తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక

Chapter 1

1 {నేను,} పౌలు, {మీకు ఈ లేఖ వ్రాస్తున్నాను,} మరియు మా తోటి విశ్వాసి అయిన తిమోతి {నాతో ఉన్నాడు}. మెస్సీయ యేసుకు ప్రాతినిధ్యం వహించడానికి దేవుడు నన్ను పంపడానికి ఎంచుకున్నాడు, ఎందుకంటే దేవుడు కోరుకున్నది అదే. కొరింతు నగరంలో ఉన్న దేవునికి చెందిన విశ్వాసుల యొక్క గుంపులో {భాగమైన మీకు} {నేను ఈ లేఖను పంపుచున్నాను}. అకయ ప్రాంతం అంతటి ద్వారా నివసించే విశ్వాసులు అందరికీ {నేను} {ఈ లేఖను కూడా పంపుచున్నాను}. 2 మన తండ్రియైన దేవుడు, మరియు మెస్సీయ ప్రభువైన యేసు మీ యెడల దయ చూపుచు, మరియు మిమ్ములను సమాధానముగా చేయును గాక. 3 మన ప్రభువైన యేసు మెస్సీయ యొక్క దేవుడు మరియు తండ్రిని మనం ఎల్లప్పుడు స్తుతిద్దాం - ఆయనే మన దయగల తండ్రి మరియు మన దేవుడు ఎల్లప్పుడు మనలను ఆదరించే వాడు. 4 మనం శ్రమపడినప్పుడల్లా దేవుడు మనలను ఆదరించాడు. ఏ విధంగానైనా శ్రమపడేవారిని మనం ఆదరించడానికి ఆయన దానిని చేస్తాడు. దేవుడు మనలను ఆదరించుచున్నట్టు వలే అదే విధానంలో వారిని ఆదరించడానికి ఆయన మనలను సమర్ధులను చేస్తాడు. 5 మీరు చూడండి, మెస్సీయ మన కోసం చాలా శ్రమ పడ్డాడు, మరియు ఇప్పుడు మనం ఆయనకు చెందినవాళ్లం కాబట్టి మెస్సీయ చేసినట్లే మనం కూడా శ్రమపడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు మెస్సీయ కూడా అదే సమృద్ధితో మనలను ఆదరిస్తాడు. 6 కాబట్టి మనుష్యులు మనలను శ్రమపెట్టినప్పుడల్లా దేవుడు మిమ్మల్ని ఓదార్చడం మరియు మిమ్మల్ని ఆత్మీయంగా రక్షించడం నిమిత్తం ఇది జరుగుతుంది. దేవుడు మమ్ములను ఆదరించినప్పుడు ఎప్పుడైనా అది ఆయన మిమ్ములను కూడా ఆదరించు నిమిత్తం ఇది జరుగుతుంది. మనుష్యులు మమ్ములను శ్రమపడేలా చేసిన విధముగానే మనుష్యులు మీకు శ్రమ కలిగించినప్పుడు మీరు ఓపికగా సహించినట్లు దేవుడు దీనిని చేస్తాడు. 7 మేము శ్రమలు అనుభవిస్తున్నట్లే మీరు కూడా శ్రమపడుతున్నప్పుడు దేవుడు మిమ్ములను కూడా ఆదరిస్తాడు అని మాకు తెలుసు. కాబట్టి, మీరు {యేసును విశ్వసించడం} కొనసాగిస్తారని మాకు చాలా నమ్మకం ఉంది.

8 ఉదాహరణకు, తోటి విశ్వాసులారా, ఆసియా ప్రాంతములో మాకు జరిగిన చెడు విషయాల గురించి మీరు తెలుసుకోవాలి అని మేము కోరుకుంటున్నాము. అవి చాలా కష్టముగా ఉన్నాయి మేము వాటిని భరించలేము అని భావించాము. మేము చనిపోతాము అని నిశ్చయముగా భావించాము. 9 ఒక న్యాయాధిపతి, “నేను నీకు మరణశిక్ష విధిస్తున్నాను” అని చెప్పడం విన్నప్పుడు ఒక వ్యక్తి అనుభూతి చెందినట్లు మాకు అనిపించింది. అయితే దేవుడు మనకు అలా అనుభూతి చెందడానికి అనుమతించాడు, తద్వారా మనం మన మీద ఆధారపడకుండా, అయితే బదులుగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటాము. ఆయన చనిపోయిన మనుష్యులను మరల బ్రతికింపచేసాడు. 10 మనం నిశ్చయముగా చనిపోతాం అని అనిపించినప్పటికి, మనలను చంపడానికి కోరుకున్నమనుష్యుల నుండి దేవుడు మమ్ములను రక్షించాడు, మరియు మమ్ములను {అటువంటి మనుష్యుల నుండి} రక్షించడం కొనసాగిస్తాడు. ఆయన తిరిగి మమ్ములను రక్షిస్తాడు అని మేము నమ్మకంగా ఆశిస్తున్నాము. 11 మీరు మా కోసం ప్రార్థించడం చేత మాకు సహాయం చేస్తుండగా. దయచేసి మా కోసం ప్రార్థించండి, తద్వారా ఆయన మా కోసం కృపతో చేసే దానికి అనేక మంది మనుష్యులు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు ఎందుకంటే అనేక మంది మనుష్యులు మా కోసం ప్రార్థించారు. 12 చేయడానికి దేవుడు మమ్ములను సమర్థులనుగా చేసియుండగా, మేము మనుష్యులు అందరి యెడల పరిశుద్ధము మరియు నిజాయితీ విధానములో ప్రవర్తించాము అని మేము యథార్థముగా చెప్పగలిగాము అని మేము గర్విస్తున్నాము. అవిశ్వాసులు జ్ఞానము అని అనుకొనే విధంగా మేము ప్రవర్తించ లేదు. బదులుగా, దేవుడు కృపతో మాకు మార్గనిర్దేశం చేస్తాడు, ముఖ్యంగా {మేము మీతో సంభాషిస్తుండగా}. 13 దీనిని చూడడానికి, నా పత్రికలు చూడండి. నేను మీకు వ్రాసిన అన్ని పత్రికలలో మీరు {సులభంగా} చదివి మరియు అర్థం చేసుకోగలిగే వాటిని మాత్రమే వ్రాసాను. {త్వరలో} మీరు {మమ్ములను } పూర్తిగా అర్థం చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను 14 మీరు మమ్ములను {ఇప్పటికే} పాక్షికంగా అర్థం చేసుకున్న విధముగా. అప్పుడు మన ప్రభువు యేసు మరల వచ్చినప్పుడు, మేము మీ గురించి గర్వించిన విధముగా మీరు మా గురించి గర్వపడతారు. 15 మరియు ఈ నమ్మకంతో నేను మొదట మీ వద్దకు రావడానికి నేను కోరుతున్నాను. తద్వారా రెండవ సారి నేను మీతో కలిగి యుండడం నుండి మీరు ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే, నేను మీ నగరం నుండి యుదయ ప్రాంతానికి వెళ్లాల్సిన వాటిని సరఫరా చేయడంలో మీరు సహాయం చేయవచ్చు. 16 నేను మాసిదోనియ ప్రాంతముకు వెళ్లే మార్గంలో ఒకసారి మిమ్మల్ని దర్శించాలి మరియు అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు మిమ్ములను మరల దర్శించాలని ప్రణాళిక చేసుకున్నాను. అలాగే, నేను మీ నగరం నుండి యూదయ ప్రాంతానికి వెళ్లడానికి నాకు అవసరమైన వాటిని సరఫరా చేయడంలో మీరు సహాయం చేయవచ్చు. 17 నేను ఆ రెండు సార్లు మిమ్ములను దర్శించాలని ఉద్దేశించాను {, అయితే నేను రెండవసారి రాలేదు}. నేను నా ప్రణాళికను తేలికగా మార్చుకున్నాను అని అర్థం కాదు. ఆ సమయంలో నేను కోరుకునే దాని ప్రకారం నేను నా ప్రణాళికలను తయారు చేయను లేదా మార్చను. “అవును, అది చేస్తాను” నేను చెప్పను, మరియు అప్పుడు త్వరగా చెప్పను, “లేదు, నేను ఇది చేయను” 18 దేవుడు నమ్మకంగా ఉన్న విధముగానే, మేము మీతో చెప్పే ప్రతి విషయంలో పూర్తిగా నిజాయితీగా ఉన్నాము. మేము నిజంగా "కాదు" అని అనుకున్నప్పుడు మేము ఎప్పుడూ "అవును" అని చెప్పము. 19 నేను మరియు సిల్వాను మరియు తిమోతి దేవుని యొక్క కుమారుడైన యేసు మెస్సీయ గురించి మీకు బోధించాము. {అది మీకు తెలుసు} ఆయన "అవును" అని ఎన్నడు చెప్పడు, "కాదు" అని ఆయన అర్థం అయిన యెడల. ఆయన ఎవరై ఉన్నాడో కారణంగా, ఆయన గురించి మా సందేశం కూడా స్థిరంగా మరియు ఆధారపడదగినదిగా ఉంది. 20 యేసు వలన మనం దేవుని యొక్క వాగ్దానాలు అన్నిటి మీద ఆధారపడవచ్చు. యేసు వాటి అన్నిటిని నెరవేరుస్తాడు. కాబట్టి, మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు, “అవును, ఇది నిజం” అని చెప్పగలిగేలా చేసేవాడు కూడా యేసే. 21 మీతో పాటు మేము కూడా మెస్సీయలో బలంగా విశ్వసించేలా చేసింది దేవుడే. తద్వారా మనం ఆయనను సేవించగలిగేలా తన ఆత్మను మనకు అందించిన దేవుడు కూడా ఆయనే. 22 దేవుడు మనలో నివసించడానికి పరిశుద్ధ ఆత్మను మనకు ఇచ్చాడు. మనం ఆయనకు చెందినవారము అని మరియు ఆయన మన కోసం చేస్తాను అని వాగ్దానం చేసిన అన్నిటిని కూడా మన కోసం చేస్తాడు అని అది చూపిస్తుంది.

23 కాబట్టి నేను నా ఆలోచనను ఎందుకు మార్చుకున్నానో ఇప్పుడు నేను మీకు చెపుతాను మరియు నేను ఉద్దేశించిన విధంగా మరల మిమ్మల్ని సందర్శించ లేదు. నేను అబద్ధం చెప్పిన యెడల దేవుడు నన్ను చనిపోయేంతగా కొట్టును గాక. అయితే నేను మీకు చెప్పేది నిజమని అతనికి తెలుసు. నేను కొరింతుకి తిరిగి రాకపోవడానికి కారణం మీరు చేసిన తప్పుల గురించి మీతో తీవ్రంగా మాట్లాడటం ద్వారా నేను మిమ్మల్ని దుఃఖపరచకుండా ఉంటాను. 24 నేను దానిని చెప్పినప్పుడు, మేము ఏమి నమ్మాలో మరియు ఏమి చేయాలో మీకు ఆజ్ఞలు ఇచ్చే మీ యజమానులము అని నా ఉద్దేశము కాదు. బదులుగా, మేము మీకు {దేవుని కోసం జీవించడం గురించి} చెప్పే ప్రతి ఒక్కటీ మీరు ఆనందంగా ఉండేలా ఉంది. మేము మీకు ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు తానే ఏమి నమ్మాలో మరియు ఏమి చేయాలో మీకు చెపుతాడు.

Chapter 2

1 {నేను మిమ్ములను సందర్శించలేదు} ఎందుకంటే గతసారి {నేను మిమ్ములను సందర్శించినట్లు} మీకు మరియు నాకు శ్రమ కలిగిస్తే మిమ్ములను సందర్శించకుండా ఉండేందుకు నేను ఎంచుకున్నాను. 2 {నేను మిమ్ములను తిరిగి సందర్శించకూడదని ఎంచుకున్నాను} ఎందుకంటే, నేను మిమ్ములను శ్రమపెట్టినప్పుడు, నన్ను సంతోషపెట్టగల మనుష్యులను మాత్రమే నేను శ్రమ పరచాను. 3 నేను ఇప్పుడు {మీకు} చెప్పుచున్నదానిని {నా మునుపటి లేఖలో} ఇప్పటికే వ్రాసాను. {నేను ఆ విషయాలు వ్రాసాను} కాబట్టి, నేను తదుపరి మిమ్ములను సందర్శించినప్పుడు, మీరు నన్ను శ్రమపెట్టకుండా ఉండేందుకు మరియు నేను మీ గురించి సంతోషిస్తాను. {నేను ఆ విషయాలు వ్రాసాను ఎందుకంటే} నేను సంతోషించినప్పుడు మీరు సంతోషిస్తారని మీ అందరి గురించి నాకు ఖచ్చితంగా తెలుసు. 4 నేను మీకు {ఆ మునుపటి లేఖ} వ్రాసినప్పుడు నేను చాలా శ్రమపడ్డాను మరియు లోపల గాయపడ్డాను. నిజానికి, {నేను వ్రాసేటప్పుడు} నేను ఏడ్చాను.{నేను మీకు పంపాను} తద్వారా నేను మీ కోసం ఎంత శ్రద్ధ వహిస్తున్నానో మీరు తెలుసుకుంటారు. నేను మిమ్ములను గాయపరచడానికి ఉద్దేశించలేదు.

5 అయితే, ఇతరులను గాయపరచిన వ్యక్తి నిజంగా నన్ను గాయపరచ లేదు. బదులుగా, ఆ వ్యక్తి {మీలో} కొందరిని గాయపరచాడు. {నేను "కొందరు" అనే పదాన్ని ఉపయోగించాను} తద్వారా నేను మీ అందరిని {ఆ వ్యక్తి గాయపరచిన వారిగా} చేర్చ లేదు. 6 మీలో చాలామంది కలిసి ఆ వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టారు. ఇంకా ఏమియూ {మీరు చేయనవసరం లేదు}. 7 కాబట్టి అప్పుడు, {ఆ వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టే} బదులు, మీరు ఇప్పుడు ఆ వ్యక్తిని క్షమించి మరియు ప్రోత్సహించాలి. లేనియెడల, వ్యక్తి చాలా దుఃఖపడతాడు మరియు వదులుకుంటాడు.

