తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

కొలస్సయులకు రాసిన పత్రిక

Chapter 1

1 పౌలు అను {నేను,} {ఈ పత్రిక మీకు రాయుచున్నాను,} మరియు మా సహ విశ్వాసి తిమోతి {నాతో ఉన్నాడు}. మెస్సీయ యేసుకు ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు నన్ను పంపాడు, ఎందుకంటే దేవుడు చెయ్యడానికి దానిని ఎంచుకున్నాడు. 2 కొలొస్సీ {యొక్క నగరం} లో {నివసించే వారు} మెస్సీయకు ఐక్యమైన దేవుని మనుష్యులు మరియు నమ్మకమైన సహ విశ్వాసులు అయిన మీకు {నేను ఈ పత్రికను పంపుచున్నాను}. మన తండ్రి దేవుడు మరియు మెస్సీయ ప్రభువు యేసు మీకు దయగా ఉండడం మరియు మిమ్ములను సమాధానంగా చెయ్యడం {కొనసాగించను} గాక. 3 మేము మీ కోసం చాలా తరచుగా ప్రార్థిస్తున్నాము. {మేము చేసినప్పుడు,} మన ప్రభువు మెస్సీయ యేసు తండ్రి దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. 4 {ఎందుకంటే} మీరు మెస్సీయ యేసును విశ్వసిస్తున్నారు అని మరియు మీరు దేవుని మనుష్యులను అందరిని ప్రేమిస్తున్నారని తెలుసుకున్నాము. 5 పరలోకంలో దేవుడు మీ కోసం ఉంచుతూ ఉన్న ప్రతిదాని కోసం మీరు ధైర్యంగా ఎదురుచూస్తున్నారు కాబట్టి {మీరు ఈ సంగతులను చేయుచున్నారు}. మీరు మెస్సీయను గురించిన శుభవార్త, {అది} సత్యమైన సందేశాన్ని విననప్పుడు దేవుడు మీ కోసం కలిగి ఉన్నవాటి అన్నిటిని గురించి మీరు మొదట తెలుసుకున్నారు. 6 మీరు {కొలస్సీలో} ఈ శుభవార్తను విన్నారు మరియు విశ్వసించిన విధముగా, అనేక స్థలములలో అధికమైన సంఖ్యలో మనుష్యుల కూడా వింటున్నారు మరియు దానిని విశ్వసిస్తున్నారు. మీరు మొదట {దాని గురించి} నేర్చుకొన్నారు మరియు నిజముగా దేవుడు {మన పట్ల} ఏవిధంగా క్రియ జరిగిస్తున్నాడో నిజంగా అనుభవించినప్పటి నుండి మీరు భిన్నమైన మార్గంలో జీవిస్తున్న విధముగా, ఈ మనుష్యులు ఇప్పుడు భిన్నమైన మార్గంలో జీవిస్తున్నారు. 7 ఎపఫ్రా {జరుగుతుంది} అని మీతో చెప్పినది ఇదే. అతడు మెస్సీయ కోసం మాతో కలిసి పనిచేస్తాడు మరియు మేము అతనిని ప్రేమిస్తున్నాము. అతడు మన ప్రతినిధిగా మెస్సీయకు నమ్మకంగా సేవ చేస్తున్నాడు. 8 దేవుని ఆత్మ {చెయ్యడానికి మిమ్మును శక్తితో నింపిన} విధముగా మీరు {దేవుని మనుష్యులు అందరిని} ప్రేమిస్తున్నారు అని అతడు మాకు చెప్పాడు. 9 ఎపఫ్రా మాకు చెప్పిన ప్రతిదాని కారణంగా, అతడు మొదటిసారిగా మాకు {మీ గురించి} చెప్పినప్పటి సమయం నుండి, మేము మీ కోసం నిరంతరం ప్రార్థించడంలో అతనితో కలిసాము. {మేము మీ కోసం ప్రార్థించుచున్నప్పుడు,} మీరు చేయాలని ఆయన కోరుకుంటున్న ప్రతీ దానిని మీకు చూపించడానికి మరియు దేవుని యొక్క ఆత్మ {మీకు బోధిస్తూ ఉన్న} ప్రతి దానిని అర్థం చేసుకోవడానికి శక్తివంతులు {మిమ్మును చెయ్యడానికి} మేము దేవుణ్ణి అడుగుతున్నాము. 10 {దేవునికి కావలసిన దానిని మీరు ఎరుగుదురు అని మేము ప్రార్థన చేస్తున్నాము} తద్వారా ప్రభువును ఘనపరచే మరియు అన్ని విధానాలలో ఆయనను సంతోషపెట్టే విధానంలో మీరు జీవించగలరు. {మీరు ఈ విధంగా జీవించినప్పుడు,} మీరు ప్రతి విధమైన మంచి క్రియలను చేస్తూ ఉంటారు మరియు నిరంతరం దేవుణ్ణి బాగా తెలుసుకుంటారు. 11 {మీరు ఈ విధంగా జీవిస్తున్నప్పుడు} అన్ని పరిస్థితులలో ఓర్పుతో సహించడానికి మరియు ఆనందంగా ఆవిధంగా ఉండడానికి శక్తికలిగి ఉండేలా దేవుడు మిమ్ములను గొప్పగా బలపరుస్తాడు. ఆయన మహిమాన్వితమైన శక్తిమంతుడు కాబట్టి దేవుడు మిమ్ములను గొప్పగా బలపరచగలడు. 