తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక

Chapter 1

1 {నేను} పౌలు, {ఈ పత్రికను వ్రాయుచున్నాను}. సీల మరియు తిమోతి {నాతో ఉన్నారు.} తండ్రి దేవుడు మరియు మెస్సీయ ప్రభువు యేసుకు ఐక్యపరచబడినవారు, థెస్సలొనీకయుల యొక్క నగరములో ఉన్న మెస్సీయలో విశ్వాసుల యొక్క సంఘము {మీకు,} {మేము ఈ పత్రికను పంపుచున్నాము} దేవుడు మీ పట్ల జాలిగా ఉండుటకు మరియు మిమ్మును సమాధానముగా చేయుటకు {కొనసాగును గాక.} 2 మేము మీ కోసం తరచుగా ప్రార్థన చేస్తున్నాము. {మేము చేసినప్పుడు,} మీ అందరి కోసం దేవునికి ఎల్లప్పుడు మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. 3 మీరు చేస్తున్న కార్యం కోసం మేము మన దేవుడు మరియు తండ్రికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ఎందుకంటే మీరు {ఆయనలో} విశ్వాసముంచుచున్నారు. మీరు మనుష్యులకు శక్తివంతంగా సహాయం చేసే విధానం కోసం మేము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఎందుకంటే మీరు {వారిని} ప్రేమిస్తున్నారు. మీరు ఓర్పుతో సహిస్తున్న విధానం కోసం మేము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఎందుకంటే మన ప్రభువు యేసు మెస్సీయ {ఆయన వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి} మీరు నమ్మకంగా ఎదురుచూచుచున్నారు. 4 {అంతేకాకుండా మేము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఎందుకంటే} ఆయన మిమ్ములను, మెస్సీయలో {మన} సహా విశ్వాసులను ప్రేమిస్తున్నాడని మేము యెరుగుదుము, మరియు {ఆయన శిష్యులు కావడానికి} మిమ్ములను ఎన్నుకొన్నాడు. 5 {దేవుడు మిమ్ములను ఎన్నుకున్నాడని మేము యెరుగుదుము,} ఎందుకంటే మేము {యేసును గురించి} శుభవార్త మీకు చెప్పినప్పుడు, అది మాటలతో మాత్రమే ఉండదు, అయితే పరిశుద్ధ ఆత్మ కూడా శక్తివంతంగా {మా ద్వారా} క్రియ జరిగించాడు. అంతేకాకుండా {ఆయన మిమ్మును ఎంచుకొన్నాడు అని మమ్మును} బలముగా ఆయన నిశ్చయపరచాడు. అదే విధంగా, మేము ఎటువంటి మనుష్యులమో మీరు యెరుగుదురు, ఎందుకంటే మేము మీతో ఉన్నప్పుడు, మేము చేసినదంతా మీకు ప్రయోజనం చేయడానికి. 6 మీ విషయంలో, మేము చేసిన విధముగా మరియు ప్రభువు {యేసు} జీవించిన విధముగా జీవించడానికి మీరు కొనసాగారు. మీరు {శుభ వార్త యొక్క} సందేశాన్ని విశ్వసించినప్పుడు, {మీరు దానిని చేసిన కారణంగా} మనుష్యులు మిమ్ములను శ్రమపడేలా చేసారు. {అయితే మీరు శ్రమ పడుతూ ఉన్నప్పటికీ} పరిశుద్ధ ఆత్మ మీరు ఆనందపడేలా చేసాడు. 7 మాసిదోనియ మరియు అకయ యొక్క రాష్ట్రముల అంతటా {మెస్సీయలో} విశ్వసించిన మనుష్యులు అందరు {మనుష్యులు మిమ్మును శ్రమ పడేలా చేసి యుండగా మీరు ఏవిధంగా ఆనందంగా నిలిచియున్నారో} వినిన కారణంగా, మీరు చేసిన విధముగా వారు కూడా జీవించడానికి కోరుకున్నారు. 8 నిజానికి, మీరు ప్రభువు {యేసు} గురించిన సందేశాన్ని చెప్పడం అనేకులైన మనుష్యులు విన్నారు. అప్పుడు వారు కూడా మాసిదోనియ మరియు అకయ రాష్త్రముల అంతటా నివసించిన ఇతర మనుష్యులకు సందేశాన్ని ప్రకటించారు. అంతకుమించి కూడా, అనేక దూర ప్రాంతాలలో నివసించిన మనుష్యులు దేవునిలో మీరు ఏవిధంగా విశ్వసించారో అనేదాని గురించి విన్నారు. దాని ఫలితంగా, మేము మనుష్యులకు {దేవుడు మీ కోసం చేసిన దాని గురించి} ఏమీ చెప్పనవసరం లేదు. 9 ఇదే మనుష్యులు {మీ నుండి దూరంగా జీవిస్తున్న వారు} కూడా {ఇతరులకు} మీరు మమ్ములను ఏవిధంగా {మనఃపూర్వకముగా} స్వాగతించారో దానిగురించి చెపుతున్నారు. మీరు అబద్ధ దేవుళ్ల {నిర్జీవ} విగ్రహాలను ఆరాధించడం మాని వేశారు అని తద్వారా మీరు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించగల్గుతున్నారు మరియు లోబడుచున్నారు అని కూడా {ఇతరులకు} వారు చెపుతున్నారు. ఆయనే {ఏకైక} నిజమైన దేవుడు. 10 {వారు} కూడా {మీరు అబద్ధ దేవుళ్లను ఆరాధించడం మాని వేశారు అని} తద్వారా పరలోకం నుండి {భూమి మీదకు తిరిగి రావడానికి} దేవుని కుమారుడు యేసు కోసం ఆతృతగా ఎదురు చూడగల్గుతున్నారని ఇతరులకు చెపుతున్నారు.} {మీరు యెరిగిన విధముగా,} దేవుడు యేసును ఆయన చనిపోయిన తరువాత తిరిగి లేపాడు, మరియు దేవుడు మనుష్యులను {వారి పాపముల విషయంలో} శిక్షించే సమయంలో {ఆయనలో విశ్వాసం ఉంచు} మనలను రక్షించు వాడు యేసు ఒక్కడే.

