తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

26-01

సాతాను శోధనలను జయించిన తరువాత యేసు తిరిగి వచ్చాడు.

ఈ వాక్యాన్ని రెండు భాగాలుగా చెయ్యడానికి మీరు ఉద్దేశించవచ్చు. “సాతాను చెయ్యాలని కోరుకొన్న పాప కార్యాలను యేసు చెయ్యలేదు, ఆయన వాడిని ఓడించాడు. దాని తరువాత యేసు తిరిగి వచ్చాడు.” “జయించాడు” అనే పదం “ఎదిరించాడు” లేక “తృణీకరించాడు” లేక “నిరాకరించాడు” అని అనువదించవచ్చు.

పరిశుద్ధాత్మ శక్తిలో

ఈ వాక్యాన్ని “పరిశుద్ధాత్మ శక్తి ఆయన ద్వారా పనిచెయ్యగా” లేక “పరిశుద్ధాత్మ శక్తివంతంగా ఆయన నడిపిస్తుండగా.” అని అనువాదం చెయ్యవచ్చు.

ఆయన బోధిస్తూ ఒక చోటి నుండి మరొక చోటికి

అంటే, “వివిధ పట్టణాలకు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించాడు, అక్కడి ప్రజలకు బోధించాడు.

ప్రతీ ఒక్కరూ

అంటే, “ఆయనను ఎరిగిన ప్రతీవారు లేక ఆయనను గురించి విన్న వారు.”

ఆయనను గురించి మంచిగా మాట్లాడారు

అంటే, “ఆయనను గురించి మంచి సంగతులు చెప్పారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/satan]]
  • [[rc://*/tw/dict/bible/kt/tempt]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/other/galilee]]

26-02

ఆరాధనా స్థలం

అంటే, “యూదులు దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకొనే భవనం.” ఈ పదాన్ని “ఆరాధన భవనం” అని కూడా అనువదించవచ్చు

చుట్ట

చుట్ట అంటే పొడవుగా ఉన్న కాగితం లేక తోలు. దానిని చుట్టి ఉంచుతారు, దాని పైన కూడా రాస్తారు.

ప్రవక్త యెషయా గ్రంథపు చుట్ట

అంటే, “ప్రవక్త యెషయా రాసిన మాటలున్న చుట్ట.” వందల సంవత్సరాలకు ముందు యెషయా చుట్ట మీద రాసాడు. ఆ చుట్టకు ఇది నకలు.

చుట్టను తెరచాడు

దీనిని “చుట్టబడిన చుట్టను తెరిచాడు” లేక “చుట్టను విప్పారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/nazareth]]
  • [[rc://*/tw/dict/bible/kt/sabbath]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/isaiah]]

26-03

పేదలకు సువార్త ప్రకటించడం

అంటే, “దేవుడు వారికి సహాయం చేస్తాడనే మంచి సందేశాన్ని పేదవారికీ, అవసరతలో ఉన్నవారికీ చెప్పాడానికి”

బందీలకు విడుదల

అంటే, “తప్పువిధానంలో చెరలో ఉన్న ప్రజలు విడుదల పొందుతారని వారికి చెప్పడానికి.”

గుడ్డివారు చూపును పొందుతారు

ఈ వాక్యాన్ని “గుడ్డివారుగా ఉన్నవారు తమ దృష్టిని పొందుతారు” అని అనువదించవచ్చు.

నలిగిన వారికి విడుదల

అంటే, “జీవితంలో తక్కువగా చూడబడిన వారి కోసం స్వేచ్ఛ.”

ప్రభువు హిత వత్సరం

ఈ వాక్యం, “ప్రభువు మన పట్ల కరుణతో ఉండే కాలం” లేక “మన పట్ల ప్రభువు అత్యంత కృప కలిగి ఉన్న కాలం” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/goodnews]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]

26-04

నేనిప్పుడు చదివిన ఈ మాటలు ఇప్పుడే నేరవేరుతున్నాయి.

