తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యాకోబు రాసిన పత్రిక

Chapter 1

1 యాకోబునైన నేను దేవుణ్ణి, మరియు మెస్సీయ అయిన ప్రభువైన యేసును సేవిస్తాను. యేసులో విశ్వాసం ఉంచి మరియు రోమా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న మీకు నేను ఈ లేఖ రాస్తున్నాను. నేను మీకు అందరికి శుభములు చెప్పుచున్నాను.

2 నా తోటి విశ్వాసులారా, మీరు అనేక రకాల కష్టాలను అనుభవించినప్పుడు చాలా సంతోషించాల్సిన విషయంగా భావించండి. 3 కష్టాలలో మీరు దేవుణ్ణి విశ్వసించి యుండగా, మీరు ఒక బలమైన వ్యక్తిగా మారడానికి ఇది మీకు సహాయపడుతుందని అర్థం చేసుకోండి. 4 మీరు అన్ని విధాలుగా మెస్సీయను అనుసరించేలా కష్టాలను వాటి చివరి వరకు సహించండి. అప్పుడు మీరు బాగా చేయడంలో విఫలం కాదు.

5 మీలో ఎవరైనా ఏమి చేయాలో తెలుసుకోవాలంటే, అతను దేవుణ్ణి అడగనివ్వండి, దేవుడు అతనికి చెప్తాడు. దేవుడు అందరికీ ఉదారంగా ఇస్తాడు. దేవుడు {వస్తువుల కోసం అడిగే} వ్యక్తులను గద్దించడు. 6 అయితే మీరు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు, మీకు సమాధానం ఇవ్వడానికి మీరు ఆయనను విశ్వసించాలి. ఆయన సమాధానం మరియు మీకు సహాయం చేస్తాడని సందేహించవద్దు. దేవుణ్ణి అనుమానించే మనుష్యులు మొదట ఒక పని చెయ్యడానికి నిర్ణయించుకుంటారు, అయితే అప్పుడు వారు మరొకటి చేయడానికి కోరుకుంటారు. వారు ఎన్నడూ ఒకే విధమైన కార్యక్రమం మీద స్థిరపడరు. . 7 నిజానికి, సందేహం ఉన్నవారు, ప్రభువైన దేవుడు తాము కోరినది {అంత అనిశ్చితంగా} వారికి ఇస్తాడు అని అనుకోకూడదు. 8 ఇలాంటి మనుష్యులు ఏమి చేయాలో ఎన్నడూ నిర్ణయించుకోలేరు. వారు ఒక ప్రణాళిక వేస్తారు, అయితే వారు దానిని పాటించరు.

9 ఎక్కువ డబ్బు లేని విశ్వాసులు సంతోషించాలి, ఎందుకంటే దేవుడు వారిని గౌరవించాడు. 10 అయితే చాలా డబ్బు ఉన్న విశ్వాసులు దేవుడు తమను తగ్గించాడని సంతోషించాలి {తమ సంపద ఇతర వ్యక్తుల కంటే తమను మెరుగ్గా చేయదని చూపించడం ద్వారా}. అన్నింటికంటే, అడవి పువ్వుల వలె {కొద్దికాలం మాత్రమే వికసించి మరియు అప్పుడు వాడిపోయే}, ధనవంతులైన విశ్వాసులు {మరొకరి వలే} చనిపోతారు. 11 ఒక అడవి పువ్వు కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు ఉదయించినప్పుడు, దాని మండే వేడి మొక్కలను ఎండిపోతుంది, తద్వారా వాటి పువ్వులు రాలిపోతాయి. అవి ఇక మీదట అందంగా ఉండవు. చనిపోయే పువ్వు వలే, ధనవంతులైన మనుష్యులు డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చనిపోతారు.

12 కష్టమైన పరిస్థితులలో తనకు నమ్మకంగా ఉండేవారిని దేవుడు గౌరవిస్తాడు. నిజానికి, దేవుడు వారిని శాశ్వతంగా జీవించేలా చేయడం ద్వారా వారికి ప్రతిఫలమిస్తాడు. దేవుడు తనను ప్రేమించే వారు అందరికీ చెయ్యడానికి చేసిన వాగ్దానం అదే.

13 మనం పాపం చేయడానికి శోధించబడినప్పుడు, మనలను శోధిస్తున్నది దేవుడని మనం అనుకోకూడదు. లేదు, చెడు చేయమని దేవుణ్ణి ఎవరూ ఒప్పించలేరు మరియు చెడు చేయడానికి దేవుడు ఎవరినీ ఒప్పించడానికి ప్రయత్నించడు 14 అయితే మనుష్యులు తమ సొంత కోరికల కారణంగా చెడు చేయాలని కోరుకుంటారు. వారు చేసినప్పుడు, వారు ఒక ఉచ్చులోనికి పడినట్టు వలే ఉంటుంది. 15 అప్పుడు, వారు చెడు పనులు చేయాలని కోరుకున్నారు కాబట్టి, వారు వాటిని చేయడానికి ప్రారంభించారు, మరియు చివరికి వాటిని అలవాటుగా చేస్తున్నారు. {వారు తమ పాపపు ప్రవర్తన నుండి దూరంగా ఉండకపోయిన యెడల,} వారు శాశ్వతంగా దేవుని నుండి వేరు చేయబడతారు.

16 నేను ప్రేమించే నా తోటి విశ్వాసులారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మానుకోండి. 17 ప్రతి నిజమైన మంచి మరియు పరిపూర్ణమైన బహుమతి పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని నుండి వస్తుంది. ఆయన సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు. అయితే నీడలు మారడం, కనిపించడం మరియు అదృశ్యం కావడం విధంగా దేవుడు మార్పు చెందడు. దేవుడు ఎప్పుడూ మారడు. అతను ఎల్లప్పుడూ మంచివాడు! 18 మనం ఆయన నిజమైన సందేశాన్ని విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఆధ్యాత్మిక తండ్రి అయ్యాడు. ఆయన చెయ్యడానికి కోరుకున్నాది అదే. కాబట్టి ఇప్పుడు యేసులో విశ్వాసులు భవిష్యత్తులో మరింత ఎక్కువమంది మనుష్యులు దేవునితో కలిగి ఉండే సంబంధం లాంటిదానిని అనుభవించడానికి మొదటి మనుష్యులు అయ్యారు.

