తెలుగు (Telugu): GST - Telugu

Updated ? hours ago # views See on DCS Draft Material

యోనా

Chapter 1

1 ఒక రోజున యెహోవా అమిత్తయి కుమారుడు ప్రవక్త అయిన యోనాతో మాట్లాడడం జరిగింది. యెహోవా చెప్పినది ఇదే: 2 “నీనెవె పట్టణపు ప్రజలు నిరంతరం చాలా దుష్ట కార్యాలు చెయ్యడం నేను చూసాను. కాబట్టి నువ్వు ఆరంభం అవ్వు. నీనెవెకు వాళ్ళు, అది అస్సీరియాకు పెద్ద ముఖ్య నగరం, మరియు వారి పాపముల కోసం నేను వారిని శిక్షించడానికి ప్రణాళిక చేస్తున్నానని అక్కడ ఉన్న ప్రజలకు చెప్పు.” 3 కాబట్టి యోనా వెళ్ళాడు, అయితే వ్యతిరేక మార్గంలో, దూరంగా ఉన్న తర్షీషు నగరం వైపుకు, యెహోవా నుండి దూరంగా వెళ్ళగలనని ఆలోచించాడు. యొప్పే నగరం వద్ద ఉన్న ఓడ రేవుకు అతడు దిగి వెళ్ళాడు మరియు తర్షీషుకు వెళ్ళబోతున్న ఒక ఓడ కనుగొన్నాడు. ఓడ నావికుడు డబ్బు కోసం అతనిని అడిగాడు మరియు అతడు దానిని అతనికి ఇచ్చాడు. అప్పుడు అతడు తర్షీషు వెళ్తున్న ఓడ సిబ్బందితో వెళ్ళడానికి, యెహోవా నుండి దూరంగా వెళ్ళడానికి అతడు ఓడ అడుగు భాగంలోనికి వెళ్ళాడు.

4 అయితే యెహోవా సముద్రం మీద బలమైన గాలి వీచేలా చేశాడు, మరియు ఒక బ్రహ్మాండమైన తుఫాను వంటిది సంభవించింది, అలలు ఓడను వేరుగా బద్దలు చెయ్యబోతున్నాయి. 5 నావికులు చాలా భయపడ్డారు మరియు ప్రతి ఒక్కడూ తాను ఆరాధించుచున్న దేవునికి తుఫానునుండి దేవుడు తమను రక్షించడం కోసం గట్టిగా ప్రార్థన చేసారు. వారు ఓడను తేలిక చేయడానికి ఓడ నుండి సరకులను సహితం సముద్రంలోనికి పడవేశారు. ఆవిధంగా చెయ్యడం ద్వారా ఓడ సులభంగా తిరిగి పోకుండా మరియు మునిగిపోకుండా ఉంటుందని వారు ఆశించారు. ఇది అంతా జరుగుతున్న సమయంలో, యోనా ఓడ లోపలి భాగం కింద ఉన్నాడు, పండుకొని ఉన్నాడు మరియు గాఢ నిద్రపోతున్నాడు.

6 అప్పుడు ఓడ సిబ్బంది నాయకుడు యోనా నిద్రపోతున్న దగ్గరకు వెళ్ళాడు. అతడు యోనాను నిద్ర లేపాడు మరియు అతనితో చెప్పాడు, "ఇటువంటి తఫాను సమయంలో నిద్ర పోడానికి నీ విషయంలో కొంత తప్పు జరిగింది! పైకి లెమ్ము! నువ్వు ఆరాధించు దేవునికి యదార్ధంగా ప్రార్థించు! ఒకవేళ ఆ దేవుడు మన గురించి ఆలోచించవచ్చు మరియు మనలను రక్షిస్తాడు."

7 అప్పుడు నావికులలో ఒకడు ఇతరులతో చెప్పాడు, "ఈ భయంకరమైన కార్యం మనకు జరుగునట్లు కారణం అయిన వానిని నిర్దారించడానికి మనం చీట్లు వెయ్యవలసిన అవసరం ఉంది! కాబట్టి వారు చీట్లు వేసారు, మరియు చీటీ యోనాను చూపించింది.

