తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

22-01

ఆయన ప్రజలు

“ఆయన ప్రజలు, ఇశ్రాయేలియులు” లేదా “ఆయన ప్రజలు, యూదులు” అని అనువదించవచ్చు. అయితే ఈ ప్రజలు ఎవరు అనే దానిని స్పష్టంగా అర్థం చేసుకోకపోయినప్పుడు మాత్రమే జత చేసిన సమాచారాన్ని కలపండి.

400 సంవత్సరాలు గడిచిన తరువాత

మరోమాటలో చెప్పాలంటే, “400 సంవత్సరాలు గడిచాయి” లేదా “400 సంవత్సరాలు ఉన్నాయి.” పాత నిబంధన మలాకీ ప్రవక్త నుండి 400 సంవత్సరాలు గడిచాయి.

ఆయన వారితో మాట్లాడకుండా ఉన్నప్పుడు

అంటే, “తన ప్రజలకోసం దేవుడు ప్రవక్తలకు ఎటువంటి సందేశం ఇవ్వనప్పుడు”

దైవికమైన ప్రజలు

అంటే, “దేవునికి విధేయత చూపిన ప్రజలు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]

22-02

దేవదూత

22:01 చట్రంలో జెకర్యా దగ్గరకు వచ్చిన దేవదూతను సూచిస్తుంది.

పరిశుద్దత్మతో నింపబడ్డాడు

అంటే, “పరిశుదాత్మ వశము చేయబడ్డాడు” లేదా “పరిశుద్దాత్మ ద్వారా జ్ఞానం, శక్తి పొందాడు.”

ఇది జరుగుతుందని నాకు ఎలా తెలుస్తుంది?

“ఇది నిజంగా జరుగుతుందని నేను ఎలా తెలుసుకోగలను?” అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]
  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

22-03

గర్భవతి అయ్యింది

“గర్భం దాల్చింది” అని మర్యాదపూర్వకంగా చెప్పే విధానం కొన్ని భాషలలో ఉంటుంది. చదివే వారికి ఇబ్బందికరంగా ఉండకుండా ఉండేలాంటి వాక్యాన్ని వినియోగించండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]

22-04

6 నెలల గర్భవతి

ఆమె గర్భం దాల్చి ఆరు నెలలు దాటి ఉండవచ్చు లేదా ఆమె ఆరు నెలల గర్భవతిగా ఉండియుండవచ్చు.

గర్భవతి

గర్భవతిగా ఉండడం గురించి వివిధ భాషలలో వివిధ జాతీయాలు ఉంటాయి. “ఆమె బిడ్డతో ఉంది” లేక “ఆమె దేహంలో ఒక బిడ్డ ఉంది” లేక “ఆమెకు పొట్ట ఎత్తుగా ఉంది” మొదలైన జాతీయాలు. కొన్ని భాషలలో దాని గురించి మాట్లాడడానికి “ఆమె ఎదురు చూస్తుంది” లాంటి మర్యాదపూర్వక ప్రత్యేక విధానాలు ఉంటాయి.

ఎలీసబెతు

ఆమె జెకర్యా భార్య. ఎలీసబెతు కుమారునికి జన్మనిస్తుందని దేవదూత జెకర్యాకు చెప్పాడు.

ఎలీసబెతు బంధువు

అనేక అనువాదాలు ఇక్కడ “దాయాది” అని చెపుతున్నాయి, అయితే ఈ ఇద్దరు స్త్రీల ఏవిధంగా బంధువులో మనకు తెలియదు. “బంధువు” “దగ్గరివాడు” లేక “దాయాది” అనే సాధారణ పదం ఉపయోగించవచ్చు.

ప్రధానం జరిగింది

అంటే, “వాగ్దానం చేయబడింది”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/other/virgin]]
  • [[rc://*/tw/dict/bible/other/josephnt]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]

22-05

ఇది ఎలా జరుగుతుంది

అంటే, “నేను ఎలా గర్బవతి కాగలను?” మరియ దేవదూత మాటలను అనుమానించడం లేదు కానీ, అది ఎలా జరుగుతుందని అడుగుతుంది.

పరిశుద్దాత్మ నీ దగ్గరకు వస్తాడు, దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది.

ఒకే విషయాన్ని చెప్పడానికి రెండు విధానాలు ఉన్నాయి. “దేవుని శక్తి చేత పరిశుద్ధాత్ముడు ఆశ్చర్యకరంగా నీవు గర్భవతి అయ్యేలా చేస్తాడు.” ఈ అనువాదంలో అక్కడ ఎటువంటి భౌతిక సంబంధం లేదు అని అర్థం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/other/virgin]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/holy]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]

22-06

ఎలీసబెతు

22:04 చట్రంలో ఎలీసబెతుకు సంబంధించిన వివరణను చూడండి.

మరియ శుభవచనం ఎలీసబెతు వినగానే

కొన్ని భాషలలో “మరియ ఎలీసబెతుకు శుభవచనాలు చెప్పింది, వెంటనే ఎలీసబెతు ఆమె మాట విన్నది.” అని చెప్పడం మంచిది.

తన గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది

ఎలీసేబెతు మరియ శుభవచనములను వినగానే ఆమె గర్భంలోని శిశువు వెంటనే కదిలాడు.

దేవుడు వారికి ఏమి చేసాడు

దేవుని సహజాతీత చొరవ వలన ఆ ఇద్దరు స్త్రీలు గర్భవతులు అయ్యారు అని ఈ వాక్యం సూచిస్తుంది. పురుషుడు లేకుండానే మరియ గర్భం దాల్చింది. ఎలీసబెతు జకర్యా ద్వారా బిడ్డలను కనే సమయం గడచిన తరువాత గర్భం దాల్చింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

22-07

ఎలీసబెతు

22:04 చట్రంలో ఎలీసబెతుకు సంబంధించిన వివరణను చూడండి.

దేవుడిని స్తుతించండి

అంటే, “మనమందరం దేవుణ్ణి స్తుతించాలి.”

పిలువబడతారు

“పిలువబడతారు” లేక “తెలియబడతారు” అని మరొక విధానంలో దీనిని చెప్పవచ్చు. యోహాను వాస్తవానికి సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త అవుతాడు.

ప్రవక్త

అంటే, “చాలా ముఖ్యమైన ప్రవక్త.” బాప్తిస్మం ఇచ్చే యోహాను మెస్సీయాకు ముందు వచ్చే వ్యక్తిని గురించి పాత నిబంధనలోని ప్రవక్తల ద్వారా ముందుగా ప్రవచించబడిన ప్రవక్త.

అత్యన్నతుడైన దేవుడు

“అన్నిటి కంటే గొప్ప దేవుడు” లేక “సమస్తం మీద పాలన చేసే దేవుడు” అని మరొక విధంగా అనువదించవచ్చు.

..నుండి ఒక బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]
  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]