి సంతోష పరచడానికి కార్యాలను చెయ్యడానికి నేర్చుకోవడం అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తుంది అని జ్ఞాపకం చేసుకో. {ఇది నీ కోసం మంచిది} ఇప్పుడు భూమి మీద నువ్వు జీవించుచున్నప్పుడు మరియు భవిష్యత్తులో దేవునితో నువ్వు నివసిసిస్తున్నప్పుడు. ."

9 ప్రతి ఒక్కరూ ఈ సందేశాన్ని విశ్వసించాలి మరియు సంపూర్ణంగా అంగీకరించాలి. 10 ఈ కారణం కోసం మేము చెయ్యగలిగినంత కష్టించి పని చేస్తున్నాము ఎందుకంటే సజీవుడైన దేవుడు తాను వాగ్దానం చేసిన కార్యాలను చేస్తాడని మనం ధైర్యంగా ఎదురుచూస్తున్నాము. సమస్త మానవులకు ఆయనే రక్షకుడు, అయితే ప్రత్యేకించి విశ్వసించినవారికి ఆయన రక్షకుడు.

11 ఈ సంగతులు గురించి విశ్వాసులకు బోధించు మరియు వారు వాటిని చేసేలా నొక్కి చెప్పు. 12 నువ్వు ముఖ్యమైన వాడవు కాదు అని ఎవరూ చెప్పాడానికి అనుమతించవద్దు ఎందుకంటే నువ్వు యవనస్థుడవు. దానికి బదులు ఏవిధంగా జీవించాలో ఇతర విశ్వాసులకు చూపించు. నువ్వు ఏవిధంగా మాట్లాడుతావో, నువ్వు ఏవిధంగా ప్రవర్తిస్తావో, నువ్వు ఏవిధంగా ఇతరులను ప్రేమిస్తావో, నువ్వు ఏవిధంగా దేవుణ్ణి నమ్ముతావో, మరియు ఏవిధంగా నిన్ను నీవు లైంగికంగా పవిత్రంగా ఉంచుకొంటావో వారికి దీనిని చూపించు. 13 నేను నీ దగ్గరకు వచ్చే వరకు చదవడం {మీరు ఒకరినొకరు కలుసుకొన్నప్పుడు విశ్వాసులకు లేఖనాలను} కొనసాగించేలా నిశ్చయించుకోండి, బోధించండి {విశ్వాసులకు లేఖనాలను}, మరియు {లేఖనాలకు వారు విధేయత చూపించడానికి} బతిమాలండి. 14 నీకున్న కృపావరాన్ని వినియోగించేలా జాగ్రత్తగా చూసుకోండి. సంఘ నాయకులు నీ మీద వారి చేతులు ఉంచినప్పుడు దానిని దేవుడు నీకు ఇచ్చాడు మరియు నీ గురించి దేవుడు వారికి బయలుపరచిన దానిని నీకు చెప్పాడు.

15 ఈ సంగతులు అన్నిటినీ ఆచరణలో ఉంచు {నువ్వు చెయ్యాలని నేను నీకు చెప్పినవి}. వాటి మీద మనసు కేంద్రీకరించు, తద్వారా నీవు ఎంత వరకు అభివృద్ధి చెందుతున్నావో {యేసు అనుచరునిగా} ప్రతి ఒక్కరూ చూస్తారు. 16 నువ్వు ప్రవర్తించు విధానం గురించి మరియు నువ్వు బోధించు సంగతులను గురించి చాలా జాగ్రత్తగా ఉండు. ఈ సంగతులు చెయ్యడం కొనసాగించు, ఎందుకంటే నిన్ను మాత్రమే కాదు అయితే నీ మాటలు విను ప్రజలను కూడా రక్షించడానికి దేవుడు వాటిని వినియోగిస్తాడు.

