తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

03-01

చాలా కాలం తరువాత

ఈ వృత్తాంతం సృష్టి తరువాత అనేక తరాలకు (వందలాది సంవత్సరాలు) జరిగింది.

చాలా చెడిపోయిఉంది, బలాత్కారంతో నిండియుంది.

“చెడిపోయి ఉన్నారు, బలాత్కార క్రియలు చేసారు” అని అనడం సహజంగా ఉంటుంది.

చాలా చెడుగా మారింది

“దేవునికి వ్యతిరేకంగా ప్రజలు హానికరమైన, దుర్మార్గమైన రీతిలో ప్రవర్తిస్తున్నారు” అని అనడం మరింత స్పష్టంగా ఉంటుంది.

నాశనం చెయ్యాలని నిర్ణయించాడు

భూమి సంపూర్తిగా నాశనం అయ్యింది అని అర్థం కాదు. ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యాలనీ, అటువంటి దుష్టత్వాన్నీ, బలత్కారాన్నీ కలుగచేయాలని నిశ్చయించిన ప్రజలందరినీ నాశనం చెయ్యాలని దేవుడు ఉద్దేశించాడు.

పెద్ద జలప్రళయం

చాలా లోతైన నీరు భూమిని నింపివేసింది, సహజంగా ఆరిన భూమి ఉన్న ప్రదేశాలూ, అత్యంత ఎత్తైన పర్వతాల కొనలను సహితం నింపివేసింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

03-02

దయను పొందాడు

దేవుడు నోవహు విషయంలో సంతోషించాడు, ఎందుకంటే అతడు దేవునికి భయపడ్డాడు, దేవునికి విధేయత చూపాడు. నోవహు పాపరహితుడు కాకపోయినా దేవుడు అతని పట్ల కృపచూపాడు, అతని కుటుంబాన్ని విధ్వంసకరమైన జలప్రళయంనుండి కాపాడడానికి ప్రణాళిక తయారు చేసాడు. నోవహు యోగ్యుడుగా ఇక్కడ కనిపించడం లేదు అని గుర్తించండి. లేక అతడు ఒక్కడే తప్పించుకోడానికి జరిగింది అని తలంచవద్దు. దానికి బదులు ఇది దేవుని ఎంపిక అని గుర్తించండి.

జలప్రళయం

దీనిని 03:01 లో ఏ విధంగా అనువదించారో చూడండి.

పంపించడానికి తలస్తున్నాడు

అధికమైన వర్షాన్ని పంపించడం ద్వారా భూమిని నింపి వెయ్యడానికీ లోతైన నీటిని కలుగజెయ్యడానికీ దేవుడు ప్రణాళిక చేసాడు. అంటే అధికమైన వర్షం పడేలా చెయ్యడం ద్వారా జలప్రళయం కలిగేలా ప్రణాళిక చేసాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/noah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]

03-03

ఓడ

ఎనిమిది మంది వ్యక్తులూ, ప్రతీ విధమైన జంతువుల జంట, ఒక సంవత్సరం పాటు వాటికి ఆహారం కలిగియుండేంత పెద్దదిగా ఓడ ఉంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/noah]]

03-04

నోవహు హెచ్చరించాడు

పాపం కారణంగా దేవుడు లోకాన్ని నాశనం చెయ్యడానికి ప్రణాళిక చేసాడని ప్రతీ ఒక్కరికీ నోవహు చెప్పాడు.

దేవుని వైపు తిరిగాడు

దీని అర్థం వారు పాపం చెయ్యడం నిలిపివెయ్యాలని, దేవునికి విధేయత చూపించాలని అర్థం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/noah]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

03-05

సమాచారం

_(ఈ చట్రానికి నోట్సు లేదు)

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/noah]]

03-06

దేవుడు పంపాడు

నోవహు జంతువుల కోసం వెదకనవసరం లేదు. దేవుడే వాటిని అతని వద్దకు పంపాడు.

