తెలుగు (Telugu): Open Bible Stories Translation Notes

Updated ? hours ago # views See on DCS Draft Material

01-01

ఆరంభం

అంటే “అన్నింటికీ ఆరంభం” దేవుడు తప్ప ఎవరూ లేని సమయంలో

సృష్టించబడింది

శూన్యంలోనుండి ఒక దానిని తయారు చెయ్యడం అనే భావనలో ఇది ఇక్కడ వినియోగించబడింది.

విశ్వం

భూమి మీదా, ఆకాశాలలో దృశ్యమైనవీ, అదృశ్యమైనవీ దేవుడు చేసినవన్నీ దీనిలో ఉన్నాయి.

భూమి

“భూమి” అనే పదం మనుష్యులు జీవించే ప్రపంచం యావత్తునూ సూచిస్తుంది.

చీకటి

ఇది పూర్తి చీకటిగా ఉంది. ఎక్కడా వెలుగు లేదు, ఎందుకంటే దేవుడు వెలుగును ఇంకాసృష్టించలేదు.

శూన్యం

నీటితో నిండియున్న భూమిని తప్పించి దేవుడు ఇంకా దేనినీ సృష్టించలేదు.

ఏదీ రూపొందించబడలేదు.

నిర్దిష్టమైన రూపాలు ఉన్నదేదీ లేదు – కేవలం సమస్తం నీటిచేత నింపబడియుంది.

దేవుని ఆత్మ

కొన్ని సార్లు పరిశుద్ధాత్మ అని పిలువబడిన దేవుని ఆత్మ ఆరంభంలో ఉన్నాడు, తాను చేయడానికి ఉద్దేశించిన దాన్నంతటినీ సృష్టించడానికి భూమిమీద స్వేచ్చగా కదులుతున్నాడు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/holyspirit]]

01-02

దేవుడు పలికాడు

దేవుని అతి సామాన్యమైన మౌఖిక ఆజ్ఞద్వారా వెలుగును సృష్టించాడు.

కలుగును గాక

ఇది దేవుని ఆజ్ఞ కనుక ఈ ఆజ్ఞ వెంటనే జరిగింది. ఇది ఖచ్చితంగా జరుగుతుందనే నిశ్చయతాపూరిత వాక్యంగా సహజంగా అనువదించవచ్చు. ఉదాహరణకు, “దేవుడు చెప్పాడు, ‘వెలుగు కలుగును గాక’ “ అని అనువదించవచ్చు.

వెలుగు

దేవుడు సృష్టించిన ప్రత్యేకమైన వెలుగు – అప్పటి వరకూ సూర్యుడు సృష్టించబడలేదు.

అది మంచిది

సృష్టి వృత్తాంతం అంతటిలోనూ ఈ పదం తరచుగా పునరావృతం అవుతుంది. సృష్టిలో ప్రతీ దశ దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన ప్రణాళికా, ఆయన ఉద్దేశం నేరవేర్చబడింది అనే అంశాన్ని నొక్కి చెపుతుంది.

సృష్టి

ఉనికిలో ఉన్న సమస్తాన్ని ఆరు దినాలలో దేవుడు చేసిన దానిని ఈ పదం సూచిస్తుంది.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]

01-03

రెండవ రోజు

దేవుని సృష్టి కార్యం క్రమంగా ఉంది, ఉద్దేశపూరితంగా ఉంది, పరంపరానుగతమైనది, ప్రతీ దినం ఆయన చేసిన కార్యాలు గత దినాలలో చేసిన వాటిమీద కట్టబడ్డాయి, ఆధారపడ్డాయి.

దేవుడు పలికాడు

దేవుడు ఒక ఆజ్ఞను పలకడం ద్వారా ఆకాశాన్ని సృషించాడు.

సృష్టించాడు

శూన్యంలోనుండి దేవుడు ఆకాశాన్ని సృష్టించాడు.

