తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

28-01

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించాడు. అనేక భాషలలో ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే వినియోగిస్తారు.

ధనవంతుడైన యవ్వన అధికారి

ఈ యువకుడు యవ్వన దశలో ఉండగానే ధనవంతుడుగానూ, శక్తివంతమైన రాజకీయ అధికారి గానూ ఉన్నాడు.

యేసు దగ్గరికి వచ్చాడు

అంటే, “యేసును సమీపించాడు.”

మంచి బోధకుడు

అంటే, “నీతిమంతుడైన బోధకుడు.” యేసు కేవలం నైపుణ్యంగల బోధకుడు అని మాత్రమే అని అనడం లేదు.

నిత్యజీవాన్ని కలిగియుండడానికి

అంటే, “నిత్యజీవాన్ని పొందడానికి” లేక “దేవునితో నిత్యమూ జీవించడానికి.” 27:01 చట్రంలో “నిత్యజీవం” పదం ఏవిధంగా అనువదించబడిందో చూడండి, అక్కడ దానిని సంబంధించిన వివరణను చూడండి.

నేను “మంచి” వాడినని ఎందుకు చెపుతున్నావు

తాను దేవుడను అనే అంశాన్ని యేసు తృణీకరించడం లేదు. దానికి బదులు యేసే దేవుడని ఆ అధికారి అర్థం చేసుకొన్నాడా అని ఆయన అడుగుతున్నాడు.

ఒక్కడే మంచివాడు ఉన్నాడు, ఆయనే దేవుడు.

ఈ వాక్యాన్ని “నిజంగా మంచిగా ఉన్న ఏకైక వ్యక్తి దేవుడు” లేక “దేవుడు ఒక్కడు మాత్రమే నిజంగా మంచివాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/other/teacher]]
  • [[rc://*/tw/dict/bible/kt/eternity]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]

28-02

నేను ఎవరికి విధేయత చూపించాలి?

అంటే, “నిత్యజీవాన్ని పొందడానికి ఏ శాసనాలు నాకు సరిపోతాయి?”

నిన్ను నీవు ప్రేమించుకొన్న విధంగా

అంటే, “నిన్ను నీవు ప్రేమించుకొన్నవిధంగా” లేక “నిన్ను నీవు ప్రేమించుకొన్న స్థాయిలో.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/adultery]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]

28-03

నేను బాలుడిగా ఉన్నప్పటినుండి

దీనిని “నేను చిన్నవాడుగా ఉన్న దగ్గరనుండి ఇప్పటి వరకూ” అని చెప్పవచ్చు

నేను ఇంకా ఏమి చెయ్యాలి?

అంటే, “నేను ఇంకా ఏమి చెయ్యాల్సి ఉంది” లేక “వీటికి తోడు నేను ఇంకా ఏమి చెయ్యాల్సి ఉంది?”

అతనిని ప్రేమించాడు

యేసుకి అతని మీద జాలి వేసింది. మనుష్యుల పట్ల దేవుడు కలిగియున్న ప్రేమతో నిలకడగా ఉన్న ప్రేమకు సరిపడే పదాన్ని చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]

28-04

నీవు

నీవు ఉద్దేశిస్తున్న మనుష్యుల సంఖ్యను బట్టి “నీవు” అనే పదం కోసం వివిధ పదాలను మీ భాషలో ఉంటాయి. ఏకవచన రూపాన్ని వాడండి. యేసు ఈ ఆజ్ఞను ఈ ఒక్క వ్యక్తితో చెపుతున్నాడు.

పరిపూర్ణమైన

అంటే, “సంపూర్ణంగా నీతిమంతుడు”

నీకు కలిగియున్నదంతా

అంటే, “నీ ఆస్తులన్నీ”

సంపద

ఈ పదం “సంపదలు” లేక “గొప్ప సంపద” అని అనువదించబడవచ్చు.

పరలోకంలో

ఈ పదం, “మీరు అక్కడికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఉంచబడింది.” “ఇక్కడ, ఇప్పుడు” ఉండే సంపదను విడిచి పెట్టమని యేసు యవ్వన అధికారిన్ని అడిగిన సంపదకు “అక్కడే, అప్పుడే” ఉండే సంపద వ్యతిరేకంగా ఉంటుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]

28-05

యేసు చెప్పిన దానిని విన్నాడు

అంటే, “తాను సొంతగా కలిగియున్న దానిని ఇచ్చివెయ్యమని యేసు చెప్పిన దానిని అతడు విన్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

28-06

దేవుని రాజ్యంలో ప్రవేశించండి

ఈ వాక్యం “దేవుని రాజ్యంలో పౌరునిగా మారాడు”