8 అందువలన, మీరు ఆ వ్యక్తి కోసం శ్రద్ధ వహిస్తున్నట్లు బహిరంగంగా చూపించమని నేను మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను. 9 నేను {ఆ మునుపటి పత్రిక } వ్రాయడానికి మరొక కారణం, {మీరు చేయడానికి} నేను అడిగిన ప్రతి దానిని మీరు చేస్తారా లేదా అని నేను ఖచ్చితంగా కనుగొనడం కోసం. 10 చివరికి, మీరు ఎవరినైనా దేని కోసమైనా క్షమించినప్పుడు, నేను కూడా ఆ వ్యక్తిని క్షమించాను. నిజానికి, ప్రాథమికంగా ఏమీ కానప్పటికీ, {ఆ వ్యక్తి చేసిన} దానికి నేను {ఆ వ్యక్తిని} క్షమించాను. మెస్సీయ కోరుకున్న విధముగా మీకు సహాయం చేయడానికి {నేను దానిని చేసాను}. 11 {మనం ఇతరులను క్షమించాలి} తద్వారా సాతాను మనలను నియంత్రించడు. నిజానికి, {మనలను నియంత్రించడానికి}వాడి ప్రణాళికలు అన్నిటి గురించి మనకు తెలుసు.

12 నేను త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు {తిరిగి రావడానికి నేను ఎలా ప్రయాణించానో ,} మెస్సీయను గురించిన సువార్తను ప్రభావవంతంగా ప్రకటించడానికి యేసు ప్రభువు దానిని నా కోసం సాధ్యం చేసాడు. 13 అయినప్పటికీ, నా తోటి విశ్వాసి అయిన తీతు {త్రోయ పట్టణంలో} లేనందున, నేను {అతడు మిమ్ములను సందర్శించినప్పుడు ఏమి జరిగిందో} అనే దాని గురించి నేను ఆత్రుతగా కొనసాగాను. అందువలన, నేను అక్కడ ఉన్న విశ్వాసులకు వీడ్కోలు చెప్పాను మరియు మాసిదోనియ యొక్క ప్రాంతానికి ప్రయాణించడానికి బయలుదేరాను.

14 ఇప్పుడు మనం దేవుని స్తుతిస్తున్నాము! {ఆయనే} మనలను మెస్సీయకు ఏకం చేసిన కారణంగా ఆయన {తన శత్రువులను} జయిస్తూ ఉండగా మనలను నిరంతరం చేర్చుకుంటాడు. ఇంకా, దేవుడు ఎలా ఉంటాడో అనేక స్థలములలో మనుష్యులకు బయలుపరచడానికి ఆయన మనలను ఉపయోగించుకుంటాడు. 15 నిజానికి, మనం క్రీస్తు నుండి వచ్చే ఆహ్లాదకరమైన వాసనలా ఉన్నాము మరియు అది దేవుని సంతోషపరుస్తుంది. దేవుడు రక్షించే మనుష్యులతో ఉన్నప్పుడు మరియు చనిపోయే మనుష్యులతో ఉన్నప్పుడు {మనం ఈ వాసన వలే ఉన్నాము}. 16 మృత దేహం నుండి వచ్చే వాసన వంటి వారము అని {చనిపోయే వారు అనుకుంటారు.} మరియు అది మనుష్యులు చనిపోయేలా చేస్తుంది. మరోవైపు, {దేవుడు రక్షించిన వారు మనం ఒక జీవించి ఉన్నవారి నుండి వచ్చే వాసన వంటి వారము అని భావిస్తారు మరియు అది మనుష్యులను జీవించేలా చేస్తుంది. ఎవరు సంపూర్ణంగా {ఆ విధంగా శుభవార్తను ప్రకటించలేరు}! 17 {మేము పరిపూర్ణంగా చేయలేదని మీరు చెప్పగలరు} ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన సందేశాన్ని అనేక ఇతర మనుష్యుల మాదిరిగా డబ్బు కోసం అమ్ముకోము. బదులుగా, మనం దేవుని సేవించాలని మాత్రమే కోరుకుంటున్నాము, ఏదో సంపాదించాలని కాదు. నిజానికి, {మేము సువార్తను ప్రకటిస్తాము} ఎందుకంటే అదే దేవుడు {చేయడానికి} మమ్ములను పంపాడు. కాబట్టి, దేవుడు మెస్సీయతో ఏకం చేసిన వారిగా, మనం దేవుని సంతోషపెట్టడానికి {సువార్తను} ప్రకటిస్తాము {, మనుష్యులను కాదు}.

Chapter 3

1 మేము నమ్మదగినవారము అని మీకు రెండవసారి మేము నిరూపించబోవడం లేదు. మీకు తెలిసిన విధముగా, ఇతర మనుష్యుల కోసం {మీరు ఆ పనులు చేయాల్సి ఉండవచ్చు} అయినప్పటికీ, మేము నమ్మదగినవారము అని రుజువు చేసే ఒక గమనికను మీరు వ్రాయడం లేదా స్వీకరించడం అవసరం లేదు. 2 మీరందరు {మేము నమ్మదగినవారము అని రుజువు చేసే} ఒక గమనిక వలె పనిచేస్తున్నారు. మేము ఒకరినొకరు చూసుకున్నప్పుడు, {మీ నుండి ఒక గమనిక} చదివిన విధముగా, మేము నమ్మదగినవారము అని మనుష్యులు అందరు గ్రహిస్తారు. 3 మీరు మెస్సీయ వ్రాసిన మరియు మేము అప్పగించిన ఒక గమనిక వంటి వారు అని అందరికీ తెలుసు. రంగును ఉపయోగించి రాతి పలకల మీద {మెస్సీయ} {ఈ గమనిక} వ్రాయ లేదు. బదులుగా, పరిశుద్ధ ఆత్మ ద్వారా పని చేయడం చేత మీలో {ఆయన దానిని వ్రాసిన విధముగా ఉంది}, {ఆయనే} ఏకైక నిజ దేవుడై ఉన్నాడు. 4 నేను ఆ విషయాలు చెప్పుచున్నాను. ఎందుకంటే {దేవుడు {మన గురించి అనుకుంటున్న దాని} గురించి మనకు ఖచ్చితంగా తెలుసు. {మనకు ఖచ్చితంగా ఉంది} ఎందుకంటే మెస్సీయ {మనల్ని నిశ్చయంగా} చేస్తాడు. 5 నిజమే, మనం మన స్వంతంగా {సువార్తను బాగా ప్రకటించ లేము}, మరియు మనం బాగా చేసేది ఏదైనా మన కారణంగా అని మనం తలంచము. బదులుగా, దేవుడు మనం {సువార్తను బాగా ప్రకటించడానికి} సహాయం చేస్తాడు. 6 క్రొత్త ఒప్పందము తరపున పనిచేయడానికి కూడా ఆయన మనలను సమర్థులనుగా చేసాడు. పరిశుద్ధ ఆత్మ {ఈ క్రొత్త ఒప్పందాన్ని} ఇస్తాడు, కాబట్టి ఇది కేవలం ఒకరు వ్రాసిన మాటలు కాదు. {ఇది ముఖ్యం} ఎందుకంటే {పరిశుద్ధాత్మ మీద ఆధారపడే మనుష్యులు} జీవిస్తారు, అయితే ఒకరు వ్రాసిన పదాల మీద {ఆధారపడేవారు} చనిపోతారు.

7 ఇంకా, చనిపోవడానికి {మనుష్యులను ఖండించిన పాత ఒప్పందం} తరపున మోషే చర్య తీసుకున్నప్పుడు, దేవుడు {ఒప్పందం యొక్క} పదాలను రాతి పలకల మీద చెక్కాడు. మోషే చేసినది తగినంత మహిమాన్వితమైనది, ఇశ్రాయేలీయులు అతని ముఖం వైపు చూడలేకపోయారు, ఎందుకంటే అది {దేవుడు ఎంత మహిమాన్వతుడో} ప్రతిబింబిస్తుంది, అయినప్పటికీ అది చివరికి పోతుంది. 8 కాబట్టి అప్పుడు, మనుష్యులు పరిశుద్ధాత్మ {ఇచ్చే క్రొత్త ఒప్పందము} తరపున పనిచేసినప్పుడు, అది ఇంకా ఎక్కువ మహిమాన్వితమైనదిగా ఉంటుంది. 9 నిజానికి, మోషే మనుష్యులను ఖండించే {దేవుని వద్దకు నడిపించే పాత ఒప్పందం} తరపున పని చేసినప్పుడు, అది మహిమాన్వితమైనది. కాబట్టి అప్పుడు, {మనుష్యులు నీతిమంతులుగా మారడానికి దారితీసే క్రొత్త ఒప్పందం} తరపున మనుష్యులు పని చేసినప్పుడు, అది ఇంకా ఎక్కువ మహిమాన్వితమైనది! 10 నిజానికి, మహిమాన్వితమైన {పాత ఒప్పందం} ఎంత మాత్రము మహిమాన్వితమైనదిగా కనిపించడం లేదు ఎందుకంటే {కొత్త ఒప్పందం} ఎంతో మహిమాన్వితమైనదై ఉంది. 11 నిజానికి, వెళ్ళిపోతున్న {పాత ఒప్పందం} మహిమాన్వితమైనది. కాబట్టి అప్పుడు, నిత్యము ఉండే {క్రొత్త ఒప్పందం} ఇంకా ఎక్కువ మహిమాన్వితమైనది!

12 కాబట్టి అప్పుడు, మనము ఈ {మహిమాన్వితమైన} విషయాలను {స్వీకరించడానికి} నమ్మకంగా ఆశిస్తున్నాము కాబట్టి, మనము చాలా ధైర్యంగా ప్రవర్తిస్తాము. 13 {మనం} వస్త్రాన్ని ధరించుకొని తన ముఖాన్ని దాచుకున్న మోషే వలే కాదు. ఆ విధంగా, ఇశ్రాయేలీయులు దేవుడు ఎంత మహిమాన్వితుడో అతని ముఖం ప్రతిబింబించడం ఎలా ఆగిపోయిందో చూడలేకపోయారు. 14 నిజానికి, ఇశ్రాయేలీయులు {దేవుడు బయలుపరచిన దానిని } అర్థం చేసుకో లేదు. నిజానికి, ఇప్పుడు కూడా, ఎవరైనా పాత ఒప్పందము {కలిగి ఉన్న లేఖనాలను} చదివినప్పుడు, మోషే ధరించిన వస్త్రం మనుష్యులు {దానిని} అర్థం చేసుకోకుండా చేస్తుంది {అన్నట్లు ఇది ఉంది}. అది ఎందుకంటే దేవుడు వారిని మెస్సీయతో ఐక్యం చేసే వరకు ఎవరు {ఈ లేఖనాలను} అర్థం చేసుకోలేరు. 15 నిజానికి, ఇప్పుడు కూడా ఎవరైనా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు, ఆ వస్త్రం మనుష్యులు దానిని అర్థం చేసుకోవడం నుండి ఉంచుతుంది అన్నట్టు ఇది ఉంది. 16 అయితే, మనుష్యులు ప్రభువైన {దేవుని} విశ్వసించడం ప్రారంభించినప్పుడు, దేవుడు ఆ వస్త్రాన్ని తొలగించిన విధముగా {మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని} అర్థం చేసుకునేలా చేస్తాడు. 17 నేను ప్రభువైన {దేవుని} గురించి మాట్లాడినప్పుడు, నా ఉద్దేశము పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధ ఆత్మయే {మనుష్యులు లేఖనాలను అర్థం చేసుకునేలా చేస్తాడు}. 18 కాబట్టి, ప్రభువైన {దేవుడు} ఎంత మహిమాన్వితుడో {విశ్వసించే} మనమందరం చూపిస్తాము, మరియు మన ముఖాలకు ఒక వస్త్రాన్ని కప్పుకోకుండా {మనము ఆవిధంగా చేస్తాము}. దేవుడు మనలను మారుస్తున్నాడు తద్వారా మనము {మెస్సీయ} వలె ఉంటాము. ఈ విధంగా, పరిశుద్ధ ఆత్మ అయిన మహిమాన్విత ప్రభువు, మనలను మహిమాన్వితులను చేస్తాడు.

Chapter 4

1 ఆ విషయాల కారణంగా, మరియు {క్రొత్త ఒప్పందం} తరపున చర్య తీసుకునేలా దేవుడు కరుణతో మనలను సమర్థులను చేసాడు కాబట్టి, మనము వదులుకోము. 2 బదులుగా, మనం దాచిపెట్టే ఏదైనా చేయడానికి నిరాకరిస్తాము ఎందుకంటే అది అవమానకరం. మనము ఇతరులను మోసగించడానికి ప్రయత్నించము, మరియు దేవుని నుండి వచ్చిన సందేశాన్ని మనము మార్చము. బదులుగా, మనము నిజమైన {సందేశాన్ని} ప్రకటిస్తాము, మరియు దేవుడు మనలను నమ్మదగినవారిగా పరిగణిస్తున్నాడని మనము ప్రతి ఒక్కరికి నిరూపిస్తాము. 3 నిజానికి, మనం ప్రకటించే సువార్తను అర్థం చేసుకొనని మనుష్యులు మాత్రమే గతించి పోతున్న మనుష్యులై ఉన్నారు. 4 ఇప్పుడు లోకాన్ని పరిపాలిస్తున్న సాతాను, నమ్మని ఈ మనుష్యులను అర్థం చేసుకోకుండా ఉంచాడు. ఆ విధంగా, దేవుడు ఎలా ఉంటాడో చూపే మహిమాన్వితమైన మెస్సీయ గురించిన శుభవార్త వారిని మార్చదు. 5 {మెస్సీయ గురించిన శుభవార్త అని నేను చెప్పుచున్నాను} ఎందుకంటే మనం మన గురించి ఇతరులకు చెప్పుకోము. బదులుగా, మెస్సీయ, ప్రభువైన యేసు గురించి మరియు ఆయనను బట్టి మేము మిమ్ములను ఎలా సేవిస్తాము అనే దాని గురించి {మేము వారికి చెప్పాము}. 6 “చీకటి ఉన్నది ప్రకాశవంతంగా మారుతుంది” అనే ఈ మాటలు దేవుడే చెప్పాడు కాబట్టి {మేము దానిని చేసాము}. ఆయన ఎంత మహిమాన్వితుడనే దానిలో నిజం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఆయన మనకు సహాయం చేసాడు, ఆయన మన మీద ఒక వెలుగును ప్రకాశింపజేసిన విధముగా. మెస్సీయ అయిన యేసులో {దేవుడు దీనిని బయలుపరిచాడు}.

