తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

07-01

ఇంటిలో ఉండడం ఇష్టం...వేటాడడం ఇష్టం.

కొన్ని భాషలు “ప్రేమ” అనే పదాన్ని “రిబ్కా యాకోబును ప్రేమించింది” అనే వాక్యంలో వినియోగించిన పదానికి భిన్నంగా వినియోగిస్తారు. ఉదాహరణకు, దీనిని “ఇంటిలో ఉండడం ఇష్టపడ్డాడు, వేటాడడం ఇష్టపడ్డాడు” అని అనువదించవచ్చు లేక “ఇంటిలో ఉండడం యెంచుకొన్నాడు...వేటాడడాన్ని యెంచుకొన్నాడు” అని అనువదించవచ్చు.

ఇంట వద్ద

కుటుంబ నివాసాల చుట్టూ ఉన్న ప్రాంతం అని ఈ వాక్యం సూచిస్తుంది. యాకోబు వారు నివసిస్తున్న గుడారాల సమీపంలో నివసించాలని కోరుకొన్నాడు. కొన్ని భాషలు “ఇంటి వద్ద” అనే పదానికి ప్రత్యేకమైన అర్థాన్ని కలిగియున్నాయి.

రిబ్కా యాకోబును ప్రేమించింది, అయితే ఇస్సాకు ఏశావును ప్రేమించాడు

ఈ వాక్యం “రిబ్కా యూకోబు పట్ల అమితమైన ఇష్టాన్ని కలిగియుంది, ఇస్సాకు ఏశావు పట్ల అమితమైన ఇష్టాన్ని కలిగియున్నాడు” అని అనువదించవచ్చు. రిబ్కాగానీ, ఇస్సాకు కానీ రెండవ కుమారుడిని ప్రేమించలేదు అని అర్థంకాదు, అయితే వారిద్దరికీ ఒక ప్రత్యేకమైన కుమారుడు ఉన్నాడని అర్థం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]

07-02

నాకు కొంత ఆహారం ఇవ్వు....నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇవ్వు

ఇక్కడ “ఇవ్వు” అనే పదానికి కొన్ని భాషలు రెండు భిన్నమైన పదాలు వినియోగించాయి. చివరి రెండు వాక్యాలలో “ఏశావు ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు” అనే పదాలకు వీటిని అన్వయించవచ్చు.

పెద్దకుమారునిగా హక్కులు

వారి ఆచారం ప్రకారం, ఏశావు పెద్దకుమారుడు కనుక తన తండ్రి చనిపోయినప్పుడు, తమ తండ్రి ఆస్తిలో రెండింతల ఆస్తిని పొందవలసి ఉంది. ఏశావు నుండి పెద్దకుమారుని హక్కులు తీసివేసుకొనే విధానం గురించి ఆలోచించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

07-03

అతని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు

తండ్రులు తమ పిల్లలకు జరగవలసిన మంచి అంశాలను గురించిన తమ అభిలాషను వ్యక్తీకరించడం ఒక ఆచారంగా ఉండేది. సహజంగా పెద్దకుమారుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని పొందుతాడు. ఇస్సాకు ఈ అదనపు సంపద ఏశావుకు కలగాలని కోరుకున్నాడు.

అతనిని మోసగించాడు

“మోసం” అనే పదం ఒక వ్యక్తిని బహిరంగంగా మోసం చేసిన అర్థాన్ని ఇస్తుంది. ఏశావుకు బదులుగా యాకోబుకు ప్రత్యక దీవెన ఇవ్వడానికి ఇస్సాకును మోసగించేలా రిబ్కా ఒక ప్రణాళికను తీసుకొనివచ్చింది.

నటించాడు

“నటించడం” పదం యాకోబు తన తండ్రిని ఏ విధంగా మోసగించాడో చూపిస్తుంది (ఇస్సాకు ముసలి వయసులో చూపు మందగించింది).

గొర్రె చర్మం

గొర్రె చర్మానికి ఉండే వెంట్రుకలు యాకోబును ఏశావులా చేసాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

07-04

యాకోబు ఇస్సాకు వద్దకు వచ్చాడు

కొన్ని భాషలలో “యాకోబు ఇస్సాకు వద్దకు వెళ్ళాడు” అని చాలా సహజంగా చెప్పవచ్చు.