ఈ వాక్యాన్ని అనువదించగలిగిన ఇతర విధానం, “మీరు ఇప్పుడు వినిన మాటలు ఇప్పుడే నెరవేరడం ఆరంభం అయ్యింది” లేక “ఈ రోజు నేను మీకు చదివిన మాటలు మీరు వాటిని వింటుండగా యధార్ధం అయ్యాయి.”

ఆశ్చర్య పోయారు

“ఆశ్చర్యపోయారు” అనే పదాన్ని ఇది ఎలా సాధ్యం అని వారు చాలా విస్మయం చెందారు, నిర్ఘాంతపోయారు, కలవరపడ్డారు అనే అర్థాన్నిచ్చే పదాలతో అనువదించవచ్చు.

ఇతడు యోసేపు కుమారుడు కాదా?

ఈ వాక్యాన్ని “ఈ వ్యక్తి యోసేపు ఏకైక కుమారుడు” లేక “అతడు కేవలం యోసేపు కుమారుడని అందరికీ తెలుసు!” అని అనువదించవచ్చు. ఆయన యోసేపు కుమారుడా కాదా అని ప్రజలు అడగడం లేదు. ఆయన మెస్సీయ ఎలా కాగలడు అని ఆశ్చర్యపడుతున్నారు, ఎందుకంటే ఆయన కేవలం యోసేపు కుమారుడే అని వారు తలస్తున్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/wordofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/other/josephnt]]

26-05

ఏ ప్రవక్తా తన స్వదేశంలో ఆమోదం పొందదు.

ఈ వాక్యం అర్థం, “ప్రజలు తమ మధ్యలో పెరిగిన ప్రవక్త అధికారాన్ని గుర్తించరు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/true]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/other/elijah]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

26-06

ఎలిషా

ఎలిషా దేవుని ప్రవక్త, ఏలియా తరువాత వచ్చినవాడు. ఏలియాలా ఎలిషా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న రాజులను ఎదిరించాడు, చెయ్యడానికి దేవుడు అతనికి శక్తినిచ్చినప్పుడు అతడు అద్భుతాలు చేసాడు.

సైన్యాధికారి

అంటే “సైన్యానికి నాయకుడు”

అతని పట్ల వారు కోపంతో మండిపడ్డారు.

దేవుడు తమను తప్పించి మరే ఇతర ప్రజా గుంపులను ఆశీర్వదించాడని వినడం యూదులకు ఇష్టం లేదు. అందు చేత వారు యేసు చెప్పిన మాటలను బట్టి వారు చాలా కోపగించుకొన్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/other/naaman]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]

26-07

ఆరాధనా స్థలం

అంటే “దేవుణ్ణి ఆరాధించడానికి యూదా ప్రజలు సమావేశం అయ్యే భవనం.” ఈ పదాన్ని “ఆరాధనా భవనం” అని కూడా అనువదించవచ్చు. 26:02 చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.

అయితే యేసు జనసమూహం ద్వారా నడుస్తూ వెళ్ళాడు.

“అయితే” అనే పదాన్ని బలమైన వ్యతిరేక పదంగా లేక వాక్యంగా అనువదించవచ్చు. యేసుకు జరిగించాలనుకొన్న దానిని వారు చెయ్యలేకపోవడం చూపించడానికి “అయితే దానికి బదులుగా” లేక “ఏది ఏమైనా” అనే పదాలు వినియోగించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/nazareth]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]

26-08

గలిలయ ప్రాంతం అంతటా తిరిగాడు

అంటే, “గలిలయ అంతటిలోనూ” లేక “గలిలయలో ఒక చోటునుండి మరొక చోటుకు”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/nazareth]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]

26-09

అతనిలో దయ్యాలు ఉన్నాయి

అంటే “అతడు దుష్ట ఆత్మల చేత నియంత్రించబడ్డాడు”

యేసు వాటికి ఆజ్ఞాపించినప్పుడు

ఈ వాక్యాన్ని “యేసు వాటికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/demon]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/demon]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

26-10

అతనినుండి నేర్చుకొన్నాడు

అంటే “అతడు వారికి బోధించిన దానినుండి నేర్చుకొన్నాడు” లేక “అతడు చెప్పినది, చేసిన దానంతటినుండి నేర్చుకొన్నాడు.”

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/apostle]]