ఒంటె

ఒంటెలు చాలా పెద్ద జంతువులు, తరచుగా పెద్ద బరువులను మొయ్యడానిని వినియోగిస్తారు. మీ భాషలో ఒంటెలు తెలియక పోతే, “పెద్దజంతువులు” లేక “బరువులు మోసే జంతువు” అనే పదాలు వినియోగించవచ్చు. వేరొక జంతువు పదంతో మీరు మార్పు చెయ్యాలని ఎంచుకొన్నట్లయితే యేసు తన మాటలలో చెప్పిన “ఎద్దు” లేక “గాడిద” లాంటి జంతువుల పేర్లు వినియోగించేలా చూడండి, అవి ప్రజలకు తెలిసినవిగా ఉంటాయి.

సూది బెజ్జం

ఇది బట్టలను కుట్టే సూది చివరిలో ఉండే సన్నని రంధ్రాన్ని సూచిస్తుంది. ఒంటె లాంటి పెద్ద జంతువు ఒక సూది బెజ్జంలో వెళ్ళడం అంటే అసాధ్యమైన దానిని గురించి మాట్లాడుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

28-07

నిర్ఘాంత పోయాడు

అంటే, “చాలా ఆశ్చర్యపోయాడు.”

ఎవరు రక్షించబడగలరు

ఈ వాక్యం “ధనవంతులైన మనుష్యులు రక్షణ పొందలేక పోతే ఇంకా ఎవరైనా ఎలా రక్షించబడతారు?” ధనవంతులుగా ఉండడం దేవుని దయకు సూచన అని చాలా మంది విశ్వసిస్తారు.

రక్షించబడ్డారు

ఇక్కడ ఈ పదం దేవుని తీర్పు, పాపపు శిక్ష నుండి రక్షించబడడం అని సూచిస్తుంది, దేవుని రాజ్యంలో పౌరునిగా ఉండడానికి అనుమతించబడడం గురించి మాట్లాడుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]

28-08

మనుష్యులకు ఇది అసాధ్యం

అంటే, “ఈ పని చెయ్యడం మనుష్యులకు సాధ్యం కాదు” లేక “సాధారణ మనుష్యులు తమను తాము రక్షించుకోలేరు.”

దేవునితో సమస్తమూ సాధ్యమే

ఈ వాక్యాన్ని “దేవుడు దేనినైనా చెయ్యడానికి సమర్ధుడు, ధనవంతుడిని సహితం రక్షిస్తాడు” లేక “దేవుడు అసాధ్యమైన వాటిని చెయ్యడానికి సమర్ధుడు, కాబట్టి ఆయన ధనవంతులను కూడా రక్షించగలడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

28-09

సమస్తాన్ని విడిచిపెట్టి

అంటే, “”సమస్తాన్ని వెనుక విడిచిపెట్టి” లేక “మనం సొంతంగా కలిగియున్న దాన్నంతటినీ విడిచిపెట్టి.”

మా బహుమతి ఏమిటి?

ఈ వాక్యాన్ని “మేము ఎటువంటి బహుమానాన్ని పొందుతాం” లేక “దేవుడు బహుమతిగా మాకు ఏమి ఇయ్యబోతున్నాడు?” అని మరొక విధంగా అడగవచ్చు. “మనం దీనిని చేసాం గనుక” అని వాక్యాన్ని కూడా జత చెయ్యడం అవసరంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

28-10

విడిచి వెళ్ళాడు

అంటే, “”వెనక్కు వెళ్ళాడు” లేక “వదిలివేశాడు” లేక “దేవుని కంటే తక్కువ ప్రాముఖ్యత కలిగియున్నాడని యెంచాడు.”

నాకోసం

ఈ పదం “నా కారణంగా” లేక “నా పేరున” అని అనువదించబడవచ్చు

100 సార్లు

అంటే, “తనకు ఇంతకు ముందు ఉన్న దానికంటే చాలా ఎక్కువ.”

మొదటివారు అనేకులు చివరి వారు అవుతారు

అంటే, “ఇప్పుడు ముఖ్యులైన వారు అనేకులు తరువాత ముఖ్యులుగా ఉండరు.”

చివరివారుగా ఉన్న అనేకులు మొదటివారు అవుతారు

అంటే, “భూమి మీద చాలా ప్రాముఖ్యమైనవారుగా యెంచబడని వారు అనేకులు పరలోకంలో చాలా ప్రాముఖ్యమైనవారుగా ఎంచబడతారు” లేక “ఇప్పుడు భూమి మీద తక్కువ విలువగా ఎంచబడినవారు పరలోకంలో ఉన్నతమైన విలువ కలిగిన వారుగా ఎంచబడతారు.”

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని ఇతర బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/eternity]]