తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 {నేను,} పౌలు, {ఈ పత్రిక వ్రాస్తున్నాను.} సీల మరియు తిమోతి {నాతో ఉన్నారు.} థెస్సలొనీకయ యొక్క నగరంలో {మన} తండ్రి దేవుడు మరియు మన ప్రభువు మెస్సీయ యేసుకు చెందిన విశ్వాసుల యొక్క గుంపు, {మీకు} {మేము ఈ పత్రిక పంపించుచున్నాము. 2 మన తండ్రి దేవుడు, మరియు మన ప్రభువు యేసు మెస్సీయ మీకు దయ {కలిగి ఉండుటకు} మరియు {మిమ్మును} సమాధానముగా చేయడం కొనసాగించును {గాక}. 3 మా తోటి విశ్వాసులారా, మేము చాలా తరచుగా మీ కోసం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి {, మరియు మేము ఖచ్చితంగా చేస్తాము}! మనము దీనిని చేయడం ఇది చాలా సముచితంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ప్రభువు యేసులో అధికంగా మరియు అధికంగా నమ్మకం ఉంచుతున్నారు, మరియు ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరూ ఇతరులలో ప్రతి ఒక్కరినీ అధికముగా మరియు అధికముగా ప్రేమించుచున్నారు. 4 ఫలితంగా, దేవునికి చెందిన విశ్వాసుల యొక్క ఇతర గుంపులతో మీ గురించి మేము గర్వంగా మాట్లాడుచూ ఉన్నాము. మీరు ఏవిధంగా {శ్రమను} ఓపికగా సహించుచున్నారో మరియు ఇతర మనుష్యులు నిత్యమూ మిమ్మును శ్రమ పడేలా చేసినప్పటికీ, ప్రభువు యేసులో మీరు ఏ విధంగా నమ్మడం కొనసాగించుచున్నారో మేము వారికి చెపుతాము. 5 {మనుష్యులు మిమ్మును శ్రమ పడేలా చేసినప్పుడు మీరు యేసుకు నమ్మకంగా నిలవడానికి దేవుడు మిమ్మును సమర్ధులుగా చేసాడు అని మేము స్పష్టంగా చూసాము.} దాని నుండి దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు అని మాకు తెలుసు, ఎందుకంటే శాశ్వతంగా ఆయన మనుష్యుల యొక్క భాగంగా యోగ్యులుగా ఉండడానికి ఆయన మిమ్మును పరిగణిస్తున్నాడు అని దీని అర్థం. దాని కోసం మీరు శ్రమపడుచున్నారు. 6 దేవుడు న్యాయంగా తీర్పు తీర్చు చున్నాడు కాబట్టి మీరు శ్రమ పడేలా చేసే ఆ మనుష్యుల కోసం శ్రమ కలిగించేలా కూడా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. 7 మిమ్మల్ని బాధించే మనుష్యులు దానిని చెయ్యడం నిలిపి వెయ్యడానికి కూడా ఆయన చేస్తాడు. మన కోసం కూడా ఆయన దానిని చేస్తాడు. మన ప్రభువు యేసు తన శక్తివంతమైన దేవదూతలతో పరలోకం నుండి ఆయన తిరిగి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ తనను తాను కనుపరచుకొన్నప్పుడు ఇది జరుగుతుంది. 8 అప్పుడు దేవుణ్ణి తృణీకరించిన ఆ మనుష్యులు, మన ప్రభువు యేసు గురించిన శుభ వార్తను అంగీకరించడానికి నిరాకరించిన వారిని అయన మండుచున్న అగ్నితో శిక్షిస్తాడు 9 ఈ మనుష్యులు {దేవుణ్ణి నిరాకరించడం యొక్క} ప్రత్యక్ష ఫలితాన్ని అనుభవిస్తారు. వారు ప్రభువు {యేసు} నుండి శాశ్వతం దూరంగా ఉంటారు, అక్కడ ఆయన ఎంత అద్భుతంగా శక్తిమంతుడో వారికి ఎప్పటికీ తెలియదు, మరియు అక్కడ వారు ఎల్లప్పుడూ చనిపోతూ ఉంటారు. 