8 కాబట్టి నావికులలో ఒకరు యోనాతో చెప్పారు, "మాకు ఇంత భయంకరమైన సంగతి జరగడానికి కారణమైన వారు ఎవరో మాకు ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు ఏ విధమైన పనిని చేస్తావు? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నువ్వు వస్తున్న దేశం ఏమిటి? ఎటువంటి గుంపు ప్రజలకు నువ్వు చెంది యున్నావు? 9 యోనా వారికి జవాబు చెప్పాడు, "నేను ఒక హెబ్రీయుణ్ణి. పరలోకంలో నివసిస్తున్న ఏకైక సత్య దేవుడు అయిన యెహోవాను నేను ఆరాధిస్తాను. ఆయన సముద్రాన్ని మరియు భూమిని సృష్టించినవాడు. 10 తాను చెయ్యడానికి యెహోవా తనకు చెప్పిన దానిని తప్పించడానికి యెహోవా నుండి దూరంగా వెళ్ళడానికి యోనా ప్రయత్నం చేస్తున్నాడని నావికులు తెలుసుకొన్నారు, ఎందుకంటే అతడు దానిని ఇంతకుముందే వారికి చెప్పాడు. అయితే ఇప్పుడు, యెహోవా సముద్రమును నియంత్రించువాడని వారు తెలుసుకొన్నప్పుడు వారు చాలా భయపడ్డారు. వావికులలో ఒకడు యోనాతో చెప్పాడు, "నువ్వు ఒక భయంకరమైన కార్యాన్ని చేసావు! ఇప్పుడు మనం అందరము నీ కారణంగా చనిపోబోతున్నాము.

11 తుఫాను మిక్కిలి భీకరం అవుతూ ఉంది, మరియు అలలు పెద్దవి అవుతూ ఉన్నాయి. కాబట్టి నావికులలో ఒకడు యోనాను అడిగాడు, "సముద్రం నిమ్మళించేలా మరియు మమ్మును భయపెట్టడం ఆపివేసేలా మేము నీకేం చెయ్యాలి?” 12 యోనా వారితో చెప్పాడు, “ నన్ను పైకి ఎత్తి మరియు నన్ను సముద్రంలో పడవేయండి, మీరు దానిని చేసిన యెడల, సముద్రం నిమ్మళిస్తుంది మరియు మిమ్మల్ని భయపెట్టడం ఆపివేస్తుంది. ఇది పనిచేస్తుంది, ఎందుకంటే యెహోవా నాకు చెప్పిన కార్యాన్ని నేను చెయ్యలేదు కనుక ఈ భయంకరమైన తుఫాను మీకు కలిగిందని నాకు ఖచ్చితంగా తెలుసు.”

13 అయితే నావికులు ఆ పనిని చెయ్యడానికి కోరుకోలేదు. దానికి బదులు, వారు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి చాలా కష్టపడ్డారు. అయితే వారు దానిని చెయ్యలేకపోయారు ఎందుకంటే అలలు ఇంకా పెద్దవి అయ్యాయి మరియు వారికి వ్యతిరేకంగా బలంగా అయ్యాయి.

14 చివరకు, నావికులు అందరు యెహోవాకు ప్రార్థన చేసారు, "ఓ యెహోవా, మాకు జరిగిన ఈ కార్యములు అన్నిటిని నువ్వు నియంత్రించిన వాడవు నీవే, ఈ తుఫానును మరియు మేము వేసిన చీటీని కూడా. కాబట్టి మేము నిన్ను బతిమిలాడుతున్నాము, యెహోవా దయచేసి ఈ మనిషి కారణంగా మేము చనిపోయేలా చెయ్యవద్దు, మరియు మాకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యనివానిని చంపడం విషయంలో మమ్మును చంపవద్దు.” 15 అప్పుడు వారు యోనాను ఎత్తి మరియు సముద్రంలో పడవేశారు. వెంటనే, సముద్రం నిమ్మలించింది. 16 అది జరిగినప్పుడు, నావికులు యెహోవా ఎంత శక్తివంతమైన వాడో అని ఎంతో భయపడ్డారు. వారు యెహోవాకు ఒక బలిని అర్పించారు మరియు ఆయనను ఆరాధించడానికి స్థిరంగా వాగ్దానం చేసారు.

17 ఈ లోపు, ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు, మరియు యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు.

Chapter 2

1 అతడు ఆ చేప కడుపులో ఉన్నప్పుడు, యోనా తాను ఆరాధిస్తున్న దేవుడు, యెహోవాకు ప్రార్థించాడు,

     2 అతడు ఇలా చెప్పాడు:

     "నేను తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు, నన్ను కాపాడమని యెహోవాకు ప్రార్థించాను మరియు ఆయన కాపాడాడు. నేను చేప కడుపులో ఉన్నప్పటికి, అక్కడ నేను చనిపోతానని తలంచాను, అయినా అక్కడ నీవు నా స్వరాన్ని విన్నావు మరియు సహాయం చెయ్యమని నిన్ను బతిమాలినప్పుడు నా మనవి ఆలకించావు.

