తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

24-01

అరణ్యం

అంటే “ఎడారి” లేక “సుదూరంగా ఉన్న ప్రదేశం, ఎడారిలాంటి ప్రదేశం.” ఇటువంటి ప్రదేశాలలో చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు నివసిస్తారు.

అడివి తేనె

అరణ్యాలలో తేనెటీగల నుండి సహజంగా ఉత్పత్తి అయ్యే తేనె. ప్రజలు దీనిని సాగు చేస్తారు. “తేనె” అనగానే మనుష్యులు ఈ విధంగా అర్థం చేసుకొంటారు. దానిని “అడివి” తేనె అని పిలవనవసరం లేదు.

అడివి మిడుతలు

ఇవి చాలా పెద్దవిగానూ, పెద్ద మిడుతల్లా రెక్కలతో ఎగిరే పురుగులు. ఎడారులలో నివసించే కొంత మంది వీటిని తింటారు.

ఒంటె వెంట్రుకలు

ఒంటెకు గరకుగా ఉండే జుట్టు ఉంటుంది. వాటితో మనుష్యులు వస్త్రాలను తయారు చేస్తారు. “గరకుగా ఉండే ఒంటె జుట్టు” అని అనువాదం చెయ్యచ్చు.

ఒంటె జుట్టుతో తయారు చెయ్యబడిన వస్త్రాలు.

అంటే “ఒంటె జుట్టునుండి తయారు చెయ్యబడిన ముతక వస్త్రాలు.” ఇతర వస్త్రాల్లా అరణ్యంలో ఈ వస్త్రాలు త్వరగా పాతబడి పోవు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/other/zechariahnt]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

24-02

అరణ్యం

ఈ పదం 24:01 చట్రంలో ఏ విధంగా అనువదించారో చూడండి.

పశ్చాత్తాపం

“మీ పాపాల నుండి పశ్చాత్తాప పడండి” అని అనువాదం చెయ్యవచ్చు.

దేవుడి రాజ్యం సమీపంగా ఉంది

అంటే “దేవుని రాజ్యం ప్రత్యక్షం కావడానికి సిద్ధంగా ఉంది” లేక “దేవుని రాజ్యం త్వరలో వస్తుంది.” మనుష్యుల మీద దేవుని పరిపాలను సూచిస్తుంది. ఈ వాక్యాన్ని “దేవుని పాలన ఆరంభం కానుంది.” లేక “దేవుడు రాజులా త్వరలో పాలించబోతున్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/other/preach]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]

24-03

వారి పాపాల నుండి పశ్చాత్తాపపడ్డారు.

ఈ వాక్యాన్ని “వారి పాపాల విషయంలో పశ్చాత్తాప పడ్డారు” లేక “వారి పాపాల విషయంలో తమ మనసులు మార్చుకొన్నారు” లేక “వారి పాపాలనుండి తొలగారు” అని అనువాదం చెయ్యవచ్చు.

పశ్చాత్తాప పడలేదు

అంటే “వారి పాపాలనుండి వారు వైదొలగలేదు.”

వారి పాపాలు ఒప్పుకొన్నారు

ఒప్పుకోవడం అంటే ఏదైనా ఒకదానిని సత్యం అని గుర్తించడం. ఈ నాయకులు పాపం చేసారని గుర్తించడానికి ఇష్టపడడం లేదు. ఈ వాక్యాన్ని “వారు పాపం చేసారని ఒప్పుకొన్నారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]

24-04

మీరు విషపూరిత సర్పాలు

ఈ పదాన్ని “మీరు విషపూరిత సర్పాల్లా ఉన్నారు!” అని అనువదించవచ్చు. యోహాను వారిని విషసర్పాలు అని పిలిస్తున్నాడు, ఎందుకంటే వారు ప్రమాదకరంగా ఉన్నారు, మోసపూరితంగా ఉన్నారు.

మంచి ఫలం ఫలించని ప్రతీ చెట్టు

యోహాను చెట్ల గురించి మాట్లాడడం లేదు. మంచి చెట్టు దేవుని నుండి వచ్చే మంచి క్రియలూ, మంచి వైఖరులతో సరిపోల్చే వాక్యం ఇది.

అవి నరకబడి అగ్నిలో త్రోయబడతాయి.

