తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

35-01

ఒకరోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది, అయితే నిర్దిష్టమైన సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే కలిగియుంటాయి.

సుంకం వసూలు చేసేవారు

సుంకం వసూలు చేసేవారు పాపులలో అత్యంత హీనులుగా ఎంచబడతారు. ఎందుకంటే తరచుగా వారు ప్రభుత్వానికి కావలసిన దానికంటే అధికంగా పన్ను వసూలు చేస్తారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/taxcollector]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

35-02

కథ

దేవుని రాజ్యం గురించిన సత్యాలు బోధించడానికి యేసు ఈ కథను వినియోగించాడు. సంఘటనలు వాస్తవంగా జరిగాయా లేదా అనేది స్పష్టంగా లేదు. కల్పితం, వాస్తవ కథలను రెంటినీ కలిపి చెప్పే పదం మీ భాషలో ఉన్నట్లయితే దానిని ఇక్కడ మీరు వినియోగించాలి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

35-03

సమాచారం

యేసు కథను చెపుతున్నాడు

నీ స్వాస్థ్యం

ఈ పదాన్ని “నీవు చనిపోయినప్పుడు నీ సంపదలోని భాగం న్యాయబద్ధంగా నాకు చెందుతుంది.

ఆస్తి

అంటే “సంపద” లేక “ఆస్తులు.” ఈ ఆస్తిలో బహుశా భూమి, పశువులు, డబ్బు ఉండి ఉంటాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/inherit]]

35-04

సమాచారం

యేసు కథను చెప్పడం కొనసాగిస్తున్నాడు

తన ధనాన్ని వ్యర్ధపుచ్చాడు

అంటే, “తన డబ్బునంతా ఎటువంటి విలువలేని వాటికోసం చెల్లించాడు.” కొన్ని భాషలలో ఈ వాక్యాన్ని “తన డబ్బునంతా పారవేశాడు” లేక “డబ్బంతా తినివేశాడు” అని అనువదించవచ్చు.

పాపయుక్తమైన జీవితం

అంటే, “పాపయుక్తమైన కార్యాలు చేస్తున్నాడు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

35-05

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

తీవ్రమైన కరువు కలిగింది

అంటే, “ఆహారం కొరత ఉంది.” కొన్ని భాషలలో దీనిని “అక్కడ తీవ్రమైన కరువు కలిగింది” అని అనువాదం చెయ్యవచ్చు.

ఆహారం కొనడానికి డబ్బులేదు

కరువు కారణంగా, ఆహారం చాలా ఖరీదుగా ఉంది, అతను అప్పటికే తన డబ్బు అంతా ఖర్చుచేసాడు.

ఉద్యోగం

డబ్బుకు ప్రతిగా మరొకదాని కోసం తాను చేసిన దానిని సూచిస్తుంది. ఇది స్పష్టంగా లేకపోయినట్లయితే ఈ వాక్యాన్ని “కొంత డబ్బును సంపాదించడం కోసం, తాను ఒక ఉద్యోగాన్ని తీసుకొన్నాడు” అని ఆరంభించవచ్చు.

పందులను మేపడం

అంటే, “పందులకు ఆహారం పెట్టడం.” ఈ కాలంలో అత్యంత హీనమైన ఉద్యోగంగా ఇది యెంచబడింది. తక్కువ స్థాయి ఉద్యోగాలను సూచించే పదం మీ భాషల్లో ఉన్నట్లయితే ఆ పదాన్ని వినియోగించండి.

35-06

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

నేను ఏమి చేస్తున్నాను?

అంటే, “ఎందుకు నేను ఇలా జీవిస్తున్నాను?” లేక “నేను ఈ రీతిగా జీవించకూడదు!” లేక “ఈ రీతిగా జీవించడంలో అర్థం లేదు.” కుమారుడు నిజంగా ఒక ప్రశ్న అడగడం లేదు, కాబట్టి కొన్ని భాషలు దీనిని ఒక వాక్యంగా అనువదించవు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]

35-07

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

ఇంకా దూరంగా ఉండగానే

ఈ వాక్యాన్ని “తండ్రి ఇంటికి కనుచూపు మేరలో, ఇంకా దూరంగా ఉన్నప్పుడే.” కుమారుడు తండ్రికి సమీపం అవుతున్నాడు, అయితే ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఇంటిలో ఎక్కువమంది అతనిని చూడలేదు. కుమారుడు వేరే దేశంలో ఉన్నాడని అనిపించకుండా ఉండేలా చూడండి.

జాలి పడి

అంటే, “లోతైన ప్రేమ చూపాడు, జాలి చూపాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/son]]

35-08

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాను, నీకు వ్యతిరేకంగా పాపం చేసాను.

