తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

13-01

మండుతున్న పొద

మోషే ఐగుప్తుకు రావడానికి ముందు, దేవుడు ఒక మండుచున్న పొద నుండి మాట్లాడాడు. అయితే ఆ పొద అగ్ని చేత కాలిపోలేదు. 09:12 చూడండి

వారి గుడారాలను ఏర్పరచుకొన్నారు

ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వాగ్దానదేశానికి చాలా దూరం ప్రయాణం చెయ్యవలసి ఉంది. కనుక వారు తమతో గుడారాలను తీసుకొన్నారు. తద్వారా వారు మార్గంలో వాటితో తమ నివాసాలు ఏర్పాటు చేసుకొని వాటిలో విశ్రమిస్తారు. కొన్ని భాషలలో ఈ వాక్యాన్ని “గుడారాలను పట్టుకొని ఉన్నారు” అని అనువదించవచ్చు.

పర్వతం ఎదుట

ఈ పదం “పర్వతం అడుగు భాగం” అని అనువదించవచ్చు. నేలమీద పర్వతం ఏర్పడేలా ఏటవాలు ప్రాంతం ఆరంభం అయ్యేదాని ప్రక్కన ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/redsea]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]

13-02

నా నిబంధనను పాటించండి

ఈ వాక్యం “నా నిబంధన చెయ్యమని కోరిన దానిని మీరు చెయ్యండి” అని అనువదించవచ్చు. విధేయత చూపించడం, నిబంధనను జరిగించడం రెండు భిన్నమైన కార్యాలు కాదు. దీనిని స్పష్టంగా చెప్పాలంటే “నా నిబంధనను గైకొనడం ద్వారా నాకు లోబడండి” అని చెప్పవచ్చు. దేవుడు తన నిబంధన కోరుతున్న దానిని వెంటనే చెపుతాడు

నా స్వకీయ సంపాద్యం

“మీరు నా స్వాస్థ్యంగా ఉంటారు, నేను మిమ్మును అమితంగా విలువైన వారిగా ఎంచుతాను” లేక “ఇతర ప్రజా గుంపులందరి కంటే మీరు నాకు విలువైన గుంపుగా ఉంటారు” లేక “మీరు నా సొంత ప్రశస్తమైన ప్రజగా ఉంటారు” అని అనువదించవచ్చు.

మీరు యాజక రాజ్యంగా ఉంటారు

ఈ వాక్యం “నేను మీకు రాజుగా ఉంటాను, మీరు యాజకులుగా ఉంటారు” అని అనువదించవచ్చు. ఇశ్రాయేలీయులు ఇతర దేశాలకు దేవుని గురించి బోధించవలసిన వారిగా ఉండాలి, ఇశ్రాయేలీయులకూ దేవునికీ మధ్య సంచరించేలా దేవునికీ ఇశ్రాయేలు దేశంలో యాజకులుగా ఉన్నట్టుగా దేవునికీ దేశాలకు మధ్యవర్తులుగా ఉండవలసియుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/kingdom]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/kt/holy]]

13-03

మూడు దినముల తరువాత

మరొక మాటలలో, వారు సీనాయి పర్వతం వద్దకు వచ్చిన మూడు రోజుల తరువాత, దేవుడు మొట్టమొదటిసారి వారితో మాట్లాడాడు

ఆత్మీయంగా తమ్మును తాము సిద్ధపరచుకొన్నారు

దేవుణ్ణి కలుసుకోవడంలో ఆచార పూర్వకమైన సిద్ధబాటును ఇది సూచిస్తుంది. దీనిని “దేవుణ్ణి కలుసుకోడానికి సిద్ధపడ్డారు” లేక దేవుణ్ణి కలుసుకోడానికి తమ్మును తాము సిద్ధపరచుకొన్నారు” అని అనువదించవచ్చు.

పెద్ద బూర శబ్దం

ఈ పదం “ఒక కొమ్మునుండి ఒక పెద్ద శబ్దం వచ్చింది” లేక “ఒక కొమ్ము ఊదారు, అది ఒక పెద్ద శబ్దం చేసింది” లేక “ఒక కొమ్మునుండి వచ్చిన పెద్ద శబ్దాన్ని వారు విన్నారు” అని అనువదించ వచ్చు. గొర్రెల కొమ్ముల నుండి కొమ్ము బూరలు తయారు చేస్తారు. దేవుణ్ణి కలుసుకోడానికి పర్వతం వద్ద ప్రజలు సమావేశం కావడానికి వాటిని వినియోగించేవారు.