12 {అప్పుడు మీరు నిరంతరం} తండ్రియైన {మన దేవునికి} కృతజ్ఞతలు తెలుపుతారు, {ఎందుకంటే} ఆయన తన మనుష్యులు వారు తనతో ఉన్నప్పుడు ఇవ్వవలసిన ప్రతిదానిలో పాలుపంచుకోవడానికి మిమ్మల్ని యోగ్యులనుగా చేసాడు. 13 మన తండ్రి దేవుడు మనలను నిర్భందిస్తూ ఉండే దుష్టుని నుండి మనలను విడిపించాడు మరియు ఇప్పుడు మనం తన కుమారునికి లోబడేలా తాను ప్రేమించే తన కుమారునికి ఆయన మనలను అనుగ్రహించాడు. 14 మనం ఆయన కుమారునితో ఐక్యంగా ఉన్నాము కాబట్టి, దేవుడు మనల్ని విడిపించాడు; {అంటే} ఆయన మన పాపములను క్షమించాడు. 15 దేవుణ్ణి ఎవరూ చూడలేనప్పటికీ కూడా, దేవుడు ఎవరో దేవుని కుమారుడు పరిపూర్ణంగా వెల్లడిస్తాడు. దేవుడు దేనినైనా సృష్టించకముందే కుమారుడు ఉనికి కలిగి ఉన్నాడు మరియు దేవుడు సృష్టించిన ప్రతిదాని మీద ఆయన మొదటి స్థానాన్ని కలిగియున్నాడు. 16 ఎందుకంటే తండ్రి మరియు కుమారుడు కలిసి ఉనికి కలిగి ఉన్న ప్రతిదానిని సృష్టించిన కారణంగా {మరేదైనా ఉనికిలో ఉండకముందే కుమారుడు ఉన్నాడని మరియు సమస్తము మీద మొదటి స్థానంలో ఉన్నాడని మీరు తెలుసుకోవచ్చు.} పరలోకంలో సమస్తము మరియు భూమి మీద సమస్తము, మరియు మనం చూడగలిగే ప్రతిదీ మరియు సింహాసనాలు, ఆధిపత్యాలు, అధిపతులు మరియు అధికారులు వంటి {ఆత్మీయ జీవులతో సహా} మనం చూడలేని ప్రతిదీ {దీనిలో ఉన్నాయి.} తండ్రి మరియు కుమారుడు కలిసి ఉనికి కలిగియున్న మస్తమును సృష్టించారు మరియు సమస్తము కుమారుని ఘనపరచుటకు ఉనికి కలిగి ఉంది. 17 సృష్టిలో ఏదైనా ఉనికిలో ఉండకముందే కుమారుడు ఉనికి కలిగి ఉన్నాడు మరియు ఆయన దానిని అంతటిని నిర్వహించుచున్నాడు మరియు సంబంధపరచుచున్నాడు. 18 సంఘానికి సంబంధించి, {అంటే, విశ్వాసులు అందరూ}, మనుష్యుల శిరస్సులు వారి శరీరాలను పరిపాలించిన విధముగా ఆయన దాని మీద పరిపాలిస్తాడు. చనిపోయిన తరువాత {, ఇక ఎన్నడూ తిరిగి చనిపోకుండుటకు} తిరిగి సజీవుడు కావడానికి {ఆయన} మొదటి వ్యక్తి అయినప్పుడు సంఘం ఆరంభంకావడం కోసం ఆయన దానిని సాధ్యపరచాడు. ఎందుకంటే ఈ సంగతుల కారణంగా ఆయన అన్నింటికంటే మరియు ఇతరుల అందరికంటే ఆయన గొప్పవాడు మరియు మరింత ప్రాముఖ్యమైనవాడు. 19 {కుమారుడు సమస్తము మీద పరిపాలన చేస్తున్నాడు} ఎందుకంటే తండ్రి ఆనందంతో ఆయనను ఉండుటకు ఇచ్చయించిన విధముగా కుమారుడు సంపూర్ణంగా దేవుడు. 20 {తండ్రి దేవుడు} కూడా సమస్త విశ్వంలోని ప్రతిదానిని {మరియు తాను సృష్టించిన ప్రతి వ్యక్తిని} తనతో సమాధానపరచుకోవడానికి కుమారుని ద్వారా {ఆనందంతో క్రియ జరిగించడానికి ఎంచుకున్నాడు}. తన కుమారుడు సిలువ మీద మరణించినప్పుడు {దేవుడు} తన కుమారుని ద్వారా {ఇది చేసాడు}, ఇది దేవునికి మరియు ఆయన సృష్టికి మధ్య సమస్తమును సమాధానపరచింది. 21 {మీరు మెస్సీయలో విశ్వసించక} ముందు, మీరు {దేవునికి} సన్నిహితంగా ఉండాలని కోరుకోలేదు మరియు మీరు {ఆయనకు} శత్రుత్వం కలిగి ఉన్నారు, ఎందుకంటే మీరు అనుకున్నది మరియు చేసింది అంతా చెడ్డది. 22 అయితే ఇప్పుడు {అది అంతా మారిపోయింది} {మీరు యేసును విశ్వసిస్తున్నారు!} తండ్రి దేవుడు తన కుమారుడు మానవుడిగా మారాడు మరియు చనిపోయినప్పుడు తన కుమారుని ద్వారా {క్రియ జరిగించడం చేత} తనకు మరియు మీకు మధ్య ఉన్న సంబంధాన్ని బాగుచేశాడు. పాపం నుండి సంపూర్ణంగా విముక్తి పొందిన మనుషుల వలే మీరు ఆయనతో నివసించు నట్లు {తండ్రి దేవుడు సంబంధాన్ని బాగుచేసాడు}. 