Chapter 2

1 మెస్సీయలో {మా} తోటి విశ్వాసులు, మేము మీతో గడిపిన సమయం చాలా ఫలకరమైనది అని మీకు బాగా తెలుసు. 2 మీరు యెరిగిన విధముగా, ఫిలిప్పీ యొక్క నగరంలో మనుష్యులు ఇంతకుముందు మమ్ములను శ్రమ పెట్టేలా చేసారు మరియు మమ్ములను దూషించారు, అయితే మీకు దేవుని యొక్క శుభవార్తను మాట్లాడడం {నుండి మమ్మును అడ్డగించడానికి ప్రయత్నించినవారికి వ్యతిరేకంగా} మేము ఎంతగా ప్రయాస పడినప్పటికీ మీకు ఆయన శుభవార్తను మాట్లాడడానికి మన దేవుడు మమ్మును ధైర్యవంతులనుగా చేసాడు. 3 ఖచ్చితంగా, {దేవుని శుభవార్తను విశ్వసించడానికి} మిమ్మును మేము ప్రోత్సహించినప్పుడు, తప్పు సందేశాన్ని విశ్వసించడానికి మిమ్మును ఒప్పించడానికి మేము {ప్రయత్నించ} లేదు. {మేము} స్వార్థపూరితంగా ప్రేరేపించబడలేదు. {మేము చెప్పిన దానితో మిమ్మును} మోసగించడానికి {మేము} {ప్రయత్నించ} లేదు. 4 నిజానికి, మేము దేవుని శుభ వార్త మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఆయన మమ్మును పరీక్షించాడు మరియు ఆ విధంగా చెయ్యడానికి మేము నమ్మదగినవారిమి అని ఆమోదించాడు. మేము దేవుని శుభవార్త చెప్పినప్పుడు, మేము మనుష్యులను సంతోషపెట్టడానికి {ప్రయత్నించడం} లేదు. బదులుగా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి {మేము ప్రయత్నిస్తున్నాము}. {ఆయన శుభవార్త} మాట్లాడడానికి మనలను ప్రేరేపించే దానిని దేవుడే {నిరంతరం} పరీక్షిస్తాడు. 5 నిజానికి, మేము గతంలో వచ్చినప్పుడు, మిమ్మల్ని పొగడం చేత మిమ్మల్ని సంతోషపెట్టడానికి మేము ప్రయత్నించలేదు. ఇది సత్యం అని మీకు తెలుసు. {మేము} అత్యాశగా ప్రేరేపించబడలేదు, కాబట్టి మేము మీ నుండి మేము ఎంత అత్యాశగా ఉన్నామనే దానిని దాచుటకు ప్రయత్నించడానికి మేము సంగతులు చెప్పవలసిన అవసరం లేదు. ఇది సత్యం అని దేవుడు ధృవీకరిస్తాడు! 6 మనుష్యులు {మమ్మును–} గౌరవిస్తారు అని {మేము} {ఎదురు చూడ} లేదు, మీరు కాదు మరియు ఇతరులు కాదు{-} 7 {అయితే,} మేము మెస్సీయ యొక్క అధికార ప్రతినిధులం కాబట్టి, మాకు లోబడి యుండేలా మేము మిమ్మల్ని చెయ్యగలము. బదులుగా, మేము మీతో ఉన్నప్పుడు శిశువుల వలె సౌమ్యంగా ప్రవర్తించాము. మేము తన స్వంత పిల్లలను ఆదరిస్తున్న {పోషించే} తల్లిగా {మృదువుగా} ప్రవర్తించాము. 8 మేము మీ పట్ల ఎంతో ప్రియముగా ఉన్నాము కాబట్టి, దేవుని శుభవార్తను మీతో పంచుకోవడానికి మేము సంతోషించాము. అంత మాత్రమే కాదు, అయితే {మేము} మా స్వంత జీవితాలను కూడా{మీతో} కూడా {పంచుకోడానికి సంతోషిస్తున్నాము}. {ఇది} ఎందుకంటే మేము మిమ్మును {చాలా ఎక్కువగా} ప్రేమించడానికి ఆరంభించాము. 9 ఖచ్చితంగా {మా} తోటి విశ్వాసులారా, మేము ఎంత కష్టపడ్డామో మీకు జ్ఞాపకం ఉంది. రాత్రి మరియు పగలు సమయంలో మేము పని చేస్తూనే ఉన్నాం. మాకు ఆర్థికంగా సహాయం చెయ్యడానికి మీలో ఎవరినీ అడగనవసరం లేదు కాబట్టి ఇది జరిగింది. మేము పని చేస్తున్నప్పటికీ, మేము {ఇప్పటికీ} మీకు దేవుని శుభవార్త ప్రకటించాము. 10 {దేవునిలో} విశ్వసించే మీ {అందరి} పట్ల మేము ఎంత నమ్మకంగా, నీతిగా, మరియు నిర్దోషముగా ప్రవర్తించామో మీరు మరియు దేవుడు ఇద్దరూ సాక్ష్యమిస్తున్నారు. 11 మీలో ఒక్కొక్కరు మరియు ప్రతి ఒక్కరూ దీనిని వ్యక్తిగతంగా యెరుగుదురు: తండ్రి తన స్వంత పిల్లల {పట్ల ప్రవర్తించు విధముగా} {మీ పట్ల} అదే విధముగా {మేము ప్రవర్తించాము}. 12 దేవుడు తన మనుష్యులు జీవించడానికి కోరుకుంటున్న విధంగా మీరు అందరూ జీవించాలని {మేము} బతిమాలుచూ మరియు ప్రోత్సహించుచూ మరియు సాక్ష్యమిచ్చుచూ {ఉన్నాము}! ఇది ఎందుకంటే దేవుడు తన సొంత మహిమాన్వితమైన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మిమ్ములను ఆహ్వానిస్తూనే {ఉన్నాడు.