తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

08-01

పంపాడు

యాకోబు యోసేపును వెళ్ళమని చెప్పాడు, యోసేపు వెళ్ళాడు అని ఈ పదానికి అర్థం

ఇష్టమైన కుమారుడు

ఈ పదం “తనకున్న ఇతర కుమారులందరికంటే అధికంగా ప్రేమించబడిన కుమారుడు” అని అనువదించవచ్చు.

పరిశీలించాడు

యోసేపు అక్కడికి వెళ్లి తన సోదరుల విషయంలో అక్కడ అంతా సవ్యంగా ఉందా అని చూసాడు అని అర్థం. కొన్ని భాషలలో “తన సోదరుల క్షేమాన్ని చూడడానికి” అని ఉండవచ్చు.

సోదరులు

వీరు యోసేపు అన్నలు

మందలను కాస్తున్నారు

ఇది అనేక రోజుల ప్రయాణం కనుక “దూరంలో ఉంటూ కాస్తున్నవారు” అని చెప్పడం అవసరం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/josephot]]

08-02

తన సోదరుల వద్దకు వచ్చాడు

“తన సోదరులు ఉన్న ప్రదేశానికి చేరుకొన్నాడు” అని మరొక విధంగా అనువదించవచ్చు.

అపహరించారు

తన ఇష్టానికి వ్యతిరేకంగా పట్టుకొన్నారు. ఈ విధంగా చెయ్యడం వారికి సరియైనది కాదు.

బానిస వర్తకులు

ఒక యజమాని నుండి మనుష్యులను కొనే వ్యాపారం చెయ్యడం, వారిని మరోక యజమానికి బానిసలుగా అమ్మడం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/dream]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]

08-03

గొర్రె రక్తం

బట్టల మీద ఉన్న గొర్రె రక్తం యోసేపు రక్తం అని యాకోబు తలంచాలని సోదరులు కోరారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

08-04

ప్రభుత్వ అధికారి

ఈ వ్యక్తి ఐగుప్తు ప్రభుత్వంలో ఒక భాగం. “ఐగుప్తు ప్రభుత్వంలో ఒక అధికారి” అని మరొక విధంగా అనువాదం చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/nileriver]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

08-05

యోసేపుతో పాపం చెయ్యడానికి ప్రయత్నించింది

“ఆమెతో లైంగిక పాపం చెయ్యడానికి యోసేపును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించింది” అని మరొక విధంగా చెప్పవచ్చు. “తనతో పరుండ”డానికి అనే పదం అసభ్యంగానూ, అసహ్యంగానూ కాకుండా వ్యక్తపరచే విధానం.

దేవునికి వ్యతిరేకంగా పాపం

వివాహం చేసుకోకుండా ఒకరితో ఒకరు లైంగిక సంబంధాలలో పాల్గొనడం ప్రజల కోసం దేవుడు ఇచ్చిన శాసనానికి వ్యతిరేకం. దేవుని శాసనానికి అవిధేయత చూపించడం ద్వారా పాపం చెయ్యకూడదని యోసేపు కోరుకున్నాడు.

దేవునికి నమ్మకంగా ఉండిపోయాడు

“దేవునికి విధేయత చూపించడం కొనసాగించాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/faithful]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

08-06

అతనిని ఎక్కువగా వ్యాకులపరచింది

రాజు అధికంగా భయపడ్డాడు, కలవరపడ్డాడు అని అర్థం (దర్శనాలలో తాను చూచిన దానిని బట్టి)

అతని సలహాదారులు

ఈ పురుషులు ప్రత్యేకమైన శక్తులు, జ్ఞానం కలిగినవారు, కొన్నిసార్లు కలల భావాన్ని చెప్పగల్గుతారు. “జ్ఞానులు” అని కొన్ని అనువాదాలు చెపుతున్నాయి

కలల అర్థం

కలలు రానున్న భవిష్యత్తులో జరగబోతున్న దాని గురించి దేవుళ్ళు చెప్పే సందేశాలు అని ఐగుప్తులోని ప్రజలు నమ్ముతారు. జరగబోతున్న దానిని ఫరోకు చెప్పడానికి దేవుడు కలలను వినియోగించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/kt/innocent]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/king]]
  • [[rc://*/tw/dict/bible/other/dream]]

08-07

కలల అర్థం చెప్పడం

“భావం వివరించడం” అంటే ఒకదాని అర్థాన్ని చెప్పడం . కనుక యోసేపు ఇతరుల కలల అర్థాన్ని చెప్పగల సమర్ధుడు.

