తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

37-01

ఒక రోజు

ఈ వాక్యం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది, కానీ నిర్దిష్ట సమయాన్ని పేర్కొనలేదు. వాస్తవమైన కథ ప్రారంభించి చెప్పడానికి చాలా భాషలలో ఇలాంటి విధానం ఉంది.

మరియ

యేసు తల్లి పేరు కూడా మరియ. అయితే ఈమె వేరే స్త్రీ.

ఈ రోగం మరణానికి ముగింపు కాదు

దీనిని "ఈ వ్యాధికి తుది ఫలితం మరణం కాదు" లేదా "లాజరు అనారోగ్యంతో ఉన్నాడు, కానీ ఈ రోగం తుది ఫలితం మరణం కాదు" అని కూడా అనువదించవచ్చు. లాజరు చనిపోడు అని యేసు శిష్యులు భావించారు. కానీ యేసుకు తెలుసు, లాజరు అనారోగ్యంతో చనిపోయినప్పటికీ, చివరికి అతను బతుకుతాడని.

ఇది దేవుని మహిమ కొరకు

అంటే, "దేవుడు ఎంత గొప్పవాడో అని ప్రజలు తెలుసుకొని స్తుతించడానికి ఇది కారణమవుతుంది."

కానీ ఆయన రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో,అక్కడే ఉండిపోయాడు

దీనిని ఇలా అనువదించవచ్చు, "లాజరును ఆయన స్వస్థపరచాలని వారు కోరుకున్నప్పటికీ, ఆయన రెండు రోజులు ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోయాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/glory]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]

37-02

యూదయ

యూదా గోత్రం వారు స్థిరనివాసం చేసిన ఇశ్రాయేలు దేశపు దక్షిణ భాగాన్ని ఇది సూచిస్తుంది. కొన్ని భాషలలో ఇది "యూదా ప్రాంతం" అని సూచిస్తుoది.

నిద్రపోతున్నాడు, నేను అతన్ని లేపాలి.

మీ భాషలో "నిద్ర", "మేల్కొల్పడం" అనే పదాలను సామాన్యమైన మాటలతో ఈ పదాలను అనువదించండి. యేసు ఈ పదాలను వేరే అర్థంతో ఉపయోగిస్తున్నప్పటికీ, శిష్యులకు అది ఇంకా అర్థం కాలేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/teacher]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]

37-03

అతను బాగవుతాడు

"అతని వ్యాధి నయమవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు అతను దగ్గరకు వెళ్ళడానికి ఎలాంటి కారణం లేదు." అని శిష్యులు ఉద్దేశించారు.

నేను సంతోషిస్తున్నాను

దీనిని "నేను సంతోషంగా ఉన్నాను" లేదా "ఇది మంచిది" అని అనువదించవచ్చు. లాజరు చనిపోయినoదుకు ఆయన సంతోషంగా ఉన్నాడని కాదు, కానీ దేవుడు ఎంత గొప్పవాడో కనపరచబోతున్నoదుకు ఆయన సంతోషంగా ఉన్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]

37-04

మార్త

లాజరు, మరియల సహోదరి మార్త. 37:01 చట్రాన్ని చూడండి.

యేసును కలవడానికి బయలు దేరాడు

అంటే, "యేసు పట్టణంలోకి వస్తున్నాడని, ఆయనను కలవడానికి వెళ్ళింది."

నా సోదరుడు చనిపోయేవాడు కాడు.

అంటే, "నీవు నా సోదరుడిని నయం చేసేవాడివి, అతను చనిపోయేవాడు కాదు" లేదా, "నీవు నా సోదరుడిని చనిపోకుండా ఆపేవాడవు."

ఆయనను నీవు ఏమి అడిగిన అది నీకు ఇస్తాడు

అంటే, "నీవు ఆయన్ని చేయమని అడిగినదంతా చేస్తాడు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

37-05

పునరుత్థానమూ, జీవము నేనే

యేసు తన ముఖ్యమైన స్వభావం గురించి “నేను” అని తెలియచేయడం అనేది చాలా శక్తివంతమైన ప్రకటనలలో ఒకటి. ఇందులో, యేసు "పునరుత్థానమూ" లేదా "పునరుత్థానానికీ, జీవానికి" మూలం తానేనని సూచించాడు. వీలైతే, ఇది ఆయన ముఖ్యమైన స్వభావమనే విధంగా ఈ వాక్యాన్ని స్పష్టంగా అనువదించండి. "ప్రజలను పునరుత్థానులుగా చేసి, వారు జీవించేందుకు కారణం నేనే" అని కూడా దీనిని అనువదించవచ్చు.

ఆయన చనిపోయినప్పటికీ జీవించే ఉంటాడు.

