తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

06-01

తన సేవకులలో ఒకరిని వెనుకకు పంపాడు

దీనిని “తన సేవకులలో ఒకరిని వెనుకకు వెళ్ళమని చెప్పాడు” అని అనువదించవచ్చు. “వెనుక” అని పదం చాలా కాలం క్రితం కనాను ప్రాంతానికి రాకముందు నివసించిన ప్రదేశానికి ఆ సేవకుడు వెళ్తాడు అని అర్థం. ఈ అర్థం స్పష్టంగా వచ్చేలా ఈ పదాన్ని అనువదించేలా చూడండి.

ఆ ప్రదేశానికి

అబ్రహాము ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి తూర్పున ఉన్న ప్రదేశం.

తన కుమారుడు ఇస్సాకుకు ఒక భార్యను తీసుకొని రావడానికి

ఈ వాక్యాన్ని “తన కుమారుడు ఇస్సాకు వివాహం చేసుకోడానికి ఒక అవివాహిత స్త్రీని తీసుకొని రావడానికి” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

06-02

అబ్రహాము సోదరుని మనుమరాలు

ప్రత్యేకించి ఆమె అబ్రహాము సోదరుని కుమారుని కుమార్తె. ఆమె తాత అబ్రహాము సోదరుడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]

06-03

రిబ్కా అంగీకరించింది

రిబ్కా తల్లిదండ్రులు ఆమెకు వివాహ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇస్సాకును వివాహం చేసుకోవాలని బలవంతం చెయ్యడం లేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]

06-04

వాగ్దానాలు..గడిచిపోతున్నాయి

అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనా వాగ్దానాలు అబ్రహాముకు మాత్రమే కాదు, అయితే ఆయన సంతానానికి కూడా అవి వర్తిస్తాయి.

అసంఖ్యాకంగా

ఈ పదం “చాలా అధికం” అని కూడా అనువదించవచ్చు. అంటే మనుష్యులు లెక్కించలేనంతగా అబ్రాహము సంతానం చాలా అధికంగా ఉంటారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]

06-05

రిబ్కా గర్భంలో

అంటే “ఆమెలో”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

06-06

ఇద్దరు కుమారుల నుండి

అంటే “ఆ ఇద్దరు కుమారుల సంతానం నుండి” అని అర్థం

ఒకరితో ఒకరు వారు ఘర్షణ పడతారు

ఇద్దరు కుమారులు, వారి నుండి వచ్చిన జాతులు నిరంతరం ఒకరితో ఒకరు పోరాటాలు చేసుకొంటూనే ఉంటారు. 06:05 చట్రంతో సరిపోల్చండి

పెద్ద కుమారుడు

పుట్టిన శిశువులు కవలలు అయినప్పటికీ, మొదటిగా బయటికి వచ్చిన శిశువు పెద్దకుమారుడిగా పరిగణించబడతాడు.

చిన్నవానిని సేవిస్తాడు

ఈ వాక్యం “పెద్దకుమారుడు చిన్నకుమారుడు చెప్పిన దానిని చెయ్యవలసి ఉంది” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]

06-07

రిబ్కా శిశువులు పుట్టారు

కొన్ని భాషలలో ఈ వాక్యాన్ని ఇంకా పరోక్ష విధానంలో వినియోగించారు, “రిబ్కా చూచి వారిని తీసుకొన్నప్పుడు” లేక “రిబ్కా వారిని వెలుగులోనికి తీసుకొని వచ్చినప్పుడు” అని రాశారు.

పెద్దకుమారుడు....చిన్నకుమారుడు

ఈ వాక్యం, “మొదటి కుమారుడు బయటికి రావలసియుండగా, రెండవ కుమారుడు బయటికి రావలసి యుండగా,” అని అనువదించవచ్చు.

ఎరుపు

దీని అర్థం అతని చర్మం చాలా ఎరుపు రంగులో ఉండియుండవచ్చు లేక అతని శరీరంమీద ఉన్న వెంట్రుకలు ఎరుపు రంగులో ఉండవచ్చు.

వెంట్రుకలతో నిండియుంది

ఏశావు శరీరం మీద అధికంగా వెంట్రుకలు ఉన్నాయి. “పెద్దకుమారుని శరీరం ఎరుపు రంగులో, ఎక్కువ వెంట్రుకలతో ఉంది” అని చెప్పవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ సూచనలు కొన్ని అనువాదాలలో కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]