తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

27-01

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే ఒక నిర్దిష్ట సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషల్లో ఒక వాస్తవమైన కథను ఆరంభించేటప్పుడు ఇలాంటి విధానమే ఉంటుంది.

యూదా ధర్మశాస్తంలో పండితుడు

దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈ మనిషి అధ్యయనం చేసాడు, దానిని బోధించాడు. ఇతర యూదా శాసనాలను కూడా అధ్యయనం చేసి బోధించాడు.

ఆయన శోధించడానికి

అంటే, “యేసు మంచి జవాబు ఇస్తాడని వారు చూడడానికి”

నిత్యజీవం స్వతంత్రించుకోడానికి

అంటే, “దేవునితో శాశ్వత జీవితం కలిగియుండడానికి” లేక “దేవునితో శాశ్వత కాలం జీవితాన్ని ఆయన ఇవ్వడానికి” లేక “దేవుని నుండి శాశ్వతజీవాన్ని పొందడానికి.” ధర్మ శాస్త్ర పండితుడు తండ్రియైన దేవుని నుండి స్వాస్థ్యంగా నిత్యజీవాన్ని పొందడానికి తాను ఏవిధంగా యోగ్యుడవుతాడని అడుగుతున్నాడు.

నిత్యజీవం

క్షయమైన దేహం చనిపోయిన తరువాత దేవునితో శాశ్వత జీవితాన్ని ఇది సూచిస్తుంది. నిత్య జీవం కోసం ముఖ్య పదం పుటను చూడండి.

దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినదేమిటి?

అంటే, “దీని విషయం దేవుని ధర్మశాస్త్రంలో రాయబడినదేమిటి?” దేవుని ధర్మ శాస్త్రం వాస్తవంగా బోధిస్తున్న దానిని గురించి ఆ బోధకుడు తెలుసుకోవాలని కోరుతున్నాడు కనుక యేసు ఈ ప్రశ్న అడిగాడు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/teacher]]
  • [[rc://*/tw/dict/bible/kt/inherit]]
  • [[rc://*/tw/dict/bible/kt/eternity]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]

27-02

ధర్మ శాస్త్ర నిపుణుడు

అంటే, “యూదా ధర్మశాస్త్రంలో ఒక నిపుణుడు.” ఈ పదాన్ని 27:01 చట్రంలో ఏ విధంగా అనువదించారో చూడండి.”

నీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించాలి

“మన ప్రభువైన దేవుణ్ణి మనం ప్రేమించాలి” అని చెప్పవచ్చు. ఈ వ్యక్తి యేసును ఆజ్ఞాపిస్తున్నట్టు కనిపించేలా చూడండి. దానికి బదులు దేవుని ధర్మశాస్త్రం మనుష్యులు ఏమి చెయ్యాలని ఆజ్ఞాపిస్తుందో అతడు చెపుతున్నాడు.

నీ పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతో

అంటే, “మీ పూర్తి ఆత్మతో” లేక “నీలోని ప్రతీ భాగంతో.” కొన్ని భాషలలో దీనిని “మీ పూర్తి కాలేయంతో, శ్వాసతో, బలంతో, ఆలోచనలతో” అని అనువదించవచ్చు. ఈ భాగాల మీద లక్ష్యముంచడం కాదు కాని మనలో ఉన్న అన్నిటిమీద. మీ భాషలో పూర్తి వ్యక్తిని సూచించే కీలక అంశాలను వినియోగించండి.

హృదయం

హృదయం ఒక వ్యక్తిలోని కోరికలూ, ఉద్రేకాలను సూచించే ఒక భాగం

ప్రాణం

ఒక వ్యక్తిలోని భౌతికం కాని ఆత్మీయ భాగాన్ని సూచిస్తుంది.

