తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

02-01

తోట

ఆదాము హవ్వలు సంతోషించడానికీ, దానిని తినడానికీ దేవుడు వృక్షాలతో, మొక్కలతో ఒక ప్రత్యేకమైన కూర్పును సిద్ధపరచాడు. 01:11 లో వినియోగించిన ఒకే పదంగా ఉంది. ఈ పదాన్ని అక్కడ ఏవిధంగా అనువదించారో చూడండి.

దేవునితో మాట్లాడారు

“మాట్లాడడం” కోసం పదం మానవులతో మాట్లాడడాన్ని సూచించడానికి వినియోగించే పదం లాంటిదే. పురుషుడు, స్త్రీ లతో మాట్లాడడానికి ఒక భౌతిక రూపాన్ని దేవుడు తీసుకొని ఉండవచ్చు, ఎందుకంటే అక్కడ వచన భాగం వారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు అని చూపిస్తుంది.

సిగ్గు

మనం పాపం చేసాం అని తెలుసుకోవడంతో వచ్చే అనుభూతి లేక ఏదోవిధంగా మనం తప్పిపోయాం అనే అనుభూతి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/adam]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

02-02

కుయుక్తి

మోసగించాలనే ఉద్దేశంతో తెలివితేటలు, కపటం.

సర్పం

పొడవుగా ఉంది, కాళ్ళులేకుండా ఉండే భూప్రాణి. ఇప్పుడు తన కడుపుతో ఇటు అటు కదులుతుంది. తరువాత వృత్తాంతంలో సర్పం సాతానుగా బయలుపడినా ఇక్కడి ఈ చట్రంలో ఆ సంగతి చెప్పలేదు.

దేవుడు నిజంగా నీకు చెప్పాడా

తోటలో ఏ చెట్టు నుండైనా ఫలాన్ని తినకూడడని నిజంగా దేవుడు చెప్పాడా అని సర్పం స్త్రీని అడిగింది. అయితే దేవుడు ఏమి చెప్పాడో తెలియదన్నట్లు వాడు నటిస్తున్నాడు, ఎందుకంటే స్త్రీ మనసులో ఒక అనుమానాన్ని సృష్టించడానికి వాడు కోరుతున్నాడు. దేవుని మంచితనాన్ని ఆ స్త్రీ ప్రశ్నించాలని వారు కోరుతున్నాడు.

ఏ చెట్టు ఫలమునైనా

తోటలో ఉన్న భిన్నమైన చెట్లలో ప్రతీ దానినుండి వివిధ వృక్ష ఫలాల రకాలు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

02-03

ఫలం

ఇది ఎటువంటి ఫలమో మనకు తెలియదు. ఆ ఫలం ఈ చెట్టుకు కాస్తుందని మాత్రమే మనకు తెలుసు. ఇక్కడున్న ఫలానికి సాధారణ పదం వినియోగించడం మంచిది, ఒక ప్రత్యేకరకమైన ఫలానికి వినియోగించే పదం కాదు.

మంచి చెడుల తెలివితేటలను ఇచ్చు వృక్షం

వారు మంచి, చెడులను అర్థం చేసుకొనేలా చేసే ఈ చెట్టు ఫలాన్ని తినడానికి వారు అనుమతించబడలేదని స్త్రీకి సరిగ్గా అర్థం అయ్యింది.

మీరు చనిపోతారు

ఒక వ్యక్తి భౌతిక జీవిత ముగింపు కోసం, అనగా మరణానికి మీ సాధారణమైన పదాన్ని వినియోగించండి. మరణం ఆలోచన కఠినంగా అనిపిస్తున్న కారణంగా ఈ పదాన్ని విడిచిపెట్టవద్దు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]

02-04

దేవుని వలే

స్త్రీ, పురుషులు ఇంతకుముందే దేవుని పోలికలో చెయ్యబడ్డారు. హవ్వ చెడును అర్థం చేసుకొన్నట్లయితే ఆమె దేవుని పోలియుంటుందని సర్పం సూచన చేస్తుంది. అయితే ఆమె ఈ తెలివితేటలను కలిగియుండాలని దేవుడు ఎన్నడూ ఉద్దేశించలేదు.

మంచి చెడులను అర్థం చేసుకొంటారు

వ్యక్తిగత అనుభవం నుండి మంచి వాటినీ, చెడువాటినీ తెలుసుకోవడం, ఏదైనా మంచిది లేక చెడు అని తెలుసుకోగల్గడం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]

02-05

జ్ఞానం

సర్పానికున్నట్లుగా కనపడుతున్న అంతర్దృష్టి, అవగాహన కలిగియుండాలని స్త్రీ కోరుకుంది, దేవుని పోలియుండాలని కోరుకోలేదు.