7 మనము ఈ అద్భుతమైన విషయాలను అనుభవిస్తాము మరియు ప్రకటిస్తాము, అయితే మనమే బలహీనులం మరియు విలువలేనివారం. ఆ విధంగా, {ఇది స్పష్టంగా ఉంది} దేవుడు ఈ విషయాలు చాలా శక్తివంతంగా ఉండేలా చేస్తాడు, మనం కాదు. 8 మనము అనేక {కష్టమైన విషయాలను} అనుభవిస్తాము. మనుష్యులు మనలను హింసిస్తారు, అయితే వారు మనలను జయించ లేరు. మనము ఏమి చేయాలో ఖచ్చితంగా తెలియదు, అయితే మనము వదులుకోము. 9 మనుష్యులు మనలను గాయపరచడానికి ప్రయత్నిస్తారు, అయితే దేవుడు మనలను విడిచిపెట్టడు. మనుష్యులు మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, అయితే వారు మనలను ఓడించ లేరు. 10 యేసు చేసినట్టు వలే మనం కూడా శారీరకంగా నిరంతరం శ్రమ పడతాం. ఆ విధంగా, దేవుడు యేసును తిరిగి బ్రతికించిన విధముగా ఆయన మనలను తిరిగి బ్రతికిస్తాడు. 11 నిజానికి, మనం జీవిస్తుండగా, యేసు కారణంగా దేవుడు మనలను నిరంతరం శ్రమపడడానికి అనుమతిస్తాడు. ఆ విధంగా, అయినప్పటికీ మనం చనిపోతాము, దేవుడు యేసును తిరిగి బ్రతికించిన విధముగా ఆయన మనలను తిరిగి బ్రతికిస్తాడు. 12 మీరు చూడగలిగిన విధముగా, దేవుడు మనలను శ్రమపడడానికి అనుమతిస్తాడు, అయితే ఆయన మిమ్ములను బ్రతికిస్తాడు.

13 {కీర్తనలో} వ్రాసిన వ్యక్తి వలే ఇప్పుడు మనం {దేవుని} విశ్వసిస్తున్న వారిమై ఉన్నాము. “నేను {దేవుని} విశ్వసించుచున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను." మనం కూడా {దేవుని} విశ్వసించుచున్నాము. కాబట్టి మనం కూడా మాట్లాడతాము. 14 {మేము దానిని చేస్తాము ఎందుకంటే} దేవుడు యేసును తిరిగి బ్రతికించాడు అని మనం గ్రహించాము, కాబట్టి ఆయన మనలను కూడా తిరిగి బ్రతికిస్తాడు. అప్పుడు మేము యేసుతో మరియు మీతో దేవుని ముందు ఉంటాము. 15 మీకు సహాయం చేయడానికి మేము వాటిలో ప్రతి ఒక్కటి చేస్తాము. ఆ విధంగా, దేవుడు అనేక మంది మనుష్యుల యెడల కృపతో వ్యవహరిస్తాడు. అప్పుడు, మనుష్యులు దేవునికి ఎక్కువ కృతజ్ఞతలు తెలుపుతారు, ఇది దేవుని ఘనపరుస్తుంది. 16 అందువలన, మేము వదులుకోము. బదులుగా, మనుష్యులు చూడగలిగే మన భాగం నశించిపోవుచున్నప్పటికీ, మనుష్యులు చూడలేని భాగాన్ని దేవుడు ప్రతిరోజూ బలపరుస్తున్నాడు. 17 {మనము వదులుకోము,} ఎందుకంటే మనం తాత్కాలిక మరియు అప్రధానమైన మార్గాలలో శ్రమపడినప్పుడు, అది మనకు నిత్యము మరియు ముఖ్యమైన మార్గాలలో మరియు మనం ఊహించలేనంతగా మహిమాన్వితమైనదిగా మారుతుంది. 18 కాబట్టి, మనం చూసే వాటి మీద కాకుండా మనం చూడని వాటి మీద దృష్టి పెడతాము. {అది} ఎందుకంటే మనం చూడనిది నిత్యము ఉంటుంది, అయితే మనం చూసేది గతించిపోతుంది.

Chapter 5

1 నిజానికి, ఈ భూమి మీద మనకున్న శరీరాలు చనిపోతాయి అని మనం గ్రహించాము. అవి మనుష్యులు నాశనం చేసే గుడారాలు వలె ఉన్నాయి. అయినప్పటికీ, దేవుడు మనకు నిత్యము జీవించే క్రొత్త శరీరాలను ఇస్తాడు. అవి దేవుడు పరలోకపు ప్రదేశాలలో సృష్టించే భవనాల వలె ఉంటాయి. 2 నిజానికి, ఈ శరీరాలలో మనం ఎలా జీవిస్తున్నాం అని మేము దుఃఖిస్తున్నాము. దేవుడు మనకు క్రొత్త వస్త్రాలు ధరింపచేస్తున్న విధముగా మనకు క్రొత్త శరీరాలు ఇవ్వాలని మనం కోరుచున్నాము. ఈ క్రొత్త శరీరాలు పరలోకము నుండి {దేవుడు మనకు ఇచ్చే} భవనాల వలె ఉంటాయి. 3 మనం మన క్రొత్త శరీరాలను స్వీకరించినప్పుడల్లా, అవి మనకు నగ్నంగా ఉండకుండా చేసే వస్త్రాలువలె ఉంటాయి.

4 అయినా ఇంకా, గుడారాలు వంటి శరీరాలు మనము కలిగి ఉండగా, మనం దుఃఖిస్తాం, మరియు ఈ శరీరాలు జీవించడం కష్టతరం చేస్తాయి. దాని కారణంగా, మనం శరీరాలు లేకుండా ఉండాలి అని కోరుకోవడం కాదు, అది వస్త్రాలు కలిగి లేకుండా ఉండటమే. బదులుగా, క్రొత్త శరీరాలను పొందాలని {మేము కోరుచున్నాము}, అది క్రొత్తవస్త్రాలు వేసుకున్నట్లుగా ఉంటుంది. ఆ విధంగా, మనం చనిపోతామని ఆశించడం బదులు నిత్యము జీవిస్తాం. 5 ఈ క్రొత్త శరీరాలకు మనలను సిద్ధం చేసేది దేవుడే. ఆయన మనకు పరిశుద్ధ ఆత్మను ఇచ్చాడు, ఇది ఆయన వాగ్దానం చేసిన అన్నిటిని కూడా మనకు ఇస్తాడు అని చూపిస్తుంది.

6 కాబట్టి, అప్పుడు, {దేవుడు మనకు ఏమి ఇస్తాడో} అనే విషయంలో మనం అన్ని సమయాలలో నమ్మకంగా ఉంటాము. అలాగే, మనము ఈ శరీరాలు కలిగి ఉండగా, మనం ప్రభువు {యేసు}తో లేము అని గ్రహించాము. 7 నిజానికి, మనము {ప్రభువైన యేసును} విశ్వసిస్తున్నాము కాబట్టి మనం వ్యవహరిస్తాము, మనం {ఆయనను} చూసిన దానిని బట్టి కాదు. 8 నేను చెప్పిన విధముగా, {దేవుడు మనకు ఏమి ఇస్తాడు} అనే నమ్మకంతో మనం ఉన్నాం. అలాగే, మన శరీరాలు లేకుండా మరియు ప్రభువు {యేసు}తో ఉండటానికి బదులుగా మనం ఎంపిక చేసుకుంటాము. 9 కాబట్టి అప్పుడు, మనం ఆయనతో ఉన్నా లేకపోయినా యేసు ప్రభువును సంతోషపెట్టడానికి కృషి చేస్తాము. 10 {మేము దానిని చేస్తాము} ఎందుకంటే మనము అందరం మెస్సీయ ముందు హాజరు కావాలి మరియు మనలో ప్రతి ఒక్కరు ఏది సరైనది లేదా ఏది తప్పు చేసామో ఆయన నిర్ణయిస్తాడు. అప్పుడు, మనం ఈ శరీరాలను కలిగి ఉన్నప్పుడు మనం చేసిన దానికి అనులోమానుపాతంలో ఆయన మనకు అర్హమైన వాటిని ఇస్తాడు.

11 కాబట్టి అప్పుడు, ప్రభువు {యేసుకు} భయపడడం అంటే ఏమిటో మనం అనుభవిస్తున్నాము కాబట్టి, మనం ఇతరులను {ఆయనకు కూడా భయపడమని} ఒప్పిస్తాము. {మనం నమ్మదగినవారము అని} దేవుడు యెరుగును మరియు మీరు కూడా {మేము నమ్మదగినవారము అని} తెలుసుకోవాలని నేను మిమ్ములను కోరుచున్నాను. 12 మేము నమ్మదగినవారము అని మీకు రెండవ సారి నిరూపించడం లేదు. బదులుగా, మా గురించి గొప్పగా చెప్పుకోవడానికి మేము మిమ్ములను సమర్థులనుగా చేస్తున్నాము. ఆ విధంగా, మనుష్యులు బయట ఎలా కనిపిస్తారు అనే దాని గురించి గొప్పగా చెప్పే ఎవరికైనా మీరు ప్రతిస్పందించవచ్చు మరియు లోపల ఉన్న మనుష్యులు నిజంగా ఎవరు అనే దాని గురించి కాదు. 13 కాబట్టి, మనము పిచ్చిగా కనిపించినప్పుడు, మనం దేవుని సేవిస్తున్నాం. మేము సాధారణంగా ఆలోచించినట్లు అనిపించినప్పుడు, మేము మీకు సేవ చేస్తున్నాము. 14 {ఆ సంగతులు సత్యం} ఎందుకంటే మెస్సీయ మనలను ప్రేమిస్తున్నాడు, మరియు అది మనలను {నిర్దిష్ట మార్గాలలో పనిచేయడానికి} నిర్దేశిస్తుంది. దీని గురించి మనం ఎలా ఆలోచిస్తామో ఇక్కడ ఉంది: ఒక వ్యక్తి {, మెస్సీయ,} మనుష్యులు అందరిని రక్షించడానికి మరణించాడు. దాని వలన, {అది ఆలాగు} మనుష్యులు అందరు మరణించారు. 15 ఇంకా, {ఇందు వలననే} ఆయన మనుష్యులు అందరిని రక్షించడానికి మరణించాడు: ఆ విధంగా, ఆత్మీయముగా జీవించే వారు ఇక మీదట తమకు కావలసినది చేయరు. బదులుగా, మెస్సీయ కోరుకున్నది {వారు చేస్తారు}, ఎందుకంటే ఆయన వారిని రక్షించడానికి మరణించాడు మరియు దేవుడు ఆయనను తిరిగి బ్రతికించాడు.

16 వాటి అన్నిటి కారణంగా, మనం ఇక మీదట ఎవరి గురించి కేవలం మానవ విధానాలలో ఆలోచించడం లేదు. నిజముగా, ఒకప్పుడు మనం మెస్సీయ గురించి కేవలం మానవ విధానములలో ఆలోచించినప్పటికీ, మనం ఆయన గురించి ఇక మీదట ఆ విధానములలో ఆలోచించము. 17 కాబట్టి అప్పుడు, దేవుడు మనుష్యులను మెస్సీయతో కలిపినప్పుడల్లా ఆయన వారిని నూతన మనుష్యులుగా చేస్తాడు. వారు ఎలా ఉండేవారో అది అదృశ్యమైపోయింది. చూడండి, వారు ఇప్పుడు ఏమై ఉన్నారో అది నూతనంగా ఉంది! 18 ఈ విషయాలలో ప్రతి ఒక్కటి మనకు ఇచ్చేది దేవుడే. మెస్సీయ ద్వారా పని చేయడం చేత, ఆయన మనలను ఆయనతో కలిసి ఉండేలా సమర్థులను చేసాడు. ఇంకా, పని చేయడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు తద్వారా ఇతరులు కూడా తనతో ఉంటారు. 19 అది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది: ప్రతి వ్యక్తి తనతో ఉండడానికి సమర్థులను చేయుటకు దేవుడు క్రీస్తు ద్వారా పని చేస్తాడు. అలాగు చేయడములో, ఆయన మనుష్యులు వారు చేసిన తప్పుల కోసం వారిని క్షమించాడు. ఇంకా, వారు దేవునితో ఎలా ఉండవచ్చో ఇతరులకు చెప్పడానికి ఆయన మనకు ఆజ్ఞాపిస్తాడు.

20 ఎందుకంటే {దేవుడు మనలను నియమించాడు}, మేము మెస్సీయకు ప్రాతినిధ్యం వహిస్తాము. కాబట్టి, దేవుడు మన ద్వారా ఇతరులను ప్రోత్సహిస్తాడు. మీరు దేవునితో ఉండేందుకు {సువార్తను విశ్వసించడానికి తద్వారా} మేము మిమ్ములను అడిగినప్పుడు మేము మెస్సీయ కోసం మాట్లాడతాము. 21 యేసు పాపం చేయలేదు. {అయినప్పటికీ,} మన నిమిత్తము దేవుడు ఆయనను పాపం చేసినట్లుగా వ్యవహరించాడు. తత్ఫలితంగా, దేవుడు మనలను యేసుతో ఏకం చేయడం చేత నీతిమంతులుగా చేస్తాడు.

Chapter 6

1 దేవునితో సేవ చేసే వారిగా, దేవుడు దయతో {మీ కోసం} చేసిన దానిని పూర్తిగా అంగీకరించమని మేము మిమ్ములను ప్రోత్సహిస్తున్నాము, తద్వారా అది {మీరు ఎలా జీవించాలో} మారుస్తుంది. 2 {మీరు దానిని చేయాలి} ఎందుకంటే దేవుడు {లేఖనములో} చెప్పాడు:

     “ఇది సరైన సమయం అని నేను పరిగణించినప్పుడు, నేను మీ మాట విన్నాను {మరియు చర్య తీసుకున్నాను}.

     నిజానికి, నేను {మనుష్యులను} రక్షించేటప్పుడు, నేను నీకు సహాయం చేసాను.”

ఇప్పుడే దేవుడు ఉత్తమ సమయంగా పరిగణిస్తున్నాడు! నిజముగా, ప్రస్తుతం దేవుడు {మనుష్యులను} రక్షించే సమయం!