19 నేను ప్రేమించే నా తోటి విశ్వాసులారా, మీలో ప్రతి ఒక్కరూ {ఇతరులు చెప్పేది} ఓపికగా వినాలని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు {మీ స్వంత ఆలోచనలను} జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, 20 ఎందుకంటే మనకు కోపం వచ్చినప్పుడు మనం చెయ్యాలని దేవుడు కోరుకున్న మంఛి సంగతులు మనం చేయలేము.

21 కాబట్టి అన్ని రకాల చెడులు చేయడం మానేయండి. గర్వంగా ప్రతిఘటించడం లేకుండా, దేవుడు మీకు చెయ్యడానికి చెప్పినది చేయండి. దానిని గుర్తుంచుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇది మీరు దేవునికి చెందినవారని చూపిస్తుంది. 22 దేవుడు ఏమి ఆజ్ఞాపించాడో అది ముఖ్యం, దానిని వినడం మాత్రమే చెయ్యవద్దు. దానివి కేవలం వినడం మాత్రమే చేసి మరియు దానికి విధేయత చూపించని మనుష్యులు తమను తాము {ఇది తమను కాపాడుతుందని భావన లోనికి} బుద్ధి హీనులుగా చేసుకుంటున్నారు. 23 ఇప్పుడు కొందరు మనుష్యులు దేవుని సందేశం వింటారు, అయితే అది చెప్పుచున్న దానిని వారు చేయరు. ఆ మనుష్యులు తన ముఖాన్నిఒక అద్దములో చూసుకునే వాని వలే ఉన్నారు. 24 అతడు తనను తాను చూసుకున్నప్పటికీ, అతడు {అద్దం నుండి} దూరంగా వెళ్లి మరియు అతడు ఏవిధంగా కనిపిస్తాడో వెంటనే మరచిపోతాడు. 25 అయితే ఇతర మనుష్యులు దేవుని సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది పరిపూర్ణమైనది మరియు ఇది మనుష్యులు స్వచ్ఛందంగా {దేవుడు వారిని ఏమి చేయాలని కోరుకుంటున్నాడో} చేసేలా చేస్తుంది. ఈ మనుష్యులు తాము విన్న వాటిని జ్ఞాపకం ఉంచుకొని, మరియు వారు చెయ్యడానికి దేవుడు చెప్పిన వాటిని చెయ్యడానికి కొనసాగుతున్న యెడల, వారు చేసే పనుల కారణంగా అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు.

26 కొందరు మనుషులు వారు దేవుణ్ణి సరిగ్గా ఆరాధిస్తారని తలంచుతారు మరియు అయితే వారు చెడు సంగతులు మాట్లాడతారు. ఆ మనుష్యులు తమ ఆలోచనలో తప్పుగా ఉన్నారు. మనం నిరంతరం చెడు మాటలు చెప్పిన యెడల దేవుడు మన ఆరాధనా కార్యకలాపాలతో ప్రభావితం కాడు. 27 కష్టాలను అనుభవిస్తున్న అనాథలు మరియు వితంతువులను గురించిన శ్రద్ధ తీసుకోవడం {మనం చెయ్యడానికి దేవుడు మనకు చెప్పిన వాటిలో అది ఒకటి}. దానిని చేయు మనుష్యులు దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తారు, ఆయన మన తండ్రి. దేవునికి విధేయత చూపని ఇతరుల వలే ఆలోచించడం లేదా అనైతికంగా ప్రవర్తించకపోయిన యెడల మనుష్యులు కూడా నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ పనులు చేసే మనుష్యులను దేవుడు ఆమోదిస్తాడు.