Chapter 5

1 నీ కంటే వయసులో పెద్దవానిగా ఉన్న వ్యక్తిని కఠినంగా మందలించ వద్దు. దానికి బదులుగా ఆయన నీ తండ్రియై ఉన్నట్టుగా అతనిని హెచ్చరించు. యవన పురుషులు నీ సోదరులై ఉన్నట్టుగా వారిని హెచ్చరించు. 2 నీ కంటే పెద్దదిగా ఉన్న స్త్రీని ఆమె నీ తల్లి అయినట్టుగా హెచ్చరించు. యవన స్త్రీలు వారు నీ సోదరీలు అయినట్లుగా హెచ్చరించు. {. దీనిని అంతటిని నువ్వు చేస్తున్నప్పుడు సంపూర్ణంగా సరియైన విధానంలో {నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి}

3 వితంతువులను గురించి శ్రద్ధ తీసుకొనే వారు నిజంగా ఎవరూ లేనివారిని {సంఘం} శ్రద్ధ తీసుకొనేలా జాగ్రత్త తీసుకో. 4 అయితే ఏ వితంతువుకు పిల్లలు గాని, లేదా మనవలు గాని ఉన్న యెడల, ఈ పిల్లలు లేదా మనవలు మొదట వారి సొంత కుటుంబం యొక్క శ్రద్ధ వారు ఖచ్చితంగా తీసుకోవడం నేర్చుకోవాలి. {ఈ విధానంలో} వారు తమ తల్లిదండ్రులకు {తాతలు} ప్రత్యుపకారం చెల్లించగలరు {వారు యవ్వనంలో ఉన్నప్పుడు వారికోసం వారు చేసిన కార్యాల కోసం,} ఎందుకంటే అది చెయ్యడం దేవుణ్ణి సంతోషపరుస్తుంది. 5 నిజంగా ఒంటరిగా ఉన్న ఒక వితంతువు మరియు ఆమెకు సహాయం చేసేవారు ఎవరూ లేనప్పుడు దేవుడు ఆమెకు సహాయం చేస్తాడని ధైర్యంగా ఎదురుచూడవచ్చు. కాబట్టి ఆమె పట్టు విడువకుండా ప్రార్థిస్తుంది, మరియు ఆమె తనకు సహాయం చేయడానికి మనఃపూర్తిగా దేవుణ్ణి అడుగుతుంది. 6 అయితే తనను తాను సంతోషపరచుకోడానికి మాత్రమే జీవిస్తున్న వితంతువు ఆమె భౌతికంగా ఇంకా సజీవంగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా చనిపోయింది.

7 ఈ సంగతులను కూడా బోధించు తద్వారా విశ్వాసులు చెడుగా ప్రవర్తిస్తున్నారని ఎవరూ చెప్పరు. 8 అయితే ఎవరైనా తన సొంత బంధువులు మరియు ప్రత్యేకించి తన సొంత ఇంటిలో నివసిస్తున్నవారు గురించిన శ్రద్ధ తీసుకొనక పోయిన యెడల మనం విశ్వసించుచున్న దానిని అతడు నిరాకరించాడు. అతడు మెస్సీయలో విశ్వాసముంచని వ్యక్తి కంటే చెడ్డవాడుగా ఉన్నాడు. 9 ఆమె కనీసం 60 సంవత్సరాల వయస్సులో ఉన్న యెడల మాత్రమే ఆ వితంతువును {నిజమైన వితంతువులు}జాబితాకు జత చెయ్యి. ఆమె తన భర్తకు కూడా నమ్మకంగా ఉండాలి. 10 ఆమె మంచి పనులు చేసినదని మనుషులు చెప్పాలి. ఆమె తన పిల్లలను చక్కగా పెంచింది అనీ, ఆమె పరదేశీయులను స్వాగతించింది అనీ, విశ్వాసులకు వినయంతో సేవచేసింది అనీ, కష్టాలను భరిస్తున్న మనుషులకు ఆమె సహాయం చేసింది అనీ, మరియు అన్ని విధాలైన మంచి పనులు చెయ్యడానికి ఆతృత కలిగియుంది అనీ వారు నివేదించాలి,