3 మేము ఇతరులకు అభ్యంతరం కలిగించే ఏదైనను చెయ్యడం మానుకుంటాము. ఆ విధంగా, మేము {దేవుణ్ణి} ఎలా సేవిస్తామో ఎవరు విమర్శించలేరు. 4 బదులుగా, మేము దేవుని సేవిస్తున్నప్పుడు మేము అన్ని విధాలుగా నమ్మదగినవారము అని నిరూపిస్తాము. మనుష్యులు మమ్ములను శ్రమ పెట్టినప్పుడు మరియు హింసించినప్పుడు మేము ఎల్లప్పుడు పట్టుదలతో ఉంటాము. 5 మనుష్యులు మమ్ములను కొట్టినప్పుడు, చెరసాలలో పెట్టినప్పుడు, మరియు మా మీద జనసమూహములను రెచ్చగొట్టినప్పుడు {మేము పట్టుదలతో ఉంటాము}. మేము కష్టపడి పనిచేసినప్పుడు, ఎక్కువ నిద్రపోకుండా, ఆకలితో ఉన్నప్పుడు {మేము పట్టుదలతో ఉంటాము}. 6 మేము చెడు విషయాల నుండి విముక్తి పొందాము, {సత్యము ఏమిటో} మాకు తెలుసు, మరియు మేము సులభంగా కోపపడము. మేము {ఇతరుల కోసం} శ్రద్ధ వహిస్తాము, మేము పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నాము, మరియు మేము {మనుష్యులను} హృదయపూర్వకంగా ప్రేమిస్తాము. 7 మేము సత్యాన్ని ప్రకటిస్తాము, మరియు శక్తివంతంగా పనిచేయడానికి దేవుడు మమ్ములను సమర్థులను చేస్తాడు. మనం నీతిమంతులం, ఇది ఒక చేతిలో కత్తి మరియు మరొక చేతిలో డాలు కలిగి ఉండడం వంటిది. 8 కొందరు మనలను గౌరవిస్తారు, మరియు మరికొందరు మనలను అవమానపరుస్తారు. కొందరు మనుష్యులు మన గురించి చెడుగా చెపుతారు, మరియు మరికొందరు మన గురించి మంచిగా చెపుతారు. కొందరు మనుష్యులు మనం అబద్ధాలు చెపుతాము అని అనుకుంటారు, అయితే నిజంగా మనం సత్యము మాట్లాడతాం. 9 మనలను ఎవరు అంగీకరించరు అని కొందరు అనుకుంటారు, అయితే నిజంగా, దేవుడు మనలను అంగీకరిస్తాడు. కొందరు మనుష్యులు మనం చనిపోవుచున్నాము అని అనుకుంటారు, అయితే నిజంగా, మనం బ్రతికి ఉన్నాము! దేవుడు మనలను శిక్షిస్తున్నాడు అని కొందరు మనుష్యులు అనుకుంటారు, అయితే నిజంగా, మనం చనిపోవాలి అని ఆయన నిర్ణయించ లేదు. 10 మనం దుఃఖిస్తున్నాము అని కొందరు మనుష్యులు అనుకుంటారు, అయితే నిజంగా, మనం నిరంతరం సంతోషిస్తాం. కొందరు మనుష్యులు మనం అవసరంలో ఉన్నాము అని అనుకుంటారు, అయితే నిజంగా, అనేకమంది మనుష్యులు నిజంగా విలువైన వాటిని పొందేందుకు మనము సహాయం చేస్తాము. కొందరు మనుష్యులు మన దగ్గర ఏమీ లేదు అని అనుకుంటారు, అయితే నిజంగా, మనకు ప్రతిదీ ఉంది.

11 కొరింతీ పట్టణంలోని తోటి విశ్వాసులారా, మేము మీకు సత్యమేమిటో చెప్పాము, మరియు మేము మీ యెడల ఎంతో శ్రద్ధ వహిస్తాము. 12 మేము {మీ కోసం శ్రద్ధ వహించడం} మానేసిన వాళ్ళం కాదు. బదులుగా, మీరు {మా కోసం} పట్టించుకోవడం మాని వేసారు. 13 ఇప్పుడు నేను మీతో మాట్లాడతాను, పిల్లలు {చేసినట్టు} వలే {మీరు సరళంగా ఆలోచించినట్లు}: మేము మీ యెడల శ్రద్ధ వహిస్తాము కాబట్టి, మీరు మా యెడల శ్రద్ధ వహించిన యెడల అది సరైనది. 14 {మెస్సీయను} విశ్వసించని మనుష్యులతో చేర వద్దు. {నేను దానిని చెప్పుచున్నాను} ఎందుకంటే ఏది సరైనది మరియు ఏది తప్పు అనేది ఉమ్మడిగా ఏమీ లేదు. ఇంకా, మంచి అయినది చెడు అయినదానితో దేనినీ పంచుకోదు. 15 మెస్సీయ బెలియాలు అనే సాతానుతో {దేని గురించి} ఏకీభవించడు. ఇంకా, {మెస్సీయను} విశ్వసించే మనుష్యులు {మెస్సీయను} విశ్వసించని మనుష్యులతో సంబంధం కలిగి ఉండరు. 16 దేవుని యొక్క మందిరం ఇతర దేవుళ్ళతో కలిసి వెళ్ళదు. నిజానికి, {విశ్వసించే వారం} మనం మాత్రమే నిజమైన దేవుని మందిరమై ఉన్నాము. {మనం దేవుని ఆలయము అని మీరు చెప్పగలరు} ఎందుకంటే దేవుడు {లేఖనాలలో ఈ మాటలు} చెప్పాడు: “నేను నా మనుష్యులతో ఉంటాను. నిజానికి, నేను వారిని విడిచిపెట్టను. మరియు వారు నన్ను తమ దేవుడిగా ఉండడానికి భావిస్తారు మరియు నేను వారిని నా మనుష్యులుగా ఉండడానికి భావిస్తాను. 17 కాబట్టి అప్పుడు, ప్రభువైన {దేవుడు} {లేఖనములలో} చెప్పిన విధముగా {మనం చేయాలి}:

     “{నన్ను సేవించని} మనుష్యుల నుండి దూరంగా ఉండండి.

     మీరు {వారి కంటే} భిన్నంగా ఉన్నారు అని నిశ్చయము చేసుకోండి.

     నిన్ను అపవిత్రం చేసే దేని నుండి అయిన దూరంగా ఉండు.”

     {ఆయన చెప్పుచున్నాడు,} "అప్పుడు, నేను నిన్ను సంతోషముగా స్వీకరిస్తాను."

18 ఇంకా, సమస్తాన్ని పరిపాలించే ప్రభువైన {దేవుడు}, చెప్పుచున్నాడు

     “నేను నీకు తండ్రిగా ఉంటాను.

     మీరు నాకు కుమారులు మరియు కుమార్తెలుగా ఉంటారు.”

Chapter 7

1 కాబట్టి, నేను ప్రేమించే {తోటి విశ్వాసులారా}, దేవుడు మనకు ఈ సంగతులు వాగ్దానం చేసాడు కాబట్టి, బయట మరియు లోపల మనలను అపవిత్రం చేసే ప్రతిదానిని మనం వదిలించుకోవాలి. దేవునికి భయపడుతూనే మనం సంపూర్ణంగా పరిశుద్ధంగా మారాలి. 2 మా కోసం శ్రద్ధ వహించమని {మిమ్ములను అడుగుచున్నాము}! మేము గాయపరచ లేదు, మోసం చేయలేదు లేదా ఎవరిని నాశనం చేయలేదు. 3 మిమ్ములను నిందించడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు. నిజానికి, నేను ఇప్పటికే {ఈ లేఖలో} వ్రాసిన విధముగా, ఏమి సంభవించినప్పటికీ మేము మీ కోసం ఎంతో శ్రద్ధ వహిస్తాము. 4 మీరు {సరైనది చేస్తారు} {అని} నాకు చాలా నమ్మకం ఉంది. {నిజానికి,} నేను తరచుగా మీ గురించి గొప్ప విషయాలు చెపుచున్నాను. మీరు నన్ను గొప్పగా ప్రోత్సహిస్తున్నారు, మరియు మేము శ్రమపడుచున్నప్పుడు కూడా నేను {మీ గురించి} చాలా సంతోషిస్తున్నాను.

5 ఇప్పుడు {నేను ఎలా ప్రయాణించాను} అనేదానికి తిరిగి రావడానికి, మేము మాసిదోనియలో చేరుకున్నప్పుడు, మాకు విషయాలు అంత సులభతరం కాలేదు. బదులుగా, మేము అనేక విధాలుగా శ్రమపడ్డాము. ఇతర మనుష్యులు మాతో గొడవ పడ్డారు, మరియు మేము తరచుగా మేమే భయపడ్డాము. 6 అయినప్పటికీ, నిరుత్సాహంగా భావించే మనుష్యులను దేవుడు ప్రోత్సహిస్తాడు. తీతు {మమ్ములను} చేరడం చేత ఆయన మమ్ములను ప్రోత్సహించాడు. 7 తీతును {మమ్ములను} చేరేలా చేయడం ద్వారా పాక్షికంగా {దేవుడు మమ్ములను ప్రోత్సహించాడు}, అయితే దానికి మించి మీరు చేసిన పని తీతును ఎంతో ప్రోత్సహిస్తుంది. మీరు {నన్ను చూడాలని} కోరుకుంటున్నారని, {మీరు చేసిన దానికి} చింతిస్తున్నారు అని మరియు మీరు నన్ను గౌరవించటానికి ప్రయత్నిస్తున్నారు అని అతడు మాకు చెప్పాడు. ఆ విషయాల కారణంగా, నేను {ఇంతకు ముందు చేసినదాని కంటే} ఎక్కువ సంతోషించాను.

8 నేను రాసిన దానితో మిమ్ములను గాయపరచినప్పటికీ, {నేను మునుపటి పత్రిక వ్రాసినందుకు} నేను విచారపడుట లేదు. నిజానికి, నేను విచారపడుచున్నాను ఒకే కారణం {దానిని నేను వ్రాసాను అని} ఆ పత్రిక మిమ్ములను గాయపరచింది అని నాకు తెలుసు, అయినప్పటికీ కొద్ది సమయం కొరకు మాత్రమే. 9 అయినప్పటికీ, ఇప్పుడు {తీతు మీ గురించి మాకు చెప్పాడు అని} నేను చాలా సంతోషంగా ఉన్నాను. {నేను సంతోషంగా ఉన్నాను} నేను మిమ్ములను గాయపరచిన కారణంగా కాదు. బదులుగా, {నేను సంతోషంగా ఉన్నాను} ఎందుకంటే నేను మిమ్ములను గాయపరచినప్పుడు, {మీరు చేసిన దానికి} మీరు విచారపడి, మరియు {దీనిని చేయడం} ఆపివేసారు. నిజానికి, మీరు దేవుని గౌరవించే విధంగా గాయపరచబడ్డారు. కాబట్టి, మీరు మంచిదానిని ఏదైనా కోల్పోయేలా మేము చేయలేదు. 10 {అది} ఎందుకంటే, దేవుని ఘనపరచే విధానంలో మనుష్యులు గాయపరచబడినప్పుడు, ఇది వారిని {వారు చేసిన దానికి} విచారపడేలా చేస్తుంది, మరియు {దానిని చేయడం} ఆపుతుంది. { వారు గాయపరచబడ్డారు అని } వారు విచారపట లేదు, ఎందుకంటే వారిని రక్షించడానికి {వారు భావించే దానిని దేవుడు ఉపయోగిస్తాడు}. అయినప్పటికీ, అనేకమంది మనుష్యులు చేసే విధానంలో మనుష్యులు గాయపరచబడినప్పుడు, {వారు ఎలా భావిస్తారు} అనేది చివరికి వారు చనిపోయేలా చేస్తారు. 11 మీ విషయానికొస్తే, దేవుని ఘనపరచే విధంగా మీరు గాయపరచబడినప్పుడు, అది నిశ్చయముగా మీరు {సరైనది చేయడానికి} చాలా ఆసక్తితో ఉండేలా చేసింది. మీరు దోషి కాదు అని వాదించారు. మీరు {జరిగిన దాని గురించి} కలత చెందారు. మీరు {జరిగినదాని గురించి} భయపడుచున్నారు. మీరు {మమ్ములను చూడడానికి} కోరుచున్నారు. మీరు {మమ్ములను } గౌరవించడానికి ప్రయత్నించారు. మీరు {తప్పు చేసిన వ్యక్తిని} శిక్షించారు. {ఆ పనులు} అన్ని చేయడం చేత, మీరు ఏమి జరిగిందో దానికి ప్రతిస్పందనగా మీరు సరైనది చేసారు అని చూపించారు. 12 కాబట్టి అప్పుడు, నేను మీకు {మునుపటి పత్రిక} పంపినప్పుడు, తప్పు చేసిన వ్యక్తితో నేను ప్రధానంగా వ్యవహరించ లేదు. అలాగే, అతడు గాయపరచిన వ్యక్తితో నేను ప్రధానంగా వ్యవహరించ లేదు. బదులుగా, మీరు మా యెడల {సరిగా ప్రవర్తించడానికి} ఎంత ఆత్రుతగా ఉన్నారో మరియు దేవుడు {దీనిని} ఆమోదిస్తాడు అని మీకు చూపించడానికి నేను ఉద్దేశించాను. 13 మీరు ఈ విధానాలలో స్పందించారు కాబట్టి, మీరు మమ్మల్ని ప్రోత్సహించారు. నిజానికి, మీరు మమ్మల్ని ప్రోత్సహించినప్పటికీ, మీరు తీతును ఎలా సంతోషపెట్టారనే దాని గురించి మేము మరింత సంతోషిస్తున్నాము. మీరందరూ అతనిని ఓదార్చినప్పుడు మరియు బలపరచినప్పుడు { మీరు దానిని చేసారు}. 14 {మేము ఇంత సంతోషంగా ఉన్నాం}. ఎందుకంటే నేను మీ గురించి తీతుతో గొప్ప సంగతులు చెప్పిన తర్వాత మీరు నన్ను కించపరచలేదు. బదులుగా, మీ గురించి మేము చెప్పిన గొప్ప విషయాలు వాస్తవానికి సత్యము అని తీతు కనుగొన్నాడు. {ఇది} మేము మీకు చెప్పిన ప్రతి విషయం కూడా ఎలా నిజమో అదే విధముగా ఉన్నాయి. 15 మీరు అందరు మాకు ఎలా విధేయత చూపారో, ముఖ్యంగా అతడు వచ్చినప్పుడు మీరు అతనికి ఎలా భయపడ్డారో తీతు గుర్తుచేసుకున్నాడు. {దానిని బట్టి,} అతడు ఇప్పుడు మీ గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాడు. 16 మీరు {సరియైనదే చేస్తున్నారు} అని నాకు పూర్తిగా నిశ్చయం ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను.