Chapter 2

1 నా తోటి విశ్వాసులారా, కొందరిని ఇతరులకన్నా ఎక్కువగా గౌరవించకండి మరియు అదే సమయంలో మన గొప్ప ప్రభువు యేసు మెస్సీయలో విశ్వసించండి. 2 ఉదాహరణకు, బంగారు ఉంగరాలు, మరియు మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి మీతో ఆరాధన కోసం కలిసాడు అనుకుందాం. మరియు చిరిగిన బట్టలు వేసుకున్న ఒక పేద వ్యక్తి కూడా మీతో చేరాడని అనుకుందాం. 3 మరియు మీరు మంచి దుస్తులు ధరించిన వ్యక్తికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని అనుకోండి. మీరు అతనితో చెపుతారు, "దయచేసి ఇక్కడ ఈ మంచి ఆసనంలో కూర్చోండి!" అయితే మీరు పేదవాడితో చెపుతారు {తక్కువ గౌరవప్రదమైన ప్రదేశానికి వెళ్ళడానికి, చెపుతారు}, "నువ్వు అక్కడ నిలబడు" లేదా, "నేల మీద కూర్చో! 4 పేదవారి కంటే ధనవంతులు మంచివారని మీరు భావించారని ఇది చూపిస్తుంది. మీరు చెడు ఆలోచనల ఆధారంగా {వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే దాని గురించి} మీ తీర్పులు ఇస్తున్నారని ఇది చూపిస్తుంది. 5 నేను ప్రేమించే నా తోటి విశ్వాసులారా, నా మాట వినండి. దేవుడు తనలో అధికంగా నమ్మకం ఉంచడానికి విలువైనదేమీ కలిగి లేని వారిగా కనిపించే పేద మనుష్యులను ఎన్నుకున్నాడు. ఆయన ప్రతిచోటా పరిపాలించినప్పుడు వారికి గొప్ప సంగతులను ఇస్తాడు. ఇదే తనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ చెయ్యడానికి ఆయన వాగ్దానం చేశాడు. 6 అయితే మీరు పేద మనుష్యులతో అమర్యాదగా ప్రవర్తించారు! దీని గురించి ఆలోచించు! మీరు శ్రమ పడేలా చేస్తున్నది ధనవంతులైన మనుష్యులే, పేద మనుష్యులు కాదు! మిమ్మల్ని బలవంతంగా న్యాయస్థానానికి {న్యాయమూర్తుల ముందు మిమ్మల్ని నిందించడానికి} తీసుకు వెళ్ళేది ధనవంతులైన మనుష్యులే! 7 మరియు మిమ్మల్ని అవమానపరచే వ్యక్తులు వారే ఎందుకంటే మీరు క్రైస్తవులు! 8 {కాబట్టి మీరు పేదవారి కంటే ధనవంతులతో మెరుగ్గా వ్యవహరించకూడదు.} బదులుగా, యేసు ప్రాముఖ్యమైనదని చెప్పిన ఆజ్ఞకు మీరు లోబడాలి. ఇది మోషే ధర్మశాస్త్రం నుండి వచ్చింది: "నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమించు." నీవు అందరిపట్ల సమానంగా ప్రేమను కనబరిచిన యెడల నీవు సరైన దానిని చేస్తావు. 9 అయితే మీరు కొందరిని ఇతరులకన్నా ఎక్కువగా గౌరవించిన యెడల, మీరు తప్పు చేస్తున్నారు. మరియు {దేవుడు ఆజ్ఞాపించినది నీవు చేయనందున,} నీవు తన ధర్మశాస్త్రమును ఉల్లంఘించినావని దేవుడు చెప్పును.

10 {దేవుడు ఇది చెపుతాడు} ఎందుకంటే మీరు దేవుని నియమాలలో ఒకదానిని ఉల్లంఘించిన యెడల, మిగతా వాటికి మీరు విధేయత చూపించినప్పటికీ, మీరు అన్ని చట్టాలను ఉల్లంఘించినట్లే 11 ఉదాహరణకు, దేవుడు చెప్పాడు, “వ్యభిచారం చేయవద్దు.” అయితే ఆయన “ఎవరినీ హత్య చేయవద్దు” అని కూడా చెప్పాడు. కాబట్టి మీరు వ్యభిచారం చేయకుండా అయితే మీరు ఎవరినైనా హత్య చేసిన యెడల, అప్పుడు మీరు దేవుని నియమాలను ఉల్లంఘించే ఒక వ్యక్తి అవుతారు. 12 ఆయన మనకు ఇచ్చిన {ఇతరులను ప్రేమించమని} ఇచ్చిన ఆజ్ఞ ఆధారంగా దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడని తెలుసుకుని {ఎల్లప్పుడూ} ఇతరుల పట్ల మాట్లాడండి మరియు ప్రవర్తించండి. మనం ఆ ఆజ్ఞను అనుసరించినప్పుడు, మనం స్వేచ్ఛగా దేవునికి లోబడతాము. 13 మీరు ఈ విధంగా మాట్లాడాలి మరియు ప్రవర్తించాలి, ఎందుకంటే దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు, ఇతరుల పట్ల కనికరం చూపని వారి పట్ల ఆయన కనికరం చూపడు. అయితే మనం ఇతరుల పట్ల దయతో ఉంటే, దేవుడు మనల్ని తీర్పు తీర్చినప్పుడు మనపై దయ చూపుతాడని మనం ఆశించవచ్చు.

14 నా తోటి విశ్వాసులారా కొందరు చెపుతారు, “నేను ప్రభువైన యేసు మెస్సీయను విశ్వసిస్తున్నాను”, అయితే వారు ప్రేమతో కూడిన పనులు చేయరు. వారు చెప్పేది వారికి మేలు చేయదు. వారు కేవలం మాటలతో నమ్మిన యెడల, దేవుడు వారిని ఖచ్చితంగా రక్షించడు. 15 {ఉదాహరణకు,} ఒక తోటి విశ్వాసికి, పురుషుడైనా లేదా స్త్రీ అయినా, ప్రతిరోజూ బట్టలు మరియు ఆహారం విషయంలో కొరతగా ఉంటారని అనుకుందాం. 16 మరియు మీలో ఒకరు, “చింతించకండి, వెచ్చగా ఉండండి, మీకు కావాల్సిన ఆహారం తీసుకోండి” అని వారితో చెప్పారు అనుకుందాం. అయితే మీరు వారికి ఎలాంటి దుస్తులు లేదా ఆహారం ఇవ్వలేదని అనుకుందాం. అప్పుడు అది వారికి సహాయం చేయదు! 17 అదేవిధంగా, మీరు యేసులో విశ్వసిస్తున్నారని కేవలం చెప్పి మరియు దానిని కనుపరచేది దేనిని చేయని యెడల, మీరు నిజంగా యేసును విశ్వసించలేదు.