     3 నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. అక్కడ ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి.

     నీవు చేసిన ఆ భయంకరమైన అలలు అన్నీ నాకు మీదుగా వెళ్ళాయి.

     4 నేను అనుకొన్నాను, "నీవు నన్ను తరిమి వేసావు; నా వైపు చూడడానికి కూడా శ్రద్ధ చూపించలేదు;"

     అయినా నీ పరిశుద్ధ ఆలయమును మరల చూడడం గురించిన నిరీక్షణ నాకు ఇంకా ఉంది.

     5 నీళ్ళు నన్ను చుట్టూ ఆవరించి యున్నాయి, నేను కొనప్రాణంతో ఉన్నాను. లోతైన నీరు నన్ను చుట్టుకొనియున్నాయి.

     సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది.

     6 సముద్రాల అడుగు భాగాన పర్వతాలు ఆరంభం అయ్యే ప్రదేశం వరకూ నేను కిందకు వెళ్లాను. భూమి నేను తప్పించుకోడానికి సాధ్యం కాని చెర వలే ఉన్నట్టు నేను తలంచాను.

     అయితే నువ్వు, నేను ఆరాధిస్తున్న యెహోవా దేవా మృత్యువు స్థాలంలోనికి తిరిగి వెళ్ళకుండా నన్ను కాపాడావు.

     7 నేను దాదాపు చనిపోయినప్పుడు యెహోవా నేను నీ గురించి ఆలోచించాను, సహాయం కోసం అడగడానికి. మరియు నీవు నివసిస్తున్న నీ పరిశుద్ధ స్థలం నుండి నీవు నా ప్రార్థన అంగీకరించావు.

     8 వ్యర్థమైన విగ్రహాలను ఆరాధించువారు నిన్ను నిరాకరిస్తున్నారు, నువ్వు అన్ని సమయాలలో వారికి నమ్మదగినవాడవుగా ఉండువాడవు.

     9 అయితే నేను దానిని చెయ్యను. బదులుగా, నా స్వరంతో గట్టిగా వినబడేలా నీకు కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా నీకు ఒక బలిని అర్పిస్తాను.

     నేను స్థిరంగా వాగ్దానం చేసినదానిని నేను జరిగిస్తాను.

     యెహోవా నీవు ఒక్కడివే నిజమైన దేవుడవు, మనుషులను రక్షించువాడవు."

10 అప్పుడు యోనాను బయటికి కక్కివేయడానికి యెహోవా పెద్ద చేపకు ఆజ్ఞాపించాడు, మరియు చేప అతనిని పొడి నేల మీద కక్కి వేసింది.

Chapter 3

1 అప్పుడు యెహోవా యోనాతో మరల మాట్లాడాడు. యెహోవా చెప్పినది ఇదే: 2 “ముందుకు కదులుతూ ఉండు! అస్సీరియ నగరానికి ముఖ్యనగరం నీనెవెకు వెళ్ళు, మరియు అక్కడ నివసించే మనుషులకు నేను వారికి చెప్పమని నీకు చెప్పిన సందేశాన్ని ప్రకటించు.” 3 ఈ సమయంలో యోనా లేచి ముందుకు కదిలాడు మరియు చెయ్యడానికి యెహోవా తనకు చెప్పిన ప్రకారం నీనెవెకు వెళ్ళాడు. ఇప్పుడు నీనెవె చాలా పెద్ద నగరం, ప్రపంచంలో ఉన్న నగరాలలో ఒక నగరం. దాని ద్వారా పూర్తిగా వెళ్ళడానికి ఒక వ్యక్తి మూడు రోజులు నడువ వలసినంత చాలా పెద్దది.

