తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

34-01

కథలు

దేవుని రాజ్యం గురించిన సత్యాలను బోధించడానికి యేసు ఈ కథలను వినియోగించాడు. సంఘటనలు నిజంగా జరిగాయా లేదా అనేది స్పష్టంగా లేదు. కల్పితం, వాస్తవ కథలను రెంటినీ కలిపి చెప్పే పదం మీ భాషలో ఉన్నట్లయితే దానిని ఇక్కడ మీరు వినియోగించాలి.

ఆవగింజ

నల్ల ఆవగింజ మొక్కను సూచిస్తుండవచ్చు. దీనికి చాలా చిన్న విత్తనాలు ఉంటాయి, ఇవి త్వరగా పెరుగుతాయి, చాలా పెద్ద చెట్టుగా పెరుగుతుంది. మీ భాషలో ఈ చెట్టుకు ఒక పేరు ఉన్నట్లయితే మీరు దీనిని వినియోగించండి. లేకపోతే అటువంటి లక్షణాలు ఉన్న మరొక చెట్టు పేరును ప్రత్యామ్యాయంగా వినియోగించాలి.

అన్నిటిలో చాలా చిన్న విత్తనం

అంటే, “మనుష్యులు నాటే విత్తనాలన్నిటిలో చాలా చిన్న విత్తనం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

34-02

సమాచారం

యేసు కథను చెప్పడం కొనసాగిస్తున్నాడు

ఆవగింజ

34:01 చట్రంలో ఈ పదాన్ని ఏ విధంగా అనువదించారో చూడండి.

పెరుగుతుంది

“పరిణత చెందుతున్న చెట్టుగా” అని మీరు జత చెయ్యవచ్చు

తోట మొక్కలు

ఈ పదాన్ని “తోటలో నాటే మొక్కలు” అని అనువదించవచ్చు

కూర్చుని యుండడం

ఈ మాటను “మీద కూర్చుని” లేక “కూర్చుండబెట్టడం” అని అనువదించవచ్చు

34-03

కథ

34:01 చట్రంలో ఈ పదాన్ని ఏ విధంగా అనువదించారో చూడండి.

పులియ చేసే పిండి

ఈ మాటను “పులిసిన పిండి” లేక “పులిసిన పిండిలో కొంచెం” అని అనువదించవచ్చు. రొట్టె పిండి పొంగ చెయ్యడానికి దీనిని కలుపుతారు. పెద్ద మొత్తంలో ఉన్న రొట్టెపిండిలో దీనిని కలపువచ్చు, ఆ పిండి అంతా పులియ చెయ్యవచ్చు.

రొట్టె ముద్ద

నీరు, పిండి కలిసిన మిశ్రమం, దీనిని ఒక రూపం లోనికి తీసుకొని రావచ్చును, రొట్టెగా వండవచ్చు. రొట్టె ముద్దకు లేక పిండికి పదాలు లేకపోతే పిండి కోసం పదాలను చూసుకోండి లేదా దానిని “విత్తనాలను పిండి చెయ్యడం” అని పిలవండి.

ముద్ద అంతా వ్యాపిస్తుంది

అంటే, “ముద్ద అంతటిలోనూ పులియజేసే పిండి ఉంటుంది” లేక “పులియజేసే పిండి ముద్ద అంతా వ్యాపిస్తుంది.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

34-04

సమాచారం

యేసు మరొక కథ చెప్పాడు

సంపద

అంటే, “చాలా విలువైనది”

తిరిగి పాతిపెట్టాడు

“ఎవరూ దానిని కనుగొనకుండా ఉండేలా” అని జత చెయ్యవచ్చు

సంతోషంతో నిండి ఉంది

“చాలా సంతోషం” లేక “ఉత్సహించారు” అని జత చెయ్యవచ్చు

ఆ పొలాన్ని కొన్నాడు

“ఆ సంపద తనది అవుతుందని” అని జత చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/joy]]

34-05

సమాచారం

యేసు దేవుని రాజ్యం గురించి మరొక కథను చెప్పడం కొనసాగించాడు

సంపూర్ణమైన ముత్యం

అంటే, “ఎటువంటి లోపాలు లేని ముత్యం.”

ముత్యం

ముత్యాలు తెలియక పొతే దీనిని “అందమైన రాయి” లేక “అందమైన రాయి వంటి పదార్ధం” అని అనువదించవచ్చు

గొప్ప విలువ

అంటే, “అది చాలా విలువైనది” లేక “చాలా డబ్బు అంత విలువైనది.”

ముత్యాల వర్తకుడు

అంటే, “ముత్యాల వ్యాపారి” లేక “ముత్యాల వర్తకం చేసేవాడు.” ముత్యాలు అమ్మడం, కొనడం లాంటి వ్యాపారం చేసే వ్యక్తిని సూచిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

34-06

కథ

34:01 చట్రంలో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి.

