తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

10-01

ఫరో వద్దకు

“అతనితో మాట్లాడడానికి ఫరో అంతఃపురం వద్దకు” అని చెప్పడం స్పష్టంగా ఉండవచ్చు.

ఇశ్రాయేలు దేవుడు

“తన ప్రజలుగా ఉండడానికి ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొన్న దేవుడు” అని దీనిని అనువదించవచ్చు. లేక “ఇశ్రాయేలు ప్రజను పాలిస్తున్న దేవుడు” లేక “ఇశ్రాయేలీయులు ఆరాధించే దేవుడు” అని అనువదించవచ్చు.

నా ప్రజలను పోనిమ్ము

“నా ప్రజలు స్వతంత్రులుగా వెళ్ళడానికి అనుమతించు” అని మరొక విధంగా చెప్పవచ్చు లేక “నా ప్రజలు ఐగుప్తు విడిచిపెట్టడానికి స్వతంత్రులనుగా చెయ్యి” అని అనువదించవచ్చు.

నా ప్రజలు

09:13 లో “నా ప్రజలు” పదం చూడండి.

వినడానికి

“జాగ్రత్తగా వినడం” లేక “విధేయత” అని దీనిని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-02

ప్రజలు

ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది, “ఇశ్రాయేలీయులు” అని కూడా పిలుస్తారు.

పది భయంకర తెగుళ్ళు

తెగులు అంటే ఎవరికైనా సంభవించే చాలా చెడ్డదైన లేక భయంకరమైన విపత్తు. ఒక తెగులు అంటే సాధారణంగా అనేక మంది ప్రజలను ప్రభావితం చేసేది లేక పెద్ద భౌగోళిక ప్రాంతానికి సంభవించేది. “తెగులు” కు మరొక పదం “విపత్తు”

ఐగుప్తు దేవతలందరూ

“ఐగుప్తు ప్రజలు పూజించే దేవతలందరూ” అని చెప్పడం స్పష్టంగా ఉండవచ్చు. ఐగుప్తు ప్రజలు అనేక ఇతర తప్పుడు దేవతలను పూజించారు. ఈ తప్పుడు దేవతలు ఇశ్రాయేలు దేవుడు సృష్టించిన ఆత్మజీవులు అయి ఉండవచ్చు లేక ఉనికిలో లేనివి అయియుండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]

10-03

నైలు నదిని రక్తంగా మార్చాడు

“నైలు నదిలో ఉన్న నీటిని రక్తంగా మార్చాడు” అని కొన్ని భాషలలో చెప్పవలసి ఉంది. నదిలో నీటికి బదులు రక్తం ఉండడం వల్ల చేపలు చనిపోయాయి, ప్రజలు తాగడానికి నీరు లేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/nileriver]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-04

దేవుడు ఐగుప్తు అంతటి లోనికి కప్పలను పంపించాడు

ఈ వాక్యాన్ని “ఐగుప్తు దేశం అంతటిలోనూ అనేక కప్పలు కనిపించేలా దేవుడు చేసాడు” అని అనువదించవచ్చు.

తన హృదయాన్ని కఠినపరచుకొన్నాడు.

అతడు మరల మూర్ఖుడిగా మారాడు, దేవునికి విధేయత చూపించడానికి నిరాకరించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/beg]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-05

దేవుడు ఒక తెగులును పంపించాడు

దీనిని “దేవుడు అక్కడ ఒక తెగులు ఉండాలని శపించాడు” లేక “దేవుడు ఐగుప్తు భూమి మీద ఒక తెగులు (ఈగలు) కలిగించాడు” అని అనువదించవచ్చు.

దోమలు

ఇవి స్వల్పంగా ఉంటాయి, సమూహాలుగా ఎగురుతూ ఉండే కుడుతూ ఉండే కీటకాలు, మనుష్యులందరిపైనా, జంతువులపైనా వాలుతూ వారిని బాధిస్తూ ఉన్నాయి.