అంటే, "ఆయన చనిపోయినప్పటికీ శాశ్వతంగా జీవిస్తాడు." "ఆయన" అనే ఆంగ్ల పదం పురుషులకు మాత్రమే సూచించదు. యేసును విశ్వసించే స్త్రీలు కూడా శాశ్వతంగా జీవిస్తారు.

మార్త

లాజరు, మరియల సోదరి మార్త . 37:01 చూడండి.

ఎప్పటికి చనిపోడు

"శాశ్వతంగా జీవిస్తారు" అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/resurrection]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]

37-06

మరియ

37:01 లో ఉన్న అదే స్త్రీ ఈమె, యేసు తల్లి కాదు.

యేసు పాదాలపై పడింది

అంటే, గౌరవ చిహ్నంగా "యేసు పాదాల వద్ద మోకరిల్లింది".

నా సోదరుడు చనిపోయేవాడు కాదు.

అంటే, "నీవు నా సోదరుడిని చనిపోకుండా ఉంచేవాడవు" లేదా, "నీవు నా సోదరుడి మరణాన్ని ఆపేవాడవు" లేదా "నా సోదరుడు ఇంకా బతికే ఉండేవాడు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]

37-07

ఆయన వారికి చెప్పాడు

"ఆయన అక్కడి మనుష్యులకు చెప్పాడు.” అంటే, ఆయన మరియ, మార్తలతో రాయి తీసివేయమని చెప్పలేదేమో.

రాయిని దూరంగా దొర్లించండి

"సమాధి తెరవడానికి దూరంగా రాయిని దొర్లించండి" అనికొన్ని భాషలలో చెప్పడానికి ఇష్టపడవచ్చు.

మార్త

లాజరు, మరియల సోదరి మార్త. 37:01 చూడండి.

అతను చనిపోయి నాలుగు రోజులైంది

దీనిని "అతను నాలుగు రోజుల క్రితం చనిపోయాడు, ఇంకా అతని శరీరం అక్కడే ఉంది" అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/tomb]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]

37-08

నేను మీకు చెప్పలేదా?

అంటే, "నేను మీకు చెప్పింది జ్ఞాపకం చేసుకోండి." యేసు సమాధానాన్ని రాబట్టడానికి ఈ ప్రశ్న అడగడం లేదు, కాబట్టి కొన్ని భాషలలో దీనిని ఒక ఆజ్ఞగా అనువదించాలి.

దేవుని మహిమను చూడండి

అంటే, "దేవుడు అగుపరచే మహిమను చూడండి" లేదా, "దేవుడు తానెంత గొప్పవాడో కనపరచడం చూడండి."

రాయిని దూరంగా దొర్లించారు

కొన్ని భాషలు "సమాధిని తెరవడానికి రాయిని దొర్లించారు" అని చెప్పాలి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/glory]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]

37-09

నా మాట వినండి

"నా మాటలను వింటున్నావు." ఇంకా సహాయకరంగా ఉండేందుకు, "నేను నిన్ను ప్రార్థిస్తూండగా" లేదా "నేను మీతో చెపుతుండగా" అని జోడించవచ్చు.

బయటికి రా

కొన్ని భాషలలో "సమాధి నుండి బయటకు రా" అని చెప్పడానికి ఎంచుకోవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]

37-10

లాజరు, బయటకు రా!

కొన్ని భాషలలో "లాజరు సమాధి నుండి బయటకు వచ్చాడు!" అని చెప్పాలి.

ప్రేతవస్త్రాలు

అంటే, " సమాధిలో పెట్టేటప్పుడు కట్టే వస్త్రాలు." దీనిని "ఖననం కోసం శవానికి కట్టే కట్టలు" లేదా, “గుడ్డ పేలికలు” అని కూడా అనువదించవచ్చు.

ఈ అద్భుతం కారణంగా

అంటే, "దేవుడు ఈ ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని చేసినందుకు" లేదా, "యేసు లాజరును మళ్ళీ సజీవంగా బ్రతికించినందుకు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/miracle]]

37-11

ఈర్ష్య

అంటే, "యేసు శక్తీ, ప్రజాదరణపై అసూయ" లేదా, "చాలా మంది యూదులు యేసును నమ్ముతున్నారని అసూయపడ్డారు."

కలిసి కట్టుగా

అంటే, "కూడుకొనిరి" లేదా, "ఒకరికొకరు కలిశారు." ఇది ఒక సాధారణ సమావేశం కాదు, ఒక నిర్దిష్టమైన పని కోసం సమావేశం, అనగా యేసును ఎలా చంపాలో ప్రణాళిక వేయడానికి ఈ సమావేశం.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలకు స్వల్పంగా భిన్నమైనవిగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc:/en/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/lazarus]]