ఆకాశం

ఈ పదం భూమి మీద ఉన్న స్థలాన్నంతటినీ సూచిస్తుంది, దీనిలో ఆకాశాలూ, మనం పీల్చే గాలికూడా ఉన్నాయి.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]

01-04

మూడవ రోజు

క్రమబద్ధమైన రోజుల క్రమంలో తరువాత రోజు, దీనిలో జీవం కోసం దేవుడు భూమిని సిద్ధపరుస్తున్నాడు.

దేవుడు పలికాడు

దేవుడు ఒక ఆజ్ఞను పలకడం ద్వారా ఆరిన నేలను సృష్టించాడు

భూమి

ఇక్కడ వినియోగించిన పదం మట్టి లేక నేల ను సూచిస్తుంది, ఆరిన నేలగా తయారు చెయ్యబడింది.

సృష్టించాడు

శూన్యంలోనుండి ఒక దానిని తయారు చెయ్యడం భావనలో ఇది ఇక్కడ వినియోగించబడింది.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]

01-05

దేవుడు పలికాడు

దేవుడు ఒక ఆజ్ఞను పలకడం ద్వారా సమస్త మొక్కలను సృష్టించాడు.

భూమి మొలిపించును గాక

దేవుడు పలికాడు కనుక కనుక ఈ ఆజ్ఞ వెంటనే జరిగింది.

సమస్త విధములైన

మొక్కలలోనూ, చెట్లలోనూ అనేకవిధములైన జాతులు లేక రకాలు.

సృష్టించబడ్డాయి

శూన్యంలోనుండి ఒక దానిని తయారు చెయ్యడం భావనలో ఇది ఇక్కడ వినియోగించబడింది.

అది మంచిది

సృష్టి వృత్తాంతం అంతటిలోనూ ఈ పదం తరచుగా పునరావృతం అవుతుంది. సృష్టిలో ప్రతీ దశ దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నేరవేర్చబడింది అనే అంశాన్ని నొక్కి చెపుతుంది.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]

01-06

నాలుగవ రోజు

క్రమబద్ధమైన రోజుల క్రమంలో తరువాత రోజు, దీనిలో దేవుడు సృష్టించాడు.

దేవుడు పలికాడు

దేవుడు సూర్యుడినీ, చంద్రుడినీ, నక్షత్రాలనూ ఒక ఆజ్ఞ పలకడం ద్వారా సృష్టించాడు.

వెలుగు

ఆకాశంలో ప్రకాశించే వస్తువులు ఇప్పుడు భూమికి వెలుగును అందించాయి.

పగలు, రాత్రి, కాలాలూ, సంవత్సరాలు

కాలంలో చిన్నదానినుండి పెద్దదాని వరకూ ప్రతీ భాగాన్ని గుర్తించడానికి ఒక ప్రత్యేక వెలుగును దేవుడు సృష్టించాడు, కాలాంతం వరకూ నిరంతరం పునరావృతం అయ్యేలా వాటిని నియమించాడు.

సృష్టించాడు

శూన్యంలోనుండి ఒక దానిని తయారు చెయ్యడం భావనలో ఇది ఇక్కడ వినియోగించబడింది.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]

01-07

ఐదవ రోజు

గతించిన నాలుగు రోజులలో దేవుడు ఆరంభించిన ఆయన వృద్ధిక్రమానుసార సృష్టిని కొనసాగిస్తున్నాడు

దేవుడు పలికాడు

దేవుడు ఒక ఆజ్ఞను పలకడం ద్వారా పక్షులనూ, జలచరములను సృష్టించాడు.

నీటిలో చలించువాటన్నిటిని.

దేవుడు చేపలను మాత్రమే చెయ్యలేదు, ఆ నీళ్ళనిండా చలిస్తున్న అన్ని విధాల జలచరాలనూ సృష్టించాడు. దేవుడు వాటిని సృష్టించడానికి ఎంపిక చేసాడు కనుక అన్నీ ఉనికి కలిగియున్నాయి.