ఆమెతో ఉన్నదెవరు

ఇది ముఖ్యమైన సమాచారం ఎందుకంటే ఆ స్త్రీ పండు తినవలసిన నిర్ణయం చెయ్యవలసి వచ్చినప్పుడు పురుషుడు ఆమెతో ఉన్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/wise]]

02-06

వారి కన్నులు తెరువబడ్డాయి

“వారు సంగతులను భిన్నంగా చూసారు” అని తర్జుమా చెయ్యవచ్చు. వారు ఇప్పుడు మొట్టమొదటిసారి ఎదో అర్థం చేసుకొన్నారని ఈ వాక్యం తెలియజేస్తుంది. మీ భాషలో ఇటువంటి అర్థాన్నిచ్చే వ్యక్తీకరణ ఉంటే దీనిని అనువదించడానికి వినియోగించవచ్చు.

వారు దిగంబరులమని గుర్తించారు

స్త్రీ, పురుషుడు దేవునికి అవిధేయత చూపించిన తరువాత వారు దిగంబరులుగా ఉన్నారని సిగ్గుతో నిండిపోయారు. ఆ కారణంగానే వారి దిగంబర దేహాలను కప్పుకోడానికి ఆకులను వినియోగించారు.

వారి శరీరాలను కప్పుకొన్నారు

స్త్రీ, పురుషుడు దేవుని నుండి తమను తాము దాచుకోడానికి ఆకులను వినియోగించారు.

02-07

దేవుడు నడుస్తున్నాడు

దేవుడు స్త్రీతోనూ, పురుషునితోనూ నడవడానికీ, మాట్లాడడానికీ క్రమంగా తోటలోనికి వచ్చినట్లుగా కనబడుతుంది. ఇది ఎలా కనిపిస్తుందో మనకు తెలియదు. సాధ్యం అయితే ఒక వ్యక్తి నడవడం గురించి మాట్లాడడానికి ఇదే పదాన్ని వినియోగించడం మంచిది.

నీవెక్కడ ఉన్నావు?

దేవునికి ఈ ప్రశ్న జవాబు ముందుగానే తెలుసు. పురుషుడు, స్త్రీ ఎందుకు దాక్కొన్నారో వివరించడానికి బలవంతం చెయ్యడమే ఈ ప్రశ్న ఉద్దేశం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/adam]]

02-08

మీరు దిగంబరులని మీకు చెప్పినదెవరు?

లేక, “మీరు దిగంబరులని ఏవిధంగా కనుగొన్నారు?” దేవుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆయనకు తెలుసు. ఈ ప్రశ్న అడగడం ద్వారా, ఈ క్రింది ప్రశ్న అడగడం ద్వారా అవిధేయతా పాపాన్ని ఒప్పుకోడానికి దేవుడు ఆదాముకు అవకాశం ఇస్తున్నాడు. దిగంబరంగా ఉండడం పాపం కాదు. ఆవిధంగానే ఉండేలా దేవుడు వారిని సృష్టించాడు. వారి దిగంబరత్వాన్ని గురించిన జ్ఞానం పాపం. వారి సిగ్గు వారు పాపం చేసారని చూపిస్తుంది.

ఆమె నాకు పండును ఇచ్చింది

పురుషుడు తన అవిధేయతను ఒప్పుకోడానికీ, దేవునికి అవిధేయత చూపించడంలో తన బాధ్యతను అంగీకరించడానికి బదులు స్త్రీని నిందిస్తున్నాడు.

నీవేమి చేసావు?

లేక, “దీనిని నీవు ఎందుకు చేసావు?” ఈ ప్రశ్నకు సమాధానం దేవునికి ముందుగానే తెలుసు. ఈ ప్రశ్న అడగడం ద్వారా స్త్రీ తన దోషాన్ని అంగీకరించే అవకాశాన్ని దేవుడు ఆమెకు ఇస్తున్నాడు. ఆమె చేసిన దానిని చెయ్యకుండా ఉండవలసింది అనే దానిని తెలియజేస్తున్నాడు.

సర్పం నన్ను మోసగించింది

సర్పం ఆమెను మోసగించింది, తప్పుగా నడిపించింది. వాడు తనకు అబద్దం చెప్పాడు. ఆమె మీద ఒక మంత్రం వల్లె వెయ్యడం లేక ఆమెను మంత్రముగ్ధురాలను చెయ్యడం గురించిన పదాన్ని వినియోగించవద్దు. ఆమె అవిధేయతను ఒప్పుకోవడం, దేవునికి అవిధేయత చూపించడంలో ఆమె బాధ్యతను అంగీకరించడానికి బదులు సర్పాన్ని నిందిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

02-09

నీవు శపించబడ్డావు

ఈ వాక్యం “నేను నిన్ను శపిస్తున్నాను” అనిగానీ లేక “గొప్ప హాని నీ మీదకు వస్తుంది” అని గానీ అనువదించవచ్చు. గారడీని సూచించే పదాన్ని వినియోగించవద్దు.