23 మీరు {మెస్సీయలో} నమ్మకంగా విశ్వసించడానికి మీరు కొనసాగుతూ ఉన్నంత కాలం, మరియు మీరు వినిన మరియు లోకం అంతటా ఉన్న మనుష్యులు వినిన సువార్తలో {దేవుడు వాగ్దానం చేసిన దానిని చెయ్యడం కోసం} ధైర్యంగా నిరీక్షణను విడిచిపెట్టనంత కాలం {మీ విషయంలో ఇది నిజమే.} పౌలు అను నేను ఇదే శుభవార్తను {మనుష్యులకు ప్రకటించడం చేత} దేవునికి పరిచర్య చేస్తున్నాను. 24 ప్రస్తుత సమయంలో నేను సంతోషంగా శ్రమపడుతున్నాను {ఎందుకంటే అది} మీ ప్రయోజనం కోసమే. మెస్సీయ తన స్వంత శరీరం వంటి సంఘం కోసం {తన మనుష్యుల} పక్షంగా మెస్సీయ ఆరంభించిన శ్రమలో {నా భాగాన్ని} సంపూర్ణం చెయ్యడానికి నేను శరీరరీతిగా శ్రమపడుతున్నాను. 25 దేవుడు తన సంఘానికి పరిచర్య చేయడానికి నన్ను పిలిచాడు, మరియు మీకు సంబంధించిన తన ప్రణాళికను అమలు చేయడానికి ఆయన నన్ను {ప్రత్యేకంగా} నియమించాడు. {ఈ ప్రణాళికలో నా భాగం} దేవుని నుండి సంపూర్ణ సందేశాన్ని {యూదులు కాని మీకు} ప్రకటించడం. 26 దేవుడు ఈ సందేశాన్ని ఒక రహస్యంగా ఉంచాడు, చాలా కాలం పాటు మనుష్యుల నుండి దానిని దాచియుంచాడు. అయితే ఇప్పుడు ఆ సందేశాన్ని తన మనుష్యులకు తెలియపరచాడు. 27 దేవుడు తన మనుష్యులకు ఈ రహస్యంగా ఉన్న అధికమైన ఆ మహిమాన్వితమైన సందేశాన్ని చెప్పాలని కోరుతున్నాడు. ఇది యూదులు కానివారికి {అంతే కాకుండా యూదులకు కూడా} అన్వయిస్తుంది. మెస్సీయ మీతో {యూదులు కానివారు} ఐక్యం అయ్యాడు అనేది రహస్యం. అంటే మీరు మెస్సీయ వంటి మహిమాన్వితమైన జీవులుగా మార్పు చెందడానికి మీరు ధైర్యంగా ఎదురు చూడవచ్చు అని అర్థం. 28 {ఆయనే మెస్సీయ} ఆయనను మేము {ప్రతి ఒక్కరికీ} ప్రకటిస్తున్నాము. {మేము ఆయనను గురించి మాట్లాడునప్పుడు, } మేము చెయ్యగలిగినంతగా ప్రతి వ్యక్తిని జ్ఞానయుక్తంగా హెచ్చరిస్తాము మరియు బోధిస్తాము. మెస్సీయతో ప్రతి వ్యక్తి యొక్క ఐక్యతలో ఈ మనుష్యులలో ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా పరిణతి చెందడానికి {మేము ఈ సంగతులను చేయుచున్నాము.} 29 ఆ లక్ష్యాన్ని సాధించడానికి నేను చేసే సమస్త పనిలోనూ కష్టపడి పనిచేస్తున్నాను. {నేను దీనిని చెయ్యగలను} ఎందుకంటే మెస్సీయ దీనిని చెయ్యడానికి నన్ను శక్తివంతంగా బలపరుస్తున్నాడు.

Chapter 2

1 {నేను ఈ విషయాలు వ్రాస్తున్నాను} ఎందుకంటే నేను ఎంత కష్టపడి పనిచేస్తున్నానో మీకు తెలియజేయడానికి కోరుతున్నాను. మీ కోసం, లవొదికయ {యొక్క నగరం} లో నివసించే తోటి విశ్వాసుల కోసం మరియు నన్ను వ్యక్తిగతంగా కలవని తోటి విశ్వాసులందరి కోసం {నేను కష్టపడుతున్నాను}. 2 మీ అందరినీ {నన్ను కలవని వారు} ప్రోత్సహించడానికి {నేను కష్టపడి పని చేస్తున్నాను}, తద్వారా మిమ్మల్ని మీరు ఒకరి కోసం ఒకరు ప్రేమతో ఏకం చేసుకొంటారు. దేవుడు ఇంతకు ముందు దాచి ఉంచిన ఆ రహస్యాన్ని పూర్తిగా మరియు నమ్మకంగా అర్థం చేసుకోవడానికి {నేను కోరుకుంటున్నాను}. {ఈ రహస్యం} మెస్సీయ గురించి. 3 ఈ రహస్యం{, ఇది మెస్సీయ,} దానిలో జ్ఞానయుక్తమైన ఆలోచనతో కూడా విలువైన ప్రతిదీ ఉంది. 4 నేను ఈ రహస్యం గురించి మీతో చెపుతున్నాను తద్వారా ఒప్పింపచేస్తూ వాదించే ఏ వ్యక్తీ సత్యం కాని దానిని విశ్వసించేలా మిమ్ములను ఒప్పించడానికి శక్తిమంతుడిగా ఉండడు. 