అన్ని విధాల పక్షులు

దేవుడు కేవలం ఒక విధమైన పక్షిని తయారు చెయ్యలేదు, అయితే అద్భుతమైన రూపాలు, ఆకారాలు, రంగులలో ఉండే అన్ని విధాల పక్షులను సృష్టించాడు.

అది మంచిది

సృష్టి వృత్తాంతం అంతటిలోనూ ఈ పదం తరచుగా పునరావృతం అవుతుంది. సృష్టిలో ప్రతీ దశ దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నెరవేర్చబడింది అనే అంశాన్ని నొక్కి చెపుతుంది.

వారిని ఆశీర్వదించాడు

వారు ఫలించాలనీ, ఆయన వారిని ఉంచిన లోకంలో అన్ని సవ్యంగా జరగాలనే తన ఉద్దేశాన్ని దేవుడు పలికాడు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]
 • [[rc://*/tw/dict/bible/kt/bless]]

01-08

ఆరవ రోజు

రోజుల వృద్ధిక్రమానుసారంలో, సృజనాత్మక క్రియల కొనసాగింపులో తరువాత సంఘటన.

దేవుడు పలికాడు

దేవుని నోటిమాట ద్వారా పశువులను సృష్టించడాడు.

సమస్త విధమైన

అనేక రకాలైన పశువులు, ఒక క్రమంలో ఉండడం అని సూచిస్తుంది.

భూజంతువులు

భూమి మీద నివసించిన ప్రతివిధమైన జంతువులు పక్షులు లేక సముద్రంలో నివసించే జలజరాలకు భిన్నమైనవి ఉన్నాయి.

నేలమీద నివసించే జంతువులు

నేల మీద నివసించే జంతువులు - మచ్చిక చెయ్యడంలోనూ లేక గృహాలలో పెంచడంలోనూ సహజంగా ప్రజలతో సమాధానంగా ఉంటాయి.

నేలమీద ప్రాకు జీవులు

వీటిలో ప్రాకెడు జీవులు, కీటకాలు ఉండవచ్చు.

అడవి

మనుష్యులతో సహజంగా నివసించని అన్ని రకాల జంతువులు, సాధారణంగా అవి మనుష్యులకు భయపడతాయి, లేక మనుష్యులకు ప్రమాదకరంగా ఉంటాయి.

అది మంచిది

సృష్టి వృత్తాంతం అంతటిలోనూ ఈ పదం తరచుగా పునరావృతం అవుతుంది. సృష్టిలో ప్రతీ దశ దేవునికి ఇష్టంగా ఉంది, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం నేరవేర్చబడింది అనే అంశాన్ని నొక్కి చెపుతుంది.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]

01-09

మనం

ఒక నిర్దిష్ట ఉద్దేశం కోసం, ఒక నిర్దిష్టమైన విధానంలో మానవుడిని సృష్టించడానికి దేవుని ఉద్దేశపూరిత, ఇష్టపూరిత నిర్ణయాన్ని సూచిస్తుంది.

మన...మనయొక్క...మన...

ఏక దేవుడు ఉన్నాడని బైబిలు బోధిస్తుంది, అయితే పాతనిబంధనలో “దేవుడు” పదం బహువచనంలో ఉంది, దేవుడు తనలో తాను మాట్లాడుకొనేటప్పుడు బహువచన సర్వనామాన్ని వినియోగిస్తాడు. దేవుని తన మహాత్యాన్ని వ్యక్తీకరించడానికి ఒక ప్రత్యేక విధానం అని కొందరు అర్థం చేసుకొంటారు, కుమారుడు, పరిశుద్ధాత్మతో తండ్రియైన దేవుడు మాట్లాడుతున్నాడని కొందరు అర్థం చేసుకొంటారు. ముగ్గురూ ఏక దేవుడే.

