తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

32-01

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే దానిని నిర్దిష్ట సమయాన్ని ప్రస్తావించదు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించదానికి ఇటువంటి విధానాన్ని కలిగియుంటాయి.

గెరాసేన ప్రజలు

గెరాసేనీయులు గలిలయ సముద్ర తీరాన్న నివసించారు. వారు యూదుల సంతానం. అయితే వారిని గురించి చాల తక్కువగా తెలుసును.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

32-02

దయ్యం పట్టిన మనిషి

అంటే, “తనలో దయ్యాలు ఉన్న వ్యక్తి” లేక “దురాత్మల చేత నియంత్రించబడుతున్న వ్యక్తి.”

పరుగెత్తుకొని వస్తుంది

అంటే, “అక్కడికి పరుగెత్తి” లేక “పరుగెత్తుకొని వచ్చి ఆయన ముందర నిలిచింది.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/demonpossessed]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

32-03

అతని చేతులు, కాళ్ళు కట్టి వేశారు

అంటే, “నిర్భందించారు” లేక “కట్టివేశారు.”

విరుగగొట్టుకుంటున్నాడు

కొన్ని భాషలలో “గొలుసులను తెంచుకొంటూ ఉన్నాడు” అని చెప్పవలసిన అవసరం ఉంది.

32-04

సమాధుల మధ్య

అంటే, “సమాధుల దగ్గర” లేక “సమాధుల చుట్టూ.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/tomb]]

32-05

మోకరించి

అంటే, “త్వరితంగా నేల మీద మోకరించాయి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/demon]]

32-06

బయటికి అరిచాడు

అంటే, “కేకలు వేశాడు” లేక “ఆశ్చర్యపోయాడు.”

నాతో నీకేమి పని

ఈ వాక్యం అర్థం, “నన్ను ఏమి చెయ్యబోతున్నావు?”

సర్వోన్నతుడైన దేవుడు

అంటే, “సర్వాతీతుడైన దేవుడు” లేక “ఉన్నత సార్వభౌమాధికారి అయిన దేవుడు” లేక “అత్యంత శక్తిగల దేవుడు.” “ఉన్నత” అనే పదానికి ఇక్కడున్న అర్థం దేవుని గొప్పతనాన్ని సూచిస్తుంది. ఇది ఎత్తు లేక పొడవుగా ఉండడం గురించి మాట్లాడడం లేదు.

సేన

ఇది దయ్యాల గుంపు పేరు. అయితే దురాత్మలు అసంఖ్యాకంగా ఉంటాయని వివరిస్తుంది. ఈ క్రింది గమనిక మీ భాషలో అర్థాన్ని స్పష్టం చేస్తుంటే పేరును వినియోగించండి. ఆలా కాని పక్షంలో ఈ పదాన్ని “సైన్యం´లేక “సమూహం” లేక “వేలకొలది” అని వినియోగించండి.

మేము సైన్యం

మేము అనేకులం – అంటే “మాలో అనేకులం ఉన్నాం” లేక “మేము అనేక మైన దయ్యాలం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/demonpossessed]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/sonofgod]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

32-07

మమ్మల్ని పంపించవద్దు

అంటే, “మమ్మల్ని వెళ్ళేలా చెయ్యవద్దు.”

దయచేసి మమ్మల్ని పంపించండి

అంటే, “దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి.”

బదులుగా

అంటే, “మమ్మల్ని గెంటి వేయడానికి బదులు.”

వెళ్ళు!

ఈ పదం, “పందులలోనికి వెళ్ళండి” లేక “నీవు మమ్మల్ని పందులలోనికి వెళ్లనివ్వు!”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/demon]]
  • [[rc://*/tw/dict/bible/other/beg]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

32-08

మంద

అంటే, “పందుల మంద” లేక “పందుల గుంపు.” అనేక భాషల్లో పశువుల గుంపులకు ఒక “గొర్రెల మంద” “కుక్కల గుంపు”, అనే ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. పందుల పెద్ద గుంపుకోసం వినియోగించే సరియైన పదాన్ని వినియోగించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/demon]]

32-09

జరిగిన దానిని

అంటే, “దయ్యాలను ఆ మనిషిలోనుండి పందుల లోనికి ఏవిధంగా పంపాడో.”

దయ్యములను కలిగియున్న వ్యక్తి

అంటే, “ఎవరిలో దయ్యాలు నివసం చేసాయో” లేక “దురాత్మల చేత నియంత్రించబడిన వ్యక్తి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/demon]]

32-10

ప్రజలు

కొన్ని భాషలు “ఆ ప్రాంతం నుండి ప్రజలు” లేక “గేరాసేన ప్రజలు” అని చెబుతున్నాయి.

