తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

12-01

వారికమీదట బానిసలు కారు

ఈ వాక్యం “వారు ఇక మీదట బానిసలుగా ఉండరు” అని అనువదించవచ్చు

వెళ్తున్నారు

కొన్ని భాషలు “ప్రయాణిస్తున్నారు” అనే పదాన్ని నిర్దిష్టంగా వినియోగించవచ్చు, ఎందుకంటే వారు వాగ్దాన భూమికి చాలా దూరం వెళ్తున్నారు.

వాగ్దాన భూమి

అబ్రహాము సంతానానికి అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమి ఇది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

12-02

మేఘ స్తంభం

ఈ పదం “ఒక పొడవాటి మేఘం” లేక “స్తంభం రూపంలో ఉన్న ఒక స్తంభం” అని అనువదించబడవచ్చు.

పొడవాటి అగ్ని స్తంభం

ఇది ఇశ్రాయేలీయుల యెదుట ఆకాశంలో వేలాడుతున్న లేక తేలియాడుతున్న అగ్నిస్తంభం.

వారిని నడిపించింది

ఇశ్రాయేలీయులు దానిని అనుసరించేలా అగ్ని స్తంభం వారితోపాటు కదిలేలా చెయ్యడం ద్వారా దేవుడు వారికి ఒక మార్గాన్ని చూపించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

12-03

కొద్దికాలం తరువాత

బహుశా రెండు రోజులు గడిచిపోయాయి. దానిని స్పష్టంగా చెప్పాడానికి ఈ వాక్యాన్ని “కొద్ది రోజుల తరువాత” లేదా “ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిన కొద్ది రోజుల తరువాత” అని అనువదించవచ్చు.

వారి మనసులు మార్చుకొన్నారు

“వారు గతంలో ఆలోచించిన దానికి భిన్నంగా తలంచడం ఆరంభించారు” అని ఈ వాక్యానికి అర్ధం. కొన్ని భాషలలో ఇదే వ్యక్తీకరణ ఉండవచ్చు, తిన్నని విధానంలో అర్థాన్ని తెలియపరుస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]

12-04

వారు ఎర్ర సముద్రం మధ్యలో చిక్కుకుపోయారు

దీనిని “ఐగుప్తీయులు వారి వెనుక ఉన్నారు, ఎర్ర సముద్రం వారికి ముందు ఉంది కనుక వారు తప్పించుకోడానికి వేరే మార్గం లేదు” అని చెప్పవచ్చు.

మనం ఎందుకు ఐగుప్తును విడిచిపెట్టాం?

“మనం ఐగుప్తును విడిచిపెట్టకుండా ఉండవలసింది!” అని దీని అర్థం. వారు కారణాల కోసం అడగడం లేదు. వారు భయపడిన కారణంగా, ఈ క్షణంలో వారు ఐగుప్తును విడిచిపెట్టకుండా ఉండవలసిందని కోరుతున్నారు (అక్కడ వారికి చాలా కష్టంగా ఉన్నప్పటికీ)

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/redsea]]

12-05

దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు

“ఈ రోజు దేవుడు మీకోసం ఐగుప్తీయులను ఓడిస్తాడు, వారు మీకు హాని చెయ్యకుండా రక్షిస్తాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

కదలండి

కొన్ని భాషలలో మరింత స్పష్టంగా “నడవండి” అని చెప్పవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/other/redsea]]

12-06

మేఘ స్తంభం

ఈ పదాన్ని 12:02 చట్రంలో మీరు ఏవిధంగా అనువదించారో చూడండి

చూడలేకపోయారు

మేఘ స్తంభం చాలా పెద్దది, దట్టంగా ఉంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూడలేకపోయారు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

12-07

సముద్రం మీద తన చేతిని ఎత్తాడు

“సముద్రం మీద తన చేతిని నిలిపాడు” అని అనువదించవచ్చు. మోషే ద్వారా దేవుడు ఈ అద్భుతాన్ని చెయ్యబోతున్నాడని చూపించదానికి ఇది ఒక సూచన.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]

12-08

ముందుకు కదిలారు

ఈ పదం “నడిచారు” లేదా “వెళ్ళారు” అని అనువదించవచ్చు.

