తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

43-01

పరలోకానికి తిరిగి వెళ్ళాడు

అంటే, “పరలోకానికి వెనక్కు వెళ్ళాడు.”

యెరూషలెంలో నిలిచారు

అంటే, “యెరూషలెంలో కొంత కాలం నిలిచారు.” వారు అక్కడ శాశ్వతం ఉండిపోలేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

43-02

పెంతెకోస్తు

“పెంతెకోస్తు” అంటే “యాభైయవ (రోజు).” మీ అనువాదంలో “పెంతెకోస్తు” అనే పదాన్ని వినియోగించవచ్చు. వాక్యభాగం దాని అర్థాన్ని చెప్పనివ్వాలి. లేక దాని అర్థం 50 వ రోజు అని మీరు చెప్పవచ్చు.

గోధుమ పంట వేడుక చేసారు.

యూదులు గోధుమ పంట కోసం తమ అర్పణలు తేవడం, ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. గోధుమ ఒక విత్తన పంట. “గోధుమ” అనే పదం మీకు లేకపోతే విత్తనానికి సాధారణ పదాన్ని వినియోగించండి. మే మాసంలో ఇది జరుగుతుంది. ఇతర పంటలు సంవత్సరంలో ఇతర మాసాలలో పంటకొస్తాయి.

ఈ సంవత్సరం

అంటే, “యేసు చనిపోయిన సంవత్సరం”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/passover]]
  • [[rc://*/tw/dict/bible/kt/jew]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/heaven]]

43-03

ఒక బలమైన గాలివంటిది

అంటే, “ఒక బలమైన గాలి చేసే శబ్దం” లేక “గాలి బలంగా వీచినప్పుడు కలిగే శబ్దం.”

పరిశుద్ధాత్మతో నింపబడ్డారు

అంటే, “పరిశుద్ధాత్మ ద్వారా సామర్ధ్యాన్ని పొందారు” లేదా “పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందారు.”

ఇతర భాషలలో

“వారి భాష కాకుండా ఇతర భాషలలో” అని అనువదించవచ్చు. లేదా “పరదేశీ భాషలలో” లేదా “ఇతర స్థలాలలో ఉన్న ప్రజలు మాట్లాడే భాషలలో” అని అనువదించవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్కు శక్తిని అనుగ్రహించేంత వరకూ విశ్వాసులకు ఈ భాషలు తెలియదు. “భాషలు” పదం అనువదించడానికి వినియోగించే పదం ప్రజలు వాస్తవంగా మాట్లాడేదీ అర్థం చేసుకొనేదీ అయ్యి ఉండేలా చూడాలి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]

43-04

సమూహం

“ప్రజల గుంపు” లేదా “పజల పెద్ద గుంపు” అని అనువదించవచ్చు.

దేవుని ఆశ్చర్య కార్యాలు

“దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

43-05

శిష్యులు మత్తులో ఉన్నారని నిందించారు

“శిష్యులు మత్తులై ఉన్నారని చెప్పారు” అని అనువదించవచ్చు.

యోవేలు

ఇది జరగడానికి అనేక వందలాది సంవత్సరాలకు ముందు యోవేలు ప్రవక్త నివసించాడు.

అంత్య దినాలు

“లోకాంతానికి ముందు చివరి రోజులను” సూచిస్తున్నాయి.

నా ఆత్మను కుమ్మరిస్తాను

“నా ఆత్మను ధారాళంగా ప్రజలకు ఇస్తాను” అని అర్థంలో దీనిని అర్థం చేసుకోవచ్చు. లేదా “మనుషులనుపజలను పూర్తిగా ఆత్మతో నింపేలా చేస్తుంది.”

నా ఆత్మ

అంటే, “నా పరిశుద్ధాత్మ.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]

43-06

సమాచారం

పేతురు ప్రజలకు బోధించడం కొనసాగిస్తున్నాడు

ఇశ్రాయేలు పురుషులారా

“ఇశ్రాయేలు ప్రజలారా” అని కొన్ని భాషలలో చెప్పడం మంచిది, ఎందుకంటే దీనినిలో స్త్రీలూ, పురుషులూ కలిసి ఉన్నారు. “నా తోటి ఇశ్రాయేలు ప్రజలారా” లేదా “నా తోటి యూదులారా” అని అనువదించవచ్చు, పేతురు కూడా యూదుడే, “ఇశ్రాయేలు ప్రజలకు” చెందియున్నాడు అని స్పష్టం చెయ్యడానికి ఈ పదాన్ని వినియోగించ వచ్చు.

మీరు ఆయనను సిలువ వేశారు

“మీరు ఆయనను సిలువ వెయ్యడానికి కారకులయ్యారు” అని అనువదించవచ్చు. లేదా “మీ కారణంగా ఆయన సిలువ వెయ్యబడ్డాడు.” వాస్తవానికి యూదులు యేసును సిలువ వెయ్యలేదు. అయితే యూదా నాయకులు ఆయన శిక్షించబడడానికీ కారణం అయ్యారు. ప్రజలలో అనేకులు ఆయన సిలువ వెయ్యబడాలని అరిచారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/miracle]]
  • [[rc://*/tw/dict/bible/kt/power]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]

43-07

సమాచారం

పేతురు సమూహానికి బోధించడం కొనసాగించారు.