} 13 ఈ కారణం కోసం మేము నిరంతరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము: మేము దానిని మీకు తెలియపరచినప్పుడు మీరు దేవుని సందేశాన్ని అంగీకరించారు. మీరు దానిని కేవలం మానవ సందేశంగా పరిగణించలేదు. దేవుడు తానే దానిని పంపిన విధముగా సందేశాన్ని {మీరు అంగీకరించారు}. మరియు తెలియజేయడానికి వాస్తవంగా దేవుడు మాకు సందేశాన్ని ఇచ్చాడు! మీలో ఆయన యందు విశ్వాసం ఉంచేవారి కోసం దేవుడు తన మనుష్యులు వలే జీవించేలా మిమ్మల్ని సమర్థవంతంగా మారుస్తున్నాడు అని {మేము} కూడా {దేవునికి నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతున్నాము}, 14 యూదయలోని {అవిశ్వాసులైన} యూదులు {చాలా కాలం క్రితం} ప్రవక్తలను చంపడం మాత్రమే కాదు, అయితే వారు {ఇటీవల} ప్రభువు యేసును కూడా చంపారు. వారు మమ్మల్ని {అపొస్తలులను} కూడా తీవ్రంగా హింసించారు. ఈ అవిశ్వాసులైన యూదులు కూడా మెస్సీయలో ఉన్న యూదా విశ్వాసులు బాధ పడేలా చేసారు. ఖచ్చితంగా, {మా} మెస్సీయలో తోటి విశ్వాసులు, మీరు మీ తోటి దేశస్థుల నుండి అదే శ్రమ చేత మెస్సీయ యేసుతో ఐక్యమైన యూదయలో దేవుని యొక్క ఆ సంఘాలను అనుకరించారు. దేవుడు ఈ {అపనమ్మకమైన} యూదులతో పూర్తిగా అసంతృప్తి చెందాడు. వారు కూడా మొత్తం మానవ జాతికి శత్రువులుగా ఉన్నారు.! 15 యూదయలోని {అవిశ్వాసులైన} యూదులు {చాలా కాలం క్రితం} ప్రవక్తలను చంపడం మాత్రమే కాదు, అయితే వారు {ఇటీవల} ప్రభువు యేసును కూడా చంపారు. వారు మమ్మల్ని {అపొస్తలులను} కూడా తీవ్రంగా హింసించారు. ఈ అవిశ్వాసులైన యూదులు కూడా మెస్సీయలో ఉన్న యూదా విశ్వాసులు బాధ పడేలా చేసారు. ఖచ్చితంగా, {మా} మెస్సీయలో తోటి విశ్వాసులు, మీరు మీ తోటి దేశస్థుల నుండి అదే శ్రమ చేత మెస్సీయ యేసుతో ఐక్యమైన యూదయలో దేవుని యొక్క ఆ సంఘాలను అనుకరించారు. దేవుడు ఈ {అపనమ్మకమైన} యూదులతో పూర్తిగా అసంతృప్తి చెందాడు. వారు కూడా మొత్తం మానవ జాతికి శత్రువులుగా ఉన్నారు. 16 అవిశ్వాసులైన యూదులు యూదులు కాని వారికి {దేవుని శుభవార్త} చెప్పడం నుండి మమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకంటే యూదులు కాని వారిని దేవుడు రక్షించడానికి అవిశ్వాసులైన యూదులు కోరుకోరు. అవిశ్వాసులైన ఈ యూదులు అధికంగా పాపం చెయ్యడానికి కొనసాగుతూ ఉన్నారు. వారు దేవుడు అనుమతించే పరిమితికి దాదాపు చేరుకున్నారు. నిజానికి, వారు దానిని ఆశించకుండా ఉన్నప్పుడు దేవుడు వారిని {కాలం యొక్క} చివరిలో శిక్షిస్తాడు! 17 {మా} తోటి విశ్వాసులు, చాలా దూరంగా ఉండడం చేత కొద్దికాలం పాటు మిమ్మల్ని చూడడం నుండి {మమ్మల్ని} నిరోధించారు. అయితే, మేము మీ నుండి చాలా దూరంగా ఉన్నప్పటికీ, మేము {మీ పట్ల} తక్కువ అనురాగాన్ని కలిగియుండలేదు. మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి మరింత అత్యాశగానూ మరియు లోతుగా కోరుకున్నాము. 18 నిజానికి, మేము మిమ్మల్ని దర్శించాలని కోరుకున్నాము. నేను, పౌలును, రెండు సార్లు {రావడానికి ప్రయత్నించాను} కూడా, అయితే {మేము రావడానికి ప్రయత్నించినప్పుడు,} సాతాను మమ్మల్ని వ్యతిరేకించాడు. 19 మేము మిమ్మును దర్శించడానికి కోరుకున్నాము ఎందుకంటే {దేవునిలో మీకున్న విశ్వాసం గురించి} మేము చాలా ధైర్యంగా ఉన్నాము. {మీ మధ్య ఉండడం} కూడా మమ్ములను ఆనందంగా చేస్తుంది. {మీరు దేవునికి చాలా నమ్మకంగా ఉన్నారు కాబట్టి,} దేవుడు మమ్మును ఏమి చెయ్యాలని కోరుకున్న దానిని మేము సంపాదించాము అని మేము నిశ్చయంగా ఉన్నాము. ఖచ్చితంగా, మన ప్రభువైన యేసు {మళ్లీ} వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో {మనమందరం కలిసి ఉంటామని ఒప్పించబడి} కూడా ఉన్నాం! 20 మీ యొక్క కారణంగా, మేము {దేవుణ్ణి} మహిమపరుస్తున్నాము మరియు సంతోషిస్తున్నాము!