5 {ఒప్పింప చేస్తూ వాదించే వారు తప్పు అని మీరు తెలుసుకోవచ్చు} ఎందుకంటే నేను వ్యక్తిగతంగా మీతో లేనప్పటికీ, నేను మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాను మరియు మీ గురించి ఆలోచిస్తున్నాను. మీరు సక్రమంగా ప్రవర్తిస్తున్నారని మరియు మీరు మెస్సీయను దృఢంగా విశ్వసిస్తున్నారు అని చూడడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 6 ఇప్పుడు {నేను మీకు శుభవార్త గురించి మరియు నా గురించి సత్యం చెప్పాను అని}, దేవుడు మిమ్ములను మెస్సీయతో ఏవిధంగా ఐక్యం చేసాడో దానికి తగిన విధంగా మీరు ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. మీరు మెస్సీయ యేసు ప్రభువును అంగీకరించినప్పుడు మీరు చేసిన విధముగా మీరు ప్రవర్తించడం కొనసాగించాలి. 7 {ఈ విధానంలో ప్రవర్తించడంలో ఇవి ఉన్నాయి} మొక్క యొక్క వేర్లు దానిని గట్టిగా పట్టుకున్న విధముగా ఆయనకు దృఢంగా ఐక్యంగా ఉండడం, ఒక ఇల్లు దాని పునాది మీద నిలబడిన విధముగా, సంపూర్తిగా ఆయన మీద ఆధారపడి యుండడం {ఇది కూడా ఉంటుంది}. ఎపఫ్రా మీకు బోధించిన విధముగా, మెస్సీయను నమ్మకంగా విశ్వసించడం మరియు ఎక్కువగా మరియు ఎక్కువగా కృతజ్ఞతలు చెప్పడం {కూడా దీనిలో ఉంటుంది.} 8 మెలకువగా ఉండండి తద్వారా మిమ్ములను సత్యం నుండి దూరం చేయడానికి ప్రయత్నించే ఏ ఒక్కరూ విజయం సాధించకుండా ఉంటారు. మిమ్ములను దూరంగా నడిపించడానికి ప్రయత్నించే ఎవరైనా అర్థరహితమైన మరియు మోసపూరితమైన మానవ ఆలోచనను వినియోగిస్తారు. {అలాంటి తప్పుడు సందేశం} పురాతన తరాలు యువ తరాలకు బోధించే దాని నుండి మరియు లోకం గురించి మానవులు సాధారణంగా ఆలోచించే దాని నుండి వస్తుంది, మెస్సీయ నుండి కాదు. 9 {నేను మెస్సీయను ప్రస్తావిస్తున్నాను} ఎందుకంటే ఆయన, ఒక మానవుడు, సంపూర్ణంగా దేవుడు. 10 దీనికి జతగా, దేవుడు మిమ్ములను మెస్సీయతో ఏకం చేసిన కారణంగా మీకు అవసరమైన ప్రతీదానిని మీరు కలిగియున్నారు, ఆయన ప్రతి పాలకుడు మరియు మరియు ప్రతి అధికారాన్ని {ఆత్మీయ జీవులతో సహా} పరిపాలించేవాడు. 11 దేవుడు మిమ్ములను మెస్సీయతో ఐక్యం చేసినప్పుడు, తండ్రి అయిన దేవుడు మీకు సున్నతి చేసిన విధంగా ఉంది. మానవుడు శారీరకంగా మీ మాంసాన్ని కత్తిరించడం అని నా ఉద్దేశ్యం కాదు. {బదులుగా, మాంసాన్ని కత్తిరించే బదులు,} దేవుడు మీ బలహీనమైన మరియు పాపాత్మకమైన భాగాలను తొలగించాడు. మెస్సీయ సాధించిన దాని ద్వారా {దేవుడు} {ఈ విధానంలో మిమ్ములను} సున్నతి చేసాడు. 12 {దేవుడు మీ కోసం చేసిన దానిని అర్థం చేసుకోవడానికి ఇక్కడ మరొక మార్గం ఉంది:} వారు మీకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు, {మెస్సీయ చనిపోయి మరియు} మనుష్యులు ఆయనను సమాధి చేసినప్పుడు {తండ్రి అయిన దేవుడు మిమ్మును చేర్చిన కారణంగా} {మీరు మరణించారు మరియు} మనుష్యులు మిమ్ములను పాతిపెట్టిన విధముగా ఇది ఉంది. మరియు మెస్సీయను తిరిగి సజీవునిగా చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు మిమ్ములను తిరిగి సజీవులనుగా చేసిన విధంగా ఉంది {ఎందుకంటే ఆయన మిమ్ములను చేర్చాడు.} {ఇది జరిగింది} ఎందుకంటే తండ్రి అయిన దేవుడు శక్తివంతంగా పనిచేస్తాడు అని మీరు విశ్వసించారు, ప్రత్యేకించి ఆయన మెస్సీయను తిరిగి సజీవునిగా చేసినప్పుడు. 13 మీరు {తరచుగా} దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందున మరియు మీరు యూదేతరులుగా ఉన్న కారణంగా {మరియు దేవుని ప్రజలలో భాగం కారు} మీరు ఆత్మీయంగా చనిపోయినవారుగా ఉన్నారు. అయితే తండ్రి దేవుడు మిమ్ములను ఆత్మీయంగా తిరిగి సజీవులనుగా చేసాడు {ఎందుకంటే} ఆయన మెస్సీయను తిరిగి సజీవునిగా చేసినప్పుడు ఆయన మిమ్మును కలిపాడు. {దీని అర్థం} మనం ఆయనకు వ్యతిరేకంగా చేసిన తప్పులు అన్నిటి కోసం ఆయన మనలను క్షమించాడు. 