18 అయితే నాకు క్రియలు ఉండగా నీకు విశ్వాసం ఉందని ఎవరైనా {నీతో} చెప్పవచ్చు. {ఒక వ్యక్తి తన మతాన్ని విశ్వాసం లేదా పనుల ద్వారా వ్యక్తపరచగలడని మరియు అతనికి రెండూ ఉండవలసిన అవసరం లేదని అతడు చెప్పవచ్చు.} {అయితే నేను ప్రతిస్పందనగా చెపుతున్నాను, నీవు} క్రియలు లేకుండా నీ విశ్వాసాన్ని నాకు చూపించలేవు. నేను{, మరోవైపు,} నా పనుల చేత నా విశ్వాసాన్ని నీకు చూపగలను. 19 {దేవుడు మీరు చేయాలనుకున్నది చేయడం లేకుండా దేవుణ్ణి విశ్వసించడం మిమ్మల్ని ఏవిధంగా రక్షించలేదో నేను వివరిస్తాను.} నిజమైన దేవుడు ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు. మీరు నమ్మడం సరైనదే. అయితే దయ్యాలు కూడా దానిని నమ్ముతాయి, మరియు అవి {భయంతో} వణుకుతున్నాయి, ఎందుకంటే ఒకే నిజమైన దేవుడు తమను శిక్షిస్తాడని కూడా వాటికి తెలుసు. 20 అంతేకాకుండా, నువ్వు మూర్ఖుడవైన వ్యక్తివి, ఎవరైనా తాను యేసులో విశ్వసిస్తున్నానని చెప్పి అయితే అతడు దానిని కనుపరచే దేనినీ చేయని యెడల అప్పుడు అతడు చెప్పేది అతనికి ఏ విధంగానూ సహాయం చేయదని నేను మీకు రుజువు ఇస్తాను. 21 {ఇక్కడ రుజువు ఉంది.} అబ్రాహాము, ఆయన నుండి మనం సంతానంగా వచ్చాము, తన కుమారుడైన ఇస్సాకును {దేవునికి} బలిగా అర్పించడానికి {అది చెయ్యమని దేవుడు కోరుకున్న యెడల} తాను సిద్ధమని చూపించాడు. దేవుడు అబ్రాహామును నీతిమంతునిగా పరిగణించాడు, ఎందుకంటే అతడు ఆయనకు విధేయత చూపుతాడని చూపించాడు {మరియు అతను నిజంగా దేవుణ్ణి విశ్వసించాడని నిరూపించాడు}. 22 ఈ విధంగా, అబ్రాహాము దేవునికి విధేయత చూపాడు, ఎందుకంటే అతడు ఆయనను నమ్మాడు. అతడు ఆయనకు విధేయత చూపినప్పుడు, అది దేవుణ్ణి పూర్తిగా విశ్వసించడానికి అతనికి సహాయపడింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నిజంగా విశ్వసించాడు కాబట్టి దేవుడు అతనిని సరైనది చేసే వ్యక్తిగా చూశాడు” అనే లేఖనం అలా నిజమైంది. అబ్రాహాము దేవుని స్నేహితుడు అని ఇతర లేఖనాలు చెపుతున్నాయి. 24 {అబ్రాహాము యొక్క ఉదాహరణ నుండి,} వారు కేవలం ఆయనలో విశ్వాసం ఉంచడం కారణంగా కాదు వారు చేయుచున్న దాని కారణంగా దేవుడు మనుషులను నీతిమంతులుగా పరిగణిస్తున్నాడని మీరు గుర్తించాలి. 25 అయన అబ్రాహాము కోసం చేసినట్టు వలే, దేవుడు రాహాబును కూడా ఆమె చేసిన దాని కారణంగా నీతిమంతురాలిగా యెంచాడు. ఆమె వేశ్యగా ఉండేది, అయితే ఆమె సందేశకులను {భూమిని వేగు చూడడానికి యెహోషువా పంపాడు} చూసుకుంది. ఆమె తరువాత వారిని సురక్షితమైన మార్గంలో తిరిగి పంపించడం చేత తప్పించుకోవడానికి ఆమె వారికి సహాయం చేసింది.

26 ఇది అంతా ఒక ముఖ్యమైన సత్యాన్ని వివరిస్తుంది. ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకోకపోయిన యెడల అతని శరీరం సజీవంగా లేనట్టు గానే, అదే విధంగా, ఒక వ్యక్తి తాను చేసే పని ద్వారా ఆ నమ్మకాన్ని వ్యక్తపరచకపోయిన యెడల దేవునిలో నిజంగా నమ్మడు.

Chapter 3

1 నా తోటి విశ్వాసులారా, మీలో చాలామంది {దేవుని వాక్యానికి} బోధకులు కావాలని కోరుకోకూడదు. మీకు తెలిసినట్లుగా, దేవుడు బోధకులమైన మనకు {ఇతరులను తీర్పు తీర్చడం కంటే} మరింత కఠినంగా తీర్పు ఇస్తాడు. 2 {మీలో అనేకమంది బోధకులుగా ఎందుకు మారకూడదో నేను మీకు చెపుతాను.} మనమందరం తరచుగా తప్పు పనులు చేస్తుంటాము. అయితే ఎవరైనా తప్పుగా మాట్లాడకుండా ఉండగలిగిన యెడల, అతడు దేవుడు అనుకున్న వ్యక్తి అవుతాడు. అతడు తన చర్యలన్నింటినీ కూడా నియంత్రించగలడు. 3 ఉదహరించడానికి, మనం ఒక గుర్రం యొక్క నోటిలోనికి ఒక చిన్న లోహపు కడ్డీని ఉంచగలం మరియు అది ఎక్కడికి వెళ్ళడానికి మనం కోరుకుంటున్నామో గుర్రం వెళ్ళడానికి ఉపయోగించవచ్చు. మనం అలా చేసినప్పుడు, గుర్రం యొక్క పెద్ద శరీరాన్ని {కేవలం ఆ చిన్న పరికరం ద్వారా} నిర్దేశించవచ్చు. 4 ఓడల గురించి కూడా ఆలోచించండి. ఒక ఓడ చాలా పెద్దది కావచ్చు మరియు దానిని ముందుకు నడిపించే గాలులు చాలా బలంగా ఉండవచ్చు. అయినప్పటికీ, ఒక చిన్న చుక్కానిని ఉపయోగించడం ద్వారా, నావికుడు తాను దానిని ఎక్కడికి వెళ్లాలని కోరుకున్నాడో ఓడను నడిపించగలడు. 5 అదేవిధంగా, మన నాలుకలు చాలా చిన్నవి అయినప్పటికీ, మనం గొప్ప పనులు చేశామని గొప్పగా చెప్పుకోవడానికి వాటిని ఉపయోగిస్తాము. ఒక చిన్న మంటలా మొదలయ్యే అగ్ని అనేక చెట్లను కాల్చేస్తుందని కూడా గమనించండి.