Chapter 3

1 కాబట్టి, అప్పుడు మేము {మనం} ఇక మీదట సాధ్యమైన మేర వేచి ఉండలేమని భావించినప్పుడు,సీల మరియు నేను మాత్రమే ఏథెన్స్ నగరంలో ఉండడం సముచితమని మేము తలంచాము. 2 అయితే, మేము {మీ వద్దకు} ఇంకా తిమోతిని పంపాము. అతడు మాతో కలిసి పనిచేస్తాడు మరియు మెస్సీయ గురించిన శుభవార్త {ప్రకటిస్తూ} చేత దేవునికి సేవ చేస్తున్నాడు. మీరు {దేవునికి} నమ్మకంగా నిలిచియుండడానికి సహాయం చెయ్యడానికి మరియు ప్రోత్సహించడానికి {సీల మరియు నేను అతనిని పంపాము}. 3 మనుష్యులు మమ్ములను {అపొస్తలులు} శ్రమ పెట్టినప్పుడు {మీరు దేవునియందు విశ్వసించడంలో} మీలో ఎవ్వరూ సంశయించడానికి ఇది కారణం కాకుండా ఉండేలా {మేము తిమోతిని కూడా మీ వద్దకు పంపాము}. మనుష్యులు మమ్ములను {అపొస్తలులను} శ్రమ పెడతారు అని {దేవుడు} నిర్ణయించాడు అని మీరు బాగా యెరుగుదురు. 4 నిజానికి, మేము {అపొస్తలులు} మిమ్మల్ని సందర్శిస్తున్నప్పుడు కూడా, మేము ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మనుష్యులు మమ్ములను {అపొస్తలులను} శ్రమ పెట్టడం కోసం దేవుడు నిర్ణయించాడు అని మేము మిమ్మల్ని హెచ్చరించాము. సరిగ్గా ఇదే సంభవించిందని మీరు బాగా యెరుగుదురు. 5 తిరిగి ఈ కారణంగా, నేను {నేను ఆవిధంగా భావించాను} ఇక వేచి ఉండలేనని భావించినప్పుడు, నేను {తిమోతిని} మీ వద్దకు పంపాను. మీరు ఇంకా {దేవుని మీద} విశ్వాసం ఉంచుతున్నారో లేదో తెలుసుకోవడానికి నేను ఆందోళన కలిగియున్నాను. ఏదో ఒకవిధంగా సాతాను మిమ్ములను {దేవునిలో విశ్వాసముంచడం నిలిపి వెయ్యడానికి మిమ్మును శోధించాడు అని నేను ఆందోళన కలిగియున్నాను. {దేవునిలో మీరు విశ్వాసముంచడం నిలిపి వేసిన యెడల,} {మీ మధ్య} మేము ప్రయాసపడి చేసిన పని అంతా నిరుపయోగంగా మారిపోయి ఉండేది! 6 తిమోతి ఈ మధ్యకాలంలో మీతో దర్శింపు నుండి సీల మరియు నా దగ్గరకు తిరిగి వచ్చాడు. మీరు {దేవుణ్ణి} ఎంతగా విశ్వసించారో మరియు ప్రేమిస్తున్నారో అనేదాని గురించి అతడు మాకు శుభవార్త చెప్పాడు. మీరు మా గురించి ఆలోచించిన ప్రతీసారి, అది మీకు సంతోషాన్ని కలిగిస్తుందని కూడా {అతడు మాకు చెప్పాడు.} మీరు మమ్మల్ని సందర్శించాలని ఎంతగా కోరుకుంటున్నారో {అతడు మాకు చెప్పాడు}. మాకు కూడా అదే కోరిక ఉంది! 7 మెస్సీయలో {మా} తోటి విశ్వాసులు, పూర్తి కాలం అంతటిలో మనుష్యులు మమ్మల్ని దూషించారు మరియు మమ్ములను శ్రమపెట్టారు – మీ గురించి దేవుడు మమ్మును ప్రోత్సహించాడు మీరు {ఇప్పటికీ} {దేవునిలో} విశ్వాసముంచుతున్నారు అని {తిమోతి నుండి మేము వినినప్పుడు} మేము ప్రోత్సహించబడ్డాము. 8 నిజానికి, మీరు ప్రభువు {యేసు}లో {విశ్వాసం ఉంచడానికి} కొనసాగించిన కారణంగా మేము పునరుజ్జీవింపబడ్డామని భావించాము! 9 నిజానికి, ఆయన మీ కోసం చేసిన దానికి మేము దేవునికి తగినంత కృతజ్ఞతలు చెప్పలేము! మన దేవునికి {మనం ప్రార్థించినప్పుడు}, మీరు {ఎంతోగానో} {ఆయనలో విశ్వసించుచున్న} కారణంగా మేము చాలా విస్తారంగా సంతోషిస్తున్నాము. 10 మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడడానికి {మేము శక్తితో ఉండేలా} మేము నిరంతరం మరియు అధికంగా దేవుణ్ణి వేడుకుంటున్నాము. మీరు {దేవునిలో} అధికంగా విశ్వసించడంలో వృద్ధి చెందడంలో మీకు సహాయం చెయ్యడానికి {మేము} కూడా {కోరుకుంటున్నాము.}! 11 ఇప్పుడు, మేము మిమ్మును {తిరిగి} సందర్శించడానికి వారు మమ్మును అనుమతించాలి అని మన తండ్రి దేవునికి మరియు మన ప్రభువు యేసును ప్రార్థిస్తున్నాము! 12 మీరు మీ తోటి విశ్వాసిని ఎక్కువగా ప్రేమించడంలో ఎక్కువగా మరియు ఎక్కువగా వృద్ధి చెందడానికి ప్రభువు {యేసు} మీకు జరిగించాలని {మేము} ప్రార్థిస్తున్నాము. మనుష్యులు అందరిని ప్రేమించడంలో మీరు వృద్ధి చెందాలని కూడా {మేము} ప్రార్థిస్తున్నాము. మేము మిమ్మును ప్రేమిస్తున్న విధానం ఖచ్చితంగా ఇదే! 13 {మన ప్రభువు యేసు} మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అధికంగా కోరుకోడానికి మిమ్మును బలపరచాలి అని మేము ప్రార్థిస్తున్నాము. మన తండ్రి దేవుడు తనకు చెందిన వారి పట్ల దోషరహితంగా భావించే విధానంలో జీవించడానికి {మన ప్రభువు యేసు} మీకు శక్తిని అనుగ్రహించాలని మేము ప్రార్థిస్తున్నాము. మన ప్రభువు యేసు {రెండవ సారి} వచ్చినప్పుడు, తనకు సంబంధించినవారిని అందరిని తీసుకువచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉండవలెనని {ఈ సంగతులు అన్నిటికోసం మేము ప్రార్థిస్తున్నాము}. ఆ విధంగా జరుగును గాక!