14 మనం అచ్చియున్న ఋణముల యొక్క అధికారిక జాబితా {, అవి మన పాపాలు} దేవుడు కలిగి యున్న విధముగా ఉంది. {ఆయన మనలను క్షమించినప్పుడు,} ఆయన మనకు వ్యతిరేకంగా లెక్కించబడిన పాపముల జాబితాను తుడిచి వేసాడు మరియు అది మనకు మరియు ఆయనకు మధ్య రావడం నుండి నిరోధించాడు. {మెస్సీయ సిలువ మీద మరణించినప్పుడు, ఖచ్చితంగా ఉన్న విధముగా} ఆయన ఆ జాబితాను సిలువకు కొట్టివెయ్యడంతో దేవుడు దీనిని సాధించాడు. 15 అంతేకాదు, లోకాన్ని పరిపాలించే ఆత్మీయ జీవులను దేవుడు ఓడించాడు మరియు {ఆయన వారిని ఓడించాడు అని} వారిని ఖైదీలు వలే ఊరేగించిన విధముగా బహిరంగంగా కనుపరచాడు. సిలువ మీద { మెస్సీయ మరణించినప్పుడు దేవుడు దీనిని చేసాడు.} 16 ఈ కార్యముల కారణంగా {దేవుడు మీ కోసం చేసినవి}, మీరు చెయ్యవలసిన దానిని గురించి ఇతర వ్యక్తులు చెపుతున్న దాని విషయంలో చింతించకండి. ఏమి తినాలి మరియు ఏమి త్రాగాలి అనే దాని గురించి {వారికి అభిప్రాయాలు ఉండవచ్చు}. దేవుణ్ణి ఆరాధించడం కోసం రోజులు, అమావాస్య ఉన్నప్పుడు వేడుక చేసుకొనే రోజులు లేదా విశ్రాంతి కోసం రోజులతో సహా ఎటువంటి ప్రత్యేక రోజులు పాటించడానికి {వారికి అభిప్రాయాలు ఉండవచ్చు}. 17 భవిష్యత్తు కోసం తాను ప్రణాళిక చేసిన దానిని అంటే మెస్సీయ రాకడ సూచించడానికి {దేవుడు ఈ సంగతులను వినియోగించాడు.} 18 వినయంగా ఉన్నట్లు నటించడం మరియు దేవదూతలను ఆరాధించడం మరియు తాము చూసిన {అద్భుతమైన} సంగతులను గురించి మాట్లాడడానికి సంతోషపడేవారు {కొంతమంది మనుష్యులను మీరు కలుస్తారు}. వారు గొప్పవారు అన్నట్టు ప్రవర్తిస్తారు-మంచి కారణం లేకుండా ఉన్నప్పటికీ, ఎందుకంటే వారు మానవ విధానాలలో మాత్రమే ఆలోచిస్తారు. దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాటిని తీసివేయడానికి ప్రయత్నిస్తున్న ఈ మనుష్యుల మాట విన వద్దు. 19 {ఈ మనుష్యులు} మెస్సీయకు నమ్మకంగా నిలిచి ఉండరు. మనుష్యుల శిరస్సులు వారి శరీరాలను నడిపించిన విధముగా సంఘాన్ని నడిపించేది ఆయనే. శిరస్సు సర్వ శరీరాన్ని, ప్రతీ మరియు ఒక్కొక్క భాగం, తనకు అవసరమైన వాటిని ఎలా పొందుతుందో మరియు అది ఎలా కలిసి పనిచేస్తుందో నిర్దేశిస్తుంది. ఈ విధంగా శరీరం వృద్ధి చెందుతుంది. ఆ విధంగానే, మెస్సీయ సంఘాన్ని నిర్దేశిస్తాడు, తద్వారా దేవుడు దాని విషయంలో కోరుకున్నట్లుగా అది అభివృద్ధి పొందుచున్నది. 20 మెస్సీయ చనిపోయినప్పుడు, {దేవుడు మిమ్ములను జత చేసాడు కాబట్టి} మీరు మరణించిన విధముగా ఇది ఉంది. ఈ లోకాన్ని పాలించే ఆత్మీయ జీవుల నుండి {ఇది మిమ్మును విడిపిస్తుంది}. కాబట్టి, మీరు {ఈ వ్యక్తులు మీకు ఇచ్చిన} నియమాలకు విధేయత చూపించకూడదు. {అలా చేయడం అంటే} మీరు నిజంగా ఈ లోకంలో భాగమై ఉన్నారు అని అర్థం. 21 {ఈ నియమాలలో ఇలాంటి ఆదేశాలు ఉన్నాయి:} “{కొన్ని సంగతులను} భావించవద్దు!” "{కొన్ని ఆహారాలు} ప్రయత్నించవద్దు!" "{కొన్ని సంగతులను} పట్టుకోవద్దు!" 22 అలాంటి నియమాలు అన్ని మనుష్యులు వాటిని ఉపయోగించినప్పుడు అవి నశించే వాటికి సంబంధించినవి. ఇంకా, మనుష్యులు {, దేవుడు కాదు,} {ఈ నియమాలను} బోధిస్తారు మరియు వారికి అవసరం. 23 ఈ నియమాలను అనుసరించడం తాము కోరుకున్న విధానంలో దేవుణ్ణి ఆరాధించే మనుష్యుల విషయంలో చెయ్యడానికి జ్ఞానయుక్తమైన కార్యంగా అనిపించవచ్చు. వారు వినయంగా ఉన్నట్టు నటించేవారు మరియు తమ శరీరాలను {తమ మతంలో భాగంగా} చెడుగా చూస్తారు. అయితే, {ఈ నియమాలను అనుసరించడం} పాపం చేయడం ఆపడానికి మీకు సహాయం చేయదు.

