తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

40-01

ఆయన్ని దూరంగా నడిపించారు

అంటే, "వారితో వెళ్ళడానికి బలవంతం చేశారు." దీనిని "ఆయనను తీసుకు వెళ్లారు" అని కూడా అనువదించవచ్చు.

ఆయనను సిలువ వేయడానికి

అంటే, "ఆయనను సిలువపై చంపడానికి."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/mock]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]
  • [[rc://*/tw/dict/bible/kt/cross]]

40-02

కపాలo

యెరూషలేంకు దగ్గరగా తెల్లని రాతి పైభాగంతో పుర్రె ఆకారంలో ఉన్న ఒక కొండ.

వారిని క్షమించండి, ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు

అంటే, "వారు ఏమి చేస్తున్నారో వారికి అర్థం కాలేదు, కాబట్టి దయచేసి వారిని క్షమించండి." సైనికులు యేసు చనిపోయే అర్హత కలిగిన నేరస్థుడని మాత్రమే భావించారు. ఆయన దేవుని కుమారుడని వారికి అర్థం కాలేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/cross]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingofthejews]]

40-03

యేసు వస్త్రాల కోసం చీట్లు వేశారు

అంటే, "యేసు వస్త్రాలు గెలుచుకోవడం కోసం ఆట ఆడారు." వారు దీన్ని ఎలా చేశారో మనకు తెలియదు, కానీ కొన్ని సంస్కృతులలో దీనిని "యేసు దుస్తులను గెలవడానికి నేలమీద రాళ్ళును పాచికలుగా విసిరారు" లేదా "యేసు దుస్తులను ఎవరు తీసుకోవాలో నిర్ణయించడానికి పాచికలవంటి కర్రలను ఎంచుకున్నారు" అని అనువదించవచ్చు.

వారు చెప్పబడిన ప్రవచనాన్ని నెరవేర్చారు

అంటే, "చాలా కాలం క్రితం లేఖనాలలో మెస్సీయకు ఏమి జరుగుతుందని చెప్పబడిందో, దానిని వారు చేసారు" లేదా "ప్రవక్త ఒకరు చాలా కాలం క్రితమే వ్రాసినట్లుగా వారు చేసారు."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

40-04

ఇద్దరు దొంగలు

దీనిని "ఇద్దరు బందిపోట్లు" అని కూడా అనువదించవచ్చు. వస్తువులను దొంగిలించడానికి బలాన్ని, లేదా హింసను ఉపయోగించిన నేరస్థులను ఇది సూచిస్తుంది.

దేవుని భయం నీకు లేదా?

దొంగ ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆశించలేదు; ఇది కొన్ని భాషలలో బలంగా తెలియచేయడానికి ఉపయోగించే విధానం. మీ భాషలో ఈ విధంగా ప్రశ్నలను ఉపయోగించకపోతే, అప్పడు దీనిని "మీరు దేవునికి భయపడాలి!" అని అనువదించండి.

మనం దోషులు, ఈయన నిర్దోషి

దీనిని ఈ విధంగా అనువదించవచ్చు, "నీవూ, నేనూ చెడు పనులు చేసాము, అందువల్ల మనం చావడానికి తగినవారం, కాని యేసు అనే ఈ మనిషి ఏ తప్పు చేయలేదు, చనిపోయే అవసరం ఈయనకు లేదు." ఇక్కడ "మేము" అనేది, ఇద్దరు దొంగలను చూపుతుంది, కాని ఇందులో యేసును చేర్చలేదు.

ఈ మనిషి

ఈ మాట యేసును సూచిస్తుంది.

దయచేసి నన్ను గుర్తుంచుకో

అంటే, "దయచేసి నన్ను అంగీకరించు" లేదా, "దయచేసి నన్ను స్వాగతించు" లేదా, "దయచేసి, నీతో ఉండటానికి నన్ను అనుమతించండి." ఇక్కడ "గుర్తుంచుకో" అంటే ఏదో మర్చిపోయిన తర్వాత, దానిని గుర్తుకు తెచ్చుకోవడం కాదు. వినయపూర్వకమైన అభ్యర్థనను తెలియజేసే విధంగా దీనిని అనువదించండి.

నీ రాజ్యంలో

అంటే, "నీవు నీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు" లేదా, "నీవు రాజుగా పరిపాలించేటప్పుడు."

పరదైసు

ఇది "స్వర్గం/పరలోకం"కు మరొక పేరు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]
  • [[rc://*/tw/dict/bible/other/mock]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/guilt]]
  • [[rc://*/tw/dict/bible/kt/innocent]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

40-05

నిన్ను నమ్ముతున్నాను

అంటే, "నీ యందు నమ్మకం ఉంచుతున్నాను" లేదా, "నీవు మెస్సీయ అని నమ్ముతున్నాను."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/other/mock]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/cross]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]

40-06

సమాచారం

ఈ చట్రంలో గమనికలు లేవు.

40-07

సమాప్తమైంది!

"పూర్తయింది", లేదా "నేను పూర్తి చేశాను", లేదా "నేను పనిని పూర్తి చేసాను" అని కూడా దీనిని అనువదించవచ్చు. రక్షణకు సంబంధించిన యేసు చేసిన పని పూర్తయిందని దీని అర్థం.

నీ చేతుల్లోకి

అంటే, "నీ వశంలోకి."

తల వాల్చాడు

అంటే, "తన తలను వంచాడు."

తన ఆత్మను అప్పగించుకున్నాడు

అంటే, "తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు" లేదా, "తన ఆత్మను దేవునికి విడిచిపెట్టి, మరణించాడు."

పెద్ద తెర

ఇది ఆలయంలో వేలాడదీసిన పెద్దదైన, ఒక బలమైన అల్లిక వస్త్రం. ఇది ఒక గదిని, మరొక గది నుంఛి వేరుచేసే గోడలా, అడ్డంగా ఉంది. దీనిని "మందపాటి పరదా" లేదా, "వ్రేలాడుతున్న అల్లిక వస్త్రం" లేదా, "తెర" అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/spirit]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]

40-08

ఆయన మరణం మూలంగా

అంటే, "ఆయన మరణం ద్వారా" లేదా, "మరణించడం ద్వారా."

ఒక మార్గం తెరవబడింది

అంటే, "అది సాధ్యమైంది."

దేవుని వద్దకు రండి

అంటే, "దేవుని దగ్గరికి రండి" లేదా, "దేవునికి దగ్గరగా వెళ్ళు" లేదా, "దేవుణ్ణి సంప్రదించు" లేదా, "దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకో." పరదా చిరిగి పోవటం దేవునికీ, ప్రజలకూ మధ్యన ఉన్న అడ్డంకిని తొలగినట్లు చూపుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/innocent]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]

40-09

యోసేపు

ఇతను మరియ భర్త కాడు. యోసేపు అనే పేరున్న మరో వ్యక్తి.

యేసు శరీరం కోసం పిలాతును అడిగాడు

అంటే, "యేసు మృతదేహాన్ని సిలువపై నుండి క్రిందికి దింపి తీసుకెళ్లడానికి అనుమతించమని పిలాతును కోరాడు."

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలకు స్వల్పంగా భిన్నమైనవిగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]