ఈ వాక్యాన్ని, “దేవునికి వ్యతిరేకంగా పాపం చేసాను, నీకు వ్యతిరేకంగా కూడా పాపం చేసాను.”

నేను యోగ్యుడను కాను

“కాబట్టి నేను యోగ్యుడను కాను” అని చెప్పే అవకాశం కూడా ఉంది, లేక “ఫలితంగా నేను యోగ్యుడను కాను.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

35-09

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

కొవ్విన దూడ

ఈ వాక్యాన్ని “కొవ్విన దూడ.” అని అనువదించవచ్చు. ఇది కొవ్వినదిగా ఉంది, దీనిని వండినప్పుడు ఇది చాలా రుచికరంగానూ, శ్రేష్ఠమైనదిగానూ ఉంటుంది.

నీ కుమారుడు చనిపోయాడు, అయితే ఇప్పుడు సజీవుడిగా ఉన్నాడు!

అంటే, “ఇతడు చనిపోయిన నా కుమారుని వలే ఉన్నాడు, ఇప్పుడు మరల బ్రతికాడు” లేక “నా కుమారుడు చనిపోయాడని నేను చాలా దుఃఖపడ్డాను, అయితే ఇప్పుడు నేను సంతోషిస్తున్నాడు, ఎందుకంటే అతడు తిరిగి జీవంలోనికి వచ్చినట్టు ఉంది!” తన చిన్న కుమారుడు ఇంటికి వచ్చిన కారణంగా తాను ఎంత సంతోషంగా ఉన్నాడో చూపించడానికి ఈ మాటలు చెపుతున్నాడు.

అతడు తప్పిపోయాడు, అయితే ఇప్పుడు దొరికాడు!

అంటే, “నేను నా కుమారుడిని కోల్పోయినట్లుగా ఉంది,అయితే నేను ఇప్పుడు అతనిని కనుగొన్నాను.” తన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినందుకు తండ్రి యెంత సంతోషంగా ఉన్నాడో చూపించడానికి ఈ మాటలు చెపుతున్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

35-10

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

చాలా కాలానికి ముందే

ఈ వాక్యాన్ని “త్వరలో” లేక “కొద్ది కాలం తరువాత” అని అనుదించవచ్చు

35-11

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/beg]]

35-12

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

ఒక చిన్న మేక పిల్ల

ఒక చిన్న మేక పిల్ల కొద్దిమందికి మాత్రమే సరిపోతుంది, అయితే కొవ్విన దూడ ఎక్కువమందికి సరిపోతుంది. అది ఎక్కువ విలువైనది కాదు. పెద్ద కుమారుడు తన తండ్రి పాపంతో కూడిన చిన్న కుమారుడిని తనకంటే విలువైన వాడిగా యెంచుతున్నాడని ఆయన మీద నింద మోపుతున్నాడు.

నీ కుమారుడు

పెద్దకుమారుడు కోపంగా ఉన్నాడని ఈ వాక్యం తెలియపరుస్తుంది. తన చిన్న సోదరుడిని తాను తృణీకరించినట్లు చూపిస్తుంది, చిన్న కుమారుడిని తన తండ్రి తిరిగి ఆహ్వానించడానికి తన అసమ్మతిని చూపిస్తున్నాడు. ఇతర భాషలలో ఈ సంగతులను పరోక్షంగా తెలియపరచే మాటలు కూడా ఉండవచ్చు.

నీ డబ్బును వ్యర్ధపరచాడు

అంటే, “మీరు ఇచ్చిన డబ్బును నాశనం చేసాడు” లేక “మీ సంపదను మాయం చేసాడు.” సాధ్యమైతే సోదరుని కోపాన్ని కనపరచే మాటలను వినియోగించండి.

శ్రేష్టమైన కొవ్విన దూడ

అంటే, “విందులో తినడానికి శ్రేష్ఠమైన కొవ్విన దూడ చంపారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

35-13

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు.

ఇది మనకు సరియైనది

అంటే, “దీనిని చెయ్యడం మనకు సరియైనదే” లేక “ఇది మనకు న్యాయమైనది.”

నీ సోదరుడు

తండ్రి తన చిన్న కుమారుణ్ణి “నీ సోదరుడు” అని సూచిస్తున్నాడు. చిన్న కుమారునితో తన పెద్దకుమారుని సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, తన చిన్న సోదరుడిని ఏవిధంగా ప్రేమించాలో జ్ఞాపకం చేస్తున్నాడు.

చనిపోయాడు, అయితే ఇప్పుడు సజీవుడు

35:09 చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

అతడు చనిపోయాడు, అయితే ఇప్పుడు దొరికాడు!

35:09 చట్రంలో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు భాషలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]