మన స్వరూపంలో

స్వరూపం అంటే ఒకరి లేక ఒకదాని భౌతిక ప్రాతినిద్యం. మనం దేవుని గుణగణాలు లేక లక్షణాలలో కొన్నింటికి ప్రాతినిధ్యం వహించడం లేక వాటిని చూపించే విధానంలో మానవులు సృష్టించబడ్డారు.

మన పోలిక

మానవులు దేవుని గుణలక్షణాలలో కొన్నింటిని పంచుకొంటారు, అయితే ఆయన లక్షణాలన్నిటినీ కాదు. ‘మానవుడు దేవుని పోలి ఉంటాడు అయితే ఆయనతో సమానం కాదు లేక ఆయనకు సమానంగా ఉండడు’ అని కనపరచే పదాలతో ఈ వాక్యమ అనువదించబడాలి.

అధికారం

భూమినీ, జంతువులనూ వినియోగించడంలో దేవుడు మానవులకు నిర్వహణ హక్కునూ, శక్తినీ, నడుపుదలనూ, నియంత్రణనూ ఇచ్చాడు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]

01-10

కొంత నేల మట్టి

దేవుడు మానవుడిని నేలనుండి తీసిన మట్టి లేక ఆరిన మట్టిలో నుండి చేసాడు. భూమి కోసం వినియోగించిన సాధారణ పదానికిది భిన్నమైనది కావచ్చును.

నిర్మించాడు

దేవుడు వ్యక్తిగతంగా మానవుడిని రూపొందించాడు అని ఈ పదం తెలియపరుస్తుంది, ఒక వ్యక్తి తన చేతులతో దేనినైనా చెయ్యడంతో సరిపోల్చుతుంది. “సృష్టించడం” అనే పదానికి భిన్నమైన పదం వినియోగించబడడం గమనించండి. మిగిలిన వాటన్నిటినీ కేవలం నోటిమాట ద్వారా సృష్టించాడు అనే దానికి ఇది పూర్తిగా భిన్నమైనదిగా ఉంది.

మానవుడు

ఈ సారి కేవలం మానవుడు సృష్టించబడ్డాడు; భిన్నమైన పద్ధతిలో స్త్రీ సృష్టించబడింది.

జీవవాయువు ఊదాడు

తనలోనుండి జీవాన్ని ఆదాము శరీరంలోనికి ఆయన బదిలీ చేసిన దేవుని వ్యక్తిగత, సన్నిహిత చర్యను తెలియచేస్తుంది.

జీవం

ఈ చర్యలో భౌతిక, ఆత్మీయ జీవం రెంటినీ దేవుడు ఊదాడు.

ఆదాము

పాత నిబంధనలో “మానవుడు” అనే పదానికి వినియోగించిన పదం ఆదాము అనే పేరుతో సమానం. తాను తీయబడిన “నేలమట్టి” కి వినియోగించిన పదం లాంటిదే.

తోట

ఒక ఉద్దేశం కోసం చెట్లు, మొక్కలూ నాటిన ఒక భూభాగం – సాధారణంగా ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యడానికీ, అందాన్ని అందించే ఉద్దేశం.

దానిని భద్రంగా చూడడం కోసం.

సేద్యపరచడం, కలుపు తీయడం, నీరు పోయడం, పంట కోయడం, నాటడం మొదలైనవి చెయ్యడం ద్వారా తోటను నిర్వహించడం.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/life]]
 • [[rc://*/tw/dict/bible/other/adam]]

01-11

మధ్యలో

మధ్య ప్రదేశం రెండు చెట్ల ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తుంది

తోట

ఒక ఉద్దేశం కోసం చెట్లు, మొక్కలూ నాటిన ఒక భూభాగం – సాధారణంగా ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యడానికీ, అందాన్ని అందించే ఉద్దేశం.

జీవవృక్షం

ఈ చెట్టునుండి ఫలాన్ని తినిన ఎవరైనా ఎన్నటికీ చావరు.