Chapter 3

1 {నేను ఇంతకు ముందు చెప్పినదానికి} తిరిగి రావడానికి, దేవుడు మెస్సీయను తిరిగి సజీవుడిగా తీసుకొనివచ్చినప్పుడు ఆయన మిమ్మును జీవముకు తీసుకొనివచ్చిన విధంగా ఇది ఉంది. {ఎందుకంటే ఆయన మిమ్ములను జతచేసాడు}. {దీని కారణంగా} మీరు పరలోకంలో ఉన్నదాని మీద దృష్టి కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే మెస్సీయ అక్కడ ఉన్నాడు. ఆయన సింహాసనం మీద తండ్రియైన దేవుని పక్కన కూర్చున్నాడు {మరియు ప్రతీ దానినీ పరిపాలిస్తున్నాడు}. 2 మీరు పరలోకంలో {దేవుడు మీ కోసం సిద్ధంగా ఉంచిన} దానిని మీరు ఆశపడాలని నేను కోరుకుంటున్నాను, భూమి మీద {మీరు ఇక్కడ కలిగిఉండగలిగే} దానిని కాదు. 3 {మీరు ఈ విధంగా ఆలోచించాలి} ఎందుకంటే మీరు చనిపోయిన విధంగా ఇది ఉంది. దేవుడు తనతో సన్నిహిత సంబంధంలో మిమ్ములను మెస్సీయకు ఐక్యపరచిన కారణంగా మాత్రం మీరు ఆత్మీయంగా సజీవులుగా ఉన్నారు, మరియు ఇది {ప్రస్తుతం భూమి మీద} కనిపించదు. 4 దేవుడు మిమ్ములను మెస్సీయకు ఐక్యపరచిన కారణంగా మీరు సజీవంగా ఉన్నారు. {కాబట్టి,} {ఆయన భూమికి తిరిగి వస్తాడు మరియు} ప్రతి ఒక్కరూ ఆయనను చూసినప్పుడు, ఆ సమయంలో మీరు ఆయనతో ఉంటారు. అప్పుడు, మీరు కూడా మహిమాన్వితులుగా {ఆయనను పోలిన జీవులు} మారారని ప్రతి ఒక్కరూ చూస్తారు. 5 ఎందుకంటే {ఇది మీ గమ్యం}, ఈ లోకంలో మీరు దుష్ట కార్యాలు చెయ్యడానికి కోరికలను శత్రువులు వలే భావించి చంపివెయ్యాలి. {మీరు కోరుకునే దుష్ట సంగతులలో} అనైతికమైన లైంగికత, అపవిత్రమైన పనులు చేయడం, తప్పుడు భావోద్వేగాలను ఆస్వాదించడం, చెడు విషయాలను కోరుకోవడం మరియు మీకు అవసరమైన దానికంటే ఎక్కువ కోరుకోవడం, ఇది మరొక దేవుణ్ణి ఆరాధించడం వంటిదే. 6 మనుషులు ఈ కోరికలు కలిగియున్నారు, కాబట్టి దేవుడు వారి విషయంలో కోపంగా ఉన్నాడు మరియు వారిని శిక్షిస్తాడు. 7 వారి వలే మీరు చెడు పనులు చేయాలనే కోరికలు కలిగి యుండేవారు. మీరు ఈ కోరికలను నెరవేర్చినప్పుడు {అది ఉంది}. 8 అయితే ఇప్పుడు {మీరు విశ్వసించారు అని}, మీరు అన్ని దుష్ట మార్గాలలో ప్రవర్తించడం మానివెయ్యాలి. {ఈ చెడు మార్గాలలో} కోపంతో కూడిన విధానాలలో క్రియలు జరిగించడం, ఇతరులతో కోపంగా ఉండటం, ఇతరులను బాధపెట్టాలని కోరుకోవడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం మరియు సిగ్గుకరమైన మాటలు మాట్లాడటం. 9 మీరు ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పకూడదు. మీరు గతంలో ఉండేలాంటి వ్యక్తి కాదు, సాధారణంగా ఈ దుష్ట మార్గాలలో ప్రవర్తించే వ్యక్తి కాదు. 10 మీరు ఇప్పుడు ఒక నూతన వ్యక్తి, ఆయనను ఎక్కువగా మీరు తెలుసుకొనేలా చెయ్యడానికి దేవుడు కార్యాన్ని జరిగిస్తున్న {ఒక వ్యక్తి}. దేవుడి వలే ఉన్న {ఇప్పుడు ఒక నూతన వ్యక్తి} ఆయన మిమ్మును ఈ నూతన వ్యక్తిలోనికి మార్చాడు. 11 {మీరు అందరు నూతన వ్యక్తులు}, కాబట్టి, ఎవరైనా యూదేతరులు అయినా లేదా యూదులు అయినా, లేదా ఎవరైనా సున్నతి పొందినవారు అయినా లేదా, పొందనివారు అయినా, ఎవరైనా విదేశీయుడు లేదా అనాగరిక వ్యక్తి అయినా, లేదా ఎవరైనా బానిస అయినా లేదా కాకపోయినా { ఇది ముఖ్యం కాదు} . బదులుగా, మెస్సీయ అత్యంత ముఖ్యమైనవాడు మరియు దేవుడు ఆయనను {మీ} అందరికి ఏకం చేసాడు. 12 దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఆయన నిన్ను తన స్వంత ప్రజలుగా ప్రత్యేక పరచాడు మరియు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయాల కారణంగా మరియు {మీరు నూతన వ్యక్తులు} కాబట్టి, మీరు ఎల్లప్పుడూ సరియైన విధంగా {ఇతరుల పట్ల} ప్రవర్తించాలి. వారిపట్ల శ్రద్ధ వహించడం, వారిపట్ల దయ కలిగియుండడం, గర్వంగా ఉండకపోవడం, కఠినంగా ప్రవర్తించకపోవడం మరియు కోపంగా ఉండటానికి ఎక్కువ సమయం తీసుకోవడం {దీనిలో ఉన్నాయి.