6 మంటలు అడవిని తగలబెట్టిన విధంగా, మనం చెడు మాటలు మాట్లాడినప్పుడు అనేక మందిని గాయపరుస్తాము. {మనం చెప్పేది దానిని వెల్లడిస్తుంది} మనలో చాలా చెడు ఉంది. మనం చెడు మాటలు చెప్పినప్పుడు, ఇది మనం ఆలోచించే మరియు చేసే ప్రతిదాన్ని కలుషితం చేస్తుంది. అది మన జీవితాన్ని అంతటినీ నాశనం చేయగలదు. చెడు మాట్లాడేలా మనల్ని ప్రభావితం చేసేది సాతానే. 7 మరొక ఉదాహరణ చెప్పడానికి, మనుష్యులు అనేక రకాల అడవి జంతువులు, పక్షులు, ప్రాకెడు జంతువులు మరియు నీటిలో నివసించే జంతువులను మచ్చిక చేసుకోగలిగారు. 8 అయితే ఆయన చెప్పే మాటలను ఎవరూ అదుపు చేయలేరు. మనుష్యులు చెప్పే విషయాలు ప్రమాదకరమైన జీవి లాంటివి, దాని విషంతో మనుష్యులను చంపడం ఎప్పటికీ ఆగదు. 9 మన ప్రభువు మరియు తండ్రి అయిన {ఆయన దేవుడు} స్తుతించడానికి మనం సంబాషణను ఉపయోగిస్తాము. అయితే మనుష్యులకు చెడు జరగాలని మనం కోరుకుంటున్నాము అని చెప్పడానికి కూడా మనం సంబాషణను ఉపయోగిస్తాము. {అది చాలా తప్పు, ఎందుకంటే} దేవుడు తన లాంటి మనుష్యులను సృష్టించాడు. 10 ఎవరైనా దేవుణ్ణి స్తుతించడానికి తన సంభాషణను ఉపయోగించవచ్చు. అయితే మనుష్యులకు చెడు జరగాలని కోరుకోవడానికి అతడు అదే సంభాషణను ఉపయోగిస్తాడు. నా తోటి విశ్వాసులారా, ఇది జరగకూడదు! 11 మంచి-రుచిగల నీరు మరియు చెడు-రుచిగల నీరు ఖచ్చితంగా ఒకే మూలం నుండి రావు! 12 నా తోటి విశ్వాసులారా, అంజూరపు చెట్టు ఒలీవలను ఉత్పత్తి చెయ్య లేదు . మరియు ఒక ద్రాక్షతీగ అంజూరపు పండ్లను ఉత్పత్తి చేయలేదు. అంతేకాకుండా ఉప్పగా ఉండే మూలం మంచి నీటిని ఉత్పత్తి చేయలేదు. {అదేవిధంగా, మనం మంచిని మాత్రమే మాట్లాడాలి, మరియు చెడుగా ఉన్నదానిని మనం మాట్లాడకూడదు.} 13 మీలో ఎవరైనా బాగా అవగాహన కలిగి యున్న యెడల, మీ జీవితాన్ని సరిగ్గా జీవించడం చేత మీరు దానిని కనుపరుస్తారు. జ్ఞానంగా ఉండడం ఇతరుల పట్ల మృదువుగా ప్రవర్తించేలా నడిపిస్తుంది. 14 అయితే మీరు లోలోపల ఇతరులపై అసహ్యంతో పగ పెంచుకుని, మరియు వారికంటే మీరే ముఖ్యమని భావించిన యెడల, మీరు జ్ఞానవంతులమని చెప్పుకోకూడదు. అది అబద్ధం అయిన దానిని వాస్తవంగా నిజం అని చెపుతుంది. 15 అసూయపడే మరియు స్వార్థపూరితమైన మనుష్యులు దేవుడు కోరుకున్నట్లుగా జ్ఞానవంతులు కారు. బదులుగా వారు దేవుణ్ణి గౌరవించని వారిలా ఆలోచిస్తూ ఉన్నారు మరియు ప్రవర్తిస్తున్నారు. వారు తమ స్వంత చెడు కోరికలను అనుసరిస్తారు. దయ్యాలు చేసే పని వారు చేస్తున్నారు. 16 పగ మరియు స్వార్థపూరితంగా ఉండే ఆ మనుష్యులు జ్ఞానవంతులు కారు అని మనం చెప్పగలం ఎందుకంటే వారు తమను తాము నియంత్రించుకోరు. వారు అనేక పాపపు కార్యకలాపాలలో పాల్గొంటారు. 17 అయితే జ్ఞానిగా ఉండమని దేవుడు బోధించిన వ్యక్తి అన్నిటిలో మొదట నైతికంగా పవిత్రుడు. అటువంటి వ్యక్తి ఇతరులతో కూడా సమాధానాన్ని చేస్తాడు. అతడు వారితో దయగా ఉంటాడు మరియు వారితో బాగా కలిసిపోతాడు. అతడు అర్హత లేని వ్యక్తుల పట్ల ఉదారంగా ఉంటాడు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఆచరణాత్మకమైన పనులను చేస్తాడు. అతడు ఒకరి మీద మరొకరికి అనుకూలంగా ఉండడు మరియు అతడు కానిదానిని ఉన్నట్లుగా నటించడు. 18 ఇతరులతో కలిసిమెలిసి ఉండేందుకు మనుష్యులు నిశ్శబ్దంగా పని చేస్తున్నప్పుడు, వారు మంచి సంబంధాలు కలిగి ఉండేందుకు ఇతరులకు సహాయపడగలరు.

