తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

05-01

ఇంకా కుమారుడు కలుగలేదు

కుమారుడు లేకుండా, ఒక గొప్ప జనాంగం కావడానికి అబ్రాముకు సంతానం లేదు.

ఆమెను కూడా వివాహం చేసుకో

హాగరును అబ్రాము తన రెండవ భార్యగా చేసికొనవచ్చును అయితే భార్యగా శారాకు ఉన్నంత పూర్తి స్థాయి ఆమెకు ఉండదు. ఆమె ఇంకా శారా సేవకురాలిగానే ఉంటుంది.

నా కోసం కుమారుడిని కను

హాగరు శారాకు సేవకురాలు కనుక హాగరుకు పుట్టిన పిల్లలందరికీ శారా తల్లిగా పరిగణించబడుతుంది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/sarah]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/servant]]
  • [[rc://*/tw/dict/bible/other/hagar]]

05-02

వివాహం అయ్యింది

హాగరు అబ్రాముకు ఉంపుడుగత్తె అయ్యింది – “రెండవ భార్య”గా తక్కువ స్థాయిలో ఉంది. అయినా హాగరు శారాకు సేవకురాలిగానే ఉంది.

హాగరు విషయంలో అసూయ పడింది

తనకు పిల్లలు కలుగకుండా, హాగరుకు పిల్లలు కలుగబోతున్నందుకు ఆమె విషయంలో శారా అసూయ పడింది.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/hagar]]
  • [[rc://*/tw/dict/bible/other/ishmael]]
  • [[rc://*/tw/dict/bible/other/sarah]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

05-03

అనేక దేశాలకు తండ్రి

అబ్రాము అనేకమంది సంతానాన్ని కలిగియుండబోతున్నాడు, వారికి తమ సొంత భూభాగాలు ఉంటాయి. తమ్మును తాము పరిపాలించుకొంటారు. ఆ సంతానం, ఇతర ప్రజలు అబ్రామును వారి పితరుడు అని జ్ఞాపకం చేసుకొంటారు, ఆయనను గౌరవిస్తారు.

నేను వారి తండ్రిగా ఉందును

“వారు ఆరాధించేలా నేను వారి దేవుడిగా ఉంటాను” అని మరొక విధంగా చెప్పవచ్చు.

నీ కుటుంబంలోని ప్రతీ పురుషుడు

ఈ వాక్యాన్ని “నీ కుటుంబంలోని ప్రతీ మగబిడ్డ, ప్రతీ పురుషుడు” అని అనువదించ వచ్చు. దీనిలో అభ్రాము సేవకులూ, ఆయన సంతానం ఉన్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/other/canaan]]
  • [[rc://*/tw/dict/bible/kt/circumcise]]

05-04

సమాచారం

దేవుడు అబ్రాముతో మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.

వాగ్దాన కుమారుడు

దేవుడు అబ్రాము శారాలకు వాగ్దానం చేసిన కుమారుడు ఇస్సాకు. అబ్రాముకు అనేకమంది సంతానాన్ని ఇవ్వడానికి దేవుడు వినియోగించుకొనే కుమారుడు.

అతనితో నా నిబంధనను చేయుదును

ఇది దేవుడు అబ్రాముతో చేసిన నిబంధన.

అనేకులకు తండ్రి

దేవుడు వాగ్దానం చేసిన విధంగా అనేక దేశాలుగా మారే అనేకమంది మనుష్యులకు అబ్రాము పితరుడుగా కాబోతున్నాడు.

రాకుమారి

రాజకుమారి అంటే రాజు కుమార్తె. శారాయి, శారా అనే రెండు పేర్లకు “రాకుమారి” అని అర్థం. అయితే దేవుడు ఆమె పేరును అనేక జనాంగాలకు తల్లిగా సూచించేలా మార్చాడు, ఆమె సంతానంలో కొందరు రాజులు అవుతారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/sarah]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/kt/covenant]]
  • [[rc://*/tw/dict/bible/other/ishmael]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/sarah]]

05-05

అతని ఇంటిలో పురుషులందరు

ఆబ్రహాము బాధ్యత తీసుకొనే పురుషులు, మగబిడ్డలందరూ అని అర్థం. దీనిలో పురుష సేవకులూ, యవనస్థులూ, ముసలివారూ ఉన్నారు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/circumcise]]
  • [[rc://*/tw/dict/bible/other/sarah]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

05-06

దేవుడు అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించాడు

అబ్రహాము ఆయనకు సంపూర్తిగా లోబడి యుండాలని దేవుడు కోరుకొన్నాడు, దేవుడు అబ్రాహాముకు చెప్పిన ప్రతిదానిలోనూ విధేయత చూపించాలని కోరుకొన్నాడు.

అతనిని చంపు

దేవుడు మానవ బలులను కోరుకోలేదు. అబ్రాహాము తన కుమారుని ప్రేమించినదాని కంటే ఆయనను ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు. తన కుమారుణ్ణి తిరిగి దేవునికి ఇవ్వాలని కోరినప్పుడు కూడా అబ్రాహాము విధేయత చూపించాలని దేవుడు కోరాడు.