పర్వతం మీదకు మోషే ఒక్కడికి మాత్రమే అనుమతి లభించింది

ఈ వాక్యాన్ని “పర్వతం మీదకు రావడానికి దేవుడు మోషేను అనుమతించాడు, అయితే మరెవరినీ దేవుడు అనుమతించలేదు” అని తర్జుమా చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]

13-04

దేవుడు వారికి నిబంధనను ఇచ్చి ఇలా చెప్పాడు

తరువాత దేవుడు నిబంధనలోని సారాంశాన్ని చెప్పాడు, అంటే వారు ఖచ్చితంగా లోబడవలసిన వాటిని గురించి ఆయన వారికి చెప్పాడు. దీనిని “దేవుడు వారికి తన నిబంధనను చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు లేక “దేవుడు వారితో ఈ నిబంధన చేసాడు” అని అనువదించవచ్చు.

యెహోవా మీ దేవుడు

కొన్ని భాషలలో సహజంగా దీని క్రమం “మీ దేవుడు యెహోవా” అని మారవచ్చు. ఇశ్రాయేలీయులకు ఒకరికంటే ఎక్కువమంది దేవుళ్ళు ఉన్నారనే భావన రాకుండా చూడాలి. యెహోవా ఏకైక దేవుడు అని స్పష్టంగా ఉండాలి. “మీ దేవుడైన యెహోవా” లేక “మీ దేవుడు, ఆయన పేరు యెహోవా” అని అనువదించవచ్చు.

బానిసత్వం నుండి మిమ్మును రక్షించినవాడు.

“బానిసత్వం నుండి నేను నిన్ను విడిపించాను” అని అనువదించ వచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/save]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/egypt]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/falsegod]]

13-05

సమాచారం

దేవుడు మోషేతో మాట్లాడడం కొనసాగించాడు

నేను యెహోవాను, రోషముగల దేవుడును.

ఈ వాక్యాన్ని “నేను యెహోవాను, నన్ను తప్పించి మరి దేనినైనా మీరు పూజించి, ఘనపరచినట్లయితే నేను కోపగిస్తాను.” అని అనువదించవచ్చు. ఇంకొకదాని కంటే లేక ఇంకొక వ్యక్తికంటే ఆయన ప్రజలు ఆయనను ప్రేమించి, సేవించి ఆయనకు మాత్రమే లోబడి యుండాలని దేవుడు బలంగా అభిలషించాడు.

నా పేరును వ్యర్ధంగా పలుకకూడదు

ఈ వాక్యాన్ని “గౌరవం, ఘనత చూపించని విధంగా నన్ను గురించి మాట్లాడకూడదు” లేక “నాకు సరైన గౌరవం, ఘనత ఇచ్చేవిధానంలో నన్ను గురించి మాట్లాడాలి” అని అనువదించవచ్చు

ఏడవ రోజు

ఈ పదాన్ని అనువదించడానికి వారంలో ఒక నిర్దిష్టమైన రోజు పేరును ఇవ్వడం కంటే (“ఏడవ”) సంఖ్యను వినియోగించడం శ్రేష్టం,

నన్ను జ్ఞాపకం చేసుకోడానికి

“నన్ను మీ మనసులో ఉంచుకోండి” లేక “నన్ను ఘనపరచడానికి” అని అనువాదం చెయ్యవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/yahweh]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sabbath]]
  • [[rc://*/tw/dict/bible/kt/holy]]

13-06

సమాచారం

దేవుడు మోషేతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు

వ్యభిచారం చెయ్యకూడదు

“నీ జీవిత భాగస్వామితో తప్పించి మరెవరితోనూ లైంగిక సంబంధమైన సంబంధాలు కలిగియండవద్దు” లేక “మరొకరి భార్యతో గానీ, లేక మరొకరి భర్తతో గానీ లైంగిక సంబంధాలు కలిగియుండవద్దు” అని అనువదించవచ్చు. ప్రజలను గాయపరచకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా అనువదించడంలో జాగ్రత్త తీసుకొండి. “వారితో పరుండ వద్దు”...లాంటి పరోక్షంగా, మర్యాదతో కూడిన విధానంలో ప్రస్తావించే మాటలు కొన్ని భాషల్లో ఉండవచ్చు.