ఆరికి రెండు వైపులా నీటి గోడలతో

“వారికి రెండువైపులా నీళ్ళు ఎత్తుగా నిలిచాయి, అవి నిటారుగా గోడల్లా నిలిచాయి.” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

12-09

సమాచారం

ఈ చట్రానికి ఎటువంటీ నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

12-10

సముద్రం గుండా దారి

సముద్రం అడుగు భాగాన భూమి మీద ఆరిన భూబాట, దానికి రెండువైపులా నీటి గోడ ఉంది

భయపడడానికి

“భయపడడానికీ, కలవరపడడానికీ” అని అనువదించవచ్చు

నిలిచిపోయారు

రథాలు ముందుకు కదలలేక పోయాయి

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/chariot]]

12-11

మరొక వైపుకు క్షేమంగా వెళ్ళారు

ఈ వాక్యాన్ని “మరొక వైపుకు క్షేమంగా నడిచారు” లేక “మరొక వైపుకు క్షేమమగా చేరారు” లేక “మరొక వైపుకు నడిచారు, ఐగుప్తీయుల నుండి, సముద్రం నుండి క్షేమంగా ఉన్నారు” అని అనువదించవచ్చు.

అతడు మరలా తన చెయ్యి చాచాడు

“సముద్రం వైపుకు తన చెయ్యిని మరలా ఎత్తాడు” లేక నేరుగా ఒక ఆజ్ఞగా “దేవుడు మోషేతో చెప్పాడు, “నీ చేతిని మరల చాపు” అని అనువదించవచ్చు.

నీళ్ళు తిరిగి వచ్చాయి

“నీళ్ళు మార్గంగా ఉన్న ఆ స్థానాన్ని తిరిగి కప్పివేసాయి” లేక “పూర్తి సముద్రాన్ని మరల నింపివేశాయి” లేక “దేవుడు వేరు చేయడానికి ముందు ఉన్న చోటికి తిరిగి వెళ్ళాయి” అని అనువదించవచ్చు.

ఐగుప్తు సైన్యం మొత్తం

“ఐగుప్తు సైన్యం లోని ప్రతి ఒక్కరూ” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

12-12

దేవుని యందు విశ్వాసముంచారు

మరొక మాటల్లో, దేవుడు శక్తిమంతుడనీ, వారిని కాపాడగలడనీ ప్రజలు ఇప్పుడు విశ్వాసముంచారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

12-13

అత్యుత్సాహంతో వారు ఆనందించారు

“చాలా సంతోషించారు, అత్యుత్సాహంతో దానిని కనుపరచారు” లేక “వారు తమ పూర్తి హృదయంతో చొప్పించారు” లేక “వారి పూర్తి బలంతో” అని అనువదించవచ్చు

మరణం నుండి, బానిసత్వం నుండి

“చావునుండి లేక ఐగుప్తీయులచేత బానిసలు కావడం నుండి” అని అనువదించవచ్చు

సేవించడానికి స్వేచ్ఛ

దేవుడు వారిని విడిపించాడు లేక కాపాడాడు, ఇశ్రాయేలీయులు ఆయనను సేవించేలా ఐగుప్తీయులకు బానిసలుగా మారకుండా విడిపించాడు.

దేవునికి స్తుతి

కొన్ని భాషలలో “దేవుని పేరును హెచ్చించారు” లేక “దేవుడు గొప్పవాడు అని చెప్పారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

12-14

పస్కా

“పస్కా కార్యకలాపాలు” లేక “పస్కా పండుగ వేడుక” లేక “పస్కా భోజనం” అని అనువదించవచ్చు.

దేవుడు వారికి విజయాన్ని ఏ విధంగా ఇచ్చాడో జ్ఞాపకం చేసుకొండి

“దేవుడు ఏ విధంగా ఓడించాడో క్రమంగా జ్ఞాపకం చేసుకోండి” అని అనువదించవచ్చు. ఇక్కడ “జ్ఞాపకం” అనే పదం కేవలం మరచిపోకండి అని మాత్రమే కాదు, గతంలో జరిగిన దానిని స్మరణకు తెచ్చుకొని దాని విషయంలో వేడుక చేసుకోవడం అని అర్థం

పరిపూర్ణమైన గొర్రెపిల్ల

ఇక్కడ “పరిపూర్ణం” అనే పదం ఎటువంటి వ్యాధి లేని గొర్రెపిల్ల లేక ఎటువంటి లోపం లేని గొర్రెపిల్లను సూచిస్తుంది. దీనిని “సంపూర్ణంగా ఆరోగ్యవంతమైంది, చక్కటి రూపం ఉన్నగొర్రె పిల్ల” అని మరొక విధంగా చెప్పవచ్చు

పులియజేసే పిండి లేకుండా చేసిన రొట్టె

“పులియని రొట్టె” అని మరొక విధంగా దీనిని చెప్పవచ్చు. దీనిని ఏవిధంగా అనువదించారో 11:03 చట్రాన్ని చూడండి

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా విభిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/passover]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]