11 అయితే యవన వితంతువులను {నిజమైన వితంతువుల జాబితాకు} చేర్చవద్దు. వారు బలమైన కోరికలను కలిగియున్నప్పుడు, మెస్సీయకు మాత్రమే భక్తి కలిగియుండడం గురించి వారి మనసులను మార్చుకొంటారు మరియు వారు తిరిగి వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. 12 {వారు దీనిని చేసినప్పుడు} ఆరంభంలో వారు చేసిన నిబంధనను {వితంతువులుగా నిలిచిపోవడానికి} అతిక్రమించడం విషయంలో దోషులుగా మారతారు. 13 దానికి తోడుగా, ఏమీ చెయ్యకుండా ఉండిపోడానికి కూడా వారు అలవాటు పడిపోతారు. వారు ఒక ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్తారు, {మంచిది} చెయ్యకుండా ఉండడం మాత్రమే కాకుండా అయితే మనుషులను గురించి మాట్లాడుతూ మరియు ఇతర మనుషుల వ్యవహారాలలో అనావశ్యంగా జోక్యం చేసుకోనేవారుగా కూడా ఉంటారు. వారు మాట్లాడకూడని వాటిని చెపుతూ ఉంటారు.

14 కాబట్టి {యవన వితంతువులను నిజమైన వితంతువుల జాబితాకు సంఘం జత చెయ్యడానికి బదులు} యవన వితంతువులు వివాహం చేసుకోడానికీ, పిల్లలను కలిగి యుండడానికీ నేను ఎంచుతున్నాను. ఈ స్త్రీలు తమ కుటుంబాలను చక్కగా నిర్వహించాలి. ఆ విధంగా వారు తప్పు చేస్తున్నారని వారిని నిందించడానికి శత్రువుకు {సాతాను} అవకాశం ఇవ్వరు. 15 {నేను ఈ సంగతులను రాస్తున్నాను} ఎందుకంటే ఇంతకుముందే {యవన వితంతువులు} కొందరు {ఇకమీదట మెస్సీయకు విధేయత చూపించకుండా, దానికి బదులుగా} సాతానుకు లోబడుతున్నారు. 16 విశ్వసించే స్త్రీ ఎవరికైనా {తమ బంధువుల మధ్య} వితంతువులు ఉన్న యెడల ఆమె వారికి సహాయం చెయ్యాలి. ఆ విధంగా విశ్వాసుల గుంపు తాను చూడగలిగిన దాని కంటే ఎక్కువ వితంతువులకు సహాయం చెయ్యవలసిన అవసరం లేదు. అప్పుడు విశ్వాసుల గుంపు నిజమైన వితంతువులకు {వారిని గురించిన శ్రద్ధ తీసుకోడానికి కుటుంబ సభ్యులు లేనివారు} సహాయం చెయ్యగలుగుతారు.

17 విశ్వాసులు తమను చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా {లేఖనాలు చెపుతున్నవాటిని} ప్రకటించడం మరియు బోధించడంలో కష్టపడే పెద్దలను గౌరవించాలి మరియు వారికి ప్రతిఫలాన్ని చెల్లించాలి. 18 {ఇది సరియైనదని మనకు తెలుసు} ఎందుకంటే లేఖనాలలో క్రింద ఉన్నదానిని {మోషే రాసినది} మనం చదువుతున్నాము: "ఒక ఎద్దు కళ్ళం నూర్చుతూ ఉండగా, అది ధాన్యాన్ని తినకుండా ఉండేలా నువ్వు దాని మూతికి చిక్కం పెట్టకూడదు." మరియు {ఇది సరియైనదని కూడా మనకు తెలుసు ఎందుకంటే యేసు చెప్పాడు,} "మనుషులు తమ కోసం పని చేసే వారికి ప్రతిఫలం చెల్లించాలి." 19 {కనీసం} ఇద్దరు లేదా ముగ్గురు మనుషులు ఆ సంగతిని గురించి సాక్ష్యం ఇచ్చిన యెడల మాత్రమే ఒక పెద్ద తప్పు చేసాడని ఒకరు మోపిన నిందారోపణలను విను.