Chapter 4

1 మీరు ఒకరితో ఒకరు ఎందుకు గొడవ పడుతున్నారో నేను మీకు చెపుతాను. ఎందుకంటే మీలో ప్రతి ఒక్కరూ చెడు పనులు చేయాలని లోలోపల కోరుకుంటారు. ఆ కోరికలు మిమ్మల్ని పోరాడటానికి దారి తీస్తాయి {ఆ పనులు చేయగలగడానికి}. 2 మీరు వస్తువులను కలిగి ఉండాలని కోరుకుంటారు, అయితే మీరు {వాటిని} పొందలేరు. ఇది వాటిని కలిగి ఉన్న మనుష్యుల మీద మీకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తుంది. అయితే మీరు {ఇప్పటికీ} {మీకు కావలసినది} పొందలేరు, కాబట్టి మీరు {ఇతరులతో} గొడవపడతారు మరియు పోరాడుతారు. మీరు {దేవునికి} బదులుగా {మీరు కోరుకునే వాటి కోసం} ప్రార్థిస్తే, దేవుడు మీకు {మీకు నిజంగా అవసరమైనది} ఇస్తాడు. 3 అయితే మీరు దేవుణ్ణి అడిగినప్పుడు కూడా ఆయన వాటిని మీకు ఇవ్వడు, ఎందుకంటే మీరు చెడు ఉద్దేశాలతో అడుగుతున్నారు. మీరు తప్పుడు మార్గాల్లో ఆనందించడానికి వాటిని ఉపయోగించుకునేలా మీరు వస్తువులను అడుగుతున్నారు.

4 మీరు దేవునికి {ఆయనకు విధేయత చూపకుండా} అవిధేయులుగా ఉన్నారు! దుర్మార్గులైన మనుష్యుల వలె ప్రవర్తించే వారు దేవునికి విరోధులని మీరు గ్రహించాలి. కాబట్టి మీరు అలా జీవించడానికి నిర్ణయించుకుంటే, అప్పుడు మీరు దేవునికి విరోధంగా ఉండటాన్ని ఎంచుకుంటారు. 5 దేవుడు దీని గురించి లేఖనాలలో మనకు ఉద్దేశపూర్వకంగా చెప్పాడని మీరు గ్రహించాలి. ఆయన మనలో ఉంచిన ఆత్మ మన జీవితాలు ఆయనను సంతోషపెట్టే విధంగా జీవించడానికి మన కోసం అపేక్షించుచున్నాడని అక్కడ మనకు బోధిస్తున్నాడు. 6 మనం దేవునికి ఇష్టం లేని మార్గాలలో జీవిస్తున్నట్లయిన యెడల, ఆయన మనపట్ల చాలా దయగా ఉంటాడు. {మనం తప్పు చేస్తున్నామని వినయంగా ఒప్పుకున్న యెడల మనం భిన్నంగా జీవించడంలో ఆయన మనకు సహాయం చేస్తాడు.} ఆ కారణంగా బైబిలులో ఈ బోధ ఉంది: “దేవుడు గర్వంగా ఉన్నవారికి సహాయం చేయడు, అయితే ఆయన వినయంగా ఉన్నవారికి సహాయం చేస్తాడు.”

7 కాబట్టి దేవునికి విధేయత చూపడానికి వినయంగా ఎంపిక చేసుకోండి. సాతాను శోధనలకు లొంగిపోకూడదని దృఢంగా నిశ్చయించుకోండి. సాతాను మిమ్మల్ని శోధించడానికి ప్రయత్నించడం వదిలివేసేలా ఇది చేస్తుంది. 8 దేవునితో నిజాయితీగా మరియు యదార్ధంగా ఉండండి. మీరు చేసిన యెడల, ఆయన మిమ్ములను తన సన్నిధిలోనికి సమక్షంలోకి స్వాగతిస్తాడు. పాపాత్ములైన మీరు, తప్పు చేయడం నుండి దూరంగా ఉండి, మరియు సరైనది మాత్రమే చేయండి. దేవునికి సమర్పించుకొని ఉంటారో లేదో నిర్ణయించుకోలేని మీరు, తప్పుడు ఆలోచనలను ఆపి వెయ్యండి మరియు సరైన ఆలోచనలను మాత్రమే ఆలోచించండి. 9 దుఃఖం చూపండి మరియు విచారంగా ఉండండి మరియు ఏడవండి {మీరు చేసిన తప్పు పనుల కారణంగా}. మీరు ఆనందాన్ని పొందుతున్నారు, అయితే మీరు గంభీరంగా ఉండాలి {మరియు మీరు ఎంత మారవలసి ఉంది అని గ్రహించండి}. 10 మీ పాపాల పట్ల మీరు ఎంత పశ్చాత్తాపపడుతున్నారో వినయంగా ప్రభువుకు కనుపరచండి. మీరు దానిని చేసిన యెడల, ఆయన మిమ్ములను ఘనపరుస్తాడు.

11 నా తోటి విశ్వాసులారా, తప్పు చేస్తున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మానేయండి. ఒక తోటి విశ్వాసిని నిందించి మరియు ఖండించే ఎవరైనా నిజంగా దేవుని ఆజ్ఞను {మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని} నిందిస్తున్నారు. అయితే మీరు ఆ ఆజ్ఞకు విరుద్ధంగా మాట్లాడిన యెడల, మీరు దానికి విధేయత చూపించరు. బదులుగా, మీరు దానిని ఖండించే ఒక న్యాయాధిపతి వలే వ్యవహరిస్తున్నారు. 12 ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన వ్యక్తి మాత్రమే మనుష్యులకు {ధర్మశాస్త్రం ప్రకారం} తీర్పు తీర్చగలడు. ఆయన దేవుడు, మనుష్యులను {చట్టాన్ని ఉల్లంఘించినందుకు} ఖండించడానికి మాత్రమే కాకుండా {వారు చట్టాన్ని ఉల్లంఘించినప్పటికీ}. అయితే వారిని క్షమించదానికి కూడా శక్తి గలవాడు. మీరు దేవుని స్థానాన్ని ఆక్రమించడానికి మరియు ఇతరులను తీర్పు తీర్చడానికి మీకు ఖచ్చితంగా అర్హత లేదు.