అబద్దమాడవద్దు

దీని అర్థం, “ఇతరులను గురించి తప్పుడు మాటలు పలుకవద్దు.”

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/adultery]]

13-07

ఈ పది ఆజ్ఞలు

ఇశ్రాయేలీయులు విధేయత చూపించడం కోసం దేవుడు మోషేకు ఇంచ్చిన ఆజ్ఞలను సూచిస్తున్నాయి. 13:05 చట్రాలలో వాటి జాబితా ఉంది.

రాతి పలకలు

ఇవి చదునుగా ఉన్న రాతి పలకలు

దేవుడు అవి కూడా ఇచ్చాడు

ఈ వాక్యం “దేవుడు కూడా వారితో చెప్పాడు” అని అనువదించవచ్చు

అనుసరించడానికి

“వారు విధేయత చూపించాలి” లేక “వారు పాటించాలి” అని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/tencommandments]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]
  • [[rc://*/tw/dict/bible/other/punish]]

13-08

వివరణతో కూడిన వర్ణన

ఈ వాక్యాన్ని “దేవుడు వివరాలతో దానిని వర్ణించాడు” లేక “దేవుడు ఖచ్చితంగా కోరిన విధంగా వారు చెయ్యాలని వారితో చెప్పాడు” అని అనువదించవచ్చు.

అది దాని పేరు.

ఈ పదం “వారు దానికి ఆ పేరు పెట్టారు.” లేక “మోషే దానిని అలా పిలిచాడు” అని అనువదించవచ్చు

తెర వెనుక గది

ఈ గది తెర వెనక ఉంది. కొన్ని భాషలలో ఈ గదిని “తెరకు ముందు ఉన్న గది” అని పిలుస్తారు.

దేవుడు అక్కడ నివాసం ఉంటాడు

దేవుడు గుడారాలలో నివాసముండేలా తనను తాను పరిమితం చేసుకొంటున్నాడని ప్రజలు అభిప్రాయపడునట్లు ఈ వాక్యం చేస్తున్నట్లయితే దీనిని “దేవుడు ఉన్నాడు” లేక “దేవుడు తనను తాను అక్కడ మానవులకు బయలుపరచుకొన్నాడు” అని అనువాదం చెయ్యవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/tentofmeeting]]
  • [[rc://*/tw/dict/bible/kt/highpriest]]

13-09

దేవుని ధర్మశాస్త్రం

విధేయత చూపించాలని దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన ఆజ్ఞలూ, హెచ్చరికలన్నిటినీ ఇది సూచిస్తుంది

ప్రత్యక్షపు గుడారం వద్దకు

వారు జంతువులను ప్రత్యక్షపు గుడారం లోనికి తీసుకొని రాలేదు, ప్రత్యక్షపు గుడారం ఎదుట ఉన్న బలిపీఠం వద్దకు తీసుకొని వచ్చారు. వారు లోనికి తీసుకొని వచ్చారు అని అర్థమిచ్చే వ్యక్తీకరణను వినియోగించడం గురించి జాగ్రత్త తీసుకోండి.

ఒక వ్యక్తి పాపాన్ని కప్పుతుంది

ప్రజలు బలికోసం జంతువులను తీసుకొనివచ్చినప్పుడు వారి పాపాల్ని కప్పడానికి దేవుడు జంతువుల రక్తాన్ని చూడడానికి ఎంపిక చేసుకొన్నాడు. దాని దానిని కప్పడం ద్వారా అసహ్యంగానూ, ఆశుద్ధంగానూ ఉన్న దానిని దాచిపెడుతున్నట్టు ఉంది.

దేవుని దృష్టిలో పవిత్రం

ఈ వాక్యాన్ని “దేవుని ప్రకారం అతడు పాపం చెయ్యలేదన్నట్టుగా” లేక “దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినందుకు లభించే శిక్షనుండి విడుదల” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/disobey]]
  • [[rc://*/tw/dict/bible/kt/lawofmoses]]
  • [[rc://*/tw/dict/bible/other/tentofmeeting]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/priest]]
  • [[rc://*/tw/dict/bible/kt/altar]]
  • [[rc://*/tw/dict/bible/kt/blood]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]

13-10

వారికి ఇచ్చాడు

దీనిని “విధేయత చూపించాలని వారికి చెప్పాడు.”