Chapter 8

1 నా తోటి విశ్వాసులారా, మాసిదోనియ ప్రాంతములో {ఇక్కడ} విశ్వాసుల గుంపులను దేవుడు కృపతో ఏమి చేయగలిగాడు అనే దాని గురించి మేము మీకు చెప్పాలనుకుంటున్నాము. 2 వారు చాలా ఎక్కువ శ్రమపడినప్పటికీ, {వారు ఎలా స్పందిస్తారో} పరీక్షించబడ్డారు, వారు మిక్కిలి దాతృత్వము గలవారుగా ఉన్నారు. వారు చాలా కొంచెము కలిగి ఉన్నప్పటికీ, {వారు దీనిని చేసియుండగా} వారు చాలా సంతోషముగా ఉన్నారు. 3 నిజానికి, వారు అర్పించగలిగినంత ఎక్కువ, మరియు వారు అర్పించగలిగే దానికంటే ఎక్కువగా {వారు అర్పించారు} అని నేను మీకు చెప్పగలను. దీనిని చేయడానికి వారే ఎంచుకున్నారు. 4 {వారు ఇచ్చేది} మమ్ములను వారు అంగీకరించమని కోరినప్పుడు వారు చాలా పట్టుదలగా ఉన్నారు. వారు దేవుని మనుష్యులకు సేవ చేయడంలో పంచుకోవడానికి కోరుకున్నారు. 5 ఇంకా, వారు మేము ఊహించిన దాని కంటే ఎక్కువ చేసారు. వారు ప్రాథమికంగా ప్రభువైన {యేసును} సేవించడానికి మరియు ఆ తర్వాత మాకును {సేవ చేయడానికి} తమను తాము అంకితం చేసుకున్నారు. {అది} కేవలం దేవుడు కోరుకునేది. 6 దాని కారణంగా, మీరు ఇచ్చే వాటిని అంగీకరించడం ముగించడానికి మేము తీతును ప్రోత్సహించాము, ప్రత్యేకించి అతడు ఇప్పటికే {ఆ విధముగా చేయడం} ప్రారంభించాడు. 7 మీ విషయానికొస్తే, మీరు ఇప్పటికే చాలా విధాలుగా బాగానే చేయుచున్నారు. మీరు {దేవుని} ఎలా విశ్వసిస్తారో, మీరు ఏమి చెప్పుతారో, మీకు ఎంత తెలుసో, మీరు ఎల్లప్పుడూ {సరైనది చేయడానికి} ఎలా ఆసక్తిగా ఉంటారో, మరియు మేము మిమ్ములను ఎంతగా ప్రేమిస్తున్నామో {దీనిలో చేరి ఉన్నాయి}. కాబట్టి, మీరు {తోటి విశ్వాసులకు డబ్బు} ఇవ్వడంలో కూడా బాగా చేయాలి.

8 {డబ్బు ఇవ్వడానికి} నేను మీకు ఆజ్ఞాపించడం లేదు. బదులుగా, ఇతర మనుష్యులు ఎల్లప్పుడు {డబ్బు ఇవ్వడానికి} ఎలా ఆసక్తిగా ఉంటారో {మీరు చేసే పనులను} పోల్చడం ద్వారా మీరు {తోటి విశ్వాసుల కోసం} నిజంగా శ్రద్ధ వహిస్తున్నారు అని నేను చూపించాలని కోరుచున్నాను. 9 {మీరు డబ్బు ఇవ్వడానికి ఉత్సాహంగా ఉండాలి} ఎందుకంటే మన ప్రభువైన యేసు మెస్సీయ మీకు సహాయం చేయడానికి తనకు ఉన్నదంతా దయతో వదులుకున్నాడు అని మీరు గ్రహించారు. {ఆయన అనేక సంగతులు కలిగి ఉన్నప్పటికీ} ఆయన దానిని చేశాడు. ఆయన కలిగియున్న దానిని వదులుకోవడం చేత తానే మీకు అనేక వస్తువులు ఇవ్వడానికి ఆయన కోరుకున్నాడు. 10 డబ్బు ఇవ్వడం గురించి నేను ఏమి అనుకుంటున్నానో నేను మీకు చెప్పుచున్నాను, ఎందుకంటే నేను అనుకున్నది వినడం మీకు సహాయం చేస్తుంది. గత సంవత్సరం, మీరు ఇద్దరు కోరుకున్నారు మరియు {డబ్బు ఇవ్వడం} ప్రారంభించారు. 11 ఇప్పుడే, మీరు ప్రారంభించినది మీరు పూర్తి చేయాలి. ఆ విధంగా, మీరు ఏమి పూర్తి చేస్తారో మీరు ఆత్రంగా {చేయాలనుకున్న దానితో సరిపోలుతుంది, మీరు కలిగి ఉన్న దానిలో {కొంత ఇవ్వడానికి}. 12 ఇప్పుడు దేవుడు తాము కలిగియున్న వాటి ఆధారంగా {మనుష్యులు ఇచ్చేవాటిని} ఆమోదిస్తాడు, వారు కలిగి లేని వాటి ఆధారంగా కాదు. వారు {ఇవ్వడానికి} ఆసక్తిగా ఉన్నంత వరకు {ఇది నిజం}.

13 కాబట్టి, ఇతర విశ్వాసులు బాగుగా ఉన్నప్పుడు మీరు శ్రమపడాలి అని నేను కోరుకోవడం లేదు. బదులుగా, నేను {విశ్వాసులు తమ వద్ద ఉన్న వాటిని} సమానంగా పంచుకోవాలని కోరుచున్నాను. 14 ప్రస్తుతం, మీ వద్ద ఉన్నవి ఎక్కువ లేని వారికి సహాయం చేయగలవు. అప్పుడు, ఆ మనుష్యులకు చాలా ఉన్నప్పుడు మరియు మీకు కొంచెం ఉన్నప్పుడు, వారు మీకు సహాయం చేయగలరు. ఆ విధంగా, విశ్వాసులు {తాము కలిగి ఉన్న వాటిని} సమానంగా పంచుకుంటారు. 15 {దేవుడు ఇశ్రాయేలీయులకు శక్తివంతంగా ఆహారం ఇచ్చినప్పుడు} ఒకరు వ్రాసిన విధముగా {అది ఉండాలని మేము కోరుకుంటున్నాము}:

     “ఎక్కువగా కలిగి ఉన్న మనుష్యులకు వారు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి లేరు.

     కొంచెము కలిగి ఉన్న మనుష్యులు వారికి అవసరమైన దానికంటే తక్కువ కలిగి లేరు.”

16 మేము ఉన్నట్టు వలే మీ కోసం ఆసక్తితో ఉండడానికి {శ్రద్ధ చూపడానికి} తీతును చేసినందు కోసం మేము దేవునికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. 17 నిజానికి, అతడు మిమ్మల్ని పాక్షికంగా దర్శిస్తున్నాడు, ఎందుకంటే మేము అతనిని {అలా చేయడానికి} బతిమాలడం అతడు మా మాట విన్నాడు. అయితే, ఎక్కువగా, {అతడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు} ఎందుకంటే {మిమ్మల్ని దర్శించడానికి} అతడు తానే ఎంచుకున్నాడు అని {మీ కోసం శ్రద్ధ చూపించడానికి} అతడు చాలా ఆసక్తిగా ఉన్నాడు, 18 మేము తీతుతో వెళ్ళడానికి ఒక తోటి విశ్వాసిని ఎంచుకున్నాము. విశ్వాసుల అనేక గుంపులు శుభవార్త కొరకు అతనిని {అతడు చేసే పనుల కారణంగా} సిఫారసు చేస్తారు. 19 అంతకంటే ఎక్కువ, విశ్వాసుల యొక్క గుంపులు అతనిని నాతో పాటు ప్రయాణించడానికి ఎంపిక చేసారు. మేము {యెరూషలేములోని విశ్వాసులకు డబ్బుని} అంగీకరించడానికి పని చేస్తున్నప్పుడు అతడు మాకు సహాయం చేస్తున్నాడు. {ఈ డబ్బును అంగీకరించడం} ప్రభువైన {దేవుని} గౌరవిస్తుంది మరియు మనం {తోటి విశ్వాసుల యెడల శ్రద్ధ వహించడానికి} ఎంత ఆత్రుతగా ఉన్నామో చూపిస్తుంది.

20 కాబట్టి, మనుష్యులు దాతృత్వముగా ఇచ్చిన {ఈ డబ్బుతో} మేము చేసే పనులకు ఇతరులు మమ్ములను విమర్శించకుండా ఉండేందుకు మేము చేయగలిగినదంతా చేస్తున్నాం. 21 మీరు చూడగలిగిన విధముగా, {మేము ఈ డబ్బును సేకరించడం ప్రారంభించే} ముందు, దీనిని బాగా ఎలా చేయాలో ప్రణాళిక చేసాము. ప్రభువైన {దేవుడు} ఏమి అనుకొనుచున్నాడో {మేము పరిగణించాము}, అయితే ఇతర మనుష్యులు ఏమి అనుకొనుచున్నారో కూడా మేము {పరిగణించాము}.

22 మేము తీతు వెళ్ళడానికి మరొక తోటి విశ్వాసిని ఎంచుకున్నాము మరియు {నేను మాట్లాడుచున్న} ఆ ఇతర మనుష్యుడు గురించి. మేము అతనిని పరీక్షించాము మరియు అతడు {దేవుని సేవ చేయడానికి} ఆసక్తిగా ఉన్నాడు అని ఖచ్చితంగా తెలుసుకున్నాము. నిజానికి, మీరు {సరైనది చేస్తారు} అని అతనికి చాలా నమ్మకం ఉంది కాబట్టి, ప్రస్తుతం అతడు ప్రత్యేకంగా {మీతో సేవ చేయడానికి) ఆసక్తిగా ఉన్నాడు. 23 {నేను ఈ మనుష్యులను సిఫార్సు చేస్తున్నాను.} తీతు నాతో {నేను చేసే పనిలో} చేరాడు మరియు మీకు సహాయం చేయడానికి నాతో కలిసి పనిచేస్తాడు. విశ్వాసుల గుంపులు ఇతర ఇద్దరు తోటి విశ్వాసులను పంపుతారు, మరియు వారు మెస్సీయను గౌరవిస్తారు. 24 కాబట్టి అప్పుడు, మీరు నిజంగా {తోటి విశ్వాసుల యెడల} శ్రద్ధ వహిస్తున్నారు అని మరియు మీ గురించి మేము చెప్పే గొప్ప విషయాలు నిజంగా సత్యము అని ఈ ముగ్గురు మనుష్యులకు మరియు విశ్వాసుల యొక్క గుంపులకు కూడా చూపించండి.

Chapter 9

1 నిజంగా, అయినప్పటికి, మనం {యెరూషలేములో} దేవుని మనుష్యులకు ఎలా సేవ చేస్తున్నామో నేను మీకు ఏమీయు చెప్పడం అవసరం లేదు. 2 {అది} ఎందుకంటే మీరు {ఇవ్వడానికి} ఎంత ఆత్రుతగా ఉన్నారో నేను గుర్తించాను. నిజముగా, మాసిదోనియ ప్రాంతములోని విశ్వాసులకు నేను మీ గురించి గొప్ప విషయాలు చెప్పుచున్నాను. అకయ ప్రాంతములో విశ్వాసులైన మీరు గత సంవత్సరం ఇప్పటికే {ఇవ్వడానికి} సిద్ధమవుచున్నారని {నేను వారికి చెప్పుచున్నాను}. మీరు {ఇవ్వడానికి} ఎంత ఆత్రుతతో ఉన్నారనేది వారిలో చాలా మందిని {కూడా ఇవ్వడానికి} ప్రోత్సహించింది. 3 అయినప్పటికీ, {మీరు ఆసక్తిగా ఉన్నారు అని మాకు తెలిసినప్పటికీ}, మీరు {ఇవ్వడానికి} ఎలా ఆసక్తిగా ఉన్నారనే దాని గురించి మేము చెప్పే గొప్ప విషయాలు నిజం అని నిరూపించుకోవడానికి మిమ్ములను సందర్శించడానికి మేము ఈ {ముగ్గురు} తోటి విశ్వాసులను ఎంచుకున్నాము. {వారు మిమ్ములను సందర్శిస్తున్నారు} తద్వారా మీరు {ఇవ్వడానికి} సిద్ధం చేయడం ముగించవచ్చు మరియు ఈ విధంగా నేను {మీ గురించి మాసిదోనియ వారికి} చెప్పిన దానితో సరిపోలవచ్చు. 4 మరోవైపు, {ఏమి జరుగుతుందో ఆలోచించండి} మాసిదోనియ ప్రాంతము నుండి కొంతమంది విశ్వాసులు నాతో మిమ్ములను సందర్శించడానికి వచ్చారు మరియు మీరు {ఇవ్వడానికి} సిద్ధం కాలేదు అని తెలుసుకున్నారు. మీరు ఎలా ప్రవర్తించారు అనేది మాకు కూడా అవమానం కలిగిస్తుంది, మరియు {అది} మీకు ఖచ్చితంగా {సిగ్గును} కలిగిస్తుంది. 5 దాని కారణంగా, నేను మిమ్మును దర్శించడానికి ముందు మరియు మీరు ఇస్తానని చెప్పిన దానితో మీకు సహాయం చేయడానికి ఈ {ముగ్గురు} తోటి విశ్వాసులను అడగడానికి నాకు అవసరం ఉంది అని నేను నిర్ణయించుకున్నాను. ఆ విధంగా, మీరు ఏమి ఇస్తున్నారో మీరు ఇప్పటికే సిద్ధం చేస్తారు మరియు {మీరు దీనిని అందిస్తారు} ఎందుకంటే మీరు కోరుకున్నారు మరియు మీరు దీనిని చేసేలా మేము మిమ్మల్ని చెయ్యడం కాదు. 6 ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది {మీరు ఎలా ఇవ్వాలో అది వివరిస్తుంది}. రైతులు కొన్ని విత్తనాలను మాత్రమే నాటినప్పుడు, వారు కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే పంటకోస్తారు. రైతులు చాలా విత్తనాలు నాటినప్పుడు, వారు చాలా ఆహారాన్ని పండిస్తారు. అదే విధంగా, మీరు ఇతర మనుష్యులకు సహాయం చేసినప్పుడు, బదులుగా ఎవరైనా మీకు సహాయం చేస్తారు. 7 మీలో ప్రతి ఒక్కరు {ఎంత ఇవ్వాలో} మీ కోసం మీరే ఎంపిక చేసుకోవాలి. మీరు గాయపడినందున లేదా మీరు చేయవలసి ఉన్నందున {ఎంత ఇవ్వాలో {ఎంచుకోవద్దు}. {అని నేను చెప్పుచున్నాను} ఎందుకంటే దేవుడు సంతోషంగా ఇచ్చే మనుష్యుల యెడల శ్రద్ధ వహిస్తాడు. 8 దేవుడు కృపతో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు. ఆ విధంగా, ప్రతి పరిస్థితిలో మీకు అవసరమైన ప్రతి దానిని మీరు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు కాబట్టి, మీరు ఎల్లప్పుడు సరైన ప్రతిదానిని చేయవచ్చు. 9 {అది నిజమని మీరు చెప్పగలరు} ఎందుకంటే ఒకరు {ఈ రకమైన వ్యక్తి గురించి} లేఖనాలలో వ్రాసారు,

     “వారు అనేక మనుష్యులకు ఇస్తారు.

