తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

04-01

జలప్రళయం తరువాత అనేక సంవత్సరాలకు

జలప్రళయం తరువాత అనేక తరాలు గతించిపోయాయి.

మరల అనేకమంది ప్రజలు

ఒక పట్టణాన్ని నింపగలిగేలా నోవహు కుటుంబం విస్తరించింది

ఒకే భాష

దీని అర్థం అక్కడ ఒకే భాష ఉంది, కనుక వారు ఒకరినొకరు అర్థం చేసుకోగల్గుతున్నారు.

ఒక పట్టణం

వచన భాగంలో ఒక నిర్దిష్టమైన పేరు లేదు కనుక “పట్టణం” అనే సాధారణ పదం వినియోగించడం మంచిది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

04-02

ఆకాశమునంటు శిఖరంగల ఒక గోపురం

ఈ నిర్మాణం చాలా పెద్దది, ఇది ఆకాశం అంటుతూ ఉంది.

అంతరిక్షం

దీనిని “ఆకాశం” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/proud]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

04-03

వారి భాషను తారుమారు చేసాడు

ఒక్క క్షణంలో దేవుడు ఆశ్చర్యకరంగా వారు మాట్లాడడానికి వివిధ భాషలను అనుగ్రహించాడు, తద్వారా వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేక పోయారు.

అనేక భిన్నమైన భాషలు

ప్రజల పెద్దగుంపు ఒక్క భాషను మాట్లాడడానికి బదులు అనేక చిన్న గుంపు ప్రజలు తాము సొంతంగా ప్రత్యేకమైన భాషను మాట్లాడుతున్నారు.

చెదరగొట్టాడు

దేవుడు వారు భాషలు మార్చినప్పుడు, ఈ చిన్న గుంపు ప్రజలు భూమంతటిలో చెదరిపోయారు, ప్రతీ గుంపు తమ సొంత ప్రదేశాలకు కదిలిపోయారు.

బాబెలు

ఈ పట్టణం ఖచ్చితంగా ఎక్కడ ఉందో మనకు తెలియదు. పురాతన మధ్యప్రాచ్యంలో ఒక ప్రాంతంలో ఉందని మాత్రమే మనకు తెలుసు.

తారుమారు

దేవుడు వారి భాషను మార్చిన తరువాత వారు ఒకరినొకరు అర్థం చేసుకోలేనప్పుడు ప్రజలు ఏ విధంగా గందరగోళపడ్డారో తారుమారయ్యారో చూపిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]

04-04

వందలాది సంవత్సరాల తరువాత

“బాబెలు వద్ద ప్రజలు వివిధం భాషా గుంపులుగా చీలిపోయిన అనేక తరాల తరువాత” లేక “అది జరిగిన చాలా కాలం తరువాత” అని అనువదించవచ్చు

నీ దేశాన్ని విడిచిపెట్టు

అబ్రాము పుట్టి, పెరిగిన ప్రదేశాన్ని సూచిస్తుంది (మధ్య ఆసియాలో “ఊరు” అనే ప్రాంతం). “పుట్టిన ప్రాంతం” లేక “సొంత ఊరు” అని అనువదించవచ్చు.

కుటుంబం

తన బంధువులలో అనేకులను విడిచిపెట్టాలని దేవుడు అబ్రాముకు చెప్పాడు. అయితే అబ్రాము బాధ్యత వహించే తన ప్రజలను పరిత్యజించాలని చెప్పలేదు. తన భార్యనుకూడా పరిత్యజించాలని చెప్పలేదు. గొప్ప జనముగా చేస్తాను అబ్రాముకు అనేకమంది సంతానం కలిగేలా దేవుడు చెయ్యగలడు. వారు ప్రాముఖ్యమైన పెద్ద జాతిగా మారగలరు.

నీ నామాన్ని గొప్పచేయుదును

అబ్రాము పేరు, కుటుంబం ప్రపంచం అంతా ప్రముఖంగా మారుతుంది, ప్రజలు వారిని గురించి మంచిగా తలస్తారు.

భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు

దేవుణ్ణి వెంబడించాలనే అబ్రాము నిర్ణయం తన కుటుంబాన్ని ప్రభావితం చెయ్యడం మాత్రమే కాక, భూమి మీద ఉన్న ప్రతీ ప్రజాగుంపునూ ప్రభావితం చేస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/kt/curse]]

04-05

అతడు తీసుకొన్నాడు

“అతడు తీసుకొచ్చాడు” అని కొన్ని భాషలు చెప్పవచ్చు. మరికొన్ని భాషలు ఇక్కడ రెండు క్రియా పదాలను వినియోగిస్తున్నాయి. “తన భార్య తనతో వచ్చేలా చేసాడు,” “వారి సేవకులందరినీ, యావదాస్థినీ తనతో తీసుకొనివచ్చాడు.” అనే వాక్యాలను వినియోగించారు.

దేవుడు అతనికి చూపించాడు

అబ్రాము ఎక్కడికి వెళ్ళవలసి ఉందో దేవుడు అబ్రాముకు తెలియపరచాడు. దేవుడు ఏవిధంగా చూపించాడో ఈ వచన భాగం మనకు తెలియపరచలేదు.

కనాను దేశం

ఈ ప్రదేశం పేరు “కనాను.” దీనిని “కనాను అని పిలువబడిన ప్రదేశం” అని అనువాదం చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sarah]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]

04-06

నీవు చూస్తున్న దేశం అంతా

అబ్రాము ఒక పర్వతం మీద నిలిచినట్లయితే, అతడు చాలా విస్తారమైన ప్రదేశాన్ని చూడగలదు. అనేక సందర్భాలలో కనాను భూభాగాన్నంతటినీ అబ్రాముకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసాడు.

ఒక స్వాస్థ్యంగా

ఒక తండ్రి తన భూమినీ, సంపదనూ తన పిల్లలకు ఇచ్చేవిధంగా దేవుడు ఆ భూమిని అబ్రాముకూ, అతని సంతానానికీ ఇస్తాననీ వాగ్దానం చేసాడు.

అబ్రాము ఆ దేశంలో స్థిరపడ్డాడు

అబ్రాము తనతో పాటు వచ్చిన వారందరితో అక్కడ నివసించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/kt/inherit]]

04-07

మెల్కీసెదెకు

మెల్కీసెదెకు కనానులో మతపరమైన అధికారిగా గుర్తించబడ్డాడు, కానుకలను స్వీకరించాడు, వాటిని దేవునికి సమర్పించాడు.

సర్వోన్నతుడగు దేవుడు

కనాను ప్రజలు అనేక అబద్ధపు దేవుళ్ళను పూజించారు. మెల్కీసెదెకు ఆరాధించే దేవుడు వారందరికన్నా అధికుడు అని “సర్వోన్నతుడైన దేవుడు” అనే పదం వివరిస్తుంది. ఆబ్రాము ఆరాధించే దేవుడు ఈ దేవుడే.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]

04-08

అనేక సంవత్సరాలు

అబ్రాముకు కుమారుడు జన్మిస్తాడని దేవుడు మొట్టమొదట వాగ్దానం చేసి అనేక సంవత్సరాలు గడిచిపోయాయి.

ఆకాశంలోని నక్షత్రాలు

అబ్రాము సంతానం లెక్కించలేనంత అధికంగా ఉంటారని ఈ వ్యక్తీకరణ అర్థం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/sarah]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]

04-09

రెండు గుంపులు

రెండు గుంపులు ఇద్దరు ప్రజలు, రెండు గుంపు ప్రజలు, లేక ఒక వ్యక్తి, ఒక గుంపు ప్రజ. ఈ విషయంలో దేవునికీ, అబ్రాముకు మధ్య అంగీకారం.

నీ సొంత దేహంలోనుండి

అబ్రాము తన సొంత శరీరం నుండి తన భార్యను గర్భవతినిగా చెయ్యగలడు, తద్వారా వారు తమ సొంత సంతానాన్ని, సహజకుమారుడిని కలిగియుండగలరు. ఇది అద్భుతమైన వాగ్దానం ఎందుకంటే అబ్రాము, శారా చాలా ముసలివారు.

సంతానం లేనివాడు

భూమిని స్వతంత్రించుకోడానికి అబ్రాముకు ఇంకా సంతానం కలుగలేదు.

..నుండి బైబిలు కథ

ఈ సూచనలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]