తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

25-01

పరిశుద్ధాత్మ ఆయనను నడిపించాడు

అంటే, “పరిశుద్ధాత్మ ఆయనను నడిపించాడు” లేక “పరిశుద్ధాత్మ ఆయన్ను వెళ్ళమని ప్రేరేపించాడు.”

అరణ్యం

ఈ పదం “ఎడారి” లేక “కొద్దిమందితో ఉన్న సుదూర, నిస్సార స్థలం.” ఈ స్థలంలో బహుశా కొద్ది చెట్లు లేక ఇతర మొక్కలు ఉన్నాయి, కాబట్టి అక్కడ ఎక్కువమంది నివాసం చెయ్యలేరు.

నలుబది పగళ్ళు, నలుబది రాత్రుళ్ళు

“నలుబది రోజులు, అంటే పగటి సమయాలూ, రాత్రి సమయాలూ” అని దీని అర్థం. ఈ పదం అనువాదం ఇది ఎనుబది దినాల కాలం అని అనిపించకుండ ఉండేలా చూడండి.

ఆయన పాపం చెయ్యడానికి శోధించాడు

యేసు పాపం చెయ్యలేదు కనుక యేసు పాపం చెయ్యడానికి ఒప్పించడంలో సాతాను విజయవంతం అయ్యాడని అర్థమిచ్చే పదాన్ని వినియోగించకుండా చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/other/fast]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/tempt]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

25-02

ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో

ఈ వాక్యం “ఈ రాళ్ళు రొట్టెలుగా మారేలా చెయ్యి” లేక “ఈ రాళ్ళను సహజాతీంగా రొట్టెలుగా మార్చు” అని అనువదించవచ్చు

రొట్టె

సహజంగా రొట్టె ఒక క్రమమైన ఆహారంగా లేని భాషల్లో దీనిని “ఆహరం” అని అనువదించవచ్చు. యూదుల సంస్కృతిలో రొట్టె ప్రధానమైన ఆహారం

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/tempt]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]

25-03

రొట్టె

25:02 లో “రొట్టె” పదాన్ని అనువదించడానికి మీరు వినియోగించిన పదాన్నే వినియోగించేలా చూడండి.

దేవుడు పలికిన ప్రతీ మాట వారికి కావాలి

ఈ వాక్యాన్ని “దానికి బదులు మనుష్యులు దేవుడు పలికిన ప్రతీ మాటను వినాలి, వాటికి లోబడాలి” లేక దానికి బదులు దేవుడు పలికిన ప్రతి మాటనూ విశ్వసించడం ద్వారా వాటికి లోబడం ద్వారా నిజమైన జీవితాన్ని వారు కలిగియుండాలి” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

25-04

కిందికి దూకు

అంటే “ఈ భవనం నుండి నేల మీదకు దూకు”

ఇది రాయబడియుంది

అంటే “దేవుని ప్రవక్త చాలా కాలం క్రింద రాశాడు.”

నీ పాదం రాతికి తగలకుండా ఉండేలా

అంటే, “తద్వారా నీకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేలా; రాతి మీద నీ పాదానికి సహితం గాయం కాకుండేలా” అని అర్థం. ఈ వాక్యాన్ని “తద్వారా నీ పాదం రాయికి తగలకుండా ఉండాలి; నీకు ఎటువంటి హాని జరుగకూడదు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]

25-05

దేవుని వాక్యంలో, ఆయన తన ప్రజలను ఆజ్ఞాపిస్తున్నాడు, “ప్రభువైన నీ దేవుణ్ణి శోధించకూడదు.”

ఈ వాక్యాన్ని పరోక్ష వ్యాఖ్యగా అనువదించవచ్చు, “మన ప్రభువైన దేవుణ్ణి శోధించకూడదని దేవుడు తన వాక్యంలో మనలను ఆజ్ఞాపిస్తున్నాడు.”

ప్రభువైన నీ దేవుణ్ణి శోధించకూడదు

ఈ వాక్యాన్ని, “దేవుడు తనను తాను నీకు రుజువు పరచుకొనేలా చెయ్యకూడదు” లేక “దేవుడు తాను మంచివాడని తన్నుతాను రుజువు పరచుకొనేలా చెయ్యకూడదు” అని అనువదించవచ్చు.

ప్రభువైన నీ దేవుడు

అంటే “యెహోవా నీ దేవుడు” లేక “దేవుడైన యెహోవా, నీ మీద అధికారం కలిగియున్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

25-06

ఈ లోక రాజ్యాలు

ఈ పదం అత్యంత గొప్ప నగరాలు, దేశాలు, ప్రపంచంలోని ఇతర రాష్ట్రాలను సూచిస్తుంది

వాటి మహిమ

అంటే, “వాటి శక్తి, సంపద”

వీటన్నిటినీ నేను నీకు ఇస్తాను

ఈ వాక్యాన్ని, “ఈ రాజ్యాల సంపదనూ, శక్తినీ నీకు ఇస్తాను” లేక “ఈ దేశాలూ, నగరాలూ, మనుష్యులందరి మీద నిన్ను పాలకునిగా చేస్తాను” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/kt/glory]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]

25-07

నా నుండి వెళ్ళిపో

ఈ వాక్యాన్ని “నన్ను విడిచిపెట్టు” లేక “నన్ను ఒంటరిగా విడిచిపెట్టు” అని అనువదించవచ్చు

దేవుని వాక్యంలో ఆయన తన ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు, “నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే సేవించాలి.”

ఈ వాక్యాన్ని పరోక్ష వ్యాఖ్యగా రాయవచ్చు, “దేవుని వాక్యంలో మన మీద పరిపాలన చేస్తున్న ప్రభువైన దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి, సేవించాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు” అని రాసి ఉంది, అని అనువదించవచ్చు.

ప్రభువైన నీ దేవుడు

25:05 చట్రంలో మీరు చేసిన విధంగానే ఈ వాక్యాన్ని అనువదించండి.

ఆయనను మాత్రమే సేవించాలి

“మీరు సేవించవలసినది ఆయనను మాత్రమే” అని మరొక విధంగా దీనిని చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

25-08

ఇవ్వలేదు

ఈ పదం “అయన చేత చేయించాలని సాతాను పెట్టిన శోధనలకు అయన లొంగలేదు” అని అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/tempt]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]