అతడు ఏశావు అని ఇస్సాకు తలంచాడు

తాను తాకుతున్న, వాసన వస్తున్న వ్యక్తి ఏశావు అని ఇస్సాకు తలంచాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

07-05

జ్యేష్టకుమారుని హక్కులు

తన తండ్రి సంపదలో పెద్దభాగాన్ని తీసుకోడానికి యాకోబు ఒక మార్గాన్ని కనుగొన్నాడు, పెద్దకుమారునిగా ఏశావుకు అది చెందవలసి ఉంది. 07:02 నోట్సు కూడా చూడండి.

అతని ఆశీర్వాదం

ఇస్సాకు ఏశావుకు ఇవ్వాలని ఉద్దేశించిన అదనపు సంపదను గురించిన వాగ్దానాన్ని యాకోబుకు ఇచ్చేలా తన తండ్రిని కూడా మోసగించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

07-06

ఏశావు ప్రణాళిక

తన తండ్రి చనిపోయిన తరువాత యాకోబును చంపాలని ఏశావు ప్రణాళిక.

ఆమె, ఇస్సాకు యాకోబును పంపించి వేశారు

ఏశావు చేతిలోనుండి యాకోబును కాపాడాలని రిబ్కా కోరింది, కనుక యాకోబును పంపించి వేయాలని ఇస్సాకుతో మాట్లాడింది.

ఆమె బంధువులతో నివసించడానికి చాలా దూరం

అబ్రహాము సేవకుడు ఇస్సాకుకు భార్యగా తనను తీసుకొనివెళ్తున్నప్పుడు రిబ్కా నివసించిన ప్రదేశం ఇదే. దీనిని స్పష్టం చెయ్యడానికి “తాను ఒకప్పుడు నివసించిన ప్రదేశంలోని బంధువులు” అని జతచెయ్యవచ్చు. ఆ భూభాగం తూర్పువైపుకు అనేక వందల మైళ్ళ దూరంలో ఉంది.

ఆమె బంధువులు

ఈ వాక్యం “వారి బంధువులు” అని కూడా అనువదించవచ్చు. అబ్రహాము సోదరుడు రిబ్కా తాత, ఆమె బంధువులు కూడా ఇస్సాకు బంధువులే.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

07-07

ఆస్తిపరుడు

దీనిలో ధనం, విస్తారమైన పశువులు, ఇతర ఆస్తులు ఉన్నాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/rebekah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

07-08

ఇరువది సంవత్సరాల తరువాత

యాకోబు తన తల్లి నివసించిన ప్రదేశంలో ఇరువది సంవత్సరాలు జీవించాడు. అది స్పష్టంగా లేనట్లయితే, “తన బంధువులు ఉన్న ప్రదేశంలో ఇరువది సంవత్సరాలు నివసించిన తరువాత” అని చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

07-09

నీ సేవకుడు, యాకోబు

వాస్తవానికి యాకోబు ఏశావు సేవకుడు కాదు. అయితే తాను ఏశావు వద్దకు వినయంగానూ, గౌరవభావంతో రావాలని కోరుకుంటున్నట్లు చూపించడానికి తన సేవకులు ఏశావుతో పలకాలని వారితో చెప్పాడు, కనుక ఏశావు యాకోబు విషయంలో కోపంగా లేడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

07-10

నెమ్మదిగా జీవించాడు

ఏశావు యాకోబులు ఒకరిపట్ల ఒకరు కోపంగా లేకుండా, ఒకరితో ఒకరు ఘర్షణలు పడకుండా జీవించారని ఈ పదం సూచిస్తుంది.

అతనిని పాతిపెట్టారు

వారు భూమిని తవ్వారు అని అర్థం కావచ్చును. ఇస్సాకు దేహాన్ని దానిలో ఉంచారు, దానినంతటినీ మట్టితో లేక రాళ్ళతో నింపారు అని అర్థం కావచ్చును. లేక వారు ఇస్సాకు దేహాన్ని ఒక గుహలో ఉంచి దానిని ద్వారాన్ని మూసివేసారు ఆనే అర్థాన్ని ఇవ్వవచ్చు.

నిబంధన వాగ్దానాలు

ఇవి అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనలోని వాగ్దానాలు.

ఇస్సాకునుండి యాకోబుకు అందించబడ్డాయి

వాగ్దానాలు అబ్రహామునుండి తన కుమారుడు ఇస్సాకుకు వెళ్ళాయి, ఇప్పుడు ఇస్సాకు కుమారుడు యాకోబుకు వెళ్ళాయి. ఏశావు వాగ్దానాలను పొందలేదు. 06:04 కూడా చూడండి

..నుండి బైబిలు కథ

ఈ వచనాలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/esau]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]