తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

39-01

మధ్య రాత్రి

ఈ భావ వ్యక్తీకరణ అర్ధం, "సగం రాత్రి గడిచిన తరువాత” లేదా, " చాలా రాత్రి అయిన తరువాత."

ఆయన్ని ప్రశ్నించేందుకు

అంటే, "యేసు చేస్తున్నది తప్పని, ఏదైనా నింద మోపేందుకు ఆయనను ప్రశ్నలను అడగడం."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]

39-02

యేసును విచారణలో నిలబెట్టారు

"ఏదో తప్పు చేశాడని యేసుపై నేరం ఆరోపించడానికి ఒక అధికారిక సమావేశం జరిగింది" అని దీనిని అనువదించవచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి నిర్దిష్టమైన నేరానికి సంబంధించి నిర్దోషా లేదా దోషా అని తెలుసుకోవడానికి సాధారణంగా విచారణ జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో, యేసును దోషిగా చేసేలా నాయకులు నిశ్చయించుకున్నారు.

ఆయన గురించి అబద్దం చెప్పారు

అంటే, "ఆయన గురించి అబద్ధాలు చెప్పారు" లేదా, "ఆయన ఏదో తప్పు చేశాడనే అబద్దాన్ని ఆరోపించారు."

వారి చేసిన ప్రతిపాదనలు ఒకరితో ఒకరికి సమ్మతించలేదు

దీనిని ఈ విధంగా అనువదించవచ్చు, "వారు యేసును గురించి ఒకదానికొకటి భిన్నమైన విషయాలను చెప్పారు" లేదా, "యేసును గురించి సాక్షులు చెప్పిన విషయాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి.

ఏది ఏమైనప్పటికీ ఆయన నేరస్తుడయ్యాడు

అంటే, "ఆయన ఏదైనా తప్పు చేశాడని...."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/witness]]
  • [[rc://*/tw/dict/bible/kt/guilt]]

39-03

చివరగా

అంటే, "వారు ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు చూపలేకపోయిరి "లేదా, "ఆయనను దోషి అని వారు నిరూపించలేకపోయిరి."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]

39-04

నేను

అంటే, "మీరు చెప్పినట్లే" లేదా, "నేను దేవుని కుమారుడైన మెస్సీయను." “నేను" అని అంటే దేవుని పేరు కూడా.(చూడండి 09:14). యేసు "నేను” అని చెప్పడం వలన ఆయన కూడా దేవుడనై యున్నానని చెప్తున్నాడు. వీలైతే, యేసు ఇచ్చిన సమాధానానికి, దేవుని పేరుకు మధ్యన ఉన్న సారూప్యతను ప్రజలు చూచే విధంగా అనువదించండి.

దేవునితో కూర్చున్నాడు

దీనిని "దేవునితో పరిపాలించడం" అని అనువదించవచ్చు. ఎందుకంటే దేవుడు అందరికీ పాలకుడు కాబట్టి, ప్రజలు ఆయనను గురించి పరలోకంలో సింహాసనంపై కూర్చున్నట్లు చెబుతారు. తాను దేవునితో కూర్చుంటానని చెప్పడం ద్వారా, తండ్రితో పరిపాలించే అధికారం తనకు ఉందని యేసు పేర్కొన్నాడు.

దేవునితో కూర్చున్నాడు, పరలోకం నుండి వస్తాడు

దీనిని "దేవుని పక్కన కూర్చొన్నాడు, పరలోకం నుండి వస్తున్నాడు" అని అనువదించవచ్చు.

కోపంతో తన బట్టలు చింపివేసాడు

దుఃఖాన్ని లేదా కోపాన్ని ప్రదర్శించేందుకు యూదులు తమ బట్టలు చింపుకుంటారు. బట్టలు చింపివేయడం అంటే మీ భాషలో మరేదైనా పదం ఉంటే, దానిని "అతను చాలా తీవ్రంగా కోపపడ్డాడు" అని ప్రత్యామ్నాయంగా అనువదించవచ్చు.