     అవును, వారు చాలా తక్కువ ఉన్నవారికి సహాయం చేస్తారు.

     వారు ఎప్పటికీ సరైనదే చేస్తారు.”

10 దేవుడు వాటిని నాటినవారికి విత్తనాలను అందజేస్తాడు, మరియు మనుష్యుల కోసం తినడానికి ఆహారం {ఆయన అందజేస్తాడు}. కాబట్టి, ఆయన మీకు అవసరమైన వాటిని కూడా అందజేస్తాడు మరియు దానిలో ఎక్కువ మీకు ఇస్తాడు. ఇంకా, మీరు సరైనది చేసినప్పుడు, మంచి పనులు చేయడానికి ఆయన దానిని ఉపయోగిస్తాడు. 11 దేవుడు మీకు అవసరమైన దానికంటే ఎక్కువగానే మీకు నిరంతరం ఇస్తాడు తద్వారా {ఇతరులకు ఇవ్వడానికి} మీరు ఎల్లప్పుడు దాతృత్వముగా ఇస్తారు. మీరు ఉదారంగా ఇచ్చినప్పుడు మరియు మేము మీ బహుమతులను {తోటి విశ్వాసులకు} పంపినప్పుడు, వారు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతారు. 12 నిజానికి, మీరు దేవుని యొక్క మనుష్యులకు {యెరూషలేములో} {వారికి} ఇవ్వడం చేత సేవ చేసినప్పుడు, అది వారికి అవసరమైన వాటిని అందిస్తుంది. ఇంకా ఎక్కువ, అయినప్పటికీ, అది వారు దేవునికి చాలా ఎక్కువ కృతజ్ఞతలు చెప్పేలా చేస్తుంది. 13 {యెరూషలేములో} దేవుని యొక్క మనుష్యులకు సేవ చేయడం చేత మిమ్ములను మీరు నిరూపించుకుంటున్నారు. కాబట్టి అప్పుడు, వారు దేవుని ఘనపరుస్తారు. ఎందుకంటే మీరు నిజంగా మెస్సీయ గురించిన శుభవార్తకు ఏది అవసరమో అదే మీరు చేస్తారు, మీరు నమ్ముచున్నట్లు చెప్పేది {అదే శుభవార్తయై ఉన్నది}. {వారు దేవుని ఘనపరుస్తారు} కూడా ఎందుకంటే మీరు వారితో మరియు {విశ్వాసులందరితో} దాతృత్వముగా {మీరు కలిగి ఉన్నవాటిని} పంచుకుంటారు. 14 ఇంకా, వారు మీ కోసం ప్రార్థిస్తున్నప్పుడు వారు మిమ్ములను{చూడాలని} కోరుకుంటారు, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని బలపరచచూ ఉండగా మీరు చాలా కృపా పూరితంగా ఇస్తారు. 15 మనం చెప్పగలిగిన దానికంటే అద్భుతమైన వాటిని మనకు ఇచ్చినందుకు మనము దేవునికి వందనములు చెల్లిస్తాము!

Chapter 10

1 ఇప్పుడు పౌలునైన నేను నా {గురించి మాట్లాడుతాను}. మెస్సీయ {వినయము మరియు సహేతుకంగా ఉన్న} విధముగానే {సరైనది చేయడానికి} నేను వినయంగా మరియు సహేతుకంగా మిమ్ములను కోరుచున్నాను. {కొందరు మనుష్యులు దానిని చెపుతారు} నేను వ్యక్తిగతంగా మీతో ఉన్నప్పుడు, నేను మీతో సౌమ్యంగా ఉన్నాను, అయితే ఇప్పుడు, నేను దూరంగా ఉన్నప్పుడు, నేను మీతో బలవంతంగా ఉంటాను. 2 నేను మరియు నాతో పాటు సేవ చేసేవారు కేవలం మానవ మార్గాలలో ప్రవర్తిస్తాము అని భావించే ఈ మనుష్యులకు వ్యతిరేకంగా నేను ధైర్యంగా వ్యవహరించినప్పుడు బలవంతంగా వ్యవహరించాలని నేను భావిస్తున్నాను. కాబట్టి, నేను మిమ్ములను సందర్శించినప్పుడు తద్వారా మీతో కూడా బలవంతంగా ఉండాల్సిన అవసరం లేకుండా {సరైనది చేయమని మిమ్ములను అడుగుచున్నాను. 3 నిజానికి, మేము మనుష్యులుగా వ్యవహరిస్తున్నప్పటికీ, కేవలం మానవ మార్గాలలో మనలను మనం రక్షించుకో లేము. 4 నిజానికి, మనలను మనం రక్షించుకోవడానికి మనం ఉపయోగించేది సాధారణంగా మనుష్యులు ఉపయోగించేది కాదు. బదులుగా, దేవుడు {మనలను మనం రక్షించుకోవడానికి ఉపయోగించే వాటికి} శక్తివంతం చేస్తాడు, తద్వారా ఇతర మనుష్యులు శక్తివంతంగా వాదించే వాటిని మనం ఓడించగలము. 5 దేవుని తెలుసుకోవడం కంటే గొప్పదని మనుష్యులు చెప్పుకునే దేనినైనా కూడా {మేము} {ఓడిస్తాము}. ఇంకా, వారు మెస్సీయకు విధేయత చూపేలా మనుష్యులు భావించే ప్రతిదానిని ప్రభావితం చేయడానికి మేము పని చేస్తాము. 6 మీరు {మెస్సీయకు} పూర్తిగా విధేయత చూపే సమయంలో, {ఆయనకు} అవిధేయత చూపే ఎవరినైనా శిక్షించడానికి మేము సిద్ధంగా ఉంటాము.

7 స్పష్టంగా ఉన్న దాని గురించి ఆలోచించండి. మనుష్యులు మెస్సీయకు వారు ప్రాతినిధ్యం వహిస్తారు అని ఖచ్చితంగా అనుకుందాం. వారి వలెనే మేము కూడా మెస్సీయకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఆ మనుష్యులు గుర్తుంచుకోవాలి. 8 నిజానికి, ప్రభువైన {యేసు} తనకు ప్రాతినిధ్యం వహించడానికి మనకు ఎలా శక్తిని ఇచ్చాడు అనే దాని గురించి నేను అనేక గొప్ప విషయాలు చెప్పినప్పుడు నన్ను నేను అవమానించుకోను. {ఆయన దానిని చేసాడు} తద్వారా మేము మిమ్ములను {దేవుణ్ణి ఎక్కువగా విశ్వసించడానికి} ప్రోత్సహించడానికి మరియు సహాయం చేయడానికి, మేము మిమ్ములను {దేవుణ్ణి విశ్వసించకుండా} నిరుత్సాహపరిచేందుకు కాదు. 9 కాబట్టి, నేను మీకు {బలవంతంగా} పత్రికలు పంపినప్పుడు నేను మిమ్ములను భయపెట్టడానికి ప్రయత్నించడం లేదు {అని మీరు చెప్పగలరు}. 10 {నేను దానిని వ్రాస్తున్నాను} ఎందుకంటే కొంత మంది మనుష్యులు {నా గురించి} చెప్పారు, “అతడు తీవ్రమైన మరియు శక్తివంతమైన పత్రికలు మాకు పంపుతాడు, అయితే అతడు బలహీనంగా ఉన్నాడు మరియు అతడు మాతో ఉన్నప్పుడు చాలా పేలవంగా మాట్లాడతాడు.” 11 మేము మీతో లేనప్పుడు మా పత్రికలలో {మీకు} వ్రాసేది మీతో ఉన్నప్పుడును మేము ఆలాగుననే వ్యవహరిస్తాము అని ఆ సంగతులు చెప్పే మనుష్యులు గ్రహించవలసిన అవసరం ఉంది. 12 తాము నమ్మదగినవారము అని చెప్పుకునే {మీకు తెలిసిన} మనుష్యుల వలె మేము మంచివాళ్ళము అని చెప్పలేనంత వినయంగా మేము ఉన్నాం. ఆ మనుష్యులు మూర్ఖులు. {వారు గొప్పవారు అని చెప్పినప్పుడు,} వారు తమను మాత్రమే చూస్తున్నారు. 13 దీనికి విరుద్ధంగా, మేము వాస్తవంగా చేసే దానికంటే ఎక్కువగా మమ్ములను గురించి గొప్ప విషయాలు చెప్పుకోము. బదులుగా, {మా గురించి మేము గొప్ప విషయాలు చెప్పుకుంటాము} అది దేవుడు మాకు ఏమి చేయడానికి ఇచ్చాడో దానితో సరిపోలుతుంది. మేము మీతో ఉన్నప్పుడు మేము ఏమి చేసామో అది కలసి ఉంది. 14 నిజానికి, మేము మిమ్మల్ని దర్శించ కుండా ఉన్న యెడల మాత్రమే {చెయ్యడానికి దేవుడు మాకు ఇచ్చినది} మిమ్మల్ని చేర్చుకోలేదు. అయితే వాస్తవానికి, మేము మిమ్మల్ని ఇప్పటికే దర్శించాము {మరియు మీకు} మెస్సీయ గురించి శుభవార్త చెప్పాము. 15 ఇతరులు చేసే కారణంగా మమ్ములను గురించి మేమే గొప్ప విషయాలు చెప్పుకోము అయితే వాస్తవానికి మేము చేసే దాని కారణంగా . నిజానికి, మీతో చేయడానికి దేవుడు మాకు ఇంకా ఎక్కువ ఇస్తాడు అని మేము నమ్మకంగా ఆశిస్తున్నాము. మీరు {దేవుణ్ణి} ఎక్కువగా విశ్వసించినప్పుడు {అది జరుగుతుంది}. 16 ఆ విధంగా, మీకంటే మాకు దూరంగా ఉన్న మనుష్యులకు మేము శుభవార్త చెప్పగలం. దేవుడు తమకు చేయడానికి ఇచ్చిన దానిని ఇతర మనుష్యులు ఎలా చేసారనే దానిని బట్టి మా గురించి గొప్పవిషయాలు మేమే చెప్పుకునే బదులు {అదే మేము చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము}. 17 {ప్రవక్తయైన యిర్మీయా వ్రాసిన దానిని ప్రతి ఒక్కరు చేయాలి,}

     "గొప్ప విషయాలు చెప్పే వారు ఎవరైనా ప్రభువైన {దేవుని} గురించి చెప్పాలి."

18 {ప్రతిఒక్కరు దానిని చేయాలి} ఎందుకంటే ప్రభువైన {యేసు} తాను నమ్మదగినవారు అని చెప్పిన వారినే సిఫారసు చేస్తాడు, తమ గురించి చెప్పుకునేవారిని కాదు.

Chapter 11

1 {తరువాత,} నేను అవివేకముగా భావించే కొన్ని విషయాలు నేను చెప్పుచుండగా మీరు నాతో సహనముగా ఉంటారు అని ఆశిస్తున్నాను. మీరు నాతో సహనంతో ఉన్నారు అని నాకు తెలుసు! 2 దేవుడు మిమ్ములను గురించి కాపుదలగా ఉండగా నేను మీ గురించి కాపుదలగా ఉన్నాను కాబట్టి {నేను అవివేకపు విషయాలు చెపుతాను}. నిజానికి, నేను మీకు శుభవార్త చెప్పినప్పుడు, నేను మిమ్ములను ఒక పురుషునికి భార్యగా ఇస్తానని వాగ్దానము చేసిన ఒక తండ్రివలె ఉన్నాను. ఈ తండ్రి తన కుమార్తె ఈ ఒక్క పురుషునితో మాత్రమే ఉండాలి అని కోరుకున్న విధముగా, కాబట్టి మీరు మెస్సీయను మాత్రమే విశ్వసించాలని నేను కోరుచున్నాను. 3 అయినప్పటికీ, మొదటి స్త్రీ అయిన హవ్వను సాతాను యుక్తిగా మోసగించిన విధముగా, ఎవరైనా {మిమ్ములను మోసం చేస్తారేమో} అని నేను భయపడుచున్నాను. {అటువంటి ఒక వ్యక్తి} మెస్సీయకు పూర్తిగా విధేయత చూపే మార్గాల్లో మీ ఆలోచనలను నాశనం చేస్తాడు అని నేను భయపడుచున్నాను. 4 {నేను మీ గురించి భయపడుచున్నాను} ఎందుకంటే మనుష్యులు మిమ్ములను దర్శించి మరియు యేసు గురించి చెపుతారు {అని నేను ఎరుగుదును}, అయితే మేము మీకు చెప్పిన అదే యేసుని గురించి కాదు. ఇతరులు మీకు ఒక ఆత్మను అందిస్తారు, అయితే మేము మీకు అందించిన పరిశుద్ధాత్మ కాదు. ఇతరులు మీకు శుభవార్త ప్రకటిస్తారు, అయితే అది మీరు మొదట విశ్వసించిన అదే శుభవార్త కాదు. అయినప్పటికీ, మీరు చాలా సహనముగా ఉంటారు {ఈ విషయాల గురించి మనుష్యులు మీకు చెప్పినప్పుడు}.

