తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

ఫిలేమోనుకు రాసిన పత్రిక

Chapter 1

1 పౌలు అను {నేను} ప్రస్తుతం మెస్సీయ యేసును సేవించడం కోసం చెరసాలలో ఉన్నాను, ఇక్కడ నేను మన సహా విశ్వాసి తిమోతితో ఉన్నాను. ఫిలేమోనూ, {నీకు} {నేను ఈ పత్రికను రాయుచున్నాను}. నువ్వు కూడా మెస్సీయను సేవించుచున్నవాడవు మరియు మేము నిన్ను ప్రేమించుచున్నాము. 2 మన సహా విశ్వాసి అప్ఫియకు మరియు మనతో {అతడు మెస్సీయకు సేవ చేసే విధానంలో} ఒక సైనికుని {వలె} ఉన్న అర్ఖిప్పుకు, మీ ఇంటిలో కలుస్తూ ఉన్న విశ్వాసుల గుంపు {కూడా నేను వ్రాస్తున్నాను}. 3 మన తండ్రి దేవుడు మరియు మన ప్రభువు మెస్సీయ యేసు మీ అందరికి దయ కలిగి యుండడం కొనసాగించాలి మరియు మిమ్ములను సమాధానపూరితులుగా చెయ్యాలి {అని నేను ప్రార్థిస్తున్నాను.) 4 నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కోసం (ఫిలోమోను) నేను ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుచున్నాను. 5 ఎందుకంటే ప్రభువు యేసు నందు నీవు ఎంతగా విశ్వాసముంచావో మరియు ఆయననూ మరియు దేవుని యొక్క పిల్లలు అందరినీ నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో (మనుష్యులు నాకు చెప్పారు). 6 మేము ఆయనలో విశ్వాసం ఉంచిన విధముగా, మీరు మెస్సీయలో విశ్వాసముంచిన యుండగా, ఆయనను సేవించడం కోసం మెస్సీయ మనకు అనుగ్రహించిన మంచి సంగతులు అన్నిటిని మీరు మరింతగా అర్థం చేసుకుంటారు అని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. 7 నా ప్రియ స్నేహితుడా, నువ్వు నన్ను గొప్పగా ప్రోత్సహించావు మరియు నీవు నన్ను ఎంతో ఆనందించేలా చేసావు. ఎందుకంటే నువ్వు వారిని అధికంగా ప్రేమించడం చేత దేవుని మనుష్యులను ప్రోత్సహిస్తూ ఉన్నావు. 8 కాబట్టి {ఎందుకంటే నువ్వు దేవుని మనుష్యులను ప్రేమించుచున్నావు} మరియు మెస్సీయ యొక్క {నేను ఒక అపొస్తలుడిని}, మీరు చెయ్యవలసిన దానిని మీరు చ్య్యడానికి ఆజ్ఞాపించడానికి మెస్సీయ నన్ను అనుమతిస్తాడు అని నేను సంపూర్ణంగా ధైర్యంగలవానిగా ఉన్నాను. 9 అయితే {ఆజ్ఞాపించడానికి బదులుగా,} {ఎందుకంటే మనం ఒకరినొకరం ప్రేమించుకొంటున్నాము,} నేను, పౌలును, వృద్ధుడైన మనిషిని, మరియు ఇప్పుడు కూడా ఒక ఖైదీని, ఎందుకంటే నేను మెస్సీయ యేసును సేవించుచున్నాను. {నువ్వు దీనిని చెయ్యాలి అని} ఒకే ఒక మనవి. 10 ఒనేసిము కోసం ఏదైనా చెయ్యాలని నేను నిన్ను అడుగుతున్నాను. అతడు {ఇక్కడ మెస్సీయ గురించి అతనికి నేను చెప్పినదగ్గర నుండి} చెరసాలలో నాకు ఒక కుమారుని వలే మారాడు. 11 గతంలో అతడు నీకు నిష్‌ప్రయోజనమైనవాడుగా ఉన్నాడు, అయితే ఇప్పుడు నీకూ మరియు నాకూ ఇద్దరికీ ప్రయోజనకారిగా ఉన్నాడు. 12 అతడు నాకు చాలా ప్రియమైనవాడుగా ఉన్నప్పటికీ, నేను అతనిని నీ వద్దకు తిరిగి పంపుతున్నాను. 13 నీ స్థానంలో అతడు నాకు సేవ చెయ్యడం కోసం ప్రత్యేకంగా {మెస్సీయ గురించి} శుభ వార్తను ప్రకటించడం కోసం ఇప్పుడు ఇంకా నేను చెరసాలలో ఉన్నప్పుడు, అతనిని ఇక్క నాతో ఉంచుకోవాలని నేను కోరుతున్నాను. 