10 దేవుడు నిర్ణయించిన సమయానికి ప్రభువు యేసు పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు {ఇది జరుగుతుంది}. దాని ఫలితంగా, ఆయన మనుష్యులమైన మనం అందరం ఆయనను స్తుతిస్తాము మరియు అతనిని చూసి ఆశ్చర్యపోతాము. {మీరు కూడా అక్కడే ఉంటారు,} ఎందుకంటే మేము యేసు గురించి సత్యము అని మేము యెరిగిన సంగతులు మేము మీకు చెప్పినప్పుడు మీరు మమ్ములను విశ్వసించారు. 11 {మిమ్మును ఆత్మీయంగా బలపరచడానికి} మేము తరుచుగా దేవుణ్ణి ప్రార్థిస్తుంటాము తద్వారా మీరు యేసును ఈ విధంగా స్తుతిస్తారు. మేము ఆరాధించే దేవుడు తాను ఆహ్వానించిన నూతన మనుష్యులుగా ఉండడానికి మిమ్మల్ని యోగ్యులుగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. చెయ్యడానికి దేవుడు మిమ్మును ప్రేరేపించిన కారణంగా మీరు చేయడానికి మీరు కోరుకుంటున్న ప్రతి మంచి కార్యమును నెరవేర్చడానికి ఆయన మీకు శక్తిని ఇవ్వాలి అని మేము ప్రార్థిస్తున్నాము. 12 మేము దీనిని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే మీరు మన ప్రభువు యేసును స్తుతించడానికి మరియు ఆయన మిమ్మల్ని గౌరవించాలని మేము కోరుకుంటున్నాము. ఇది జరుగుతుంది ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు మరియు మన ప్రభువు యేసు మెస్సీయ మీకు అత్యధికమైన దయ చూపుతున్నారు.

Chapter 2

1 మన ప్రభువు యేసు మెస్సీయ తిరిగి వచ్చి మరియు మనలను తన దగ్గరకు చేర్చుకునే సమయం గురించి ఇప్పుడు {నేను మీకు వ్రాయడానికి కోరుచున్నాను}. నా తోటి విశ్వాసులారా నేను మిమ్మును బతిమాలుచున్నాను, 2 ప్రభువు యేసు ఇప్పటికే భూమికి తిరిగి వచ్చాడని చెప్పే ఏదైనా సందేశం గురించి ప్రశాంతంగా ఆలోచించడానికి. ఈ విధమైన సందేశం మిమ్మల్ని కలవరపెట్టనివ్వ వద్దు. సందేశం ఆత్మ నుండి వచ్చిన యెడల లేదా అది ఒక వ్యక్తి నుండి వచ్చిన యెడల లేదా నేను వ్రాసాను అని ఒకరు చెప్పుకొన్నట్టు ఒక పత్రికలో ఉన్న యెడల అది ముఖ్యభాగం కాదు. 3 అటువంటి సందేశాన్ని విశ్వసించడానికి మిమ్మును ఒప్పించడానికి ఎవరినీ అనుమతించవద్దు. ఇది సత్యము కాదు, ఎందుకంటే {ఇంకా జరగని}ఇతర సంగతులు {ప్రభువు తిరిగి రావడానికి} ముందు జరగాలి. ప్రభువు తిరిగి రావడానికి ముందే, పెద్ద సంఖ్యలో మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. దేవుడు చెప్పిన ప్రతిదానిని వ్యతిరేకించే ఒక నిర్దిష్ట వ్యక్తిని వారు అంగీకరిస్తారు మరియు విధేయత చూపిస్తారు. (కొంతకాలం తరువాత, దేవుడు అతనిని నాశనం చేస్తాడు.) 4 మనుష్యులు దేవుడిగా పరిగణించే ప్రతీదీ మరియు మనుష్యులు ఆరాధించే ప్రతిదాని కంటే అతడు గొప్పవాడు అని ఈ మనిషి చెపుతాడు. అతడు రెండింటినీ వ్యతిరేకిస్తాడు. దాని ఫలితంగా, అతడు తానే దేవుడను అని ప్రకటించుకోవడానికి దేవుని ఆలయంలో {దేవుని స్థానంలో} కూడా కూర్చుంటాడు! 5 నేను {అక్కడ థెస్సలొనీకలో} మీతో ఇంకా ఉన్నప్పుడు ఈ సంగతులు అన్నిటి గురించి మీకు చెప్పాను అని మీకు జ్ఞాపకం ఉంది అని నేను నిశ్చయంగా ఉన్నాను.

6 ఇప్పుడు ఈ మనిషి తనను తాను ప్రతి ఒక్కరికీ కనుపరచుకోవడం నుండి అడ్డుకుంటున్నది కూడా మీకు తెలుసు. దేవుడు తనకు నిర్ణయించిన సమయం వరకు అతడు తనను తాను కనుపరచుకోలేడు. 7 స్పష్టంగా, విశ్వాసులు మాత్రమే అర్థం చేసుకోగల కారణాల కోసం దేవుడు చెప్పినదానిని మనుష్యులు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారు. అయితే ఒకరు ఇప్పుడు ఈ మనిషి {తనను తాను బయలుపరచుకోవడం నుండి} అడ్డుకుంటున్నారు మరియు ఈ మనిషిని నిరోధించడాన్ని ఆపమని దేవుడు చెప్పేంత వరకు అతడు ఈ మనిషిని అడ్డుకోవడం కొనసాగిస్తూ ఉంటాడు. 8 దేవుని హెచ్చరికలను పూర్తిగా తిరస్కరించే ఈ మనిషి తనను తాను ప్రతి ఒక్కరికి కనుపరచుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు అని ఇది ఉంది. (చివరిలో, యేసు తిరిగి వస్తాడు. ఈ మనిషి యేసును చూసినప్పుడు, ఈ మనిషి పూర్తిగా శక్తిహీనుడు అవుతాడు. అప్పుడు ప్రభువు యేసు ఈ మనిషిని నాశనం చేసే ఆజ్ఞను పలుకుతాడు.)

9 {అయితే యేసు ఈ మనిషిని నాశనం చేసే ముందు, } ఈ మనిషి ద్వారా సాతాను చాలా శక్తివంతంగా పని చేస్తాడు. దేవుడు చేసే అద్భుతాల వలె కనిపించే అన్ని రకాల అతీంద్రియ కార్యాలను చేయడానికి సాతాను ఈ మనిషిని శక్తివంతం చేస్తాడు. 10 ఈ మనిషి చాలా దుష్టుడు మరియు అనేక మంది మనుష్యులను మోసం చేస్తాడు. ఈ మనుష్యులు నశిస్తారు ఎందుకంటే వారు యేసు గురించిన నిజమైన సందేశాన్ని అత్యంత విలువైనదిగా అంగీకరించలేదు, కాబట్టి దేవుడు వారిని రక్షించడు. 11 ఈ మనుష్యులు యేసు గురించిన నిజమైన సందేశాన్ని తిరస్కరించిన కారణంగా, దేవుడు వారిని తప్పుగా ఆలోచించేలా చేస్తాడు, తద్వారా వారు ఈ మనిషి యొక్క అబద్ధాలను నమ్ముతారు. 12 దేవుడు దానిని చేస్తాడు తద్వారా యేసు గురించిన నిజమైన సందేశాన్ని నమ్మడానికి నిరాకరించిన వారు అందరు, బదులుగా చెడ్డ పనులు చేయడానికి ఎన్నుకొనే వారు అందరికీ ఆయన న్యాయంగా శిక్ష విధిస్తాడు. 13 అయితే మన ప్రభువు యేసు ప్రేమిస్తున్న మీరు, మా తోటి విశ్వాసులారా, మీ కోసం మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మేము దీని చెయ్యాలి ఎందుకంటే యేసు గురించిన నిజమైన సందేశాన్ని విశ్వసించే మొదటి మనుష్యుల మధ్య ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకొన్నాడు. దేవుడు తన ఆత్మ యొక్క విధానం చేత తన కోసం ఆయన రక్షించడం మరియు ప్రత్యేకపరచే మొదటి మనుష్యుల మధ్య ఉండడానికి దేవదు మిమ్మును ఎన్నుకున్నాడు. 14 యేసు గురించిన సువార్తను మేము మీకు ప్రకటించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆయనకు చెందియుండడానికి దేవుడు ఆహ్వానించాడు. 15 కాబట్టి, మా సహా విశ్వాసులారా, మెస్సీయలో బలంగా విశ్వసించడం కొనసాగించండి. మేము మీతో మాట్లాడినప్పుడు మరియు మీకు పత్రిక వ్రాసినప్పుడు మేము మీకు అందించిన నిజమైన బోధనలను విశ్వసించడం కొనసాగించండి.

16-17 మన తండ్రి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన పట్ల చాలా దయగలగి ఉన్నాడు. ఆయన మనల్ని శాశ్వతంగా ప్రోత్సహించడం కొనసాగిస్తాడు, మరియు మనం ఆయన నుండి మంచి విషయాలు పొందదానికి ఆశించవచ్చు. ఆయన మరియు మన ప్రభువు యేసు మెస్సీయ స్వయంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మరియు ప్రతి విధమైన మంచి క్రియలు నిత్యమూ చెయ్యడానికి మరియు చెప్పదానికి సమర్దులనుగా చేస్తాడు అని మేము ప్రార్థిస్తున్నాము.

Chapter 3

1 ఇది నేను చెప్పడానికి కోరుకున్న దాని యొక్క చివరి భాగం. మా తోటి విశ్వాసులారా, మీరు చేసిన విధముగా అనేక మంది మనుష్యులు మన ప్రభువు యేసును గురించిన సందేశాన్ని త్వరలో వింటారు మరియు దానిని గౌరవించాలి అని మా కోసం ప్రార్థన చెయ్యండి. 2 దుష్టులైన మనుష్యులు అనేకులు మాకు హాని చెయ్యడం నుండి దేవుడు మమ్మును కాపాడుతాడు అని మా కోసం కూడా ప్రార్థన చెయ్యండి. 3 అయినప్పటికీ, ప్రభువు యేసు మీకు నమ్మదగినవాడుగా ఉన్నాడు! ఆయన మిమ్మును ఆత్మీయంగా బలంగా చేస్తాడు మరియు దుష్టుడు సాతాను నుండి ఆయన మిమ్ములను రక్షిస్తాడు. 4 మీరు మన ప్రభువు యేసుతో కలిసి ఉన్నారు కాబట్టి, మేము మీకు ఆజ్ఞాపించిన దానికి మీరు ఇప్పుడు విధేయులై ఉన్నారు అని, మరియు మేము మీకు {ఈ పత్రికలో} ఆజ్ఞాపిస్తున్నదానికి మీరు విధేయత చూపుతున్నారు అని కూడా మేము నమ్మకంగా ఉన్నాము. 5 దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంతేకాకుండా మెస్సీయ మీకు ఇచ్చే ఓర్పును అనుభవించడానికి మన ప్రభువు యేసు మీకు సహాయం చెయ్యడం కొనసాగించాలి అని మేము ప్రార్థిస్తున్నాము. 6 మా తోటి విశ్వాసులారా, మన ప్రభువు యేసు మెస్సీయ తానే దీనిని చెపుతున్న యెడల, మేము ఇప్పుడు చెప్పుచున్న దానిని అంగీకరించండి: సోమరితనం మరియు పని చేయడానికి నిరాకరించే ప్రతి తోటి విశ్వాసితో సహవసించడం నిలిపివెయ్యడానికి మేము మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ఈ మనుష్యులు యేసు మాకు బోధించిన విధంగా మరియు మేము మీకు బోధించిన విధంగా జీవించడం లేదు. 7 మేము దీనిని మీకు చెపుతున్నాము ఎందుకంటే మేము ప్రవర్తించిన విధముగా మీరూ ప్రవర్తించాలి అని మీమట్టుకు మీకు తెలుసు. మేము మీ మధ్య జీవిస్తున్నప్పుడు పని చేయకుండా అక్కడ ఊరికే కూర్చోలేదు. 8 అంటే, మనం దాని కోసం డబ్బు చెల్లించని యెడల మేము ఒకరి ఆహారం తినలేదు. బదులుగా, మేము {మమ్ములను మేము పోషించుకోవడానికి} సమయం అంతా చాలా కష్టపడ్డాము. మేము దానిని చేసాము తద్వారా {మాకు అవసరమైన వాటి కోసం}మీలో ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటాము. 9 దేవుడు తన మనుష్యుల నుండి మాకు అవసరమైన వాటిని పొందడానికి ఖచ్చితంగా మాకు అధికారం ఇచ్చాడు. అయితే మీ నుండి విషయాలు గట్టిగా కోరడానికి బదులుగా, మేము కష్టపడి పనిచేశాము తద్వారా తన మనుష్యులు ఏవిధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడో మీరు చూడగల్గుతారు, మరియు మీరు అదే విధానంలో జీవిస్తారు. 10 మేము మీతో అక్కడ ఉన్నప్పుడు, తోటి విశ్వాసి ఎవరైనా పని చేయడానికి నిరాకరించిన యెడల, మీరు అతనికి తినడానికి ఆహారం ఇవ్వకూడదు అని మేము మీకు ఆజ్ఞాపించాము అని జ్ఞాపకం ఉంచుకోండి. 11 ఇప్పుడు మేము దీనిని మరల చెపుతున్నాము, ఎందుకంటే మీలో కొందరు సోమరిగా ఉన్నారని మరియు అస్సలు పని చెయ్యడం లేదు అని ఒకరు మాకు చెప్పారు. అది మాత్రమే కాదు మీలో కొందరు ఇతర వ్యక్తులు చేయుచున్నదానికి అడ్డుపడుచున్నారు. 12 ప్రభువు యేసు మెస్సీయ స్వయంగా దీనిని చెపుతున్నాడు అనే విధంగా మేము ఇప్పుడు చెపుతున్న దానిని అంగీకరించండి: పని చేయని ఆ తోటి విశ్వాసులు వారి స్వంత వ్యాపారాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మరియు వారు జీవించడానికి అవసరమైన వాటిని కలిగి ఉండే నిమిత్తం పని చెయ్యడానికి మేము ఆజ్ఞాపిస్తున్నాము మరియు బతిమాలుచున్నాము. 13 కష్టపడి పనిచేస్తున్న తోటి విశ్వాసులారా, మీ మట్టుకు మీరు సరైనది చేయడంలో ఎప్పుడూ అలసిపో వద్దు! 14 ఈ పత్రికలో మేము వ్రాసిన దానికి ఎవరైనా తోటి విశ్వాసి విధేయత చూపించని యెడల, ఆ వ్యక్తిని బహిరంగంగా గుర్తించండి. అప్పుడు {అతడు పని చెయ్యడం లేదు అని} అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సహవాసం చేయవద్దు. 15 అతడు మీ శత్రువు అయినట్టుగా భావించవద్దు; బదులుగా, మీరు మీ ఇతర తోటి విశ్వాసులను హెచ్చరించిన విధముగా అతనిని హెచ్చరించండి. 16 నిజంగా ఎవరినైనా సమాధానపరచగల మన ప్రభువు మాత్రమే మిమ్మును ప్రతీ మార్గంలో మరియు అన్ని పరిస్థితులలో సమాధానంగా చెయ్యాలి అని నేను ప్రార్థిస్తున్నాను.

మన ప్రభువు యేసు మీకు అందరికీ సహాయం చెయ్యడం కొనసాగించాలి అని నేను ప్రార్థిస్తున్నాను. 17 {ఇప్పుడు నేను నా లేఖకుడి నుండి కలం తీసుకున్నాను, మరియు} నేను, పౌలు, నేనే దీనిని వ్రాస్తున్న విధముగా మీకు ఈ శుభములు పంపుతున్నాను. నేను నా పత్రికలు అన్నిటిలో దీనిని చేస్తున్నాను తద్వారా ఈ పత్రిక పంపినది నిజంగా నేనే అని మీరు తెలుసుకొంటారు. నేను ఎప్పుడూ నా పత్రికలను ఇలా ముగిస్తాను. 18 మన ప్రభువు యేసు మెస్సీయ మీ అందరి యెడల దయతో వ్యవహరించడం కొనసాగించాలని నేను ప్రార్థిస్తున్నాను.