వారి సొంత మంచి కార్యాలలో నమ్మకం ఉంచారు

అంటే, “వారి మంచి కార్యాలు వారిని నీతిమంతులుగా చేస్తాయని విశ్వసించారు” లేక “ఎంత పరిపూర్ణంగా దేవుని శాసనాలను నెరవేర్చామని గర్వంగా ఉన్నారు” లేక “వారి మంచి కార్యాలు తమ విషయంలో దేవుడు సంతోషపడేలా చేశాయని విశ్వసించడం.”

ఇతరులను తృణీకరించాడు

అంటే, “ఇతరులు వారి కంటే తక్కువవారు అని ఎంచడం” లేక “ఇతరులను తక్కువగా చూడడం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/trust]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/other/taxcollector]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]

34-07

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

ఒక మతాధికారి ఈ విధంగా ప్రార్థన చేసాడు

“మత నాయకుడు ఈ విధంగా ప్రార్థన చేసాడు” లేక “మతనాయకుడు ఈ విధానంలో ప్రార్థన చేసాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

నేను అతనిలా పాపిని కాదు

అంటే, “నేను అలా పాపంతో నిండిన వాడిని కాను” లేక “నేను నీతిమంతుడను, అలా కాదు.”

అనీతిమంతుడైన వ్యక్తి

అంటే, “నీతిమంతులు కాని మనుష్యులు” లేక “చెడ్డ కార్యాలు చేసే మనుషులు” లేక “ఆజ్ఞలను మీరేవారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/adultery]]
  • [[rc://*/tw/dict/bible/other/taxcollector]]

34-08

సమాచారం

మతనాయకుని ప్రార్థనను గురించి చెప్పడం కొనసాగిస్తున్నాడు

నేను ఉపవాసం ఉంటాను

ఈ విధంగా చెయ్యడం ద్వారా దేవుని దయను సంపాదించుకోవచ్చని మతాధికారి విశ్వసించాడు

పదియవ భాగం

అంటే, “పదిలో ఒక భాగం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/fast]]

34-09

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

దూరాన నిలుచున్నాడు

ఈ వాక్యాన్ని “దూరాన నిలుచున్నాడు” లేక “వేరుగా నిలబడ్డాడు” అని అనువదించవచ్చు

ఆకాశం వైపుకు తల కూడా ఎత్తలేదు

సాధారణంగా ప్రజలు ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపుకు చూస్తారు, అయితే ఈ మనిషి ఆ విధంగా చూడలేదు ఎందుకంటే తన పాపం విషయంలో సిగ్గుపడుతున్నాడు అనే దానిని “అయినప్పటికీ” అనే పదం చూపుతుంది.

చేతితో తన రొమ్మును కొట్టుకొంటున్నాడు

“అతని దుఃఖం కారణంగా తన చేతితో తన రొమ్ము మీద కొట్టుకుంటున్నాడు” లేక “వేదనతో తన రొమ్ము మీద కొట్టుకుంటున్నాడు” అని అనువదించవచ్చు. ప్రజలు వేరొక కారణాలను బట్టి రొమ్ము మీద కొట్టుకొంటారు కనుక దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే “అతడు తన పరితాపాన్ని” చూపిస్తున్నాడు అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/taxcollector]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/mercy]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

34-10

అతనిని నీతిమంతుడిగా ప్రకటించాడు

అంటే, “అతనిని నీతిమంతుడుగా ఎంచాడు.” సుంకం వసూలు చేసేవాడు పాపి అయినప్పటికీ అతడు చూపిన వినయం, పశ్చాత్తాపం కారణంగా దేవుడు అతని పట్ల జాలి చూపించాడు,

తగ్గించుకొంటాడు

దీనిని “తక్కువ స్థాయి ఇస్తారు” లేక “ప్రాముఖ్యమైన వానిగా ఉండకుండా చేస్తుంది” అని కూడా అనువదించవచ్చు. “తక్కువ చేస్తుంది” అని రూపకంగా అనువదించవచ్చు.

హెచ్చిస్తుంది

అంటే, “ఉన్నత స్థాయిని ఇస్తుంది” లేక “ఘనపరుస్తుంది.”

తనను తాను తగ్గించుకోవడం

అంటే, “వినయ పూర్వక విధానంలో ప్రవర్తించడానికి ఎంపిక చేసుకొన్నాడు” లేక “తన గురించి వినయ పూర్వక వైఖరి కలిగియున్నాడు.”

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలో స్వల్పంగా భిన్నంగా ఉంటుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/taxcollector]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/humble]]
  • [[rc://*/tw/dict/bible/other/proud]]