దీని అర్థం, “అవి దేవునిచేత తీర్పు తీర్చబడతాయి, శిక్షించబడతాయి.”

యోహాను నెరవేర్చాడు

అంటే దేవుని సందేశకుడు ఇలా చేస్తాడని ప్రవక్త చెప్పిన దానిని “యోహాను చేస్తున్నాడు.”

చూడండి

దీనిని “దృష్టి నిలపండి, చూడండి” లేక “గమనాన్ని నిలపండి” అని అనువాదం చెయ్యవచ్చు

నా సందేశకుడు

అంటే “నేను యెహోవాను నా సందేశకుడిని పంపిస్తాను.” కొన్ని భాషలలో ఈ వాక్యం పరోక్షంగా వినియోగించడం మరింత సహజంగా ఉంటుంది. “దేవుడు తన సందేశకుడిని పంపుతాడని ప్రవక్త అయిన యెషయా ముందుగా చెప్పినట్లుగా” అని అనువదించవచ్చు.

నీకు ముందుగా

ఈ వాక్యంలో “నీకు” అనే పదం మెస్సీయను సూచిస్తుంది

నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు

దేవుని సందేశకుడు ప్రజలు మెస్సీయ మాటలు వినేలా వారిని సిద్ధపరుస్తాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]

24-05

ఆయన చాలా అధికుడు

ఈ వాక్యాన్ని “ఆయన చాలా ప్రాముఖ్యమైనవాడు” అని అనువదించవచ్చు

ఆయన చెప్పులు విప్పడానికైననూ యోగ్యుడను కాను

వేరే మాటల్లో “ఆయనతో పోల్చుకొంటే ఆయన కోసం ఎంత చిన్న పని చెయ్యడానికైనా నేను తగినంత ప్రాముఖ్యమైన వాడిని కాను.” చెప్పులను విప్పడం చాలా తక్కువ పని, అది బానిసలు చేసే పని.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

24-06

అక్కడ ఉన్నాడు

కొన్ని భాషలలో ఈ పదం “ఇక్కడ ఉన్నాడు” లేక “ఆ వ్యక్తి” అని ఉంటుంది.

దేవుని గొర్రెపిల్ల

ఈ పదం “దేవుని నుండి గొర్రెపిల్ల” లేక “దేవుడు సమకూర్చిన బలి గొర్రెపిల్ల” అని అనువదించవచ్చు. పాపం కోసం దేవుడు సమకూరుస్తానని వాగ్దానం చేసిన సంపూర్ణమైన బలి ప్రభువైన యేసే. పాతనిబంధన గ్రంథంలో దహనబలి గొర్రెపిల్లల ద్వారా కనుడిన రూపాన్ని ఆయన నెరవేర్చాడు.

తీసివేస్తాడు

మనలో పాపం ఎన్నడూ లేవన్నట్టుగా దేవుడు చూచేలా ప్రభువైన యేసు బలి చేసింది.

లోక పాపం

అంటే, “ఈ లోకంలో ఉన్న ప్రజల పాపం”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

24-07

నీకు బాప్తిస్మం ఇవ్వడానికి యోగ్యుడను కాను

ఈ వాక్యాన్ని “నీకు బాప్తిస్మం ఇవ్వగలిగేంత మంచి వాడను కాను” లేక “నేను పాపిని, కనుక నేను నీకు బాప్తిస్మం ఇవ్వకూడదు.”

ఇలా నెరవేర్చుట మనకు తగియున్నది

ఈ వాక్యాన్ని “ఇలా చెయ్యడం సరియైన కార్యం” లేక “ఇది దేవుడు నన్ను చెయ్యమని కోరిన కార్యం” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

24-08

నేను ప్రేమించు నా కుమారుడు

మరొక కుమారుడు ఉన్నాడని అనువాదంలో ధ్వనించకుండా ఉండేలా చూడండి. “నీవు నా కుమారుడవు, నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను, నీ విషయంలో చాలా సంతోషిస్తున్నాను” అని అనువదించడం అవసరం కావచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]

24-09

దేవుడు యోహానుతో చెప్పాడు

అంటే, “దీనికి ముందు దేవుడు యోహానుతో చెప్పాడు” లేక “యేసు బాప్తిస్మం పొందడానికి రావడానికి ముందు దేవుడు యోహానుతో చెప్పాడు.”

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/johnthebaptist]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]