13 మీలో కొందరు {అహంకారంతో}, “ఈరోజు లేదా రేపు మనం ఒకానొక నగరానికి వెళ్తాము. మనం అక్కడ ఒక సంవత్సరం గడుపుదాము మరియు మేము వస్తువులను కొనడం మరియు అమ్మడం మరియు చాలా డబ్బు సంపాదిస్తాము.” ఇప్పుడు మీరు నా మాట వినండి! 14 రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు కాబట్టి మీరు అలా మాట్లాడకూడదు. నిజానికి నువ్వు ఎంతకాలం బతుకుతావో కూడా నీకు తెలీదు! అన్నింటికంటే, మీ జీవితం చిన్నది, పొగమంచు వలే క్లుప్తంగా కనిపిస్తుంది అయితే అప్పుడు అదృశ్యమవుతుంది. 15 {మీరు చెప్పేదానికి} బదులుగా, “ప్రభువుకు ఇష్టమైన యెడల, మనం ఇంకా బ్రతికే ఉంటాము మరియు మనం ఒకదానిని లేదా మరొక దానిని చేయగలము” అని చెప్పాలి. 16 అయితే మీరు చేస్తున్నది మీరు చేయడానికి ప్రణాలిక చేసుకొంటున్న అన్ని సంగతులను గురించి గొప్పగా చెప్పుకోవడం. ఆ విధంగా గొప్పలు చెప్పుకోవడం పాపం. 17 కాబట్టి ఎవరైనా తాను చేయవలసిన పని అది సరైనదని తెలిసినా దానిని చేయకపోయిన యెడల, అతడు పాపం చేసిన వాడు అవుతాడు.

Chapter 5

1 ధనవంతులైన మనుష్యులు మీతో ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను {మీరు యేసును నమ్ముతున్నారని చెప్పేవారు}. నా మాట వినండి! మీరు భయంకరమైన కష్టాలను అనుభవించబోతున్నారు కాబట్టి మీరు బిగ్గరగా ఏడవాలి మరియు విలపించాలి.! 2 మీ సంపద నిరుపయోగం అది కుళ్లిపోయినట్లుగా ఉంది. చిమ్మటలు వాటిని నాశనం చేసిన విధంగా మీ చక్కటి దుస్తులు నిరుపయోగం. 3 నీ బంగారం మరియు వెండి తుప్పు పట్టినట్టిన విధంగా నిరుపయోగంగా ఉంది. {దేవుడు నిన్ను తీర్పు తీర్చినప్పుడు,} నీ యొక్క ఈ విలువలేని సంపద మీరు దోషి అని {దురాశతో ఉన్నందుకు} నిదర్శనం అవుతుంది. తుప్పు మరియు అగ్ని వస్తువులను నాశనం చేసిన విధంగా, దేవుడు నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. యేసు తిరిగి రాబోతున్నాడని తెలిసి మీరు మరింత ధనవంతులు కావడానికి ప్రయత్నించి ఉండకూడదు. {ఆయన తిరిగి వచ్చినప్పుడు, నీ సంపదకు విలువ లేకుండా పోతుంది.} 4 నువ్వు చేసిన దాని గురించి ఆలోచించు. మీ పొలాలను పండించిన కూలీలకు మీరు వాగ్దానం చేసిన వేతనాలు చెల్లించలేదు. ఈ చెల్లించని వేతనాలు మీరు ఈ కార్మికులకు ఎంత అన్యాయం చేశారో చూపిస్తుంది. నీవు వారితో ప్రవర్తించిన తీరును బట్టి వారు దేవునికి మొఱ్ఱపెట్టుచున్నారు. ప్రభువు గొప్ప శక్తిగల దేవుడు, మరియు ఆయన వారి గొప్ప కేకలు వింటాడు {మరియు మీరు చేసిన దానికి ఆయన మిమ్మల్ని శిక్షిస్తాడు}. 5 మీరు కోరుకున్న విలాసాలన్నీ మీ కోసం కొన్నారు. పశువులు తమను తాము కొవ్వ చేసుకొని, తాము నరికివేయబడతామని గ్రహించకుండా ఉన్న విధంగా, మీరు కేవలం వస్తువుల విషయంలో ఆనందించడానికే జీవించారు, దేవుడు మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడని గ్రహించలేదు. 6 నిజాయితీ మనుష్యులను ఖండించడానికి మీరు ఇతరులను ఏర్పాటు చేసారు. ఏ తప్పు చేయని మనుష్యులను చంపడానికి మీరు ఇతరులను ఏర్పాటు చేసారు. వారు మీకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోలేకపోయారు. {అయితే ఈ పనులన్నీ చేసినందుకు మిమ్మల్ని తీర్పుతీరుస్తాడు మరియు శిక్షిస్తాడు.}