20 {ఆరాధించడానికి మీరు కలిసినప్పుడు} పాపం చేసిన వారిని ప్రతి ఒక్కరి యెదుట సరిదిద్దండి, తద్వారా మిగిలిన {మనుషులు} వారు {పాపం చెయ్యడానికి} భయపడతారు. 21 దేవుడు మరియు మెస్సీయ యేసుతో మరియు దేవుడు ఎన్నుకొన్న పరలోకపు సేవకులు నన్ను గమనిస్తూ మరియు నేను చెపుతున్నదానిని వింటూ ఉండగా, నేను ఇప్పుడు నీకు ఇచ్చిన హెచ్చరికలకు విధేయత చూపించడానికి రూఢిగా చెప్పుచున్నాను. ప్రతీ అంశాన్ని న్యాయంగా తీర్పు తీర్చండి మరియు ఒకరిని మించి మరొకరికి దయ చూపకండి.

22 ఒకరిని నియమించడానికి త్వరపడవద్దు {విశ్వాసుల గుంపులో ఒక నాయకుడి వలే}. అతడు పాపం చేసిన యెడల అది నీవు కూడా పాపం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి అది చేయవద్దు. నువ్వు పాపం చెయ్యడం విసర్జించాలి. 23 నీళ్ళు మాత్రమే త్రాగడం నిలిపివెయ్యి, {తిమోతి.} దానికి బదులుగా తరచుగా కలిగే నీ కడుపు వ్యాధి విషయంలో సహాయం చెయ్యడానికి కొద్దిగా మద్యాన్ని కూడా తాగు.

24 కొందరు మనుషులు పాపం చేసినప్పుడు దానిని గురించి ప్రతీ ఒక్కరికి తెలుసు మరియు {దేవుడు} వారిని {దాని కోసం} తీర్పు తీరుస్తాడని తెలుసు. అయితే ఇతర ప్రజలు పాపం చేసినప్పుడు ఆ తరువాతి కాలం వరకూ ఎవరికీ దానిని గురించి తెలియదు. 25 అదే విధంగా మనుషులు చేసే {అనేకమైన} మంచి కార్యాల గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే మనుషులు మంచి కార్యాలు రహస్యంగా చేసినప్పుడు సహితం ప్రతి ఒక్కరూ వాటిని గురించి తరువాత కనుగొంటారు.

Chapter 6

1 బానిసలుగా ఉన్నవారు అందరు {విశ్వాసులు}అన్ని విధాలుగా తమ యజమానులను గౌరవించాలి. అప్పుడు మనుషులు దేవుని గురించి లేదా మనం బోధించే వాటిని గురించి చెడుగా మాట్లాడారు {కారణం ఉండదు}. 2 అంతే కాకుండా మెస్సీయలో విశ్వాసం ఉంచిన యజమానులను కలిగియున్న బానిసలు ఆ యజమానులను అగౌరవపరచకూడదు, ఎందుకంటే వారు తోటి విశ్వాసులు. దానికి బదులుగా వారు తమ యజమానులకు మరింత సేవ చెయ్యాలి ఎందుకంటే వారి మంచి పని నుండి ప్రయోజనం పొందు వారు మెస్సీయలో తోటి విశ్వాసులు మరియు దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. ఈ సంగతులు {మన ప్రజలు వాటిని చెయ్యడానికి} బోధించు మరియు పురికొల్పు.

3 కొందరు మనుషులు సత్యము కాని సంగతులను బోధిస్తున్నారు. మన ప్రభువు మెస్సీయ యేసు గురించిన నమ్మదగిన సందేశాన్ని వారు అంగీకరించరు. మరియు దేవుణ్ణి సంతోషపరచే విధానంలో జీవించడం గురించిన బోధను వారు అంగీకరించరు. 4 ఈ మనుషులు గర్విష్టులు. అయితే వారు దేనినీ అర్థం చేసుకోరు. దానికి బదులుగా అప్రధానమైన సంగతులు గురించి మరియు కొన్ని పదాలను గురించి వాదించడానికి వారు అసాధారణంగా కోరుకుంటారు, వారి ప్రవర్తన ఇతర మనుషుల విషయంలో అసూయ పడడడానికి కారణం అవుతుంది. వారు ఒకరితో ఒకరు పోట్లాడుతారు. ఇతరులను గురించి చెడ్డ సంగతులు పలుకుతారు, మరియు ఇతరులకు దుష్ట ఉద్దేశాలు ఉన్నాయని అనుమానిస్తారు. 5 వారు నిరంతరం ఇతర మనుషులతో పోట్లాడుతూ ఉంటారు. వారి సంపూర్ణ ఆలోచనా విధానం పూర్తిగా చెడ్డగా మారింది. వారు సత్య బోధను నిరాకరించారు. దాని ఫలితంగా దైవిక మార్గంలో జీవించడం యొక్క ఉద్దేశం భౌతిక వస్తువులను సంపాదించడం అని వారు భావిస్తారు.