} 13 మీరు ఒకరితో ఒకరు సులభంగా చిరాకు పడ కూడదు. వారు చేసిన పనులకు మీరు ఇతర వ్యక్తులను నిందించినప్పుడు, మీరు వారిని క్షమించాలి. {ఒకరినొకరు క్షమించడం} ద్వారా ప్రభువు మిమ్మును ఏవిధంగా క్షమించాడో దానిని మీరు అనుకరించాలి. 14 చివరగా, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది ఇంతవరకు {నేను చెప్పిన} అన్నింటికంటే ముఖ్యమైనది. ఇలా చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచినట్లుగా మీరు కూడా ఏకం అవుతారు. 15 మీరు ఏమి చేయాలో ఎంచుకున్నప్పుడు మెస్సీయ మీకు అనుగ్రహించిన సమాధానము మీరు ప్రాథమిక అంశంగా చేసుకోవాలి. {మీరు దీన్ని తప్పక చేయండి} ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఒక వ్యక్తి యొక్క శరీరం వలె సన్నిహితంగా ఒకదానితో ఒకటి కలిపేలా సమాధానము కలిగి ఉండడానికి మిమ్ములను ఎంచుకున్నాడు. అంతే కాకుండా, మీరు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. 16 మీరు ఆలోచిస్తూ ఉన్నప్పుడూ మరియు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడూ మీరు మెస్సీయ గురించిన సందేశం మీద సంపూర్ణంగా దృష్టిని పెట్టాలి. మీరు లేఖనాల నుండి పాటలు, యేసు గురించిన పాటలు మరియు పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించిన పాటలను చాలా జ్ఞానయుక్తంగా వినియోగించి ఒకరికొకరు బోధించాలి మరియు హెచ్చరించాలి. మీరు కృతజ్ఞతతోనూ మరియు హృదయపూర్వకంగా దేవునికి పాడాలి. 17 మీరు ఏదైనా మాట్లాడినప్పుడు లేదా చేసినప్పుడు, ప్రతి పరిస్థితిలోనూ ప్రభువైన యేసుకు ప్రాతినిధ్యం వహించే {మనుష్యులుగా} {మీరు ప్రవర్తించాలి.} అంతేకాకుండా మీరు {మన} తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మెస్సీయ యొక్క {కార్యం} కారణంగా {మీరు దీనిని మాత్రమే} చేయగలరు. 18 భార్యలు {తమ కుటుంబాలలో} నాయకులు వలే తమ భర్తలను గౌరవించాలి. ఎందుకంటే దేవుడు ప్రభువుకు ఐక్యపరచిన వారి కోసం ఇది తగిన ప్రవర్తనగా ఉంది. 19 భర్తలు తమ భార్యలను ఖచ్చితంగా ప్రేమించాలి మరియు వారిని కఠినంగా చూడకూడదు. 20 పిల్లలు ప్రతీ పరిస్థితిలో తమ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. {మరియు ఇది సరియైనది} దేవుడు ప్రభువుతో ఐక్యము చేసిన వారి విషయంలో ఇది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. 21 తండ్రులు తమ పిల్లలకు కోపం తెప్పించకూడదు. లేనియెడల పిల్లలు విడిచిపెట్టబడినట్లు భావిస్తారు. 22 బానిసలు ఈ లోకంలో తమ యజమానులైన వారికి ప్రతి సందర్భంలోనూ విధేయులై ఉండాలి. వారి యజమానులు చూస్తున్నప్పుడు మాత్రమే {వారు విదేయత} చూపడం కాదు, అంటే కేవలం మనుష్యులను మాత్రమే సంతోషపెట్టాలనుకునే వారు ఆ విధంగా ప్రవర్తిస్తారు. బదులుగా, {వారు తమ యజమానులకు యదార్ధంగా} {విధేయత చూపాలి} ఎందుకంటే వారు ప్రభువుకు దైవభక్తి చూపుతారు. 23 మీరు చేయవలసిన పనిని కేవలం మానవ యజమానుల కోసం కాకుండా ప్రభువు కోసం {మీరు చేస్తున్నట్టుగా} శ్రద్ధగా చేయాలి. 24 ప్రభువు మీ కోసం దాచిన దానిని మీకు న్యాయముగా ఇచ్చునని మీరు యెరుగుదురు గనుక {మీరు ఈ విధముగా విధేయత చూపించాలి మరియు పరిచర్య చెయ్యాలి}. ప్రభువు మెస్సీయ ప్రభువు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారో వారికి {నిజమైన యజమాని} ప్రభువు {అని జ్ఞాపకం ఉంచుకోండి}. 25 {నిజమైన యజమాని ఎవరో మీరు తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలి} ఎందుకంటే తప్పు చేసేవారు ఎవరినైనా దేవుడు ఆ చెడ్డ క్రియలకు అనుగుణంగా శిక్షిస్తాడు. {దీనికి కారణం} మనుషులు ఏవిధంగా కనిపిస్తున్నారు లేదా వారు ఎవరు అనే దాని ఆధారంగా తీర్పు చెప్పడు అయితే వారు ఏమి చేసారు అనే దానిమీద తీర్పుతీరుస్తాడు.