మీ తీర్పు ఏమిటి?

అంటే, "మీ నిర్ణయం ఏమిటి?" లేదా, "మీరు ఏమి నిర్ణయించుకున్నారో మాకు చెప్పండి: ఆయన నిర్దోషా లేదా దోషా?" దేవునితో సమానుడని చెప్పుకున్నందుకు, ప్రధాన యజకుడూ, మత పెద్దలూ యేసును శిక్షించాలని అనుకున్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/witness]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/judge]]

39-05

వారు యేసు కళ్లకు గంతలు కట్టారు

అంటే. "యేసుని చూడనివ్వకుండా కళ్ళు కప్పారు."

ఆయన మీద ఉమ్ము ఊశారు

"ఆయనను అవమానించడానికి ఆయన మీద ఉమ్మి ఊశారు" లేదా "యోగ్యుడు కాదని చెప్పడానికి ఆయన మీద ఉమ్మివేశారు " అని కూడా అనువదించవచ్చు. ఇది ఒకరి యెడల ధిక్కారాన్ని చూపే విధం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/mock]]

39-06

ఒప్పుకోలేదు

దీనిని "ఇది నిజం కాదని చెప్పాడు" లేదా "అతను యేసుతో లేడని చెప్పాడు" లేదా "లేదు, అది నిజం కాదు" అని అనువదించవచ్చు.

పేతురు దాన్ని మళ్ళీ ఖండించాడు

"రెండవసారి, పేతురు యేసును ఎరగనని బొంకాడు" లేదా "తిరిగి పేతురు, తాను యేసుతో ఉన్నవాడను కాను అని చెప్పాడు" అని దీనిని అనువదించవచ్చు.

గలిలయ నుండి....

"గలిలయ వారు" అని కూడా అనువదించవచ్చు. యేసు, పేతురు ఇరువురు మాట్లాడే విధానాన్నిబట్టి వారు గలిలయ ప్రాంతం నుండి వచ్చారని ప్రజలు చెప్పారు .

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/galilee]]

39-07

ఒట్టు పెట్టుకొన్నాడు

అంటే, "ధృడంగా చెప్పాడు" లేదా, "చాలా గట్టిగా చెప్పాడు."

ఈ మనిషి గనుక నాకు తెలిసుంటే, దేవుడు నన్ను శపించును గాక!

ఈ శాపం అనే దాని అర్ధం, "మీరు చెప్పేది నిజమైతే దేవుడు నాకు హాని కలిగించు గాక!" లేదా "నేను మీకు అబద్ధం చెప్పినట్లయితే దేవుడు నన్ను శిక్షించును గాక!" ఈ విధంగా పేతురు యేసును తెలియదని చాలా గట్టిగా చెప్పాడు. అతను యేసును "ఈ మనిషి" అని పలికాడు, అంటే ఆయనెవరో నాకు తెలియదు అనేలాగా ఉంది.

కోడి కూసింది

"కూత" అనేది కోడిపుంజు చేసే పెద్ద శబ్దం. 38:09 లో మీరు దీన్ని ఎలా అనువదించారో పోల్చుకోండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/curse]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

39-08

తీవ్ర దుఃఖంతో ఏడ్చాడు

అంటే, " తీవ్ర దుఖాన్ని అనుభవిస్తూ" లేదా, " తీవ్రమైన విచారాన్ని అనుభవిస్తూ ఏడ్చాడు."

ద్రోహి

అంటే, "యేసుకు ద్రోహం చేసినవారు" లేదా "యేసును బంధించడానికి అధికారులకు సహాయం చేసినవాడు."

...యేసును చంపడానికి నిర్ణయిoచాడు

అంటే, "యేసు దోషిగా చనిపోవాలని చెప్పాడు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/other/judasiscariot]]
  • [[rc://*/tw/dict/bible/other/betray]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

39-09

రోమా గవర్నరు

అంటే, "రోమా ప్రభుత్వ అధికారి." ఇశ్రాయేలు దేశంలోని యూదా ప్రాంతాన్ని పాలించడానికి రోమా ప్రభుత్వం పిలాతును నియమించింది.