బలుల కోసం వినియోగించాడు

“దేవునికి దహనబలి కోసం అంగీకృతమైన జంతువులు” అని చెప్పడం కొన్ని భాషలలో సరియైనదిగా ఉండవచ్చు. మనుష్యులు ఆయనకు జంతువులను దహనబలిగా అర్పించాలని దేవుడు నిర్ణయించాడు. అయితే కొన్ని విధాలైన జంతువులను మాత్రమే అర్పించడానికి ఆయన అనుమతించాడు.

దేవుడు తానే తలుపును మూసివేశాడు

దేవుడే ద్వారాన్ని మూసివేశాడని నొక్కి చెపుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/noah]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]

03-07

వర్షం, వర్షం, వర్షం

అసాధారణ, విస్తారమైన వర్షం ఉందని ఇది నొక్కి చెపుతుంది. ఇతర భాషలు దీనిని మరోవిధంగా నొక్కి చెప్పవచ్చు.

ప్రచండ వర్షం

దాని అర్థం అధిక మొత్తంలో నీరు వెలుపలికి వస్తుందని సూచిస్తుంది.

భూమి అంతా మునిగిపోయింది

జలప్రళయం నుండి నీటితో భూమి అంతా నిండిపోయింది అని సూచిస్తుంది.

03-08

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/death]]

03-09

వర్షం నిలిచిపోయింది

“వర్షం పడడం నిలిచిపోయింది” అని కూడా అనువదించవచ్చు.

ఓడ నిలిచింది

వర్షంనుండి అధికమైన జలం వచ్చింది, అది పర్వతాలను ముంచివేసింది. పర్వతాల మీదుగా ఓడ తేలియాడుతూ ఉంది. నీరు ఇంకిపోతున్నప్పుడు ఓడ నీటితో పాటుగా కిందకు వెళ్లి ఒక పర్వతం మీద నిలిచిపోయింది.

మూడు నెలలు

తరువాత మూడు నెలల కాలంలో నీరు కిందకు దిగుతూ ఉంది.

కొండల శిఖరాలు కనబడ్డాయి.

“కనిపిస్తూ ఉన్నాయి” లేక “ప్రత్యక్షం అయ్యాయి” లేక “కనపడవచ్చు” అని మరో విధంగా అనువదించవచ్చు. “మూడు నెలల తరువాత నీరు తగినంతగా కిందకు ఇంకిపోయింది తద్వారా నోవహు, అతని కుటుంబం స్పష్టంగా పర్వతాల అంచులను చూడగల్గారు.

03-10

కాకి

ఎగిరే నల్లని పక్షి. రకరకాల మొక్కలు, జంతువుల ఆహార పదార్ధాలను తింటూ ఉంటుంది. కుళ్ళిపోయిన దేహాలు, చనిపోయిన జంతువులను కూడా తింటుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/noah]]

03-11

పావురం

తెలుపు రంగు లేదా బూడిదరంగులో ఎగిరే చిన్న పక్షి. విత్తనాలనూ లేక ఫలాలను తింటుంది.

ఒలీవచెట్టు ఆకు

ఒలీవ చెట్టు ఫలం నూనెను కలిగియుంటుంది. మనుష్యులు దీనిని వంటకు వినియోగిస్తారు లేదా శరీరాల మీద రాయడానికి వినియోగిస్తారు. “ఒలీవ కొమ్మ” అనే పదం మీ భాషలో లేనట్లయితే “ ‘ఒలీవ’ అనే చెట్టు నుండి ఒక కొమ్మ” లేక “ఒక నూనె చెట్టు కొమ్మ” అని మీరు అనువదించవచ్చు.

నీళ్ళు భూమి మీద నుండి ఇంకిపోయెను

“నీరు వెళ్ళిపోతుంది” లేక “నీటి స్థాయి తగ్గిపోతుంది” అని మీ భాషలో చాలా సాధారణంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/noah]]

03-12

ఏడు దినములు ఎదురు చూచాడు

“ఇంకా ఏడు రోజులు ఎదురు చూచాడు” అని చెప్పవచ్చు. “ఎదురు చూచాడు” అనే పదం నోవహు వరద నీరు తగ్గిపోడానికి సమయం ఇస్తున్న దాన్ని సూచిస్తున్నది. ఆపైన పావురాన్ని వదలవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/noah]]

03-13

రెండు నెలల తరువాత

అంటే ఓడలోనుండి నోవహు ఒక పావురాన్ని బయటికి పంపిన రెండు నెలల తరువాత అని అర్థం. ఇది స్పష్టంగా లేనట్లయితే దానిని వివరాణాత్మకంగా చెప్పడం అవసరం.