Chapter 4

1 మెస్సీయలో {మా} తోటి విశ్వాసులు, ఇక్కడ {ఈ పత్రిక యొక్క} సారాంశం ఇక్కడ ఉంది. మేము ప్రభువు యేసు యొక్క ప్రతినిధులం కాబట్టి, మేము మీకు బోధించిన వాటిని ఆచరణలో పెట్టడానికి మేము మిమ్మును బతిమాలుచున్నాము మరియు ప్రోత్సహిస్తున్నాము. ఈ విధంగా మీరు జీవించడానికీ మరియు దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీ కోసం ఇది అవసరం. అప్పుడు మీరు మరింత అధిగమిస్తారు, ఎందుకంటే ప్రభువు యేసు మీకు ఇవ్వమని మాకు చెప్పిన ఆజ్ఞలు మీకు తెలుసు. 2 మెస్సీయలో {మా} తోటి విశ్వాసులు, ఇక్కడ {ఈ పత్రిక యొక్క} సారాంశం ఇక్కడ ఉంది. మేము ప్రభువు యేసు యొక్క ప్రతినిధులం కాబట్టి, మేము మీకు బోధించిన వాటిని ఆచరణలో పెట్టడానికి మేము మిమ్మును బతిమాలుచున్నాము మరియు ప్రోత్సహిస్తున్నాము. ఈ విధంగా మీరు జీవించడానికీ మరియు దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీ కోసం ఇది అవసరం. అప్పుడు మీరు మరింత అధిగమిస్తారు, ఎందుకంటే ప్రభువు యేసు మీకు ఇవ్వమని మాకు చెప్పిన ఆజ్ఞలు మీకు తెలుసు. 3 ఖచ్చితంగా, మీరు సంపూర్తిగా తనకు చెందినవారని నిరూపించే విధానంలో మీరు జీవించడానికి మీ కోసం దేవుడు ఇచ్చయించుచున్నాడు: {ఏదైనా} లైంగిక అనైతిక చర్యలను జరిగించడం నుండి మీరు నిరోధించుకోవాలి అని {ఆయన కోరుకుంటున్నాడు}. 4 మీలో ప్రతి ఒక్కరు తన సొంత భార్యతో మాత్రమే లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని {దేవుడు కోరుకుంటున్నాడు}. మీ భార్యలు దేవునికి చెందిన వారి వలే మీరు ఆదరించాలి మరియు వారిని ఘనపరచాలి అని {దేవుడు ఇచ్చయించుచున్నాడు.} 5 మీరు కోరుకున్న దానిని కామాతురముగా తృప్తిపరచుకోడాకి {మీరు మీ భార్యను వినియోగించ కూడదు}. ఇది ఎందుకంటే దేవుని మనుష్యులు కాని జాతులు ఈ విధంగా జీవిస్తాయి. 6 మెస్సీయలో తన తోటి విశ్వాసి యొక్క {భార్యను} విషయంలో ఏ ఒక్కరూ అతిక్రమించకూడదు మరియు ప్రయోజనం పొందకూడదు అని {దేవుడు కూడా ఇచ్చయించుచున్నాడు}. ఇది ఎందుకంటే ఈ {లైంగిక దుర్నీతి} చర్యలు అన్నిటికి ప్రభువు {యేసు} ప్రతీకారం చేస్తాడు. మేము ఇంతకు ముందు చెప్పాము మరియు బలముగా మిమ్ములను హెచ్చరించిన విధముగా ప్రభువు {యేసు} ఖచ్చితంగా ప్రతీకారం చేస్తాడు. 7 ఖచ్చితంగా దేవుడు మనలను {తన మహిమాన్వితమైన రాజ్యంలోనికి మెస్సీయలో విశ్వాసులు} అపవిత్రమైన {జీవనం} యొక్క ఉద్దేశం కోసం పిలవడు. బదులుగా, మనం ఆయనకు చెందిన వారి వలే జీవించాలి అని దేవుడు ఇచ్చయించుచున్నాడు. 8 ఈ ముఖ్య కారణం కోసం అందుకే, {మీలో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాను. ఈ సంగతులు చెప్పడానికి దేవుడు మాకు చెప్పాడు కాబట్టి} ఏ ఒక్కరైనా మేము చెప్పే దానిని తిరస్కరించడానికి {కొనసాగిస్తూ ఉన్న యెడల}, మీరు కేవలం మానవుడిని తిరస్కరించడం లేదు. లేదు, మీరు దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు! మీ అందరితో తన పరిశుద్ధ ఆత్మను {నిరంతరంగా} పంచుకునే దేవుణ్ణి మీరు తిరస్కరిస్తున్నారు! 9 ఇప్పుడు, {మీ ప్రశ్న గురించి,} మెస్సీయలో తోటి విశ్వాసులు ఒకరిపట్ల ఒకరు ఆప్యాయంగా ఏవిధంగా మీరు ప్రవర్తించాలో మీకు {జ్ఞాపకం చెయ్యడానికి} {ఏ ఒక్కరికికైనా} వ్రాయడానికి {నిజంగా} అవసరం లేదు. ఇది ఎందుకంటే, “ఒకరినొకరు ప్రేమించు కొనుడి” అని దేవుడు బోధించే దానిని మీరు ఇప్పటికే నేర్చుకున్నారు అని ఇది ఖచ్చితం. 