6 అయితే మనం దైవిక మార్గంలో జీవించినప్పుడు మరియు మనం కలిగియున్నవాటితో సంతృప్తి కలిగి యున్నప్పుడు మనం గొప్ప లాభాన్ని సంపాదిస్తాము . 7 ఇది సత్యం ఎందుకంటే మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు {మనం పుట్టినప్పుడు}, మరియు దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము {మనం చనిపోయినప్పుడు}. 8 కాబట్టి మనం ఆహారం మరియు వస్త్రాలు కలిగియున్న యెడల, మనం ఆ వస్తువులతో సంతృప్తి చెంది ఉండాలి. 9 అయితే కొందరు మనుషులు ధనవంతులుగా ఉండాలని బలంగా ఆశిస్తారు. దాని ఫలితంగా డబ్బు సంపాదించడానికి వారు చెడ్డ కార్యాలు చేస్తారు. తరువాత వారికి చెడ్డ కార్యాలు జరుగుతాయి, మరియు వాటి నుండి వారు తప్పించుకోలేరు. వారికి హాని కలిగించే అనేక సంగతులను వారు బుద్ధిహీనంగా ఆశిస్తారు మరియు, చివరిలో ఈ సంగతులు వారిని నాశనం చేస్తాయి. 10 నీవు చూడు, మనుషులు చాలా డబ్బు కలిగి యుండాలని వారు బలంగా ఆశించేటప్పుడు అనేకమైన చెడ్డ కార్యాలను చేస్తారు. కొందరు మనుషులు డబ్బును ఆశించడం ఆరంభించారు మరియు యేసును అనుసరించడానికి ఆశించడం నిలిపి వేశారు. దీనిని చెయ్యడం చేత, వారు అనేక విధాలలో తమ్మును తాము దుఃఖపూరితంగా చేసుకొన్నారు.

11 అయితే దేవుణ్ణి సేవిస్తున్నవానిగా నువ్వు ఈ {దుష్ట} కార్యాలను విడిచిపెట్టాలి. దానికి బదులు సరియైన దానిని నువ్వు చెయ్యాలని నిర్ణయించుకో మరియు దేవుణ్ణి సంతోషపరచడానికి జీవించాలి. దేవుణ్ణి విశ్వసించు, మరియు {ఇతరులను} ప్రేమించు. సహించు {నీకు సంభవిస్తున్న కష్టమైన కార్యాలను}. ఎల్లప్పుడూ {మనుషులతో} మృదువుగా ఉండు. 12 నీవు విశ్వసించిన దాని ప్రకారం జీవించడానికి మనఃపూర్వకంగా ప్రయత్నించు, చెయ్యడానికి ఇది మంచి కార్యం అని తెలుసుకో. నీవు మెస్సీయకు చెంది యున్నావని అనేక సాక్షుల యెదుట నువ్వు బహిరంగంగా చెప్పినప్పుడు నీవు కలిగియుండడానికి దేవుడు నీ కోసం ఎంపిక చేసిన నిత్యజీవపు వరాన్ని నీవు కలిగియుండేలా చూసుకో 13 దేవుడు {మనం ఆయన సన్నిధిలో ఉన్నాము} సమస్తానికి జీవాన్ని ఇస్తున్నాడు. మెస్సీయ యేసు {మనం ఆయన సన్నిధిలో ఉన్నాము} పొంతి పిలాతు ముందు విచారణలో ఉన్నప్పుడు ఆయన సత్యము అయిన దానిని ధైర్యంగా ప్రకటించాడు. వారి సన్నిధిలో, నేను నీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. 14 మెస్సీయ మనకు ఆజ్ఞాపించిన దానిని విధేయత చూపించు. తప్పు అయిన దానికి చెయ్యవద్దు. ఆ విధంగా ఎవరూ నిన్ను విమర్శించలేరు. మన ప్రభువు మెస్సీయ యేసు తిరిగి వచ్చు వరకు విధేయత చూపించడానికి కొనసాగు.