యోసేపును అతని వద్దకు తీసుకొని వచ్చారు

“యోసేపు తన వద్దకు తీసుకొని రావాలని తన సేవకులకు ఆజ్ఞ ఇచ్చాడు” అని మరొక విధంగా చెప్పవచ్చు.

దేవుడు పంపబోతున్నాడు

ఏడు సంవత్సరాలు కోసం పంటను దేవుడు అధికంగా ఇయ్యబోతున్నాడు, దాని తరువాత పంట చాలా తక్కువగా పండేలా చేస్తాడు తద్వారా మనుష్యులూ, పశువులూ తినడానికి సరిపడిన ఆహారం ఉండదు.

కరువు

తోటలూ, పొలాలు చాలా తక్కువ ఆహారాన్ని పండిస్తాయి, ప్రజలకూ, పశువులకూ తినడానికి చాలినంత ఉండదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/dream]]
  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]

08-08

ఆకట్టుకొన్నాడు

యోసేపు జ్ఞానానికి ఫరో చాలా ఆశ్చర్యపడ్డాడు, అతని పట్ల గౌరవం చూపించాడు; యోసేపు తన ప్రజల క్షేమం కోసం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు చెయ్యగలడని నమ్మాడు. “యోసేపు జ్ఞానం ఫరోని ఆకట్టుకొంది” అని చెప్పడం స్పష్టంగా ఉంటుంది.

రెండవ అత్యధికమైన శక్తి కలిగిన వ్యక్తి

ఫరో యోసేపును ఐగుప్తు అంతటి మీదా చాలా శక్తివంతమైన, ప్రాముఖ్యమైన అధికారిగా చేసాడు. కేవలం ఫరో ఒక్కడు మాత్రమే యోసేపు కంటే శక్తిమంతుడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/pharaoh]]
  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

ఆహారాన్ని అధిక మొత్తంలో నిలువ చేసాడు

విస్తారంగా పండిన పంటనుండి ధాన్యం సేకరించి నగరాలకు తీసుకొనివచ్చి అక్కడ నిలువ చేసారు. ఆ ధాన్యం ఫరోకు చెందింది.

కరువు

దీనిని 08:07 లో ఏవిధంగా అనువాదించావో చూడండి

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]

08-10

ఐగుప్తు, కనాను కూడా

“ఐగుప్తు దేశం, కనాను దేశం కూడా” అని చెప్పడం కొన్ని భాషలలో చాలా స్పష్టంగా ఉండవచ్చు లేక సహజంగా ఉండవచ్చు.

కరువు తీవ్రంగా ఉంది

కరువు చాలా తీవ్రంగా ఉంది. ఆహారం కొరత ఏర్పడింది. ఐగుప్తు వెలుపల అనేకమంది ప్రజలు ఆకలితో ఉన్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

08-11

అతని పెద్దకుమారులు

యోసేపును బానిసత్వంలోనికి అమ్మివేసిన అన్నదమ్ములు వీరు

యోసేపును గుర్తించలేదు

ఆ వ్యక్తి యోసేపు అని వారికి తెలియలేదు, ఎందుకంటే వారు యోసేపును చివరిసారి చూసినప్పటి కంటే ఇప్పుడు చాలా పొడగరిగా ఉన్నాడు, ఐగుప్తు దుస్తులలో ఉన్నాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/other/josephot]]

08-12

తన సోదరులను పరీక్షిస్తున్నాడు

యోసేపు తన అన్నలను ఇబ్బందికరమైన పరిస్తితులలో ఉంచాడు, వారు తమ కనిష్ట సోదరుడిని కాపాడుతున్నారా లేక తనను చూసిన విధంగానే హీనంగా చూస్తున్నారా అని చూస్తున్నాడు. వారు తమ తమ్ముడిని భద్రంగా చూస్తున్నప్పుడు వారు మార్పు చెందారని యోసేపు చూసాడు.