5 {మేము మీకు మొదట చెప్పిన దానిని మీరు విశ్వసించాలని నేను కోరుచున్నాను} ఎందుకంటే మెస్సీయ నా ద్వారా ఎంతగా పనిచేస్తాడో తాము ఉత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాము అని చెప్పుకునే వారి ద్వారా కూడా పనిచేస్తాడు అని నేను భావిస్తున్నాను. 6 నేను బాగా మాట్లాడటం నేర్చుకొన లేదు అయినప్పటికీ, అది ఉన్నప్పటికీ, {సత్యమైన దానిని} అని తెలుసుకోవడానికి {నేను నేర్చుకున్నాను}. నేను ఏదైనా ఎప్పుడైనా చెప్పినా లేదా చేసినా ఇది సత్యం అని నేను మీకు చూపిస్తాను. 7 దేవుని నుండి సువార్త మీకు ప్రకటించినందుకు నాకు డబ్బు చెల్లించమని నేను మిమ్ములను అడగనప్పుడు నేను మీకు వ్యతిరేకంగా పాపం చేయలేదు అని మీకు తెలుసు. {దానిని చేయడం చేత,} మిమ్ములను మరింత ముఖ్యమైనవారుగా చేయడానికి నన్ను నేను తక్కువ ప్రాముఖ్యత గలవాడిగా చేసుకొన్నాను. 8 {వాస్తవానికి,} నేను ఇతర విశ్వాసుల గుంపుల నుండి డబ్బు స్వీకరించాను. నేను వారి డబ్బును అంగీకరించాను తద్వారా నేను మీకు సేవ చేయగలను. 9 ఇంకా, నేను మీతో ఉన్నప్పుడు, నాకు అవసరమైన ప్రతీది నేను కలిగి లేను. అయినప్పటికీ, నేను మీలో ఎవరినీ {డబ్బు అడగడం చేత} ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మాసిదోనియ ప్రాంతము నుండి {నాతో పాటు} ప్రయాణించిన మా తోటి విశ్వాసులు నాకు అవసరమైన ప్రతీది నాకు అందించారు.{నేను అలా చేయగలను}. వాస్తవముగా, ప్రతి పరిస్థితిలోను, నేను {నా కోసం డబ్బు అడగడం చేత} మిమ్ములను ఇబ్బంది పెట్టలేదు మరియు ఎన్నడు ఇబ్బంది పెట్టను. 10 అకయ ప్రాంతములోని ఏ ప్రాంతంలోనైనా నివసించే వారెవరు, {నేను మిమ్ములను ఎలా ఇబ్బంది పెట్టలేదు అని} గొప్పగా చెప్పకుండా నన్ను నిరోధించలేరు. నేను చెప్పేది మెస్సీయ చెప్పినంత నిజం. 11 నేను {మిమ్ములను ఇబ్బంది పెట్టకపోవడానికి} కారణం నేను మిమ్ములను పట్టించుకోవడం లేదు అని కాదు. {నేను మీ యెడల శ్రద్ధ వహిస్తున్నాను అని} దేవుడు సాక్ష్యమివ్వగలడు.

12 బదులుగా, {ఎందు కోసమో ఇక్కడ నా కారణం ఉంది} నేను మిమ్ములను ఇబ్బంది పెట్టకుండా కొనసాగిస్తాను. ఆ విధంగా, మనం {మన గురించి చెప్పుకున్నట్లుగా} తమ గురించి గొప్ప విషయాలు చెప్పుకోకుండా ఎవరినైనా నేను నిరోధించగలను. కొంతమంది దీనిని చేయాలనుకుంటున్నారు {అని నాకు తెలుసు}. 13 ఆ మనుష్యులు నిజంగా మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి పంపబడిన వారు కాదు. వారు చేసే పనులతో మనుష్యులను మోసగిస్తారు, మరియు వారు మెస్సీయకు ప్రాతినిధ్యం వహించడానికి నటించడం మాత్రమే చెయ్యగలరు. 14 అది మనకు ఆశ్చర్యం కలిగించదు. సాతాను కూడా ఒక మహిమాన్వితమైన ఆత్మీయ జీవిగా ఉన్నట్టు నటిస్తాడు. 15 కాబట్టి అప్పుడు, ఆయనను సేవించే వారు కూడా మనుష్యులు నీతిమంతులుగా మారేందుకు సహాయం చేసినట్లు నటిస్తారు అని మనం ఆశించాలి. వారు చేసిన దానికి అనులోమానుపాతంలో దేవుడు చివరికి వారికి అర్హమైన వాటిని ఇస్తాడు.

16 నేను ఇంతకు ముందు చెప్పిన దానినే తిరిగి చెప్పుచున్నాను: నేను మూర్ఖుడనని ఎవరు భావించడం నేను కోరుట లేదు. అయినప్పటికీ, మీరు {నేను మూర్ఖుడను అని అనుకున్న యెడల}, కనీసం మూర్ఖమైన మార్గాలలో ప్రవర్తించడానికి మీరు నన్ను అనుమతించాలి. ఆ విధంగా, నేను కూడా నా గురించి కొన్ని గొప్ప విషయాలు చెప్పగలను. 17 నేను చెప్పబోయేది ప్రభువైన {యేసుకు} ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నేను ఎలా మాట్లాడతాను అనేది కాదు. బదులుగా, నేను నా గురించి గొప్ప విషయాలు చెప్పుకోగలను అని నేను నిరూపించుకుంటూ మూర్ఖంగా మాట్లాడబోవుచున్నాను. 18 అనేక ఇతర మనుష్యులు తమ గురించి గొప్ప విషయాలు కేవలం మానవ మార్గాలలో చెప్పుకుంటారు. కాబట్టి, నేను కూడా నా గురించి గొప్ప విషయాలు చెపుతాను. 19 {మీరు నా మాట వింటారు అని నాకు తెలుసు,} ఎందుకంటే మిమ్ములను మీరు తెలివైన మనుష్యులుగా భావిస్తారు, కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించే ఇతర మనుష్యులతో సహనంతో సంతోషంగా ఉంటారు. 20 నిజానికి, {మనుష్యులు మీతో చెడుగా వ్యవహరించినప్పుడు} మీరు సహనముగా ఉంటారు. వారికి లోబడడానికి వారు మిమ్ములను బలవంతం చేయవచ్చు. వారు మీరు కలిగి ఉన్న దానిని ఉపయోగించుకోవచ్చు. వారు మిమ్ములను మోసం చేయవచ్చు. వారు మీ కంటే మెరుగైన వారని చెప్పవచ్చు. వారు మిమ్ములను అవమానించవచ్చు. {అయినప్పటికి, మీరు ఇంకా వారితో సహనముగా ఉన్నారు.} 21 {బలవంతులైన మనుష్యులు మీతో వ్యవహరించడానికి అదే సరైన మార్గము అయిన యెడల, అప్పుడు} {మేము మీతో ఉన్నప్పుడు మేము ఎలా ప్రవర్తించాము అని} అది మాకు అవమానం కలిగిస్తుంది మరియు మేము బలహీనులమని రుజువు చేస్తుంది నేను ఒప్పుకుంటున్నాను. మరోవైపు, ఇతర మనుష్యులు ఏమి చేయడానికి ధైర్యం చేస్తారో, నేను కూడా చేయడానికి ధైర్యం చేయగలను. అయితే, నేను ఈ విషయాలు మాత్రమే చెప్పుచున్నాను ఎందుకంటే నేను బుద్దిహీనముగా నటిస్తున్నాను. 22 ఆ మనుష్యులు తాము హీబ్రూ మాట్లాడే యూదులమని చెప్పుతారు, అయితే నేను కూడా {యూదుడిని మరియు హీబ్రూ మాట్లాడుతాను}. వారు తాము ఇశ్రాయేలీయులు అని చెపుతారు, అయితే నేను కూడా {ఇశ్రాయేలీయుడనే}. వారు అబ్రాహాము యొక్క వంశస్థులమని చెప్పుతారు, అయితే నేను కూడా {అబ్రహాము యొక్క వంశస్థుడనే}. 23 వారు మెస్సీయను సేవిస్తున్నారని చెపుతారు, అయితే నేను {మెస్సీయను} మరింత ఎక్కువగా సేవిస్తున్నాను. {అయితే,} నేను పిచ్చివాడిలా మాట్లాడుచున్నాను. {అయినప్పటికీ,} నేను {వారు కలిగిన దాని కంటే} కష్టపడి పనిచేసాను. మనుష్యులు నన్ను {వారి కంటే} ఎక్కువగా చెరసాలలో పెట్టారు. మనుష్యులు నన్ను చాలా అనేక సార్లు కొట్టారు. నేను దాదాపు అనేక సార్లు చనిపోయాను. 24 ఐదు వేర్వేరు సార్లు యూదు నాయకులు నన్ను కొట్టిన ఒకరిని కలిగి యున్నారు {గరిష్ట సంఖ్య సార్లు:} 39 25 మూడు వేర్వేరు సార్లు నన్ను ఒక కర్రతో తిరిగి తిరిగి కొట్టే ఒకరిని నాయకులు కలిగి యున్నారు. ఒక సారి మనుష్యులు {నన్ను చంపడానికి} నా మీద రాళ్ళు విసిరారు. మూడు వేర్వేరు సార్లు {నేను ప్రయాణిస్తున్న} ఓడ మునిగిపోయింది. నేను సముద్రం యొక్క మధ్యలో 24 గంటలు జీవించి ఉన్నాను. 26 నేను తరచుగా ప్రయాణిస్తాను. నేను నదులు, పట్టణాలు, ఎడారులు మరియు మహాసముద్రాలతో సహా ప్రమాదకరమైన ప్రదేశాల ద్వారా వెళతాను. దొంగలు, యూదు మనుష్యులు, యూదులు కాని మనుష్యులు మరియు తోటి విశ్వాసులుగా నటించే మనుష్యులతో అపాయాలు సహా నన్ను బాధించే మనుష్యులు ఎల్లప్పుడూ ఉంటారు. 27 నేను చాలా కష్టపడి పని చేసాను. నేను తరచుగా ఎక్కువగా నిద్రపోలేదు. నాకు తినడానికి లేదా త్రాగడానికి తగినంత లేదు. నేను తరచుగా ఆకలితో ఉన్నాను. నేను కొన్నిసార్లు చలిచేత గడ్డకట్టుకొనిపోయాను మరియు తగినంత దుస్తులు కలిగి లేను. 28 అన్నిటితో పాటు {నేను ప్రస్తావించగలిగినవి}, విశ్వాసుల యొక్క గుంపులు అన్నిటి గురించి నేను ఆత్రుతగా ప్రతిరోజు ఆలోచిస్తాను. 29 తోటి విశ్వాసి బలహీనంగా ఉన్నప్పుడు నేను బలహీనముగా ఉన్నాను. ఎవరైనా తోటి విశ్వాసిని పాపం చేసేలా చేసినప్పుడు, నేను చాలా కోపపడతాను.

30 నా గురించి నేను గొప్ప విషయాలు చెప్పుకోవాలి కాబట్టి, నేను ఎంత బలహీనంగా ఉన్నానో గొప్ప విషయాలు చెప్పాలని నేను ఉద్దేశించాను. 31 మనము అందరం ప్రభువైన యేసు యొక్క తండ్రి మరియు దేవుని ఎల్లప్పుడు గౌరవిస్తాం. నేను చెప్పేది నిజము అని ఆయన సాక్ష్యం చెప్పగలడు.

32 నేను దమస్కు నగరంలో ఉన్నప్పుడు, అరెత రాజుకు సేవ చేసిన స్థానిక పాలకుడు నన్ను పట్టుకోవడానికి నగరంలో నా కోసం వెదకుచున్న సైనికులను కలిగి ఉన్నాడు. 33 అయినప్పటికీ, స్థానిక పాలకుడి నుండి తప్పించుకోవడానికి తోటి విశ్వాసులు నాకు సహాయం చేసారు. ఒక పెద్ద గంపలో{వారు నన్ను ఉంచారు}, {దానిని ఒక తాడుకు జోడించి, మరియు} నగర గోడలోని సందు ద్వారా దానిని క్రిందికి వదలారు.

Chapter 12

1 నా గురించి నేను గొప్ప విషయాలు చెప్పుకోవాలి. {కాబట్టి,} ఇది సహాయకరముగా లేనప్పటికీ, ప్రభువైన {యేసు} ప్రత్యేకంగా విషయాలను {నిర్దిష్ట మనుష్యులకు} ఎలా చూపిస్తాడో {దాని గురించి మాట్లాడటానికి} నేను ముందుకు సాగుచున్నాను. 2 పద్నాలుగు సంవత్సరాల క్రితం, దేవుడు ఒక నిర్దిష్ట క్రైస్తవుడిని పరలోకము యొక్క మూడవ {స్థాయికి} తీసుకు వెళ్ళాడు. భౌతికంగా లేదా ఒక కలలో లేదా ఆత్మీయముగా {దేవుడు అతనిని అక్కడికి తీసుకు వెళ్ళాడో} నాకు ఖచ్చితంగా తెలియదు. దేవుడు మాత్రమే {ఇది ఎలా జరిగిందో} ఖచ్చితంగా చెప్పగలడు. 3 ఇప్పుడు ఆ నిర్దిష్ట క్రైస్తవుని గురించి {నేను మీకు ఎక్కువగా చెపుతాను}. {తిరిగి,} భౌతికంగా లేదా ఒక కలలో లేదా ఆత్మీయముగా {దేవుడు అతనిని పరలోకము యొక్క మూడవ స్థాయికి తీసుకు వెళ్ళాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. దేవుడు మాత్రమే {ఇది ఎలా జరిగిందో} ఖచ్చితంగా చెప్పగలడు. 4 దేవుడు ఆ వ్యక్తిని పరదైసులోనికి తీసుకువెళ్ళాడు, {చనిపోయిన విశ్వాసులు ఉన్న పరలోకంలోని స్థలం}. అక్కడ, అతడు ఎవరికీ తిరిగి చెప్పలేని అద్భుతమైన విషయాలను విన్నాడు. 5 నేను దాని గురించి గొప్ప విషయాలు చెప్పగలను {, ఎందుకంటే నేను మాట్లాడుచున్న వ్యక్తిని నేనే}. అయినప్పటికీ, నేను ఎంత బలహీనంగా ఉన్నానో దాని గురించి గొప్ప విషయాలు మాత్రమే నేను చెపుతాను. 6 నిజానికి, నేను నా గురించి గొప్పగా చెప్పడానికి కోరుకున్నాను అని అనుకుందాం. నేను యదార్ధంగా మాట్లాడుతున్నాను కాబట్టి, నేను ఇప్పటికీ అవివేకముగా ప్రవర్తించడం లేదు. అయితే, నేను {నా గురించి గొప్పగా చెప్పుకోకూడదని} నిర్ణయించుకున్నాను. {ఆ విధంగా,} మనుష్యులు నేను చెప్పేది మరియు చేస్తున్న దానిని నిర్దారించడం చేత మాత్రమే వారు నన్ను వర్ణించగలరు. 7 కాబట్టి అప్పుడు, దేవుడు నాకు అటువంటి గొప్ప విషయాలను తెలియజేసినందుకు నేను గర్వపడకుండా ఉండేందుకు, ఆయన నన్ను శ్రమపడడానికి అనుమతించాడు. ప్రత్యేకంగా, సాతాను పంపిన ఒక ఆత్మీయ జీవి నన్ను శ్రమపెట్టింది. ఆ విధంగా, నేను గర్వపడకపోవచ్చు. 8 నేను ఆ విధంగా శ్రమ పడడం ఆపమని ప్రభువైన {యేసును} నేను మూడు వేరువేరు సార్లు అడిగాను. 9 ఆయన నాతో చెప్పడం చేత స్పందించాడు, “నేను నీ యెడల దయగా వ్యవహరించినప్పుడు నీకు కావాల్సింది ఒక్కటే. వాస్తవానికి, వారు బలహీనంగా ఉన్నప్పుడు నేను మనుష్యులను పూర్తిగా శక్తివంతం చేస్తాను. అందువలన, నేను ఎంత బలహీనంగా ఉన్నాను అనే దాని గురించి నేను చాలా సంతోషంగా చెపుతాను. ఆ విధంగా, మెస్సీయ ఎల్లప్పుడు నేను శక్తివంతంగా వ్యవహరించేలా చేస్తాడు. 10 కాబట్టి అప్పుడు, {నాకు చెడు విషయాలు జరిగినప్పుడు} నేను సంతోషముగా ఉన్నాను ఎందుకంటే మెస్సీయను {నేను సేవిస్తున్నాను}. నేను బలహీనంగా ఉన్నప్పుడు, మనుష్యులు నా గురించి చెడు విషయాలు మాట్లాడినప్పుడు, మనుష్యులు నన్ను గాయపరచినప్పుడు, మనుష్యులు నన్ను హింసించినప్పుడు, మరియు నేను పోరాడుచున్నప్పుడు ఇందులో ఉన్నాయి. {నేను సంతోషముగా ఉన్నాను} ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు {దేవుడు} నాకు శక్తిని ఇస్తాడు.