4 యోనా చేరినప్పుడు, అతడు ఆ నగరంలో ఒక రోజు ప్రయాణమంత దూరం నడిచాడు. తరువాత నగరంలోని మనుషులకు అతడు ప్రకటన చేసాడు, "ఇప్పటి నుండి యింకా నలుబది దినములు, దేవుడు నీనెవెను నాశనం చేస్తాడు. 5 నీనెవె మనుషులు యోనా ప్రకటించిన దేవుని సందేశాన్ని విశ్వసించారు. ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండాలని మరియు వారు చేస్తూ ఉన్న దుష్టక్రియల కోసం విచారపడుతున్నారని చూపించడానికి తమ దేహాల మీద గోనె పట్ట ధరించాలని నిర్ణయించుకొన్నారు. కాబట్టి చాలా ముఖ్యమైన మనుషుల నుండి తక్కువ ప్రాముఖ్యతగల మనుష్యుల వరకు నగరంలోని ప్రతిఒక్కరు దానిని చేసారు.

6 యోనా ప్రకటిస్తున్న సందేశం గురించి నీనెవె రాజు వినినప్పుడు అతడు తన సింహాసనం నుండి కిందకు దిగాడు. అతడు తన రాజవస్త్రాలను తీసివేసాడు, బదులుగా గోనెపట్ట కట్టుకొన్నాడు, మరియు ఒక చల్లని బూడిదె కుప్పలో కూర్చున్నాడు. అతడు తాను చేస్తూ వస్తున్న దుష్ట కార్యాల విషయంలో అతడు కూడా విచారపడుతున్నాడని చూపించడానికి అతడు దీనంతటిని చేసాడు. 7 అప్పుడు అతడు నీనెవెలో మనుషులకు ప్రకటించడానికి సందేశకులను పంపించాడు: "ఏ ఒక్కరూ లేదా జంతువు ఎటువంటి ఆహారాన్ని రుచి చూడకూడదు లేదా ఎటువంటి నీటినీ త్రాగకూడదు అని రాజు మరియు తన మంత్రులు శాశనం చేసారు. ఆవులు మరియు గొర్రెలు కూడా మేత మేయకూడదు.”

8 “ప్రతి ఒక్క మనిషి మరియు ప్రతి జంతువు ఖచ్చితంగా తమ దేహాల మీద గోనెపట్ట ధరించాలి. ప్రతి ఒక్కరు దేవునికి ఖచ్చితంగా మనఃపూర్వకమైన ప్రార్థన చెయ్యాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు వారు చేస్తూ వస్తున్న దుష్ట క్రియలు మరియు విషయంలో వారు చేస్తూ వస్తున్న హింసాత్మకమైన క్రియలు చెయ్యడం ఆపివేయ్యాలి. 9 ప్రతీ ఒక్కరు ఆ క్రియలు జరిగించిన యెడల ఈ దేవుడు తన మనసు మార్చుకోవడం సాధ్యం మరియు మన విషయం కరుణ కలిగి యుంటాడు. ఆయన మన విషయంలో చాలా కోపంగా ఉండడం నుండి జాలిపడతాడు, దాని ఫలితంగా మనం చనిపోము..”

10 కాబట్టి మనుషులు ఆ సంగతులు జరిగించారు మరియు వారు చేస్తూ ఉన్న దుష్ట క్రియలను చెయ్యడం నిలిపివేసారు. దీనిని అంతటిని దేవుడు చూసాడు. కాబట్టి దేవుడు వారి మీద కరుణ చూపాడు మరియు ఆయన చేస్తానని చెప్పినట్టు వారిని నాశనం చెయ్యలేదు. ఆయన దానిని చెప్పినప్పటికీ, ఆయన దానిని చెయ్యలేదు.

Chapter 4

1 ఎందుకంటే యోనా దృష్టిలో దేవుడు నీనెవెను నాశనం చెయ్యకుండా ఉండడం చాలా తప్పుగా అనిపించింది. అతడు దాని విషయంలో చాలా కోపపడ్డాడు. 2 అతడు యెహోవాకు ప్రార్ధించాడు. “ఓ యెహోవా, నేను నా ఇంటిని విడిచి పెట్టడానికి ముందే జరగబోతుందని చెప్పింది ఖచ్చితంగా ఇదే! నువ్వు మనుషులు అందరి పట్ల చాలా దయతో మరియు కరుణతో కార్యాలు జరిగించు దేవుడవు అని నాకు తెలుసు. నువ్వు దుష్ట మార్గాలలో క్రియలు జరిగించు మనుషులతో త్వరగా కోపగించుకోవు. నువ్వు మనుషులను చాలా ప్రేమిస్తావు మరియు వారిని నశింపజేయడానికి బదులుగా మనుషులకు కరుణతో ఉండడానికి ఎంచుకొన్నావు. ఈ కార్యం జరుగకుండా నిలిపి వెయ్యడానికి నేను తర్షీషు వెళ్ళడానికి పారిపోవడంలో కారణం ఇదే ఎందుకంటే నువ్వు నీనెవెను నాశనం చెయ్యాలని నేను కోరుకున్నాను. 3 కాబట్టి ఇప్పుడు యెహోవా దయచేసి నన్ను చంపి వెయ్యి, ఎందుకంటే నువ్వు నీనెవెను నాశనం చెయ్యకపోయిన యెడల నేను జీవించియుండడం కంటే చనిపోవడం నాకు మేలు."