Chapter 4

1 యజమానులు తమ బానిసలను న్యాయముగానూ మరియు యధార్ధముగానూ చూడవలెను. {యజమానులైన మీరు దీనిని తప్పక చెయ్యాలి} ఎందుకంటే మీరు కూడా ఒక యజమానిని యెరుగుదురు {. ఆయన} పరలోకములో ఉన్నవాడు. 2 {దేవునికి} పట్టుదలగా ప్రార్థన చెయ్యండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు గమనము నిలపండి, మరియు {దేవునికి} కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 3 మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మా కోసం కూడా ప్రార్థన చెయ్యండి, దేవుడు మా సందేశాన్ని స్వేచ్చగా ప్రకటించడానికి మా కోసం దీనిని సాధ్యం చేయునట్లు {ప్రార్థన చెయ్యండి}, ఇది మెస్సీయను గురించిన రహస్యం, దీనిని మేము ఇప్పుడు ఇతరులతో పంచుకొంటున్నాము. ఎందుకంటే ఈ సందేశమును {మేము ప్రకటించాము}, నేను ఇప్పుడు చెరలో ఉన్నాను. 4 నేను సువార్తను స్పష్టంగా వివరించగలుగునట్లు {ప్రార్థించండి}, ఎందుకంటే దీనిని చెయ్యడానికి దేవుడు నన్ను పిలిచాడు. 5 మెస్సీయలో విశ్వాసం ఉంచని వారి విషయంలో జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి. ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి {మీరు దీనిని చెయ్యాలి}. 6 {మీరు వారితో మాట్లాడినప్పుడు} మీరు ఎల్లప్పుడూ సంతోషకరమైన మరియు ఆసక్తికరమైన విధానములో మాట్లాడాలి. {మీరు దీనిని చేసినప్పుడు,} ప్రతి వ్యక్తికి ప్రతిస్పందించడానికి శ్రేష్టమైన మార్గాన్ని మీరు తెలుసుకొంటారు. 7 నాకు సంభవిస్తున్న ప్రతీ దానిని తుకికు మీకు చెపుతాడు. {అతడు} నేను ప్రేమించుచున్న నా సహా విశ్వాసి, అతడు నాకు నమ్మకంగా సహాయం చేస్తాడు, మరియు మరియు దేవుడు ప్రభువుకు ఐక్యం చేసిన వ్యక్తి వలే నాతో కలిసి సేవ చేస్తాడు. 8 నేను తుకికును మీ వద్దకు {ఈ పత్రికతో} పంపు చున్నాను ఎందుకంటే మేము ఏవిధంగా చేయుచున్నామో మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను మరియు ఎందుకంటే మీరు ధైర్యముగా నివసించేలా తుకికు మీకు సహాయం చేస్తాడు. 9 ఒనేసిముతో {అతనిని నేను మీ వద్దకు పంపుచున్నాను} అతడు నమ్మకమైన తోటి విశ్వాసి, నేను అతనిని ప్రేమించుచున్నాను. అతడు మీ గుంపు నుండి వచ్చినవాడు. తుకికు మరియు ఒనేసిము ఇక్కడ {జరుగుతున్న} ప్రతీ దాని గురించి మీకు చెపుతారు. 10 నాతో చెరలో ఉన్న అరిస్తార్కు, మరియు మరియు బర్నబా యొక్క జ్ఞాతియైన మార్కు మీకు వారి శుభములు చెప్పుచున్నాడు మార్కు మిమ్ములను దర్శించిన యెడల మీరు అతనిని స్వాగతించాలని మీకు ఇంతకు ముందే తెలుసు. 11 యూస్తు అనే పేరు చేత మీకు తెలిసిన యేసు, కూడా {అతని శుభములు పంపుతున్నాడు}. ఈ మనుష్యులు {- అరిస్తార్కు, మార్కు మరియు యూస్తు-} మాత్రమే యూదు విశ్వాసులు, వారు దేవుని యొక్క రాజ్యము నిమిత్తము నాతో పని చేయుచున్నారు. వారు {ఈ పనిలో} నన్ను ప్రోత్సహించారు. 12 ఎపఫ్రా, అతడు మీ గుంపు నుండి వచ్చినవాడు {మరియు} అతడు మెస్సీయ యేసును సేవించుచున్నాడు, మీకు వందనములు పంపు చున్నాడు. అతడు చాలా తరచుగా మీ కోసం మనఃపూర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని పిలిచినట్లుగా ఉండేందుకు మరియు దేవుడు కోరుకునే ప్రతిదానిని గురించి ఖచ్చితంగా ఉండేలా దేవుడు మిమ్ములను శక్తివంతులనుగా చేయగలడని {అతడు ప్రార్థిస్తున్నాడు}. 13 {అతడు మీ కోసం ఈ విధంగా ప్రార్థిస్తున్నాడని మీరు యెరుగుదురు} ఎందుకంటే నేను అతనిని గురించి వ్యక్తిగతంగా దీనిని ధృవీకరించగలను. అతడు మీ కోసం, లవొదికయ యొక్క నగరంలో {నివసిస్తున్న} మనుష్యుల కోసం, మరియు హియెరాపొలి యొక్క నగరంలో {నివసిస్తున్న} మనుష్యుల కోసం బహు ప్రయాసపడుచున్నాడు అని {నేను మీకు చెప్పుచున్నాను}. 14 నేను ప్రేమించుచున్న వైద్యుడైన లూకా, మరియు దేమా మీకు శుభములు చెప్పుచున్నారు. 15 లవొదికయలో నివసించుచున్న సహా విశ్వాసులకు, మరియు నుంఫాకు, మరియు నుంపా గృహంలో {కలుస్తున్న} విశ్వాసుల గుంపుకు మా శుభములు ఇవ్వండి. 16 మీకు ఈ పత్రికను చదువు వాడు దీనిని ముగించిన తరువాత, {దానిని లవొదికయకు} పంపండి తద్వారా అక్కడ విశ్వాసుల గుంపుకు మరొకరు చదవగలరు, అంతేకాకుండా లవొదికయలోని విశ్వాసులకు నేను పంపిన పత్రిక {కోసం అడగండి} తద్వారా మీరు కూడా దానిని చదవగలరు. 17 దేవుడు తనను మెస్సీయతో ఏకం చేసినప్పుడు దేవుడు తనకు అప్పగించిన కర్తవ్యాన్ని అతడు పూర్తి చేశాడని నిర్ధారించుకోవాలని అర్ఖిప్పుతో {మీరు తప్పక} చెప్పాలి. 18 పౌలు అను నేను {నీకు} నా శుభములు పంపుతున్నాను. నేను {ఈ చివరి మాటలు} నా అంతట నేను {నా లేఖకుడు వాటిని రాయడానికి బదులుగా) వ్రాయుచున్నాను. నేను చెరలో ఉన్నాను అని నీవు మరచిపోకూడదు. {దేవుడు} నీకు కృపాభరితంగా ఉండాలని {నేను ప్రార్థన చేయుచున్నాను}.