బహుగా పిల్లల్ని పొందండి.

ఇది దేవుని ఆజ్ఞ, ఆయన అభిలాష అని స్పష్టంగా చెప్పడానికి మీరు “మీరు ఎక్కువ మంది పిల్లలను కనండి” లేక “మీరు ఎక్కువమంది పిల్లల్ని కలిగియుండాలని నేను కోరుతున్నాను”

భూమి అంతటా విస్తరించండి

ఇది స్పష్టంగా లేకపోయినట్లయితే “మనుష్యులతో భూమిని నింపండి” లేక “కాబట్టి భూమి మీద అనేకులు నివసిస్తారు” అని చెప్పడం అవసరం

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/noah]]

03-14

దహనబలి కోసం వినియోగించే పశువు

“ప్రజలు ఆయనకు దహనబలి కోసం వినియోగించగల్గుతారు” అని మరొక విధానంలో చెప్పవచ్చు.

దేవుడు సంతోషించాడు

ఈ జంతువులను బలిగా అర్పించడంలో దేవుడు సంతోషించాడు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/noah]]
  • [[rc://*/tw/dict/bible/kt/altar]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

03-15

మరల చెయ్యను

“మరల ఎన్నటికీ జరగదు” లేక, “ఏ సమయంలోనైనా మరలా జరగదు” లేక “నిజానికి మరలా జరగదు” అని అర్థం. ఉదాహరణలు: “భూమిని నేను మరల శపించను.” లేక “ఏ సమయంలోనూ నేను భూమిని తిరిగి శపించను.” లేక “నిజానికి నేను మరల భూమిని శపించను.”

భూమిని శపించడం

భూమీ, దానిలోని జీవులూ మనిషి పాపం కారణంగా శ్రమను అనుభవించారు.

భూమినంతటినీ

ఈ మాట భూమినీ, దానిలో నివసిస్తున్న కీటకాలనూ సూచిస్తుంది.

నరులు వారి బాల్యంనుండి పాపయుక్తంగా ఉన్నారు

“నరులు తమ పూర్తి జీవితాలలో పాపయుక్తమైన కార్యాలు చేస్తున్నారు” అని కూడా చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/curse]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

03-16

ధనుస్సు

వివిధ రంగులతో విల్లు ఆకారంలో ఉన్న కాంతి, తరచుగా గాలివాన వచ్చిన తరువాత ఆకాశంలో కనిపిస్తుంది.

ఒక గురుతు

ఒక గురుతు (ఒక వస్తువు లేక సంఘటన లాంటిది) అంటే ఒక విధమైన అర్థాన్ని ఇస్తుంది లేక సత్యమైన దానినీ లేక జరగబోయే దానినీ చూపిస్తుంది.

నిబంధనకు గురుతుగా

“ఆయన వాగ్దానం చేసాడని చూపించడానికి” అని కొన్ని భాషలలో చెప్పడం సరియైనది.

ప్రతీ సమయం

దీని అర్థం ఆ సమయం మొదలు ధనుస్సు కనిపించిన ప్రతీసారీ అని స్పష్టంగా తెలుస్తుంది. “అప్పటినుండి, ప్రతీ సారీ” అని జత చెయ్యడం అవసరం.

ఆయన వాగ్దానం చేసినది

జలప్రళయంతో భూమిని ఇక మీదట తిరిగి ఎన్నటికీ నాశనం చెయ్యనని దేవుడు వాగ్దానం చేసిన గత చత్రనాన్ని సూచిస్తుంది.

...నుండి బైబిలు కథ

ఈ సూచనలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]