బలం

భౌతిక దేహం, దానిలోని అన్ని సామర్ధ్యాలను బలం సూచిస్తుంది

మనసు

ఒక వ్యక్తి ఆలోచించడం, ప్రణాళికలు చెయ్యడం, అభిప్రాయాలను కలిగియుండే భాగాన్ని మనసు సూచిస్తుంది

పొరుగువాడు

“పొరుగువాడు” పదం సాధారణంగా మనకు సమీపంగా నివసించే వ్యక్తిని సూచిస్తుంది. యూదులు ఈ పదాన్ని తమకు దగ్గరి బంధువు, లేక విదేశీయుడు, లేక శత్రువుకు తప్ప మిగతా వారికి అన్వయిస్తారు.

నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు

అంటే, “నిన్ను నీవు ప్రేమించే స్థాయిలో నీ పొరుగువాడిని ప్రేమించు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
  • [[rc://*/tw/dict/bible/kt/love]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

27-03

ధర్మశాస్త్ర నిపుణుడు

అంటే, “యూదా ధర్మశాస్త్రంలో ఒక నిపుణుడు.” ఈ పదాన్ని 27:01 చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.

నా పొరుగువాడు ఎవడు?

ఈ వాక్యాన్ని, “పొరుగు వాడు అంటే నీవు ఏమనుకొంటున్నావు?” లేక “ఎటువంటి ప్రజలు నా పొరుగువారు?” అని అనువదించవచ్చు. తాను ప్రతిఒక్కరినీ ప్రేమించడం లేదని అతనికి తెలుసు, ఎటువంటి ప్రజలను తాను ప్రేమించవలసి ఉంది అని అడుగుతున్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/righteous]]

27-04

సమాచారం

ఈ దృశ్యం చుట్టూ మేఘంలాంటి చట్రం యేసు ఒక కథ చెపుతున్నట్టు సూచిస్తుంది, ఒక చారిత్రాత్మక సంఘటనను వివరించనవసరం లేదు.

ధర్మ శాస్త్ర నిపుణుడు

ఈ పదాన్ని 27:01 చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.

యెరూషలేం నుండి యెరికో వరకు

కొన్ని భాషలలో దీనిని “యెరూషలేం నగరం నుండి యెరికో నగరం వరకూ” లేక “యెరూషలెం నుండి యెరికో వరకు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/other/jericho]]

27-05

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు.

తనకున్నదంతా

అంటే, “తనతో ఉన్నదంతా, దానిలో తాను ధరించిన అతని వస్త్రాలు ఉన్నాయి.”

27-06

సమాచారం

యేసు కథ కొనసాగిస్తున్నాడు

కిందకు నడవడం జరిగింది.

అంటే, “ఆ దారిలో ప్రయాణం చేస్తున్నాడు.” కొన్ని భాషలకు “ప్రయాణం” అనే పదాన్నివినియోగించడం “నడవడం” అనే పదాన్ని వినియోగించడం కంటే అవసరం కావచ్చు. ఎందుకంటే యాజకుడు దారిలో కేవలం నడవడం లేదు, మరొక నగరానికి చేరుకోడానికి ప్రయాణం చేస్తున్నాడు.

ఆ మనిషిని విర్ల్యక్షపెడుతున్నాడు

అంటే, “ఆ మనిషికి సహాయం చెయ్యలేదు” లేక “ఆ మనిషి విషయంలో శ్రద్ధ చూపించలేదు.”

వెళ్తూ ఉన్నాడు

అంటే, “ఆ దారిలో కిందకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/other/jewishleaders]]

27-07

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు

దారిలోనికి వచ్చాడు

అంటే, “అదే దారిలో కిందకు నడుస్తున్నాడు.”

లేవీయులు యూదాలో ఒక గోత్రం

అంటే, “లేవీయులు ఇశ్రాయేలీయుల లేవి గ్రోతంనుండి వచ్చిన వారు.” లేక “లేవీయులు ఇశ్రాయేలీయులలో లేవి వంశంలోనుండి వచ్చిన వారు.”