10 మాసిదోనియ అంతట నివసించే మెస్సీయలో ఉన్న తోటి విశ్వాసులు అందరితో ఖచ్చితంగా మీరు {ఇప్పటికే} ప్రేమగా ప్రవర్తిస్తున్నారు. అయినప్పటికీ, మెస్సీయలో ఉన్న మా తోటి విశ్వాసులారా, {ఒకరినొకరు} మరింత ఎక్కువగా ప్రేమించుకోవడంలో వృద్ధిచెందడానికి మీ అందరినీ బతిమిలాడడానికి మేము {కోరుకుంటున్నాము}! 11 సమాదానముగా జీవించడానికి ఆకాంక్షించడానికి {మేము} కూడా {మిమ్మల్ని బతిమిలాడుతున్నాము}. మీ స్వంత విషయాలతో పని కలిగి యుండడానికి {మేము మిమ్ములను కోరుతున్నాము}. మీరు జీవించడానికి అవసరమైన వాటిని సంపాదించడానికి పని చేయడం మీద దృష్టి నిలపడానికి {మేము మిమ్ములను బతిమాలుచున్నాము}. మేము ఇప్పటికే మీకు ఆజ్ఞాపించినట్లు చేయండి. 12 {మీ ఈ సంగతులు చెయ్యడానికి మేము మిమ్ములను బతిమాలుచున్నాము,} తద్వారా మెస్సీయలో విశ్వాసం ఉంచని విశ్వసించని వారి యెడల {మీరు ఎంతో నిరాడంబరంగా జీవించడం చేత} మీరు ఒక మంచి మాదిరిని ఏర్పాటు చెయ్యగలరు. అప్పుడు {జీవించడానికి} మీకు అవసరమైన దానిని సమకూర్చడానికి మీరు {ఇతరుల మీద} మీరు ఆధారపడనవసరం లేదు. 13 అంతే కాకుండా మెస్సీయలో {మా} తోటి విశ్వాసులారా, చనిపోయిన మెస్సీయలో విశ్వాసులకు {ఏమి జరగబోతున్నది అనేదాని} గురించి మీరు తెలుసుకొని ఉండాలని మేము మిమ్మును కోరుకుంటున్నాము. మెస్సీయలో విశ్వాసం ఉంచని మిగిలిన మానవజాతి వలే మీరు ఉండకూడదు. వారు మిక్కిలి విచారంగా ఉన్నారు, ఎందుకంటే మరణం తర్వాత మనుష్యులు పునరుత్థానం చెందుతారని వారు నమ్మకంగా ఎదురుచూడరు. 14 ఖచ్చితంగా, యేసు మరణించాడు మరియు పునరుత్థానుడు అయ్యాడు అని మేము {అపొస్తలులు} ఒప్పించబడ్డాము. ఈ కారణం చేత యేసుకు ఐక్యమైనవారు మరణించిన మనుష్యులకు దేవుడు {పునరుత్థానులుగా చేస్తాడు} అని కూడా మేము ఒప్పించబడ్డాము. అప్పుడు {ఆయన భూమికి తిరిగి వచ్చినప్పుడు} దేవుడు వారిని యేసుతో వెనుకకు పంపుతాడు. 15 నిజానికి, మేము {అపొస్తలులు} ఇప్పుడు చెపుతున్నది ప్రభువు {యేసు తానే} నుండి మీకు చెపుతున్న సందేశం. ప్రభువు {యేసు} తిరిగి వచ్చినప్పుడు{, మెస్సీయలో విశ్వాసం ఉంచే వారు అందరు ఆయనకు నమస్కరిస్తారు}. మొదట, {ఇప్పటికే} మరణించిన వారు {మెస్సీయలో విశ్వాసులు} ఖచ్చితంగా ఆయనకు నమస్కరిస్తారు, మరియు ఆ తరువాత ఇంకా సజీవంగా ఉన్న మనము {మెస్సీయలో విశ్వాసులు}. 16 {ఈ విధంగా} ప్రభువు {యేసు} పరలోకం నుండి దిగి వస్తాడు: ప్రభువు {యేసు} తానే {అందరూ పునరుత్థానం కావడానికి} వ్యక్తిగతంగా ఆజ్ఞ ఇస్తాడు. ప్రధాన దేవదూత కేక వేస్తాడు. దేవుని బూర మోగుతుంది. అప్పుడు మెస్సీయకు ఐక్యం చెయ్యబడిన మృతులు {అందరు} మొదట {భూమి నుండి} పునరుత్థానులు అవుతారు. 17 దాని తరువాత, భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్న మెస్సీయలో విశ్వాసులు మన అందరిని దేవుడు పైకి కొనిపోతాడు, తద్వారా మనం ప్రభువు {యేసును} ఆకాశంలో కలుసుకుంటాము. మెస్సీయలో విశ్వాసుల యొక్క రెండు గుంపులు మేఘాల మీద ఏకంగా కలుస్తాయి. ఈ విధంగా మనం ఎప్పటికీ ప్రభువు {యేసుతో} కలిసి ఉంటాము! 18 ఫలితంగా, మీరు ఈ సందేశంతో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి!