వారు మార్పు చెందినప్పుడు

“వారు గతంలో ఉన్నదానికి భిన్నంగా ఉన్నప్పుడు” అని మరొక విధంగా చెప్పవచ్చు. “అనేక సంవత్సరాల క్రితం యోసేపు సోదరులు అతనిని బానిసత్వం లోనికి అమ్మివేశారు,

భయపడవద్దు

“నా నుండి ఎటువంటి శిక్షకూ భయపడవలసిన అవసరం లేదు” అని మరొక విధంగా చెప్పవచ్చు. యోసేపు పట్ల వారు ఘోరమైన తప్పిదం చేసారు, ఇప్పుడు యోసేపు ఒక గొప్ప అధికారిగా వారిని శిక్షించడానికి శక్తికలిగినవాడిగా ఉన్న కారణంగా యోసేపు విషయంలో తన సోదరులు భయపడుతున్నారు. యోసేపు వారికి ఆహారాన్ని అమ్మడానికి నిరాకరించవచ్చు, లేక వారిని చెరలో ఉంచవచ్చు లేక చంపవచ్చు.

మేలు కోసం చెడు

యోసేపు సోదరులు యోసేపును ఒక బానిసగా అమ్మినప్పుడు ఒక చెడు కార్యాన్ని జరిగించారు, యోసేపును ఐగుప్తుకు పంపారు. అయితే కరువు కాలంలో భయంకర కరువునుండి అనేక వేలమందినీ, తన సొంత కుటుంబాన్ని కూడా యోసేపు కాపాడేలా దేవుడు దీనిని అనుమతించాడు. ఇది చాలా మేలుకరమైన అంశం.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/kt/evil]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/good]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]

08-13

సమాచారం

_(ఈ చట్రానికి వివరణ ఏమీ లేదు)

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/josephot]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]

08-14

యాకోబు ముసలివాడు అయినప్పటికీ, అతడు ఐగుప్తుకు కదిలాడు.

ఐగుప్తు కనానునుండి చాలా దూరంలో ఉంది. వృద్దుడైన వ్యక్తి అంతదూరం నడిచివెళ్ళడం లేక బండిమీద ప్రయాణం చెయ్యడం చాలా కష్టం.

యాకోబు చనిపోవడానికి ముందు

యాకోబు ఐగుప్తులో చనిపోయాడు. తనకూ, తన సంతానానికీ ఇస్తానని వాగ్దానం చేసిన కనానుకు అతడు తిరిగి వెళ్ళలేదు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]

08-15

నిబంధన వాగ్దానాలు

చాలా కాలం క్రితం దేవుడు అబ్రాహముతో ఒక ఒప్పందాన్ని చేసాడు, అనేకమంది సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు. వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకొంటారు, గొప్పజనాంగం అవుతారు. అబ్రహాము సంతానం ద్వారా మనుష్యులందరూ ఆశీర్వదించబడతారని కూడా దేవుడు వాగ్దానం చేసాడు. 07:10 కూడా చూడండి.

అందించాడు

“పంపబడింది” లేక “ఇవ్వబడింది” లేక “అన్వయించబడింది” అని మరొక విధంగా అనువదించవచ్చు. దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం అతని సంతానానికీ, మనుమ సంతానానికీ, మిగిలిన అతని సంతానాని కంతటికీ వర్తిస్తుంది. 06:04 చూడండి.

ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు

అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం గొప్ప జనాంగం అవుతుందని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తరువాత దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు 12 కుమారులు 12 గోత్రాలుగా మారారు. ఈ 12 గోత్రాలు పురాతన ఇశ్రాయేలు దేశంగా తయారయ్యింది. యాకోబు నూతన పేరుమీద ఇది ఏర్పడింది.

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/jacob]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]