ఆయన ప్రత్యేకమైన ప్రజ

భూ దేశాలన్నిటిలోనుండి. దేవుడు తన ప్రత్యేక ఉద్దేశం కోసం ఇశ్రాయేలీయులను ఎంపిక చేసుకొన్నాడు. “ఆయన ప్రత్యేక ప్రజా” లేక “ఆయన స్వకీయ జనం” లేక “తన ప్రజగా ఉండడానికి ఆయన ఎంచుకొన్న దేశం” అని అనువదించవచ్చు.

ఒక స్వల్ప కాలం

మోషే పర్వతం మీద దేవునితో ఉన్న నలుబది రోజుల కాలంలో ప్రజలు పాపం చేసారు.

భయానకరంగా పాపం చేసారు

ప్రత్యేకంగా దేవునికి కోపం తెప్పించే విధంగా వారు పాపం చేసారు. ఈ వాక్యాన్ని “వారు దుర్మార్గంగా పాపం చేసారు” లేక “వారు భయంకరమైన దానిని చేసారు” లేక “దేవునికి కోపం తెప్పించే చెడ్డ కార్యం వారు చేసారు” అని అనువదించవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/obey]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]

13-11

ప్రజలు ఎదురు చూసి అలసిపోయారు

ఈ వాక్యాన్ని “మోషే త్వరితంగా రాని కారణంగా వారు సహనం లేనివారయ్యారు” లేక “మోషే తిరిగి వచ్చేంత వరకూ ఎదురు చూడాలని కోరుకోలేదు” అని అనువదించవచ్చు.

బంగారాన్ని తీసుకొనివచ్చారు

ఇవి బంగారంతో తయారుచేసిన వస్తువులు, ఆభరణాలు. ఇవి కరిగిపోగలవు, ఇతర వస్తువుల వలే తయారు కాగలవు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]

13-12

ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేసారు.

బంగారంతో చేసిన వస్తువులను ప్రజలు తీసుకొనివచ్చినప్పుడు ఆహారోను వాటిని తీసుకొన్నాడు, వాటిని కరిగించాడు, కలిపాడు, ఒక దూడ రూపంలో తయారుచేసాడు.

క్రమం లేని ఆరాధన

విగ్రహాన్ని ఆరాధించడం ద్వారా ప్రజలు పాపం చేస్తున్నారు, వారు ఆ విగ్రహాన్ని పూజిస్తూ పాపకార్యాలు చెయ్యడం ద్వారా పాపం చేసారు.

అతని ప్రార్థన విన్నాడు

దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థన వింటాడు. ఈ పరిస్థితిలో “విన్నాడు” అంటే మోషే అడిగిన దానిని చెయ్యడానికి దేవుడు అంగీకరించాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/aaron]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/worship]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/sin]]
  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]

13-13

రాతి పలకలను నాశనం చేసాడు

అతడు ఆ రాతిపలకలను నేల మీద వేసి కొట్టాడు. దానిని వారు చిన్న ముక్కలుగా విరుగగొట్టారు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/tencommandments]]

13-14

విగ్రహాన్ని తుత్తునియలుగా విరుగగొట్టాడు

విగ్రహాన్ని అతి చిన్నవైన అనువులుగా పగలగొట్టడం ద్వారా దానిని మోషే సమూలంగా నాశనం చేసాడు

నీళ్ళ లో

బంగారు పిండిని ఎక్కువ నీటిలోనికి మోషే చెదరగొట్టాడు

ఒక తెగులు

“ఒక భయంకరమైన వ్యాధి” అని దీనిని అనువదించవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/other/idol]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

13-15

మోషే చేసాడు

సుత్తి, ఉలి లాంటి సాధనాలతో మోషే రాతిపలకలను చెక్కాడు.

వినాలని

ఈ చట్రాన్ని ఏవిధంగా అనువదించారో 13:2 చూడండి

...నుండి బైబిలు కథ

ఈ రిఫరెన్సులు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/moses]]
  • [[rc://*/tw/dict/bible/kt/pray]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/forgive]]
  • [[rc://*/tw/dict/bible/other/tencommandments]]
  • [[rc://*/tw/dict/bible/kt/israel]]
  • [[rc://*/tw/dict/bible/other/sinai]]
  • [[rc://*/tw/dict/bible/kt/promisedland]]