ఇది ప్రవచనాన్ని నెరవేర్చింది

“చాలా కాలం క్రితం ప్రవక్తలలో ఒకరు చేపిన్నది నిజం కావడానికి ఇది కారణం అయ్యింది” అని మరొక విధంగా దీనిని అనువదించవచ్చు.

నీవు అనుమతించవు

“నీవు”, “నీ” అనే పదం దేవుణ్ణి సూచిస్తుంది. దానిని స్పష్టం చెయ్యడానికి “నీవు, దేవా అనుమతించవు” అని అనువదించవచ్చు. “ఓ దేవా, నీవు” అని కొన్ని భాషలలో ప్రత్యేకమైన విధానంలో పదాలు ఉంటాయి.

సమాధిలో కుళ్ళు పట్టనివ్వవు

అంటే, “సమాధిలో కుళ్ళిపోవడం” లేడా “సమాధిలో మురిగిపోవడం.” ప్రభువైన యేసు సమాధిలో ఎక్కువ కాలం ఉండడని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆయన చనిపోయి ఉండడు అని మరొక విధంగా చెప్పవచ్చు. అయితే ఆయన తిరిగి సజీవుడవుతాడు.

యేసును సజీవునిగా తిరిగి లేపాడు

అంటే, “యేసును సజీవుడిగా తిరిగి లేపాడు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/raise]]
  • [[rc://*/tw/dict/bible/other/death]]
  • [[rc://*/tw/dict/bible/kt/fulfill]]
  • [[rc://*/tw/dict/bible/kt/prophet]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]
  • [[rc://*/tw/dict/bible/kt/witness]]
  • [[rc://*/tw/dict/bible/kt/life]]

43-08

సమాచారం

పేతురు సమూహంతో తన బోధను కొనసాగిస్తున్నాడు

యేసు ఇప్పుడు ఘనపరచబడ్డాడు

“యేసు ఇప్పుడు పైకి ఎత్తబడ్డాడు” లేదా “యేసు ఇప్పుడు పైకి హెచ్చించబడ్డాడు” లేదా “దేవుడు యేసును హెచ్చించాడు” అని అనువదించవచ్చు.

దేవుని కుడిపార్శ్వమున

“అత్యంత హెచ్చయిన స్థానం” లేదా “హెచ్చయిన ఘనతకు స్థానానికి ప్రక్కన.”

కారణం అవుతున్నాడు

అంటే, “విశ్వాసులను బలపరుస్తున్నాడు” లేదా “ఈ పనులు చెయ్యడానికి శక్తినిస్తున్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/godthefather]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]

43-09

సమాచారం

సమూహానికి బోధించడం కొనసాగిస్తున్నాడు

అయితే ఇప్పుడు ఖచ్చితంగా తెలుకోండి

“అయితే అది సత్యం అని మీరు తెలుసుకోవచ్చును” లేక “అయితే మీరు నిశ్చయంగా ఉండవచ్చు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/crucify]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/lord]]
  • [[rc://*/tw/dict/bible/kt/christ]]

43-10

అధికంగా కదిలించబడ్డాడు

అంటే, “చాలా కలవరపడ్డాడు” లేదా “వారు వినినప్పుడు చాలా బాధ పడ్డారు.” “కదిలించబడడానికి” బలమైన భావోద్రేకాలను అనుభవిస్తారు.

సహోదరులు

ఒక యూడుడు తోటి యూదుడిని పలకరించే సాధారణ విధానం. “స్నేహితులు” అని కూడా అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]

43-11

నామంలో

ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. “అధికారము చేత”, “అధికారం కింద.” మీ భాషలో ఈ విధంగా అర్థం అయినట్లే “నామం” అనే పదాన్ని అక్షరార్ధంగా అనువదించడానికి ఆలోచన చెయ్యండి.

క్రీస్తు

దీనికి “మెస్సీయ” అనే అర్థం ఉంది. “అభిషిక్తుడైన వాడు” అని లేదా “ఏర్పాటు చెయ్యబడినవాడు” అని అనువదించవచ్చు. కొంతమంది అనువాదకులు “క్రీస్తు” అని పదాన్ని ఉంచడానికే యెంచుకొంటారు, తమ సొంత భాషలోని శబ్దాలలో పలుకుతారు.

యేసు క్రీస్తు

“క్రీస్తు” అనే పదం ఇక్కడ పేరును సూచిస్తుంది కనుక, కొందరు అనువాదకులు క్రమాన్ని మార్పు చెయ్యడానికి చూస్తారు, “క్రీస్తు యేసు” అని పలుకుతారు. రెండు క్రమాలు బైబిలులో వినియోగించబడ్డాయి.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/repent]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]

43-12

సమాచారం

ఈ చట్రానికి నోట్సు లేదు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/believe]]
  • [[rc://*/tw/dict/bible/other/peter]]
  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/jesus]]
  • [[rc://*/tw/dict/bible/kt/baptize]]
  • [[rc://*/tw/dict/bible/kt/church]]
  • [[rc://*/tw/dict/bible/other/jerusalem]]

43-13

వారిని క్షేమాన్ని గురించి తలంచారు

అంటే, “వారి పట్ల ఆశావహ అభిప్రాయాన్ని కలిగియున్నారు.”

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలను స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/disciple]]
  • [[rc://*/tw/dict/bible/kt/apostle]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/other/praise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/believer]]