15 సంపూర్ణమైన సమయంలో దేవుడు, యేసు వెనుకకు తిరిగి వచ్చేలా చేస్తాడు. మనం దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఆయన మాత్రమే పరిపాలకుడు! ఆయన ఇతర రాజులు అందరికి పైన రాజు మరియు ఇతర పాలకులు అందరి మీద ప్రభువు! 16 దేవుడు ఒక్కడే ఎన్నటికీ చనిపోనివాడు. ఆయన {పరలోకంలో} ఏ ఒక్కరూ సమీపింప శక్యము గాని చాలా ప్రకాశవంతమైన వెలుగులో నివసిస్తున్నాడు! ఆయనను ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు మరియు ఆయనను ఏ మనిషీ చూడలేడు! మనుష్యులు అందరు ఆయనను ఘనపరచాలని మరియు ఆయన శాశ్వతం శక్తివంతంగా రాజ్యపాలన చెయ్యాలి అని నా కోరిక ఆ విధంగా జరుగును గాక! 17 ఈ ప్రస్తుత లోకంలో ఇక్కడ ధనవంతులుగా ఉన్న విశ్వాసులు గర్విష్టులుగా ఉండకూడదని చెప్పు. వారు తమ అనేకమైన ఆస్తులలో నమ్మకం ఉంచకూడదు ఎందుకంటే వారు వాటిని ఎంత కాలం కలిగియుంటారో వారు ఖచ్చితంగా ఉండలేరు. దానికి బదులు దేవునిలో నమ్మకం ఉంచాలని వారికి చెప్పు. మనం కలిగియున్నవాటిని అన్నిటినీ ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చువాడు, మరియు మనం దానిని అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. 18 ధనవంతులైన ఈ విశ్వాసులు మంచి కార్యాలు చెయ్యాలని చెప్పు. వారు అనేకమైన మంచి కార్యాలు చెయ్యడానికి కోరుకోవాలని వీరికి చెప్పు {అధికమైన డబ్బును వారు సంపాదించడానికి బదులుగా}. వారు ఔదార్యము గలవారుగా ఉండాలి {వారి సంపదలతో} మరియు పంచుకోడానికి ఇష్టపూర్వకంగా ఉండాలి {వారు కలిగియున్న దానిని ఇతరులతో}. 19 {వారు దానిని చేసిన యెడల,} ఇది వారు {పరలోకంలో} వారి భవిష్యత్తు జీవితం కోసం అనేక మంచి సంగతులను తమ కోసం నిలువ చేసుకొన్నవారి వలే ఉంటుంది. {ఆ మంచి కార్యాలు అన్నిటినీ చెయ్యడం} దేవుడు వారికి ఇవ్వడానికి కోరుకొంటున్న జీవితం కోసం వారిని చక్కగా సిద్ధపరుస్తుంది. అదే నిజమైన జీవితం.

20 తిమోతీ, ప్రభువు నీకు అనుగ్రహించిన సత్య సందేశాన్ని కాపాడు. దేవునికి ముఖ్యం కాని సంగతులను గురించి మాట్లాడాలని కోరుకొనే మనుషులను తప్పించు. వారు నిజమైన జ్ఞానం కలిగియున్నామని తప్పుగా చెప్పుకొనే మనుషులను అయితే మనం బోధించు నిజమైన సంగతులను వ్యతిరేకించు వారిని కూడా తప్పించు 21 కొందరు మనుషులు ఈ సంగతులను విశ్వసించారు మరియు దేవుని గురించిన సత్యాన్ని విశ్వసించడం నిలిపివేసారు. దేవుని దయ మీ అందరికి ఉంటుంది గాక.