మంచి చెడుల తెలివితేటలనిచ్చు వృక్షం

ఈ చెట్టు ఫలం ఒక వ్యక్తి మంచి, చెడులను తెలుసుకొనేలా చేస్తుంది.

తెలివితేటలు

వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకోవడానికీ, అర్థం చేసుకోవాడానికి.

మంచి, చెడులు

మంచికి వ్యతిరేకం చెడు. “మంచి” దేవుణ్ణి సంతోషపరచే దానిని సూచిస్తున్నట్టుగా “చెడు” దేవుణ్ణి సంతోష పరచనిదాన్నంతటినీ సూచిస్తుంది.

చనిపోవడం

ఈ సందర్భంలో మానవుడు భౌతికంగానూ, ఆత్మీయంగానూ చనిపోతాడు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/life]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]
 • [[rc://*/tw/dict/bible/kt/evil]]
 • [[rc://*/tw/dict/bible/other/adam]]
 • [[rc://*/tw/dict/bible/other/death]]

01-12

మంచిది కాదు

సృష్టిలో ఏదైనా మంచిదిగా లేనిది ఇదే మొదటిసారి. అంటే దాని అర్థం “అది ఇప్పటికి మంచిదిగా కాలేదు” అని అర్థం, ఎందుకంటే మానవులకు సంబంధించిన సృష్టిని దేవుడు ఇంకా పూర్తి చెయ్యలేదు.

ఒంటరితనం

ఆదాము ఒక్కడే మానవుడు, మరో వ్యక్తితో సంబంధాన్ని కలిగియుండే అవకాశం లేదు. పిల్లలను కలిగియుండడానికీ, విస్తరించడానికీ సామర్ధ్యం లేదు.

ఆదాము సహాయకురాలు

దేవుడు ఆదాముకు ఇచ్చిన పనిని తనతో కలిసి పూర్తిచెయ్యడానికి ఆదాముతో కలిసి చెయ్యడానికి ఆదాములాంటి వారు ఎవరూ లేరు. పశువులలో ఏదీ దీనిని చెయ్యలేదు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]
 • [[rc://*/tw/dict/bible/other/adam]]

01-13

గాఢనిద్ర

ఇది సాధారణనిద్ర కంటే అధిక నిద్ర.

ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి చేసాడు.

ఆదామునుండి ఒక పక్కటెముకను తొలగించడం, దానిని ఒక స్త్రీగా రూపొందించడంలోని దేవుని వ్యక్తిగత కార్యాన్ని ఈ క్రియాపదాలు చూచిస్తున్నాయి.

ఒక స్త్రీ

ఆమె మొట్టమొదటి స్త్రీ, ఇప్పటి వరకు మానవులలో భాగంగా లేని స్త్రీ.

ఆమెను అతని వద్దకు తీసుకొనివచ్చాడు

దేవుడు వ్యక్తిగతంగా వారిని పరిచయం చేసాడు. స్త్రీని ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు, ఒక ప్రత్యేక బహుమతిని అందిస్తున్నట్టుగా తీసుకొని వచ్చాడు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/other/adam]]

01-14

చివరకు

స్త్రీ లాంటి ఒకదానికోసం ఆదాము ఎదురు చూస్తున్నట్లుగా ఆదాము ఆశ్చర్యార్ధకం సూచిస్తుంది.

నన్ను పోలి ఉంది.

ఆదాముకూ, స్త్రీకీ మధ్య ప్రాముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, స్త్రీ కూడా ఆదాములాంటి వ్యక్తే.

స్త్రీ

ఈ పదం పురుషుని కోసం పదానికి స్త్రీ రూప పదం.

మనిషినుండి చెయ్యబడింది

ఆదాము సొంత శరీరం నుండి స్త్రీ నేరుగా నిర్మించబడింది.

