తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

29-01

ఒక రోజు

ఈ పదం గతంలో జరిగిన ఒక సంఘటనను పరిచయం చేస్తుంది. అయితే ఒక నిర్దిష్టమైన సమయాన్ని చెప్పాడు. అనేక భాషలు ఒక నిజమైన కథను చెప్పడం ఆరంభించడానికి ఇటువంటి విధానాన్నే కలిగియుంటారు.

నా సోదరుడు

కొన్నిసార్లు ఈ పదంలో తోబుట్టువులు కాని వారిని కూడా కలిపియుంటాయి. అయితే మతానికీ, ఒక నిర్దిష్టమైన జాతికీ చెందిన బలమైన సంబంధాన్ని పంచుకొనే వారిని కలుపుతుంది.

నాకు వ్యతిరేకంగా పాపాలు

ఈ వాక్యాన్ని “నాకు వ్యతిరేకంగా కొంత తప్పిదం చేసాడు” అని అనువదించవచ్చు.

ఏడు సార్లు కాదు, డెబ్బది ఏడుసార్లు!

ఈ వాక్యాన్ని, “నీవు ఏడుసార్లు మాత్రమే క్షమించడం కాదు, దానికి బదులు డెబ్బది ఏడుసార్లు మట్టుకు మీరు క్షమించాలి.” ఒక ఖచ్చితమైన సంఖ్య గురించి యేసు మాట్లాడడం లేదు. మనుష్యుల మన పట్ల తప్పిదం చేసిన ప్రతీసారి మనం వారిని క్షమించాలని యేసు చెపుతున్నాడు.

దీనివలన యేసు ఉద్దేశం

అంటే, “యేసు దీనిని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

29-02

దేవుని రాజ్యం ఇలా ఉంటుంది

ఈ వాక్యాన్ని, “మనుష్యుల మీద ఆయన పాలన ఇలా ఉంటుంది” లేక “మనుష్యుల మీద దేవుని పాలన విధానం ఇలా పోల్చవచ్చు” అని మరొక విధంగా చెప్పవచ్చు

ఆయన ఒక రాజు, ఇలా ఉంటాడు

ఈ వాక్యం “ఒక రాజు రాజ్యంలా ఉంది, ఆయన,” లేక “ఒక రాజు పాలనతో పోల్చవచ్చు,” అని అనువదించవచ్చు.

అతని సేవకుల ఖాతాలు సరిచెయ్యాలి

అంటే, “తనకు అచ్చియున్న అప్పును సేకరించాలి” లేక “సేవకులు అతని వద్దనుండి అప్పుగా తీసుకొన్న సేకరించాలి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/kingdomofgod]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

29-03

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

అప్పు చెల్లించు

అంటే, “రాజుకు అప్పుగా ఉన్న సొమ్మును తిరిగి చెల్లించు.”

అతని అప్పు మీద డబ్బు చెల్లించడం.

ఈ వాక్యాన్ని “వారిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును వినియోగించి నాకు అచ్చియున్న దానిలో కొంత భాగం చెల్లించాలి.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

29-04

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

మోకరించాడు

అంటే, “వెంటనే నేల మీద మోకరించాడు.” అతని వినయాన్ని చూపించడానికీ, తనకు సహాయం చెయ్యమని అడగడానికి ఇది ఒక విధానం. యాదృచ్చికంగా కింద పడ్డాడని అనిపించకుండా ఉండేలా చూడండి.

రాజు ముందు

“రాజు యెదుట” అని అర్థం.

జాలిపడ్డాడు

అంటే, “కరుణ కలిగింది” లేక “దాని విషయం విచారపడ్డాడు.” సేవకుడూ, అతని కుటుంబం బానిసత్వంలోనికి అమ్మి వేయబడినట్లయితే వారు అధికంగా శ్రమల పాలవుతారని రాజుకు తెలుసు.

అతని అప్పు అంతటినీ రద్దు చేసాడు

ఈ వాక్యాన్ని “ఆ సేవకుడు తాను రాజుకు చెల్లించవలసిన అప్పును తిరిగి చెల్లించనవసరం లేదని చెప్పాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]

29-05

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

తోటి సేవకుడు

రాజుకు సేవకుడైన మరొక సేవకుడిని సూచిస్తుంది

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]

29-06

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

తోటి సేవకుడు

ఈ పదాన్ని 29:05 చట్రంలో ఉన్న విధంగానె అనువదించండి.

మోకరించాడు

ఈ పదానికి 29:04 చట్రంలో ఉన్న అదే అర్థం ఉంది.

తన తోటి సేవకుడిని చెరలో వేయించాడు

ఈ వాక్యాన్ని “అతణ్ణి పట్టి చెరలో వేసాడు” అని అనువదించవచ్చు. “త్రోసివేసాడు” అనే పదం రూపకంగా ఉంది, బలవంతంగా దీనిని చేసాడని అర్థం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]

29-07

సమాచారం

యేసు కథను కొనసాగిస్తున్నాడు

ఏమి జరిగింది

అంటే, “ఆ సేవకుడు తన తోటి సేవకుని అప్పును రద్దు చెయ్యడానికి నిరాకరించాడు, అతనిని చెరలో వేసాడు.

చాలా కలవరపడ్డారు

అంటే, “లోతుగా దుఃఖించారు” లేక “చాలా క్రుంగిపోయారు.”

సమస్తం

అంటే, “ఆ సేవకుడు తన తోటి సేవకునికి చేసిన దానిని గురించి వారు రాజుకు చెప్పారు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]

29-08

సమాచారం

యేసు కథ చెప్పడం కొనసాగించాడు

సేవకుడిని పిలిచాడు

అంటే, “సేవకుడిని తన వద్దకు రమ్మని ఆజ్ఞాపించాడు” లేక “సేవకుడిని తన వద్దకు తీసుకొని రమ్మని తన భటులకు ఆజ్ఞ ఇచ్చాడు.”

నన్ను బతిమాలాడు

ఈ వాక్యాన్ని “నన్ను వేడుకొన్నాడు” లేక “నా పట్ల కరుణ చూపాలని ఆత్రుతగా అడిగాడు.”

నీవు కూడా ఆ విధంగా చెయ్యవలసింది

అంటే, “నేను నిన్ను క్షమించిన విధంగా నీవూ నీకు అచ్చియున్న వానిని క్షమించియుండవలసింది.”

త్రోసారు

అంటే, “అక్కడ వెయ్యాలని తన భటులకు ఆజ్ఞాపించాడు.” “త్రోసారు” అనే పదం 29:06 చట్రంలో ఏవిధంగా అనువదించారో గమనించండి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/other/beg]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]

29-09

అప్పుడు యేసు ఇలా చెప్పాడు

కొన్ని భాషలు “ఆయన శిష్యులకు” అని అదనంగా చేర్చాయి.

ఇది

“ఇది” అనే పదం 29:08 చట్రంలో క్షమించలేని సేవకుడిని రాజు శిక్షించిన దానిని సూచిస్తుంది.

నా పరలోకపు తండ్రి

అంటే, “పరలోకంలో ఉన్న నా తండ్రి.” తండ్రియైన దేవునితో విశిష్టమైన, వ్యక్తిగతమైన సంబంధాన్ని ప్రభువైన యేసు వ్యక్తపరుస్తున్నాడు.

నీ సహోదరుడు

ఈ పదాన్ని 29:01 చట్రంలో ఏవిధంగా అనువదించారో చూడండి.

నీ హృదయంలోనుండి

అంటే, “చిత్తశుద్ధితో” లేక “నిజంగా” లేక “యధార్ధతతో” లేక “నిజాయితీతో.”

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]