11 నేను అవివేకముగా మాట్లాడుచూ ఉన్నాను, అదే చేయడానికి మీరు నన్ను బలవంతం చేసారు. {మీరు నన్ను బలవంతం చేసారు} ఎందుకంటే నేను నమ్మదగినవాడిని అని మీరు చెపుతూ ఉంటారు, {అయితే మీరు దానిని చెప్పుచుండ లేదు}. {మీరు దానిని చెప్పుచూ ఉండాలి} ఎందుకంటే తాము మెస్సీయను ఉత్తమంగా ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే మనుష్యులతో నేను కూడా అంతే గొప్పవాడిని. నేను ఎంతమాత్రము గొప్పవాడిని కాను అయినప్పటికీ {అది నిజం}. 12 మెస్సీయ తనకు ప్రాతినిధ్యం వహించడానికి పంపిన వ్యక్తి నేనే అని మీకు నిరూపించే మార్గాలలో నేను పట్టుదలతో వ్యవహరించాను. నేను శక్తివంతమైన మరియు అద్భుతమైన పనులు చేసాను. 13 ఇంకా, ఏ ఇతర విశ్వాసుల గుంపుల కంటే మీరు తక్కువ ప్రాముఖ్యత కలిగిన వారి వలె నేను మీతో వ్యవహరించ లేదు. ఒకే విధానం {నేను మీతో విభిన్నంగా వ్యవహరించాను}, { డబ్బు కోసం మిమ్ములను అడగడం చేత} నేను మిమ్ములను ఇబ్బంది పెట్టలేదు. అది నిజంగా తప్పు అయిన యెడల, దానిని చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి!

14 శ్రద్ధ వహించండి! నేను మూడవసారి మిమ్ములను సందర్శించబోవుచున్నాను. అయినప్పటికి మరల, నేను మిమ్ములను {డబ్బు కోసం అడగడం చేత} ఇబ్బంది పెట్టను. {అనగా} ఎందుకంటే మీరు {నన్ను మరియు మెస్సీయను విశ్వసించాలి అని} నేను కోరుచున్నాను. మీరు కలిగి ఉన్న వస్తువులు {నేను కోరుట లేదు}. నిజానికి, నేను మీ తల్లితండ్రుల వంటి వాడిని కాబట్టి, నేను మీ కోసం డబ్బు పొదుపు చేయాలి. ఇంకా, మీరు నా పిల్లలు వంటి వారు కాబట్టి, మీరు నా కోసం డబ్బు పొదుపు చేయకూడదు. 15 మీకు ఏదైనా సహాయం చేయడానికి నేను చాలా సంతోషంగా చేస్తాను మరియు అనుభవిస్తాను. నేను మిమ్ములను {నేను ఇంతకు ముందు చేసినదాని కంటే} ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు, మీరు నన్ను {మునుపటి కంటే} తక్కువగా ప్రేమించకూడదు. 16 నేను వ్యక్తిగతంగా మిమ్ములను {డబ్బు అడగడం చేత} ఇబ్బంది పెట్టలేదు అని మీరు అంగీకరించవచ్చు. అయినప్పటికీ, బహుశా నేను తెలివైన వ్యక్తిని. {బహుశా} నాకు {డబ్బు} ఇవ్వమని నేను మిమ్ములను ఏదో విధంగా మోసగించాను. 17 {అయితే} మిమ్ములను మోసం చేయడం చేత నా కోసం నటించి మిమ్ములను దర్శించిన వారు ఏ ఒక్కరూ నా వద్ద లేరు. 18 {ఉదాహరణకు,} నేను తీతుని {మిమ్ములను సందర్శించమని} అడిగాను, మరియు అతనితో పాటు ఒక విశ్వాసి వెళ్ళేలా నేను చేసాను. తీతు మిమ్ములను మోసం చేయలేదు {అని మీకు తెలుసు}. అతడు మరియు నేను ఒకే విధంగా జీవించాము మరియు అదే పనులు చేసాము.

19 నేను నాతో పాటు సేవ చేసేవారు నమ్మదగిన వారము అని మీకు వివరించడానికి మేము ఈ మాటలు చెప్పడానికి కారణం కాదు అని మీరు తెలుసుకోవాలి. బదులుగా, దేవుడు మెస్సీయతో ఐక్యం చేసిన వారిగా, మేము దేవునికి ఇష్టమైన వాటిని చెప్పుచున్నాము. వాస్తవానికి, మేము ప్రేమించే {తోటి విశ్వాసులు}, మేము చెప్పే మరియు చేసే ప్రతిదానిని మీరు ఎదగడములో సహాయం చెయ్యడానికి మేము ఉద్దేశిస్తాము. 20 నేను దర్శించినప్పుడు {ఏమి జరుగుతుందో} అనే ఆందోళనతో {నేను ఈ విషయాలు చెప్పాను}. {నేను ఆందోళన చెందుతున్నాను} మీరు నేను కోరుకున్న విధముగా {మీరు ప్రవర్తించడం} లేదని నేను తెలుసుకుంటాను మరియు మీరు {నేను ప్రవర్తించాలని} కోరుకున్న విధముగా నేను ప్రవర్తించడం లేదని మీరు కనుగొంటారు. మీరు {ఒకరితో ఒకరు} పోట్లాడుకోవడం, {ఒకరి మీద ఒకరు} అసూయపడడం, {ఒకరితో ఒకరు} కోపంగా ఉండటం, {ఒకరినొకరు} నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం, {ఒకరి గురించి ఒకరు} చెడ్డ సంగతులు చెప్పుకోవడం, {ఇతరుల గురించి} తప్పుడు కథనాలు చెప్పుకోవడం, మీ గురించి గొప్పగా చెప్పుకోవడం లేదా {ఒకరి మీదపై ఒకరు} గుంపులను రెచ్చగొట్టడం గురించి {నేను ఆందోళన చెందుచున్నాను} , 21 నేను ఈ మూడవసారి మిమ్ములను దర్శించినప్పుడు {ఏమి జరుగుతుందో} అనే దాని గురించి {నేను చింతిస్తున్నాను}. దేవుడు నన్ను మీ గురించి సిగ్గుపడేలా చేయవచ్చు. ఇంకా, మునుపు తప్పు అయిన దానిని చేసిన మరియు సరికాని లైంగిక చర్యను కలిగి యుండడం నిలిపి వెయ్యని అనేకులైన మనుష్యులను గురించి నేను చాలా దుఃఖపడతాను.

Chapter 13

1 {లేఖనము చెపుతుంది:} “ఇది నిజము అని మనం నమ్మడానికి ముందు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సాక్షులు {ఒకరి గురించి} అదే మాట చెప్పాలి.” {దానిని తెలుసుకొని ఉండాలి} నేను తదుపరిసారి మిమ్ములను సందర్శించినప్పుడు మూడవసారి {మీరు చేస్తున్న దానికి నేను సాక్షిగా ఉంటాను}. 2 నేను మిమ్ములను రెండవసారి సందర్శించినప్పుడు, మీలో పాపం చేస్తున్న ప్రతి ఒక్కరినీ శిక్షిస్తాను అని మీలో ప్రతిఒక్కరిని హెచ్చరించాను. మరియు ఇప్పుడు నేను మీకు దూరంగా ఉండగానే తిరిగి మిమ్ములను హెచ్చరిస్తున్నాను. ఈ మూడవసారి నేను మిమ్ములను సందర్శించినప్పుడు, పాపం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాను. 3 నేను మీతో దీనిని చెప్పుచున్నాను ఎందుకంటే నేను మీతో మాట్లాడుచున్నప్పుడు మెస్సీయ మీతో మాట్లాడుచున్నాడు అని నేను మీకు నిరూపించడానికి అని మీరు అడిగారు. {ఆయన మిమ్ములను క్రమశిక్షణలో పెట్టినప్పుడు మీరు దీనిని తెలుసుకుంటారు.} ఆయన మీతో బలహీనంగా ఉండడు; బదులుగా, ఆయన మీ మధ్య శక్తివంతంగా పని చేస్తాడు. 4 మీరు చూడండి, మనుష్యులు తనను ఒక సిలువకు మేకులతో కొట్టినప్పుడు మెస్సీయ తనను తాను బలహీనంగా {మనిషి వలే}ఉండడానికి అనుమతించాడు. అయితే దేవుడు శక్తిమంతుడు, మరియు ఆయన ఆయనను తిరిగి బ్రతికించాడు. ఆయన ఉన్నట్టు మనం కూడా బలహీనమైన మానవులమే. అయితే దేవుడు కూడా మనలను మెస్సీయ వలె జీవింప చేయడానికి శక్తివంతంగా మనలో పని చేస్తాడు, కాబట్టి మేము మీ మధ్య శక్తివంతంగా పని చేస్తాము.

5 మీలో ప్రతి ఒక్కరు మిమ్ములను మీరే అడుగుకోవాలి: “నేను మెస్సీయను విశ్వసించి మరియు ఆయన నాకు నిర్దేశించినట్లు జీవిస్తున్నానా?” మీలో ప్రతి ఒక్కరు మిమ్ములను {ఈ విధంగా} పరీక్షించుకోవాలి. అప్పుడు మీరు నిజంగా మెస్సీయ అయిన యేసుతో ఒకటిగా జీవిస్తున్నారు అని మీరు తెలుసుకొంటారు. మీరు ఈ పరీక్షలో విఫలమైతే తప్ప, అది నిజం. 6 మా విషయానికొస్తే, మేము పరీక్షలో ఉత్తీర్ణులమయ్యాము అని మీరు అర్థం చేసుకుంటారు అని నాకు నిశ్చయముగా తెలుసు. 7 మీరు ఎలాంటి చెడు పనులు చేయకుండ ఉండాలి అని మేము దేవునికి ప్రార్థిస్తున్నాము. మేము దీని కోసం ప్రార్థిస్తున్నాము, {మిమ్ములను క్రమశిక్షణలో పెట్టడంలో} మేము విజయం సాధించాము అని మనుష్యులు భావించాలి అని మేము కోరుకోవడం లేదు, అయితే మీరు మంచి పనులు చేయాలి అని కోరుచున్నాము. {మీకు మా అవసరం లేదు కాబట్టి} మేము విఫలమయ్యాము అని మనుష్యులు భావించినప్పటికీ, మేము మీ కోసం దీనిని కోరుచున్నాము. 8 మీరు మంచి పనులు చేయాలని మేము కోరుచున్నాము {అప్పుడు మేము మిమ్ములను క్రమశిక్షణలో ఉంచలేకపోయినా మరియు శక్తివంతంగా కనిపించినా} ఎందుకంటే మేము దేవుని నిజమైన సందేశానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క నిజమైన సందేశానికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము. 9 మేము బలహీనులము{అని మనుష్యులు భావించినప్పుడు} మేము సంతోషిస్తాము, ఎందుకంటే మీరు {దేవునికి విధేయత చూపడంలో} {మా నుండి క్రమశిక్షణ అవసరం లేకుండా} బలంగా ఉన్నారు. మీరు దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాలి అని మరియు విధేయత చూపాలి అని నిర్ణయించుకునేలా మేము ప్రార్థించే విషయము ఇదే. 10 ఇది ఎందుకంటే మీరు దేవుణ్ణి పూర్తిగా విశ్వసించాలి మరియు విధేయత చూపడానికి నేను కోరుచున్నాను అని నేను మీ నుండి దూరంగా ఉన్నప్పుడు ఈ విషయాల గురించి మీకు వ్రాస్తున్నాను. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు, నేను మిమ్ములను కఠినంగా శిక్షించాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రాతినిధ్యం వహించడానికి ప్రభువు నాకు అధికారం ఇచ్చాడు, అయితే ఆయన దానిని చేసాడు తద్వారా నేను మిమ్ములను {దేవుణ్ణి ఎక్కువగా విశ్వసించడానికి} ప్రోత్సహిస్తాను మరియు సహాయం చేస్తాను. తద్వారా నేను మిమ్ములను {దేవుణ్ణి విశ్వసించడం నుండి} నిరుత్సాహపరచడానికి కాదు. 11 నా తోటి విశ్వాసులారా, నేను మీకు చివరిగా చెప్పదలచుకున్న విషయాలు ఇక్కడ ఉన్నాయి. సంతోషముగా ఉండండి! మీరు జీవించాలని దేవుడు కోరుకునే విధంగా జీవించండి. నేను మీతో చెప్పిన విషయాలు {దేవుణ్ణి ఎక్కువగా విశ్వసించడానికి} మిమ్ములను ప్రోత్సహించనివ్వండి. ఒకరితో ఒకరు {ముఖ్యమైన విషయాల గురించి} అంగీకరించండి. ఒకరితో ఒకరు సమాధానముగా జీవించండి. {మీరు ఈ పనులు చేసిన యెడల,} దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయనే ప్రేమించడానికి మరియు ఇతరులతో శాంతియుతంగా ఉండడానికి మిమ్ములను సమర్థులనుగా చేస్తాడు. 12 దేవుని యొక్క కుటుంబ సభ్యులకు తగిన విధంగా ఒకరినొకరు ఆప్యాయంగా శుభములు చెప్పుకోండి. దేవుని మనుష్యులు అందరు {ఇక్కడ} మీకు వందనములు తెలియజేస్తున్నారు. 13 ప్రభువైన యేసు మెస్సీయ మీ యెడల దయతో వ్యవహరించును గాక, దేవుడు మిమ్ములను ప్రేమించును గాక, మరియు పరిశుద్ధ ఆత్మ మీకు తోడై యుండును గాక మరియు మిమ్ములను అందరిని కలుపును గాక!