14 అయితే, {అతనిని నీ వద్దకు తిరిగి నేను పంపుతున్నాను} ఎందుకంటే అతనిని ఇక్కడ ఉంచడానికి నీవు నాకు చెప్పలేదు. నువ్వు నాకు సహాయం చెయ్యాలని నేను కోరుచున్నాను {ఎందుకంటే నువ్వు నాకు సహాయం చెయ్యడానికి కోరుతున్నావు,} మరియు నువ్వు నాకు సహాయం చెయ్యడానికి నేను బలవంతం చేసిన కారణంగా కాదు. 15 {నీ నుండి} దూరంగా ఉండడానికి ఈ కొద్దికాలం పాటు {దేవుడు ఒనేసిమును అనుమతించాడు అని} ఇది ఉండవచ్చు తద్వారా అతడు నీ వద్దకు {ఒక విశ్వాసి వలే} తిరిగి వస్తాడు మరియు నీతో శాశ్వతంగా ఉంటాడు. 16 దీనికి కారణం {ఒనేసిము} ఇక మీదట కేవలం ఒక బానిసగా ఉండడు, అయితే అతడు ఒక బానిస కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అతనిని ఒక సహా విశ్వాసి వలే ప్రేమించగలవు! అతడు నాకు చాలా ప్రియమైనవాడు, అయితే అతడు ఖచ్చితంగా నీకు మరింత ప్రియమైనవాడుగా ఉన్నాడు. దీనికి కారణం ఇప్పుడు అతడు నీకు {ఒక బానిస వలే} చెందియుండడం మాత్రమే కాదు, అయితే అతడు ప్రభువుకు కూడా చెందియున్నాడు. 17 కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన ఈ పనిని చేయడంలో నీ పాలివాడు, పౌలు, నన్ను నీవు స్వీకరించిన అదే విధముగా నీ ఇంటిలోనికి అతనిని స్వీకరించు. 18 అయితే అతడు నీ నుండి ఏదైనా తీసుకున్న యెడల లేదా అతడు నీకు ఏదైనా రుణం కలిగియున్న యెడల, నేను నీకు తిరిగి చేల్లిస్తాను. 19 నేను – పౌలును – ఇప్పుడు నా సొంత చేరాతలో దీనిని రాస్తున్నాను: అతడు నీకు రుణం కలిగి ఉన్నది ఏదైనా నేను నీకు తిరిగి చేల్లిస్తాను. {ఒనేసిము నీకు రుణపడి యున్న దానికంటే} నువ్వు నాకు అంతకంటే మరింత ఎక్కువ రుణపడి ఉన్నావు అని నేను నీకు జ్ఞాపకం చెయ్యనవసరం అని నేను నిశ్చయంగా ఉన్నాను, {ఎందుకంటే } {నేను నీకు మెస్సీయ గురించి నీకు చెప్పినప్పుడు}నీ జీవితాన్ని {దేవుడు రక్షించాడు}. 20 అవును, నా సహా విశ్వాసి, {నేను చెపుతున్నాను అని నువ్వు అనుకున్న దానినే నేను నీకు చెపుతున్నాను}, ఎందుకంటే ప్రభువు {నీ కోసం చేసిన} దానిని బట్టి {నువ్వు నా కోసం దీనిని చెయ్యడానికి} నేను కోరుతున్నాను. మనం ఇద్దరం మెస్సీయకు కలిసియున్నాము అని సంతోషంగా ఉండడానికి నాకు మరొక కారణం ఇవ్వు. 21 నేను నీకు {ఈ ఉత్తరం} రాస్తూ ఉండగా, నువ్వు చేయడానికి నేను అడుగుతున్న దానిని నువ్వు చేస్తావు అని నేను నిశ్చయంగా ఉన్నాను. వాస్తవానికి, నువ్వు చెయ్యడానికి నేను అడుగుతున్న దాని కంట మరింత ఎక్కువ నువ్వు చేస్తావు అని నేను యెరుగుదును. 22 {నువ్వు చెయ్యడానికి నేను నిన్ను అడిగిన దానిని నువ్వు చేసి}, నీ ఇంటిలోనికి నన్ను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే మీరు అందరు నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, {చెరసాల విడిచిపెట్టడానికి} మరియు మీ అందరి వద్దకు రావడానికి {దేవుడు నన్ను అనుమతిస్తాడు} అని నేను ధైర్యంగా ఎదురు చూస్తున్నాను. 23 23 మెస్సీయ యేసును {సేవించడం కోసం} చెరసాలలో నాతో శ్రమపొండుతున్న వాడు ఎపఫ్రా నీకు అతని శుభములు చెప్పుచున్నాడు. 24 ఇక్కడ నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, మరియు లూకా {కూడా నీకు శుభములు చెప్పుచున్నారు.} 25 మన మెస్సీయ ప్రభువు యేసు నీకు దయతో ఉండడం కొనసాగిస్తాదు అని {నేను ప్రార్థన చేస్తున్నాను}. ఆమేన్.