ఆయనను చంపడానికి తీర్పు ఇచ్చాడు

గవర్నరుగా, యేసును సిలువ వేసి మరణశిక్షకు గురిచేయడానికీ, లేదా విడిపించడానికి పిలాతుకు అధికారం ఉంది. ఒకరిని చంపే అధికారం యూదు మత నాయకులకు లేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/other/rome]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingofthejews]]

39-10

నీవు అలా చెప్పావు

అంటే, "నీవు సరిగ్గానే మాట్లాడావు."

నా రాజ్యం, భూసంబంధమైన రాజ్యం కాదు

అంటే, "నా రాజ్యం భూసంబంధమైన రాజ్యాల వంటిది కాదు."

నా సేవకులు నా కోసం పోరాడుతారు

అంటే, "నన్ను రక్షించడానికి నా శిష్యులు పోరాడుతారు" గనుక నేను నా రాజ్యాన్ని స్థాపిస్తాను.

నా మాట వినండి

"నా బోధను విని నాకు లోబడండి" అని దీనిని అనువదించవచ్చు. యేసు మాటలు వినడమే కాదు, ఆయన చెప్పినట్లు చేస్తుండాలి.

నిజం ఏమిటి?

అంటే, "నిజం ఏమిటో ఎవరైనా తెలుసుకోగలరా?"

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/other/pilate]]

39-11

ఈ మనిషిలో నేను ఏ విధమైన అపరాధం కనుగోలేదు

అంటే, "నేను ఈ మనిషిని దోషిగా గుర్తించలేదు" లేదా, "నేను ఈ వ్యక్తిని పరిశీలించాను, ఈయన ఏ తప్పు చేయ లేదు."

అతను దోషి కాదు

అంటే, "ఆయన ఏ తప్పు చేయలేదు!"

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/kt/guilt]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]

39-12

అల్లరి

అంటే, "వారు కోపంతో దౌర్జన్యo చేయడం ప్రారంభించారు."

అతను అంగీకరించాడు

యేసు నిర్దోషి అని నమ్మినందున, పిలాతు యేసును చంపడానికి ఇష్టపడలేదు. కానీ జనసమూహం బలవంతం చేయడం వలన వారికి భయపడి యేసును సిలువ వేయమని తన సైనికులకు చెప్పవలసి వచ్చింది. వీలైతే, అతని అయిష్టతను చూపించే విధంగా ఈ వాక్యాన్ని అనువదించండి.

రాజ వస్త్రం

అంటే, "రాజు ధరించే వస్త్రాన్ని పోలినటువంటి వస్త్రం." ఈ వస్త్రం ప్రకాశవంతమైన రంగును కలిగి ఉంది, కాబట్టి ఇది ఒక రాజు ధరించే వస్త్రాన్ని పోలి ఉంటుంది.

ముళ్ళతో చేసిన కిరీటం

అంటే వారు కిరీటంలా కనిపించేలా ముళ్ళ కొమ్మలను ఒక వృత్తంలో కట్టారు. కిరీటం అనేది ఒక రాజు తన అధికారాన్ని చూపించడానికి తలపై ధరించే ఆభరణం. కానీ వారు యేసు తలపై పదునైన, ప్రమాదకరమైన ముళ్ళున్న కిరీటాన్నిఉంచారు.

చూడండి

అంటే, "చూడండి" లేదా, "ఇక్కడ ."

యూదుల రాజు

అప్పటి నుండి సైనికులు యేసును అపహాస్యం చేశారు."యూదుల రాజు అని పిలుస్తున్నారు" అని దీనిని అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలకు స్వల్పంగా భిన్నమైనవిగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/rome]]
  • [[rc://*/tw/dict/bible/other/mock]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingofthejews]]