Chapter 5

1 {భూమి మీదకు మన ప్రభువు యొక్క రాకడ యొక్క సమయము గురింఛి మీరు యెరిగియుండాలని నేను కోరుకుంటున్నాను} మెస్సీయలో మా తోటి విశ్వాసులారా, మేము {నిజంగా} మీకు {మన ప్రభువు యొక్క రాకడ యొక్క} నిర్దిష్ట సమయం గురించి {ఏదీ} వ్రాయడానికి అవసరం లేదు. 2 ఇది ఎందుకంటే ప్రభువు {యేసు} తిరిగి వచ్చు సమయం గురించి మీకుగా మీరు ఇంతకు ముందే ఖచ్చితంగా యెరిగియున్నారు. రాత్రి సమయంలో ఒక దొంగ వచ్చినప్పటి వలే {అనుకోకుండా} ఆయన వస్తాడు అని కూడా మీరు యెరుగుదురు. 3 “{మేము} సురక్షితంగా మరియు భద్రముగా ఉన్నాము!” అని మనుష్యులు చెపుతున్న సమయంలో {ప్రభువు యేసు} వస్తాడు. అప్పుడు, అకస్మాత్తుగా, దేవుడు వారిని అణచివేస్తాడు మరియు నాశనం చేస్తాడు! గర్భిణీ స్త్రీ ప్రసవ నొప్పుల చేత ముంచి వెయ్యబడడం నుండి కుండా తప్పించుకోలేనప్పుడు ఇది సమానంగా ఉంటుంది. అదే విధంగా, ఆ మనుష్యులు {దేవుడు నాశనం చేసినప్పుడు} ఎప్పటికీ తప్పించుకోలేరు! 4 అయితే, మెస్సీయలో {మా} తోటి విశ్వాసులారా, మీరు మనుష్యులు చీకటిలో ఉన్నట్టు వలే జరుగబోతున్న దాని విషయంలో యెరుగని మనుష్యులు కాదు. ఈ కారణంగా, ప్రభువు యేసు తనకు చెందని మనుష్యులను శిక్షించడానికి భూమికి తిరిగి వచ్చినప్పుడు, ఆయన దొంగగా ఉన్న విధముగా మిమ్ములను ఆశ్చర్యపరచడు. 5 మీరు అందరు దేవుని పిల్లలు {కాబట్టి}, వెలుగులో ఉన్నవారు లేదా జరుగుతున్న దానిని గురించి యెరిగి పగటిపూట మెలకువగా ఉన్న మనుష్యుల వలే {భూమికి యేసు తిరిగి రావడం కోసం మీరు సిద్ధంగా జీవించాలి}. మనం జరుగుతున్న దానిని గురించి యెరుగకుండా జీవించే {సాతాను పిల్లలం,} కాదు, రాత్రిపూట లేదా చీకటిలో ఉన్న {అలాగే గ్రహించలేని} మనుషులం కాదు. 6 కాబట్టి, ఈ కారణంగా, {దేవుని పిల్లలముగా, జరుగుతున్న దాని కోసం మనం సిద్ధపడి జీవించాలి. మనం} జరుగుతున్న దాని గురించి యెరుగని ఇతర మనుష్యుల వలే మనం జీవించకూడదు. వారు నిద్రిస్తున్న మనుష్యుల వలే ఉన్నారు. బదులుగా, మనం మెలకువ కలిగి ఉండాలి మరియు శ్రద్ధగా ఉండాలి, {భూమికి యేసు తిరిగి రావడానికి యెదురుచూస్తున్నాము}. 7 జరుగబోతున్న దాని గురించి మనుష్యులకు తెలియనప్పుడు అని, ఇది {సాధారణంగా} రాత్రి సమయంలో, వారు నిద్రపోతున్నప్పుడు అని బాగా తెలుసు. మరియు ప్రజలు త్రాగినప్పుడు, ఏమి జరుగబోతుందో దాని కోసం వారు సిద్ధంగా లేరు. వారు {సాధారణంగా} రాత్రిపూట త్రాగి ఉంటారు, {వారు విషయాలను కూడా గ్రహించలేనప్పుడు}. 8 అయితే {ప్రభువు యేసు భూమికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న మనం ఈ ప్రజల వలే జరుగబోతున్న దాని గురించి యెరుగకుండా జీవించము.} మనం సిద్ధంగా ఉన్నాము కాబట్టి, మనం శ్రద్ధగా ఉండాలి. మనం {సైనికుల వలె} పూర్తిగా ఆయుధాలు ధరించాలి. {దేవునిపట్ల} నమ్మకమైన ప్రేమ ఒక కవచము వలే రొమ్మును కప్పి ఉంచాలి. {దేవుడు} మనలను రక్షిస్తాడు అని ధైర్యముగా ఉండడం ఒక శిరస్త్రాణం వలే {మన శిరస్సులను సంపూర్తిగా కాపాడాలి} 9 {మనం ఆయన మనుష్యులం} కాబట్టి, {మన పాపముల కోసం} దేవుడు మనలను శిక్షించడానికి నియమించలేదు. బదులుగా, మన ప్రభువు మెస్సీయ యేసు మనలను భద్రపరుస్తాడు మరియు కాపాడుతాడు అని ఆయన నియమించాడు. 10 యేసు మన స్థానంలో చనిపోయాడు తద్వారా మనం ఆయనతో {శాశ్వత కాలం} జీవిస్తాము. మనం జీవించి ఉన్నను లేదా చనిపోయినను {ఆయన భూమికి తిరిగి వచ్చినప్పుడు} {ఇది సత్యం,} 11 ఇది సత్యం కాబట్టి, {మెస్సీయలో మీ తోటి విశ్వాసులలో} ప్రతివారిని మరియు ఒక్కొక్కరిని స్వాభావికంగా ప్రోత్సహించడం మరియు సహాయం చెయ్యడానికి కొనసాగించండి! 