4 యెహోవా జవాబిచ్చాడు, “నేను నీనెవెను నాశనం చెయ్యలేదు కనుక నువ్వు కోపంగా ఉండడం సరియైనదేనా?" 5 యోనా జవాబు ఇవ్వలేదు, అయితే నగరం వెలుపలికి వెళ్లిపోయాడు మరియు నగరానికి దగ్గర దూరంలో తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఎండనుండి తనకు నీడగా ఉండడానికి ఒక చిన్న పందిరి సిద్దం చేసుకొన్నాడు. అతడు పందిరి కింద ఉన్నాడు మరియు నగరానికి ఏమి సంభవిస్తుందో చూడడానికి ఎదురుచూస్తున్నాడు. 6 అప్పుడు యెహోవా దేవుడు ఒక మొక్కను అతని తలకు ఎండనుండి నీడను ఇవ్వడానికి యోనాకు పైగా త్వరగా పెరిగేలా చేసాడు. యోనా తన దుష్ట వైఖరిని మార్చుకోవడంలో సహాయ పడడానికి యెహోవా ఆ పనిని చేసాడు. ఎండ నుండి తనకు నీడను ఇచ్చిన ఈ మొక్కను కలిగియుండడం బట్టి యోనా చాలా సంతోషించాడు. 7 అప్పుడు మరుసటి రోజు ఉదయం ఆ మొక్క ఎండిపోయేంతగా ఆ మొక్కను ఎక్కువగా నమిలి వేయడానికి దేవుడు ఒక పురుగు సిద్ధంచేసి ఉంచాడు. 8 అప్పుడు, సూర్యోదయం అయిన తరువాత, దేవుడు తూర్పునుండి వీచే వేడి గాలిని సిద్ధం చేశాడు. యోనా తల మీద తీవ్రమైన ఎండ దెబ్బ తగిలింది మరియు యోనాకు సొమ్మసిల్లిపోయినట్టుగా అనిపించడం ఆరంభం అయ్యింది. అతడు చనిపోవాలని కోరుకున్నాడు మరియు అతడు చెప్పాడు, "జీవించడం కొనసాగడం కంటే నాకు చనిపోవడమే నాకు మేలు!” 9 అప్పుడు దేవుడు యోనాతో చెప్పాడు “ఈ మొక్కకు జరిగిన దానిని గురించి కోపంగా ఉండడం నీ విషయంలో సరియైనదేనా?” యోనా జవాబిచ్చాడు, "అవును, కోపంగా ఉండడం నా విషయంలో ఇది సరియైనది! నేను చాలా కోపంగా ఉన్నాను, చనిపోవడానికి నేను కోరుకుంటున్నాను!" 10 అప్పుడు యెహోవా అతనితో చెప్పాడు, "ఇది పెరిగేలా చెయ్యడానికి దానిని గురించిన శ్రద్ధ నువ్వు తీసుకోడానికి ప్రయత్నం చెయ్యలేదు, లేదా ఏమీ చెయ్యలేదు అయినా అది చనిపోయినప్పుడు, మొక్క గురించి నీకై నువ్వు చాలా విచారంగా ఉన్నావు, ఇది ఒక్క రాత్రిలోనే పెరిగింది మరియు మరుసటి రోజు రాత్రి చివరిలో పూర్తిగా వాడిపోయింది. 11 అదేవిధంగా అయితే ఇంకా చాలా ఎక్కువగా, నీనెవె మహా నగరాన్ని నాశనం చెయ్యడం గురించి నేను విచారపడడం నాకు సరియైనదే. కుడి నుండి ఎడమకు తెలియని 120, 000 కంటే ఎక్కువమంది మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. అక్కడ చాలా పశువులు కూడా ఉన్నాయి. నేను వాటినన్నిటిని సృష్టించాను, కాబట్టి వారిని గురించిన శ్రద్ధాశక్తులు కలిగి యుండడం నాకు సరియైనదే.