ఈగలు

ఇవి కొంచెం ఆకారంలో కొద్ది పెద్దవిగా ఉండే కీటకాలు, ఇవి బాధిస్తాయి, నాశనాన్ని కలిగిస్తాయి. ఇటువంటి ఈగలు అనేకం సమస్తాన్ని కప్పివేశాయి, ఐగుప్తీయుల గృహాలను కూడా కప్పివేశాయి.

తన హృదయాన్ని కఠినపరచుకొన్నాడు

10:04లో వివరణ చూడండి

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

10-06

పెంపుడు పశువులు

ఇది ఐగుప్తీయులకు తమ పనిలో సహాయం చేయ్యడానికి వినియోగించే పెద్ద పశువులను సూచిస్తుంది. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు, మేకలు మొదలైనవి.

హృదయం కఠినపరచబడింది

10:04లో వివరణ చూడండి

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-07

దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరచాడు

ఫరో మూర్ఖుడుగా కొనసాగేలా దేవుడు చేసాడు, 10:04లో ఉన్న వివరణ చూడండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-08

దాని తరువాత

దీని అర్థం, దేవుడు ఐగుప్తీయుల శరీరంలో బాధాకరమైన కురుపులు కలిగించిన తరువాత

దేవుడు వడగండ్లను పంపించాడు

దేవుడు ఆకాశం నుండి వడగండ్లు పడేలా చేసాడు.

వడగండ్లు

వడగండ్లు మంచు గడ్డల్లా ఉంటాయి, వర్షం లానే అవి మేఘాలనుండి భూమి మీదకు కురుస్తాయి. ఈ గడ్డలు చాలా చిన్నవిగా ఉంటాయి లేక చాలా పెద్దవిగా ఉంటాయి. పెద్ద వడగండ్లు పడిన చోట గాయాల్ని చేస్తాయి లేక చంపుతాయి.

మీరు వెళ్ళవచ్చు

“మీరు” అనే పదం మోషే, ఆహారోను, ఇశ్రాయేలీయులను సూచిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

10-09

తన హృదయాన్ని కఠినపరచుకొన్నాడు

10:04లోని వివరణను చూడండి

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-10

మిడుతల దండు

మిడుతల గుంపులో మిడుతలు గుంపులుగా లేక పెద్ద గుంపులలో కలిసి ఎగురుతాయి, అధిక ప్రదేశంలో అన్ని రకాలైన మొక్కలను, ఆహార పంటలను తినివెయ్యడం ద్వారా వాటిని నాశనం చేస్తాయి.

వడగండ్లు

వడగండ్లు మంచు గడ్డల్లా ఉంటాయి, వర్షం లానే అవి మేఘాలనుండి భూమిమీదకు కురుస్తాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

10-11

దేవుడు చీకటిని పంపాడు

దేవుడు ఐగుప్తులో అధిక భాగాన్ని చీకటి కప్పివేసేలా లేక విస్తరించేలా చేసాడు. మరొక మాటలో, ఐగుప్తులోని ఈ భాగంలో దేవుడు వెలుగును తీసి వేసాడు.

చీకటి మూడు రోజలు నిలిచియుంది.

ఈ చీకటి సాధారణంగా రాత్రి సమయాలలో ఉండే చీకటి కంటే తీవ్రంగా ఉంది, మూడు పూర్తి రోజులు సంపూర్తిగా చీకటి కొనసాగింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]

10-12

ఈ తొమ్మిది తెగుళ్ళు

“దేవుడు కలుగజేసిన ఈ తొమ్మిది విపత్తులు” అని అర్థం

ఫరో వినలేదు కనుక

“దేవుడు తనకు చెప్పిన దానిని వినలేదు కనుక” అని దీనిని అనువదించవచ్చు లేక “ఫరో దేవునికి విధేయత చూపించడానికి నిరాకరించిన కారణంగా” అని అనువదించవచ్చు

ఇది ఫరో మనసును మార్చుతుంది

“ఈ చివరి తెగులు దేవుని గురించి తన ఆలోచనను మార్చుతుంది, ఫలితంగా అతడు ఇశ్రాయేలీయులను స్వతంత్రులనుగా వెళ్ళనిస్తాడు” అని మరొక విధంగా అనువదించవచ్చు.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలాలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]