తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

41-01

అవిశ్వాసులైన యూదు నాయకులు

అంటే, "యేసును నమ్మని యూదు నాయకులు."

ఆ వంచకుడు, యేసు అన్నాడు

"ఆ యేసు అనే మనిషి అబద్దం చెప్పాడు" అని కూడా దీనిని అనువదించవచ్చు. యేసు తాను దేవుని కుమారుడని చెప్పిన నిజాన్ని నమ్మేందుకు వారు నిరాకరించారు.

మృతులలో నుండి లేచి

అంటే, "తిరిగి జీవంలోకి రావడం" లేదా, "మళ్ళీ జీవించడం."

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

41-02

వారు ఉంచారు

అంటే, "మత పెద్దలనూ, సైనికులనూ ఉంచారు."

రాయిపై ముద్ర వేసి

వారు మెత్తని బంక మట్టి, లేదా మైనం వంటి పదార్థాన్నిసమాధికి అడ్డుగా ఉంచిన రాయికీ, సమాధికి మధ్య ఉంచి అధికారికంగా ముద్ర వేశారు. ఆ రాయిని కదిలిస్తే, ఆ ముద్ర వేసిన ఆ పదార్థం విరిగి, ఎవరో సమాధిలోకి ప్రవేశించినట్లు తెలుపుతుంది. "మనుషులు ఆ రాయిని దొర్లించకుండా నిషేధించడానికి గుర్తు వేయబడింది" అని కూడా దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pilate]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]

41-03

యూదులకు అనుమతి లేదు

యూదుడు విశ్రాంతి దినపు నియమాన్ని అనుసరించి చాలా దూరం నడవడానికీ, లేదా మరే ఇతర పని చేయడానికి అనుమతి లేదు.

సమాధికి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు

చెడు వాసనను కప్పిపుచ్చడానికి మృతదేహంపై ఉంచిన సువాసనతో కూడిన సుగంధ సంబారాలను ఇది సూచిస్తుంది. దీనిని "పరిమళ వాసనగల సుగంధ ద్రవ్యాలు" లేదా "పరిమళ వాసనగల తైలములు" లేదా "పరిమళ వాసన గల మొక్కలు" అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sabbath]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]

41-04

గొప్ప భూకంపం

దీనిని "భయంకరమైన భూకంపం" లేదా "బలంగా భూమి కంపించడం" అని కూడా అనువదించవచ్చు. కొన్ని భాషలు దీనిని తిరిగి చెప్పడానికి ఇష్టపడవచ్చు, "భూమి తీవ్రంగా కంపించడం ప్రారంభమైంది."

అది గొప్ప మెరుపులా కాంతివంతంగా ప్రకాశించింది

అంటే, "ఇది మెరుపులా ప్రకాశవంతంగా అగుపడింది."

చచ్చిన వారిలా నేలమీద పడ్డారు

వారు చనిపోలేదు, కాని చనిపోయిన మనుషులు కదలని విధంగా వారు కదలలేదు. వారు బహుశా భయం వలన మూర్ఛపోయారు. దీన్ని స్పష్టం చెప్పడానికి, "అకస్మాత్తుగా నేలమీద పడి కదలలేదు" అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]

41-05

భయపడ వద్దు

అంటే, "భయపడటం మానేయండి." ప్రకాశమానమైన ఒక దేవదూత మెరుపులా మెరుస్తూ భయపెట్టే దృశ్యం!

ఆయన మృతులలోనుండి లేచాడు

“ఆయన తిరిగి జీవoలోకి వచ్చాడు" అని దీనిని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/tomb]]

41-06

ఆయన మీకు ముందుగా గలిలయకు వెళ్తాడు

అంటే, "ఆయన మిమ్మల్ని గలిలయలో కలుస్తాడు" లేదా, "మీరు అక్కడికి చేరుకున్నప్పుడు ఆయన గలిలయలో ఉంటాడు." ఇక్కడ "మీరు" అనే పదం అపొస్తలులకూ,మరి ఇతర శిష్యులతో కలిపి బహువచనం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/angel]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/other/galilee]]

41-07

భయంతో కూడిన గొప్ప ఆనందం

అంటే, "భయంతో భావోద్వేగాలను అనుభవించడమే కాకుండా గొప్ప ఆనందం పొందడం కూడా."

శుభవార్త

"యేసు మళ్ళీ బ్రతికాడు అనే శుభవార్త" అని కూడా దీనిని అనువదించవచ్చు. ఈ శుభవార్త యేసు మృతులలోనుండి లేచాడు అనే విషయాన్ని సూచిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/joy]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

41-08

నన్ను చూస్తారు

అంటే, "నన్ను కలుస్తారు" లేదా, "నాతో కలవగలరు."

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నమైనవిగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/galilee]]