12 చివరగా, మెస్సీయలో {మా} తోటి విశ్వాసులారా, ప్రభువు {యేసుకు} మీరు గుర్తింపును ఇచ్చిన అదే విధానంలో మీ మధ్య ప్రయాసపడి పనిచేయు మీ ఆత్మీయ నాయకులకు మీరు గుర్తింపు ఇవ్వాలి అని మేము మనవి చేయుచున్నాము. మీరు వారికి గుర్తింపును కూడా ఇవ్వాలి ఎందుకంటే వారు నిరంతరం మిమ్ములను హెచ్చరిస్తారు మరియు {మెస్సీయలో విశ్వాసులు వలే జీవించడం గురించి} ఉపదేశిస్తారు. 13 {మీ కోసం} వారు {ఎంతో కష్టపడి} పనిచేయుచున్నారు కాబట్టి, వారి విషయంలో ఆలోచన కలిగియుండడం చేత మీ ఆత్మీయ నాయకులను సమృద్ధిగా ప్రేమించాలని కూడా మేము మనవి చేయుచున్నాము. మీరు ఒకరితో ఒకరు సమాధానముగా జీవించడం కొనసాగించాలి అని {కూడా మేము బతిమాలుచున్నాము}. 14 మెస్సీయలో {మా} తోటి విశ్వాసులారా, విరుద్ధముగా జీవించే వారిని హెచ్చరించండి మరియు వారికి బోధించవలసింది అని మేము ఇప్పుడు బతిమాలుచున్నాము. నిరుత్సాహపడిన వారిని మీరు ఉత్సాహపరచాలని {కూడా} మేము బతిమాలుచున్నాము. బలహీనంగా ఉన్న వారికి సహాయం చెయ్యాలి అని {కూడా} మేము బతిమాలుచున్నాము. {మెస్సీయలో మీ తోటి విశ్వాసులలో} ప్రతి ఒక్కరితో మీరు సహనంతో జీవించాలి అని {కూడా} మేము బతిమాలుచున్నాము. 15 ఎవరైనా మిమ్మును చెడుగా చూసిన యెడల, బదులుగా మీరు వారితో చెడుగా ప్రవర్తించ కుండా చూసుకోండి. బదులుగా, {మీకు వీలైనప్పుడు,} {మెస్సీయలో ఉన్న ప్రతి తోటి విశ్వాసిని} దయతో వ్యవహరించడానికి మార్గాల కోసం చురుకుగా చూడండి. 16 అన్ని సమయాలలో ఆనందంగా ఉండండి! 17 నిరంతరం ప్రార్థించండి! 18 ప్రతి సందర్భంలో దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండండి! నిజానికి, ఈ సంగతులు అన్నీ చెయ్యడానికి మెస్సీయ యేసుతో ఐక్యమైన మీ అందరి కోసం దేవుడు కోరుకుంటున్నాడు. 19 {పరిశుద్ధ} ఆత్మ {మీ మధ్య పనిచేయడం నుండి {ఆపడానికి ప్రయత్నం} చెయ్యవద్దు. అది ఎవరైనా {అగ్నిని} ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు వలే ఉంటుంది! 20 {ఇతర మాటలలో,} {మెస్సీయలో ఇతర విశ్వాసులకు పరిశుద్ధ ఆత్మ ఇస్తున్న} ప్రవచనాలను నిందించ వద్దు! 21 {బదులుగా,} అన్ని {ప్రవచనములను} మూల్య నిర్ధారణ చేస్తూ ఉండండి మరియు శ్రేష్టమైనవిగా నిరూపించబడిన వాటిని {మాత్రమే} నిలిపి ఉంచుకోండి. 22 దుష్టత్వముగా కనిపించే దేని నుండైనా దూరంగా ఉండండి! 23 సారాంశంలో, తనకు సంపూర్తిగా చెందిన మనుష్యుల వలే జీవించేలా దేవుడు వ్యక్తిగతంగా మిమ్ములను చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. తన మనుష్యులకు సమాధానమును ఇచ్చువాడు దేవుడే. మన ప్రభువు మెస్సీయ యేసు తిరిగి భూమి మీదకు వచ్చు సమయం కోసం దేవుడు మిమ్మల్ని సంపూర్తిగా నిర్దోషులుగా కాపాడాలని కూడా మేము ప్రార్థిస్తున్నాము. 24 నమ్మకమైన దేవుడు {నిరంతరంగా} {సంపూర్తిగా ఆయనకు చెందిన వారి వాలే జీవించడానికి} మీ అందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి, ఆయన {ఆయన సంపూర్తిగా చెందిన వారి వలే జీవించడానికి శక్తిమంతులను చెయ్యడం కోసం మీకు అవసరమైనదానిని} కూడా ఆయన చేస్తాడు అని మీరు నిశ్చయమగా ఉండవచ్చు. 25 మెస్సీయలో {మా} తోటి విశ్వాసులారా, మీరు నా కోసం, సీల కోసం మరియు తిమోతి కోసం ప్రార్థిస్తూ ఉండాలని కూడా మేము కోరుతున్నాము! 26 మీరు {ఆరాధన కోసం} ఒకచోట కలిసినప్పుడు, దేవునికి చెందిన వారికి తగిన విధంగా మెస్సీయలో మీ తోటి విశ్వాసులలో ప్రతి ఒక్కరికి అనురాగంతో శుభములు చెప్పండి. 27 {మీ మధ్య} మెస్సీయలో {మీలో ఉన్న} విశ్వాసులు అందరికి ఈ పత్రికను మీరు చదువుతారు అని మీరు ప్రభువు {యేసు}కు ఒక ప్రమాణం చేయడానికి నేను మిమ్మును కోరుతున్నాను. 28 మన ప్రభువు మెస్సీయ యేసు మీ అందరి పట్ల దయతో క్రియ జరిగించడం {కొనసాగిస్తూనే} ఉండును గాక!