తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

23-01

అతడు తన బిడ్డ కాదని అతనికి తెలుసు

అంటే, “ఆ బిడ్డ పుట్టడానికి తాను కారణం కాదని అతనికి తెలుసు.”

మరియను అవమానపరచడం

అంటే, “మరియను బహిరంగంగా అవమాన పరచడం ఇష్టం లేదు” లేక “బహిరంగంగా మరియను ఇబ్బంది పెట్టడం.” ఆమె వ్యభిచారం ద్వారా గర్భం దాల్చినట్లుగా కనపడుతున్నప్పటికీ యోసేపు మరియ పట్ల కరుణ చూపాడు.

గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు విడాకులు ఇవ్వడానికి ఆలోచించాడు

“ఎందుకు అని ఇతరులకు చెప్పకుండా ఆమెతో విడిపోదాం అనుకున్నాడు” లేదా, “ఆమె గర్భం గురించి ఇతరులకు చెప్పకుండా ఆమెతో విడిపోదామనుకున్నాడు” అని కూడా అనువదించవచ్చు. యోసేపు నీతిమంతుడు కాబట్టి, సాధ్యమైనంత వరకు ఈ పరిస్థితిని పరిష్కరించాలని చూచాడు. ఇది ఆ సంస్కృతిలో మౌనంగా విడాకులు ఇవ్వడమే.

ఆమెతో విడిపోవడం

“ప్రధానం రద్దు చేసుకోవడం” అని కొన్ని బాషలలో చెప్పడానికి ఇది మంచిదిగా ఉండవచ్చు. యోసేపు మరియలు ప్రధానం చెయ్యబడ్డారు లేదా “వివాహానికి ప్రతిజ్ఞ చేయబడినవారు”. అయితే యూదా సంస్కృతిలో ప్రధానాన్ని రద్దు చెయ్యడానికి విడాకులు అవసరం.

కలలో

అంటే, “అతను నిద్రలో కలకంటుండగా.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]
  • [[rc://*/tw/dict/bible/other/josephnt]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/dream]]

23-02

మరియను నీ బార్యగా అంగీకరించడానికి భయపడవద్దు

“మరియను పెళ్లి చేసుకోవద్దు అని ఆలోచించడం ఆపమని” లేదా “మరియను నీ భార్యగా పొందడానికి సందేహించ వద్దని” అని కూడా దీనిని అనువదించవచ్చు.

పరిశుదాత్మ నుండి కలిగింది

అంటే, “పరిశుద్దాత్మ ఆశ్చర్యకార్యం ద్వారా గర్భవతి అయ్యింది.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/josephnt]]
  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

23-03

అతను ఆమెతో కలిసి నిద్రించలేదు

అంటే, “ఆమెతో ఎటువంటి శారీరక సంబంధం అతను కలిగియుండలేదు.” బిడ్డ పుట్టే దాకా ఆమెను అతను కన్యకగానే ఉంచాడు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephnt]]
  • [[rc://*/tw/dict/bible/other/mary]]

23-04

ప్రసవానికి మరియకు సమయం దగ్గర పడినప్పుడు

అంటే, “మరియ గర్భానికి ముగింపు వచ్చినప్పుడు.”

రోమా ప్రభుత్వం

ఆ సమయంలో రోమా ప్రభుత్వం ఇశ్రాయేలీయులను జయించి వారిని స్వాధీన పరచుకొని పాలిస్తుంది.

జనాభా లెక్కల కోసం

అంటే, “ప్రభుత్వ గణాంకాలలో లెక్కించబడానికి” లేక “ప్రభుత్వం వారి పేర్లను తమ జాబితాలో రాయడానికి” లేక “ప్రభుత్వం చేత లెక్కించబడడానికి.” ఈ గణాంకాలు ప్రజల మీద పన్ను విధించడానికి బహుశా జరిపియుండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/other/rome]]
  • [[rc://*/tw/dict/bible/other/josephnt]]
  • [[rc://*/tw/dict/bible/other/nazareth]]
  • [[rc://*/tw/dict/bible/other/bethlehem]]
  • [[rc://*/tw/dict/bible/other/david]]

23-05

ఉండటానికి స్థలం లేదు

అంటే, “ఉండటానికి మామూలు స్థలం లేదు.” ఎందుకంటే ఆ సమయంలో బెత్లెహేము ప్రజా సమూహంతో నిండిపోయింది. అతిధులకు సహజంగా ఉండే గదులు ప్రజలతో నిండిపోయాయి.

పశువులు ఉండే స్థలం

ఇది పశువులను పెట్టె స్థలం మనుషులు ఉండే స్థలం కాదు. ఈ పదం సాధారణంగా పశువులను ఉంచే స్థలాన్ని సూచించే పదాన్ని అనువాదంలో వినియోగించాలి.