మనిషి విడిచి పెడతాడు

ఇది వర్తమాన కాలంలో చెప్పబడింది, భవిష్యత్తులో ఇది సహజంగా జరిగే పరిస్థితిగా ఉండబోతున్నాడని సూచిస్తుంది. ఆదాముకు తండ్రి లేక తల్లి లేరు, అయితే మిగిలిన మనుష్యులందరికీ ఉన్నారు.

ఏకం అవుతారు

భర్త, భార్య ఒకరికొకరు సన్నిహితమైన ఐక్యతా బంధాన్నీ, సమర్పణనూ పంచుకొంటారు, అది వారి సంబంధాలను మిగిలిన దేనితోనైనా అదిగమిస్తుంది.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/other/adam]]

01-15

దేవుడు సృష్టించాడు

దేవుడు స్త్రీనీ, పురుషుడినీ అత్యంత వ్యక్తిగతమైన విధానంలో నిర్మించాడు.

ఆయన సొంత స్వరూపంలో

స్వరూపం అంటే ఒకరి లేక ఒకదాని భౌతిక ప్రాతినిధ్యం. మనం దేవుని గుణగణాలు లేక లక్షణాలలో కొన్నింటికి ప్రాతినిధ్యం వహించడం లేక వాటిని చూపించే విధానంలో మానవులు సృష్టించబడ్డారు.

చాలా మంచిది

“మంచిదిగా ఉంది” అనీ మాటల కంటే ఎక్కువైన “చాలా మంచిదిగా ఉంది” పదాలు సృష్టి అంతటినీ సూచిస్తున్నాయి, కేవలం పురుషుడు, స్త్రీని గురించి కాక. సమస్తం దేవుడు నిర్దేశించిన రీతిలో ఖచ్చితంగా ఉన్నాయి.

సృష్టి

ఆరు రోజుల కాలం, దీనిలో ఉనికిలో ఉన్న సమస్తాన్నీ దేవుడు సృష్టించాడు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/bless]]
 • [[rc://*/tw/dict/bible/kt/good]]

01-16

ఏడవ రోజు

ఆరు రోజుల సృష్టి పూర్తి అయిన తరువాత రోజు.

తన పనిని ముగించాడు

ప్రత్యేకించి దేవుడు సృష్టి కార్యాన్ని పూర్తి చేసాడు. ఆయన ఇంకా ఇతర కార్యాలను చేస్తూనే ఉన్నాడు.

దేవుడు విశ్రమించాడు

దేవుడు “విశ్రమించాడు” అంటే ఆయన పని చెయ్యడం నిలిపివేశాడు, ఎందుకంటే సృష్టి సంపూర్తి అయ్యింది. దేవుడు అలసి పోలేదు లేక కొనసాగించలేక పోవడం కాదు.

ఏడవ రోజును ఆశీర్వదించాడు

ఏడవ రోజు పట్లా, రాబోతున్న ప్రతీ ఏడవ రోజు పట్లా దేవునికి ఒక ప్రత్యేకమైన, నిశ్చయాత్మకమైన ప్రణాళిక ఉంది

పరిశుద్ధ పరచాడు

అంటే దేవుడు ఆ రోజును ఒక ప్రత్యేక రోజుగా “ప్రత్యేకపరచాడు.” వారంలో మిగిలిన ఆరు రోజులవలే ఈ రోజును వినియోగించకూడదు.

విశ్వం

భూమి మీదా, ఆకాశాలలో దృశ్యమైనవీ, అదృశ్యమైనవీ దేవుడు చేసినవన్నీ దీనిలో ఉన్నాయి.

ఒక బైబిలు కథ ఎక్కడనుండి

ఈ సూచనలు కొన్ని బైబిలు అనువాదాలలో స్వల్పంగా భిన్నంగా ఉండవచ్చు.

అనువాదం పదాలు

 • [[rc://*/tw/dict/bible/kt/god]]
 • [[rc://*/tw/dict/bible/kt/bless]]
 • [[rc://*/tw/dict/bible/kt/holy]]