భయపడ్డారు

“యేసు చేసిన దానిని బట్టి వారు భయపడ్డారు” అని చెప్పడం మంచిది.

సిద్ధపడ్డాడు

అంటే, “సిద్ధపడుతున్నాడు.”

యేసుతో వెళ్ళడానికి బతిమాలాడు

అంటే, “తనతో ఉండనిమ్మని యేసును బతిమాలాడు” లేక “యేసుతో పాటు వెళ్ళడానికి యేసును వినయంగా అడిగాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/beg]]

32-11

తాను ఏ విధంగా కనికరాన్ని పొందాడో

ఈ వాక్యాన్ని “ఆయన నీ పట్ల ఏ విధంగా కనికరాన్ని చూపించాడో” లేక “ఆయన నీ పట్ల కనికరం కలిగియున్నాడు.” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/mercy]]

32-12

ఆ వృత్తాంతాన్ని విన్నారు.

అంటే, “ఆ మనిషి జరిగిన దానిని చెప్పడం విన్నారు.”

ఆశ్చర్యంతోనూ, దిగ్భ్రాంతితోనూ నిండిపోయారు

“దిగ్భ్రాంతి”, “ఆశ్చర్యం” అనే పదాలు అర్థంలో ఒకేలా ఉంటాయి. ప్రజలు యెంత ఆశ్చర్యపడ్డారో చూపించడానికి ఆ రెండు పదాలు వినియోగించారు. దీనిని “అతడు చెప్పిన దానిని బట్టి వారు పూర్తిగా ఆశ్చర్యపడ్డారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]

32-13

ఆయనను బలవంతం చేసారు

అంటే, “ఆయనకు వ్యతిరేకంగా బలంగా నెట్టారు” లేక “ఆయన చుట్టూ బలంగా గుమికూడారు.”

ఆమె ఆరోగ్యం క్షీణించింది

అంటే, “ఆమె పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది” లేక “ఆమె ఆరోగ్యం బాగవ్వడానికి బదులు ఎక్కువగా క్షీణిస్తుంది” లేక “దానికి బదులు ఆమె మరింత జబ్బుపడిపోయింది.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]

32-14

సమాచారం

ఈ చట్రానికి ఎటువంటి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]

32-15

నాలో నుండి ప్రభావం బయటికి వెళ్లింది

ఈ వాక్యాన్ని “స్వస్థ పరచే శక్తి ఆయన నుండి ఒకరికి ప్రవహించింది” లేక “ఆయన శక్తి ఒకరిని బాగు చేసింది.” దీనివల్ల యేసు ఎటువంటి శక్తినీ కోల్పోలేదు.

“నన్ను తాకినది ఎవరు?” అని నీవు ఎందుకు అడుగుతున్నావు?

కొన్ని భాషలలో “నిన్ను ఎవరో తాకారని ఎందుకు అడుగుతున్నావు?” లేక “ఎవరు నిన్ను తాకారని నీవు ఎందుకు ఆశ్చర్యపడుతున్నావు?” అని పరోక్షంగా అడగవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

32-16

ఆమె మోకరించింది

అంటే, త్వరగా కిందకు మోకరించింది

యేసు ముందు

అంటే, “యేసు ముందు.”

వణుకుతూ, చాలా భయపడింది.

అంటే, “భయంతో వణుకుతుంది” లేక “ఆమె భయపడుతుంది కనుక వణుకుతుంది.”

నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది

ఈ వాక్యం “నీ విశ్వాసం కారణంగా నీవు బాగయ్యావు” అని అనువదించవచ్చు.

సమాధానంతో వెళ్ళు

ప్రజలు ఒకరినొకరు విడిచిపెట్టేటప్పుడు ఈ సంప్రదాయ ఆశీర్వచనాన్ని పలుకుతారు. ఇతర భాషలు కొన్ని ఇటువంటి “దేవునితో వెళ్ళు” లేక “సమాధానం” అనే మాటలనే వినియోగిస్తాయి. వీటిని “నీవు వెళ్తుండగా నీకు సమాధానం ఉండును గాక” లేక “వెళ్ళు, మన మధ్య సమస్తం సవ్యంగా జరుగుతుంది” అని కూడా అనువదించవచ్చు.

..నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/faith]]
  • [[rc://*/tw/dict/bible/other/heal]]
  • [[rc://*/tw/dict/bible/other/peace]]