నిర్ల్యక్షపెట్టాడు

అంటే, “సహాయం చెయ్యలేదు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/kt/temple]]

27-08

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు

కిందకు నడుస్తున్నాడు

అంటే, “ప్రయాణం చేస్తూ ఉన్నాడు.” ఈ ప్రజలు ఒక పట్టణం నుండి మరొక దానికి ప్రయాణం చేస్తున్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/samaria]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]

27-09

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు

తన సొంత గాడిద

“తన” అనే పదం సమరయునికి సంబంధించిందని చూపేలా చూడండి

త్రోవలో ఉన్న సత్రం

అంటే, “వసతి ఉండే స్థలం.” ప్రయాణీకులకు ఆహారం, రాత్రిపూట వసతి దొరికే స్థలం.

అక్కడ అతని గురించిన శ్రద్ధ తీసుకొన్నాడు.

ఈ వాక్యాన్ని “అక్కడ అతని గూర్చిన శ్రద్ధ తీసుకోవడం కొనసాగించాడు” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/samaria]]

27-10

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగిస్తున్నాడు.

తన ప్రయాణాన్ని కొనసాగించాడు

ఈ వాక్యాన్ని, “తన గమ్యం వైపుకు తన ప్రయాణాన్ని కొనసాగించాడు.”

బాద్యత వహించే

అంటే, “నిర్వహించేవాడు.” ఆ వసతి స్థలానికి అతడు యజమాని కూడా అయిఉండవచ్చు.

అతని గురించిన శ్రద్ధ తీసుకోండి

కొన్నిభాషలకు “దయచేసి అతని గురించిన శ్రద్ధ తీసుకోండి” అని చెప్పడం అది ఒక ఆజ్ఞలా కాకుండా మృదువైన మనవిగా ఉండేలా సరిగా ఉండవచ్చు.

ఆ ఖర్చులన్నీ తిరిగి చెల్లిస్తాను

ఈ వాక్యాన్ని “నీకు తిరిగి చేల్లిస్తాను” లేక “ఆ డబ్బు నీకు తిరిగి చెల్లిస్తాను” లేక “దానిని తిరిగి చెల్లిస్తాను.” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/samaria]]

27-11

ధర్మశాస్త్ర నిపుణుడు

అంటే, “యూదా ధర్మశాస్త్రంలో ఒక నిపుణుడు.” ఈ పదాన్ని 27:01 చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.

ముగ్గురు వ్యక్తులు

ఈ ముగ్గురు వ్యక్తులు యాజకుడు, లేవీయుడు, సమరయుడు.

పొరుగువాడు

27:02 చట్రంలో ఉన్న దానికంటే ఒక విశాల దృక్ఫథంలో యేసు “పొరుగువాడు” అనే పదాన్ని వినియోగిస్తున్నాడు. ఇక్కడ “పొరుగువాడు” అనే పదం మన సహాయం అవసరమైన ప్రతీవానిని సూచిస్తుంది.

పొరుగువాడై యున్నాడు.

ఈ వాక్యం “పొరుగువాడుగా ప్రవర్తించాడు” లేక “స్నేహితుడిగా ఉన్నాడు” లేక “ఒక ప్రేమగల విధానంలో సహాయం చేసాడు” అని అనువదించవచ్చు. “పొరుగువాడు” అనే పదం 27:02 చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.

నీవు వెళ్ళు, ఆలా చెయ్యి

అంటే, “నీవు కూడా వెళ్ళాలి, ఆవిధంగా చెయ్యాలి” లేక “ఇప్పుడు నీవు ఖచ్చితంగా చెయ్యాలి” అని అర్థం. సమరయుడు చేసిన విధంగా ధర్మశాస్త్ర బోధకుడు కూడా చెయ్యాలని యేసు ఆజ్ఞాపిస్తున్నాడు.

అదే చెయ్యి

అంటే, “ఇతరులను ప్రేమించు, మీ శత్రువులను సహితం ప్రేమించు.” గాయపడిన వ్యక్తికి సహాయం చెయ్యడాన్ని మాత్రమే సూచించేలా ఉండకుండా చూడండి.

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/mercy]]