ఒకరినొకరు ద్వేషించారు

స్త్రీ సర్పాన్ని ద్వేషిస్తుంది, సర్పం స్త్రీని ద్వేషిస్తుంది. స్త్రీ సంతానం కూడా సర్పం సంతానాన్ని ద్వేషిస్తారు, సర్పం సంతానం వారిని ద్వేషిస్తారు.

స్త్రీ సంతానం

ఆమె సంతానంలో ఒకరిని ప్రత్యేకంగా సూచిస్తుంది.

నీ తలను చితకగొట్టును

స్త్రీ సంతానం సర్పం సంతానాన్ని నాశనం చేస్తారు.

మడిమెను గాయపరచును

సర్పం సంతానం స్త్రీ సంతానాన్ని గాయపరుస్తారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/curse]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]

02-10

ప్రసవవేదన చాలా నొప్పిగా ఉంటుంది

కొన్ని భాషలు దీనిని ఒక క్రియాపదంగా వ్యక్తపరచవచ్చు. “నీ పిల్లలకు జన్మనిచ్చినప్పుడు నీకు అధికమైన బాధ కలుగచేస్తాను” అని మీరు చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

02-11

భూమి శపించబడింది

ఆదాము అవిధేయతకు శిక్షగా భూమి ఇకమీదట ఫలవంతంగా ఉండదు. తినడానికి ఆహారాన్ని పండించడానికి ఆదాము అధికంగా కష్టపడతాడు.

నీవు చనిపోతావు

వారి అవిధేయతకు అంతిమ శిక్ష మరణం. ఆత్మీయమరణం దేవుని నుండి మన ఎడబాటు. భౌతిక మరణం మన దేహం నుండి మన ఎడబాటు.

మన్నుకు చేరతావు

మట్టి లేక నేల నుండి దేవుడు ఆదామునూ, హవ్వనూ సృష్టించాడు, పాపం ఫలితంగా అతని జీవం తన వద్దనుండి తీసివేయబడుతుంది, అతని శరీరం కుళ్ళిపోతుంది, తిరిగి మన్నుగా మారిపోతుంది.

హవ్వ, అంటే ‘జీవమిచ్చునది.’

ఆదాముకూ, హవ్వకూ దేవుడు జీవాన్ని ఇచ్చాడు, ప్రసవం ద్వారా ప్రతీ వ్యక్తికీ ఇది అందించబడుతూ ఉంది.

సమస్త మనుష్యులకు తల్లి

మనుష్యులందరి స్త్రీ పూర్వికురాలిగా ఆమె ఉండబోతుంది. కొన్ని భాషలలో “ఆమె మనుష్యులందరికీ అవ్వ అవుతుంది” అని ఉంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/curse]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/eve]]
  • [[rc://*/tw/dict/bible/other/adam]]

02-12

మంచి, చెడులు తెలుసుకోవడం ద్వారా మన వలే ఉంటారు

ఇక్కడ ఈ వాక్యం ఆదాము, హవ్వ దేవునిలా ఉంటారు అనే నూతన విధానాన్ని చూపిస్తుంది. వారు పాపం చేసిన కారణంగా వారు చెడును గురించిన అవగాహన కలిగియున్నారు, దానిని అనుభవించారు. “ఇప్పుడు వారు మంచి, చెడును తెలుసుకొన్న కారణంగా” అని మీరు చెప్పవచ్చు.

ఫలం

నిర్దిష్టమైన రకం ఫలం ఇక్కడ బయలు పడలేదు, ఇక్కడున్న ఫలానికి సాధారణ పదం వినియోగించడం మంచిది, ఒక ప్రత్యేకరకమైన ఫలానికి వినియోగించే పదం కాదు.

జీవవృక్షం

ఫలం ఉన్న వాస్తవమైన వృక్షం. 01:11 చూడండి. ఒక వ్యక్తి ఈ ఫలాన్ని తినినప్పుడు అతడు నిరంతరం జీవిస్తాడు, ఎన్నటికీ చనిపోడు.

..నుండి బైబిలు కథ

ఈ సూచనలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/other/adam]]
  • [[rc://*/tw/dict/bible/other/eve]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]