7 కాబట్టి, నా తోటి విశ్వాసులారా, {ధనవంతులైన మనుష్యులు మీరు బాధ పడేలా చేసినప్పటికీ} మెస్సీయ అయిన యేసు తిరిగి వచ్చే వరకు ఓపికగా ఉండండి. రైతులు ఒక పొలాన్ని నాటినప్పుడు, వారు తమ విలువైన పంటలు పెరిగే వరకు వేచి ఉండాలని జ్ఞాపకం ఉంచుకోండి. నాట్లు వేసే సమయంలో కురిసే వర్షం కోసం మరియు పంట చేతికి వచ్చే ముందు మరింత వర్షం కోసం వారు ఓపికగా ఎదురుచూడాల్సి వస్తోంది. {పంటలు పెరగడానికి మరియు పరిణత చెందడానికి ఈ వర్షం అవసరం, తద్వారా రైతులు వాటిని కోయవచ్చు.} పండించవచ్చు.} 8 అదేవిధంగా, మీరు కూడా ఓపికగా వేచి ఉండండి మరియు మెస్సీయ అయిన యేసును దృఢంగా విశ్వసించండి, ఎందుకంటే ఆయన త్వరలో తిరిగి వస్తాడు {మరియు ఆయన మనుష్యులు అందరికి న్యాయంగా తీర్పు తీరుస్తాడు}. 9 నా తోటి విశ్వాసులారా, ఒకరి గురించి ఒకరు సణుగుకొనకండి. ఆ విధంగా ప్రభువు యేసు మిమ్మల్ని శిక్షించనవసరం లేదు. ఆయనే మనకు తీర్పు తీర్చు వాడు, మరియు ఆ పని చేయడానికి ఆయన త్వరలోనే తిరిగి వస్తాడు 10 నా తోటి విశ్వాసులు, {ఓపికతో ఎలా ఉండాలో} ఉదాహరణగా, ప్రభువు దేవుడు తన సందేశాలను చెప్పడానికి చాలా కాలం క్రితం పంపిన ప్రవక్తలను ఆలోచించండి. మనుష్యులు వారికి అధిక బాధలు కలిగించినప్పటికీ, వారు దానిని ఓపికగా భరించారు. 11 మనుష్యులు శ్రమలను {ఓపికగా మరియు నమ్మకంగా} సహించగలిగినప్పుడు, దేవుడు వారిని ఆశీర్వదించాడని మనం ఎలా చెప్పగలమో పరిశీలించండి. {దీనికి ఒక ఉదాహరణ} యోబు అనే పేరు గల మనిషి. మీకు కూడా ఆయన గురించి {లేఖనాల నుండి}తెలుసు. ఆయన ఓపికగా అనేక సంగతులు శ్రమ పడ్డాడు అని మీకు తెలుసు. దేవుడు {యోబు అనుభవించిన వాటి ద్వారా మంచి పనులు చేయాలని} ప్రణాళిక చేసాడని కూడా మీకు తెలుసు. మరియు దాని నుండి దేవుడు చాలా శ్రద్ధగలవాడు మరియు దయగలవాడని మీరు చెప్పగలరు. 12 నా తోటి విశ్వాసులారా, ఇది మీరు గ్రహించవలసిన ముఖ్యమైన విషయం. మీరు చేసే వాగ్దానానికి హామీ ఇవ్వడానికి ఆకాశం లేదా భూమి లేదా మరొకటి దేనిమీదనైనా పిలిచి మీరు ఎప్పుడూ ప్రమాణం చేయకూడదు. మీరు చెప్పవలసిందల్లా "అవును" లేదా "కాదు." దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు {అంతకు మించి మీరు వెళ్ళి మరియు ప్రమాణం చేసి అయితే అప్పుడు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకొనని యెడల}.

13 మీలో ఎవరైనా కష్టాలను అనుభవించినప్పుడు, {దేవుడు అతనికి సహాయం చేయమని} ప్రార్థించాలి. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు {దేవునికి} స్తుతి గీతాలు పాడాలి. 14 మీలో అనారోగ్యంతో ఉన్నవారు ఎవరైనా, సంఘం యొక్క నాయకులు రావడానికి మరియు అతని కోసం {కోలుకోవడానికి} ప్రార్థన చెయ్యడానికి పిలవాలి. వారు అతని మీద ఒలీవల నూనె ఉంచాలి {అతడు కోలుకోవడంలో సహాయం చెయ్యడానికి} మరియు, ప్రభువు అధికారంతో, ప్రార్థించాలి. 15 ఈ నాయకులు విశ్వాసంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తాడు. ప్రభువు అతని ఆరోగ్యాన్ని పునరుద్ధరించును. ఆ వ్యక్తి పాపం చేసిన యెడల, దేవుడు అతనిని {ఆ పాపాలను} క్షమిస్తాడు. 16 ప్రభువు రోగులను స్వస్థపరచగలడు మరియు పాపములను క్షమించగలడు గనుక, మీరు చేసిన పాపములను ఒకరికొకరు ఒప్పుకొని, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దేవునితో సరిగా ఉన్న మనుష్యులు ప్రార్థన చేసిన యెడల, దేవుడు వారి ప్రార్థనలకు శక్తివంతమైన మార్గాల్లో సమాధానం ఇస్తాడు. 17 ఏలీయా ప్రవక్త కూడా మనకు వలే సాధారణ వ్యక్తి. అయితే వర్షం పడకూడదని అతడు హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు, {ఇశ్రాయేలు} భూమికి మూడున్నరేళ్లుగా వర్షం కురవలేదు. 18 అప్పుడు ఏలీయా మరల ప్రార్థించాడు{, వర్షం కురిపించమని దేవుణ్ణి వేడుకున్నాడు}, మరియు దేవుడు వర్షం కురిపించాడు మరియు మొక్కలు పెరిగాయి మరియు తిరిగి పంటలు ఫలించాయి.

19 నా తోటి విశ్వాసులారా, మీలో ఒకరు దేవుని నుండి వచ్చిన నిజమైన సందేశానికి విధేయత చూపడం మాని వేసిన యెడల, అప్పుడు మీలో మరొకరు ఆ వ్యక్తిని దేవుడు మనం చెయ్యడానికి మనతో చెప్పినట్లు మరోసారి చేయమని ఒప్పించాలి 20 ఒక పాపి పశ్చాత్తాపపడేందుకు సహాయం చేసే ఎవరైనా, తాను చేసిన పనిని బట్టి దేవుడు ఆ పాపిని ఆధ్యాత్మిక మరణం నుండి రక్షిస్తాడనీ, మరియు అతని అనేక పాపాలను క్షమిస్తాడనీ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను.