తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యోహాను రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 {యోహాను నుండి} పెద్దను {ఆయనకు చెందియుండడానికి) దేవుడు ఎన్నుకొన్న {ప్రజల} సంఘమైన మీకు {నేను ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను}. విశ్వాసులైన మిమ్ములను అందరిని నేను నిజముగా ప్రేమించుచున్నాను. మరియు నేను మాత్రమే మిమ్మును ప్రేమించడం కాదు అయితే నిజమైన సందేశాన్ని {యేసు బోధించిన దానిని} ఎరిగిన వారు మరియు అంగీకరించిన వారు అందరు కూడా మిమ్ములను ప్రేమిస్తున్నారు. 2 {మేము మిమ్మును ప్రేమిస్తున్నాము} ఎందుకంటే మనం అందరం దేవుని సత్య సందేశాన్ని అంగీకరించాము. ఈ సత్య సందేశం మనలో ఒక భాగం అయ్యింది మరియు మనతో శాశ్వతంగా ఉంటుంది. 3 తండ్రి అయిన దేవుడు మరియు తండ్రి కుమారుడు మెస్సీయ అయిన యేసు మన పట్ల దయతోను మరియు కరుణతోను క్రియ జరిగిస్తాడు {కొనసాగిస్తాడు} మరియు మనలను శాంతియుతంగా చేస్తాడు. {వారు దీనిని జరిగిస్తారు, ఎందుకంటే} వారు సత్యవంతులు మరియు వారు {మనలను} ప్రేమిస్తారు}.

4 మీ సంఘం నుండి కొందరు విశ్వాసులు {దేవుడు మనకు బోధించిన} సత్య సందేశం ప్రకారం జీవిస్తున్నారని నేను తెలుసుకున్నాను. అది నన్ను చాలా సంతోషపరచింది. మనం చేయాలని మన తండ్రి ఆజ్ఞాపించినది ఇదే. 5 మరియు ఇప్పుడు, ప్రియమైన సంఘమా, మనం ఒకరినొకరం ప్రేమించాలని {దేవుడు ఆజ్ఞాపించిన దానిని చేయడానికి} నేను మిమ్మును విన్నవించుకొంటున్నాను. {మనం చేయాలని} దేవుడు మనకు ఆజ్ఞాపించిన క్రొత్త విషయంగా నేను మీకు ఇది వ్రాయడం లేదు. దానికి బదులుగా, మనం ఆరంభంలో మెస్సీయను విశ్వసించినప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న ఈ ఆజ్ఞ మనకు తెలుసు. 6 {దేవున్నీ మరియు ఒకరినొకరు} ప్రేమించడం అంటే అర్థం ఇదే. మనం చేయడానికి దేవుడు మనకు ఇచ్చే ఆజ్ఞలకు విధేయత చూపించాలి. {ఒకరినొకరు ప్రేమించుకోవడానికి} దేవుడు మీకు ఆజ్ఞాపిస్తున్నది ఇదే, కనుక మీరు దీనిని చేయాలి. మీరు ఆరంభంలో మెస్సీయను విశ్వసించినప్పటి ప్రకారం మీరు దీనిని విన్నారు.

7 నేను ఈ విషయం చెప్పుచున్నాను ఎందుకంటే ఈ లోకంలో నలుదిక్కులా సంచారము చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మోసపూరిత ప్రజలు మెస్సీయ అయిన యేసు భూమి మీదకు వచ్చాడనీ, మరియు ఆయన ఒక మనిషి అని చెప్పడానికి నిరాకరిస్తారు. ఈ {బోధ) మెస్సీయను వ్యతిరేకించే వాడు అయిన{ఆరంభ} మోసగాడి నుండి వస్తుంది. 8 జాగ్రత్తగా ఉండండి, తద్వారా మీరు {ఆ బోధకులు మిమ్మును మోసపరచ నివ్వకుండా ఉండండి! వారు మిమ్మల్ని మోసం చెయ్యనిచ్చిన యెడల, మీరు} మనం కష్టపడిన ప్రతిఫలాన్ని కోల్పోతాము. కాబట్టి మీరు సంపూర్ణ ప్రతిఫలం పొందేలా చూసుకోడానికి జాగ్రత్తగా ఉండండి!

9 మెస్సీయ బోధించిన సంగతులను విశ్వసించడానికి, మరియు బోధించడానికి కొనసాగడం లేకుండా ఉన్నవారు వారు, అయితే దానికి బదులుగా, ఇతర సంగతులను విశ్వసింఛి మరియు వాటిని బోధించే వారికి దేవునితో {ఒక నిజమైన సంబంధం} లేదు. అయితే మెస్సీయ బోధించిన వాటిని విశ్వసించడానికీ, మరియు వాటిని బోధించడానికి కొనసాగించేవారికి {దేవునితో,}మన తండ్రితోనూ {,} మరియు ఆయన కుమారుడు {యేసుతోనూ,} {ఒక నిజమైన సంబంధం}ఉంది 10 కాబట్టి మెస్సీయ బోధించిన దానికి భిన్నమైనదానిని బోధించు వారు ఎవరైనా మీ వద్దకు వచ్చినప్పుడు, అతనిని మీ గృహాలలోనికి ఆహ్వానించవద్దు! అతనికి శుభములు కూడా చెప్పవద్దు {లేదా అతనికి ఏ విధంగానైనా శుభములు చెప్పవద్దు. తద్వారా మీరు అతనిని ప్రోత్సహించవద్దు. 11 నువ్వు ఈ ప్రజలకు గౌరవప్రదంగా శుభములు చెప్పిన యెడల, వారు చేసే చెడు పనులను చేయడానికి మీరు వారికి సహాయం చేస్తున్నారు.

12 మీకు చెప్పాలని కోరుకున్నవి నాకు అనేకం ఉన్నాయి. అయితే వాటిని మీకు ఒక ఉత్తరంలో రాయడం వద్దు అని నేను నిర్ణయించుకున్నాను. దానికి బదులుగా, త్వరలో మీతో ఉండాలని మరియు మీతో వ్యక్తిగతంగా మాట్లాడడానికి నేను ఆశిస్తున్నాను. అప్పుడు మనం కలిసి సంపూర్ణమైన ఆనందంతో ఉంటాము. 13 ఇక్కడ సంఘంలో నీ తోటి విశ్వాసులు నీకు శుభములు చెప్పుచున్నారు, దేవుడు వారిని కూడా ఎన్నుకొన్నాడు.