దహనబలిని సిద్దపరచాడు.

అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించడానికి సిద్ధపడియున్నాడు. అబ్రహాము తన కుమారుని చంపడానికి ముందు దేవుడు అబ్రహాము ఆపాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/faith]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]

05-07

దహనబలి స్థలానికి నడిచాడు

ఒక ప్రత్యేకమైన ఎత్తైన కొండమీద ఇస్సాకును బలి ఇవ్వాలని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. వారు నివసించే స్థలానికి అది మూడు రోజుల ప్రయాణం.

దహనబలి కోసం కట్టెలు

ఒక దహనబలి కోసం సాధారణంగా ఒక గొర్రెపిల్లను చంపుతారు, దానిని కట్టెలమీద ఉంచుతారు, తద్వారా కట్టెలు, గొర్రెపిల్ల అగ్నిలో కాలిపోతాయి.

గొర్రెపిల్ల

ఒక చిన్న గొర్రెపిల్ల లేక మేకపిల్లను సహజంగా ఒక బలికోసం అర్పిస్తారు.

సమకూర్చడం

ఇస్సాకు స్థానంలో బలి ఇవ్వడానికి ఒక పొట్టేలును సమకూర్చడం ద్వారా అబ్రహాము మాటలను దేవుడు నెరవేర్చినప్పటికీ ఇస్సాకు తనకు దేవుడు సమకూర్చిన “గొర్రెపిల్ల” అని అబ్రహాము విశ్వసించియుండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/kt/lamb]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

05-08

తన కుమారుని చంపడం

దేవుడు మానవ బలులను కోరుకోలేదు. అబ్రాహాము తన కుమారుని ప్రేమించినదాని కంటే ఆయనను ఎక్కువగా ప్రేమించాలని దేవుడు కోరుకున్నాడు. తన కుమారుణ్ణి తిరిగి దేవునికి ఇవ్వాలని కోరినప్పుడు కూడా అబ్రాహాము విధేయత చూపించాలని దేవుడు కోరాడు.

ఆగు! చిన్నవానికి ఏమీ చేయకు!

దేవుడు ఇస్సాకును కాపాడాడు, అతనిని వధించకుండా అబ్రహామును నిలువరించాడు.

నీవు నాకు భయపడువాడవు

అబ్రహాము దేవునికి భయపడ్డాడు. దీనిలో దేవుని విషయంలో భయం, గౌరవం ఉన్నాయి. వాటి కారణంగా అబ్రహాము దేవునికి విధేయత చూపాడు.

నీ కుమారుడిని మాత్రమే

ఇష్మాయేలు కూడా అబ్రహాము కుమారుడే. అయితే ఇస్సాకు మాత్రం అబ్రహాము, శారాలకు ఒకే కుమారుడు. దేవుని నిబంధన ఇస్సాకుతో ఉంది. ఇస్సాకు ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని నేరవేరుస్తాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]
  • [[rc://*/tw/dict/bible/kt/altar]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]

05-09

ఒక పొట్టేలు

పొట్టేలు అంటే ఒక మగ గొర్రె. మనుష్యులు గొర్రెలను దేవునికి బలిగా అర్పిస్తారు.

దేవుడు ఒక పొట్టేలును సమకూర్చాడు

సరియైన సమయంలో పొట్టేలు ఒక పొదలో చిక్కుకొనేలా దేవుడు చేసాడు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/sacrifice]]
  • [[rc://*/tw/dict/bible/other/isaac]]

05-10

నీ ఒక్కగానొక్క కుమారుడు

05:08 లోని వివరణను చూడండి.

ఆకాశంలోని నక్షత్రాలు

04:08 లోని వివరణను చూడండి.

లోకంలో ఉన్న కుటుంబాలన్నీ

ఇక్కడ ‘కుటుంబాలు’ అనే పదం భూమి మీద ప్రత్యేకమైన పెద్ద ప్రజా గుంపులని సూచిస్తున్నాయి. తల్లిదండ్రులూ, పిల్లల గుంపులను కాదు.

నీ కుటుంబం ద్వారా ఆశీర్వదించబడతాయి

ఇక్కడ ‘కుటుంబం’ అంటే అబ్రహాము కలిగియుండబోయే అనేకమంది సంతానాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని తరాలు అబ్రహాము సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయి. అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడు, మెస్సీయ ద్వారా రాబోతుంది.

...నుండి ఒక బైబిలు కథ

ఈ సూచనలు ఇతర బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

  • [[rc://*/tw/dict/bible/kt/god]]
  • [[rc://*/tw/dict/bible/other/abraham]]
  • [[rc://*/tw/dict/bible/kt/son]]
  • [[rc://*/tw/dict/bible/kt/promise]]
  • [[rc://*/tw/dict/bible/kt/bless]]
  • [[rc://*/tw/dict/bible/other/descendant]]
  • [[rc://*/tw/dict/bible/other/obey]]