పశువుల తొట్టె

అంటే, “పశువుల ఆహారపు పెట్టె” లేదా, “పశువులను మేపడానికి ఉపయోగించే చెక్క లేదా రాతి డబ్బా.” ఈ పెట్టెలో శిశువు పండుకోడానికి మెత్తటి ఉపరితలం సమకూర్చడానికి దానిని గడ్డితో నింపవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/bethlehem]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

23-06

వారి మందను కాస్తున్నారు

“మంద” అంటే గొర్రెల గుంపు. గొర్రెల కాపరులు గొర్రెలకు ఏ హానీ, అపాయం కలగకుండా వాటిని కాపాడుతూ భద్రపరుస్తున్నారు.

మెరుస్తున్న దేవదూత

“నిండు వెలుగుతో చట్టుబడిన దేవదూత” అని దీనిని అనువదించవచ్చు. రాత్రి చీకటికి భిన్నంగా మెరుస్తున్న వెలుగు మరింత కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది.

వారు భయపడ్డారు

అసాధారణ దేవదూత దర్శనం మరింత భయాన్ని కలిగించింది.

భయపడకుడి

“భయపడడం ఆపండి” అని తరచుగా దీని అర్ధం. దేవదూత చూసినప్పుడు గొర్రల కాపరులు చాల భయపడ్డారు కాబట్టి వారు భయపడనవసరం లేదని దూత చెప్పాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/shepherd]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/other/bethlehem]]

23-07

సమాచారం

దేవదూత మాట్లాడడం కొనసాగించాడు

పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు

పొడవాటి గుడ్డముక్కలతో కొత్తగా జన్మించిన బిడ్డను గట్టిగా చుట్టడం అప్పటి ఆచారం. “సాంప్రదాయ బద్దంగా పొడవాటి గుడ్డలతో చుట్టబడ్డాడు” అని చెప్పడం అవసరం.

పశువుల తొట్టె

అంటే, “పశువుల ఆహారపు పెట్టె.” 23:05 చట్రంలో ఇది ఎలా అనువదించబడిందో చూడండి.

దేవదూతలతో నిండియుంది.

ఆకాశాన్ని నింపే అంత పెద్ద సంఖ్యలో దేవదూతలు ఉన్నారని దీనికి అర్ధం.

దేవునికి మహిమ

“అందరం దేవున్ని మహిమపరుద్దాం!” లేదా, “మహిమ, ఘనతలు ఆయనకే చెల్లును!” లేదా, “మనమందరం దేవున్ని మహిమ పరుద్దాం!”

భూమిపై సమాధానము

మరోమాటలో “భూమిమీద సమాధానం ఉండునుగాక” అని చెప్పవచ్చు.

ఆయనకు ఇష్టులైన వారికి

“దేవుడు దయతోనూ, ఆనందంతోనూ, అభయంతోనూ చూచే మనుషులు,

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/glory]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]

23-08

అందరు దానిని విన్నారు, చూసారు

అంటే, “వారు విననట్టి, చూనట్టి ప్రతీదానిని.” దీనిలో మహిమాయుక్తమైన దేవదూతలూ, వారి ఆశ్చర్యకరమైన సందేశం, మెస్సీయను కన్నులారా చూడడం ఉన్నాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/shepherd]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/other/mary]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

23-09

కొంత సమయం తరువాత

యేసు పుట్టిన తర్వాత, జ్ఞానులు నక్షత్రం చూడడానికి ముందు ఎంత కాలమైనదో స్పష్టంగా తెలియదు, అయితే వారు తమ ప్రయాణానికై సిద్దపడటానికీ, బెత్లెహేము ప్రయాణం చెయ్యదానికీ వారికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టియుండవచ్చు.

జ్ఞానులు

“జ్ఞానులు” అంటే బహుశా నక్షత్రాలను అధ్యయనం చేసిన ఖగోళ శాస్త్రజ్ఞులు కావచ్చును. మెస్సీయ జననం గురించి ముందుగా గమనించి చెప్పిన పాతనిబంధన ప్రవక్తల రచనలను కూడా వారు అధ్యయనం చెయ్యగలిగారు.

అసాధారణమైన నక్షత్రం

వారు చూసిన నక్షత్రం సాధారణ నక్షత్రం కాదు. యేసు జననమప్పుడు ప్రత్యక్షం అయిన నక్షత్రం.

వారు గుర్తించారు

కొన్ని బాషలు “ఈ జ్ఞానులు తమ అధ్యయనాలనుండి వారు గుర్తించారు” అని జత చెయ్యవచ్చు.

ఇల్లు

వారు ఆయన పుట్టిన ఆ పశువుల శాలలో వారు నివసించడం లేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/wise]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingofthejews]]
  • [[rc://*/tw/dict/bible/other/bethlehem]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

23-10

జ్ఞానులు

23:09 చట్రంలో దీనిని మీరు ఏవిధంగా అనువదించారో చూడండి.

సాగిలపాడి

అంటే, నేలమట్టుకు సాగిలపడ్డారు”.” ఆ కాలంలో ఇది గొప్ప గౌరవం, భక్తి చూపించడం సాంప్రదాయ విధానం.

విలువైన

అంటే, “చాలా చాల విలువైనది”

..నుండి ఒక బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]